![Anantapur: Police arrested constable over kidnap of young girl - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/25/ra_0.jpg.webp?itok=2XRiZm32)
రొద్దం: మరికొన్ని గంటల వ్యవధిలో పెళ్లి పీటలు ఎక్కబోయే యువతి కిడ్నాప్‌కు గురి కావడం రొద్దంలో కలకలం సృష్టించింది. పోలీసుల సమాచారం మేరకు.. రొద్దం మండలం గౌరాజుపల్లికి చెందిన యువతికి పెళ్లి నిశ్చయమైంది. గురువారం పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా... పెళ్లికుమార్తెకు మేకప్‌కు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసేందుకు బుధవారం ఆమె మండల కేంద్రానికి వచ్చింది. అప్పటికే మాటు వేసి ఉన్న ఆమె బావ, మరో ఇద్దరితో కలిసి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయాడు.
కుటుంబసభ్యులు అప్రమత్తం చేయడంతో ఎస్‌ఐ నారాయణ, సిబ్బంది వెంటనే రంగంలో దిగి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల పట్టుబడితే వారి చెర నుంచి యువతిని విడిపించి, తల్లిదండ్రులకు అప్పగిస్తామని, లేకుంటే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామంటూ ఈ సందర్భగా ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment