bac meeting
-
బీఏసీకి హరీశ్ రాకపై అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ నిర్వహణ తేదీలు, ఎజెండా ఖరారు కోసం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో మంత్రులు, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య స్వల్ప వాగ్విదం జరిగింది. బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత కేసీఆర్‌కు బదులు హరీశ్‌రావు బీఏసీ భేటీకి హాజరు కావడంపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ చాంబర్లో బీఏసీ తొలి సమావేశం ప్రారంభమైంది. అధికార పార్టీ తరఫున శ్రీధర్‌బాబు, పొన్నంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రతిపక్ష బీఆర్ఎస్ తరఫున హరీశ్‌రావు, కడియం శ్రీహరి హాజరయ్యారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున తనకు బదులుగా హరీశ్‌రావు బీఏసీ సమావేశంలో పాల్గొంటారంటూ మాజీ సీఎం కేసీఆర్ బుధవారం స్పీకర్‌కు సమాచారం ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అయితే శ్రీధర్‌బాబు, పొన్నం అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం జరిగింది. కేసీఆర్‌కు బదులుగా తాను హాజరయ్యేందుకు స్పీకర్ అంగీకరించారని హరీశ్ చెప్పారు. అయితే ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కాబట్టి హరీశ్‌రావు హాజరయ్యేందుకు వీలు లేదని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అలా హాజరయ్యేందుకు వీలు లేదు: శ్రీధర్‌బాబు తాము ఎవరిని బీఏసీ సమావేశం నుంచి బయటకు వెళ్ళమని చెప్పలేదని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్ నిర్ణయం మేరకు బీఏసీ సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ నుంచి ఇద్దరు సభ్యులకు అవకాశం కలి్పంచారని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ తరఫున మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి పేర్లు ఇచ్చారని తెలిపారు. కానీ బీఏసీ భేటీకి కేసీఆర్ రావడం లేదు కాబట్టి తాను వస్తానని హరీశ్‌రావు తెలిపారని, అయితే ఒక సభ్యుడు సమావేశానికి రావడం లేదని చెప్పి అతడి స్థానంలో మరో సభ్యుడికి అనుమతినివ్వడం కుదరదని పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి లేఖ కూడా ఇవ్వలేదని తెలిపారు. కాగా అసెంబ్లీని ఎన్నిరోజులైనా నిర్వహించేందుకు తా ము సిద్ధమని శ్రీధర్‌బాబు చెప్పారు. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. గతంలో అనేకసార్లు మేం అనుమతించాం: హరీశ్ గతంలో తాము బీఏసీ జాబితాలో లేని వారిని కూడా పార్టీ శాసనసభా పక్ష నేత వినతి మేరకు అనుమతించిన విషయాన్ని హరీశ్ గుర్తు చేశా రు. ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ బదు లుగా ఎమ్మెల్యే బలాలను పలు సందర్భాల్లో అనుమతించామని, అవసరమైతే బీఏసీ మిని ట్స్‌ను పరిశీలించాలని అన్నారు. తాము అలా అనుమతించలేదని నిరూపిస్తే రాజీనామా చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్తానని హరీశ్ స్పష్టం చేశారు. దీంతో మినిట్స్ పరిశీలించేందు కు సమయం పడుతుందని, అభ్యంతరం వ్యక్తమైన నేపథ్యంలో సర్దుకుపోవాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్ కోరారు. దీంతో మీ విచక్షణకే వదిలివేస్తున్నానంటూ హరీశ్‌రావు బీఏసీ భేటీ నుంచి బయటకు వచ్చారు. దీంతో కడియం ఒక్కరే బీఆర్ఎస్ తరఫున బీఏసీ భేటీలో పాల్గొన్నారు. -
Ts: బీఏసీ మీటింగ్ వివాదం.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజు గురువారం మాజీ మంత్రి హరీశ్‌రావుకు అసెంబ్లీలో వింత అనుభవం ఎదురైంది. బీఏసీ సమావేశానికి హాజరయ్యే విషయంలో ఏర్పడిన గందరగోళంపై హరీశ్‌రావు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘గతంలో లేని సంప్రదాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తోంది. జాబితాలో పేర్లు ఉన్న వారు మాత్రమే బీఏసీ సమావేశానికి రావాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అంటున్నారు. కడియం శ్రీహరితో పాటు హరీశ్‌రావు బీఏసీకి వస్తారని నిన్ననే స్పీకర్‌కు బీఆర్ఎస్ఎల్పీ లీడర్ కేసిఆర్ తెలియజేశారు. స్పీకర్ రమ్మన్నారు కాబట్టే వెళ్ళాను. ఒక్క ఎమ్మెల్యే ఉన్న సీపీఐని బీఏసీ సమావేశానికి పిలిచారు’ అని హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. అంతకుముందు బీఏసీ సమావేశానికి వెళ్లిన హరీశ్‌రావు సమావేశం మధ్యలో నుంచే బయటికి వచ్చేశారు. జాబితాలో పేరున్న కేసీఆర్‌కు బదులుగా పేరున్న హరీశ్‌రావు బీఏసీకి వెళ్లారు. హరీశ్‌రావు బీఏసీ సమావేశానికి రావడంపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం తెలపడంతో హరీశ్‌రావు మధ్యలోనే బయటికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. తాము ఎవరినీ వ్యక్తిగతంగా బీఏసీ నుంచి బయటికి వెళ్లమని కోరలేదన్నారు. స్పీకర్ నిర్ణయం మేరకే బీఏసీ నడిచిందని, పార్టీల నుంచి ముందుగా ప్రతిపాదించిన సభ్యులే బీఏసీకి రావాలని స్పీకర్ కోరారని చెప్పారు. జాబితాలో పేరున్న కేసీఆర్‌కు బదులుగా హరీశ్‌రావు వస్తారని బీఆర్ఎస్ తెలిపిందన్నారు. గవర్నర్ ప్రసంగంలో గ్యారెంటీల జాడ లేదు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంపై అసెంబ్లీ మీడియా పాయింట్లో హరీశ్‌రావు స్పందించారు. ఒక విజన్‌లా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచిందన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా లేదని విమర్శించారు. ‘కొత్త ఆసరా పెన్షన్లు, మహిళలకు నెలకు రూ. 2500 ఎప్పుడిస్తారో తెలియని ప్రసంగం నిరాశపరిచింది. రైతులకు బోనస్, రైతు బంధు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేనేలేదు. ప్రజావాణి కార్యక్రమం తుస్సుమంది. మంత్రులు, ఐఏఎస్‌లు తీసుకోవాల్సిన అప్లికేషన్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పినట్టు 2 గ్యారెంటీలు అమలవ్వడం లేదు. త్వరలో ఎన్నికల కోడ్ అమలవనుంది. అప్పుడు ఈ కొత్త హామీలు ఎలా అమలు చేస్తారు’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇదీచదవండి.. ప్లీజ్ కేటీఆర్..కాంట్రవర్సీ వద్దు -
ఏపీ: ముగిసిన బీఏసీ సమావేశం
-
అసెంబ్లీ బీఏసీ మీటింగ్ లో కీలక నిర్ణయాలు..
-
Telangana: అసెంబ్లీ 3 రోజులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగి ఆదివారం ముగియనున్నాయి. శాసనసభ, శాసనమండలి బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజులకు సంబంధించిన ఎజెండాను కూడా ఖరారు చేశారు. దీని ప్రకారం.. 10 ప్రభుత్వ బిల్లులపై చర్చించి ఆమో దించడంతో పాటు 3 అంశాలకు సంబంధించి స్వల్పకాలిక చర్చ కూడా జరుగుతుంది. శని, ఆది వారాల్లో ప్రభుత్వ బిల్లులపై చర్చించి ఆమోదించిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడనుంది. సాయన్న మృతికి సంతాపం.. వాయిదా శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11.30కు ప్రారంభమయ్యాయి. దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం ప్రకటించిన తర్వాత సభ వాయిదా పడింది. అనంతరం స్పీకర్ పోచారం అధ్యక్షతన ఆయన చాంబర్లో బీఏసీ భేటీ జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మా రావుతో పాటు మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ పాల్గొన్నారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. సభ్యులు కోరినన్ని రోజులు సభ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భట్టి, వరదలపై స్వల్పకాలిక చర్చ జరపాలని అక్బరుద్దీన్ ప్రతిపాదించారు. చివరకు మూడురోజుల పాటు సభ నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. వరదలు, విద్య, వైద్యంపై స్వల్పకాలిక చర్చ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో తొలుత ప్రశ్నోత్తరాలను చేపడతారు. అనంతరం రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలు, విద్య, వైద్య రంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు– ఫలితాలు అనే అంశాలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. వివిధ అంశాలపై మొత్తం 10 బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శనివారం కూడా ఏదేని ఒక అంశంపై స్వల్పకాలిక చర్చతో పాటు బిల్లులపై చర్చ జరుగుతుంది. ఇక శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ భేటీలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, చీఫ్ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎంఐఎం సభ్యులు అఫెందీ, మీర్జా రహమత్ బేగ్ పాల్గొన్నారు. శాసనసభలో ప్రవేశ పెట్టే బిల్లులకు అనుగుణంగా ఎజెండాను రూపొందించారు. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు ఇలా.. ప్రశ్నోత్తరాల్లో భాగంగా శుక్రవారం శాసనసభలో ఐటీ ఎగుమతులు, రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, చార్మినార్ పాదచారుల రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు, ఆరోగ్య లక్ష్మి పథకం, జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్‌ఆర్‌డీపీపై మంత్రులు సమాధానాలు ఇస్తారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, బీసీ కులవృత్తులకు ఆర్థిక సాయం, గొర్రెల సంఖ్య పెరుగుదల, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు, జాతీయ విద్యా సంస్థల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లింపు అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. శాసనమండలిలో హరితహారం, కొత్త మెడికల్ కాలేజీల మంజూరు, పంటల బీమా పథకం, పల్లె ప్రగతి, ఆసరా పింఛన్లు, హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ కోతలపై ప్రశ్నలు ఉంటాయి. వ్యవసాయ రంగం అభివృద్ధి, గురుకులాలకు భవనాలు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, బీరప్ప ఆలయాలకు సాయం అంశాలపై కూడా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. -
24 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 16న బడ్జెట్.. బీఏసీలో నిర్ణయం
సాక్షి, అమరావతి: స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. 9 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం చీఫ్ విప్ ప్రసాదరాజు మీడియాతో మాట్లాడుతూ, రేపు(బుధవారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపారు. బడ్జెట్ సెషన్ కావడంతో శని, ఆదివారాల్లోనూ(18,19) సమావేశాలు కొనసాగుతాయన్నారు. 21, 22 అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించామన్నారు. సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. ప్రతిపక్ష నేతను కూడా సభకు ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై చర్చకు సిద్ధమని ప్రసాదరాజు అన్నారు. కాగా, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్ అన్నారు. తొలిసారి ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామని గవర్నర్ అన్నారు. చదవండి: ఏపీలో నాలుగేళ్లుగా సుపరిపాలన: గవర్నర్ అబ్దుల్ నజీర్ -
అడ్డుకోవడమే విపక్షం అజెండా
సాక్షి, అమరావతి: సమావేశాలు ప్రారంభం అయిన తొలి నిమిషం నుంచే శాసనసభ కార్యకలాపాలను స్తంభింపజేసేలా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారు. వాయిదా తీర్మానాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తూ, సభ సంప్రదాయాలకు విరుద్ధంగా ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే.. నిరుద్యోగ సమస్యపై వాయిదా తీర్మానాన్ని అనుమతించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. బీఏసీ సమావేశం నిర్వహించకుండానే వాయిదా తీర్మానానికి ఎలా డిమాండ్ చేస్తారని స్పీకర్ వారిని ప్రశ్నించారు. ఏయే అంశాలపై చర్చించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తామని, వాటిలో టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్న అంశం లేకపోతే వాయిదా తీర్మానాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. స్పీకర్ ఎంత చెబుతున్నా వినకుండా టీడీపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానానికే పట్టుబట్టారు. నినాదాలు చేసుకుంటూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. పోడియం బల్లను చరుస్తూ నినాదాలు చేశారు. మంత్రులు సమాధానం ఇస్తుండగానే పదేపదే అంతరాయం కలిగించారు. ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణబాబు, అశోక్ తదితరులు స్పీకర్ పోడియం మీదకు వెళ్లి స్పీకర్ చైర్ వద్ద నిలబడి ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల తీరు పట్ల స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెళ్లి తమ స్థానాల్లో కూర్చోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో స్పీకర్ 10 నిమిషాలు సభను వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి సమావేశమయ్యాక కూడా వారు వాయిదా తీర్మానానికే పట్టుబట్టి, స్పీకర్ చైర్ వైపు దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్.. మార్షల్స్‌ను పిలిపించి వారు తన వద్దకు రాకుండా అడ్డుగా ఉంచారు. టీడీపీ సభ్యుల నినాదాలు, గందరగోళ పరిస్థితుల మధ్యే మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేల మృతికి స్పీకర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సంతాపం తెలిపిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యేల వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తూ సభను వాయిదా వేశారు. టీడీపీ నాయకులు నిరుద్యోగ సమస్యపై వాయిదా తీర్మానానికి డిమాండ్ చేయడం పట్ల అధికార పక్షం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సభలో మాటల యుద్ధం నడిచింది. లక్షలాది ఉద్యోగాల ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దే నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ అన్నారు. కరోనా కష్ట పరిస్థితుల్లోనూ 2.60 లక్షల మందికి వలంటీర్లు, 1.35 లక్షల మందికి సచివాలయాల ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉద్దేశ పూర్వకంగానే సభ కార్యకలాపాలను స్తంభింపజేయాలని వ్యవహరిస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వాళ్లే ప్రశ్నలు అడిగి.. ఆ ప్రశ్నలకు తాము సమాధానాలిచ్చే సమయంలోనే ఆందోళనకు దిగడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టండని డిమాండ్ చేసి.. ఇప్పుడు అడుగడుగునా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని శాసనసభ వ్యవహారాల కో–ఆర్డినేటర్ శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. నిరుద్యోగుల గురించి టీడీపీ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు విమర్శించారు. టీడీపీ సభ్యుల రచ్చ శాసన సభ సమావేశాల తొలి రోజే ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు రచ్చకు దిగారు. స్పీకర్ పోడియం వద్ద ఘర్షణ వాతావరణం సృష్టించారు. మార్షల్స్‌తో దురుసుగా ప్రవర్తించారు. స్పీకర్ ఎంతగా సర్దిచెప్పినా వినకపోవడంతో చివరకు వారిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేశారు. గురువారం శాసన సభలో వికేంద్రీకరణపై స్వల్ప కాలిక చర్చ చేపట్టిన సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డు తగిలారు. సభకు విఘాతం కలిగించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వికేంద్రీకరణపై మాట్లాడుతుండగా.. ఆరి్థక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మైక్ తీసుకుని ప్రతిపక్ష నాయకులు అవాస్తవాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అమరావతిలో భూములు కొన్న టీడీపీ నాయకుల జాబితా చదివి వినిపించారు. ఇందులో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేరు ఉండటంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. సమయాన్నిబట్టి అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పడంతో పయ్యావుల సీట్లో కూర్చున్నారు. రామానాయుడు ప్రసంగం అనంతరం మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతుండగా మరోసారి పయ్యావుల కేశవ్ వెల్‌లోకి వెళ్లారు. ఆయన వెంట ఇతర టీడీపీ సభ్యులు కూడా వెళ్లి పోడియం వద్ద గందరగోళం సృష్టించారు. చైర్ మాటకు విలువలేదంటూ స్పీకర్‌నుద్దేశించి పయ్యావుల వ్యాఖ్యానించగా... చైర్‌కు టీడీపీ సభ్యులు ఎంత విలువ ఇస్తున్నారో పద్ధతిని చూస్తే తెలుస్తుందని స్పీకర్ బదులిచ్చారు. కన్నబాబు ప్రసంగానికి ఆదిలోనే పదేపదే బ్రేక్ పడింది. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో కేశవ్‌కు మైక్ ఇవ్వడంతో రాజధాని ప్రకటన తర్వాతే తన కుటుంబ సభ్యులు భూములు కొన్నారని, దీనిపై ఎటువంటి విచారణకైనా సిద్ధమేనంటూ పయ్యావుల సవాల్ చేశారు. దీంతో ఆరి్థక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధారాలతో సహా ఎప్పుడెప్పుడు టీడీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో భూములు కొన్నారో వివరిస్తుండగా.. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్తాయనే భయంతో టీడీపీ సభ్యులందరూ మరోసారి స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సభను అడ్డుకొన్నారు. సీట్లలో కూర్చోవాలని వారిని స్పీకర్ కోరినా వినిపించుకోలేదు. సీట్లలో కూర్చోకుంటే.. తీసుకెళ్లి కూర్చోబెడతాం అంటూ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్షల్స్‌ను సభలోకి పిలిచారు. పోడియం వద్ద టీడీపీ సభ్యులకు మార్షల్స్ అడ్డుగా నిల్చున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు విధి నిర్వహణలో ఉన్న మార్షల్స్‌ను పదేపదే తోసేస్తూ దురుసుగా ప్రవర్తించారు. మరో ఎమ్మెల్యే రామానాయుడు మార్షల్స్‌ను ఉద్దేశించి ఇదేమీ లోటస్‌పాండ్, వైఎస్సార్సీపీ కార్యాలయం.. కాదంటూ వాగ్వాదానికి దిగారు. చీఫ్ మార్షల్‌తో నువ్వేమన్నా స్పీకర్వా.. మమ్మల్ని ముట్టుకోవద్దు... అంటూ గొడవకు దిగారు. ఇలా పోడియం వద్ద ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. అక్కడే నినాదాలు చేస్తూ సెల్ఫోన్లో ఫొటోలు తీసుకుని.. వాటిని షేర్ చేసుకున్నారు. ఎంతకీ పరిస్థితి దారికి రాకపోవడంతో ఆరి్థక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌కు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ్యుల ఆమోదంతో స్పీకర్ ఆ తీర్మానాన్ని పాస్ చేశారు. టీడీపీ సభ్యులు అశోక్ బెందాళం, అచ్చెన్నాయుడు, చినరాజప్ప, ఆదిరెడ్డి భవాని, బుచ్చయ్య చౌదరి, వెంకటరెడ్డినాయుడు, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మెహన్, రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, రామరాజు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌ను ఒక్క రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మండలిలోనూ అదే గొడవ శాసనమండలిలో టీడీపీ సభ్యులు సభాసంప్రదాయాలకు విరుద్ధంగా చైర్మన్ పోడియంను చుట్టుముట్టి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. జాబ్ క్యాలెండర్– రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యపై తెలుగుదేశం సభ్యులు ఇచి్చన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలుపెట్టగానే వారు అడ్డుతగిలారు. తొలుత వారిస్థానాల్లో నిలబడి ప్లకార్డులు, నినాదాలతో నిరసన తెలిపిన సభ్యులు తర్వాత పోడియం ముందుకు వచ్చారు. కొందరు చైర్మన్ మోషేన్ రాజు సీటు వద్దకు వెళ్లి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, సీనియర్ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలుగుదేశం సభ్యుల తీరును తప్పుబట్టారు. చంద్రబాబు డైరెక్షన్లో సభ్యులు గలాటా చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం సభ్యులపై చర్యలు తీసుకుని సభను ఆర్డర్లో పెట్టాలని కోరారు. చైర్మన్ పదేపదే హెచ్చరించగా టీడీపీ సభ్యులు పోడియం దిగి ముందు నిలబడి నినాదాలు కొనసాగించడంతో టీబ్రేక్ ఇస్తూ సభను వాయిదా వేశారు. -
బీఏసీలో అచ్చెన్నాయుడికి సీఎం జగన్ ఆఫర్
సాక్షి, అమరావతి: వర్షాకాల సమావేశాలు మొదలైన వెంటనే.. సభను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అచ్చెన్నాయుడికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మీరు ఏం అంశం కావాలన్నా చర్చకు మేం రెడీ. సభలో చర్చకు సహకరిస్తారా? లేదా?. మీరు కోరే ప్రతీ అంశంపైనా చర్చిస్తాం. అవసరమైతే ఈఎస్ఐ స్కాంపైనా చర్చిద్దాం. రాజధానిది కావాలంటే అది కూడా చర్చ పెడదాం. సభ నిర్వహణను మాత్రం అడ్డుకోవద్దని అచ్చెన్నాయుడితో సీఎం జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. చర్చకు సహకరించకుండా గొడవ చేయడం సమంజసం కాదని టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులు బీఏసీలో అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఎంను ఏదైనా అంటే ఊరుకునేది లేదని, చంద్రబాబే రెచ్చగొట్టి ఎమ్మెల్యేలను గొడవకు పంపిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. -
గవర్నర్ పెద్ద వయసు వారు.. మనం గౌరవం ఇవ్వాలి: సీఎం జగన్
అప్డేట్స్: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం ►ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఉద్యోగుల వయో పరిమితి వయస్సు 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్విభజనపై కేబినెట్ చర్చించింది. ►ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 25 వరకూ కొనసాగించాలని నిర్ణయం ►దివంగత గౌతమ్ రెడ్డి మృతికి గౌరవ సూచకంగా ఈనెల 9వ తేదీన సభకు సెలవు ► వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి కేబినెట్ సంతాపం తెలిపింది. 2 నిమిషాలు సీఎం వైఎస్ జగన్, మంత్రులు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్‌ను దూషిస్తూ, గవర్నర్ ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించి గవర్నర్‌పై విసిరేయడంపై బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంచి పద్ధతి కాదని అచ్చెన్నాయుడికి సీఎం జగన్ హితవు పలికారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదనే సంగతిని సీఎం జగన్ గుర్తుచేశారు. గవర్నర్ వయసులో పెద్దవారని, ఆయనకు మనం గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు. ►స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ► హాజరైన సీఎం జగన్, మంత్రులు బుగ్గన, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ ►టీడీపీ నుంచి హాజరైన అచ్చెన్నాయుడు ►భోగాపురం ఎయిర్‌పోర్టును వేగవంతం చేసేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. ఎంఎస్ఎంఈలకు రూ. 2363.2 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించామని అన్నారు. వైఎస్సార్ జగన్ బడుగు వికాసం కింద షెడ్యూల్ కులాల పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పారిశ్రామిక నైపుణ్యం కోసం రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలోనే తొసారిగా మైక్రోసాఫ్టు అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. 2.98 లక్షలకు గాను 2.87 లక్షల ఫిర్యాదులు పరిష్కరించామని గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. ► వైఎస్సార్ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ.9,100 కోట్లు అందించామని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వైఎస్సార్ కాపు నేస్తం కింద ఐదు విడతల్లో రూ. 75 వేల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు. కాపు నేస్తం కింది ఇప్పటివరకు రూ. 981.88 కోట్లు అందించామని తెలిపారు. ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ. 15 వేల చొప్పున సాయం చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ.6,400 కోట్ల వ్యయంతో 3 వేల కిలో మీటర్ల పొడవున 2 లైన్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ► పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడిగా ఉందిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. 2023 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదిక పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వేగవంతమైన అభివృద్ధికి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం వద్ద 3 ఓడరేవుల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ►రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ. 13,500 చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ఇప్పటివరకు 52.38 లక్షల మంది రైతులకు రూ. 20, 162 కోట్ల సాయం చేశామని పేర్కొన్నారు. ► 9 గంటల ఉచిత విద్యుత్ పథకం కింద 18.55 లక్షల మంది రైతులకు ప్రయోజంన చేకూర్చినట్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. 2021-2022లో రూ.9,091 కోట్ల వ్యయంతో రైతులుకు ప్రయోజనం చేకూర్చామని పేర్కొన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ. 577 కోట్ల సాయం చేసినట్ల తెలిపారు. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయీ బ్రహ్మణులకు రూ. 583 కోట్ల సాయం అందించినట్లు పేర్కొన్నారు. ► జగనన్న తోడు ప్రథకం కింద చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్ల సాయం అందజేసినట్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వైఎస్సార్ వాహన మిత్ర కింద ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ. 770 కోట్ల సాయం చేశామని చెప్పారు. వైఎస్సార్ ఆసరా కింద స్వయం సహాయక సంఘాలకు 12,758 కోట్ల సాయం, వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.2,354 కోట్లు అందించామని అన్నారు. జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.2,304 కోట్లు జమ చేశామని తెలిపారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. ► ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. 2020-2021 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధించిందని అన్నారు. మన బడి నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతోందని, తొలి దశలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 44.5 లక్షల మంది తల్లులకు అమ్మఒడి కింద రూ. 13,023 కోట్లు అందజేశామని చెప్పారు. ► రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగుతుందని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ మెరుగైన అభివృద్ధి సాధింస్తోందని తెలిపారు. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శంగా పనిచేస్తున్నాయని గవర్నర్ తెలిపారు. కోవిడ్ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని, గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నామని తెలిపారు. ► గవర్నర్‌ను దూషిస్తూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి గవర్నర్‌పై విసిరేసిన టీడీపీ సభ్యులు. ► ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తున్నారు. ► ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ అసెంబ్లీకి చేరుకున్నారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలితోపాటు, శాసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో సోమవారం ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్ సమావేశాల సమయంలో వర్చువల్ విధానంలో మాట్లాడారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం అనంతరం ఏపీ అసెంబ్లీ వాయిదా పడనుంది. గవర్నర్ ప్రసంగం అనంతరం బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. బీఏసీ సమావేశం ముగిశాక వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై చర్చించి ఆమోదించనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతోపాటు పలు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. -
26 వరకు ఏపీ శాసన సభ సమావేశాలు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26 వరకు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. తొలుత ఒక్క రోజే సభ నిర్వహించాలని భావించామన్నారు. టీడీపీ శాసస సభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఈ నెల 26 వరకు కొనసాగించాలని సమావేశంలో డిమాండ్ చేయటంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే అంగీకారం తెలిపారని చెప్పారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. సీఎం జగన్‌తో పాటు బీఏసీ సభ్యులు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు పాల్గొన్నారు. టీడీపీ తరపున ఆ పార్టీ శాసన సభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు బీఏసీ సమావేశానికి హాజరు కాకుండా అచ్చెన్నాయుడును పంపించారని తెలిపారు. బీఏసీలో తాము పూర్తి ప్రజాస్వామ్య విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. టీడీపీ లేవనెత్తిన ప్రతి అంశాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ తెలియజేశారన్నారు. ఇప్పుడు టీడీపీ చర్చకు సిద్ధంగా ఉండాలని, పారిపోకూడదని అన్నారు. సభా సమయాన్ని వృథా చేయకుండా టీడీపీ సహకరించాలని కోరారు. టీడీపీ హయంలో బీఏసీలో ప్రతిపక్షాన్ని మాట్లాడనిచ్చేది కాదని తెలిపారు. ఒక్కసారి కూడా టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షం అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇపుడు సీఎం జగన్ ప్రతిపక్షం మాటే వింటున్నారని తెలిపారు. కరోనా వల్ల ఒక్కరోజు మాత్రమే నిర్వహించాలని, అది కూడా ఎమ్మెల్సీల నామినేషన్ల తర్వాత సభను ఏర్పాటు చేయాలని భావించామని చెప్పారు. అయినా ప్రతిపక్షం కోరిక మేరకు నిర్ణయాన్ని మార్చుకున్నామన్నారు. తాము సంస్కారయుతంగా, ఎదుటి వారిని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 27 అంశాలపై చర్చించాలని టీడీపీ కోరిందని చెప్పారు. మహిళా సాధికారతతో పాటు బీసీల జనగణనకు సంబంధించిన తీర్మానంపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. -
ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ నిర్ణయం
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ప్రారంభమైన బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు హాజరయ్యారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు. కాగా నవంబర్ 26 వరకు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని టీడీపీ కోరగా.. టీడీపీ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. చదవండి: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు -
స్పీకర్‌దే తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశానికి ముగ్గురు సభ్యులున్న బీజేపీని పిలవాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బీఏసీ సమావేశానికి హాజరు కావాలనుకుంటే బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. సోమవారానికి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కమిటీహాల్లో శుక్రవారం మీడియాతో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్పుకుంటామని సీఎం కేసీఆర్ బీఏసీ భేటీలో వెల్లడించారన్నారు. ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుత సమావేశాల్లో హరితహారం, దళితబంధు, ఐటీ, పరిశ్రమలు వంటి పది అంశాలను చర్చించాలని కోరుతూ స్పీకర్‌కు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. 12 అంశాలపై చర్చకు కాంగ్రెస్ ప్రతిపాదనలు ఈ సమావేశాల్లోనే నాలుగైదు బిల్లులతో పాటు రెండు ఆర్డినెన్స్‌లు కూడా సభ ముందుకు వస్తా యని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 12 అంశాలపై చర్చించాలని ప్రతిపాదనలు ఇచ్చిందని, హైదరాబాద్ ఓల్డ్‌సిటీ అభివృద్ధిపై చర్చించాలని ఎంఐఎం పార్టీ కోరిందని పేర్కొన్నారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం కానిస్టిట్యూషన్ క్లబ్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్పై ఈటల రాజేందర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీయే తమకు ప్రధాన ప్రత్యర్థి అని, ఈ నెల 21,22,23 తేదీల్లో నిర్వహించిన సర్వేలో బీజేపీ కంటే టీఆర్ఎస్ పార్టీ 15% ఎక్కువ ఓట్లు సాధిస్తుందని వెల్లడైనట్లు మంత్రి తెలిపారు. -
విపక్షాలు ఎన్ని రోజులు గడువు అడిగితే అన్ని రోజులు నడుపుతాం
-
పార్లమెంట్లో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతాం
-
పార్లమెంట్లో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతాం
సాక్షి, న్కూఢిల్లీ : సోమవారం నుంచి జరగనున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో బిజినెస్ ఎడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీ ఆదివారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నుంచి ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత ఎంపీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. భేటీ అనంరతం ఆయన వివరాలను వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యలు, భారత్-చైనా సరిహద్దు వివాదాలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని స్పీకర్ కోరినట్లు తెలిపారు. నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై కూడా చర్చించాలని కోరినట్లు వెల్లడించారు. అవకాశం వచ్చినా ప్రతిసారి ప్రత్యేక హోదా అంశాన్ని లెవనెత్తుతూనే ఉంటామని, ప్రత్యేక హోదా అంశంపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. (కేంద్రంతో ఇక బిగ్‌ఫైట్) కరోనా వైరస్ నేపథ్యంలో వర్షాకాల సమావేశాలు ప్రత్యేక పరిస్థితుల్లో జరగబోతున్నాయని అన్నారు. ఇక ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుందన్నారు. విపక్షాలకు అంశాలు లేక తమపై అనవసరమైన నిందలు వేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కరెంట్ మీటర్ల విషయంలో ఎవరు ఆందోళనలో చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని సీఎం జగన్ స్పష్టం చేశాని మిథున్ రెడ్డి గుర్తుచేశారు. విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తాం: నామా పెండింగ్ బిల్లులు ఆమోదించుకోవడమే లక్ష్యంగా అజెండా రూపొందించారు. జీఎస్టీ పెండింగ్ నిధులు, కరోనా, వలస కార్మికుల సమస్యలు, నిరుద్యోగం, సరిహద్దు వివాదాలు, ఆర్థిక ప్రగతిపై కూడా చర్చించాలని కోరాం. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు లేవనెత్తుతాం. 11 ఆర్డినెన్స్ లు కేంద్రం ప్రవేశ పెట్టబోతోంది. ఈ సమావేశాల్లో మొత్తం 25 బిల్లులు ఉన్నాయని చెప్పారు. కొన్ని ప్రజావ్యతిరేక బిల్లు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో నూతన విద్యుత్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. దాన్ని వ్యతిరేకిస్తాం. నాగేశ్వరరావు, టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత -
ముగిసిన బీఏసీ: 10న రెవెన్యూ చట్టంపై ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన భేటీఅయిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. సభ నిర్వహణ, అజెండా తయారీపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 28 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 10, 11 తేదీల్లో అసెంబ్లీలో కీలకమైన రెవెన్యూ చట్టంపై చర్చచేపట్టనున్నారు. అలాగే భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది. సమావేశాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్ష సభ్యులను కోరారు. (తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!) మీడియా పాయింట్ ఎత్తివేయడంపై సమావేశంలో గరం గరం చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మీడియా పాయింట్ ఎత్తివేయడంపై భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. కోవిడ్ నేపథ్యంలోనే మీడియా పాయింట్ అనుమతించలేదని సీఎం కేసీఆర్ వివరించారు. కాగా వివిధ కారణాల దృష్ట్యా ఈ నెల 12, 13, 20, 27 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. కాగా సోమవారం నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. -
బీఏసీ సాక్షిగా బయటపడ్డ టీడీపీ డ్రామాలు
సాక్షి, అమరావతి : బీఏసీ సమావేశం సాక్షిగా మరోసారి టీడీపీ డ్రామాలు బయటపడ్డాయి. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన మంగళవారం జరిగిన బీఏసీ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సాధ్యం కాని అంశాలను లేవనెత్తాడు. వర్చువల్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే వర్చువల్ అసెంబ్లీ సాధ్యం కాదని, దీనిపై పార్లమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. 50 రోజులైనా అంసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. (చదవండి : లైవ్ అప్డేట్స్: ఏపీ వ్యవసాయ బడ్జెట్) ‘మేం చేసిన కార్యాక్రమాలను ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 3.98 కోట్ల మందికి వివిధ పథకాల ద్వారా 42 వేల కోట్ల రూపాయలను బదిలీ చేశాం. ఈ విషయాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. బయట పరిస్థితులు అందరికి తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీ నడపాలని టీడీపీ కోరితే మాకు అభ్యంతరం లేదు. ఎన్ని రోజులు నడపాలో అడగండి.. నిర్వహిస్తాం. కాకపోతే వర్చువల్ అసెంబ్లీ సాధ్యం కాదు. దీనిపై పార్లమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అని సీఎం జగన్ స్పష్టం చేయడంతో టీడీపీ ఎమ్మెల్యేలు మౌనంగా ఉండిపోయారు. (చదవండి : ఏపీ బడ్జెట్ హైలైట్స్) -
మూడు రోజుల పాటు అసెంబ్లీ
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడు రోజులు, శాసనమండలి సమావేశాలు రెండు రోజులు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయం తీసుకుంది. సోమవారం అసెంబ్లీ కార్యాలయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు శాసనసభ నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతో పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు అధికారపార్టీ పేర్కొనగా, వాటిని వ్యతిరేకిస్తామని తెలుగుదేశం పార్టీ తెలిపింది. మండలి చైర్మన్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో మంగళవారం, బుధవారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో అధికారపార్టీ నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్‌చంద్రబోస్ పాల్గొనగా ప్రతిపక్ష పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో అధికారపార్టీ ప్రతిపాదించిన ధరల స్థిరీకరణ నిధి, ప్రతిపక్ష పార్టీ ప్రతిపాదించిన రాజధాని ఉద్యమం అంశాలపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. -
హై పవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం
అమరావతి: హై పవర్ కమిటీ నివేదికకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం సమావేశమైన మంత్రిమండలి భేటీ పలు కీలక అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సంబంధించి శాసనసభలో ప్రతిపాదించే బిల్లుపై చర్చించి ఆమోదముద్ర వేసింది. అలాగే రాజధాని రైతులకు చెల్లిస్తున్న పరిహారానికి సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రైతులకు చెల్లిస్తున్న పరిహారం రూ. 2500 నుంచి రూ. 5000కు పెంచడాన్ని మంత్రిమండలి ఆమోదించింది. అలాగే, పరిహారం చెల్లింపు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకూ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సీఆర్డీఏను అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ నిర్ణయాలు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ రూ.2500 నుంచి 5వేలకు పరిహారం పెంపు భూములు ఇచ్చిన రైతులకు కౌలు 15 ఏళ్లకు పెంపు శాసన రాజధానిగా అమరావతి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం న్యాయ రాజధానిగా కర్నూలు స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం మంత్రివర్గం భేటీ అనంతరం స్పీకర్ అధ్యక్షతన జరిగిన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఇక టీడీపీ తరఫున ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం జరిగింది. కాగా సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. చదవండి: సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అమరావతికి అన్నీ ప్రతికూలతలే మూడు కమిటీలూ వికేంద్రీకరణకే ఓటు అమరావతిలో అలజడికి కుట్రలు.. మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధే ధ్యేయం -
శాసనసభ బీఏసీ సమావేశం రేపటికి వాయిదా
సాక్షి, అమరావతి: శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ అధ్యక్షతన సోమవారం శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. వారం రోజులు పాటు శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో తీర్మానం చేశారు. ఈనెల 9, 10, 11, 12, 13, 16, 17 తేదీలలో ఏడు పని దినాల్లో మండలి సమావేశాలు నిర్వహించాలని ఈ మేరకు బీఏసీ నిర్ణయం తీసుకొంది. డిసెంబర్ 14, 15 తేదీలు శని, ఆదివారాలు కావడంతో సభకు సెలవు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సమావేశమైన బీఏసీ తదుపరి సమావేశాన్ని రేపటికి వాయిదా వేసింది. సమావేశానికి శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు హాజరయ్యారు. -
బీఏసీకి దూరంగా ఉండనున్న ఈటల, ఎర్రబెల్లి
సాక్షి, వరంగల్ : శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశాలకు మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈసారి దూరంగా ఉండనున్నారు. ఇంతకు ముందు కమిటీలో వీరి పేర్లు ఉండగా... తాజా కమిటీ నుంచి ఆ ఇద్దరు మంత్రుల పేర్లను తొలగించారు. కొత్తగా ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు బీఏసీలో అవకాశం కల్పించారు. తొలుత స్థానం రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన అనంతరం ఫిబ్రవరి 21న బీఏసీని ఏర్పాటు చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో సీఎం కేసీఆర్ సహా మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కూడా సభ్యులుగా స్థానం ఉంది. అయితే స్పీకర్ విచక్షణ, పరిస్థితులకు అనుగుణంగా.. బీఏసీని పునర్ వ్యవస్థీకరించుకోవచ్చనే నిబంధన మేరకు తాజా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 8న బీఏసీ కమిటీని నామినేట్ చేశారు. ఈ మేరకు ఆ కమిటీలో మార్పులు, చేర్పులు జరిగాయి. ఈ కమిటీలో గత బీఏసీ కమిటీ జాబితాలో ఉన్న ఇద్దరు మంత్రులు రాజేందర్, దయాకర్‌రావు పేర్లు లేకపోగా.. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్కు అవకాశం కల్పించారు. ఈ మార్పులకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని తెలంగాణ శాసనసభ వెబ్సైట్లో పొందుపర్చారు. -
ఏ చర్చకైనా సై
