AP Assembly Budget Session 2020
-
ఇళ్ల యజ్ఞం పూర్తి చేస్తాం
చరిత్ర ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం వల్ల 30 రకాల వృత్తుల వారికి ఉపాధి లభిస్తోంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి 71 లక్షల టన్నుల సిమెంట్, 7.56 లక్షల టన్నుల స్టీల్, 312 లక్షల టన్నుల ఇసుక, 1,250 కోట్ల ఇటుకలు అవసరం. కార్మికులకు 21.4 కోట్ల పని దినాల ఉపాధి లభిస్తుంది. వృత్తి నైపుణ్య కార్మికులకు అదనంగా మరో 10.60 కోట్ల పని దినాలు లభిస్తాయి. ఇవన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎంతగానో దోహద పడతాయి. రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు సొంతం చేసి తీరతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వివిధ దశల్లో ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేసి, నిరుపేదలందరినీ ఇంటి యజమానులు చేయాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ‘దాదాపు 30.76 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశాం. 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో దశల వారీగా ఇళ్ల నిర్మాణం సాగుతుంది. తొలి దశలో 10,067 కా>లనీల్లో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైంది. రూ.28 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసికట్టుగా ఒక మహాయజ్ఞం చేశాం. ఇందుకోసం 71,811 ఎకరాల భూమిని వివిధ రూపాల్లో సేకరించాం. ఈ భూమి విలువే కనీసం రూ.25 వేల కోట్లు ఉంటుంది. పూర్తి నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తున్న 17,005 కాలనీల్లో మౌలిక వసతుల కోసమే రూ.32,909 కోట్లు వెచ్చించనున్నాం. నిర్మాణాలు పూర్తయితే రూ.4 లక్షల కోట్ల సంపద పేదల చేతుల్లో ఉంటుంది. ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తి సమకూరుతుంది’ అని తెలిపారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా సరే ఈ మిషన్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. అక్కచెల్లెమ్మల ఫొటోతో సహా పట్టాను ఇస్తున్నప్పుడు వారి కళ్లల్లో కనిపించే ఆనందమే తమకు శక్తినిస్తుందని, తమను ముందుకు నడిపిస్తుందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. సొంతింటితో సామాజిక హోదా ► త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక సొంత ఇల్లుతో అక్కచెల్లెమ్మలకు సామాజిక హోదా వస్తుంది. భద్రతతో పాటు భరోసా వస్తుంది. ► ఇటువంటి భద్రత ప్రతి అక్క, చెల్లెమ్మకు ఇవ్వాలని, ఆత్మ విశ్వాసం పెంచే గొప్ప ఆస్తిని వారి చేతిలో పెట్టాలని మా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు కూడా మేలు జరుగుతుంది. ఎమ్మెల్యేలు గర్వపడే పరిస్థితి ► ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరిగితే పెన్షన్ రాలేదనో.. ఇల్లు లేదనో.. ఫలానా పథకం అందలేదనో.. అర్హత ఉన్నా ఇవ్వలేదనో ఇలా.. గతంలో రకరకాల ఫిర్యాదులు వినిపించేవి. ► ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి ఎమ్మెల్యే సగర్వంగా, కాలర్ ఎగరేసుకునే పరిస్థితులు తీసుకువచ్చాం. ప్రతి పథకం పారదర్శకంగా అమలు చేస్తూ లంచాలు, వివక్షకు తావు లేకుండా అందిస్తున్నాం. ► అర్హత ఉంటే చాలు మన పార్టీయా, మరో పార్టీయా అని ఎక్కడా చూడటం లేదు. కులం, ప్రాంతం, మతం, పార్టీ చూడకుండా అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నాం ► 30.76 లక్షల ఇళ్లలో టిడ్కోకు సంబంధించినవి 2.62 లక్షల ఇళ్లు ఉన్నాయి. అందులోనూ అన్ డివైడెడ్ షేర్ అప్ ల్యాండ్ లబ్ధిదారులకు వస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 13 వేల పంచాయతీలు ఉంటే.. మా ప్రభుత్వం కొత్తగా 17,005 కాలనీలు నిర్మిస్తోంది. ► కొన్ని చోట్ల ఆ కాలనీలు చూస్తే.. మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, మేజర్ పంచాయితీల సైజులో కనిపిస్తున్నాయి. ఇవాళ మేం కడుతోంది ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నాం అని చెబుతున్నా. ► ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు సేకరించగలిగాం కాబట్టే కేంద్రం నుంచి కూడా మనకు సహాయం అందుతుంది. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. 17,005 కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్.. తదితర మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ► ఈ మౌలిక సదుపాయాల కోసమే రాబోయే రోజుల్లో రూ.32,909 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. కొన్ని సంవత్సరాల పాటు ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే కార్యక్రమాలు నిర్వహిస్తాం. సకల వసతులు, నాణ్యతతో నిర్మాణం ► గతంలో చంద్రబాబు హయాంలో ఇంటి విస్తీర్ణం గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 215 చదరపు అడుగులు. ఇవాళ మనం కడుతున్న ఇంటి విస్తీర్ణం 340 చదరపు అడగులు. ప్రతి ఇంట్లో బెడ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బాత్రూమ్ కమ్ టాయ్‌లెట్, వరండా.. ఇవన్నీ ఉంటాయి. ► ప్రభుత్వమే దగ్గరుండి తొలుత 20 ఇళ్లు కట్టించింది. ఎంత ఖర్చవుతుందో లెక్క వేసేందుకు ఆ పని చేశాం. ఆ తర్వాత నిర్మాణ వ్యయాన్ని ఏ విధంగా అయినా తగ్గించగలిగితే పేదలకు మెరుగ్గా ఇళ్లు కట్టంచగలుగుతామని రకరకాల ఆలోచనలు చేసి ఒక కార్యాచరణ రూపొందించాం. ► సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ఇంటి తలుపులు, పెయింటింగ్, శానిటరీ, ఎలక్ట్రికల్ పరికరాలు వంటి 14 రకాల నాణ్యమైన సామగ్రిని తీసుకువచ్చాం. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అయితే రివర్స్ టెండరింగ్‌కు ఆస్కారం ఉంటుంది. నాణ్యత కూడా ఉంటుంది. సామగ్రిని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో ధరలు కూడా తగ్గుతాయి. ► ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్ పడుతుంది. మార్కెట్లో సిమెంట్ బస్తా రూ.350 నుంచి రూ.400 ఉంది. సిమెంట్ కంపెనీలతో మాట్లాడి పేదల ఇళ్లకు మాత్రం పీపీసీ సిమెంట్ బస్తా రూ.225, ఓపీసీ బస్తా రూ.235కే సరఫరా చేసేట్లు ఒప్పించాం. ప్రతి లబ్ధిదారుడికి అవసరమైన 20 టన్నుల ఇసుకను కూడా ఉచితంగా డోర్ డెలివరీ చేస్తున్నాం. దాదాపు 7.50 లక్షల టన్నుల స్టీల్‌ను రివర్స్ టెండరింగ్ ద్వారా మార్కెట్ రేటు కన్నా తక్కువకే కొనుగోలు చేశాం. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు ఉచితం ► టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్లను జీ ప్లస్ త్రీ పద్ధతిలో మూడు కేటగిరీల్లో నిర్మిస్తున్నాం. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆ ఇళ్లు కడుతుండగా, వాటిలో 300 చదరపు అడుగుల ఇంటిని పేదలకు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం. ► ఇవే ఇళ్లకు చంద్రబాబు హయాంలో.. ఒక చదరపు అడుగుకు రూ.2 వేల చొప్పున ఒక్కో ఇంటి వ్యయం రూ.6 లక్షలుగా లెక్కేశారు. అందులో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1.50 లక్షలు పోగా, మిగిలిన రూ.3 లక్షలు బ్యాంకు రుణం ఇప్పించే వారు. ఆ రుణం తీర్చేందుకు పేద కుటంబం నెలకు రూ.3 వేల చొప్పున ఏకంగా 20 ఏళ్ల పాటు వాయిదాలు కట్టాల్సి వచ్చేది. ఇవాళ మన ప్రభుత్వం అవే ఇళ్లకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి పేదలకు ఇస్తోంది. ► 365 చదరపు అడుగుల ఇళ్లకు రూ.25 వేల చొప్పున, 430 చదరపు అడుగుల ఇళ్లకు రూ.50 వేల చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. ఆ విధంగా వారికి కూడా మేలు చేస్తున్నాం. టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 1,07,814 ఇళ్లు పూర్తి కాగా, మరో 63,306 ఇళ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ ఇళ్ల పంపిణీని గత జనవరిలో మొదలు పెట్టాం. వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. ఎప్పటికప్పుడు బిల్లులు ► ప్రభుత్వ పని అంటే నాసిరకం అని గతంలో పేరు ఉండేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏ పని చేసినా పూర్తి నాణ్యత ఉంటుందనే పేరు తెచ్చుకున్నాం. పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం. ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ కోసమే ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఒక జాయింట్ కలెక్టర్‌ను నియమించాం. ► అధికారులు, సచివాలయాల్లో ఉన్న ఇంజనీర్లు ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించాలని నిర్దేశించాం. గతంలో ఇళ్లు కట్టిన తర్వాత బిల్లులు రావడం కాదు కదా.. చివరకు ఆ బిల్లులు తయారు చేయడం కూడా గగనమై పోయేది. ఇవాళ సచివాలయాల్లో ఆ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇంటి నిర్మాణం పురోగతిని బట్టి ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు బిల్లులు జనరేట్ చేస్తున్నారు. ఆ వెంటనే సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం. పుట్టగతులు ఉండవనే టీడీపీ కుట్ర ఈ యజ్ఞం పూర్తయితే రాజకీయంగా పుట్టగతులు ఉండవనే ఆందోళనతోనే టీడీపీ ఈ పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ► ఈ మహాయజ్ఞానికి ఆటంకం కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ శాయశక్తులా ప్రయత్నించింది. ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయితే జగన్‌కు ఇంకా మంచి పేరు వస్తుంది.. దీంతో తమ అడ్రస్ పూర్తిగా గల్లంతు అవుతుందన్న భయంతో ఏవేవో కారణాలు చూపుతూ కోర్టులను ఆశ్రయించారు. ► నా నియోజకవర్గం పులివెందులతో పాటు విశాఖపట్నం, ఇతర చోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిపోయింది. ఆ విధంగా ఏడాది పాటు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ► విశాఖపట్నంలో భూముల సేకరణకు హైకోర్టు ఇటీవలే క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నాహాలు చేయండని అధికారులను ఆదేశించాం. ఏప్రిల్‌లో విశాఖపట్నం వెళ్లి 1.80 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వెంటనే ఇళ్ల నిర్మాణం మొదలు పెడతాం. -
భారతదేశంలో ఉత్తమ ఉద్యానవనంగా మన రాష్ట్రమే..!!
-
రూ. 40 వేలకోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేశాం..!!
-
ముగిసిన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రతి సభ్యుడి హక్కులు కాపాడాని నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా హక్కుల కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ సభా హక్కుల కమిటీ భేటీ అయింది. అనంతరం కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుపై ఇటీవల అసెంబ్లీలో ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌పై ఇవాళ విచారణ చేపట్టినట్లు తెలిపారు. వారి వివరణ కోసం పది రోజుల సమయం ఇస్తున్నామని పేర్కొన్నారు. స్పీకర్‌పై చేసిన ఆరోపణలకు సంబంధించి అచ్చెన్నాయుడుపై ఎమ్మెల్యే జోగి రమేష్, శ్రీకాంత్‌రెడ్డి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడుపై సభలో చేసిన తీర్మానం ఆధారంగా రిఫర్ చేశారని కాకాణి తెలిపారు. ఈ అంశంపై చర్చించి వివరణ కోరామని, కమిటీ ముందుకు నాలుగు అంశాలు మాత్రమే వచ్చాయని, వాటిపై విచారణ జరిపామని తెలిపారు. ఈ భేటీలో కమిటీ సభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, మల్లాది విష్ణు, చినఅప్పలనాయుడు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుపై ఇటీవల అసెంబ్లీలో ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌పై కమిటీ విచారణ చేపట్టింది. టీడీపీ ఫిర్యాదులు విచారించలేదన్నది అవాస్తవమని, కమిటీ సమావేశంలో టీడీపీ సభ్యుడు కూడా ఉన్నారన్నారు. ఆ సభ్యులు కూడా తమ నిర్ణయంతో ఏకీభవించారన్నారు. టీడీపీ సభ్యులు కూడా ఫిర్యాదులు చేసిందని తమ దృష్టికి తెచ్చారని, స్పీకర్ ఎప్పుడు రిఫర్ చేస్తే అప్పుడు విచారిస్తామని పేర్కొన్నారు. -
పోలవరం నేనే పూర్తి చేస్తా
సాక్షి, అమరావతి: ‘రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే.. ఆయన కొడుకుగా ప్రాజెక్టును నేనే పూర్తి చేసి తీరుతా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని.. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యాలే అందుకు తార్కాణమన్నారు. బుధవారం శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. 2014 – 2019 మధ్య పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం చేశామని చంద్రబాబు అవాస్తవాలు వల్లె వేశారని.. వాస్తవంగా ఆయన హయాంలో జరిగింది కేవలం 20 శాతం పనులేనని ఎత్తిచూపారు. చంద్రబాబు చేసిన పాపాలను కడిగేస్తూ.. 2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తామని పునరుద్ఘాటించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. పోలవరం ప్రాజెక్టు ఒక కల – స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టు అన్నది ఒక కల. ఏ సీఎం ఈ కలను సాకారం చేయాలని అనుకోలేదు. 2004లో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పోలవరం ప్రాజెక్టును సాకరం చేస్తూ పనులను పరుగులెత్తించారు. ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ కోసం 10,627 ఎకరాలు (86 శాతం) సేకరించారు. కుడి కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. – 2014లో చంద్రబాబు తిరిగి సీఎం అయ్యాక కుడి ప్రధాన కాలువలో సేకరించిన భూమి కేవలం 1,700 ఎకరాలు మాత్రమే. కేవలం 14 శాతం. నిజానికి 2005లో భూసేకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు కోర్టులో కేసులు వేయించి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. – ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ కోసం వైఎస్ హయాంలో 10,342 ఎకరాలు (98 శాతం) భూసేకరణ జరగ్గా, 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక కేవలం 95.32 ఎకరాలు (0.89 శాతం) మాత్రమే సేకరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తెచ్చారు. వైఎస్సార్ కుడి ప్రధాన కాలువను పూర్తి చేయకపోయి ఉంటే.. చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతలతో నీటిని ఎలా తరలించే వారు? ఎక్కడికి తీసుకుపోగలిగేవారు? అప్పుడెందుకు నోరు పెగల్లేదు బాబూ? – 2016 సెప్టెంబరు 7న అరుణ్‌జైట్లీ అర్ధరాత్రి ఢిల్లీలో మీటింగ్ పెట్టి స్పెషల్ ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడు ఆయన పక్కనే టీడీపీ మంత్రి సుజానాచౌదరి, ఎంపీ సీఎం రమేష్, నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉన్నారు. – అదే రాత్రి చంద్రబాబు కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి.. అరుణ్‌జైట్లీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. – 2016 సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ ఒక మెమొరాండంను కేంద్ర జల శక్తి శాఖకు పంపించింది. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటి పారుదల విభాగం పనులకు అయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని అందులో స్పష్టంగా ఉంది. అయినా అప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదు? అదే సమయంలో ఇక్కడ అసెంబ్లీలో నేను ఆ విషయాన్ని ఆ రోజు ప్రస్తావించాను. (ఆ రోజు ఏం మాట్లాడింది వీడియో చూపారు.) – 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి అరుణ్‌జైట్లీ చెప్పిన దాని ప్రకారం పోలవం ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు మాత్రమే వస్తుందని తెలిసినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు. అందులో 2014 ఏప్రిల్ 1కి ముందు చేసిన ఖర్చు రూ.5,500 కోట్లు ఇవ్వం అని, పవర్ హౌస్, తాగునీటి సరఫరా వ్యయం రూ.2,800 కోట్లు ఇవ్వలేమని, కేవలం నీటి పారుదల విభాగం వ్యయం రూ.7,500 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారు? – అసలు ఈ మనిషికి ఇంగ్లిష్ వస్తుందా? రాదా? అన్నది అర్థం కావడం లేదు. ఏ ప్రాజెక్టు పనుల్లో అయినా ధరలు ఒకే విధంగా ఉండవు. ఇదే అంశాన్ని నేను శాసనసభలో లేవనెత్తి, నిలదీసే ప్రయత్నం చేస్తే అప్పటి స్పీకర్ మా గొంతు నొక్కారు. అప్పుడే చంద్రబాబు స్పందించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం జగన్ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.37,883 కోట్లు అవసరం – ఇలాంటి పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చాం. చంద్రబాబు చేసిన పాపాలను కడిగేస్తున్నాం. అన్యాయమైన పరిస్థితులను మారుస్తూ వస్తున్నాం. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసమే రూ.26,585 కోట్లు కావాలి. ఇతర సివిల్ పనులకు రూ.7,174 కోట్లు, పవర్ ప్రాజెక్టుకు మరో రూ.4,124 కోట్లు కావాలి. ఆ విధంగా మొత్తం రూ.37,883 కోట్లు కావాలి. – పోలవరం ప్రాజెక్టులో నెలకొన్న పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. ఒకటికి రెండు సార్లు జల శక్తి మంత్రి, ఆర్థిక మంత్రులను కలిశాం. వాస్తవ పరిస్థితులను వివరించాం. చివరకు వారు 2013–14 ధరలతో ప్రాజెక్టు పూర్తి కాదని అంగీకరించారు. కేంద్రం కూడా దేవుడి దయతో సానుకూలంగా స్పందిస్తోంది. అందుకు కేంద్రానికి కృతజ్ఞతలు. – ఇంటి పెద్దగా చెబుతున్నాను. ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదు. మొత్తం 45.72 మీటర్లు కడతాం. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతాయి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కూడా ఎక్కడా ఆపం. సీడబ్ల్యూసీ ప్రొటోకాల్ ప్రకారమే నీరు నిల్వ చేస్తాం. – తెలుగు జాతి ప్రజల కోరిక మేరకు.. మన ఎమ్మెల్యేల తీర్మానం మేరకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని 100 అడుగుల ఎత్తుతో ప్రాజెక్టు వద్ద ప్రతిష్టిస్తాం. – ప్రాజెక్టు పనుల్లో ఒక్క పైసా కూడా మేం వృథా చేయడం లేదు. గత ప్రభుత్వం బస్సులు పెట్టి, ప్రజలు సందర్శించినట్లు రాసుకుంటూ ఏకంగా రూ.83.45 కోట్లు ఖర్చు చేసింది. (ప్రజలను తీసుకుపోయి జయము..జయము చంద్రన్నా అంటూ చిడతలతో మహిళలు పాడిన పాటల వీడియో ప్రదర్శించారు. ఈ పాట వస్తున్నంత సేపూ సభలో సభ్యులంతా విరగబడి నవ్వారు.) రివర్స్ టెండరింగ్‌లో ఆదా ఇలా.. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని అన్నారు. పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి చంద్రబాబు హయాంలో పిల్చిన టెండర్లను రద్దు చేసి.. యాపిల్ టు యాపిల్ పద్ధతిలో తొలుత రివర్స్ టెండర్లు పిలిస్తే రూ.1,142 కోట్లు ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్ విధానంలో ఆ తర్వాత చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో మరో రూ.201 కోట్లు ఆదా అయ్యాయి. ఆ రెండూ కలిపితే అక్షరాలా రూ.1,343 కోట్లు పోలవరం పనుల్లో ఆదా అయ్యాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జయము.. జయము చంద్రన్నకు రూ.83 కోట్లు ‘పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయిం ది.. రండి.. రండి.. చూసొద్దురు కానీ.. మేమే తీసుకెళ్తాం.. తీసుకొస్తాం.. మంచి భోజనం పెడతాం..’ అంటూ గత ప్రభుత్వ హయాంలో బస్సులు పెట్టి, జనాన్ని తరలించిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. తీరా చూస్తే.. ‘ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుంది వ్యవహారం. పునాదుల్లో ఉన్న ప్రాజెక్టును చూపించి, కీర్తనలు పాడించుకుని తరించిపోయారు అప్పటి (అ)ధర్మ ప్రభువులు. ఇలాంటి సీన్ల కోసం రూ.లక్ష కాదు.. రూ.కోటి కాదు.. ఏకంగా రూ.83.45 కోట్లు ఖర్చు చేశారు. అలా ప్రాజెక్టు వద్దకు తరలించి ‘జయము.. జయము చంద్రన్నా.. అంటూ మహిళలు పాడుతూ భజన చేస్తున్న ఓ పాటకు సంబంధించిన వీడియోను బుధవారం అసెంబ్లీలో ప్రదర్శించినప్పుడు సభ్యులు పొట్ట చెక్కలయ్యేట్లు విరగబడి నవ్వడం కనిపించింది. -
