
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే 23 రైళ్లను తాత్కాలికంగా రద్దుచేయగా, మరో రెండింటిని పాక్షికంగా రద్దు చేసింది. కోవిడ్ దృష్ట్యా గతకొద్ది రోజులుగా రైళ్లలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ చాలావరకు పడిపోయింది. దీంతో డిమాండ్ ఉన్న రూట్లలోనే నడుపుతున్నారు. ఔరంగాబాద్–నాందేడ్, ఆదిలాబాద్–నాందేడ్, వికారాబాద్–గుంటూరు, సికింద్రాబాద్–యశ్వంత్‌పూర్, తిరుపతి–మన్నార్‌గుడి, రేపల్లె–కాచి గూడ, గుంటూరు–కాచిగూడ, సికింద్రాబాద్–సాయినగర్ షిరిడి, చెన్నై సెంట్రల్–తిరుపతి, సికింద్రాబాద్–విశాఖపట్టణం, ఔరంగాబాద్– రేణిగుంట, పర్బనీ–నాందేడ్ మధ్య రాకపోకలు సాగించే రైళ్లను ఆదివారం నుంచి జూన్ 2 వరకు రద్దు చేసినట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. నాందేడ్–తాండూరు–పర్బనీ మధ్య నడిచే 2 సరీ్వసులను ఈనెల 31 వరకు సికింద్రాబాద్–తాండూరు మధ్య నడుపుతారు.
Comments
Please login to add a commentAdd a comment