
సాక్షి, అనంతపురం : ధర్మవరంలో జరిగిన ఎస్‌బీఐ ఉద్యోగిని స్నేహలత హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ప్రియుడు గుత్తి రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు కార్తీక్ కోసం గాలిస్తున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు మీడియాతో మాట్లాడుతూ.. స్నేహలతపై రేప్ జరగలేదని, ప్రేమికుల మధ్య విభేదాలే హత్యకు కారణమని తెలిపారు. ప్రవీణ్ అనే మరో యువకుడితో ఆమె సన్నిహితంగా ఉంటోందన్న కోపంతో నిందితులు హత్యకు పాల్పడ్డారని అన్నారు. ( ఎస్‌బీఐ ఉద్యోగిని దారుణ హత్య)
ప్రియుడు రాజేష్, ఇతర నిందితులపై 302, అట్రాసిటీ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఎక్కడా పోలీసుల నిర్లక్ష్యం లేదని, ఫిర్యాదు రాగానే మిస్సింగ్ కేసు నమోదు చేశారని తెలిపారు. స్నేహలత కేసును దిశ పీఎస్‌కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. త్వరగా ఛార్జిషీట్ వేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment