ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలంటూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో 37 రోజులుగా దీక్షలు కొనసాగుతున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం కరువయింది. ఈ నేపథ్యంలో వీరికి అండగా నిలిచేందుకు.. ఆత్మస్థైర్యం నింపేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహనరెడ్డి మంగళవారం ధర్మవరం రానున్నారు.