![Two Men killed friedn son for Money - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/8/ows_149246973193137.jpg.webp?itok=79nsHEFw)
సాక్షి, అనంతపురం : డబ్బు కోసం స్నేహితుడి కొడుకుని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గౌతమ్(9) అనే బాలుడిని అతని తండ్రి స్నేహితులు సాయి, మల్లిలు డబ్బు కోసం కిడ్నాప్ చేసి.. ఆ తర్వాత భయంతో చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత బాలుడి మృతదేహాన్ని బి.యాలేరు చెరువులో పడేశారు. పోలీసులు ఎట్టకేలకు నిందితులు సాయి, మల్లిలను అరెస్టు చేశారు. బాలుడి హత్యతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమకు న్యాయం జరిగేలా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గౌతమ్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment