Indian Railways
-
రైలు బండి మరింత వేగం..
ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్ లలో ఒకటైన భారతీయ రైల్వే కొంతకాలంగా వేగంగా ఆధునికతను సంతరించుకుంటోంది. కుంటుతూ గెంటుతూ నడిచే రైళ్ల స్థానంలో అమితవేగంతో దూసుకుపోయే అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. బుల్లెట్ రైళ్లను కూడా వీలైనంత త్వరగా దేశంలో పరుగులు పెట్టించాల ని కేంద్రం భావిస్తోంది.ఈ నేపథ్యంలో 2025 - 26 బడ్జెట్లో రైల్వేలకు కేంద్రం ఏం ఇస్తుంది? ఎలాంటి మార్పులు ప్రతిపాదిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 1న కేంద్రప్రభు త్వం 2025 -26 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైల్వేల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఏం ఆశిస్తున్నారనేది చూద్దాం..గత ఐదేళ్లలో రైల్వేలో కొత్తగా వచ్చిన మార్పులు2019: సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు ప్రవేశం. 2020: రైల్వేల్లో ప్రమాదాలను అరికట్టేందుకు ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీ) ‘కవచ్’ ప్రారంభం. 2022: రాష్ట్రీయ రైల్ సంరక్ష కోశ్ ఫండ్ (ఆర్ఆర్ఎస్కే) ఏర్పాటు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పెంచాలని లక్ష్యం. 2023: ముంబైృ అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టు వేగవంతానికి చర్యలు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ప్రారంభం. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 1,275 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయం. 2024: కవచ్ 4.0 ప్రారంభం. స్టేషన్ల వద్ద ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు. డెడికేటెడ్ సరుకు రవాణా మార్గాల నిర్మాణం పూర్తి.అమృత్ భారత్ 1.0 ప్రారంభం. 2025: అమృత్ భారత్ 2.0 రైళ్లు. జమ్మూకశ్మీర్‌లో కీలకమైన రైల్వేలైన్ల నిర్మాణం పూర్తి.మరింత వేగంగా ఆధునికత ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో భారతీయ రైల్వే ఇంకా వెనుకబడే ఉంది. జపాన్, చైనా, యూరప్‌లో బుల్లెట్ ట్రైన్లు ఎప్పటి నుంచో దూసుకుపోతుండగా, మన దేశంలో వాటికి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. అయితే, గత ఐదారేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రైల్వేల ఆధునీకరణను వేగవంతం చేసింది. సాధారణ రైళ్ల స్థానంలో వందేభారత్ వంటి అత్యాధునిక సౌకర్యాలున్న రైళ్లను ప్రవేశపెట్టింది. 2024 డిసెంబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా 136 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. సాధారణ రైళ్లకంటే వీటి వేగం భారీగా ఉండటంతో టికెట్ ధరలు కాస్త ఎక్కువైనా వీటిల్లో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మరిన్ని వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా వచ్చే బడ్జెట్లో వందే భారత్ రైళ్లకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ముంబైృ అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైల్ మార్గాన్ని మరింత వేగంగా పూర్తిచేసేందుకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వొచ్చని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో ప్రయాణికుల రైళ్ల నిర్వహణకు వీలు కల్పించాలని పారిశ్రామికవర్గాలు కోరుతున్నాయి.రూ.3 లక్షల కోట్లకు రైల్వే బడ్జెట్? రైల్వే శాఖకు 2024ృ25లో కేంద్రత్వం రూ.2,62,200 కోట్లు కేటాయించింది. 2025ృ26 బడ్జెట్లో 15 నుంచి 18 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అంటే మొత్తం బడ్జెట్ దాదాపు రూ.2.9 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. వందేభారత్, బుల్లెట్ రైళ్లకు కేంద్రం ఇచ్చే ప్రాధాన్యాన్ని బట్టి రైల్వే బడ్జెట్లో పెంపుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2024 ఏడాదిలోనే కేంద్రం ఏకంగా 62 వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని భారీగా పెంచే అవకాశం ఉందని అంటున్నారు. - సాక్షి, సెంట్రల్ డెస్క్ -
రైలులో లోయర్ బెర్త్.. రైల్వే కొత్త రూల్
దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ప్రయాణీకుని అవసరాలకు తగినట్లుగా భారతీయ రైల్వే సౌకర్యాలు కల్పిస్తోంది. రైళ్లలో లోయర్, మిడిల్, అప్పర్.. ఇలా రకారకాల బెర్తులు ఉంటాయి. అయితే మిడిల్, అప్పర్ బెర్తులకు పెద్ద వయసువారు ఎక్కలేరు.ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా లోయర్ బెర్త్‌ల కేటాయింపులో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యం ఇస్తోంది. అయితే కుటుంబంలోని సీనియర్ సిటిజన్ల కోసం టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు వారికి కచ్చితంగా లోయర్ బెర్త్ రావాలంటే రైల్యేవారి కొత్త రూల్స్ పాటించాలి.సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే పలు నిబంధనలను రూపొందించింది. ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌లను రిజర్వ్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్‌లు సులభంగా కేటాయిస్తున్నట్లు ఐఆర్సీటీసీ (IRCTC) పేర్కొంది. కాళ్ల సమస్యలు ఉన్న తన అంకుల్ కోసం రైలు టికెట్ బుక్ చేసి, లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ రైల్వే మాత్రం ఆయనకు పై బెర్త్ ఇచ్చిందని ఓ ప్రయాణికుడు ట్వీట్ చేశాడు.సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ఎలా బుక్ చేసుకోవాలి? అంటూ కోరాడు. ప్రయాణికుడి ట్వీట్‌పై రైల్వే స్పందిస్తూ, సాధారణ కోటా కింద టికెట్ బుక్ చేసుకుంటే, సీట్లు అందుబాటులో ఉంటేనే లోయర్ సీట్ల కేటాయింపు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. రిజర్వేషన్ సెలక్షన్ బుక్ కింద బుక్ చేస్తేనే లోయర్ బెర్త్ లభిస్తుందని స్పష్టం చేసింది.ముందుగా వచ్చిన వారికే ప్రాధాన్యంజనరల్ కోటా కింద బుకింగ్ చేసుకునే వారికి సీట్లు అందుబాటులో ఉన్నప్పుడే లోయర్ బెర్తులు కేటాయిస్తామని రైల్వే తెలిపింది. ఈ సీట్ల కేటాయింపు ముందుగా వచ్చిన వారికి ముందుగా అందించబడే పద్ధతిలో ఉంటుంది. జనరల్ కోటా బెర్త్ కేటాయింపులో మానవ ప్రమేయం ఉండదు. అయితే మీరు లోయర్ బెర్త్ కోసం టీటీఈ (TTE)ని సంప్రదించవచ్చు. -
మహా కుంభ్‌కు ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ: పన్నెండేళ్లకోసారి జరిగే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభ మేళాను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి వరకు 42 రోజుల పాటు గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరగనుంది. ఈ సందర్భంగా యాత్రికులు త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇందులో జనవరి 13న పుష్య పౌర్ణమిన, 14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు చేసే స్నానాలకు ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ రాజ స్నానం రోజుల్లో భక్తుల సంఖ్య కోట్లలో ఉండనుందన్నది అధికారుల అంచనా. కేవలం జనవరి 29న మౌని అమావాస్య రోజున షాహి స్నాన్‌లో గరిష్టంగా 4 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గతంలో 2013లో జరిగిన మహా కుంభమేళాతో పోలిస్తే ఇప్పుడు జరుగనున్న మహాకుంభమేళా మూడు రెట్లు పెద్దదని భావిస్తున్నారు. ఈ పవిత్ర స్నానాల కోసం గతంలో 12 కోట్ల మంది భక్తులు రాగా ఈసారి సుమారు 40 కోట్లకు పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్లుగా 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మేళా ఏర్పాట్లు విస్తృతంగా సాగుతున్నాయి. నాలుగు రెట్ట బడ్జెట్ మహాకుంభమేళా నిర్వహణకు ప్రభుత్వం రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. గతం కంటే బడ్జెట్ నాలుగు రెట్లు పెంచారు. ఈసారి మహాకుంభ బడ్జెట్ రూ.5,060 కోట్లు కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.2,100 కోట్లు ఇచి్చంది. 2013 కుంభ్ సమయంలో రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధికారంలో ఉండగా.. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2013లో మహాకుంభ్‌మేళా కోసం రూ.1,214 కోట్ల బడ్జెట్ కేటాయించగా రూ.1,017 కోట్లు ఖర్చు చేశారు. 2025లో మహాకుంభ బడ్జెట్ 2013 కంటే రూ.4,043 కోట్లు ఎక్కువ కావడం విశేషం. 38 వేల మంది జవాన్లతో భద్రత మహాకుంభమేళా జరుగుతున్న కుంభ్ నగర్ భద్రతను దుర్భేద్యమైన కోటలా పటిష్టం చేశారు. కుంభ్ నగర్ మాస్టర్ ప్లాన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భద్రత కోసం 38 వేల మంది సైనికులను మోహరిస్తున్నారు. మొత్తం 56 పోలీస్ స్టేషన్లు, 144 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రెండు సైబర్ స్టేషన్లను విడివిడిగా ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ డెస్క్ ఉంటుంది. కాగా, 2013 మహా కుంభ్‌లో దాదాపు 12 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో 12 మంది ఏఎస్పీ, 30 మంది సీఓలు, 409 మంది ఇన్స్పెక్టర్లు, 4,913 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీఐపీల కోసం మహారాజా టెంట్లు వీఐపీల కోసం 150 మహారాజా టెంట్లతో కూడిన ప్రత్యేక నగరాన్ని సిద్ధం చేస్తున్నారు. దీనిలో ఒక్కరోజు ఛార్జీ రూ.30 వేలకు పైగా ఉంటుంది. వీటితో పాటు 1,500 సింగిల్ రూమ్‌లు, 400 ఫ్యామిలీ టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు డోమ్ సిటీని సిద్ధం చేశారు. వీటి అద్దె లక్షకు పైగా ఉంటుంది. మహాకుంభ్‌లో లక్షన్నర మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. వీటిలో 300 మొబైల్ టాయిలెట్లు ఉన్నాయి. 2013లో మొత్తం 33,903 మరుగుదొడ్లు నిర్మించారు. ఘాట్ వద్ద దాదాపు 10 వేల దుస్తులు మార్చుకునే గదులను నిర్మించనున్నారు. 2013 కుంభ్‌లో దుస్తులు మార్చుకునే గదుల సంఖ్య దాదాపు రెండున్నర వేలుగా ఉన్నాయి. 23 నగరాల నుంచి విమానాలు మహాకుంభమేళా కోసం రైల్వే శాఖ 3 వేల ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఇది 13 వేలకు పైగా ట్రిప్పులను నడుపనుంది. ప్రతిరోజూ 5 లక్షల మంది ప్రయాణికులు జనరల్ కోచ్‌లలో ప్రయాణిస్తారని రైల్వేశాఖ అంచనా వేసింది. ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌తో పాటు నగరంలోని 8 రైల్వే స్టేషన్లను సిద్ధం చేశారు. అంతేగాక ఉత్తరప్రదేశ్ రోడ్‌వేస్ వేలకు పైగా బస్సులను ప్రత్యేకంగా నడుపనుంది. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుంచి దేశంలోని దాదాపు 23 నగరాలకు నేరుగా విమానాలు అందుబాటులో ఉంచనున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, భువనేశ్వర్, లక్నో, రాయ్‌పూర్, బెంగళూరు, అహ్మదాబాద్, గౌహతి, కోల్‌కతాలకు నేరుగా విమానాలు నడుస్తాయి. వీటితో పాటు మహాకుంభ్‌కు వీవీఐపీలు, విదేశీ అతిథులకు చెందిన 200కు పైగా చార్టర్డ్ విమానాలు ప్రయాగ్‌రాజ్ రానున్నాయి. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంలో కేవలం 15 విమానాలకు మాత్రమే పార్కింగ్ స్థలం ఉంది. అందువల్ల, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నాలుగు రాష్ట్రా ల్లోని 11 విమానాశ్రయాల నుంచి పార్కింగ్‌కు సంబంధించిన నివేదికలను అందించాల ని కోరింది. నీటి అడుగునా నిఘాం మహాకుంభ్ అత్యంత ఆకర్షణీయంగా కనిపించేందుకు ఈసారి విద్యుత్‌కు రూ.391.04 కోట్ల బడ్జెట్ కేటాయించారు. మొత్తం 67 వేల వీధి దీపాలను ఏర్పాటు చేశారు. 85 కొత్త తాత్కాలిక పవర్ ప్లాంట్లు, 170 సబ్ స్టేషన్లు నిర్మించారు. మహాకుంభ్‌లో ఆకాశంతో పాటు డ్రోన్ల ద్వారా నీటి అడుగున కూడా నిఘా ఉండనుంది. నీటి అడుగున భద్రత కోసం తొలిసారిగా నదిలోపల 8 కిలోమీటర్ల మేర డీప్ బారికేడింగ్‌ను ఏర్పాటు చేశారు. మహాకుంభ్‌లో అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 25 మెగా ఈవెంట్లు జరగనున్నాయి. దీనిని విదేశీ కంపెనీలు రూపొందించాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒక కార్యక్రమానికి, ప్రధాని నరేంద్ర మోదీ రెండు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. పదికి పైగా దేశాల అధినేతలు రానున్నారు. -
కొత్త ఏడాదిలో రైల్వేశాఖ కీలక నిర్ణయాలు
భారతీయ రైల్వే 2024 ప్రారంభంలో మొదలు పెట్టిన ‘ట్రైన్ ఎట్ ఎ గ్లాన్స్(TAG)’ 44వ ఎడిషన్ రేపటి వరకు అందుబాటులో ఉంటుంది. తదుపరి ఎడిషన్‌ను 2025 జనవరి 1 నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. రైల్వేశాఖ కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు, పాత ఎడిషన్‌లోని కొన్ని అంశాలను సవరించనున్న నేపథ్యంలో దాదాపు మూడు కోట్ల మంది ప్రయాణికులు ప్రభావితం చెందుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.నమో భారత్ ర్యాపిడ్ రైల్ (Vande Metro), రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను 2025లో ప్రవేశపెట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు 2024లో 70 కొత్త సర్వీసులు, 64 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు.ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో సమీక్షించాల్సినవి..మహాకుంభమేళా 2025 ఏర్పాట్లుజనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించబోయే మహాకుంభమేళా(mahakumbh mela)కు భారతీయ రైల్వే ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా రైల్వే ప్రయాణాల్లో అత్యున్నత సౌకర్యాలను సిద్ధం చేస్తోంది. లక్ష మందికి పైగా ఉండటానికి, 3,000కు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని భావిస్తోంది.మహాకుంభ్ గ్రామ్మహాకుంభమేళా జరగబోయే ప్రదేశంలో త్రివేణి సంగమం పక్కనే మహాకుంభ్ గ్రామ్ అనే లగ్జరీ టెంట్ సిటీని ఐఆర్సీటీసీ(IRCTC) ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి 2025 జనవరి 10 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ ఏర్పాట్లు రానున్న రోజుల్లో రైల్వేశాఖకు భారీగా లాభాలు తీసుకొస్తాయని నమ్ముతుంది. -
రైల్వే కొత్త రూల్.. ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే..
