dharmavaram
-
ధర్మవరంలో కూటమి నేతల బరితెగింపు, కరెంట్ తీగలతో..
సాక్షి, సత్యసాయి జిల్లా: మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయ కక్షలు బయటపడ్డాయి. వైఎస్సార్ సీపీ నేత, ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్య కుట్ర భగ్నమైంది.కాంపౌండ్ వాల్ ఐరన్ డోర్‌కు విద్యుత్ తీగలు వేసిన టీడీపీ కూటమి నేతలు.. డోర్ తాకిన వెంటనే కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి చనిపోయేలా పన్నాగం పన్నారు. అయితే 33కేవీ విద్యుత్ తీగలకు బదులుగా.. ఫైబర్ కేబుల్‌కు కనెక్షన్ ఇవ్వడంతో ప్రమాదం తప్పింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. కామిరెడ్డిపల్లి పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. అక్కడితో ఆగకుండా బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు. తాజాగా ఆదివారం రాత్రి పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో నిత్యం రద్దీగా ఉండే వైఎస్సార్, నెహ్రూ సర్కిళ్లతో పాటు ధర్మవరం బస్టాండ్ ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ గూండాలు మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసులు చూస్తుండగానే... కొడపగానిపల్లికి చెందిన వినోద్‌కుమార్‌రెడ్డి, నరేంద్రరెడ్డి, హరిపై అకారణంగా కాళ్లతో, కర్రలతో విరుచుకు పడ్డారు. కొత్తచెరువుకు చెందిన టీడీపీ ముఖ్య నేత శ్రీనివాసులు ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొన్నట్లు బాధిత కార్యకర్తలు వాపోయారు. కొత్తచెరువు మండలం కొడపగానిపల్లికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఈడిగ మారుతి రెండు రోజుల క్రితం సోషల మీడియాలో ఓ పోస్టును పెట్టారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ తీర్చిదిద్దిన ప్రభుత్వ బడి ఫొటోతో పాటు ఇటీవల ‘బడి వైన్స్’ పేరుతో తిరుపతిలో ప్రారంభించిన మద్యం దుకాణం ఫొటోను జతపరుస్తూ పోస్టు చేశారు. ఇందులో తప్పిదం ఏమీ లేకపోయినా... సీఎం చంద్రబాబు మద్యం పాలసీని తప్పు బట్టారని, ఆ పోస్టును తొలగించకపోతే కేసు పెడతామని స్థానిక టీడీపీ నేత శివయ్య బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఇంత చిన్న విషయాన్ని రచ్చ చేయరాదని, కేసులు.. గీసులు ఏమీ వద్దని పోలీసులు నచ్చచెప్పారు. అదే సమయంలో ప్రశాంత మైన గ్రామంలో వర్గ కక్షలు ఉండరాదని భావించిన మారుతి కూడా ఆ పోస్టును తొలగించాడు. దీంతో అప్పటికి సమస్య సద్దుమణిగిందనుకున్నారు. అయినా కక్ష కట్టిన శివయ్య... మారుతి పోస్టును స్క్రీన్ షాట్ తీసి ఆదివారం కొత్తచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఒత్తిళ్లను తాళలేక మారుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న కొడపగానిపల్లికి చెంది వైఎస్సార్సీపీ నాయకులు వినోద్‌కుమార్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, హరి... కొత్తచెరువు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మారుతీకి స్టేషన్ బెయిల్ ఇచ్చే విషయంగా పోలీసులతో చర్చించి ఆదివారం రాత్రి బయటకు వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ముఖ్య నేత శ్రీనివాసులు తన అనుచరులతో కలసి పథకం ప్రకారం కొత్తచెరువులోని ప్రధాన కూడళ్లలో వీధి లైట్లను ఆఫ్ చేయించి వినోద్‌కుమార్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, హరిపై దాడికి తెగబడ్డారు. చెప్పులు, కర్రలు, ముష్టిఘాతాలతో విరుచుకుపడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన హరి అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన ఇద్దరికి మూగ దెబ్బలయ్యాయి. ఘటనపై బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మారుతిని సోమవారం పోలీసులు వదిలేశారు. -
ఇదో రకం పిచ్చి..!
