సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): కాచిగూడ నుంచి కర్నూలు మీదుగా యలహంక (బెంగళూరు)కు వెళ్లే యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును ధర్మవరం వరకు కుదించారు. బెంగళూరు – పెనుగొండ మధ్య జరుగుతున్న రైల్వే ట్రాక్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 17603 నంబరు రైలు ఈనెల 12, 13, 14 తేదీల్లో కాచిగూడ నుంచి కర్నూలు, డోన్ మీదుగా ధర్మవరం వరకు మాత్రమే వెళ్తుంది. అలాగే యలహంక నుంచి కాచిగూడ వెళ్లే 17604 నంబరు రైలు 13, 14, 14 తేదీల్లో ధర్మవరం నుంచి వెనుదిరిగి వెళ్తుంది.
భువనేశ్వర్ రైలు రద్దు
భువనేశ్వర్ – బెంగళూరు – భువనేశ్వర్ మధ్య నంద్యాల, డోన్ మీదుగా రాకపోకలు సాగించే 18463, 18464 రైళ్లు ఈనెల 12, 13, 14, 15 తేదీల్లో బెంగళూరు – శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ల మధ్య రద్దు చేశారు. మచిలీపట్నం – యశ్వంత్‌పూర్ – మచిలీపట్నం మధ్య కర్నూలు మీదుగా రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైళ్లు 13, 14వ తేదీల్లో ధర్మవరం– యశ్వంత్‌పూర్ మధ్య రద్దు చేశారు.
కోర్బా – యశ్వంత్‌పూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 12న కర్నూలు, డోన్, గుత్తి, రేణిగుంట, జోలార్‌పెట్టాయి, బంగారపేట్, కృష్ణరాజపురం మీదుగా దారి మళ్లించారు. రాజ్‌కోట్ – కోయంబత్తూర్‌కు మంత్రాలయం రోడ్, ఆదోని మీదుగా వెళ్లే 16613 ఎక్స్‌ప్రెస్ రైలును గుత్తి, రేణిగుంట, జోలార్‌పట్టాయి, తిరపత్తూర్, సేలమ్ మీదుగా మళ్లించారు. ఈ మేరకు రైల్వే శాఖ సీపీఆర్‌ఓ రాకేష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment