Meera Kumar
-
Congress Party: తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ మాదే..
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మరోసారి గుర్తు చేసేలా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన వేడుకలకు మాజీ లోక్‌సబ స్పీకర్ మీరాకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెసేనని హస్తం నేతలు గట్టిగా నినదించారు. కాంగ్రెస్ లేకుంటే ,తెలంగాణ వచ్చేది కాదని.. అయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని టీ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. తరువాత టీ కాంగ్రెస్ నేతలతో పాటు మీరా కుమార్ తెలంగాణ ఏర్పాటును గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వచ్చినా ప్రజల ఆశయాలు నెరవేరలేదని, తెలంగాణ ప్రజల ఆశయాలు నెరవేర్చేది కాంగ్రెస్ మాత్రమేనని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని మీరా కుమార్ తెలంగాణ ప్రజలను కోరారు. "తెలంగాణ ఆశయాలు నెరవేర్చాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. తెలంగాణ ప్రజలు ఏ లక్ష్యం కోసం కోట్లాడారో ఆ లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ అన్ని వర్గాల ప్రజల త్యాగాలను చూసి కాంగ్రెస్ త్యాగం చేసి మరి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా దేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉండాలంటే తెలంగాణ ఆశయాలు తెలిసిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. తెలంగాణ ప్రజల త్యాగాలు, ఆశయాలు కాంగ్రెస్‌కు మాత్రమే తెలుసు" - మీరా కుమార్, లోక్‌సభ మాజీ స్పీకర్ "ఉద్యోగాల విషయంలో మనకు అన్యాయం జరుగుతోందని నాడు 1200మంది బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అప్పటి హోంమంత్రి చిదంబరం తో రెండు సార్లు చర్చించా.. అది నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. మీరాకుమార్ ఎంతో ధైర్యంతో తెలంగాణ బిల్లును పాస్ చేసారు. మీరాకుమార్ ధైర్యం చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఇప్పుడు ఏలుతున్న వారు తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణ ఏర్పాటును మోదీ అపహాస్యం చేశారు. పార్లమెంట్ తలుపులు మూసేసి తెలంగాణ ఇచ్చారని పార్లమెంట్లో మోదీఆరోపిస్తున్నారు. బీజేపీ వాళ్లు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చదవండి: Hyderabad: మెట్రో ప్రయాణికులకు మరో షాక్ తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు కేసీఆర్ పార్లమెంట్లో లేరు. మీరాకుమార్ రాష్ట్రపతి అభ్యర్థిగా హైదరాబాద్ వస్తే..మీరాకుమార్‌కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కు ఫోన్ చేసినా మాట్లాడలేదు. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన మీరాకుమార్‌కు వ్యతిరేకంగా కేసీఆర్ ఓటు వేశారు. నేరేళ్ళ బాధితులను పరామర్శించేందుకు మీరాకుమార్ వస్తే.. కేసీఆర్ అవహేళన చేసారు. 9 ఏళ్ళు పూర్తయితే.. ఎన్నికల కోసం ఓక సంవత్సరం ముందుగానే దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపాలి." - ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి "తెలంగాణలో యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. రైతులు సమస్యలతో సతమతమవుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. తెలంగాణ ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేర్చకుందాం." -మాణ్క్ రావ్ ఠాక్రే "అసమానతలు ఉన్న ప్రాంతాల్లో తిరుగుబాటు వస్తుంది. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. చారిత్రక నిర్ణయం వెనక సోనియా గాంధీ కృషి ఎంతో ఉంది. ఆనాటి తెలంగాణలో రాష్ట్రానికి ఉన్న గౌరవం, ఇప్పుడు ఉన్న గౌరవం ఎలా ఉందో అందరూ గమనిస్తున్నారు. రెండు సార్లు ఒకే కుటుంబ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు అవసరం గురించి నాడు గంట పాటు సోనియా గాంధీ కి వివరించా." -దామోదర రాజనర్సింహ "తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ చొరవ వల్లే తెలంగాణ వచ్చింది. ఇప్పటికీ రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదు. కేసీఆర్ కుటుంబం తప్ప సామాన్యుడికి ఒరిగిందేమి లేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది.. ఉద్యోగాలు ఏమయ్యాయి. మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా..? మళ్ళీ గడీల పాలన నడుస్తోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ తో కలిసి బిఆరెస్ చేస్తుంది. కవిత విషయంలో అది నిరూపితమైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జలు పట్టం గడుతారు. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దించాలి. నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యం." -మహేష్ గౌడ్ పార్టీలో అందరికంటే సీనియర్ ను నేనే. కడుపు చించుకుంటే పేగులు బయటపడుతాయని చెప్పడం లేదు. తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటా అని కేసీఆర్ చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం వల్లే నష్టం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను అనడం తో కాంగ్రెస్‌కు భారీ నష్టం జరిగింది. కొట్లాడింది, తెచ్చింది మేము. -వి.హనుమంతరావు -
దళిత, గిరిజనులు ఏకం కావాలి
-
అంబేడ్కర్, జగ్జీవన్‌రాం ఆశయసాధనకు కృషి
షాబాద్(చేవెళ్ల): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమసమాజ నిర్మాణానికి కృషి చేస్తానని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంతోపాటు పోతుగల్ గ్రామంలో అంబేడ్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాలను పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రసాద్, మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, చంద్రశేఖర్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులతో కలసి ఆమె ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షాబాద్‌లోని బహిరంగసభలో మీరాకుమార్ మాట్లాడుతూ.. అన్యాయాన్ని అరికట్టేందుకు అందరం ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాజంలో దళితులను చిన్నచూపు చూస్తున్నారని, అలాంటి అసమానతలను సమాజం నుంచి దూరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన తండ్రి జగ్జీవన్‌రాం ఆశయాలను పుణికి పుచ్చుకున్న తాను అణగారిన కులాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని చెప్పారు. అలాంటి మహనీయుల ఆశయాలను సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశానని అన్నారు. మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించిన ఈరోజు ఎంతో శుభదినమని, ఇక్కడి ప్రజలు తనను ఎంతో ప్రేమానురాగాలతో స్వాగతించారని చెప్పారు. మీరాకుమార్తోనే రాష్ట్రం ఏర్పాటు: ఉత్తమ్ మీరాకుమార్ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పాస్ అయిందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీలు ఇచ్చిన కేసీఆర్ వారిని మోసం చేశారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేరెళ్లలో దళిత రైతులపై అక్రమ కేసులు పెట్టారని, ఖమ్మంలో గిరిజనులపై దాడి చేసిన చరిత్ర వారికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, పార్టీ నాయకుడు రాచమల్లసిద్ధేశ్వర్, టఫ్ అధ్యక్షురాలు విమలక్క తదితరులు పాల్గొన్నారు. -
ఐక్య ‘గర్జన’కు సిద్ధం కండి
సాక్షి ప్రతినిధి, వరంగల్: దళిత, గిరిజనుల రక్షణ చట్టాలను నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యంగా ఎదుర్కోవాలని నేతలు పిలుపునిచ్చారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడుల్ని తిప్పికొట్టేందుకు వరుసగా చేపట్టనున్న పోరాటాలు ఈ సింహగర్జనతో మొదలయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిరక్షణ పేరుతో దళిత, గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో జరిగిన సింహగర్జనలో జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ మాట్లాడుతూ.. ‘నేను ఎంపీగా ఉన్నపుడు బిహార్‌లో వరుసగా జరిగిన రెండు దాడుల్లో 25 మంది దళితులు చనిపోయారు. ఈ విషయాన్ని అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీకి వివరించాను. అపుడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రూపొందించారు. ఇంతకాలం రక్షణగా ఉన్న ఈ చట్టం.. సుప్రీం తీర్పుతో పదును కోల్పోయింది. చట్టాన్ని కాపాడేందుకు కేంద్రం ఆర్డినెన్స్ ఎందుకు తీసుకురాలేదు’అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉద్దేశపూర్వకంగానే కేంద్రం నీరుగారుస్తోందని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దంటే న్యాయ వ్యవస్థలోనూ రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం చేసి తీసేశారు.. ‘అనేక మంది దళితుల త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పాటైంది. రాష్ట్రానికి దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. కానీ దళిత సీఎం హామీ పక్కనబెట్టి కేసీఆర్ సీఎం అయ్యారు. దళితుడిని డిప్యూటీ సీఎం చేసి వెంటనే తీసేశారు. ఈ ఘటనలు బాధించాయి’ అని మీరాకుమార్ అన్నా రు. రాబోయే రోజుల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్లకు అధికార పీఠం దక్కనివ్వబోమని, ఈ విషయాన్ని ఇక్కడున్న ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి చెప్పాలన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిరక్షణ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు పోరాడుతామని హామీ ఇచ్చారు. దళిత, గిరిజనులు ఏకం కావాలి: సురవరం అంతరంగిక సమస్యలు పక్కనబెట్టి అంతా ఏకం కావాలని దళిత, గిరిజనులకు సీపీఐ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజే పీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమవుతున్న తరుణంలో ఎస్సీ, ఎస్టీలు ఏకమై పోరాడాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ప్రస్తుతమున్నట్లే కొనసాగించాలని, అలాగే దాడుల నుంచి రక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చట్టం పరిరక్షణకు చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి విచారణ జరపాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు డి.రాజా డిమాండ్ చేశారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’అంటూ దళిత, గిరిజనుల పక్షాన ప్రధాని నిలవడం లేదన్నారు. గుజరాత్ నుంచి గాంధీ, వల్లభాయ్ పటేల్, మోదీ వచ్చారని బీజేపీ నేతలు చెబుతున్నారు.. కానీ మీసాలు పెంచినందుకు, క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు, పెళ్లి బరాత్ నిర్వహించినందుకు దళితులపై దాడులు అక్కడే జరిగాయన్న విషయం మర్చిపోవద్దన్నారు. దళిత, గిరిజనులపై చర్యలకు వ్యతిరేకంగా జరుగబోయే వరుస పోరాటాలు ఇక్కడి నుంచే మొదలవుతాయన్నారు. ‘సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ నేషన్’ అని రాజా పిలుపునిచ్చారు. పాలకులయ్యేవరకు పోరాడాలి: రమణ పాలితులుగా ఉండటం కాదు పాలకులు అయ్యే వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలసికట్టుగా పోరాడాలని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పిలుపునిచ్చారు. తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గానికి ప్రతినిధి మంద కృష్ణ మాదిగను అకారణంగా జైలులో పెట్టారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు తన మద్దతు ఉంటుందని అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిరక్షణ కోసం సంఘటితంగా పోరాడాలని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. సింహగర్జనతో పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కాంగ్రెస్ నేత కొప్పుల రాజు అన్నారు. -
కేసీఆర్ మాట నిలబెట్టుకో..
పొన్నం దీక్షచేస్తే పోలీసులతో బెదిరిస్తావా..? - ఇసుకాసురుల కోసం దళితులపై దౌర్జన్యాలు చేస్తావా? - తెలంగాణ బిల్లు కోసం కృషి చేసిన మీరాకుమార్ను అవమానిస్తావా? - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం సాక్షి, కరీంనగర్: ‘కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పటమే కాకుండా.. వైద్యకళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆమరణ దీక్ష చేపడితే అనుమతులు ఇవ్వకుండా పోలీసులతో బెదిరిస్తావా..? సన్నాసి కేసీఆర్.. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో..’అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. మెడికల్ కళాశాల సాధన కోసం మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌కు సంఘీభావం తెలిపేందుకు సోమవారం కరీంనగర్ వచ్చిన ఆయన దీక్షా శిబిరంలో మాట్లాడారు. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్లో ఎన్ని అవాంతరాలొచ్చినా తనదైన శైలిలో నిలబడి సాధించిన వ్యక్తి పొన్నం అని కొనియాడారు. ఇసుకాసురుల కోసం దళితులపై దాడులు, దౌర్జన్యాలు చేయడమే కాకుండా పోలీసులను ఉసిగొల్పి థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా చేసిన నీచ సంస్కృతి కేసీఆర్‌దే అన్నారు. ‘2009 డిసెంబర్లో రాష్ట్ర సాధన కోసం నీవు దీక్ష చేసినప్పుడు నీ కూతురు కవిత అప్పటి లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు అర్ధరాత్రి ఫోన్‌చేసి నా తండ్రి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, రక్షించాలని వేడుకున్నారని, వెంటనే మీరాకుమార్ పార్టీ అధిష్టానంతో మాట్లాడి చిదంబరంతో ప్రకటన చేయించి నిన్ను కాపాడిన గొప్ప వ్యక్తని అవమానిస్తావా..?’ ఉత్తమ్ పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుకు అండగా నిలబడి బిల్లు పాస్ చేయించిన మీరాకుమార్ నేరెళ్ల బాధితులను పరామర్శించేందుకు ఢిల్లీ నుంచి ఇక్కడకు వస్తే ఆమెను స్వాగతించాల్సింది పోయి పిచ్చికూతలతో అవవమానిస్తావా..? అని విమర్శించారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని, కేసీఆర్ ఇచ్చినా.. ఇవ్వకున్నా మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి తీరుతామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీమంత్రి రాంచంద్రారెడ్డి, ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ చిత్తరంజన్‌దాస్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు. ఇతర కాంగ్రెస్ నేతల ధ్వజం పూటకో మాట మాట్లాడుతూ అబద్దాలతో కాలం వెల్లదీస్తూ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ఊసరవెళ్లిలా తయారయ్యారని శాసనమండలి పక్షనేత షబ్బీర్‌అలీ అన్నారు. పొన్నంకు మెడికల్ కళాశాల ఇప్పుడు గుర్తొచ్చిందా..? అంటూ టీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పొన్నం దీక్షతో కరీంనగర్ కాంగ్రెస్ సునామీగా మారిందని, ఈ సునామీలో కేసీఆర్ రాచరికపు, ప్రజాస్వామ్య వ్యతిరేకపాలన కొట్టుకుపోతుందని మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. పొన్నం దీక్షను భగ్నం చేయడానికి టీఆర్ఎస్ నాయకులు, పోలీసులతో కుట్ర పన్నుతున్నారని, మెడికల్ కళాశాలపై ప్రకటన వెలువడేవరకూ పొన్నం దీక్ష విరమింపజేసే ధైర్యం ఎవరికీ లేదని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి హెచ్చరించారు. -
మీరాకుమార్‌కు టీఆర్ఎస్ ఓట్లు: సంపత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి మీరాకుమార్‌కు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓట్లు వేయనున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే 38 మంది ప్రజాప్రతినిధులు మీరాకుమార్‌కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, వీరిలో టీఆర్ఎస్ వాళ్లే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ మీరాకుమార్ లోక్‌సభ స్పీకరుగా ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో చేసిన కృషిని మరిచిపోలేమన్నారు. ఇప్పటికైనా యూపీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను చేతులెత్తి కోరుతున్నట్టుగా చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని బీజేపీ కాళ్ల వద్ద తాకట్టుపెడుతున్న కేసీఆర్ తీరుపై టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. సీబీఐ కేసుల నుంచి బయటçపడడానికే కేసీఆర్ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మీరాకుమార్‌కు మద్దతు కూడగట్టడానికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను కలుస్తున్నట్టుగా వెల్లడించారు. తెలంగాణలో 90 శాతం మంది ఆత్మప్రభోదానుసారం మీరాకుమార్‌కు ఓటు వేస్తారని చెప్పారు. మూడేళ్లుగా కేసీఆర్ కుటుంబసభ్యులైన నలుగురి కబంధహస్తాల నుంచి బయటపడి స్వేచ్ఛగా ఓటువేయడానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారని సంపత్‌కుమార్ పేర్కొన్నారు. -
మీరాకుమార్ను అవమానిస్తారా!