డోన్: కొందరు యువకుల చేష్టలు విపరీత అనర్థాలకు దారితీస్తున్నాయి. ద్విచక్రవాహనాల నంబర్ ప్లేట్ల స్థానంలో ఫలానా తాలుకా అంటూ బోర్డులు తగిలించుకోవడం.. ఏదో గనకార్యం చేసినట్లు దూసుకుపోవడం ప్యాషన్‌గా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన పేర్లు వేసుకుని తిరగడం ఎక్కువయ్యాయి. డోన్ పట్టణంలో కొందరు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి తాలుకా అని, మరికొందరు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తాలుకా అని, ఇంకొందరు కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ తాలుకా అని నేమ్ప్లేట్లు రాయించుకుని రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. ఈ వాహనాలకు రిజి్రస్టేషన్ నంబర్లు ఉండేచోట ఫలానా వ్యక్తి తాలుకా అని తాటికాయ అంత అక్షరాలతో రాసుకుని తిరుగుతుండటంపై ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి వెర్రి మరింత ముదిరిపోకముందే పోలీసు, ఆర్టీఓ అధికారులు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ఇదీ చంద్రబాబు సర్కార్ డొల్లతనం
సాక్షి, ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లాలో చంద్రబాబు సర్కార్ డొల్లతనం బయటపడింది. బెల్టు షాపులకు ఐదు లక్షల జరిమానా విధించాలంటూ సీఎం చంద్రబాబు చెబుతుంటే.. ధర్మవరంలో మాత్రం డబ్బులు తీసుకుని బెల్ట్ షాపులకు అనుమతి ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గం లో ఓ టీడీపీ నేత వీడియో వైరల్‌గా మారింది. డబ్బులు తీసుకుని బెల్టుషాపులకు అనుమతిస్తున్నారంటూ ధర్మవరం టీడీపీ నేత మరస హరి ఆరోపిస్తున్నారు.పోలీసులు అరెస్ట్ చేస్తే ఏ ఒక్కరూ పట్టించుకోలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ముఖ్య నేతలు, అధికారులు లంచం తీసుకుని బెల్ట్ షాపులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల వద్ద డబ్బు తీసుకుని మద్యం బెల్ట్ షాపులు కేటాయించడం సరికాదన్నారు. బీజేపీ నేతలతో మాట్లాడితే.. టీడీపీలో ఉండొద్దంటున్నారంటూ ధర్మవరం టీడీపీ నేత మరస హరి చెప్పుకొచ్చారు. -
సచివాలయాన్ని ఎత్తేశాడు
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నాయకుల అధర్మ ప్రవర్తన రోజురోజుకు పెచ్చుమీరుతోంది. తాము చెప్పినచోటే సచివాలయం పనిచేయాలంటూ ఏకంగా కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను తరలించేశారు. దీంతో ఆ సచివాలయం ఉద్యోగులు మరో వార్డు సచివాలయానికి వెళ్లి పనిచేస్తున్నారు. ధర్మవరం పట్టణంలోని 39వ వార్డులో ఈ దురాగతం జరిగి వారం రోజులైనా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం విమర్శనీయంగా ఉంది. 39వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ కేతా శ్రీను కొద్దిరోజులుగా సచివాలయ సిబ్బంది తాను చెప్పినట్లుగానే వినాలంటూ తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాడు.వార్డులోని 37వ నంబరు సచివాలయాన్ని తాను చెప్పినచోటుకు మార్చాలని హుకుం జారీచేశాడు. అతడు చెప్పిన ప్రదేశం వార్డు ప్రజల రాకపోకలకు అనువుగా లేదు. దీంతో సచివాలయాన్ని ఉన్నచోటే కొనసాగించాలని స్థానిక బీజేపీ నాయకుడు జింకా చంద్రశేఖర్, వార్డు ప్రజలు కోరారు. అయినా తనమాటే చెల్లాలంటూ కేతా శ్రీను వారం రోజుల కిందట సచివాలయంలోని ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని దౌర్జన్యంగా తీసుకెళ్లాడు. వాటిని మరో ఇంట్లో ఉంచి సచివాలయ సిబ్బంది అక్కడికొచ్చి పనిచేయాలని నిర్దేశించాడు. ఈ విషయాన్ని మునిసిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లిన సచివాలయ సిబ్బంది మూడురోజులు రామ్‌నగర్ సచివాలయం నుంచి పనిచేశారు.తరువాత వార్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో 40 వార్డులోని తారకరామాపురంలో ఉన్న 38వ నంబరు సచివాలయం నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. పనుల మీద ఇప్పటివరకు సచివాలయం ఉన్న చోటుకు వెళ్లిన ప్రజలు ‘ఇక్కడి మా సచివాలయం ఏది?’ అని ప్రశ్నిస్తున్నారు తనకు ప్రభుత్వం నుంచి ఆరునెలల అద్దె రావాల్సి ఉందని, కనీస సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా సచివాలయాన్ని ఖాళీచేయడం దారుణమని భవన యజమాని కడప రంగస్వామి ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై మునిసిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్‌ను అడిగేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలోనే టీడీపీ నేత ఇలా దౌర్జన్యంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. -
కూటమి నేతల మధ్య ‘మట్టి’ రగడ
«సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య ‘మట్టి వార్’ తారాస్థాయికి చేరింది. ధర్మవరం మండలం రేగాటిపల్లిలో ఆదివారం మట్టిని అక్రమంగా తవ్వుతున్న టీడీపీ నాయకులకు చెందిన జేసీబీని జనసేన నాయకులు ధ్వంసం చేశారు. ఇక్కడ మట్టిని తాము తప్ప మరెవ్వరూ తవ్వకూడదని జనసేన నాయకులు హెచ్చరించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జనసేనకు చెందిన ముఖ్య నేత ఆ«ధ్వర్యంలో జేసీబీ, హిటాచీ వాహనాలతో పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోజూ రూ.లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. మట్టి కోసం ఈ పంచాయతీ దరిదాపుల్లోకి ఇతరులెవరినీ రానీయకుండా సదరు జనసేన నేత హుకుం జారీ చేస్తున్నారు. ఇదే పంచాయతీకి చెందిన పలువురు టీడీపీ నాయకులు తాము కూడా ఎన్నికల్లో కూటమి గెలిచేందుకు కృషి చేశామని, తామూ మట్టి తవ్వుకుంటామని పలుమార్లు జనసేన కీలక నేతకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. అయితే టీడీపీ నాయకులు ఆదివారం సొంతంగా జేసీబీతో రేగాటిపల్లి కొండ సమీపంలో మట్టి అక్రమ తవ్వకాలకు పూనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన తమ పార్టీకి చెందిన పదిమందిని పంపి దౌర్జన్యం చేయించారు. మట్టి తవ్వుతున్న జేసీబీపై రాళ్ల వర్షం కురిపించి ధ్వంసం చేయించారు. ఇంత గొడవ జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించినట్లు సమాచారం. ఆ తర్వాత తీరిగ్గా రెండు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన టీడీపీ నాయకులు తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అక్కడే ఈ మట్టి గొడవ తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా, ఈ విషయంలో కూటమి నాయకులు గొడవపడుతున్నా పోలీస్, మైనింగ్ అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ధర్మవరంలో రెచ్చిపోయిన కూటమి మద్యం మాఫియా
-
ధర్మవరం వన్ టౌన్ సీఐ తల్లి స్వర్ణకుమారి దారుణ హత్య
-
కిడ్నాపైన సీఐ తల్లి దారుణహత్య
సాక్షి రాయచోటి/మదనపల్లె: పది రోజుల క్రితం కిడ్నాపైన ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఎదురింట్లో ఉంటున్న వెంకటేష్ అనే యువకుడు పూజల పేరుతో ఆమెను బయటకు తీసుకెళ్లి.. తన స్నేహితుడు, అతని తల్లితో కలిసి స్వర్ణకుమారిని అంతమొందించాడు. ఉద్యోగానికి సెలవుపెట్టి మరీ తల్లి ఆచూకీ కోసం «ధర్మవరం సీఐ నాగేంద్రప్రసాద్ వెతికినా ఆయన కష్టం వృథా అయింది. తల్లి క్షేమంగానే ఉంటుందనుకున్న ఆశలు చివరకు అడియాశలయ్యాయి. తల్లి కేసును తానే విచారణ చేపట్టడంతో ఆమె హత్యకు గురైనట్టు నిర్ధారణ అయ్యింది. పోలీసు అధికారి తల్లికే దిక్కులేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొన్న ముచ్చుమర్రిలో వాసంతి హత్య.. నిన్న పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ హత్యోదంతం, ఇప్పుడు సీఐ తల్లి హత్య ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారాయో స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఓ పోలీసు అధికారి తల్లిని దారుణంగా హతమార్చినా దిక్కులేకుండాపోయింది. ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసమే అన్నట్లుగా రాష్ట్రంలో సాగుతున్న రెడ్‌బుక్ పాలనలో బాలికలు, మహిళల భద్రతకు కనీస చర్యలు కూడా చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కుమారుడిపైనే ఆశలన్నీ పెట్టుకుని..అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం మేడికుర్తికి చెందిన స్వర్ణకుమారి భర్త శ్రీరాములుతో 30 ఏళ్ల క్రితమే విడిపోయారు. ఒక్కగానొక్క కుమారుడు నాగేంద్రప్రసాద్‌ను చదివించి, ప్రయోజకుడిని చేసేందుకు మదనపల్లెకు వలస వచ్చి దేవళం వీధిలో కాపురం ఉండేవారు. నాగేంద్రప్రసాద్ చదువుతోపాటు హాకీ క్రీడాకారుడిగా ప్రతిభ కనపరిచి స్పోర్ట్స్ కోటాలో పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించారు. కుమారుడు ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చినప్పటికీ, తల్లి స్వర్ణకుమారి మదనపల్లెలోనే ఉండేవారు. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వైఎస్సార్ కాలనీలో ఇల్లు మంజూరు కావడంతో సొంత ఇల్లు నిర్మించుకుని అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ఎదురింట్లో ఉంటున్న సొంతూరికే చెందిన యల్లమ్మతో ఆమె స్నేహంగా ఉండేవారు. యల్లమ్మ, సురేంద్ర దంపతుల కుమారుడైన నిందితుడు వెంకటేష్ మదనపల్లెలో డిగ్రీ వరకు చదువుకుని, బెంగళూరు వెళ్లి కాల్‌టాక్సీ డ్రైవర్‌గా, జొమాటో బాయ్‌గా పనిచేసేవాడు. నెల రోజుల క్రితం బెంగళూరు నుంచి మదనపల్లె వచ్చిన వెంకటేష్ తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. పూజల పేరుతో.. స్వర్ణకుమారికి భక్తి ఎక్కువ. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ తన స్నేహితుడి ఇంటికి కాశీ నుంచి స్వామీజీ వస్తున్నారని, ఆయన మంత్రిస్తే మంచి జరుగుతుందని స్వర్ణకుమారిని నమ్మించాడు. స్వామీజీ గురించి గొప్పలు చెబుతూ అక్కడకు వెళదాం రమ్మని ఆహ్వానించాడు. స్వామీజీ వద్దకు వెళితే మంచి జరుగుతుందని నమ్మిన స్వర్ణకుమారి గతనెల 28న నిందితుడు వెంకటేష్‌తో వెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం వెంకటేష్ పట్టణంలోని గజ్జెలకుంట సాయిరాం వీధిలో ఉంటున్న స్నేహితుడు అనిల్ ఇంటికి స్వర్ణకుమారిని తీసుకెళ్లాడు. స్వామీజీ అక్కడికే వస్తున్నాడని నమ్మించి.. ఆమెతో పూజా కార్యక్రమాలు చేయించాడు. తీర్థం తీసుకునేందుకు ఆమె తలవంచగానే వెనుక నుంచి సుత్తితో తలపై మోదాడు. వెంటనే స్నేహితుడు అనిల్, అతడి తల్లి రమాదేవితో కలిసి స్వర్ణకుమారి ప్రాణం తీశాడు. అనంతరం స్వర్ణకుమారి వంటిపై నగలు తీసుకుని, మృతదేహాన్ని గోనె సంచిలో దాచారు. మృతదేహానికి అనిల్ తల్లి రమాదేవిని కాపలాగా ఉంచి వెంకటేష్, అనిల్ బయటకు వచ్చారు. నగలను తీసుకెళ్లి ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.4 లక్షలు తీసుకున్నారు.శవంపైనే స్వర్ణకుమారి మృతదేహాన్ని పూడ్చి..అదే రోజు రాత్రి కారు అద్దెకు తీసుకుని గోనె సంచిలో ఉంచిన స్వర్ణకుమారి మృతదేహాన్ని పూడ్చేందుకు పోతబోలువైపు వెళ్లారు. అక్కడ ఖననం చేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు చేతబడి పూజలకు ఎవరో వచ్చారని కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం అయోధ్య నగర్‌లోని శ్మశానానికి చేరుకున్నారు. ఇటీవల ఓ మృతదేహాన్ని ఖననం చేసిన స్థలాన్ని ఎంచుకుని నాలుగు అడుగుల మేర తవ్వి స్వర్ణకుమారి మృతదేహం ఉన్న గోనె సంచిని పాత శవంపైనే ఉంచి పూడ్చేశారు. నగలు కుదువపెట్టగా వచ్చిన సొమ్ములో సగం అనిల్‌కు ఇచ్చి రూ.లక్షను తన అకౌంట్లో ఉంచి, మరో రూ.లక్షను ఇంట్లో ఉంచాడు. పెన్షన్ తీసుకునేందుకు రాకపోవడంతో..ఇంటినుంచి వెళ్లిన స్వర్ణకుమారి రెండు రోజులైనా ఇంటికి రాకపోవడం, 1వ తేదీన పెన్షన్ తీసుకునేందుకు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఆమె కుమారుడు సీఐ నాగేంద్రప్రసాద్‌కు సమాచారం అందించారు. ఆయన తల్లి ఫోన్‌కు చేయగా, కాల్ ఫార్వర్డ్ మెసేజ్ రావడంతో అనుమానంతో నాగేంద్రప్రసాద్ మదనపల్లె వచ్చారు. అక్టోబర్ 2న తాలూకా పోలీస్ స్టేషన్లో తన తల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండటంతో తల్లి ఆచూకీ కోసం సీఐ నాగేంద్రప్రసాద్ తానే విచారణ చేపట్టారు. స్వర్ణకుమారిని ఇంటినుంచి తీసుకెళ్లిన యువకుడు వెంకటేష్‌ను అనుమానితుడిగా భావించి.. ఇంట్లో తనిఖీలు నిర్వహించగా నగలు కుదువపెట్టిన రసీదులు, బియ్యం డబ్బాలో దాచిన రూ.లక్ష నగదు లభించాయి. నిందితుడు వెంకటేష్ తన ఫోన్ స్విచ్ఆఫ్ చేసి.. ఇంట్లోనే ఉంచేసి రెండు రోజులపాటు హతురాలు స్వర్ణకుమారి ఫోన్ ఉపయోగించాడు. చివరగా ఆ ఫోన్ వినియోగించిన టవర్ లొకేషన్, నిందితుడు వెంకటేష్ ఫోన్లోని కాంటాక్ట్స్ ఆధారంగా అతడి స్నేహితులను విచారిస్తే వెంకటేష్ తరచూ వాడే ఫోన్ నంబర్లు ఇచ్చారు. వాటిపై నిఘా ఉంచగా.. మదనపల్లె, తిరుపతి చివరగా బెంగళూరులో ఒక నంబర్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఆ నంబర్‌పై నిఘా పెట్టగా నిందితుడు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయడంతో దాని ఆధారంగా వెంకటేష్‌ను పట్టుకున్నారు. అతడిని తీసుకొచ్చి తాలూకా పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. హత్య చేసిన వైనాన్ని వివరించాడు. మంగళవారం అధికారుల సమక్షంలో తహసీల్దార్, వైద్యులను తీసుకువచ్చి ఘటనాస్థలంలో పంచనామా నిర్వహించి, మృతదేహానికి పోస్టుమార్టం జరిపించారు. అనంతరం స్వర్ణకుమారి మృతదేహానికి కుటుంబసభ్యులు అదే శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించారు. స్వర్ణకుమారి కుమారుడు సీఐ కావడం, ఆయనే స్వయంగా దర్యాప్తు చేపట్టడంతో 10 రోజుల అనంతరం ఈ కేసు వెలుగు చూసింది. లేదంటే ఈ కేసులో మిస్టరీ వీడేది కాదు. కాగా.. స్వర్ణకుమారి హత్యకు సహకరించిన రెండో నిందితుడు అనిల్, అతడి తల్లి రమాదేవి ఎక్కడ ఉన్నారో ఇప్పటివరకు పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. వారిద్దరూ రేణిగుంట నుంచి విమానంలో రాజస్థాన్ వెళ్లినట్టు తెలిసింది.ఇదీ చదవండి: ఆడ శిశువును విక్రయించిన తల్లి -
AP: ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్
మదనపల్లె/రాయచోటి: ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి(62) మదనపల్లెలో కిడ్నాప్ అయ్యారు. గత నెల 28న ఆమె అదృశ్యమై ంది. 9 రోజులు కావస్తున్నా నేటికీ జాడ కనుక్కోలేని పరిస్థితి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. మదనపల్లె శివారు వైఎస్ జగన్ కాలనీలో సీఐ తల్లి స్వర్ణకుమారి ఒంటరిగా నివసిస్తోంది. సెప్టెంబర్ 28న మధ్యాహ్నం ఆమె స్నేహితురాలు స్వర్ణకుమారికి ఫోన్ చేస్తే కాల్ ఫార్వర్డ్ వాయిస్ వినిపించింది. సాయంత్రమైనా ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు దైవభక్తి అధికం కావడంతో తెలిసిన వారితో కలిసి దూరప్రాంతంలోని గుడికి వెళ్లిందేమోనని స్నేహితురాలు భావించింది.కాగా, అక్టోబర్ 1న పెన్షన్ తీసుకునేందుకు స్వర్ణకుమారి రాకపోవడంతో స్థానికులు ఆ విషయాన్ని కుమారుడైన సీఐ నాగేంద్రప్రసాద్‌కు తెలిపారు. దీంతో ఆయన మదనపల్లెకు చేరుకుని తల్లి ఆచూకీ కోసం విచారించారు. మూడు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో అక్టోబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ కళా వెంకటరమణ అదృశ్యం కేసుగా నమోదుచేసి విచారణ చేపట్టారు. స్వర్ణకుమారి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, టవర్ లొకేషన్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుండటంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. స్వర్ణకుమారి అదృశ్యం పట్టణంలో చర్చనీయాంశం కాగా.. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. వెంకటేశ్ అనే యువకుణ్ణి బెంగళూరులో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. సీఐ తల్లికే దిక్కులేకపోతే? సీఐ తల్లి అదృశ్యమైతేనే ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని జనం చర్చించుకుంటున్నారు. ముందెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో చిన్నారులు, మహిళలను కిడ్నాప్ చేసి అంతమొందించడం లాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 9 రోజులైనా సీఐ తల్లి ఆచూకీ తెలియలేదంటే.. ఆమె విషయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై వరుస అఘాయిత్యాలు భయపెడుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో వాసంతిని, పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్‌ను తుదముట్టించిన ఘటనలు శాంతిభద్రతలను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోవడంతో బాధితులు శవాలుగా మారిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. పేపర్లకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా?మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కాగితాలు తగలబడితే చంద్రబాబు రాష్ట్ర డీజీపీని హెలికాప్టర్లో పంపించి దర్యాప్తు చేయించారు. అయితే.. బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు. -
ధర్మవరంలో బీజేపీ – టీడీపీ వార్
ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున నియామకం కూటమి పార్టీల మధ్య చిచ్చు రగిల్చింది. మంత్రి సత్యకుమార్ మద్దతుతో మల్లికార్జున ధర్మవరం మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మల్లికార్జున మున్సిపల్ ఆఫీసుకు వస్తే చొక్కా పట్టుకుని బయటకు గెంటేస్తానని శ్రీరామ్ హెచ్చరించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కమిషనర్‌ను అడ్డుకునేందుకు అక్కడికి భారీగా తరలివచ్చారు. దీంతో మంత్రి సత్యకుమార్ మున్సిపల్ అధికారులను, కమిషనర్‌ను మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఎన్డీఏ కార్యాలయంలోని క్యాంప్ ఆఫీసుకి రప్పించుకుని అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ధర్మవరం–అనంతపురం ప్రధాన రహదారిపై బైఠాయించారు. మంత్రి సత్యకుమార్, కమిషనర్ మల్లికార్జునకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసినా ఫలించక పోవడంతో ఎన్డీఏ ఆఫీస్‌లోకి ఎవ్వరూ వెళ్లకుండా తాళం వేశారు.కమిషనర్ మల్లికార్జున నియామకం సరైనదేఅంతకు ముందు మంత్రి సత్యకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. కమిషనర్ మల్లికార్జున నియామకం సరైనదేనని, ఆయన సమర్ధుడైన మంచి అధికారి అంటూ కితాబిచ్చారు. మల్లికార్జున అయితే ధర్మవరం అభివృద్ధి చెందుతుందని భావించే మున్సిపల్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించిందన్నారు. గత ప్రభుత్వంలో పని చేశారన్న కారణంతో ఆయన్ని కొన్ని పార్టీల నాయకులు అడ్డుకుంటున్నారని, అది మంచి పద్ధతి కాదని చెప్పారు. అధికారులకు రాజకీయాలను ఆపాదించకూడదని అన్నారు. కమిషనర్‌గా మల్లికార్జున కొనసాగుతారని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.సత్యకుమార్‌ను ఘెరావ్ చేసిన టీడీపీ కార్యకర్తలుమంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు కమిషనర్ మల్లికార్జునను కార్యాలయం వెనుక గేట్ నుంచి బందోబస్తుతో పంపించేశారు. అనంతరం మంత్రి సత్యకుమార్ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించుకుని బయటకు వచ్చారు. వెంటనే టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు. ‘మేం కష్టపడి గెలిపిస్తే మంత్రివి అయ్యావు. నీవు, నీ అనుచరులు మాపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మీ సంగతి చూస్తాం’ అంటూ దుర్భాషలాడారు. మంత్రి సత్యకుమార్ ముందుకు కదలకుండా ఆయన వాహనాన్ని చుట్టుముట్టి ఘొరావ్ చేశారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలను నెట్టివేసి మంత్రిని పంపించేశారు. బీజేపీ, టీడీపీ విభేదాల కారణంగా ధర్మవరం పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రహదారిపై రెండు గంటల పాటు ధర్నా వల్ల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పాఠశాలల విద్యార్థులు, వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
