నిందితులు కార్తీక్, రాజేష్
సాక్షి, అనంతపురం: స్నేహలత దారుణ హత్య కేసులో పోలీసుల పురోగతి సాధించారు. ఈ హత్యలో కీలకమైన మరో నిందితుడు కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హత్యలో రాజేష్‌కు సహకరించిన కార్తీక్ నుంచి నాలుగు సెల్ ఫోన్లు, అపాచి బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజేష్, కార్తీక్‌లను కలిపి పోలీసులు హత్యకు సంబంధించి లోతుగా విచారిస్తున్నారు. వారిపై 302, అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. స్నేహలత హత్యపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ గురువారం బాధిత కుంటుంబాన్ని అనంపురం వెళ్లి పరామర్శించారు. బాధిత కుంటుంబానికి బరోసాగా ఉంటామని తెలిపారు. చదవండి: స్నేహితులతో కలిసి యువతిని హత్య చేసిన ప్రియుడు!
బుధవారం ధర్మవరంలో ప్రియుడి చేతిలో స్నేహలత హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్న పోలీసులు కీలక నిందితుడు రాజేష్‌కు సహకరించిన స్నేహితులకు కోసం గాలిస్తున్నారు. స్నేహలత హత్య కేసును ‘దిశ’ పోలీసు స్టేషన్‌కు అప్పగించినట్లు ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. హత్యకు కారకులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తమ కూతురును హత్య చేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని స్నేహలత తల్లి లక్ష్మిదేవి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment