న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఈనెల 12వ తేదీ నుంచి ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ స్పష్టం చేసింది. న్యూ ఢిల్లీ నుంచి దేశంలోని 15 ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లను (మొత్తం 30 సర్వీసులు) నడపనున్నారు. చదవండి: ఆ మార్కెట్‌కు వెళ్లే వర్తకులు అప్రమత్తంగా ఉండాలి
న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే ప్రకటించింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీలో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కాగా.. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ నిర్వహించి కరోనా లక్షణాలు లేవని తేలితేనే రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తామని రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. రాబోయే రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా దేశంలోని మరిన్ని ప్రాంతాలకు రైళ్ల సర్వీసులను పునరుద్ధరిస్తామని కేంద్రం ప్రకటించింది.
చదవండి: ‘కరోనా’ ప్రూఫ్ కారును చూశారా?
Comments
Please login to add a commentAdd a comment