Passenger train
-
Hyderabad: ఊరగాయలో బల్లి.. హోటల్ సీజ్ చేసిన పోలీసులు
నాంపల్లి: తిరుపతికి వెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్తున్న భక్తులకు నగరంలో అపశృతి చోటుచేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో బల్లిపడిన వంటకాన్ని తిని వాంతులు చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన 30 మంది భక్తులు దైవదర్శనం కోసం ఇటీవల తిరుపతికి వెళ్లారు. దర్శనం అనంతరం రైలులో మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. బుధవారం ఉదయాన్నే హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి పూర్ణా ప్యాసింజర్ రైలులో సొంతూరు వెళ్లాల్సి ఉంది. మంగళవారం రాత్రి నగరంలోనే బస చేయడంతో రైల్వే స్టేషన్‌కు చేరువలో ఉండే మహేష్ రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. 30 మంది ఒకేసారి భోజనాలు చేస్తుండగా ఊరగాయ(పికిల్)లో చనిపోయిన బల్లిని చూశారు. అన్నంలో ఊరగాయను వేసుకుని కలుపుతుండగా ఓ భక్తుడి చేతికి బల్లి తగిలింది. దీంతో అతడక్కడే వాంతులు చేసుకున్నారు. ఈ క్రమంలో మిగతా వారూ అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. స్థానికులు గమనించి అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరంతా త్వరగానే కోలుకోవడంతో తిరిగి ఉదయాన్నే హైదరాబాదు రైల్వే స్టేషన్‌కు చేరుకుని పూర్ణా ప్యాసింజర్ రైలులో తిరుగుపయనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మహేష్ హోటల్‌ను రాత్రి మూసివేయించారు. హోటల్ సిబ్బందిని, యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
సాధా‘రణ’ బోగీ.. కిక్కిరిసి
రైళ్లలో జనరల్ బోగీలు చూడగానే కిక్కిరిసి ఉంటాయి. కూర్చోవడానికే కాదు.. నిల్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. లగేజీ బెర్తు...వాష్‌రూమ్, ఫుట్‌బోర్డు ఇలా ఎక్కడచూసినా ఫుల్ రష్ కనిపిస్తుంది. గంటల తరబడి నిలబడటానికి ఇబ్బంది పడేవారు.. సీట్లలో కూర్చున్న ప్రయాణికుల కాళ్ల వద్ద కూడా కూర్చొనేవారు ఉన్నారు. వాస్తవానికి ఒక్కో జనరల్ బోగీలో కూర్చొని 75 మంది దాకా ప్రయాణించొచ్చు. కానీ ఏ జనరల్ బోగీ చూసినా... అందులో ప్రయాణించే వారి సంఖ్య 150 నుంచి 200 మంది పైనే ఉంటుంది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్‌నగర్, వరంగల్, కామారెడ్డి, కాజీపేట రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకొనేందుకు ‘సాక్షి ’క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రయాణికుల కష్టాలు తెలుసుకుంది. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా సాధారణ బోగీల సంఖ్య పెంచకపోవడంతో వందలాదిమంది రెండు, మూడు బోగీల్లోనే కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే కాదు గోదావరి, పద్మావతి, నారాయణాద్రి, విశాఖ ఎక్స్‌ప్రెస్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ తదితర అన్ని రైళ్లలోనూ సాధారణ ప్రయాణికులు నిత్యం నరకం చవిచూస్తున్నారు. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సివస్తోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లక్షలాదిమంది కార్మికులు హైదరాబాద్‌లో నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు. ఈ కార్మికుల కుటుంబాలు, బంధువులు నిత్యం తమ స్వస్థలాలకు రాకపోకలు సాగిస్తారు. ఈ ప్రయాణికుల డిమాండ్ మేరకు రైళ్లు లేక, అందుబాటులో ఉన్న రైళ్లలోనే ప్రయాణం చేస్తున్నారు. తగ్గిన ప్యాసింజర్ రైళ్లు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైళ్లు బాగా తగ్గుముఖం పట్టాయి. కొన్నింటిని ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చారు. పదేళ్లు దాటినా ఇంటర్సిటీ రైళ్ల సంఖ్య పెరగలేదు. దీంతో హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు బయలుదేరే రైళ్లలోనే సాధారణ బోగీలను ఆశ్రయించాల్సి వస్తోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్న సుమారు 250 రైళ్లలో సుమారు 100 వరకు ప్యాసింజర్ రైళ్లు ఉంటే 150 వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. కానీ 2 లక్షల మందికి పైగా సాధారణ ప్రయాణికులే కావడం గమనార్హం. ప్రస్తుతం 24 బోగీలు ఉన్న ట్రైన్లలో 2 నుంచి 3 సాధారణ బోగీలు ఉండగా, 18 బోగీలు ఉన్న రైళ్లలో కేవలం 2 సాధారణ బోగీలే ఉన్నాయి. ప్రయాణికులు మాత్రం వాటి సామర్థ్యానికి రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. ఎలాగోలా ప్రయాణం ముంబయి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా భువనేశ్వర్‌కు వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు ముందు ఒకటి, వెనుక మరొకటి చొప్పున 2 జనరల్ బోగీలు మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్కో బోగీలో కనీసం 250 మందికి పైగా ప్రయాణం చేస్తూ కనిపించారు. కొందరు బాత్రూమ్ వద్ద కిటకిటలాడుతుండగా, మరికొందరు పుట్బోర్డుపైన నిండిపోయారు. అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది. » కాజీపేట్, వరంగల్ స్టేషన్లలో సాధారణ బోగీల్లో ప్రయాణికుల దుస్థితిని పరిశీలించినప్పుడు, ఒక్క కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లోనే కాకుండా ఈస్ట్‌కోస్ట్, సంఘమిత్ర, గోరఖ్‌పూర్, సాయినగర్ షిర్డీ, కృష్ణా, మచిలీపట్నం, గౌతమి, గోదావరి, శాతవాహన, గోల్కొండ, ఇంటర్సిటీ, తదితర అన్ని రైళ్లలోను ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపించింది. » కామారెడ్డి మీదుగా ఇటు సికింద్రాబాద్, అటు నాందేడ్, ముంబై, షిరిడీలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ 2 సాధారణ బోగీలు మాత్రమే ఉన్నాయి. » సికింద్రాబాద్ నుంచి ముంబయికి వెళ్లే దేవగిరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లోని 2 సాధారణ బోగీలు సికింద్రాబాద్‌లోనే కిక్కిరిసిపోతాయి. కానీ మిర్జాపల్లి, అక్కన్నపేటస్టేషన్, కామారెడ్డి, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నాందేడ్, ముంబయికి వెళ్లే ప్రయాణికులు దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లోని సాధారణ బోగీలనే ఆశ్రయిస్తారు. దీంతో ఈ ట్రైన్ కామారెడ్డికి వచ్చేసరికి కాలు మోపేందుకు కూడా చోటు ఉండదు. అయినా సరే ముంబయికి ఉపాధి కోసం వెళ్లే కూలీలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. రైళ్ల రద్దుతో పెరుగుతున్న రద్దీ హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పుష్ఫుల్, ప్యాసింజర్ రైళ్లను తరచు రద్దు చేయడం వల్ల మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లపైన ఒత్తిడి పెరుగుతోంది. మెయింటెనెన్స్ పనుల పేరిట వారం, పదిరోజుల పాటు రద్దు చేస్తున్నారు. మరోవైపు ఏ ట్రైన్ ఎప్పుడు, ఎందుకు రద్దవుతుందో కూడా తెలియదు. దీంతో రోజువారీ ప్రయాణం చేసే చిరువ్యాపారులు, ఉద్యోగస్తులు, విద్యార్ధులు, వివిధ వర్గాలకు చెందినవారు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. రోలింగ్ కారిడార్ బ్లాక్ పనుల వల్ల సాధారణ రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయడమే ఇందుకు కారణం. ‘ఒక నెలలో పుష్ఫుల్ రైళ్లు 20 రోజులునడిస్తే కనీసం 10 రోజులు రకరకాల కారణాలతో రద్దవుతున్నాయని తాండూరుకు చెందిన శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు కోవిడ్ అనంతరం చాలా వరకు పుష్ఫుల్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చారు. సాధారణ బోగీల సంఖ్యను పెంచకుండా చార్జీలు మాత్రమే పెంచారు. » మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, తదితర స్టేషన్ల నుంచి సుమారు 1000 మందికి పైగా నగరానికి రాకపోకలు సాగిస్తారు. కానీ మహబూబ్‌నగర్ నుంచి