deepak reddy
-
TS Election 2023: దోస్త్ వర్సెస్ దోస్త్..!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు పాత మిత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీపడుతున్నారు. టీడీపీలో ఇరువురు సుదీర్ఘకాలం పని చేశారు. గ్రేటర్లో పలు పదవులు చేపట్టారు. టీడీపీలో పనిచేసిన వీరిరువురు ఇప్పుడు ఒకరు బీఆర్ఎస్, మరొకరు బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. వారే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, లంకల దీపక్‌రెడ్డి. టీడీపీలో మూడు దశాబ్దాలకు పైగా గ్రేటర్లో పనిచేసిన మాగంటి గోపీనాథ్ 2014లో టీడీపీ తరఫున గెలిచి తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. రెండు దశాబ్దాలుగా టీడీపీలో గ్రేటర్‌తో పాటు రాష్ట్ర పదవులు చేపట్టిన లంకల దీపక్‌రెడ్డి తర్వాత పరిణామాలతో బీజేపీలో చేరారు. రాజకీయ అనుభవం కలిగిన లంకలకు బీజేపీ పార్టీ టికెట్‌ను ఖరారు చేసింది. ఇద్దరూ టీడీపీలో కలిసి గ్రేటర్లో పనిచేశారు. ఇద్దరు పాత మిత్రులు ప్రస్తుతం పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న లంకల తన అనుభవాన్ని జోడించి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తారా.. లేదంటే మాగంటి హ్యాట్రిక్ కొడతారా? అనేది ఓటర్లే నిర్ణయిస్తారు. – శ్రీనగర్‌కాలనీ -
కాల్వకు 'జేసీబీ'తో బ్రేక్.. ఈసారి టికెట్ ఆయనకేనా?
ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలు కావడం కామనే. తెలుగుదేశంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నాయకుడికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదనే ప్రచారం సాగుతోంది. గత ప్రభుత్వంలో మంత్రిగా, అంతకుముందు ఎంపీగా పనిచేసిన ఆ నేతపై పచ్చ పార్టీ అధినేత గుర్రుగా ఉన్నారట. అందుకే ఈసారి టిక్కెట్ రాదంటూ ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ ఆ నేత ఎవరు? కాల్వ కేరాఫ్ రామోజీ క్యాంపస్ కాలువ శ్రీనివాస్. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన తరచుగా మీడియాలో కనిపించేవారు. ఈనాడు జర్నలిస్ట్‌గా ఉంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాలువ తొలిసారి అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 దాకా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అదే నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జిగా పనిచేస్తున్నారు. టీడీపీ అనంతపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా.. పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాల్వకు జేసీబీతో బ్రేక్ చంద్రబాబు కావాలని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కాలువ శ్రీనివాస్‌కు గతంలో మంచి ప్రాధాన్యతే దక్కింది. అయితే ప్రస్తుతం ఆయనకు జేసీబీ (జేసీ బ్రదర్స్) రూపంలో కష్టాలు ఎదురవుతున్నాయి. రాజకీయ సమీకరణాల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్‌కు రాయదుర్గం టిక్కెట్ దక్కదని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్ కోసం రాయదుర్గం టిక్కెట్ త్యాగం చేసిన దీపక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు, లోకేష్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. జేసీ బ్రదర్స్‌లో ఒకరైన జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడే దీపక్ రెడ్డి. 2012 రాయదుర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దీపక్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ రాయదుర్గం నియోజకవర్గంపై కన్నేసిన దీపక్ రెడ్డి.. చంద్రబాబు, నారాలోకేష్ లతో మంచి సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు. కార్యకర్తల విరాళాలు కాల్వ పాలు.! కాలువ శ్రీనివాస్ వైఖరిపై గత కొంత కాలంగా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పార్టీ పదవులు ఇప్పిస్తానని పలువురు నేతల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు కాలువ శ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ ఫండ్ అభ్యర్థులకు ఇవ్వకుండా తన జేబులో వేసుకున్నారని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీటిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాయదుర్గంలో కాలువ శ్రీనివాస్‌ను పక్కన పెట్టి.. దీపక్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై మాజీ మంత్రి బెంగ పెట్టుకున్నట్లు సమాచారం. కిం కర్తవ్యం.? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకపోతే ఏం చేయాలన్న దానిపై కాలువ శ్రీనివాస్ తర్జన భర్జనలు పడుతున్నట్లు టాక్. పరిస్థితి నుంచి ఎలా బయటపడాలన్న దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నారు. తనకు అనుకూలంగా ఉండే పార్టీ సీనియర్ నేతల ద్వారా కాలువ శ్రీనివాస్ లాబీయింగ్ ప్రారంభించినట్లు అనంతపురం తెలుగుదేశం పార్టీలో ప్రచారం సాగుతోంది. -
‘మనసానమః’ దర్శకుడికి సీఎం జగన్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ‘మనసానమః’ అనే లఘు చిత్రాన్ని రూపొందించి, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అవార్డులు సాధించిన యువ దర్శకుడు దీపక్ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ లఘు చిత్రం దాదాపు 900 పైగా పురస్కారాలు అందుకోవడంతో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తనను కలిసిన దీపక్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇకపై మరిన్ని మంచి చిత్రాలు రూపొందించాలని ఆకాంక్షించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌కు గజ్జల శిల్ప నిర్మాణ బాధ్యతలు వహించారు. చదవండి: చెరువులపైనే ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం వైఎస్ జగన్ -
మనసానమః షార్ట్ ఫిల్మ్ దర్శకుడికి వీసా ఇబ్బందులు
ఒక చిన్న షార్ట్ ఫిల్మ్‌తో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు దీపక్‌రెడ్డి. మనసానమః అనే షార్ట్‌ఫిల్మ్‌తో వందల కొద్దీ అవార్డులను, ఆస్కార్ క్వాలిఫైయింగ్ స్క్రీనింగ్ అవకాశం కూడా దక్కించుకున్నారు. అయితే వీసా ఇబ్బందులతో ఆ స్క్రీనింగ్ కోసం అమెరికాకి దర్శకుడు వెళ్లలేకపోవడం దురదృష్టకరం. దీనికి సంబంధించి అమెరికా వెళ్లేందుకు వీలైన అవకాశాలను సూచించమని డైరెక్టర్ దీపక్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశాడు. దీంతో ఆయనను సపోర్ట్ చేస్తూ కొందరు ట్వీట్స్ చేశారు. -
మంత్రుల్ని రౌడీలంటారా!
సాక్షి, అమరావతి: మంత్రులు వీధి రౌడీల మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బుధవారం శాసన మండలిలో తీవ్ర దుమారం రేపాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీయగా.. ఒక దశలో పరిస్థితి ఇరుపక్షాలు బాహాబాహీ తలపడే స్థాయికి వెళ్లింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే.. దీపక్‌రెడ్డి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్‌ను కోరుతూ.. మైక్ ఇవ్వకముందే మంత్రులపై వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్సీలు ఓ చోట చేరగా.. బొత్స సత్యనారాయణ తన స్థానం నుంచి పక్కకు వచ్చారు. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకుని ఇలా అయితే సభ ఎలా నడుస్తుందని, సభ్యులు ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని తీవ్ర స్వరంతో ఆదేశించడంతో పరిస్థితి సద్దుమణిగింది. మేం దొడ్డిదారిన రాలేదు : మంత్రి బొత్స అనంతరం ఈ పరిణామాలపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తామేమీ దొడ్డిదారిన రాలేదని, మంత్రులంతా ప్రజల ఓట్లతో ఎన్నుకోబడి వచ్చిన వాళ్లేనని, అలాంటి వారిని వీధి రౌడీలని టీడీపీ ఎమ్మెల్సీలు ఎలా అంటారని నిలదీశారు. టీడీపీ సభ్యులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. ప్రభుత్వం తరఫున మాట్లాడే అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు. మండలిలో ప్రభుత్వ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హుందాగా జరగాల్సిన సభలో టీడీపీ ఎమ్మెల్సీలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. మంత్రులు ఈ సభకు రావడాన్నే వారు తప్పు పడుతున్నారని, మంత్రులకు సభకు వచ్చే హక్కు లేదా అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులతో పాటు అధికార వైఎస్సార్సీపీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, కనీసం తన సీటు అయినా మార్చాలని విజ్ఞప్తి చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలపై రికార్డుల పరిశీలన ఇదిలావుంటే.. మంగళవారం నాటి సభలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీడీపీ ఎమ్మెల్సీ బాబురాజేంద్రప్రసాద్ మధ్య చోటుచేసుకున్న వాగ్వావాదం అంశం బుధవారం సభ ప్రారంభం కాగానే చర్చకు వచ్చింది. మంత్రి వెలంపల్లి తనపై చేసిన వ్యాఖ్యలను బాధించాయని, ఆయనతో క్షమాపణలు చెప్పించాలని బాబురాజేంద్రప్రసాద్ చైర్మన్‌ను కోరగా.. ఆ సమయంలో జరిగిన పరిణామాలన్నింటిపైనా రికార్డులను పరిశీలించాకే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని మంత్రి బొత్స కోరారు. రికార్డులను పరిశీలించాక అవసరమైతే మంత్రిని, రాజేంద్రప్రసాద్‌ను తన చాంబర్‌కు పిలిపించి మాట్లాడతానని, తర్వాత ఆ విషయాలపై సభలో కూడా ప్రస్తావనకు తీసుకురావచ్చని చైర్మన్ సూచించారు. తాను రికార్డులు పరిశీలించే వరకు డిప్యూటీ చైర్మన్ సభను నిర్వహిస్తారని చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. -
మేము ఇక్కడికి దొడ్డిదారిన రాలేదు: బొత్స
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మంత్రి బొత్స సత్యనారాయణను వీధి రౌడీ అంటూ అనుచితవ్యాఖ్యలు చేశారు. మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు జగదీశ్వరరావు, అంగర రామ్మోహన్ మంత్రులపైకి దూసుకెళ్లారు. టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందిస్తూ.. మమ్మల్ని వీధి రౌడీలని టీడీపీ సభ్యులు ఎలా అంటారు. మేము ఇక్కడికి దొడ్డిదారిన రాలేదు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ చూడలేదు. టీడీపీ సభ్యులు నోటికెంత వస్తే అంత మాట్లాడుతున్నారు. చదవండి: (బాబూ వంద కోట్ల ఫైన్ అప్పుడే మర్చిపోయారా..?) మేము రన్నింగ్ కామెంటరీ చేసే వ్యక్తులం కాదు. ప్రభుత్వం తరపున మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఇది మంచి పద్దతి కాదు' అంటూ బొత్స హెచ్చరించారు. సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు మాట్లాడుతూ.. ఇది పెద్దల సభ. సభ్యులు హుందాగా వ్యవహరించాలి. టీడీపీ సభ్యులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. టీడీపీ సభ్యులు సభాసంప్రదాయాలు కూడా పాటించడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (ఏపీ అసెంబ్లీ: కీలక బిల్లులు ఆమోదం) -
గడ్డంపై చర్చ: టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి కౌంటర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(2020-21) సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మంత్రుల గడ్డాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాము గడ్డాలు పెంచితే రౌడీలు అంటున్నారని, గడ్డం పెంచితే రౌడీలేనా అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. శాసనమండలి ఛైర్మన్‌కు, చంద్రబాబుకు కూడా గడ్డం ఉందని పేర్కొన్న మంత్రి వాళ్లు కూడా రౌడీలేనా అని కౌంటర్ అటాక్ చేశారు. అంతేకాకుండా పురాణాలను పరిశీలిస్తే మునులు, రుషులు గడ్డాలు పెంచారని, వాళ్లను కూడా రౌడీలు అంటారా అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. (అభివృద్ధి.. సంక్షేమంతో నవశకం) శాసనమండలి చైర్మెన్ అధ్యక్షతన బుధవారం రోజు 12 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే.. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు శాసనమండలి సంతాపం తెలిపింది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. కల్నల్ మృతిపై మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. (జనతా పద్దు.. కొత్త పొద్దు) -
మా వాళ్లనే అరెస్ట్ చేస్తావా?
