Snehalata
-
Snehalatha Mekala: అట్టడుగు వర్గాల కోసం అంతర్జాతీయ వేదికలపై...
ఎనిమిది దక్షిణాసియా దేశాలూ, అభివృద్ధికి నోచుకోని అనేక ఆఫ్రికాలోని వెనకబడిన దేశాల పల్లెల్లోని అట్టడుగు వర్గాలు, మారుమూల గిరిజనులకు, నగరాల్లోని మురికివాడల్లో రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్న వందలాది సంస్థల్ని సమన్వయం చేసే బాధ్యతలు... చాలా దేశాల్లోని పేదలూ, అణగారిన ప్రజలు, వికలాంగులు, ట్రాన్స్జెండర్స్లాంటి వారి అవసరాలను అంతర్జాతీయ వేదికలపై వినిపించడంతో పాటు వారికి అందాల్సిన సేవలూ, సౌకర్యాల విధాన రూపకల్పనలకు కృషి.. తమ పరిశోధనల్ని అంతర్జాతీయ సంస్థలకూ, వివిధ దేశాల్లోని ప్రభుత్వాలకూ, అక్కడి నేతలకు తెలియజెప్పే పని... అర్ధరాత్రి, అపరాత్రుల్లేకుండా దాదాపు 35 పైగా దేశాల్లో పర్యటనలు... ఇవన్నీ నిర్విరామంగా నిర్వర్తిస్తున్న సార్క్ దేశాల, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల సమన్వయకర్త ‘స్నేహలత మేకల’తో మాటా మంతీ... ► ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న బాధ్యతల గురించి... స్నేహలత : మన దేశంలోనే కాకుండా... మరెన్నో దేశాలలోని కుగ్రామాల్లో, గిరిజన ఆవాసాల్లో, పేదరికం తాండవిస్తున్న కొన్ని దేశాల్లోని మారుమూల పల్లెల్లో, పట్టణ మురికివాడల్లో మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం కల్పనకు అవసరమైన విధాన రూపకల్పనలతో పాటు అనేక సేవా కార్యకలాపాల రంగంలో పాలుపంచుకుంటున్నాను. మనదేశంతోపాటు బాంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, పాకిస్తాన్, మాల్దీవ్స్, శ్రీలంక, నేపాల్ దేశాల్లోని 500 పైగా ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలను సమన్వయపరుస్తూ... అవి తమ అవసరాలను, అభిప్రాయాలను అంతర్జాతీయ వేదికలపైన తెలియజెప్పే బాధ్యతలను, ప్రభుత్వ సహాయాలు అందేందుకు లోపరహితమైన విధాన రూపకల్పనలో పాలుపంచుకునే‘సౌత్ ఏషియన్ కాన్ఫరెన్స్ ఆన్ శానిటేషన్ ఫర్ ఆల్’ (సాకోశాన్) ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. అట్టడుగువర్గాలు, గిరిజనలతో పాటు వికలాంగులు, ట్రాన్స్‌జెండర్స్ లాంటివారి వెతలను అంతర్జాతీయ వేదికలపై వినిపించడమే కాకుండా... ఆ సేవలన్నీ వారికి ఎలా అందాలన్న విధాన రూపకల్పనపై ప్రభుత్వాలతో కలిపి పనిచేస్తుంటాం. ఈ కార్యక్రమాల కోసం బాగా వెనకబడిన ఆఫ్రికా దేశాలు మొదలుకొని... యూఎస్, ఫ్రాన్స్, బెల్జియమ్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్ వంటి దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తాం. ► ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ కార్యకలాపాలూ, వాటిల్లో మీ భాగస్వామ్యం... ఇది రెండు విధాలుగా జరుగుతుంది. వివిధ దేశాల్లోని 500 స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో పాటు, బడుగువర్గాలు, నగర మురికివాడల్లోని పేద ప్రజల వెతలు తీర్చడానికి వివిధ దేశాల్లోని హైలెవల్ పొలిటికల్ కమిటీలు, ప్రభుత్వంలోని నేతలు, బాధ్యులందరూ తీసుకోవాల్సిన చర్యలు, అవి జరగడానికి అవసరమైన విధాన నిర్ణయాల రూపకల్పనలో తోడ్పాటు అందిస్తుంటాను. అలాగే అట్టడుగు వర్గాలు, గిరిజనుల గొంతుకను అంతర్జాతీయ వేదికలపై వినిపించడం... ఇదంతా ఒకవైపు కార్యక్రమం. ఇక మరోవైపున మా ప్రతిపాదనలు సాకారమయ్యాక... వీటి నిర్వహణకు కావలసిన పాలనాపరమైన ఆవశ్యకతలు, నిధులు... ఇవన్నీ అనేక దేశాల్లోని బడుగువర్గాలు, నగర మురికివాడల ప్రజలకు చేరేందుకు అవసరమైన సేవలందిస్తుంటాం. ► ఇన్ని దేశాల్లోని ఇన్నిన్ని మారుమూల ప్రాంతాల్లో కార్యకలాపాలకు నిధులెలా? మాకు యునిసెఫ్, శానిటేషన్ అండ్ వాటర్ ఫర్ ఆల్, వాటర్ ఎయిడ్, జీడబ్ల్యూపీ వంటివాటితో పాటు ఇంకా అనేక అంతర్జాతీయ సంస్థలు నిధుల్ని అందిస్తాయి. ► అంతర్జాతీయ కార్యకలాపాల్లోకి మీ ప్రవేశం... ఇందుకు దోహదపడ్డ నేపథ్యం... నా కెరియర్ కర్నూలులో మొదలైంది. వాననీటిని ఒడిసిపట్టి, చెక్‌డ్యామ్స్ వంటివి నిర్మించి, భూగర్భజలాల వృద్ధికి తోడ్పడే ‘వాటర్‌షెడ్’ కార్యక్రమంలో చాలా చిన్నస్థాయి ‘సోషల్ ఆర్గనైజర్’గా కెరియర్ ప్రారంభించా. ఈ కార్యక్రమంలో ఓ వ్యవసాయ అధికారి, ఓ ఇంజనీర్, ఓ ఫారెస్టు అధికారితోపాటు కలిసి ఫీల్డ్‌లో పనిచేయాలి. మారుమూల ప్రాంతాలతోపాటు కొన్నిసార్లు గిరిజన, అటవీ ప్రాంతాల్లోనూ పనిచేయాల్సి వచ్చేది. క్రమక్రమంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలూ, వేదికలపై కార్యకలాపాలతో పాటు ప్రపంచబ్యాంకుకూ, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థలకు కన్సెల్టెన్సీ బాధ్యతలనూ నిర్వర్తించా. ప్రస్తుతం తాజాగా ‘ఫాన్సా’ లో ముఖ్యంగా సమన్వయ బాధ్యతలు. ఈ కార్యక్రమంలోనే భాగంగా హైదరాబాద్‌లోని మెట్రో వాటర్ బోర్డుతో కలిసి ఇక్కడ కూడా నీటి వృథా నివారించడం, వర్షపు నీటిని కాపాడుకోవడం కోసం ఓ ప్రాజెక్టులో భాగం పంచుకున్నా. ► భవిష్యత్తు కార్యకలాపాల గురించి ఏమైనా ప్రణాళికలు? ప్రస్తుతం ఈ సేవలతో పాటు కొంపల్లి ప్రాంతంలో ‘నిశ్చింత’ అనే వృద్ధాశ్రమం నడుపుతున్నా. అది నాకెంతో ఇష్టమైన సేవా కార్యక్రమం. చేయగలిగినంత కాలం చేశాక... నేనూ, నా భర్త... పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్నే ఎంచుకుని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా వీలైనంతమందికి ఆరోగ్యాన్నివ్వాలన్నదే నా సంకల్పం. ఆమె సంకల్పం నెరవేరాలని ఆశిద్దాం. ► మహిళగా వివక్షగానీ, ఇబ్బందులుగానీ ఎదుర్కొన్నారా? స్నేహలత : వివక్ష కాదుగానీ... ఇబ్బందులు చాలానే ఎదుర్కొన్నా. మారుమూల పల్లెలకూ, దట్టమైన అడవుల్లోని చాలా గిరిజన గ్రామాలకు వెళ్లాల్సి రావడంతో నన్ను తీసుకెళ్లడానికి తోటివాళ్లు ఇబ్బంది పడేవారు. పట్నంలో చదువుకున్న ఓ అమ్మాయి ఇలా గ్రామాలు పట్టుకు తిరగడం నాకంటే... నాతోటివాళ్లనీ, గ్రామస్తుల్ని ఇబ్బంది పెట్టేది. వాళ్లతో మమేకం కావడానికీ, వయసుకంటే పెద్దగా కనిపించడానికీ చీరకట్టుతో వెళ్తుండేదాన్ని. అడవిబాటల్లో చీరకట్టుతో ప్రయాణం అదో ఇబ్బంది. కాన్ఫరెన్స్‌ల కోసం ఇంగ్లిష్ తెలియని ఆఫ్రికా ఖండంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటనలు ఓ సవాల్. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడాలేకుండా ఆఫ్రికాలోని బుర్కినాఫాస్ లాంటి చోట్లకు వెళ్లినప్పుడు కేవలం సైగలతో నెట్టుకురావడం లాంటివి ఇబ్బంది కలిగించేవే. ఒంటరిగా దాదాపు 35 దేశాలు తిరుగుతున్నప్పుడు కొన్ని అటవీ ప్రయాణాలు, అర్ధరాత్రి పయనాలు సాహసయాత్రకు తీసిపోనివిగా ఉండేవి. మహిళలకు ఫీల్డ్ జాబ్ అనువు కాదని ఈ రోజుల్లో అనుకోడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. మూడు దశాబ్దాల కిందటే నేనూ, అలాగే మా తరంలోని అనేకమంది చేయగలిగినప్పుడు... ఇప్పుడిది ఓ అంశమే కాదు. – యాసీన్ ఫొటో: రాజేశ్ -
స్నేహలత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద హత్యకు గురైన స్నేహలత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి ఆమె కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని గురువారం చెప్పారు. దళిత వర్గానికి చెందిన మహిళలపై అత్యాచార ఘటనల్లో చట్టపరంగా రూ.8.25 లక్షల పరిహారం అందజేస్తారు. దీనికి సీఎం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అదనమని మంత్రి తెలిపారు. పక్షపాతానికి తావివ్వకుండా త్వరితగతిన కేసును దర్యాప్తు చేయాలని పోలీసుశాఖను సీఎం ఆదేశించారని చెప్పారు. స్నేహలత కుటుంబానికి చట్టప్రకారం వచ్చే రూ.8.25 లక్షల్లో తక్షణసాయంగా రూ.4,12,500 అందజేస్తున్నామన్నారు. స్నేహలత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇంటి స్థలం, ఇల్లు, ఐదెకరాల పొలం ఇస్తామని చెప్పారు. ఆ కుటుంబానికి మూడు నెలలకు సరిపడా వందకిలోల బియ్యం, పదిలీటర్ల వంటనూనె, పదికిలోల చక్కెర, ఇతర నిత్యావసర సరుకులు, వంటపాత్రలు అందించినట్లు తెలిపారు. చదవండి: (యువతి దారుణ హత్య) నిందితులకు కఠినశిక్ష పడేలా చూస్తాం స్నేహలత హత్యపై పూర్తిస్థాయిలో న్యాయ విచారణ జరిపించి నిందితులకు కఠినశిక్షలు పడేలా చూస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గురువారం ఆమె అనంతపురంలో స్నేహలత కుటుంబసభ్యులను పరామర్శించారు. మరో నిందితుడు కార్తీక్ అరెస్టు స్నేహలత హత్యకేసులో మరో నిందితుడు సాకే కార్తీక్‌ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.సత్యయేసుబాబు మీడియాకు తెలిపారు. -
స్నేహలత హత్య కేసు: ఇద్దరు అరెస్ట్
సాక్షి, అనంతపురం : జిల్లాలోని బడన్నపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఎస్బీఐలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని స్నేహలత (19) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియుడు గుత్తి రాజేష్, కార్తీక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 302,201 కింద కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ బి.సత్యయేసు గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. గత నాలుగేళ్లుగా స్నేహలత-రాజేశ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలిపారు. ఇతర వ్యక్తులతో సంబంధాలున్నాయని రాజేశ్ వేధించాడని, ఈ క్రమంలో రాజేష్ మంగళవారం స్నేహలతను తన బైక్ మీద ధర్మవరం నుంచి అనంతపురానికి తీసుకొచ్చేందుకు వెళ్లాడని చెప్పారు. (యువతి దారుణ హత్య) బడన్నపల్లి సమీపంలోకి వచ్చే సరికి రోడ్డు పక్కన బైక్ ఆపి ఆమెతో గొడవపడి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బ్యాంకు పేపర్లను శరీరంపై వేసి కాల్చి పరారయ్యాడయాని అనంతరం తల్లిదండ్రులు ఫిర్యాదుతో అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నిందితులపై త్వరగా ఛార్జ్‌షీట్ వేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. స్నేహలతపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. కాగా స్నేహలత హత్య కేసు స్థానికలంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు స్థానిక ఎస్పీ పర్యవేక్షణలో కేసు విచారణ జరిగింది. దారుణ హత్యకు గురైన స్నేహలత కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. (స్నేహలత హత్యపై టీడీపీ రాజకీయాలు) -
స్నేహలత హత్యపై టీడీపీ రాజకీయాలు