కాచిగూడకు రాకపోకలు సాగించే డెమో ట్రైన్ తరచు రద్దవుతోంది. గంటల తరబడి ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతకాలంగా 40 నిమిషాలకు పైగా ఆలస్యంగా నడుస్తుందని , దీంతో సకాలంలో హైదరాబాద్‌కు చేరుకోలేకపోతున్నామని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. బోగీలు పెంచడమే పరిష్కారం అన్ని ప్రధాన రైళ్లలో సాధారణ బోగీలను 2 నుంచి 4కు పెంచనున్నట్టు ఇటీవల రైల్వేశాఖ స్పష్టం చేసింది. కానీ దక్షిణమధ్య రైల్వేలో ఇంకా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాలుగైదు రైళ్లలో మాత్రమే బోగీల సంఖ్యను పెంచినట్టు అధికారులు తెలిపారు. జోన్ పరిధిలో సుమారు 320 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లన్నింటిలోనూ సాధారణ బోగీలు పెంచడమే తక్షణ పరిష్కారం. » అన్ని ప్రధాన రైళ్లలో మహిళల కోసం ఒక ప్రత్యేక బోగీని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణం మహిళలకు ఎంతో కష్టం. ఈ దిశగా చర్యలు చేపట్సాల్సి ఉంది. డెమో రైలును రైట్‌టైమ్ ప్రకారం నడపాలి మహబూబ్‌నగర్ డెమో రైలులో ఏడాది నుంచి ప్రయాణం చేస్తున్న. కొద్ది రోజుల నుంచి డెమో ఆలస్యంగా నడుస్తోంది. దీంతో టైమ్ ఆఫీసుకు వెళ్లలేకపోతున్నా. లేట్‌గా వెళ్లిన రోజుల్లో కొన్నిసార్లు సగం జీతమే లెక్కలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి డెమో రైలును టైమ్ ప్రకారం నడపాలి. – ఎం.మహేశ్, ప్రైవేట్ ఉద్యోగి, మర్లు (మహబూబ్‌నగర్) నాలుగు రోజుల జీతం కట్ కొన్ని రోజుల నుంచి డెమో రైలు ఆలస్యంగా బయలుదేరి వెళుతుండ డంతో చాలా ఇబ్బందులు పడుతున్నా. నేను పనిచేసే సంస్థకు ఆలస్యంగా వెళుతుండటంతో నెలలో నాలుగు రోజులైన జీతం కట్ చేస్తున్నారు. డెమో రైలును రైట్‌టైమ్‌లో నడిపి మా సమస్యను పరిష్కరించాలి. – శ్రీనివాస్, ప్రైవేట్ ఉద్యోగి, హన్వాడ బోగీలు పెంచాలి ఇరవై ఏళ్లుగా కాంట్రాక్టు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాను. ఉదయం 9 గంటల వరకు ఉద్యోగంలో ఉండాలి. అందుకే ప్రతి రోజు ఉదయం 7 గంటలకు ఉండే పుష్ఫుల్ ట్రైన్‌కు వెళ్తాను. ఇది సుమారు 45 నిమిషాల పాటు ఆలస్యంగా వస్తుంది. దీని తర్వాత వచ్చే కాకతీయ ట్రైన్ వేళలు మార్చారు. బోగీల సంఖ్య కూడా తగ్గించారు. దీంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లపైన ఆధారపడాల్సి వస్తోంది. సాధారణ రైళ్లలో బోగీలు పెంచితే చాలు. – సత్తిబాబు, కాంట్రాక్టు రైల్వే ఉద్యోగి, భువనగిరి -
జనం గుండెల్లో బోగీ మంటలు
సాక్షి ప్రతినిధి,గుంటూరు, లక్ష్మీపురం, తెనాలి రూరల్: రైళ్లలోని జనరల్ బోగీలు నరకానికి నకళ్లుగా మారాయి. ఫలితంగా ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. వందల కిలోమీటర్ల దూరం నిలువు కాళ్లపై నిలబడే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మహిళలు, పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. ఏసీ కోచ్‌లు, వందేభారత్ రైళ్లపై ఉన్న శ్రద్ధ సామాన్యులు వెళ్లే జనరల్ బోగీలపైనా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం వివిధ రైళ్లలో జనరల్ బోగీలపై ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఈ విషయాలు బయటపడ్డాయి.రెండే జనరల్ బోగీలుగుంటూరు స్టేషన్ నుంచి నిత్యం సుమారుగా 20 వేల మందికిపైగా ప్రయాణం చేస్తుంటారు. గుంటూరు రైల్వే స్టేషన్‌కు నిత్యం సుమారుగా 65 రైళ్లు వస్తుంటాయి. వీటిలో ప్రధానంగా సికింద్రాబాద్, వైజాగ్, తిరుపతి, గుంతకల్లు, పిడుగురాళ్ల, విజయవాడ, రాజమండ్రి, వైపుగా ప్రయాణించే రైళ్లు ఉన్నాయి. ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించే వాటిలో సికింద్రాబాద్–తిరువనంతపురం వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్, హౌరా – సికింద్రాబాద్ నడిచే ఫలక్‌నుమా, సికింద్రాబాద్ – భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, వాస్కో–షాలీమార్ మధ్య నడిచే అమరావతి ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ – బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కి రెండు జనరల్ బోగీలు మాత్రమే ఉన్నాయి. వీటిల్లో ప్రయాణికులు కనీసం నిలబడేందుకూ స్థలం లేక నరకయాతన అనుభవించారు. బోగీలో కనీసం తాగునీటి వసతి లేదు. మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దుర్గంధం వెదజల్లుతున్నాయి. వాటివద్దే ప్రయాణికులు కూర్చుని, నిలబడి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.ప్యాసింజర్ రైళ్లు తగ్గింపుఒకప్పుడు పేదల బండిగా ఉన్న రైలు ఇప్పుడు పేద వారికి అందని ద్రాక్షగా మారుతోంది. కేంద్రప్రభుత్వం ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్ట్, వందేభారత్ వచ్చాక ప్యాసింజర్ రైళ్లను తగ్గించి వేయడమే కాకుండా ఎక్స్ ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీలను కాలక్రమేణా కుదిస్తూ వస్తోంది. రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాలు పెంచుతున్నామనే పేరుతో రైలు ప్రయాణాన్ని పేదలకు దూరం చేస్తోంది.టాయిలెట్లూ అస్తవ్యస్తం ధన్‌బాద్ నుంచి అలెప్పి వెళ్లే ఎక్స్‌ప్రెస్ మంగళవారం మూడు గంటలు ఆలస్యంగా రాత్రి 7.50 గంటలకు తెనాలి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. 24 బోగీలు ఉన్న ఈ రైలులో మూడు మాత్రమే జనరల్ బోగీలు. ఫలితంగా వీటిల్లో జనం కిక్కిరిసిపోయారు. వీటిలో 80 మంది చొప్పున ప్రయాణించేందుకే అవకాశం ఉంటుంది. కానీ సుమారు 140 మంది వరకు ఉన్నారు. రెండు జనరల్ బోగీల బాత్రూమ్లకు కిటికీ అద్దాలు లేవు. అందులోకి వెళ్లిన వ్యక్తి బయటకు కనపడేలా ఉన్నాయి. తలుపు దగ్గర, నడిచే దారిలో, ఆఖరికి టాయిలెట్ల వద్ద కూడా ప్రయాణికులు కూర్చుని ప్రయాణించారు.బోగీలు తగ్గిస్తే ఎలాకేంద్రం సామాన్య ప్రజలకు రైలు ప్రయాణం దూరం చేసేలా ఉంది. జనరల్ బోగీలు ఉండట్లేదు. స్లీపర్ కోచ్‌లు, ఏసీ కోచ్‌ల ధరలు అందని ద్రాక్షాలా ఉన్నాయి. నాలాంటి పేదల కోసం జనరల్ బోగీలు పెంచాల్సింది పోయి తగ్గిస్తే ఎలా?– కుర్రా హనుమంతరావు, క్రోసూరు, పల్నాడు జిల్లాఉగ్గబట్టుకున్నాంమాది తెనాలి. నేను శబరి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఎక్కాను. ఎప్పుడు తెనాలి చేరుకుంటానా అని ఉగ్గబట్టుకుని కూర్చున్నా. భరించలేని దుర్వాసన, నిలబడేందుకూ స్థలం లేదు. ఫుట్ బోర్డుపై కూర్చుని ప్రయాణించాను.– కూరపాటి సుదీప్, తెనాలికిటకిటనేను తిరుపతి వెళ్తున్నా. నేను ఎక్కిన రైలులో రెండు మాత్రమే జనరల్ బోగీలు. కిటకిటలాడుతున్నాయి. ఏ స్టేషన్లో అయినా తగ్గుతారని అనుకుంటే రైలు ఆగిన ప్రతి స్టేషన్లో జనం ఎక్కుతూనే ఉన్నారు. జనరల్ బోగీలను పెంచాలి.– గాజలు రామాంజనేయులు, బయ్యవరం -
రైలులో మంటలు... నాలుగు బోగీలు దగ్ధం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ప్యాసింజర్ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. సోమవారం(జూన్3) ఢిల్లీ సరితా విహార్‌లో తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు మంటలంటుకున్నాయి. దీంతో రైలులోని నాలుగు బోగీలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి.అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఏమీ కాలేదని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. మంటలార్పడానికి ఐదు ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. అగ్ని ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉంది. Breaking: Fire in a passenger train near Sarita Vihar, Delhi. 6 fire tenders rushed to the site. Further details awaited. pic.twitter.com/ru0l6UPG8y— Prashant Kumar (@scribe_prashant) June 3, 2024 -
హేవలాక్.. గోదావరి ఐకానిక్..