సాక్షి, మంగళగిరి: మాజీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్సీలు మంగళగిరి రూరల్ పోలీసులపై జులుం ప్రదర్శించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో భాగంగా టీడీపీ కార్యాలయంలో పనిచేసే నాయబ్ రసూల్‌ను సోమవారం మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్సీలు లోకేష్, అశోక్‌బాబు, రాజేంద్రప్రసాద్, దీపక్‌రెడ్డి హుటాహుటిన మంగళగిరి రూరల్ స్టేషన్‌కు చేరుకున్నారు. ‘‘మా కార్యాలయంలో పనిచేసే వారినే అరెస్ట్ చేస్తావా? ఎవరు ఇచ్చారు మీకు అధికారం?’’ అంటూ సీఐపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఫిర్యాదు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ రెచ్చిపోయారు. సీఐ శేషగిరిరావు మాట్లాడుతూ.. ఆరునెలలుగా తాను ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నానని, ఇప్పటి వరకూ తనకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. సీఐ మాటలను టీడీపీ నేతలు పట్టించుకోలేదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. చట్టాలు మాకు నేర్పుతావా అంటూ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో పెట్టింది తప్పు అని చట్టంలో ఎక్కడ రాసి ఉందో చూపాలంటూ చిందులు వేశారు. (చదవండి: ఇంకెన్ని విచిత్రాలు చూడాలో!) -
పోలీసులపైకి ‘రివర్స్’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డితో పాటు న్యాయవాది శైలేష్ సక్సేనా పోలీసులపై తప్పుడు రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వారికి తలనొప్పిగా మారారు. హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం పోలీసులు, దర్యాప్తు అధికారి ఏసీపీ విజయ్‌కుమార్‌తో పాటు డీసీపీ అవినాష్ మహంతి తదితరులపై వరుసపెట్టి పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. తాజాగా హైకోర్టులో శైలేష్ దాఖలు చేసిన మూడింటితో కలిపి మొత్తం 60 రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం సీసీఎస్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీపక్‌రెడ్డితో పాటు న్యాయవాదులు శైలేష్ సక్సేనా, సంజయ్ సక్సేనా తదితరులు భోజగుట్టతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఉన్న 4 ఖరీదైన స్థలాలపై కన్నేశారు. బోగస్ డాక్యుమెంట్లు, నకిలీ యజమానులను సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ రూ.వందల కోట్ల విలువైన స్థలాలను కొట్టేసేందుకు భారీ కుట్రలే పన్నారు. ఒకే వ్యక్తిని వివిధ పేర్లతో పరిచయం చేస్తూ పలు స్థలాలపై జీపీఏలు, సేల్డీడ్లు తయారు చేయించారు. ఈ వ్యవహారంపై నమోదైన ఆరు కేసులను సీసీఎస్ అధికారులు దర్యాప్తు చేశారు. దీపక్‌రెడ్డితో పాటు శైలేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భారీ పథకమే.. అప్పట్లో బాధితులుగా ఉండి, పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిపై శైలేష్ ప్రైవేట్ కేసులు నమోదు చేశారు. వారంతా ఉద్దేశపూర్వకంగా తనపై ఫిర్యాదులు చేశారని, రాజకీయ కారణాలతోనే సీసీఎస్ అధికారులు జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. సివిల్ వివాదాల్లో సీసీఎస్ పోలీసులు తలదూర్చి తమను అక్రమంగా అరెస్టు చేశారంటూ పేర్కొన్నారు. శైలేష్ సక్సేనా దాఖలు చేసే రిట్ పిటిషన్లలో అధికంగా అధికారుల పేర్లతోనే వేస్తున్నారు. దీంతో అధికారులే సొంతంగా లాయర్లను ఏర్పాటు చేసుకోవాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. -
కుటుంబం వేరు.. రాజకీయం వేరు
రాయదుర్గం: ‘‘కుటుంబ విషయాలు వేరు...రాజకీయాలు వేరు...మీరు మంత్రి కాలవ విషయంలో మాత్రం జోక్యం చేసుకోవద్దు. అతను నా అనుచరులపై దాడులు చేయించాడు. అక్రమ కేసులు పెట్టించి వేధించాడు. కొంతమంది దొంగలను వెంటేసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. ఇలాంటి వారికి ఎలా సహకరించాలి...నాలుగున్నరేళ్లుగా అవమానాలు ఎదుర్కొన్నాం. ఇపుడు కార్యకర్తల నిర్ణయమే నాకు శిరోధ్యారం. వారి అభిలాష ప్రకారం నడుచుకుంటాను’’ అని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎంపీ దివాకర్‌రెడ్డితో స్పష్టం చేసినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. మంత్రి కాలవ తీరుపై మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి నిరసనగళం వినిపించగా...పరిస్థితిని చక్కదిద్దేంకు ఎంపీ దివాకర్‌రెడ్డి రంగంలోకి దిగారు. మంగళవారం ఉదయం ఆయన మెట్టు గోవిందరెడ్డితో జరిపిన సంప్రదింపులు ఫలించకపోగా...బెడిసి కొట్టాయి. ఆ వెంటనే మెట్టు గోవిందరెడ్డి పార్టీకి రాజీనామా కూడా చేశారు. అనంతరం ఎంపీ జేసీ తన అల్లుడు, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఇంటికి చేరుకుని మంత్రి కాలవపై అసమ్మతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగున్నరేళ్లుగా జరిగిన సంఘటనలను దీపక్‌రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే సహించేదిలేదని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. బుధవారం కార్యకర్తల సమావేశం ఉందనీ, వారి ఆవేదన వినాలంటే మీరు రండని ఆహ్వానించగా...ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. -
ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతా
అనంతపురం, రాయదుర్గం : పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను, నాయకులను మంత్రి కాలవ శ్రీనివాసులు అవమానించారు..దాడులు చేయించారు..అక్రమంగా కేసులు పెట్టించారు..అందుకే వారంతా ఆయనపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. టీడీపీ టిక్కెట్ కాలవకే కేటాయించడంతో ఈ సారి ఎన్నికల బరిలో దిగాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకు రాయదుర్గంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నా...మంత్రి కాలవను ఓడించి తీరుతా’’ అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన ‘చేయూత’ ట్రస్ట్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి కాలవ శ్రీనివాసులు తనకు కావాల్సిన వారిని మాత్రమే అమరావతికి తీసుకెళ్లి నియోజకవర్గ రివ్యూలో తనకు అనుకూలంగా చెప్పించుకున్నాడన్నారు. టీడీపీలోనే మంత్రి కాలవపై 20 నుంచి 30 వేల మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాగే దీపక్ రెడ్డి వర్గం అనే భావనతో నియోజకవర్గంలో ఎంతో మంది టీæడీపీ నాయకులపై మంత్రి కాలవ అక్రమ కేసులు బనాయించారని, దాడులు చేయించారని ఆరోపించారు. గత ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఉన్న తనపై, తన కార్యకర్తలపై దాడులు చేసిన వైఎస్సార్సీపీ నాయకుడైన పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత మంత్రి కాలవ టీడీపీ వారికి ఇవ్వడం లేదని దుమ్మెత్తిపోశారు. మంత్రి నియోజకవర్గంలోని టీడీపీలో వర్గాలు ఏర్పాటు చేస్తున్నాడని, తన కోటరీలో దొంగలకు ఇస్తున్న ప్రాధాన్యత ఇస్తున్నాడన్నారు. అందువల్లే కార్యకర్తల నిర్ణయం మేరకు ఇండింపెండ్ంట్గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యానన్నారు. రెండురోజుల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకు తుది నిర్ణయం వెల్లడిస్తానన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు పసుపులేటి రామాంజనేయులు, మహాబలి, ఆదెప్ప, మారెన్న , చంద్రశేఖర్ రెడ్డి, ఓబనాయక, జయరాములు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీఐ ద్వారా వివరాలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కింగ్స్ గార్డెన్ యజమాని షహనవాజ్, మహ్మద్ జుబైరుద్దీన్‌లు తమకు చెందిన 6.10 ఎకరాల భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. అనుమతులు తీసుకోకుండానే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారన్న విషయానికి సంబంధించి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద పూర్తి సమాచారాన్ని తీసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం ఆ సమాచారంతో తిరిగి పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటును ఇచ్చింది. ఈ మేర కు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా ఆసిఫ్‌నగర్ మండలం గుడిమల్కాపూర్ గ్రామంలో ఉన్న తమ 6.10 ఎకరాల భూమిని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కింగ్స్ గార్డెన్ యజమాని షహనవాజ్, మహ్మద్ జుబైరుద్దీన్‌లు కబ్జా చేసి, అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇందుకు జీహెచ్ ఎంసీ కమిషనర్ దానకిషోర్ సహకరించారంటూ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి తరఫున ఆయన జీపీఏ హోల్డర్ తగశిరపు శివనాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. షహనవాజ్, మహ్మద్ జుబైరుద్దీన్లతో దాన కిషోర్ వ్యాపార భాగస్వామిగా ఉంటూ తమ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టా రని పిటిషన్లో పేర్కొన్నారు. వీటిని కూల్చివేయడంతోపాటు దాన కిషోర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, తమ స్థలంలో అక్రమ నిర్మా ణాలు చేస్తున్నారని దీపక్‌రెడ్డి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దానకిషోర్‌కు ఏం సంబంధం? ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా దాన కిషోర్ బాధ్యతలు చేపట్టి ఎంత కాలమైందని ప్రశ్నించారు. ఓ 3 నెలలు అయిందని న్యాయవాది చెప్పగా, మరి అంతకుముందు జరిగిన వ్యవహారాలతో అతనికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. -
ఏపీనా.. బిహారా..?