కుట్రతోనే ద్రవ్య బిల్లుకు మోకాలడ్డు
సాక్షి, అమరావతి: శాసన మండలిలో టీడీపీ సభ్యులు కుట్రపూరితంగానే ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అగ్రహం వ్యక్తంచేశారు. స్వయం ప్రకటిత మేధావి, అసెంబ్లీ రూల్స్ బుక్ తానే తయారుచేసినట్లు ఫీలయ్యే యనమల రామకృష్ణుడు.. బిల్లులను మండలిలో అడ్డుకుని తీరుతామని ముందే చెప్పారన్నారు. చంద్రబాబు తీరు అసెంబ్లీలో ఒక రకంగా, మండలిలో ఒక రకంగా ఉందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ► సంఖ్యాబలం ఉందని మండలిలో టీడీపీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. ► నారా లోకేశ్ చౌదరి ప్రోత్సాహంతోనే టీడీపీ సభ్యులు దీపక్‌రెడ్డి, బీద రవిచంద్ర తనపై, మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్‌పై గూండాల్లా దాడి చేశారు. ► ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు లోకేశ్ దాడికి తెగబడ్డారు. ► ప్రజా కోర్టులో చంద్రబాబు ఎప్పటికీ దోషిగా మిగిలిపోతారు. ► గతంలో చైర్మన్ విచక్షణాధికారం అని చెప్పి రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించారు. ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ కూడా అదే రీతిలో ప్రవర్తించారు. ► చైర్మన్ సీట్లో కూర్చొన్న వ్యక్తి టీడీపీ సభ్యులను ఉద్దేశించి ‘మా వాళ్లు’ అని సంబోధించడం ఎంతవరకు సమంజసం? ► తనను ఓడించిన ప్రజల మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే యనమల నిన్న సభలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ► చైనా సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన తెలుగు వ్యక్తి కల్నల్ సంతోష్‌బాబుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, వైఎస్సార్సీపీ తరఫున నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. లోకేశ్ డైరెక్షన్లోనే దాడి చంద్రబాబు, లోకేశ్ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నందుకే చంద్రబాబు తనయుడు లోకే‹శ్ నాయుడు తనపై కక్షగట్టి ప్రవర్తిస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. తిరుమలలో అన్యమత ప్రార్థనలు అంటూ దుష్ప్రచారం చేసిన లోకేశ్‌కు దమ్ముంటే వాటిని నిరూపించాలని ఆనాడు సవాల్ విసిరానని.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కౌన్సిల్ వేదికగా లోకేశ్ దాడులు చేయించారని వెలంపల్లి అన్నారు. ఆర్యవైశ్యుడినని.. మాటల్లో చెప్పలేని విధంగా తనపై దాడి చేశారని గురువారం ఆయన ‘సాక్షి’తో అన్నారు. ల్యాండ్ మాఫియా గూండా దీపక్‌రెడ్డి వెల్‌లోకి వచ్చి మంత్రులను బయటకు నెట్టేయాలంటూ మాట్లాడారని తెలిపారు. రూల్స్‌కు విరుద్ధంగా లోకేశ్ సెల్ఫోన్లో ఫొటోలు తీయడం.. వీడియో రికార్డింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకే నాపై టీడీపీ నేతలు దాడిచేశారని.. ఇదంతా మీడియా వారు లాంజ్‌లో నుంచి చూశారని మంత్రి వివరించారు. లోకేశ్, దీపక్‌రెడ్డి, బీద రవిచంద్ర మీద డిప్యూటీ చైర్మన్ చర్యలు తీసుకోవాలని వెలంపల్లి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సమన్వయంతో ఉండాలని సీఎం వైఎస్ జగన్ చెప్పారు కాబట్టే సమన్వయంతో ఉంటున్నామని ఆయన అన్నారు. -
‘మా మౌనాన్ని చేతకానితనంగా చూడొద్దు ’
సాక్షి, విజయవాడ : శాసనమండలిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేతల దాడిని వైఎస్సార్సీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతల దాడిని ఖండిస్తూ గుణదలలోని అతని నివాసం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్లు, డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. పెద్దల సభలో టీడీపీ సభ్యులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లిపై దాడికి పాల్పడిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీగా అర్హత లేని టీడీపీ సభ్యులు మండలిలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన బిల్లులను మండలికి పంపితే వాటిని అడ్డుకోవడం హేయమైన చర్య అని అవినాష్ పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలని చూస్తుంటే.. టీడీపీ నేతలు వ్యవస్థలను, కోర్టులను అట్టుపెట్టుకొని అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దాడిని టీడీపీ నాయకులు హీరోయిజంగా చెప్పుకుంటున్నారని, ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య మరొకటి లేదన్నారు. వైఎస్సార్సీపీ నేతల మౌనాన్ని చేతకానితనంగా చూడొద్దని హెచ్చరించారు. దాడి చేనినవారిపై చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌కు రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలని కుట్రలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని దేవినేని అవినాష్ హెచ్చరించారు. బిల్లులను అడ్డుకోవడం దురదృష్టకరం : బొప్పన భవకుమార్ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన బిల్లులు పాస్ కాకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ అన్నారు. పెద్దల సభలో రౌజీయిజం చేయడం టీడీపీ పార్టీ నిరంకుశ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. శాసనమండలిలో మంత్రిపై దాడి చేయడం దేశ చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. టీడీపీ సభ్యులు రౌడీలు, గుండాలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విధ్వంశాలు చేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఉరుకోదని హెచ్చరించారు. -
‘టీడీపీ ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పాలి’
సాక్షి, గుంటూరు : శాసనమండలిలో టీడీపీ నేతలు తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ విమర్శించారు. ద్రవ్యబిల్లును పెట్టనీయకుండా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పేదల కోసం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లిపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. (చదవండి : మండలిలో మరోసారి దుష్ట సంప్రదాయం!) మంత్రి వెల్లంపల్లికి టీడీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు ద్రవ్యబిల్లు ప్రాధాన్యత తెలియదా అని ప్రశ్నించారు. సభ్యులు ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో రౌడీయిజానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చాంబర్లో కూర్చొని సభ్యులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు మారకుంటే టీడీపీ భూస్థాపితం కాకతప్పదని ఎమ్మెల్యే గిరిధర్ వ్యాఖ్యానించారు. -
మండలిలో మాటల యుద్ధం
సాక్షి, అమరావతి: శాసన మండలిలో బుధవారం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై చర్చ కొనసాగుతున్న సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటా మాట పెరిగి కొద్ది సేపు సభా కార్యక్రమాలు వాడీవేడిగా కొనసాగాయి. బడ్జెట్‌పై చర్చలో టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, నాగజగదీశ్వరరావులు మంత్రులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు.. టీడీపీ సభ్యులకు దీటుగా జవాబిచ్చారు. మంత్రులు గెడ్డాలు పెంచి గత సమావేశాల సమయంలో సభలో రౌడీల మాదిరి వ్యవహరించారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి బొత్స జోక్యం చేసుకొని సభ్యులు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పారు. దీంతో చైర్మన్ షరీఫ్.. సభ్యులు బడ్జెట్‌పై చర్చకే పరిమితం కావాలని సూచించారు. ఆధారాలుండటం వల్లే అచ్చెన్నాయుడి అరెస్ట్ ► టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు ప్రస్తావిస్తూ.. ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. ► అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉండడం వల్లే అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేశారని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. దొంగతనం చేస్తే, అవినీతి చేస్తే బీసీలు కదా అని వదిలి వేయాలా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ఒక్క బీసీ నేతకు కూడా రాజ్యసభ సీటు కేటాయించ లేదని, సీఎం జగన్ ఇప్పుడు ఒకేసారి ఇద్దరు బీసీ నేతలకు రాజ్యసభ సీట్లు ఇచ్చారని చెప్పారు. ► పేద కార్మికులకు సంబంధించిన రూ.150 కోట్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని తేలడంతో అచ్చెన్నాయుడు అరెస్టు జరిగిందని, తప్పు చేయకుంటే చట్టం ముందు ఆయన తన నిజాయితీని నిరూపించుకోవాలని మంత్రి అనిల్‌కుమార్ సవాల్ విసిరారు. తప్పుచేసే బీసీల పట్ల ఒక తీరుగా, అగ్రవర్ణాల పట్ల మరో తీరుగా వ్యవహరించడం చట్టంలో లేదన్నారు. గత ప్రభుత్వంలో కాపు నాయకుడు ముద్రగడ దీక్ష చేస్తుంటే అక్కడ 3 వేల మంది పోలీసులను దించి దిగ్బంధనం చేశారన్నారు. చంద్రబాబుకు, చైర్మన్‌కూ గెడ్డం ఉంది.. ► ‘మంత్రులు గెడ్డాలు పెంచుకుంటే రౌడీలన్నట్టు టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు.. చంద్రబాబుకు గెడ్డం ఉంది.. చైర్మన్‌కు కూడా గెడ్డం ఉంది.. వాళ్లు రౌడీలవుతారా’ అని అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ► మంత్రి అనిల్ మాట్లాడే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు జోక్యం చేసుకుని, మంత్రిపై క్రికెట్ బెట్టింగ్ కేసు ఉందనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ► గత ప్రభుత్వంలో పోలీసులు కేవలం నోటీసులిచ్చారని, తాను తప్పు చేయలేదు కాబట్టి విచారణకు హాజరై తన నిజాయితీని నిరూపించుకున్నానని అనిల్ అన్నారు. పోలీసు రికార్డులు పరిశీలించుకోవచ్చని చెప్పారు. గత ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు పెట్టి తనను ఓడించడానికి ప్రయత్నించిందని, అయినా తనను ఏమీ చేయలేకపోయారని చెప్పారు. ► సభలో గొడవ ముదిరే పరిస్థితికి దారితీస్తుండటంతో చైర్మన్ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కూడా కొద్దిసేపు టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు, మంత్రి అనిల్ మధ్య వాగ్వాదం సాగింది. -
దొంగలను అరెస్ట్ చేయొద్దా?
సాక్షి, అమరావతి: దొంగలను అరెస్టు చేయకుండా.. దండలు వేసి ఊరేగించాలా అంటూ టీడీపీ సభ్యులపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌పై శాసన మండలిలో బుధవారం చర్చ జరుగుతుండగా.. టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ కలుగజేసుకొని తమ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. దీంతో మంత్రి బొత్స స్పందిస్తూ.. ‘ఈఎస్ఐలో జరిగిన కుంభకోణంలో అచ్చెన్నాయుడే ప్రధాన పాత్రధారుడనే విషయం ఏసీబీ దర్యాప్తులో తేలింది. అలాగే జేసీ ప్రభాకర్‌రెడ్డిని కూడా అక్రమాలకు పాల్పడినందునే అరెస్టు చేశారు’ అని వివరించారు. ఫైబర్ గ్రిడ్‌లో ఏం జరిగిందో.. వాటి స్కామ్‌లకు సంబంధించిన అవినీతిని కూడా బయటకు తీస్తామని చెప్పారు. అవినీతిపరులపై ప్రభుత్వం విచారణ చేయకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. చంద్రబాబుకు ధైర్యముంటే టీడీపీ హయాంలో అవినీతి జరగలేదని సభలో చెప్పాలంటూ సవాల్ విసిరారు. -
రాష్ట్రానికి భారీ పెట్టుబడులొచ్చాయ్!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. బుధవారం శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చ అనంతరం సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. భారీగా పెట్టుబడులు రావడం వల్ల పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. ► ఈ బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి సమన్యాయం కల్పించాం. విభజన సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన రెవెన్యూ గ్రాంట్లు రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం. ► భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి గత ప్రభుత్వం జీఎమ్మార్‌కు 2,700 ఎకరాలను కేటాయించింది. ఇప్పుడు 2,200 ఎకరాల్లోనే విమానాశ్రయ నిర్మాణానికి ఆ సంస్థ అంగీకరించింది. తాజా ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి 500 ఎకరాలు మిగిలింది. ► రాష్ట్రంలో 15 చోట్ల టూరిజం అభివృద్ధి పనులు చేపట్టనున్నాం. నూతన పథకాలకు రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. ► నవంబర్‌లో కరోనా వైరస్ పీక్ స్టేజ్ (గరిష్ట దశ)కు చేరుకుంటుందని వైద్య నిపుణుల అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తామని అడిగితే చెప్పలేని పరిస్థితి దాపురించింది. ► కరోనా వేళ సభ నడపటానికే ఇబ్బందికర పరిస్థితులుంటే ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్ అంశాలు కాకుండా ఏవేవో మాట్లాడుతూ సమయం వృథా చేస్తున్నారు. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ, పీడీఎఫ్, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. సభ్యులు ఏమన్నారంటే.. ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయని బడ్జెట్ అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన కొనసాగింది. ఈ బడ్జెట్లోనూ ఏ ఒక్క వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా కేటాయింపులు చేశారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపారు. – జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ సభ్యుడు తేడా కనిపిస్తోంది బడ్జెట్ అంచనాలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా కనిపిస్తోంది. – దీపక్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ ఎక్కువ నిధులు రాబట్టాలి బడ్జెట్ ప్రతిపాదనలకు, వాస్తవానికి పొంతన లేదు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులను రాబట్టాల్సిన అవసరం ఉంది. ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు పేదలకు ఊరట కలిగిస్తాయి. పేదలను శాశ్వతంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా కొనసాగించాలి. – లక్ష్మణరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ మా పార్టీ సమర్థిస్తోంది ఏడాది పాలనలో 3.58 కోట్ల ప్రజలకు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను చేరువ చేసింది. ఈ బడ్జెట్లోనూ సంక్షేమ పథకాలకు చేసిన కేటాయింపులను మా పార్టీ సమర్ధిస్తోంది. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలను బడ్జెట్లో ఎక్కడా పొందుపరచలేదు. -
ఎన్పీఆర్, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం
సాక్షి, అమరావతి: జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)కు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. గతంలో ప్రకటించిన విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఎన్పీఆర్లో కేంద్రం కొత్తగా చేర్చిన అంశాలతో ముస్లింలలో భయాందోళన నెలకొని ఉందని పేర్కొంది. 2010 నాటి ఫార్మాట్ అమలు చేయాలంటూ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ► కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్పీఆర్, ఎన్ఆర్సీలపై ముస్లింలలో అభద్రతా భావముంది. ► రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలోనూ ఎన్పీఆర్ను అమలు చేయబోమని సీఎం వైఎస్ జగన్ గతంలో స్పష్టం చేశారు. ► ఎన్పీఆర్లో కొన్ని కాలమ్స్ ముస్లింలకు ఆందోళన కలిగించేవిగా, భయపెట్టేవిగా ఉన్నాయి. ► తల్లిదండ్రుల వివరాలు, పుట్టిన తేదీ, ప్రదేశానికి సంబంధించిన వివరాలతో పాటు మాతృభాషకు సంబంధించి కొన్ని అభ్యంతరాలున్నాయి. ► 2010లో ఎన్పీఆర్ నిర్వహించారు. అయితే ఇప్పుడు నిర్వహిస్తున్న ఫార్మాట్లో అభ్యంతరాలున్నాయి. ► 2010 ఫార్మాట్ ప్రకారమే ఎన్పీఆర్ను కొనసాగించాలని తీర్మానంలో చెప్పాం. ► మార్చి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఎన్పీఆర్, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేశాం. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముస్లింలకు భరోసా వచ్చింది. -
పల్నాటి ప్ర'జల కల'