సాక్షి డెస్క్, రాజమహేంద్రవరం: అమ్మమ్మగారింటికనో.. చుట్టాలింటికనో గోదావరి అవతల ఉన్న ఏ విజయవాడకో.. మెడ్రాసుకో (ఇప్పుడంటే చైన్నె కానీ.. అప్పట్లో అలానే కాస్త స్టైలుగా అనేవారు ఎందుకో! కాకపోతే కొందరు మద్రాసు, మదరాసు అనేవారు) చిన్నప్పుడు వెళ్లిన వాళ్లందరికీ రాజమండ్రి పాత రైలు బ్రిడ్జిపై ప్రయాణం ఎప్పటికీ చెదరని ఓ మధుర జ్ఞాపకమే. పగటి పూట అయితే చాలామంది కాకినాడ – మెడ్రాసు సర్కార్ ఎక్స్‌ప్రెస్ లేకపోతే ప్యాసింజర్ రైలు ఎక్కేవారు. అప్పట్లో బొగ్గు ఇంజన్. కూ... అంటూ చెవులు చిల్లులు పడేలా పే....ద్ధ కూత పెట్టుకుంటూ చుక్చుక్చుక్ మంటూ వచ్చేది. రైలు నెమ్మదిగా రాజమండ్రి (కొంతమంది ‘రాజమంట్రి’ అనేవారు. అదేమిటో!) చేరిందంటే చాలు.. గోదావరి వచ్చేసిందని పెద్దవాళ్లు అప్రమత్తం చేసేవారు. అందరూ పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు, పది, 20 పైసలు.. కాస్త ఉన్న వాళ్లయితే పావలా నుంచి రూపాయి కాసు వరకూ చేతులతో పట్టుకుని రైలు బోగీ కిటికీలు, గేట్ల వద్దకు ఉరికేందుకు సిద్ధంగా ఉండేవారు. ఏదో యుద్ధానికి సిద్ధమైన యోధుల్లా..రైలు కూత పెట్టి నెమ్మదిగా రాజమండ్రి స్టేషన్‌ను వీడేది. ఇంజిన్.. దాని వెనుకనే ఒకదాని వెనుకన ఒక్కో బోగీ గోదావరి బ్రిడ్జి మీదుగా పరుగులు తీసేవి. ఇప్పుడంటే రోడ్ కం రైల్వే బ్రిడ్జి, ఆర్చి బ్రిడ్జి ఉన్నాయి కానీ.. అప్పట్లో రైలు గోదావరి దాటాలంటే ఒక రకం జేగురు రంగులో ఉండే రెడ్ ఆకై ్సడ్ పూత పూసిన పాత బ్రిడ్జి ఒక్కటే దిక్కు.. దీనికే హేవలాక్ బ్రిడ్జి అని మరో పేరు. అమ్మో బ్రిడ్జి మీద ప్రయాణమే.. అప్పట్లో ఆ బ్రిడ్జిపై ప్రయాణం అంటే చాలామందికి హడల్.. గుండెలు గుబగుబలాడిపోయేవి. ఓపక్క ఠక్‌ఠక్.. ఠక్‌ఠక్ అంటూ రైలు చక్రాల సౌండ్.. అది ఇనుప బ్రిడ్జి కావడంతో వాటి అదురు నుంచి వచ్చే రీసౌండ్.. చిన్న పిల్లలైతే భయంతో బిర్రబిగుసుకుపోయేవాళ్లు. మరోపక్క కిందన అఖండ గోదావరి. ఎటు చూసినా కనుచూపు మేరంతా అగాధంలాంటి జలరాశే. అసలే ఆ బ్రిడ్జికి అటూ ఇటూ ఏమీ ఉండేవి కావు. ఒక వేళ ఈ రైలు ఆ బ్రిడ్జి మీంచి కింద పడిపోతే.. అనే ఆలోచన వస్తేనే పై ప్రాణాలు పైనే పోయినట్టుండేది. (ఒకవేళ బ్రిడ్జికి అటూ ఇటూ గోడలుంటే మాత్రం వేగంగా వెళ్తున్న రైలు పడితే ఆపుతాయా? అదో వెర్రి ఆలోచన.) ఈలోగా గోదావరిలో డబ్బులేసేవాళ్లు.. పూలు, పండ్లు విసిరేవారు.. చల్లగా చూడాలమ్మా అంటూ తల్లి గోదారికి దణ్ణాలు పెట్టేవాళ్లు. ఈ ప్రాంత ప్రజలతోనే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజలతో కూడా అనుబంధం పెనవేసుకున్న ఈ హేవలాక్ వంతెనకు చాలానే చరిత్ర ఉంది. అంతకు ముందు కేవలం పడవలే.. హేవలాక్ బ్రిడ్జి నిర్మించక ముందు గోదావరి నదిని దాటడానికి ఇక్కడి ప్రజలు పడవలే వినియోగించేవారు. ఆ రోజుల్లో గోదావరి వరద ఉధృతంగా ఉంటే ఒక్కోసారి పడవలు తలకిందులై ప్రాణనష్టం కూడా జరిగేది. అటువంటి దుస్థితికి ఈ వంతెన చెక్ చెప్పింది. ప్రజలు సురక్షితంగా గోదావరి దాటడానికి ఒక రవాణా సాధనం లభించింది. అప్పట్లో బ్రిడ్జిపై ఎలాంటి ఆధారం లేకుండా రైలు వెళ్తూంటే అందులోని ప్రయాణికులు చాలా భయపడేవారు. అదే సమయంలో థ్రిల్‌గా కూడా ఫీలయ్యేవారు. పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు ప్రణాళిక రైళ్ల రాకపోకలను 1997లో నిలిపివేసిన పదేళ్ల తరువాత ఈ వంతెనను పర్యాటకంగా, రాజమహేంద్రవరం – కొవ్వూరు మధ్య పాదచారుల మార్గంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 2008లో ఈ వంతెన సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టేందుకు తీర్మానం చేసింది. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించలేదు. నాటి ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఈ ప్రాజెక్ట్‌ను ఆమోదించాల్సిందిగా రైల్వే శాఖకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. హేవలాక్ బ్రిడ్జిని తొలగించి, దానిలోని ఉక్కును తీసుకువెళ్లాలని రైల్వే శాఖ చేసిన యత్నాలను స్థానికులు తిప్పి కొట్టారు. ఈ ఐకానిక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. బ్రిడ్జిపై రోడ్డు వేస్తే చిరు వ్యాపారులకు, రైతులకు ఉపయోగపడుతుందని, వాకింగ్ ట్రాక్‌గా కూడా పనిస్తుందని చెప్పారు. చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేస్తే పర్యాటకంగా ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2017లో రైల్వే శాఖకు కొంత మొత్తం చెల్లించి, సొంతం చేసుకుంది. దీనిని వారసత్వ సంపదగా అభివృద్ధి చేస్తామని చెప్పింది. అడుగులు ముందుకు పడలేదు. ప్రస్తుత రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ కల సాకారమయ్యే రోజు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు పొడవు : 2.7 కిలోమీటర్లు – వెడల్పు: 1.7 మీటర్లు నిర్మాణం ప్రారంభం : 1897 నవంబర్ 11 నిర్మాణ అంచనా వ్యయం : రూ.47 లక్షలు వంతెన ప్రారంభం : 1900 ఆగస్టు 30 వంతెన మూసివేత : 1997 స్తంభాలు : 56 (రాతి కట్టడాలు) మొట్టమొదట ప్రయాణించిన రైలు : మెయిల్ చివరిసారి ప్రయాణించిన రైలు : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ 1897లో నిర్మాణం ఆరంభం ఈ వంతెనను అఖండ గోదావరిపై బ్రిటిష్ వారి పాలనలో హౌరా – మద్రాసు (నేటి చైన్నె) రైలు మార్గంలో రాజమహేంద్రవరం – కొవ్వూరు పట్టణాల మధ్య 1897లో నిర్మించారు. దీనిని వంద సంవత్సరాల పాటు వినియోగంలో ఉండేలా అప్పట్లో డిజైన్ చేశారు. స్తంభాలు పూర్తి రాతి కట్టడాలు. బలమైన ఉక్కు గడ్డర్లు ఉపయోగించారు. దీని నిర్మాణానికి ఫ్రెడరిక్ థామస్ గ్రాన్విల్లే వాల్డన్ ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించారు. ఈ వంతెనకు అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్ సర్ ఆర్థర్ ఎలిబ్యాంక్ హేవ్‌లాక్ పేరు పెట్టారు. -
సికింద్రాబాద్ టు సిద్దిపేట రూ.440
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి సిద్దిపేటకు ఎక్స్‌ప్రెస్ బస్ చార్జి రూ.140. వెళ్లి రావటానికి రూ.280. రెండు రోజులకు రూ.560. అదే రైలులో నెల రోజులు ప్రయాణించేందుకు రూ.440 చెల్లిస్తే సరి. రెండు రోజుల బస్ చార్జి కంటే చవకగా, ఏకంగా నెలరోజుల పాటు ప్రయా ణించే వెసులుబాటును రైల్వే శాఖ కల్పించింది. ఈ నెల మూడో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన సికింద్రాబాద్–సిద్దిపేట ప్యాసింజర్ రైలు ఆ ప్రాంత వాసులకు కారు చవక ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య 117 కి.మీ. ప్రయాణానికి రైలు టికెట్ ధర కేవలం రూ.60 మాత్రమే. ఇప్పుడు దానిని మరింత చవకగా మారుస్తూ నెలవారీ సీజన్ టికెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. మామూలు టికెట్ ప్రకారం.. వెళ్లి రావటానికి రూ.120 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెల రోజులకు రూ.3,600 అవుతుంది. కానీ, నెల రోజుల సీజన్ టికెట్ కొంటే కేవలం రూ.440తో నెల రోజుల పాటు ఎన్ని ట్రిప్పులైనా తిరగొచ్చు. ఇంతకాలం బస్సులు, ప్రైవేటు వాహనాలకు ఎక్కువ మొత్తం చెల్లిస్తూ ప్రయాణిస్తున్న నిరుపేద వర్గాలకు ఇది పెద్ద వెసులుబాటుగా మారనుంది. స్పెషల్ రైలు సర్వీసుగా సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య ఈ రైలు సేవలు ప్రారంభమైనప్పటికీ, సీజన్ టికెట్‌ను జారీ చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రత్యేక రైలులో ఎక్స్‌ప్రెస్ టికెట్ ధరలను అమలు చేస్తారు. దాన్ని రెగ్యులర్ సర్వీసుగా మార్చగానే ఆర్డినరీ టికెట్ ధరలను వర్తింపచేస్తారు. ఈ ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న టికెట్ ధర రూ.60 నుంచి రూ.50కి తగ్గుతుంది. అయితే దీనితో సంబంధం లేకుండా ఇప్పుడు సీజన్ టికెట్‌ను అందుబాటులోకి తెచ్చారు. 101 కి.మీ. నుంచి 135 కి.మీ. వరకు ప్రయాణ దూరానికి సీజన్ టికెట్ ధర రూ.440 ఉంటుంది. సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రైలు ప్రయాణ దూరం 117 కి.మీ.గా ఉంది. దీంతో ఈ టికెట్ ధరను రూ.440 ఖరారు చేశారు. నెల తర్వాత దానిని మళ్లీ రెన్యూవల్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ –సిద్దిపేట మధ్య ఇతర స్టేషన్ల వరకు కూడా ఈ సీజన్ టికెట్ పొందే వెసులుబాటు కల్పించారు. ఆయా స్టేషన్ల మధ్య దూరం ఆధారంగా ఆ టికెట్ ధర ఉంటుంది. ట్రిప్పు వేళలు ఇలా.. ♦ సిద్దిపేటలో రైలు (నంబరు:07483) ఉదయం 6.45కు బయలుదేరి సికింద్రాబాద్‌కు 10.15కు చేరుకుంటుంది. ♦ తిరిగి సికింద్రాబాద్‌లో రైలు (నంబరు:07484) ఉదయం 10.35కు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకుంటుంది. ♦ తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి సిక్రింద్రాబాద్‌కు సాయంత్రం 5.20 గంటలకు చేరుకుంటుంది. ♦ సికింద్రాబాద్‌లో సాయంత్రం.5.45 గంటలకు బయలుదేరి సిద్దిపేట కు రాత్రి 8.45 గంటలకు చేరుకుంటుంది. ♦ హాల్ట్‌స్టేషన్లు: మల్కాజిగిరి, కేవలరీ బ్యారెక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చ ల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట -
ప్యాసింజర్ రైళ్లు ఆలస్యం..
