
సాక్షి, అనంతపురం : జిల్లాలోని ధర్మవరం మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తుంపర్తి గ్రామంలో భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఆదేశాలతోనే తమ భూములు లాక్కుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ, తహశీల్దార్‌లపై దాడికి యత్నించారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళన చేపడుతున్న గ్రామస్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.