సీబీఐ కేసులకు భయపడే కోవింద్‌కు కేసీఆర్ మద్దతు: కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లు ఆమోదంలో లోక్‌సభ స్పీకర్‌గా మీరా కుమార్ పాత్ర విస్మరించలేనిదని, అలాంటిది.. మద్దతుకోసం మీరాకుమార్ ఫోన్‌చేస్తే స్పందించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానించడం దారుణమని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, సురేశ్ శెట్కార్ తదిత రులతో కలసి వారు గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన మీరాకుమార్‌కు మద్దతును ఇవ్వకుండా బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఎందుకు మద్దతిస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐ కేసులకు భయపడే కేసీఆర్ మద్దతు ఇస్తున్నారా, మరేమైనా రహస్య కారణాలున్నాయా అని ప్రశ్నించారు. -
కేసీఆర్‌తో మాట్లాడే ప్రయత్నం చేశా
మద్దతుపై యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ ► సీఎం కార్యాలయానికి సమాచారం ఇచ్చాం.. అందుబాటులోకి రాలేదు సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు కోరడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మాట్లాడటానికి ఫోన్ చేశాను. ఫోనులో అందుబాటులోకి రాలేదు. మాట్లాడుతామని ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం కూడా పెట్టినాము’అని రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్‌అలీ తదితరులతో కలసి సోమవారం ఆమె గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.‘నేను లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటైంది. ఆ సమయంలో లోక్‌సభ స్పీకర్‌గా ఉండటం ఒక చారిత్రక ఘట్టం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తీసుకుంది. అలాంటి తెలంగాణ ప్రజాప్రతినిధులంతా నాకు మద్దతు ఇవ్వాలి’ అని మీరాకుమార్ విజ్ఞప్తి చేశారు. విపక్ష పార్టీలకు కృతజ్ఞతలు... రాష్ట్రపతిఎన్నికలో తన అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించిన 17 ప్రతిపక్ష పార్టీలకు మీరాకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. భిన్న దృక్పథాలున్న వేర్వేరు పార్టీలు సిద్ధాంతాల పరిరక్షణకోసం ఏకమై తనకు మద్దతు ఇస్తున్నాయన్నారు. తాను పర్యటించిన అన్ని రాష్ట్రాల్లో విశేషాదరణ వస్తోందన్నారు. ‘నేను బలిపశువును, బకరాను కాను. నేను ఒంటరిని కాను, సిద్ధాంతాలకోసం రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీలో ఉన్నాను. తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకముంది. నాకు మద్దతును ఇవ్వాలని ఎంఐఎంను కూడా కోరుతా. టీఆర్ఎస్కు, ఎంఐఎంకు లేఖలు రాస్తా. మై బిహార్ కీ బేటీ హూ.. మగర్ దేశ్ హమారా హై(నేను బిహార్ బిడ్డనే. కానీ దేశమంతా మనదే)’అని మీరాకుమార్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వారం రోజులే చాలా ఎక్కువ అని అన్నారు. ఎన్నికలకు ఇంకా రెండువారాల సమయం ఉందని.. ఏమైనా జరగవచ్చని పేర్కొన్నారు. అధికార పక్షం నుంచీ మద్దతిస్తారు.. అధికార బీజేపీలో ఉన్న చాలామంది తనకు మద్దతు ఇస్తారని మీరా ధీమా వ్యక్తం చేశారు. ‘అధికార పార్టీల సభ్యుల ఓట్లు పొందడానికి మా వ్యూహాలు మాకున్నాయి. మాకు మద్దతు ఇస్తున్న అందరి పేర్లు బయటకు చెప్పలేము కదా’అని మీరాకుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీకాదన్నారు. రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అని స్పష్టంచేశారు. దేశంలో లౌకిక వాదానికి విఘాతం కలిగించే సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రజలు ఏంతినాలో, ఏం తినకూడదో ప్రభుత్వమే చెప్పడం ప్రమాదకరమన్నారు. కేసీఆర్.. మనసు మార్చుకో: ఉత్తమ్ ముస్లింలు, క్రైస్తవులు దేశంలో పరాయివారని వ్యాఖ్యానించిన రామ్‌నాథ్ కోవింద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ఎలా ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మనసు మార్చుకుని, యూపీఏ అభ్యర్థి మీరాకుమార్‌కు మద్దతు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం శాసనసభ్యుడు సున్నం రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకటరెడ్డి, జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాతృ హృదయంతో వ్యవహరించా.. తెలంగాణ బిల్లుపై మీరాకుమార్ లోక్‌సభలో తెలంగాణ బిల్లు వచ్చిన సమయంలో మాతృహృదయంతో వ్యవహరించానని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన మీరా కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు చెందిన ముఖ్యులు, వివిధ మీడియా సంస్థల సంపాదకులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి, ఆత్మగౌరవంకోసం స్వరాష్ట్ర కాంక్షతో తెలంగాణ యువత ప్రాణత్యాగాలకు సిద్ధపడుతుంటే ద్రవించిపోయానన్నారు. చారి త్రక సమయంలో తెలంగాణ ఏర్పాటుకు పనిచేసిన సంతృప్తి ఉందన్నారు. తనకు తెలంగాణతో ఎంతో అనుబంధముందన్నారు. హైదరాబాద్‌తో తనది రెండు తరాల అనుబంధమన్నారు. కాగా, కాంగ్రెస్ నేతలతో కలసి తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపంవద్ద మీరాకుమార్ నివాళులు అర్పించారు. -
నేడు హైదరాబాద్‌కు మీరాకుమార్
-
వైఎస్సార్సీపీ ఓటింగ్ కీలకం
- మీరాకుమార్‌కు మద్దతివ్వండి - వైఎస్ జగన్‌కు పీసీసీ చీఫ్ రఘువీరా లేఖ విజయవాడ సెంట్రల్: రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు 17 పార్టీలు బలపర్చిన మీరాకుమార్‌కు మద్దతు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు సొంతగా తన అభ్యర్థిని గెలిపించుకొనే బలం లేదని, దీంతో వైఎస్సార్సీపీ ఓటింగ్ కీలకమైందన్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలన్న తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. రామ్‌నాథ్ కోవింద్ రాజకీయ జీవితం మనువాద భావజాలం పునాదిగా ఏర్పడిందన్నారు. -
మీరాకుమార్ను ఓడిస్తారా..!
కేసీఆర్‌పై వీహెచ్ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ స్పీకర్‌గా తెలంగాణ ఇచ్చిన మీరాకుమార్ను రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించాలని సీఎం కేసీఆర్ ఎలా పనిచేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ప్రశ్నించారు.గురువారం ఆయన మాట్లాడుతూ మీరాకుమార్‌కు వ్యతిరేకంగా ఓటేయాలనే కేసీఆర్ నిర్ణయం దారుణమన్నారు. ఆర్ఎస్ఎస్కు విధేయుడైన రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వంపై ఎంఐఎం వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. మియాపూర్ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేస్తామంటే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. -
6 నిమిషాల్లో 60 సార్లు అడ్డుకున్నారు!
మాజీ స్పీకర్ మీరాకుమార్‌పై సుష్మ న్యూఢిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్, యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్‌పై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ విరుచుకుపడ్డారు. 2013 ఏప్రిల్‌లో లోక్‌సభ సమావేశాల సందర్భంగా మీరాకుమార్ వ్యవహరించిన తీరుపై ఓ వీడియోను సామాజిక మాధ్య మంలో పోస్టుచేశారు. సమావేశాల సంద ర్భంగా అప్పటి మన్మోహన్ ప్రభుత్వాన్ని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి పెద్ద స్కాంల ప్రభుత్వమని సుష్మ విమర్శి స్తుండడం, మంత్రులు పదే పదే ఆమె ప్రసంగానికి అడ్డుపడుతుండడం, స్పీకర్ మీరా కుమార్ థాంక్యూ, ఆల్రైట్ అంటూ ఆమె ప్రసంగాన్ని ఆపేసేలా ప్రయత్నించడం ఆ వీడియోలో ఉన్నాయి. దాంతోపాటు ఓ దినపత్రికలో ప్రచురితమైన ‘స్పీకర్ 6 నిమిషాల్లో 60 సార్లు సుష్మా ప్రసంగాన్ని అడ్డుకున్నారు’ అనే హెడ్లైన్ ఉన్న పేపర్ క్లిప్‌ను ఆ వీడియోకు లింకు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తటస్థవ్యక్తి అంటూ విపక్షాలు మీరాకుమార్ను ప్రచారం చేయడాన్ని ప్రశ్నిస్తూ ఆమె ఈ వీడియోను పోస్టు చేశారు. అంతరాత్మ సాక్షిగా: మీరా కుమార్ రాష్ట్రపతి ఎన్నికల్లో అంతరాత్మను అనుసరించి ఓటేయాలని విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ చట్టసభల సభ్యులను కోరారు. ఏదైనా చట్టాన్ని తీసుకురావడంలో రాష్ట్రపతిదే తుది నిర్ణయం అని రాజ్యాంగం చెబుతోందనీ, ఆ పదవిని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకూడదని ఆమె అన్నారు. -
పోటీ నామమాత్రమే..!