పెద్దపల్లి: సాధారణ, మధ్య తరగతి ప్రజలు తక్కువ ఖర్చు.. భద్రతతో కూడిన రైలులో సకాలంలో గమ్యం చేరేందుకు ప్రయాణిస్తుంటారు. అయితే ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖాజీపేట–సిర్పూర్ కాగజ్‌నగర్, నిజామాబాద్– సిర్పూర్కాగజ్నగర్ మధ్య నడిచే రామగిరి, పుష్పుల్, ఇంటర్సిటీ, సింగరేణి ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. 98 కిలోమీటర్ల దూరంలో కాజీపేట, 220కిలోమీటర్ల దూరంలో ఉన్న సికింద్రాబాద్, ని జామాబాద్ వెళ్లేందుకు పొద్దస్తమానం పడిగాపులు కాయాల్సి వస్తోందని ప్రయాణికులు అంటున్నారు. ట్రాక్ పనులు చేపడితే రద్దే.. కరీంనగర్, కాజీపేట– కాగజ్‌నగర్ మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడితే గతంలో ఒకటి రెండు రైళ్లను నడిపించిన రైల్వేశాఖ.. ప్రస్తుతం వారం రోజుల పాటు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తోంది. ఆర్టీసీ బస్సు చార్జీలతో పోల్చితే నాలుగో వంతు రైలు చార్జీలు ఉండడంతో సాధారణ, నిరుపేద ప్రయాణికులు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. కాగా గంటల తరబడి రైళ్ల ఆలస్యంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్స్‌ప్రెస్, గూడ్సులకే మొదటి ప్రాధాన్యం క్రమంగా పెరుగుతున్న రైళ్ల సంఖ్యకు అనుగుణంగా రైల్వే ట్రాక్స్ విస్తరిస్తున్న రైల్వేశాఖ ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ప్యాసింజర్ రైలు రాకపోకలు సాగించే క్రమంలో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్లు మొదటగా పంపించేందుకు వీటిని గంటల తరబడి నిలిపివేస్తుండడంతో సాధారణ ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్నారు. గూడ్స్ రాకపోకలతో వందలాది కోట్ల ఆదాయం ఉండగా, రైల్వేశాఖ సేవా దృక్పథాన్ని మరిచి లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుందనే విమర్శలు మూటగట్టుకుంటుంది. -
ప్యాసింజర్ రైళ్లకు మంగళం
స్వాతంత్రోద్యమ కాలం నుంచి రైళ్లు ప్రజల జీవితాలతో ముడిపడి ఉండేవి. రోడ్డు మార్గాలు, రవాణా సాధనాలు అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో పేద, మధ్య, ఎగువ తరగతి ప్రజలకు ప్రయాణ సాధనం రైలు మాత్రమే. దీంతో రైల్వే శాఖ నిరంతరం ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పనిచేసేది. కాలక్రమేణా ఆధునికత సంతరించుకున్న రైల్వే శాఖ సేవామార్గాన్ని విస్మరించి లాభార్జనే పరమావధిగా పనిచేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి, వాటిని ఎక్స్‌ప్రెస్‌లుగా మర్పు చేయడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయాణం భారంగా మారింది. ఏలూరు (టూటౌన్): ఒక నాడు అధికంగా కనిపించే ప్యాసింజర్ రైళ్లు క్రమేణా కనుమరుగయ్యాయనే చెప్పవచ్చు. ఎక్కడో కొన్ని మార్గాల్లో మినహా ప్యాసింజర్ రైళ్లు అనేవి కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా విజయవాడ డివిజన్ పరిధిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి–విజయవాడ ప్యాసింజర్ రైలు ప్రతి రోజు అప్ అండ్ డౌన్‌గా తిరిగేది. ఇది పేద ప్రజలకు, నిత్యం ప్రయాణించే చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు అక్కరకు వచ్చేది. ఉదాహరణకు ఏలూరు నుంచి కేవలం రూ.15 చార్జీతో విజయవాడ ప్రయాణం చేసి మళ్లీ సాయంత్రం తిరిగి వచ్చే వెసులుబాటు ఉండేది. అంటే ఒక ప్రయాణికుడు కేవలం రూ.30 ఖర్చుతో ఏలూరు నుంచి విజయవాడ వెళ్లి వచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ రైలు ఎక్స్‌ప్రెస్‌గా మార్చి వేశారు. అలాగే చార్జీలు పెద్ద ఎత్తున పెంచి వేశారు. దీంతో గతంలో కిక్కిరిసి ఉండే ప్రయాణికులు ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చిన తరువాత నామమాత్రంగానే కనిపిస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి విజయవాడ వచ్చే ఫాస్ట్ ప్యాసింజర్ రైలు సైతం నేడు ఎక్స్‌ప్రెస్ రైలుగా రూపాంతరం చెందింది. సుదూర ప్రాంతం నుంచి వచ్చే రాయగడ–గుంటూరు ప్యాసింజర్ సైతం ఎక్స్‌ప్రెస్‌గా మార్చి వేశారు. దీంతో ఈ ప్రాంతం నుంచి విశాఖపట్టణం, శ్రీకాకుళం, రాయగడ ప్రాంతాలకు వెళ్లే వలస కూలీలు, సాధారణ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పాత సీసాలో కొత్త సారా నింపినట్లు గతంలో నడిచే ప్యాసింజర్ రైళ్లనే ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి వేసి పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తున్నారే తప్ప ఆ రైళ్లల్లో అదనంగా ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. స్లీపర్ బోగీలు కుదింపు.. ఏసీ బోగీలు పెంపు రైళ్లలో ప్రయాణించే జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల విషయంలో రైల్వే శాఖ పట్టించుకోవడం లేదనేది ప్రయాణికుల వాదనగా ఉంది. రద్దీ ఉండే అనేక రైళ్లలో ఏసీ బోగీల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నారు. ఇదే సమయంలో జనరల్, స్లీపర్ బోగీల సంఖ్యను కుదిస్తున్నారు. భువనేశ్వర్ నుంచి బెంగుళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో గతంలో స్లీపర్ బోగీలు 10, ఏసీ బోగీలు 3 ఉండేవి. తాజాగా స్లీపర్ బోగీలను ఆరుకు తగ్గించి, ఏసీ బోగీలను ఆరుకు పెంచారు. అలాగే విశాఖపట్టణం–హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో గతంలో స్లీపర్ బోగీలు 12 ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య ఏడుకు తగ్గించి, ఏసీ బోగీలను మూడు నుంచి ఏడుకు పెంచారు. ఇలా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ బోగీలను తగ్గించి, ఏసీ బోగీలను పెంచడం వల్ల సాధారణ ప్రజలకు రైలు ప్రయాణం అందని ద్రాక్షలా చేస్తున్నారనేది ప్రయాణికుల వాదనగా ఉంది. రైళ్ల రద్దుతోనూ తప్పని అవస్థలు ఇటీవల ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో పాటు ట్రాక్‌ల మెయింట్‌నెన్స్ పేరుతో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. నిత్యం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండే విజయవాడ–విశాఖపట్టణం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–విశాఖపట్టణం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్, కాకినాడ పోర్టు–విజయవాడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును పలు పర్యాయాలు రద్దు చేస్తుండటంతో వాటిలో ప్రయాణించేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు నిత్యం ప్రయాణించే రైళ్లే. వీటిని పలు కారణాలతో ఎక్కువ సార్లు రద్దు చేస్తుండటంతో నిత్యం ప్రయాణించే వారి బాధలు వర్ణనాతీతంగా చెప్పుకోవచ్చు. ఆదాయం బాగుంటేనే గ్రీన్‌సిగ్నల్ పలు కారణాలతో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్న రైల్వే శాఖ అంతరాష్ట్ర సర్విసులను, రైల్వేకు అధిక ఆదాయం తెచ్చే వందేభారత్ వంటి రైళ్ళను మాత్రం యధావిధిగా నడపడంపై సాధారణ ప్రయాణికులు విమర్శలు చేస్తున్నారు. భిన్నమతాలు, భాషలు, ప్రాంతాలను కలిపే రైళ్లు నేడు లాభాలు తెచ్చే మార్గాల వైపే దృష్టి సారించడం శోచనీయమంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్లీపర్ బెర్త్ దొరకడమే కష్టమే స్లీపర్ క్లాస్ బోగీల సంఖ్యల తగ్గించి వేస్తుండటంతో రిజర్వేషన్ దొరకడమే కష్టంగా మారింది. నెల ముందు రిజర్వేషన్ కోసం ప్రయత్నించినా వెయిటింగ్ లిస్ట్ వస్తోంది. గతంలో నాలుగు రోజుల ముందు ప్రయత్నిస్తే స్లీపర్ క్లాస్‌లో రిజర్వేషన్ దొరికేది. సామాన్య, మధ్యతరగతి ప్రయాణికుల పట్ల రైల్వే శాఖ శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. – కొరబండి బాబూరావు, సామాజిక కార్యకర్త, ఏలూరు -
రెండు రైల్వే లైన్లు !