సాక్షి, అమరావతి: ప్రజా ప్రాధాన్యం కలిగిన ఏ అంశంపై అయినా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఏ అంశంపైనైనా చర్చకు అధికారపక్షమే ముందు ఉండాలని బీఏసీ సమావేశంలో సూచించారు. సమస్యల పరిష్కారంపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ప్రతిపక్షాన్ని మాట్లాడనిస్తామని, గత ప్రభుత్వం మాదిరిగా వ్యవహరించబోమని పేర్కొన్నారు. ఈనెల 11వతేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఆయన చాంబర్లో బీఏసీ (శాసనసభా వ్యవహారాల సలహా మండలి) సమావేశం జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మంత్రులు పి.అనిల్‌కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు, టీడీపీ తరపున ఉపనేత కె.అచ్చెన్నాయుడు దీనికి హాజరయ్యారు. ‘ఏ అంశంపై చర్చ జరగాలని కోరుకుంటున్నారో చెప్పండి. ఆ అవకాశం మీకే ఇస్తున్నాం... అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించుకుందామో కూడా చెప్పండి. 20 రోజులకు పెంచుకుందామా.. లేక ఇంకా కావాలా? మీరే చెప్పండి..’ అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీకి సూచించారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశాలను ఈనెల 30వతేదీ వరకు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. మొత్తం 14 పని రోజుల్లో 84 గంటల పాటు సమావేశాలు జరగనున్నాయి. రోజూ ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పోనీ తరువాతే చెప్పండి.. బుధవారం బీఏసీ సమావేశం ప్రారంభం కాగానే స్పీకర్ సీతారామ్ తొలుత మాట్లాడారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిద్దామో సూచించాలని ప్రతిపక్షాన్ని కోరారు. అయితే టీడీపీ నుంచి హాజరైన అచ్చెన్నాయుడు దీనిపై అప్పటికపుడు సమాధానం చెప్పకపోవడంతో ... ‘పోనీ ఇవాళ కాకపోయినా ఆ తరువాతైనా ఎన్ని రోజులు కావాలో చెప్పండి..’ అని పేర్కొంటూ జగన్ విపక్షానికే అవకాశాన్ని ఇచ్చారు. సమావేశాలు పొడిగించాలని చివరి రోజుల్లో కోరితే ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం అన్నట్లు తెలిసింది. ప్రతిపక్షం నుంచి ఈ విషయంపై స్పందన లేకపోవడంతో బీఏసీలో ఇతర అంశాలపై చర్చ జరిగింది. నూతన ఒరవడికి సీఎం శ్రీకారం: మంత్రులు గతంలో మాదిరిగా కాకుండా బీఏసీలో పూర్తి అర్థవంతంగా చర్చ జరిగిందని, సమావేశంలో అధికారపక్షం కన్నా ప్రతిపక్షానికే ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఇచ్చారని మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని, ప్రజా ప్రాధాన్యం కలిగిన ఏ సమస్య ఉన్నా ముందుకు రావాలని ప్రతిపక్షానికి సూచించారన్నారు. అసెంబ్లీ ఎన్ని రోజులైనా సరే నిర్వహిద్దామని కూడా ప్రతిపాదించారన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా సభలో మైక్‌లు కట్ చేయడం, ప్రతిపక్షానికి సమయం ఇవ్వకపోవడం లాంటివి ఇప్పుడు ఉండవని, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా సభను వినియోగించుకోవాలని సీఎం సూచించారని చెప్పారు. అచ్చెన్న.. ఆశ్చర్యం! ప్రతిపక్షాన్ని అణగదొక్కాలన్నది తమ అభిమతం కాదని మంత్రులు పేర్కొన్నారు. కరువుపై చర్చించాలని బీఏసీలో టీడీపీ కోరగానే ముఖ్యమంత్రి తొలి రోజునే చర్చకు అంగీకరించారన్నారు. తమ ప్రభుత్వం చర్చకు రెండడుగులు ముందుకు వేస్తుందే తప్ప వెనక్కి వెళ్లదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ ఇలా ఉదార స్వభావంతో మాట్లాడటం టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు కూడా ఆశ్చర్యం కలిగించి ఉంటుందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ చాలా ఉదారంగా వ్యవహరించడం పట్ల తమకు గర్వంగా ఉందని గడికోట పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్నపుడు ఇలా వ్యవహరించలేక పోయామే అని అచ్చెన్న పశ్చాత్తాపపడి ఉంటారని. అయితే ఆ విషయాన్ని ఆయన బయటకు చెప్పలేకపోయి ఉంటారన్నారు. ఈ సమావేశాల్లోనే ఫీజుల నియంత్రణ, టెండర్లపై జ్యుడీషియల్ కమిషన్, అమ్మ ఒడి తదితర బిల్లులను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తాము ప్రతిపక్షంలో ఉండగా సభలో చర్చించాల్సిన అంశాలపై బీఏసీ సమావేశంలో లిఖితపూర్వకంగా ఇస్తే నాడు అధికార పక్షంగా ఉన్న టీడీపీ కనీసం పట్టించుకోలేదని గడికోట గుర్తు చేశారు. అయితే తాము మాత్రం ఏ అంశంపైనైనా చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 40 రోజుల వైఎస్ జగన్ పాలనలో ఏదో జరిగిపోయినట్లుగా శాంతి భద్రతల అంశంపై చర్చ జరగాలని టీడీపీ కోరుతోందని విమర్శించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం పోలీసులను ఆదేశించారని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. విపక్ష నేతకు ముందే సమాచారం ఇచ్చాం... ప్రతిపక్ష నేత చంద్రబాబు బీఏసీ సమావేశానికి గైర్హాజరు కావటాన్ని బట్టి ప్రజలపై ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. చివరి నిమిషంలో ఆయనకు ఆహ్వానం పంపారనడం సరికాదన్నారు. ఒకరోజు ముందుగానే ఉదయమే తెలియజేశామన్నారు. బీఏసీ సమావేశానికి తక్కువ మంది టీడీపీ సభ్యులకు అవకాశం కల్పించారని కొందరు విలేకరులు ప్రశ్నించగా నిబంధనల మేరకే వ్యవహరించామని గడికోట తెలిపారు. అసెంబ్లీలో సంఖ్యాపరంగా చూస్తే టీడీపీ నుంచి 0.5 మందికే బీఏసీకి అవకాశం ఉంటుందన్నారు. అచ్చెన్నాయుడు లాంటి భారీ మనిషికి అర అవకాశం ఇవ్వలేం కనుక ఒకరికి సభ్యత్వం కల్పించామని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు కూడా పాల్గొన్నారు. 23 అంశాలపై సభలో చర్చిద్దాం సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజా ప్రాధాన్యం కలిగిన 23 అంశాలపై సభలో చర్చించాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్షం ప్రతిపాదించింది. మంత్రి కురసాల కన్నబాబు వీటిని మీడియాకు విడుదల చేశారు. ఆ వివరాలు ఇవీ. రాష్ట్రంలో వ్యవసాయరంగం– రైతు భరోసా– 40 రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు విద్యారంగం–పాఠశాలలు, కాలేజీల పరిస్థితి, అమ్మ ఒడి, అధిక ఫీజుల నియంత్రణ, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం పారదర్శకమైన పాలన – అవినీతి నిర్మూలన ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, పనుల్లో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలకు 50% రిజర్వేషన్లు వైద్య ఆరోగ్య రంగం – స్థితిగతులు, ఆరోగ్యశ్రీ, 108, 104 నిర్వహణ నీటి పారుదల రంగం – పోలవరం, ఇతర ప్రాజెక్టులు గృహ నిర్మాణం– 25 లక్షల ఇళ్ల స్థలాలు ఆర్థిక పరిస్థితులు, గత ఐదేళ్ల అప్పులు, బకాయిలు ప్రత్యేక హోదా, విభజన హామీలు – కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచెయ్యి విద్యుత్ రంగం – వాస్తవాలు రాజధాని అంశం – సీఆర్డీఏ పరిధిలో భూ కేటాయింపులు పొదుపు సంఘాల రుణాలు బెల్టు షాపులు – ఎక్సయిజ్ పాలసీ గ్రీవెన్సెస్, స్పందన కార్యక్రమం ఇసుక అక్రమ రవాణా డ్వాక్రా రుణాలు –వాస్తవాలు గత ఐదేళ్లలో రాష్ట్రంలో భూ కేటాయింపులు అగ్రిగోల్డ్ అంశం జన్మభూమి కమిటీలు – రాజ్యాంగేతర శక్తులుగా పని చేసిన తీరు, అవినీతి, ‘కే ట్యాక్స్’ నదుల ఆక్రమణలు, అక్రమ కట్టడాలు – భవిష్యత్తుపై ప్రభావం కాంట్రాక్టులు, అవకతవకలు – అవినీతి ఉద్యోగాలు, నిరుద్యోగం, గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్లు ప్రభుత్వోద్యోగులు – సంక్షేమం. బడ్జెట్ సమావేశాలకు గట్టి భద్రత సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు: నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి నిర్వహిస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 1,450 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నారు. మొత్తం 14 రోజుల పాటు సమావేశాలు జరగనుండగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదేరోజు వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కన్నబాబు ప్రత్యేకంగా సమర్పిస్తారు. మూడంచెల భద్రత అసెంబ్లీ వద్ద మూడంచెల విధానంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 2 రోజుల ముందు నుంచే పరిసర ప్రాంతాలను బాంబు స్క్వాడ్ బృందాలతో జల్లెడ పట్టారు. తుళ్లూరు మండలం పరిధిలో పోలీస్ యాక్ట్–30 అమలు చేస్తున్నారు. అసెంబ్లీ పరిధిలో 10 కిలో మీటర్ల వరకు సెక్షన్ 144 అమల్లోకి తెచ్చారు. వెలగపూడి వైపు వెళ్లే వాహనాలను చెక్‌పోస్టుల వద్ద క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. గరుడ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి డ్రోన్ కెమెరాల ద్వారా సచివాలయం, అసెంబ్లీ పరిసర ప్రాంతాలను సిబ్బంది పర్యవేక్షించనున్నారు. ప్రధాన గేటు నుంచి వీవీఐపీ, వీఐపీలు.. వీవీఐపీ, వీఐపీలను ప్రధాన గేటు నుంచి అసెంబ్లీలోకి అనుమతిస్తారు. పాసులు కలిగిన మీడియా ప్రతినిధులను 4 లేదా 5వ గేటు నుంచి అనుమతిస్తారు. అసెంబ్లీకి వచ్చే వారందరికీ వేర్వేరుగా వాహనాల పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు. డ్రైవర్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఎమ్మెల్యేల అనుచరులను లోపలకు అనుమతించరు. ఆ దారిలో సీఎం, మంత్రులకే అనుమతి.. స్క్రూ బ్రిడ్జి– కరకట్ట – ఎమ్ఎస్ఆర్ ఆశ్రమం మార్గంలో సీఎం, మంత్రులను మాత్రమే అసెంబ్లీకి వెళ్లేందుకు అనుమతిస్తారు. ప్రజాప్రతినిధులు, కార్యదర్శి స్థాయి అధికారులు ఉండవల్లి సెంటర్ – ఉండవల్లి గుహలు –పెనుమాక––కృష్ణాయపాలెం–వెలగపూడి మీదుగా అసెంబ్లీకి చేరుకోవాలి. అధికారులు, ఉద్యోగులు ఇతర వీఐపీలు మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ – ఎరబ్రాలెం – కృష్ణాయపాలెం – వెలగపూడి మీదుగా అసెంబ్లీకి చేరుకోనున్నారు. నాలుగు మొబైల్ పార్టీలు కాజా టోల్ ప్లాజా, మంగళగిరిలోని నిడమర్రు రైల్వే గేట్, నిడమర్రు సెంటర్, తాడికొండ అడ్డరోడ్డు వద్ద ట్రాఫిక్ నియంత్రణ, తనిఖీల కోసం సిబ్బందిని నియమించారు. నాలుగు మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశారు. మంగళగిరి, తాడేపల్లిలో ఎస్టీఎఫ్, ఏపీఎస్పీ బృందాలను సిద్ధంగా ఉంచారు. కనకదుర్గ వారధి, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి సెంటర్, డాన్ బాస్కో స్కూల్, కురగల్లు జంక్షన్, తాడికొండ క్రాస్ రోడ్స్ వద్ద మొత్తం ఆరు చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడాన్ని నిషేధించారు. -
‘ప్రతిపక్షానికి ఎంత సమయమైనా ఇస్తాం’
సాక్షి, అమరావతి : అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రతిపక్షాలకు కావాల్సినంత సమయం ఇస్తామని మంత్రి కన్నబాబు అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన విధంగా మైక్ కట్ చేయడం, ప్రతిపక్షాల గొంతు నొక్కడం లాంటి పనులను తాము చేయమన్నారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన బీఏసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. బీఏసీ సమావేశం చాలా అర్థవంతంగా జరిగిందన్నారు. సభలో మొత్తం 23 అంశాల మీద చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాజధాని భూ కేటాయింపు వంటి ముఖ్య అంశాలతో పాటు అగ్రిగోల్డ్, కె టాక్స్, ఉద్యోగుల సంక్షేమం, ఇసుక అక్రమ రవాణా వంటి అంశాలు మీద చర్చ ఉంటుందని తెలిపారు. సభ అనుకున్న సమయం కంటే ఎక్కువ రోజులు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సభ ఎన్నిరోజులు జరపాలని సీఎం జగన్ ప్రతిపక్ష సభ్యులు అచ్చెన్నాయుడిని అడిగితే.. సమధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. -
14 రోజుల పాటు ఏపీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాల వ్యవహారాల సలహామండలి (బీఏసీ) సమావేశం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన బుధవారం జరిగింది. స్పీకర్ ఛాంబర్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, సభా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభా సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకూ జరపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. శని, ఆదివారం మినహా మొత్తం 14 పనిదినాలు పాటు శాసనసభ జరగనుంది. ఈ సమావేశం ముగిసిన తరువాత శాసనమండలి సభా కార్యకలాపాల సలహామండలి సమావేశం చైర్మన్ ఎంఏ షరీఫ్ ఛాంబర్లో జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేస్తారు. కాగా శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (గురువారం) ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తొలిసారిగా శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు 2019–20 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీకి సమర్పిస్తారు. శాసనమండలిలో సభా నాయకుడు, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. శాసన మండలిలో పశు సంవర్థక, మత్య్స శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పిస్తారు. -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను పొడిగించారు. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 6 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 30,31, వచ్చే నెల 1, 5న సెలవుగా ప్రకటించారు. అలాగే 28 వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. -
ఏపీ అసెంబ్లీ పనిదినాల పెంపు
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల పని దినాలను పెంచారు. ఈ నెల 27,28, 29 తేదీలలోనూ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ నెల 25 న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఈ నెల 10 న ప్రారంభమైన ఏపీ అసంబ్లీ సమావేశాలు మొత్తం 10 రోజుల పాటు నిర్వహించాలనుకున్నారు. 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా అప్పట్లో బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. 11, 12, 16, 17, 18, 19 తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు. తిరిగి నేడు ( సోమవారం) అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన తర్వాత పని దినాలను పెంచుతున్నట్టు అధికారంగా తెలిపారు. -
ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు సభ
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు సభ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. శాసన సభ సోమవారానికి వాయిదా పడిన అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్, టీడీపీలు గైర్హాజరయ్యాయి. ప్రతి రోజూ ఒక అంశంపై స్వల్పకాలిక చర్చ జరపాలని నిర్ణయించారు. పార్టీ సభ్యుల సంఖ్యా బలం ఆధారంగా స్వల్పకాలిక అంశాలను, రొటేషన్ పద్ధతిలో ఖరారు చేయనున్నారు. అన్ని బిల్లులు ఒకేసారి కాకుండా వేర్వేరు రోజుల్లో పెట్టాలని ప్రతి పక్షాలు సూచించగా ప్రభుత్వం అందుకు అంగీకరించింది. బిల్లులపై చర్చను మధ్యాహ్నం సెషన్లలో చర్చిద్దామని ప్రతిపా దించింది. 15 రోజులపాటు సభ నడిపితే చాలంటూ ఈ భేటీలో ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ లేఖ ఇచ్చారు. ఎన్ని రోజులు సభ జరపాలన్న అంశంపై స్పష్టమైన నిర్ణయం ఏదీ జరగలేదని, ఎన్ని రోజులైనా జరిపేం దుకు సిద్ధమని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఫ్లోర్ లీడర్లతో అన్నట్టు తెలిసింది. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పది పనిదినాలకు సరిపోను రోజుకు పది ప్రశ్నల చొప్పున వంద ప్రశ్నలను ఎంపిక చేశారు. టీఆర్ఎస్–69, కాంగ్రెస్–16, ఎంఐఎం–6, టీడీపీ–3, సీపీఎం–1, ఇండిపెండెంట్–1 చొప్పున ప్రశ్నలను కేటాయించారు. -