యూపీఏ, ఇతర విపక్షపార్టీలు మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపాయి. వామపక్షాలు చెప్పినట్లు ఇది సైద్ధాంతిక పోటీయే తప్పితే ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని అంకెలు చెబుతున్నాయి. రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఓట్ల విలువ 10,98,903. దీంట్లో సగంకన్నా ఒక ఓటు ఎక్కువ (5,49,452 ఓట్లు) వచ్చిన వారు గెలుస్తారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరాన్ని పాటించే తటస్థ పార్టీల్లో.. వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, బీజేడీ, జేడీయూ, అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఎన్డీయే అభ్యర్థికే తమ మద్దతును ప్రకటించాయి. తాజాగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ తమ పార్టీ జేడీయూ మద్దతు కోవింద్‌కు ఉంటుందని ప్రకటించారు. ఎన్డీయే బలానికి వీరి ఓట్లు కూడా తోడైతే కోవింద్‌కు ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న బలం 62.39 శాతం. విజయానికి 5,49,452 ఓట్లు వస్తే సరిపోనుండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో కోవింద్‌కు అనుకూల ఓట్లు 6,89,630 కావడం గమనార్హం. దీనిని బట్టి విపక్షపార్టీలు మొక్కుబడిగా పోటీకి దిగుతున్నాయనేది సుస్పష్టం. యూపీఏ అభ్యర్థికి 3,70,804 అనుకూల ఓట్లున్నాయి. అంటే ఎలక్టోరల్ కాలేజీలో వీరికి 33.58 శాతం మద్దతుంది. ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న ఆప్ (0.82 శాతం), ఐఎన్ఎల్డీ (0.38 శాతం), స్వతంత్రులు, ఇతర చిన్నాచితక పార్టీలు ఏ వైఖరి తీసుకున్నా అంతిమఫలితంపై ప్రభావమేమీ ఉండదు. ఎన్డీఏకు మద్దతిస్తున్న ఇతర పార్టీలు పార్టీ ఓట్ల విలువ శాతం వైఎస్సార్సీపీ 16,848 1.53 టీఆర్ఎస్ 22,048 1.99 బీజేడీ 32,892 2.98 అన్నాడీఎంకే 59,224 5.36 (రెండు వర్గాలు) జేడీయూ 20,935 1.89 మొత్తం 1,51,947 13.75 – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
విపక్షాల అభ్యర్థి మీరాకుమార్
రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించిన ప్రతిపక్షాలు ► 17 పార్టీల భేటీలో ఏకగ్రీవ నిర్ణయం ► మీరాకుమార్‌కు మాయావతి మద్దతు ► ఫలించని లాలూ దౌత్యం.. కోవింద్‌కు మద్దతుపై వెనక్కి తగ్గని జేడీయూ ► మీరాకుమార్ను బలిపశువును చేశారు: బీజేపీ న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల సంగ్రామంలో ఎన్డీఏ దళిత బాణానికి ప్రతిపక్షాలు అదే స్థాయిలో బదులిచ్చాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌పై పోటీకి దళిత వర్గానికే చెందిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్(72)ను ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి. కోవింద్ కూడా దళిత వర్గ నేత కావడంతో ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు దళిత నేతల మధ్య పోరుగా మారింది. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో గురువారం జరిగిన భేటీలో 17 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్ ఎంపికతో కొంత విజయం సాధించినా.. అసలు లక్ష్యమైన నితీశ్‌కుమార్ మద్దతు దక్కకపోవ డంతో డీలాపడ్డాయి. అయితే మీరాకు బీఎస్పీ మద్దతు ప్రకటించడం కొంత ఉపశమనం. మీరాకుమార్ను కాంగ్రెస్ బలిపశువు చేస్తోందని బీజేపీ విమర్శించింది. విపక్షాల భేటీ అనంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘రాష్ట్రపతి ఎన్నికల్లో మీరాకుమార్ను బరిలోకి దించాలని 17 ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్ణయించార’ని పేర్కొన్నారు. నితీశ్ మద్దతుపై స్పందిస్తూ.. ‘ఇతర పార్టీలు కూడా మాతో కలుస్తాయనే ఆశాభావంతో ఉన్నామని, ఎవరి విషయంలోను నిరాశచెందమ’ని సమాధానమిచ్చారు. మీరాకుమార్ పేరుకు పార్టీలన్నీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. షిండే, ముంగేకర్, గాంధీ, అంబేడ్కర్ల పేర్లపై చర్చ సమావేశం ప్రారంభంలో సోనియా మాట్లాడుతూ.. ఉమ్మడి అభ్యర్థి విషయంలో ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరముందన్నారు. అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. మీరాకుమార్తో పాటు మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు దళిత నేతలైన మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, రాజ్యసభ ఎంపీ బాలచంద్ర ముంగేకర్ పేర్లను ప్రతిపాదించారు. ఎక్కువ పార్టీలు మీరాకుమార్ ఎంపికకు మొగ్గుచూపడంతో ఆమె పేరును సోనియా ఖరారు చేశారు. మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ, బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ పేర్లను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించినా ఆ పేర్లపై ఏకాభిప్రాయం రాలేదు. సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, సీపీఐ నాయకుడు డి.రాజా, డీఎంకే నుంచి కనిమొళి, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఒమర్ అబ్దుల్లా, తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్, ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్, బీఎస్పీ నేత మిశ్రా తదితరులు పాల్గొన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా మీరాకుమార్‌కు మద్దతు పలికారు. మద్దతు మాత్రమే.. ఎన్డీఏతో కలవం: జేడీయూ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు నిర్ణయాన్ని మార్చుకోవాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను కోరతానని భేటీ అనంతరం ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో విభేదాలతో ఆర్జేడీ, జేడీయూ సంకీర్ణానికి ముప్పు లేదన్నారు. అయితే లాలూ విజ్ఞప్తిని జేడీయూ తిరస్కరించింది. కోవింద్‌కు మద్దతిచ్చినంత మాత్రానా.. ఎన్డీఏతో కలిసే ప్రసక్తే లేదని జేడీయూ నేత త్యాగి పేర్కొన్నారు. అప్పుడు మీరాకుమార్ గుర్తుకు రాలేదా: బీజేపీ మీరాకుమార్ను బలిపశువు చేశారని బీజేపీ పేర్కొంది. ‘కాంగ్రెస్ అధికారంలో ఉండగా దళిత నేతను రాష్ట్రప తిగా ఎన్నికునే అవకాశమున్నా.. అప్పుడు తగిన వ్యక్తిగా మీరాకుమార్ను గుర్తించలేదు. ఇప్పుడు ఓటమి తప్పదని తెలియడంతో ఆమెను రంగంలోకి దింపార’ని బీజేపీ ప్రతినిధి నరసింహ రావు పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల మేరకు నిర్ణయం తీసుకోండి: మీరాకుమార్ న్యూఢిల్లీ: అత్యున్నత విలువలు, సామాజిక న్యాయం, సిద్ధాంతాలు, సైద్ధాంతిక భావజాలం ఆధారంగా విశాల దేశ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు నిర్ణయం తీసుకోవాలని మీరాకుమార్ కోరారు. తనను ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన ప్రతిపక్ష పార్టీలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాల ఐక్యత తనకు సంతోషం కలిగించిందన్నారు. ఐఎఫ్ఎస్ నుంచి స్పీకర్ వరకు.. ⇒ కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేయక ముందు నుంచే ప్రముఖ దళిత నేత జగ్జీవన్‌రాం కుమార్తెగా మీరాకుమార్ సుపరిచితమే.. ⇒ జననం: మార్చి 31, 1945న బిహార్‌లోని అర్రాహ్ జిల్లాలో ⇒ తల్లిదండ్రులు: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రాం, స్వాతంత్య్ర సమరయోధురాలు ఇంద్రాణీదేవి ⇒ కుటుంబం: భర్త మంజుల్ కుమార్.. ఆయన కూడా ఐఎఫ్ఎస్ అధికారే.. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ⇒ విద్యాభ్యాసం: బీఏ, ఎల్ఎల్బీ, ఎంఏ(ఇంగ్లిష్), అడ్వాన్స్డ్ డిప్లమో ఇన్ స్పానిష్, బనస్థలి విద్యాపీఠ్ నుంచి గౌరవ డాక్టరేట్ ⇒ దౌత్యవేత్తగా: 1973లో ఐఎఫ్ఎస్లో చేరిక. బ్రిటన్, స్పెయిన్, మారిషస్‌లో దౌత్యవేత్తగా బాధ్యతల నిర్వహణ. ఐరాసలోని వివిధ భారతీయ మిషన్లలో కూడా పనిచేశారు. ⇒ రాజకీయ ప్రస్థానం: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఐఎఫ్ఎస్కు రాజీనామా.. 1985లో తొలిసారి యూపీలోని బిజ్నోర్ నుంచి ఎన్నిక. అనంతరం బిహార్‌లోని తండ్రి నియోజకవర్గం సాసారాం నుంచి 1989, 91లో ఓటమి. 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని కరోల్‌బాగ్ నుంచి గెలుపు.. అనంతరం 1999 ఎన్డీఏ ప్రభజనంలో ఓటమి. 2004, 2009లో సాసారాం నుంచి గెలుపు. ప్రముఖ దళిత నేతలైన రాంవిలాస్ పాశ్వాన్, మాయావతిని ఆమె ఓడించారు. ⇒ కేంద్ర మంత్రిగా: 2004–2009 వరకూ సాంఘిక న్యాయం, సాధికారికత మంత్రిగా, 2009లో జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతల నిర్వహణ. ⇒ 2009 నుంచి 2014 వరకూ 15వ లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. -
ఆ నలుగురిలో ఒకరు!
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై కసరత్తు న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేతర పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్ గాంధీల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నలుగురిలో ఎవరో ఒకరిని అభ్యర్థిగా నిలబెట్టవచ్చని ప్రతిపక్ష నేత ఒకరు వెల్లడించారు. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న శరద్ పవార్ పేరుపై ప్రతిపక్షాలు సానుకూలంగా ఉండగా.. దళిత నేత, కాంగ్రెస్‌కు చెందిన మీరా కుమార్‌కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. జేడీయూకు చెందిన శరద్ యాదవ్ సీనియర్ నేతే కాకుండా పార్లమెంట్ సభ్యుడిగా సుదీర్ఘ అనుభవముంది. మహాత్మాగాంధీ మనవడైన గోపాలకృష్ణ గాంధీకి పార్టీలకతీతంగా మద్దతిస్తున్నారు. గాంధీ అభ్యర్థిత్వానికి తృణమూల్ కాంగ్రెస్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థి విషయమై కొందరు ప్రతిపక్ష నేతలు తనను సంప్రదించారని గాంధీ తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, బిహార్ సీఎం నితీశ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, సీపీఐ నేత డి.రాజా, ఇతర ప్రతిపక్ష నేతలు చర్చలు కొనసాగిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్, బీజేడీతో పాటు దక్షిణాదికి చెందిన ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా తమకు మద్దతిచ్చేలా సంప్రదింపులు జరుపుతున్నారు. -
ప్రజాస్వామ్యం ఎటుపోతోంది?
ఆంధప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ ధోరణులు సాగుతున్నాయా? అన్న ప్రశ్న ఇక్కడి వాతావరణాన్ని గమనించేవారి కందరికీ తలెత్తుతుంది. రాష్ట్రపతులు, గవర్నర్లు, స్పీకర్లు మొదలైనవారు పార్టీలకు అతీతంగా హుందాగా రాజ్యాంగ తదితర సంక్షోభాలు తలెత్తినప్పుడు తండ్రిలా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ, ఈ మధ్య కాలంలో పరిస్థితులు-రాజకీయాల్లో హుందాతనం కొరవడినట్లు సూచిస్తున్నాయి. స్పీకర్ నిష్పాక్షికంగా గాక, అధికార పక్షం ప్రతినిధిగా వ్యవహరిస్తుండటం దురదృష్టకరం. మన రాష్ట్ర విభజన విషయంలో కూడా అప్పటి లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ నిష్పాక్షికంగా కాక అప్పటి అధికార పక్షానికి దన్నుగా నిలబడి అపఖ్యాతి పాలయ్యారు. మరి లోక్‌సభలో ఆమెక్కూడా పెప్పర్ స్ప్రే ఘాటు తగిలింది. ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌కి- రోజాకు మధ్య వివాదం దానితో పోలిస్తే తక్కువే గదా! మరి అలాంటప్పుడు ఇంత రాజీలేని ధోరణి, న్యాయస్థానాల ఉత్తర్వులను కూడా బేఖాతరు చేసే పరిస్థితి చూస్తుంటే న్యాయమూర్తులు అన్నట్లు ‘‘ఏపీలో అసలేం జరుగు తుంది? - సంథింగ్ రాంగ్, సంథింగ్ రాంగ్!!’’ ఎమ్మెల్యే రోజా ‘సారీ’ చెప్పాలని పట్టుబట్టే వారికి ఒక మౌలి కమైన విషయం అర్థం అవ్వాలి, కోర్టు మధ్యంతర ఉత్తర్వుల దృష్ట్యా ఆమెను సభలోకి అనుమతించి ఉన్నట్లయితే, ఆమె జరిగిన దానికి మర్యాద పూర్వకంగా ‘సారీ’ చెప్పి వుండేవారు కదా! మరికొందరు విపక్ష సభ్యులు వాడిన అన్ పార్లమెంటరీ భాష, హావభావాలను గురించి కూడా ఆమె మాట్లాడేవారు, మరి ప్రతిపక్ష నేతనుద్దేశించి ముఖ్యమంత్రి, అధికార పక్షం మంత్రులు, సభ్యులు ఉపయోగించిన పదజాలం కూడా అన్పార్లమెంటరీనే గదా! అంటే ఒకరికొకరు ‘సారీ’ చెప్పుకోవడం కంటే వీరంతా ప్రజలకు ‘సారీ’ చెప్పాల్సి ఉంటుంది. కొత్త చీర, ఓ పెద్ద కరెన్సీ నోటు కోసం రాత్రంతా ఎదురుచూసి ఓటును అమ్ముకునేవారున్నంత కాలం చట్టసభలు కూడా ఇలాంటి వారికి దర్పణంగా మాత్రమే ఉంటాయనటానికి మన ప్రస్తుత రాజకీయాలు నిదర్శనం. ‘వోట్ ఫర్ నోట్’తోపాటు, రాజకీయ బేరసారాల గురించి మనం ఎన్నికలు అయిపోయాక కూడా వింటున్నాం కదా. రాష్ట్రంలో ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుల్లాగా కొనేసుకుంటున్న వైనం చూసి జాతీయ నేతలు విస్తుపోతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని ఘోర పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తరచుగా మన మెక్కడికి పోతున్నాం అంటుంటారు. ఆయన ఇదే ప్రశ్నను తనపై తాను వేసుకుంటే అందరికీ మంచిది. - డాక్టర్ టి. రామదాసు, సీనియర్ వైద్యులు మొబైల్: 7675958696 నీటి దిగుమతి తప్పదా? నేడు దేశంలో ఎటు చూసినా దాహపు కేకలే, కరవు నీడల్లో, అడుగంటిన నీటి జాడల్తో దేశంలో సింహభాగం అల్లాడుతోంది. అధికార గణాంకాల మేరకు తొమ్మిది రాష్ట్రాలు కరువుబారిన పడ్డాయి. తొంబై ఒక్క పెద్ద జలాశయాలలో నీరు అడుగంటింది. తొమ్మిది జీవనదులు ఒట్టిపోయాయి. లాతూర్ ప్రాంతానికి తాగునీటిని ప్రభుత్వం రైళ్ల ద్వారా పంపిణీ చేయాల్సిన దుర్గతి దాపురించింది. శక్తివంతమైన క్రికెట్ పోటీలు కూడా నీటి ఎద్దడి మేరకు వేరే ప్రాంతాలకు వలసపోవడం తప్పనిసరైంది. వీటన్నింటిని మించి భారతదేశంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో అడుగంటుతున్నాయి. తలసరి నీటి లభ్యత 1950లలో మనిషికి ఐదువేల క్యూబిక్ మీటర్లుండగా నేడది పదిహేను వందల క్యూబిక్ మీటర్లు. కనీస స్థాయి పదిహేడు వందల మేరకు లేకపోతే ఆ దేశాన్ని నీటి ఎద్దడి దేశంగా గుర్తిస్తారు. అధికారికంగా ఇక మన దేశం ప్రమాదంలో ఉన్నట్టే కనుక భారత సమాజం కళ్లు తెరవాల్సిన సమయం. వాస్తవాన్ని గుర్తెరిగి నష్ట నివారణకు నడుం బిగించాల్సిన సందర్భం. ఇప్పుడు దేశంలో ‘సుజల భారత్’ ఉద్యమం అవసరం. అందుకు ప్రధానమంత్రి నడుం బిగించి దేశ ప్రజలను నడిపిం చాల్సి ఉంది. విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడివెయ్యడం, ఉపరితల జలాలను వృథాపర్చడం నియంత్రించాలి. నీటి పొదుపు, నీటి నిల్వ నిర్వహణ శాస్త్రీయంగా, సమర్థవంతంగా జరగాలి. ఈ అల వాట్లను వ్యక్తి స్థాయి నుండి వ్యవస్థ స్థాయి వరకూ పాదుకొల్పాలి. ప్రభుత్వం, పౌర సమాజం, మీడియా, యంత్రాంగం, ప్రజానీకం చిత్తశుద్ధితో కదలాల్సిన అత్యవసర పరిస్థితి, ఉదాసీనత వహిస్తే నీరు కూడా దిగుమతి చేసుకోవాల్సిన దినుసుల లిస్టులో చేరడం ఖాయం. - డాక్టర్ డీవీజీ శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం అంబేడ్కరీయం భారతీయుల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, విశ్వ మేధావి డాక్టర్ బి.ఆర్ . అంబే డ్కర్ 125వ జయంత్యుత్సవం సందర్భంగా తెలుగు రక్షణ వేదిక కవితాంజలి సమర్పి స్తోంది. పొట్ల్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో ‘అంబేద్కరీయం’ పేరుతో ఆ మహనీ యుడిపై కవితా సంకలనం తీసుకురాదలి చాము. అంబేద్కర్ భావజాలం, ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలను ఆవిష్కరిస్తూ కవిత లను పంపవలసిందిగా కవులను ఆహ్వా నిస్తున్నాము. మీ కవితలు 12 నుంచి 27 పంక్తులకు మించరాదు. కవిత స్వంతమేనని హామీపత్రం జతచేసి పంపాలి. కవితలను telugupaluku@yahoo.com కి 1-5-2016 లోగా పంపగలరు. అందరికీ ఆహ్వానం. సంపాదకవర్గం: డాక్టర్ కత్తిమండ ప్రతాప్ (90003 43095), జాబిలి జయచంద్ర, అనిల్ డ్యాని, బొడ్డు మహేందర్ పొట్లూరి హరికృష్ణ జాతీయ అధ్యక్షులు, తెలుగు రక్షణ వేదిక -
కేసీఆర్ ఓటమే ప్రజా గెలుపు
-
కేసీఆర్ ఓటమే ప్రజా గెలుపు
- వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, దిగ్విజయ్ - తెలంగాణ బిల్లు ఆమోదం ఓ చరిత్రాత్మక ఘట్టం - ఉద్విగ్న క్షణాల మధ్య బిల్లు ప్రవేశపెట్టా: లోక్‌సభ మాజీ స్పీకర్ - ఆ సమయంలో బలిదానాలు నన్ను కదిలించాయి - ఇద్దరు ఎంపీలున్న టీఆర్ఎస్తో బిల్లు పాస్ కాలేదు - కాంగ్రెస్, సోనియా కృషి వల్ల ప్రత్యేక రాష్ట్రం వచ్చింది - కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయం: దిగ్విజయ్ - మాల, మాదిగలకు కేబినెట్లో చోటేది: పీసీసీ చీఫ్ ఉత్తమ్ - సీఎంకు ఝలక్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: పొన్నాల - భూపాలపల్లి, పరకాలలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలు సాక్షి, హన్మకొండ: ‘‘వరంగల్ ఉప ఎన్నికలో కేసీఆర్ ఓటమే ప్రజల గెలుపు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి’’ అని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు మద్దతుగా కాంగ్రెస్ ఆదివారం భూపాలపల్లి, పరకాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించింది. ఈ సందర్భంగా మీరాకుమార్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌పై విమర్శలు కురిపించారు. మాయమాటలు చెప్పే కేసీఆర్, ప్రధాని మోదీలకు ఈ ఉప ఎన్నికలో ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ‘‘పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఓ చరిత్రాత్మక ఘట్టం. పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత ఉద్విగ్న క్షణాల మధ్య తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాను. బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు పెప్పర్స్ప్రేలతో, సభ్యుల నినాదాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లు ప్రవేశపెట్టొద్దంటూ కొందరు నన్ను కోరారు. ఆ క్షణాన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న అలుపెరుగని పోరాటం, బలిదానాలు నా మనసును కదిలించాయి. అందుకే బెదరకుండా బిల్లు ప్రవేశపెట్టేందుకు మొగ్గుచూపాను’’ అంటూ నాటి ఘటనలను మీరా కుమార్ గుర్తుచేసుకున్నారు. సోనియా కృషి వల్లే తెలంగాణ ఇద్దరు ఎంపీలున్న టీఆర్ఎస్తో బిల్లు పాస్ కాలేదని, సోనియాగాంధీ, కాంగ్రెస్ కృషి వల్లే పార్లమెంటులో బిల్లు ఆమోదానికి అవసరమైన మద్దతు సమకూరిందని మీరా కుమార్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ ఎన్నడూ చిత్తశుద్ధితో పనిచేయలేదని, ఎప్పుడూ ప్రజలను రెచ్చగొట్టడమే ఆ పార్టీ పనంటూ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించకపోవడం వారిని అవమానించడమేనని అన్నారు. ‘‘నా జీవిత చరిత్రలో అబద్ధాలు చెప్పే ప్రధానిని ఇప్పటి వరకు చూడలేదు. అందుకే మొన్నటి ఎన్నికల్లో మా బిహారీలు బీజేపీకి బుద్ధి చెప్పారు’’ అంటూ మోదీపై మండిపడ్డారు. మాయమాటలు చెప్పే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లకు వరంగల్ ఉప ఎన్నికలో గుణపాఠం చెప్పాలన్నారు. సర్వే సత్యనారాయణ సమర్థుడని, 24 క్యారెట్ల బంగారమని వ్యాఖ్యానించారు. చికెన్ కంటే పప్పు ధర ఎక్కువా? చికెన్ ధర కంటే పప్పు ధర ఎక్కువగా ఉండటం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దిగ్విజయ్ సింగ్ దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పి గద్దె నెక్కిన మోదీ, కేసీఆర్‌లకు బుద్ధి చెప్పేందుకు ఇది సరైన సమయమన్నారు. విదేశాలకు వెళ్లి భారత్ ఎంతగానో అభివృద్ధి చెందిందనడం, మన దేశంలో మాత్రం కాంగ్రెస్ పాలన వల్ల దేశం వెనుకబడి ఉందనడం ప్రధాని మోదీకే చెల్లిందన్నారు. దేశంలో కాంగ్రెస్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరిగిందన్నారు. సకల జనుల సమ్మె కాలాన్ని సెలవు దినంగా ప్రకటించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఎన్నికల కమిషన్ ఈ విషయంపై చూస్తూ ఊరుకోవడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి అన్నారు. మాల, మాదిగలకు రాష్ట్ర కేబినేట్లో చోటులేకపోవడం బాధాకరమని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నక్సలైట్ల అజెండానే తమ అజెండా అని చెప్పి.. శృతిని ఎన్కౌంటర్ చేశారని విమర్శించారు. హమీలను విస్మరించిన కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆకాశంలో నడుస్తున్న కేసీఆర్‌ను నేలపైకి దించాలంటే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. హిట్లర్ కంటే హీనంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని సర్వే సత్యనారాయణ అన్నారు. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బలరాంనాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీ గౌడ్, జనక్ ప్రసాద్, సంపత్, రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'వరంగల్‌లో మాదే విజయం'
వరంగల్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం పరాకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో దిగ్విజయ్ సింగ్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కేసీఆర్ అవలంభించిన నిరంకుశ పాలన వలనే ఉపఎన్నికలు వచ్చాయని అన్నారు. వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని దిగ్విజయ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, ప్రజలంతా కాంగ్రేస్‌ను గెలిపించుకోవాలని మీరా కుమార్ కోరారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్ మాట తప్పాడని ఆమె విమర్శించారు. -
భరించే అభ్యర్థి ఎవరు..?
* ఓరుగల్లు ఉపఎన్నికపై టీపీసీసీ మల్లగుల్లాలు * కాసులు పెట్టే అభ్యర్థికోసం అన్వేషణ * ఖర్చుకోసం వెనుకాడుతున్న నేతలు * వ్యూహాత్మకంగా తెరపైకి మీరాకుమార్ సాక్షి, హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలు టీపీసీసీకి ‘భారం’గా మారాయి. అధికారపార్టీ సిట్టింగ్ స్థానంలో పోటీ పడాలంటే అంగబలం, అర్థబలం దండిగా ఉన్న అభ్యర్థినే బరిలో నిలపాలి. అలాంటి అభ్యర్థి అయితేనే ఖర్చు భారం తమపై పడదని టీపీసీసీ భావిస్తోంది. ఇక్కడ గెలవాలంటే అర్థబలం కీలకమని, దీనికి తట్టుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థిని కాకుండా, పదేళ్లపాటు ప్రభుత్వ పదవుల్లో కొనసాగిన వారిని వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిపితేనే టీపీసీసీ నేతలపై భారం పడకుండా తప్పించుకోవచ్చుననే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ, గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా వ్యవహరించిన నేతలు సైతం వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీచేయడానికి నిరాసక్తతతో ఉండడం పార్టీని కలవరపరుస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కడియం శ్రీహరి వరంగల్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడం వల్ల టీఆర్ఎస్కు అనేక సానుకూల అంశాలు ఉన్నాయని, ఖర్చుకు కూడా వెనకాడే పరిస్థితి ఉండదని టీపీసీసీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ స్థాయిలో ఖర్చు పెట్టాలంటే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్ మీరాకుమార్ పేరును తెరపైకి తీసుకువస్తున్నారని ఆ పార్టీ నాయకుడొకరు పేర్కొంటున్నారు. మీరాకుమార్‌కు పార్టీ టికెట్ ఇస్తే వరంగల్‌లో ఉప ఎన్నిక ఖర్చు అంతా ఏఐసీసీ భరిస్తుందనే ఆలోచనలతోనే వ్యూహాత్మకంగా ఈ పేరును ప్రచారంలోకి తెచ్చినట్టుగా చెబుతున్నారు. దామోదరపై పెరుగుతున్న ఒత్తిడి టీఆర్ఎస్కు పోటీగా ఖర్చు పెట్టుకోవడంతో పాటు తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పోటీలో దిగాలంటూ కొందరు నేతలు కోరుతున్నారు. ఆయన బరిలో ఉంటే తెలంగాణవాదుల నుంచి మద్దతును పొందడం సులభం అవుతుందని వారు వాదిస్తున్నారు. తెలంగాణ 10 జిల్లాలకు రాయలసీమ జిల్లాలను కలిపే ప్రతిపాదనను వ్యతిరేకించిన చరిత్ర దామోదరకు ఉందని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలుచేయడంలోనూ కీలకంగా పనిచేశారని, ఇది ఆయనకు ఉప ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీలు జి.వివేక్, సిరిసిల్ల రాజయ్య వంటిపేర్లపై అధిష్టానం సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది. -
వరంగల్ బరిలో మాజీ స్పీకర్ మీరాకుమార్!
హైదరాబాద్: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో అనూహ్యపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవైపు మాజీ ఎంపీలు రాజయ్య, వివేక్, సర్వే సత్యనారాయణ సహా పలువులు ఎస్సీ నేతల పేర్లు పరిశీలనలో ఉండగానే.. వరంగల్ నుంచి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను పోటీలోకి దించాలని టీపీసీసీ భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదే విశయాన్ని హైకమాండ్‌తో చర్చించేందుకే టీపీసీసీ చీఫ్ ఉత్తమ కుమర్ రెడ్డి శనివారం ఢిల్లీకి పయనమయ్యారని పార్టీ వర్గాలు చెప్పాయి. దీంతోపాటు ఈ నెలలో నిర్వహించనున్న రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్, రూట్ మ్యాప్ తదితర వివరాలపైనా ఆయన హైకమాండ్ తో మాట్లాడతారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో తొలితరం దళిత నేతగా ఎనలేని కీర్తిప్రతిష్ఠలు పొందిన బాబూ జగజ్జీవన్ రామ్ తనయగా, గత లోక్‌సభ స్పీకర్‌గా సమర్థతను నిరూపించుకున్న నాయకురాలిగా మీరా కుమార్ కు కూడా దేశవ్యాప్త గుర్తింపు ఉంది. అయితే ఆమె ఎంపిక తెలంగాణలో కాంగ్రెస్‌కు మళ్లీ జవసత్వాలు తెచ్చిపెడుతుందా లేదా అనేది ఉప ఎన్నికలు ముగిశాకగానీ వెల్లడికాదు. -
రాజకీయాల్లో షీలా అరంగేట్రం
సాక్షి, న్యూఢిల్లీ: 1996లో ఎన్నికైన ప్రభుత్వం ఏడాదిన్నరకే కుప్పకూలడంతో 1998లో 12వ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. రాజీవ్ గాంధీ హత్యతో డీఎంకేకు సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది. తమిళ వేర్పాటు వాదులతో డీఎంకే సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆరోపణల నేపథ్యంలో తలెత్తిన వివాదంతో ఇంద్రకుమార్ గుజ్రాల్ నేతృత్వంలోని యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి సీతారామ్ కేసరి నేతృత్వంలోని కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సీతారామ్ కేసరి నేతృత్వంలో పోటీ చేసింది. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయని కేసరి ఆశాభావంతో చెప్పిన జోస్యం నిజంగానే కాంగ్రెస్‌కు అశ్చర్యం కలిగించింది. ఈ ఎన్నికలలో ఢిల్లీలోని ఏడు స్థానాలలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. కరోల్ బాగ్ నుంచి మీరాకుమార్ గెలిచి పార్టీ పరువు నిలబెట్టారు.ఈ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ జరిగింది. మిగతా ఆరు స్థానాలలో బీజేపీ గెలిచింది. విబేధాలను పక్కనబెట్టి బీజేపీ నేతలు మదన్‌లాల్ ఖురానా, సాహిబ్‌సింగ్ వర్మ ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కృషి చేశారు. ఈ ఎన్నికలతో షీలా దీక్షిత్ ఢిల్లీ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఈస్ట్ ఢిల్లీలో లాల్ బిహారీ చేతిలో ఓడిపోయిన షీలాదీక్షిత్ ఆ తరువాత పది నెలలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్‌ను గెలిపించడమే కాకుండా 15 సంవత్సరాలపాటు ఢిల్లీలో నిరాటంకంగా రాజ్యమేలారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఘోర పరాజయం పాలైన ఆమెకు కాంగ్రెస్, కేరళ గవర్నర్‌గా పంపింది. లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గంలో అజయ్ మాకెన్‌ను ఓడించిన సుష్మాస్వరాజ్ ఆ తరువాత ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. కానీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం అనంతరం ఆమె ఢిల్లీ రాజకీయాల నుంచి నిష్ర్కమించారు. న్యూఢిల్లీలో బీజేపీ నేత జగ్మోహన్ కాంగ్రెస్ అభ్యర్థి ఆర్కె ధావన్‌ను ఓడించారు. చాందినీ చౌక్‌లో జేపీ అగర్వాల్, బీజేపీ నేత విజయ్ గోయల్చేతిలో పరాజయం పాలయ్యారు. సదర్ నుంచి మదన్‌లాల్ ఖురానా, ఔటర్ ఢిల్లీ నుంచి కేఎల్ శర్మ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల నాటికి ఢిల్లీలో ఓటర్ల సంఖ్య 83 లక్షలకు పెరిగింది. 43 లక్షల మంది ఓటు వేశారు. 132 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వారిలో పది మంది మహిళలున్నారు. -
బిల్లు ప్రవేశపెట్టినట్టు అంగీకరించొద్దు: సీమాంధ్ర మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినట్టు అంగీకరించొద్దని స్పీకర్ మీరాకుమార్‌కు సీమాంధ్రకు చెందిన ఐదుగురు కేంద్ర మంత్రులు లేఖ రాశారు. 14వ తేదీతో ఉన్న ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో కావూరి సాంబశివరావు, పల్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పురందేశ్వరి ఉన్నారు. ‘‘నిబంధనావళితో సంబంధం లేకుండా కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును సభలోకి తెచ్చారు. సవరించిన ఎజెండాలో కూడా లేనప్పుడు సప్లిమెంటరీ బిజినెస్‌లో ఉండడం సభాసాంప్రదాయం. కానీ ఆ బిల్లు సవరించిన ఎజెండాలో లేదు. సప్లిమెంటరీ ఎజెండా కూడా ఏదీ ఇవ్వలేదు. మీరు మాత్రం 12 గంటలకు హోంమంత్రిని పిలిచారు. సప్లిమెంటరీ జాబితా 2 గంటలకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదంతా సభా సంప్రదాయాలకు విరుద్ధం. ఈ నేపథ్యంలో కేంద్ర ఉద్దేశాలను, స్పీకర్ కార్యాలయం ఉద్దేశాన్ని అనుమానించాల్సి వస్తోంది. బిల్లు ప్రవేశపెట్టినట్టు ప్రకటించడాన్ని బీజేపీ సహా అనేక రాజకీయ పార్టీలు ఖండించాయి. తిరిగి బిల్లు ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలి’’ అని అందులో కోరారు. సస్పెన్షన్లపై పునరాలోచించాలి: ఎంపీలను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించి ఎత్తివేయాలని కోరుతూ ఈ ఐదుగురు కేంద్ర మంత్రులు స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ రాశారు. సభను అడ్డుకోవద్దు: అద్వానీ కేంద్ర మంత్రులు కావూరి, పల్లంరాజు, పురందేశ్వరి, చిరంజీవి, కిల్లి కృపారాణి సోమవారం బీజేపీ అగ్రనేత అద్వానీతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తమ ప్రాంతానికి తగిన ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేలా సహకరించాలని, తమ ప్రాంత ఎంపీల సస్పెన్షన్‌ను ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు అద్వానీని కోరారు. అద్వానీ సానుకూలంగా స్పందించారు. అలాగే, పార్లమెంటు సాంప్రదాయాలను కాలదన్ని వెల్‌లో నిరసనలకు దిగడం సరికాదని, సభను అడ్డుకోవద్దని అద్వానీ వారికి సూచించారు. ఈ భేటీలో మరో కేంద్ర మంత్రి జేడీ శీలం పాల్గొనలేదు. -
జాతికి క్షమాపణ చెప్పండి : మోదుగుల
స్పీకర్ మీరాకుమార్‌కు మోదుగుల లేఖ సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు భిన్నంగా అధికార పార్టీ పక్షపాతిగా వ్యవహరిస్తున్న స్పీకర్ మీరాకుమార్ తన పదవి నుంచి తప్పుకుని జాతికి క్షమాపణ చెప్పాలని టీడీపీ సీమాంధ్ర ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన స్పీకర్‌కు మూడు లేఖలు పంపారు. ‘అవిశ్వాసంపై మేము పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పుడు.. సభ సజావుగా సాగడంలేదని స్పీకర్ అనుమతివ్వలేదు. మరి విభజన బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో సభ సజావుగా సాగుతుందా?’ అని మోదుగుల ప్రశ్నించారు. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు న్యాయనిపుణుల సలహాను కోరిన రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రజాస్వామ్య విలువలను కాపాడారని గుర్తు చేస్తూ.. లోక్‌సభలో కనీస విలువలు పాటించలేదని స్పీకర్‌ను దుయ్యబట్టారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరించారని ఆరోపించారు. 13వ తేదీన లోక్‌సభలో తెలంగాణ బిల్లు పెట్టిన సమయంలో జరిగిన పరిణామాలపై సీసీటీవీ దృశ్యాలను బహిర్గతపర్చాలని డిమాండ్ చేశారు. శరద్ యాదవ్, తంబిదొరైలతో భేటీ తెలంగాణ ప్రాంత టీడీపీ నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఆ ప్రాంత నేతల బృందం సోమవారం రాత్రి జేడీయూ అధినేత శరద్‌యాదవ్, ఏఐఏడీఎంకే నేత తంబిదొరైలను వేర్వేరుగా కలిసి పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేసింది. నామా వెంట టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ యర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు ఉన్నారు. -
హక్కుల సంఘానికి 'పెప్పర్ స్ప్రే '
-
హక్కుల సంఘానికి 'పెప్పర్ స్ప్రే '
పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరిన లోక్‌సభ స్పీకర్ నేడు పార్లమెంటు భద్రతా కమిటీ అత్యవసర భేటీ పార్లమెంటులోకి వెళ్లేముందు ఎంపీలను తనిఖీ చేసే అంశంపై చర్చ! న్యూఢిల్లీ: లోక్‌సభలో పెప్పర్ స్ప్రే(మిరియాల ద్రావకం) చల్లిన ఉదంతంపై స్పీకర్ మీరాకుమార్ స్పందించారు. దీనికి సంబంధించిన విషయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదివారం సభా హక్కుల కమిటీకి నివేదించారు. సభా వ్యవహారాలు, ప్రవర్తనా నియమావళిలోని 227 నిబంధన కింద ఆమె ఈమేరకు నివేదించారని లోక్‌సభ సెక్రటేరియట్ ఓ ప్రకటనలో తెలిపింది. కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో నేతృత్వంలోని 15 మంది సభ్యులు గల సభాహక్కుల కమిటీకి హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారిని శిక్షించే అధికారాలు ఉన్నాయి. జైలు శిక్ష విధించాలని, బహిష్కరించాలని సిఫార్సు చేయడం వంటివి అందులో ఉన్నాయి. గత గురువారం లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకునే క్రమంలో కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లడం, ఇతరత్రా ఘటనలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ భద్రతా కమిటీ భేటీ నిర్వహించాలని స్పీకర్ ఆదే శించడమూ విదితమే. పెప్పర్ స్ప్రే ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో భద్రతా కమిటీ సోమవారం అత్యవసరంగా భేటీ కానుంది. పార్లమెంటు ఆవరణలో జరగనున్న ఈ భేటీలో.. పార్లమెంటులోకి ప్రవేశించే సమయం లో ఎంపీలను తనిఖీ చేసే అంశంపై చర్చించే అవకాశముంది. హక్కులకు కోత! ఎంపీల ద్వారా సభలోకి ప్రమాదకరమైన, ప్రాణాలకు ముప్పు కలిగించే వస్తువులను తీసుకురాకుండా నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలతోసహా భద్రతకు సంబంధించిన సమస్త విషయాలను భద్రతా కమిటీ పరిశీలించనుంది. సభ్యులకున్న హక్కులను తగ్గించాలన్న డిమాండ్లను సైతం కమిటీ పరిశీలించేందుకు ఆస్కారమున్నట్టు సమాచారం. 2001 ఉగ్రవాద దాడి అనంతరం పార్లమెంటు భద్రతను పలు దఫాలుగా పటిష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలను, మెటల్ డిటెక్టర్లను అమర్చారు. పెద్ద ఎత్తున పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించారు. స్టేషనరీ మొదలుకుని తినుబండారాల వరకు ప్రతి ఒక్కదానినీ తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. ఎంపీలను మాత్రం ఈ తనిఖీల నుంచి మినహాయించారు. అంతేగాక వారు మెటల్ డిటెక్టర్ల నుంచి కాకుండా విడిగా వెళ్లేం దుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. అయితే తాజా ఘటన తో ఎంపీలను సైతం తనిఖీ చేయాలన్న వాదన తలెత్తింది. ‘పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగాక అలాంటివి పునరావృతం కాకుం డా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. అయితే కుటుంబ సభ్యుడే ఇంటికి నిప్పు పెట్టేందుకు యత్నిస్తే ఎవరేం చేయగలరు?’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కమిటీ సభ్యుడొకరు అన్నారు. -
ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: కావూరి
ఈ మేరకు స్పీకర్‌కు లేఖ రాస్తాం.. వెల్‌లోకి వెళతాం.. ప్రతిఘటిస్తాం సాక్షి, న్యూఢిల్లీ: సహచర సీమాంధ్ర ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివే యాలని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. సోమవారం స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ ద్వారా ఈ మేరకు విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు. ‘ఎవరికి చెప్పుకున్నా వినలేని పరిస్థితుల్లోనే వెల్‌లోకి వెళ్లాలనుకున్నాం. సోమవారం వెళతాం. ఆ తర్వాతా వెళతాం. ప్రతిఘటన తప్పదు..’ అని అన్నారు. ఆదివారం రాత్రి కావూరి నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై 3 గంటలపాటు చ ర్చించారు. అనంతరం కావూరి మీడియాతో మాట్లాడారు. ‘అసలు హింసాత్మక పద్ధతులకు ఎవరు పాల్పడ్డారు. వీడియో దృశ్యాలు చూడాలి. అప్పుడు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యులను బయటకు పంపి రాష్ట్రాన్ని విభజించడాన్ని చరిత్ర క్షమించదు. మా సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి. సభలోకి రావడానికి అనుమతించాలని స్పీకర్ గారిని అడగబోతున్నాం. దీనికి కాంగ్రెస్, ప్రతిపక్షాల నేతలు కూడా సహకరిస్తారని నమ్ముతున్నాం. ప్రధాని, సోనియా, జీఓఎంకు చెప్పినా.. అసెంబ్లీ తిప్పిపంపినా వినకుండా విభజిస్తే దేశం ఎలా ముక్కలవుతుందో చెప్పదలుచుకున్నాం. కేబినెట్లో చర్చించినా మా అభిప్రాయాలకు విలువ లేకపోతే ఎలా? పార్లమెంటులో అన్ని పార్టీల సభ్యులు పరిస్థితిని అర్థం చేసుకుని పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నాం..’ అని చెప్పారు. ‘బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో నేను కూడా ఉన్నా. సంప్రదాయమేంటి. సవరించిన జాబితాలో పెట్టొచ్చు. అర్జంట్ అయితే సప్లిమెంటరీ ఎజెండాను సభ్యులకు పంచిపెడతారు. సభ్యులు అడ్డుచెబితే సభ అభిప్రాయం తీసుకుని.. సభా సంప్రదాయం మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. కానీ గొడవలో ఎవరు ఏంచేస్తున్నారో తెలియని పరిస్థితిలో బిల్లును తెచ్చినట్టు చెప్పడం సబబు కాదు..’ అని పేర్కొన్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు చిరంజీవి, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జేడీ శీలం.. ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, మాగుంట, బాపిరాజు, సారుుప్రతాప్, సబ్బం హరి, లగడపాటి, ఉండవల్లి, కేవీపీ, హర్షకుమార్లు పాల్గొన్నారు. -