అనంతపురం, డీ.హీరేహాళ్: ‘నడిరోడ్డుపై మాజీ ప్రజాప్రతినిధి భర్తను కొందరు విచక్షణారహితంగా కొట్టుకుంటూ స్టేషన్ వరకు తీసుకొచ్చినా పోలీసులు చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. ఇది ఆంధ్రప్రదేశా.. లేక బిహారా..?’ అంటూ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ మాజీ ఎంపీపీ పుష్పావతి భర్త మహాబలేశ్వరప్పపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎమ్మెల్సీ ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ వద్ద అరగంట సేపు ధర్నా నిర్వహించారు. దాడి జరిగి మూడు రోజులైనా నిందితులను అరెస్ట్ చేయలేదని, పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. కొంత మంది నాయకులు చిల్లర, కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇసుక మాఫియా దొంగలే దాడికి పాల్పడ్డారని, అలాంటి వారిపై పోలీసులకు ఎందుకంత ప్రేమో తెలియడం లేదని మండిపడ్డారు. బాధితుడి ఫిర్యాదును ఎందుకు తీసుకోలేదు? దాడిలో గాయపడిన ఎంపీపీ భర్త స్టేషన్‌కు వచ్చినా ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదని సీఐని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. పోలీసులు రక్షణ కల్పించాల్సిందిపోయి, బాధితులనే భయపెడుతున్నారని విరుచుకుపడ్డారు. ఫిర్యాదుదారు ఏదైతే రాసుకొచ్చారో దాని ఆధారంగా కేసు నమోదు చేయాలన్నారు. అలా కాకుండా ఫిర్యాదు తప్పుగా ఉంది మార్చి రాయాలంటూ చించి వేస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఇక్కడి ఎస్ఐపైనా, మాజీ ఎంపీపీ భర్తపై దాడి చేసిన వారిపైనా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డీఐజీతో పాటు ముఖ్యమంత్రి వరకు సమస్యను తీసుకెళ్తామని హెచ్చరించారు. కుల రాజకీయాలతో చిచ్చు ఇక్కడ నాయకులు బీసీ వర్గాల్లో చిచ్చుపెట్టి, విభజించాలని చూస్తున్నారని, దొంగలు, దోపిడీదారులు అరాచకాలు చేస్తున్నా వారికి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. మాకు మంత్రి, పోలీసులు, నాయకుల అండ ఉందంటూ ఒక మాజీ ఎంపీపీ భర్తను కొట్టుకుంటూ స్టేషన్ వరకు తీసుకువచ్చినా ఇంత వరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం ఏమిటి? ఇదేమైనా పాళేగాళ్ల రాజ్యమా? అంటూ సీఐని ప్రశ్నించారు. రౌడీరాజ్యంలా మారింది.. మాజీ ఎంపీపీ పుష్పావతి మాట్లాడుతూ హీరేహాళ్ రౌడీ రాజ్యంగా మారిందని అన్నారు. పోలీసులు కనీస విలువలు లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. బాధితులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి అండతోనే, నాయకులు తన భర్తపై దాడిచేయించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నా తమకు రక్షణ లేకుండాపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. మహాబళేశ్వరప్ప మాట్లాడుతూ తనపై దాడి చేసిన వారే తన పొలంలో ఇసుకను తవ్వి తరలించారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. దాడి చేసిన వారు కళ్ల ముందే దర్జాగా తిరుగుతున్నా పోలీసులు అరెస్ట్ చేయడం లేదన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన తన భార్య, కొడుకుపైనే కేసులు నమోదు చేస్తామంటూ బెదిరించారని ఆరోపించారు. చట్ట ప్రకారం చర్యలు చట్టప్రకారం నిందితులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సీఐ సుబ్బరాయుడు తెలిపారు. ఉన్నతాధికారులకు జరిగిన సంఘటనపై నివేదిక అందిస్తామని ఎమ్మెల్సీకి హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ప్రహల్లాద, చంద్రశేఖర్‌రెడ్డి, హిర్దెహాళ్ మారెన్న తదితరులు పాల్గొన్నారు. -
అనంతపురం జిల్లా టీడీపీలో ముదిరిన వర్గపోరు
-
వందల్లో చెల్లించి.. కోట్లలో కొట్టేసి..
సాక్షి, హైదరాబాద్: రాజధాని నడిబొడ్డుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వందల కోట్ల విలువైన స్థలాలను కొట్టేయడానికి దీపక్‌రెడ్డి, శైలేశ్ తదితరులు భారీ కుట్రలే పన్నారు. ఒకే వ్యక్తిని వివిధ పేర్లతో ‘పరిచయం’చేస్తూ సదరు స్థలంపై జీపీఏలు, సేల్డీడ్లు తయారు చేయించారు. అతడికి వందల్లో చెల్లిస్తూ కోర్టులకు బోగస్ పేర్లతో తిప్పి వందల కోట్ల స్థలాలను కబ్జా చేసే కథ నడిపారు. అత్తాపూర్‌లోని రామ్‌బాగ్ ప్రాంతానికి చెందిన శివభూషణం ఎంజే మార్కెట్లోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వివిధ రకాలైన పత్రాలు విక్రయిస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే తరచుగా అక్కడకు వచ్చే మొఘల్‌పురకు చెందిన న్యాయవాది శైలేశ్ సక్సేనాతో 2000లో ఇతడికి పరిచయమైంది. తనకు అవసరమైనప్పుడల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి తాను చెప్పిన పేరుతో సంతకాలు చేయాలని కోరడంతో శివభూషణం అంగీకరించాడు. దీనికి ప్రతిఫలంగా శివభూషణంకు ఉన్న అప్పులు తీర్చడంతో పాటు కుమార్తె, కుమారుడి వివాహాలకు అవసరమైన సాయం చేస్తానంటూ శైలేశ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2004లో గుడిమల్కాపూర్‌లోని భోజగుట్టలో ఉన్న రూ.300 కోట్లకు పైగా ఖరీదైన 78 ఎకరాల రెండు గుంటల స్థలంపై శైలేశ్ కన్నేశాడు. ఈ స్థలాన్ని దాని యజమాని ఇక్బాల్ ఇస్లాం ఖాన్ తనకు విక్రయించినట్లు రికార్డులు రూపొందించి సివిల్ సూట్స్ వేశాడు. తాను నిర్వహిస్తున్న స్థల యజమాని ఇస్లాం ఖాన్ లేడని, కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడానికి అతడి సంతకాలు కావాలంటూ శివభూషణంతో శైలేశ్ చెప్పాడు. దీనికి ముందే ఇక్బాల్ ఇస్లాంఖాన్ తన పేరిట రాశాడంటూ ఓ బోగస్ జీపీఏ సృష్టించిన శైలేశ్ దాన్ని శివభూషణానికి చూపాడు. ఇక్బాల్ ఇస్లాంఖాన్‌గా నటించేందుకు శివభూషణం అంగీకరించడంతో బోగస్ పత్రాల ఆధారంగా 2004లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో భోజగుట్ట స్థలానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన శైలేశ్... శివభూషణాన్ని కోర్టుకు తీసుకువెళ్ళి ఇక్బాల్ ఇస్లాంఖాన్‌గా చూపించారు. న్యాయస్థానంలో ఇక్బాల్ ఇస్లాం ఖాన్‌గా సంతకాలు సైతం చేయించారు. కోర్టు వాయిదాలు ఉన్నప్పుడల్లా శివభూషణాన్నే ఇస్లాం ఖాన్‌గా న్యాయస్థానానికి హాజరయ్యేలా శైలేశ్ ఏర్పాట్లు చేశాడు. ఈ సమయంలో అతడి వెంట సక్సేనా అనుచరుడితో పాటు దీపక్‌రెడ్డి కూడా ఉండేవారు. ఒక్కో వాయిదాకు రూ.500 నుంచి రూ.700 శివభూషణంకు చెల్లించేవాడు. 2006 మార్చిలో దీపక్, శైలేశ్లు మరోసారి శివభూషణాన్ని ఉపయోగించుకున్నారు. గుడిమల్కాపుర్‌లో ఉన్న 78 ఎకరాల 22 గుంటలు, మాదాపూర్‌లోని ఎకరం స్థలంపై వీరి కన్ను పడింది. శివభూషణంతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు ఈ స్థలాలను ఎన్‌హెచ్ శైలజ, బి.ప్రకాశ్‌చంద్ సక్సేనా, జి.దీపక్‌రెడ్డిలకు విక్రయించినట్లు బోగస్ పత్రాలు సృష్టించారు. వీటిపై శివభూషణంతో పాటు శైలేశ్ సక్సేనా, దీపక్‌రెడ్డి తీసుకువచ్చిన మరో ఐదుగురు వ్యక్తులు సంతకాలు చేశారు. అతడే ఖాన్.. అతడే ఠాకూర్ వివిధ సందర్భాల్లో వినియోగించడానికి శివభూషణానికి బోగస్ గుర్తింపు కార్డు అవసరమైంది. దీంతో శైలేశ్, దీపక్‌రెడ్డి సంయుక్తంగా శివభూషణం ఫొటోతో, రాధాకృష్ణన్ ఠాకూర్ పేరుతో బోగస్ ఓటర్ ఐడీ రూపొందించారు. దీని ఆధారంగా శివభూషణాన్ని ఠాకూర్‌గా మార్చే శారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.12లో ఉన్న రూ.100 కోట్ల ఖరీదైన స్థలం ‘క్రయ విక్రయాల్లో’ఈ ఐడీని వాడారు. శివభూషణంను హైదరా బాద్ (సౌత్) జాయింట్ సబ్–రిజిస్ట్రార్ ఆఫీస్‌కు తీసుకువెళ్లారు. అక్కడ సదరు స్థలాన్ని విక్రయిస్తున్నట్లు ఠాకూర్ పేరుతో శివభూషణం సంతకం చేయగా, ఖరీదు చేస్తున్నట్లు దీపక్‌రెడ్డి సంతకం చేశారు. దీనికి ప్రతిఫలంగా శైలేశ్ రూ.వెయ్యి శివభూషణంకు ఇచ్చాడు. జీపీఏలో పొరపాటు దొర్లిందని చెప్పిన సక్సేనా 2008 అక్టోబర్‌లో మరోసారి శివభూషణంను రిజిస్ట్రార్ కార్యాలయానికి పిలిపించాడు. దీపక్‌రెడ్డి పేరుతో మరో డీడ్ చేయించి రూ.500 చెల్లించాడు. ఈ వ్యవహారాలకు సంబంధించి నమోదైన మొత్తం ఆరు కేసుల్ని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు గతేడాది శివభూషణంని అరెస్టు చేశారు. మావూరి శివభూషణం మృతి దీపక్‌రెడ్డి కబ్జాల కేసులో కీలక నిందితుడు భోజగుట్టసహా నగరంలో ఉన్న రూ.వందల కోట్ల భూములకు ‘పేపర్ యజమాని’, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, న్యాయవాది శైలేశ్ సక్సేనాలు రంగంలోకి దింపిన ‘నకిలీ దాదా’మావూరి శివభూషణం మంగళవారం మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అత్తాపూర్‌లోని ఇంట్లో చనిపోయాడు. భోజగుట్ట భూ కబ్జా కేసులో దీపక్‌రెడ్డి, శైలేశ్లతో పాటు గతేడాది సీసీఎస్ పోలీసులకు భూషణం చిక్కాడు. కాగా ఈ కేసుపై సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ‘సాక్షి’తో మాట్లాడారు. ‘సాధారణంగా ఎలాంటి కేసులోనూ నిందితులు న్యాయమూర్తి ముందు తమ నేరం అంగీకరిస్తూ వాంగ్మూలం (164 స్టేట్మెంట్) ఇవ్వరు. అయితే శివభూషణం మాత్రం గతంలోనే న్యాయస్థానంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేసు విచారణపై ఆయన మరణ ప్రభావం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఇతడికి కుమారుడిగా నటించిన బషీర్ సైతం ఈ కేసుల్లో కీలకం’అని మహంతి చెప్పారు. -
