
సాక్షి, అమరావతి : బీఏసీ సమావేశం సాక్షిగా మరోసారి టీడీపీ డ్రామాలు బయటపడ్డాయి. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన మంగళవారం జరిగిన బీఏసీ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సాధ్యం కాని అంశాలను లేవనెత్తాడు. వర్చువల్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే వర్చువల్ అసెంబ్లీ సాధ్యం కాదని, దీనిపై పార్లమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 50 రోజులైనా అంసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. (చదవండి : లైవ్ అప్‌డేట్స్: ఏపీ వ్యవసాయ బడ్జెట్)
‘మేం చేసిన కార్యాక్రమాలను ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 3.98 కోట్ల మందికి వివిధ పథకాల ద్వారా 42 వేల కోట్ల రూపాయలను బదిలీ చేశాం. ఈ విషయాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. బయట పరిస్థితులు అందరికి తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీ నడపాలని టీడీపీ కోరితే మాకు అభ్యంతరం లేదు. ఎన్ని రోజులు నడపాలో అడగండి.. నిర్వహిస్తాం. కాకపోతే వర్చువల్ అసెంబ్లీ సాధ్యం కాదు. దీనిపై పార్లమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అని సీఎం జగన్ స్పష్టం చేయడంతో టీడీపీ ఎమ్మెల్యేలు మౌనంగా ఉండిపోయారు.
(చదవండి : ఏపీ బడ్జెట్ హైలైట్స్)
Comments
Please login to add a commentAdd a comment