దేశంలో అత్యధిక మంది ప్రయాణించే రవాణా సాధనం రైల్వేలు. రోజూ వేలాది రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. కాగా కన్ఫర్మ్డ్ టిక్కెట్లతో ప్రయాణించే వారికి, ముఖ్యంగా ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఇండియన్ భారతీయ రైల్వే కొత్త ఆదేశాన్ని జారీ చేసింది.ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిమీరు ఆన్లైన్లో టిక్కెట్లను (ఈ-టికెట్లు) బుక్ చేసుకుంటే ప్రయాణ సమయంలో ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే టిక్కెట్ తనిఖీ చేసే టీటీఈ మిమ్మల్ని టిక్కెట్టు లేని ప్రయాణికుడిగా పరిగణించి జరిమానా విధించవచ్చు. మీ టిక్కెట్‌ను రద్దు చేసి, రైలు నుండి మిమ్మల్ని దించేయవచ్చు.అంగీకరించే ఐడీ ప్రూఫ్‌లు ఇవే.. » ఆధార్ కార్డ్» పాస్‌పోర్ట్» ఓటరు గుర్తింపు కార్డు» డ్రైవింగ్ లైసెన్స్» పాన్ కార్డ్» ఫోటోతో ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఐడీ» ఈ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌లలో ఏదో ఒకదానిని ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. రైల్వేలు ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప ఫోటోకాపీలు లేదా డిజిటల్ ఐడీలను అంగీకరించరు.ఒరిజినల్ ఐడీ లేకపోతే ఏమౌంది?మీ వద్ద ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ లేకపోతే మీ ఈ-టికెట్ చెల్లనిదిగా పరిగణించి టీటీఈ జరిమానా విధిస్తారు. మీకు కన్ఫర్మ్ అయిన సీటును రద్దు చేయవచ్చు. విధించే జరిమానాలు ఏసీ తరగతులకైతే టిక్కెట్ ధరతో పాటు రూ.440, అదే స్లీపర్ క్లాస్ అయితే టిక్కెట్ ధరతో పాటు రూ.220 ఉంటుంది. జరిమానా కట్టినా కూడా మళ్లీ మీకు కేటాయింపు ఉండదు. -
కూతపెట్టనున్న..హైడ్రోజన్ రైలు
సాక్షి, హైదరాబాద్: అధునాతన సౌకర్యాలతో సరికొత్త రైళ్లను అందుబాటులోకి తెస్తున్న భారత రైల్వే.. త్వరలోనే హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను పట్టాలెక్కించబోతోంది. వచ్చే నెలలోనే తొలి రైలును ప్రయోగాత్మకంగా నడిపించనుంది.జర్మనీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో.. మన రైల్వే సొంతంగానే ఈ రైళ్లను తయారు చేస్తోంది. ఇప్పటికే అధిక వ్యయం, కాలుష్య కారకమైన డీజిల్ రైళ్లను తొలగించి ఎలక్ట్రిక్ రైళ్ల సంఖ్యను పెంచుతుండగా.. ఇకపై ఏ మాత్రం కాలుష్యం ఉండని హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై పరుగెత్తనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంలో జర్మనీ ముందుంది. ఆ దేశం గణనీయ సంఖ్యలో హైడ్రోజన్ రైళ్లను నడుపుతోంది. దానితోపాటు చైనా, రష్యా సహా ఐదు దేశాలు హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్నాయి. వాటి సరసన ప్రపంచంలో ఐదో దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది.‘హైడ్రోజన్’ రైలు ప్రాజెక్టు విశేషాలివీ..» నీటి నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఆ హైడ్రోజన్‌ను, ఆక్సిజన్‌తో కలిపినప్పుడు రసాయన చర్య జరిగి వెలువడే శక్తి ద్వారా రైలును నడిపిస్తారు. ఇందుకోసం రైలు ఇంజన్లలో హైడ్రోజన్, ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేస్తారు. » ఒకసారి ఇంధనాన్ని నింపితే వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని అంచనా. » హైడ్రోజన్ ఇంజన్లు డీజిల్ ఇంజన్ల కంటే 65 శాతం తక్కువ శబ్ధాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుత పరిజ్ఞానం మేరకు గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని.. 54.6 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. » ఒక కిలో హైడ్రోజన్ ఇంధనం 4.5 లీటర్ల డీజిల్‌తో సమానంగా శక్తిని అందిస్తుంది. ఓ అంచనా మేరకు ఒక్కో హైడ్రోజన్ రైలు ద్వారా ఏడాదికి రూ.16 లక్షల డీజిల్ ఆదా అవుతుంది. » ఒక డీజిల్ ఇంజన్ ద్వారా ఏడాదిలో 4,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. హైడ్రోజన్ ఇంజన్‌తో ఆ కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుంది. హైడ్రోజన్ ఇంజన్లో ఇంధనాన్ని మండించిన తర్వాత వ్యర్థాలుగా నీరు, నీటి ఆవిరి వెలువడతాయి. » రైల్వే తొలుత 35 హైడ్రోజన్ రైళ్లను రూపొందించాలని భావించినప్పటికీ తాజాగా ఆ సంఖ్యను 50కి పెంచింది. » ప్రస్తుత పరిజ్ఞానం ప్రకారం ఒక్కో రైలు తయారీకి రూ.80 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. వీటి తయారీకి రూ.2,800 కోట్లను కేటాయించారు. » రైల్వే రోజుకు 3 వేల కిలోల హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఒక ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. తర్వాత హిల్ స్టేషన్లలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొదట హిల్ స్టేషన్లలో.. హరియాణాలోని జింద్–సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో తొలి హైడ్రోజన్ రైలును పరీక్షించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలాఖరులో ఈ ప్రయోగాత్మక పరిశీలన మొదలుకానుంది. పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని ఈ హైడ్రోజన్ రైళ్లను తొలుత ప్రకృతి అందాలతో అలరారే హిల్ స్టేషన్లలోని రూట్లలో నడపాలని రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటెయిన్ రైల్వేలను ఎంపిక చేసింది. మరిన్ని హిల్ స్టేషన్లలో ప్రస్తుతం డీజిల్ ఇంజన్లతో నడుపుతున్న రైళ్లను తొలగించి హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. తర్వాత దశలవారీగా సాధారణ రూట్లలోనూ నడపనుంది. భవిష్యత్ ఇంధనం హైడ్రోజనే... బొగ్గు, చమురు నిల్వలు తరిగిపోతుండటం, అవి కాలుష్య కారకం కావడంతో... ప్రత్యామ్నాయ ఇంధనాలపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టాయి. ఈ క్రమంలో ఎలాంటి కాలుష్యం వెలువడని, తరిగిపోని హైడ్రోజన్‌ను భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్నాయి. వాటితో వాహనాలను నడిపే సాంకేతికతలను కొన్ని దేశాలు అభివృద్ధి చేశాయి. ఈ క్రమంలోనే మన రైల్వే కూడా వేగంగా ప్రయోగాలు పూర్తి చేసి హైడ్రోజన్ రైళ్లను పట్టాలెక్కించే దిశగా ముందుకు వెళుతోంది. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టును చేపట్టగా.. డిసెంబర్ చివరిలో ప్రయోగాత్మక పరిశీలన మొదలవుతోంది. -
దేశంలో కొత్త రకం రైలు.. నీళ్లుంటే చాలు!
దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు అతి త్వరలోనే పట్టాలెక్కనుంది. వచ్చే డిసెంబర్ నెలలోనే దీన్ని ఆవిష్కరించేందుకు ఇండియన్ రైల్వేస్ సిద్ధమైంది. డీజిల్ లేదా విద్యుత్‌తో పని లేకుండా నడిచే ఈ హైడ్రోజన్-ఆధారిత అద్భుతం 2030 నాటికి "నికర శూన్య కార్బన్ ఉద్గారిణి"గా మారాలన్న లక్ష్యంతో ఉన్న భారతీయ రైల్వేలకు ఒక ప్రధాన మైలురాయి కానుంది.హైడ్రోజన్‌తో నడిచే ఈ రైలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి నీటిని తన ప్రాథమిక వనరుగా ఉపయోగించుకుంటుంది. ఈ రైలులో హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్‌తో రసాయన చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి. ఈ విద్యుత్తుతో రైలు నడుస్తుంది. ఇందులో ఉప ఉత్పత్తులుగా వెలువడేవి నీరు, ఆవిరి మాత్రమే. అవసరమైన రసాయన ప్రక్రియల కోసం రైలుకు గంటకు సుమారు 40,000 లీటర్ల నీరు అవసరమవుతుంది.సాంప్రదాయ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్ల మాదిరిగా కాకుండా ఈ వినూత్న రైలు కదలడానికి అవసరమైన విద్యుత్‌ను హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఇంధన ఘటాలు, ఆక్సిజన్‌తో కలిసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, నీరు మాత్రమే వెలువడుతాయి. అంటే పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు ఉండవు. ఈ క్లీన్ ఎనర్జీ విధానం దేశంలో భవిష్యత్ రైళ్లకు ప్రమాణాన్ని ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.ట్రయల్ రన్హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పురాతన పర్వత ప్రాంతాల రైల్వేలైన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే , నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా-సిమ్లా రైల్వేతో పాటు దేశంలోని సుందరమైన, మారుమూల ప్రాంతాల వంటి అదనపు మార్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.ఈ రైలు గరిష్టంగా గంటకు 140 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదని, ప్రయాణికులకు వేగవంతమైన , సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. రైలులోని హైడ్రోజన్ ఇంధన ట్యాంక్ ఒకసారి ఇంధనం నింపుకొంటే 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీంతో భవిష్యత్తులో సుదీర్ఘ మార్గాలకు కూడా ఈ రైళ్లు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఒక్కో హైడ్రోజన్ రైలు అభివృద్ధికి రూ.80 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 2025 నాటికి 35 హైడ్రోజన్ రైళ్లు వివిధ మార్గాల్లో నడపాలని భావిస్తున్నారు. -
'వందే భారత్' మేడిన్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో త్వరలోనే రైల్ కోచ్.. మేడ్ ఇన్ తెలంగాణ అన్న అక్షరాలు కనిపించబోతున్నాయి. దశాబ్దాలుగా కలగానే మిగిలిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ మరికొన్ని నెలల్లో కార్యరూపం దాల్చబోతోంది. దేశవ్యాప్తంగా దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లకు ఇక్కడి నుంచి హైస్పీడ్ బోగీలు సరఫరా కాబోతున్నాయి. ప్రస్తుతం వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరగటం, కేంద్రం కూడా భవిష్యత్తులో సాధారణ రైళ్ల స్థానంలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తుండటంతో కాజీపేటలో ఎక్కువగా వందేభారత్ రైల్ కోచ్‌లు తయారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు బడ్జెట్ ను కూడా పెంచింది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తున్నది. రొబోటిక్ టెక్నాలజీ వినియోగం..: కాజీపేటలో ఏర్పాటుచేస్తున్న కోచ్ ఫ్యాక్టరీలో అత్యాధునిక రొబోటిక్ యంత్రాలు వాడాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో మంజూరు చేసిన వ్యాగన్ తయారీ కేంద్రాన్ని కోచ్ ఫ్యాక్టరీగా మార్చిన నేపథ్యంలో ఆ మేరకు నిర్మాణాల డిజైన్లను మార్చింది. వందేభారత్ రైళ్ల బోగీల తయారీకి వీలుగా జపాన్‌కు చెందిన టైకిషా ఇంజినీరింగ్ సంస్థ నుంచి ఆధునిక రొబోటిక్ యంత్రాలను దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే ఆ సంస్థకు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ ఫ్యాక్టరీని రూ.521 కోట్లతో ఏర్పాటుచేస్తామని గతంలో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆధునిక యంత్రాలు కొనుగోలు చేస్తుండటంతో బడ్జెట్‌ను మరో రూ.150 కోట్ల మేర పెంచుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా.. ఆలస్యానికి బ్రాండ్‌గా మారిన భారతీయ రైల్వేలను పరుగులు పెట్టించే పని మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా క్రమంగా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడుతున్నది. వందేభారత్ రైళ్లు కూడా అందులో భాగమే. రైల్వేశాఖ సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌ల వినియోగాన్ని కూడా ఆపేసి పూర్తిగా ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లనే వినియోగించటం ప్రారంభించింది. క్రమంగా ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్ రైళ్లను కూడా తప్పించి వందేభారత్ రైళ్లనే తిప్పాలని నిర్ణయించింది. అన్ని కేటగిరీల్లో వాటినే వాడాలన్నది కేంద్రం యోచన. వందేభారత్ రైళ్లకు డిమాండ్ కూడా అమాంతం పెరిగింది. రైల్వేకు చెందిన ప్రధాన కోచ్ ఫ్యాక్టరీలైన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్‌ఫ్యాక్టరీ (ఐసీఎఫ్), కపుర్తలాలోని రైల్ కోచ్‌ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్)లలో ప్రస్తుతం సింహభాగం కోచ్‌ల ఉత్పత్తి జరుగుతోంది. త్వరలో లాతూరులోని మరాటా్వడా రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఎంఆర్సీఎఫ్)లో ఉత్పత్తి మొదలు కాబోతోంది. వీటితోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా కోచ్‌ల కోసం రైల్వేశాఖ ఆర్డర్ ఇస్తోంది. భవిష్యత్తు డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి జరగాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కాజీపేటలో కూడా అత్యాధునిక కోచ్‌ల తయారీని ప్రారంభిస్తున్నది. క్రమంగా ఉత్పత్తి పెంపు – పూర్తిస్థాయిలో నిర్మాణ వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు కాజీపేటలో తక్కువ పరిమాణంలో అయినా ఉత్పత్తిని ప్రారంభించాలన్నది కేంద్రం యోచన. ఇందులో భాగంగా తొలుత నెలకు 10 ఎల్‌హెచ్‌బీ, వందేభారత్ కోచ్‌లు తయారు చేసేలా ఏర్పాట్లు చేస్తారు. – తదుపరి ఐదారు నెలల్లో నెలకు 20 చొప్పున కోచ్‌లు తయారు చేసేలా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత డిమాండ్ ఆధారంగా సామరŠాధ్యన్ని మరింత పెంచుతారు. అందుకు తగ్గట్టు బడ్జెట్‌ను కేటాయిస్తారు. – యాద్గిర్లో తయారయ్యే చక్రాలను ఇక్కడికి పంపుతారు. మరో ప్రాంతంలో తయారైన విడి భాగాలను (కోచ్ దిగువ భాగం) ఇక్కడికి తీసుకొచ్చి పూర్తిస్థాయి బోగీగా రూపొందించి దానిపై షెల్ (కోచ్ బాడీ)ను బిగిస్తారు. – కోచ్‌లలో కావాల్సిన అమరికలను సిద్ధం చేసేందుకు కాంపోనెంట్ ఎరిక్షన్, ఫ్యాబ్రికేషన్ షెడ్లను నిర్మిస్తున్నారు. –తయారైన కోచ్‌లకు రంగులు వేయటం, వాటి పనితీరును తనిఖీ చేసేందుకు పెయింటింగ్ బూత్, టెస్ట్ షాప్‌లను ఏర్పాటుచేస్తున్నారు. – ఒక వందేభారత్ రైలు రేక్ తయారీకి రూ.125 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల రైలుకు రూ.80 కోట్లవుతుంది. ఐదు దశాబ్దాల కల కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ ఐదు దశాబ్దాలుగా ఉన్నది. 1982లో ఈ కోచ్ ఫ్యాక్టరీ మంజూరు అయింది. నాటి ప్రధాని ఇందిర హత్య, ఆ తర్వాత సిక్కులపై ఊచకోత.. కాంగ్రెస్‌పై సిక్కుల్లో ఆగ్రహం.. వారిని శాంతపరిచే చర్యల్లో భాగంగా ఇక్కడ ఏర్పాటువాల్సి కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు తరలించారు. అప్పటి నుంచి ఫ్యాక్టరీ కోసం తెలంగాణలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 2009లో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కాజీపేటకు రైలు చక్రాల తయారీ యూనిట్ మంజూరైంది. అది కూడా ఆ తర్వాత రద్దయ్యి, మోదీ ప్రభుత్వం వచ్చాక పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌గా మారింది. భూ సమస్య కారణంగా దాని ఏర్పాటు పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. చివరకు గత ఏడాది ఫిబ్రవరిలో దాన్ని గూడ్సు రైలు వ్యాగన్ల తయారీ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేశారు. ఇప్పుడు దాన్ని కోచ్‌ల తయారీ కేంద్రంగా మళ్లీ అప్‌గ్రేడ్ చేశారు. మరో 35 ఎకరాల భూ సేకరణకాజీపేట ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం 160 ఎకరాల భూమిని మంజూరు చేసింది. అందులో 150 ఎకరాలు ఇప్పటికే రైల్వేకు అప్పగించింది. మిగతా భూమి త్వరలో అందజేయనుంది. మారిన డిజైన్ నేపథ్యంలో తాజాగా మరో 35 ఎకరాలు కూడా రైల్వే తీసుకోనున్నట్టు తెలిసింది. కాజీపేట స్టేషన్‌తో అనుసంధానిస్తూ కోచ్ తయారీ కేంద్రంలోకి ట్రాక్ ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. 