పార్లమెంట్లో కాంగ్రెస్ గూండాగిరి
* సీమాంధ్ర ఎంపీల ధ్వజం * ఇతర రాష్ట్రాల ఎంపీలను పెట్టి కొట్టించారు * కాంగ్రెస్ చెప్పినట్లు స్పీకర్ నడుస్తున్నారు * టెన్ జనపథ్ నుంచే ఫ్లోర్ మేనేజ్మెంట్ * లోక్‌సభ వీడియోలను ప్రజల ముందుంచుతాం న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గూండాగిరి చేస్తోందని సీమాంధ్ర ఎంపీలు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలను మోహరింపజేసి తమపై దాడి చేయించారని వాపోయారు. విభజన బిల్లు విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పెద్దలతో పోలిస్తే లోక్‌సభలో లగడపాటి రాజగోపాల్ చేసిన పని చాలా చిన్నదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ను సజావుగా నడపాల్సిన లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ సైతం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం కాంగ్రెస్ చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సభలో ఎవరు ఎవరిపై దాడి చేశారో... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందెవరనే విషయంపై లోక్‌సభ వీడియో పుటేజీలను సేకరించి ప్రజల ముందుంచుతామని తెలిపారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో శుక్రవారం ఉదయం ఎంపీలు సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, జి.హర్షకుమార్, సబ్బంహరి, లగడపాటి రాజగోపాల్ తదితరులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై గంటకుపైగా చర్చించారు. లోక్‌సభలో గురువారం జరిగిన పరిణామాలకు తమను దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నందున వాస్తవాలను బయటపెట్టేందుకు లోక్‌సభ వీడియో దృశ్యాలను సేకరించాలని నిర్ణయించారు. దీంతోపాటు విభజన బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి వివరించేందుకు సిద్ధమయ్యారు. అనంతరం ఆయా నేతలు మీడియాతో మాట్లాడారు. ఆ మూడూ సవరిస్తే విభజనకు ఓకే: కావూరి రాష్ట్రాల విభజనకు శాస్త్రీయ విధానం ఉండాలి. ఉత్తరప్రదేశ్‌ను విభజించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్రం ఎందుకు చేయలేదు? ఆంధ్రప్రదేశ్‌ను విభజించవద్దని ఈ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే ఎందుకు విడదీస్తున్నారు? మేము ప్రతిపాదించిన మూడు సవరణలకు కేంద్రం సోమవారంలోగా అంగీకరిస్తే రాష్ర్ట విభజనకు సహకరిస్తాం. హైదరాబాద్‌ను పదేళ్లపాటైనా యూటీ చేయాలి. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలి. భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలి. వీటిని అంగీకరించకపోతే తెలంగాణ బిల్లును అడ్డుకుంటాం. నేనూ సిగ్గుపడుతున్నా: లగడపాటి లోక్‌సభలో గురువారం జరిగిన పరిణామాలపట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. అలాంటి చర్యలు ఎవరు చేసినా ఆక్షేపణీయమే. అందుకు నేను సిగ్గుపడుతున్నా. నిన్నటి పరిణామాలకు దారి తీసిన పరిస్థితులేమిటో అందరికీ తెలియాల్సిన అవసరముంది. మాపై దాడి చేయడానికి వందమంది ఎంపీలు వచ్చారు. నా సహచర ఎంపీపైనా దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసమే పెప్పర్‌స్ప్రే ఉపయోగించాను. మమ్మల్నే ఎందుకు సస్పెండ్ చేశారు?: హరి కాంగ్రెస్ అప్రజాస్వామికంగా బిల్లును ప్రవేశపెట్టింది. గురువారం సుమారు వందమంది ఎంపీలు వెల్‌లోనే ఉండి ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలను మాత్రమే ఎందుకు సస్పెండ్ చేశారు? పార్లమెంట్ ఏమైనా జన్‌పథ్ అనుకుంటున్నారా? జన్‌పథ్ నుంచి పంపిస్తే తెలుస్తుంది: హర్షకుమార్ రాష్ట్రాన్ని విడగొట్టి మమ్మల్ని హైదరాబాద్ నుంచి పంపుతామంటున్నారు. మిమ్మల్ని (సోనియాగాంధీని ఉద్దేశించి) జన్‌పథ్ నుంచి పంపితే ఎంత బాధ ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. పార్లమెంట్లో ఫ్లోర్ మేనేజ్మెంట్ అంతా జన్‌పథ్ నుంచే నడిస్తోంది. దీనికి కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు. సీట్ల కోసం విభజిస్తారా?: సాయిప్రతాప్ తెలంగాణలో సీట్లు రావాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది. తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కనీసం ప్రతిపక్షాలకు తెలీకుండా పార్లమెంట్లో బిల్లును పెడుతున్నారు. ఇంతకంటే అప్రజాస్వామిక చర్య ఏముంటుంది? సస్పెన్షన్ ఎత్తివేయండి స్పీకర్‌కు లగడపాటి, సబ్బం లేఖలు సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి తమను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం నిర్హేతుకం, అన్యాయమైనదని ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి పేర్కొన్నారు. తమపై సస్పెన్షన్ ఎత్తివేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈ మేరకు వేర్వేరుగా లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ రాశారు. ఈ సస్పెన్షన్ ఎత్తివేసి నిజమైన ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటు విలువలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ ఇద్దరు సభ్యులు విడివిడిగా లేఖలు రాశారు. -
టీ బిల్లు పెట్టలేదు
*బీజేపీ, వైఎస్సార్సీపీ సహా ఎనిమిది పార్టీలదీ అదే మాట *సుష్మాస్వరాజ్ నేతృత్వంలో స్పీకర్‌తో భేటీ *బిల్లు సభలో పెట్టామన్న వాదనను అంగీకరించడం లేదు *బృందంలో జగన్, మేకపాటి, ఎస్పీవై రెడ్డి తదితరులు న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును గురువారం అసలు లోక్‌సభలో ప్రవేశపెట్టినట్టా, లేదా అన్నది వివాదాస్పదంగా మారింది. బిల్లు పెట్టినట్టుగా తాము పరిగణించే ప్రసక్తే లేదని ప్రధాన ప్రతిపక్షం సహా ఎనిమిది విపక్షపార్టీలు స్పీకర్‌కు తేల్చిచెప్పాయి. బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, జేడీ(యూ), సీపీఐ, ఏఐఏడీఎంకే తదితర పార్టీలు గురువారం సభ వాయిదా అనంతరం ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ నేతృత్వంలో స్పీకర్ మీరాకుమార్ను కలిసి ఈ విషయమై తీవ్ర నిరసన, అభ్యంతరం తెలిపాయి. బిల్లును సభలో పెట్టామన్న ప్రభుత్వ వాదనను అంగీకరించడం లేదని స్పష్టం చేశాయి. అసలు బిల్లును ఎక్కడ, ఎలా, ఏ పద్దతిన ప్రవేశపెట్టారో వివరించాలని నిలదీశాయి. బృందంలో బీజేపీ అగ్రనేత అద్వానీ, శరద్ యాదవ్ (జేడీ-యూ), గురుదాస్ దాస్‌గుప్తా (సీపీఐ), శైలేంద్రకుమార్ (ఎస్పీ), భరృ్తహరి మెహతాబ్ (బీజేడీ)లతో పాటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, తంబి దొరై (ఏఐఏడీఎంకే) కూడా ఉన్నారు. అనుబంధ ఎజెండాలో లేకుండా, పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా, ఒక రాష్ట్రాన్ని విభజించే కీలకమైన అంశానికి సంబంధించిన బిల్లును ఆషామాషీగా సభ నియంత్రణలో లేనప్పుడు ప్రవేశపెట్టకుండానే ప్రవేశపెట్టినట్టు ప్రకటించడం అప్రజాస్వామికమన్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టామని చెబుతున్న యూపీఏ ప్రభుత్వం.. ఆ తర్వాత, అంటే మధ్యాహ్నం 2 గంటలకు సభ్యులకు పంచిపెట్టిన అజెండా సర్క్యులర్ ఇది! ‘బిల్లును సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది’ అని అందులో పేర్కొనడం విశేషం. ‘సాధారణ ఎజెండాలో, అనుబంధ ఎజెండాలో కూడా పేర్కొనకుండానే 12 గంటల సమయంలో బిల్లు ప్రవేశపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఈ అంశం వివాదాస్పదం కావడంతో దిద్దుబాటు చర్యగా అఘమేఘాల మీద మూడో అనుబంధ ఎజెండాను వెలువరించారు. తప్పును సరిపుచ్చుకోవడానికా అన్నట్టు, 2 గంటల సమయంలో సభ్యులకు పంపిణీ చేసిన అనుబంధ ఎజెండాలో ‘‘ బిల్లు ప్రవేశపెట్టబడుతుంది’’ అని వెల్లడించడమేమిటి?’ అని మొత్తం ప్రక్రియనే తప్పుబట్టారు. సభ అదుపులో లేనప్పుడు క్షణాల్లో ఏదో చదివామనిపించడం ఏమిటని ప్రశ్నించారు. సంప్రదాయ పద్దతిలో బిల్లు ప్రవేశపెట్టాలన్నప్పుడు, కనీస పద్ధతయిన కొందరు అవుననటం, కొందరు కాదనటం కూడా జరగలేదని, ఎవరూ చేతులెత్తలేదనీ చెప్పారు. ఆ సమయంలో అక్కడే ఉన్న హోంమంత్రి షిండే, మంత్రి కమల్‌నాథ్ అంతా సజావుగానే జరిగిందంటూ చెప్పుకొచ్చారు. ఇది సరికాదని, మంత్రులు తమ అభిప్రాయాన్ని ప్రతినిధి బృందంపై రుద్దే యత్నం చేస్తున్నారని నిరసిస్తూ వారు వాకౌట్ చేశారు. -
నిబంధనలకు పాతర: లెఫ్ట్
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే క్రమంలో అన్ని నియమ నిబంధనలనూ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కాయంటూ వామపక్షాలు దుయ్యబట్టాయి. ‘‘గురువారం సభలో జరిగిన సంఘటనలకు కేవలం మిరియాల ద్రావకం చల్లిన వారిని మాత్రమే బాధ్యులను చేయడం తగదు. కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఇందుకు పూర్తి బాధ్యత వహించాలి. అవి సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోలేదు. నిజానికిదంతా ఉద్దేశపూర్వకంగా జరిగినదే. సభ సజావుగా సాగాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదనేందుకు ఇదే రుజువు’’ అని సీపీఎం లోక్‌సభా పక్షనేత బాసుదేవ్ ఆచార్య ఆరోపించారు. ఇలాంటి వివాదాస్పద బిల్లును ప్రవేశపెట్టే విషయమై కేంద్రం కేవలం బీజేపీతో మాత్రమే చర్చించింది తప్ప ఇతర విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదంటూ తప్పుబట్టారు. తెలంగాణ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టలేదన్నదే తమ అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ బిల్లు అసలు సభ ఎజెండాలోనే లేదు. ఇది సభా నిబంధనలను బాహాటంగా ఉల్లంఘించడమే. పైగా బిల్లును ప్రవేశపెట్టినట్టుగా స్పీకర్ మీరాకుమార్ ప్రకటిస్తున్న సమయంలో, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ‘నేను బిల్లును ప్రవేశపెడుతున్నాను’ అని అనలేదు. అలా అనడం తప్పనిసరి’’ అని తొమ్మిదోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచార్య చెప్పారు. తమ హయాంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియను శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా పూర్తి చేశామన్న బీజేపీ వాదనను సీపీఎం నేత సీతారాం ఏచూరి ఖండించారు. సభలో పూర్తి గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో ఆ బిల్లులను ఆమోదింపజేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హింసాకాండ వ్యాప్తి చేసేందుకు పార్లమెంటును వేదికగా కాంగ్రెస్ వాడుకుంటోందని సీపీఐ మండిపడింది. సాకులతో తెలంగాణ ఏర్పాటును వీలైనంత ఆలస్యం చేయడమే వారి లక్ష్యమని ఆరోపించింది. -
సస్పెన్షన్ గురైన ఎంపీలు
-
లోక్‌సభలో 16 మంది ఎంపీల సస్పెన్షన్
-
ఐదో రోజూ అదేతీరు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో ఐదోరోజూ ప్రతిష్టంభన కొనసాగింది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు ఇతర రాష్ట్రాలకు చెందిన సభ్యులు తమ ప్రాంతాల సమస్యలపై నిరసన తెలిపారు. గందరగోళం మధ్యే ప్రభుత్వం మొత్తం నాలుగు బిల్లులు ప్రవేశపెట్టడం మినహా చెప్పుకోదగిన కార్యక్రమాలేవీ లేకుండానే ఉభయ సభలూ బుధవారానికి వారుుదాపడ్డాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ మీరాకుమార్ హీరాకుడ్ పడవ ప్రమాదం, పశ్చిమబెంగాల్లో ట్రక్కు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. ఆ వెంటనే సభలో సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలు మార్మోగాయి. ఈ గందరగోళంలోనే సభాపతి ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించినా నినాదాలు కొనసాగడంతో మూడు నిమిషాల్లోనే సభ 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభం కాగానే వివిధ పార్టీలకు చెందిన సుమారు 40 మంది సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కనుమూరి బాపిరాజు తదితరులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సీమాంధ్ర ఎంపీలు వెల్‌లో నినాదాలు చేస్తున్న సమయంలో ఆ ప్రాంత కేంద్ర మంత్రులు పలువురు వారివారి స్థానాల్లో నిల్చొని రాష్ట్ర విభజనపై తమ నిరసన తెలిపారు. ఈ సమయంలోనే స్పీకర్ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసులు వచ్చినట్లు తెలిపారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ సభ్యులు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, టీడీపీ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు నోటీసులు ఇచ్చారని తెలిపారు. దీనిపై నిర్ణయం కోసం అవసరమైన ప్రక్రియ చేపట్టేందుకు సభ అదుపులో లేదని తెలుపుతూ.. సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని కోరారు. ఈ క్రమంలోనే పలువురు మంత్రులు తమ శాఖలకు చెందిన వార్షిక నివేదికలను సభ ముందుంచారు. రాష్ట్రానికి చెందిన జేడీ శీలం, బలరాం నాయక్‌లు వీరిలో ఉన్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ జేడీ(యూ) సభ్యులు పోస్టర్లు ప్రదర్శించారు. ముంబైలో డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ మెమోరియల్ ఏర్పాటుకు నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి స్థల సేకరణ చేపట్టేందుకు రూపొందించిన బిల్లును కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు సభలో ప్రవేశపెట్టారు. మరోవైపు సభలో గందరగోళం యథావిధిగా కొనసాగుతుండటంతో మధ్యాహ్నం 12.11 గంటల సమయంలో స్పీకర్ సభను మర్నాడికి వాయిదా వేశారు. రాజ్యసభ పలుమార్లు వారుుదా ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల ఢిల్లీలో మణిపురి బాలికపై జరిగిన అత్యాచార సంఘటనపై సభ్యుడు బీరేంద్రప్రసాద్ బైష్యా మాట్లాడటం ప్రారంభించారు. మరోవైపు పోడియం వద్ద సీమాంధ్ర ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, సీఎం రమేశ్, వై.ఎస్.చౌదరి తదితరులు ప్లకార్డులు పట్టుకుని సమైక్యాంధ్ర నినాదాలు ప్రారంభించారు. వీరితోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన సభ్యులు కూడా ఆందోళనకు దిగడంతో చైర్మన్ హమీద్ అన్సారీ రెండు నిమిషాల్లోనే సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 11.11 గంటలకు సభ ప్రారంభమైనా అదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమయ్యాక గందరగోళం కొనసాగుతుండగానే.. కేంద్ర మంత్రులు కిశోర్‌చంద్రదేవ్, జ్యోతిరాదిత్య సింథియా, మునియప్ప తదితరులు తమ శాఖలకు చెందిన వార్షిక నివేదికలను సభ ముందుంచారు. ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ హెచ్ఐవీ నిరోధం, నియంత్రణ బిల్లు-2014ను సభలో ప్రవేశపెట్టారు. 12.09 సమయంలో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైనప్పుడు కేంద్ర మంత్రి డాక్టర్ గిరిజావ్యాస్.. వీధుల్లోని చిన్నవ్యాపారుల రక్షణకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు డిప్యూటీ చైర్మన్ కురియన్ అనుమతించారు. ఇంత గొడవ జరుగుతుంటే బిల్లు ఎలా ప్రవేశపెడతారని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వులు (సవరణ) బిల్లునూ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. -