సాక్షి, అమరావతి: తీవ్ర దుర్భిక్షంతో తల్లడిల్లుతున్న ‘పల్నాటి సీమ’ను సుభిక్షం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రూ.1,750 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకం, రూ.6,020 కోట్లతో వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులను ‘వైఎస్సార్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్’ కింద చేపట్టి వరద జలాలను తరలించడం ద్వారా పల్నాడును సస్యశ్యామలం చేయాలని నిర్ణయించింది. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ కోసం ఎస్పీవీ(స్పెషల్ పర్పస్ వెహికల్)ను ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖను ఆదేశించింది. పల్నాటి ప్రజల 70 ఏళ్ల స్వప్నం.. వరుసగా వర్షాభావంతో పల్నాడు కరవు కోరల్లో చిక్కుకుపోయింది. గుక్కెడు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది. పల్నాడు ప్రజల ఏడు దశాబ్దాల స్వప్నమైన వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేయడం, పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించిన గోదావరి జలాలను వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా అందచేసి ఆ ప్రాంత తాగు, సాగునీటి కష్టాలను కడతేర్చ డానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జలవనరుల శాఖను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం ఇదీ.. ► పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించిన జలాల్లో కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న ఏడు వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి(80 కి.మీ. వద్దకు) ఎత్తి పోస్తారు. కుడి కాలువ ఆయకట్టుకు నీటిని అందిస్తూనే పల్నాటి సీమకు గోదావరి జలాలను తరలిస్తారు. ► ప్రకాశం బ్యారేజీ నుంచి గోదావరి జలాలను నాగా ర్జునసాగర్ కుడి కాలువలోకి ఎత్తిపోసే పనులను రెండు ప్యాకేజీలుగా చేపడతారు. వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం మొదటి ప్యాకేజీ పనులను రూ.2,845 కోట్ల వ్యయంతో, రెండో ప్యాకేజీ పనులను రూ.3,175 కోట్ల వ్యయంతో చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర వేశారు. వరికపుడిశెల ఎత్తిపోతల పథకం ఇదీ.. వరికపుడిశెల వాగు వరద జలాలను ఒడిసి పట్టి పల్నాటి సీమను సస్యశ్యామలం చేయాలనే ప్రతిపాదన ఏడు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైంది. ఈ ఎత్తిపోతల పథకానికి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరికపుడిశెల ఎత్తిపోతల పథకం తొలిదశను రూ.350 కోట్లతో, రెండో దశను రూ.1,400 కోట్లతో చేపట్టే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. వైఎస్సార్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్‌కు శ్రీకారం.. వరికపుడిశెల ఎత్తిపోతల పనులను రూ.1,750 కోట్లతోనూ, వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులను రూ.6,020 కోట్లతో వెరసి రూ.7,770 కోట్ల వ్యయంతో వైఎస్సార్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్ కింద చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ జలవనరుల శాఖను ఆదేశించారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయడానికి నిధుల సమీకరణ కోసం ఎస్పీవీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి ఈ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి పల్నాడులో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా సుభిక్షం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు ముఖ్యమంత్రిని కలిసిన పల్నాడు ప్రజాప్రతినిధులు పల్నాడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకరరావు, అంబటి రాంబాబు కలిశారు. పల్నాటి ప్రజల చిరకాల స్వప్నమైన వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేసే దిశగా చర్యలు చేపట్టినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. 70 ఏళ్లుగా పల్నాటి ప్రజలకు కలగా మిగిలిన వరికపుడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని త్వరగా పూర్తి చేసేందుకు వైఎస్సార్ పల్నాడు దుర్బిక్ష నివారణ మిషన్‌లో విలీనం చేయడం గొప్ప విషయమన్నారు. -
ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: ద్రవ్య వినిమయ బిల్లు (అప్రాప్రియేషన్ బిల్)కు బుధవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2,28,738 కోట్ల బడ్జెట్ వినియోగానికి సంబంధించిన ఈ బిల్లును సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. అలాగే గడిచిన మూడు మాసాలకు గానూ బడ్జెట్ వినియోగానికి ఇచ్చిన ఆర్డినెన్స్‌కూ సభ ఆమోద ముద్ర వేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి అనుబంధ వ్యయాలు (సప్లిమెంటరీ ఎస్టిమేట్స్)కు శాసనసభ ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోద ముద్ర వేసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. ► అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 5.58 గంటల పాటు జరిగినట్లు స్పీకర్ చెప్పారు. ► ద్రవ్య వినిమయ బిల్లుతో సహా 15 బిల్లులు పాస్ చేసినట్టు పేర్కొన్నారు. ► ద్రవ్య వినిమయ బిల్లు పాస్ చేసే సమయంలో స్పీకర్.. మీకేమైనా వేతనాలు తగ్గాయా అంటూ ఛలోక్తి విసిరారు. దీనికి సభ్యులు ఒక్కసారిగా నవ్వి.. తమకు ఎలాంటి కోతలూ లేవని అన్నారు. ► ఈ సమావేశాల్లో వైఎస్సార్ సీపీ తరఫున 151 మంది, టీడీపీ తరఫున 23 మంది, జనసేన పార్టీ తరఫున ఒకరు పాల్గొన్నారని స్పీకర్ తెలిపారు. ► 2020–21 బడ్జెట్‌కు సంబంధించి వివిధ శాఖల పద్దులను కూడా శాసనసభ ఆమోదించింది. ► రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా వివిధ శాఖల పద్దులను విడివిడిగా ఆమోదించాల్సిందిగా అన్ని శాఖల తరఫున ఆర్థిక మంత్రి శాసనసభను కోరారు. ► అనంతరం సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆయా శాఖల పద్దులకు సభ ఆమోదం తెలిపిందని ప్రకటించారు. -
ఆక్వా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ఏడీఏ (ఏపీస్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ) బిల్లును బుధవారం శాసనసభ ఆమోదించింది. రాష్ట్రంలో చేపలు, రొయ్యల సాగు అభివృద్ధికి సంబంధించిన ప్రాధికార సంస్థ బిల్లును మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం మంత్రి మోపిదేవి మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే.. ► ఆక్వా ఉత్పత్తుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉండగా, దేశ ఎగుమతుల్లో 50 శాతం రాష్ట్రం నుంచి అవుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ 80 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర నిర్ణయించి కొనుగోలు చేయించాం. ► ఆక్వా రంగానికి ప్రధానమైన విద్యుత్ యూనిట్ రేటు గతంలో రూ. 3.50 ఉండగా, దాన్ని రూ. 1.50 తగ్గించాం. ► 9 జిల్లాల్లో 8 మేజర్ ఫిషింగ్ హార్బర్లు, 4 మైనర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు రూ. 3,200 కోట్లతో నిర్మించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ► ఆక్వా రంగంలో తీసుకున్న నిర్ణయాలతో 18 లక్షల మంది నిరుద్యోగ యువకులకు పరోక్షంగానూ, ప్రత్యక్షంగాను ఉపాధి లభిస్తోంది. ► వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న ఈ రంగం అసంఘటిత రంగంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ రంగంలో ఉన్నవారికి భరోసా కల్పిస్తున్నాయి. ► వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఆక్వారైతుల సమస్యలు విన్నారు. అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించారు. ఆక్వా ప్రాధికార సంస్థతో ప్రయోజనాలు ఇవే ► చేపలు, రొయ్యల పెంపకంలో నూతన వ్యాపార మార్గాలను సృష్టించడం ► ఆక్వా పెంపకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో ఫోరం ఏర్పాటు ► ఆక్వా రైతులకు మార్కెట్ ఇంటిలిజెన్స్ సేవలు. చేపలు, రొయ్యలకు వచ్చే వ్యాధులపై నిఘా, నియంత్రణ చర్యలు ► సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై మార్కెట్ సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు రైతులకు ప్రయోజనం చేకూర్చడం. నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు తనిఖీలు..ఆడిట్లు ► సీడ్ హేచరీస్, ఫీడ్ ప్లాంట్ మేనేజ్మెంట్, ఆక్వా ఉత్పత్తి చేసే రైతులు, ప్రాసెసింగ్ చేసే ఎగుమతిదారులూ భాగస్వాములను చేయడం ► ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో 36 చోట్ల రూ.50 కోట్ల వ్యయంతో ఆక్వా టెస్టింగ్ లాబ్స్ ఏర్పాటు. క్వాలిటీ మెటిరియల్ అందించి రైతులు నష్టపోకుండా పర్యవేక్షణ విధానాన్ని ఏర్పాటు చేయడం ► ఆక్వా ఉత్పత్తుల నిల్వకు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ► అసంఘటిత రంగంగా ఉన్న ఈ రంగాన్ని సంఘటిత రంగంగా మార్చడం జగన్ సర్కారు వచ్చాక తీసుకున్న నిర్ణయాలు ఇవే ► కోవిడ్ సమయంలో 1.10 లక్షల మందికి రూ. 10 వేలు చొప్పున సాయం. ► డీజిల్ సబ్సీడీని 6 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచి వేటకు వెళ్లిన రోజునే స్మార్ట్ కార్డు ద్వారా వారి ఖాతాల్లో జమచేయడం ► చేపల వేట నిషేధం సమయంలో ఇచ్చే రూ.4వేల పరిహారాన్ని రూ.10వేలకు పెంచడం. చనిపోయిన వ్యక్తులకు పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెంచడం ► తూర్పు గోదావరి జిల్లాలో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ ఆయిల్ కోసం చేపల వేటపై నిషేధం విధించిన సమయంలో వాళ్లు ఇస్తానన్న పరిహారం చెల్లించకపోతే ఏపీ ప్రభుత్వమే రూ.80 కోట్లు చెల్లించడం ► సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఉత్తరాంధ్రకు చెందిన 22 మంది మత్స్యకారులు గుజరాత్ వలస వెళ్లి పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్ అధికారులు అరెస్టు చేస్తే.. వారిని నాలుగు మాసాల్లోనే విడిపించి స్వరాష్ట్రానికి తీసుకురావడం ► ఆక్వా రైతులకు కరెంటు చార్జీలు తగ్గించి రూ.720 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించడం. మండలిలో ఆమోదం పొందిన బిల్లులు ► ఏపీ పంచాయతీ రాజ్ చట్టం – 1994 సవరణ బిల్లు ► ఏపీ విలువ ఆధారిత పన్ను చట్టం – 2005 సవరణ బిల్లు.. రాష్ట్ర జీఎస్టీ చట్ట సవరణ బిల్లు (జీఎస్టీ 38వ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం మేరకు) ► ఏపీ ఆబ్కారీ చట్టం –1968 సవరణ బిల్లు ► ఏపీ మద్య నిషేధ చట్టం –1995 సవరణ బిల్లు ► పురపాలక కార్పొరేషన్ల చట్టం – 1955, ఏపీ పురపాలికల చట్టం – 1965 సవరణ బిల్లు. ► ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చట్ట సవరణ బిల్లు ► తిరుమల ఆలయం తలుపులు తెరిచి తొలి దర్శనం చేసుకొనే ‘సన్నిధి యాదవ్’కు వారసత్వ హక్కు కల్పిస్తూ దేవదాయ చట్ట సవరణ బిల్లు ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ – జూన్ వరకు బడ్జెట్ కేటాయింపులకు వీలుగా తెచ్చిన ఆర్డినెన్స్ బిల్లు. రాష్టంలో 8 దేవాలయాల ట్రస్టు బోర్డుల నియామకాల్లో మార్పులు చేస్తూ బిల్లు -