390 మీటర్ల పొడవైన షెడ్లుకాజీపేట ఫ్యాక్టరీలో తొలుత వ్యాగన్లు తయారుచేయాలని నిర్ణయించినందున అందుకు తగ్గట్టుగానే డిజైన్లు రూపొందించారు. తాజాగా ఆ డిజైన్లలో 50 శాతం వరకు మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం 30 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. 2026 మార్చి నాటికి పూర్తిగా యూనిట్ సిద్ధమై ఉత్పత్తి పనులు మొదలుపెట్టాలన్నది లక్ష్యం. ఇక్కడ భారీ షెల్ అసెంబ్లింగ్ షెడ్ నిర్మిస్తున్నారు. ఇందులో కోచ్‌ల బాడీలు సిద్ధమవుతాయి. వందే భారత్ రైలు దాదాపు 390 మీటర్ల పొడవుంటుంది. దానికి సరిపడే రీతిలో దీన్ని నిర్మిస్తున్నారు. 600 మంది ఉద్యోగులుకాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో ప్రత్యక్ష్యంగా 600 మంది ఉద్యోగులు పనిచేస్తారు. పరోక్షంగా 8 వేల నుంచి పది వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. వేగంగా కోచ్‌లను సిద్ధం చేయాల్సిన నేపథ్యంలో ఇది అసెంబ్లింగ్ యూనిట్‌గా ఏర్పాటవుతోంది. కోచ్‌ల తయారీకి కావాల్సిన ముడి సరుకు పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. దీంతో ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా స్థానికంగా ప్రైవేటు సంస్థలు లాభపడతాయి. వాటిల్లో పనిచేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రాబోతున్నారు. -
విద్రోహచర్య కారణంగానే భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం !
న్యూఢిల్లీ: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో అక్టోబర్ 11న జరిగిన మైసూర్–దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం వెనుక విద్రోహుల కుట్ర దాగి ఉందని ముగ్గురుసభ్యుల రైల్వే సాంకేతిక బృందం అనుమానాలు వ్యక్తంచేసింది. ప్రమాదం జరిగిన చోట పట్టాలకు ఎలాంటి బోల్ట్‌లు లేకపోవడం, పట్టాలను ఎవరో బలవంతంగా అపసవ్య దిశలోకి సుత్తితో కొట్టిన గుర్తులు ఉన్నట్లు తెలుస్తోంది. 15 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడిన విషయం తెల్సిందే. సవ్యదిశలో నేరుగా వెళ్లాల్సిన రైలు లూప్లైన్లోకి హఠాత్తుగా వచ్చి ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొనడంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. దీంతో రైల్వే సిగ్నల్, టెలికం, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ బృందం ఆదివారం కవరపేట స్టేషన్‌లోని ఘటనాస్థలిలో దర్యాప్తు మొదలెట్టింది. ‘‘రైల్వేపట్టాల ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలోని భాగాలను విడదీశారు. వీటి గురించి బాగా అవగాహన ఉన్న ఆగంతకులే ఈ పని చేశారు. ఇటీవల కవరపేట స్టేషన్ సమీపంలో ఇలాంటి దుశ్చర్యకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక్కడ మాత్రం సఫలమయ్యారు. ఘటన జరగడానికి నాలుగు నిమిషాల ముందే ఇదే పట్టాల మీదుగా ఒక రైలు వెళ్లింది. అది వెళ్లి మైసూర్–దర్భంగా రైలువచ్చేలోపే బోల్ట్‌లు, విడిభాగాలు విడతీశారు’’ అని అధికారులు వెల్లడించారు. -
ఇండియన్ రైల్వేస్‌దే మురుగప్ప గోల్డ్‌కప్
చెన్నై: భారత్‌లో అతి పురాతన హాకీ టోర్నమెంట్లలో ఒకటైన ఎంసీసీ–మురుగప్ప గోల్డ్ కప్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ రైల్వేస్ జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. 1901లో తొలిసారి మొదలైన ఈ టోర్నీ ఇప్పటి వరకు 95 సార్లు జరిగింది. ఫైనల్లో రైల్వేస్ జట్టు 5–3 గోల్స్ తేడాతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జట్టుపై ఘనవిజయం సాధించింది. రైల్వేస్ తరఫున యువరాజ్ వాలీ్మకి (18వ, 58వ ని.లో) రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా గుర్సాహిబ్జిత్ సింగ్ 7వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి జట్టుకు శుభారంభమిచ్చారు. రెండు నిమిషాల వ్యవధిలోనే సిమ్రన్‌జ్యోత్ సింగ్ (9వ ని.లో) ఫీల్డ్‌గోల్ చేసి రైల్వేస్ ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. తర్వాత కాసేపటికి యువరాజ్ చేసిన గోల్‌తో 3–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఎట్టకేలకు ఐఓసీ ఆటగాడు తలీ్వందర్ సింగ్ (23వ ని.లో) చేసిన గోల్‌తో జట్టు ఖాతా తెరిచింది. ఆరు నిమిషాల వ్యవధిలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుజిందర్ సింగ్ (ఐఓసీ) గోల్‌గా మలచడంతో రెండు క్వార్టర్లు ముగిసేసరికి ఐఓసీ 2–3తో రైల్వేస్ ఆధిక్యానికి గండికొట్టింది. కానీ మూడో క్వార్టర్ మొదలైన కాసేపటికే ముకుల్ శర్మ (35వ ని.లో), చివరి క్వార్టర్లో యువరాజ్ చేసిన గోల్స్‌తో రైల్వేస్‌కు విజయం ఖాయమైంది. ఐఓసీ తరఫున రాజ్బిర్ సింగ్ (58వ ని.లో) గోల్ చేసినా లాభం లేకపోయింది. -
ఉద్యోగానికి రాజీనామా చేసిన వినేశ్ ఫొగట్.. ఫొటో వైరల్
