Trains
-
రైళ్లలో ఫుడ్.. రైల్వే కీలక చర్యలు
దేశంలో అత్యధిక మంది ఉపయోగించే ప్రయాణ సాధనం రైలు. దేశవ్యాప్తంగా నిత్యం కొన్ని వేల రైళ్లు నడుస్తున్నాయి. లక్షల సంఖ్యలో ప్రయాణికులు వీటి ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రైళ్లలో అత్యంత ప్రధాన సమస్య ఆహారం. రైళ్లలో లభించే ఆహారం నాణ్యత లేకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటం వంటి వాటితో ప్రయాణికులు ఇబ్బందులు పడతుంటారు. ఈ సమస్యలు నివారించేందుకు రైల్వే శాఖ కీలక చర్యలకు ఉపక్రమించింది.పారదర్శకతను పెంపొందించడానికి, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ముఖ్యమైన చర్యలో భారతీయ రైల్వే అన్ని రైళ్లలో ఆహార ధరలతోపాటు మెనూలను ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేసింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన ఈ చొరవ ప్రయాణికులకు అందుబాటులో ఉన్న ఆహార ఎంపికలు, వాటి ధరల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించేలా చేస్తుంది.రైల్వే శాఖ ముఖ్యమైన చర్యలు ఇవే..ప్రింటెడ్ మెనూ కార్డులు: ప్రయాణికులు ఇప్పుడు ఆన్ బోర్డ్ వెయిటింగ్ స్టాఫ్ నుండి ప్రింటెడ్ మెనూ కార్డులను కోరవచ్చు. ఈ కార్డులు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను, వాటి ధరలను తెలియజేస్తాయి.డిజిటల్ యాక్సెస్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ మెనూలను తన అధికారిక వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు లేదా ప్రయాణ సమయంలో ఆహార ఎంపికలు, ధరలను సమీక్షించవచ్చు.ఎస్ఎంఎస్ అలర్ట్స్: పారదర్శకతను మరింత పెంచడానికి భారతీయ రైల్వే ఆహార మెనూ, టారిఫ్ వివరాలకు సంబంధించిన లింక్‌లను ప్రయాణికులకు ఎస్ఎంఎస్ అలర్ట్‌ల రూపంలో అందిస్తోంది.ప్యాంట్రీ కార్ డిస్ప్లేలు: రైళ్లలోని ప్యాంట్రీ కార్లలో రేట్ లిస్ట్ లు ప్రముఖంగా ప్రదర్శిస్తారు. ఇది ప్రయాణికులకు ధరలను సరిపోల్చుకోవడం సులభం చేస్తుంది.ఆధునిక బేస్ కిచెన్లు: ప్రామాణిక ఆహార తయారీ ప్రక్రియలను నిర్ధారించడానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన నిర్దేశిత బేస్ కిచెన్లలో భోజనాన్ని తయారు చేస్తారు.సీసీటీవీ మానిటరింగ్: ఆహార తయారీని రియల్ టైమ్ మానిటరింగ్ చేయడానికి, భద్రతా ప్రోటోకాల్స్ పాటించేలా చూడటానికి బేస్ కిచెన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.బ్రాండెడ్ పదార్థాలు: స్థిరమైన ఆహార నాణ్యతను నిర్వహించడానికి వంట నూనె, పిండి, బియ్యం, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పనీర్, పాల ఉత్పత్తులు వంటివాటికి సంబంధించి బ్రాండెడ్ ముడి పదార్థాలను ఉపయోగించడాన్ని రైల్వే తప్పనిసరి చేస్తుంది.ఫుడ్ సేఫ్టీ సూపర్ వైజర్లు: క్వాలిఫైడ్ ఫుడ్ సేఫ్టీ సూపర్ వైజర్లు బేస్ కిచెన్లలో ఫుడ్ సేఫ్టీ, పరిశుభ్రతా పద్ధతులను పర్యవేక్షిస్తారు.అదనపు చర్యలురవాణా సమయంలో ఆహార నాణ్యతలో ఉన్నత ప్రమాణాలను నిర్వహించడానికి, భారతీయ రైల్వే పలు వినూత్న చర్యలను ప్రవేశపెట్టింది.ఆహార ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్స్: ఆహార ప్యాకెట్లలో ఇప్పుడు క్యూఆర్ కోడ్లు ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడ తయారైంది.. ప్యాకేజింగ్ తేదీ వంటి వివరాలను ప్రదర్శిస్తాయి.రెగ్యులర్ ఆడిట్లు, తనిఖీలు: ప్యాంట్రీ కార్లు, బేస్ కిచెన్ ల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యతను మదింపు చేయడానికి రొటీన్ ఫుడ్ శాంప్లింగ్, థర్డ్ పార్టీ ఆడిట్ లు నిర్వహిస్తారు.ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్: అన్ని క్యాటరింగ్ యూనిట్లు నేషనల్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్‌కు కట్టుబడి ఉండేలా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నుంచి సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. -
చర్లపల్లి–కాకినాడ టౌన్, నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్ది దృష్ట్యా విజయవాడ మీదుగా చర్లపల్లి–కాకినాడ టౌన్, చర్లపల్లి–నర్సాపూర్ మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ గురువారం తెలిపారు. చర్లపల్లి–కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07031) ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో రాత్రి 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07032) మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరుతుంది. రెండు మార్గాల్లో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల్లో ఆగుతుంది. అలాగే, చర్లపల్లి–నర్సాపూర్ ప్రత్యేక రైలు (07233) ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో రాత్రి 8.15 గంటలకు చర్లపల్లిలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07234) మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో రాత్రి 8గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరుతుంది. రెండు మార్గాల్లో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్ల్లో ఆగుతుంది. విజయవాడ మీదుగా పలు రైళ్లు రద్దు కడియం–ద్వారపూడి–అనపర్తి సెక్షన్‌ల్లో జరుగుతోన్న నాన్ ఇంటర్‌లాక్ పనుల కారణంగా ఆయా మార్గాల్లో నడిచే పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. మార్చి 1, 2 తేదీల్లో గుంటూరు–విశాఖ (17239/17240), మార్చి 2న విశాఖ–గుంటూరు (22701/22702), విశాఖ–లింగంపల్లి (12805), 3న లింగంపల్లి–విశాఖ (12806) రైళ్లను రద్దు చేసింది. -
పలు కుంభమేళా రైళ్లు రద్దు.. టిక్కెట్ బుక్ చేసుకుంటే నగదు వాపస్
న్యూఢిల్లీ: యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వెళుతున్న భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా అక్కడక్కడా ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీనిని గమనించిన రైల్వేశాఖ ప్రయాగ్‌రాజ్ వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంది.తాజాగా దుర్గ్(ఛత్తీస్‌గఢ్) నుండి చాప్రా(బీహార్) వరకూ, అలాగే చాప్రా నుండి దుర్గ్ వరకు నడిచే సారనాథ్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ మూడు రోజుల పాటు రద్దు చేసింది. ఈ దుర్గ్-చాప్రా సారనాథ్ ఎక్స్‌ప్రెస్‌ను ఫిబ్రవరి 19 నుండి ఫిబ్రవరి 21 వరకు రద్దు చేశారు. ఈ రైలు ప్రయాగ్‌రాజ్ మీదుగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. దీంతో ప్రయాగ్‌రాజ్‌కు వెళదామనుకున్న ప్రయాణికులు నిరాశకు గురవుతున్నారు. కాగా ఈ రైలు ద్వారా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వారి డబ్బును రైల్వేశాఖ వారి ఖాతాకు బదిలీ చేయనున్నట్లు సమాచారం. ప్రయాగ్‌రాజ్‌లో భారీ రద్దీని తగ్గించడానికి రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నదని సంబంధిత అధికారులు తెలిపారు.ఇదేవిధంగా రైలు నంబర్ 55098/55097 గోరఖ్‌పూర్-నర్కటియగంజ్ ప్యాసింజర్ రైలును ఫిబ్రవరి 23 వరకు రద్దుచేశారు. అలాగే రైలు నంబర్ 15080 గోరఖ్‌పూర్-పాటిలీపుత్ర ఎక్స్‌ప్రెస్ కూడా ఫిబ్రవరి 22 వరకు రద్దు చేశారు. మహాశివరాత్రికి ప్రయాగ్‌రాజ్ వెళ్లాలనుకున్న భక్తులకు ఈ వార్త షాక్‌లా తగిలింది. మరోవైపు జయనగర్ నుండి ప్రయాగ్‌రాజ్ మీదుగా న్యూఢిల్లీకి వెళ్లే స్వతంత్ర సేనాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు రూట్‌ను మార్చారు. ఈ రైలు ఫిబ్రవరి 28 వరకు ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళ్ళదు. బీహార్, ఛత్తీస్‌గఢ్‌ల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళుతున్నారు. దీంతో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది.ఇది కూడా చదవండి: రిస్క్‌లో కుంభమేళా మోనాలిసా? -
లక్షలాది జనం.. రవాణా ఘోరం
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక యాత్ర విషాదభరితంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళాకు తరలి వెళ్తున్నారు. కానీ డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేవు. ఇటు తెలంగాణ ఆర్టీసీ కానీ, అటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయలేదు. భక్తులు మధ్యతరగతి, సామాన్యప్రజలకు ఏ మాత్రం అందనంతగా విమానచార్జీలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి రావాలని కోరుకుంటున్న జనం తోచిన మార్గంలో వెళ్తున్నారు. సామర్థ్యం లేని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. నాచారం (హైదరాబాద్) నుంచి యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాకు మినీబస్సులో వెళ్లిన ఏడుగురు భక్తులు తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొని మరణించిన ఉదంతం ఆందోళన రేపుతోంది. ప్రయాణికుల రద్దీ కారణంగా ఒకవైపు రహదారులు వందలకొద్దీ కిలోమీటర్లతో కిక్కిరిసిపోతుండగా, మరోవైపు మినీబస్సులు, మ్యాక్సీక్యాబ్‌లు వంటి చిన్న వాహనాల్లో ఎక్కువమంది ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అరకొర రైళ్లు...: ప్రయాణికుల రద్దీ మేరకు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కానీ అరకొర రైళ్లు అందుబాటులో ఉన్నాయి. పైగా సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్, గోరఖ్‌పూర్, లక్నో, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో జనవరి నాటికే బుకింగ్ నిలిచిపోయింది. వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్టు 200 దాటింది. మరిన్ని అదనపు రైళ్లు నడిపితే తప్ప తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు ప్రయాణం చేయడం సాధ్యం కాదు. సాధారణంగా సంక్రాంతి, దసరా వంటి పండుగలు, మేడారం వంటి జాతరలకు ఆర్టీసీ వేలకొద్దీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. కానీ ఈ కుంభమేళాకు లక్షలాది మంది తరలి వెళ్తున్నట్లు తెలిసి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయకపోవడం శోచనీయం.ప్రైవేట్ ట్రావెల్స్ నిలువుదోపిడీప్రతిసారీ పండుగ ప్రయాణాన్ని సొమ్ము చేసుకొనే ప్రైవేట్ ట్రావెల్స్, టూరిస్ట్ సంస్థలు మహాకుంభమేళా భక్తులను కూడా వదలకుండా నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఫిట్నెస్ ఉన్నా లేకున్నా పెద్దఎత్తున వాహనాలను నడుపుతున్నాయి. 30 నుంచి 40 మంది ప్రయాణం చేసే ప్రైవేట్ బస్సులతోపాటు, 14 నుంచి 20 మంది వరకు ప్రయాణం చేసే సామర్థ్యం ఉన్న మినీ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, ఇతరత్రా వాహనాలను ఎడాపెడా రోడ్డెక్కిస్తున్నాయి. ప్యాకేజీల పేరుతో ఒక్కో ప్రయాణికుడి వద్ద రూ. 25,000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణంగా సుదీర్ఘమైన ప్రయాణం చేసే వాహనాల్లో ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి 8 గంటలకు ఒకసారి విధులు మార్చుకోవాలి. కానీ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న వాహనాలు చాలావరకు ఒక డ్రైవర్‌తోనే బయలుదేరుతున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు సుమారు 1,136 కి.మీ. దూరం నిరాటంకంగా వాహనాలను నడపడం వల్ల డ్రైవర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. -
Mahakumbh-2025: నాలుగు నిముషాలకు ఒక రైలు.. మౌని అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతోంది. ఈరోజు (జనవరి 29) మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాలో రెండవ అమృత స్నానం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భక్తులు ముందుగానే సంగమస్థలికి చేరుకుంటున్నారు. మహా కుంభమేళా పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు భారతీయ రైల్వే విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్ స్టేషన్ నుండి 190 ప్రత్యేక రైళ్లు, 110 సాధారణ రైళ్లు, 60 మెమూ రైళ్లు సహా 360 రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ మీడియాకు తెలిపారు.కుంభమేళాకు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల ప్రయాణ అవసరాలను తీర్చడంపై భారత రైల్వేశాఖ దృష్టిసారించిందన్నారు. మౌని అమావాస్య నాడు పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చే భక్తుల రద్దీని తట్టుకునేందుకు ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రైలును నడుపుతున్నామని తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. ప్రతి స్టేషన్లో తాగునీరు, ఫుడ్ కోర్టులు, టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు.అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రథమ చికిత్స బూత్‌లు, వైద్య పరిశీలన గదులను ఏర్పాటు చేశామని, ప్రయాగ్‌రాజ్ జంక్షన్, ప్రయాగ్‌రాజ్ ఛోకిలలో యాత్రి సువిధ కేంద్రాల్లో వీల్చైర్లు, లగేజ్ ట్రాలీలు మందులు మొదలైనవి అందిస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు -
Bangladesh: సమ్మెకు దిగిన రైల్వే సిబ్బంది.. కదలని రైళ్లు
ఢాకా: బంగ్లాదేశ్‌లో రైల్వే సిబ్బంది సమ్మెతో ఈరోజు (మంగళవారం) రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే ఉద్యోగులు ఓవర్ టైం పనికి తగిన ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. రైల్వే సిబ్బంది సమ్మె ప్రభావం లక్షలాది మంది ప్రయాణికులపై పడింది.పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, ఓవర్ టైం పనికి ప్రయోజనాలు కల్పించాలని కోరూతూ బంగ్లాదేశ్ రైల్వే రన్నింగ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సమ్మెకు దిగింది. ఈ సమ్మె దాదాపు 400 ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలను ప్రభావితం చేసింది. బంగ్లాదేశ్ రైల్వే రోజుకు దాదాపు 2,50,000 మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుస్తుంటుంది. బంగ్లాదేశ్‌లో గత కొన్ని నెలలుగా హింస కొనసాగుతోంది. ఇప్పుడు రైల్వే ఉద్యోగులు సమ్మెకు దిగడంతో యూనస్ ప్రభుత్వానికి ఇబ్బందులు మరింతగా పెరిగాయి.ఇది కూడా చదవండి: అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం -
ఈసారైనా నమో భారత్ రైలొచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్.. సమీప నగరాలను, పట్టణాలను చుట్టేసే ఇంటర్ సిటీ రైలు. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల కోసం హైదరాబాద్ ఎదురుచూస్తోంది. గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లను, హైదరాబాద్ కేంద్రంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలోనూ అందుబాటులోకి తేవాలన్న ప్రతిపాదన రెండేళ్ల నుంచే ఉంది. వందేభారత్ తరహాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైళ్లు, గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటిని మొదట వందే మెట్రో రైళ్లుగా పిలిచారు. అనంతరం నమో భారత్ ర్యాపిడ్ రైళ్లుగా పేరు మార్చారు. అహ్మదాబాద్–భుజ్ స్టేషన్ల మధ్య మొట్టమొదటి నమో భారత్ రైలు పట్టాలెక్కింది. గత సంవత్సరమే ఇవి మనకు అందుబాటులోకి వస్తాయని భావించినా వీలు కాలేదు. వచ్చే బడ్జెట్లో అయినా మనకు వీటిని కేటాయిస్తారని ప్రజలు ఆశపడుతున్నారు.సామాన్యుల రైళ్లు..నమో భారత్ ర్యాపిడ్ రైళ్లను కనిష్టంగా 100 నుంచి గరిష్టంగా 250 కిలోమీటర్ల దూరం వరకు నడపాలని ప్రతిపాదించారు. హైదరాబాద్ నుంచి వరంగల్, భద్రాచలం, కర్నూల్, మహబూబ్‌నగర్, గజ్వేల్, వికారాబాద్, తాండూర్‌తోపాటు ప్రస్తుతంఇంటర్ సిటీ రైళ్లు నడుస్తున్న సికింద్రాబాద్–విజయవాడ మధ్య కూడా ఈ రైళ్లను నడపాలనే ప్రతిపాదన ఉంది. గతంలో జరిగిన పార్లమెంట్ సభ్యుల సమావేశంలోనూ ఇంటర్ సిటీ రైళ్లుగా వీటిని ప్రవేశపెట్టాలని పలువురు ఎంపీలు కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లా కేంద్రాలకు, ముఖ్య పట్టణాలకు వీటిని నడపడం వల్ల ప్రజలు తక్కువ చార్జీలతో రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. కాజీపేట – సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ఇంటర్ సిటీ లేదా మెము ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని 12 సంవత్సరాల క్రితం ప్రతిపాదించినా ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం నమో భారత్‌ను ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌గా నడపాలనే డిమాండ్ ఉంది. సామాన్య, మధ్య తరగతివారికి ఉపయోగపడే తక్కువ దూరం నడిచే పుష్పుల్ మెము, ఇంటర్ సిటీ, నమో భారత్ ర్యాపిడ్, వందే సాధారణ్ (అమృత్ భారత్) ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సికింద్రాబాద్–మనోహరాబాద్–కొత్తపల్లి రూట్లో రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి కొమురవెల్లికి వెళ్లే భక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.స్టాండింగ్ జర్నీకి అవకాశం..ప్రస్తుతం ఎంఎంటీఎస్ వంటి లోకల్ రైళ్లు నడుస్తున్నట్లుగానే వందే మెట్రోలు రాకపోకలు సాగిస్తాయి. ఒక బోగీలో 100 మంది కూర్చొనే సదుపాయం ఉంటుంది. వీటిలో కనీసం 200 మంది నిలబడి ప్రయాణం చేయవచ్చు. ఆటోమెటిక్ డోర్ లాకింగ్ వ్యవస్థ ఉంటుంది. ప్రమాదాలను నివారించే కవచ్ సాంకేతికతతో వీటిని అనుసంధానం చేశారు. ప్రతి బోగీలో సీసీటీవీ నిఘా ఉంటుంది. ప్రయాణికులకు పూర్తి భద్రత లభిస్తుంది. -
‘ఆపుకోలేని’ ఆవేదన!
రైలింజన్లలో వాష్‌రూంలు లేక మహిళా లోకోపైలట్ల యాతనఒక్కసారి ఊహించుకోండి.. మీరు బిజీ సెంటర్లో ఉన్నారు. చాలా అర్జెంటు.. ఎక్కడా వెళ్లే పరిస్థితి లేదు. మీకెలా అనిపిస్తుంది? నరకయాతన కదూ.. ఒక్క రోజుకే మన పరిస్థితి ఇలా ఉంటే.. దేశంలో రైళ్లను నడిపే మహిళా లోకోపైలట్లు రోజూ ఈ నరకయాతనను అనుభవిస్తున్నారు. అదీ ఎన్నో ఏళ్లుగా.. దేశవ్యాప్తంగా..లోకోపైలట్లు 86,000దక్షిణమధ్య రైల్వేలో 12,000మహిళలు 3,000 మహిళలు 500భారతీయ రైల్వే.. గతంతో పోలిస్తే ఎంతో మారింది. మన రైళ్లలోనూ ఎన్నో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ అదే రైళ్లను నడిపే లోకోపైలట్లకు కనీస సదుపాయమైన వాష్‌రూం మాత్రం నేటికీ అందు బాటులోకి రాలేదు. వీటిని ఏర్పాటు చేయాలని 2016లోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినా.. నేటికీ అది సాకారం కాలేదు. దీంతో చేసేది లేక.. కొందరు మహిళా లోకోపైలట్లు అడల్ట్ డైపర్లు వాడుతున్నారు.. మరికొందరు డ్యూటీకెళ్లేటప్పుడు నీళ్లు తాగడం మానేస్తున్నారు. ఫలితంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు.మా సమస్యను పట్టించుకునేవారేరి?వాష్‌రూం లేకపోవడం వల్ల స్త్రీ, పురుష లోకోపైలట్లు ఇద్దరికీ ఇబ్బంది అయినా.. తమ సమస్యలు వేరని తమిళనాడుకు చెందిన సీనియర్ మహిళా లోకోపైలట్ ఒకరు చెప్పారు. ‘మెయిన్ జంక్షన్లలో తప్పితే.. చాలా స్టేషన్లలో 1–5 నిమిషాలు మాత్రమే రైలును ఆపుతారు. ఆ టైంలోనే వెనుక ఉన్న బోగీకి లేదా స్టేషన్‌లోని వాష్‌రూంకు వెళ్లి.. పని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమయానికి తిరిగి రాకపోతే.. ట్రైన్ నిర్ణిత సమయం కన్నా ఎక్కువ సేపు ఆగితే.. వివరణ ఇచ్చుకోవాలి.దాని కన్నా.. వెళ్లకపోవడమే బెటరని చాలామంది భావిస్తారు’అని ఆమె చెప్పారు. ఇలాంటి పరిస్థితుల వల్ల తాను కూడా మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్ బారిన పడ్డానని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. తమ సమస్యలను పట్టించుకునేవారేరి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా.. ఒకసారి ఇంజన్ క్యాబిన్లోకి ప్రవేశిస్తే విధులు ముగిసేవరకు బయటకు వెళ్లడం సాధ్యం కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లవలసి వస్తే వాకీటాకీల్లో పై అధికారులకు సమాచారం అందజేయాలి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మహిళా లోకోపైలట్లు చెబుతున్నారు.పైగా కొన్ని చోట్ల స్టేషన్లు చాలా ఖాళీగా ఉంటాయి. అలాంటి స్టేషన్లలో వాష్‌రూంను వినియోగించడమంటే తమ భద్రతను పణంగా పెట్టడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎనిమిది గంటల డ్యూటీ అంటారు. కానీ ఒక్కసారి బండెక్కితే పదకొండు గంటలు దాటిపోతుంది.అప్పటి వరకు ఆపుకోవాల్సిందే’అని దక్షిణ మధ్య రైల్వేలో విధులు నిర్వహిస్తున్న ఒక సహాయ మహిళా లోకోపైలట్ ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రాన్ని ఆపుకోవడం లేదా నీళ్లు తక్కువగా తాగడం వల్ల మహిళల్లో మూత్రనాళం, కంటి సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తాయని, ఇది ప్రమాదకరమని ప్రముఖ గైనకాలజిస్ట్ శాంతి రవీంద్రనాథ్ హెచ్చరించారు.రైలు నడుపుదామనుకున్నా.. కానీ.. ⇒ ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది లోకో పైలట్ అవ్వాలని వచి్చ.. డెస్క్ జాబ్‌లో సర్దుకుంటున్నారు. .. నా నైపుణ్యాన్ని నిరూపించుకోవాలని ఉండేది. లోకో పైలట్ క్వాలిఫై అయి ఐదేళ్లయింది. వాష్‌రూం లేని చోట పనిచేయడం ఇబ్బందని.. డెస్క్ జాబ్ చేస్తున్నాను’అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ మహిళ చెప్పారు. తాను లోకోపైలట్ అయినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యానని.. అయితే మహిళలు శానిటరీ న్యాప్కిన్లు ధరించి డ్యూటీకి రావాల్సిన దుస్థితిని కల్పిస్తున్న ఇలాంటి పని వాతావరణంలోకి రావడానికి ఎందరు ఇష్టపడతారని ఓ లోకోపైలట్ ప్రశ్నించారు.నెలసరి సమయంలో మరిన్ని ఇబ్బందులు పడలేక.. సెలవు పెట్టడమే బెటరని భావిస్తున్నట్లు చెప్పారు. రన్నింగ్ డ్యూటీలు చేయలేని వాళ్లకు స్టేషన్డ్యూటీలు అప్పగించే వెసులుబాటు ఉంది. కానీ అధికారులు అంతగా ఇవ్వడం లేదు. ప్రెగ్నెన్సీతో విధులకు హాజరయ్యే మహిళలకు మాత్రమే ఈ వెసులుబాటు ఇస్తున్నారు. ‘గతంలో చాలాసార్లు స్టేషన్ డ్యూటీ ఇవ్వాలని అధికారులను వేడుకున్నా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కావడం వల్ల స్టేషన్ డ్యూటీ ఇచ్చారు’అని సికింద్రాబాద్‌కు చెందిన రేవతి చెప్పారు. చేస్తామని చెప్పి.. చేయలేదురైలింజన్లలో వాష్‌రూంలు లేకపోవడంపై ద ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్ మెన్స్ ఆర్గనైజేషన్ మాజీ అధ్యక్షుడు అలోక్ వర్మ అప్పట్లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో ప్రతి ఇంజన్ క్యాబిన్లో ఏసీ సదుపాయంతో పాటు వాష్‌రూమ్‌ను ఏర్పాటు చేయాలని హక్కుల కమిషన్ 2016లో ఆదేశించింది. దీనికి సమాధానంగా అన్ని రైళ్లలో వాష్‌రూంను ఏర్పాటు చేస్తామని రైల్వే చెప్పింది. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదు. దేశంలో కొన్ని డివిజన్లలోని ఇంజన్లలో వీటి ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినప్పటికీ.. క్లీనింగ్ తదితర నిర్వహణ సమస్యలతోపాటు ఇంజిన్లోకి లోకోపైలట్ మినహా ఎవరినీ అనుమతించ రాదనే నిబంధనలు వంటి కారణాలతో దాన్ని అమలు చేయలేదని అధికారులు చెబుతున్నారు.ఇది లోకోపైలట్ల కనీస హక్కులను హరించడమేనని అలోక్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం వస్తున్న వందేభారత్‌లలో ఈ సమస్య పెద్దగా లేదని చెప్పారు. మిగతావాటి పరి స్థితి ఏమిటని ప్రశ్నించారు. అమెరికా, యూరప్, బ్రిటన్లలో లోకోపైలట్లకు ప్రతి 4 గంటలకు 20–25 నిమిషాల బ్రేక్ ఉంటుందని చెప్పారు. – సాక్షి, హైదరాబాద్/సాక్షి, సెంట్రల్డెస్క్కమిటీ వేసినా.. ముందడుగు పడలేదు..రైలింజన్లలో వాష్‌రూంలు, సరైన విశ్రాంతి గదులు వంటి సదుపాయాలు కల్పించాలని ఇప్పటికి అనేక సార్లు రైల్వేబోర్డుకు విన్నవించాం. 3 నెలల క్రితమే రైల్వే బోర్డు ఒక కమిటీని వేసింది. అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అధ్యయనం చేయలేదు. – మర్రి రాఘవయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్) -
సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లు
-
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. 'జన సాధారణ్ అన్ రిజర్వ్డ్’ స్పెషల్ ట్రైన్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి ఊరెళ్లే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య జనసాధారణ్ అన్ రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.1) రైలు నంబర్ (08534) చర్లపల్లి-విశాఖపట్నం (జనసాధారణ్ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) జనవరి 11, 13, 16, 18 తేదీలలో చర్లపల్లి నుంచి ఉదయం 00.30 గంటలకు (రాత్రి 12.30 గంటలకు) బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు (అదే రోజున ) విశాఖపట్నం చేరుకుంటుంది. 2) రైలు(08533) విశాఖపట్నం-చర్లపల్లి (జనసాధారణ్ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) విశాఖపట్నం నుంచి జనవరి 10, 12, 15, 17 తేదీలలో ఉదయం 09.45 గంటలకు బయలుదేరి (అదే రోజు) రాత్రి 22.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ప్రత్యేక రైళ్లు నంబర్ (08533/08534) విశాఖపట్నం-చర్లపల్లి - విశాఖపట్నం జనసాధారణ (అన్ రిజర్వ్డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ లలో ఇరువైపులా ఆగుతాయి.3) రైలు నంబర్: (08538) చర్లపల్లి-విశాఖపట్నం (జన సాధారణ్ అన్రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు) జనవరి 11, 12, 16, 17వ తేదీల్లో చర్లపల్లిలో ఉదయం 10.00 గంటలకు బయలుదేరి 22.00 గంటలకు (అదే రోజు రాత్రి) విశాఖపట్నం చేరుకుంటుంది. ఇదీ చదవండి: పండుగ బస్సు..‘ప్రత్యేక’ చార్జీ4) రైలు నంబర్ (08537) విశాఖపట్నం - చర్లపల్లి (జనసాధారణ అన్ రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లు) 2025 జనవరి 10, 11, 15 & 16 తేదీలలో విశాఖపట్నం నుండి (సాయంత్రం 6.20) 18.20 గంటలకు బయలు దేరుతుంది మరియు 08.00 గంటలకు (మరుసటి రోజు ఉదయం) చర్లపల్లి చేరుకుంటుంది. రైలు(08537/08538) విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం జనసాధరణ (అన్ రిజర్వ్డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. జనసాధరన్ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులను సులభతరం చేయడానికి అన్రిజర్వ్డ్ కోచ్‌లను అందుబాటులోకి తెచ్చింది.సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లుదక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ సాక్షి మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి రద్దీ దృష్ట్యా 188 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నామన్నారు. ప్రయాణీకులకు అందుబాటులో ఉండే విధంగా 16 జన సాధారణ రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఛార్జీలే ఈ జన సాధారణ రైళ్లలో వసూలు చేస్తామన్నారు. ఛార్జీల పెంపు భారీగా ఉండదు. ప్లాట్ ఫారమ్ చార్జీలు కూడా పెంచటం లేదు.చర్లపల్లి నుంచి కొన్ని రైళ్లు ఈ సంక్రాంతికి నడపనున్నాం. సిటీ నుంచి చర్లపల్లికి వెళ్లాలంటే సికింద్రాబాద్ స్టేషన్ బయట నుంచి కొన్ని బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. చర్లపల్లి కాకుండా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రైళ్లు నడుస్తాయి’’ అని శ్రీధర్ వెల్లడించారు. -
పేదోడి రైళ్లకు సెలవు!
రాజంపేట: తిరుపతి– గుంతకల్ మధ్య ఉన్న రెండు వేర్వేరు మార్గాల్లో పేదోడి రైళ్లకు బ్రేక్ వేశారు. ఏకంగా రెండునెలలపాటు పల్లె రైళ్లకు రాబోయే కుంభమేళా–2025 (Maha Kumbh Mela 2025) నేపథ్యంలో సెలవు ఇచ్చేశారు. పేదవాడి కోసం ఉన్నదే ఒకరైలు, దానిని కూడా రద్దు చేశారు. దీంతో పేద ప్రయాణిక వర్గాల్లో రైల్వేబోర్డు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. దేశంలో ఎక్కడా రైళ్లు లేన్నట్లుగా రాయలసీమలో (Rayalaseema) ప్రతి గ్రామీణ రైల్వేస్టేషన్లో ఆగుతూ, పరుగులుతీసే పల్లెరైళ్లను కుంభమేళా–2025కు దారిమళ్లించడం ఇప్పుడు సీమలో వివాదాస్పదంగా మారుతోంది. దీంతో తిరుపతి–గుంతకల్ మధ్య వేర్వేరు రెండు రైలుమార్గాల్లో నడిచే పల్లె రైలును రద్దు చేస్తూ దక్షిణమధ్య రైల్వే డిప్యూటీ సీవోఎం కె.మనికుమార్ పేరిట ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. అడిగే నాథుడు లేన్నట్లుగా రైల్వే ఉన్నతాధికారులు గుంతకల్ డివిజన్ (Guntakal Division) పరిధిలో తీసుకుంటున్న నిర్ణయాలు పరోక్షంగా కేంద్రప్రభుత్వంపై పేదవర్గాల్లో అసంతృప్తిని పెంపొందిస్తోంది. తిరుపతి– గుంతకల్(కడపమీదుగా) మార్గంలో.. తిరుపతి– గుంతకల్(కడపమీదుగా) మార్గంలో తిరుపతి–హుబ్లీ మధ్య నడిచే (07657/07658) ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. తక్కువ ధరతో గమ్య చేరడానికి పేదవర్గాలకు ఈరైలు అనుకూలంగా ఉంది. తిరుపతి (Tirupati) నుంచి బయలుదేరుతుంది. ప్రతి గ్రామీణస్టేషన్లో ఆగుతుంది. దీనిని రద్దు చేయడంతో ఉద్యోగులు, అధికారులు, విద్యార్థులు, వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గుంతకల్–తిరుపతి(ధర్మవరంలైన్)మార్గంలో.. గుంతకల్– తిరుపతి (ధర్మవరంలైన్) మార్గంలో 07589/07590 నంబరుగల తిరుపతి నుంచి కదిరి దేవరపల్లెకు నడిచే పల్లెరైలును కూడా రద్దు చేశారు. ఈ రైలు అనంతపురం, బెంగళూరుతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉండేది. డివిజన్ కేంద్రం గుంతకల్‌కు పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి ప్యాసింజర్ రైలు నడిచేది. ఈ రైలు కూడా ఆ మార్గంలో ఉన్న పీలేరు, మదనపల్లె, కదిరి తదితర ప్రాంతాలకు చెందిన పల్లె వాసులకు అనుకూలంగా ఉండేది. ఇప్పుడు ఆ రైలు రద్దు కావడంతో ఎక్స్ప్రెస్రైళ్లే దిక్కయ్యాయి రెండునెలలపాటు ప్రయాణానికి గ్రహణం కుంభమేళా–2025 కోసం రెండునెలల పాటు తిరుపతి నుంచి కడప మీదుగా, అటు ధర్మవరం మార్గంలో నడిచే ఆరు రైళ్లను రద్దు చేశారు. అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం జిల్లాల మీదుగా ఉండే రైలుమార్గంలో నడిచే ప్యాసింజర్ రైళ్లపై ఆధారపడి ప్రయాణించే వేలాదిమంది పేదలకు పల్లెరైళ్లను దూరం చేశారు. ప్రత్యామ్నాయం చూపని రైల్వేబోర్డు ఏకంగా రెండు రైలుమార్గాల్లో ఆరు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసే గ్రామీణులు ఇబ్బందులను రైల్వేబోర్డు పరిగణనలోకి తీసుకోలేదన్న అపవాదును మూటకట్టుకుంది. రైల్వేబోర్డు కుంభమేళాకు రేక్స్ కేటాయించాలని కోరితే, దక్షిణమధ్య రైల్వే అధికారులు రాయలసీమలో పేదలకు అందుబాటులో ఉండే రైళ్లను కేటాయించడంపై విమర్శలు వెలువడుతున్నాయి. ఇతర రైల్వేజోన్‌తోపాటు మరికొన్ని డివిజన్లలో రేక్ పొజిషన్ పుష్కలంగా ఉన్నప్పటికి ‘సీమ’పల్లెరైళ్లను కేటాయించారు. ఈ ప్రాంతానికి చెందిన కూటమి ఎంపీలు నోరుమెదిపే పరిస్థితిలో లేరని పేదప్రయాణికులు ఎద్దేవా చేస్తున్నారు. మార్చి 1వరకు పల్లె రైళ్లకు సెలవురైల్వేబోర్డు ఆదేశాలతో దక్షిణమధ్య రైల్వే వారు తిరుపతి–కదిరిదేవరపల్లె ప్యాసింజర్ రైలు, గుంతకల్–తిరుపతి ప్యాసింజర్‌రైలు, తిరుపతి–హుబ్లీ మధ్య నడిచే ఇంటర్సిటి ఎక్స్‌ప్రెస్ రైలును వచ్చేయేడాది మార్చి01 వరకు రద్దు చేశారు. ఆదివారం నుంచి ఈరైళ్లు రెండు మార్గాల్లో కూడా నడవవు. సామాన్యుడు అంటే చిన్నచూపు పేదోడి రైళ్లను రద్దు చేస్తే అడిగేవారు లేరన్న ధీమాలో కేంద్రప్రభుత్వం ఉంది. ఎక్స్‌ప్రెస్‌రైళ్లలో జనరల్బోగీలు వేయడంలో రైల్వే వివక్షను ప్రదర్శిస్తోంది. ప్యాసింజర్‌రైళ్లు రద్దు చేస్తే ప్రత్యామ్నాయంగా రైళ్లను నడపాలి. సామాన్యుడు అంటేనే కేంద్రానికి చిన్నచూపు. – టీఎల్ వెంకటేశ్, సీపీఐ నేత, పీలేరుపేదలను ఇబ్బందులు పెట్టారు... తక్కువ ధరతో పల్లెవాసులకు అనుకూలంగా ఉన్న ఇంటర్సిటీ రైలును రద్దు చేయడం అన్యాయం. తిరుపతి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ వరకు పేదవర్గాలు తక్కువ వ్యయంతో వెళ్లే వారు. ఉన్న ప్యాసింజర్ రైళ్ల రద్దు చేశారు. ప్రత్యామ్నాయంగా ప్యాసింజర్‌రైలును నడపాలన్న ఆలోచన కేంద్రానికి లేదు. పేదలంటే మోదీ సర్కారుకు చిన్నచూపు. – పులివేల రమణయ్య, నాగిరెడ్డిపల్లె, నందలూరు -
ఉప్పల్ రైల్వే స్టేషన్లో నిలిచిన రైళ్లు.. కారణం ఇదే
సాక్షి, హన్మకొండ జిల్లా: కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఆదివారం పలు రైలు సుమారు అరగంట పాటు నిలిచిపోయాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్య రావడంతో హైదరాబాద్-నాగ్‌పుర్ వందే భారత్, ఢిల్లీ-సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు నిలిపివేశారు.అనంతరం వీటిని రైల్వే అధికారులు స్టేషన్ నుంచి పంపించారు.సింగరేణి ప్యాసింజర్ రైలు ఉప్పల్ స్టేషన్లో 20 నిమిషాలు ఆగిపోయింది. అలాగే, మెయిన్ లైన్లో గూడ్స్ రైలు కూడా నిలిచిపోయింది. సిగ్నల్ సమస్య కారణంగా ఉప్పల్ ఆర్బోబీ సమీపంలో రైల్వే గేటు తెరుచుకోకపోవడంతో ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం రైళ్లను పంపించిన అధికారులు, సిగ్నలింగ్ వ్యవస్థను సరి చేశారు.ఇదీ చదవండి: ఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు? -
పెరిగిన ఏసీ రైళ్ల ట్రిప్పులు.. ప్రయాణికులకు తిప్పలు!
దాదర్: పశ్చిమ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్ల 13 ట్రిప్పులు పెంచడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ లోకల్ రైళ్ల కారణంగా నాన్ ఏసీ రైళ్ల ట్రిప్పులు తగ్గిపోయాయి. రైల్వే అధికారులు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంబైకర్ల ప్రయాణం ఠండా, ఠండా, కూల్ కూల్‌గా సాగాలనే ఉద్దేశంతో తొలుత సెంట్రల్ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్లను ప్రవేశపెట్టారు. మొన్నటి వరకు ఫాస్ట్ మార్గంలో పరుగులు తీసిన ఏసీ లోకల్ రైళ్లు ఇప్పుడు స్లో మార్గంలో కూడా సేవలందిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సెంట్రల్ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్లకు ప్రయాణికుల నుంచి వస్తున్న విశేష స్పందనను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ మార్గంలో కూడా ప్రవేశ పెట్టారు. ప్రారంభంలో చార్జీలు చాలా ఎక్కువ ఉండటం వల్ల గిట్టుబాటు కాకపోయేది. దీంతో ప్రయాణికులు ఏసీ లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు కొంత వెనకడుగు వేశారు. దీనిపై దృష్టిసారించిన రైల్వే అధికారులు ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను వెలికి తీశారు. ఏసీ చార్జీలు ఫస్ట్ క్లాస్ కంటే చాలా ఎక్కువ ఉండటమేనని గుర్తించారు. దీంతో అనేక మంది ఏసీ లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు ముఖం చాటేస్తున్నట్లు తేలింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు చార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కొద్ది నెలల కిందట చార్జీలు తగ్గించడంతో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా ఉదయం, సాయంత్రం పీక్ హవర్స్‌లో రద్దీ కారణంగా డోరు మూసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా ఏసీ లోకల్ రైళ్లు డోరు మూసుకోనిదే ముందుకు కదలవు. గత్యంతరం లేక ప్లాట్‌ఫామ్‌పై విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రయాణికులను బలవంతంగా లోపలికి నెడుతున్నారు. ఇది రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో జరుగుతున్నదే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రైల్వే అధికారులు ఏసీ రైళ్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. ఉదయం, సాయంత్రం రద్దీ కొంతమేర తగ్గుతుందని భావించారు. ఆ ప్రకా>రం గత బుధవారం నుంచి 13 ఏసీ లోకల్ రైళ్లను పెంచారు. దీంతో ప్రస్తుతం వాటి సంఖ్య 96 నుంచి 109కి చేరింది. ఏసీ రైళ్ల సంఖ్య పెరగడంతో రద్దీ కొంతమేర తగ్గింది. కానీ ఏసీ రైళ్ల కారణంగా నాన్ ఏసీ లోకల్ రైళ్ల సంఖ్య తగ్గిపోయింది. గతంలో కూడా ఇలాగే ఏసీ లోకల్ రైళ్ల ట్రిప్పులు పెంచడతో నాన్ ఏసీ రైళ్ల తగ్గిపోయింది. ఫలితంగా సాధారణ లోకల్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. పెంచిన ఏసీ లోకల్ రైళ్లను ఫాస్ట్ మార్గంలో నడుపుతున్నారు. 13 ట్రిప్పుల్లో ఆరు ట్రిప్పులు విరార్–చర్చిగేట్ స్టేషన్ల మధ్య, భాయిందర్–చర్చిగేట్ మధ్య మూడు ట్రిప్పుల చొప్పున, ఒక ట్రిప్పు చర్చిగేట్–విరార్ (డౌన్) మధ్య ఇలా మొత్తం 13 ట్రిప్పులు పెరిగాయి. -
పొగబారిన ఉత్తరాది.. 50 రైళ్లు, పలు విమానాలపై ప్రభావం
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశమంతా గత రెండు రోజులుగా తెల్లటి పొగమంచు కింద తలదాచుకుంటోంది. ఈరోజు (శుక్రవారం) మూడో రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పెరిగిన చలికి తోడు పొగమంచు కారణంగా పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. పొగమంచు దట్టంగా అలముకోవడంతో రవాణా సమస్య తీవ్రమయ్యింది. ఉత్తర భారతదేశంలోని పలు నగరాల్లో పొగమంచు కారణంగా ఉదయం 9 గంటలకు వరకూ కూడా విజిబులిటీ సరిగ్గా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రైళ్లు, విమానాలపై కూడా పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ రోజు కూడా అమృత్సర్, చండీగఢ్, ఢిల్లీల నుండి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రన్‌వేపై చాలా తక్కువ విజిబులిటీ కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. పొగమంచు కారణంగా లక్నో, చండీగఢ్‌లకు వచ్చే విమానాలను జైపూర్‌కు మళ్లించారు.ఇక రైళ్ల విషయానికొస్తే ఢిల్లీలోని వివిధ స్టేషన్లలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి వచ్చే 30కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లోని 50కి పైగా రైళ్లపై పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. న్యూఢిల్లీకి వచ్చే 30కి పైగా రైళ్లు, ఆనంద్ విహార్‌కు వచ్చే 10 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎన్సీఆర్లోని 50కి పైగా రైళ్లపై పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. ఈ రైళ్లన్నీ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది కూడా చదవండి: Delhi Pollution: గ్యాస్ ఛాంబర్ కన్నా ఘోరం.. బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! -
కాజీపేటలోనే ఎంఎంటీఎస్ కోచ్‌లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న ఎంఎంటీఎస్ రైళ్లు ఇకపై మన రాష్ట్రంలోనే తయారుకాబోతున్నాయి. ఇక్కడే కాకుండా, ముంబై లోకల్ రైల్ సర్వీసులకు అవసరమైన కోచ్‌లను కూడా ఇక్కడే తయారు చేసి సరఫరా చేయనున్నారు. ఇందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే కాజీపేటకు మంజూరు చేసిన వ్యాగన్ తయారీ కేంద్రాన్ని ఇటీవలే కోచ్ తయారీ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2026 మార్చి నాటికి ఫ్యాక్టరీ ఏర్పాటు పూర్తిచేసి, ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలో ఎల్‌హెచ్‌బీ, వందేభారత్ కోచ్‌లతో పాటు ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ (ఈఎంయూ)లను కూడా తయారు చేయనున్నారు. ఫ్యాక్టరీ సిద్ధమైన వెంటనే ఈఎంయూల ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది.తొలుత నెలకు 24 కోచ్‌ల ఉత్పత్తి..ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోకల్ రైళ్లుగా ఈఎంయూ కోచ్‌లతో కూడిన రేక్స్‌ను వినియోగి స్తున్నారు. ప్రధాన నగరాలకు చేరువగా ఉన్న అన్ని రూట్లను దాదాపు విద్యుదీకరించడంతో వీటి వినియోగం పెరిగింది. హైదరాబాద్‌లోని మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (ఎంఎంటీఎస్)లో వాడుతున్న కోచ్‌లు కూడా ఈఎంయూలే. ఈ కోచ్‌లలోనే లోకోమోటివ్ అంతర్భాగంగా ఉంటుంది. ఇవి పుష్–పుల్ తరహాలో పనిచేస్తాయి. వీటిని ఎక్కువగా ముంబైలో లోకల్ రైళ్లుగా, చెన్నై శివారులో సబర్బన్ రైళ్లుగా వినియోగిస్తున్నారు. మరికొన్ని నగరాల్లోనూ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఈఎంయూ కోచ్‌లను ఉత్పత్తి చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపుతున్నారు.వందే భారత్‌కు డిమాండ్ పెరగటంతో..దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతున్నందున ఐసీఎఫ్‌లో వందే భారత్ కోచ్‌ల ఉత్పత్తిని పెంచారు. దీనితో అక్కడ ఈఎంయూల ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ మేరకు ఇతర కోచ్ ఫ్యాక్టరీలలో వాటిని ఉత్పత్తి చేయనున్నారు. కాజీపేటలో సిద్ధమవుతున్న కోచ్ తయారీ కేంద్రానికి కూడా ఈ బాధ్యత అప్పగించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 16 ఎంఎంటీఎస్ రేక్స్ నడుస్తున్నాయి. 12 కోచ్‌లతో కూడిన రైలును ఒక రేక్ అంటారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ విస్తరణ నేపథ్యంలో మరిన్ని రేక్స్ అవసరం ఏర్పడింది. ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయితే ఇంకా వినియోగం పెరుగుతుంది.అప్పటికల్లా కాజీపేట ఫ్యాక్టరీ సిద్ధంకానుండటంతో.. ఆ కోచ్‌లను ఇక్కడే తయారు చేయనున్నారు. దేశంలో ఎక్కువ ఈఎంయూలను వాడుతున్నది ముంబై లోకల్ రైల్వే వ్యవస్థ. అక్కడ ప్రస్తుతం నిత్యం 191 రేక్స్ 2,500కు పైగా ట్రిప్పులు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ముంబైకి కూడా కాజీపేట నుంచే ఈఎంయూ కోచ్‌లు సరఫరా కానున్నాయి. నెలకు 24 కోచ్‌ల (రెండు రేక్స్) సామర్థ్యంతో యూనిట్ ప్రారంభం కానుంది. తర్వాత క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు. -
పలు రైళ్లు దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని నూజివీడు–వట్లూరు సెక్షన్లో జరుగుతోన్న ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ గురువారం తెలిపారు.ఈ నెల 7, 8, 11, 12 తేదీల్లో ధన్‌బాద్–అలప్పుజ (13351), 7న టాటా–యశ్వంత్‌పూర్ (18111), సంత్రగచ్చి–సనత్‌నగర్ (07070), 8, 13 తేదీల్లో విశాఖ–విజయవాడ (08567), 8న టాటా–బెంగళూరు (12889), 11న హతియా–యర్నాకుళం (22837),12న హతియా–బెంగళూరు (12835) రైళ్లు వయా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించినట్లు తెలిపారు. -
స్పీడ్ విజన్ కెమెరాలతో రైలు ప్రమాద కుట్రలకు చెక్
న్యూఢిల్లీ: రైల్వే ట్రాక్‌లపై బరువైన వస్తువులు, సిలిండర్లు పెట్టి, రైళ్లను పట్టాలు తప్పించే కుట్రలకు రైల్వేశాఖ చెక్ పెట్టనుంది. ఇటువంటి దుశ్చర్యలను విఫలం చేసేందుకు రైల్వేశాఖ హైటెక్నాలజీ సాయంతో రైళ్లకు రక్షణ కల్పించనుంది.రైలు ప్రమాద కుట్రలను పసిగట్టేందుకు ఇకపై రైళ్ల లోకోమోటివ్ (ఇంజిన్) ముందు, గార్డు క్యాబిన్ వెనుక స్పీడ్ విజన్ కెమెరాలు అమర్చనున్నారు. దీంతో లోకోమోటివ్ పైలట్లు ట్రాక్‌పై అడ్డుగావున్న వస్తువును దూరం నుండే చూడగలుగుతారు. ఈ స్పీడ్ విజన్ కెమెరాలు రికార్డు కూడా చేస్తాయి. ఫలితంగా ఇటువంటి చర్యలకు పాల్పడే నిందితులను పట్టుకునేందుకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపకరిస్తుంది.ఇటీవలి కాలంలో యూపీలోని కాన్పూర్ డివిజన్‌తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై భారీ వస్తువులను ఉంచి రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకున్న రైల్వే అధికారులు స్పీడ్ విజన్ కెమెరాలను రైళ్లకు అమర్చాలని నిర్ణయించారు. ఈశాన్య రైల్వే అధికారులు దీనికి సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేసి, రైల్వే బోర్డుకు పంపారు. బోర్డు ఈ ముసాయిదాను రైల్వే మంత్రిత్వ శాఖకు పంపింది. మంత్రివర్గం నుంచి ఆమోదం పొందగానే, రైళ్లకు స్పీడ్ విజన్ కెమెరాలను అమర్చనున్నారు. ఈ హైటెక్ సెక్యూరిటీ సిస్టమ్ కోసం రైల్వేశాఖ ప్రత్యేక భద్రతా ఏజెన్సీ సహాయాన్ని తీసుకోనుంది. ఇది కూడా చదవండి: ఉత్తమ వారసత్వ పర్యాటక గ్రామంగా ఆండ్రో, ఎక్కడుందో తెలుసా? -
ఆరు వందేభారత్‌లకు మోదీ పచ్చ జెండా
న్యూఢిల్లీ: ఆరు నూతన వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త రైళ్ల రాకతో 54గా ఉన్న వందేభారత్ రైళ్ల సంఖ్య 60కి చేరిందని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రధాని మోదీ ఆదివారం నాడు జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ ఆరు నూతన వందేభారత్ రైళ్లు టాటా నగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటా నగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మధ్య నడుస్తాయి.ఈ కొత్త వందే భారత్ రైళ్లు దేవఘర్‌లోని బైద్యనాథ్ ధామ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం, కాళీఘాట్, కోల్‌కతాలోని బేలూర్ మఠం వంటి మతపరమైన ప్రదేశాలకు త్వరగా చేరుకోవడానికి సహాయపడతాయి. ఇది కాకుండా ఈ రైళ్లు ధన్బాద్లో బొగ్గు గనుల పరిశ్రమను, కోల్‌కతాలోని జనపనార పరిశ్రమను, దుర్గాపూర్‌లో ఇనుము, ఉక్కు పరిశ్రమను చూపిస్తాయి.ఇది కూడా చదవండి: కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లుమొదటి వందే భారత్ రైలు 2019, ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యింది. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రత్యేక ప్రయాణ అనుభూతిని అందజేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు వందే భారత్ మొత్తం సుమారు 36,000 ప్రయాణాలను పూర్తి చేసింది. 3.17 కోట్ల మంది ప్రయాణీకులకు ఉత్తమ ప్రయాణ అనుభూతిని అందించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. #WATCH | PM Modi virtually flags off the Tatanagar-Patna Vande Bharat train at Tatanagar Junction Railway Station.He will also lay the foundation stone and dedicate to the nation various Railway Projects worth more than Rs. 660 crores and distribute sanction letters to 20,000… pic.twitter.com/vNiDMSA6tK— ANI (@ANI) September 15, 2024 -
షార్ట్ సర్క్యూట్‌తో రైలును పేల్చేందుకు కుట్ర?
