రైళ్లు కిటకిట | Trains kitakita | Sakshi
Sakshi News home page

రైళ్లు కిటకిట

Published Mon, Dec 16 2013 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM

రైళ్లు కిటకిట

రైళ్లు కిటకిట

=అటు అయ్యప్పస్వాముల సందడి
 =క్రిస్మస్ సెలవుల హడావుడి
 =చాంతాడులా వెయిటింగ్ లిస్ట్
 =ప్రయాణికుల ఇక్కట్లు

 
 రైళ్లకు అప్పుడే పండుగ కళ వచ్చేసింది. ఆదివారంరైళ్లన్నీ కిటకిటలాడాయి. హైదరాబాద్ వైపు వెళ్లే బళ్లన్నీ రద్దీగా ఉన్నాయి. యశ్వంత్‌పూర్, చెన్నయ్, తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లదీఅదే దారి. ఇటు క్రిస్మస్ సెలవులకు వెళ్లే వారు..అటు శబరిమల వెళ్లే స్వాముల హ డావిడి ఎక్కువగా కనిపిం చింది. ఇంకా సంక్రాంతి రాకుండానే నిరీక్షణ జాబితా చాంతాడులా పెరిగిపోవటంతో పలువురు ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు.
 
 విశాఖపట్నం, న్యూస్‌లైన్: రైలు ప్రయాణికులకు ఇది పరీక్ష సమయం. క్రిస్మస్ సెలవులు  ప్రారంభం అయిన సందర్భంగా తమ ఊళ్లకు తరలివెళ్లే వారు.. ఈ నెల 26 నుంచి అయ్యప్ప భక్తుల మండల యాత్రలు ముగుస్తుండడంతో శబరిమల చేరుకోవాలనుకునే స్వాములతో ఆదివారం రైళ్లన్నీ కిటకిటలాడాయి. విశాఖ నుంచి బయల్దేరే దాదాపు అన్ని రైళ్లకూ వెయిటింగ్ జాబితా ప్రయాణికులు ఉండిపోయారు. వందలాది మంది ప్రయాణికులు తమతమ ప్రయాణాలను రద్దు చేసుకున్నా మరింత మంది రైల్లో బెర్తులు లభ్యం కావని ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే రైళ్లతో బాటు యశ్వంత్‌పూర్, చెన్నయ్, తిరుపతి వెళ్లే రైళ్లకు భారీ డిమాండ్ ఉంది. ప్రయాణికులను నియంత్రించలేక రైల్వే పోలీసులు అవస్థలు పడ్డారు. గోదావరి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ల జనరల్ బోగీల్లోకి ప్రయాణికులను ఎక్కించేందుకు చెమటలు కక్కారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తీవ్రంగా శ్రమించి ఆ రైళ్లలో వేలాడే ప్రయాణికులను దించేసి ఇతర రైళ్లలో పంపించారు.  గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 150 మంది, విశాఖలో 80 మంది, గరీబ్థ్‌ల్రో 300 మంది నిరీక్షణ జాబితాతో  ఈ మూడు రైళ్లు కదిలాయి. దురంతో ఎక్స్‌ప్రెస్‌కు 100 మందికి పైగా ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. సంక్రాంతికి నెల రోజుల ముందుగానే రైళ్ల పరిస్థితి ఇలా వుంటే పండుగ సీజన్‌లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు.
 
గరీబ్థ్‌క్రు 100 దాటితే కష్టమే!

 గరీబ్థ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణానికి 200 వెయిటింగ్ జాబితా ఉన్నా గతంలో టికెట్ కన్‌ఫర్మ్ అయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 50 వెయిటింగ్ వచ్చినా రిజర్వ్ అయ్యే ఛాన్స్‌లు తక్కువగా ఉన్నాయి. అప్పట్లో రెండు బోగీలు అదనంగా ఉండేవి. అప్పట్లో ఈ రెండు బోగీలకు చెందిన బెర్తులు అధికారికంగా ఫీడయ్యేవి కావు.
 
దీంతో నిరీక్షణ జాబితాలో వున్న వారందరికీ రైలు బయల్దేరే వేళకు బెర్తులు ఖాయమయ్యేవి. కానీ గత వారంలో ఆ రెండు బోగీల బెర్తులను కంప్యూటర్‌లో ఫీడ్ చేశారు. దీంతో టికెట్ తీసుకున్నప్పుడే స్టేటస్ మేరకు నమోదవుతోంది. ఎక్కువ వెయిటింగ్ జాబితా టికెట్ కొనుక్కుంటే ఇకపై రైల్లో కష్టాలు పడాల్సిందే కానీ బెర్త్ ఖాయం మాత్రం కాదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement