హైదరాబాద్: ఏపీ శాసనసభ సమావేశాలను ఐదు రోజులపాటు నిర్వహించాలని బీఏసీ( ఆంధ్రప్రదేశ్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో నిర్ణయించినట్టు ప్రభత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అయితే ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు జరపాలని విపక్షం కోరినట్టు ఆయన తెలిపారు. దీంతో అవసరమైతే ఒకపూట పొడిగించేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పై సీఎం చంద్రబాబు ప్రకటన చేస్తారని కాల్వ వెల్లడించారు.
ఈ బీఏసీ సమావేశంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వైఎస్ఆర్ సీపీ నుంచి ఎమ్మోల్యేలు జ్యోతుల నెహ్రో, శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.