హర్దోయ్: కోల్‌కతా నుంచి అమృత్సర్ వెళ్తున్న దుర్గియానా ఎక్స్‌ప్రెస్ ఓహెచ్ఈ వైర్‌ను బలంగా తాకడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన యూపీలోని హర్దోయ్‌లో చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో షార్ట్ సర్క్యూట్‌తో రైలును పేల్చేసేందుకు ఎవరో కుట్రపన్ని ఉంటారని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు.ఈ రైలు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు యూపీలోని లక్నో నుంచి బయలుదేరింది. ఉదయం ఐదు గంటలకు ఉమర్తాలి స్టేషన్ దాటిన వెంటనే ట్రాక్‌పై వేలాడుతున్న ఓహెచ్ఈ వైర్‌ను బలంగా తాగింది. వెంటనే పేలుడు సంభవించింది. దీంతో పైలట్ రైలును ఆపి ఉమ్రతాలి, దలేల్‌నగర్ స్టేషన్లకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు ఆ మార్గంలో నడిచే రైళ్లను నిలిపివేశారు. దాదాపు ఆరు గంటల తర్వాత దుర్గియానా ఎక్స్‌ప్రెస్ బయలుదేరేందుకు అనుమతినిచ్చారు. ఈ ఘటన నేపధ్యంలో రాజధాని, వందే భారత్‌లతో పాటు మరికొన్ని రైళ్లను మరో మార్గంలోకి మళ్లించారు. రెండు రైళ్లను రద్దు చేశారు.ఈ ఘటన దరిమిలా దుర్గియానా ఎక్స్‌ప్రెస్ రైలు విద్యుత్ కేబుల్‌ను బలంగా తాకడమనేది సహజంగా జరిగినది కాదని రైల్వే అధికారులు భావిస్తున్నారు. సాంకేతిక లోపం కంటే ట్యాంపరింగ్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని వారు అంటున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది. ఇది కూడా చదవండి: దేశంలో భద్రత గుర్తింపు పొందిన తొలి కంపెనీ -
Vande Bharat: ఆటోమెటిక్ తలుపులు.. ఆధునిక టాయ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: పరిమిత దూరంలో ఉన్న నగరాల మధ్య 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లు.. ఇక వెయ్యి కి.మీ.ని మించిన దూరప్రాంతాల మధ్య తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకుగాను తొలిసారి స్లీపర్ బెర్తులతో కూడిన వందేభారత్ రైలు పూర్తిస్థాయిలో సిద్ధమై త్వరలో తొలి పరుగుకు సిద్ధమైంది. ఇప్పటివరకు మన రైళ్లలో కనిపించని ఆధునిక రూపుతో ఇవి కళ్లు చెమర్చేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ఈ రైలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఆమోదముద్ర పడటంతో మరిన్ని రైళ్ల తయారీ కూడా ఊపందుకుంది. పూర్తిస్థాయిలో అగ్ని నిరోధక భద్రతా ప్రమాణాలతో రూపొందిన ఈ రైలు పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందడం విశేషం. ప్రత్యేకతలు ఇవే.. 👉స్లీపర్ వందేభారత్ రైలును ఆస్టెనిటిక్ స్టెయిన్లెస్ స్టీలుతో రూపొందించారు. వందేభారత్ తరహాలో దీని వెలుపలి రూపు ఏరోడైనమిక్ డిజైన్‌తో కనువిందు చేస్తోంది. 👉 ఇంటీరియర్‌ను జీఎప్ఆర్పీ ప్యానెల్‌తో రూపొందించారు. ఇందులో మాడ్యులర్ పాంట్రీ ఉంటుంది. 👉 అగ్ని నిరోధక వ్యవస్థలో ఈఎన్–45545 ప్రమాణ స్థాయితో రూపొందింది. 👉 దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించగలిగే పద్ధతిలో ప్రత్యేక బెర్తులు, టాయిలెట్లను ఇందులో పొందుపరిచారు. 👉 ఆటోమేటిక్ పద్ధతిలో తెరుచుకొని మూసుకునే పద్ధతిగల తలుపులను ఏర్పాటు చేశారు. ఇది సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్‌తో పనిచేస్తాయి. 👉 దుర్వాసనను నియంత్రించే ప్రత్యేక వ్యవస్థతో కూడిన పూర్తి సౌకర్యవంతమైన టాయ్లెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 👉 లోకోపైలట్ల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. 👉 మొదటి శ్రేణి ఏసీ కోచ్‌లో వేడి నీటితో కూడిన షవర్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. 👉 కోచ్‌లలోని బెర్తుల వద్ద రీడింగ్ లైట్లు, యూఎస్బీ చార్జింగ్ వసతి ఉంటుంది. 👉 అనౌన్స్మెంట్ల కోసం ఆడియో, వీడియో వ్యవస్థ ఉంటుంది. 👉 ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు విశాలమైన కోచ్ ఉంటుంది. 👉 సెక్యూరిటీ, రైల్వే సిబ్బందికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. లోకోపైలట్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక ఆడియో వ్యవస్థ అక్కడ అందుబాటులో ఉంటుంది. మొత్తం 16 కోచ్‌లు.... ఈ ఆధునిక స్లీపర్ వందేభారత్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. అందులో ఏసీ 3–టైర్ కోచ్‌లు 11 ఉంటాయి. వాటిల్లో 611 బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఏసీ 2 టైర్ కోచ్‌లు 4 ఉంటాయి. వీటిల్లో 188 బెర్తులు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఒకటి ఉంటుంది. అందులో 24 బెర్తులుంటాయి. అప్పర్ బెర్తులోకి చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తరహా ఏర్పాటు ఉంటుంది. మిడిల్ బెర్తు నారింజ రంగులో, లోయర్, అప్పర్ బెర్తులు గ్రే కలర్లో ఉంటాయి. అప్పర్ బెర్డులను నిలిపి ఉంచేందుకు గతంలో గొలుసు తరహా ఏర్పాటు ఉంటే, ఇందులో ప్రత్యేక స్టీల్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. బెర్తుల వద్ద మేగజైన్ బ్యాగు, మొబైల్ ఫోన్ పెట్టుకునే బాక్సు ఏర్పాటు చేశారు. æ బెర్తులు ఆరడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు. -
ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు పునరుద్ధరణ, దారి మళ్లింపు
సాక్షి, విజయవాడ: వరదలతో విజయవాడ డివిజన్లో రద్దు అయిన పలు రైళ్లను అధికారులు పునరుద్ధరించారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. మచిలీపట్నం–బెంగళూరు (07650) మధ్య ప్రత్యేక రైలును నడిపారు. అహ్మదాబాద్–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12655), చెన్నై సెంట్రల్–కాట్రా (16031), త్రివేండ్రం–హజరత్ నిజాముదీ్ధన్ (12643) యథావిధిగా పునరుద్ధరించారు.అలాగే సికింద్రాబాద్–గుంటూరు (17202) రైలును రెండు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ నుంచి నడిపారు. గూడూరు–సికింద్రాబాద్ (12709) రైలును వయా తెనాలి, గుంటూరు, రేణిగుంట మీదుగా, న్యూఢిల్లీ–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12622) వయా రేణిగుంట, గుంతకల్లు, సికింద్రాబాద్, ఖాజీపేట మీదుగా, సికింద్రాబాద్–గుంటూరు (17202) వయా పగిడిపల్లి, నడికుడి మీదుగా దారి మళ్లించారు. -
భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్..
-
ఆ రైళ్లలో బెడ్‌రోల్స్ లేవు...
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు నడిపే స్పెషల్ రైళ్లలో బెడ్‌రోల్స్‌కు కొరత ఏర్పడుతోంది. అందుబాటులో ఉన్న బెడ్ రోల్స్ సంఖ్య, వాటిని శుభ్రపరిచి తిరిగి అందించే లాండ్రీల సామర్థ్యానికి మించి డిమాండ్ ఏర్పడటమే దీనికి కారణం. రెగ్యులర్ రైళ్లు, సంవత్సరం పొడవునా నిర్వహించే సాధారణ స్పెషల్ రైళ్లకు ఇవి సరిపోతుండగా, ఉన్నట్టుండి వచ్చే రద్దీ ఆధారంగా నడిపే స్పెషల్ రైళ్లకు ఈ సమస్య ఏర్పడుతోంది. ఐదు రోజుల వరుస సెలవులతో.. పంద్రాగస్టు నేపథ్యంలో గురువారం దేశవ్యాప్త సెలవు ఉంది. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. దీంతో రాకపోకలు బాగా పెరుగుతాయి. శనివారం వారాంతం కావటంతోపాటు ఆదివారం పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు ఉండటంతో శనివారం ప్రయాణించేవారి సంఖ్య అధికంగా ఉండనుంది. ఆదివారం ఎలాగూ సెలవు, ఆ రోజు వేల సంఖ్యలో పెళ్లిళ్లున్నాయి. సోమవారం రాఖీ పౌర్ణమి.. ఇలా వరుసగా ఐదు రోజుల పాటు రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. దీంతో.. మరిన్ని స్పెషల్ రైళ్లు నడపాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు ఏకంగా 15 మంది పార్లమెంటు సభ్యులు విన్నప లేఖలు పంపారు. ప్రయాణికుల నుంచి కూడా డిమాండ్ వచ్చి0ది. దీంతో అందుబాటులో రేక్స్ తక్కువగా ఉండటంతో.. కొన్ని స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. స్పెషల్ రైళ్లు ఇవే.. 18న నర్సాపూర్–సికింద్రాబాద్, 19న సికింద్రాబాద్–నర్సాపూర్, 15, 17, 19 తేదీల్లో కాకినాడ–సికింద్రాబాద్, 16, 18, 20 తేదీల్లో సికింద్రాబాద్–కాకినాడ, 14, 15 తేదీల్లో తిరుపతి–నాగర్సోల్, కాచిగూడ–తిరుపతి మధ్య వీటిని నడుపుతున్నారు. వీటన్నింటిలో ఏసీ కోచ్‌లున్నాయి. కానీ, వాటిల్లోని ప్రయాణికులకు బెడ్‌రోల్స్‌ను సర్దుబాటు చేయలేమని నిర్ణయించుకున్న దక్షిణ మధ్య రైల్వే, బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ స్పెషల్ రైళ్లలో బెడ్ రోల్స్‌ను సరఫరా ఉండదని తేల్చి చెప్పింది. ఇక ప్రయాణికులే సొంత ఏర్పాట్లతో రావాలన్నది దాని పరోక్ష సారాంశం. -
సాధా‘రణ’ బోగీ.. కిక్కిరిసి
రైళ్లలో జనరల్ బోగీలు చూడగానే కిక్కిరిసి ఉంటాయి. కూర్చోవడానికే కాదు.. నిల్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. లగేజీ బెర్తు...వాష్‌రూమ్, ఫుట్‌బోర్డు ఇలా ఎక్కడచూసినా ఫుల్ రష్ కనిపిస్తుంది. గంటల తరబడి నిలబడటానికి ఇబ్బంది పడేవారు.. సీట్లలో కూర్చున్న ప్రయాణికుల కాళ్ల వద్ద కూడా కూర్చొనేవారు ఉన్నారు. వాస్తవానికి ఒక్కో జనరల్ బోగీలో కూర్చొని 75 మంది దాకా ప్రయాణించొచ్చు. కానీ ఏ జనరల్ బోగీ చూసినా... అందులో ప్రయాణించే వారి సంఖ్య 150 నుంచి 200 మంది పైనే ఉంటుంది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్‌నగర్, వరంగల్, కామారెడ్డి, కాజీపేట రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకొనేందుకు ‘సాక్షి ’క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రయాణికుల కష్టాలు తెలుసుకుంది. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా సాధారణ బోగీల సంఖ్య పెంచకపోవడంతో వందలాదిమంది రెండు, మూడు బోగీల్లోనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే కాదు గోదావరి, పద్మావతి, నారాయణాద్రి, విశాఖ ఎక్స్‌ప్రెస్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ తదితర అన్ని రైళ్లలోనూ సాధారణ ప్రయాణికులు నిత్యం నరకం చవిచూస్తున్నారు. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సివస్తోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లక్షలాదిమంది కార్మికులు హైదరాబాద్‌లో నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు. ఈ కార్మికుల కుటుంబాలు, బంధువులు నిత్యం తమ స్వస్థలాలకు రాకపోకలు సాగిస్తారు. ఈ ప్రయాణికుల డిమాండ్ మేరకు రైళ్లు లేక, అందుబాటులో ఉన్న రైళ్లలోనే ప్రయాణం చేస్తున్నారు. తగ్గిన ప్యాసింజర్ రైళ్లు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైళ్లు బాగా తగ్గుముఖం పట్టాయి. కొన్నింటిని ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చారు. పదేళ్లు దాటినా ఇంటర్సిటీ రైళ్ల సంఖ్య పెరగలేదు. దీంతో హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు బయలుదేరే రైళ్లలోనే సాధారణ బోగీలను ఆశ్రయించాల్సి వస్తోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్న సుమారు 250 రైళ్లలో సుమారు 100 వరకు ప్యాసింజర్ రైళ్లు ఉంటే 150 వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. కానీ 2 లక్షల మందికి పైగా సాధారణ ప్రయాణికులే కావడం గమనార్హం. ప్రస్తుతం 24 బోగీలు ఉన్న ట్రైన్లలో 2 నుంచి 3 సాధారణ బోగీలు ఉండగా, 18 బోగీలు ఉన్న రైళ్లలో కేవలం 2 సాధారణ బోగీలే ఉన్నాయి. ప్రయాణికులు మాత్రం వాటి సామర్థ్యానికి రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. ఎలాగోలా ప్రయాణం ముంబయి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా భువనేశ్వర్‌కు వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు ముందు ఒకటి, వెనుక మరొకటి చొప్పున 2 జనరల్ బోగీలు మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్కో బోగీలో కనీసం 250 మందికి పైగా ప్రయాణం చేస్తూ కనిపించారు. కొందరు బాత్రూమ్ వద్ద కిటకిటలాడుతుండగా, మరికొందరు పుట్బోర్డుపైన నిండిపోయారు. అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది. » కాజీపేట్, వరంగల్ స్టేషన్లలో సాధారణ బోగీల్లో ప్రయాణికుల దుస్థితిని పరిశీలించినప్పుడు, ఒక్క కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లోనే కాకుండా ఈస్ట్‌కోస్ట్, సంఘమిత్ర, గోరఖ్‌పూర్, సాయినగర్ షిర్డీ, కృష్ణా, మచిలీపట్నం, గౌతమి, గోదావరి, శాతవాహన, గోల్కొండ, ఇంటర్సిటీ, తదితర అన్ని రైళ్లలోను ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపించింది. » కామారెడ్డి మీదుగా ఇటు సికింద్రాబాద్, అటు నాందేడ్, ముంబై, షిరిడీలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ 2 సాధారణ బోగీలు మాత్రమే ఉన్నాయి. » సికింద్రాబాద్ నుంచి ముంబయికి వెళ్లే దేవగిరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లోని 2 సాధారణ బోగీలు సికింద్రాబాద్‌లోనే కిక్కిరిసిపోతాయి. కానీ మిర్జాపల్లి, అక్కన్నపేటస్టేషన్, కామారెడ్డి, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నాందేడ్, ముంబయికి వెళ్లే ప్రయాణికులు దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లోని సాధారణ బోగీలనే ఆశ్రయిస్తారు. దీంతో ఈ ట్రైన్ కామారెడ్డికి వచ్చేసరికి కాలు మోపేందుకు కూడా చోటు ఉండదు. అయినా సరే ముంబయికి ఉపాధి కోసం వెళ్లే కూలీలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. రైళ్ల రద్దుతో పెరుగుతున్న రద్దీ హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పుష్ఫుల్, ప్యాసింజర్ రైళ్లను తరచు రద్దు చేయడం వల్ల మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లపైన ఒత్తిడి పెరుగుతోంది. మెయింటెనెన్స్ పనుల పేరిట వారం, పదిరోజుల పాటు రద్దు చేస్తున్నారు. మరోవైపు ఏ ట్రైన్ ఎప్పుడు, ఎందుకు రద్దవుతుందో కూడా తెలియదు. దీంతో రోజువారీ ప్రయాణం చేసే చిరువ్యాపారులు, ఉద్యోగస్తులు, విద్యార్ధులు, వివిధ వర్గాలకు చెందినవారు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. రోలింగ్ కారిడార్ బ్లాక్ పనుల వల్ల సాధారణ రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయడమే ఇందుకు కారణం. ‘ఒక నెలలో పుష్ఫుల్ రైళ్లు 20 రోజులునడిస్తే కనీసం 10 రోజులు రకరకాల కారణాలతో రద్దవుతున్నాయని తాండూరుకు చెందిన శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు కోవిడ్ అనంతరం చాలా వరకు పుష్ఫుల్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చారు. సాధారణ బోగీల సంఖ్యను పెంచకుండా చార్జీలు మాత్రమే పెంచారు. » మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, తదితర స్టేషన్ల నుంచి సుమారు 1000 మందికి పైగా నగరానికి రాకపోకలు సాగిస్తారు. కానీ మహబూబ్‌నగర్ నుంచి కాచిగూడకు రాకపోకలు సాగించే డెమో ట్రైన్ తరచు రద్దవుతోంది. గంటల తరబడి ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతకాలంగా 40 నిమిషాలకు పైగా ఆలస్యంగా నడుస్తుందని , దీంతో సకాలంలో హైదరాబాద్‌కు చేరుకోలేకపోతున్నామని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. బోగీలు పెంచడమే పరిష్కారం అన్ని ప్రధాన రైళ్లలో సాధారణ బోగీలను 2 నుంచి 4కు పెంచనున్నట్టు ఇటీవల రైల్వేశాఖ స్పష్టం చేసింది. కానీ దక్షిణమధ్య రైల్వేలో ఇంకా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాలుగైదు రైళ్లలో మాత్రమే బోగీల సంఖ్యను పెంచినట్టు అధికారులు తెలిపారు. జోన్ పరిధిలో సుమారు 320 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లన్నింటిలోనూ సాధారణ బోగీలు పెంచడమే తక్షణ పరిష్కారం. » అన్ని ప్రధాన రైళ్లలో మహిళల కోసం ఒక ప్రత్యేక బోగీని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణం మహిళలకు ఎంతో కష్టం. ఈ దిశగా చర్యలు చేపట్సాల్సి ఉంది. డెమో రైలును రైట్‌టైమ్ ప్రకారం నడపాలి మహబూబ్‌నగర్ డెమో రైలులో ఏడాది నుంచి ప్రయాణం చేస్తున్న. కొద్ది రోజుల నుంచి డెమో ఆలస్యంగా నడుస్తోంది. దీంతో టైమ్ ఆఫీసుకు వెళ్లలేకపోతున్నా. లేట్‌గా వెళ్లిన రోజుల్లో కొన్నిసార్లు సగం జీతమే లెక్కలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి డెమో రైలును టైమ్ ప్రకారం నడపాలి. – ఎం.మహేశ్, ప్రైవేట్ ఉద్యోగి, మర్లు (మహబూబ్‌నగర్) నాలుగు రోజుల జీతం కట్ కొన్ని రోజుల నుంచి డెమో రైలు ఆలస్యంగా బయలుదేరి వెళుతుండ డంతో చాలా ఇబ్బందులు పడుతున్నా. నేను పనిచేసే సంస్థకు ఆలస్యంగా వెళుతుండటంతో నెలలో నాలుగు రోజులైన జీతం కట్ చేస్తున్నారు. డెమో రైలును రైట్‌టైమ్‌లో నడిపి మా సమస్యను పరిష్కరించాలి. – శ్రీనివాస్, ప్రైవేట్ ఉద్యోగి, హన్వాడ బోగీలు పెంచాలి ఇరవై ఏళ్లుగా కాంట్రాక్టు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాను. ఉదయం 9 గంటల వరకు ఉద్యోగంలో ఉండాలి. అందుకే ప్రతి రోజు ఉదయం 7 గంటలకు ఉండే పుష్ఫుల్ ట్రైన్‌కు వెళ్తాను. ఇది సుమారు 45 నిమిషాల పాటు ఆలస్యంగా వస్తుంది. దీని తర్వాత వచ్చే కాకతీయ ట్రైన్ వేళలు మార్చారు. బోగీల సంఖ్య కూడా తగ్గించారు. దీంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లపైన ఆధారపడాల్సి వస్తోంది. సాధారణ రైళ్లలో బోగీలు పెంచితే చాలు. – సత్తిబాబు, కాంట్రాక్టు రైల్వే ఉద్యోగి, భువనగిరి -
‘వందేభారత్‌పైనే శ్రద్ధనా?’ రైల్వే మంత్రి ఏమన్నారంటే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2024-25 బడ్జెట్లో ఉద్యోగ కల్పన, గ్రామీణాభివృద్ధిపై అధికంగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మంత్రి తన 83 నిమిషాల సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో రైల్వే అనే పదాన్ని ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం రైల్వేలకు ఏమి చేస్తున్నదనే ప్రశ్న పలువురి మదిలో మెదిలింది. అలాగే ప్రభుత్వం వందేభారత్‌పై పెడుతున్న శ్రద్ధ.. పేదల రైళ్ల విషయంలో పెట్టడం లేదంటూ పలు ఆరోపణలు వినవస్తున్నాయి. వీటిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.బడ్జెట్ వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో తక్కువ ఆదాయవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారని, వీరికి సంబంధించిన రైళ్ల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. అటు వందేభారత్పైన, ఇటు సాధారణ ప్రయాణికులు రైళ్లపైన కూడా దృష్టి పెడుతున్నదన్నారు. రైలును రూపొందించే విధానం ప్రతి రైలుకు ప్రామాణికంగా ప్రత్యేకంగా ఉంటుందని, దానికి అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, నాన్-ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు ఉంటాయన్నారు. అల్ప ఆదాయ వర్గానికి చెందినవారు తక్కువ చార్జీలకే ప్రయాణించేలా చూడటమే రైల్వేల ప్రధాన లక్ష్యమన్నారు. దేశంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, డబ్లింగ్‌లో గణనీయమైన పెట్టుబడితో సహా గత ఐదేళ్లలో రైల్వేలపై మూలధన వ్యయం 77 శాతం పెరిగిందని 2023-24 ఆర్థిక సర్వే తెలిపిందన్నారు. 2014కు ముందు రైల్వేలకు మూలధన వ్యయం సుమారు రూ. 35,000 కోట్లు అని, నేడు ఇది రూ. 2.62 లక్షల కోట్లు అని, ఈ తరహా పెట్టుబడులు పెట్టినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నానని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. -
రైలు దొంగ.. సినిమాల్లో సీన్లు చూసి..
చీరాల రూరల్/నెల్లూరు (క్రైమ్): విలాసాలు, వ్యసనాలకు బానిసయిన ఓ యువకుడు ఇంటర్నెట్లో సినిమాలు చూసి “రైలు దొంగ’గా అవతారమెత్తి.. కటకటాలపాలయిన ఘటన బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. శుక్రవారం రైల్వే డీఎస్పీ సి.విజయభాస్కర్‌రావు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన పెదాల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ అలియాస్ వెంకటేష్ వ్యసనాలకు, విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డాడు. కూలీ ద్వారా సంపాదించిన మొత్తం తన అవసరాలకు సరిపోకపోవడంతో ఈజీ మార్గంలో మనీ సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం సినిమాల్లో రైళ్లలో దొంగతనాలు చేసే సీన్లు చూసి ప్రేరణ పొంది దొంగగా అవతారమెత్తాడు.రైళ్లల్లో తిరుగుతూ ప్రయాణికులు ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో వారి బ్యాగ్‌లు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను అపహరించేవాడు. ఇటీవల చీరాలలో రైలు దొంగతనాలు అధికం కావడంతో గుంతకల్లు రైల్వే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.చౌడేశ్వరి ఆదేశాల మేరకు.. ఒంగోలు జీఆర్పీ సీఐ కె.భుజంగరావు ఆధ్వర్యంలో చీరాల జీఆర్పీ ఎస్ఐ సీహెచ్.కొండయ్య తన సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు.సాంకేతికత ఆధారంగా నిందితుడు వెంకటేశ్వర్లును గుర్తించారు. గురువారం రాత్రి చీరాల రైల్వేస్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫారంపై నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.3.81 లక్షల విలువచేసే 62 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు సెల్ఫోన్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
విజయవాడ రూట్లో పలు రైళ్ల రద్దు: ఎస్సీఆర్
సాక్షి,విజయవాడ: ఆగస్ట్ నెలలో ఐదు రోజుల పాటు పలు రైళ్లు రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు బుధవారం(జులై 3) ఒక ప్రకటన విడుదల చేసింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మూడవ లైన్ ఏర్పాటులో భాగంగా మరమ్మతులు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ మరమ్మతుల వల్లే రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేసినట్లు తెలిపింది. ఆగస్టు 5 నుంచి ఆగస్ట్ 8 వరకు 37 రైళ్లు రద్దు చేయనుండగా 38 రైళ్లను దారి మళ్లించనున్నారు. -
బోగీల్లో మంటలు
సాక్షి, హైదరాబాద్/ సికింద్రాబాద్: నగరంలోని ఏదో ఒక రైల్వేస్టేషన్లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం ఏసీ బోగోల్లో మంటలు చెలరేగిన సమయంలో అదృష్టవశాత్తు ప్రయాణికులెవరూ లేరు. ⇒ గతంలో నాంపల్లి స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌పైన నిలిపి ఉన్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లోనూ ఇలాగే మంటలు చెలరేగాయి. అప్పటికే ప్రయాణికులు దిగి వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రైన్లో పేలుడు స్వభావం ఉన్న పదార్థాల వల్లనే మంటలు అంటుకున్నట్టు అప్పట్లో గుర్తించారు. ⇒ సికింద్రాబాద్ స్టేషన్లోనూ చారి్మనార్ ఎక్స్‌ప్రెస్ కూడా ప్రమాదానికి గురైంది. విశాఖ నుంచి నగరానికి చేరుకున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే యార్డుకు చేరుకున్న కొద్దిసేపటికే అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన నాలుగేళ్ల క్రితం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.ఒకవేళ యార్డుకు చేరుకోకముందే అగ్నిప్రమాదం చోటుచేసుకొని ఉంటే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేది. ఇలా తరచుగా ఏదో ఒక ట్రైన్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని రైళ్లలో పొగలు రావడంతోనే గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు భారీ ఎత్తున మంటలు అంటుకొని ప్రయాణికులు, అధికారులు, సిబ్బందిని భయాందోళనకు గురిచేసిన సంఘటనలూ ఉన్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యమే కారణమా..రైల్వేయార్డులు, వాషింగ్‌లైన్‌లు, పిట్లైన్లలో నిలిపి ఉంచే బోగీలకు భద్రత ఉండటం లేదనే ఆరోపణలున్నా యి. కోచ్‌లను శుభ్రం చేసేందుకు రైళ్లను పిట్‌లైన్‌లకు తరలిస్తారు. కొన్నింటిని డిపోల్లో నిలిపివేస్తారు. రైళ్లు, బోగీలు ఎక్కడ నిలిపి ఉంచినా, వాటిపైన భద్రతా సిబ్బంది నిఘా కొరవడుతోంది. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు ఈ బోగీలు అడ్డాలుగా మారుతున్నాయి. తాగుబోతులు, ర్యాగ్‌పిక్కర్స్, అసాంఘిక శక్తులు రాత్రి వేళల్లో బోగీల్లో తిష్టవేస్తూ మద్యం సేవిస్తున్నారు. సిగరెట్లు, గంజాయి వంటివి తాగి మండుతున్న పీకలను బోగీల్లోనే వేస్తున్నారు. దీంతో సిగరెట్ పీకలు, వెలిగించిన అగ్ని పుల్లలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ⇒ ఏసీ బోగీల నిర్వహణలో వైఫల్యం వల్ల తరచూ విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నా యి. ఏసీ బోగీల్లో ప్రయాణికులు చెత్తాచెదారం, ఆహారపదార్ధాలు వదిలేస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో ఎలుకలు, బొద్దింకలు వచ్చి చేరుతున్నాయి. ఎలుకలు తరచుగా విద్యుత్ వైర్లు కట్ చేయడం వల్ల షార్ట్‌సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరుగుతున్నట్టు రైల్వే భద్రతా నిపుణుడు ఒకరు చెప్పారు. ఆరీ్పఎఫ్, జీఆర్పీ వంటి పోలీసు విభాగాలు పిట్లైన్లు, యార్డుల్లో నిరంతరం నిఘా కొనసాగించాలి. బయటి వ్యక్తులు యార్డుల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.ఏసీ కోచ్‌ల్లో అగ్ని ప్రమాదంసికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి గురువారం ఉద యం 10.30 గంటలకు ఏసీ కోచ్‌లను వాషింగ్ కోసం మెట్టుగూడ వద్దనున్న క్లీనింగ్ పిట్ యార్డ్ తీసుకెళ్లారు. క్లీనింగ్ పూర్తయ్యాక 11 గంటల ప్రాంతంలో తిరిగి రైల్వే స్టేషన్‌కు తరలిస్తుండగా ఏసీ బోగీల్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇది గమనించిన చిలకలగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రైల్వే అధికారులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది స్టేషన్లో మంటలు ఆర్పే యంత్రాలతో తగలబడుతున్న బోగీలను అదుపు చేసే ప్రయ త్నం చేశారు. మంటలు ఇతర బోగీలకు వ్యాపించ కుండా రైల్వే సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలోనే అక్కడకు చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేశాయి. రైలు కోచ్‌లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. విషయం తెలియగానే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై సమీక్షించి, భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డివిజనల్ అధికారులను ఆదేశించారు. -
రైలు ప్రయాణికులకు అలర్ట్.. రిజర్వేషన్ సేవలకు బ్రేక్!
ఢిల్లీ, చుట్టుపక్కల రాష్ట్రాలలో నడిచే రైళ్లకు రిజర్వేషన్ చేయాలనుకుంటున్న ప్రయాణికులు శుక్రవారం రాత్రికి ముందే చేసేయండి. ఎందుకంటే ఢిల్లీ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)కు సంబంధించిన అన్ని సేవలు శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు పనిచేయవు. అయితే, సర్వీసులు నిలిచిపోయిన సమయంలో చాలా తక్కువ మంది మాత్రమే అసౌకర్యానికి గురవుతారని రైల్వే పేర్కొంది. చాలా కొద్ది మంది మాత్రమే ఈ సేవలను ఉపయోగిస్తున్నారని రైల్వే చెబుతోంది. పీఆర్ఎస్ దేశవ్యాప్తంగా ఐదు నగరాల నుండి పనిచేస్తుంది. వీటిలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, గౌహతి ఉన్నాయి. ఢిల్లీ పీఆర్ఎస్ వ్యవస్థను శుక్రవారం రాత్రి తాత్కాలికంగా మూసివేయనున్నారు. అంటే ఢిల్లీ పీఆర్ఎస్ ద్వారా నిర్వహించే అన్ని రైళ్లలో రిజర్వేషన్, రద్దు, విచారణ (139, కౌంటర్ సర్వీస్), ఇంటర్నెట్ బుకింగ్‌తో సహా అన్ని రకాల సేవలు ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 11.45 గంటల నుండి ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 04.15 గంటల వరకు దాదాపు 04.30 గంటల పాటు నిలిచిపోతాయి. ఈ సమయంలో ఢిల్లీ పీఆర్ఎస్కు సంబంధించిన ఏ పనిని మరే ఇతర నగరంలోని పీఆర్ఎస్ నుండి చేయలేము. రిజర్వేషన్ లేదా మరేదైనా పనిని పూర్తి చేయాలనుకుంటే, శుక్రవారం రాత్రికి ముందే పూర్తి చేయండి.. లేకపోతే మీరు శనివారం ఉదయం మాత్రమే పూర్తి చేయగలుగుతారు. -
రైల్లో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలో తెలుసా?
సాధారణంగా రైలు ప్రయాణాల్లో ఒక్కొసారి విలువైన వస్తువులు పొరపాటున మర్చిపోతుంటాం. చాలామంది వాటిని తిరిగి పొందేందుకు(క్లైయిమ్ చేసుకునేందుకు) ప్రయత్నించారు. ఆ ఇంకెక్కడుంటుంది. ఈపాటికి ఎవరో ఒకళ్లు పట్టుకుపోయి ఉంటారులే అనుకుంటారు. ఓ మూడు, నాలుగురోజులు అబ్బా..! అలా ఎలా వదిలేశాను? అని తెగ బాధపపడిపోతూ.. మర్చిపోయే యత్నం చేస్తారు. చాలామటుకు అందరూ ఇలానే చేస్తారు. అలా బాధపడనక్కర్లేకుండా ఆ వస్తువులను ఎలా తిరిగి సంపాదించుకోవాలి? వాటిని రైల్వే అధికారులు, సిబ్బంది ఏం చేస్తారు తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!. రైలులో ఎవ్వరైనా ఏదైన విలువైన వస్తువు మర్చిపోతే బాధపడుతూ కూర్చొనవసరం లేదు. పైగా ఇక దొరకదనుకుని డిసైడ్ అయ్యే పోనక్కర్లేదు. ఏం చేయాలంటే?..మనం వస్తువుని రైల్లో మరచిన వెంటనే చేయాల్సింది.. మన టిక్కెట్‌ని జాగ్రత్త చేయాలి. ఇప్పుడూ మొబైల్ ఫోన్‌కి టికెట్ వచ్చినట్లు మెసేజ్ వస్తుంది కాబట్టి దాన్ని డిలీట్ చేయకూడదు. ఆ తర్వాత మనకు సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్‌కి వెళ్లి అక్కడ అధికారులకు తెలియజేయాలి. వారు విచారించి మీరు ప్రయోణించిన ట్రైయిన్ తాలుకా లిస్ట్ తీసి.. ఆ రైలు లాస్ట్ స్టేషన్ వద్ద సిబ్బంది కలెక్ట్ చేసిని వస్తువుల సమాచారం లిస్ట్‌ని తీయడం జరుగుతుంది. ఆయా వ్యక్తులు పలానా ట్రెయిన్లో తాము ఈ వస్తువు మర్చిపోయామని పూర్తి వివరాలను తెలియజేస్తే..ఆ జాబితాలో ఉందా లేదా అనేది నిర్థారిస్తారు అధికారులు. ఆ తర్వాత సదరు వ్యక్తి కోల్పోయిన వస్తువు వివరాలు, ప్రయాణించిన ట్రైయిన టిక్కెట్ ఆధారంతో అతడి వస్తువని నిర్థారించుకుంటారు. ఆ తర్వాత రైల్వే అధికారులు అతడు పొగొట్టుకున్న వస్తువులను అందచేయడం జరుగుతుంది. అలాగే ఇలా రైలులో యాత్రికులు మర్చిపోయిన వస్తువులను రైల్వే సిబ్బంది కలెక్ట్ చేసి రైల్వే మాస్టర్‌కి అందజేస్తారు. ఆ తర్వాత ప్రయాణికులెవరైనా.. వచ్చి కలెక్ట్ చేసుకోవాడానికి వస్తారేమో!.. అని కొన్ని రోజులు వేచి చూస్తారు. రానీ పక్షంలో వాటిని వేలం ద్వారా విక్రయించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే రైల్వే అధికారిక మార్గదర్శకాలను తెలుసుకుంటే సరిపోతుంది. అది ఐఆర్సీటీసీ సైట్లో లేదా రైల్వేస్టేషన్ అడిగి సవివరంగా తెలుసుకోవచ్చు. ఇక నుంచి రైలులో వస్తువు పోతే దొరకదని వదిలేయకండి. కనీసం రైల్వే హెల్ప్ సెంటర్‌కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకునే యత్నం చేయండి. (చదవండి: బొటాక్స్ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్ కోసం వాడితే..!) -
చర్లపల్లి టెర్మినల్ నుంచి త్వరలో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: నాలుగో రైల్వే టెర్మినల్‌గా చర్లపల్లి స్టేషన్ సేవలు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై పెరిగిన రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే రూ.221 కోట్లతో చర్లపల్లి స్టేషన్ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి రోజూ సుమారు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా చర్లపల్లి టెర్మినల్‌ను విస్తరించారు. సరుకు రవాణాకు పార్శిల్ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. రోజుకు 200కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రస్తుతం పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్ల రాకపోకలను నియంత్రించవలసిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే చర్లపల్లి స్టేషన్ విస్తరణ పూర్తి కావడంతో మార్చి నుంచి కొన్ని రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాని మోదీతో ప్రారంభం! ప్రధాని మోదీతోనే త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. అదే రోజు రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే... ► షాలిమార్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18045/18046) త్వరలో సికింద్రాబాద్‌కు బదులు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది. ► చెన్నై నుంచి నాంపల్లి స్టేషన్‌కు నడిచే చార్మి నార్ ఎక్స్‌ప్రెస్ (12603/12604) చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనుంది. ► గోరఖ్‌పూర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే (12589/12590) గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి నుంచి నడుపనున్నారు. మరో 6 రైళ్లకు హాల్టింగ్... ► హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011/17012), సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (12757/12758), గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (12705/12706) ఎక్స్‌ప్రెస్ రైళ్లను మార్చి నుంచి చర్లపల్లి స్టేషన్లో నిలుపనున్నారు.ఈ మేరకు రైల్వేబోర్డు అనుమతులను ఇచ్చింది. -
40వేల నార్మల్ బోగీలను వందే భారత్ ప్రమాణాలకు పెంచుతాం
-
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాలకు నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 27 వరకు విశాఖపట్నం–సికింద్రాబాద్ (08579), ఫిబ్రవరి 8 నుంచి మార్చి 28 వరకు సికింద్రాబాద్–విశాఖపట్నం (08580), ఫిబ్ర వరి 5 నుంచి మార్చి 25 వరకు విశాఖపట్నం–తిరుపతి (08583), ఫిబ్రవరి 6 నుంచి మార్చి 26 వరకు తిరుపతి–విశాఖపట్నం (08584), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు విశాఖపట్నం–బెంగళూరు (08543) ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 1 వరకు బెంగళూరు–విశాఖపట్నం (08544), ఫిబ్రవరి 3 నుంచి మార్చి 30 వరకు భువనేశ్వర్–తిరుపతి (02809), ఫిబ్రవరి 4 నుంచి మార్చి 31 వరకు తిరుపతి–భువనేశ్వర్ (02810), ఫిబ్రవరి 5 నుంచి ఏప్రిల్ 29 వరకు పాట్నా–సికింద్రాబాద్ (03253), ఫిబ్రవరి 7 నుంచి మే 1 వరకు హైదరాబాద్–పాట్నా (07255), ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 26 వరకు సికింద్రాబాద్–పాట్నా (07256), ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 25 వరకు ధనాపూర్–సికింద్రాబాద్ (03225), ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 28 వరకు సికింద్రాబాద్–ధనాపూర్ (03226), ఫిబ్రవరి 7 నుంచి ఏప్రిల్ 28 వరకు బెంగళూరు–ధనాపూర్ (03242) రైళ్లను పొడిగించినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సౌత్ ఈస్ట్రన్ రైల్వేలోని పలు సెక్షన్లలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 2న నర్సాపూర్–హుబ్లీ (17225), ఫిబ్రవరి 3న హుబ్లీ–నర్సాపూర్ (17226), హుబ్లీ–గుంతకల్లు (07337), గుంతకల్లు–హుబ్లీ (07338), బల్గెవి–కాజీపేట (07335), ఫిబ్రవరి 4న కాజీపేట–బల్గెవి (07336) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
పలు రైళ్లు రీ షెడ్యూల్
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఖుర్దారోడ్ డివిజన్, ఖుర్దారోడ్–బ్రహ్మపూర్ సెక్షన్ పరిధిలో జరుగుతున్న లిమిటెడ్ హైట్ సబ్వే పనుల నిమిత్తం ట్రాఫిక్ బ్లాక్ తీసుకుంటున్నందున ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో రీ షెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ► ఫిబ్రవరి 1వ తేదీన భువనేశ్వర్‌లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయల్దేరాల్సిన భువనేశ్వర్–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్(12830) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3.10 గంటలకు బయల్దేరుతుంది. ► ఫిబ్రవరి 1వ తేదీన పూరీలో మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరాల్సిన పూరీ–గుణుపూర్(18417) ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది. ► ఫిబ్రవరి 1వ తేదీన గుణుపూర్‌లో ఉదయం 5 గంటలకు బయల్దేరాల్సిన గుణుపూర్–పూరీ(18418) ఎక్స్‌ప్రెస్ ఉదయం 9గంటలకు బయల్దేరుతుంది. ► ఈనెల 31న తిరుపతిలో ఉదయం 10.40 గంటలకు బయల్దేరాల్సిన తిరుపతి–పూరీ(17480) ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.40 గంటలకు బయల్దేరుతుంది. ► ఫిబ్రవరి 1న సంత్రాగచ్చిలో ఉదయం 5 గంటలకు బయల్దేరాల్సిన సంత్రగచ్చి–తాంబరం (06054) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 7 గంటలకు బయల్దేరుతుంది. ► ఈ నెల 31న ఎంజీఆర్ చైన్నె సెంట్రల్లో రాత్రి 7.50 గంటలకు బయల్దేరాల్సిన ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–షాలిమర్(22826) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 10.10గంటలకు బయల్దేరుతుంది. ► ఈ నెల 31న తిరునల్వేలిలో తెల్లవారు 3 గంటలకు బయల్దేరాల్సిన తిరునల్వేలి– పురూలియా (22606) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.15 గంటలకు బయల్దేరుతుంది. ► ఈ నెల 31న పుదుచ్చేరిలో మధ్యాహ్నం 2.15 గంటలకు బయల్దేరాల్సిన పుదుచ్చేరి–హౌరా(12868) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5గంటలకు బయల్దేరుతుంది. ► ఈ నెల 31న చైన్నె సెంట్రల్లో రాత్రి 7 గంటలకు బయల్దేరాల్సిన ఎంజీఆర్ చైన్నె సెంట్రల్– హౌరా(12840) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 9.30 గంటలకు బయల్దేరుతుంది. ► ఈ నెల 31న సికింద్రాబాద్‌లో సాయంత్రం 4.50 గంటలకు బయల్దేరాల్సిన సికింద్రాబాద్–హౌరా(17016) విశాఖ ఎక్స్‌ప్రెస్ రాత్రి 7.35గంటలకు బయల్దేరుతుంది. -
అయోధ్య రూట్లో రైళ్లు రద్దు.. కారణమిదే!
