yesvantpur express
-
Yesvantpur Express: ఆ రైలు ధర్మవరం వరకే
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): కాచిగూడ నుంచి కర్నూలు మీదుగా యలహంక (బెంగళూరు)కు వెళ్లే యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును ధర్మవరం వరకు కుదించారు. బెంగళూరు – పెనుగొండ మధ్య జరుగుతున్న రైల్వే ట్రాక్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 17603 నంబరు రైలు ఈనెల 12, 13, 14 తేదీల్లో కాచిగూడ నుంచి కర్నూలు, డోన్ మీదుగా ధర్మవరం వరకు మాత్రమే వెళ్తుంది. అలాగే యలహంక నుంచి కాచిగూడ వెళ్లే 17604 నంబరు రైలు 13, 14, 14 తేదీల్లో ధర్మవరం నుంచి వెనుదిరిగి వెళ్తుంది. భువనేశ్వర్ రైలు రద్దు భువనేశ్వర్ – బెంగళూరు – భువనేశ్వర్ మధ్య నంద్యాల, డోన్ మీదుగా రాకపోకలు సాగించే 18463, 18464 రైళ్లు ఈనెల 12, 13, 14, 15 తేదీల్లో బెంగళూరు – శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ల మధ్య రద్దు చేశారు. మచిలీపట్నం – యశ్వంత్‌పూర్ – మచిలీపట్నం మధ్య కర్నూలు మీదుగా రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైళ్లు 13, 14వ తేదీల్లో ధర్మవరం– యశ్వంత్‌పూర్ మధ్య రద్దు చేశారు. కోర్బా – యశ్వంత్‌పూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 12న కర్నూలు, డోన్, గుత్తి, రేణిగుంట, జోలార్‌పెట్టాయి, బంగారపేట్, కృష్ణరాజపురం మీదుగా దారి మళ్లించారు. రాజ్‌కోట్ – కోయంబత్తూర్‌కు మంత్రాలయం రోడ్, ఆదోని మీదుగా వెళ్లే 16613 ఎక్స్‌ప్రెస్ రైలును గుత్తి, రేణిగుంట, జోలార్పట్టాయి, తిరపత్తూర్, సేలమ్ మీదుగా మళ్లించారు. ఈ మేరకు రైల్వే శాఖ సీపీఆర్ఓ రాకేష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో హిజ్రాల బీభత్సం
కర్ణాటక, గుంతకల్లు: బెంగళూరు యశ్వంతపూర్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం మధ్యాహ్నం కొందరు ప్రయాణికులపై హిజ్రాలు దాడి చేశారు. ప్రయానికుల నుంచి డబ్బులు లాక్కోవడంతో పాటు టికెట్లు చించివేసి భయబ్రాంతులకు గురి చేశారు. వివరాలు.. యశ్వంతపూర్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ధర్మవరం చేరిన తరువాత కొందరు హిజ్రాలు ఎక్కారు. రైలు కల్లూరు స్టేషన్ దాటిన తరువాత పెన్నానది వంతెనపై ఎస్–3 నుంచి ఎస్–6 బోగీల్లోని చొరబడి సుమారు 15 మంది హిజ్రాలు బీభత్సం సృష్టించారు. కొందరి నుంచి అందినకాడికి డబ్బు లాక్కుతున్నారు. డబ్బులు ఇవ్వనందుకు కొందరి టికెట్లను చించివేశారు. తీరిగ్గా చైను లాగి దిగి వెళ్లిపోయారు. గుంతకల్లులో ప్రయాణికుల ధర్నా ఈ విషయంపై కొందరు బాధితులు ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారమందించారు. ఈ రైలు గుంతకల్లు జంక్షన్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంది. హిజ్రాల దాడిలో జేబులు ఖాళీ అయిన ప్రయాణికులంతా ప్లాట్‌ఫారంపై బైఠాయించి రైలును ముందుకు కదలనివ్వకుండా అరగంటకుపైగా ఆందోళన చేశారు. తక్షణం హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న ఆర్పీఎఫ్ ఎస్ఐ సాయిప్రసాద్, ఏఎస్ఐ ఆనందప్పలు ప్రయాణికులకు సర్దిచెప్పి రైలు ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. -
రైలు నుంచి జారిపడి బాలుడు మృతి
భిక్నూర్ (నిజామాబాద్) : వేగంగా వెళ్తున్న రైలు నుంచి జారి కిందపడిన ఓ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భిక్నూర్ మండలం తాళ్లమడ్ల సమీపంలో చోటుచేసుకుంది. బోధన్ మండలం పెంటకుర్దు గ్రామానికి చెందిన నర్సింహులు భార్య, కుమారుడితో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నర్సింహులు కుమారుడు ఆకాష్(8) తాళ్లమడ్ల గ్రామ సమీపంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు. రాళ్లపై పడటంతో తీవ్రగాయాలపాలైన బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. రైలు కామారెడ్డి స్టేషన్లో ఆగిన తర్వాత కుమారుడు లేడన్న విషయాన్ని నర్సింహులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వారు వెంటనే స్పందించి ఆకాష్ చనిపోయిన విషయం తెలుసుకుని ధ్రువీకరించటంతో అతడు హతాశుడయ్యాడు. -