50 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. 50 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేపు( శుక్రవారం) ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత మరోసారి బీఏసీ సమావేశం జరుగనుంది. సమావేశాల్లో ఏయే అంశాలు చర్చించాలనే దానిపై షెడ్యూలు ఖరారు చేశారు. ప్రతిరోజు గంటన్నర సేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించారలని నిర్ణయించారు. కాగా నవంబర్ 27న హైదరాబాద్‌లో ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా సభకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. ఈ సమావేశానికి ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. అనారోగ్యం కారణంగా స్పీకర్ మధుసూదనాచారి హాజరుకాలేదు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ , హరీశ్‌రావు, జానారెడ్డి, కిషన్‌రెడ్డి, మంత్రి ఈటల, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, భట్టివిక్రమార్క, చిన్నారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. -
27 నుంచి తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు ఈ నెల27నుంచి ప్రారంభం కానున్నాయి. 15 నుంచి 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 26న బీఏసీ సమావేశంలో షెడ్యూల్ ఖరారు కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో అన్ని అంశాలపై కులంకషంగా చర్చ జరగాలన్నారు. ప్రతిపక్షాలు ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సభలో ప్రతిపక్షాలు ఏ అంశంపై ప్రశ్నించినా జవాబు చెప్పేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. సభ హుందాగా నడవాలని, ప్రతి అంశంపై చర్చ జరగాలని సీఎం పేర్కొన్నారు. -
అది పక్కా రాజకీయ కుట్ర
-
అది పక్కా రాజకీయ కుట్ర: సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళన, విధ్వంసం ఘటనపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పందించారు. ఖమ్మం మార్కెట్ యార్డులో అలర్లు, విధ్వంసం రాజకీయ కుట్రతో, ప్రథకం ప్రకారమే జరిగాయని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఖమ్మం మిర్చి యార్డులో జరిగింది కృత్రిమ ఆందోళన అని, రాజకీయ ప్రయోజనాల కోసమే దీనిని చేశారని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ఈ వివరాలను స్వయంగా తానే బయటపెడతానని ఆయన చెప్పినట్టు సమాచారం. ఈ విధ్వంసానికి కారణమైనవారిపై అంతేస్థాయిలో కేసులు ఉంటాయని ఆయన హెచ్చరించారు. భూసేకరణ బిల్లులోని సవరణలను అసెంబ్లీ ఆమోదించే విషయమై బీఏసీ సమావేశం శనివారం వాడివేడిగా జరిగింది. భూసేకరణ బిల్లు ప్రధానమని ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. భూసేకరణ బిల్లులోని సవరణల ఆమోదం కోసం ఆదివారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా భూసేకరణ బిల్లు చర్చించే అవకాశముందని, ఇతర అంశాలు సభముందుకు రాకపోవచ్చునని తెలుస్తోంది. -
బీఏసీ భేటీకి పిలిచి.. అవమానించారు
అసెంబ్లీ కార్యదర్శి సదారాంపై స్పీకర్‌కు సండ్ర ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: శాసనసభలో బీఏసీ సమావేశానికి తనను పిలిచి అవమానించారని, దీనికి బాధ్యులైన అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ మధుసూదనాచారికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ఫిర్యాదుచేశారు. ఈ నెల 15న జరిగిన బీఏసీ సమావేశానికి హాజరుకావాలని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం తనను అధికారికంగా ఆహ్వానించారని, అయితే హాజరైన తనను బడ్జెట్ సమావేశాలు మొత్తానికి సస్పెండైన కారణంగా బీఏసీ సమావేశానికి హాజరు కావొద్దని తిప్పి పంపించారని వివరించారు. దీనిపై అసెంబ్లీ కార్యదర్శిపై శాసనసభ రూల్ 168 ప్రకారం ప్రివిలేజ్ మోషన్ పెట్టి, చర్యలు తీసుకోవాలని కోరారు. -
నియంతలకు పట్టిన గతే పడుతుంది
-
నేడు 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ
-
నియంతలకు పట్టిన గతే పడుతుంది
హైదరాబాద్: అసెంబ్లీ నిబంధనలను పక్కనబెట్టి హరీష్‌రావు, సదారాం కనుసన్నల్లో సభ నడుస్తున్నదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, అసెంబ్లీలా కాకుండా టీఆర్ఎస్ కార్యాలయంలా నడుస్తోందని విమర్శించారు. పార్టీ కార్యాలయాలకతీతంగా స్పీకర్ కార్యాలయం పనిచేయాలన్నారు. ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సింది స్పీకరేనని, అయితే దురదృష్టంకొద్దీ అలా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నిన్నటివరకు టీడీపీ జెండా కింద పనిచేసింది మరిచిపోయారా అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలమైన తమను బీఏసీకి రావాలని పిలిచి అవమానించడం దారుణమన్నారు. ఇది తెలంగాణ సమాజానికి జరిగిన అవమానం అని అన్నారు. అసెంబ్లీ కార్యదర్శి సదారాంను సస్పెండ్ చెయ్యాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నియంతలకు పట్టిన గతే పడుతుంది: సండ్ర ప్రభుత్వం, అసెంబ్లీ టీడీపీ గొంతు నొక్కుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శనివారం ఆయన స్పీకర్‌ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీఏసీ తమను అనుమతించక పోవడం దారుణమన్నారు. బీఏసీ మీటింగ్ కు రావాలని ఆహ్వానించి, అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో, శాసన సభలో భజన చేసేవారే ఉండాలన్నట్లు ప్రభుత్వం వ్యవహరుస్తోందని ఆరోపించారు. తమనేందుకు సస్పెండ్ చేశారో.. ఫుటేజ్ బయటికివ్వమని అడిగితే స్పీకర్ దగ్గర సమాదానం లేదని తెలిపారు. చరిత్రలో నియంతలకు పట్టిన గతే ఈ సర్కార్‌కు పడుతుందని దుమ్మెత్తి పోశారు. -
రేపు 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ
హైదరాబాద్: తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. సమావేశంలో ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో పాటు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీలనుంచి పలువులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, ఎంఐఎం నుంచి పాషా ఖాద్రీ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీపై నిషేధం ఉండటంతో పార్టీ తరపున ఎవరూ పాల్గొనలేదు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రేపటి సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టాలని తీర్మానించారు. అందులో ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు, కేంద్ర జీఎస్టీ బిల్లుతోపాటు హెరిటేజ్‌కు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతుంది. -
అసెంబ్లీ సమావేశాల పొడిగింపు కుదరదు
చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు సాక్షి, అమరావతి: మార్చి నెలాఖరులోగా బడ్జెట్ ఆమోదం పొందాల్సి ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ సమావేశాలను పొడిగించలేమని ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడారు. బీఏసీ సమావేశం నిర్ణయానికి విరుద్దంగా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్ ప్రసంగం బాగుందని చెప్పారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయోజనాలను గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం మరోసారి చాటిచెప్పిందన్నారు. మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు ప్రభాకర్‌చౌదరి, ఎ.నాగేశ్వర్‌రెడ్డి, బొండా ఉమామహేశ్వరరావు, కేఏ నాయుడు, కాగిత వెంకట్రావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా మాట్లాడారు. -
42 సమస్యలు చర్చించడానికి 13 రోజులా?
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, అమరావతి: ‘మొత్తం 42 సమస్య లున్నాయి. ఈ సమస్యలు చర్చించేందుకు కనీసం నెలరోజుల సమయం పడుతుంది. అందుకే మరో పదిరోజులు సమయం ఇవ్వాల్సిందిగా పదేపదే కోరాం. అందుకు శాసనసభ వ్యవహారాలమంత్రి యనమల రామకృష్ణుడు ఒప్పుకోలేదు. ఆయన మాట్లాడిన మాటలు ప్రభుత్వం మాట్లాడిన మాటలుగానే భావించాల్సి ఉంటుంది’ అని పుంగనూరు, రాయచోటి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం బీఏసీ సమావేశం ముగిసిన తరువాత వారు వెలగపూడి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అనేక సమస్యలున్నాయి.. మాట్లాడాలని చెబితే మాకు ఇంతకంటే సమస్యలున్నాయని నిర్లక్ష్య ధోరణిలో సమాధానం ఇవ్వడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారు. 42 అంశాలపై చర్చించే ధైర్యం మీకుంటే సభను మరో 20 రోజులు పెంచి జరిపించాలి అని సూచించారు. ప్రభుత్వంలో అవినీతి ఉందనటానికి ఓటుకు కోట్లు కేసే ఉదాహరణ అని పేర్కొన్నారు. తప్పులు చేయలేదనుకున్నప్పుడు కోర్టుకు వెళ్లి ఎందుకు స్టేలు తెచ్చుకుంటున్నారో సమాధానం చెప్పాలని వారు నిలదీశారు. -
యనమల కుదరదన్నారు: వైఎస్ఆర్ సీపీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 13 రోజులు మాత్రమే జరుపుతామని అనడం పద్ధతి కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. బిజినెస్ ఎడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం అనంతరం పార్టీ నేతలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ సభలో చర్చించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు. మరో పది రోజుల పాటు సమావేశాలు పొడిగించమని అడిగామని అయితే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కుదురదన్నారని తెలిపారు. ప్రజల సమస్యలను అసెంబ్లీ చర్చించాల్సిన అవసరం ఉందని, అయితే అందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నెలరోజులైనా అసెంబ్లీ సమావేశాలు ఉండాలని, అప్పుడే ప్రజాసమస్యల మీద చర్చించడానికి వీలుంటుందని అన్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 28 వరకూ జరగనున్నాయి. -
28 వరకే ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 13 రోజుల పాటు.. అంటే ఈనెల 28 వరకు మాత్రమే నిర్వహించాలని బిజినెస్ ఎడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించిన తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడింది. అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. అందులో ముందుగా ఈనెల 28 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. బడ్జెట్ మరునాడు సెలవు ఇవ్వకూడదని నిర్ణయించారు. మొత్తం పది బిల్లులను ఆమోదించాలని అన్నారు. బిల్లులు పెట్టినప్పుడు మాత్రం రెండోపూట కూడా సభను నిర్వహించాలని తెలిపారు. కాగా, శాసనసభ చరిత్రలో అతి తక్కువ రోజులు నిర్వహించే బడ్జెట్ సమావేశాలు ఇవే కావడం విశేషం. అయితే ఈ నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. కనీసం నెలరోజులైనా సమావేశాలు ఉండాలని, అప్పుడే ప్రజాసమస్యల మీద చర్చించడానికి వీలుంటుందని చెప్పింది. దీంతో.. మళ్లీ సమావేశమై అదనపు రోజుల గురించి చర్చించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. -
11 దాకా తెలంగాణ అసెంబ్లీ
-
11 దాకా అసెంబ్లీ
► మండలి కూడా.. బీఏసీ భేటీలో నిర్ణయం ► తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న ప్రతిపక్షాలు ► నిరసన కూడా తెలపనివ్వడం లేదంటూ అసంతృప్తి ► విపక్షాలకే ఎక్కువ సమయం ఇచ్చామన్న అధికార పక్షం ► 6వ తేదీ వరకు ఎజెండా ఖరారు.. ► 11న మరోమారు బీఏసీ భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు జనవరి 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈమేరకు తేదీలను పొడిగిస్తూ ఇరు సభల బీఏసీ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాలు ముగిశాక స్పీకర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో ఆయన చాంబర్లో అసెంబ్లీ బీఏసీ భేటీ జరిగింది. ఈ భేటీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, కాంగ్రెస్ పక్ష నేత జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బీజేఎల్పీనేత కిషన్‌రెడ్డి, టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య, సీపీఎం నుంచి సున్నం రాజయ్య హాజరయ్యారు. వచ్చే నెల 11వ తేదీ వరకు సమావేశాలు కొనసాగించాలని భేటీలో నిర్ణయించారు. 3, 4, 5, 6 తేదీల్లో వరుసగా నాలుగు రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. 7, 8 తేదీల (శని, ఆదివారాలు)ను సెలవుగా ప్రకటించారు. తర్వాత 9, 10, 11 తేదీల్లో సమావేశాలు నిర్వహిస్తారు. ఇక 11వ తేదీన మరోమారు భేటీ కావాలని, అవసరమైతే సంక్రాంతి వరకు సమావేశాలు జరిపే విషయంలో నిర్ణయం తీసుకుందామని బీఏసీ నిర్ణయించింది. ఇక జనవరి 6వ తేదీ వరకు వరకు సభలో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేశారు. జనవరి 3న మత్స్య సంపద అభివృద్ధిపై, 4న ఫీజు రీయింబర్స్మెంట్, 5న సింగరేణి, 6న ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్, ఎస్సీలకు మూడెకరాల భూపంపిణీ అంశాలపై చర్చ చేపట్టనున్నారు. ఇంకా బీసీ, మైనారిటీ సంక్షేమం, కేజీ టు పీజీ, శాంతి భద్రతలు, స్వయం సహాయక సంఘాలు తదితర అంశాలపైనా చర్చించనున్నా తేదీలు ఖరారు కాలేదు. విపక్షాలకు అవకాశమివ్వడం లేదు: జానారెడ్డి శాసనసభలో తమకు సరిగా అవకాశం ఇవ్వడం లేదని బీఏసీ సమావేశంలో సీఎల్పీ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు పదే పదే జోక్యం చేసుకుంటున్నారని.. వారిని స్పీకర్, సీఎంలు వారించడం లేదని పేర్కొన్నారు. సభలో విపక్షాలకు కనీసం నిరసన తెలిపే అవకాశమివ్వడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్... విపక్షాలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని అంగీకరించారు. నిరసన తెలపడం, వాకౌట్ చేసే అవకాశం ఉంటుందని, ఇందుకోసం విపక్షాలకు సమయం ఇవ్వాల్సిందేనని... దానిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 12.36 గంటలు మాట్లాడితే... అధికార పక్షం కేవలం 9 గంటలు మాత్రమే మాట్లాడిందని అధికారపక్షం బీఏసీ భేటీలో వివరించింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. భూసేకరణ చట్టం విషయంలో సీఎం మాట్లాడిన భాషపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. అది తన భాష అని సీఎం కేసీఆర్ వివరించారు. ఇక మంత్రులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. ఎవరైనా సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు మంత్రులు మధ్యలో జోక్యం చేసుకుంటూ అడ్డు తగులుతున్నారని, అలా రావొద్దని విపక్షాలు పేర్కొన్నాయి. ఆయా అంశాలపై నిరసన తెలిపే అవకాశమివ్వాలని కోరాయి. ప్రభుత్వ అంశాలనే ఎజెండాలో పెడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశాయి. పార్టీ ఫిరాయింపులపై తేల్చండి బీఏసీ భేటీలో పార్టీ ఫిరాయింపుల విషయాన్నీ తేల్చాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ఈ అంశాన్ని ప్రత్యేకంగా లేవనెత్తారు. అయితే ఆ అంశం కోర్టులో ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. అయినా మెజారిటీ సభ్యులు విలీనమయ్యారని, చట్టంలో ఆ వెసులుబాటు ఉందని వ్యాఖ్యానించారు. భూసేకరణ చట్టంపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. అది చట్టమేనని, సవరణ కాదని తెలిపారు. మండలి బీఏసీ భేటీ కూడా.. శాసన మండలిలోనూ చైర్మన్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు, చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కాంగ్రెస్ నుంచి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బీజేపీ సభ్యుడు రాంచంద్రరావు, ఎంఐఎం తరఫున రిజ్వీ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభతో పాటు మండలి సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఎన్ని రోజులైనా సభ నిర్వహిస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయినా అవకాశం ఇస్తలేవు కదా..! అసెంబ్లీ బీఏసీ భేటీలో జానారెడ్డి, కేసీఆర్ మధ్య సరదా సంభాషణ జరిగింది. జానారెడ్డి వేసుకున్న డ్రెస్‌ను చూస్తూ.. ‘ప్రధాని మోదీలా డ్రస్ వేశారు అన్నా..’అని సీఎం కేసీఆర్ పేర్కొనగా... ‘అయినా కూడా అవకాశం ఇస్తలేవ్ కదా ..’అని జానా సెటైర్ వేశారు. -