చంద్రబాబు సభలో దీపక్‌రెడ్డి కలకలం
-
చంద్రబాబు సభలో దీపక్‌రెడ్డి కలకలం
సాక్షి, అనంతపురం: ధర్మవరంలో సీఎం చంద్రబాబు పర్యటనలో వివాదం నెలకొంది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న దీపక్‌రెడ్డి.. ముఖ్యమంత్రి సభకు హాజరుకావడం వివాదానికి దారి తీసింది. జన్మభూమి- మాఊరు ముగింపు సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ధర్మవరం వచ్చారు. తన మామ జేసీ దివాకర్‌రెడ్డితో కలిసి దీపక్‌రెడ్డి సభకు హాజరయ్యారు. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన నాయకుడు సీఎం సభకు రావడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడైన దీపక్‌రెడ్డిని భూకబ్జా కేసుల్లో హైదరాబాద్ పోలీసులు గతేడాది జూన్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అన్నివైపుల నుంచి ఒత్తిడి వచ్చింది. పార్టీ పరువు కాపాడుకునేందుకు దీపక్‌రెడ్డిని టీడీపీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేశారు. మళ్లీ ఆయనతో ఈరోజు సీఎం చంద్రబాబు సభా వేదిక పంచుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు కేసుల నమోదు దీపక్‌రెడ్డిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ సెక్షన్ 506 కింద రెండు కేసులు, ఆక్రమణలకు పాల్పడ్డారంటూ సెక్షన్447 కింద కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కొందరిపై దాడి చేశారని సెక్షన్ 341 కింద ఓ కేసు, మారణాయుధాలు కలిగి ఉన్నాడని సెక్షన్ 148 కింద మరో కేసు నమోదైనట్లు సమాచారం. ఇవి కాకుండా భూకబ్జాలకు సంబంధించి హైదరాబాద్‌లో 6 కేసులు నమోదయ్యాయి. మాదాపూర్ పోలీసుస్టేషన్లో బెదిరింపుల కేసు, సైఫాబాద్ పోలీసుస్టేషన్లో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌ను బెదిరించిన కేసులు కూడా ఆయనపై ఉన్నాయి. -
ఎవరేమనుకున్నా మేమింతే!
నిత్యం ఏదో ఒక వివాదంలో జేసీ బ్రదర్స్ ప్రజాప్రతినిధులమనే సంగతి మరిచి దురుసు ప్రవర్తన సామాన్యులపై చేయి చేసుకోవడం, బెదిరించడమే నైజం విమానాశ్రయాల్లో దివాకర్‌రెడ్డి వీరంగాలు భూకబ్జా కేసులో ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డి అరెస్టు దీపక్‌రెడ్డి దందాలకు జేసీ సోదరుల సహకారం జేసీ బ్రదర్స్... రాజకీయాల్లో వీరు అదో టైపు! నోటికి ఏదొస్తే అది మాట్లాడడం.. సామాన్యులపై చేయి చేసుకోవడం, బెదిరించడం వీరి నైజం! నిత్యం ఏదో ఒక వివాదంలో, వార్తల్లో ఉండడం పరిపాటే. ఎవరేమనుకున్నా వీరు తీరు మార్చుకోరు. జేసీ బ్రదర్స్‌తోపాటు తాజాగా వారి అల్లుడు, టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి కూడా ఈ జాబితాలో చేరిపోయారు. తెలంగాణలో భూకబ్జా కేసులో అరెస్టయిన దీపక్‌రెడ్డిపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేయడం, అదేరోజు విశాఖపట్నం ఏయిర్‌పోర్టులో జేసీ దివాకర్‌రెడ్డి వీరంగం సృష్టించడంతో జేసీ ఫ్యామిలీ, వారి వ్యవహార శైలి అనంతపురం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గన్నవరం ఎయిర్‌పోర్టులోనూ చిందులు అనంతపురంలో ప్లాస్టిక్ నిషేధం పేరుతో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కొద్దినెలల క్రితం హల్చల్ చేశారు. తాడిపత్రి నుంచి భారీగా జనాలను రప్పించి నాలుగు రోజులపాటు నగరంలో కలియతిరిగారు. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న వ్యాపారులను ఇష్టానుసారంగా దూషించారు. నోటికి ఎంతమాట వస్తే అంత అనేశారు. కొంతమందిపై చేయి కూడా చేసుకున్నారు. కొన్ని దుకాణాలకు తాళాలు వేశారు. వారం రోజులపాటు తాళాలు తిరిగి ఇవ్వలేదు. దివాకర్‌రెడ్డి వైఖరిపై అనంతపురం జిల్లాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన గతంలో గన్నవరం విమానాశ్రయంలో చిందులు తొక్కారు. ఆలస్యంగా వచ్చారనే కారణంతో బోర్డింగ్‌పాస్ ఇవ్వకపోవడంతో సిబ్బందిపై వీరంగం వేశారు. తాజాగా విశాఖపట్నం విమానాశ్రయంలోనూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అలాగే ప్రవర్తించారు. సోదరుడి వైఖరీ అంతే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇతను కూడా తాను ప్రజాప్రతినిధి అనే విషయం మరిచిపోయి మాట్లాడుతుంటారు. తోటి ప్రజాప్రతినిధుల గురించి ఏకవచనంలో సంబోధిస్తుంటారు. ఇటీవల తెలంగాణకు సంబంధించిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులను అనంతపురం రూట్లో నిలిపేస్తున్నారని ఆ రాష్ట్ర ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్ ఆర్టీఏ కార్యలయానికి వెళ్లి వీరంగం సృష్టించారు. కొద్ది రోజుల క్రితం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అనంతపురం బైపాస్ రోడ్డులో టెంటు వేసి విపక్ష నేతను దుర్భాషలాడారు. దీపక్‌రెడ్డి చరిత్ర నేరమయం జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డి కూడా నేర చరిత్ర కలిగిన వ్యక్తే. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఇతడు 2012లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచాడు. తనకు రూ.6,781.05 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొని ఒక్కసారిగా జాతీయస్థాయిలో వార్తల్లోకెక్కాడు. రూ.వేల కోట్ల ఆస్తులను అఫిడవిట్లో చూపించిన వారు రాష్ట్రంలో ఎవరూ లేరు. బహుశా దేశంలోనే లేరేమో! ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డికి హైదరాబాద్‌లోనే రూ.15,000 కోట్లకుపైగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. నకిలీ పత్రాలు సృష్టించి చాలాచోట్ల ప్రభుత్వ భూములను కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కబ్జాలు, సెటిల్మెంట్లతో రూ.వేల కోట్ల ఆస్తులను ఆక్రమంగా సంపాదించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీపక్‌రెడ్డిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, దౌర్జన్యాలు, ఆక్రమణలకు పాల్పడడం, దాడి చేయడం, మారణాయుధాలు కలిగి ఉండడం వంటి కారణాలతో కేసులు నమోదైనట్లు సమాచారం. ఇవి కాకుండా భూకబ్జాలకు సంబంధించి హైదరాబాద్‌లో 6 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దీపక్‌రెడ్డిని అరెస్టు చేసి, జైలుకు తరలించారు. దీపక్‌రెడ్డి చేసిన సెటిల్మెంట్లకు జేసీ బ్రదర్స్‌తోపాటు జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి కూడా సహకరించినట్లు తెలుస్తోంది. -
టీడీపీ నుంచి దీపక్‌రెడ్డి సస్పెన్షన్
విజయవాడ: భూ అక్రమాల కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపై వేటు పడింది. ఆయనను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. హైదరాబాద్‌లో భూముల కుంభకోణంలో అరెస్టైన దీపక్‌రెడ్డిని బహిష్కరించాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేయడంతో టీడీపీ దిగివచ్చింది. సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన టీడీపీ సమన్వయ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడైన దీపక్‌రెడ్డిని భూకబ్జా కేసుల్లో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఫోర్జరీ పత్రాలతో భూకబ్జాకు ప్రయత్నించినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.2లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న సర్వే నం.129/71లోని 3.37 ఎకరాల స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టుగా సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు వివాదంపై కూడా టీడీపీ సమన్వయ భేటీలో చర్చించారు. విభేదాలను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దని అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులను చంద్రబాబు హెచ్చరించినట్టు సమాచారం. పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం, నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కూడా సమన్వయ భేటీలో చర్చించినట్టు తెలిసింది. -
దీపక్‌పై వేటు పడేనా?