రైళ్లు కిటకిట
=అటు అయ్యప్పస్వాముల సందడి =క్రిస్మస్ సెలవుల హడావుడి =చాంతాడులా వెయిటింగ్ లిస్ట్ =ప్రయాణికుల ఇక్కట్లు రైళ్లకు అప్పుడే పండుగ కళ వచ్చేసింది. ఆదివారంరైళ్లన్నీ కిటకిటలాడాయి. హైదరాబాద్ వైపు వెళ్లే బళ్లన్నీ రద్దీగా ఉన్నాయి. యశ్వంత్‌పూర్, చెన్నయ్, తిరుపతి వెళ్లే ఎక్స్ప్రెస్లదీఅదే దారి. ఇటు క్రిస్మస్ సెలవులకు వెళ్లే వారు..అటు శబరిమల వెళ్లే స్వాముల హ డావిడి ఎక్కువగా కనిపిం చింది. ఇంకా సంక్రాంతి రాకుండానే నిరీక్షణ జాబితా చాంతాడులా పెరిగిపోవటంతో పలువురు ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. విశాఖపట్నం, న్యూస్‌లైన్: రైలు ప్రయాణికులకు ఇది పరీక్ష సమయం. క్రిస్మస్ సెలవులు ప్రారంభం అయిన సందర్భంగా తమ ఊళ్లకు తరలివెళ్లే వారు.. ఈ నెల 26 నుంచి అయ్యప్ప భక్తుల మండల యాత్రలు ముగుస్తుండడంతో శబరిమల చేరుకోవాలనుకునే స్వాములతో ఆదివారం రైళ్లన్నీ కిటకిటలాడాయి. విశాఖ నుంచి బయల్దేరే దాదాపు అన్ని రైళ్లకూ వెయిటింగ్ జాబితా ప్రయాణికులు ఉండిపోయారు. వందలాది మంది ప్రయాణికులు తమతమ ప్రయాణాలను రద్దు చేసుకున్నా మరింత మంది రైల్లో బెర్తులు లభ్యం కావని ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే రైళ్లతో బాటు యశ్వంత్‌పూర్, చెన్నయ్, తిరుపతి వెళ్లే రైళ్లకు భారీ డిమాండ్ ఉంది. ప్రయాణికులను నియంత్రించలేక రైల్వే పోలీసులు అవస్థలు పడ్డారు. గోదావరి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ల జనరల్ బోగీల్లోకి ప్రయాణికులను ఎక్కించేందుకు చెమటలు కక్కారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తీవ్రంగా శ్రమించి ఆ రైళ్లలో వేలాడే ప్రయాణికులను దించేసి ఇతర రైళ్లలో పంపించారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 150 మంది, విశాఖలో 80 మంది, గరీబ్థ్ల్రో 300 మంది నిరీక్షణ జాబితాతో ఈ మూడు రైళ్లు కదిలాయి. దురంతో ఎక్స్‌ప్రెస్‌కు 100 మందికి పైగా ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. సంక్రాంతికి నెల రోజుల ముందుగానే రైళ్ల పరిస్థితి ఇలా వుంటే పండుగ సీజన్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు. గరీబ్థ్‌క్రు 100 దాటితే కష్టమే! గరీబ్థ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణానికి 200 వెయిటింగ్ జాబితా ఉన్నా గతంలో టికెట్ కన్ఫర్మ్ అయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 50 వెయిటింగ్ వచ్చినా రిజర్వ్ అయ్యే ఛాన్స్‌లు తక్కువగా ఉన్నాయి. అప్పట్లో రెండు బోగీలు అదనంగా ఉండేవి. అప్పట్లో ఈ రెండు బోగీలకు చెందిన బెర్తులు అధికారికంగా ఫీడయ్యేవి కావు. దీంతో నిరీక్షణ జాబితాలో వున్న వారందరికీ రైలు బయల్దేరే వేళకు బెర్తులు ఖాయమయ్యేవి. కానీ గత వారంలో ఆ రెండు బోగీల బెర్తులను కంప్యూటర్లో ఫీడ్ చేశారు. దీంతో టికెట్ తీసుకున్నప్పుడే స్టేటస్ మేరకు నమోదవుతోంది. ఎక్కువ వెయిటింగ్ జాబితా టికెట్ కొనుక్కుంటే ఇకపై రైల్లో కష్టాలు పడాల్సిందే కానీ బెర్త్ ఖాయం మాత్రం కాదు. -
పలు రైళ్లు రద్దు: ఈస్ట్ కోస్ట్ రైల్వే
భారీ వర్షాల కారణంగా విశాఖపట్నం డివిజన్లో పలు రైళ్లు రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే ఆదివారం వెల్లడించింది. విశాఖ, భువనేశ్వర్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే పలు రైళ్లను దారి మళ్లీస్తున్నట్లు పేర్కొంది. రైలు నెంబర్12863: హౌరా -యశ్వంత్‌పూర్, రైలు నెంబర్18463: భువనేశ్వర్ - బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, రైలు నెంబర్18047: హౌరా-వాస్కో అమరావతి ఎక్స్‌ప్రెస్, రైలు నెంబర్18401: పూరీ-వోకా ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. విజయనగరం, రాయ్‌పూర్, నాగ్‌పూర్ మీదుగా మళ్లీస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే పేర్కొంది.