సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(2020-21) సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మంత్రుల గడ్డాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
తాము గడ్డాలు పెంచితే రౌడీలు అంటున్నారని, గడ్డం పెంచితే రౌడీలేనా అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. శాసనమండలి ఛైర్మన్‌కు, చంద్రబాబుకు కూడా గడ్డం ఉందని పేర్కొన్న మంత్రి వాళ్లు కూడా రౌడీలేనా అని కౌంటర్ అటాక్ చేశారు. అంతేకాకుండా పురాణాలను పరిశీలిస్తే మునులు, రుషులు గడ్డాలు పెంచారని, వాళ్లను కూడా రౌడీలు అంటారా అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. (అభివృద్ధి.. సంక్షేమంతో నవశకం)
శాసనమండలి చైర్మెన్ అధ్యక్షతన బుధవారం రోజు 12 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే.. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు శాసనమండలి సంతాపం తెలిపింది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. కల్నల్ మృతిపై మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. (జనతా పద్దు.. కొత్త పొద్దు)
Comments
Please login to add a commentAdd a comment