– సీబీఐ దాడుల నేపథ్యంలో ఎమ్మెల్సీ వాకాటిపై టీడీపీ సస్పెన్షన్ వేటు – అరెస్టయిన దీపక్‌రెడ్డిపై కూడా చంద్రబాబు వేటు వేస్తారా అని సర్వత్రా చర్చ – దీపక్‌రెడ్డి చరిత్ర ఆది నుంచీ నేరపూరితమే – జేసీ బ్రదర్స్ అండతో కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) దీపక్‌రెడ్డి ఐదేళ్ల కిందట వరకూ ‘అనంత’కు పరిచయం లేని పేరు. 2012 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రాయదుర్గం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఒక్కసారిగా అందరి నోళ్లలో నానారు. గెలిచి కాదు..ఆయన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల చిట్టాతోనే! రాష్ట్రంలో.. బహుశా దేశంలోనే ఏ అసెంబ్లీ అభ్యర్థీ చూపించిన విధంగా తనకు రూ.6,781కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొని ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జిల్లా నుంచి కనుమరుగయ్యారు. తాజాగా తిరిగి వార్తల్లోకి వచ్చారు. భూకబ్జా కేసుల్లో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో ఆయనపై ‘అనంత’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సీబీఐ దాడుల నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై ఇటీవల సస్పెన్షన్ వేటు వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు భూకబ్జా లాంటి భారీ అక్రమాలతో ఏకంగా అరెస్టయిన ఎమ్మెల్సీ దీపక్రెడ్డిపైన సస్పెన్షన్ వేటు వేస్తారా? వేయరా? అనే చర్చ విపక్షంతో పాటు అధికార పక్షంలోనూ నడుస్తోంది. దీపక్‌రెడ్డి చరిత్ర నేరపూరితమే! దీపక్‌రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయాన అల్లుడు. ఈయన నెల్లూరు జిల్లాకు చెందినవారు. అయితే.. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. 2012 ఉప ఎన్నికలకు ముందు డీ.హీరేహాళ్‌లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ ఉప ఎన్నికల్లో రాయదుర్గం నుంచి పోటీ చేశారు. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను పేర్కొంటూ వార్షిక ఆదాయం రూ.3.27లక్షలుగా, తన భార్య ఆదాయం రూ.1.98 లక్షలుగా పేర్కొన్నారు. తన పేరుతో రూ.4.59 కోట్ల చరాస్తులు, రూ.5.86 కోట్ల స్థిరాస్తులు , భార్య పేరుతో రూ.1.76 కోట్ల చరాస్తులు, రూ.16.86 కోట్ల స్థిరాస్తులు, ఇతర వాటాలు ఉన్నట్లు చూపారు. ఇవి కాకుండా మరో రూ.6,781.05కోట్ల ఆస్తులను చూపించారు. ఇవి వివాదాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఏడాదికి రూ.3.27లక్షల వార్షికాదాయం ఉండే వ్యక్తి రూ.6,781 కోట్ల ఆస్తులను ఎలా సంపాదించారు? ఇది సాధ్యమేనా అని అప్పట్లోనే సర్వత్రా చర్చ నడిచింది. దీపక్‌రెడ్డి ఇంత భారీస్థాయిలో ఆస్తులు సంపాదించేందుకు కారణం భూకబ్జాలు, సెటిల్మెంట్లే అని అప్పట్లోనే అంతా భావించారు. ఆదాయ పన్ను శాఖకు దీపక్‌రెడ్డి రూ.5 లక్షలు మాత్రమే రిటర్న్స్ చూపించడంతో ఈ ఆస్తులు మొత్తం అవినీతి సంపాదనగా వచ్చి ఉండొచ్చని, ఈయన చరిత్ర కూడా నేరపూరితమేనని భావించారు. హైదరాబాద్‌లోనే రూ.15 వేల కోట్ల ఆస్తులు? దీపక్‌రెడ్డికి హైదరాబాద్‌లోనే రూ.15 వేల కోట్లకుపైగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. నకిలీ పత్రాలు సృష్టించి చాలాచోట్ల ప్రభుత్వ భూములను కాజేసినట్లు ఆరోపణలున్నాయి. శంషాబాద్ మండలం కొత్వాల్గూడెంలో ఖరీదైన మూడెకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో దీపక్‌రెడ్డి పేరుతో అత్యంత విలువైన 8,084, అతని భార్య పేరుతో 13,224 చదరపు అడుగుల స్థలాలు ఉన్నట్లు సమాచారం. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో దీపక్‌రెడ్డికి 840 గజాల స్థలం, బెంగళూరులో అతని భార్యకు అత్యంత విలువైన 2,400గజాల స్థలం ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోనూ భార్య పేరుతో రూ. 7 కోట్లకుపైగా విలువ చేసే 16వేల చదరపు అడుగుల వాణిజ్యస్థలం ఉన్నట్లు తెలుస్తోంది. పలు కేసుల నమోదు దీపక్‌రెడ్డిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ సెక్షన్ 506 కింద రెండు కేసులు, ఆక్రమణలకు పాల్పడ్డారంటూ సెక్షన్447 కింద కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కొందరిపై దాడి చేశారని సెక్షన్ 341 కింద ఓ కేసు, మారణాయుధాలు కలిగి ఉన్నాడని సెక్షన్ 148 కింద మరో కేసు నమోదైనట్లు సమాచారం. ఇవి కాకుండా భూకబ్జాలకు సంబంధించి హైదరాబాద్‌లో 6 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మంగళవారం దీపక్‌ను అరెస్టు చేశారు. గతంలోనూ మాదాపూర్ పోలీసుస్టేషన్లో బెదిరింపుల కేసు, సైఫాబాద్ పోలీసుస్టేషన్లో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌ను బెదిరించిన కేసులు నమోదయ్యాయి. జేసీ బ్రదర్స్ అండతోనే దందాలు! దీపక్‌రెడ్డి చేసిన దందాల వెనుక జేసీ బ్రదర్స్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 2004–2009 మధ్య కాలంలో జేసీ దివాకర్‌రెడ్డి మంత్రిగా ఉండటం, జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటంతో హైదరాబాద్‌లో సెటిల్మెంట్లు, కబ్జాల అంశాల్లో జేసీ బ్రదర్స్ జోక్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడేవారని తెలుస్తోంది. వీరి అండతోనే దీపక్ భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు వినికడి. హైదరాబాద్‌లోని సెటిల్మెంట్లలో జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి కూడా దీపక్‌రెడ్డికి సహకారం అందినట్లు తెలుస్తోంది. బాబు..వేటు వేస్తారా? వాకాటి నారాయణరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడంతో ఇప్పుడు టీడీపీతో పాటు విపక్షాల దృష్టి దీపక్‌రెడ్డిపై పడింది. చంద్రబాబు నిజంగా అవినీతికి తావు ఇవ్వని వ్యక్తిగా చెప్పుకునేందుకే వాకాటిపై వేటు వేసి ఉంటే, ఇప్పుడు ఏకంగా అరెస్టయిన దీపక్‌రెడ్డిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విపక్ష సభ్యులతో పాటు కొందరు స్వపక్షసభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. జేసీ బ్రదర్స్ బ్లాక్మెయిల్ రాజకీయాల వలలో చంద్రబాబు చిక్కుకుని ఉన్నారని, దీపక్‌రెడ్డిపై వేటు వేసే ధైర్యం చేయలేరని కూడా పలువురు చర్చించుకుంటున్నారు. దీపక్‌రెడ్డి గత చరిత్ర మొత్తం నేరపూరితమని తెలిసికూడా చంద్రబాబు ఆయన్ను ఎమ్మెల్సీగా ప్రకటించినప్పుడే సీఎం వైఖరి స్పష్టమైందని విపక్షాలు అంటున్నారు. ఈక్రమంలో చంద్రబాబు ఎలాంటి చర్యకు ఉపక్రమిస్తారో వేచిచూడాలి! -
ఏడాదిలోనే డిగ్రీ పాస్.. భారీగా భూదందా!