కోదాడ: ఇప్పటి వరకు ప్యాసింజర్ రైలు ముఖం చూడని జిల్లా వాసులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. జిల్లా మీదుగా రెండు రైల్వే లైన్లు వేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కొద్ది సంవత్సరాల్లోనే జిల్లా వాసులకు ఒక సాధారణ, మరో హైస్పీడ్ రైల్వేలైన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే డోర్నకల్–మిర్యాలగూడ మార్గానికి సంబంధించి సర్వే దాదాపు పూర్తికావొచ్చింది. తాజాగా శుక్రవారం కేంద్ర రైల్వే, పర్యాటకశాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్‌రెడ్డిలు తెలుగు రాష్ట్రాల విభజన హామీల్లో భాగంగా శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ వరకు హైస్పీడ్ రైల్వేలైన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని సర్వే కోసం కాంట్రాక్టర్‌ను కూడా నియమించడంతో ఈ ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కే అవకాశముంది. కేంద్ర మంత్రుల తాజా ప్రకటనతో జిల్లావాసులకు ఆనందాన్ని కలిగిస్తుంది. తీరనున్న జిల్లా వాసుల చిరకాల వాంఛ తమ పట్టణంలో రైలు ఎక్కాలనుకుంటున్న జిల్లావాసుల చిరకాలకోరిక తీరే సమయం దగ్గరపడింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్‌రెడ్డి ప్రకటించిన ఈ కొత్త రైల్వేలైన్ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే జిల్లాలోని సూర్యాపేట, కోదాడ వాసులు హైస్పీడ్ రైలు ఎక్కడానికి ఎక్కువ సమయం పట్టదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల విభజన హామీల్లో భాగంగా రెండు రాష్ట్రాలను కలుపుతూ శంషాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్ వరకు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వేకు రైల్వేబోర్డు అనుమతులు మంజూరు చేసింది. దీనికి కాంట్రక్టర్‌ను కూడా నియమించింది. ఆరు నెలల్లో సదరు కాంట్రాక్టర్ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. 220 కి.మీ. గరిష్ట వేగంతో (సెమీ హైస్పీడ్) రైళ్లను నడిపే విధంగా ఈ లైన్ వేయాలని నిర్ణయించారు. రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రాథమికంగా శంషాబాద్ నుంచి అంబర్‌పేట ఓఆర్ఆర్ మీదుగా 65వ నంబర్ జాతీయ రహదారికి సమాంతరంగా ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల ఉమ్మడి జిల్లాలోని చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ పట్టణాల సమీపంలోనుంచి ఈ లైన్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పూర్తికావొచ్చిన డోర్నకల్ – మిర్యాలగూడ లైన్ సర్వే డోర్నకల్ నుంచి మిర్యాలగూడ వరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ సర్వే పనులు గడిచిన ఆరు నెలలుగా జరుగుతున్నాయి. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో సర్వే పనులు ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం నల్లగొండ జిల్లా పరిధిలో సర్వే జరుగుతోంది. ఈ లైన్ డోర్నకల్, నేలకొండపల్లి, కోదాడ, హుజూర్నగర్ల మీదుగా మిర్యాలగూడకు చేరుకోనుంది. మరో ప్రతిపాదనలో డోర్నకల్, నేలకొండపల్లి, కోదాడ, హుజూర్నగర్ మీదుగా ఇప్పటికే ఉన్న జాన్‌పహాడ్ వద్ద లైన్‌కు కలిసే విధంగా తయారు చేస్తున్నట్లు సమాచారం. దీనిలో మొదటి ప్రతిపాదనకే అధికారులు మొగ్గుచూపుతున్నారని.., వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ లైన్‌కు నిధులు మంజూరు చేయించడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడకు చెందిన ఐఆర్టీఎస్ అధికారి బర్మావత్ నాగ్యానాయక్ తీవ్ర కృషి చేస్తున్నట్లు తెలిసింది. ఎంపీ కాగానే పార్లమెంట్లో ప్రతిపాదించా.. హైదరాబాద్ – విజయవాడల మధ్య హైస్పీడ్ రైల్వేలైన్ ఆవశ్యకతను నేను ఎంపీగా ఎన్నిక కాగానే తొలిసారి పార్లమెంట్లో ప్రతిపాదించాను. రెండు రాష్ట్రాల మధ్య ఈ లైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాను. ప్రభుత్వం దీనిపై ఇన్నాళ్లకు నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. దీనికి వెంటనే నిధులు మంజూరు చేయించడానికి నావంతు ప్రయత్నం చేస్తాను. – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ నల్లగొండ -
సిబ్బంది లేని రైల్వే స్టేషన్లు అవి.. టిక్కెట్లు ఎవరిస్తారంటే..
మనం పలు రైల్వే స్టేషన్ల పేర్లు వినేవుంటాం. వాటిలో కొన్నింటి పేర్ల చివర సెంట్రల్, టెర్మినల్, రోడ్డు అని ఉండటాన్ని చూసేవుంటాం. అయితే కొన్ని రైల్వే స్టేషన్ల పేరు చివర పీహెచ్ అని రాసివుంటుంది. అలా ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని రైల్వే స్టేషన్ల పేర్ల చివరన పీహెచ్ అని ఉంటుంది. ఇక్కడ పీహెచ్ అంటే పాసింజర్ హాల్ట్ అని అర్థం. అంటే ఈ స్టేషన్లలో కేవలం పాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. ఇటువంటి స్టేషన్లు మిగిలిన స్టేషన్ల కన్నా కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ స్టేషన్లలో రైల్వేశాఖ తరపున ఎటువంటి అధికారిగానీ, ఉద్యోగిగానీ ఉండరు. పాసింజర్ హాల్ట్ అనేది డీక్లాస్ తరహా స్టేషన్. రైళ్లు ఆగేందుకు సిగ్నల్ చూపేలా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉండవు. అయితే సిగ్నల్స్ లేని ఇటువంటి స్టేషన్లలో రైళ్లు ఎలా ఆగుతాయనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఇటువంటి రైల్వే స్టేషన్లలో రైళ్లను రెండు నిముషాల పాటు ఆపాలంటూ ట్రైన్ డ్రైవర్‌కు ముందుగానే ఆదేశాలు అందుతాయి. ఈ మేరకు డ్రైవర్ ఆయా స్టేషన్లలో రైళ్లను ఆపుతాడు. కాగా ఇటువంటి స్టేషన్లలో రైల్వే సిబ్బందే లేకపోతే మరి ప్రయాణికులు టిక్కెట్లు ఎలా తీసుకోవచ్చనే సందేహం కలుగుతుంది. ఇటువంటి డీ క్లాస్ స్టేషన్లలో రైల్వేశాఖ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తిని కమిషన్ ఆధారంగా టిక్కెట్లు విక్రయించేందుకు నియమిస్తుంది. అయితే ప్రస్తుతం ఇటువంటి రైల్వేస్టేషన్లకు స్వస్తి పలకాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ఇటువంటి స్టేషన్ల నుంచి రైల్వేకు ఎటువంటి ఆదాయం రావడంలేదని సమాచారం. -
తీవ్ర విషాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
ఇటీవలే గ్రీస్ దేశంలో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 50కిపైగా మందికి మృతిచెందిన ఘటన మరువక ముందే మరో విషాదం నెలకొంది. ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ప్రమాద ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఈజిప్టు దేశంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఈజిప్టులోని కైరో నగరంలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కాగా, నైలు డెల్టాలోని మెనోఫ్ నగరానికి వెళ్లే మార్గంలో కల్యుబ్ నగరంలోని స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుండగా ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ రైలు ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించినట్టు వెల్లడించారు. AFP: Two people were killed and several others injured Tuesday in a #train_accident north of #Cairo, #Egypt's #health_ministry said. A ministry statement said there were "two dead in the train accident at #Qalyub, while the injured are in a stable condition." pic.twitter.com/ILBz8R0xs4 — Usama Farag (@VOAFarag) March 7, 2023 -
హైదరాబాద్: పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు ఎంఎంటీఎస్‌లు, దూర ప్రాంతాలకు మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. మరమ్మతుల పనుల కారణంగానే దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. నేడు(బుధవారం),రేపు(గురువారం) నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ప్యాసింజర్ రైళ్లలో.. విజయవాడ-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-విజయవాడ, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-సికింద్రాబాద్ సర్వీసులు ఉన్నాయి. అలాగే.. ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలకొస్తే.. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి లింగంపల్లి-ఫలక్‌నుమా ఆర్సీ పురం-ఫలక్‌నుమా ఫలక్‌నుమా-ఆర్సీ పురం ఫలక్‌నుమా-హైదరాబాద్‌ల మధ్య ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. రెండురోజుల పాటు ఈ అంతరాయం కొనసాగుతుందని ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది దక్షిణ మధ్య రైల్వే. Cancellation of Passenger and MMTS Trains pic.twitter.com/RuX3ewtDG2 — South Central Railway (@SCRailwayIndia) January 11, 2023 -
Train Video: ఇది రైలు ప్రయాణమా? ఇంత ఘోరమా?