బంతి, కనకాంబరాల పూల తోటలు.. ప్రకృతి అందాలు (ఫొటోలు)
-
చంపడానికి వచ్చారు.. ధర్మవరంలో రెచ్చిపోయిన కూటమి నేతలు.. కేతిరెడ్డి ఫైర్
-
కేతిరెడ్డిపై టీడీపీ రౌడీల దాడి
-
అధికారుల నిర్వాకం.. సర్కారీ ఆఫీస్‌ల్లో ‘పరిటాల’ ఫోటో
శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరంలో అధికారుల నిర్వాకం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఫోటోలు వెలిశాయి. ధర్మవరం నియోజకవర్గానికి బీజేపీ నుంచి మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ధర్మవరం టీడీపీ ఇంఛార్జి గా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు.ధర్మవరం నియోజకవర్గంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఫోటోలతో పాటు పరిటాల శ్రీరామ్ ఫోటోలను అధికారులు ఉంచారు. ఏ పదవి లేని పరిటాల శ్రీరామ్ ఫోటో ఉంచటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రైలు పట్టాలపై ఇనుప స్తంభాలు.. ధర్మవరంలో తప్పిన ప్రమాదం
శ్రీసత్యసాయి, సాక్షి: జిల్లాలో గత అర్ధరాత్రి లోకో పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఇనుప స్తంభాలు ఉంచారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆకతాయిల పనిగా భావిస్తున్న రైల్వే పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్
-
ధర్మవరంలో కార్పొరేట్ పాలిటిక్స్
ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కార్పొరేట్ రాజకీయం రంగ ప్రవేశం చేసింది. ఢిల్లీ నుంచి వచ్చానన్న బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఇక్కడ గల్లీలో ప్రలోభాలు, బెదిరింపులతో నీచరాజకీయాలు చేస్తున్నారు. రూ.కోట్లు కుమ్మరించి అధికార పార్టీ నాయకులను కొనుగోలు చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. తనకు మద్దతు ఇవ్వని వ్యాపారులపై సీబీఐ, ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తానంటూ తన వర్గీయుల ద్వారా బెదిరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ధర్మవరం: ప్రొద్దుటూరుకు చెందిన సత్యకుమార్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగప్రవేశం చేయగానే ధర్మవరంలో కొత్త సంస్కృతి మొదలైంది. ఆయనకు మద్దతుగా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి రెండు వేల మందికిపైగా ధర్మవరంలో దిగారు. పట్టణంలోని అద్దె ఇళ్లు, లాడ్జీలలో తిష్ట వేశారు. వైఎస్సార్సీపీ నాయకులను ప్రలోభాలకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారు. డబ్బు ఇస్తామని, నామినేటెడ్ పదవులు, సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని.. ఇలా పలు రకాలుగా ప్రలోభపెడుతున్నారు. గ్రామస్థాయి నాయకుడికైతే రూ.10 లక్షలు, ఓ మోస్తరు నాయకుడికైతే అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ నాయకుడు గిర్రాజు నగేశ్, ఏపీ కురుబ కార్పొరేషన్ చైర్మన్ కోటి బాబు, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్‌లను పెద్దఎత్తున ప్రలోభపెట్టి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేర్చుకున్నట్లు సమాచారం. వీరివెంట భారీగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు వస్తారని భావించినప్పటికీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. వంద మందితో పారీ్టలో చేరుతానని చెప్పిన గిర్రాజు నగేశ్ కనీసం పది మందికి కూడా కండువా కప్పించలేకపోయాడు. కోటిబాబు వెంట కూడా ఎవరూ వెళ్లలేదు. కోటిబాబు బీజేపీలోకి చేరిన మరుసటి రోజే ఆయన సోదరులు మళ్లీ వైఎస్సార్సీపీలో చేరడం విశేషం. అదేవిధంగా తమ ప్రలోభాలకు లొంగని వారిని సీబీఐ, ఈడీ, ఐటీ దాడుల పేరిట సత్యకుమార్ మనుషులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. పట్టు–చేనేత వస్త్ర వ్యాపారానికి కేంద్రమైన ధర్మవరంలో వ్యాపారులకు ఈ తరహా బెదిరింపులు ఎక్కువైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, సత్యకుమార్ ప్రచారానికి కూడా ఇతర ప్రాంతాల నుంచి డబ్బులు ఇచ్చి జనాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఆయన నామినేషన్ కార్యక్రమానికి కూడా ప్రొద్దుటూరు, కర్నూలు, రాప్తాడు తదితర ప్రాంతాల నుంచి డబ్బులు ఇచ్చి వాహనాల్లో జనాలను తీసుకురాగా, వారు మధ్యలోనే వెళ్లిపోయారు. బీజేపీపై చేనేతల ఆగ్రహం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత వ్రస్తాలపై 5 శాతం జీఎస్టీ విధించడంతో నేతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. జీఎస్టీ రద్దు చేయాలని నేతన్నలు నిరసన తెలిపినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా గత కేంద్ర బడ్జెట్లో జీఎస్టీ 5 నుంచి 12 శాతానికి పెంచాలని భావించింది. అప్పట్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌లు కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి చేనేత వస్త్రాలపై జీఎస్టీని పెంచడం వల్ల కలిగే నష్టాలను వివరించడంతో 5 శాతానికే పరిమితం చేశారు. ఈ క్రమంలో బీజేపీపై నేతన్నలు, వ్యాపారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. -
బీజేపీ సేవలో ప్రభుత్వ వైద్యుని భార్య
ధర్మవరం: ప్రభుత్వ వైద్యుని భార్య బీజేపీ సేవలో తరిస్తున్నారు. ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప దంతవైద్యునిగా పనిచేస్తున్నారు. ఈయన భార్య నీరజ కూడా డాక్టరే. అయితే ఆమె ప్రైవేట్‌గా వైద్య సేవలందిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున భార్య త్రివేణి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం డాక్టర్ వివేక్ ఇంటివద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా దంతవైద్యుని సమక్షంలోనే ఆయన భార్య డాక్టర్ నీరజకు బీజేపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ డాక్టర్ భార్య రాజకీయ పార్టీలో చేరడం విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ సమయంలో సమర్పించిన వివరాలలో భార్య పేరు ప్రస్తావించలేదు. పిల్లలు మాత్రమే ఉన్నట్లు పొందుపరిచారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం సత్యకుమార్ భార్యగా త్రివేణి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. -
ధర్మవరంలో జోరుగా కేతిరెడ్డి భార్య ఎన్నికల ప్రచారం...!
-
సీఎం జగన్ పై దాడి...చంద్రబాబు, పవన్ కి కేతిరెడ్డి మాస్ వార్నింగ్..
-
ధర్మవరంలో పరిటాల సూరి వర్గీయుల మధ్య బయటపడ్డ విబేధాలు
-
ధర్మవరంలో పరిటాల, సూరి వర్గీయుల మధ్య బయటపడ్డ విబేధాలు
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రతిపక్ష టీడీపీలో వర్గపోరు రచ్చకెక్కింది. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ మధ్య మరోసారి విబేధాలు బయటపడ్డాయి. తాజాగా బత్తలపల్లిలో వరదాపురం సూరి వర్గీయుల వాహనాలను పరిటాల అనుచరులు ధ్వంసం చేశారు. దీంతో పరిటాల-సూరి వర్గీయులు ఒకరికొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వరదాపురం సూరి వర్గీయులు ప్రయాణిస్తున్న 10-15 వాహనాలు ధ్వంసం అయ్యాయి. నలుగురు సూరి వర్గీయులకు గాయాలయ్యాయి. దీంతో కాసేపు స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పెనుకొండలో సోమవారం సాయంత్రం జరిగే చంద్రబాబు ‘రా.. కదలిరా’ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న వరదాపురం సూరి వర్గీయులు చంద్రబాబు సభకు వెళ్లకూడదంటూ పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇక ధర్మవరం టీడీపీ టికెట్ కోసం కొంతకాలంగా పరిటాల శ్రీరామ్ - వరదాపురం సూరి గొడవపడుతున్న సంగతి విదితమే. చదవండి: నర్రెడ్డి సునీత యాక్షన్.. చంద్రబాబు డైరెక్షన్ -
ధర్మవరంలో హై టెన్షన్...వరదాపురం Vs పరిటాల..
-
ధర్మవరంలో టీడీపీకి భారీ షాక్
-
ధర్మవరంలో టీడీపీకి భారీ షాక్