'కొత్త జిల్లాల ప్రకటనను వాయిదా వేయాలి’
హైదరాబాద్: శాసనసభలో చర్చించి, నిర్ణయం తీసుకునే వరకు జిల్లాల విభజనపై తుది ప్రకటనను వాయిదా వేయాలని బీజే ఎల్పీనేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. ప్రజాస్వామ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం విశ్వాసమున్నా జిల్లాల ఏర్పాటు ఏకపక్షంగా జరపొద్దన్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో వీటిపై అసెంబ్లీలో చర్చించకుండా జిల్లాల ప్రకటన చేయవద్దని గట్టిగా సూచించారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాలులో విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 20 నుంచి పది పనిదినాలు అసెంబ్లీ జరిగే విధంగా స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించగా, దానిని కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని ప్రొరోగ్ చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. దీనిపై బీఏసీలో, ఇతర పక్షాలతో చర్చించకుండా సీఎం ఇచ్చిన మాటను ఆయనే ఉల్లంఘించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని, శాసనసభ వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ధ్వజమెత్తారు. స్పీకర్‌ను అవమానించేలా వ్యవహరించిందన్నారు. అసెంబ్లీ ద్వారా కాకుండా ఆర్డినెన్స్‌ల ద్వారా భూసేకరణ చట్టానికి సవరణలు, బీసీ కమిషన్ ఏర్పాటు, నిజామాబాద్,కరీంనగర్ కమిషనరేట్ల ఏర్పాటునకు ప్రభుత్వం ఈ చర్యకు దిగిందన్నారు. పార్టీ పిరాయింపులపై హైకోర్టు చేసిన సూచనలను స్పీకర్ పరిగణలోకి తీసుకుని సముచిత నిర్ణయం తీసుకోవాలన్నారు. హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా ఉంది.. రోడ్లు పూర్తిగా దెబ్బతిని, వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా తయారైందని కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ రోడ్లు నరకానికి దారులుగా మారాయన్నారు. మున్సిపల్ మంత్రి ఉత్తర కుమార ప్రగల్భాల మాదిరిగా రోడ్లను అదిచేస్తాం ఇది చేస్తామన్నారే తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. వంద రోజుల్లో మొత్తం పరిస్థితిని మార్చేస్తామని, రోడ్లను అద్దంగా మారుస్తామని మంత్రి చెప్పారన్నారు. కొత్త రోడ్లు వేయడం మాట అటుంచి, కనీసం రోడ్లపై పడిన గుంతలను పూడ్చడానికి ఏమైందని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం లేదా మంత్రి వైఫల్యమా లేక జీహేచ్ఎంసీ యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదా అని నిలదీశారు. -
బీఏసీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
హైదరాబాద్ : ఏపీ బీఏసీ( ఆంధ్రప్రదేశ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్) సమావేశం గురువారమిక్కడ ప్రారంభం అయింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల ఎజెండాను బీఏసీ భేటీలో ఖరారు చేయనున్నారు. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ మూడురోజుల పాటు రోజుకు పది గంటలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే 13 అంశాలపై చర్చ జరపాలని నిర్ణయం తీసుకుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకూ, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. అయితే వైఎస్ఆర్ సీపీ ...సభలో 36 అంశాలపై చర్చకు పట్టుబట్టింది. అధికార పక్షం మాత్రం అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులకు మించి జరపలేమని తెలిపింది. అధికారపక్షం నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి బీఏసీ నుంచి వాకౌట్ చేశారు. -
‘మల్లన్నసాగర్, కరువు అంశాలు లేవనెత్తుతాం’
హైదరాబాద్ : తెలంగాణలో నెలకొన్న కరువు అంశంపై చర్చించాలని బీఏసీలో పట్టుపట్టామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. వినాయకచవితి కారణంగా సమావేశాలను కొనసాగించలేకపోతున్నట్లు ప్రభుత్వం తెలిపిందన్నారు. గట్టిగా పట్టుబట్టడంతో వచ్చే నెల 20వ తేదీ నుంచి పదిరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రుణమాఫీ, మల్లన్నసాగర్, కరువు వంటి ప్రజా సమస్యలను ఈ సమావేశాల్లో లేవనెత్తుతామని తెలిపారు. -
మల్లన్నసాగర్, కరువు అంశాలు లేవనెత్తుతాం
-
20 నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి పది రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అసెంబ్లీలో మంగళవారం జీఎస్టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశమైంది. ఈ సమావేశంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేశారు. నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించే గణేష్ నిమజ్జనం కార్యక్రమం ఉండడంతో వచ్చే నెల 20 నుంచి సమావేశాలను జరపాలని బీఏసీ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలని విపక్షాలు పట్టుబట్టినప్పటికీ... ప్రభుత్వం 10 రోజులు నిర్వహించేందుకు అంగీకరించింది. దేవాలయాల పాలక మండలి సభ్యుల సంఖ్య పెంపు, సైబరాబాద్ కమిషనరేట్ విభజన, వ్యాట్ ఆర్డినెన్స్‌లను మంగళవారమే సభలో ఆమోదించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. -
తెలంగాణ బీఏసీ సమావేశం
తెలంగాణ శాసన సభ సమావేశాల పొడిగింపు విషయంపై బీఏసీ సమావేశంలో చర్చ జరుగుతోంది. శాసనసభా వ్యవహారాల సలహా సంఘం సమావేశం కొద్ది సేపటి క్రితం అసెంబ్లీ ఆవరణలో ప్రారంభమైంది. అందులో భాగంగా ఈ నెల 30,31 తేదిల్లో శాసనసభ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల అజెండాను సంబంధించిన విషయాలపై చర్చ జరుగుతోంది. -
రేపు తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం ఆదివారం జరగనుంది. ఈ నెల 30, 31న అసెంబ్లీలో చర్చించాల్సిన ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. కొత్త విద్యావిధానం, కరవుపై చర్చ, ఇరిగేషన్ ప్రాజెక్టు, తదితర అంశాలపై సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత చర్చించాల్సిన అంశాలపై బీఏసీ తుది నిర్ణయం తీసుకోనుంది. -
ముగిసిన ఏపీ బీఏసీ సమావేశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సలహా సంఘం(బీఏసీ) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మార్చి 23(హోలి), 25(గుడ్ ఫ్రైడే)లతో పాటు 24వ తేదీని కూడా సెలవుగా పేర్కొంటూ బీఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం సభను రెండు పూటలా నిర్వహిచాలని బీఏసీ నిర్ణయించింది. సమావేశాలను యథావిధిగా ఈ నెల 30 వరకు నిర్వహించాలని శాసన సభ సలహా సంఘం నిర్ణయం తీసుకుంది. -
అవిశ్వాసంపై ఈరోజే చర్చ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై సోమవారమే అసెంబ్లీలో చర్చించనున్నారు. ఏడు గంటల పాటు ఈ తీర్మానంపై చర్చ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం విధాన ప్రకటనలు చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి, అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు మీడియా పాయింట్లో ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై సోమవారం చర్చించాలన్న అంశాన్ని అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ప్రజా సమస్యల పరిష్కారంలోను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోను అధికార పక్షం ఘోరంగా విఫలమైందంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టారు. దీనికి తగినంత మంది సభ్యుల మద్దతు లభించడంతో చర్చను చేపట్టేందుకు అనుమతి లభించినట్లయింది. బీఏసీ సమావేశంలో ఈ అంశం గురించి చర్చించనున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం జరిగిన బీఏసీ భేటీలో.. అవిశ్వాసంపై సోమవారమే చర్చించాలని నిర్ణయించారు. -
సర్కారు కొత్త సంప్రదాయం
ఆదివారాల్లోనూ అసెంబ్లీ సమావేశాలు సాక్షి, హైదరాబాద్: ఆదివారం అంటే అందరికీ ఆటవిడుపు.. సెలవు దినం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివారం అచ్చొచ్చినట్లుంది. ఇటీవల వరుసగా మంత్రివర్గ భేటీలను ఆదివారం నిర్వహిస్తున్న ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా ఆదివారం కొనసాగించే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలతో చర్చించి ఆమోద ముద్ర కూడా వేయించింది. ఈనెలాఖరు వరకు జరిగే బడ్జెట్ సమావేశాల వ్యవధిలో వచ్చే మూడు ఆదివారాలను పనిదినాలుగా గుర్తించడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం కేబినెట్ మీటింగ్‌లతో పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ప్రతిపాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో అసెంబ్లీకి శని, ఆదివారాలు సెలవులుండేవి. ఈ రెండ్రోజులు ఉద్యోగులకు సెలవు దినాలు కాగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాలకు వెళ్లే వీలుండేది. కానీ తాజా నిర్ణయంతో ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు వీరందరూ పని చేయాల్సిందే. సహజంగానే అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు సాధారణ పరిపాలనా విభాగంతో పాటు సచివాలయ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తారు. అవసరమైన సమాచారంతో నిత్యం అందుబాటులో ఉండాలని ఇప్పటికే సంబంధిత విభాగాల అధికారులు ఉద్యోగులందరికీ సర్క్యులర్ జారీ చేశారు. రాజ్యాంగం ప్రకారం ఏప్రిల్ ఒకటికి ముందే బడ్జెట్‌కు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లు శాసనసభ ఆమోదం పొందటం తప్పనిసరి. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి ప్రభుత్వం నిధులు డ్రా చేయడానికి వీలుండదు. అందుకే సెలవు రోజులతో సంబంధం లేకుండా పదహారు పనిదినాల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాల్సి ఉందని ప్రభుత్వం లెక్కలేసుకుంది. ఈ నేపథ్యంలోనే శని, ఆదివారాలు పనిదినాలుగా మార్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్‌ను ఆమోదించేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రివర్గ భేటీ సైతం రేపు (ఆదివారం) సాయంత్రమే జరగనుండటం కొసమెరుపు. -
ముగిసిన బీఏసీ సమావేశం, 16 రోజులే అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కేవలం 16 పనిదినాల పాటు మాత్రమే నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈనెల 30వ తేదీ వరకు సమావేశాలు ఉంటాయని తెలిపారు. అసెంబ్లీ కార్యకలాపాల షెడ్యూలును నిర్ణయించేందుకు బీఏసీ సమావేశం అసెంబ్లీలో శనివారం జరిగింది. ఈనెల 10వ తేదీనే సాధారణ, వ్యవసాయ బడ్జెట్లు రెండూ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 9వ తేదీన సమాధానం ఇస్తారు. బడ్జెట్‌పై చర్చకు ఈనెల 17న ఆర్థికమంత్రి సమాధానం ఇస్తారు. సమావేశాలు ఈనెల 30 వరకు ఉంటాయని ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు తెలిపారు. క్వశ్చన్ అవర్, జీరో అవర్ తర్వాతే వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాలని స్పీకర్ సూచించారని ఆయన చెప్పారు. వైఎస్ఆర్సీపీ తరఫున ఈ సమావేశానికి హాజరైన సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్‌రెడ్డి సమావేశాలను 40 రోజుల పాటు నిర్వహించాలని గట్టిగా పట్టుబట్టారు. 25 ప్రధానాంశాలపై చర్చ జరగాలని వైఎస్ఆర్సీపీ సూచించింది. తాము 40 రోజులు అసెంబ్లీ ఉండాలని సూచించినా అధికారపక్షం పట్టించుకోలేదని సమావేశం అనంతరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకే వాయిదా తీర్మానాల ప్రతిపాదన సమావేశాల మొదట్లోనే ఉండాలని తాము పట్టుబట్టామన్నారు. రూల్స్ కమిటీలో సవరణలు ఏవీ జరగలేదు కాబట్టి, మునుపటిలాగే వాయిదా తీర్మానాలను చేపట్టాలని కోరామన్నారు. ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. -