సాక్షి, అనంతపురం : దారుణ హత్యకు గురైన స్నేహలత కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. మృతదేహానికి నివాళులు అర్పించిన వాసిరెడ్డి పద్మ... బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘వైద్య విద్యార్థిని రిసితేశ్వరి చనిపోతే కేసు కూడా నమోదు చేయని చరిత్ర చంద్రబాబు నాయుడిది. అలాంటిది స్నేహలత హత్యపై టీడీపీ రాజకీయాలు చేస్తోంది. హత్య ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాం. చదవండి: స్నేహలత హత్య కేసు: కార్తీక్ అరెస్ట్ దిశ చట్టం ద్వారా వారం రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు అవుతుంది. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ...స్నేహలత హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం, మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. మరోవైపు ఈకేసులో నిందితులు ఉన్న రాజేష్, కార్తీక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. -
స్నేహలత హత్య కేసు: కార్తీక్ అరెస్ట్
సాక్షి, అనంతపురం: స్నేహలత దారుణ హత్య కేసులో పోలీసుల పురోగతి సాధించారు. ఈ హత్యలో కీలకమైన మరో నిందితుడు కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హత్యలో రాజేష్‌కు సహకరించిన కార్తీక్ నుంచి నాలుగు సెల్ ఫోన్లు, అపాచి బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజేష్, కార్తీక్‌లను కలిపి పోలీసులు హత్యకు సంబంధించి లోతుగా విచారిస్తున్నారు. వారిపై 302, అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. స్నేహలత హత్యపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ గురువారం బాధిత కుంటుంబాన్ని అనంపురం వెళ్లి పరామర్శించారు. బాధిత కుంటుంబానికి బరోసాగా ఉంటామని తెలిపారు. చదవండి: స్నేహితులతో కలిసి యువతిని హత్య చేసిన ప్రియుడు! బుధవారం ధర్మవరంలో ప్రియుడి చేతిలో స్నేహలత హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్న పోలీసులు కీలక నిందితుడు రాజేష్‌కు సహకరించిన స్నేహితులకు కోసం గాలిస్తున్నారు. స్నేహలత హత్య కేసును ‘దిశ’ పోలీసు స్టేషన్‌కు అప్పగించినట్లు ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. హత్యకు కారకులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తమ కూతురును హత్య చేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని స్నేహలత తల్లి లక్ష్మిదేవి డిమాండ్ చేశారు. -
యువతి దారుణ హత్య
ధర్మవరం రూరల్/అనంతపురం క్రైం: ఓ యువతిని హత్య చేసి.. ఆ తర్వాత తగలబెట్టేందుకు ప్రయత్నించిన ఘటన అనంతపురం జిల్లా బడన్నపల్లి గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అనంతపురం పట్టణంలోని అశోక్ నగర్లో నివాసముంటున్న లష్మి, కుల్లాయప్ప దంపతుల కుమార్తె స్నేహలత(19) ధర్మవరంలోని ఎస్బీఐలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. గుత్తి రాజేష్, కార్తీక్ అనే యువకులు ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతుండేవారు. చెడు వ్యసనాలకు బానిస అయిన రాజేష్‌కు స్నేహలత దూరంగా ఉండేది. దీంతో ఆమెపై రాజేష్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో రాజేష్ మంగళవారం స్నేహలతను తన బైక్ మీద ధర్మవరం నుంచి అనంతపురానికి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. బడన్నపల్లి సమీపంలోకి వచ్చే సరికి రోడ్డు పక్కన బైక్ ఆపి ఆమెతో గొడవపడి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బ్యాంకు పేపర్లను శరీరంపై వేసి కాల్చి పరారయ్యాడు. బుధవారం ఉదయం కొందరు రైతులు బడన్నపల్లి సమీపంలోని పొలంలో యువతి శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలి వద్ద లభ్యమైన ఆధారాలతో యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ బిడ్డను డిగ్రీ చదుతున్నప్పటి నుంచి కార్తీక్, రాజేష్ అనే యువకులు ప్రేమ పేరుతో వేధించేవారని.. అల్లారుముద్దుగా చూసుకుంటున్న తమ కూతురిని చివరకు ఇలా చేశారంటూ స్నేహలత తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరైంది. రాజేష్‌తో పాటు కార్తీక్ కూడా ఈ ఘటన వెనుక ఉన్నాడని.. వారిద్దరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, ఘటనా స్థలిని డీఎస్పీ రమాకాంత్, సీఐ చిన్న పెద్దయ్య, ఎస్ఐ జనార్ధన్‌నాయుడు పరిశీలించి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. యువతి అదృశ్యం విషయం తెలియగానే వన్ టౌన్ పోలీసులు అప్రమత్తమై.. ధర్మవరం పోలీసులకు సమాచారమిచ్చారని.. రాత్రంతా ధర్మవరం, పరిసరాల్లో గాలింపు జరిపారని వివరించారు. కాగా, రాజేష్, కార్తీక్ వేధిస్తున్నట్లు గతంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వన్ టౌన్ పోలీసులు తెలిపారు. అదుపులో రాజేష్.. పరారీలో కార్తీక్ స్నేహలత హత్య కేసును త్వరితగతిన ఛేదిస్తామని ఎస్పీ బి.సత్యయేసు తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గుత్తి రాజేష్ అనే వ్యక్తి స్నేహలతను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అతనితో పాటు మరో అనుమానితుడు కార్తీక్ కూడా ఉన్నట్లు తెలియడంతో విచారణ చేస్తున్నామని చెప్పారు. రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నామని.. కార్తీక్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. స్నేహలతపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని.. వీలైనంత వేగంగా చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని చెప్పారు. -
స్నేహలతపై లైంగిక దాడి జరగలేదు
సాక్షి, అనంతపురం : ధర్మవరంలో జరిగిన ఎస్బీఐ ఉద్యోగిని స్నేహలత హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ప్రియుడు గుత్తి రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు కార్తీక్ కోసం గాలిస్తున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు మీడియాతో మాట్లాడుతూ.. స్నేహలతపై రేప్ జరగలేదని, ప్రేమికుల మధ్య విభేదాలే హత్యకు కారణమని తెలిపారు. ప్రవీణ్ అనే మరో యువకుడితో ఆమె సన్నిహితంగా ఉంటోందన్న కోపంతో నిందితులు హత్యకు పాల్పడ్డారని అన్నారు. ( ఎస్బీఐ ఉద్యోగిని దారుణ హత్య) ప్రియుడు రాజేష్, ఇతర నిందితులపై 302, అట్రాసిటీ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఎక్కడా పోలీసుల నిర్లక్ష్యం లేదని, ఫిర్యాదు రాగానే మిస్సింగ్ కేసు నమోదు చేశారని తెలిపారు. స్నేహలత కేసును దిశ పీఎస్‌కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. త్వరగా ఛార్జిషీట్ వేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
విద్య, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
మంచిర్యాలఅగ్రికల్చర్ : ‘‘నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి. వ్యవసాయం, విద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. భారతదేశానికి వ్యవసాయం రంగం నుంచి వచ్చే వాటా ఎంతో ఉంది. దీనిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అందించే పథకాలు, రైతులకు ఆర్థిక లబ్ధిచేకూర్చేలా చూస్తాను. ఆడపిల్లలకు చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తాను. వారిని విద్యావంతులను చేయడం, మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై వారిని చైతన్యవంతులను చేయడం నా కర్తవ్యంగా భావిస్తాను..’’ అని మంచిర్యాల జిల్లాకు కొత్తగా వచ్చిన ట్రెయినీ ఐఏఎస్ మొగిలి స్నేహలత అన్నారు. ఏడాదిపాటు ట్రెయినీ ఐఏఎస్‌గా జిల్లాలో పని చేయనున్నారు. సోమవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ‘సాక్షి’ ఆమెను పలుకరించింది. పలు విషయాలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. మీ బాల్యం, చదువు ఎక్కడ..? పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. 10వ తరగతి, ఇంటర్ అంతా హైదరాబాద్. సీబీఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాను. కుటుంబం నేపథ్యం గురించి.. స్నేహలత : నాన్న పేరు రాజేంద్రకుమార్, హైదరాబాద్‌లో కాంట్రాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అమ్మ మాధవి గృహిణి, అక్క నిఖిత, చెల్లి అలేఖ్యలు ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు. తమ్ముడు సాయితేజ గ్రూప్స్‌కు సన్నద్ధం అవుతున్నాడు. ఐఏఎస్ వైపు ఎలా వచ్చారు.. స్నేహలత : డిగ్రీ చదువుతున్నప్పుడు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ప్రజలకు మరింత దగ్గరవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగంలో మంచి స్థానంలో ఉంటే సాధ్యం అని ఐఏఎస్‌కు సన్నద్ధం కావాలని నిర్ణయించకున్నారు. బీటెక్ పూర్తి కాగానే ఈ విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పాను. వారు కూడా ప్రోత్సహించారు. ఐఏఎస్ ఏ బ్యాచ్, శిక్షణ ఎక్కడ తీసున్నారు.. స్నేహలత : 2016లో పరీక్ష రాశాను. 2017లో వచ్చిన ఫలితాల్లో ఎంపికయ్యాను. మా బ్యాచ్‌కు లాల్‌బహదూర్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ సమయంలో రెండు నెలలపాటు భారత్ దర్శన్ యాత్రకు వెళ్లాను. సొంత రాష్ట్రంలో శిక్షణపై మీ అభిప్రాయం? స్నేహలత : ఐఏఎస్ ట్రైనింగ్‌ను సొంత రాష్ట్రంలో కేటాయించడం సంతోషంగా ఉంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలో ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం దొరికింది. జిల్లా అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్తాను. శిక్షణ పూర్తయ్యేలోపు ఇక్కడి పరిస్థితులపై పట్టు సాధించడమే లక్ష్యం. పరీక్షకు ఎలా సన్నద్ధం అయ్యారు.. స్నేహలత : పరీక్షకు ముందే రెండవ చాయిస్ ఉండకూదనుకొని చదివాను. సంవత్సర కాలం అంతా పుస్తకాలతో గడిపాను. రోజులో సింహభాగం ప్రిపరేషన్‌కు కేటాయించాను. నా కష్టానికి తోడు కుటుంబం నుంచి అందిన ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలోనే సెలెక్ట్ అయ్యాను. శిక్షణ అనంతరం ఒక సంవత్సరంపాటు ట్రైనీ ఐఏఎస్‌గా మంచిర్యాలకు పోస్టింగ్ ఇవ్వడంతో ఇక్కడకు వచ్చాను. యువతకు మీరిచ్చే సందేశం..? స్నేహలత : సమయం ఎక్కువగా ఉన్నదని లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నష్టపోతాం. కష్టపడి చదివే వారిని విజయం తప్పకుండా వరిస్తుంది. దానిని సాధించేవరకు తపస్సులా శ్రమించాలి. లక్ష్యాన్ని సాధించే క్రమంలో మొదలు పెట్టిన ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపవద్దు. ఏ చిన్న అవకాశాన్ని చేజార్చుకోవద్దు. ముఖ్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళితే లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటాం. మన చదువు మనకే కాకుండా మన దేశానికి ఉపయోగపడేలా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సమాజ సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలి. – మంచిర్యాలఅగ్రికల్చర్ -
వికసించిన విద్యా కుసుమం