వైరల్: మన దేశంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ.. భారతీయ రైల్వేస్. అలాగే.. అత్యంత రద్దీ వ్యవస్థ కూడా ఇదే!. పండుగలు, ఇతర సెలవుల సమయంలో రైళ్లలో రద్దీ ఏపాటి ఉంటుందో తెలియంది కాదు. అయితే.. సాధారణ రోజుల్లోనూ కొన్ని మార్గాల్లో రద్దీ అధికంగా ఉంటోంది. ఆ రద్దీని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించలేకపోతోందనే విమర్శ ఇండియన్ రైల్వేస్‌పై ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా రాజేష్ దుబే అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అమృత్సర్ కథిహార్ ఎక్స్‌ప్రెస్‌లో 72 బెర్త్ స్లీపర్లు ఉన్న కోచ్‌లో ఏకంగా 350 మంది ప్రయాణించారు. ఎటు చూసినా ప్యాసింజర్లు, లగేజీలతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. అంత నరకంలోనూ గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లు, మరో మార్గం లేక ఇలా చేసినట్లు కొందరు ప్రయాణికులు వెల్లడించారు. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులు అలా ప్రయాణించడం నేరమే!. కానీ, ఆ టైంకి అక్కడ టీటీఈ కూడా లేకపోవడంతో.. విషయం రైల్వేస్ దృష్టికి వెళ్లింది. రైల్వే సేవా అధికారిక ట్విటర్ అకౌంట్ ఈ ప్రయాణ వివరాలను అందించమని కోరగా.. చివరకు ఫిర్యాదు నమోదు అయ్యింది. Video Credits: The Logical Indian -
దేశంలో అత్యంత నెమ్మెదిగా నడిచే రైలు ఇదే.. అయినా ‘యూనెస్కో’ గుర్తింపు
చెన్నై: ఒక రైలు తన ప్రయాణం మొదలు పెట్టిందంటే.. అది గమ్యం చేరేందుకు గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుంది. వందే భారత్, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని తెలుసు. కానీ, దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో తెలుసా? అసలు అలాంటి ఓ ట్రైన్ ఉంటుందని ఊహించారా? అవునండీ నిజమే ఉంది. అది కేవలం గంటకు 10 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. కానీ, అది యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు సంపాదించింది. అదే తమిళనాడులోని ‘మెట్టుపాలయం ఊటీ నీలగిరి ప్యాసెంజర్ ట్రైన్’. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఓసారి తెలుసుకుందాం. భారత్‌లో అత్యంత నెమ్మెదిగా నడిచే ట్రైన్‌గా ఈ రైలు ప్రసిద్ధిగాంచింది. అత్యంత వేగంగా నడిచే రైలుతో పోలిస్తే.. ఇది 16 రెట్లు నెమ్మదిగా వెళ్తుందంటే నమ్మశక్యం కాదు. ఐదు గంటల్లో కేవలం 46 కిలోమీటర్లు ప్రయాణించి గమ్యం చేరుకుంటుంది. అయితే, అందుకు ప్రధాన కారణం అది కొండ ప్రాంతంలో నడవటమే. ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో ఈ రైలును ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. యునెస్కో ప్రకారం.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే లైన్ నిర్మాణం కోసం 1854లో తొలుత ప్రతిపాదన చేశారు. కానీ, కొండల్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు 1891లో పనులు ప్రారంభం కాగా.. 1908లో పూర్తయ్యాయి. The slowest train goes uphill at the speed of 10 kilometers per hour You can jump off the train, light up a smoke, take few drags and climb on the train again. It’s the Mettupalayam Ooty Nilgiri Passenger train. pic.twitter.com/DHyFKe3cbp — Gouthama Venkata Ramana Raju Chekuri (@gouthamaraju) May 2, 2020 ఆహ్లాదానిచ్చే రైడ్.. ఐఆర్టీసీ ప్రకారం.. ఈ రైలు చాలా సొరంగాల గుండా ప్రయాణిస్తుంది. 46 కిలోమీటర్ల ప్రయాణంలో 100కుపైగా వంతెనలను దాటుతుంది. పెద్ద పెద్ద రాళ్లు, లోయలు, తేయాకు తోటలు, పచ్చని కొండల అందాలు ఆహ్లాదానిస్తాయి. మెట్టుపాలయం నుంచి కూనూర్ మధ్య సుందరమైన దృశ్యాలు కనిపిస్తాయి. ప్రధాన స్టేషన్లు.. నీలగిరి మౌంటెయిన్ రైల్వే ప్రతిరోజు మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు సేవలందిస్తుంది. రోజు ఉదయం 7.10 గంటలకు ఈ రైలు మెట్టుపాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఊటీకి చేరుకుంటుంది. తిరిగి ఊటీలో 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.35 గంటలకు మెట్టుపాలయంకు చేరుకుంటుంది. ఈ రూట్లో ప్రధానంగా కూనూర్, వెల్లింగ్టన్, అరవన్‌కుడు, కెట్టి, లవ్‌డేల్ వంటి స్టేషన్లు వస్తాయి. ఈ రైలులో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని రెండు రకాల కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్‌లో తక్కువ సంఖ్యలో సీట్లు ఉంటాయి. డిమాండ్ పెరిగిన క్రమంలో 2016లో నాలుగో బోగీని జత చేసింది రైల్వే శాఖ. టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? నీలగిరి మౌంటెయిన్ రైల్వేలో ప్రయాణించేందుకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. హాలీడేస్, వీకెండ్లో పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదీ చదవండి: ఏనుగుతో ఫోటోకు కొత్త జంట పోజు.. చిర్రెత్తి కుమ్మిపడేసిందిగా! -
పట్టాలు తప్పిన రైలు.. విశాఖ వైపు వెళ్లే పలు ట్రైన్స్ ఆలస్యం!
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బాలాజీపేట వద్ద గూడ్స్ రైలు పట్టింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు భోగి పూర్తిగా పట్టాలపై పడిపోయింది. ఇక, ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని భోగిని పట్టలాపై నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం కారణంగా విశాఖ వైపునకు వెళ్లు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్తిలి వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి. -
100 బోగీలు..1.9 కిలోమీటర్ల పొడవు!
జెనీవా: ప్రపంచంలోనే అతి పొడవైన ప్రయాణికుల రైలు తమదేనంటూ స్విట్జర్లాండ్‌కు చెందిన రేషియన్ రైల్వే కంపెనీ ప్రకటించింది. 100 బోగీలతో 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ రైలును ఆల్ఫ్స్ పర్వతాల గుండా అల్బులా/బెర్నినా మార్గంలో నుంచి ప్రీడా నుంచి బెర్గ్యున్ వరకు శనివారం విజయవంతంగా నడిపినట్లు తెలిపింది. సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పట్టిందని వివరించింది. పర్వతాల దిగువన మెలికలు తిరుగుతూ ఉండే 22 టన్నెళ్లు, 48 వంతెనల మీదుగా సాగే సుందరమైన ఈ మార్గాన్ని 2008లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చిందని తెలిపింది. 175వ వార్షిక ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుంటున్న స్విస్ రైల్వేల ఇంజినీరింగ్ ప్రతిభను చాటేందుకే ఈ ప్రయత్నాన్ని చేపట్టినట్లు రేషియన్ రైల్వే డైరెక్టర్ రెనాటో ఫసియాటి చెప్పారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. -
మెదక్‌లో రైలు కూత
మెదక్‌జోన్: మెదక్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. శుక్రవారం మెదక్‌లో రైలు కూత వినిపించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మెదక్–అక్కన్నపేట రైల్వేస్టేషన్ మధ్య నూతన రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేస్తూ మెదక్ నుంచి కాచిగూడ వరకు ప్యాసింజర్ రైలును మెదక్ రైల్వేస్టేషన్లో కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డితో కలిసి ప్రారంభించి రైలు టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎన్నికై ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడి ప్రజలు రైలు కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మెదక్ జిల్లా ప్రజలకు ఇది పండుగ వేళ అన్నారు. మెదక్–అక్కన్నపేట వరకు 17.2 కిలోమీటర్ల రైల్వేలైన్ కోసం రూ.205 కోట్లు వ్యయమైందన్నారు. మెదక్ నుంచి రెండు ప్యాసింజర్ రైళ్లను ప్రారంభిస్తున్నామన్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్–ముంబై ట్రాక్‌కు కనెక్ట్ చేస్తారని చెప్పారు. త్వరలో వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు గతంలో ఈ ప్రాంతంలోని మాసాయిపేట వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొట్టిన దుర్ఘటన ఇంకా తన కళ్ల ముందే కదలాడుతోందని, అలాంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 43 స్టేషన్ల పరిధిలో ప్రత్యేక పనులను చేపట్టామని కిషన్‌రెడ్డి చెప్పారు. భద్రాచలం, సత్తుపల్లిలో రైల్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు సైతం రూ.221 కోట్ల వ్యయంతో జరుగుతున్నాయని, రూ.653 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసి అభివృద్ధి చేసుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టంచేశారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి అన్ని రంగాల్లో్ల ప్రాధాన్యత ఇస్తోందని, మెదక్ జిల్లా కేంద్రానికి నేషనల్ హైవే నర్సాపూర్ మీదుగా నిర్మించారని చెప్పారు. అలాగే జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.లక్షా నాలుగు వేల కోట్లను ఖర్చుపెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య నియంత్రణ కోసం చర్లపల్లి రైల్వేస్టేషన్లో రూ.221 కోట్లతో రైల్వే టర్మినల్ నిర్మిస్తున్నామన్నారు. వరంగల్‌లో రూ.400 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