హైదరాబాద్: సీసీఎస్ అధికారులు అరెస్టు చేసిన టీడీపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై గతంలో ఎన్నో భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దీపక్‌రెడ్డికి 15 వేల కోట్ల విలువైన స్థలాలు ఉన్నట్లు తెలుస్తోంది. దొంగ పత్రాలు సృష్టించి ఎన్నో ప్రభుత్వ భూములను కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకే చోట దీపక్‌రెడ్డికి 3 వేల 128 ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం. 2012 ఉప ఎన్నికలో రాయదుర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన దీపక్‌రెడ్డి...2017లో స్థానిక సంస్థల కోటాలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. అయితే 2012 ఎన్నికల్లో నామినేషన్ పత్రాల్లో 6 వేల 781 కోట్లు మాత్రమే ఆస్తులున్నట్లు అఫిడవిట్ సమర్పించాడు. దాంతోపాటు కేవలం ఏడాది కాలంలోనే డిగ్రీ పాసైనట్లు దీపక్‌రెడ్డి అఫిడవిట్లో పేర్కొన్నాడు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆస్తులు చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. శంషాబాద్ మండలం కొత్వాల్ గూడెలో అతనికి విలువైన మూడు ఎకరాలకు పైగా భూములు వున్నాయి. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో అత్యంత ఖరీదైన 8084 చదరపు అడుగుల స్థలం, అదే రోడ్లో అతని భార్యకు 13,224 చదరపు అడుగుల స్థలం వున్నాయి. అలాగే శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో దీపక్ రెడ్డికి 840 గజాల స్థలం, బెంగళూరులో అతని భార్యకు అత్యంత విలువైన 2400 గజాల స్థలం వున్నాయి. జూబ్లీహిల్స్‌లోనూ అతని భార్య పేరుతో 7 కోట్లకు పైగా విలువచేసే 16,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం వుంది. దీపక్ రెడ్డిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, దౌర్జన్యానికి పాల్పడ్డాడంటూ IPC 506 కింద అతనిపై రెండు కేసులు, అక్రమణలకు పాల్పడ్డాడంటూ IPC 447 సెక్షన్ కింద మరొక కేసు నమోదయ్యాయి. కేసుల పరంపర అంతటితోనే ఆగలేదు. అడ్డుకోవడంతోపాటు దాడి చేశాడంటూ IPC 341 కింద కేసు, అల్లర్లకు పాల్పడ్డాడంటూ 147 సెక్షన్ కింద కేసు, మారణాయుధాలు కలిగి వున్నాడంటూ 148 సెక్షన్ కింద మరొక కేసు నమోదయ్యాయి. భోజగుట్టలో పేదల భూమిని కొల్లగొట్టేందుకే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డితో పాటు మరికొందరు ప్రయత్నించారని....విచారణలో అది నిజమని తేలడంతో అరెస్ట్ చేశామని సీసీఎస్ అడిషనల్ డీసీపీ జోగయ్య తెలిపారు. దొంగ పత్రాలు సృష్టించి భూములు కొల్లగొట్టేందుకు యత్నించారని చెప్పారు. వందల ఎకరాల కబ్జా చేసినట్టు పలు స్టేషన్ల నుంచి ఫిర్యాదులు రావడంతోనే....కేసును విచారణకు స్వీకరించి అరెస్ట్ చేశామన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్ట్‌తో ఆయన బాధితుల సంబరాలు అంబరాన్నంటాయి. బోజగుట్టలో బాధితులు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా తమను దీపక్‌రెడ్డి బెదిరిస్తూ ఎన్నో భూములను కబ్జా చేశాడని...ఎట్టకేలకు దీపక్‌రెడ్డి అరెస్ట్‌తో తమ బాధలకు విముక్తి లభించిదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రిమాండ్‌లో ఉన్నా ఫోన్ లో రాయబారాలు సాధారణంగా రిమాండ్‌లో వున్న వ్యక్తి ఫోన్ ఉపయోగించడం రూల్స్ ఒప్పుకోవు. అయితే దీపక్ రెడ్డి ముందు రూల్స్ బలాదూర్ అన్నట్లుగా వుంది. ఆయనను 15 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ దీపక్ రెడ్డి పోలీసుల రిమాండ్‌లో ఉండగానే నింపాదిగా ఫోన్లో రాయబారాలు జరపడం సాక్షి కెమెరాకు చిక్కింది. -
పూర్తి విచారణ జరిగితే మరిన్ని విషయాలు
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి దొంగపత్రాలు సృష్టించి హైదరాబాద్‌లో భూ కబ్జాలకు పాల్పడ్డారని సీసీఎస్ అడిషనల్ డీసీపీ జోగయ్య వెల్లడించారు. కోర్టుకు దొంగపత్రాలు సమర్పించారని, పూర్తి విచారణ జరిగితే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని ఆయన వెల్లడించారు. దీపక్‌రెడ్డి అండ్ కో వందల ఎకరాలు కబ్జా చేసినట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని జోగయ్య వెల్లడించారు. భోజగుట్టలో పేదల భూమిని కొల్లగొట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇక్కడ 78.33 ఎకరాలను కబ్జా చేసిన కేసులో పోలీసులు అయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో 8 ఎకరాలు, షేక్‌పేటలో 12 ఎకరాల భూమితో పాటు.. నానక్‌రామ్‌గూడ, జూబ్లీ హిల్స్లలో దీపక్‌రెడ్డి అండ్ కో కబ్జాలకు పాల్పడింది. -
దీపక్‌రెడ్డి కబ్జాల్లో ఎన్నో కథలు..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి కబ్జా దందాల్లో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. కబ్జాలపై నమోదైన మొత్తం ఆరు కేసుల్ని దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు కీలక నిందితుడు ఒకర్ని అరెస్టు చేయడంతో.. న్యాయవాది శైలేష్ సక్సేనాతో కలసి దీపక్‌రెడ్డి చేసిన దందాలు బయటకు వస్తున్నాయి. ఎంజే మార్కెట్లోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వివిధ రకాల పత్రాలు విక్రయించే శివభూషణంతో శైలేష్ సక్సేనా, దీపక్‌రెడ్డి బోగస్ సంతకాలు చేయించేవారని వెల్లడైంది. దీనికి ప్రతిఫలంగా శివభూషణం కుమార్తె, కుమారుడి వివాహం జరిపిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. 2004లో భోజగుట్టలో ఉన్న రూ. 300 కోట్లకు పైగా ఖరీదైన 78 ఎకరాల స్థలానికి సంబంధించి న్యాయ వివాదాలు సృష్టించారు. ఆ స్థలం యజమాని ఇక్బాల్ ఇస్లాం ఖాన్‌లాగా న్యాయస్థానంలో శివభూషణంతో సంతకాలు చేయించారు. వాయిదాలు ఉన్నప్పుడల్లా శివభూషణాన్నే.. ఇక్బాల్ ఇస్లాం ఖాన్‌గా కోర్టుకు తీసుకెళ్లేవారు. 2006 మార్చ్‌లో మరోసారి శివభూషణాన్ని శైలేష్ సక్సేనా, దీపక్‌రెడ్డి బోగస్ సంతకాలకు వాడుకున్నారు. గుడిమల్కాపూర్‌లో ఉన్న 78 ఎకరాలు 22 గుంటలు, మాదాపూర్‌లోని ఎకరం స్థలాన్ని శివభూషణంతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు ఎన్‌హెచ్ శైలజ, బి.ప్రకాష్ చంద్ సక్సేనా, జి.దీపక్‌రెడ్డిలకు విక్రయించినట్లు బోగస్ పత్రాలు సృష్టించారు. వివిధ సందర్భాల్లో వినియోగించడానికి శివభూషణానికి రాధాకృషన్ ఠాకూర్ పేరుతో బోగస్ ఓటర్ ఐడీ సృష్టించారు. ఆ బోగస్ ఓటర్ ఐడీని బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.12లో ఉన్న రూ.100 కోట్ల విలువైన స్థలం ‘క్రయ విక్రయాల్లో’ వాడారు. ఇదే తరహాలో జరిగిన మరిన్ని దందాలు సీసీఎస్ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసులో ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి పొందిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. దీపక్‌రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి అల్లుడనే విషయం తెలిసిందే. -
చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం
సీఎంపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్య రాయదుర్గం: ముఖ్యమంత్రి చంద్రబాబు కూరల్లో కరివేపాకులా వ్యక్తులను అవసరమైనపుడు మాత్రమే వాడుకుని వదిలేసే రకమని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ అప్రదిష్టను తొలగించుకోవడానికే తన అల్లుడు దీపక్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు. దీపక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాయదుర్గం నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఆదివారం ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. బాబుకు ఉన్నంత ఆశ దేశంలో ఏ ఒక్కరికీ లేదన్నారు. జిల్లాకు సాగునీరు ఇచ్చేలా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని కోరారు. రాజకీయాల్లో డబ్బుకే ప్రాధాన్యత ఉందన్నారు. ప్రజల జేబుల్లో చేతులు పెట్టకూడదని, అలా అలవాటు చేసుకుంటే వారి రాజకీయ జీవితం ముగిసినట్టేనని పేర్కొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి బెదిరింపుల దందా
- తనపై భూకబ్జా కేసు విత్‌డ్రా చేసుకోవాలంటూ హెచ్చరికలు - మాదాపూర్ పోలీసు స్టేషన్లో బాధితుడు మూర్తి ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ పత్రాలతో భూ కబ్జాకు ప్రయత్నించిన కేసులో నిందితుడైన టీడీపీ నేత, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి బెదిరింపుల దందాకు దిగారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన భూకబ్జా కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న మాదాపూర్ వాసి ఎం.రాధాకృష్ణమూర్తిని దీపక్‌రెడ్డి బెదిరిం చారు. బాధితుడి ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు శనివారం దీపక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నం.286/2017తో రిజిస్టరైన ఈ కేసులో అనుమతి లేకుండా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించడం (ఐపీసీ 448), బెదిరించడం (ఐపీసీ 506) సెక్షన్ల కింద ఆరోపణలను చేర్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన దీపక్‌రెడ్డి ఆ జిల్లాలోని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి స్వయానా అల్లుడు. 3.37 ఎకరాలపై కన్ను బంజారాహిల్స్‌లోని రోడ్ నం.2లో ఉన్న సర్వే నెం.129/71లోని 3.37 ఎకరాల స్థలంపై దీపక్‌రెడ్డి సహా ఇతర నిందితులు కన్నేశారు. ఈ స్థలాన్ని దశాబ్దాల క్రితం నగరంలో నివాసం ఉన్న శరణార్థి అయూబ్ కమల్‌కు ప్రభుత్వం కేటాయించింది. దీన్ని ఆయన నుంచి 1960 లో ఎంవీఎస్ చౌదరితో పాటు ఆయన సోద రులు ఖరీదు చేశారు. అయూబ్ కమల్ ఈ స్థలాన్ని అన్సారీ బ్రదర్స్‌కు విక్రయించినట్లు, వారి నుంచి దీన్ని తాము ఖరీదు చేసినట్లు జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థకు చెందిన బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాశ్ చంద్ర సక్సేనాలతోపాటు జి.దీపక్‌రెడ్డి బోగస్ డాక్యుమెంట్లు రూపొందించి, సివిల్ సూట్ వేయడం ద్వారా తదుపరి చర్యలకు ఉప క్రమించారు. దీంతో ఎంవీఎస్ చౌదరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. షేక్‌పేట్ మండల రెవెన్యూ అధికారులు విచారించి ఆ స్థలం ఎంవీఎస్ చౌదరిదని తేల్చారు. దీంతో చౌదరి తరపు ప్రతినిధి, మాదాపూర్‌కు చెందిన ఎం.రాధాకృష్ణ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బదులు చెప్పలేక నీళ్లు నమిలిన దీపక్ సీసీఎస్ పోలీసులు దీపక్‌రెడ్డిని శనివారం విచారించగా.. ఆ స్థలానికి, తనకు సంబం ధం లేదన్నారు. అయితే, పోలీసులు ఎన్నికల అఫిడవిట్లో ఈ స్థలం వివరాలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. దీంతో దీపక్‌రెడ్డి బదులు చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలిసింది. నిందితుడిపై చర్యలు తీసుకుంటాం ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న మాదాపూర్ వాసి ఎం.రాధాకృష్ణమూర్తిని దీపక్‌రెడ్డి బెదిరించారు. శనివారం ఉదయం 7.10 గంటలకు మూర్తి ఇంటికి వెళ్లిన దీపక్‌రెడ్డి దాదాపు 45 నిమిషాలపాటు అక్కడే ఉండి, తనపై కేసును ఉపసంహ రించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తనకున్న అనంతపురంలో మూర్తిపై తప్పు డు కేసులు నమోదు చేయిస్తానంటూ హెచ్చరించారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు మేరకు దీపక్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ కళింగ్రావ్ చెప్పారు. -