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రస్తుతం రైల్వే ట్రాక్ డబ్లింగ్ (సింగిల్ ట్రాక్ డబ్లింగ్), విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో జనవరి 16 నుండి 22 వరకు అయోధ్యలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ రూటులో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో సహా మొత్తం ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. అలాగే డూన్ ఎక్స్‌ప్రెస్ సహా 35 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. నార్తర్న్ రైల్వే లక్నో డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రేఖా శర్మ మీడియాతో మాట్లాడుతూ అయోధ్య కాంట్ నుండి ఆనంద్ విహార్ (ఢిల్లీ)కి వెళ్లే వందే భారత్ రైలును ట్రాక్ నిర్వహణ కారణంగా జనవరి 15 వరకు రద్దు చేసినట్లు చెప్పారు. అయితే ఈ రైలు రద్దును జనవరి 22 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రామ్‌లల్లా పవిత్రోత్సవానికి జరుగున్న సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని, అయోధ్య రైల్వే సెక్షన్లో ట్రాక్ డబ్లింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలావుండగా అయోధ్యలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రారంభోత్సవానికి ముందే హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. జనవరి 22కు ముందుగానే భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీస్ ప్రారంభమవుతుందని యూపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. అయితే దీనికి సంబంధించి నిర్దిష్ట తేదీని ప్రకటించలేదు. అయోధ్యలో రామ మందిరాన్ని ఈనెల 22న ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో రామ్‌లల్లాకు పట్టాభిషేకం జరగనుంది. రాజకీయ నేతలు మొదలుకొని, సినిమా, క్రీడా ప్రపంచానికి చెందిన పులువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళ్లలేరా? ప్రాణప్రతిష్ఠను ఇలా ప్రత్యక్షంగా చూడండి! -
రైళ్ల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: కాజీపేట్–డోర్నకల్, విజయవాడ– డోర్నకల్ మధ్య రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. కాజీపేట్–డోర్నకల్ మధ్య ఈ నెల 14 నుంచి, విజయవాడ–డోర్నకల్ మధ్య ఈ నెల 20 నుంచి రైళ్లు యాథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి. రైల్వేలైన్ల నిర్వహణ దృష్ట్యా ఈ రెండు రైళ్లను ఈ నెల ఒకటో తేదీ నుంచి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
World Longest Train Trips: ప్రపంచంలోని పొడవైన రైలు ప్రయాణాలు (ఫోటోలు)
-
చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు!
చెట్లకు పండ్లను పండించడం విన్నాం. కానీ ఇలా చెట్లకే కుర్చీలను పండించడం గురించి వినలేదు కదా!ఎక్కడైనా చెట్లను పెంచి వాటిని కట్ చేసి కుర్చీల ఆకృతిలో తయారు చేస్తారు. కానీ ఏకంగా ఓ పండు మాదిరిగా కుర్చీలను చెట్లకు పెంచడం ఏమిటీ? అసలు అదెలా సాధ్యం? అనిపిస్తుంది కదా!. అయితే ఇక్కడో రైతు ఈ వినూత్న ఆలోచనతో పెద్ద వ్యాపారమే చేస్తున్నాడు. లక్షల్లో లాభలు కూడా ఆర్జిస్తున్నాడు. ఎలా చేస్తాడంటే..యూకేకి చెందిన గావిన్, ఆలిస్ మున్రో జంట ఈ వినూత్న వ్యవసాయాన్ని మొదటు పెట్టారు. ఇద్దరు ఫర్నీచర్ ఫామ్‌ని చేస్తారు. వారు తమ పొలంలో కుర్చీల్లా ఎదిగేలా చెట్లను పెంచుతారు. ఫర్నీచర్ కోసం పరిపక్వానికి వచ్చిన చెట్లను నరికేసి భారీగా కార్బన్ ఉద్గారాలు పెరిగే ప్రమాదానికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఒక చెట్టును 50 ఏళ్లపాట్లు పెంచి ,నరికి కుర్చీగా తయారు చేసే బదులు చెట్లకే నేరుగా కావాల్సిన ఆకృతిలో కుర్చీలను పెంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది గావిన్ అనే రైతుకి. అనుకున్నదే తడువుగా ఆ భార్యభర్తలిద్దరూ ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసేలా కుర్చీలను పండిస్తున్నారు. దీన్ని గావిన్ ఒక రకమైన జెన్ త్రీడీ ప్రింటింగ్ అంటారని చెబుతున్నారు. ఆయనకు ఈ ఆలోచన తాను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడూ కుర్చీలా ఉండే బోన్సాయ్ చెట్లను చూసి ఈ ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు. అదీగాక గావిన్ చిన్నతనంలో వంగిన వెన్నుపూసతో జన్మించాడు. దీంతో చాలా కాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. అక్కడ వైద్యులు వెన్నుని సరిచేసే నిమిత్తం మెటల్ ఫ్రేమ్‌ని అమర్చారు. దాంతోనే చాలా ఏళ్లు గడిపాడు. అప్పుడే గావిన్కి తెలిసింది..ఏదైన సరైన ఆకృతిలో రావాలంటే పెరుగుతున్న క్రమంలోనే ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే సెట్‌రైట్ అవుతుందని. ఆ తర్వాత గావిన్ తన ఆలోచనకు(చెట్లకు కుర్చీలు పెంచడ) రూపమిచ్చే పనిలో నిమగ్నమయ్యాడు. అందుకోసం విల్లో అనే ప్రత్యేకమైన చెట్లును ఉపయోగించాడు. విల్లో చెట్టు కొమ్మలు చాలా సరళంగా ఉంటాయి. అదేవిధంగా, ఓక్, యాష్, సైకమోర్ వంటి బలమైన తీగలు ఉన్న చెట్లను కూడా ఫర్నిచర్ పెంచడానికి ఉపయోగిస్తారు. చెట్ల తీగలను కుర్చీలుగా మార్చడానికి గావిన్ ఇనుప ఫ్రేమ్‌లను ఉపయోగిస్తాడు. ఈ ఫ్రేమ్‌ల లోపల చెక్క కుర్చీని అమర్చి పెంచుతారు. కుర్చీల ఆకారం చెడిపోకుండా ఉండటానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చెట్టు కత్తిరిస్తాడట. అయితే ఒక్కో కుర్చి ఖరీదు మాత్రం రూ. 6 నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుంది. ఈ క్రమంలో వారు చెట్ల పెరుగుదలను అడ్డురాకుండా మంచి ఆకృతిలో పెంచేందుకు ఒక మార్గాన్ని కూడా కనుగొనవల్సి వచ్చింది. ఈ సేంద్రీయ మొక్కలను పెంచడానికి చాలా శ్రమ, సమయంల ఖర్చు అవుతుందని చెబుతున్నాడు గావిన్. ఈ మొక్కల పెంపకంలో అతడి భార్య ఆలిస్ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇలా ఈ దంపతులు 2012లో ఫుల్ గ్రోన్ అనే కంపెనీని స్థాపించారు. అంతేగాదు సగటున ఒక కుర్చీ పెరగడానికి ఆరు నుంచి 9 సంవత్సరాలు పట్టగా ఎండడానికి ఒక ఏడాది పడుతుంది. అంటే ఒక కుర్చీ తయారవ్వడానకి ఇంచుమించు ఏడు నుంచి పదేళ్లు పట్టొచ్చు. పైగా ధర కూడా లక్షల్లో ఉంటుంది. చెట్లకు కుర్చీలనే పెంచడమే ఒక వింత అనుకుంటే వాటిని ఇన్ని లక్షలు పోసి కొనడం మరింత విడ్డూరంగా ఉంది కదా!.అంతేగాదు గావిస్ ఆలిన్ ఇంత సమయం పట్టకుండా ఉండేలా ఏటా పండించేలా చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. 2024 కల్లా ఆ లక్ష్యం నెరవేరగా దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఆ గావిన్ ఆలిస్ దంపతులు. (చదవండి: 30 ఏళ క్రితం పోయిన బ్యాగ్ మళ్లీ యజమాని చెంతకు..! 11 ఏళ్ల చిన్నారి..) -
కాస్త ఎండ.. అంతలోనే విపరీతమైన చలి!
దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు విపరీతంగా పొగమంచు కమ్ముకుంటోంది. అయితే చాలా రోజుల తర్వాత ఆదివారం కాస్త ఎండ కనిపించింది. అయితే సాయంత్రానికల్లా మళ్లీ చలి వివరీతంగా పెరిగింది. పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా 22 రైళ్లు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చలి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో ఉదయం పూట ఈ వారం పొడవునా తేలికపాటి పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. జనవరి 9న తేలికపాటి వర్షం లేదా చినుకులు పడవచ్చు. ఢిల్లీలో శీతాకాల సెలవులను జనవరి 12 వరకు పొడిగించారు. అయితే ఇది ఐదవ తరగతిలోపు విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. 6 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల తరువాతనే వీరికి తరగతులు నిర్వహిస్తారు. ఢిల్లీలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 18.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది శనివారం కంటే మూడు డిగ్రీలు తక్కువ. కనిష్ట ఉష్ణోగ్రత 8.2 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వాయు కాలుష్యం తీవ్రమయ్యింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 333గా ఉంది. జమ్మూ డివిజన్లో దట్టమైన పొగమంచు కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. 11 విమానాలు ఆలస్యంగా నడిచాయి. -
విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లు పూర్తిగా, పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పూర్తిగా రద్దు చేసిన రైళ్లు ♦ ఈ నెల 19, 20, 22, 23, 24, 26, 27 తేదీల్లో విజయవాడ–విశాఖపట్నం (22702/222701) ♦ ఈ నెల 19 నుంచి 28 వరకు గుంటూరు–విశాఖపట్నం (17239) ♦ ఈ నెల 20 నుంచి 29 వరకు విశాఖపట్నం–గుంటూరు (17240) ♦ ఈ నెల 19 నుంచి 28 వరకు బిట్రగుంట–విజయవాడ (07977/07978) ♦ ఈ నెల 22 నుంచి 26 వరకు బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు ♦ ఈ నెల 15 నుంచి 28 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్–విజయవాడ (07863/07866), మచిలీపట్నం–విజయవాడ (07770), విజయవాడ–భీమవరం జంక్షన్ (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్ (078661) రైళ్లను రెండు మార్గాల్లో రామవరప్పాడు–విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లు ఈ నెల 15, 22 తేదీల్లో ఎర్నాకుళం–పాట్నా (22643), ఈ నెల 20, 29 తేదీల్లో భావ్‌నగర్–కాకినాడ టౌన్ (12756), ఈ నెల 17, 19, 24, 26 తేదీల్లో బెంగళూరు గౌహతి (12509), ఈ నెల 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్–భువనేశ్వర్ (11019) రైళ్లను దారి మళ్లించారు. అదేవిధంగా ఈ నెల 15 నుంచి 28 వరకు ధనబాద్–అలెప్పి (13351), ఈ నెల 18, 25 తేదీల్లో టాటా–యశ్వంత్‌పూర్ (18111), ఈ నెల 17, 24 తేదీల్లో జసిదిహ్–తాంబరం (12376), ఈ నెల 15, 22 తేదీల్లో హథియా–ఎర్నాకుళం (22837), ఈ నెల 15, 24 తేదీల్లో హథియా–బెంగళూరు (18637), ఈ నెల 20, 27 తేదీలలో హథియా–బెంగళూరు (18637), ఈ నెల 16, 21, 23, 28 తేదీలలో హథియా–బెంగళూరు (12835), ఈ నెల 19, 26 తేదీల్లో టాటా–బెంగళూరు (12889) రైళ్లు విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా మళ్లించారు. -
100% ఆక్యుపెన్సీ దాటిన ‘వందేభారత్’
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన వందేభారత్ రైళ్లు అత్యధిక ఆక్యుపెన్సీతో పరుగులు తీస్తున్నాయి. దక్షిణమధ్య రైల్వేలో గతేడాది ప్రవేశపెట్టిన నాలుగు రైళ్లలో ఆక్యుపెన్సీ వంద శాతం దాటింది. ఈ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రయాణికుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్‌లో 134% ఆక్యుపెన్సీ.. సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను గతేడాది జనవరిలో ప్రవేశపెట్టారు. 16 కోచ్‌లతో ఈ రైలు ప్రారంభమైంది. మొదటి నుంచి ఈ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో స్థిరంగా నడుస్తోంది. గత డిసెంబర్లో ఈ ట్రైన్లో ప్రయాణికుల నుంచి అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. సికింద్రాబా ద్ నుంచి విశాఖకు వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో 134 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. ఇక విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే వందేభారత్‌లో ఇది ఏకంగా 143 శాతానికి చేరుకుంది. సంవత్సరాంతం కావడంతో రెండు వైపుల నుంచి ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో చాలా మంది వెయిటింగ్ జాబితాలో నిరీక్షించవలసి వచ్చింది. గత డిసెంబర్ ఆఖరు వారంలో వరుస సెలవులు రావడంతో ఎక్కువ మంది రాకపోకలు సాగించారు. సంక్రాంతి వరకు కూడా ప్రయాణికుల రద్దీ ఇలాగే ఉండవచ్చని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్‌లో... గతేడాది ఏప్రిల్‌లో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మొదట 8 కోచ్‌లతో ప్రారంభించారు. ఈ ట్రైన్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తోంది. ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో గతేడాది మే 17 నుంచి 16 కోచ్‌లకు పెంచారు. గత డిసెంబర్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు 114 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే వందేభారత్‌లో 105 శాతానికి ఆక్యుపెన్సీ చేరుకోవడం గమనార్హం. మరోవైపు గత సెపె్టంబర్లో 8 బోగీలతో ప్రవేశపెట్టిన కాచిగూడ–యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో డిసెంబర్లో ఆక్యుపెన్సీ 107 శా తానికి చేరింది. తిరుగుదిశలో యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడ వరకు 110 శాతం వరకు నమోదైంది. అలాగే దక్షిణమధ్య రైల్వే పరిధిలోని విజయవాడ–ఎంజీఆర్ చెన్నై–వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో సైతం గత డిసెంబర్లో 126 శాతం ఆక్యుపెన్సీ నమోదవగా చెన్నై నుంచి విజయవాడకు వచ్చే ట్రైన్లో ఇది 119 శాతం వరకు ఉంది. గత సెస్టెంబర్లో 8 కోచ్‌లతో ఈ ట్రైన్‌ను ప్రవేశపెట్టారు. ఈ ట్రైన్ తిరుపతి మీదుగా రాకపోకలు సాగిస్తోంది. ఆకట్టుకుంటున్న సదుపాయాలు... వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏర్పాటు చేసిన సదుపాయాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకొనే విధంగా రైళ్లను నడుపుతుండటంతో ఎక్కువ మంది వందేభారత్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ ట్రైన్లో ఏసీ చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లతో అన్ని రకాలసదుపాయాలు అందుబాటులో ఉన్నా యి. జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, రిక్లైనింగ్ సీట్లు, అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, డిఫ్యూజ్డ్ ఎల్ఈడీ లైటింగ్, చార్జింగ్ పాయింట్లు వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ప్రయాణికులకు పూర్తిగా సురక్షితమైన, మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. -
పట్టాలపై పొగమంచు
రామగుండం/ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట–బల్లార్షా సెక్షన్ల మధ్య బుధవారం రైలు పట్టాలపై పొగమంచు కమ్ముకోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకోవడంతో పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు విఘాతం కలిగింది. ప్రధానంగా సికింద్రాబాద్–బల్లార్షా–న్యూఢిల్లీ మధ్య ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్ల వేగం తగ్గించి నడిపించారు. సిగ్నల్స్‌ను పొగమంచు కమ్మేయడంతో లోకో పైలట్లు అప్రమత్తమయ్యారు. వేగం బాగా తగ్గించి నడపడంతో రైళ్లు నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా నడిచాయి. మరోవైపు.. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపైకి వచ్చేవరకూ రైళ్లు కనిపించక ప్రయాణికులు సైతం తికమకపడ్డారు. కాజీపేట– బల్లార్షా సెక్షన్ల మధ్య పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట, ఓదెల, పొత్కపల్లి, కొలనూర్, బిజిగిరిషరీఫ్, హసన్‌పర్తి మధ్య ఈ పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. ఉదయం 11 గంటల తర్వాత సూర్యుడు రావడంతో రైల్వేసిగ్నలింగ్ వ్యవస్థ, పట్టాలు యథాతథస్థితికి చేరుకున్నాయి. దీంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
2023.. భారతీయ రైల్వేలో అద్భుతాలివే..
2023 సంవత్సరం ముగియబోతోంది. కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో ప్రవేశించనుంది. 2023లో భారతీయ రైల్వే అనేక విజయాలను నమోదు చేసుకుంది. ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే భారతీయ రైల్వే 2023లో ఏమి సాధించిందో ఇప్పుడు చూద్దాం. అత్యంత పొడవైన రైల్వే స్టేషన్.. ప్రపంచంలో భారీ నెట్వర్క్ కలిగిన రవాణా సాధనాలలో భారతీయ రైల్వే ఒకటి. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్‌గా భారత్‌లోని ఒక రైల్వే స్టేషన్ రికార్డు సృష్టించింది. గతంలో యూపీలోని గోరఖ్‌పూర్ స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్‌గా రికార్డు సృష్టించింది. దీని పొడవు 1,366.4 మీటర్లు. అయితే ఈ సంవత్సరం మార్చి లో హుబ్లీ రైల్వే స్టేషన్ అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారం కలిగిన స్టేషన్‌గా కొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్లాట్‌ఫారమ్ పొడవు 1,507 మీటర్లు. ఈ ప్లాట్ఫారం ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. అమృత్ భారత్ స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ల ద్వారా భారతీయ రైల్వే రూపురేఖలు మారనున్నాయి. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఆగస్టు 6న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నాయి. వీటి అభివృద్ధికి రూ.24,470 కోట్లు ఖర్చుకానుంది. ఈ పథకం ద్వారా దేశంలోని 1,309 రైల్వే స్టేషన్లు మరింత అభివృద్ధి చెందనున్నాయి. మూడువేల కొత్త రైళ్లు.. పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా భారతీయ రైల్వే రాబోయే నాలుగైదు సంవత్సరాలలో మూడువేల అదనపు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రస్తుతం రైల్వే ఏటా ఎనిమిది వందల కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేస్తున్నదని అన్నారు. ప్రయాణికుల పెరుగుదల దృష్ట్యా మరో మూడువేల రైళ్లు అవసరమని అన్నారు. ప్రతి సంవత్సరం 200 నుండి 250 కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు. 400 నుండి 450 వందే భారత్ రైళ్లకు ఇవి అదనం అని పేర్కొన్నారు. లిఫ్ట్‌లు/ఎస్కలేటర్లు సుగమ్య భారత్ అభియాన్‌లో భాగంగా భారతీయ రైల్వేలు రైల్వే ప్లాట్‌ఫారమ్‌లలో వికలాంగులు, వృద్ధులు, పిల్లలకు ఉపయోగపడేలా లిఫ్టులు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. 2021-22లో 208 లిఫ్టులు, 182 ఎస్కలేటర్లు ఏర్పాటు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 215 లిఫ్టులు, 184 ఎస్కలేటర్లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ దాదాపు మూడు కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతీయ రైల్వేలు 68 వేల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్‌వర్క్‌ను కలిగివుంది. ఉపాధి కల్పన విషయంలో భారతీయ రైల్వే చాలా దేశాల కంటే ముందుంది. భారతీయ రైల్వేలో 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: సీతారాముల స్వస్థలాలు ‘అమృత్ భారత్’తో అనుసంధానం! -
ఘోర ప్రమాదం.. రెండు మెట్రో రైళ్లు ఢీ
బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని బీజింగ్‌లో రెండు మెట్రో రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 515 మంది గాయపడ్డారు. 102 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే.. ఈ ఘటనలో ఇప్పటికైతే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. నిత్యం రద్దీగా ఉండే బీజింగ్‌లో మెట్రో రైళ్లు క్షణం గడువు లేకుండా నడుస్తుంటాయి. నగరంలో 27 రైల్వే లైన్లలో ప్రతిరోజూ 13 మిలియన్ల మంది ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి రెండు నిమిషాలకో రైలు నడుస్తుంది. బీజింగ్‌లో శుక్రవారం భారీగా మంచు కురిసింది. రైల్వే ట్రాక్‌లు తడిసి ఉన్నాయి. ఈ క్రమంలో సబ్వే వద్ద ఓ రైలు బ్రేక్ వేసింది. వెనకనే వస్తున్న రైలు బ్రేక్ వేయడంలో విఫలమైన నేపథ్యంలో రెండు రైళ్లు ఢీ కొన్నాయని బీజింగ్ మున్సిపల్ అధికారులు తెలిపారు. రెండు రైళ్లు ఢీకొనడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కుదుపుకు గురయ్యారు. చెల్లాచెదురుగా పడిపోయామని స్థానికులు తెలిపారు. కొందరు ఎముకలు విరిగి ఆర్తనాదాలు చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా 515 మంది గాయపడగా ఆస్పత్రికి తరలించారు. 102 మందికి ఎముకలు విరిగి పరిస్థితి తీవ్రంగా ఉందని వెైద్యులు తెలిపారు. ఇదీ చదవండి: వెనెజులాలో ట్రక్కు బీభత్సం.. 16 మంది మృతి -
రెండు నెలల్లో రూ.4 లక్షలు.. ఏసీ కోచ్‌ల నుంచే..
గత రెండు నెలల్లో ట్రైన్ ఎస్ కోచ్‌ల నుంచి లక్షల విలువైన దుప్పట్లు, బెడ్షీట్లు, దిండ్లు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. చోరీకి గారైన వస్తువుల విలువ ఎంత? ఎక్కడ ఈ చోరీలు ఎక్కువగా జరిగాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ఏసీ కోచ్‌ల ప్రయాణించే ప్రయాణికులకు దుప్పట్లు, దిండ్లు వంటి వస్తువులను రైల్వే శాఖ ఉచితంగానే అందిస్తుంది. కొందరు ప్రయాణికులు వారి ప్రయాణం పూర్తయిన తరువాత ఆ దుప్పట్లను మడిచి బ్యాగులో వేసుకునే వెళ్లిపోయే సంఘటనలు చాలానే ఉన్నాయి. ప్రయాణికులు కాకుండా.. ఏసీ కోచ్ అటెండర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా భోపాల్‌లో జరిగినట్లు సమాచారం. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లలో ఇలాంటి చోరీలు జరిగాయని కొందరు అధికారులు తెలియజేసారు. భోపాల్ ఎక్స్‌ప్రెస్, రేవాంచల్ ఎక్స్‌ప్రెస్, మహామన ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానానికి చేరుకోవడానికి సుమారు 12 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుండటంతో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరిగాయి. అన్ని రైళ్లలో 12 కోచ్‌లు, ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉంటారు. వారు రాత్రి సమయంలో పడుకునే సందర్భంలో మధ్యలో దిగిపోయేవారు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు. ఇదీ చదవండి: బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత కేవలం గత రెండు నెలల్లో రైళ్లలో రూ.2.65 లక్షల విలువైన 1,503 బెడ్షీట్లు, రూ.1.9 లక్షల విలువైన 189 దుప్పట్లు, రూ.10 వేలకు పైగా విలువ చేసే 326 దిండ్లు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకులు ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై పెద్దగా చర్యలు తీసుకోలేదని.. చోరీలను ఆపడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 🚨 Blankets, bed sheets, pillows and other stuff worth 4 lakh were stolen from trains AC coaches in last two months. Most incidents took place in Bhopal, Rewanchal, Mahamana and Humsafar express (GRP Officials) pic.twitter.com/paAGnaNSRH — Indian Tech & Infra (@IndianTechGuide) December 14, 2023 -
శబరిమలకు 22 అదనపు రైళ్లు
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో 22 అదనపు రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు.. సికింద్రాబాద్–కొల్లాం (07111/07112) ప్రత్యేక రైలు ఈ నెల 27, జనవరి 3, 10, 17 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55కు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 29, జనవరి 5, 12, 19 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాకినాడ టౌన్–కొట్టాయం (0713/0714) ప్రత్యేక రైలు డిసెంబర్ 28, జనవరి 4, 11, 18 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 30, జనవరి 6, 13, 20 తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారు జామున కాకినాడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్–కొట్టాయం (07117/07118) స్పెషల్ ట్రైన్ జనవరి 2వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 4వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్–కొట్టాయం (07009/07010) స్పెషల్ ట్రైన్ జనవరి 6, 13 తేదీల్లో సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.05 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 8, 15 తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. -
రైళ్లు, విమానాల రాకపోకలకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: మిచాంగ్ తుపాన్ ప్రభావంతో మంగళవారం కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రూట్లలో పరిమితంగా సర్విసులను పునరుద్ధరించారు. ముంబయి మీదుగా చెన్నైకి వెళ్లే కొన్ని రైళ్లను ఇతర మార్గాల్లో మళ్ళించారు. ఈ నెల 8వ తేదీ వరకు వివిధ మార్గాల్లో సుమారు 120 రైళ్లను రద్దు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. తుపాన్ తగ్గుముఖం పట్టి, సాధారణ పరిస్థితులు నెలకొంటే రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, భువనేశ్వర్, కోల్‌కతా, తదితర ప్రాంతాలకు వెళ్లే రైలు మార్గాల్లో వరదల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టాలపై వరదనీటిని తొలగించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది రాత్రింబవళ్లు విధులను నిర్వహిస్తున్నారని వివరించారు. రాకపోకలు నిలిచిన రైళ్ళు ఇవే: కాచిగూడ–చెంగల్పట్టు, హైదరాబాద్–తాంబరం, సికింద్రాబాద్–కొల్లాం, సికింద్రాబాద్–తిరుపతి, లింగంపల్లి–తిరుపతి. సికింద్రాబాద్–రేపల్లె, కాచిగూడ–రేపల్లె. చెన్నై–హైదరాబాద్, సింద్రాబాద్–గూడూరు, సికింద్రాబాద్–త్రివేండ్రమ్ తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. మరోవైపు చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ రూట్లో రైలు సర్విసులు పునరుద్ధరణ: తిరుపతి–సికింద్రాబాద్, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్–గూడూరు రూట్లలో కొన్ని సర్విసులను పునరుద్ధరించినట్లు అధికారులు పేర్కొన్నారు. తుపాన్ కారణంగా రద్దయిన రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు బుక్ చేసుకొన్న ప్రయాణికులు రైళ్ల పునరుద్ధరణకు అనుగుణంగా తిరిగి తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 20 విమాన సర్విసులు రద్దు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 20 దేశీయ విమాన సర్విసులు నిలిచిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, చెన్నై, రాజమండ్రి, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు బయలుదేరే విమానాలను వాతావరణ ప్రభావం కారణంగా అధికారులు రద్దు చేశారు. మరోవైపు చెన్నై నుంచి హైదరాబాద్‌కు రావలసిన విమాన సర్వీసులు కూడా ఆగిపోయాయి. తప్పనిసరిగా వెళ్లవలసిన వాళ్లు రైళ్లతో పాటు విమానాలు కూడా రద్దవడంతో ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. -
మిచౌంగ్ తుపాను : దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్
సాక్షి, హైదరాబాద్: మిచౌంగ్ తుపాన్ కారణంగా 300 రైళ్లు రద్దయ్యాయని దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) ముఖ్య ప్రజా సంబంధాల అధికారి(సీపీఆర్వో) తెలిపారు. ఎస్సీఆర్ పరిధిలో రైళ్లపై తుపాన్ ఎఫెక్ట్ మీద ఒక ప్రకటన విడుదల చేశారు. రద్దైన రైళ్లు కాకుండా మరో 10 రైళ్లు గూడూరు చెన్నై- రూట్లో కాకుండా ఇతర రూట్లలో దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ‘ప్రస్తుతం రైల్వే ట్రాక్ లపై ఎక్కడా నీళ్ళు నిలవలేదు. వరద నిలిచే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించాం. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైళ్ల రద్దు సమచారం అందించాం. ఎస్ఎంఎస్లు, సామాజిక మాధ్యమాల్లోనూ అందించాం. ప్రయాణికుల రిజర్వేషన్ ఛార్జీలు రీఫండ్ చేశాం. తుపాను తీరం దాటాక వీలైనంత త్వరగా రైళ్లు పునరుద్ధరిస్తాం’ అని సీపీఆర్వో తెలిపారు. ఇదీచదవండి..మిచౌంగ్ తుపాను హెచ్చరిక.. అప్డేట్స్ -
దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయి ఆదాయం
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా గరిష్ట స్థాయి ఆదాయాన్ని ఆర్జిస్తూ తన పాత రికార్డులు అధిగమిస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు మరో ఘనతను సాధించింది. నవంబర్ నెలకు సంబంధించి రైల్వే శాఖ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ఇటు ప్రయాణికుల రైళ్ల ద్వారా, అటు సరుకు రవాణా రైళ్ల ద్వారా నవంబర్‌లో రూ.1,600.53 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది నవంబర్‌లో గరిష్ట ఆదాయం రూ.1,454 కోట్లు మాత్రమే కాగా, ప్రయాణికుల రైళ్ల ద్వారా రైల్వే ఈ సంవత్సరం నవంబర్‌లో 469.40 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ప్రయాణికుల అవసరాల మేరకు 342 అదనపు ట్రిప్పులను నడిపింది.ఇది 64 రైళ్లకు సమానం. వీటిల్లో 3.39 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. అలాగే రైల్వే శాఖ ఈ నవంబర్‌లో 11.57 మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసింది. దీని ద్వారా రూ.1,131.13 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇది గతేడాది నవంబర్ ఆదాయం కంటే పది శాతం ఎక్కువ. కొత్త క్లైంట్లతో ఒప్పందాలు చేసుకోవటం, సరుకు రవాణా చేసే కొత్త గమ్యస్థానాలను జోడించటం, కొత్త ట్రాక్‌ను అందుబాటులోకి తేవటం వంటి చర్యల ద్వారా ఇది సాధ్యమైందని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆదాయాన్ని భారీగా పెంచడానికి కృషి చేసిన ఉద్యోగులు, ఇతర సిబ్బందిని జోన్ జీఎం అరుణ్‌కుమార్ జైన్ అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించి కూడా ఇదే తరహా రికార్డును సాధించాలని ఆయన సూచించారు. -
‘రైళ్లను పేల్చేస్తా’నంటూ బెదిరించి.. పోలీసు విచారణలో నిందితుని ట్విస్ట్!
పట్నా: బీహార్ రాజధాని పట్నా రైల్వే స్టేషన్లో ఆ సమయంలో కలకలం చెలరేగింది. రాజధాని, జన-శతాబ్ది, వందే భారత్ రైళ్లను పేల్చివేస్తామంటూ రైల్వే అధికారులకు బెదిరింపు లేఖ వచ్చింది. రాజేంద్ర నగర్ టెర్మినల్ స్టేషన్ మేనేజర్‌కు ఆగంతకుడు ఈ బెదిరింపు లేఖను పోస్ట్ ద్వారా పంపాడు. తాను ఈ మూడు రైళ్లను పేల్చకుండా ఉండాలంటే రైల్వే శాఖ తనకు రూ.1.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఈ విషయాన్ని స్టేషన్ మేనేజర్.. జీఆర్పీకి, స్థానిక పోలీసులకు తెలియజేశారు. ఈ కేసులో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మరొకరిని ఈ కేసులో ఇరికించాలని ఒక పథకం ప్రకారం స్టేషన్ మేనేజర్‌కు బెదిరింపు లేఖ పంపాడు. ఈ కేసులో కామత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు కామత్ విస్తుపోయే వివరాలను వెల్లడించాడు. కపిల్ దేవ్ అనే వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని, పోలీసు కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో కామత్ ఈ బెదిరింపు లేఖ రాశాడని పోలీసుల విచారణలో తేలింది. కామత్, కపిల్ దేవ్ మధ్య చాలా కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ నేపధ్యంలో కామత్ జైలుకు కూడా వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన అతను కపిల్దేవ్పై పగ తీర్చుకునే ఉద్దేశంతో ఈ పనిచేశాడని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: పాక్‌పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
దీపావళి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా హైదరాబాద్–కటక్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్–కటక్ (07165/07166) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14, 21 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు బయల్దేరి మర్నాడు సాయంత్రం 5.45 గంటలకు కటక్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు కటక్ నుంచి బయల్దేరి మర్నాడు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
పదేళ్లయినా విస్తరించని కవచ్!
సాక్షి, హైదరాబాద్: వందేభారత్... వేగవంతమైన, ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన రైలు. కానీ వేగంగా, విలాసవంతంగా ప్రయాణించడం కంటే రైళ్లు భద్రంగా గమ్యస్థానం చేరడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని విస్మరించిన రైల్వే శాఖ... రైళ్లు ఢీకొనకుండా నిరోధించే కవచ్ వ్యవస్థను విస్తరించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురై ఏకంగా 296 మంది ప్రయాణికులు దుర్మరణం పాలై నాలుగున్నర నెలలు దాటినా నేటికీ కవచ్ వ్యవస్థను కొత్తగా ఒక్క కిలోమీటర్ మేర కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. ఒకవేళ ఆ వ్యవస్థను విస్తరించి ఉంటే తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటన తప్పి ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో కేవలం 5 డీజిల్ లోకొమోటివ్‌లలో దీన్ని ఏర్పాటు చేయడం తప్ప ఎలాంటి పురోగతీ లేదు. ఏటా 5 వేల కి.మీ. మేర ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇటీవల 3 వేల కి.మీ. మేర దీన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారు. కానీ పనుల్లో వేగం లేదు. టీకాస్ నుంచి కవచ్‌గా రూపాంతరం... రైల్వే అనుబంధ పరిశోధన సంస్థ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) 2013లో తొలుత రైల్ కొలీజన్ అవాయ్‌డెన్స్ సిస్టం (టీకాస్)ను సిద్ధం చేసింది. ప్రయోగాల కోసం వికారాబాద్–వాడీ–సనత్‌నగర్ సెక్షన్లను రైల్వే శాఖ ఎంపిక చేసింది. 260 కి.మీ. నిడివిలో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశీలించింది. ఆరేళ్ల క్రితం దాని పేరును కవచ్‌గా మార్చింది. 2022 నాటికి కవచ్ ఎక్కడెక్కడంటే.. నాందేడ్–నిజామాబాద్–సికింద్రాబాద్–కర్నూలు–గుంతకల్ మార్గంలో 960 కి.మీ. పర్బణి–పర్లివైజ్నాథ్–లాతూర్–వికారాబాద్ మార్గంలో 31 కి.మీ. వాడి–వికారాబాద్–సనత్‌నగర్ మార్గంలో 174 కి.మీ. ఇవి తప్ప, దేశంలోని మిగతా ప్రాంతాల్లో వీటి ఏర్పాటు జరగలేదు. కవచ్ పనితీరు ఇలా... ప్రత్యేక కవచ్ యంత్రాలను రైల్వే స్టేషన్లలో, రైళ్లలో అమరుస్తారు. ట్రాక్‌పై ప్రతి కి.మీ.కు ఒకటి చొప్పున ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఏర్పాటు చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాంతాల్లో 40 మీటర్ల ఎత్తున్న టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్ఫేస్లతో అనుసంధానిస్తారు. దీంతో ఎప్పటికప్పుడు ఇవి రైళ్లను నియంత్రిస్తుంటాయి. లోకో పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించినా తనంతట తనుగా బ్రేక్‌లు వేసుకోవటం, హారన్ మోగించటం లాంటివి కవచ్ చేయగలదు. పొరపాటున ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు వస్తే.. కనీసం 100 మీటర్ల దూరంలోనే అవి ఆటోమేటిక్‌గా నిలిచిపోతాయి. వందేభారత్‌లకూ పొంచి ఉన్న ప్రమాదం.. గంటకు 160 కి.మీ.వేగంతో (నిర్ధారిత పరిధి) దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లలోనూ కవచ్ వ్యవస్థ లేదు. అవి పరుగుపెట్టే ట్రాక్ మొత్తం కవచ్ వ్యవస్థ ఏర్పాటైతేనే పనిచేసే పరిస్థితి ఉన్నందున వందేభారత్ రైళ్లు కూడా ఎదురెదురుగా ఇతర రైళ్లను ఢీకొనే ప్రమాదపు అంచులో ఉన్నట్టే. వందేభారత్ ఎక్స్‌ప్రెస్..పరిజ్ఞానం: దేశీయం నేపథ్యం: 2016 చివర్లో తయారీపై మొదలైన ప్రయోగాలు 2018 నాటికి పూర్తి. అందుకే దీన్ని తొలుత ‘ట్రైన్–18’గా పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరిలో ఢిల్లీ–వారణాసి మధ్య తొలి రైలు పరుగు ప్రారంభించింది. ఆలోచన నుంచి పట్టాలెక్కడం వరకు పట్టిన సమయం కేవలం రెండున్నరేళ్లు. ఖర్చు: ఒక్కో రైలు తయారీకి అవుతున్న వ్యయం దాదాపు రూ. 100 కోట్లు. కవచ్ ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు వచ్చినప్పుడు పరస్పరం ఢీకొనకుండా నిరోధించేందుకు అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా రూపొందించిన వ్యవస్థ. పరిజ్ఞానం: దేశీయం నేపథ్యం: 2013లో ప్రయోగాలు మొదలు. అవి విజయవంతం కావడంతో ఆ వ్యవస్థను వినియోగించేందుకు 2021లో అనుమతి. ప్రస్తుతం భారతీయ రైల్వే నెట్వర్క్ 1.29 లక్షల కి.మీ. మేర విస్తరించి ఉంది. కానీ కవచ్‌కు అంకురార్పణ జరిగి దశాబ్దం దాటుతున్నా ఇప్పటివరకు ఏర్పాటైంది కేవలం 1,425 కి.మీ. నిడివిలోనే.ఖర్చు: కిలోమీటర్‌కు రూ.50 లక్షలు. -
మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు.. జాతీయ రహదారుల దిగ్బంధం
ముంబయి: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లపై జరుగుతున్న ఆందోళనలు ఉద్ధృతంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కోరుతూ నిరసనకారులు రాష్ట్రమంతటా ఆందోళనలు నిర్వహించారు. రైల్వే ట్రాకులు, జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. నేడు ముంబై-బెంగళూరు హైవేను రెండు గంటలపాటు నిరసనకారులు దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరాఠా క్రాంతి మోర్చా కార్యకర్తలు షోలాపూర్‌లో రైలు పట్టాలను దిగ్బంధించారు. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. నిరసనకారులు రైలు పట్టాలపై టైర్లు తగులబెట్టారు. అటు.. జల్నా జిల్లాలో జరిగిన నిరసనల్లో కొందరు వ్యక్తులు పంచాయతీ సమితి కార్యాలయానికి నిప్పుపెట్టారని పోలీసులు మంగళవారం తెలిపారు. రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ జల్నాలో జరిగిన మరో ఘటనలో షెల్గావ్ గ్రామంలోని రైల్వే గేట్ వద్ద మరాఠా వర్గానికి చెందిన కొందరు యువకులు రైళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు ఆందోళనకారులు రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగా మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగే అక్టోబర్ 25 నుండి జాల్నా జిల్లాలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మరాఠా రిజర్వేషన్లపై రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి షిండే వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా నిరసనలకు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్ల వివాదం.. సీఎం షిండే విధేయులు రాజీనామా -
ఎటు చూసినా చెత్తే..!
సాక్షి, హైదరాబాద్: పారిశుధ్యానికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. స్వచ్ఛభారత్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ మేరకు చర్యలు చేపట్టి అమలు చేస్తోంది. నిత్యం లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రైళ్ల విషయంలోనూ ‘స్వచ్ఛతా పక్వారా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రయాణికుల్లోనే మార్పు రావటం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని పక్షం రోజుల పాటు రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాలు, వర్క్‌షాపులు, రైల్వే ఉద్యోగులు నివాసం ఉండే కాలనీల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. పక్షం రోజుల్లో ఏకంగా 544 టన్నుల చెత్త పోగవడం చూసి అధికారులు నివ్వెరపోయారు. పారిశుధ్యంపై రైల్వే ప్రత్యేక దృష్టి గత కొంతకాలంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో చాలా మార్పులు సంతరించుకుంటున్నాయి. అధునాతన రైళ్లతో పాటు స్టేషన్లలో అన్నిరకాల వసతులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయి. రైళ్లు, స్టేషన్లు పరిశుభ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా ఆదేశించారు. అంతేగాక స్వయంగా చీపురు పట్టి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో రైల్వే అధికారులూ అప్రమత్తంగా ఉంటున్నారు. స్టేషన్లను శుభ్రపరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించి క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చూస్తున్నారు. రైళ్లలో కూడా శుభ్రపరిచే సిబ్బందిని ఉంచి, ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రాకముందే క్లీన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి మాత్రం దీనికి ఎలాంటి సహకారం లభించడం లేదని రైళ్లు, స్టేషన్లలో దర్శనమిచ్చే చెత్త స్పష్టం చేస్తోంది. పట్టించుకోని ప్రయాణికులు కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు, మిగిలిపోయిన తినుబండారాలు, కాఫీ/టీ కప్పులు, భోజన ప్యాకెట్లు, విస్తరాకులు.. ఇలాంటి వాటన్నిటినీ ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ విసిరేస్తున్నారు. దీంతో రైళ్లు, రైల్వే స్టేషన్లు, పరిసరాలు చెత్తతో నిండిపోతున్నాయి. సిబ్బంది ఎన్నిసార్లు శుభ్రం చేసినా మళ్లీ చెత్త పోగవుతోంది. ఇటీవల పక్షం రోజుల పాటు 639 రైల్వే స్టేషన్లు, 180 రైళ్లలో స్వచ్ఛతా పక్వారా కార్యక్రమాలను అధికారులు నిర్వహించారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో చెత్త వేసేందుకు ప్రత్యేకంగా డస్ట్బిన్లు ఉన్నా, విచ్చలవిడిగా చెత్త విసురుతున్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 544 టన్నుల చెత్తను పోగేసిన అధికారులు.. చెత్తను విసురుతూ పట్టుబడ్డ 857 మంది నుంచి రూ.4.5 లక్షల జరిమానా వసూలు చేశారు. 21,685 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. పోగైన చెత్తలో 42 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలుండటం విశేషం. ఇక రైల్వే ప్రాంగణాల్లో 436 టన్నుల తుక్కును సేకరించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. 3,510 కి.మీ. నిడివిగల ట్రాక్‌ను కూడా ఈ సందర్భంగా శుభ్రం చేశారు. అయితే స్వచ్ఛతా పక్వారా పేరుతో ఎప్పుడో ఓసారి నిర్వహించే కార్యక్రమాలతో ఫలితం అంతగా ఉండదని, రైళ్లు, రైల్వే స్టేషన్లలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ చెత్త వేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం ద్వారా మార్పు తెచ్చేందుకు ప్రయతి్నంచాలనే సూచనలు వస్తున్నాయి. -
ఏ రైల్వే స్టేషన్ ఎప్పుడు పుట్టిందో?
