
ఢాకా: బంగ్లాదేశ్‌లో రైల్వే సిబ్బంది సమ్మెతో ఈరోజు (మంగళవారం) రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే ఉద్యోగులు ఓవర్ టైం పనికి తగిన ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. రైల్వే సిబ్బంది సమ్మె ప్రభావం లక్షలాది మంది ప్రయాణికులపై పడింది.
పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, ఓవర్ టైం పనికి ప్రయోజనాలు కల్పించాలని కోరూతూ బంగ్లాదేశ్ రైల్వే రన్నింగ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సమ్మెకు దిగింది. ఈ సమ్మె దాదాపు 400 ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలను ప్రభావితం చేసింది. బంగ్లాదేశ్ రైల్వే రోజుకు దాదాపు 2,50,000 మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుస్తుంటుంది. బంగ్లాదేశ్‌లో గత కొన్ని నెలలుగా హింస కొనసాగుతోంది. ఇప్పుడు రైల్వే ఉద్యోగులు సమ్మెకు దిగడంతో యూనస్ ప్రభుత్వానికి ఇబ్బందులు మరింతగా పెరిగాయి.
ఇది కూడా చదవండి: అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment