ధర్మవరంలో సీఎం చంద్రబాబు పర్యటనలో వివాదం నెలకొంది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న దీపక్‌రెడ్డి.. ముఖ్యమంత్రి సభకు హాజరుకావడం వివాదానికి దారి తీసింది. జన్మభూమి- మాఊరు ముగింపు సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ధర్మవరం వచ్చారు. తన మామ జేసీ దివాకర్‌రెడ్డితో కలిసి దీపక్‌రెడ్డి సభకు హాజరయ్యారు. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన నాయకుడు సీఎం సభకు రావడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.