టి.బిల్లుపై అస్పష్టత, మీడియాతో మాట్లాడని కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మండిపడ్డారు. స్పీకర్ మీరా కుమార్ నేతృత్వంలో జరిగిన బీఏసీ సమావేశం అనంతంర మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆపార్టీకి చెందిన కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు, మరికొందరు సమర్ధిస్తున్నారు అని సుష్మా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద ప్రమాణాలను సుష్మా స్వరాజ్ ఎండగట్టారు. దాంతో లోకసభలో ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతునే ఉంది. అఖిలపక్ష భేటిలోనూ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే సూచనలను కనిపిస్తున్నాయి. సమావేశం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. -
నేడు ఫ్లోర్ లీడర్ల భేటీకి కేసీఆర్
-
నేడు ఫ్లోర్ లీడర్ల భేటీకి కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందేలా కార్యాచరణ మొదలుపెట్టిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంగళవారం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన జరగనున్న పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశానికి స్వయంగా హాజరుకావాలని నిర్ణయించారు. ఆయన ఈ భేటీలో పాల్గొంటుం డటం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారి! మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ హాల్లో జరిగే ఈ సమావేశానికి టీఆర్ఎస్లో చేరిన ఎంపీలు వివేక్, మంద జగన్నాథంలతో కలసి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. బిల్లును సభలో ప్రవేశపెట్టే తేదీలపై స్పీకర్ నుంచి ఆయన స్పష్టత కోరతారని తెలుస్తోంది. బిల్లును సమర్థిస్తున్న పలు పార్టీల మద్దతు కోరుతూనే, దీనిపై స్పష్టత ఇచ్చేలా స్పీకర్‌పై, కేంద్రంపై ఆయా పార్టీల ద్వారా ఒత్తిడి పెంచాలన్నది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న మొత్తం 39 బిల్లుల్లో తెలంగాణ బిల్లుకు రెండో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ దృష్ట్యా ఫిబ్రవరి పదో తేదీకి ముందే బిల్లును ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కోరతారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ వెనక్కెళ్తే వారికే నష్టం: అజిత్‌సింగ్ బిల్లుకు మద్దతు కోరుతూ అన్ని జాతీయ పార్టీల అధ్యక్షులను కలుస్తున్న కేసీఆర్ సోమవారం తన బృందంతో కలసి ఆర్ఎల్డీ అధ్యక్షుడు అజిత్‌సింగ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిలతో విడివిడిగా భేటీ అయ్యారు. బిల్లుకు సంపూర్ణ మద్దతు కోరారు. అందుకు వారి నుంచి పూర్తి సానుకూలత లభించింది. భేటీ అనంతరం కేసీఆర్‌తో కలసి అజిత్‌సింగ్ విలేకరులతో మాట్లాడారు. ఏడేళ్ల కిందటే వరంగల్‌లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి హోదాలో పాల్గొని తెలంగాణకు మద్దతు తెలిపానని గుర్తు చేశారు. ‘‘ఎన్నో క్లిష్ట పరిస్థితులను దాటుకుని పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు అనుకూల వాతావరణం ఉంది. మా నుంచీ సంపూర్ణ మద్దతుంటుంది. తెలంగాణకు మద్దతిస్తామన్న హామీ నుంచి బీజేపీ వెనక్కు వెళ్తే ఎన్నికల వేళ వారికినష్టమే’’ అన్నారు. తెలంగాణ బిల్లును బలపరుస్తున్నామని, దానికి తమ మద్దతుందని సురవరం చెప్పారు. ‘‘మెజార్టీ పార్టీలు మద్దతు తెలిపినందున బిల్లు సజావుగా ఆమోదం పొం దేలా చూడాలని మేం కేంద్రాన్ని కోరాం. కొందరు బిల్లును అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలను అడ్డుకునే బాధ్యతను కాంగ్రెస్, బీజేపీలే తీసుకోవాలి. బిల్లు అసెంబ్లీలో తిరస్కరణకు గురైందని చెబుతున్నా, ఆ తీర్మానానికి ఎలాంటి విలువా లేదు. ఆర్టికల్ 3 ప్రకారం మాత్రమే బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సీమాంధ్ర ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరిగేలా మా పార్టీ కృషి చేస్తుంది’’ అని తెలిపారు. బీజేపీ వెనక్కు పోతుందనుకోను: కేసీఆర్ తెలంగాణకు మద్దతుపై బీజేపీ వెనక్కు పోతుందని అనుకోనని కేసీఆర్ అన్నారు. ఈ మేరకు వస్తున్నవన్నీ మీడియా కథనాలేనని, మంచి కార్యం జరుగుతున్న తరుణంలో అడ్డంకులు సృష్టించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతాయని అన్నారు. ‘‘తెలంగాణకు మద్దతిస్తామని ఈ రోజు కమల్‌నాథ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ లోక్‌సభలో విపక్ష నేత, బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్ తెలిపారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు బ్రహ్మాండంగా ఆమోదం పొందుతుంది. దీనిపై కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. తెలంగాణకు మొదటి నుంచీ మద్దతుగా నిలిచినందుకు అజిత్‌సింగ్, సురవరంలకు ధన్యవాదాలు’’ అన్నారు. కేసీఆర్‌కు రాజ్‌నాథ్ ముఖంచాటు! తెలంగాణ అంశంపై ఒక్కో జాతీయ పార్టీ మద్దతు కూడగడుతున్న కేసీఆర్‌కు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అపాయింట్మెంట్ మాత్రం దక్కకపోవడం ఆ పార్టీతో పాటు ఢిల్లీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల క్రితమే రాజ్‌నాథ్‌ను కేసీఆర్ అపాయింట్మెంట్ కోరారు. సోమవారం మధ్యాహ్నం తరవాత ఏదొక సమయంలో ఇస్తామని కబురు పంపారు. కానీ సోమవారం రాజ్‌నాథ్ ఢిల్లీలోనే అందుబాటులో ఉండి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చినా కేసీఆర్‌కు మాత్రం తిరస్కరించారు. పైగా మంగళవారం కూడా రాజ్‌నాథ్ అందుబాటులో ఉండరంటూ ఆయన కార్యాలయం టీఆర్ఎస్ నేతలకు సమాచారమిచ్చింది. దీనిపై వారు ఒకింత అసహనంతో ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుపైనే వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విభజనకు అడ్డుగా నిలబడి, టీడీపీతో మైత్రికి ప్రయత్నిస్తున్న వెంకయ్యే పార్టీ అధ్యక్షుడిని తప్పుదారి పట్టిస్తున్నారని బహిరంగంగా విమర్శిస్తున్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా సోమవారం రాజ్‌నాథ్‌తో భేటీకి ప్రయత్నించి విఫలమయ్యారు. మంగళవారం వారి ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయో చూడాలి. -
సమాజంలో మార్పు రాలేదు:మీరా కుమార్
కోల్‌కతా: నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటినా సమాజంలో మార్పు రాలేదని, మహిళలపై అకత్యాలు కొనసాగుతూనే ఉన్నాయని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారమిక్కడ జరిగిన ఓ ఆధ్మాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో గ్యాంగ్‌రేప్ బలైన నిర్భయం చివరకంటూ మృత్యువుతో పోరాడి సింగపూర్ లో మరణించిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల తర్వాత సమాజంలో మంచి దిశగా ఏమైనా మార్పు కనిపించిందా అని విలేకరులు అడగ్గా.. ఈ తరహా ఘటనలపై ఇంకా మార్పు రాకపోవడం దురదృష్టకరంగా ఆమె పేర్కొన్నారు. -
లోక్‌సభ స్పీకర్‌పై బీజేపీ ‘అవిశ్వాసం’!
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో జేపీసీ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తీరుపై బీజేపీ మండిపడింది. దీనికి వ్యతిరేకంగా లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచనలో పడింది. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, నెల్సన్ మండేలా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు లోక్‌సభలో విపక్షనేత సుష్మా స్వరాజ్ దక్షిణాఫ్రికా వెళ్లినందున ఆమె తిరిగి ఇక్కడకు వచ్చాక ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాలని పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2జీ వ్యవహారంలో తాము సమర్పించిన అసమ్మతి నోట్‌ను జేపీసీ చైర్మన్ పీసీ చాకో తన నివేదికలో ఇష్టానుసారంగా కుదించడంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు స్పీకర్ అనుమతించని కారణంగా, ఆమెపై అసమ్మతి తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ భావిస్తోంది. చాకో తన నివేదికలో అసమ్మతి నోట్లోని పలు భాగాలను తొలగించడాన్ని రాజ్యసభలో బీజేపీ ఉపనేత రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా తప్పుపట్టారు. జేపీసీ నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన సమయంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు సైతం అనుమతించకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సైతం యూపీఏ సర్కారు, కాంగ్రెస్ పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదని రాజ్యసభలో విపక్షనేత అరుణ్ జైట్లీ దుయ్యబట్టారు. తొలుత అవినీతికి పాల్పడటం... తర్వాత దాన్ని కప్పిపుచ్చేందుకు రాజ్యాంగ సంస్థలను నీరుగార్చడం కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే, జేపీసీ నివేదిక వ్యవహారంపై స్పీకర్ కార్యాలయం వివరణ ఇచ్చింది. నివేదిక సభ ముందుకు రానిదే దానిపై చర్చకు అనుమతించలేమని, నివేదిక సభ ముందుకు వచ్చాక అది సభకు చెందినదవుతుందని పేర్కొంది. ఒక అంశంపై స్పీకర్ రూలింగ్ ఇచ్చాక అదే అంతిమమవుతుందని, దానిపై అభ్యంతరాలు లేవనెత్తేందుకు వీలుండదని స్పష్టం చేసింది. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించడం పార్లమెంటరీ సంప్రదాయం కాదని పేర్కొంది. కాగా, 2జీ కుంభకోణంలో దోషులను కాంగ్రెస్ సిగ్గులేకుండా జేపీసీ ద్వారా వెనకేసుకొస్తోందని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. చాకో ఈ అంశంలో జేపీసీ చైర్మన్‌గా కంటే ఎక్కువగా కాంగ్రెస్ ఏజెంటుగానే వ్యవహరించారని విమర్శించారు. స్పీకర్ నిర్ణయాన్ని బట్టి మా నిర్ణయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఎంపీలు యూపీఏపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి తాము మద్దతు ఇవ్వాలా వద్దా అన్నది ఆలోచిస్తామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ‘‘అవిశ్వాస తీర్మానాన్ని.. లోక్‌సభ స్పీకర్ ఆమోదించాల్సి ఉంది. దాన్ని సభలో ప్రవేశపెట్టాలంటే.. కొంత మంది సభ్యుల మద్దతు అవసరం’’ అని వ్యాఖ్యానించారు. స్పీకర్ గనక దాన్ని ఆమోదిస్తే.. అప్పుడు మద్దతు ఇవ్వాలా లేదా అన్నది నిర్ణయిస్తామని చెప్పారు. -
తొలిరోజు నివాళి
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మృతి చెందిన సభ్యులు, మాజీ సభ్యులకు సంతాపం తెలిపిన అనంతరం ఉభయ సభలు తొలిరోజు వాయిదా పడ్డాయి. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా నియోజకవర్గానికి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మురళీలాల్ సింగ్ (61) బుధవారం రాయ్‌పూర్‌లో మృతి చెందడంతో ఆయనకు లోక్‌సభ నివాళులర్పించింది. ఆయన గిరిజనుల కోసం అహరహం శ్రమించారని స్పీకర్ మీరా కుమార్ కొనియాడారు. మాజీ సభ్యులు గుర్వీందర్ కౌర్ బ్రార్, ఆర్పీ సారంగి, మోహన్‌సింగ్, రామ్ నరేశ్ కుష్వాహ, మోహన్ ధారియా, నితీశ్ సేన్‌గుప్తా, హెచ్‌పీ సింగ్‌ల మృతికి లోక్‌సభ సంతాపం తెలిపింది. అంతేగాక, కెన్యా రాజధాని నైరోబీలోని మాల్ జరిగిన కాల్పుల్లో మృతి చెందిన నలుగురు భారతీయులకు, రెండు నెలల క్రితం ముంబైలో భవంతి కూలిన సంఘటనలో 27 మంది మృతికి, పైలీన్, హెలెన్, ఫిలిప్పీన్స్‌లో విధ్వంసం సృష్టించిన హైయాన్ తుపానులు, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, ఒడిశా వరదల్లో మృతి చెందిన వారికి, మధ్యప్రదేశ్ రతన్‌గఢ్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 111 మందికి, ఔరంగాబాద్ పేలుళ్లలో తుదిశ్వాస విడిచిన ఏడుగురు పోలీసులకు లోక్‌సభ నివాళి అర్పించింది. వీరందరికి రాజ్యసభ సభ్యులు కూడా సంతాపం తెలిపారు. అంతేగాక గాయకుడు మన్నా డే మృతికి, ఆంధ్రప్రదేశ్ వోల్వో బస్సు దుర్ఘటనలో చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. -
మేడం.. నా రాజీనామాను ఆమోదించండి: లగడపాటి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఎంపీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదింపజేసుకోవడం తన హక్కు అని విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. తన రాజీనామాను ఆమోదింపజేసుకునేందుకు ఆయన స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. స్పీకర్ మీరాకుమార్ లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధిగా తనకు రాజీనామా చేసే హక్కుందని, వెంటనే ఆమోదించాలన్నారు. రాజీనామా ఆమోదం కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాల ఎంపీలు రాజీ నామాలు చేస్తే వెంటనే ఆమోదించారని గుర్తు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. మీరాకుమార్.. లగడపాటి రాజీనామాను ఆమోదిస్తారా లేక మరోసారి ఈ విషయంపై చర్చించే అవకాశముందా అన్నది కచ్చితంగా తెలియరాలేదు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్రానికి చెందిన ఇతర ఎంపీలు రాజీనామాలు చేసినా వీటిపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ లగడపాటి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, తెలంగాణ అంశంపై తలెత్తుతున్న పరిణామాల వల్ల మరింతమంది ఎంపీలు రాజీనామాలు చేసే అవకాశముందని, దీనివల్ల ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని ఎన్సీపీ అధినేత, కేంద్రమంత్రి శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. -
జగన్ రాజీనామాను, నాది ఆమోదించాలని కోరా: మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యత్వానికి తాము చేసిన రాజీనామాల్ని ఆమోదించాలని స్పీకర్ మీరాకుమార్ను కోరినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. రాజీనామాల్ని ఆమోదించుకోవడానికి శనివారం స్పీకర్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను గత నెల 5న, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అదే నెల 10న రాజీనామాలను ఫ్యాక్స ద్వారా పంపించాం. 24న స్పీకర్‌ను కలవాలనుకున్నా కుదరలేదు. ఇవాళ కలిశాం. మా ఇద్దరి రాజీనామాల్ని ఆమోదించాలని స్పీకర్‌ను కోరా. జగన్ హైదరాబాద్ నుంచి రావడం కష్టం కనుక, ఆయన ఫోన్ నంబర్ ఇచ్చా. ఫోన్‌ద్వారా వ్యక్తిగతంగా మాట్లాడి రాజీనామా విషయాన్ని ధ్రువీ కరించుకోమని చెప్పా. నేను చెప్పిన విషయాలను వాళ్లు రికార్డు చేసుకున్నారు. తప్పనిసరిగా మా రాజీనామాలను ఆమోదిస్తారని ఆశిస్తున్నాం’’ అని చెప్పారు. దుర్మార్గంగా మాట్లాడుతున్న టీడీపీ నేతలు: ‘‘సోనియాకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపినట్టు, నేను, విజయమ్మ వెళ్లి రాహుల్‌ను కలిసినట్టు కొందరు టీడీపీ నేతలు దుర్మార్గమైన, అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నారు’’ అని మేకపాటి మండిపడ్డారు. ‘‘నేను గురువారంరాత్రి ఢిల్లీకి వచ్చా. విజయమ్మ శుక్రవారం ఉదయం వచ్చా రు. ఇక్కడినుంచి నేరుగా జంతర్‌మంతర్‌లోని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్నాం. మధ్యాహ్నం 3 గంటల తరువాత విజయమ్మ హైదరాబాద్ వెళ్లిపోయారు. రాహుల్‌ను కలిసిందేమిటి? సోనియాకు కృతజ్ఞతలు చెప్పిందేమిటి? అన్నీ తప్పుడు ఆరోపణలే’’ అని మేకపాటి.. టీడీపీ నేతల తీరును దుయ్యబట్టారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన టీడీపీకి ప్రజల్లో విశ్వసనీయత లేదన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. నేను ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశా: ఎస్పీవై రెడ్డి రాష్ట్ర విభజన నిర్ణయంతో ప్రజలు తమపై కోపంతో ఉన్నారని, తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌కు విన్నవించినట్టు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డి చెప్పారు. స్పీకర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం ఆగస్టు 2న రాజీనామా చేశానని, మళ్లీ స్పీకర్‌ను కలిసి రాజీనామాను ఆమోదించాలని కోరానని చెప్పారు. ‘‘ప్రజలు మాపై కోపంతో ఉన్నారు. చేతులు జోడించి రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను కోరాం. ఆమె ఏం మాట్లాడలేదు. విన్నారు. ఇద్దరు అధికారులు విషయాలను రికార్డు చేసుకున్నారు. మా రాజీనామాను ఆమోదిస్తారని విశ్వసిస్తున్నా. ఆమోదించినా, ఆమోదించకపోయినా నా వరకు నేను ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేశాను. వైఎస్సార్ సీపీలో చేరాను’’అని చెప్పారు. -
లోక్‌సభను స్తంభింపజేసిన సమైక్యగళం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కు తీసుకోవాల్సిందేనంటూ కోస్తా, రాయలసీమకు చెందిన ఎంపీలు మరోసారి లోక్‌సభను స్తంభింపజేశారు. అయిదు రోజుల సస్పెన్షన్ ముగియడంతో శుక్రవారం తిరిగి లోక్‌సభకు హాజరైన ఎంపీలు రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలనే ఆందోళనను కొనసాగించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎంపీలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా మధ్యంలోకి దూసుకొచ్చి సభా కార్యక్రమాలకు అడ్డు తగలడంతో లోక్‌సభను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. స్పీకర్ మీరాకుమార్ ఉదయం 11 గంటలకు ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టగానే టీడీపీకి చెందిన సభ్యులు కొనకళ్ల నారాయణరావు, నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి పోడియం వద్దకు చేరుకొచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు మాత్రం సభామధ్యం అంచుల వద్ద నిలబడి నినాదాలు చేశారు. వీరికితోడు తమిళ జాలర్లపై శ్రీలంక సైన్యం దాడులను నిరసిస్తూ అన్నా డీఎంకే సభ్యులు కూడా వెల్‌లోకి రావడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పడు కూడా టీడీపీతోపాటు కాంగ్రెస్ సభ్యులు కూడా వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. బీహార్, యూపీ వరదలపై ఆర్జేడీ సభ్యులు పోడియం వద్దకు రావడంతో మరోసారి సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ మొదలైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మూడు గంటల వరకూ వాయిదా వేసి సీమాంధ్ర ఎంపీలనందరినీ మరోసారి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం లోక్‌సభ సచివాలయ అధికారులు సభ ను అడ్డుకుంటున్న సభ్యుల జాబితాను సిద్ధం చేశారు. అయితే, 3 గంటలకు సభ సమావేశమైన తర్వాత చివరి నిమిషంలో ప్రభుత్వం మనసు మార్చుకుని సస్పెన్షన్లను సోమవారానికి వాయిదా వేయాలని సూచించింది. దీంతో సభను వచ్చే సోమవారానికి వాయిదావేశారు. రాజ్యసభలో కూడా టీడీపీకి చెందిన సభ్యులు వై.ఎస్.చౌదరి, సి.ఎం.రమేష్‌లు సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు ముద్రించి ఉన్న చొక్కాలు ధరించి సభామధ్యంలో కొంతసేపు ప్లకార్డులను ప్రదర్శించారు. మధ్యాహ్నం వారు ఆందోళన విరమించడంతో సభ సజావుగా సాగింది. -
‘విభజన’లో కొత్త డ్రామా
సంపాదకీయం: రాష్ట్ర విభజన నిర్ణయంపై పార్లమెంటు వేదికగా కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు సాగిస్తున్న డ్రామాలో కొత్త అంకానికి తెరలేచింది. ఇరు పార్టీలకూ చెందిన 12మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ శుక్రవారం లోక్‌సభలో స్పీకర్ మీరా కుమార్ నిర్ణయం తీసుకున్నారు. నిత్యమూ నినాదాలతో, ప్లకార్డుల ప్రదర్శనతో వీరంతా సమావేశాలకు అంతరాయం కలిగిస్తున్నారు. సభ మధ్యలోకి దూసుకెళ్లడంతో ఆగక స్పీకర్ మైక్‌ను విరగ్గొట్టే ప్రయత్నమూ జరిగింది. ఇవన్నీ చానెళ్లలో గమనిస్తున్న వారికి ఈ ఎంపీలను సస్పెండ్ చేయడం వింతేమీ అనిపించలేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచీ సభా కార్యకలాపాలు నడుస్తున్న తీరు ప్రజల్ని విస్మయపరుస్తోంది. ఉభయసభలూ ఆద్యంతమూ గందరగోళంతోనే సాగుతున్నాయి. టీవీలు వీక్షిస్తున్న పౌరులే అసహనానికి గురై చానెళ్లను మార్చేయవలసిన అవసరం ఏర్పడుతున్నదంటే సభాధ్యక్ష స్థానంలో ఉండేవారి పరిస్థితేమిటో ఊహించుకోవచ్చు. వేరే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తమకు అవకాశమివ్వాలని మరో విపక్షం బతిమాలితే సీమాంధ్ర ఎంపీలంతా కాస్సేపు మౌనంగా ఉండటానికి అంగీకరించారు. ఏతా వాతా పార్లమెంటులో గందరగోళానికి మాత్రం తెరపడలేదు. అది విసుగొచ్చే సీరియల్లా అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ఒకపక్క అర్జెంట్‌గా ఆహారభద్రతా బిల్లు, భూసేకరణ బిల్లు ఆమోదింపజేసుకుందామని తహతహ లాడుతూ, అందుకోసమని పార్లమెంటు సమావేశాలను కూడా పొడిగించిన యూపీఏ పెద్దలు చివరకు ఈ సస్పెన్షన్ రూటు ఎంచుకున్నారన్నది సుస్పష్టమే. విభజన నిర్ణయం తర్వాత సీమాంధ్రలో పెద్దయెత్తున ప్రజా ఉద్యమం పెల్లుబికింది. వివిధ వర్గాల ప్రజలంతా రోడ్లమీదికొచ్చారు. విద్యాసంస్థలు మూత బడ్డాయి. బస్సులు ఆగిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు పని చేయడంలేదు. తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో పలువురు మరణించారు. ఎన్నాళ్ల నుంచో నలుగుతున్న తెలంగాణ సమస్యకు విభజనే పరిష్కారమని విశ్వసించే వారు సైతం తప్పుబట్టేలా ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించింది. ఎవరినైనా సంప్రదిస్తే, తన ప్రతిపాదనేమిటో బహిరంగపరిస్తే తనకు రావల్సిన కీర్తి దక్కదేమోనన్న భయంతో అది గోప్యత పాటించింది. పుష్కర కాలంగా తెలంగాణ ఉద్యమానికి సారథ్యంవహిస్తున్న కేసీఆర్‌ని సంప్రదించలేదు. తమకు ఇష్టమైన ఇతరులను పిలిపించుకుని మాట్లాడుతూనే, నిర్ణయం ప్రకటించాక టీఆర్ఎస్ నుంచి తనవైపు రాగలవారెవరన్న జాబితా తయారు చేసుకుంటూనే పైకి గుంభనంగా ఉండిపోయింది. అయితే, జాతీయ మీడియాకు మాత్రం లీకులిచ్చింది. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులకు అధిష్టానం అంతరంగం, అది వేయబోతున్న అడుగుల సంగతి ముందుగా తెలుసో, లేదో ఎవరికీ తెలియదు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో... తమకు ముందే చెప్పారంటే ఏమవుతుందో, చెప్పలేదంటే ఏమవుతుందో తెలియక సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా గందరగోళపడుతున్నారు. ‘కేవలం పక్షం రోజులముందు మాత్రమే తమకు తెలిసింద’ని ఒక ఎంపీ బయటపడేసరికి మిగిలినవారంతా ఆయన నోరు నొక్కారు. అటు టీడీపీ పరిస్థితీ ఇంతకన్నా మెరుగ్గా లేదు. విభజన సంగతి బాబుకు ముందే తెలిసిందని, దానిపై ఆయన కాంగ్రెస్ అధినాయకత్వానికి ఫోన్లుచేసి మాట్లాడారని ఒక జాతీయ పత్రిక బయటపెట్టింది. అటు తర్వాత నే ఆయన విలేకరుల సమావేశం పెట్టి విభజన జరిగిపోయిందని, ఇప్పుడు కొత్త రాజధాని ఏర్పాటుకు నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు అడుగుదామని సీమాంధ్రులకు హితవు పలికారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల ఎంపీలూ ముందుగా నిలదీయాల్సింది తమ తమ పార్టీ అధినేతలను కాగా, పార్లమెంటుకొచ్చి రచ్చచేయడమేమిటని సహజంగానే ప్రజలంతా అనుకున్నారు. ప్రజాస్వామ్యవ్యవస్థలో పార్లమెంటు అత్యున్నత ప్రజా వేదిక. ఈ వేదికపై ప్రజా సమస్యలనూ, ప్రజలను ఆందోళన పరుస్తున్న ఇతర అంశాలనూ ప్రస్తావించడంలో... వారి అభిమతాన్ని వెల్లడించడంలో తప్పేమీ లేదు. కానీ, అంతకన్నా ముందు ఆ పని పార్టీ వేదికల్లో జరగాలి. ఫలానా సమస్యలు పరిష్కరించకుండా నిర్ణయం తీసుకుంటే పరిస్థితులు వికటిస్తాయని తమ అధినాయకురాలికి కాంగ్రెస్ నేతలు చెప్పి ఉండాలి. కనీసం విభజనకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించే సమయంలోనే కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి తాము సమకూర్చబోతున్నవేమిటో స్పష్టం చేయించాలి. ఉద్యోగాలు, నీళ్లు, నిధుల పంపకం వగైరా అంశాల్లో తమ ప్రతిపాదనలేమిటో ప్రజలముందు పెట్టించాలి. ఇటు టీడీపీ ఎంపీలూ అదే తరహాలో వ్యవహరించి ఉండాల్సింది. కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన మాట్లాడినదేమిటో, వారు ఆయనకు చెప్పిందేమిటో తెలుసుకుని ఉండాల్సింది. తమ అధినేతల నిర్ణయంతో ఏకీభవించకపోతే ఆ రెండు పార్టీల ఎంపీలూ బాహాటంగా ఆ సంగతిని ప్రకటించి పదవులను వీడాల్సింది. ఆ మార్గాన్ని వదిలి వీరు పార్లమెంటులో గొడవచేశారు సరే... కనీసం ఆ పార్టీల సభా నాయకులైనా తమ సభ్యుల్ని నియంత్రించడానికి ప్రయత్నించలేదు. తమ పార్టీకి చెందినవారు అలా నిరవధికంగా గొడవ చేస్తుంటే అది తమ చేతగానితనానికి, వైఫల్యానికి నిదర్శనమని గుర్తించలేదు. అసలు రాజీనామాలిచ్చి సభకు ఎందుకొచ్చారని అడగాల్సి ఉండగా ఆ పనీ చేయలేదు. మొత్తానికి వీరంతా పార్లమెంటును తమ రాజకీయ విన్యాసాలకు వేదికగా చేసుకున్నారు. సస్పెండైతే ప్రజల్లో వీరోచిత కార్యంగా ప్రచారమై తమ పార్టీలకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేసుకున్నారు. సారాంశంలో పార్లమెంటు విలువైన సమయాన్ని వృథా చేశారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ప్రవర్తించాల్సింది ఇలాగేనా? ఆ రెండు పార్టీలూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. -
దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశ 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్సింగ్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక భారత నిర్మాణం కోసం ప్రజలంతా పనిచేయాలని అన్సారీ తన సందేశంలో సూచించగా పాకిస్థాన్‌తో శాంతి, స్నేహం, సహకారం కొనసాగాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.