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, కాజీపేట్,వరంగల్, ఖమ్మం.... ఇలాంటి ప్రముఖ రైల్వే స్టేషన్లు ఎప్పుడు స్థాపించారు.. ఎలా ఆవిర్భవించాయి ?.. వాటి పుట్టుకలో కీలక భూమిక ఎవరిది..?.. నాటి ఏ పరిస్థితి వల్ల అక్కడ స్టేషన్ ఏర్పాటైంది? –ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఇలాంటి వివరాల సేకరణలో తలమునకలై ఉన్నారు. ప్రత్యేకంగా కొంతమందిని ఇందుకోసం పురమాయించారు. సదరు సిబ్బంది ఆ వివరాల సేకరణకు ఉరుకులు పరుగులు మొదలుపెట్టారు. ఏ స్టేషన్ ఎప్పుడు ఏర్పడిందో వివరాలు తెలిస్తే.. వాటి పుట్టిన రోజు (ఆవిర్భావ దినోత్సవం) వేడుకలు నిర్వహిస్తారట. మోదీ చేసినప్రస్తావనే ఆదేశంగా భావిస్తూ.. ఇటీవల దేశవ్యాప్తంగా తొమ్మిది వందేభారత్ రైళ్లను రైల్వే శాఖ పట్టాలెక్కించింది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జెండా ఊపి వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన, ప్రజలను రైల్వేకు మరింత చేరువ చేసే క్రమంలో రైల్వే స్టేషన్లకు పుట్టినరోజు వేడుకలు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. తమిళనాడులోకి కోయంబత్తూరు, ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్ల భవనాలకు ఇటీవల స్థానిక రైల్వే అధికారులు ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. వీటిని ఉదహరించిన మోదీ, మిగతా వాటికి కూడా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కానీ, విధానపరంగా అలాంటి నిర్ణయం ఇప్పటి వరకు లేదని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నట్టుండి ప్రధాని స్వయంగా పేర్కొనేసరికి, వెంటనే కొన్ని స్టేషన్ భవనాలకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని, ఆయా స్టేషన్లతో అనుబంధం ఉన్న ప్రముఖులు, సాధారణ ప్రయాణికులను పెద్ద సంఖ్యలో పిలిపించి అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో, సమీపంలో ఏయే స్టేషన్ల ఆవిర్భావ రోజులున్నాయో గుర్తించే పనిలో పడ్డారు. వివరాలు సేకరిస్తున్నాం ‘‘రెండు స్టేషన్ల పుట్టినరోజు వేడుకలను ప్రధాని స్వయంగా ప్రస్తావించారు. కానీ, ఇప్పటి వరకు మాకు అలాంటి నిర్ణయంపై సమాచారం లేదు. ప్రధాని స్వయంగా చెప్పారంటే, ఆదేశాలతో సంబంధం లేకుండా మేం నిర్వహించాల్సిందే. అందుకే వివరాలు సేకరిస్తున్నాం’ అని ఓ ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. -
వీల్‌చైర్ వాడేవారి కోసం రైళ్లలో ర్యాంపులు
న్యూఢిల్లీ: వీల్‌చైర్ వాడే వారు, సీనియర్ సిటిజన్ల సౌకర్యం కోసం రైళ్లలో త్వరలో ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇందుకోసం కొత్తగా రూపొందించిన ర్యాంపుల ఫొటోలను శనివారం ఆయన విడుదల చేశారు. ఇలాంటి వాటిని ఇప్పటికే చెన్నై రైల్వే స్టేషన్లో వినియోగించి చూశామని, ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా అందిందన్నారు. త్వరలో వీటిని వందేభారత్ రైళ్లలో, ఆ తర్వాత మిగతా రైళ్లలోనూ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. టికెట్లు బుకింగ్ చేసుకునే సమయంలోనే వీటి అవసరముందనే విషయం ప్రయాణికులు తెలిపేందుకు వీలుగా మార్పులు చేస్తున్నామన్నారు. దాని ఆధారంగా సంబంధిత రైల్వే స్టేషన్లకు అలెర్ట్ వెళ్తుందని, దాన్ని బట్టి అక్కడి సిబ్బంది ర్యాంపును సిద్ధంగా ఉంచుతారని వివరించారు. బోగీ తలుపుల వద్ద వీటిని సునాయాసంగా ఏర్పాటు చేయొచ్చన్నారు. -
తెరపైకి మళ్లీ డబుల్ డెక్కర్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్లు సూపర్ సక్సెస్ కావటంతో, ఫెయిల్యూర్‌గా ముద్రపడ్డ డబుల్ డెక్కర్ రైళ్లపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఆక్యుపెన్సీ రేషియో లేక ఒక్కొక్కటిగా మూలపడుతూ వస్తున్న డబుల్ డెక్కర్ రైళ్లను మళ్లీ పట్టాలెక్కించి విజయవంతం చేయాలని భావిస్తోంది. బెర్తులు ప్రవేశపెట్టి.. డబుల్ డెక్కర్ రైళ్లు కేవలం పగటి వేళ మాత్రమే తిరిగేలా రైల్వే ప్రవేశపెట్టింది. దీంతో వాటిల్లో కేవలం చైర్ కార్ మాత్రమే ఉండేది. సాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగంతోనే వాటిని నడిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడిచే సూపర్ ఫాస్ట్ రైళ్లకు దాదాపు 11 గంటల ప్రయాణ సమయం పడుతోంది. రాత్రి వేళ కావటంతో సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణికులు పడుకుని ప్రయాణిస్తుండటంతో వారికి పగటి సమయం వృథా కావటం లేదు. కానీ, డబుల్ డెక్కర్ రైళ్లలో పగటి వేళ అన్ని గంటలు ప్రయాణించాల్సి రావటంతో ప్రయాణికులకు ఒక రోజు సమయం వృథా అయ్యేది. డబుల్ డెక్కర్ రైళ్లు ప్రారంభమైన కొత్తలోనే సికింద్రాబాద్–తిరుపతి, సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టారు. ఈ రెండు ప్రాంతాలకు వెళ్లే వారు పగటి సమయం మొత్తం రైళ్లలోనే గడపటంతో ఒక రోజు మొత్తం వృథా అయినట్టుగా భావించేవారు. ఫలితంగా వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో వారం రోజుల్లోనే 14 శాతానికి చేరింది. దీంతో ఆ రెండు సర్వీసులను రైల్వే రద్దు చేసింది. ఇటీవలే వందేభారత్ రైళ్లు పట్టాలెక్కి, అదే పగటి వేళ పరుగుపెడుతున్నా కిక్కిరిసిపోతున్నాయి. వాటి ఆక్యుపెన్సీ రేషియో 110 శాతం నుంచి 120 శాతంగా ఉంటోంది. వీటి వేగం ఎక్కువ కావటంతో, తక్కువ సమయంలోనే గమ్యం చేరుతున్నాయి. కానీ, వందేభారత్ తరహా లో అన్ని మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్ల వేగా న్ని పెంచటం సాధ్యం కాదు. దీంతో వాటిల్లో బెర్తులు ప్రవేశపెట్టి రాత్రి వేళ తిప్పే యోచనలో రైల్వే ఉంది. ప్రయాణికులతోపాటు సరుకులు కూడా.. ఇక పైడెక్‌లో ప్రయాణికులు, దిగువ డెక్‌లో సరుకులను ఏకకాలంలో తరలించే ప్యాసింజర్ కమ్ గూడ్స్ నమూనాలో కూడా డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే భావిస్తోందని సమాచారం. దీనికి సంబంధించి డిజైన్లను రైల్వే అనుబంధం సంస్థ ఆర్డీఎస్ఓ పరిశీలిస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. వెరసి డబుల్ డెక్కర్ రైళ్లకు మళ్లీ డిమాండ్ కల్పించాలని రైల్వే భావిస్తోంది. -
నేరం చేస్తే అంతే సంగతులు!
20 నెలల్లోనే ఉరి శిక్ష అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ మౌలాలి అదే గ్రామానికి చెందిన సరళమ్మ, గంగులమ్మలను హత్య చేసి అనంతరం 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో సమగ్రంగా దర్యాప్తు చేసిన పోలీసులు తగిన ఆధారాలతో సహా నిరూపించారు. దాంతో కేవలం 20 నెలల్లోనే విచారణ ప్రక్రియ పూర్తి చేసిన న్యాయస్థానం సయ్యద్ మౌలాలికి ఉరి శిక్ష విధించింది. ఆ ఇద్దరికీ 20 ఏళ్ల జైలు 2022లో బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో 2022లో ఓ యువతిపై పాలుబోయిన విజయ్‌కృష్ణ, పాలుచూరి నిఖిల్ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసును కూడా కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానంలో దర్యాప్తు చేసిన పోలీసులు 15 రోజుల్లోనే చార్జ్‌షిట్ దాఖలు చేశారు. తగిన ఆధారాలతో నేరాన్ని నిరూపించారు. దాంతో న్యాయస్థానం దోషులు పాలుబోయిన విజయ్ కృష్ణ, పాలుచూరి నిఖిల్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సాక్షి, అమరావతి: ఎవరైనా నేరానికి పాల్పడితే శిక్ష పడాల్సిందే అన్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. అందుకోసం కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ (నేరారోపణ ఆధారిత పోలీసింగ్) విధానాన్ని ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధిస్తోంది. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఏళ్ల కొద్దీ దర్యాప్తు.. ఆధారాల సేకరణకు నానా తంటాలు.. సుదీర్ఘ కాలం విచారణ.. వెరసి నేరం జరిగి ఏళ్లు గడుస్తున్నా దోషులు దర్జాగా బయట తిరిగే పరిస్థితి దశాబ్దాలుగా నెలకొంది. ఇలాంటి అస్తవ్యస్త విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముగింపు పలికింది. నేరానికి పాల్పడిన వ్యక్తి తప్పించుకోవడం అసంభవం అన్నట్టుగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసింది. దాంతో గతంలో ఎన్నడూలేని రీతిలో రాష్ట్రంలో నేరాలకు పాల్పడిన వారికి న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తున్నాయి. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ఇలా.. నేరాలకు పాల్పడే వారికి సత్వర శిక్షలు విధించేలా చేయడంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకోసం 2022 జూన్ నుంచి పోలీస్ స్టేషన్ల వారీగా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టింది. పోలీసు అధికారులకు ప్రత్యేకంగా కేసుల బాధ్యతలు అప్పగించింది. పోలీస్ జిల్లా యూనిట్ల అధికారులకు ఐదేసి కేసుల చొప్పున అప్పగించింది. ఆ కేసుల దర్యాప్తు, విచారణను వారు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీలకు పదేసి చొప్పున కేసులు అప్పగించి దర్యాప్తును సత్వరం పూర్తి చేసి చార్జిషిట్లు దాఖలు చేసేలా పర్యవేక్షించింది. దాంతో దోషులను గుర్తించి.. దోషులు చేసిన నేరాన్ని న్యాయస్థానాల్లో నిరూపించి శిక్షలు పడేలా చేస్తోంది. సత్వరమే శిక్షలు ఈ విధానం సత్పలితాలిస్తోంది. రాష్ట్రంలో ఏడాది కాలంగా నేరస్తులకు న్యాయస్థానాల ద్వారా సత్వరం శిక్షలు విధిస్తుండటమే ఇందుకు నిదర్శనం. అందులోనూ తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి అత్యంత కఠిన శిక్షలు విధించేలా చేయడం పోలీసు శాఖ సమర్థతకు అద్దం పడుతోంది. 2022 నుంచి ఇప్పటివరకు కన్విక్షన్ బేస్డ్ విధానంలో 122 కేసులను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వాటిలో ఏకంగా 109 కేసుల్లో తగిన ఆధారాలతో దోషులను గుర్తించి న్యాయస్థానాలు శిక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే దాదాపు 90 శాతం కేసుల్లో నేరస్తులకు సత్వరమే శిక్షలుపడటం రాష్ట్ర చరిత్రలోనే ఓ రికార్డు. నేరాల తీవ్రతను బట్టి దోషులకు కఠిన శిక్షలు విధించడం కూడా నేరస్తుల పట్ల పోలీసు వ్యవస్థ ఏమాత్రం ఉదాసీనంగా లేదన్న సందేశాన్నిస్తోంది. -
నేడు వివిధ మార్గాల్లో పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక కారణాల దృష్ట్యా వివిధ మార్గాల్లో 20 దూరప్రాంతాల రైళ్లను, నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే మరో 16 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 4 నుంచి 10 వరకు రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాజీపేట్–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రచాలం రోడ్–డోర్నకల్, కాజీపేట్–సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లా ర్ష– కాజీపేట్, సికింద్రాబాద్–వరంగల్, సి ర్పూర్ టౌన్–భద్రాచలం, వరంగల్– హైదరాబాద్, కరీంనగర్–సిర్పూర్టౌన్, కరీంనగర్–నిజామాబాద్, కాజీపేట్–బల్లార్ష, తదితర మార్గాల్లో రైళ్లు రద్దు కానున్నట్లు పేర్కొన్నారు. ఎంఎంటీఎస్‌లు రద్దు: ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–ఫలక్‌నుమా, ఉందానగర్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 16 సర్వీసులు రద్దు కానున్నట్లు వెల్లడించారు. -
వందే భారత్‌కు తప్పని రాళ్ల దెబ్బలు
ఇది సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు పరిస్థితి. ఏకంగా ఆరు కోచ్‌ల అద్దాలను ఆకతాయిలు పగలకొట్టేశారు. ఇటీవల ప్రారంభమై ప్రయాణికుల ఆదరణ చూరగొంటూ దాదాపు 115 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్న ఈ రైలును ఆకతాయిలు టార్గెట్‌గా చేసుకుంటున్నారు.– సాక్షి, హైదరాబాద్ వందేభారత్ రైళ్లపైనే కసిగా.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రైళ్లపై రాళ్ల దాడులు జరగటం ముందు నుంచీ ఉంది. కానీ వందేభారత్ రైళ్లు పట్టాలెక్కిన తర్వాత అది మరింతగా పెరిగింది. గత ఏడు నెలల్లో రాష్ట్రంలో దాదాపు 300 పర్యాయాలు రైళ్లపై దాడులు జరిగితే, అందులో వందేభారతపై జరిగినవే 50కి పైగా ఉండటం గమనార్హం. వెడల్పాటి అద్దాలుండటంతో వందేభారత్ రైళ్లకు ఈ రాళ్లదాడి తీవ్ర నష్టం చేస్తోంది. సాధారణంగా రైలు అద్దాలు పగిలితే, మెయింటెనెన్స్ సమయంలో వాటిని మార్చేస్తారు. కానీ, వందేభారత్ రైళ్ల అద్దాలు తరచూ పగిలిపోతుండటంతో వాటిని మార్చటం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం దక్షిణ మధ్య పరిధిలో సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో విశాఖపట్నం రైలు విశాఖలో మెయింటెయిన్ అవుతుండగా,తిరుపతి రైలు సికింద్రాబాద్‌లో అవుతోంది. వారానికి ఒక రోజు వీటికి సెలవు ఉండటంతో ఆ రోజు పూర్తిస్థాయిలో నిర్వహణ పనులు చేపడుతూ పగిలిన అద్దాలను మారుస్తున్నారు. బాగా పగిలితే మాత్రం వెంటనే మార్చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో అద్దాలను స్థానికంగా నిల్వ చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ డివిజన్‌లోనే ఎక్కువగా.. తాజాగా తిరుపతి రైలులో ఆరు కోచ్‌ల అద్దాలు పగలగా, విశాఖ రైలుకు మూడు కోచ్‌ల అద్దాలు పగిలాయి. ఈ ఏడాది రైళ్లపై జరిగిన 300 రాళ్ల దాడుల్లో ఎక్కువ సికింద్రాబాద్ డివిజన్‌లోనే చోటు చేసుకున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రైళ్లపై దాడుల విషయంలో నిందితులపై తీవ్రచర్యలుంటాయి. రైళ్లపై దాడి చేయటాన్ని జాతి ఆస్తి విధ్వంసంగా పరిగణిస్తూ కఠిన సెక్షన్లు దాఖలు చేస్తారు. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం పోతుంది. దాడి చేసి అలాంటి కేసులుకొని తెచ్చుకోవద్దని ఎంతగా ప్రచారం చేసినా ఆకతాయిలు వినటం లేదు. దీంతో ఆ సెక్షన్ల కింద గరిష్ట జైలు శిక్షలు విధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి పట్టుబడిన వారికి వీలైనంత ఎక్కువ కాలం జైలు శిక్ష పడే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
రైళ్లలో వాటర్ బాటిల్ కొంటున్నారా.. ఏ బ్రాండ్ అమ్మాలి.. రూల్స్ ఏంటి?
ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. రైలు ప్రయాణంలో ఎక్కువ మంది ఇబ్బందులు పడేది ఆహారం, నీళ్లతోనే. డబ్బు పెట్టినా సురక్షితమైన నీళ్లు లభించవు. చాలా సార్లు రైళ్లలో అసురక్షితమైన ఏవో లోకల్ బ్రాండ్ వాటర్ బాటిళ్లు విక్రయిస్తుంటారు. అయితే రైళ్లలో ఏ బ్రాండ్ వాటర్ బాటిళ్లు అమ్మాలో నిబంధనలు ఉన్నాయి. తాజాగా పోర్బందర్ ఎక్స్‌ప్రెస్ ప్యాంట్రీ కారు నుంచి అనధికారిక, నాసిరకం తాగునీటి బాటిళ్లను మొరాదాబాద్ రైల్వే స్టేషన్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం వాటర్ బాటిళ్ల విక్రయంపై ఓ సిబ్బందిలో ఒకరు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో రైల్వే అధికారులు వేగంగా చర్యలు తీసుకున్నారు. సుమారు 80 కేసులు లోకల్ బ్రాండ్‌కు చెందిన బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యుడైన మేనేజర్‌ను, మరికొంత మందిని అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే.. సీనియర్ డిప్యూటీ చీఫ్ మేనేజర్ (DCM) సుధీర్ కుమార్ సింగ్ ఈ సంఘటనపై మాట్లాడుతూ భారతీయ రైల్వేలలో ‘రైల్ నీర్’ బ్రాండ్ వాటర్ బాటిళ్లను మాత్రమే విక్రయించాలని, ఒకవేళ అవి అందుబాటులో లేకుంటే నిర్దిష్ట బ్రాండ్ నీటిని విక్రయించడానికి కచ్చితమైన ప్రోటోకాల్ ఉందని పేర్కొన్నారు. 'రైల్ నీర్' బ్రాండ్ వాటర్ బాటిళ్ల సరఫరా పుష్కలంగా ఉన్న నేపథ్యంలో వేరే బ్రాండ్లను విక్రయించాల్సిన పని లేదన్నారు. ‘రైల్ నీర్’ అనేది భారతీయ రైల్వేలో భాగమైన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRTC)కి చెందిన బాటిల్ వాటర్ బ్రాండ్. -
పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): వర్షాల కారణంగా హసనపర్తి–కాజీపేట సెక్షన్ మధ్యలో ట్రాక్‌లపై ప్రమాదకర స్ధాయిలో నీటి ప్రవాహం చేరుకోవడంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరి కొన్నింటిని అధికారులు దారి మళ్లించారు. సికింద్రాబాద్–సిర్పుర్ కాగజ్‌నగర్ (17233) రైలును ఈ నెల 27, సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్(17223) రైలును ఈ నెల 28న పూర్తిగా రద్దు చేశారు. సికింద్రాబాద్–ధనాపూర్ (12791)రైలును గురువారం కాజీపేట, విజయవాడ, దువ్వాడ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు. చెన్నై సెంట్రల్–అహ్మదాబాద్ (12656) రైలును వరంగల్లు, సికింద్రాబాద్, వాడి, సోలాపూర్, మన్మాడ్ మీదుగా దారి మళ్లించారు. చైన్నె సెంట్రల్–మాత వైష్ణోదేవి కాత్ర రైలును గుంటూరు, సికింద్రాబాద్, మన్మాడ్ మీదుగా దారి మళ్లించారు. రామేశ్వరం–బెనారస్ (22535) రైలును విజయవాడ, దువ్వాడ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు. హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు వర్షాల నేపథ్యంలో రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు వీలుగా విజయవాడ, ఒంగోలు, తెనాలి, సామర్లకోట, ఏలూరు, రాజమండ్రి స్టేషన్లతో పాటు గూడురు స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు విజయవాడ 0866–2576924, గూడూరు 7815909300 స్టేషన్లలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు గురువారం చెప్పారు. -
రైలు ప్రయాణంలో తకరారు.. వరంగల్ వరకే తిరుపతి–కరీంనగర్ రైలు..
కరీంనగర్: భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్నింటిని అధికారులు పాక్షికంగా రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లించారు. ఈ ఆకస్మిక పరిణామంతో జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రద్దు, పాక్షిక రద్దు, దారి మళ్లిన రైళ్ల వివరాలిలా ఉన్నాయి.. ► సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ గురు, శుక్రవారాల్లో రద్దయ్యాయి. ► సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ గురువారం రద్దవగా శుక్రవారం ఉదయం కూడా రద్దు చేశారు. ► సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఘన్పూర్–సికింద్రాబాద్ మధ్య నడుపుతున్నారు. ఘన్పూర్–కాగజ్‌నగర్ వరకు రద్దు చేశారు. ఈ మూడు రైళ్ల వల్ల నిత్యం హైదరాబాద్ వెళ్లాల్సిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ► తిరుపతి–కరీంనగర్ బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను వరంగల్‌కే పరిమితం చేశారు. వరంగల్–కరీంనగర్ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. పిల్లాపాపలతో తిరుమల దర్శనానికి వెళ్లిన వారంతా లగేజీతో వర్షంలో తడుస్తూ తిరిగి బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ► సికింద్రాబాద్–పాట్నా వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ పెద్దపల్లి, రామగుండం నుంచి వెళ్లాల్సి ఉండగా విజయవాడ మీదుగా దారి మళ్లించారు. ► చైన్నె–అహ్మదాబాద్ వెళ్లాల్సిన నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ను పెద్దపల్లి, మంచిర్యాల కాకుండా వాడి–సికింద్రాబాద్ మీదుగా మళ్లించారు. ► న్యూఢిల్లీ–హైదరాబాద్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను బల్లార్షా–ఆదిలాబాద్–ముత్కేడ్ జంక్షన్ మీదుగా నిజామాబాద్ నుంచి దారి మళ్లించారు. ► గోరక్‌పూర్–సికింద్రాబాద్ రైలును పెద్దపల్లి–కరీంనగర్– నిజామాబాద్ మీదుగా దారి మళ్లించారు. -
మరిన్ని ఫీచర్లతో వందే భారత్ రైళ్లు.. కొత్తగా ఏమేం ఉన్నాయంటే..?
చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ప్రాజెక్టు వందేభారత్ రైళ్లు. దేశమంతటా వేగంగా ప్రయాణించగల వందేభారత్ రైళ్లను ప్రధాన నగరాల మధ్య ఇప్పటికే ప్రవేశపెట్టారు. అయితే.. ఈ రైళ్లలో నాణ్యతపై విమర్శలు కూడా ఎక్కువగానే వచ్చాయి. ప్రయాణికులు కూడా కొన్ని లోపాలను రైల్వే శాఖకు ఫీడ్‌బ్యాక్‌లో ఇచ్చారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వందే భారత్ రైళ్లలో 25 రకాల మార్పులను చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఏమేం మార్పులంటే.. ► రైళ్లలో ప్రయాణికులు కూర్చునే కుషింగ్స్ గట్టిగా ఉన్న నేపథ్యంలో వాటిని మార్చనున్నారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునేలా మరిన్ని స్లాట్లను ఏర్పాటు చేయనున్నారు. ► సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఎక్కువగా వంగేలా సీటును ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ సీట్ల రంగును రెడ్ నుంచి బ్లూకు మార్చనున్నారు. కోచ్‌లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్ ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నారు. దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా వీల్ ఛైర్ ఫిక్సింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ► అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్‌తో మాట్లాడేందుకు ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో బోర్డర్‌లెస్ ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్ బాక్స్ కవర్లో మార్పులు చేయనున్నారు. ► వందే భారత్ రైళ్లలో కోచ్‌ల మధ్య మెరుగైన కనెక్టివిటీ కోసం యాంటీ క్లైంబర్స్ అనే కొత్త భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యవస్థను వందే భారత్‌తోపాటు, అన్ని రైళ్లలో ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ► మెరుగైన ఎయిర్ కండీషనింగ్ కోసం ఎయిర్‌టైట్ ప్యానల్స్‌లో మార్పులు చేయనున్నారు. అత్యవసర సమయాల్లో రైలును ఆపేందుకు ఉపయోగించే ఎమర్జెన్సీ పుష్ బటన్‌ను లోకో పైలట్‌కు సులువుగా యాక్సెస్ చేసేందుకు వీలుగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ► నీరు బయటకు రాకుండా వాష్ బెసిన్ లోతులను పెంచనున్నట్లు తెలిపారు. టాయిలెట్స్‌లో లైటింగ్ సిస్టమ్స్ మెరుగుపరచనున్నట్లు పేర్కొన్నారు. ► త్వరలో రిజర్వేషన్ చేయించుకోనివారికి కూడా అధునాతన సదుపాయాలతో కోచ్‌లను తయారు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దశలవారిగా వందే భారత్ రైళ్లకు మరిన్ని సదుపాయాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: Gyanvapi Case Updates: జ్ఞానవాపిలో పురావస్తు సర్వేకు బ్రేక్.. సుప్రీం కీలక ఆదేశాలు -
డ్రైవర్ లేకుండా మెట్రో రైలు
వాహనం నడపాలంటే డ్రైవర్లు తప్పనిసరి. కానీ ఆధునిక సాంకేతికత డ్రైవర్ల అవసరం లేకుండా ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తోంది. పాశ్యాత్య దేశాలలో డ్రైవర్‌లెస్ కార్లు ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. అలాగే ఐటీ సిటీలో డ్రైవర్లతో నిమిత్తం లేకుండా మెట్రో రైళ్లు పరుగులు తీయబోతున్నాయి. కంట్రోల్ రూం నుంచి రైలు గమనాన్ని పర్యవేక్షిస్తారు. డ్రైవర్లకు అనారోగ్యం, సమ్మె వంటి సమస్యలతో ఇబ్బంది ఉండదు. బనశంకరి: బెంగళూరులో డ్రైవర్లు లేకుండానే మెట్రో రైళ్లు దూసుకుపోనున్నాయి. ఈ ఏడాది చివరిలో ప్రారంభిస్తున్నట్లు బీఎంఆర్సీఎల్ అధికారులు తెలిపారు. దీనికి కావలసిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 2020 డిసెంబరులో దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. తరువాత దేశ ఆర్థిక రాజధాని ముంబై లో డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు వచ్చాయి. ఆగస్టులో తమిళనాడు రాజధాని చైన్నెలో అమలులోకి రానుంది. ఇప్పుడు ఐటీ సిటీలో శ్రీకారం చుట్టబోతున్నారు. ఆర్వీ రోడ్డు– బొమ్మసంద్ర మార్గంలో 19 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ గా ఉన్న గులాబీ లైన్లో (ఆర్వీ రోడ్డు– బొమ్మసంద్ర) ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది, నిజానికి గత ఏడాది పూర్తి కావలసి ఉంది. కానీ కోవిడ్ కారణంగా పనులు ఆలస్యం కావడంతో ఈ ఏడాది చివరిలో ప్రారంభించే కారిడార్‌లో డ్రైవర్ రహిత మెట్రో నడపడానికి బీఎంఆర్సీఎల్ సన్నాహాలు చేస్తోంది. సీబీటీసీ సిగ్నలింగ్ ఆధారంగా డ్రైవర్లు లేకుండా ఈ రైళ్లు పరుగులు తీస్తాయని మెట్రో వర్గాలు తెలిపాయి. ఇంటర్‌చేంజ్‌గా సిల్క్‌బోర్డు స్టేషన్ నమ్మ మెట్రో గులాబీ మార్గం నిర్మాణదశలో ఉండగా దీని పొడవు 18.82 కిలోమీటర్లు. ఈ మార్గాన్ని ఆర్వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర కు అనుసంధానిస్తారు. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్ కాగా 16 స్టేషన్లు కలిగి ఉంది. ఆర్వీ రోడ్డు స్టేషన్ టెర్మినల్ స్టేషన్ కాగా గ్రీన్ లైన్‌తో ఇంటర్చేంజ్ కల్పిస్తారు. సిల్క్‌బోర్డు స్టేషన్ గులాబీలైన్, నీలి లైన్ మధ్య మరో ఇంటర్ చేంజ్ స్టేషన్ కానుంది. గులాబీ లైన్‌ను మొదట్లో బొమ్మసంద్ర వరకు ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇప్పుడు బొమ్మసంద్ర నుంచి తమిళనాడులోని హోసూరు పట్టణం వరకు విస్తరించడానికి కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎలా పనిచేస్తాయంటే ► డ్రైవర్ రహిత రైళ్లను నడపడానికి మెట్రో రైల్వేలో సాంకేతికంగా మార్పులు చేశారు. ఆధునిక సీబీటీసీ సిగ్నలింగ్ వ్యవస్థలను అమర్చారు. ఇది రైళ్లు స్వయంచాలితంగా సంచరించడానికి సహాయపడుతుంది. ►గులాబీ (పర్పుల్) లైన్‌కు సీబీటీసీ సాంకేతికతను అమర్చారు. ఎలక్ట్రానిక్ సిటీ, గొట్టిగెరె, నాగవార, సిల్క్‌బోర్డు, కెంపేగౌడ విమానాశ్రయం లాంటి కొత్త మార్గాల్లో సీబీటీసీ వ్యవస్థను అమర్చుతారు. ►డ్రైవర్ రహిత మెట్రోరైలులో డ్రైవర్ ఉండరు, ఒక అటెండర్ మాత్రం ఉంటారు, అత్యవసరం అనుకుంటే అటెండర్ డ్రైవింగ్‌ను తీసుకుంటారు. డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడేళ్లు సంచరిస్తే ఆ అటెండర్ అవసరం కూడా ఉండదని మెట్రో అధికారులు తెలిపారు. ►ప్రతి రైలును కంట్రోల్ రూమ్ కేంద్రాల ద్వారా పర్యవేక్షిస్తారు. -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అదే నిజమైతే బడ్జెట్ ధరలో లగ్జరీ ప్రయాణం!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. విలాసవంతమైన వందే భారత్ ట్రైన్లు ఇకపై సామాన్యులకు సైతం అందుబాటులోకి రానున్నాయి. తక్కువ టికెట్ ధరతో నాన్ ఏసీ ట్రైన్ సర్వీసులు ప్రయాణికులకు అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అప్‌గ్రేడ్ చేసిన సెకండ్ క్లాస్ అన్ రిజర్డ్వ్, సెకండ్ క్లాస్ 3-టైర్ స్లీపర్ కోచ్‌లతో వందే సాధారణ్ పేరుతో కొత్త ట్రైన్లను తయారు చేయించేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, వందే సాధారణ్ ట్రైన్లపై భారత రైల్వే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకే వేళ ఇదే నిజమైతే మెరుగైన ప్రయాణం చేసే సౌలభ్యం కలగనుంది. ఇక బడ్జెట్ ధరలో ప్రయాణించేందుకు వీలుగా తయారు చేయనున్న వందే సాధారణ్ ట్రైన్ ఫీచర్లు వందే భారత్ ఎక్స్ ప్రెస్ తరహాలో ఉండనున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాదిరిగా కాకుండా లేటెస్ట్ రైలు లోకో లాగింగ్ ఉంటుంది. అన్నీ రైళ్లు ఒక లోకోమోటివ్ (ఇంజిన్)తో ప్రయాణికులకు సేవల్ని అందిస్తుండగా..దీనికి రెండు వైపులా లోకోమోటివ్ ఉంటాయి. ప్రతి చివరలో లోకోమోటివ్‌తో పాటు, ట్రైన్ వేగం కోసం పుష్-పుల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. ట్రైన్లు చివరి గమ్య స్థానానికి చేరుకున్న వెంటనే ..స్టేషన్ వద్ద లోకోమోటివ్ సదరు ట్రైన్ నుంచి విడిపోనుంది. తద్వారా టర్న్ రౌండ్ సమయం తగ్గుతుంది. ఈ కొత్త ట్రైన్ల కోసం లోకోమోటివ్లను చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్‌డబ్ల్యూ)లో, కోచ్‌లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)లో తయారు చేస్తారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తయారు చేస్తున్న ఏకైక భారతీయ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐసిఎఫ్ ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త రైలు ఎలా ఉండబోతుంది. అందులోని సౌకర్యాలు ఎలా ఉండనున్నాయని రైల్వే బోర్డ్ నిర్ధేశించిన అక్టోబర్ నాటికి వెలుగులోకి రానున్నాయి. లింకే హాఫ్మన్ బుష్ (LHB) కోచ్ అనేది ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఒక ప్యాసింజర్ కోచ్. ఇందులో 2 సెకండ్ లగేజీ, గార్డ్ అండ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ కోచ్‌లు, 8 సెకండ్ క్లాస్ అన్ రిజర్డ్వ్ కోచ్‌లు, 12 సెకండ్ క్లాస్, 3 టైర్ స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. అన్ని బోగీలు నాన్ ఏసీగా ఉంటాయి. చదవండి👉 నైట్ షిఫ్ట్‌లు నిషేధం.. కంపెనీ తీసుకున్న నిర్ణయం ఎంత పనిచేసిందంటే -
ఇండియా ఫస్ట్ ఏసీ ట్రైన్ - ఆశ్చర్యగొలిపే నిజాలు!
మన దేశంలో ఈ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే విస్తరించి ఉంది. అయితే ఒకప్పుడు అంటే భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు రైల్వే అనేది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు ట్రైన్లో ఉండే జనరల్, ఏసీ, స్లీపర్ వంటి కోచ్‌లు ఉండేవి కాదు కేవలం ఫస్ట్ (ఏసీ కోచ్) అండ్ సెకండ్ క్లాసులు మాత్రమే ఉండేవి. ఈ ఏసీ కోచ్‌లు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఎక్కడ మొదలయ్యాయి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏసీ కోచ్ లేదా ఫస్ట్ క్లాసులో కేవలం బ్రిటీష్ వారు మాత్రమే ప్రయాణించాలి. వారి అవసరాలకు అనుగుణంగా చల్లగా ఉండటానికి ఏసీ బోగీలను ఏర్పాటు చేసుకున్నారు. భారతీయులకు వీటిలోకి అనుమతి ఉండేది కాదు. ఇండియన్స్ సెకండ్ క్లాసులోనే ప్రయాణించాలి. ఏసీ బోగీలుగా పిలువబడే వాటికి ఏసీలకు బదులు ఐస్ బ్లాక్స్ ఉపయోగించే వారు. వీటిని నేరుగా ఫ్లోర్‌లోనే ఉంచేవారని తెలుస్తోంది. ఈ రైలు మొదట 1928లో ముంబైలోని బల్లార్డ్ పీర్ స్టేషన్ నుంచి ఢిల్లీ, బటిండా, ఫిరోజ్‌పూర్, లాహోర్ మీదుగా ప్రయాణించేది. ఆ తరువాత 1930లో సహరాన్ పూర్, అంబాలా, అమృత్సర్, లాహోర్కి మళ్లించారు. ఈ రైలు పేరు 'ఫ్రాంటియర్ మెయిల్' (Frontier Mail). ఆ తరువాత ఇది 1996లో గోల్డెన్ టెంపుల్ మెయిల్ పేరుతో వినియోగంలో ఉండేది. (ఇదీ చదవండి: రైతు దశ తిప్పిన టమాట.. ఇది చూస్తే ఆగుతుంది నోటమాట!) ఫ్రాంటియర్ మెయిల్ ప్రత్యేకతలు.. నిజానికి ఫ్రాంటియర్ మెయిల్ అనేది బ్రిటీష్ వారి కాలంలో అత్యంత విలాసవంతమైన ట్రైన్. కొన్ని నివేదికల ప్రకారం ఇది సుమారు 35 రైల్వే స్టేషన్స్‌లో ఆగుతూ 1893 కిమీ ప్రయాణిస్తుందని సమాచారం. ఒక సారికి ఇది 1300 మంది ప్రయాణికులను తీసుకెళ్లేదని, టెలిగ్రామ్స్ వంటి వాటిని తీసుకెళ్లడానికి కూడా దీన్ని ఉపయోగించేవారని తెలుస్తోంది. -
పరోక్షంగా పార్టీ ప్రచారం కూడా జరుగుతుంటుంది!
పరోక్షంగా పార్టీ ప్రచారం కూడా జరుగుతుంటుంది! -
రైలు ప్రయాణికులకు ఊరట.. ఏసీ రైళ్లలో తగ్గనున్న ఛార్జీలు..
న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సహా 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉండే అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ల ఛార్జీలను 25 శాతం మేర తగ్గించనున్నట్లు రైల్వే బోర్డు శనివారం తెలిపింది. అనుభూతి, విస్తాడోమ్ కోచ్‌లు సహా ఏసీ సౌకర్యం ఉండే అన్ని రైళ్లకు ఇది వర్తిస్తుందని వివరించింది. ఇతర వాహన ప్రయాణ ఛార్జీలను బట్టి కూడా రాయితీని నిర్ణయిస్తామని పేర్కొంది. వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా ఏసీ కోచ్‌ల్లో ప్రయాణాలపై డిస్కౌంట్ పథకాలను ప్రకటించే అధికారాన్ని జోనల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయించిందని కూడా వివరించింది. ‘ప్రాథమిక ఛార్జీపై గరిష్టంగా 25 శాతం వరకు రాయితీ ఉంటుంది. రిజర్వేషన్ ఛార్జ్, సూపర్ ఫాస్ట్ సర్‌చార్జ్, జీఎస్టీ మొదలైన తదితర ఛార్జీలు అదనం. ఆక్యుపెన్సీ ఆధారంగా ఏదైనా లేదా అన్ని తరగతులలో డిస్కౌంట్ అందించవచ్చు’అని రైల్వే బోర్డు పేర్కొంది. ‘గత 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న కొన్ని సెక్షన్లలోని రైళ్లలో విభాగాల వారీగా రాయితీ ఉంటుంది. డిస్కౌంట్ పథకం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు చార్జీల వాపస్ ఉండదు’అని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండే, కొన్ని తరగతులకు ఫ్లెక్సీ ఫేర్ అమల్లో ఉన్న కొన్ని రైళ్లకు ఈ రాయితీ పథకం వర్తించదు. పండగలు, సెలవు రోజుల్లో ప్రత్యేకంగా నడిపే రైళ్లల్లో రాయితీ ఉండదు. రాయితీ స్కీమ్ వందేభారత్ రైళ్లకు కూడా వర్తిస్తుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఇదీ చదవండి: టేకాఫ్ కష్టమని దింపారు -
రైళ్లలో అరకొరగా ఆన్‌బోర్డు సేవలు
సాక్షి, హైదరాబాద్: రైలు బోగీల పరిశుభ్రత, ఇతర నిర్వహణకు సంబంధించిన ఆన్‌బోర్డు సేవలు సరిగా లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది. బోగీల్లో చెత్తా చెదారం పేరుకుపోవడం, ప్రయాణికులు తిని వదిలేసిన, పడేసిన తినుబండారాల వల్ల ఎలుకలు, బొద్దింకలు వంటివి పెరిగిపోతున్నాయి. విద్యుత్ వైర్లను ఎలుకలు కొరికేయడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఒకట్రెండు సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి కూడా. బోగీల్లో ఎలుకలు, బొద్దింకలపై ప్రయాణికులు తరచూ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నా అధికారుల్లో చలనం లేదనే విమర్శలు వస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఆన్‌బోర్డు సేవలు దెబ్బతిని కోవిడ్ సమయంలో కొన్ని నెలలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అన్ని రకాల ప్రయాణికుల సేవలకూ బ్రేక్ పడింది. తర్వాత దశలవారీగా రైళ్లన్నీ పట్టాలెక్కినా.. ఆన్ బోర్డు సేవలను అందజేసే ప్రైవేట్ సంస్థలతో పూర్తిస్థాయి ఒప్పందాలు మాత్రం కుదుర్చుకోలేదు. ఒప్పందం చేసుకున్న పలు కాంట్రాక్టు సంస్థలు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయక బోగీల నిర్వహణ అధ్వానంగా మారుతోందని.. దీనితో కొన్ని రైళ్లలో ఆన్‌బోర్డు సేవలు సరిగా అందడం లేదని, చాలా రైళ్లలో ఇటీవలివరకు బెడ్‌రోల్స్‌ను కూడా అందజేయలేకపోయారని అధికారులు చెప్తున్నారు. తరచూ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు గతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉండగానే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు బోగీల్లో మంటలు వచ్చాయి. మరోసారి సికింద్రాబాద్ స్టేషన్లోనే చెన్నైకి వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా షార్ట్‌సర్క్యూట్ జరిగి బోగీలు దెబ్బతిన్నాయి. నాంపల్లి స్టేషన్లో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఇదే తరహా ప్రమాదానికి గురైంది. తాజాగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోనూ ఐదు బోగీలు కాలిపోయాయి. -
చరిత్ర సృష్టించిన హైదరాబాద్ మెట్రో.. 40 కోట్ల మంది ప్రయాణం
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ చరిత్ర సృష్టించింది. నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాణికుల సంఖ్య 40 కోట్లకు చేరుకుంది. 2017 నవంబర్ 29న నగరంలో మెట్రో సేవలను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తొలుత నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు మెట్రో రైలు పరుగులు తీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్ మీదుగా మియాపూర్ వరకు.. నాగోల్ నుంచి అమీర్‌పేట్ మీదుగా రాయదుర్గం వరకు మెట్రో రైళ్లు పరుగులు తీశాయి. అదేవిధంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో అందుబాటులోకి వచ్చింది. దశలవారీగా ప్రయాణికుల రద్దీతో పాటే ట్రిప్పుల సంఖ్య సైతం పెరిగింది. ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సుమారు వెయ్యి ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ మార్గాల్లో ట్రిప్పుల సంఖ్యను పెంచేందుకు హెచ్ఎంఆర్ చర్యలు చేపట్టింది. అంచెలంచెలుగా.. నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ప్రయాణికుల నుంచి ఆదరణ లభించింది. ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు మెట్రో సేవలను గణనీయంగా వినియోగించుకున్నారు. క్రమంగా విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు మెట్రో శాశ్వత ప్రయాణికులుగా మారారు. ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 4.90 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. త్వరలో ఈ సంఖ్య 5 లక్షలు దాటనున్నట్లు పేర్కొన్నారు. రోజుకు 6.70 లక్షల మంది ప్రయాణం చేసేందుకు అనుగుణంగా మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రయాణికుల్లో ప్రతిరోజూ 1.20 లక్షల మంది విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. మరో 1.40 లక్షల మంది సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నట్లు ఎండీ వెల్లడించారు. -
40 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలిక హాల్ట్‌లు.. స్పందన ఉంటే కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 40 ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపుల జాబితాను పెంచింది. ఇక నుంచి కొన్ని స్టేషన్లలో తాత్కాలికంగా ఆగనున్నట్లు పేర్కొంది. ఆరు నెలలు పరిశీలించి, ప్రయాణికుల నుంచి స్పందన మెరుగ్గా ఉంటే కొనసాగిస్తామని తెలిపింది. తిరుపతి–లింగంపల్లి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, చెన్నై–సికింద్రాబాద్–విశాఖ ఎక్స్‌ప్రెస్, నాగర్సోల్–నర్సాపూర్, లింగంపల్లి–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, భద్రాచలం రోడ్డు– బల్లార్షా ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం–పట్నా ఎక్స్‌ప్రెస్, మైసూరు–దర్బంగా భాగమతి ఎక్స్‌ప్రెస్, రామేశ్వరం–బెనారస్ ఎక్స్‌ప్రెస్, హజ్రత్ నిజాముద్దీన్–తిరుపతి çసంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–మణుగూరు ఎక్స్‌ప్రెస్, చార్మినార్–పద్మావతి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్, ధర్మవరం–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, కొండవీడు ఎక్స్‌ప్రెస్, యశ్వంతపూర్–లక్నో ఎక్స్‌ప్రెస్, కాచిగూడ–చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్, లోకమాన్య తిలక్–మధురై ఎక్స్‌ప్రెస్, లోకమాన్య తిలక్–కరైకల్ ఎక్స్‌ప్రెస్, నాగర్‌కోయల్–సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్, నాగర్‌కోయల్– కాచిగూడ ఎక్స్‌ప్రెస్, చెంగల్పట్టు–కాకినాడ ఎక్స్‌ప్రెస్, డెల్లా ఎక్స్‌ప్రెస్, హిమసాగర్ ఎక్స్‌ప్రెస్, పూరి–తిరుపతి ఎక్స్‌ప్రెస్, బిలాస్పూర్–ఎక్స్‌ప్రెస్, తిరుపతి–కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్, రాప్తి సాగర్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్–కాచిగూడ ఎక్స్‌ప్రెస్, సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్, యలహంక–కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లలో కొన్ని తాత్కాలిక స్టాపులను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు, సంఘాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల ఆధారంగా దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. -
పట్టాలెక్కిన మరో ఐదు వందే భారత్ రైళ్లు.. పచ్చ జెండా ఊపిన ప్రధాని..
భోపాల్: మధ్యప్రదేశ్ నుంచి ఐదు వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. వీటిలో రెండిటిని ప్రత్యక్షంగా ప్రారంభించగా మూడింటిని మాత్రం వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో ప్రధాని ప్రకటించిన 75 వందే భారత్ రైళ్లలో ఇప్పటికి 23 రైళ్లు పట్టాలెక్కాయి. మధ్యప్రదేశ్ షాహ్ధూల్ జిల్లాలో పర్యటించిన ప్రధాని మొదట భోపాల్ రాణి కమలాపాటి రైల్వే స్టేషన్ చేరుకుని భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్ పూర్ మధ్య వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం గోవా- ముంబై, ధార్వాడ్-బెంగుళూరు, హతియా-పాట్నా వందేభారత్ రైళ్లను కూడా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈరోజు ప్రారంభించిన రైళ్లు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచుతాయని.. మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల మధ్య అనుబంధాలను మరింత మెరుగుపరుస్తాయని అన్నారు. వాణిజ్యపరంగా, పర్యాటకంగా కూడా ఈ కనెక్టివిటీ ఉపయోగపడుతుందని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని సుమారు 10 లక్షల మంది బూత్ స్థాయి కార్యకర్తలతో వర్చువల్ గా సమావేశం కానున్నారు. అనంతరం దేశంలోని 3000 మంది బూత్ స్థాయి కార్యకర్తలతో కూడా మాట్లాడనున్నారు. #WATCH | Madhya Pradesh | PM Narendra Modi flags off five Vande Bharat trains from Rani Kamlapati Railway Station in Bhopal. Vande Bharat trains that have been flagged off today are-Bhopal (Rani Kamalapati)-Indore Vande Bharat Express; Bhopal (Rani Kamalapati)-Jabalpur Vande… pic.twitter.com/N4a72zwR0m — ANI (@ANI) June 27, 2023 ఇది కూడా చదవండి: దేశంలో ఏం జరుగుతోందో తెలియాలంటే మణిపూర్ వెళ్లి చూడండి.. -
అలర్ట్: ఈ రూట్లలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ)/తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): సౌత్ ఈస్ట్రన్ రైల్వేలోని ఖరగ్‌పూర్–భాద్రక్ సెక్షన్లో జరుగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణంగా ఆయా మార్గంలో నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఆదివారం షాలీమార్–హైదరాబాద్ (18045/18046), సత్రగచ్చి–తిరుపతి (22855), గౌహతి–సికింద్రాబాద్ (02605), హౌరా–పుదుచ్చేరి (12867), చెన్నై సెంట్రల్– సత్రగచ్చి (22808), మైసూర్–హౌరా (22818) రైళ్లు రద్దు అయ్యాయి. ఈ నెల 19న తిరుపతి–సత్రగచ్చి (22856), సికింద్రాబాద్–అగర్తల (07030), యర్నాకులం–హౌరా (22878) రైళ్లను రద్దు చేశారు. వందేభారత్ రీషెడ్యూల్ విశాఖలో శనివారం ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం– సికింద్రాబాద్(20833) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.10 గంటలకు బయల్దేరింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి శుక్రవారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరాల్సి ఉండగా సుమారు 10 గంటలు ఆలస్యంగా శనివారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంది. అందువల్ల విశాఖ నుంచి సుమారు 8 గంటలు ఆలస్యంగా బయల్దేరింది. చదవండి: అగ్నివీరులొచ్చేశారు.. -
ప్యాసింజర్ రైళ్లకు మంగళం
స్వాతంత్రోద్యమ కాలం నుంచి రైళ్లు ప్రజల జీవితాలతో ముడిపడి ఉండేవి. రోడ్డు మార్గాలు, రవాణా సాధనాలు అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో పేద, మధ్య, ఎగువ తరగతి ప్రజలకు ప్రయాణ సాధనం రైలు మాత్రమే. దీంతో రైల్వే శాఖ నిరంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పనిచేసేది. కాలక్రమేణా ఆధునికత సంతరించుకున్న రైల్వే శాఖ సేవామార్గాన్ని విస్మరించి లాభార్జనే పరమావధిగా పనిచేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి, వాటిని ఎక్స్‌ప్రెస్‌లుగా మర్పు చేయడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయాణం భారంగా మారింది. ఏలూరు (టూటౌన్): ఒక నాడు అధికంగా కనిపించే ప్యాసింజర్ రైళ్లు క్రమేణా కనుమరుగయ్యాయనే చెప్పవచ్చు. ఎక్కడో కొన్ని మార్గాల్లో మినహా ప్యాసింజర్ రైళ్లు అనేవి కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా విజయవాడ డివిజన్ పరిధిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి–విజయవాడ ప్యాసింజర్ రైలు ప్రతి రోజు అప్ అండ్ డౌన్‌గా తిరిగేది. ఇది పేద ప్రజలకు, నిత్యం ప్రయాణించే చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు అక్కరకు వచ్చేది. ఉదాహరణకు ఏలూరు నుంచి కేవలం రూ.15 చార్జీతో విజయవాడ ప్రయాణం చేసి మళ్లీ సాయంత్రం తిరిగి వచ్చే వెసులుబాటు ఉండేది. అంటే ఒక ప్రయాణికుడు కేవలం రూ.30 ఖర్చుతో ఏలూరు నుంచి విజయవాడ వెళ్లి వచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ రైలు ఎక్స్‌ప్రెస్‌గా మార్చి వేశారు. అలాగే చార్జీలు పెద్ద ఎత్తున పెంచి వేశారు. దీంతో గతంలో కిక్కిరిసి ఉండే ప్రయాణికులు ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చిన తరువాత నామమాత్రంగానే కనిపిస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి విజయవాడ వచ్చే ఫాస్ట్ ప్యాసింజర్ రైలు సైతం నేడు ఎక్స్‌ప్రెస్ రైలుగా రూపాంతరం చెందింది. సుదూర ప్రాంతం నుంచి వచ్చే రాయగడ–గుంటూరు ప్యాసింజర్ సైతం ఎక్స్‌ప్రెస్‌గా మార్చి వేశారు. దీంతో ఈ ప్రాంతం నుంచి విశాఖపట్టణం, శ్రీకాకుళం, రాయగడ ప్రాంతాలకు వెళ్లే వలస కూలీలు, సాధారణ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పాత సీసాలో కొత్త సారా నింపినట్లు గతంలో నడిచే ప్యాసింజర్ రైళ్లనే ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి వేసి పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తున్నారే తప్ప ఆ రైళ్లల్లో అదనంగా ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. స్లీపర్ బోగీలు కుదింపు.. ఏసీ బోగీలు పెంపు రైళ్లలో ప్రయాణించే జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల విషయంలో రైల్వే శాఖ పట్టించుకోవడం లేదనేది ప్రయాణికుల వాదనగా ఉంది. రద్దీ ఉండే అనేక రైళ్లలో ఏసీ బోగీల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నారు. ఇదే సమయంలో జనరల్, స్లీపర్ బోగీల సంఖ్యను కుదిస్తున్నారు. భువనేశ్వర్ నుంచి బెంగుళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో గతంలో స్లీపర్ బోగీలు 10, ఏసీ బోగీలు 3 ఉండేవి. తాజాగా స్లీపర్ బోగీలను ఆరుకు తగ్గించి, ఏసీ బోగీలను ఆరుకు పెంచారు. అలాగే విశాఖపట్టణం–హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో గతంలో స్లీపర్ బోగీలు 12 ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య ఏడుకు తగ్గించి, ఏసీ బోగీలను మూడు నుంచి ఏడుకు పెంచారు. ఇలా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ బోగీలను తగ్గించి, ఏసీ బోగీలను పెంచడం వల్ల సాధారణ ప్రజలకు రైలు ప్రయాణం అందని ద్రాక్షలా చేస్తున్నారనేది ప్రయాణికుల వాదనగా ఉంది. రైళ్ల రద్దుతోనూ తప్పని అవస్థలు ఇటీవల ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో పాటు ట్రాక్‌ల మెయింట్‌నెన్స్ పేరుతో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. నిత్యం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండే విజయవాడ–విశాఖపట్టణం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–విశాఖపట్టణం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్, కాకినాడ పోర్టు–విజయవాడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును పలు పర్యాయాలు రద్దు చేస్తుండటంతో వాటిలో ప్రయాణించేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు నిత్యం ప్రయాణించే రైళ్లే. వీటిని పలు కారణాలతో ఎక్కువ సార్లు రద్దు చేస్తుండటంతో నిత్యం ప్రయాణించే వారి బాధలు వర్ణనాతీతంగా చెప్పుకోవచ్చు. ఆదాయం బాగుంటేనే గ్రీన్‌సిగ్నల్ పలు కారణాలతో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్న రైల్వే శాఖ అంతరాష్ట్ర సర్విసులను, రైల్వేకు అధిక ఆదాయం తెచ్చే వందేభారత్ వంటి రైళ్ళను మాత్రం యధావిధిగా నడపడంపై సాధారణ ప్రయాణికులు విమర్శలు చేస్తున్నారు. భిన్నమతాలు, భాషలు, ప్రాంతాలను కలిపే రైళ్లు నేడు లాభాలు తెచ్చే మార్గాల వైపే దృష్టి సారించడం శోచనీయమంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్లీపర్ బెర్త్ దొరకడమే కష్టమే స్లీపర్ క్లాస్ బోగీల సంఖ్యల తగ్గించి వేస్తుండటంతో రిజర్వేషన్ దొరకడమే కష్టంగా మారింది. నెల ముందు రిజర్వేషన్ కోసం ప్రయత్నించినా వెయిటింగ్ లిస్ట్ వస్తోంది. గతంలో నాలుగు రోజుల ముందు ప్రయత్నిస్తే స్లీపర్ క్లాస్‌లో రిజర్వేషన్ దొరికేది. సామాన్య, మధ్యతరగతి ప్రయాణికుల పట్ల రైల్వే శాఖ శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. – కొరబండి బాబూరావు, సామాజిక కార్యకర్త, ఏలూరు -
‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ వేగంతో చేరుకున్నామా లేదా..’
‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ వేగంతో చేరుకున్నామా లేదా..’ అనే డైలాగ్ ప్రయాణికులు చెప్పుకునేలా.. సరికొత్త ఆధునిక రైల్వే లైన్ల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ మీదుగా శంషాబాద్, విశాఖ నుంచి విజయవాడ మీదుగా కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైలు మార్గాలు రానున్నాయి. ఈ రెండు మార్గాలకు సంబంధించిన పీఈటీఎస్ సర్వే నిర్వహించేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది. సాక్షి, విశాఖపట్నం : రైళ్ల వేగంలో మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే వందేభారత్ రైళ్లతో కొత్త శకానికి నాంది పలికిన భారతీయ రైల్వే శాఖ.. ఇప్పడు అంతకు మించి అన్నట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్ని కలుపుతూ అత్యాధునిక సెమీ హై స్పీడ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌ల సామర్థ్యం 110 నుంచి గరిష్టంగా 150 కిలోమీటర్లు. ముఖ్య నగరాల్ని కలుపుతూ గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విధంగా సెమీ హైస్పీడ్ రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. మూడు రాజధానుల్ని అనుసంధానం చేస్తూ.. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా.. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి కానున్నాయి. తాజాగా వస్తున్న రైల్వే లైన్లు కూడా ఈ మూడు రాజధానుల్ని అనుసంధానిస్తున్నట్లుగానే డిజైన్ చేశారు. అదేవిధంగా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో ఈ లైన్లు అనుసంధానం కానున్నాయి. అంటే.. శంషాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్ వరకూ ఈ సెమీ హైస్పీడ్ రైలు మార్గాలు రానున్నాయి. మొత్తం 942 కిలోమీటర్ల మేర.. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయేలా ట్రాక్‌లు నిర్మించనున్నారు. 5 గంటల్లో విశాఖ టూ హైదరాబాద్ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోవాలంటే 11 నుంచి 12 గంటల సమయం పడుతుంది. కానీ.. ఈ సెమీ హైస్పీడ్ ట్రాక్ నిర్మాణం పూర్తయితే.. 4 నుంచి 5 గంటల్లో విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లు గరిష్ట వేగం 160 కిలోమీటర్లు అయినా.. ప్రస్తుతం 80 నుంచి 120 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. భవిష్యత్తులో వందేభారత్ రైళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. వందేభారత్‌లోనూ స్లీపర్ కోచ్‌లు రాబోతున్నాయి. కొత్తగా రాబోతున్న ఈ ట్రైన్లు గంటకు 200 కి.మీ వేగంతో దూసుకెళ్లేలా తయారు కాబోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్గాల్లో ఎక్కువ శాతం ఈ ట్రైన్లు నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. అందుకే.. ఈ సెమీ హైస్పీడ్ కారిడార్స్ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. పీఈటీఎస్కు టెండర్లు ఈ రెండు కారిడార్లకు సంబంధించి ప్రిలిమినరీ ఇంజినీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే(పీఈటీఎస్)కు రైల్వే బోర్డు టెండర్లు ఖరారు చేసింది. సింగిల్ పాకెట్లో ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. రూ.2.70 కోట్లతో నిర్వహించనున్న ఈ సర్వేను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సదరు సర్వే సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది చివరి నాటికి సర్వే పూర్తయిన వెంటనే.. ఈ సెమీ హై స్పీడ్ కారిడార్ పనులకు సంబంధించిన ప్రాథమిక అంచనా వ్యయాన్ని నిర్ధారిస్తూ.. డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. డీపీఆర్ పూర్తయిన వెంటనే పనులకు టెండర్లు పిలవాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ కారిడార్ పనులు పూర్తయితే.. ఏపీ తెలంగాణ మధ్య రవాణా మరింత సులభతరం, వేగవంతం కానుందని వాల్తేరు డివిజన్ అధికారులు భావిస్తున్నారు. విశాఖను అనుసంధానం చేస్తూ జరుగుతున్న ఈ కారిడార్‌కు రైల్వే శాఖ ప్రాధాన్యమివ్వడం శుభపరిణామంగా చెబుతున్నారు. -
మీకు తెలుసా! ఒక ట్రైన్ తయారీకి అయ్యే ఖర్చు ఎంతంటే?
ట్రైన్ గురించి, ట్రైన్ జర్నీ గురించి దాదాపు అందరికి తెలుసు. రైలు ప్రయాణం అంటేనే అదో రకైమన అనుభూతి అనే చెప్పాలి. లయబద్దంగా కదులుతూ ఎన్నెన్నో కొత్త ప్రాంతాలను పరిచయం చేసే ఆ ప్రయాణం చేసిన వారికే తెలుస్తుంది. అయితే ఒక ట్రైన్ తయారవడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది. ఒక బోగీ తయారు కావడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది అని చాలా మందికి తెలియక పోవచ్చు. మనం ఈ కథనంలో అలాంటి వివరాలను తెలుసుకుందాం. కొన్ని నివేదికల ప్రకారం.. మన దేశంలో 12,000 కంటే ఎక్కువ ట్రైన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ప్రతి రోజూ కొన్ని లక్షల మందిని గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. భారతదేశంలో ప్రస్తుతం వివిధ రకాల రైళ్లు ఉన్నాయి. ప్యాసింజర్ ట్రైన్లలో అయితే జనరల్, ఏసీ, స్లీపర్ అనే పేర్లతో బోగీలు ఉంటాయి. నిపుణుల అంచనాల ప్రకారం, ఒక స్లీపర్ కోచ్ తయారు చేయడానికి సుమారు రూ. 1.25 కోట్లు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. జనరల్ బోగీ తయారు చేయడానికి రూ. కోటి, ఏసీ కోచ్ నిర్మించడానికి రెండు కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఇక ఇంజిన్ తయారీ విషయానికి వస్తే.. ట్రైన్ మొత్తం ఈ ఇంజిన్ మీద ఆధార పడి ఉంటుంది, కావున దానికయ్యే ఖర్చు ఆ రేంజ్‌లోనే ఉంటుందని చెబుతున్నారు. ఇంజిన్ తయారీకి రూ. 20 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఒక్క బిజినెస్.. వందల కోట్ల టర్నోవర్ - వినీత సింగ్ సక్సెస్ స్టోరీ!) ఒక ట్రైన్ పూర్తిగా నిర్మించడానికి సుమారు రూ. 100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. కాగా ఈ మధ్య కాలంలో వచ్చిన వందే భారత్ రైలు తయారీకి రూ. 115 కోట్లు ఖర్చయినట్లు చెబుతున్నారు. ఈ ట్రైన్ బోగీలను చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మిస్తున్నారు. ఇటీవల ఒడిశాలో ప్రమాదానికి గురైన ట్రైన్ చాలా బోగీలు ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో సుమారు 24 బోగీలు నాశనమైనట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆ కోచ్‌ల మొత్తం విలువ రూ. 48 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. -
పలు రైళ్లు రద్దు, రీ షెడ్యూల్
తాటిచెట్లపాలెం: భద్రత, ఆధునికీకరణ పనుల కారణంగా విశాఖపట్నం నుంచి, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆయా తేదీల్లో రద్దు చేశారు. మరికొన్ని రీషెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3న విశాఖపట్నం–రాయ్‌పూర్(08527/08528) పాసింజర్ స్పెషల్ ఇరువైపులా రద్దయింది. షెడ్యూల్ చేసిన రైళ్లు ► ఈ నెల 3న విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్ (12807) సమతా ఎక్స్‌ప్రెస్ విశాఖలో గంట ఆలస్యంగా బయలుదేరుతుంది. ► ఈ నెల 3న అమృత్సర్–విశాఖపట్నం (20808) హిరాకుడ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అమృత్‌సర్‌లో 5 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ► ఈ నెల 4న సికింద్రాబాద్–భువనేశ్వర్(17016) విశాఖ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌లో 4 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ► ఈ నెల 4న చైన్నె సెంట్రల్–హౌరా (12840) మెయిల్ చైన్నె సెంట్రల్లో 4 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ► ఈ నెల 4న వాస్కోడగామా–షాలిమార్ (18048) అమరావతి ఎక్స్‌ప్రెస్ వాస్కోడగామాలో 4 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. గమ్యం కుదించిన రైళ్లు ► విశాఖపట్నం–కిరండూల్ (18514) నైట్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. ► కిరండూల్–విశాఖపట్నం (18513) నైట్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 5 నుంచి 12 వ తేదీ వరకు దంతేవాడ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది. ► విశాఖపట్నం– కిరండూల్ (08551) పాసింజర్ స్పెషల్ ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. ► కిరండూల్– విశాఖపట్నం(08552) పాసింజర్ స్పెషల్ ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు దంతేవాడ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది. ► ఈ నెల 4న రామేశ్వరం–భువనేశ్వర్ (20895), బెంగళూరు–భువనేశ్వర్(18464) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లు మార్గమధ్యలో 45 నిమిషాలు, 30 నిమిషాలు నిలిపివేస్తారు. -
Odisha Train Accident: నిమిషాల వ్యవధిలోనే..మూడు రైళ్లు..
ఒడిశా ఘోర రైలు ప్రమాదం ఎలా జరిగిందనేది సర్వత్రా.. అందరి మదిలోను మెదులుతున్న ప్రశ్న. ఐతే ఆ ఘటన గురించి ప్రత్యక్షసాక్షులు, అధికారుల కథనం మేరకు..ఈ భారీ విషాదం నిమిషాల వ్యవధిలోనే జరిగినట్లు తెలుస్తోంది. కోరమాండల్ షాలిమర్ ఎక్స్‌ప్రెస్ అనే ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడం తోపాటు గూడ్స్ రైలుని ఢీ కొట్టింది. అదే సమయంలో అటుగా వస్తున్న యశ్వంత్‌పూర్ హౌరా సూపర్ ఫాస్ట్ అనే మరోరైలు పట్టాలు తప్పిన కోచ్‌లపైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో రెండు ప్యాసింజర్ రైళ్లు ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలిపారు. మూడవ రైలు అదే సైట్లో ఆపి ఉంచిన గూడ్స్ రైలు ప్రమాదం బారిన పడినట్లు ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 6.50 నుంచి 7.10 గంటల మధ్య నిమిషాల వ్యవధిలో ఈ పెను ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ఇక కార్యాచరణ వైఫల్యంపై ప్రశ్నల నేపథ్యంలో రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. అలాగే క్రాష్ జరిగిన ప్రదేశంలో సీసీఫుటేజ్ విజ్యువల్స్‌లో పట్టాలపై రైలు కోచ్‌లు చిన్నాభిన్నామై పోతున్నట్లుగా మెలిపెట్టే దృశ్యాలు కనిపించాయి. (చదవండి: చెల్లచెదురుగా పడ్డ మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలు..జీవితంలో మర్చిపోలేని భయానక దృశ్యం) -
కాకతీయ.. ఎక్స్‌ప్రెస్‌గా మారినా ప్రయోజనం శూన్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి నిత్యం నడుస్తున్న రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. పేరుకే టైం టేబుల్ తప్ప ఆచరణలో అమలు కావడంలేదు. నెలలో సగం రోజులకుపైగా ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఫలితంగా ఇటు భద్రాచలంరోడ్ , అటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు అర్ధరాత్రి వేళ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు బెళగావి.. కరోనాకు ముందుకు జిల్లా కేంద్రమైన కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్ నుంచి నిత్యం మూడు రైళ్లు రాకపోకలు సాగించేవి. ఇందులో మణుగూరు, కొల్హాపూర్‌లు ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా ఉండగా కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్‌గా సేవలు అందించేంది. మూడు రైళ్లూ మణుగూరులో బయల్దేరి కొత్తగూడెం మీదుగా సికింద్రాబాద్‌కు ప్రయాణికులను చేరవేసేవి. దీంతో కొత్తగూడెంతోపాటు పాల్వంచ, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, ఇల్లెందు, టేకులపల్లి తదితర మండలాల ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండేది. కరోనా సమయంలో ఈ మూడు రైళ్లు రద్దు చేయగా.. ఆ తర్వాత మణుగూరు సూపర్‌ఫాస్ట్, ప్యాసింజర్‌గా ఉన్న కాకతీయను ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తూ పునరుద్ధరించారు. కొల్హాపూర్ స్థానంలో బెళగావి అంటూ గత జనవరిలో రైల్వే అధికారుఉలు ప్రకటించి రద్దు చేశారు. బెళగావి నుంచి సికింద్రాబాద్ వరకు నడుస్తున్న ఈ రైలును మణుగూరు వరకు పొడిగిస్తూ ఎట్టకేలకు శనివారం రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సికింద్రాబాద్‌లో అర్ధరాత్రి ఎదురుచూపులు సికింద్రాబాద్ –మణుగూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్లో రోజూ రాత్రి 11:45 గంటలకు బయల్దేరి తెల్లవారుజామున 4:15 గంటలకు భద్రాచలంరోడ్ చేరుకోవాలి. కానీ ఈ రైలు నెలలో సగం రోజులకు పైగా సికింద్రాబాద్‌లో సమయానికి బయల్దేరడం లేదు. ఫలితంగా సికింద్రాబాద్ స్టేషన్లో ప్రయాణికులు అర్ధరాత్రి వేళ జాగారం చేయాల్సి వస్తోంది. నగరంలోని చాలా మంద్రి ప్రయాణికులు రాత్రి 9:30 నుంచి 10:30 గంటల మధ్యలోనే ఇంటి నుంచి పిల్లాపాపలు, లగేజీతో బయల్దేరితేనే 11:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. తీరా స్టేషన్‌కి వచ్చాక రైలు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా ఫ్లాట్‌ఫారమ్ మీదకు వస్తోంది. దీని వల్ల చిన్నపిల్లలు, భారీ లగేజీతో అర్ధరాత్రి రెండు గంటలకుపైగా పసిపిల్లలు సహా ప్రయాణికులు మేల్కోవాల్సి వస్తోంది. చివరి నిమిషంలో ఫ్లాట్‌ఫారమ్ మారితే అటు ఇటు వెళ్లడం మరో ప్రయాస. సికింద్రాబాద్‌లో ఆలస్యంగా బయల్దేరడంతో కొత్తగూడేనికి నిర్దేశిత సమయానికి రావడం లేదు. ఫలితంగా ఈ రైలును నమ్ముకుని ఉదయం వేళ భద్రాచలంలో సీతారాముల దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ఇబ్బందులు వస్తున్నాయి. సింగరేణి ఇక అంతేనా! సికింద్రాబాద్‌కు వెళ్లే రైళ్ల పరిస్థితి ఇలా ఉంటే కోల్‌బెల్ట్ ప్రాంతాలను కలిపే ఏకై క రైలు సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్‌ను నడిపేతీరు ఇంకా మారలేదు. రైలు వేగం పెంచుతామంటూ రెగ్యులర్ కోచ్‌లు తీసి పుష్పుల్ కోచ్‌లతో నడిపినా, ప్యాసింజర్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినా ఇసుమంతైనా మార్పు రాలేదు. ఈ రైలు కూడా నెలలో ఇరవై రోజులకు పైగా గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకుని ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది. ఫలితంగా ఒకప్పుడు కిక్కిరిసిన ప్రయాణికులతో నడిచిన సింగరేణి ఇప్పుడు ఆ స్థాయిలో ప్రయాణికులను ఆకట్టుకోలేకపోతోంది. బొగ్గు రవాణా ద్వారా రైల్వేకు కోట్లాది రూపాయల ఆదాయం అందిస్తున్న ఈ జిల్లాకు, ఇక్కడి ప్రజలు, వారి సమయం, అవసరాలను రైల్వేశాఖ ఇప్పటికై నా గుర్తించాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. తమ సమయాన్ని వృథా చేయొద్దని, టికెట్ రూపంలో తాము చెల్లిస్తున్న సొమ్ములకు సరిపడా నాణ్యమైన సేవలు అందించాలని ప్రయాణికులు రైల్వే శాఖను డిమాండ్ చేస్తున్నారు. -
నెల్లూరుకు వందే భారత్ రైలు
నెల్లూరు(సెంట్రల్): భారత రైల్వే సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వందే భారత్ రైలు నెల్లూరు మీదుగా ప్రయాణించనుంది. తక్కువ సమయంలోనే గమ్యానికి చేరేలా ఈ రైలు సూపర్ స్పీడ్‌తో పట్టాలపై పరుగులు తీయనుంది. కాగా ఈ రైలులో ఒక్క సారైనా ప్రయాణించాలని ప్రయాణికులు ఉత్సాహం చూపుతున్నారు. కాగా రైల్వే అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకు వందే భారత్ రైలు నెల్లూరు రైల్వేస్టేషన్లో ఆగనుంది. 9 నుంచి రెగ్యులర్ సర్వీసులు ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా సికింద్రాబాద్‌లో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలు నేరుగా తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. ఎక్కడా ప్రయాణికులకు అందుబాటులో ఉండదు. అయితే ఈ రైలు 9వ తేదీన తిరుపతి నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఈ రైలు 10వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 130 కి.మీ. స్పీడ్‌కు అనుమతులు సాధారణంగా ప్రస్తుతం ఉన్న అన్ని సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు కేవలం 70 నుంచి 100 కిలోమీటర్ల లోపు వేగంతో ప్రయాణిస్తాయి. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మాత్రం 110 నుంచి 130 కిలోమీటర్ల వరకు స్పీడ్ కెపాసిటీ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 110 కి.మీ. వేగంతో, ట్రాక్ ఇబ్బందులు లేనిచోట్ల 130 కి.మీ. వేగంతో ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. 8 కోచ్‌లు మాత్రమే ప్రస్తుతం తిరుగుతున్న ఎక్స్‌ప్రెస్, సూపర్‌పాస్ట్ రైళ్లలో అన్నీ కలిపి 23 కోచ్‌లు ఉంటాయి. కానీ వందే భారత్ రైలు సూపర్ స్పీడ్‌తో ప్రయాణించనుండడంతో కేవలం 8 ఏసీ కోచ్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. పరిస్థితిని బట్టి మరికొన్ని రోజుల్లో కోచ్‌లు పెంచే యోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయాల్లో.. సికింద్రాబాద్ – తిరుపతి(20701) వందే భారత్ రైలు ఉదయం 6 గంటలకు ప్రారంభమై నెల్లూరుకు మధ్యాహ్నం 12.30 గంటలకు, తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుపతి – సికింద్రాబాద్(20702) వందే భారత్ రైలు మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రారంభమై నెల్లూరుకు సాయంత్రం 5.20 గంటలకు, సికింద్రాబాద్‌కు రాత్రి 11.45 గంటలకు చేరుకుంటుంది. దాడులు చేస్తే కఠిన చర్యలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వందే భారత్ రైల్లో ప్రయాణికులు కూడా ఉత్సాహంగా ఎక్కుతున్నారు. కాగా కొంతమంది ఇటీవల ఈ రైలుపై దాడులు చేశారు. వివిధ చోట్ల దాడులు చేసిన 39 మందిని ఇటీవల అరెస్ట్ చేశాం. అలాంటివి జరిగితే రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – శివేంద్ర మోహన్, డీఆర్ఎం, విజయవాడ డివిజన్ -
పలు రైళ్ల రద్దు, కొన్ని దారి మళ్లింపు
గుంతకల్లు: నైరుతి రైల్వేలో బెంగుళూరు సమీపంలో జరుగుతున్న రైల్వే పనుల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ► ధర్మవరం– బెంగళూరు–ధర్మవరం (06595/96) స్పెషల్ ప్యాసింజర్ రైళ్లను ఏప్రిల్ 01.06, 29 వ తేదీల్లో రద్దు చేశారు. ► ఇక పూరి–యశ్వంత్‌పూర్ (22883) ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 31న నంద్యాల, యర్రగుంట్ల, రేణిగుంట, జోలార్‌పేట్ మీదుగా యశ్వంత్‌పూర్‌కు మళ్లించారు. ► ఎల్టీటీ ముంబై–కోయంబత్తూరు (11013) ఎక్స్‌ప్రెస్ రైలును గుంతకల్లు, రేణిగుంట, జోలార్‌పేట్, సేలం మీదుగా కోయంబత్తూరుకు మళ్లించారు. ► ఇక గుంతకల్లు డివిజన్లోని పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల కోసం పలు స్పెషల్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. గుంతకల్లు–రాయచూర్–గుంతకల్లు స్పెషల్ ప్యాసింజర్ రైళ్లును 23 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నడపరు. ► నంద్యాల–కడప–నంద్యాల (07284/85), విజయపుర–రాయచూర్– విజయపుర స్పెషల్ ప్యాసింజర్ రైళ్లు 23వ తేదీ నుంచి ఈ నెల 31 వరకు రద్దయ్యాయి. -
ట్రైన్లో యాక్షన్ సీన్స్.. ఆ కిక్కే వేరప్పా!
తెరపై విలన్ని హీరో రఫ్ఫాడిస్తుంటే ప్రేక్షకులకు దక్కే కిక్కే వేరు. అందుకే యాక్షన్ సీన్స్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తుంటారు. ఇప్పుడు కొన్ని సినిమాల కోసం ట్రైన్లో ఫైట్ సీన్స్ డిజైన్ చేస్తున్నారు. ట్రైన్లో రిస్కీ యాక్షన్ సీన్స్ చూపించనున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ట్రైన్లో భారతీయుడు దర్శకుడిగా శంకర్ పరిచయమైన తొలి సినిమా ‘జెంటిల్‌మేన్’. ఈ సూపర్‌డూపర్ హిట్ ఫిల్మ్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమా ప్రారంభంలోనే ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే... శంకర్ దర్శకత్వం వహించిన ఆ తర్వాతి చిత్రాల్లో రజనీకాంత్ ‘రోబో’, విక్రమ్ ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) వంటి వాటిలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ట్రైన్ యాక్షన్ సీక్వెన్సెస్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు శంకర్. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు పాతికేళ్ల తర్వాత కమల్, శంకర్ కాంబోలోనే ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. అక్కడ దాదాపు రెండు వారాలపాటు షూటింగ్‌ని ΄్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లోనే ఓ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట శంకర్. ఫారిన్ ఫైటర్స్, ఫారిన్ యాక్షన్ మాస్టర్స్ ఈ ఫైట్‌ను డిజైన్ చేయనున్నట్లు సమాచారం. ‘ఇండియన్ 2’లో ఉన్న మేజర్ హైలైట్స్‌లో ఇదొకటనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. పది కోట్ల ఫైట్ ఒకవైపు కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2’ సినిమా చేస్తూనే మరోవైపు రామ్‌చరణ్‌తో ‘సీఈవో’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా చేస్తున్నారు శంకర్. ఈ సినిమా షూటింగ్‌ని యాక్షన్ సీన్‌తోనే ఆరంభించారు. భారీ స్థాయిలో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు దర్శకుడు శంకర్. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో వందమందికి పైగా ఫైటర్స్ పాల్గొన్నారని, ఈ ఫైట్ ఖర్చు రూ. పది కోట్లు పైనే అనే టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ ఫైట్ ఏ విధంగా ఉంటుందనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ పాల్గొనగా ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్. నాగేశ్వరరావు దోపిడీ స్టువర్టుపురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ లుక్‌లో రవితేజ రైలు పట్టాలపై ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కథ రీత్యా ట్రైన్లో నాగేశ్వరరావు దోపీడీ చేసే సీన్ అట అది. ట్రైన్లో చిన్నపాటి యాక్షన్ టచ్ కూడా ఉంటుందట. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. డెవిల్ పోరాటం స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1945లో బ్రిటిష్‌వాళ్ళు పరిపాలించిన మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో జరిగే కథతో రూపొందుతున్న చిత్రం ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్పోస్టర్లో కల్యాణ్ రామ్ ఓ ట్రైన్‌పై ఉన్నట్లు కనిపిస్తుంది. యాక్షన్ సీన్లో భాగంగా ఈ ట్రైన్ వస్తుందని తెలుస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బొగ్గు దొంగ తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల సమీపంలో గల ఓ కల్పిత గ్రామంలో జరిగే కథగా రూపొందిన చిత్రం ‘దసరా’. ఇందులో మద్యానికి బానిస అయి, బొగ్గు దొంగతనం చేసే ధరణి పాత్రలో కనిపిస్తారట నాని. ఇటీవల విడుదలైన ‘దసరా’ ట్రైలర్లో బొగ్గు ఉన్న గూడ్స్ ట్రైన్‌పై నాని ఉన్న సీన్ కనిపిస్తుంది. ఇది ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ అని టాక్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. లోకల్ ట్రైన్లో ఏజెంట్ లోకల్ ట్రైన్లో ఫైట్స్ చేశారట అక్కినేని అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఏజెంట్’. గత ఏడాది వేసవిలో ‘ఏజెంట్’ షూటింగ్ హైదరాబాద్ మెట్రో రైల్లో జరిగింది. ట్రైన్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా సురేందర్ రెడ్డి చిత్రీకరించారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఎనిమిది కోట్ల యాక్షన్ సూరి, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విడుదలై’. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘విడుదలై పార్ట్ 1’ ఈ నెల 31న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం దర్శకుడు వెట్రిమారన్ ఓ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను తీశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఖర్చు దాదాపు రూ. 8 కోట్లు అని సమాచారం. కాగా ‘విడుదలై’ రెండో భాగం విడుదలపై కూడా త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. -
టికెట్ బుకింగ్ సమయంలో షాక్.. ఐఆర్సీటీసీపై యూజర్లు ఫైర్!
దేశ ప్రజలకు ఇండియన్ రైల్వేస్ అందిస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చవకైన ప్రయాణం చేయాలనుకుంటే ఖచ్చితంగా రైలు ప్రయాణానికే ఓటు వేస్తారు. అంతేనా ప్యాసింజర్లకు సరికొత్త సేవలను కూడా తీసుకోస్తోంది రైల్వే శాఖ. ప్రతి రోజూ వేలాది మంది ప్యాసింజర్లు రైలు ప్రయాణం మీద ఆధారపడుతున్నారు కనుకే ఏ మాత్రం చిన్న తప్పులు జరిగినా దాని ప్రభావం అదే స్థాయిలో ఉంటుంది. తాజాగా తత్కాల్ బుకింగ్ వెబ్సైట్ మొరాయించడంతో యూజర్లు నెట్టింట తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ డౌన్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్! ట్రైన్లో అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే తత్కాల్ బుకింగ్‌ల వైపే ప్రజలు మొగ్గు చూపుతారన్న విషయం తెలిసిందే. ఈ తత్కాల్ సేవల కోసం ఆన్లైన్లో ఉదయం 10:00 గంటల నుంచి ACతరగతి, ఉదయం 11 గంటలకు నాన్ ఏసీ తరగతికి సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే శనివారం, ఎప్పటిలానే ప్యాసింజర్లు తత్కాల్ బుకింగ్ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఐఆర్సీటీసీ సర్వర్ మొరాయించింది. దీంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టికెట్ బుకింగ్ కోసం యూజర్లు లాగిన్ చేస్తున్న సమయం నుంచి పేమంట్ వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే తత్కాల్ బుకింగ్ కోసం అమౌంట్ చెల్లించి, కస్టమర్ల ఖాతా నుంచి డిడెక్ట్ అయినప్పటికీ రైలు టికెట్ మాత్రం కన్ఫర్మ్ కాలేదట. ఈ మేరకు కొందరు యూజర్లు వాపోతున్నారు. అలాగే మరికొందరు యూజర్లు టికెట్ బుకింగ్ సమయంలో వచ్చిన ఎర్రర్ మెస్సేజ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై ట్వీట్స్, మీమ్స్ నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఐఆర్సీటీసీ నుంచి ఎటువంటి స్పందన లేదు. @IRCTCofficial Still trying to Book ticket through #irctc website. Is it going to work today ? It's been an half an hour now for tatkal ticket slot booking, but still website is not working. pic.twitter.com/fYFuXCaHrj — Prashant waghmare (@Prashan95320710) March 4, 2023 #irctc Becoming worse day by day pic.twitter.com/mruQJX4mbv — 🅽🅰🆁🅴🆂🅷 🅼🅰🆃🆃🅷🅴🆆7 (@nareshmatthew17) March 4, 2023 When someone says Bhai #Tatkal_tickets kaat de Me : pic.twitter.com/g96AuufaM5 — Sumit Kr Shaurya (@TweetTo_Shaurya) March 4, 2023 -
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. త్వరలో ట్రైన్ హోటల్స్!
సాక్షి, చెన్నై: వృథాగా ఉన్న రైలు బోగీలను హోటళ్లుగా మార్చేందుకు దక్షిణ రైల్వే ప్రణాళిక రూపొందిస్తోంది. తొలి విడతలో మూడు చోట్ల ట్రైన్ హోటళ్లు ఏర్పాటు చేయనుంది. వివరాలు.. దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు రోజూ వేలాది మంది ప్రయాణికులు వచ్చి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ సరైన హోటళ్లు అందుబాటులో లేవు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న దక్షిణ రైల్వే ప్రయాణికులను ఆకర్షించే విధంగా వృథాగా ఉన్న బోగీల్లో హోటళ్ల ఏర్పాటపై దృష్టి సారించింది. ఈ హోటళ్ల నిర్వహణ ప్రైవేటు సిబ్బందికి అప్పగించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా దక్షిణ రైల్వేకు అదనపు ఆదాయం కూడా సమకూరనుంది. ఇప్పటికే అనేక చోట్ల నగరాల్లో ప్రైవేటు హోటళ్లు రైళ్ల తరహాలో సెట్టింగ్ లు, పెయింటింగ్స్‌తో భోజన ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అయితే, రైల్వే యంత్రాంగం నిజమైన రైలు బోగీలను హోటళ్లుగా మార్చనుండడం విశేషం. రైలులో ప్రయాణిస్తూ ఆహారాన్ని తింటున్నామనే అనుభూతిని కలిగించేలా.. ఆయా బోగీలలో ప్రత్యేక డిజైన్లు, సీట్లను ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి టెండర్ల ద్వారా ఈ హోటళ్లను త్వరలో కేటాయించనున్నారు. 24 గంటల పాటూ ఇవి సేవలు అందించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నారు. ఒకే సమయంలో ఓ బోగీలో 40 మంది కూర్చుని ఆహారం తినేందుకు తగినట్లు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో చెన్నై సెంట్రల్, పెరంబూరు, కాటాన్ కొళ్తూరు స్టేషన్లలో ఈ రైలు బోగీల హోటళ్లకు ఆన్లైన్ ద్వారా టెండర్లను ఆహా్వనించనున్నారు. చదవండి ఊరేగింపులో రూ.కోట్ల విలువైన కార్లు.. అయినా ఎద్దుల బండి మీద వరుడు ఎంట్రీ! -
ట్రైన్లో తోటి ప్రయాణికులపై దాడి చేస్తే మూడేళ్లు జైలు
కొరుక్కుపేట(చెన్నై): రైలులో ప్రయాణిస్తున్న సమయంలో తోటి వారిపై దాడికి పాల్పడితే మూడేళ్లు జైలు శిక్ష, జరిమానా తప్పదని రైల్వే ఏడీజీపీ వనిత హెచ్చరించారు. ఈనెల 16న కదులుతున్న రైలులో ఉత్తరాదికి చెందిన వ్యక్తిపై కొందరు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సెంట్రల్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసిన రైల్వే సెక్యూరిటీ ఫోర్స్ పోలీసులు సహకారంతో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ విషయమై ఏడీజీపీ వనిత మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఉత్తరాది వారి వల్ల తమిళనాడు ప్రజలకు ఉదోగావకాశాలు రావడం లేదని, దీనికి ప్రధాని మోదీయే కారణమంటూ కొందరు దాడులకు పాల్పడడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ, వ్యక్తిగత ద్వేషపూరిత మాటలతో పలువురిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు. ఇక కొందరు కుల మత భావాలను రెచ్చగొట్టి అశాంతికి కారణం అవుతున్నారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధితులు ఫిర్యాదుల కోసం 1512 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు. చదవండి చిన్నారి చికిత్సకు రూ. 11 కోట్ల విరాళం.. కనీసం పేరు చెప్పకుండా! -
రైళ్లలో అత్యవసర మందులతో ఫస్ట్ ఎయిడ్.. విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రయాణీకులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు దేశంలోని అన్ని రైళ్లు, రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులు, మెడికల్ సామాగ్రి, ఆక్సిజన్ సిలిండర్ కలిగిన మెడికల్ బాక్స్‌లను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అత్యవసర పరిస్థితులలో ప్రయాణీకులకు ఫస్ట్ ఎయిడ్ సేవలు చేసేలా ఫ్రంట్ లైన్ సిబ్బంది అయిన ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ), ట్రైన్ గార్డులు, సూపరింటెండ్లు, స్టేషన్ మాస్టర్లకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. రైళ్లు, రైల్వే స్టేషన్లలో అత్యవసర వైద్య సేవలు కల్పించే అంశాన్ని పరిశీలించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు అణుగుణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులతో ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అన్ని ప్రయాణీకుల రైళ్లతో పాటు రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులతో కూడిన మెడికల్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని, రైల్వే సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించడంలో శిక్షణ ఇవ్వాలని, రైలు ప్రయాణీకులలో ఎవరైనా డాక్టర్ అందుబాటులో ఉంటే వారి చేత లేదా సమీప రైల్వే స్టేషన్లో అస్వస్థతకు గురైన ప్రయాణికునికి తక్షణ వైద్య సేవలు అందే సదుపాయం కల్పించాలని నిపుణుల సంఘం సిఫార్సు చేసినట్లు మంత్రి తెలిపారు. చదవండి: పాత బడ్జెట్ చదివిన సీఎం అశోక్ గెహ్లాట్..! ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించే రైల్వే సిబ్బందికి ఎప్పటికప్పుడు రిఫ్రెషర్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే రైల్వే స్టేషన్‌కు సమీపాన ఉన్న ఆస్పత్రులు, అక్కడ పని చేసే వైద్యుల, వారి మొబైల్ నంబర్లతో కూడిన జాబితాను రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అస్వస్థతకు గురైన లేదా గాయపడిన ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించేందుకు రైల్వే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల అంబులెన్స్ సర్వీసులను కూడా అందుబాటులో ఉంచినట్లు మంత్రి పేర్కొన్నారు. బీఐఎస్ ఆమోదం లేని బొమ్మల తయారీపై చర్యలు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ఆమోదం లేకుండా బొమ్మలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి చెప్పారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న బీఐఎస్ మార్క్ లేని బొమ్మలు పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి చేటు కలిగిస్తున్నవో ప్రభుత్వం మదింపు చేస్తోందా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ బీఐఎస్ ఆమోదం లేకుండా బొమ్మలు తయారు చేస్తున్న వారిపై తరచుగా దాడులు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
ఈ నెల 11వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు కొన్ని రైళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. గురువారం కొన్ని రైళ్లను రద్దు చేశామని, ఒక రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 9, 10 తేదీల్లో విజయవాడ–బిట్రగుంట (07978), విజయవాడ–గూడూరు (07500), ఒంగోలు–విజయవాడ (07576) రైళ్లు, 10, 11 తేదీల్లో గూడూరు–విజయవాడ (07458), 10న కాకినాడ పోర్టు–విశాఖపట్నం (17267), విశాఖపట్నం–కాకినాడ పోర్టు (17268), విజయవాడ–ఒంగోలు (07461), విజయవాడ–గుంటూరు (07783), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237), చెన్నై సెంట్రల్–బిట్రగుంట (17238) రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. అదేవిధంగా కాకినాడ పోర్టు–విజయవాడ (17258) రైలును ఈ నెల 10న కాకినాడ పోర్టు–రాజమండ్రి మధ్య, విజయవాడ–కాకినాడ పోర్టు (17257) రైలును ఈ నెల 9, 10 తేదీల్లో రాజమండ్రి–కాకినాడ పోర్టు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. -
త్వరలో మరో మూడు వందేభారత్ రైళ్లు.. ఈ మార్గాల్లోనే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు త్వరలో మరో మూడు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ఈ రైలు ప్రారంభం కావడం తెలిసిందే. చైర్‌కార్ సదుపాయం ఉన్న ఈ రైలు ప్రారంభమైనప్పటి నుంచి.. అనూహ్య రీతిలో ప్రయాణికుల ఆదరణ చూరగొంటోంది. రోజూ వంద శాతం ఆక్యుపెన్సీతో వందేభారత్ పరుగులు తీస్తోంది. ఈ క్రమంలోనే కాచిగూడ–బెంగళూరు, సికింద్రాబాద్–తిరుపతి, సికింద్రాబాద్–పూనేల మధ్య త్వరలో మరో మూడు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు చేపట్టింది. రైళ్ల నిర్వహణ కోసం మెకానికల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చేందుకు కార్యాచరణ మొదలైంది. వందేభారత్ రైళ్ల కోసం డిపోల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు. -
పట్టాలు తప్పిన ట్రైన్.. వికారాబాద్ స్టేషన్లో నిలిచిపోయిన రైళ్లు
బెంగళూరు: కర్ణాటకలోని చిత్తాపూర్ సులేహళ్లిలో గుడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో వికారాబాద్ రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వికారాబాద్ మీదుగా వెళ్లే రైళ్లను రాయచూర్ వైపు దారి మళ్లిస్తున్నారు. కేఎస్ఆర్ బెంగళూరు, యశ్వంత్‌పూర్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లిస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులను తాండూరు మీదుగా నడపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పండగ సమయం కావడం, గంటలపాటు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులను అధికారులు తాండూర్ తరలిస్తున్నారు. చదవండి: శరవేగంగా ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణానికి ముందస్తు పనులు: ఎన్వీఎస్ రెడ్డి -
‘సాధారణ రైళ్లకు వందే భారత్‌గా పేరు మార్చి లూటీ!’
కోల్‌కతా: వందేభారత్ రైలుపై పశ్చిమ బెంగాల్లో రాళ్ల దాడి జరగటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సమర్థించారు టీఎంసీ మంత్రి ఉదయన్ గుహా. రైలు టికెట్ ధరలు అధికంగా ఉండటమే రాళ్ల దాడికి కారణమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, వందేభారత్ రైళ్లపై విమర్శలు గుప్పించారు. సాధారణ రైళ్లకు వందేభారత్‌గా పేరు మార్చి అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ‘సాధారణ రైళ్లకు వందేభారత్‌గా పేరు మార్చి తిప్పుతున్నారు. హైస్పీడ్ ట్రైన్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అది హైస్పీడ్ ట్రైన్ అయితే హౌరా నుంచి న్యూజల్పాయిగురికి చేరుకునేందుకు ఎనిమిది గంటల సమయం ఎందుకు పట్టింది? సాధారణ రైళ్లకు వందేభారత్‌గా రంగులు వేసేందుకు ప్రజల సొమ్మును వినియోగించవద్దు. తొలుత వారు వందేభారత్ సాధరణ రైలుగా పేరు పెట్టారు. ఆ తర్వాత బోగీలకు రంగులు వేసి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. టికెట్ ధరలు ఎక్కువగా ఉండటమే దాడులకు కారణమవుతోంది.’ అని కేంద్రపై విమర్శలు గుప్పించారు మంత్రి ఉదయన్ గుహా. హౌరా నుంచి న్యూజల్పాయిగురి మధ్య వందేభారత్ రైలును డిసెంబర్ 30, 2022న ప్రవేశపెట్టింది కేంద్రం. ప్రధాని మోదీ జెండా ఊపి రైలును ప్రారంభించారు. అయితే, దానిపై కొందరు రాళ్లదాడి చేశారు. ఆ దాడిపై మాట్లాడుతూ పాత రైలుతో పోలిస్తే కొత్త వందేభారత్‌లో ఎలాంటి తేడా లేదని, అందుకే ప్రజలు ఆగ్రహానికి గురైనట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: బెంగాల్లో తొలి వందేభారత్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ.. -
Hyderabad: అరకొర రైళ్లే.. పదేళ్లుగా పాతవాటితోనే సరి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నుంచి ప్రతి రోజూ సుమారు 3 లక్షల మంది రైళ్లలో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. మరో 50 వేల మంది వరకు వెయిటింగ్ జాబితాలో నిరీక్షిస్తున్నారు. పండగలు, వరుస సెలవులు వస్తే ఈ జాబితా రెట్టింపవుతుంది. రద్దీ ఉంటే అరకొరగా ప్రత్యేక రైళ్లు నడపడం మినహాయించి ఈ పదేళ్ల కాలంలో ఒకటి, రెండు మినహాయించి కొత్త రైళ్లు అందుబాటులోకి రాలేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం ప్రయాణికుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని ఆ మేరకు కొత్త రైళ్లను వేయాల్సి ఉండగా.. ఈ ప్రక్రియకు రైల్వే చాలా ఏళ్ల క్రితమే తిలోదకాలిచ్చింది. దీంతో ఒకవైపు ప్రయాణికుల అవసరాలు, డిమాండ్ పెరుగుతున్నప్పటికీ అందుకనుగుణంగా రైళ్లు మాత్రం పెరగడం లేదు. కేవలం 85 ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. కసరత్తు ఏదీ.. ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు పార్లమెంట్ సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి ప్రజాభిప్రాయం వెలువడే విధంగా ఏర్పాట్లు చేసే దక్షిణమధ్య రైల్వే ఈ ఏడాది ఆ పద్ధతిని సైతం విస్మరించింది. ఎంపీల సమావేశం నిర్వహించలేదు. మరోవైపు రైల్వే బడ్జెట్‌ను ప్రధాన బడ్జెట్లో విలీనం చేసిన తర్వాత రైల్వేల ప్రాధాన్యం బాగా పడిపోయిందని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జోన్ పరిధిలోని, డివిజన్ పరిధిలో క్రమం తప్పకుండా రైల్వే వినియోగదారుల సమావేశాలను నిర్వహించే అధికారులు ఆ సాంప్రదాయాన్ని కూడా పాటించడం లేదు. ఇలా ప్రయాణికుల అవసరాలను తెలుసుకొనేందుకు ఎలాంటి కసరత్తులు చేపట్టకపోవడంతో ప్రధాన బడ్జెట్లో రైల్వేల అంశం ప్రాధాన్యాన్ని కోల్పోయింది. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికులు హైదరాబాద్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి పాట్నాకు అరకొర రైళ్లే ఉన్నాయి. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ మినహాయించి పెద్దగా అందుబాటులో లేవు. ఈ రూట్లో అదనంగా రైళ్లను నడపాలని పదేళ్లుగా ప్రయాణికులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అలాగే సికింద్రాబాద్ నుంచి షిరిడీకి ఒక్క రైలు మాత్రమే నడుస్తోంది. వేలాది మంది భక్తులు సందర్శించే షిరిడీకి తగినన్ని రైళ్లు లేకపోవడం వల్ల ప్రైవేట్ బస్సులపైన ఆధారపడాల్సి వస్తోంది. నో కనెక్టివిటీ.. పట్టణాలు, నగరాల నుంచి రాజధానికి రైల్ కనెక్టివిటీ పెంచాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, దూరప్రాంతాల రైళ్లపైన ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా ఇంటర్సిటీ రైళ్లను, ప్యాసింజర్ రైళ్లను పెంచాలని ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి సైతం ప్రతి సంవత్సరం వినతులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మహబూబ్‌నగర్, వరంగల్, తాండూరు, వికారాబాద్, నిజామాబాద్, తదితర ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాలకు చెందిన లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రతి రోజు నగరానికి వచ్చి తిరిగి సాయంత్రం తమ ఊళ్లకు వెళ్లిపోయే ఈ ప్రయాణికులంతా సరిపడా రైళ్లు లేకపోవడంతో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది. పెరిగిన చార్జీల భారం.. ► ప్రతి రోజు ఉదయం కాజీపేట నుంచి నగరానికి వచ్చే పుష్ఫుల్ ట్రైన్ ప్రయాణికుల్లో చాలా మంది తిరిగి సాయంత్రం తమ ఊళ్లకు బయలుదేరి వెళ్తారు. వరంగల్, మడికొండ, ఘన్పూర్,రఘునాథ్‌పల్లి, జనగామ, తదితర ప్రాంతాల నుంచి సుమారు 5 వేల మందికి పైగా నెలవారీ పాస్‌లపైన రాకపోకలు సాగిస్తారు. ► మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్ చుట్టుక్కల ప్రాంతాల నుంచి మరో 7 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తారు. వికారాబాద్, తాండూర్, తదితర ప్రాంతాల నుంచి కూడా డిమాండ్ ఉంటుంది. ► గతంలో ఆలేరు నుంచి హైదరాబాద్‌కు కేవలం రూ.250 నెలవారీ పాస్‌తో రాకపోకలు సాగించిన ప్రయాణికులు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో రూ.1000కి పైగా ఖర్చు చేయాల్సివస్తోంది. (క్లిక్ చేయండి: మెరుపు సమ్మెపై మెట్రో యాజమాన్యం స్పందన) -
గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు
సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ రద్దీని మరింత తగ్గించే లక్ష్యంతో హైదరాబాద్ జంట నగరాల నుంచి విజయవాడ మీదుగా నర్సాపూర్, కాకినాడ టౌన్, తిరుపతి మధ్య మరో 16 ప్రత్యేక రైలు సర్వీసులు నడపనున్నారు. జనవరి 7న తిరుపతి–వికారాబాద్ (07050), 8న వికారాబాద్–కాకినాడ టౌన్ (07051), 9న కాకినాడ టౌన్–కాచిగూడ (07057), 10న కాచిగూడ–తిరుపతి (07058), 11న తిరుపతి–వికారాబాద్ (07070), 12న వికారాబాద్– నర్సాపూర్ (07071), 13న నర్సాపూర్–కాచిగూడ (07072), 14న కాచిగూడ–తిరుపతి (07073), 12న హైదరాబాద్–తిరుపతి (07083), 13న తిరుపతి–హైదరాబాద్ (07084), 14న హైదరాబాద్–నర్సాపూర్ (07085), 15న నర్సాపూర్–హైదరాబాద్ (07086), తిరుపతి–వికారాబాద్ (07079), 16న వికారాబాద్–నర్సాపూర్ (07080), 17న నర్సాపూర్–కాచిగూడ (07081), జనవరి 18న కాచిగూడ తిరుపతి (07082) నడపనున్నారు. -
రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య భారీగా తగ్గుతోంది!
కరోనా మహ్మమారి రాకతో దాదాపు అన్నీ రంగాల ఆదాయాలకు గండి పడింది. ఇటీవలే దీని నుంచి బయట పడుతూ కొన్ని పుంజుకుంటుండుగా, మరి కొన్ని డీలా పడిపోయాయి. ఈ వైరస్ దెబ్బకు ఇండియన్ రైల్వేస్ ఆదాయానికి కూడా చాలా వరకే గండిపడింది. ఇప్పుడిప్పుడే రైల్వే శాఖ ఈ దెబ్బ నుంచి కోలుకుంటోంది. అయితే తాజాగా ట్రైన్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్స్ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు నివేదికలు చెప్తున్నాయి. కరోనా పరిస్థితులతో పాటు, గతంలో పలు కారణాల వల్ల టికెట్‌పై ఇచ్చే రాయితీని నిలిపేయడంతో రైళ్లలో వయోవృద్ధల ప్రయాణాలు ఈ ఏడాది 24 శాతం తగ్గాయని వెల్లడయ్యింది. 2018-2019లో 7.1 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించగా, 2019-20లో ఈ సంఖ్య 7.2 కోట్లకు పెరిగింది. అయితే, 2021-22లో దాదాపు 5.5 కోట్ల మంది మాత్రమే రైలులో ప్రయాణించారు. ఈ విభాగం ప్రయాణీకుల సంఖ్య తగ్గుదల కారణంగా, రైల్వే శాఖ ఆదాయం గతంలో పోలిస్తే 13 శాతం క్షీణించింది. ఆర్బీఐ తెలిపిన సమాచారం ప్రకారం.. 2018-2019లో సీనియర్ సిటిజన్ ప్రయాణికుల నుంచి వచ్చిన మొత్తం రూ. 2,920 కోట్లు, 2019-2020లో రూ. 3,010 కోట్లు, 2020-21లో రూ. 875 కోట్లు, 2021-22లో రూ. 2,598 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. చదవండి: అమెజాన్‌లో ఏం జరుగుతోంది? భారత్‌లో మరో బిజినెస్ మూసివేత! -
పక్షులు చూపిన ‘బుల్లెట్’ మార్గం.. నిజమే.. ఆ కథేంటంటే
జపాన్ అంటేనే టెక్నాలజీకి మారుపేరు.. సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకూ మూలం. గంటకు నాలుగైదు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లు ఆ దేశానికి ప్రత్యేకం. మరి బుల్లెట్ రైళ్లు విజయవంతం కావడానికి తోడ్పడింది ఎవరోతెలుసా..? రెండు పక్షులు. నిజమే. ఆ వివరాలేమిటో చూద్దామా.. యుద్ధం వ్యథ నుంచి.. రెండో ప్రపంచ యుద్ధం చివరిలో పడిన అణు బాంబులు, ఆ తర్వాతి ఆంక్షలతో జపాన్ బాగా కుంగిపోయింది. ఆ వ్యథ నుంచి కోలుకుని, సరికొత్తగా నిలిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అప్పటికే టెక్నాలజీపై పట్టున్న జపాన్.. ప్రపంచంలో వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైలును 1964 అక్టోబర్ ఒకటిన ఆవిష్కరించింది. ట్రాక్‌ను, రైలు టెక్నాలజీని మరింతగా ఆధునీకరిస్తూ వేగాన్ని పెంచుతూ పోయింది. ఈ క్రమంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. గుడ్లగూబ స్ఫూర్తితో.. బుల్లెట్ రైళ్లు విద్యుత్‌తో నడుస్తాయి. పైన ఉండే కరెంటు తీగల నుంచి రైలుకు విద్యుత్ సరఫరా అయ్యేందుకు ‘పాంటోగ్రాఫ్’లుగా పిలిచే పరికరం ఉంటుంది. బుల్లెట్ రైలు వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ పాంటోగ్రాఫ్ వద్ద గాలి సుడులు తిరుగుతూ విపరీతమైన శబ్దం వచ్చేది, ఆ పరికరం త్వరగా దెబ్బతినేది. జపాన్ శాస్త్రవేత్తలు దీన్ని నివారించడంపై దృష్టిపెట్టారు. గుడ్లగూబలు వేగంగా ప్రయాణిస్తున్నా చప్పుడు రాకపోవడాన్ని గమనించారు. వాటి ఈకల అంచులు రంపం వంటి ఆకృతిలో ఉండటమే దీనికి కారణమని గుర్తించి.. బుల్లెట్ రైళ్ల ‘పాంటోగ్రాఫ్’లను ఆ తరహాలో అభివృద్ధి చేశారు. 1994లో బుల్లెట్ రైళ్లకు అమర్చారు. ప్రస్తుతం బుల్లెట్ రైళ్లతోపాటు చాలా వరకు ఎలక్ట్రిక్ రైళ్లకు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. గాలి నిరోధకతను ఎదుర్కొనేందుకు.. బుల్లెట్ రైళ్ల వేగసామర్థ్యాన్ని పెంచే క్రమంలో గాలి నిరోధకతతో సమస్య వచ్చింది. ఈ రైళ్ల వేగం ఆశించినంత పెరగకపోవడం, టన్నెళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత తీవ్రతతో ధ్వని వెలువడటం ఇబ్బందికరంగా మారింది. దీనికి పరిష్కారాన్ని అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలకు.. ఈసారి కింగ్‌ఫిషర్ పక్షి మార్గం చూపింది. వేగంగా ప్రయాణించేందుకు దాని ముక్కు ఆకృతి వీలుగా ఉందని వారు గుర్తించారు. ఈ మేరకు బుల్లెట్ రైలు ముందు భాగాన్ని కాస్త సాగి ఉండేలా తీర్చిదిద్దారు. రెండు పక్కలా త్రికోణాకారంలో ఉబ్బెత్తు భాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ మార్పులతో గాలి నిరోధకత తట్టుకోవడం, ధ్వనిని తగ్గించడం వీలైంది. పక్షులు చూపిన మార్గంలో.. గుడ్లగూబ, కింగ్‌ఫిషర్ పక్షుల స్ఫూర్తితో, మరికొంత టెక్నాలజీ జోడించి చేసిన మార్పులతో.. 1997లో షింకణ్‌సెన్–500 సిరీస్ రైలును నడిపారు. అది గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. నాటికి ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచిన రైలుగా ఇది రికార్డు సృష్టించింది. అంతేకాదు ఆ రైలు నుంచి పరిమితి మేరకు 70 డెసిబెల్స్ స్థాయిలోనే ధ్వని వెలువడటం గమనార్హం. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ మార్పులతో రైలు తయారీ, విద్యుత్ వినియోగం, నిర్వహణ ఖర్చులు కూడా తగ్గాయి. తర్వాత జపాన్ స్ఫూర్తితో చైనా, పలు యూరోపియన్ దేశాలు బుల్లెట్ ట్రైన్లను అభివృద్ధి చేశాయి. -
ఆ రైళ్లను ఆపండి.. రైల్వే బోర్డు ఛైర్మన్‌కు ఎంపీ భరత్ విజ్ఞప్తి
సాక్షి, ఢిల్లీ: రాజమండ్రి, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో పలు ప్రధానమైన రైళ్లు హాల్టులు, స్టాప్లకు అనుమతి ఉత్తర్వులు జారీ చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్ అండ్ సీఈవో వీకే త్రిపాఠిని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కోరారు. ఢిల్లీలో రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవోలను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. రాజమండ్రి నగర ప్రాధాన్యత, సుదూర ప్రాంతాల నుండి నిత్యం ఇక్కడకు వచ్చే వ్యాపార, వాణిజ్య, యాత్రికులకు కావలసిన రైళ్లు అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని ఎంపీ భరత్ త్రిపాఠికి తెలిపారు. హౌరా టు శ్రీ సత్య సాయి నిలయం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వరం టు రామేశ్వరం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వరం - పూణే ఎక్స్‌ప్రెస్, చెన్నై-జాల్పిగురి సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కామాక్య యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్, పాండిచ్చేరి హెచ్ డబ్ల్యూ హెచ్ ఎక్స్‌ప్రెస్‌లు హాల్ట్స్, స్టాప్స్‌కు అనుమతి కోరారు. విమానాశ్రయం, ఓఎన్జీ బేస్ కాంప్లెక్స్, ఏపీ పేపర్ మిల్స్, జీఎస్కే హార్లిక్స్, మూడు గ్యాస్ పవర్ ప్రాజెక్ట్స్ తదితర అనేక పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కూడా రాజమండ్రికి చేరువలోనే ఉందన్నారు. విశాఖపట్నం- విజయవాడ నగరాలకు మధ్యలో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన కేంద్రంగా రాజమండ్రి నగరం అన్ని రంగాలలోనూ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. టూరిజం హబ్ గా శరవేగంగా రాజమండ్రి, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అయితే ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వచ్చే యాత్రికులకు, టూరిస్టులకు, వ్యాపార, వాణిజ్య, వివిధ రంగాల వారికి అనువైన విధంగా రైళ్లు సదుపాయం లేకపోవడంతో చాలా కష్టంగా ఉంటోందని రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠికి వివరించినట్టు ఎంపీ భరత్ తెలిపారు. అలాగే కొవ్వూరు రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లకు హాల్ట్స్, స్టాప్స్ ఆపివేశారని, వాటిని కూడా పునరుద్ధరించాలని త్రిపాఠిని కోరినట్లు ఎంపీ భరత్ తెలిపారు. బొకారో, సింహాద్రి, తిరుమల, తిరుపతి-పూరి, సర్కార్, కాకినాడ- తిరుపతి, మచిలీపట్నం- విశాఖ, రాయగడ-గుంటూరు, బిలాస్పూర్ ఎక్స్‌ప్రెస్ లను పునరుద్ధరించాల్సిందిగా ఎంపీ భరత్ కోరారు. కొవ్వూరు, గోపాలపురం, తాళ్ళపూడి, పోలవరం మండలాలకు చెందిన సుమారు 60 గ్రామాల ప్రజలు కొవ్వూరు రైల్వే స్టేషను నుండి ప్రయాణం చేయాలని, అటువంటిది రైళ్ల హాల్ట్స్, స్టాప్స్ లేకపోవడంతో మరో 15 కిలోమీటర్లు అదనపు దూరం ప్రయాణించి రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు రావలసి వస్తోందన్నారు. నిలిచిపోయిన రైళ్లను పునరుద్ధరించి, ఆరు నెలలు పరిశీలించాలని.. అప్పటికీ రైల్వే శాఖకు తగిన ఆదాయ వనరులు రాకుంటే మీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవచ్చని త్రిపాఠికి ఎంపీ భరత్ సూచించారు. అలాగే అనపర్తి, నిడదవోలులో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి నుండి లోకల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కొనసాగించమని కోరినట్టు ఎంపీ భారత్ వివరించారు. తన అభ్యర్థనలపై రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠి సానుకూలంగా స్పందించారని ఎంపీ భరత్ తెలిపారు. చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? -
పేటీఎం ట్రావెల్ సేల్
న్యూఢిల్లీ: చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం (వన్ 97 కమ్యూనికేషన్స్) ‘ట్రావెల్ సేల్’ను ప్రకటించింది. 18వ తేదీ వరకు ఈ సేల్ అమల్లో ఉంటుంది. ఇందులో భాగంగా ట్రావెల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి పలు ఆఫర్లు ప్రకటించింది. గోఫస్ట్, విస్తారా, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా డొమెస్టిక్ టికెట్లపై 18 శాతం, ఇంటర్నేషనల్ ఫ్లయిట్ టికెట్లపై 12 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపింది. ఆర్బీఎల్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డ్, అమెక్స్ కార్డ్‌లతో చెల్లింపులు చేయడం ద్వారా ఈ డిస్కౌంట్ పొందొచ్చని సూచించింది. విద్యార్థులు, వృద్ధులు, సాయుధ దళాల సిబ్బందికి ప్రత్యేక ఆఫర్లను సైతం ఇస్తున్నట్టు ప్రకటించింది. కన్వీనియన్స్ ఫీజు చెల్లించే పని లేదని తెలిపింది. చదవండి: భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ.. భారత్‌పైనే ఎక్కువ ప్రభావం పడుతుందా! -
ఇంకా 23 శాతం రైళ్లు ఆలస్యమే!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ రైల్వేను ఆధునికీకరిస్తున్న రైల్వే శాఖ.. కొన్ని రైళ్లు సకాలంలో గమ్యం చేరే విషయంలో మాత్రం మరింత దృస్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్ప టికీ ఇంకా 23 శాతంమేర రైళ్లు ఆలస్యంగా గమ్యం చేరుతున్నాయి. అయితే, గతంలో ఈ శాతం ఎక్కు వగా ఉండగా, ఇప్పుడు వీలైనంతమేర తగ్గించటంలో రైల్వే శాఖ విజయం సాధించిందనే చెప్పాలి. దాదాపు 76 శాతం రైళ్లు సకాలంలో గమ్యం చేరుతుండటమే దీనికి తార్కాణం. తాజాగా ఎన్ని రైళ్లు సకాలంలో చేరుతున్నాయి, ఎన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి అన్న విషయంలో దేశవ్యాప్త వివరాలను రైల్వే వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ కోరిన సమాచారాన్ని రైల్వే తాజాగా అందజేసింది. ఆ వివరాల ప్రకారం.. 2016 నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా రాజధాని, దురొంతో, శతాబ్ది, జనశ తాబ్ది ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు.. ఇలా కేటగిరీలు కలిపి 7689535 సర్వీసులు ఉండగా, 58,59,631 రైళ్లు సకాలంలో గమ్యం చేరాయి. 18,29,904 రైళ్లు మాత్రం ఆలస్యంగా గమ్యం చేరాయి. ప్యాసింజర్ రైళ్లే ఆలస్యం పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లలో 25.76 శాతం జాప్యం నమోదు కాగా, ధనికులు ఎక్కువగా ప్రయాణించే శతాబ్ది రైళ్లలో అతి తక్కువగా 12.45 శాతం మాత్రమే జాప్యం నమోదైంది. విచిత్రమేంటంటే రైల్వే శాఖ ఎంతో ప్రాధాన్యమిచ్చే రాజధాని సర్వీసుల్లో కూడా 25.65 శాతం జాప్యం నమోదైంది. దురొంతోలో 28.10 శాతం , జన శతాబ్దిలో 14.74 శాతం, సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 19.05 శాతం మేర ఆలస్యంగా నడిచాయి. -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఆ టెన్షన్ లేదు, కొత్త సర్వీస్ వచ్చేసింది!
ఇండియన్ రైల్వేస్.. ప్రతి రోజు లక్షల మంది ప్యాసింజర్లను వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు కోట్ల రూపాయలు సరకులను రావాణా చేస్తూ ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తోంది. ప్రయాణికుల సేవలు అందించడంలో ఏ మాత్రం రాజీ పడకుండా ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా మరో సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది భారతీయ రైల్వే. రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సరికొత్త సేవ ఇకపై రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్లు రైలులో నిద్రిపోయినా ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే రైల్వే శాఖ సరికొత్త సేవని ప్రవేశపెట్టింది. ‘డెస్టినేషన్ అలర్ట్ వేక్ అప్ అలారం’ పేరుతో కొత్త సర్వీసును ప్రారంభించింది భారతీయ రైల్వే . ఇదివరకే రాత్రి వేళ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నుంచి ఈ అంశంపై పలుమార్లు రైల్వే బోర్డుకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు రైల్వేశాఖ ఈ సౌకర్యాన్ని తీసుకువచ్చింది. ఎంక్వైరీ సర్వీస్ నంబర్ 139లో రైల్వే ఈ కొత్త సేవను ప్రారంభించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రైల్వే ప్రయాణికులకు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ సర్వీసు ద్వారా ప్యాసింజర్లు వారి స్టేషన్‌కు చేరుకునే వరకు ఆందోళన లేకుండా నిద్రపోవచ్చు. ఇది ఎలా పని చేస్తుందంటే.. ప్యాసింజర్ వారి గమ్య స్థానానికి చేరుకునే 20 నిమిషాల ముందు రైల్వే శాఖ నుంచి మీకు అలర్ట్ వస్తుంది. దీని ద్వారా మీరు నిద్రలేచి మీ గమ్య స్థానానికి చేరుకుంటారు. ఇలా ఉపయోగించుకోండి డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం సేవను ప్యాసింజర్లు ఉపయోగించుకోవాలంటే.. ఐఆర్సీటీసీ( IRCTC) హెల్ప్‌లైన్ 139కి కాల్ చేయాలి. మీరు గమ్యస్థాన అలర్ట్ కోసం ముందుగా 7 నంబర్లను, ఆపై 2 నంబర్లను నొక్కాలి. తర్వాత మీ 10 అంకెల పీఎన్ఆర్(PNR) నెంబర్‌ను నమోదు చేయాలి. దీన్ని నిర్ధారించడానికి 1 డయల్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు స్టేషన్ చేరుకోవడానికి 20 నిమిషాల ముందు వేకప్ అలర్ట్ వస్తుంది. -
వందే భారత్ రైలు.. హైదరాబాద్ ట్రాక్‌లపై నడిచేనా!
సాక్షి, హైదరాబాద్: వందే భారత్ రైళ్ల రాకపోకలకు హైదరాబాద్ ట్రాక్‌లు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రతిరోజూ ఎంఎంటీఎస్‌లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు తీసే ట్రాక్‌లోనే వచ్చే ఏడాది నుంచి వందేభారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ, ముంబై, బెంగళూరు నగరాలకు ఈ అధునాతన రైళ్లను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రహరీలు, ఫెన్సింగ్ వంటి ఎలాంటి రక్షణ చర్యలు లేని నగరంలోని రైల్వేలైన్లు వందేభారత్ రైళ్ల నిర్వహణకు సవాల్‌గా మారాయి. ట్రాక్‌ల వెంట అనేక చోట్ల మలుపులు, ప్రమాదకరమైన స్థలాలు ఉన్నాయి. మనుషులు ఒకవైపు నుంచి మరోవైపునకు ట్రాక్‌లు దాటుతుంటారు. ఈ క్రమంలో గంటకు 150కిపైగా కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే వందేభారత్ రైళ్లకు ఏ చిన్న అవాంతరం ఏర్పడినా భారీ నష్టం వాటిల్లుతుందని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకే ట్రాక్‌లో రెండు ప్రమాదాలు.. ► ఇటీవల అహ్మదాబాద్– ముంబై ట్రాక్‌లో ఏకంగా రెండుసార్లు వందేభారత్ రైళ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. మొదటిసారి అడ్డుగా వచ్చిన అయిదు గేదెలను ఢీకొనడంతో అవి అక్కడిక్కడే చనిపోయాయి. ఈ ఉదంతంలో రైలు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదం మరిచిపోకముందే మరో సంఘటనలో ట్రాక్‌కు అడ్డుగా వచ్చిన ఆవును ఢీకొట్టడంతో రెండోసారి వందేభారత్ రైలుదెబ్బతిన్నది. ట్రాక్‌లకు ఇరువైపులా కంచె లేకపోవడం వల్ల పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ► మరోవైపు సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఇంజిన్లు దెబ్బ తినకుండా క్యాటిల్ గార్డ్లను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల రైళ్లు పశువులను ఢీకొట్టినప్పటికీ ఇంజిన్లు దెబ్బ తినకుండా సురక్షితంగా ఉంటాయి. కానీ వందేభారత్ రైళ్లకు ఇలాంటి గార్డ్లను ఏర్పాటు చేసే అవకాశం లేదు. సురక్షితమైన ట్రాక్‌ల నిర్వహణ ఒక్కటే పరిష్కారం. అహ్మదాబాద్– ముంబై మార్గంలో చోటుచేసుకున్న ఈ రెండు ఘటనల నుంచి హైదరాబాద్‌లో వందేభారత్ రైళ్ల నిర్వహణపై పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదకరంగా పట్టాలు.. నగరంలో సుమారు 45 కిలోమీటర్ల మార్గంలో రెండు వైపులా వందల కొద్దీ బస్తీలు, కాలనీలు ఉన్నాయి. అనేక చోట్ల ప్రహరీ గోడలు కానీ, ఫెన్సింగ్ కానీ లేకపోవడం వల్ల మనుషులు రాత్రింబవళ్లు ఒక వైపు నుంచి మరోవైపు వెళ్తారు. దీంతో ఎంఎంటీఎస్ రైళ్లు, కొన్ని చోట్ల ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొని తరచుగా మృత్యువాత పడుతున్నారు. పశువులు చనిపోతున్నాయి. భరత్‌నగర్, హఫీజ్‌పేట్, డబీర్‌పురా, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, విద్యానగర్, సీతాఫల్మండి వంటి అనేక చోట్ల పెద్ద సంఖ్యలు మలుపులు ఉన్నాయి. కొన్ని చోట్ల వార్నింగ్ అలారమ్‌లు ఏర్పాటు చేశాను. కానీ ఫెన్సింగ్ లేకపోవడం వల్ల రాకపోకలను మాత్రం నియంత్రించలేకపోతున్నారు. ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయడం, అవసరమైన చోటప్రహరీలు నిర్మించడం వంటి పనులు ఇప్పటికీ ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. రైల్వే చట్టం ప్రకారం మనుషులు, పశువులు ట్రాక్‌లు దాటడం నేరం. ఈ నేరాలు జరగకుండా అరికట్టేందుకు ఎలాంటి రక్షణ చర్యలు లేవు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ సహా అన్ని రైళ్లకు క్యాటిల్ గార్డ్లు ఉండడం వల్ల రైలు ఇంజిన్లు దెబ్బతినడం లేదు. భవిష్యత్‌లో వందేభారత్ రైళ్లు ఈ మార్గంలో నడిస్తే ఇంజిన్లు దెబ్బతిని అపారమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది. చదవండి: సిటీ@431 ఏళ్లు.. హైదరాబాద్‌లో తొలి కట్టడం ఏంటో తెలుసా! -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్!
భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. దేశ వ్యాప్తంగా అనేక మార్గాల్లో రైళ్ల వేగాన్ని పెంచే విధంగా రైల్వే యంత్రాంగం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో రైళ్ల వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చెన్నై–గూడూరు మార్గంలో రైలు వేగాన్ని పెంచే విధంగా నిర్వహించిన ట్రైల్ రన్ సంతృప్తికరంగా జరిగినట్లు దక్షిణ రైల్వే జీఎం బీజీ మాల్య తెలిపారు. రైల్వే డివిజనల్ మేనేజర్ గణేష్, ప్రధాన ఇంజినీర్ దేశ్ రతన్ గుప్తాతో కలిసి గురువారం ఈ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. 110 కి.మీ వేగం నుంచి 130 కి.మీ వరకు పరిశీలించారు. చివరకు 143 కి.మీ వరకు నడిపారు. రైళ్ల వేగం పెంచడం ద్వారా ప్రయాణ సమయం తగ్గతుందని, తద్వారా ప్యాసింజర్ల విలువైన సమయం ఆదా కానుంది. సంతృప్తికరం ట్రయల్ రన్ గురించి శుక్రవారం రైల్వే జీఎం బీజీ మాల్య మీడియాతో మాట్లాడారు. చెన్నైగూడూరు మార్గంలో అన్ని స్టేషన్లలో ఇంటర్‌లాకింగ్ ప్రమాణాల సామర్థ్యం పెంచామని తెలిపారు. ట్రాక్, సిగ్నల్, టీఆర్డీ, రోలింగ్ స్టాక్‌ల నిర్వహణ అవసరం పెరిగినట్లు వివరించారు. ఈ మార్గంలో వేగంగా సాగిన ట్రయల్ రన్ సంతృప్తిని కలిగించిందన్నారు. వేగం పెరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, హౌరా, ముంబై వైపుగా వెళ్లే అనేక రైళ్ల ప్రయాణ సమయం తగ్గుతుందని తెలిపారు. తదుపరి పవిత్ర పుణ్య క్షేత్రం తిరుపతిని కలిపే విధంగా చెన్నై–రేణిగుంట మార్గంలో వేగం పెంపునకు ట్రయల్ రన్ నిర్వహించనున్నామని తెలిపారు. ఆ తర్వాత అరక్కోణం–జోలార్‌పేట–పొత్తనూరు, సేరనూర్, తిరువనంతపురం, ఆలపులా, మంగళూరు తదితర మార్గాలపై దృష్టి పెడతామన్నారు. చివరగా, ఎగ్మూర్ నుంచి విల్లుపురం, తిరుచ్చి, దిండుగల్ మార్గంలో వేగం పెంపునకు చర్యలు తీసుకుంటామన్నారు. వేగంగా రైళ్లు నడిపేందుకు తగ్గ అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడతాయని తెలిపారు. చదవండి: క్రెడిట్ కార్డ్ పేమెంట్ కష్టంగా మారిందా, అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి! -
ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే శాఖ... ఆ రూట్లలో 80 రైళ్లు రద్దు!
దసరా పండుగ సీజన్ ప్రారంభమైంది. ప్రజలు నగరాలను విడిచి వారి సొంతూర్లకు పయనమవుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు రద్దీగా మారాయి. ఈ తరుణంలో రైల్వే శాఖ ప్రయాణికులకు భారీ షాక్‌నే ఇచ్చింది. పలు కారణాల వల్ల దాదాపు 80 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. అక్టోబర్ 1న బయలుదేరాల్సిన 52 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, 26 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణ, మౌలిక సదుపాయాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రద్దు చేయబడిన రైళ్ల జాబితాలో లక్నో, వారణాసి, ఢిల్లీ, కాన్పూర్, మరిన్ని నగరాల నుంచి నడిచే రైళ్లు ఉన్నాయి. ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్ల ఆటోమేటిక్‌గా రద్దు అవుతుందని, ఆ మొత్తం నగదు వినియోగదారు ఖాతాలలో నేరుగా రీఫండ్ కానుంది. కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు రీఫండ్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి రిజర్వేషన్ కౌంటర్‌ను సందర్శించాల్సి ఉంటుంది. చదవండి: బ్యాంకింగ్ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే! -
బతుకమ్మ-దసరా పండగకి ఊరెళ్లిపోతా మామ...బస్టాండ్ లు,రైల్వేస్టేషన్లు కిటకిట (ఫొటోలు)
-
మహిళా ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో వారికోసం..
భారతీయ రైల్వే.. ప్రతీ రోజు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తూ ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పరుచుకుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణమే గాకా వివిధ సేవలను ప్యాసింజర్లకు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం మహిళల కోసం రైల్వేశాఖ పెద్ద ప్రకటనే చేసింది. మహిళలు ఇకపై రైలులో సీటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తెలిపింది. బస్సు, మెట్రో తరహాలో ఇకపై భారతీయ రైళ్లలో మహిళలకు ప్రత్యేక సీట్లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మహిళలకు ప్రత్యేకంగా సీటు రిజర్వ్ సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళల కోసం.. భారతీయ రైల్వే ప్రత్యేక బెర్త్‌లను కేటాయించనున్నారు. దీంతో పాటు మహిళల భద్రతకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైళ్లలో మహిళల సౌకర్యార్థం రిజర్వ్ బెర్త్‌ల ఏర్పాటుతో పాటు అనేక సౌకర్యాలను ప్రారంభించినట్లు తెలిపారు. స్లీపర్ క్లాస్‌లో ఆరు బెర్త్‌లు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్‌లోని మహిళలకు ఆరు బెర్త్‌లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. రాజధాని ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, దురంతో సహా పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో థర్డ్ ఏసీ (3ఏసీ క్లాస్)లో ఆరు బెర్త్‌లు మహిళల కోసం రిజర్వ్ చేస్తున్నట్లు చెప్పారు. రైలులోని ఒక్కో స్లీపర్ కోచ్‌లో ఆరు లోయర్ బెర్త్‌లు, 3 టైర్ ఏసీ కోచ్‌లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్‌లు, 2 టైర్ ఏసీ సీనియర్ సిటిజన్లలో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్‌లు, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు, గర్భిణీ స్త్రీలకు రిజర్వు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), జీఆర్పీ, జిల్లా పోలీసులతో భద్రత కల్పిస్తారు. చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
రైళ్లలో సాహసాలు చేస్తే ఇకపై అంతే సంగతులు
చెన్నై: చెన్నైలోని ఎలక్ట్రిక్, ఎంఆర్టీఎస్ రైళ్లలో వీరంగం సృష్టించినా, సాహసాలు ప్రదర్శించినా కటకటాల్లోకి నెడుతామని విద్యార్థులకు పోలీసులు హెచ్చరించారు. రైళ్లలో కొందరు విద్యార్థుల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. రైలు బయలుదేరే సమయంలో పరుగులు తీయడం, ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రయాణించడం, రైలు కిటికీలను పట్టుకుని వేలాడటం వంటి సాహసాలు చేసే వాళ్లు ఎక్కువే. అలాగే గ్రూపు తగాదాలకు నెలవుగా కూడా రైల్వే స్టేషన్లు మారాయి. ఈ క్రమంలో విద్యార్థులకు హెచ్చరికలు చేస్తూ రైల్వే, పోలీసు యంత్రాంగం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఎలక్ట్రిక్, ఎంఆర్టీఎస్ రైళ్లల్లో, స్టేషన్లలో అకతాయి తనంతో వ్యవహరించినా, ఇష్టారాజ్యంగా వీరంగం సృష్టించినా, సహసాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే స్టేషన్లు, మార్గాల్లో నిఘా ఉంచుతామని తెలిపారు. పట్టుబడితే 3 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. చదవండి: (అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష) -
గుడ్ న్యూస్: అందుబాటులోకి అదనపు బెర్తులు, సీట్లు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఎటూ వెళ్లలేని పరిస్థితులు. ఇప్పుడు పరిస్థితులు కాస్త కుదుటపడడంతో దసరా సెలవులకు నగరవాసులు పలు పర్యాటక ప్రాంతాల సందర్శన, బంధువుల వద్దకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వస్తోంది. డీఆర్ఎం ప్రత్యేక చర్యలు పరిస్థితిని గమనించిన వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ సత్పతి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్‌ను క్లియర్ చేసే దిశగా ఆయా రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేసి బెర్తులు, సీట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(సమతా ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం–కోర్బా–విశాఖపట్నం(కోర్భా ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం–హజరత్ నిజాముద్దీన్–విశాఖపట్నం(స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం–కడప–విశాఖపట్నం(తిరుమల ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం–బెంగళూరు–విశాఖపట్నం(వీక్లీ స్పెషల్) ఎక్స్‌ప్రెస్‌లకు ఇరువైపులా తాత్కాలికంగా ఒక్కో థర్డ్ ఏసీ కోచ్‌లను జత చేశారు. విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్), విశాఖపట్నం–గా«ంధీదాం–విశాఖపట్నం(ఎక్స్‌ప్రెస్)లకు ఒక్కో స్లీపర్ క్లాస్ కోచ్‌లను, భువనేశ్వర్–విశాఖపట్నం–భువనేశ్వర్(ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్)లకు ఒక్కో ఏసీ చెయిర్ కార్ కోచ్‌లను అదనంగా జత చేశారు. ఇదే విధంగా మరిన్ని రైళ్లకు అదనపు కోచ్‌లను దసరా వరకు కొనసాగించాలని రైల్వే ప్రయాణికులు కోరతున్నారు. ప్రత్యేక రైళ్లు నడపాలి దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, హౌరా తదితర మార్గాల్లో దసరా ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. వీటిని సాధ్యమైనంత త్వరగా ప్రకటిస్తే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని సూచిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం–బెంగళూరు–విశాఖపట్నం మధ్య ప్రతి ఆది, సోమవారాల్లో నడుస్తున్న వీక్లీ స్పెషల్‌ను రెగ్యులర్ రైలుగా మార్చేందుకు డీఆర్ఎం కృషి చేయాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వారణాసి రైలు గురించి కూడా డీఆర్ఎం కృషి చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఇదీ చదవండి: కాలువలతో చెరువుల అనుసంధానం -
వచ్చేస్తున్నాయ్ వందేభారత్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వందేభారత్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా రూపొందించిన వందేభారత్ రైళ్లకు ఇటీవల భద్రతా తనిఖీలను నిర్వహించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. దక్షిణమధ్య రైల్వేలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. మొదట హైదరాబాద్ నుంచి ముంబై, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం మార్గాల్లో వందేభారత్ రైళ్లను నడిపే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతరం దశలవారీగా సికింద్రాబాద్–షిరిడీ, సికింద్రాబాద్–బెంగళూరు మార్గాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటకు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడుస్తుండగా వందేభారత్ రైళ్లు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ–వారణాసి మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు 145 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. కాగా, కొత్తగా రానున్న రైళ్ల వేగాన్ని మరో 15 కిలోమీటర్లు అదనంగా పెంచారు. దీంతో రద్దీ మార్గాల్లో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. పడిగాపులకు ఫుల్స్టాప్ హైదరాబాద్ నుంచి విశాఖ, ముంబై, బెంగళూరు, షిరిడీకి ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. కనీసం మూడు నెలల ముందే రిజర్వేషన్లు బుక్ చేసుకోవలసి వస్తుంది. సాఫ్ట్వేర్ నిపుణులు, వ్యాపారవర్గాల డిమాండ్ ఎక్కువ. ఈ రూట్లలో వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా రైళ్ల కోసం పడిగాపులు కాసే బాధ తప్పుతుంది. వందేభారత్ ప్రత్యేకతలివే.. ►గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ►ఈ రైళ్లలో ఎమర్జెన్సీ లైటింగ్ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కోచ్‌కు 4 లైట్లు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా ఇబ్బంది లేకుండా ఈ లైట్లు ఉపయోగపడతాయి. ►కోచ్‌లకు బయటవైపు నుంచి 4 కెమెరాలు ఉంటాయి. వెనుక వైపు నుంచి మరొకటి ఉంటుంది. ప్రతి కోచ్‌కు 4 అత్యవసర ద్వారాలు ఉంటాయి. కోచ్‌లు పూర్తిగా ఏసీ సదుపాయం కలిగి ఉంటాయి. అత్యుత్తమ కోచ్ కంట్రోల్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ►ప్రతి కోచ్‌లో 32 ఇంచ్‌ల స్క్రీన్‌తో ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఉంటుంది. అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటుచేసిన అగ్నిమాపక పరికరాలు కొద్దిపాటి పొగను కూడా వెంటనే పసిగట్టి ప్రయాణికులను అప్రమత్తం చేస్తాయి. వరదలను సైతం తట్టుకొనేవిధంగా వీటిని రూపొందించారు. n ఎదురెదురుగా వచ్చే రైళ్లు ఢీకొనకుండా అరికట్టే కవచ్ వ్యవస్థతో ఈ రైళ్లను అనుసంధానం చేశారు. ఈ రైళ్లలో అంధుల కోసం ప్రత్యేక సీట్లు ఉంటాయి. -
పలు మార్గాల్లో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖ–సికింద్రాబాద్ (08579/08580) స్పెషల్ ట్రైన్ ఈనెల 24 నుంచి సెప్టెబర్ 28 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకి సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 29 వరకు ప్రతి గురువారం సాయంత్రం 7.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకి విశాఖ చేరుకోనుంది. విశాఖపట్నం–మహబూబ్‌నగర్ (08585/08586) స్పెషల్ ట్రైన్ ఈనెల 23 నుంచి సెప్టెంబర్ 27 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 24 నుంచి 28 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 6.20 గంటలకి మహబూబ్‌నగర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకి విశాఖ చేరుకుంటుంది. విశాఖపట్నం–తిరుపతి (08583/08584) స్పెషల్ ట్రైన్ ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 26 వరకు ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 27 వరకు ప్రతి మంగళవారం రాత్రి 9.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. (క్లిక్: మంకీపాక్స్ నిర్ధారణ కిట్ విడుదల) -
ప్రయాణికులకు భారీ షాకిచ్చిన భారతీయ రైల్వే!
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది ఐఆర్సీటీసీ. ఇకపై రైళ్లలో భోజనం, స్నాక్స్ ధరలను ఏకంగా రూ.50 పెంచేసింది. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ సర్క్యూలర్ కూడా జారీ చేసింది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, డుర్యాంటో ఎక్స్‌ప్రెస్‌లతో సహా భారతీయ ప్రీమియం రైళ్లకు ఈ క్యాటరింగ్ ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. భారతీయ రైల్వే బోర్డు జూలై 15న జారీ చేసిన ఆర్డర్ ప్రకారం కొత్త ధరలు ఉంటాయని పేర్కొంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం. ఇకపై ప్రీమియం రైళ్లలో.. అల్పాహారం రూ.105 ఉండగా, రూ. 155 చేరింది. భోజనం రూ. 185 ఉండగా, రూ. 235, స్నాక్స్ రూ. 90 ఉండగా, రూ.140 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో టీ లేదా కాఫీ ముందుగా బుక్ చేసుకుంటే రూ. 20, బుక్ చేసుకోకుంటే రూ. 70 వసూలు చేసేవాళ్లు. ప్రస్తుతం బుక్ చేసినా, చేయకపోయినా వాటి ధరను రూ. 20గా నిర్ణయించారు. చదవండి: Google Play Store: యాప్ డెవలపర్లకు గూగుల్ కొత్త రూల్స్.. యాప్‌లు ఇన్స్టాల్ చేసేముందు అలా చేయాల్సిందే! -
ఒంటిమిట్ట.. రైలు ఆగేదెట!