నిరీక్షణ ఫలించిన వేళ.. మెతుకుసీమకు రైలుబండి
మెదక్‌జోన్: ఎన్నో దశాబ్దాలుగా రైలుకోసం ఎదురు చూస్తున్న మెతుకు సీమ ప్రజల కల ఎట్టకేలకు నెరవేరే సమయం ఆసన్నమైంది. శుక్రవారం రైలు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. దివంగత ఇందిరా గాంధీ ఎంపీగా మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటినుంచే ఈ ప్రాంతానికి రైల్వే సౌకర్యం కల్పించాలన్న డిమాండ్ ఉంది. అందుకోసం చాలా కాలం ఉద్యమాలు కొనసాగాయి. 2012 –13లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకు ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి ఫలితంగా కాస్ట్ షేరింగ్ పద్ధతిలో రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ మంజూరైంది. 2014లో శంకుస్థాపన.. మెదక్–అక్కన్నపేట రైల్వేలైన్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 17.2 కిలోమీటర్ల దూరం కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి 2012–2013 సంవత్సరంలో రూ.117 కోట్లు అవసరమని అంచనా వేసి ఆమోదం తెలిపారు. 2014లో రైల్వేలైన్ నిర్మాణానికి అప్పటి ఎంపీ విజయశాంతి చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత పనుల ఆలస్యంతో అంచనా వ్యయం రూ.206 కోట్లకు చేరింది. ఇందులో రూ.103 కోట్లు రాష్ట్రం భరించగా, మిగతా నిధులు కేంద్రం విడుదల చేసింది. భూసేకరణకు రాష్ట్ర నిధులు రైల్వేలైన్ కోసం అవసరమయ్యే 392 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైతులకు రూ.16.80 కోట్ల పరిహారం అందజేసింది. రేక్‌పాయింట్‌తో రైతులకు మేలు.. రెండు నెలల క్రితమే మెదక్‌కు రేక్‌పాయింట్ మంజూరు కాగా, మంత్రి హరీశ్‌రావు దానిని ప్రారంభించారు. రైతులు తాము పండించిన ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా తరలించుకోవడానికి ఈ పాయింట్ ఉపయుక్తంగా ఉంటుంది. అదే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎరువులు, ఇతర ఉత్పత్తులు కూడా దిగుమతి చేసుకోవచ్చు. మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు సౌలభ్యం మెదక్ నుంచి రైళ్ల రాకపోకలతో మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. మెదక్, హవేళిఘనాపూర్, చిన్నశంకరంపేట, కొల్చారం మండలాలు, కామారెడ్డి జిల్లా లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వారు ఈ సేవలు పొందొచ్చు. కలనెరవేరింది... మెదక్ నుంచి ఇందిరాగాంధీ ఎంపీగా గెలుపొంది దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచే ఇక్కడి ప్రజలు రైలు కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని రాష్ట్ర వాటాగా 50 శాతం నిధులు విడుదల చేయడంతోపాటు భూసేకరణ కూడా వేగవంతం చేసి పరిహారం చెల్లించారు. దీంతో పనులు త్వరగా పూర్తయ్యాయి. ఎట్టకేలకు రైలు రాకతో ఈ ప్రాంత ప్రజల కల నెరవేరింది. :: పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మూడు రైల్వేస్టేషన్లు.. మెదక్– అక్కన్నపేట మధ్యలో కొత్తగా నిర్మించిన రైల్వేలైన్ దూరం 17.2 కిలోమీటర్లు. ఈ మధ్యలో మెదక్, శమ్నాపూర్, లక్ష్మాపూర్‌లలో కొత్తగా రైల్వేస్టేషన్లు నిర్మించారు. ప్రస్తుతానికి మెదక్ టు కాచిగూడ, మెదక్ టు మహబూబ్‌నగర్‌కు ఉదయం, సాయంత్రం వేళ రెండు రైళ్లు నడుపుతారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని రైళ్లు నడిపేందుకు ప్రయత్నిస్తామని దక్షిణమధ్య రైల్వే అధికారులు చెప్పారు. -
ప్యాసింజర్ రైళ్ల రద్దు.. ఆలస్యం! కారణం ఏంటంటే..
దేశవ్యాప్తంగా పలు ప్యాసింజర్ రైళ్లను అర్ధాంతరంగా ఇండియన్ రైల్వేస్ రద్దు చేస్తోంది. అంతేకాదు చాలావరకు ప్యాసింజర్ రైళ్లు విపరీతమైన ఆలస్యంతో నడుస్తున్నాయి. ఈ పరిణామాలేవీ ఊహించని ప్రయాణికులు.. ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ఎందుకంటారా?.. తీవ్రమైన బొగ్గు కొరత. అవును.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కొనసాగుతోంది. వేసవి కావడం.. విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో బొగ్గుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో.. విద్యుత్ సంక్షోభం తలెత్తే ఘటింకలు మోగుతుండడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. బొగ్గు సరఫరా కోసం మార్గం సుగమం చేసేందుకే ప్యాసింజర్ రైళ్లను రద్దుచేయడం, ఆలస్యంగా నడపడం చేస్తోంది రైల్వే శాఖ. అంతేకాదు గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతంగా బొగ్గు లోడ్‌ను గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌లో 70 శాతం కరెంట్ బొగ్గు నుంచే ఉత్పత్తి అయ్యేది. అలాంటిది దేశంలో ప్రస్తుతం అనేక ప్రాంతాలు చాలా గంటలు కరెంట్ కోతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని పరిశ్రమలు అయితే ఈ శిలాజ ఇంధనం కొరత కారణంగా ఉత్పత్తిని తగ్గించేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ఆజ్యం పోసిన అధిక ఇంధన ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కష్టపడుతున్న సమయంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. మొత్తంగా 670 ప్యాసింజర్ ట్రిపులను మే 24వ తేదీవరకు రద్దు చేసినట్లు.. మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు నొటిఫై చేసింది రైల్వేస్. అయితే ఏయే రూట్లలో ప్రయాణాలు రద్దు అనేది ప్రయాణికులే గమనించాలని కోరింది. అలాగే ప్యాసింజర్ రైళ్ల అంతరాయం తాత్కాలికం మాత్రమేనని, అతిత్వరలోనే పరిస్థితి చక్కబడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్‌కృష్ణ బన్సాల్. ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరుతున్నారు. బొగ్గు సరఫరాలో అంతరాయాలకు భారతీయ రైల్వే తరచు విమర్శలు ఎదుర్కొనడం సహజంగా మారింది. సరిపడా క్యారేజీలు లేకపోవడం వల్ల ఎక్కువ దూరాలకు ఇంధనాన్ని తీసుకెళ్లడం కష్టంగా ఉంటోంది. అలాగే రద్దీగా ఉండే మార్గాల్లో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు తమ తమ ప్రయాణాల కోసం తంటాలు పడుతుంటాయి. కొన్నిసార్లు సరుకులు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ, గనులకు దూరంగా ఉన్న వినియోగదారుల కోసం క్యారియర్ బొగ్గు రవాణా కొనసాగుతోంది. ఢిల్లీలో పరిస్థితి ఘోరం ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే బొగ్గు కొరత తీవ్రంగా మారుతోంది. దీంతో డిల్లీ సర్కార్.. కేంద్రం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఢిల్లీకి అవసరమయ్యే 30 శాతం పవర్‌ను దాద్రి-2, ఊంచహార్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం వాటిలో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే.. అవి పని చేయడం ఆగిపోతాయని ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మెట్రో రైళ్లతో పాటు ఆస్పత్రుల్లోనూ కరెంట్ సరఫరా నిలిచిపోతుందటూ ఢిల్లీ సర్కార్ ఒక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. -
ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: పలు మార్గాల్లో ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–రేపల్లె–సికింద్రాబాద్ రైలు (17645/17646)ఈ నెల 27 నుంచి రాకపోకలు సాగించనుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 7.45కు రేపల్లెకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 7.50 గంటలకు రేపల్లె నుంచి బయలుదేరి సాయంత్రం 4.55 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాచిగూడ–నిజామాబాద్ రైలు (07594/07595)ఈ నెల 29 నుంచి రాకపోకలు సాగించనుంది. సాయంత్రం 6.50 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 11.50కి నిజామాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి ఉదయం 9.40గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. రాయచూర్–గద్వాల్ (07496/07495) ఈ నెల 27నుంచి అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం 1.10 కి బయలుదేరి 2.30 కు గద్వాల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.20 కి రాయచూర్ చేరుకుంటుంది. -
విశాఖ – కోరాపుట్ ప్యాసింజర్ పునఃప్రారంభం
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖపట్నం – కోరాపుట్ – విశాఖపట్నం ప్యాసింజర్ రైలును రైల్వే మంత్రి అశ్వినివైష్టవ్ శుక్రవారం కోరాపుట్ స్టేషన్లో జెండా ఊపి పునః ప్రారంభించారు. అనంతరం ఇదే రైలులో ఈ మార్గంలో స్పెషల్ బోగీలో విండో ఇన్స్పెక్షన్ చేశారు. గతంలో విశాఖపట్నం – కోరాపుట్ – విశాఖపట్నం మధ్య నడిచే డైలీ ప్యాసింజర్ రైలును కరోనా కారణంగా నిలిపేశారు. ఈ క్రమంలో ప్రజల విజ్ఞప్తి మేరకు పునః ప్రారంభించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించిందని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. శనివారం నుంచి విశాఖపట్నం–కోరాపుట్(08538), ఆదివారం నుంచి కోరాపుట్–విశాఖపట్నం (08537) రైళ్లు పాత టైమింగ్స్ ప్రకారమే నడువనున్నాయి. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం–నిజాముద్దీన్–విశాఖపట్నం సమతా ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం –నిజాముద్దీన్–విశాఖపట్నం స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌లు త్వరలో పూర్తిస్థాయిలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తాయని తెలిపారు. సమ్మలేశ్వరి ఎక్స్‌ప్రెస్, హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్, జగదల్పూర్–రూర్కెలా–జగదల్పూర్ ఎక్స్‌ప్రెస్‌లకు లఖింపూర్ రోడ్‌ను అదనపు హాల్ట్‌గా అంగీకరించామన్నారు. ఇదే విధంగా విశాఖపట్నం – కిరండూల్ –విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌కు బచేలిలో అదనపు హాల్ట్ కేటాయించనున్నట్లు తెలిపారు. (క్లిక్: సికింద్రాబాద్– కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు) -
