టి.బిల్లుపై అస్పష్టత, మీడియాతో మాట్లాడని కేసీఆర్
టి.బిల్లుపై అస్పష్టత, మీడియాతో మాట్లాడని కేసీఆర్
Published Tue, Feb 4 2014 2:24 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
కాంగ్రెస్ పార్టీ తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మండిపడ్డారు. స్పీకర్ మీరా కుమార్ నేతృత్వంలో జరిగిన బీఏసీ సమావేశం అనంతంర మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆపార్టీకి చెందిన కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు, మరికొందరు సమర్ధిస్తున్నారు అని సుష్మా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ద్వంద ప్రమాణాలను సుష్మా స్వరాజ్ ఎండగట్టారు. దాంతో లోకసభలో ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతునే ఉంది. అఖిలపక్ష భేటిలోనూ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే సూచనలను కనిపిస్తున్నాయి. సమావేశం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
Advertisement
Advertisement