అమరవీరులకు శాసనసభ సంతాపం
సాక్షి, అమరావతి: గాల్వన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవానులకు రాష్ట్ర శాసనసభ సంతాపం ప్రకటించింది. బుధవారం ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమర వీరులకు సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు విధి నిర్వహణ చేస్తూ.. గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారని.. వారికి రాష్ట్ర ప్రజల తరఫున శాసనసభ ఘన నివాళులర్పిస్తోందన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు త్యాగం తెలుగు ప్రజలకు ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. వీర మరణం పొందిన సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. అనంతరం రెండు నిమిషాల పాటు సభ మౌనం పాటించింది. అలాగే శాసనమండలిలో కూడా బీజేపీ సభ్యుడు మాధవ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు మూడు నిమిషాలు మౌనం పాటించి అమర వీరులకు నివాళులర్పించారు. మండలి చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ.. వీర మరణం పొందిన భారత సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. -
అప్రజాస్వామికం.. అమానుషం
సాక్షి, అమరావతి: శాసనమండలిలో టీడీపీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే.. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అప్రజాస్వామికంగా వ్యవహరించి సభ నడిపారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, ఆదిమూలం సురేష్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. యనమల రామకృష్ణుడు తన తెలివితేటలతో సభను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సభ నడపమని వేడుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి నిరవధిక వాయిదా అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి బోస్ ఏమన్నారంటే.. ► రూల్–90 ప్రకారం ఏదైనా అంశంపై చర్చ చేపట్టాలంటే ఒకరోజు ముందే నోటీసు ఇవ్వాలి. చైర్మన్, సభా నాయకుడితో మాట్లాడి పరిగణనలోకి తీసుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా చైర్మన్ రూల్–90ని పరిగణనలోకి తీసుకున్నారు. ► ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదిస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేం. ► ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలన్న ఆలోచనతోనే టీడీపీ వ్యవహరించింది. ఉన్నత లక్ష్యాల కోసం ఏర్పడ్డ పెద్దల సభను అప్రతిష్ట పాల్జేశారు. టీడీపీకి రాజకీయమే ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజల బాగోగులు అవసరం లేదు. ► ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ చేతులు జోడించి వేడుకున్నా పట్టించుకోలేదు. 33వేల ఎకరాల్లో వ్యాపారం చేసుకోవడం కోసమే ప్రభుత్వ బిల్లులను అడ్డుకున్నారు. ► యనమల రామకృష్ణుడిది పైశాచిక ఆనందం. టీడీపీ సభ్యులు వారి మాట వినకపోతే విధ్వంసం సృష్టిస్తామని బెదిరిస్తున్నారు. సభా సంప్రదాయాలు, నిబంధనలు వారికి అవసరం లేదు. శాసన మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. చిత్రంలో మంత్రులు, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు చరిత్రలో దుర్దినం : మంత్రి కన్నబాబు ► టీడీపీ సభ్యులు సభా నిబంధనల్ని ఉల్లంఘించారు. మెజార్టీ ఉందని ఇష్టానుసారం వ్యవహరించారు. చరిత్రలో ఇది దుర్దినం. ► మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఫొటోలు తీయొద్దని చెప్పినందుకు లోకేష్ దాడికి దిగారు. సభలో ఫొటోలు తీసి లోకేష్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ► దీనిపై కచ్చితంగా సభా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. లోకేష్ విధానం సరికాదని చైర్మన్ కూడా చెప్పారు. ► మండలి నిరవధిక వాయిదా వెనుక యనమల ప్లాన్ ఉంది. మెజార్టీ ఉందని సభను అడ్డుకుంటున్నారు. ► డిప్యూటీ చైర్మన్ తీరు ఆక్షేపణీయం. టీడీపీకి తప్ప ఏ ఇతర పార్టీ సభ్యులకు అవకాశం ఇవ్వలేదు. ► మూడ్ ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోవాలని నాలుగు గంటలు కోరాం. బీజేపీ, పీడీఎఫ్, ఇతర సభ్యుల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. దాడికి దిగారు: మంత్రి ఆదిమూలపు ► టీడీపీ సభ్యులు సభ నియమ, నిబంధనల్ని తుంగలో తొక్కారు. మంత్రులపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ► పాస్ చేయాల్సిన బిల్లులను అడ్డుకున్నారు. సంక్షేమ కార్యక్రమాల్ని టీడీపీ అడ్డుకుంటోంది. వాయిదా వేయడం శోచనీయం: చీఫ్ విప్ ఉమ్మారెడ్డి ► శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయి. టీడీపీ సభ్యులు కుట్రతోనే వచ్చారు. ► కీలక బిల్లులు ఆమోదించకుండానే సభను వాయిదా వేయడం శోచనీయం. టీడీపీ సభ్యులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి అవకాశం ఇవ్వలేదు. సభను విచ్ఛిన్నం చేయడానికి టీడీపీ ప్రయత్నించింది. గత సమావేశాల్లో మాదిరిగానే చైర్మన్ వ్యవహరించారు. ఇపుడు ఏం జరగనుంది? ద్రవ్య వినిమయ బిల్లు ► ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండా మండలిలో అడ్డుకోవడంవల్ల మహా అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఇతర చెల్లింపులు ఒకటి రెండు రోజులు ఆలస్యం కావడం మినహా ఎలాంటి సమస్య ఉండబోదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ► శాసనసభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను మండలి 14 రోజులు జాప్యం చేయగలదు తప్ప అంతకుమించి ఎలాంటి అధికారం లేదు. ► ‘ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ ఈనెల 17న ఆమోదించింది. ఇక 14 రోజులు అంటే ఈ నెలాఖరుతో గడిచిపోతాయి. వచ్చే నెల ఒకటి లేదా రెండో తేదీ నుంచి యథా ప్రకారం చెల్లింపులు చేయవచ్చు’ అని నిపుణులు తెలిపారు. సీఆర్డీఏ రద్దు.. వికేంద్రీకరణ ► ఆర్థికేతర బిల్లులను రెండోసారి మండలిలో అడ్డుకోవడంవల్ల నెల రోజులు అవి చట్టరూపం దాల్చ కుండా ఆగిపోతాయి. నెల రోజుల్లో మండలి ఆమోదించినా, తిరస్కరించినా రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 ప్రకారం ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే. ► ఏదైనా బిల్లును శాసనసభ ఆమోదించి మండలికి పంపితే అది మూడు నెలలు మాత్రమే దానిని ఆపగలదు. మూడు నెలల్లో తిరస్కరించినా, వెనక్కు పంపినా మళ్లీ అసెంబ్లీ ఆమోదించి పంపవచ్చు. ఇలా వచ్చిన బిల్లును మండలి నెల రోజుల్లోగా ఆమోదించి పంపాలి. ఒకవేళ ఆమోదించకపోయినా తిప్పి పంపకపోయినా ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం పొందినట్లేనని ఆర్టికల్ 197 స్పష్టంగా చెబుతోంది. ► పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, విద్యా హక్కు చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపించి మూడు నెలలు దాటిపోయింది. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపింది. వీటిని మండలిలో చర్చకు రాకుండా అడ్డుకున్నంత మాత్రాన ఒరిగేదేమీలేదని,అవి ఆమోదం పొందినట్లేనని న్యాయ నిపుణులంటున్నారు. -
మండలిలో గూండాగిరి