రాజంపేట: రాష్ట్రంలో వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతున్న ఒంటిమిట్ట (ఏకశిలానగరం) కోదండరాముని భక్తులపై..స్టేషన్ అభివృద్ధిపై రైల్వే చిన్నచూపు ప్రదర్శిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు భద్రాచలం రామునిక్షేత్రంగా వెలుగొందింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఒంటిమిట్ట ప్రముఖ క్షేత్రంగా భాసిల్లుతోంది. 2014లో ఏపీ ప్రభుత్వం దీనిని అధికారిక ఆలయంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం విలీనం చేసుకుని వందకోట్లకుపైగా వ్యయంతో క్షేత్రాన్ని అభివృద్ధి చేసింది. అయితే రైల్వేశాఖ, రైల్వేమంత్రిత్వశాఖ ఒంటిమిట్టకు నలుదిశల నుంచి ప్రయాణికులు క్షేత్రానికి వచ్చేలా సౌకర్యాలు కల్పించడంలో వివక్షను ప్రదర్శించింది. ఒంటిమిట్టను గుర్తించని దక్షిణమధ్య రైల్వే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం రైల్వేస్టేషన్‌ను గుర్తించినట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ను దక్షిణమధ్యరైల్వే గుర్తించలేదు. ముంబై–చెన్నై కారిడార్ రైలు మార్గంలో నడిచే ప్రతి రైలుకు ఒంటిమిట్టలో స్టాపింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అధ్యాత్మికవేత్తలు అంటున్నారు. ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఒంటిమిట్టను పరిగణలోకి తీసుకోలేదు. ఒంటిమిట్ట, భద్రాచలం రెండు పుణ్యక్షేత్రాలు దక్షిణమధ్యరైల్వేలోనే ఉండేవి. భద్రాచలం స్టేషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను ఒంటిమిట్టకు ఇవ్వడంలేదంటే వివక్ష ప్రదర్శించినట్లేనని భక్తులు భావిస్తున్నారు. దూరప్రాంత భక్తులెలా వచ్చేది.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట రామయ్య దర్శనానికి వస్తున్నారు. భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ మీదుగా భక్తులు వచ్చేందుకు వీలుగా రైళ్లు నడుస్తున్నాయి. ఒంటిమిట్ట స్టేషన్ పేరుకు మాత్రమే ఉంది. ఇక్కడ డెమై రైలు తప్ప ఏ రైలుకు స్టాపింగ్ లేదు. నవ్యాంధ్ర ఏర్పడినప్పటి నుంచి ఒంటిమిట్ట స్టేషన్ అభివృద్ధి చేయాలంటూ ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారు. అయినా రైల్వేశాఖలో ఎటువంటి స్పందన కనిపించలేదన్న విమర్శలున్నాయి. తాజాగా ఒంటిమిట్ట స్టేషన్‌కు ఎఫ్ఓబీకి బ్రేక్ ఒంటిమిట రైల్వేస్టేషన్లో డబుల్ ఫ్లాట్‌ఫాంలు ఉన్నాయి. భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్ధ్యం ఫుట్ఓవర్ బ్రిడ్జిని(ఎఫ్ఓబీ) రైల్వేబోర్డు మంజూరు చేసింది. గుంతకల్ డివిజన్లో మూడుచోట్ల మంజూరు చేస్తే, అందులో ఒంటిమిట్ట ఒకటి కావడం గమనార్హం. సెకండ్ప్లాట్ఫాంకు వెళ్లాలన్నా, అటువైపు పల్లెలోకి వెళ్లాలన్న ఎఫ్ఓబీ నిర్మాణ ఆవశ్యకత ఉంది. నిధులు వెనక్కి వెల్లకుండా అధికారులు ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
రైలు ప్రయాణికులకు అలర్ట్; పలు రైళ్ల రద్దు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): దేశంలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల దృష్ట్యా ఆయా మార్గాలలో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ► విశాఖపట్నంలో ఈ నెల 29, వచ్చేనెల 5, 12, 19 తేదీలలో బయల్దేరే విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెర్మినస్(22847) వయా రాయగడ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రద్దయింది. ► లోకమాన్యతిలక్ టెర్మినస్‌లో ఈ నెల 31, వచ్చేనెల 7, 14, 21 తేదీలలో బయల్దేరే లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(22848) ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో రద్దయిన రైళ్లు.. ► సంబల్పూర్లో బయల్దేరాల్సిన సంబల్పూర్–రాయగడ(18301) ఎక్స్‌ప్రెస్ ► రాయగడలో బయల్దేరాల్సిన రాయగడ–సంబల్పూర్(18302) ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–భువనేశ్వర్(22820) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ► భువనేశ్వర్‌లో బయల్దేరాల్సిన భువనేశ్వర్–విశాఖపట్నం (22819) ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నంలో బయల్దేరాల్సిన విశాఖపట్నం–పలాస(18532) ఎక్స్‌ప్రెస్ ► పలాసలో బయల్దేరవలసిన పలాస– విశాఖపట్నం(18531) ఎక్స్‌ప్రెస్ ► విశాఖపట్నంలో బయల్దేరవలసిన విశాఖపట్నం–కోరాపుట్(08546) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ► కోరాపుట్‌లో బయల్దేరవలసిన కోరాపుట్–విశాఖపట్నం(08545) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ► పూరీలో బయల్దేరాల్సిన పూరి–గుణుపూర్(18417) ఎక్స్‌ప్రెస్ ► గుణుపూర్‌లో బయల్దేరాల్సిన గుణుపూర్–పూరి (18418) ఎక్స్‌ప్రెస్. -
తల్లీబిడ్డ కోసం.. ‘బేబీ బెర్త్’
రైల్వే ప్రయాణం సరసమైన ధరల్లో సౌకర్యవంతంగా ఉంటుందని అందరికీ తెలుసు. అందుకే పిల్లాపాపలతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు ఎక్కువగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. కానీ చిన్న పిల్లలతో వెళ్లే తల్లులు మాత్రం బెర్త్‌లో పడుకునే సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అందుకే మదర్స్ డే సందర్భంగా తల్లులకు రైల్వే కొత్త బహుమతి అందించింది. ‘బేబీ బెర్త్’ను అందుబాటులోకి తెచ్చింది. బోగీలో లోయర్ మెయిన్ బెర్త్‌కు అనుసంధానంగా మడిచే (ఫోల్డబుల్) బేబీ బెర్త్‌ను ఏర్పాటు చేస్తోంది. తొలుత లక్నో మెయిల్లో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. ఓ బోగీలోని రెండు సీట్లకు ఈ బెర్త్‌లను జత చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రైల్వే శాఖ ట్విట్టర్లో షేర్ చేసింది. ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకొని మిగతా రైళ్లలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. బేబీ బెర్త్ గురించి మరిన్ని విషయాలు.. ♦ఈ బెర్త్ లోయర్ బెర్త్ కిందకు మడిచిపెట్టి ఉంటుంది. కింది నుంచి పైకి లాగి పెద్ద బెర్త్‌కు సమానంగా వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. ♦బేబీ బెర్త్ కిందికి వంగిపోకుండా కింద స్టీల్ లాక్‌లు ఉంటాయి. వాటిని మెయిన్ బెర్త్‌కు ఉన్న రంధ్రాల్లోకి నెట్టాలి. చిన్నారి పడిపోకుండా ఉండేందుకు బెల్టులు ఉంటాయి. ♦ప్రయాణం అయిపోయాక స్టీల్ లాక్‌లను తీసేసి మళ్లీ మెయిన్ బెర్త్ కిందికి మడతబెట్టాలి. ♦చిన్నారితో కలిసి ప్రయాణిస్తున్నామని బుకింగ్ సమయంలో చెబితే బెర్త్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటారు. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఇక అన్నీ కరెంటు ఇంజన్లే..
సాక్షి, హైదరాబాద్: త్వరలో రైళ్ల డీజిల్ ఇంజిన్లు కనుమరుగుకాబోతున్నాయి. వాటి స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ ఇంజిన్లే రానున్నాయి. ఈమేరకు అన్ని రైల్వే లైన్లను విద్యుదీకరించే పనులను కేంద్రం వేగవంతం చేసింది. గత ఏడాది కాలంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 770 కి.మీ. మేర విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ఇది జోన్ ఆల్‌టైం రికార్డు. అదీగాక ఇంత విస్తృతంగా మరే జోన్లో పనులు జరగలేదు. ఇందులో తెలంగాణ పరిధిలో 326 కి.మీ. ఎలక్ట్రిఫికేషన్ పూర్తి కావటం విశేషం. వచ్చే సంవత్సరం డిసెంబరు నాటికి జోన్ యావత్తు విద్యుదీకరణ పూర్తి చేయాలని రైల్వే బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులు పూర్తయితే 20 నెలల్లో అన్నిలైన్లలో విద్యుత్ లోకోమోటివ్‌లే నడనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1,850 కి.మీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ భూభాగం పూర్తిగా ఉంటుంది. రాష్ట్రం పరిధిలో 1,850 కి.మీ. మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. మనోహరాబాద్–కొత్తపల్లి లాంటి కొత్త ప్రాజెక్టుల పనులు జరుగుతున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్టు నిడివి ఇందులో కలపలేదు. గత ఏడాది పూర్తయిన 326 కి.మీ. కలుపుకొంటే ఇప్పటివరకు 1450 కి.మీ. మేర విద్యుదీకరణ పూర్తయింది. ఇక 400 కి.మీ.మేర మాత్రమే పనులు జరగాల్సి ఉంది. దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో త్వరలో వందశాతం విద్యుదీకరణ పూర్తవుతుందని జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. డీజిల్ ఇంజిన్‌తో భారీ వ్యయం ఖర్చు పరంగా చూస్తే డీజిల్ ఇంజిన్‌తో రైల్వేకు భారీగా వ్యయమవుతోంది. ప్రతి వంద కిలోమీటర్ల ప్రయాణానికి డీజిల్ ఇంజిన్‌తో రూ.65 వేలు ఖర్చు అవుతుండగా, ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో రూ.45 వేలు అవుతోంది. అంటే ప్రతి వంద కి.మీ.కు ఎలక్ట్రిక్ వినియోగంతో రూ.20 వేలు ఆదా అవుతుంది. అదీగాక పొగరూపంలో కాలుష్యం కూడా ఉండదు. కన్వర్షన్‌పై దృష్టి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారీకి రూ.18 కోట్లు అవుతుంది. అదే డీజిల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ ఇంజిన్‌గా కన్వర్ట్ చేసుకోవటం తక్కువ ఖర్చుతో కూడుకున్న ది. రూ.2కోట్లతో ఓ ఇంజిన్‌ను కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న డీజిల్ ఇంజిన్లు బాగా పాతబడి ఉన్నాయి. వచ్చే ఏడెనిమిదేళ్లలో అవి పనికిరాకుండా పోయే పరిస్థితి. వాటిని మెరు గుపరిస్తే మరో పదేళ్లు వాడే వీలుందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఉన్న డీజిల్ ఇంజిన్లను కన్వ ర్ట్ చేయటం ద్వారా తక్కువ వ్యయంతో కరెంటు ఇంజిన్లను పట్టాలెక్కించాలని రైల్వే భావిస్తోంది. -
షాకింగ్ వీడియో: ఉక్రెయిన్‌లో భారతీయులకు చేదు అనుభవం
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా సైనిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ విద్యార్థులు ఉక్రెయిన్‌కు వీడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. విమానాల రద్దు కారణంగా భారత్ సహా ఇతర దేశాల విద్యార్థులు ఉక్రెయిన్ను దాటేందుకు రైలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఎంతో కష్టంతో రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత వారికి చేదు అనుభవమే మిగులుతోంది. అయితే, ఖార్కీవ్పై రష్యా బాంబులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో తక్షణం ఖార్కీవ్ను విడాలని ఇండియన్ ఎంబసీ తాజా అడ్వైజరీ మేరకు వందల సంఖ్యలో భారత విద్యార్థులు రైల్వేస్టేషన్‌కు చేరుకొన్నారు. అనంతరం వారు రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా ఉక్రెయిన్ ట్రైన్ గార్డులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే రైళ్లలో ఎక్కిన భారతీయులను దింపివేయడంతో వారు ఒక్కసారిగా షాకయ్యారు. కాగా, రైలులోకి కేవలం ఉక్రెయిన్ పౌరుల కోసం మాత్రమే డోర్లు తెరుస్తున్నట్టు విద్యార్థులు చెప్పారు. ఇదిలా ఉండగా గార్డులు భారత విద్యార్థులను అడ్డుకోవడమే కాకుండా వారిని కొడుతూ, కాళ్లతో తన్నినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వారిని భయపెట్టేందకు తుపాకులతో గాలిలోకి కాల్పుల కూడా జరిపినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉక్రెయిన్ గార్డుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారత్‌కు చెందిన 600 విద్యార్థులు ఈశాన్య ఉక్రెయిన్-రష్యా సరిహద్దులోని సుమీ యూనివర్సిటీలో చిక్కుకున్నారు. వీరిని తరలించేందుకు ఎంబీసీ ప్రయత్నం చేయలేదని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు భారత జాతీయ జెండాను చూపించి టర్కీ, పాకిస్తాన్ దేశాల విద్యార్థులు సరిహద్దులకు చేరుకుంటున్నట్టు భారత విద్యార్థులు పేర్కొంటున్నారు. This is how Indians are being treated in Ukraine. They aren't allowed to board a train by Ukrainian officers. Shouldn't I call this racism and discrimination?#UkraineRussiaWar #IndiansInUkraine #RacistUkrainepic.twitter.com/BsqVGr4vRR — Mister J. (@Angryoldman_J) March 2, 2022 -
సాధారణ టికెట్‌తోనే రిజర్వ్డ్ కోచ్‌లో ప్రయాణం
సాక్షి, రైల్వేస్టేషన్ (విజయవాడ): అన్ రిజర్వ్డ్ ప్రయాణికుల సౌకర్యం కోసం విజయవాడ డివిజన్ పరిధిలో నడిచే 50 రైళ్లలో కొన్ని రిజర్వ్డ్ కోచ్‌లను సాధారణ కోచ్‌లుగా మార్చి నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నస్రత్ మండ్రూపక్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గూడురు– సికింద్రాబాద్, గూడురు–విజయవాడ, విజయవాడ–సికింద్రాబాద్, నర్సాపూర్–ధర్మవరం, తిరుపతి–కాకినాడ టౌన్, నర్సాపూర్–లింగంపల్లి, మచిలీపట్నం–బీదర్, విజయవాడ– లింగం పల్లి, తిరుపతి–ఆదిలాబాద్ రైళ్లతో సహా 50 రైళ్లలో గుర్తించిన కొన్ని రిజర్వ్డ్ కోచ్‌లలో సాధారణ ప్రయాణికులు ఎక్కేందుకు అవకాశం కల్పించినట్లు ఆమె తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. చదవండి: (‘అమ్మా ! నేను అందరిలా మళ్లీ బడికెళ్లగలనా..?') -
‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కూడా!
గత కొన్ని దశాబ్దాలపాటు ఆంక్షల నడుమ జీవనం సాగించిన సౌదీ అరేబియా మహిళ లు.. యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ నిర్ణయాలతో ఇతర దేశాల్లోని మహిళల వలే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో చేరుతూ తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. 2018 వరకు ఆంక్షల్లో ఉన్న... మహిళల డ్రైవింగ్, మగతోడు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లడం, ఒంటరి ప్రయాణాలకు అవకాశం కల్పించడం, ఆర్మీలో చేరడానికి ఒప్పుకోవడం వంటి సంచలనాత్మక నిర్ణయాలతో అక్కడి మహిళలు సంకెళ్ల నుంచి బయటపడ్డట్టుగా భావిస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న సౌదీలో ఇటీవల మక్కా మసీదులో మహిళా భద్రతా సిబ్బందిని కూడా నియమించడం సంచలనం సృష్టించింది. మొన్నటిదాకా ప్రపంచంలోనే మహిళా ఉద్యోగుల శాతం అతి తక్కువగా ఉన్న సౌదీలో.. ప్రస్తుతం ఉద్యోగాలకోసం మహిళలు వేలల్లో పోటీ పడుతున్నారు. ‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’ అంటూ నిబంధనలు సడలించడంతో వివిధ రంగాల్లో పనిచేసేందుకు అక్కడి మహిళలు అవకాశాల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. తాజాగా బుల్లెట్ ట్రైన్స్ నడపడానికి మహిళా డ్రైవర్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా.. దాదాపు 30 వేలమంది పోటీపడ్డారు. ఈ ఏడాది జనవరి మొదట్లో సౌదీ రైల్వే పాలిటెక్నిక్ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళలు రైళ్లు నడిపేందుకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. సౌదీలో అత్యంత పవిత్ర నగరాలైన మక్కా, మదీనా మధ్య రైలు సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోన్న స్పానిష్ సంస్థ మహిళా ట్రైన్ డ్రైవర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రకటనతో సౌదీ మహిళల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. 30 ఖాళీలకుగానూ 28 వేల దరఖాస్తులు వచ్చాయి. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణను ఇస్తారు. తరువాత మక్కా నుంచి మదీనా వరకు నడిచే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లను నడుపుతారు. కొన్నేళ్లుగా అనేక పరిమితులు, ఆంక్షలతో ఇటువంటి అవకాశం, నోటిఫికేషన్ రావడం ఇదే మొదటిసారి కావడంతో వేలాదిమంది మహిళలు ట్రైన్ డైవర్లు అయ్యేందుకు పోటీ పడ్డారు. యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ .. మహిళల అభ్యున్నతి, సాధికారతకు తీసుకుంటున్న నిర్ణయాలతో.. సౌదీలో కూడా ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రైవేటు సెక్టార్లలో కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హోటల్స్, ఫుడ్ ఇండస్ట్రీస్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్యలో నలభై శాతం పెరుగుదల ఉండగా, ఉత్పాదక రంగంలో 14 శాతం, నిర్మాణ రంగంలో 9 శాతం వృద్ధి నమోదైంది. సౌదీ మహిళలకు ఇప్పటిదాకా టీచర్లుగా, హెల్త్ వర్కర్లుగా మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. మిగతా రంగాల్లో మగవాళ్లకు మాత్రమే అనుమతి ఉండడంతో వారి ఉద్యోగపరిధి అక్కడితోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ ట్రైన్ డ్రైవర్ల నియామక స్ఫూర్తితో సౌదీలో మహిళల సారథ్యంలో రైళ్లు మరింత వేగంగా ముందుకు దూసుకుపోతాయని ఆకాంక్షిద్దాం. -
దోపిడికి గురవుతున్న సరకు రవాణా రైళ్లు... గుట్టలుగా పడి ఉన్న ఆన్లైన్ ప్యాకేజ్ కవర్లు
Thieves Raid Amazon, FedEx Train Cargo: ఇంతవరకు మనదేశంలో రైళ్లలో దొంగతనాలు గురించి ఉంటాం. అయితే లాంగ్ జర్నీ చేసే రైళ్లలో కచ్చితంగా దొంగతనాలు జరుగుతుండటం గురించి విన్నాం. మనం ఆన్లైన్లో ఆర్డర్‌చేసే వస్తువలను తీసుకువచ్చే గూడ్స్ రైళ్లపై దొంగలు దాడి చేసి పట్టుకుపోవడం గురించి విని ఉండం. పైగా సరకు కవర్లు కూడా అక్కడే పట్టాలపై గుట్టలు గుట్టలుగా పడేసి వెళ్లిపోతున్నారట. అసలు విషయంలోకెళ్తే...లాస్ ఏంజిల్స్‌లోని సరకులు రవాణ చేసే రైళ్లపై దొంగలు దాడి చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా రైళ్లు ఆగే ప్రదేశం కోసం వేచి చూసి డజన్లకొద్ది ఆన్లైన్లో ఆర్డర్ చేసే ఉత్పత్తులను ఎత్తుకుపోతారు. అంతేకాదు రైల్వే కంటైనర్ల పై దాడి చేసి కోవిడ్-19 టెస్ట్ కిట్లు, ఫర్నీచర్ లేదా మందులు వంటివి చాల ఎత్తుకుపోయారు. ఈ మేరకు శుక్రవారం సిటీ సెంటర్‌కి సమీపంలో ఉన్న పట్టాలపై కొన్ని వేల ఆన్లైన్ ప్యాకేజ్‌లు పడి ఉండటాన్ని చూస్తే సమీపంలోని వీధుల నుంచి చాలా సులభంగా రైల్వే కంటైనర్ల వద్దకు చేరకోగలుగుతున్నారని చెప్పవచ్చు ఈ దొంతనాలు గతేడాది యూఎస్‌లో డిసెంబర్ నాటికి సుమారు 160% కి చేరితే ఈ ఏడేది ఆ సంఖ్య కాస్త 356%కి చేరింది. ఈ దొంగల ముఠా దెబ్బకు ప్రముఖ ఆన్‌లైన వ్యాపార సంస్థలైన అమెజాన్, టార్డెట్, యూపీఎస్, ఫెడ్ఎక్స్ వంటి కంపెనీలు భారీగా దెబ్బతిన్నాయి. అయితే ఈ దొంగతనాలను అడ్డుకట్టవేయడానికి డ్రోన్లు ఇతర డిటెక్షన్ సిస్టమ్‌లతో సహా -- నిఘా చర్యలను బలోపేతం చేసినట్లు లాస్ఏంజెల్స్లోని యూనియన్ పసిఫిక్ తెలిపింది . పైగా మరింత మంది భద్రతా సిబ్బందిని నియమించింది. అయితే ఆ దొంగలను పట్టుకున్న తర్వాత కోర్టు చిన్న నేరంగా పరిగణించి ఓ మోస్తారు జరిమాన విధించి వదిలేయడంతో వాళ్లు 24 గంటల్లో విడుదలైపోతున్నారని యూనియన్ పసిఫిక్ వాపోయింది. పైగా వారు ఈ దోపిడి దాడులు నిర్వహించేటప్పుడు విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులపై దాడులు చేయడం లేదా నిప్పంటించడం వంటి విధ్వంసకర పనులకు తెగబడతున్నారని తెలిపింది. ఈ దొంగతనాలు కారణంగా గతేడాది దాదాపు రూ 36 కోట్ల నష్టం వాటల్లిందని పేర్కొంది. ఈ విషయమై యూనియన్ పసిఫిక్ లాస్ ఏంజెల్స్ కౌంటీ అటార్నీ కార్యాలయానికి లేఖ రాయడమే కాక గతేడాది అవలంభించిన భద్రతా విధానాన్ని మళ్లీ పునం పరిశీలించమని కోరింది. (చదవండి: కరోనాకు 'కత్తెర'.. రెండు కొత్త చికిత్సా విధానాలు ఆమోదం) -
సంక్రాంతికి మరో 2 ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా మరో 2 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. తిరుపతి–కాచిగూడ ప్రత్యేక రైలు (82721) ఈ నెల 16న సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. నర్సాపూర్–కాచిగూడ ప్రత్యేక రైలు (82722) ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని పేర్కొన్నారు. -
పండుగకు రైలు బండి గగనమే!!
సాక్షి హైదరాబాద్: ఈసారి సంక్రాంతికి సొంత ఊరుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్న నగర వాసులను వివిధ మార్గాల్లో నడిచే రైళ్లు నిరాశకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు 250 నుంచి 300 వరకు చేరింది. కొన్ని రైళ్లలో ‘నో రూమ్’ దర్శనమిస్తోంది. బెర్తులన్నీ పూర్తిగా భర్తీ కావడంతో ఫిబ్రవరి వరకు బుకింగ్ సేవలను సైతం నిలిపివేశారు. సాధారణంగా మూడు నెలల ముందే రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం ఉండడంతో డిసెంబర్లోనే అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు పెరిగింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఇప్పటికిప్పుడు ప్రత్యేక రైళ్లు వేస్తే తప్ప నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లడం సాధ్యం కాదు. కానీ ఈ దిశగా దక్షిణమధ్య రైల్వే పెద్దగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కొన్ని రూట్లలో మాత్రం అరకొరగా అదనపు రైళ్లను ప్రకటించారు. పెరగనున్న రద్దీ.. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా జనం సొంత ఊళ్లకు వెళ్లకుండా నగరంలోనే సంక్రాంతి వేడుకలు చేసుకున్నారు. మరోవైపు రైళ్లు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఎంపిక చేసిన మార్గాల్లో అదనపు చార్జీలతో ప్రత్యేక రైళ్లు నడిపారు. దీంతో సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్న వాళ్లు ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలపైన ఆధారపడాల్సి వచ్చింది. ప్రస్తుతం అన్ని రూట్లలో రెగ్యులర్ రైళ్లను పునరుద్ధరించారు. అదనపు చార్జీలను రద్దు చేశారు. ప్రస్తుతం నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతి రోజు సుమారు 120 ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నుంచి విశాఖ, కాకినాడ, విజయవాడ,తిరుపతి, బెంగళూరు, ముంబయి, షిరిడీ, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రైళ్లలో ఇప్పటికే బెర్తులు భర్తీ అయ్యాయి. రానున్న రోజుల్లో మరింత రద్దీ పెరగనుంది. ప్రత్యేకంగా విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి వైపు వెళ్లే రైళ్లకు మరింత డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. ప్రత్యేక రైళ్లు పది.. ఒకవైపు రద్దీ భారీగా ఉండగా, దక్షిణమధ్య రైల్వే మాత్రం తాజాగా సంక్రాంతి సందర్భంగా 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కాచిగూడ–విశాఖపట్టణం (07497/ 07498) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14 తేదీల్లో రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 16 తేదీల్లో సాయంత్రం 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ–నర్సాపూర్ (82716/07494) సువిధ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 11న రాత్రి 11.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాకినాడ–లింగంపల్లి ( 07491/07492) స్పెషల్ ట్రైన్ ఈ నెల 19, 21 తేదీల్లో రాత్రి 8.10కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 20, 22 తేదీల్లో సాయంత్రం 6.40కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. నిరీక్షణే మిగిలింది.. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే గౌతమి. విశాఖ, నర్సాపూర్, ఫలక్‌నుమా, నారాయాణాద్రి, పద్మావతి, వెంకటాద్రి, తదితర అన్ని రైళ్లలో 250 నుంచి 300 కు పైగా వెయిటింగ్ లిస్టు పెరిగింది. ఫిబ్రవరి మొదటి వారం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేకంగా ఈ నెల 10వ తేదీ నుంచి 20 వరకు ప్రయాణం చేసేందుకు ఏ మాత్రం అవకాశం లేదు. స్లీపర్, ఏసీ బోగీలన్నీ నిండిపోయాయి. -
గంజాయి అక్రమ రవాణాకు హాట్‌స్పాట్స్‌గా మారుతున్న రైళ్లు
-
Metro trains: ఆరుకొట్టంగనే మెట్రో
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో వేళలు బుధవారం నుంచి ఉదయం 6 గంటలకే ప్రారంభం అయ్యాయి. ఉదయం వేళల్లో క్యాబ్‌లు, ఆటోల దోపిడీ నుంచి ఉపశమనానికి మెట్రో వేళలను మార్చాలని కోరుతూ ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు సోమవారం ట్విట్టర్లో విన్నవించిన సంగతి విదితమే. దీంతో ఆయన ఏకీభవిస్తూ.. మెట్రో అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేశారు. ఆయన సూచనల మేరకు వేళల్లో మార్పులు చేస్తున్నట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చివరి రైలు వేళలను మాత్రం మార్పు చేయకపోవడం గమనార్హం. ఈ రైలు ఒక చివరి నుంచి రాత్రి 10.15 గంటలకు బయలుదేరి... రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానం చేరుతుందని ప్రకటించారు. బాలారిష్టాలు దాటనేలే.. నగరంలో మెట్రో ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా బాలారిష్టాలను అధిగమించనేలేదు. ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్– ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం రూట్లలోని అన్ని మెట్రో స్టేషన్ల వద్ద ద్విచక్ర వాహనాలు, కార్లను నిలిపేందుకు ఉచిత పార్కింగ్ సదుపాయం లేకపోవడం, పలు చోట్ల పార్కింగ్ దోపిడీ నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆయా స్టేషన్ల నుంచి సమీప కాలనీలు, బస్తీలకు చేరుకునేందుకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. ప్రయాణికులు ఆటోలు,క్యాబ్‌లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోంది. వెంటాడుతున్న ఆర్థిక నష్టాలు.. ► కోవిడ్, లాక్డౌన్, ఐటీ కంపెనీల వర్క్ ఫ్రం హోం తదితర కారణాలు మెట్రోను ఆర్థికంగా భారీగా దెబ్బతీశాయి. లాక్‌డౌన్‌కు ముందు మూడు మార్గాల్లో నిత్యం 4.5 లక్షల మంది జర్నీ చేసేవారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య రోజుకు కనాకష్టంగా 2.5 లక్షలు దాటడంలేదు. ► మరోవైపు నిర్మాణ సమయం పెరగడంతో వ్యయం దాదాపు రూ.3 వేల కోట్ల మేర పెరిగినట్లు సమాచారం. నిర్మాణం సమయంలో రూపొందించిన అంచనాల ప్రకారం మెట్రో ప్రాజెక్టుకు చేసిన వ్యయంలో 45 శాతం ప్రయాణికుల చార్జీలు, మరో అయిదు శాతం వాణిజ్య ప్రకటనలు, మరో 50 శాతం రియల్టీ, రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ► ఈ మూడు అంశాల్లోనూ నిర్మాణ సంస్థ అంచనాలు తల్లకిందులు కావడంతో ఆర్థిక నష్టాలు తప్పడంలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను ఆదుకునేందుకు సాఫ్ట్‌లోన్ మంజూరు చేస్తామని సూచనప్రాయంగా ప్రకటించడంతోపాటు సీఎం కేసీఆర్ సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. కానీ.. రుణ మంజూలు, ఇతరత్రా ఆర్థిక సాయం అందించే విషయంలో స్పష్టత రాకపోవడం గమనార్హం. -
ప్యాసింజర్ రైళ్లకు.. మరో 2 వారాలు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ రెండో దశ పూర్తిగా తగ్గినందున ఇక అన్ని రైళ్లను ప్రారంభించాలని యోచిస్తున్న సమయంలో రైల్వేను మూడో దశ హెచ్చరికలు తిరిగి పునరాలోచనలో పడేశాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మూడో దశపై వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో అక్టోబర్ చివరి నాటికి అన్ని రకాల రైళ్లను పునరుద్ధరించాలన్న నిర్ణయంతో ఉన్న రైల్వే బోర్డు మళ్లీ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. దీపావళి పర్వదినం సందర్భంగా ప్రజలు ఒకరింటికి మరొకరు వెళ్లి ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఒకవేళ కోవిడ్ మూడో దశ మొదలైనట్టయితే.. ఈ వేడుకల మాటున కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో దీపావళి తర్వాత రెండు వారాల పాటు ఎదురు చూసి అప్పటి పరిస్థితికి తగ్గట్లు రైళ్ల విషయంలో నిర్ణయం తీసుకోవాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ బారిన పడ్డవారికి చేరువుగా మెలిగినవారిలో రెండు వారాల్లో లక్షణాలు వెలుగుచూసే అవకాశం ఉన్నందున అప్పటి వరకు ఎదురు చూడాలన్న యోచనలో రైల్వే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కటమనేది దీనిపైనే ఆధారపడి ఉందని అంటున్నారు. పట్టాలెక్కని ప్యాసింజర్ రైళ్లు.. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 250 ప్యాసింజర్ రైళ్లు నిత్యం పరుగుపెడుతుంటాయి. కోవిడ్ నేపథ్యంలో 2020 మార్చి చివరలో మొదటిసారి లాక్డౌన్ విధించినప్పుడు ఆగిన ఈ రైళ్లు ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ రైళ్లు దశలవారీగా ప్రారంభమై దాదాపు గరిష్ట స్థాయిలో నడిపారు. మళ్లీ రెండో దశలో లాక్డౌన్ విధించినప్పుడు కొంతకాలం అవి నిలిచిపోయినా.. మళ్లీ ఆ తర్వాత ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దాదాపు అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఇక దాదాపు 15 నెలలపాటు షెడ్లకే పరిమితమైన హైదరాబాద్ సిటీ ఎంఎంటీఎస్ రైళ్లు కూడా పరిమిత సంఖ్యలో ప్రారంభమై దశలవారీగా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌లో మొత్తం 121 ఎంఎంటీఎస్ రైళ్లు ఉండగా, ప్రస్తుతం 60 రైళ్లు నడుస్తున్నాయి. వీటి సంఖ్య పెంచుతూ ఇక ప్యాసింజర్ రైళ్లకు కూడా పచ్చజెండా ఊపొచ్చని గత నెలలో నిర్ణయించారు. కానీ, వారం రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. దీపావళి ముగిసిన తర్వాత కొన్ని రోజులు పరిస్థితిని గమనించిన తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చన్న అభిప్రాయాలు రైల్వే వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నాయి. అయితే, అన్ని ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయేలా ఉన్నా... వాటిలోంచి 50 రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా నడుపుతుండటం విశేషం. వీటి స్టాపుల సంఖ్య తగ్గించి, అన్ రిజర్వ్డ్ సీట్లకు బదులు ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో టికెట్లు జారీ చేస్తూ నడుపుతున్నారు. తదుపరి రైల్వే బోర్డు నిర్ణయం తీసుకునే వరకు.. అన్ని స్టాపుల్లో ఆగుతూ, అతి తక్కువ టికెట్ ధరతో ప్రయాణించే వెసులుబాటు ఉండే ప్యాసింజర్ రైళ్లు ఎక్కే అవకాశం లేనట్లే. -
ట్రైన్ హారన్ సౌండ్ మారింది, హారన్‌కు బదులు కుక్క అరుపులు
ప్రపంచవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జపాన్.. రైలు కూతలకు కుక్క అరుపులు జోడించిందనే వార్త హాస్యస్పదమే. కానీ ఇది నిజం. భూకంప పరిస్థితుల్లో సైతం ప్రత్యేక ఆటోమేటిక్ లాకింగ్ వ్యవస్థలు కలిగిన జపనీస్ ట్రైన్ టెక్నాలజీకి.. 2018 వరకూ ఆ దేశ వన్యప్రాణులే బ్రేక్స్ వేసేవి. సూపర్ ఫాస్ట్ షింకన్సేన్ (బుల్లెట్ ట్రైన్) సైతం దూసుకుపోగలిగే జపాన్ రైల్వే ట్రాక్స్‌పై వందలాదిగా జింకలు ప్రాణాలు కోల్పోవడం, ఆ కారణంగా రైల్వే ప్రయాణికులు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకోవడం.. ఇలా జపాన్‌కి పెద్ద సమస్యే వచ్చిపడింది. ట్రాక్స్‌కి, హిల్స్‌కి జరిగే యాక్షన్‌లో కొన్ని ఐరన్ ఫిల్లింగ్స్ ఆకర్షించే రుచిని కలిగి ఉండటంతో..వాటిని నాకేందుకు జింకలు భారీగా రైల్వే ట్రాక్స్ మీదకు వస్తున్నాయని అధ్యయనాలు తేల్చాయి. అలా వచ్చిన జింకలు రైలు కిందపడి చనిపోయేవి. దాంతో రంగంలోకి దిగిన రైల్వే టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్టీఆర్ఐ) పరిష్కారం దిశగా అడుగులు వేసింది. సింహం పేడను తెచ్చి ట్రాక్ పొడవునా జల్లి ఓ ప్రయోగం చేశారు. ఆ వాసనకి అక్కడ సింహాలు ఉన్నాయేమోనన్న భయంతో జింకలు ట్రాక్ మీదకి వచ్చేవి కావట. అయితే వర్షం పడి సింహం పేడ కొట్టుకుపోవడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. శాశ్వత పరిష్కారం కోసం రైలు కూత శబ్దానికి కుక్క అరుపులను జోడించారు. 20 సెకన్ల పాటు కుక్క అరుపులు వినిపిస్తుంటే.. జింకలు ట్రాక్ మీద నుంచి తుర్రుమనడం గమనించిన అధికారులు.. ఇదే పద్ధతిని అవలంబించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో జపాన్ రైళ్లు కుక్కల్లా మొరుగుతున్నాయి. ఐడియా అదుర్స్ కదూ. చదవండి: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్! -
ఐసీఎఫ్‌కు ‘వందే భారత్’
సాక్షి, చెన్నై: చెన్నై ఐసీఎఫ్‌లో వందేభారత్ రైళ్లు 30 రూపు దిద్దుకోనున్నాయి. ఈ మేరకు ఒక్కో రైలుకు రూ. వంద కోట్లు వెచ్చించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చెన్నై పెరంబూరులోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) ఘన చరిత్ర గురించి తెలిసిందే. ఈ ఫ్యాక్టరీ నుంచి దేశ విదేశాలకు వేలాది రైలు బోగీలు తయారు చేసి పంపించారు. ఇటీవల పట్టాలెక్కిన రెండు వందే భారత్ రైళ్లను ఇక్కడే సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం రైల్వే యంత్రాంగం వందే భారత్ రైళ్లను మరిన్ని పట్టాలెక్కించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పంజాబ్‌లోని ఐసీఎఫ్, ఉత్తర ప్రదేశ్‌లోని ఐసీఎఫ్‌కు తలా 14 చొప్పున రైళ్ల తయారీకి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే, చెన్నైలోని ఐపీఎఫ్‌లో ఏకంగా 30 రైళ్లకు సంబంధించిన బోగీలు తయారు చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికత, వసతులు కలిగిన 16 బోగీలతో కూడిన ఒక వందే భారత్ రైలుకు రూ. వంద కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 2024 మార్చి 31 నాటికి ఈ రైళ్లను కేంద్ర రైల్వే యంత్రాంగానికి అప్పగించే లక్ష్యంతో పనులపై దృష్టి సారించారు. ఎలక్ట్రిక్ బస్సులు మాకొద్దు.. కేంద్రం నిధులతో కొనుగోలు చేయదలిచిన ఎలక్ట్రిక్ బస్సులకు మంగళం పాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. చెన్నైలో 525 ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపేందుకు కసరత్తులు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ బస్సుల్ని కేంద్రం నిధులు, కేంద్రం ఇచ్చే సూచనలకు అనుగుణంగా కొనుగో లు చేయాల్సి ఉంది. దీంతో కేంద్రం నిధులతో ఈ బస్సులు తమకు వద్దన్న నిర్ణయానికి డీఎంకే పాల కులు వచి్చనట్లు సచివాలయ వర్గాల సమాచారం. -
ఈనెల 19 నుంచి పట్టాలెక్కనున్న సాధారణ రైళ్లు
న్యూఢిల్లీ : ఈనెల 19 నుంచి సాధారణ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే సాధారణ రైళ్లను పునరుద్ధరించింది. 82 ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్..16 ఎక్స్‌ప్రెస్ స్పెషల్ సర్వీస్, 66 ప్యాసింజర్ స్పెషల్ సర్వీసులు నడపనుంది. ప్రయాణికులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించింది. -
పలు రైళ్ల దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ఈస్ట్రన్ రైల్వే పరిధి హౌరా–బర్ధమాన్ సెక్షన్లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా వాల్తేర్ డివిజన్ నుంచి నడిచే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. మార్పులను గమనించి, వీటికనుగుణంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు ►బెంగళూరులో శుక్రవారం బయలుదేరిన బెంగళూరు–గౌహతి(02509) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ వయా ఖరగ్‌పూర్, హౌరా, బందేల్, బర్ధమాన్ మీదుగా ప్రయాణించి హౌరా స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. ►యశ్వంత్‌పూర్‌లో శుక్రవారం బయలుదేరిన యశ్వంత్‌పూర్–గౌహతి(06577) సమ్మర్ స్పెషల్ వయా ఖరగ్‌పూర్, హౌరా, బందేల్, బర్ధమాన్ మీదుగా ప్రయాణించి హౌరా స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. త్రివేండ్రం– మాల్డా మధ్య స్పెషల్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా త్రివేండ్రం–మాల్డా –త్రివేండ్రం మధ్య స్పెషల్ సర్వీసు నడుపుతున్నట్లు డీసీఎం త్రిపాఠి తెలిపారు. త్రివేండ్రం–మాల్డా టౌన్ (06185) సమ్మర్ స్పెషల్ త్రివేండ్రంలో ఈ నెల 15వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి ఆదివారం రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి అర్ధరాత్రి 12.10 గంటలకు బయలుదేరి మూడవ రోజు(ప్రయాణ రోజు నుంచి) రాత్రి 8.10 గంటలకు మాల్డా టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మాల్డా టౌన్–త్రివేండ్రం సమ్మర్ స్పెషల్ మాల్డా టౌన్లో ఈ నెల 18వ తేదీ మంగళవారం రాత్రి 7.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 3.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 3.55 గంటలకు బయలుదేరి మూడవ రోజు (ప్రయాణ రోజు నుంచి) రాత్రి 11.10 గంటలకు త్రివేండ్రం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, కటక్, భద్రక్ స్టేషన్లలో ఆగుతుంది. 13–స్లీపర్ క్లాస్, 4–జనరల్ సెకండ్ క్లాస్, 2–లగేజీ కం బ్రేక్ వ్యాన్ కోచ్‌లతో ఈ రైలు నడుస్తుంది. చదవండి: పల్లెకు దూరమై.. చేనుకు చేరువై! ప్రైవేట్ ఆస్పత్రుల్లో అక్రమాలపై విజిలెన్స్ కొరడా -
23 రైళ్లు తాత్కాలిక రద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే 23 రైళ్లను తాత్కాలికంగా రద్దుచేయగా, మరో రెండింటిని పాక్షికంగా రద్దు చేసింది. కోవిడ్ దృష్ట్యా గతకొద్ది రోజులుగా రైళ్లలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ చాలావరకు పడిపోయింది. దీంతో డిమాండ్ ఉన్న రూట్లలోనే నడుపుతున్నారు. ఔరంగాబాద్–నాందేడ్, ఆదిలాబాద్–నాందేడ్, వికారాబాద్–గుంటూరు, సికింద్రాబాద్–యశ్వంత్‌పూర్, తిరుపతి–మన్నార్గుడి, రేపల్లె–కాచి గూడ, గుంటూరు–కాచిగూడ, సికింద్రాబాద్–సాయినగర్ షిరిడి, చెన్నై సెంట్రల్–తిరుపతి, సికింద్రాబాద్–విశాఖపట్టణం, ఔరంగాబాద్– రేణిగుంట, పర్బనీ–నాందేడ్ మధ్య రాకపోకలు సాగించే రైళ్లను ఆదివారం నుంచి జూన్ 2 వరకు రద్దు చేసినట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. నాందేడ్–తాండూరు–పర్బనీ మధ్య నడిచే 2 సరీ్వసులను ఈనెల 31 వరకు సికింద్రాబాద్–తాండూరు మధ్య నడుపుతారు. -
గుడ్‌న్యూస్: 64 వేల బెడ్లతో రైల్వే శాఖ సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో వైద్య సేవలు, బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఆస్పత్రులు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ స్పందించి కరోనా బాధితులకు సేవ చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం రైల్వే సేవలు అంతంతమాత్రంగా ఉండడంతో ఖాళీగా ఉన్న రైళ్లను కరోనా చికిత్స కోసం వినియోగించనున్నారు. ఈ మేరకు రైళ్ల ద్వారా 64,000 బెడ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. 4 వేల కోచ్‌లను కరోనా చికిత్సకు కేటాయించింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశంలో కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఐసోలేషన్ బెడ్ల కోసం 4 వేల కరోనా కేర్ కోచ్‌లను రైల్వే శాఖ ఏర్పాటు చేసిందని, వాటిలో దాదాపు 64 వేల బెడ్లు రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుతం 169 కోచ్‌లు పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. కరోనా అధికంగా ఉన్న రాష్ట్రాలకు ఆ రైల్వే కోచ్‌లను కేటాయించే అవకాశం ఉంది. ఈ రైల్వే కోచ్‌లకు సంబంధించిన వీడియోను కూడా మంత్రి పీయూశ్ గోయల్ ట్విటర్లో పంచుకున్నారు. చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ చదవండి: 25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు कोरोना संकट में Isolation Beds की आवश्यकता को देखते हुए भारतीय रेल ने देश भर में 4,000 COVID Care Coaches में 64,000 Beds तैयार किये हैं। 169 कोचेस के माध्यम से 2,700 से अधिक बेड्स राज्यों को हुए अब तक हुए उपलब्ध। 📒 https://t.co/R7UGlare84 pic.twitter.com/hFCxKckBHR — Piyush Goyal (@PiyushGoyal) April 27, 2021 -
రైల్వే ప్రయాణికులకు తీపికబురు
న్యూఢిల్లీ: కోవిడ్ విలయం కారణంగా రైల్వే సేవలు చాలా రోజులు స్తంభించిపోయాయి. గత ఏడాది మార్చి నుంచి రెగ్యులర్ రైళ్లను నిలిపివేశారు. ప్రత్యేకం పేరిట ప్రస్తుతం 66 శాతం రైళ్లను నడిపిస్తున్నారు. మరో 2 నెలల్లో కోవిడ్ ముందునాటి సాధారణ స్థితి నెలకొంటుందని, పూర్తిస్థాయిలో సేవలు అందుతాయని రైల్వేశాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి. రైళ్లను వంద శాతం పునరుద్ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే, రాష్ట్రాల అభ్యంతరాలు, కరోనా పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాయి. ఇప్పుడు 77 శాతం మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 91 శాతం సబర్బన్ రైళ్లు, 20 శాతం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కొవిడ్ రాకముందు రోజుకు 1,768 మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 3,634 ప్యాసింజర్లు, 5,881 సబర్బన్ రైళ్లు నడిచేవి. చదవండి: మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్ లీవ్ ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పైపైకి! -
రైళ్లలో సిగరెట్ తాగితే భారీ జరిమానా
-
తెలుగు రాష్ట్రాల్లో ఆధునిక రైళ్లు.. పూర్తి వివరాలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్టుబడులను ఆకర్షించడానికి 150కిపైగా మార్గాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ)లో ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ నవంబర్ 2020లో ప్రతిపాదనలు చేసిందని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. బీజేపీ సభ్యుడు సతీశ్‌చంద్ర దూబే ప్రశ్నకు ఆయన శుక్రవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 12 క్లస్టర్లలో పీపీపీ పద్ధతిలో నడిచే రైళ్లు ఎంపిక చేశామన్నారు. సికింద్రాబాద్ తదితర క్లస్టర్లలో తెలుగు రాష్ట్రాలోని పలు ప్రాంతాల మీదుగా పీపీపీ పద్ధతిలో 25 మార్గాల్లో 50 ఆధునిక రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. -
మన రైలు.. ఇక మరింత వేగం!