22వ తేదీ వరకే అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. తాము ముందుగా నిర్ణయించిన మేరకు ఐదు రోజులపాటు మాత్రమే సభను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన గురువారం బీఏసీ సమావేశం జరిగింది. సమావేశంలో వైఎస్సార్సీపీ తరఫున జ్యోతుల నెహ్రూ, గడికోట శ్రీకాంతరెడ్డి, ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, బీజేపీ తరపున పి. విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు. శాసనసభ సమావేశాలను 15 రోజుల పాటు జరపాలని వైఎస్సార్సీఎల్పీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. బీఏసీ జరగక మునుపే అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులే నిర్వహిస్తామని కొందరు మంత్రులు వెల్లడించిన విషయాన్ని జ్యోతుల నెహ్రూ స్పీకర్ దృష్టికి తెచ్చారు. మంత్రి యనమల గాని, స్పీకర్ గాని సరైన సమాధానం ఇవ్వలేదు. బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు కూడా సమావేశాలను కనీసం 15 రోజులు జరపాలని సూచించారు. ప్రభుత్వం మాత్రం అంగీకరించలేదు. ఐదు రోజుల పాటు 22 వరకూ జరిగే సమావేశాలను సద్వినియోగం చేసుకుంటే అన్ని అంశాలను చర్చించవచ్చన్నారు. కాల్‌మనీ తొలి ప్రాధాన్యంగా తీసుకోండి... కాల్‌మనీ-సెక్స్ రాకెట్ అంశాన్ని తొలి ప్రాధాన్యతగా చర్చ చేపట్టాలని వైఎస్సార్సీపీ కోరింది. తాము 344 నిబంధన కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని ఆ పార్టీ నేతలు కోరారు. ఐతే చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు ఈ నిబంధన కింద తొలుత అధికార పక్షానికి అవకాశం వస్తుందని చెప్పారు. సీఎం జోక్యం చేసుకుని కాల్‌మనీ వ్యవహారంపై 18వ తేదీన తానే ప్రకటన చేస్తున్నానని, ప్రతిపక్షం వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే సమర్పిస్తే వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. 15 అంశాలపై చర్చను కోరిన విపక్షం... కాల్‌మనీ-సెక్స్ రాకెట్, వ్యవసాయం-రైతాంగ సమస్యలు, కరవు, వరదలు, మొలకెత్తిన ధాన్యం కొనుగోళ్లు, బాక్సైట్ తవ్వకాలు, కల్తీ మద్యం మరణాలు- మద్యం విధానం, నిరుద్యోగం-భృతి, ఉద్యోగాల భర్తీ, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, కృష్ణా జలాలు, ప్రాజెక్టులు-అంచనా వ్యయం పెంపు-జీవో 22, రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ, ఇసుక అక్రమరవాణా-అధికారులపై టీడీపీ దాడులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్థానిక సంస్థలు-జన్మభూమి కమిటీలు, భూకేటాయింపులు, అంగన్వాడీ, వీఆర్ఏ-ఆశావర్కర్ల సమస్యలు, రుణాల మాఫీ వంటి అంశాలను సభలో చర్చించాలని వైఎస్సార్సీపీ కోరింది. -
ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహారిస్తోంది: జ్యోతుల నెహ్రూ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం జరిగిన బీఏసీ (శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ) సమావేశంలో 15 అంశాలపై చర్చించాలని బీఏసీలో లేవనెత్తామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు చెప్పారు. ఐదురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగాలని నిర్ణయం తీసుకోగా.. తాము ఎక్కువ రోజులు నడపాలని కోరామని ఆయన అన్నారు. తమతో పాటు బీజేపీ కూడా సమావేశాలు పొడిగించాలని కోరినట్టు జ్యోతుల చెప్పారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలను అధికార పార్టీ టీడీపీ మాత్రం కేవలం 5 రోజులే సభను పరిమితం చేసిందన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని జ్యోతుల నెహ్రు విమర్శించారు. -
ముగిసిన బీఏసీ సమావేశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం ప్రారంభమైన బీఏసీ (శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ) సమావేశం ముగిసింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఐదురోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే 17 అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని వైఎస్సార్ సీపీ కోరింది. 10 అంశాలపై చర్చించాలని టీడీపీ కోరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం(రేపు) కాల్‌మనీ-సెక్స్రాకేట్పై ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. కాగా, ఈ బీఏసీ సమావేశంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు హాజరు కాగా, వైఎస్ఆర్ సీపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
ప్రారంభమైన బీఏసీ సమావేశం
-
ప్రారంభమైన బీఏసీ సమావేశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం బీఏసీ (శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ) సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన సమావేశం ఐదురోజుల పాటు జరిగే శీతాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. ఈ బీఏసీ సమావేశంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు హాజరు కాగా, వైఎస్ఆర్ సీపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
ఏపీ శాసనసభ 9.30.. మండలి 10 గంటలకు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు నేటినుంచి ఐదురోజుల పాటు జరుగనున్నాయి. గురువారం ఉదయం 8.45 గంటలకు బీఎసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఒకరోజు పొడిగింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఉదయం 9.30 గంటలకు శాసన సభ ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రారంభం కానుంది. -
వాడివేడిగా అసెంబ్లీ
- వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై చర్చకు ఎంఐఎం పట్టు - రైతు సమస్యలకే పరిమితమవుదాం: సీఎం సూచన - ఎజెండాలో రైతు ఆత్మహత్యలు అన్న పదం లేకపోవడంపై జానా అభ్యంతరం - సమస్యపై చర్చల్లో ఏదైనా మాట్లాడొచ్చు: అధికారపక్షం సాక్షి, హైదరాబాద్: రెండోరోజు శాసనసభా సమావేశాలు వాడివేడిగా ఆరంభమయ్యాయి. మంగళవారం సమావేశం ఆరంభం కాగానే స్పీకర్ మధుసూదనాచారి రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతుల అంశంపై చర్చను ఆరంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ లేచి, తాము వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై వాయిదా తీర్మానం ఇచ్చామని, దీనిపై చర్చ జరపాలని కోరారు. 23న జరిగిన బీఏసీ సమావేశంలో ప్రశ్నోత్తరాలను రద్దుచేస్తామని చెప్పారే తప్ప, రైతుల ఆత్మహత్యలపై చర్చిస్తామనలేదన్నారు. ఇప్పుడు ప్రశ్నోత్తరాలను రద్దు చేసినందున వికార్ ఎన్‌కౌంటర్‌పై చర్చిద్దామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జోక్యం చేసుకుంటూ ‘ఈ రోజు ఇతర అంశాలను చర్చ చేయలేం. కేవలం రైతు సమస్యలపై మాత్రమే చర్చిద్దామని చెప్పాం. రెండ్రోజులు దానిపైనే చర్చిద్దాం’ అన్నారు. సీఎం ప్రకటనపైనా అక్బరుద్దీన్ అభ్యంతరం చెప్పడంతో మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకొని ప్రభుత్వ పక్షాన సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా అక్బరుద్దీన్ పట్టువీడక పోవడంతో కేసీఆర్ మరోమారు కల్పించుకొని ‘ వికార్ ఎన్‌కౌంటర్‌పై తర్వాత రోజున చర్చిద్దాం.. ప్రస్తుతానికి కూర్చోండి’ అని కోరడంతో అక్బర్ శాంతించారు. అనంతరం ప్రతిపక్షనేత కె.జానారెడ్డి లేచి ఎజెండాలో కేవలం రైతుసంక్షేమం అంశాన్నే చేర్చారని, ఆత్మహత్యలు, రుణమాఫీ,కరువు పరిస్థితులను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. దీనిపై మళ్లీ హరీశ్ స్పందిస్తూ, ‘గతంలోనూ నేరుగా రైతుల ఆత్మహత్యల అంశాన్ని ఎజెండాలో ఎక్కడా చేర్చలేదని చెప్పుకొచ్చారు. రైతు ప్రాధాన్యత దృష్ట్యా మొదటిరోజే చర్చకు పెట్టామని, దీనిపై మాట్లాడితే ఆత్మహత్యల పాపమంతా కాంగ్రెస్‌దే అని తేలుతుంది’ అని అన్నారు. శాశ్వత పరిష్కారాలు వెతుకుదాం: సీఎం పరస్పర నిందారోపణ కాకుండా సమస్యను లోతుగా చర్చించి శాశ్వతపరిష్కారాలు వెతుకుదామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతు సమస్యలపై చర్చలో ఎవరైనా ఏ అంశంపైనయినా స్వేచ్ఛగా మాట్లాడవచ్చని సూచించారు. -
10 వరకు అసెంబ్లీ
* బీఏసీ సమావేశంలో నిర్ణయం * 10 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు * నేటి నుంచి సోమవారం దాకా సెలవులు * 29న రైతు ఆత్మహత్యలు, వ్యవసాయంపై చర్చ * ప్రశ్నోత్తరాల సమయం గంటన్నరకు పెంపు * ఆ తర్వాతే వాయిదా తీర్మానాలు * పార్టీ ఫిరాయింపులపై చర్చించాలన్న ఎర్రబెల్లి * దీనిపై గతంలో ఎన్నడూ చర్చించలేదని, ఈసారీ అంగీకరించబోమన్న మంత్రి హరీశ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 10వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సభను జరపాలని నిర్ణయించింది. మొత్తంగా పది రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. గురువారం (24వ తేదీ) నుంచి 28 వరకు, అక్టోబర్ 2 నుంచి 4 వరకు సెలవులుగా ప్రకటించారు. అక్టోబర్ 5 నుంచి 10 వరకు వరుసగా ఆరు రోజుల పాటు సభ జరగనుంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మృతికి సభ సంతాపం తెలిపింది. నేతల సంతాప సందేశాల తర్వాత స్పీకర్ మధుసూదనాచారి సభను ఈనెల 29కి వాయిదా వేశారు. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం జరిగింది. రైతు ఆత్మహత్యలపై అవసరమైతే రెండ్రోజులు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై బీఏసీ సుమారు గంటపాటు చర్చించింది. సమావేశంలో పాల్గొన్న సభ్యుల నుంచి అందిన సమాచారం మేరకు.. ప్రతిరోజూ నిర్వహించే ప్రశ్నోత్తరాల సమయాన్ని గంటన్నరకు పెంచాలని నిర్ణయించారు. వాయిదా తీర్మానాలను కూడా ప్రశ్నోత్తరాల సమయం తర్వాతే ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇందుకు టీడీపీ అంగీకరించలేదు. 29వ తేదీన ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ రంగంపై చర్చిస్తారు. ఒకరోజు సమయం సరిపోకపోతే మరో రోజు కూడా చర్చకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇవే కాకుండా సాగునీటి ప్రాజెక్టులు, రీ డిజైనింగ్, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు, పారిశ్రామిక పాలసీ, విద్యుత్, విషజ్వరాలు, వైద్యసేవలు, తదితర అంశాలపై సమావేశాల్లో చర్చించనున్నారు. వివిధ రంగాల్లో ప్రభుత్వం చేస్తున్న కృషిని సభా వేదికగా ప్రజలకు వివరించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. ఫిరాయింపులపై చర్చించలేం.. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఫిరాయింపులపై చర్చకు ప్రభుత్వం అంగీకరించలేదు. బీఏసీ సమావేశంలో ఈ అంశాన్ని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి లేవనెత్తారు. అయితే ఫిరాయింపుల అంశాన్ని గతంలో ఎన్నడూ సభలో చర్చించలేదని, ఈసారి కూడా చర్చకు అంగీకరించమని మంత్రి హరీశ్‌రావు అన్నట్లు సమాచారం. ఇదే అభిప్రాయాన్ని సీఎల్పీ నేత జానారెడ్డి కూడా వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమకు ముందు వరుసలో రెండు సీట్లు కేటాయించాలని ఎర్రబెల్లి వాదనకు దిగగా.. బీఏసీ సమావేశం నిర్వహిస్తోంది సీట్ల కేటాయింపు కోసం కాదని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. సీట్ల కేటాయింపుపై స్పీకర్, శాసనసభ కార్యదర్శిని సంప్రదించాలని, ప్రతిపక్షాలు చెప్పినట్లు చేయడానికి ప్రభుత్వం లేదని సీఎం కేసీఆర్... ఎర్రబెల్లికి చురకేసినట్లు తెలిసింది. ఏవైనా డిమాండ్లు ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. తమపై మంత్రులు ఎదురు దాడి చేస్తున్నారని, ఒకేసారి ముగ్గురు ముగ్గురు సమాధానాలు ఇస్తున్నారని, మంత్రులను సీఎం కంట్రోల్ చేయాలని ఎర్రబెల్లి పేర్కొనగా.. ‘‘మీ వాళ్లు అయిదారుగురు లేసి మాట్లాడితే, మంత్రులు అలా సమాధానం ఇవ్వక ఏం చేస్తారు..’’ అని సీఎం అన్న ట్లు సమాచారం. సభలో చర్చ సక్రమంగా జరగాలని, సభ జరగకుండా గొడవ చేస్తే ప్రభుత్వం ఊరుకోద న్న అంశంపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. బీఏసీ భేటీలో సీఎం కేసీఆర్‌తోపాటు, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు, మం త్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌తోపాటు సీఎల్పీ నేత జానారెడ్డి, చిన్నారెడ్డి(కాంగ్రెస్), ఎర్రబెల్లి దయాకర్‌రావు(టీడీపీ), అక్బరుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం), లక్ష్మణ్(బీజేపీ), పాయం వెంకటేశ్వర్లు (వైఎస్సార్సీపీ), సున్నం రాజయ్య (సీపీఎం), రవీంద్ర కుమార్ (సీపీఐ) పాల్గొన్నారు. -
అక్టోబర్ 10 వరకు అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలను వచ్చే 10 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రధానంగా చర్చించాలన్న విపక్షాల డిమాండ్ కు ప్రభుత్వం అంగీకరించింది. సెస్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 10 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 2, 3, 4 తేదీల్లో సెలవు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. గంటన్నరపాటు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఈరోజు సమావేశమైన అసెంబ్లీ 28వ తేదీ వరకు వాయిదా పడింది. తిరిగి అసెంబ్లీ ఈనెల 29న మొదలుకానుంది. అదే రోజు రైతు ఆత్మహత్యలపై చర్చించనున్నారు. -
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
-
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
తొలిరోజు సంతాప తీర్మానం.. వాయిదా * తర్వాత 5 రోజులు సెలవు.. తిరిగి 29న ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇటీవల ఆకస్మికంగా మృతిచెందిన మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డికి తొలిరోజున సంతాపం ప్రకటిస్తారు. సంతాప తీర్మానంపై ఆయా పక్షాల నేతలు మాట్లాడిన అనంతరం సభ వాయిదా పడుతుంది. ఈ మేరకు టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ వివరించినట్లు సమాచారం. అనంతరం బీఏసీ సమావేశం జరిగే వీలుంది. అయితే 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సెలవుగా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తిరిగి అసెంబ్లీ 29న మొదలుకానుంది. ఎన్ని రోజులు సమావేశాలు జరుగుతాయన్నది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. -
'అవసరమైతే ఒక పూట పొడిగిస్తాం'
హైదరాబాద్: ఏపీ శాసనసభ సమావేశాలను ఐదు రోజులపాటు నిర్వహించాలని బీఏసీ( ఆంధ్రప్రదేశ్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో నిర్ణయించినట్టు ప్రభత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అయితే ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు జరపాలని విపక్షం కోరినట్టు ఆయన తెలిపారు. దీంతో అవసరమైతే ఒకపూట పొడిగించేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పై సీఎం చంద్రబాబు ప్రకటన చేస్తారని కాల్వ వెల్లడించారు. ఈ బీఏసీ సమావేశంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వైఎస్ఆర్ సీపీ నుంచి ఎమ్మోల్యేలు జ్యోతుల నెహ్రో, శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. -
ప్రారంభమైన ఏపీ బీఏసీ సమావేశం
-
ప్రారంభమైన ఏపీ బీఏసీ సమావేశం
హైదరాబాద్ : ఏపీ బీఏసీ( ఆంధ్రప్రదేశ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్) సమావేశం సోమవారమిక్కడ ప్రారంభమైంది. ఈ సమావేశంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు....వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్లొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి అయిదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. -
గరంగరంగా బీఏసీ
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామంపై స్పీకర్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఉభయసభలను ఉద్దేశించి శనివారం గవర్నర్ నరసింహన్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ వాయి దా పడింది. ఆ తర్వాత దాదాపు గంట న్నరసేపు బీఏసీ సమావేశం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయగీతం ఆలపిస్తుండగా అనుచితంగా ప్రవర్తించిన సభ్యులపై చర్య తీసుకోవాలన్న ప్రతిపాదనతో ఈ భేటీ మొదలైనట్లు సమాచారం. గంట పాటు ఇదే అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. సభలో జాతీయగీతం ఆలపిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి టేబు ళ్లు ఎక్కి గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై స్పీకర్ చర్య తీసుకోవాలన్న వాదన బీఏసీలో బలంగా వినిపించింది. అయి తే తమ సభ్యులపై దాడి చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని, అది తేలాకే మరో అంశాన్ని చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. ఈవివాదాన్ని ముగించేందుకు ముం దుగా ఫ్లోర్‌లీడర్లకు వీడియో దృశ్యాలను చూ పించాలని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ సభ్యులు డిమాండ్ చేశారు. కాగా, జాతీయగీతాన్ని అవమానపరిచిన సభ్యులు బేషరతు గా క్షమాపణ చెప్పాలని, లేదంటే వారిని సస్పెండ్ చేయాలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా, వీడియో దృశ్యాలను చూ పించే విషయంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు చెప్పగా.. స్పీకర్‌పై తమకు నమ్మకం లేద ని టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్ర బెల్లి దయాకర్‌రావు అన్నట్లు తెలిసింది. టీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయని ఆయన నిరసన తెలిపినట్లు సమాచారం. మంత్రి తలసానిపై అనర్హత వేటు వేసే దాకా తమ నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పినట్లు తెలిసింది. కాగా, సాంకేతిక అంశాలను చూపెట్టి పార్టీలపై ఒత్తిడి పెంచొద్దని, సమావేశ తేదీలను హడావుడిగా ఎందు కు నిర్ణయించారని బీజేపీఎల్పీ నేత లక్ష్మణ్ పేర్కొన్నట్లు తెలిసింది. 26, 27 తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లు బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరు కాలేదు. సమావేశం మొదలవడానికి ముందే ఆయన స్పీకర్‌ను కలిసి మాట్లాడి వెళ్లిపోయారు. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీ దాకా సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై 9, 10 తేదీల్లో చర్చ ఉంటుంది. 11వ తేదీన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 2015-16 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. 12వ తేదీన సెలవు ప్రకటించారు. 13, 14, 16 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. 17వ తేదీన ఆర్ధిక మంత్రి సమాధానం, 18, 19, 20, 23, 24, 25 తేదీల్లో ఆరు రోజులపాటు పద్దులపై చర్చ, ఓటింగ్ ఉంటాయి. 26న ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెడతారు. అదే రోజు ప్ర భుత్వ బిల్లులు, ఆర్డినెన్సులను ప్రవేశ పెడతారు. 27న శాసనమండలిలో ద్రవ్య విని మయ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. 15, 21, 22 తేదీలను సెలవుగా నిర్ణయించారు. ఒక వేళ విపక్షాలు పట్టుబడితే మరో రెండు రోజుల పాటు సభను జరపడానికి ప్రభుత్వానికి ఎ లాంటి అభ్యంతరం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నట్లు సమాచారం. కనీసం ఐదు రోజులు వర్కింగ్ లంచ్‌తో సభా సమయాన్ని పొడి గించడానికి మంత్రి సుముఖత తెలిపినట్లు తెలిసిం ది. వాయిదా తీర్మానాలను ప్రశ్నోత్తరాల తర్వాతనే చేపట్టాలని కూడా నిర్ణయించారు. సమావేశాల ప్రత్యక్ష ప్రసారానికి పాత పద్ధతినే అవలంభిస్తున్నట్లు హరీశ్ పేర్కొన్నారు. ఇక ఉద యం 9.30 గంటలకే సమావేశాలు మొదలుపెట్టాలని విపక్షాలు కోరడంతో దీనిపై నిర్ణయాన్ని స్పీకర్ పెండింగులో పెట్టారు. ఈ భేటీ లో సీఎల్పీ నుంచి మల్లు భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, సీపీఎం నుంచి సున్నం రాజయ్య, సీపీఐ నుంచి రవీంద్రకుమార్ పాల్గొన్నారు. -
హేళన చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు బీఏసీ సమావేశంలో ప్రతిపక్షాన్ని హేళన చేసే విధంగా వ్యవహరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ప్రారంభమవుతున్నా అసెంబ్లీ సమావేశాల్లో తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతి, పెషావర్ కాల్పుల్లో మృతులపై సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. హుదూద్ తుపాన్లో చనిపోయిన మృతులు, కరువు కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా సభలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టాలని తాము కోరగా... ఆ సంప్రదాయం లేదని చంద్రబాబు తోసిపుచ్చారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు సజావుగా జరగకుంటే ప్రతిఘటిస్తామని ప్రభుత్వాన్ని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. అవి 23వ తేదీతో ముగియనున్నాయి. -
ఏపీ శాసనసభ బీఏసీ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ వ్యవహారాల సమావేశం స్పీకర్ కోడెల శివప్రసాద రావు అధ్యక్షతన గురువారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీడీపీ తరుపున సీఎం చంద్రబాబు, కాల్వ శ్రీనివాసులు ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జ్యోతుల నెహ్రు, శ్రీకాంత్‌రెడ్డి... బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. ఈ సమావేశాలు 23వ తేదీతో ముగియనున్నాయి. -
18న ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం
హైదరాబాద్: ఈ నెల 18వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బీఏసీ సమావేశం జరగనుంది. ఐదు రోజుల పాటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు తిరుపతి ఎమ్యెల్యే వెంకటరమణ మృతికి సంతాపం తెలియజేస్తారు. 18న ఏపీ కేపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. -
శుక్ర,శనివారాల్లో ప్రశ్నోత్తరాలు రద్దు
హైదరాబాద్ : .బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 29 వరకూ శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. అలాగే శుక్ర, శనివారాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. అలాగే ఈనెల 28న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ...చివరి రోజున ప్రాధాన్యత గల అంశాలపై చర్చించనుంది. మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై సభలో నేడు చర్చ జరగనుంది. -
అక్బరుద్దీన్‌కు హరీష్ బుజ్జగింపులు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టడంపై శుక్రవారం సభలో రగడ చోటుచేసుకుంది. పేరు మార్పుపై కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. రాజీవ్ గాంధీ పేరును ఎలా మార్చుతారంటూ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం ఇదే అంశంపై స్పీకర్‌తో అన్ని పార్టీల నేతలు భేటీ అయ్యారు. సభ ప్రారంభం అయిన తర్వాత సీఎం కేసీఆర్ డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తప్పుబడుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని బీజేపీ, టీడీపీ తప్ప మిగత పార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. దాంతో సభలో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేయటంతో మరోసారి సమావేశాలకు అంతరాయం కలిగింది. దాంతో స్పీకర్ అసెంబ్లీని 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా అసెంబ్లీ వాయిదాపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఏసీలో నిర్ణయించిన అంశాలను చర్చించకుండానే సభ వాయిదా వేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. మరోవైపు సోమవారం బీఏసీ సమావేశానికి రావాలని శాసనసభ అధికారులు అన్ని పార్టీలను కోరారు. అయితే బీఏసీ సమావేశానికి వచ్చేది లేదని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. దాంతో బీఏసీ సమావేశానికి హాజరు కావాలని హరీష్ రావు... అక్బరుద్దీన్‌ను బుజ్జగిస్తున్నారు. -
ఈ నెల 22 వరకూ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : ఈ నెల 22వ తేదీ వరకూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బీఏసీ సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వాయిదా అనంతరం సమావేశమైన బీఏసీ పలు అంశాలపై చర్చించింది. నెలాఖరు వరకూ అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా అందుకు ప్రభుత్వం అందుకు నిరాకరించింది. మరోవైపు సభలో ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానాల అంశాన్ని పరిశీలించాలని బీఏసీ భేటీలో నిర్ణయం జరిగింది. అలాగే బడ్జెట్‌పై నాలుగు రోజుల పాటు సాధారణ చర్చ జరగనుంది. కాగా సమావేశాల పొడిగింపుపై బీఏసీ మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం. -
'నీది నోరా.. మోరీనా, నోరు అదుపులో పెట్టుకో'
హైదరాబాద్: తెలంగాణ బీఏసీ సమావేశంలో నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్దం జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం బీఏసీ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా బీఏసీ సమావేశానికి టీడీపీ సభ్యుల హాజరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని బీఏసీకి ఆహ్వానించడాన్ని ఆయన తప్పుబట్టారు. అయితే గతంలో తమ పార్టీ నుంచి ఇద్దరు సభ్యులకు బీఏసీలో పాల్గొనే అవకాశం ఇస్తామని చెప్పారని ఎర్రబెల్లి దయాకరరావు గుర్తు చేశారు. అందుకు తగ్గట్లే ఇద్దరికి అవకాశం ఇవ్వాలని ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి పట్టుబట్టగా అందుకు కేసీఆర్ నిరాకరించారు. సభను ఎలా నడపాలో తమకు తెలుసునని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అందుకు సభలో ఎలా వ్యవహరించాలో తమకూ తెలుసునని రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వగా, బడ్జెట్ కూడా వినే ఓపిక లేనివారికి సభ ఎన్ని రోజులు ఉంటే ఎందుకు? అని కేసీర్ ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎర్రబెల్లి .... నీది నోరా, మోరీ యా అంటూ కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అందుకు కౌంటర్‌గా కేసీఆర్ కూడా లేచి, ఎర్రబెల్లిని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. గొడవ తారస్థాయికి చేరటంతో కాంగ్రెస్ నేత జానారెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్ జోక్యం చేసుకుని సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. -
ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధం: హరీశ్
హైదరాబాద్: తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమన్న శాసనసభలోనే లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టనుండడం గర్వంగా ఉందని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఏ అంశంపై అయినా చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఏయే అంశాలను చర్చకు తీసుకోవాలన్న దానిపై బుధవారం జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు సభ గౌరవం పెంచేలా నడుచుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ను బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తొలి బడ్జెట్ ను ప్రవేశపెడుతామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. -
బీఏసీ సమావేశానికి వైఎస్ జగన్ హాజరు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ విజ్ఞప్తితో సోమవారం ఉదయం బీఏసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై వైఎస్ జగన్ ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. కాగా నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 6వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగుతాయి. 20న సాధారణ బడ్జెట్, 22న వ్యవసాయ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నేడు ప్రభుత్వం మూడు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు సంస్కరణల చట్టంలో సవరణలు, వ్యవసాయ మార్కెటింగ్ చట్టంలో సవరణలు, దేవాదాయ చట్టంలో సవరణలకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. -
'ప్రతిపక్షం గొంతు నొక్కే యత్నం చేస్తున్నారు'
హైదరాబాద్ : శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కే యత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పక్షం, ప్రతిపక్షం.. రెండే పక్షాలు ఉన్నా బీఏసీ సమావేశాని విపక్షం నుంచి ఎంతమందికి అవకాశం ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. బీఏసీలో సభ్యుల నియామకం సక్రమంగా లేదన్నారు. సభలో ప్రవేశపెట్టే తీర్మానాల విషయాలను ముందు సమాచారం ఇస్తే బాగుంటుందని వైఎస్ జగన్ సభలో స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై యనమల రామకృష్ణుడు స్పందిస్తూ తీర్మానాలపై బీఏసీలో చర్చించామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సమావేశానికి రానందున సమాచారం తెలియకపోయి ఉండవచ్చునన్నారు. -
బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్ఆర్ సీపీ
-
బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. బీఏసీలో సముచిత ప్రాధాన్యత కల్పించేవరకూ తాము బీఏసీ సమావేశాలకు హాజరు అయ్యేది లేదని ఆపార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు స్పష్టం చేశారు. సభా సంప్రదాయాలను అధికార పక్షం తుంగలోకి తొక్కిందని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సదుద్దేశంతో సహకరిస్తున్నా... అధికార పక్షంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కేవలం ఇద్దరికే అవకాశం కల్పిస్తామంటూ మొండి వైఖరి అలవంభిస్తున్నారని జ్యోతుల నెహ్రు ధ్వజమెత్తారు. గతంలో పాటించిన సాంప్రదాయాలనే ఇప్పుడు కూడా పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.