సాక్షి, అమరావతి: శాసనమండలిలో తనకున్న సంఖ్యా బలాన్ని చూసుకుని బుధవారం టీడీపీ దౌర్జన్యకాండకు దిగింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలను మంటగలిపింది. అసెంబ్లీలో ఆమోదం పొంది వచ్చిన బిల్లుల్ని ప్రభుత్వం బుధవారం మండలిలో ప్రవేశపెట్టే క్రమంలో టీడీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. సాక్షాత్తు రాష్ట్ర మంత్రిపై నిండు సభలో టీడీపీ ఎమ్మెల్సీలు కాళ్లతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. అడ్డుకున్న పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్సీలపైనా దౌర్జన్యం చేసి తోసివేశారు. టీడీపీ ఎమ్మెల్సీల దాదా గిరితో సభలో అరగంట సేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. నినాదాలు ► ద్రవ్య వినిమయ బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల్లో ఏది మొదట తీసుకోవాలనే విషయంపై వివాదం ఏర్పడి సభ మూడు గంటలపాటు స్తంభించింది. ఏ నిర్ణయం తీసుకోకుండా ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ► చైర్మన్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. ఏమీ జరక్కుండానే తమకు అనుకూలంగా జరిగినట్లు బల్లలు చరిచి అధికార పక్ష సభ్యులను రెచ్చగొట్టారు. ► ఈ దశలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో పలువురు ఎమ్మెల్సీలు గొడవకు దిగారు. చివరికి ఆయనపై ఒక్కసారిగా దాడి చేశారు. ► బీద రవిచంద్ర వెలంపల్లిని కాళ్లతో తన్నగా, మంతెన సత్యనారాయణరాజు ఆయన మెడ పట్టుకుని తోసివేశారు. మరో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వచ్చి వారిని ఆపి, మంత్రిని పక్కకు తీసుకువచ్చారు. ► ఆ తర్వాత కూడా బీద రవిచంద్ర మంత్రిపైకి దూసుకువచ్చి మళ్లీ దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈలోపు మిగిలిన మంత్రులు వచ్చి అడ్డుకున్నారు. ఫొటోలు, వీడియోలు తీసిన లోకేష్ ► నారా లోకేష్ ఫొటోలు, వీడియోలు తీయడమే ఈ గొడవకు కారణమైంది. డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో మంత్రులు నిబంధనల గురించి పోడియం ఎదుట నిలబడి మాట్లాడుతుండగా లోకేష్ వెనుక నుంచి ఫొటోలు, వీడియో తీశారు. మధ్యాహ్నం నుంచి సభ జరుగుతున్నంత సేపు ఆయన తన ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీయడమే పనిగా పెట్టుకున్నారు. ► ఈ క్రమంలో ఎందుకు ఫొటోలు తీస్తున్నారని వెలంపల్లి ప్రశ్నించడంతో బీద రవిచంద్ర, మంతెన సత్యనారాయణ రాజు ఆయనపై దాడి చేశారు. దాడి సమయంలోనూ లోకేష్ ఫొటోలు తీస్తూనే ఉన్నారు. చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ ఫొటోలు తీయొద్దని పదేపదే లోకేష్‌ను కోరినా ఆయన పట్టించుకోలేదు. ► మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్‌లు లోకేష్ ఫోన్లో తీసిన ఫొటోలు, వీడియోలు తొలగించాలని డిప్యూటీ చైర్మన్‌ను అడుగుతున్నప్పటికీ, ఆయన వెనుక నుంచి ఇంకా ఫొటోలు తీస్తూనే ఉన్నారు. ► ఇలా ఫొటోలు తీసి మంత్రులు, అధికారపక్ష సభ్యుల్ని రెచ్చగొట్టి, ఘర్షణకు కారణమైన లోకేష్.. చివర్లో గొడవ మరింత పెద్దదైన సమయంలో మెల్లగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సభ అదుపులో లేదు కాబట్టి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించి వెళ్లిపోయారు. సంప్రదాయాన్ని ఎందుకు పాటించాలి? ► బిల్లులపై ఓటింగ్ పెట్టాలని యనమల డిమాండ్ చేయగా, ఇవి కరోనా సమయంలో అత్యవసరంగా పెట్టిన అసెంబ్లీ సమావేశాలని.. ప్రభుత్వ బిజినెస్ కోసమే జరుగుతున్నాయని మంత్రి బుగ్గన అన్నారు. ► మధ్యలో ద్రవ్య వినిమయ బిల్లు పెడితేనే సహకరిస్తామని, లేకపోతే తాను వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఇచ్చిన రూలు 90 నోటీసు తీసుకోవాలని యనమల కోరారు. ► బుగ్గన దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అజెండా ప్రకారం సభ నడపకుండా ఆరు బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నారు. శాసన మండలి ఉన్నది ప్రభుత్వం పని చేయకుండా ఉండేందుకా అని ప్రశ్నించారు. ఎటూ తేలక సభ స్తంభించడంతో డిప్యూటీ ఛైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ► అనంతరం మళ్లీ ఇదే వివాదం నెలకొంది. డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ ఏకాభిప్రాయం రానప్పుడు తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లు చివర్లో పెట్టాలనే సంప్రదాయం పాటించాల్సిన అవసరం లేదని, ఈ సభలోనే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడతానని తెలిపారు. ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం తీసుకోండి ► మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ.. సభ మూడ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని, మిగిలిన పార్టీ ఫ్లోర్ లీడర్ల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రతి చిన్న విషయానికి కీచులాటకు దిగడం సరికాదని, ఫ్లోర్ లీడర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. ► సభలో మిగిలిన పక్షాల అభిప్రాయాలు ఎందుకు తీసుకోరని, కేవలం టీడీపీ అభిప్రాయమే ఎందుకు తీసుకుంటారని బుగ్గన ప్రశ్నించారు. ► ఒక దశలో తనకు ఈ ప్రభుత్వం ఎస్కార్టు తీసివేసిందని డిప్యూటీ చైర్మన్ చెప్పగా, టీడీపీ హయాంలో తాను ప్రతిపక్ష నేతగా ఎన్నికైనా.. నెల రోజులు ధృవీకరించకుండా ఇంకెవరైనా వైఎస్సార్సీపీ సభ్యులు టీడీపీలోకి వస్తే తనకు ఆ అవకాశం లేకుండా చేయాలని చూసిన విషయాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా రూలు 90 తీసుకున్న యనమల ► చర్చ జరుగుతుండగానే రూలు 90పై తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ.. టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుపై అభ్యంతరం చెప్పారు. ఆ రెండు బిల్లులపై రూలు 90 ప్రకారం తాను చెప్పిన విషయాలు రికార్డుల్లోకి వెళ్లిపోయాయని తెలిపారు. ► అసలు చైర్మన్ అనుమతివ్వకుండా ప్రతిపక్ష నేత ఎలా దాన్ని పెడతారని బుగ్గన ప్రశ్నించగా డిప్యూటీ చైర్మన్ అది రికార్డుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. ► అసలు రూలు 90 తీసుకోవడానికే లేదని, దాన్ని ఒకరోజు ముందు ఇవ్వాలని, కానీ ఈరోజే ఇచ్చారని, అలాగే సభా నాయకుడు, శాసనసభా వ్యవహారాల మంత్రిని సంప్రదించిన తర్వాతే ఆ నోటీసుపై నిర్ణయం తీసుకోవాలని రూలు 94 చెబుతోందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నిబంధనావళిని చదివి వినిపించారు. అసలు రూలు 90ని ఎలా అడ్మిట్ చేశారు? ► ప్రతిపక్ష నేత చెప్పిన విషయాలను రికార్డుల్లోంచి తొలగించాలని బుగ్గన, బొత్స, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు కోరారు. ► ‘ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు రూల్ బుక్‌ను వల్లెవేస్తారు కానీ పాటించరు. టీడీపీ ఇచ్చిన రూలు 90 నోటీసును చైర్మన్ ఎలా అనుమతిస్తారు? దానిపై ఎలా హక్కు ఉంటుంది? చైర్మన్ అనుమతించాడు కాబట్టి మేం దాన్ని సభలో పెట్టేస్తామంటే కుదరదు. విచక్షణాధికారం ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్లు వినియోగించకూడదు. రూలు 90ని అనుమతించేటప్పుడు సభా నాయకుడిని సంప్రదించాలనే రూలు 94ని రద్దు చేయడానికి చైర్మన్ ఎవరు? ప్రతిపక్ష నేత యనమల సభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. శాసన మండలి టీడీపీ కార్యాలయం కాదు. అక్కడ చేసినట్లు ఇక్కడ చేస్తే కుదరదు. రూలు 94 బతికుందో.. చచ్చిపోయిందో చెప్పాలి. రూల్సు అమలు చేయనప్పుడు ఈ పుస్తకాలు ఎందుకు?’ అని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ► రూలు 90 తీసుకున్నాం కాబట్టి మిగిలిన బిల్లులు పెట్టాలని డిప్యూటీ చైర్మన్ కోరగా, మీ అనుమతి లేకుండా చెప్పిన విషయాలను రికార్డుల్లోంచి తొలగించాకే ఆ బిల్లులు పెడతామని బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. సభ ఉన్నది ప్రభుత్వ బిజినెస్ జరగాడానికా, లేక ఎక్కడి నుంచో తెచ్చిన రూలు 90 కోసమా అని డిప్యూటీ చైర్మన్‌ను ప్రశ్నించారు. ఏ సభలో అయినా ప్రభుత్వ బిజినెస్‌కు టాప్ ప్రయారిటీ ఉంటుందని చెప్పారు. ► మంత్రులు, అధికార పక్ష సభ్యులు దీనిపై ఎంత అడిగినా డిప్యూటీ చైర్మన్ వినకుండా టీడీపీ పక్షం చెప్పిందే వినడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ► ఈ పరిస్థితుల్లో టీడీపీ సభ్యులు గొడవ పెట్టుకుని అధికారపక్షంపై దాడికి దిగారు. అదే సమయంలో యనమల సూచన మేరకు డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ద్రవ్య వినిమయ బిల్లు సహా ఆరు బిల్లులు ఆమోదం పొందకుండా నిలిచిపోయాయి. మండలిలో టీడీపీ శకునిపాత్ర ► శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ మరోసారి శకునిపాత్ర పోషించింది. చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్‌పై ఒత్తిడి తెచ్చి అసెంబ్లీ ఆమోదించిన ఆరు బిల్లులకు అడ్డుపడి చివరికి అవి ఆమోదం పొందకుండా చేసింది. తెలుగుదేశం పార్టీ రాజకీయంతో బడ్జెట్ సమావేశాల్లో అతి కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదు. ► వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులతోపాటు మరో మూడు బిల్లుల్ని ముందు ప్రవేశపెడతామని, చివర్లో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. కానీ యనమల.. ముందు ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని పట్టుబట్టారు. ► ఎంతో అనుభవం ఉందని చెప్పే యనమల.. ఎప్పుడైనా ద్రవ్య వినిమయ బిల్లును చివర కాకుండా ముందు ప్రవేశపెట్టిన దాఖలా ఉందా? ఉంటే చూపాలని మంత్రి బుగ్గన కోరారు. ద్రవ్య వినిమయ బిల్లు తర్వాత ఇక ఏ బిజినెస్ జరగదని, అదే సంప్రదాయమన్నారు. -
‘ఇలాంటి వాటిని సీఎం జగన్ సహించరు’
సాక్షి, అమరావతి : నేతల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివేదిక తెప్పించుకున్నారన్నారు. శాసన మండలి వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకరిపై మరొకరు నేతలు చేసుకుంటున్న విమర్శలపై పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. ఇలాంటి వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహించరని స్పష్టం చేశారు. పార్టీ నేతలు క్రమశిక్షణ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మారెడ్డి హెచ్చరించారు. (శాసన మండలిలో టీడీపీ హడావుడి) ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని, హద్దు మీరితే ఎలాంటి చర్యలకైన వెనకాడమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్లు వెల్లడించారు. నాయకులు ఒకరిపై మరొకరు సవాల్ విసురుకోవడం మానుకోవాలని హితవు పలికారు. నరసాపురంలో జరిగిన సంఘటనపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తప్పెవరిది అనే దానిపై అధిష్టానం నివేదిక తెప్పించుకుంటుందని, పార్టీ అనుమతి లేనిదే ఎవరూ మీడియా సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. నేతలకు ఇబ్బంది ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని, ఎమ్మెల్యేలు ఎంపీలకే కాదు అందరికి ఇదే వర్తిస్తుందని తెలిపారు. సీఎం జగన్ సమయం ఇవ్వడం లేదనేది అవాస్తవమని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొట్టిపారేశారు. (ఎన్ఆర్సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం) ఎంపీ వ్యవహారం అందరూ చూశారు: ప్రసాదరాజు ఎమ్మెల్యేలను పందులు గుంపుగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు పోల్చడం సరికాదని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో పార్టీకి నష్టం జరిగేలా ప్రవర్తించారని, ఇబ్బంది ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఎంపీ వ్యవహారాన్ని అందరూ చూశారని, ధైర్యం ఉంటే ఆయనే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ లేకపోతే రఘురామ కృష్ణంరాజు గడ్డి పరకతో సమానమన్నారు. (‘ఎంతమందికి చికిత్స అయినా ప్రభుత్వం సిద్ధం’) -
‘చంద్రబాబు ఆ ఆరోపణలను ఎందుకు ఖండించలేదు’?
సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల కొనుగోలు స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కామ్‌లకు సంబంధించిన అవినీతిని బయటకు తీస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం రెండో రోజు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతి పరులపై విచారణ చేయకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. ప్రభుత్వం అవినీతి జరిగిందని నిర్ధారించిందని తెలిపారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వ హయాంలో అవినీతి జరగలేదని ఎందుకు ఖండించలేదని బొత్స నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో వాహనాలు కొనుగోలు చేయలేదని చెప్పండి అని సవాల్ విసిరారు. అప్పుడే తొందరపడితే ఎలా... ముందుంది ముసళ్ల పండుగ అని టీడీపీని ఉద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు. ('దొంగలా తాళాలు వేసుకొని ఉంటే అరెస్ట్ చేయరా') -
ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2020-21 కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. దాంతోపాటు ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్)ను అమలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కు సంబంధించి రాష్ట్ర శాసనసభ నేడు ఒక తీర్మానం ఆమోదించింది. భోజన విరామం తర్వాత సభలో ఈ తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ప్రవేశపెట్టారు. ఇదిలాఉండగా.. బడ్జెట్ ఆమోదానికి ముందు సరిహద్దుల్లో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సభ్యులు రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. (చదవండి: నేను కూడా డిప్రెషన్‌ను ఎదుర్కొన్నాను) -
అమర జవాన్లకు ఏపీ అసెంబ్లీ నివాళి
సాక్షి, అమరావతి : భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో అమరులైన వీరసైనికులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ బుధవారం సంతాపం తెలిపింది. భారత జవాన్ల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఈ సంతాప తీర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టారు. ‘దేశసమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే విధి నిర్వహణ చేస్తూ, ఇండియా – చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయవద్ద ఘర్షణలో అమరులైన 20 మంది మనదేశ వీర సైనికులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఈ శాసనసభ ఘనమైన నివాళులు అర్పిస్తోంది. మొత్తం దేశంతోపాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది. తెలుగువాడు, పక్కరాష్ట్రం తెలంగాణలోని సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్‌బాబు త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోతుంది. వీరమరణం పొందిన మన సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
గడ్డంపై చర్చ: టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి కౌంటర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(2020-21) సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మంత్రుల గడ్డాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాము గడ్డాలు పెంచితే రౌడీలు అంటున్నారని, గడ్డం పెంచితే రౌడీలేనా అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. శాసనమండలి ఛైర్మన్‌కు, చంద్రబాబుకు కూడా గడ్డం ఉందని పేర్కొన్న మంత్రి వాళ్లు కూడా రౌడీలేనా అని కౌంటర్ అటాక్ చేశారు. అంతేకాకుండా పురాణాలను పరిశీలిస్తే మునులు, రుషులు గడ్డాలు పెంచారని, వాళ్లను కూడా రౌడీలు అంటారా అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. (అభివృద్ధి.. సంక్షేమంతో నవశకం) శాసనమండలి చైర్మెన్ అధ్యక్షతన బుధవారం రోజు 12 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే.. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు శాసనమండలి సంతాపం తెలిపింది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. కల్నల్ మృతిపై మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. (జనతా పద్దు.. కొత్త పొద్దు) -
మండలి ముందుకు కీలక బిల్లులు
సాక్షి, అమరావతి : మరి కొద్దిసేపట్లో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. మండలిలో అవలంభించాల్సిన వ్యూహం గురించి వారితో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బిల్లులను సెలెక్ట్ కమిటీకి ఇచ్చే అవకాశం లేదు. గతంలోనే రూల్ ప్రకారం జరగలేదని చైర్మన్ చెప్పారు. కేవలం విచక్షణ అధికారం ఉందనే సెలెక్ట్ కమిటీ పంపిస్తానని చెప్పారు. సభ అభిప్రాయం తీసుకోకుండానే వాయిదా వేసి వెళ్లిపోయారు. యనమల ఇష్టం వచ్చినట్లు రూల్స్ మార్చి చెబుతున్నారు. ఆయన చెప్పిందే రూల్స్ అన్నట్లు మాట్లాడుతున్నారు. యనమల వాదనలకు తలా తోక ఉండదు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓటింగ్ పెట్టి రిజెక్టు చేసినా నెలలో బిల్లులు పాస్ అయిపోతాయ’ని అన్నారు. చదవండి : రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు -
'దొంగలా తాళాలు వేసుకొని ఉంటే అరెస్ట్ చేయరా'
సాక్షి, అమరావతి : ఏపీ బడ్జెట్ రెండో రోజు శాసనమండలి సమావేశాల్లో భాగంగా టీడీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీటుగా సమాధానమిచ్చారు. అచ్చెనాయుడు అరెస్టును నిరసిస్తూ టీడీపీ సభ్యులు క్రికెట్ బెట్టింగ్ అంశాన్నిలేవనెత్తారు. దీనిపై అనిల్ స్పందిస్తూ..' చట్టం అనేది అందరికి సమానమే... రూ. 150 కోట్లకు పైగా అవినీతి జరిగింది.. బీసీ అయితే అరెస్ట్ చేయకుడదా.. 300 మంది పోలీసులతో అచ్చెనాయుడును అరెస్ట్ చేయడానికి వెళ్లారని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అచ్చెనాయుడు దొంగ లాగా ఇంట్లో దాక్కుని తాళాలు వేసుకుంటే పోలీసులే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.(ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభం) కాపు ఉద్యమ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముద్రగడ ఇంటికి మూడువేల మందిని పంపి భయానక వాతావరణం సృష్టించారు. అంతేగాక ఉద్యమానికి సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన మహిళలపై అమానుషంగా దాడులు చేశారు. నాపై గత ప్రభుత్వం క్రికెట్ బెట్టింగ్ విషయంలో నోటీసులు ఇచ్చిన మాట నిజమే. కానీ నేను ధైర్యంగా విచారణకు హాజరయ్యాను. ఈ వ్యవహారంలో నాకు క్లీన్చిట్ లభించింది. ఆ సమయంలో నోటీసులు ఇచ్చి నా ఇమేజ్ డామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు' అంటూ పేర్కొన్నారు.