చిన్న స్టేషన్లలో ఆగనున్న ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు
కాకినాడ: ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు చిన్న స్టేషన్లలో కూడా నిలుపుదల చేయాలంటూ కాకినాడ ఎంపీ వంగా గీత చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. కరోనా సమయంలో ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసి వాటిని ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్పుచేయడంతో చిన్న స్టేషన్లలో రైళ్ల నిలుపుదల నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఎంపీ వంగా గీత రైల్వే మంత్రి, రైల్వేబోర్డు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కరోనా తీవ్రత తగ్గినప్పటికీ ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరించకపోవడం వల్ల రైతులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, చిరువ్యాపారులు, సాధారణ పేద, మధ్య తరగతి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఆమె కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆమె చేసిన కృషి నేపథ్యంలో ఇప్పటికే తిమ్మాపురం, హంసవరం, రావికంపాడు, రైల్వే స్టేషన్లలో ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను నిలుపుదల చేసేందుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. కాకినాడ–విశాఖ, విశాఖ–కాకినాడ మధ్య శుక్రవారం నుంచి ఈ మూడు స్టేషన్లలో రైలు ఆగనుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం తన విజ్ఞప్తితో రాష్ట్రంలోని ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరణతోపాటు చిన్న స్టేషన్లలో రైళ్ల నిలుపుదల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్న రైల్వే అధికారులకు ఎంపీ వంగా గీత కృతజ్ఞతలు తెలిపారు. ఇది చదవండి: అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్న ఆలోచనే బాబుకు లేదు: సీఎం జగన్ -
మంటల్లో ఇంజన్.. రైలును ముందుకు తోసిన ప్యాసింజర్లు
ఐకమత్యమే మహాబలం అనేవాళ్లు పెద్దలు. అలాగే భిన్నత్వంలో ఏకత్వం.. బహుశా మన గడ్డకే సొంతమైన స్లోగన్ కాబోలు. కొన్ని పరిస్థితులు, ఘటనలు మినహాయిస్తే.. కలిసికట్టుగా ముందుకు సాగడంలో మనకు మనమే సాటి. ఇందుకు సంబంధించిన వీడియో ఇది. యూపీలో జరిగిన ఓ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. షార్నాపూర్-ఢిల్లీ మధ్య రైలు, మీరట్ దౌరాలా రైల్వే స్టేషన్ దగ్గర రైలు శనివారం అగ్నిప్రమాదానికి గురైంది. ఇంజన్‌కు మంటలు అంటుకోగా.. దాని నుంచి వెనకాల రెండు బోగీలకు మంటలు విస్తరించాయి. వెంటనే అధికారులు స్పందించి.. ఆ ఇంజన్, బోగీలను మిగతా బోగీలతో విడదీశారు. ఆ వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు.. మిగతా కంపార్ట్మెంట్లను ముందుకు తోసి మంటలు అంటుకోకుండా చూడగలిగారు. #WATCH | Uttar Pradesh: Fire broke out in engine & two compartments of a Saharanpur-Delhi train, at Daurala railway station near Meerut. Passengers push the train in a bid to separate the rest of the compartments from the engine and two compartments on which the fire broke out. pic.twitter.com/Vp2sCcLFsd — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2022 ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రయాణికులు రైలును ముందుకు తోస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. కశ్మీర్లో రోడ్డు ప్రమాదం జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుంది. సాంబా నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఒక కారు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చికిత్స పొందుతున్న డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఆ వాహనం అనంత్‌నాగ్ వ్యాలీకి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. -
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 706 రోజుల తర్వాత..
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. 2020 మార్చి 24 కోవిడ్ తొలి లాక్డౌన్ వేళ నిలిచిన విషయం తెలిసిందే. రైల్వేచరిత్రలో ఇంత సుదీర్ఘకాలం రైళ్లు స్తంభించిన సందర్భం లేదు. కోవిడ్ వల్ల తొలిసారి ఆ పరిస్థితి ఎదురైంది. కోవిడ్ ఆంక్షలను తొలగించేకొద్దీ విడతలవారీగా రైళ్లను తిరిగి పునరుద్ధరించినా, ప్యాసింజర్ రైళ్లకు పచ్చజెండా ఊపలేదు. 706 రోజుల తర్వాత అన్రిజర్వ్డ్ ప్రయాణాలకు అనుమతినిస్తూ, కోవిడ్ ముందు ఉన్న తరహాలో ప్యాసింజర్ రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు రైల్వేబోర్డు అనుమతించింది. కోవిడ్ ప్రబలుతుందని... కోవిడ్ మొదటిదశ తీవ్రత తగ్గిన తర్వాత మూడు నెలలకాలంలో 80% ఎక్స్‌ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించారు. పండగల కోసం కొన్ని స్పెషల్ రైళ్లు నడిపించారు. రెండోదశ లాక్‌డౌన్‌తో మళ్లీ రైళ్లకు బ్రేక్‌పడింది. మళ్లీ తొందరగానే ఎక్స్‌ప్రెస్, స్పెషల్ రైళ్లను తిరిగి ప్రారంభించారు. కానీ, ఎంత రద్దీ పెరిగినా ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించలేదు. చివరకు స్టేషన్లకు వచ్చే రద్దీని నిలువరించలేక తప్పని పరిస్థితిలో కొన్ని ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించినా, వాటిని ఎక్స్‌ప్రెస్ రైళ్లుగానే నడిపారు. అన్రిజర్వ్డ్ టికెట్లు జారీ చేస్తే బోగీల్లో రద్దీ పెరిగి కోవిడ్ ప్రబలుతుందని అధికారులు పేర్కొంటూ వచ్చారు. చదవండి: (ఆ మానవ మృగాన్ని అరెస్ట్ చేయకపోవడం దారుణం: బండి సంజయ్) ఇదీ అసలు కారణం... దక్షిణమధ్య రైల్వేలో 230 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. రోజుకు సగటును పదిన్నర లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తే, అందులో 8 లక్షలమంది ప్యాసింజర్ రైళ్లలోనే తిరుగుతారు. కానీ, ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధర నామమాత్రంగా ఉండటంతో వాటి ద్వారా భారీ నష్టాలు వచ్చిపడుతున్నాయి. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణవ్యయంలో 20 శాతం మాత్రమే టికెట్ ద్వారా తిరిగి వసూలవుతుంది. అంటే, 80 శాతం నష్టాలేనన్నమాట. ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా కలుపుకుంటే, మొత్తం నిర్వహణ వ్యయంలో 65 శాతం తిరిగి వసూలవుతాయి. దీంతో వాటిని నడిపే విషయంలో అధికారులు ఆసక్తి చూపలేదన్న అభిప్రాయముంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మొత్తం 230 ప్యాసింజర్ రైళ్లకుగాను 160 రైళ్లు ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో అన్రిజర్వ్డ్ టికెట్లు లేకుండా నడుస్తున్నాయి. ఇవి ఇక కోవిడ్ ముందు ఉన్న ప్యాసింజర్ రైళ్ల తరహాలో నడుస్తాయి. ఇప్పటికీ ప్రారంభం కాకుండా ఉన్న మిగతా ప్యాసింజర్ రైళ్లను దశలవారీగా ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. -
కరోనా: ఈ నెల 24 వరకు కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి విస్తరణ ఉధృతంగా కొనసాగుతోంది. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య మూడు లక్షలను దాటేసిన కొత్త కేసుల సంఖ్య 3,47,254గా ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జనవరి ఈ నెల 21 నుండి 24 వరకు కొన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసింది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. క్రితం రోజు మూడు లక్షలు దాటేయగా 24 గంటల వ్యవధిలో మరింత పెరిగాయి. దేశంలో పాజిటివిటీ రేటు 17.94 శాతానికి ఎగబాకింది. కేసుల పరంగా తెలంగాణాలో రోజుకు నాలుగువేలకు పైగా, ఏపీలో 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 1.40 లక్షల కేసులతో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకూ ఒమిక్రాన్ బారినపడిన వారి సంఖ్య 9,692కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. (2/3) Cancellation of Passenger Trains from 21st to 24th January, 2022 @drmsecunderabad @drmhyb @drmgtl @VijayawadaSCR @drmgnt #IndiaFightsCorona pic.twitter.com/kPpHJOHHen — South Central Railway (@SCRailwayIndia) January 21, 2022 (1/3) Cancellation of Passenger Trains from 21st to 24th January, 2022 @drmsecunderabad @drmhyb #Unite2FightCorona #IndiaFightsCorona pic.twitter.com/oy6WOCKYbH — South Central Railway (@SCRailwayIndia) January 21, 2022