
సాక్షి, అనంతపురం: జిల్లాలోని ధర్మవరంలో యువకుడి కిడ్నాప్‌తో కలకలం రేగింది. శుక్రవారం రాత్రి కార్తీక్ అనే యువకుడిని కిడ్నాప్ చేసిన దుండగులు అతన్ని చితకబాదారు. అనంతరం కార్తీక్ గాయాలతో ఉన్న వీడియోను బెంగుళూరులో ఉన్న అతని సోదరికి పంపించి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్తీక్ సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ధర్మవరం పోలీసులు గాలింపు చేపట్టారు. స్నేహితుల మధ్య గొడవతోనే కార్తీక్ కిడ్నాప్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ మిత్రుడి వద్ద రూ.9 వేలకు సెల్‌ఫోన్ కొనుగోలు చేసిన కార్తీక్ మూడు వేలు బాకీపడ్డాడు. ఈ అప్పు తీర్చకపోవడంతో సూరీ అనే వ్యక్తి తన అనుచరులతో కార్తీక్‌ను కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు.
(చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు)