
వైరల్: మన దేశంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ.. భారతీయ రైల్వేస్. అలాగే.. అత్యంత రద్దీ వ్యవస్థ కూడా ఇదే!. పండుగలు, ఇతర సెలవుల సమయంలో రైళ్లలో రద్దీ ఏపాటి ఉంటుందో తెలియంది కాదు. అయితే.. సాధారణ రోజుల్లోనూ కొన్ని మార్గాల్లో రద్దీ అధికంగా ఉంటోంది. ఆ రద్దీని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించలేకపోతోందనే విమర్శ ఇండియన్ రైల్వేస్‌పై ఉంది. ఇదిలా ఉంటే..
తాజాగా రాజేష్ దుబే అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అమృత్‌సర్ కథిహార్ ఎక్స్‌ప్రెస్‌లో 72 బెర్త్ స్లీపర్‌లు ఉన్న కోచ్‌లో ఏకంగా 350 మంది ప్రయాణించారు. ఎటు చూసినా ప్యాసింజర్లు, లగేజీలతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. అంత నరకంలోనూ గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లు, మరో మార్గం లేక ఇలా చేసినట్లు కొందరు ప్రయాణికులు వెల్లడించారు. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులు అలా ప్రయాణించడం నేరమే!. కానీ,
ఆ టైంకి అక్కడ టీటీఈ కూడా లేకపోవడంతో.. విషయం రైల్వేస్ దృష్టికి వెళ్లింది. రైల్వే సేవా అధికారిక ట్విటర్ అకౌంట్ ఈ ప్రయాణ వివరాలను అందించమని కోరగా.. చివరకు ఫిర్యాదు నమోదు అయ్యింది.
Video Credits: The Logical Indian
Comments
Please login to add a commentAdd a comment