ఫోర్జరీ కేసులో టీడీపీ ఎమ్మెల్సీకి ముందస్తు బెయిల్
► దీపక్‌రెడ్డికి మంజూరు చేసిన నాంపల్లి న్యాయస్థానం ►రద్దు కోరుతూ హైకోర్టును ఆశ్రయించనున్న సీసీఎస్ సాక్షి, అనంతపురం: ఫోర్జరీ పత్రాలతో భూకబ్జాకు యత్నించిన కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈయనతో పాటు మరికొందరిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు ఫోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం విదితమే. ఈ బెయిల్ రద్దు చేయాల్సిందిగా కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలని సీసీఎస్ పోలీసుల నిర్ణయించారు. రాయదుర్గంకు చెందిన దీపక్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయాన అల్లుడు. ఫోర్జరీ కేసులో సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేయడానికి ప్రయత్నించినా దొరక్కుండా దీపక్‌రెడ్డి తప్పించుకు తిరిగారు. అనారోగ్య కారణాల నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా... పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం మంజూరు చేసింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.2లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న సర్వే నెం.129/71లోని 3.37 ఎకరాల స్థలంపై దీపక్‌రెడ్డి సహా ఇతర నిందితులు కన్నేశారు. ఈ స్థలాన్ని కొన్ని దశాబ్దాల క్రితం నగరంలో నివాసం ఉన్న శరణార్థి అయూబ్ కమల్‌కు ప్రభుత్వం కేటాయించింది. దీన్ని ఆయన నుంచి 1960లో ఎంవీఎస్ చౌదరితో పాటు ఆయన సోదరులు ఉమ్మడిగా ఖరీదు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి ఆధీనంలోనే ఉంది. అయితే అయూబ్ కమల్ ఈ స్థలాన్ని అన్సారీ బ్రదర్స్‌కు విక్రయించినట్లు, వారి నుంచి దీన్ని తాము ఖరీదు చేసినట్లు జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థకు చెందిన బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాష్ చంద్ర సక్సేనాలతో పాటు జి.దీపక్‌రెడ్డి బోగస్ డాక్యుమెంట్లు రూపొందించారు. వీటి ఆధారంగా సివిల్ సూట్ దాఖలు చేయడం ద్వారా తదుపరి చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఎంవీఎస్ చౌదరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన షేక్‌పేట్ మండల రెవెన్యూ అధికారులు ఆ ఖరీదైన స్థలానికి ఎంవీఎస్ యజమానిగా తేల్చారు. దీంతో చౌదరి తరఫున ఆయన ప్రతినిధి మాదాపూర్‌కు చెందిన ఎం.రాధాకృష్ణ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వివరణ కోరుతూ దీపక్‌రెడ్డికి నోటీసులు జారీ చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఆయనకు హైదరాబాద్‌లో ఉన్న రెండు ఇళ్లల్లో వాకబు చేయగా..ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడిలో అనంతపురంలో ఉన్నట్లు అక్కడి వారు చెప్పారు. దీంతో ఓ ప్రత్యేక బృందం అనంతపురం వెళ్లి ప్రయత్నించినా దీపక్‌రెడ్డి ఆచూకీ లభించలేదు. దీంతో ఏపీ రాజధాని అమరావతిలోనూ కొన్ని రోజులు దీపక్‌రెడ్డి కోసం అధికారులు ప్రయత్నించారు. అక్కడ కూడా నోటీసులు తీసుకోవడానికి పోలీసులకు అందుబాటులోకి రాని దీపక్‌రెడ్డి న్యాయస్థానం ద్వారా ముందస్తు బెయిల్ పొందారు. దీన్ని రద్దు చేయించడానికి హైకోర్టును ఆశ్రయించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మిగిలిన నిందితులు బి.శైలేష్ సక్సేనా, బి.సంజయ్ సక్సేనా, బి.ప్రకాష్ చంద్ర సక్సేనాల కోసం కూడా సీసీఎస్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
డిక్లరేషన్ అందుకున్న దీపక్
అనంతపురం అర్బన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుణపాటి దీపక్‌రెడ్డి శనివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం నుంచి డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ యామినీబాల, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, గోనుగుంట్ల సూర్యనారాయణ, ఎమ్మెల్సీ కేశవ్ తదితరులు ఉన్నారు. -
ఏకగ్రీవమా? పోటీనా?
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురి నామినేషన్ - టీడీపీ తరఫున దీపక్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి - స్వతంత్ర అభ్యర్థిగా పైలా - పైలా నామినేషన్ ఉపసంహరించుకోకపోతే పోలింగ్ అనివార్యం అనంతపురం అర్బన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకోవాలనుకున్న టీడీపీ ఆశలు అడియాసలయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా తాడిపత్రి పట్టణానికి చెందిన పైలా నరసింహయ్య నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. ఒకవేళ ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే పోటీ అనివార్యం కానుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. చివరిరోజు టీడీపీ అభ్యర్థి గుణపాటి దీపక్‌రెడ్డి (మూడు సెట్లు), ఆయనకు సపోర్ట్‌గా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జూటూరు అస్మిత్‌రెడ్డి (ఒక సెట్టు) నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే పైలా నరసింహయ్య స్వతంత్ర అభ్యర్థిగా(రెండు సెట్లు) నామినేషన్ వేశారు. వీరు తమ నామినేషన్ పత్రాలను కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతంకు అందజేశారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్సీపీ దూరంగా ఉంది. దీంతో ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవంగా దక్కుతుందని టీడీపీ నాయకులు భావించారు. అయితే అనూహ్యంగా సీపీఐకి చెందిన పైలా నరసింహయ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన ఫిబ్రవరి 21 నుంచి నుంచి 27వ తేదీ వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. చివరిరోజు మాత్రం ముగ్గురు వేశారు. టీడీపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి ఒక్కరే నామినేషన్ వేసి ఉంటే ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవమయ్యేది. పైలా కూడా నామినేషన్ వేయడంతో పోలింగ్ అనివార్యమయ్యేలా కన్పిస్తోంది. అయితే.. ఈ నెల మూడున నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంది. దీపక్‌రెడ్డికి సపోర్ట్‌గా వేసిన జూటూరు అస్మిత్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇక పైలా నరసింహయ్య తన నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే టీడీపీ ‘ఏకగ్రీవ ఆశలు’ గల్లంతవుతాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగా – పైలా నరసింహయ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను విస్మరించి టీడీపీ సామాజిక న్యాయం పాటించడంలేదు. సరికదా ఎన్నికను ఏకగ్రీవం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూస్తోంది. ఇది జరగకూడదనే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశా. సామాజిక న్యాయాన్ని అనుసరించి టీడీపీ టికెట్ ఇచ్చి ఉంటే పోటీ చేసేవాడిని కాదు. తెలంగాణకు చెందిన దీపక్‌రెడ్డికి ఇక్కడ టికెట్ ఇవ్వడమేంటి? ఎన్నికల్లో పోటీ చేసేందుకు నా సమీకరణలు నాకున్నాయి. టీడీపీ అభ్యర్థిదే విజయం – మంత్రి కొల్లు రవీంద్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి విజయం సాధిస్తారని జిల్లా టీడీపీ ఇన్చార్జ్, మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీపక్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఆయనతో పాటు మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాల, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బి.కె.పార్థసారథి, జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం విలేకరులతో మంత్రులు, ఇతర నాయకులు, అభ్యర్థి మాట్లాడారు. స్థానిక సంస్థల్లో పూర్తి మెజారిటీ ఉన్న టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందన్నారు. ఏకగ్రీవ ఎన్నికకు అందరూ సహకరించాలని కోరారు. నేడు నామినేషన్ల పరిశీలన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన బుధవారం నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మూడో తేదీ ఆఖరు. 17న పోలింగ్, 20వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓటర్లుగా ఉంటారు. మునిసిపాలిటీల్లో ఎక్స్ అఫిషియో సభ్యులు కాని ఎమ్మెల్యేలకు మాత్రం ఓటు హక్కు ఉండదు. ఉరవకొండ, రాప్తాడు, పెనుకొండ, శింగనమల నియోజకవర్గాల పరిధిలో మునిసిపాలిటీలు లేనందున ఈ నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఓటు ఉండదు. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 1,278 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంపీటీసీ సభ్యులు 832 మంది, జెడ్పీటీసీ సభ్యుడు 63 మంది, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 367 మంది, ఎమ్మెల్యేలు 10 మంది, ఎమ్మెల్సీలు నలుగురు, ఇద్దరు ఎంపీలు ఓటర్లుగా ఉన్నారు. -
'నేనంటే ఏమనుకుంటున్నారో...'
రాయదుర్గం : నేనంటే ఏమనుకుంటున్నారో... మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తా అంటూ టీడీపీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి దీపక్ రెడ్డి ఎన్నికల అధికారులు, పోలీసులపై నిన్న వీరంగం వేశారు. వివరాల్లోకి వెళితే దీపక్ రెడ్డికి ఎన్నికల ఏజెంట్‌గా ఇచ్చిన అనుమతిని ఆర్వో రద్దు చేశారు. ఈ సమాచారం పోలీసులకు అందచేసి ఆయనను హౌస్ అరెస్ట్ చేయాలని సూచించారు. ఈ మేరకు పోలీసులు ఉదయం 7 గంటలకు దీపక్ రెడ్డిని కలిసి హౌస్ అరెస్టు చేస్తున్నామని, ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని తెలిపారు. దీనిపై ఆయన ఫైర్ అయ్యారు. 'నేను టీడీపీ ఎమ్పీ అభ్యర్థి ఎన్నికల చీఫ్ ఏజెంట్‌ను, నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారా, అభ్యర్థులను అడ్డగించినా, నన్ను అడ్డగించే అధికారం మీకులేదు' అంటూ రభస చేశారు. పోలీసులు ఆయనకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా దీపక్ రెడ్డి మొండిపట్టు వీడలేదు. తన ఏజెంట్ అనుమతిని రద్దుచేస్తే నియోజకవర్గంలోని అన్ని బూత్‌ల ఎన్నికలను నిలపాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సీపీకి అమ్ముడుపోయారని పోలీసులపై ఆరోపణలు చేశారు. 'కల్యాణదుర్గంలో మీపై పాత కేసులున్నాయి, ఈ కారణంగా అరెస్ట్ చేసి కల్యాణదుర్గానికి తీసుకెళ్తాం' అని సీఐ భాస్కర్ రెడ్డి, డీఎస్పీ రమాకాంత్ రావు ...దీపక్ రెడ్డిని హెచ్చరించారు. దీంతో మెత్తబడిన దీపక్ రెడ్డి పోలీసుల ఆదేశాల మేరకు తన ఇంట్లోకి వెళ్లిపోవడంతో సమస్య సద్దుమణిగింది. -
దీపక్‌రెడ్డి పేల్చిన బాంబు : టిడిపిలో కలకలం
తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ బాధ్యుడు గుణపాటి దీపక్‌రెడ్డి చేసి సంచలన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. టిడిపి రాయలసీమ బాధ్యుడు సిఎం రమేష్‌ను ఓ చీడ పురుగుగా పేర్కొన్నారు. బ్రోకర్ పాత్ర పోషిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి సోదరుడు ప్రభాకర రెడ్డి అల్లుడైన దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో రాయదుర్గం నుంచి పోటీచేసే ఓడిపోయారు. ఆ తరువాత ఆయన స్థానికంగా ఉంటూ పార్టీ కోసం పనిచేశారు. రాయదుర్గం శాసనసభ టికెట్ వస్తుందని ఆశించారు. రాయదుర్గం శాసనసభ స్థానం కాలువ శ్రీనివాస్‌కు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని వారం రోజుల క్రితం హెచ్చరించారు. అయినా ఫలితంలేదు. అధిష్ఠానం తన మాటలను లెక్కచేయకుండా మొండిచేయి చూపడంతో భంగపడ్డారు. దాంతో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి తన సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. దీపక్ రెడ్డి నిన్న విలేకరులతో మాట్లాడుతూ సీమాంధ్రలో పార్టీ ఓడిపోతే అందుకు రమేషే కారణమవుతారన్నారు. అతను పలువురిని మభ్యపెట్టి కోట్ల రూపాయలు దండుకోడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కొత్తగ రాజకీయ ప్రవేశం చేసిన కె.వి.ఉష అనే బిసి మహిళ నుంచి మూడు కోట్ల రూపాయలు, హైదరాబాద్ మల్కాజ్గిరి లోక్‌సభ అభ్యర్థి మల్లారెడ్డి నుంచి 20 నుంచి 60 కోట్ల రూపాయల వరకు రమేష్ వసూలు చేసినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తుకు ఆయనే కారణమని చెప్పారు. దీపక్ రెడ్డి బహిరంగంగా చేసిన ఆరోపణలతో టిడిపిలో కలకలం మొదలైంది. దీపక్ రెడ్డి ఈ రోజు తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. పలువురు స్థానిక నేతలు ఆయనకు గట్టిగా మద్దతు పలుకుతున్నారు. దాంతో దయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, దీపక్‌రెడ్డి ఆస్తులపై దర్యాప్తునకు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ)లను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అనంతపురం జిల్లాకు చెందిన మార్పు డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యుడు వి.సుధీర్‌కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈడీ, సీబీఐ జాయింట్ డెరైక్టర్లతో పాటు దీపక్‌రెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం ఈ నెల 15న విచారణకు రానున్నది. దీపక్‌రెడ్డి గత ఉప ఎన్నికలలో రాయదుర్గం శాసనసభ నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో 2009-10 ఆర్థిక సంవత్సరానికి తన వార్షిక ఆదాయం రూ. 3.27 లక్షలుగా, తన భార్య ఆదాయం రూ. 1.98 లక్షలుగా పేర్కొన్నారు. వాటాలు, ఇతర చరాస్తులు తన పేరు మీద రూ. 4.59 కోట్లు, తన భార్య పేరున రూ. 1.76 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే తన పేరున రూ. 5.86 కోట్ల విలువైన స్థిరాస్తులు, తన భార్య పేరున రూ. 16.86 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు చూపించారు. ఈ ఆస్తులు కాకుండా వివాదాల్లో రూ. 6,781.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఆస్తులు ఎలా సంపాదించారో తేల్చడానికి సీబీఐ, ఈడీల దర్యాప్తుకు ఆదేశాలివ్వాలని పిటిషనర్ తన పిటిషన్లో కోర్టును కోరారు. -
సీఎం రమేష్.. ఓ బ్రోకర్
* రాయదుర్గం టీడీపీ ఇన్చార్జ్ దీపక్‌రెడ్డి విమర్శ రాయదుర్గం, న్యూస్‌లైన్ : ‘తెలుగుదేశం పార్టీలో రాయలసీమ ఇన్చార్జ్గా ఉన్న సీఎం రమేష్ ఓ చీడ పురుగు.. పార్టీలో బ్రోకర్ పాత్ర పోషిస్తున్నాడ’ని టీడీపీ రాయదుర్గం నియోజకవర్గ ఇన్చార్జ్ దీపక్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నువ్వు వచ్చి పార్టీ అధినేతను కలువు అని సీఎం రమేష్ నాకు ఫోన్ చేశాడు. నేను హైదరాబాద్ వెళితే ఆ సమయంలో కాలవ శ్రీనివాసులు, మెట్టు గోవిందరెడ్డితో చంద్రబాబు చర్చిస్తున్నారు. నేనెళ్లగానే అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పారు. ఆ సమయంలో సీఎం రమేష్ ఫోటో తీయించి అందరూ కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తున్నామని పత్రికల్లో స్టేట్మెంట్లు ఇప్పించాడు. ఇది పొలిటికల్ గేం’ అని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిలో నేను ఎలా కొనసాగాలో శనివారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బీసీ మహిళ కేవీ ఉష నుంచి కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని ఆమెను మోసగించినట్టు సమాచారం ఉందన్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి మల్లారెడ్డి నుంచి కూడా రూ. 20 కోట్ల నుంచి 60 కోట్ల వరకు సీఎం రమేష్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తుకు ఆయనే కారణమని, ఈ ఎన్నికల్లో కూడా డ్రామాలు ఆడి పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. -
టీడీపీలో జేసీ కంటే నేనే సీనియర్: దీపక్‌రెడ్డి
రాయదుర్గం: తెలుగుదేశం పార్టీలో జేసీ దివాకర్‌రెడ్డి కన్నా తానే సీనియర్‌నని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ ఇన్చార్జ్ దీపక్‌రెడ్డి (జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు) అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక వేళ మా సామాజిక వర్గానికి రెండు స్థానాల్లో మాత్రమే టికెట్లు ఇవ్వదలచుకుంటే జేసీ బ్రదర్స్‌లో ఒకరికి టికెట్ ఇచ్చి మరో టికెట్‌ను నాకివ్వాలని అన్నారు. రాయదుర్గం నుంచి కాలవ శ్రీనివాసులు పోటీ చేయడాన్ని తాము తప్పుపట్టలేదని, అయితే పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన ఇతరులకు సీట్లు ఇప్పించాలే కానీ ఒకరి సీటు లాక్కోవడం తగదన్నారు. 2012 ఉప ఎన్నికల్లో ఓడిపోయి రాజీనామా చేస్తానని చెబితే ‘పార్టీని బలోపేతం చేసుకో.. 2014 ఎన్నికల్లో నీకే టికెట్ ఇస్తానని చంద్రబాబు చెప్పారు.. ఆ హామీని ఆయన నిలబెట్టుకోలేద’ని అన్నారు. బుధవారం పార్టీ అధినేతను కలిసి ప్రజల అభిప్రాయం తెలియజేస్తానన్నారు. -
నిన్న కాక మొన్న వచ్చిన జేసీ సోదరులకు టికెట్లా
ఇటీవల తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరులకు రెండు టికెట్లు ఎలా కేటాయిస్తారని రాయదుర్గం టీడీపీ ఇంఛార్జ్ దీపక్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ్ని ప్రశ్నించారు. మంగళవారం అనంతపురంలో చంద్రబాబుపై దీపక్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానికంగా ఎంతో కాలంగా పార్టీకి అంకిత భావంతో పని చేస్తుంటే నిన్న కాక మొన్న వచ్చిన నాయకులకు సీట్లు కేటాయించడం ఎంత వరకు సమంజసమంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. రాయదుర్గం అసెంబ్లీ స్థానం కాలువ శ్రీనివాస్‌కు కేటాయించిన ఉరుకునే ప్రసక్తి లేదని దీపక్ రెడ్డి హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని దీపక్ రెడ్డి స్పష్టం చేశారు.