సాక్షి, హైదరాబాద్: మన రైలు వేగం మరింత పెరగనుంది. గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగు పెట్టనుంది. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇది సరికొత్త మైలురాయి కావడం విశేషం. స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ కారిడార్లను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేయడంతో అక్కడ రైళ్లు వేగంగా వెళ్లడానికి మార్గం సుగమమైంది. లాక్డౌన్ సమయంలో... స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ పేరుతో దేశవ్యాప్తంగా రెండు కారిడార్లను కేంద్రం అభివృద్ధి చేసింది. డబ్లింగ్ లైన్ ఉన్న మార్గాలను అనుసంధానిస్తూ ఉత్తర–దక్షిణ భారత రాష్ట్రాలను కలుపుతూ ఈ మార్గాలు విస్తరించాయి. వీటిలో ప్రమాదకర మలుపులు లేకుండా చేయటంతోపాటు కొత్త సిగ్నలింగ్ వ్యవస్థ, 260 మీటర్ల పొడవున్న పట్టాలను పటిష్టమైన రీతిలో ఏర్పాటు చేశారు. లాక్డౌన్ సమయం లో ఈ పనులు పూర్తి చేశారు. అనంతరం జూలై నుంచి దశలవారీగా ఆర్డీఎస్ఓ పర్యవేక్షణలో కన్ఫర్మేటరీ అసిలోగ్రాఫ్ కార్‌తో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించారు. తర్వాత పూర్తిస్థాయి రైళ్లను గరిష్ట వేగంతో నడిపి పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవటంతో ఆ పరీక్షలు విజయవంతమైనట్టు ప్రకటించారు. తాజాగా రైల్వే సేఫ్టీ కమిషనర్ కొన్ని చిన్నచిన్న సూచనలు చేస్తూ రైళ్లను గరిష్ట వేగంతో నడిపేందుకు అనుమతి మంజూరు చేశారు. దీంతో రెండుమూడు వారాల్లో ఆ మార్పులు పూర్తిచేసి రైళ్ల వేగాన్ని పెంచనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,280 కి.మీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,612 కిలోమీటర్ల మేర కొత్త కారిడార్ విస్తరించి ఉండగా.. ప్రస్తుతానికి 1,280 కిలోమీటర్ల మేర ఈ తరహా ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. స్వర్ణ వికర్ణ కారిడార్‌కు సంబంధించి బల్లార్షా నుంచి కాజీపేట వరకు 234 కి.మీ., కాజీపేట నుంచి విజయవాడ, గుంటూరు వరకు 510 కి.మీ., స్వర్ణ చతుర్భుజి కారిడార్‌లో (చెన్నై–ముంబై సెక్షన్) 536 కి.మీ. ఈ మార్గం ఉంటుంది. ఇప్పటికే సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రైళ్లను నడుపుతున్నారు. ఇకపై మిగతా మార్గాల్లో కూడా ఇది అమలవుతుంది. ప్రస్తుతం ఆ మార్గాల్లో 90 కి.మీ. నుంచి 110 కి.మీ. గరిష్ట వేగంగా ఉంది. కొన్ని మార్గాల్లో పరిమిత దూరం 120 కి.మీ. వరకు నడుపుతున్నారు. సింగిల్ లైన్లు, సరైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ లేని మార్గాల్లో మాత్రం రైళ్లు ఇప్పటిలాగానే సాధారణ వేగంతో నడుస్తాయి. ఇందులో కొన్ని ప్రధాన మార్గాలు కూడా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్–నిజామాబాద్ మార్గం ఒకటి. -
కాల్ చేస్తే.. కదిలొస్తారు!
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో మహిళా ప్రయాణికులకు మరింత భద్రతను కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక పథకానికి శ్రీకారం చుట్టింది. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలకు ఇక నుంచి ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు తోడుగా ఉంటారు. ప్రయాణికులతో పాటే రైళ్లలోప్రయాణం చేస్తారు. సహాయం కోరితే వెంటనే వచ్చి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారు. ‘ఆపరేషన్ మేరీ సహేలీ’పేరుతో చేపట్టిన ఈ పథకాన్ని ప్రస్తుతం 8 రైళ్లలో ప్రారంభించారు. దశల వారీగా మరిన్ని రైళ్లకు విస్తరించనున్నారు. రైళ్లలో దొంగలు, అసాంఘిక శక్తులు, పోకిరీల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఒంటరి మహిళా ప్రయాణికులు సెక్యూరిటీ సహాయ నంబర్ 182కు ఫోన్ చేస్తే చాలు.. పోలీసులు క్షణాల్లో చేరుకుంటారు. మహిళా ప్రయాణికులకు సురక్షితమైన రవాణా సదుపాయం కల్పించేందుకు ‘మేరీ సహేలీ’తోడుగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే భద్రతా అధికారి ఒకరు తెలిపారు. ట్రైన్ ఎక్కినప్పట్నుంచి దిగే వరకు.. ఈ ‘మేరీ సహేలీ’లో భాగంగా అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో రైళ్లు బయలుదేరే సమయంలోనే ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్లు, మహిళా రైల్వే భద్రతా దళం సిబ్బంది మహిళా ప్రయాణికులతో మాట్లాడుతారు. వారి భద్రతకు భరోసా ఇస్తారు. ప్రయాణ సమయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో 182 నంబరుకు ఫోన్ చేయాల్సిందిగా సూచిస్తారు. అలాగే ఆర్పీఎఫ్ మహిళా పోలీసులు మహిళలు ప్రయాణించే సీట్ల నంబర్లను, వివరాలను సేకరించి అవసరమైన భద్రతా చర్యలను చేపడతారు. మార్గమధ్యలో రైళ్లు ఆగే స్టేషన్లలో విధులు నిర్వహించే ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా సదరు మహిళలు ప్రయాణం చేసే బోగీలపైనా ప్రత్యేకంగా దృష్టి సారి స్తారు. అవసరమైతే వారితో మాట్లాడుతారు. ఎలాంటి సహాయం కావాలో తెలుసుకుంటారు. ప్రయాణ సమయంలో ట్రైన్లో విధి నిర్వహణలో ఉండే ఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు, స్టేషన్ సిబ్బంది కూడా మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. మహిళా ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరిన తర్వాత ఆర్పీఎఫ్ సిబ్బంది వారితో మరోసారి మాట్లాడుతారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే వివరాలను సేకరిస్తారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేరీ సహేలీ కార్యక్రమంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆర్పీఎఫ్ సేవలను ప్రశంసిం చారు. మహిళా ప్రయాణికుల భద్రత పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చెప్పారు. మహిళలు ఫోన్ చేస్తే వెంటనే చేరుకోని తగిన భద్రత కల్పించాలని సూచించారు. ఆ 8 రైళ్లు ఏవంటే.. సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు రాకపోకలు సాగించే గోల్కొండ (07202) ఎక్స్‌ప్రెస్, నాంపల్లి నుంచి విశాఖపట్నం వరకు నడిచే గోదావరి (02778) ఎక్స్‌ప్రెస్, తిరుపతి–రాయలసీమ (02793) రాయలసీమ ఎక్స్‌ప్రెస్, నాందేడ్–అమృత్సర్ సచ్‌ఖండ్ (02715) ఎక్స్‌ప్రెస్, కిన్వత్–ముంబై, నందిగ్రామ్ (01142) ఎక్స్‌ప్రెస్, గుంటూరు– సికింద్రాబాద్ గోల్కొండ (07201) ఎక్స్‌ప్రెస్, విజయవాడ–హుబ్బళి (హుబ్లీ) అమరావతి (07225) ఎక్స్‌ప్రెస్, కాచిగూడ–మైసూరు మధ్య నడిచే మైసూర్ (02785) ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మేరీ సహేలీ పథకం ప్రారంభించారు. సుమారు 500 మంది మహిళా కానిస్టేబుళ్ల సేవలను ఇందుకోసం వినియోగించుకుంటారు. ప్రతి ట్రైన్లో ఇద్దరు లేదా ముగ్గురు మహిళా ఆర్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ నిరంతరం నిఘా కొనసాగిస్తారు. -
సివిల్స్ పరీక్షకు ప్రత్యేక రైళ్లు..
సాక్షి, హైదరాబాద్ : సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసే విద్యార్థుల కోసం ఓడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అక్టోబర్ 4 తేదీన పరీక్ష నిర్వహిస్తుండటంతో ముందు రోజు ఈ రైళ్లు నడిపేందుకు శనివారం ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 3 న బెర్హాంపూర్, కియోంజార్, ఖరియార్ రోడ్, ఇచ్ఛాపురం నుంచి సాయంత్రం 4 గంటలకు, కోరాపుట్ నుంచి ఉదయం 5 గంటలకు మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరనున్నాయి. కాగా ఈ రైళ్లు అదే రోజు సాయంత్రం నగరాలకు చేరుకోనున్నాయి. అభ్యర్థులను తీసుకెళ్లేందుకు కోరాపుట్-కటక్, కోరాపుట్-విశాఖపట్నం, రూర్కెలా- కటక్, జారుసగూడ, బారిపాడ-కటక్ మరియు విజయవాడ- విశాఖపట్నం మధ్య పరీక్షా ప్రత్యేక రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే నడుపుతుంది. కాగా మే 31న జరగాల్సిన ప్రిలిమ్స్ పరీక్ష కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
యాదాద్రికి ఎంఎంటీఎస్ ఏదీ?
సాక్షి, హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సువర్ణ యాదాద్రి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఆధ్యాత్మిక నగరంగా, అందమైన, ఆహ్లాదభరితమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా పనులు కొనసాగిస్తోంది. కానీ ఇక్కడికి రైల్వే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రతిష్టాత్మకమైన ఎంఎంటీఎస్ ప్రాజెక్టులో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. యాదాద్రి పునర్మిర్మాణ పనులను ప్రారంభించడానికి ముందే ప్రభుత్వం ఈ మార్గంలో రైల్వే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులు కోసం ఎంఎంటీఎస్ రైల్వే నెట్‌వర్క్‌ను యాదాద్రి సమీపంలోని రాయగిరి వరకు విస్తరించాలని ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రణాళికలను సైతం రూపొందించింది. కానీ నాలుగేళ్లుగా యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు కాగితాల్లో ఉండిపోయింది. టెండర్లకే పరిమితం.. యాదాద్రికి రోడ్డు రవాణా మార్గంతో పాటు రైల్వే సదుపాయం కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో రైల్వేబోర్డు అప్పటికప్పుడు సర్వేలు పూర్తి చేసి ప్రాజెక్టు అంచనాలను రూపొందించింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండోదశలో భాగంగా ఘట్కేసర్ వరకు పనులు పూర్తి చేశారు. ఇక్కడి నుంచి నుంచి రాయగిరి 33 కిలోమీటర్ల మార్గాన్ని డబ్లింగ్ చేసి విద్యుదీకరించేందుకు ఎంఎంటీఎస్ రెండో దశలోనే భాగంగా రూ.330 కోట్ల వరకు అంచనాలు వేశారు. 2016లో ఈ ప్రతిపాదనలు సిద్దం చేసినప్పటికీ 2018 వరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటికే ప్రాజెక్టు వ్యయం రూ.414 కోట్లకు చేరుకుంది. ఇదే ఏడాది దక్షిణమధ్య టెండర్లను ఆహ్వానించింది. కొన్ని నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయి. భూమి, ఇతర వనరులతో పాటు, ప్రాజెక్టు వ్యయంలో 59 శాతం రాష్ట్రం ఇవ్వాల్సి ఉంది. మిగతా 41 శాతాన్ని రైల్వే శాఖ భరిస్తుంది. పెరిగిన అంచనా వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి కోసం దక్షిణమధ్య రైల్వే ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ 2019 వరకూ సమ్మతి లభించకపోవడంతో టెండర్లు రద్దయ్యాయి. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి సమ్మతి లభించినప్పటికీ ద.మ రైల్వే ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోసారి ఏ ప్రాతిపదికపై టెండర్లను ఆహ్వానించాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఇప్పటి వరకు రూ.50 కోట్లు కేటాయించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని అందజేస్తే ముందుకు వెళ్లవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుబాటులోకి వస్తే.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, మౌలాలీ, చర్లపల్లి, ఘట్కేసర్ మీదుగా నేరుగా రాయగిరి వరకు వెళ్లవచ్చు. ప్రయాణికులు ఇప్పుడు చెల్లిస్తున్న రవాణా చార్జీలు సైతం సగానికి పైగా తగ్గుతాయి. నగరంలో ప్రస్తుతం ఎంఎంటీఎస్ చార్జీలు కనిష్టంగా రూ.5 నుంచి రూ.15 వరకు ఉన్నాయి. భవిష్యత్తులో చార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్లు భావించినా రూ.25 నుంచి రూ.30 లోపే రాయగిరి వరకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో 5 కి.మీ రోడ్డు మార్గంలో వెళ్లాల్సిఉంటుంది. ఈ రూట్లో రైల్వే సదుపాయాలు విస్తరించడం వల్ల రియల్ఎస్టేట్ రంగంతో పాటు వ్యాపార కార్యకలాపాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
చలో పల్లె‘టూరు’
సాక్షి, హైదరాబాద్/చౌటుప్పల్: ఒకపక్క కరోనా భయం.. హైదరాబాద్‌లో మళ్లీ లాక్డౌన్ విధిస్తే తిరిగి ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు.. ఆ తరువాతా బతుకుబండి గాడిన పడే పరిస్థితి లేదని భావిస్తున్న ప్రజలు.. ‘అర్జెంటుగా హైదరాబాద్ విడిచిపెట్టి పోవాలె.. ఏదోలా ఇక్కడి నుంచి బయటపడాలె’అనుకుంటూ పల్లెబాట పడుతున్నారు. కలోగంజో తాగి బతకొచ్చనే భావ నతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. చాలామంది ఇళ్లు ఖాళీచేసి, సామాను సర్దుకొని వెళ్లిపోతున్నారు. మరికొందరు లాక్డౌన్ సమయాన్ని దృíష్టిలో ఉంచుకొని వెళ్తున్నారు. తొలిసారి లాక్డౌన్ విధించిన సందర్భంగా ఎదురైన ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఇంకొందరు ఊళ్లకు బయల్దేరుతున్నారు. దీంతో రెండ్రోజులుగా హైదరాబాద్ నలువైపులా రహదార్లపై రద్దీ పెరిగింది. టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. విజయవాడ హైవేతో పాటు వరంగల్, హన్మకొండ, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, వికారాబాద్, చేవెళ్ల తదితర మార్గాల్లోనూ అదే పరిస్థితి. హైదరాబాద్ – విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి రెండ్రోజులుగా రద్దీగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి జీఎమ్మార్ టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వెళ్లే వైపు వాహనాలు బారులుతీరుతున్నాయి. వాహనాలు ఎక్కువ వస్తుండడం, నగదు మార్గంలో బారులు తీరుతుండడంతో టోల్ సిబ్బంది వాహనదారుల వద్దకే వెళ్లి హ్యాండ్‌మిషన్ ద్వారా టోల్ రుసుము తీసుకుంటున్నారు. అటూఇటూ రద్దీ.. మరోసారి లాక్డౌన్ విధిస్తారనే వార్తల నేపథ్యంలో నగర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సూపర్మార్కెట్లు, షాపింగ్ కేంద్రాలు, కిరాణా దుకాణాల వద్ద జనం నిత్యావసర వస్తువుల కోసం బారులు తీరుతున్నారు. లాక్డౌన్ కాలానికి సరిపడా సరుకులు కొని పెట్టుకోవాలనే ఆత్రుతతో దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. వైన్‌షాపుల వద్దా రద్దీ కనిపిస్తోంది. మరోపక్క సుదీర్ఘ లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన అసంఘటితరంగ కార్మికులు, దినసరి కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు, ఇతర బీదాబిక్కీ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్‌లో పనుల్లేక, సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణా సదుపాయాల్లేక కష్టపడ్డారు. సొంత వాహనాలున్న వారు అనుమతులు లభించక వెళ్లలేకపోయారు. అప్పటి అనుభవాలతో ఇప్పుడు ముందుజాగ్రత్తగా పల్లెలకు తరలివెళ్తున్నారు. నగరంలోని దాదాపు ప్రతి బస్తీ, కాలనీ నుంచి పల్లెబాట కొనసాగుతోంది. ఉద్యోగం, ఉపాధి కోసం ఏళ్ల క్రితమే హైదరాబాద్‌ను నమ్ముకొని వచ్చిన వాళ్లు ట్రాలీ ఆటోలు, టాటాఏస్ వాహనాల్లో ఇంటిసామానంతా సర్దుకొని వెళ్తున్న దృశ్యాలే ఎటుచూసినా కనిపిస్తున్నాయి. సొంత వాహనాలతో పాటు చివరకు బైక్‌లపై సైతం తరలిపోతున్నారు. బస్సు, రైళ్లకూ డిమాండ్ ఆర్టీసీ బస్సులు, రైళ్లకు రెండ్రోజులుగా డిమాండ్ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని వివిధ జిల్లాలకు హైదరాబాద్ నుంచి వెయ్యి బస్సులు నడుస్తున్నాయి. ‘ప్రయాణికుల డిమాండ్ ఇలాగే ఉంటే మరికొన్ని బస్సులను అందుబాటులోకి తెస్తాం’అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి ప్రస్తుతం రోజుకు 22 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 30 వేల మంది తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు నగరాలకూ రద్దీ పెరిగింది. విజయవాడ, విశాఖ వైపు వెళ్లే ప్రత్యేక రైళ్లలో 50 నుంచి 100 వరకు వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. ఇక, హైదరాబాద్ నుంచి దేశంలోని వివిధ నగరాలకు రాకపోకలు సాగించే దేశీయ విమాన సర్వీసులు 100 నుంచి 126కి పెరిగాయి. 63 సర్వీసులు హైదరాబాద్ నుంచి వివిధ నగరాలకు వెళ్తుండగా, మరో 63 సర్వీసులు నగరానికి చేరుకుంటున్నాయి. పాసులుంటేనే ఏపీలోకి అనుమతి కోదాడ: హైదరాబాద్‌లో త్వరలో లాక్డౌన్ విధిస్తారనే ప్రచారంతో పలువురు సొంత వాహనాల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నారు. అయితే పాస్‌లున్న వారినే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమతిస్తున్నారు. దీంతో సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని ఆంధ్ర– తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రత్యేక పాసులున్న వారిని కూడా ప్రత్యేక మొబైల్ ల్యాబ్‌లో థర్మల్ స్క్రీనింగ్ చేసి అనుమానితుల నుంచి శాంపిల్స్ తీసుకున్నాకే అనుమతిస్తున్నారు. ఇళ్లలోకి రానివ్వట్లేదు కూతురుతో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉంటూ ఇళ్లలో పనిచేస్తూ బతికేవాళ్లం. కరోనా కారణంగా యజమానులు ఇళ్లలోకి రానివ్వట్లేదు. మళ్లీ లాక్డౌన్ పెడతారని అంటున్నారు. ఇక్కడుండి ఏం చేయాలి?. – సూర్యకళ, ధర్మవరం, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్ గిరాకీ లేదు.. ఏంజేయాలె! హైదరాబాద్ కొత్తపేట ప్రాంతంలో టీకొట్టు నడిపేవాడిని. కరోనా తరువాత ఎవరూ టీ తాగేందుకు రావట్లేదు. అందుకే ఉండలేక వెళ్లిపోతున్నా. – రమేష్, వాడపల్లి, నల్లగొండ జిల్లా -
రైళ్లు, విమానాల సర్వీసులను ఆపేయండి : మమతా
కోల్‌కతా : భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దేశంలోనే కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి దేశీయ విమానాలను నడపకుండా చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి లేఖ రాశారు. ప్రతీరోజూ ఎక్కువ మొత్తంలో విమానాలను అనుమతించడం ద్వారా కరోనా కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని కాబట్టి వారానికి ఒకసారి మాత్రమే ఇతర రాష్ర్టాల నుంచి విమానాల రాకపోకలకు అనుమతించాలని కోరారు.(ఉద్రిక్తతలు సమసేనా..? ) ఇక కోల్‌కతాలో మెట్రో సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై అనిశ్చితి నెలకొంది. ఇంతకుముందు మెట్రో, సబర్బన్ సర్వీసులను ఆగస్టు 12 వరకు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తాజాగా వైద్యులు,పోలీసులు సహ ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న సిబ్బంది కోసం తిరిగి సేవలను పునః ప్రారంభించే యోచనలో సర్కార్ ఉంది. ఈ నేపథ్యంలోనే వారి రవాణాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్వరలోనే రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. దీనికి అనుగుణంగా అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, హోం శాఖకు కోల్‌కతా మెట్రో అధికారి లేఖ రాశారు. జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం టెలి-మెడిసిన్ సేవలను ప్రారంభించనుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. దీని ద్వారా ఆసుపత్రులకి వెళ్లకుండానే వెద్య సహాయం పొందొచ్చని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువవడంతో ప్రతీ ఒక్కరూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్‌కి వెళ్లకుండా ఫోన్ ద్వారా నేరుగా వైద్యులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. దీంతో ప్రతి జిల్లాకో ప్రత్యేక టెలిఫోన్ సర్వీసు ఏర్పాటుకానుంది. అంతే కాకుండా దాదాపు 30 మిలియన్ ఫేస్ మాస్కులను పాఠశాల విద్యార్థులకు, ఆరోగ్య కార్యకర్తలకు అందివ్వనున్నట్లు మమతా స్పష్టం చేశారు.(ఆ నియామకాలపై కరోనా ప్రభావం తక్కువే..) -
ట్రయిన్ల రద్దు- ఐఆర్సీటీసీ డౌన్
రోజురోజుకీ కోవిడ్-19 కేసులు పెరుగుతూ పోతుండటంతో రైల్వే శాఖ ఆగస్ట్ 12వరకూ అన్ని రెగ్యులర్ రైళ్లనూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే లాక్‌డవున్ సమయంలో ప్రకటించిన రాజధాని తదితర కొన్ని రైళ్లను మాత్రం నడపనున్నట్లు పేర్కొంది. దీంతో జూన్ 30వరకూ బుక్ చేసిన టికెట్లను రద్దు చేస్తున్నట్లు తెలియజేసింది. తదుపరి దశలో జులై 1- ఆగస్ట్ 12వరకూ తీసుకున్న టికెట్లను సైతం రద్దు చేయడం ద్వారా రిఫండ్ ఇవ్వనున్నట్లు వివరించింది. లాక్‌డవున్ తొలి దశలో వేసిన 15 జతల రాజధాని, ఎక్స్‌ప్రెస్ ట్రయిన్లతోపాటు.. వలస కూలీల కోసం నిర్వహిస్తున్న 200 శ్రామిక్ స్పెషల్ రైళ్లను సైతం నడపనున్నట్లు వివరించింది. షేరు వీక్ రైళ్ల రద్దు నేపథ్యంలో పీఎస్‌యూ దిగ్గజం ఐఆర్సీటీసీ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం పతనమైంది. రూ. 1340 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 3 శాతం నష్టంతో రూ. 1372 వద్ద ట్రేడవుతోంది. కాగా నేడు ఐఆర్సీటీసీ గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు విడుదల చేయనుంది. త్రైమాసిక ప్రాతిపదికన ఐఆర్సీటీసీ నికర లాభం 35 శాతం వరకూ క్షీణించవచ్చని రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ అంచనా వేస్తోంది. రూ. 134 కోట్ల స్థాయిలో నికర లాభం నమోదుకావచ్చని పేర్కొంది. ఆదాయం 17 శాతం తక్కువగా రూ. 594 కోట్లకు చేరవచ్చని అభిప్రాయపడింది. ఇబిటా మార్జిన్లు 7 శాతం నీరసించే వీలున్నట్లు అంచనా వేసింది. -
త్వరలో మరిన్ని కీలక రంగాల పున: ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి మెరుగుపరిచేందుకు అవసరమైన కొన్ని కీలక రంగాలను పున:ప్రారంభించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని సడలింపులతో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, మతపరమైన ప్రదేశాలతో పాటు ఇతర సంస్థల పున:ప్రారంభానికి కేంద్రం అనుమతించింది. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే మరిన్ని రంగాలు, సంస్థలు ఇప్పటికీ లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. వాటిని జూలై రెండోవారం నుంచి తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. (‘ప్రకటనలపట్ల మోదీ జాగ్రత్తగా ఉండాలి’) త్వరలో పున: ప్రారంభించేందుకు దృష్టి పెట్టిన రంగాలు ఇవే.. మెట్రో రైళ్లు: మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి 22 నుంచి మెట్రో రైలు సేవలను కేంద్రం నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 25న జనతా కర్ఫ్యూను ప్రకటించి పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ను ప్రకటించారు. అయితే దశల వారీగా అమలవుతన్న లాక్డౌన్లో కేంద్రం సడలింపులతో కూడిన కొన్ని రవాణా సేవలకు అనుమతించింది. కానీ మెట్రో రైల్వే సేవలకు మాత్రం అనుమతించలేదు. దీనిపై మెట్రో అధికారులు మే 30న ట్వీట్ చేస్తూ తదుపరి ఆదేశం వచ్చే వరకు మెట్రో సేవలు అనుమతి లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక లాక్డౌన్ మొదటి దశ మార్గదర్శకాలలో జూన్ 30 వరకు సబర్బన్ రైళ్లతో పాటు మెట్రో రైల్ సేవలు కూడా మూసివేయబడతాయని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే అత్యవసర సేవల విభాగంలో పనిచేసే వారి కోసం ముంబై సబర్బన్ రైళ్లను కెటాయించారు. (పునః ప్రారంభ సంబరం..) పాఠశాలలు, కళాశాలలు: కరోనా వ్యాప్తిని అరికట్టేందు పలు రంగాలతో పాటు విద్యాసంస్థలను కూడా ప్రభుత్వం మూసివేసింది. దీంతో అన్ని స్కూళ్లు, కాలేజీలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కాగా పాఠశాలను, కళాశాలను తిరిగి జూలైలో తెరిచేందుకు కేంద్రం తగిన చర్యలు చేపడుతోంది. మార్చిలో జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడటంతో. జూన్ 30 తర్వాత పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర, రాష్ట్ర బోర్డులు తెలిపాయి. రైల్వేలు: గత నెలలో కొన్ని రైల్వే సేవలను ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ ఇంకా పూర్తి స్థాయి సేవలకు కేంద్రం అనుమతించలేదు. 51 రోజుల లాక్డౌన్ తరువాత, మే 12 నుంచి రైల్వే శాఖ క్రమంగా రైల్వే సేవలను తిరిగి ప్రారంభించింది. అంతేగాక గత నెలలో 15 జతల రైళ్లతో ఢిల్లీ - డిబ్రుగా, అగర్తల, హౌరా, పాట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మద్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తవి రైల్వే స్టేషన్లను కలుపుతూ సేవలను ప్రారంభించింది. కోవిడ్-19 వారి కోసం కేటాయించిన 20,000 బోగీలను దృష్టిలో ఉంచుకుని కోచ్‌ల లభ్యత ఆధారంగా సేవలను తిరిగి ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. -
రన్ రాజా రన్
-
రైళ్ల పునరుద్ధరణ : ఏపీ సర్కార్ అలర్ట్
సాక్షి, విజయవాడ : లాక్డౌన్ కారణంగా సుమారు రెండు నెలల తరువాత రైళ్లు, విమానాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. రైళ్ల ప్రయాణాలకు కేంద్రం అనుమతినివ్వడంతో ప్రభుత్వం మరింత అలర్ట్ అయ్యింది. ప్రయాణికుల నుంచి వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కఠిన చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగానే ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, చెక్‌పోస్టుల వద్ద ఐ మాస్క్ స్వాబ్ టెస్టుల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. వీటిని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మంగళవారం విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ‘విజయవాడలో దిగిన ప్రతి ప్రయాణికుడికి టెస్టులు నిర్వహించేందుకు టెక్నాలజీతో కూడిన వాహనాలను వినియోగిస్తున్నాం. ఈ వాహనంతో గంటకు 200 మందికి స్వాబ్ టెస్టులు చేయవచ్చు. ప్రయాణికుల సమయం వృధా కాకుండా ఉండేందుకు ఈ వాహనాలను వినియోగిస్తున్నాం. స్వాబ్ టెస్ట్ అనంతరం ఎవరి గమ్య స్ధానాలకు వారిని పంపిస్తాం. టెస్టుల సమయంలోనే కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలిస్తాం. ప్రతి ఒక్కరి డేటా మానిటిరింగ్లో ఉంటుంది. టెస్టుల్లో పాజిటివ్ వస్తే సంబంధిత జిల్లా కలెక్టర్లకు సమాచారం అందించేలా వ్యవస్థను రూపొందించాం’ అని తెలిపారు. (‘జూన్ 8 నుంచి హరిత హోటల్స్ ప్రారంభం’) ఇక దేశవ్యాప్తంగా సోమవారం 200 రైళ్లను పునఃప్రారంభిస్తుండటంతో రైల్వే శాఖ ప్రయాణికులకు హెల్త్ ప్రొటోకాల్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీలో 18 రైల్వే స్టేషన్లలోనే హెల్త్ ప్రోటోకాల్ అనుసరిస్తామని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. విజయవాడ మీదుగా 14 రైళ్లు నడపనున్నారని తెలిపారు. -
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో భారీ క్యూలైన్లు
సాక్షి, హైదరాబాద్: సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 9 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఉదయం ఆరుగంటలకు నాంపల్లి నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి బయలుదేరింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకోవడంతో భారీ క్యూలైన్ ఏర్పడింది. ప్రయాణికులంతా రైలు బయలుదేరే సమయానికి 90-120 నిమిషాల ముందే రావాలని సూచించడంతో పెద్దసంఖ్యలో ప్రయాణికులు తెల్లవారుజాము నుంచే రైల్వే స్టేషన్‌కి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా 100 రూట్లలో 200 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతుంది. తొలి రోజు లక్షా 45వేల మంది ప్రయాణాలు చేయనున్నారు. ఆన్లైన్, రైల్వే బుకింగ్ కౌంటర్లలో రిజర్వేషన్‌కు అవకాశం కల్పించారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాత టికెట్ ఉన్న వారికే స్టేషన్లోకి అనుమతిస్తారు. ప్రతి ప్రయాణికుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించారు. -
విద్యార్ధుల కోసం కోటి రూపాయలు..
పాట్నా: రాజస్తాన్‌లోని కోట నగరం నుంచి తమ రాష్ట్ర పౌరులను తరలిచేందుకు బిహార్ ప్రభుత్వం కోటి రూపాయలు చెల్లించిందని బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. కోట నుంచి విద్యార్థులను తీసుకువచ్చేందుకు 17 రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ఖర్చులను రాజస్తాన్ ప్రభుత్వమే భరించాలని తెలిపారు. కానీ రాజస్తాన్ ప్రభుత్వం బిహార్ ప్రభుత్వమే చెల్లించాలని చెప్పడంతో 17 రైళ్లను ఏర్పాటు చేయడం కోసం తమ ప్రభుత్వం కోటి రూపాయలు డిపాజిట్ చేసిందని తెలిపారు. విద్యార్థుల కోసం ఆ మొత్తం చెల్లించడం రెండు ప్రభుత్వాలకు పెద్ద విషయం ఏం కాదని సుశీల్‌కుమార్ పేర్కొన్నారు. (కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?) కోటకి బిహార్‌కి మధ్య దూరం 1300 కిలోమీటర్లు ఉండటంతో విద్యార్థులను బస్సుల ద్వారా తరలించడం లేదని తెలిపారు. అంతదూరం బస్సులో ప్రయాణించడం కష్టమని, లాక్డౌన్ కారణంగా తినడానికి ఎక్కడ ఏవి లభించవని, అలాంటప్పుడు విద్యార్ధులు రైళ్లలో రావడమే మంచిదని పేర్కొన్నారు. ఇంకా కాంగ్రెస్, జనతాదళ్ గురించి మాట్లాడుతూ.. ‘ఈ పార్టీలు 3000 బస్సులు, 300 రైళ్ల గురించి మాట్లాడుతున్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి అని ప్రశ్నించారు. పేదల పట్ల ఇంత శ్రద్ధ ఉన్న వీరు సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి రూపాయలు విరాళమిస్తే పేద రాష్ట్రమైన బిహార్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంద‘ని సుశీల్ కుమార్ పేర్కొన్నారు. (లాక్డౌన్ 5.0 : ఆ నగరాలపై ఫోకస్) -
శ్రామిక్ రైలులో మరో రెండు మరణాలు
లక్నో : వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సహజంగానే అనేక బరువులు నెత్తినేసుకొని బతికే బతుకు జీవుల పాలిట కరోనా మహమ్మారి దించనంత బరువులు మూటగట్టింది. స్వస్థలాలకు చేరేందుకు వారు పడతున్న పాట్లు వర్ణనాతీతం. తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్న దృశ్యాలు అనేకం. తాజాగా శ్రామిక్ రైలులో స్వస్థలానికి పయనమైన కుటుంబంలో చిన్నారి మరణం విషాదాన్ని నింపింది. వివరాల ప్రకారం..బీహార్‌కు చెందిన ప్రియాంక దేవి కొన్ని నెలల క్రితమే ఉత్తరప్రదేశ్ నోయిడాలోని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లింది. తీరా లాక్డౌన్ ప్రకటించేసరికి ఏం అక్కడే ఉండిపోయింది. ప్రస్తుతం కేంద్రం వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు శ్రామిక్‌రైలును ఏర్పాటు చేసినందున తండ్రి దేవ్‌లాల్ , తన 10 నెలల చిన్నారితో కలిసి స్వస్థలానికి బయలుదేరాడు. అప్పటికే చిన్నారికి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరిస్థితిపై రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేయగా..తుండ్లా రైల్వేస్టేషన్లో వైద్యుడు ఉన్నారని, అక్కడికి చేరుకున్నాక చూద్దాం అని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని దేవ్‌లాల్ ఆరోపించారు. తుండ్లా చేరుకునే వారకు చిన్నారి ఆరోగ్యం మరింత క్షీణించిందని, హాస్పిటల్‌కి తరలించే లోపే కన్నుమూసినట్లు పేర్కొన్నాడు. సరైన సమయానికి వైద్యం అందించే ఉంటే చిన్నారి బతికేదని, రైల్వే అధికారుల నిర్లక్షమే బాలుడి ప్రాణం తీసిందని ఆరోపించాడు. (తొలి రోజు అనుభవాలు వెల్లడించిన విమానాయన సిబ్బంది ) మరో ఘటనలో శ్రామిక్ రైలులో ప్రయాణిస్తున్న 46 ఏళ్ల వలస కార్మికుడు ఆకలితో అలమటించి మరణించాడు. వివరాల ప్రకారం..మే 20న ముంబైలోని శ్రామిక్ రైలులో బయలుదేరి మే 23న వారణాసికి నేను, మామయ్య చేరుకున్నాం. అంత దూర ప్రయాణంలోనూ రైల్వే అధికారులు కనీసం తిండి, నీరు ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. రైలు ఎక్కేముందు నుంచే ఆకలితో ఉన్నాం. కానీ కొనడానికి చేతిలో డబ్బులు కూడా లేవు. దీంతో ఆకలితో అలాగే ఉండాల్సి వచ్చింది. స్వస్థలానికి అరగంటలోపు చేరుకుంటాం అనగా, తీవ్రమైన నొప్పితో మామయ్య మార్ఛపోయాడు. దాదాపు 60 గంటల నుంచి ఆహారం కనీసం నీళ్లు కూడా అందక పోవడంతో మరణించాడు అని రవీష్ యాదవ్ తెలిపాడు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి వలసకూలీలకు కనీస సౌకర్యాలైనా కల్పించాలని కోరాడు. (ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం ) -
ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీన్ తప్పనిసరి
-
వలస కూలీలపై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : వలస కూలీల తరలింపుపై కేంద్రం ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఇక మీదట కార్మికుల తరలింపుపై రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్ర స్పష్టం చేసింది. రాష్ట్రాల అనుమతి ఉంటేనే వలస కార్మికులను తరలించాలన్న పాత నిబంధనను తొలగించింది. అలాగే లాక్‌డౌక్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కూలీల కోసం స్థానిక ప్రభుత్వాలు అన్ని వసతులు కల్పించాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. (కరోనా విజృంభిస్తున్నా.. సడలింపులు) కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా తరలిస్తున్నప్పటికీ ఇంకా చాలామంది కూలీలు రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎంతో మంది కాలినడనక స్వస్థలాలకు పయనమవుతున్నారు. దీనిపై కూడా కేంద్ర హోంశాఖ స్పందించింది. వలస కార్మికుల తరలింపు కోసం ప్రస్తుతం నడుపుతునన రైళ్ల సంఖ్యను పెంచాలని రైల్వేమంత్రిత్వ శాఖను కోరింది. మరోవైపు రైల్వేలతో రాష్ట్రాలు సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఏయే రాష్ట్రాల్లో ఎంతమంది కార్మికులు ఉన్నారో ఓ అంచనాకు వచ్చి ఆ వివరాలను రైల్వేశాఖతో పంచుకోవాలని తెలిపింది. కేంద్రహోంశాఖ తాజా నిర్ణయంతో శ్రామిక్ రైళ్ల సంఖ్య పెరగనుంది. (మహా నగరాలే కరోనా కేంద్రాలు) -
‘ఆ బస్సులను ఆపకండి’
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను సొంత ఊళ్లకు చేర్చేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోం శాఖ కోరింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాల్సిందిగా కోరాడు. ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళల విషయంతో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల దేశంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పాడ్డాయన్నారు.ఫలితంగా వలస కూలీలు ఉపాధి కోల్పోతామనే భయంతో సొంత ఊళ్లకు బయలుదేరారని తెలిపారు. ఈ నేపథ్యంలో వలస కూలీలకు సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆయా రాఫ్ట్ర ప్రభుత్వాలపైనే ఉందన్నారు. (వలస కూలీల కోసం 1000 బస్సులు) వలస కూలీల కోసం ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడపడం, విశ్రాంతి నిలయాలను ఏర్పాటు చేయాలన్నారు అజయ్ భల్లా. ఆహారంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించేలా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీదనే ఉందని స్పష్టం చేశారు. వలస కూలీలకు బస్సులు, రైళ్ల ఏర్పాటు గురించి సరైన సమాచారం అందించాలని.. పుకార్లకు తావివ్వకుండా చూడాలని కోరారు. ఈ విషయంలో స్పష్టత లేకపోతే.. వలస కూలీల్లో అశాంతి ఏర్పడుతుందన్నారు. కాలినడకన బయలుదేరిన వలస కూలీలను విశ్రాంతి సముదాయాలకు తరలించడమే కాక.. వారి చిరునామ, ఫోన్ నంబర్లు సేకరించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానిదే అని పేర్కొన్నారు. వలస కూలీల బస్సులను రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఆపవద్దని కోరారు.(కరోనా ఎఫెక్ట్: డ్రైవరన్నా.. నీకు సలామ్) Home Secy Ajay Bhalla writes to Chief Secretaries of all states to take steps to "mitigate the distress of migrant workers", suggests a number of measures to be implemented incl. operation of more special trains by proactive coordination between states and Railways ministry: MHA pic.twitter.com/iQEkXhlPYQ — ANI (@ANI) May 19, 2020 -
వారికి క్వారంటైన్ అవసరం లేదు
సాక్షి, న్యూఢిల్లీ : నేటి నుంచి పరిమిత మార్గాల్లో రైళ్ల రాకపోకలు నడుస్తున్నందున ఢిల్లీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. రైళ్ల ద్వారా రాజధానికి చేరుకుంటున్న వారికి క్వారంటైన్ తప్పనిసరి కాదని వెల్లడించింది. కరోనా లక్షణాలు లేనివారికే ఈ వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. వారికి క్వారంటైన్ కాకుండా నేరుగా ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తున్నామని తెలిపింది. అయితే కొద్దిపాటి లక్షణాలు కనిపించినా వారికి మాత్రం క్వారంటైన్ తప్పనిసరని పేర్కొంది. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఫలితాల ఆధారంగా సెల్ఫ్ ఐసోలేషన్ లేదా గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించింది. ఎప్పటికప్పుడు ప్రయాణికులను పరీక్షించేందుకు రైల్వే స్టేషన్లలో ఎక్కువ సంఖ్యలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక ఈ కింది విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. (70 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య) మరిన్ని మార్గదర్శకాలివీ... ►ప్రయాణికులు ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ► ప్రయాణికులు ఎక్కడానికన్నా ముందు రైలును శానిటైజేషన్ చేయాలి ► కరోనా లక్షణాలు లేనివారినే ప్రయాణానికి అనుమతించాలి ► రైల్వే స్టేషన్లో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి ► ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా స్క్రీనింగ్ కౌంటర్లను ఏర్పాటు చేయాలి. వారి వెంట తెచ్చుకునే వస్తువులను కూడా స్క్రీనింగ్ చేయాలి. (లాక్డౌన్: కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం) (రైలు బండి.. షరతులు ఇవేనండీ) -
వాళ్లకి మాత్రమే రైల్వే స్టేషన్లోకి అనుమతి
సాక్షి, న్యూ ఢిల్లీ: రైళ్లు మళ్లీ పట్టాలెక్కనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చంటూ రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తమ బెర్తులను ఖరారు చేసుకునేందుకు ఎదురుచూసిన ప్రజల ప్రయత్నాలు ఫలించలేదు. ఎంతకూ ఐఆర్సీటీసీ వెబ్సైట్ తెరుచుకోకపోవడంతో ప్రజలు గందరగోళానికి లోనయ్యారు. దీనిపై స్పందించిన అధికారులు.. మొత్తం 30 సర్వీసులను నడుపుతుండగా ఇందులో 15 ప్రత్యేక రైళ్ల టికెట్ బుకింగ్ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుందని వివరణ ఇచ్చారు. కాగా ఈనెల 12వ తేదీ నుంచి ఢిల్లీ నుంచి కొన్ని రూట్లలో రైళ్లు నడుపుతామని రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూర్, చెన్నై, ముంబై సెంట్రల్, తిరువనంతపురం, అహ్మదాబాద్‌కు రైళ్లు నడుపనున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో రైళ్లలో క్యాటరింగ్ భోజనం ఉండదని స్పష్టం చేసింది. ఏసీ రైలు అయినా బెడ్ షీట్లు, టవల్ ఇవ్వరని పేర్కొంది. (రైల్వే జనరల్ టికెట్లు మరింత తేలిక! ) ఏడు రోజుల ముందు మాత్రమే IRCTCలో టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. రైళ్లలో ఆర్ఏసీ ప్రయాణాలు, వెయిటింగ్ లిస్ట్ ఉండదని తెలిపింది. కేవలం కన్ఫార్మ్డ్ టికెట్ ఉన్నవాళ్లకే స్టేషన్లోకి అనుమతిస్తామని పేర్కొంది. తత్కాల్, ప్రీమియం తత్కాల్ బుకింగ్ సౌకర్యం ఉండదని చెప్పింది. అప్పటికప్పుడు టికెట్ కొనుక్కునే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సల్ చేసుకుంటే తిరిగి ఇవ్వాల్సిన సొమ్ములో 50% కోత విధిస్తామంది. ముందు బుక్ చేసుకున్నవారికి వాటర్ బాటిళ్లు ఇస్తామని తెలిపింది. ప్రయాణ సమయానికి గంటన్నర ముందే స్టేషన్‌కు చేరుకోవాలని ప్రయాణికులను కోరింది. (రైలు ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్) -
అమిత్ షా వర్సెస్ టీఎంసీ
న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం అన్యాయమని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ మేరకు బెంగాల్ సీఎం మమతకు లేఖ రాశారు. ‘వేరే ప్రాంతాల్లో చిక్కుకున్న కూలీలను సొంతూళ్లకు తీసుకువచ్చేందుకు కేంద్రం రైళ్లను ఏర్పాటు చేసింది. కానీ, బెంగాల్ ప్రభుత్వం మాకు సహకరించడం లేదు. ఆ రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. దీంతో కార్మికులు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై అధికార టీఎంసీ నేత, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అయిన అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ‘లాక్డౌన్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన హోం మంత్రి.. బెంగాల్ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ఆయన.. చాలా వారాల మౌనం తర్వాత గొంతు విప్పారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. షా తన ఆరోపణలను రుజువు చేయాలి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి’ అని ట్విట్టర్లో డిమాండ్ చేశారు. కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, తెలంగాణల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన వలస కూలీల తరలింపునకు ఇప్పటికే 8 రైళ్లను ఏర్పాటు చేశామనీ, ఇందులో మొదటిది త్వరలోనే హైదరాబాద్ నుంచి మాల్దాకు చేరుకోనుందని తెలిపారు. రాష్ట్రంలోకి వలస కార్మికులను రానివ్వడంలేదంటూ ఆరోపిస్తున్న అమిత్ షా..మహారాష్ట్రలో 16 మంది కూలీల మరణానికి రైల్వే మంత్రిని బాధ్యుణ్ని చేస్తారా అని టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ ప్రశ్నించారు.