♦ టెట్‌లో స్టేట్ టాపర్‌గా స్నేహలత ♦ తెలంగాణ వ్యాప్తంగా మెతుకుసీమ ఖ్యాతి పాపన్నపేట: స్నేహలత.. విద్యాకుసుమమై వికసించింది. టెట్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచింది. మెతుకుసీమ ఖ్యాతిని తెలంగాణ వ్యాప్తంగా చాటిచెప్పింది. పాపన్నపేట మండలం ముద్దాపూర్‌కు చెందిన ఊరడి స్నేహలత శుక్రవారం ప్రకటించిన టెట్-1పేపర్(డైట్)లో 150 మార్కులకుగానూ 134 మార్కులు సాధించింది. మొదటి ప్రయత్నంలోనే స్టేట్ టాపర్‌గా నిలవడం గమనార్హం. మాస్టారింట్లో మెరిసిన ముత్యం ముద్దాపూర్ గ్రామానికి చెందిన ఊరడి పోచమ్మ దినసరి కూలీ. రెక్కలు ముక్కలు చేసుకుంటూ కొడుకు నర్సింలును చదివించి టీచర్‌ను చేసింది. నర్సింలు ప్రస్తుతం కొల్చారం ఉన్నతపాఠశాలలో గణితం స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. నర్సింలు-విజయలక్ష్మి దంపతులకు స్నేహలత, సంపత్‌కుమార్ సంతానం. స్నేహలత చిన్నప్పటి నుంచే చదువులో చురుకైన విద్యార్థిని. ఒకటి నుంచి 7వ తరగతి మెదక్ పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌లో, 8వ తరగతి కృష్ణవేణి టాలెంట్స్కూల్, 9, 10 తరగతులు వర్గల్ నవోదయలో, ఇంటర్ బోడుప్పల్లో చదివి, రంగారెడ్డి జిల్లా సూరారంలో డైట్ పూర్తిచేసింది. ఇంటర్ తరువాత బీవీఆర్ఐటీలో ఇంజనీరింగ్‌లో సీటు వచ్చినప్పటికీ ఉపాధ్యాయ వృత్తిపై మమకారంతో డైట్ పూర్తిచేసింది. అనంతరం మొదటిసారిగా అర్హతపరీక్ష రాసి 134 మార్కులు సాధించింది. స్మితాసబర్వాల్ ఆదర్శం జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ప్రస్తుతం సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితాసబర్వాల్ నా ఆదర్శం. ఐఏఎస్ లక్ష్యంగా చదువు కొనసాగిస్తా. నిరుపేదల అభివృద్ధే ధ్యేయంగా కలెక్టర్‌గా సేవలందిస్తా. అంత వరకు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సివిల్స్ సాధిస్తా. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకం మేరకు ఈరోజు టెట్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచాను. - స్నేహలత -
వ్యవసాయ కూలి నుంచి ఎంపీపీగా..
చిట్యాల : కాలం కలిసొచ్చింది. కూలి మని‘షి’ని అదృష్టం వరించింది. మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. నిన్న మొన్నటి వరకు భర్తకు తోడుగా కూలి పనిచేస్తూ ఆర్థిక అవసరాల్లో అండగా నిలుస్తూ ఇంటిని చక్కదిద్దుకునే ఆమె... ఇప్పటి నుంచి మండలస్థాయి పాలనకు సిద్ధమవుతోంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని టేకుమట్ల గ్రామంలో బందెల నరేష్, స్నేహలత దంపతులది సాదాసీదా కుటుంబం. వీరికో పాప ఉంది. ఈ ముగ్గురే కాకుండా నరేష్ అమ్మానాన్న, తమ్ముడు కూడా వీరితోనే ఉంటారు. కాగా, నరేష్ గ్రామంలో సైకిల్‌షాపు నిర్వహిస్తున్నాడు. అలాగే తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటర్ వరకు చదువుకున్న స్నేహలత ఇంటిపనులకే పరిమితం కాకుండా భర్తకు ఆసరాగా ఉండాలనుకుంది. ఇందులో భాగంగా భర్తతోపాటు రోజు వ్యవసాయ పనులు చేస్తోంది. అయితే వీరికి కొద్దిపాటి భూమి మాత్రమే ఉండడంతో రోజూ పని ఉండకపోయేది. దీంతో ఆమె కూలీ పనులకు వెళ్తుండేది. ఇలా సాగిపోతున్న వీరి జీవితంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త మలుపు తిప్పాయి. అచ్చొచ్చిన రిజర్వేషన్లు స్నేహలతను ప్రజాప్రతినిధిని చేశాయి. టేకుమట్ల ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిపించాయి. అంతేనా... మండల పరిషత్ అధ్యక్ష పదవిని కట్టబెట్టాయి. మొన్నటివరకు తమతో కూలి పనికి వచ్చిన స్నేహలత ఎంపీపీగా ఎన్నిక కావడం పట్ల ఆమెతో పరిచయం ఉన్నవారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.