-
ప్రజలందరికీ సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యం
న్యూఢిల్లీ: సమాజంలో అన్ని వర్గాలకు ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రైల్వేలకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి వచ్చేదాకా ఈ పరుగు ఆగదని స్పష్టంచేశారు. మూడు నూతన వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇవి మీరట్–లక్నో, మధురై–బెంగళూరు, చెన్నై–నాగర్కోయిల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. వందేభారత్ రైళ్ల ఆధునీకరణ, విస్తరణ ద్వారా ‘వికసిత్ భారత్’ అనే లక్ష్య సాధన దిశగా భారత్ దూసుకెళ్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన ప్రయాణానికి ఇండియన్ రైల్వే ఒక గ్యారంటీగా మారాలన్నదే తమ ధ్యేయమని, అది నేరవేరేదాకా తమ కృషి ఆగదని స్పష్టంచేశారు. భారత రైల్వే శాఖ సాగిస్తున్న అభివృద్ధి ప్రయాణం తమ ప్రభుత్వ అంకితభావానికి ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ దార్శనికతకు ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలు ఒక బలమైన మూలస్తంభమని ఉద్ఘాటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రైల్వేశాఖకు రూ.2.5 లక్షల కోట్లకుపైగా కేటాయించినట్లు గుర్తుచేశారు. మన రైల్వే వ్యవస్థ రూపురేఖలు మార్చేస్తున్నామని, హై–టెక్ సేవలతో అనుసంధానిస్తున్నామని వివరించారు. దక్షిణాది అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మన ఆశయ సాధనకు దక్షిణాది రాష్ట్రాల వేగవంతమైన ప్రగతి చాలా కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దక్షిణాదిన నిపుణులకు, వనరులకు, అవకాశాలకు కొదవ లేదని చెప్పారు. సౌత్ ఇండియా అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో రైళ్ల సంఖ్యను పెంచడానికి బడ్జెట్ కేటాయింపులు ఎన్నో రెట్లు పెంచామని వివరించారు. రైల్వే ట్రాకులు మెరుగుపరుస్తున్నామని, విద్యుదీకరణ వేగం పుంజుకుందని, రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుందని, ప్రయాణికులకు మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. -
‘పట్టా’లెక్కని ఉద్యోగాల భర్తీ!
సాక్షి, అమరావతి: భారతీయ రైల్వేలో ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది పనిభారంతో సతమతమవుతున్నారు. నిత్యం ఓవర్ టైం డ్యూటీలు చేయాల్సిన దుస్థితి కనిపిస్తోంది. సిబ్బంది కొరత కారణంగానే టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అందుకే టికెట్ బుకింగ్ సేవలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 3.11 లక్షల గ్రూప్ సి పోస్టులు, 3,018 గెజిటెడ్ కేడర్ మంజూరైన పోస్టులుంటే.. వాటిల్లో సుమారు 2.74లక్షల పోస్టులు ఇంకా భర్తీకే నోచుకోలేదు. భద్రతను విస్మరిస్తూ.. రైల్వేలో లోకో పైలెట్లు, ట్రాక్స్‌పర్సన్స్, క్లర్క్‌లు, గారు్డలు, రైలు మేనేజర్, స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ పోస్టులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ట్రాక్ మెయింటెనెన్స్, ఫిట్నెస్, సీనియర్–జూనియర్ సెక్షన్ ఇంజినీర్లు, గ్యాంగ్‌మెన్, టెక్నీíÙయన్ల పోస్టులు భర్తీ కాకపోవడంతో.. తగిన సిబ్బంది లేక రైల్వే ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ట్రాక్‌లను తనిఖీ చేయడానికి సిబ్బంది రోజూ 8–10 కి.మీ ప్రయాణించాల్సి ఉంది. ఇలాంటి సున్నితమైన పనిని శ్రద్ధతో చేయాల్సి ఉండగా.. పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి.సేఫ్టీ కేటగిరీలోని 1,52,734 ఖాళీలను యు ద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. వెంటాడుతున్న ప్రమాదాలు.. పాసింజర్ రైళ్లలో 2020–21లో 22, 2021–22లో 35, 2022–23లో 48, 2023–24లో 20 ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాలకు రైళ్లు పట్టాలు తప్పడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మిగిలిన సంవత్సరాలతో పోలిస్తే 2022–23లో రైలు ప్రమాదాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఒక్క 2018–19లో 59 ప్రమాదాలు జరిగితే వీటిల్లో 46 రైళ్లు పట్టాలు తప్పాయంటే ట్రాక్‌ల దుస్థితి ఎంత దారుణ పరిస్థితిలో ఉందో అద్దం పడుతున్నది. 2022–23లో 48 ఘటనల్లో 6 ప్రమాదాలు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొనడం, 36 పట్టాలు తప్పడంతో జరిగాయి. వీటిల్లో దాదాపు 17 శాతం ప్రమాదాలు ముంబై, నాగ్‌పూర్, భుసావల్, పూణే, షోలాపూర్ ప్రాంతాల్లోనే సంభవించాయి. సెంట్రల్ జోన్ తర్వాత ఈస్ట్ సెంట్రల్ జోన్, నార్త్ జోన్లలో 6 ప్రమాదాలు జరిగాయి. దేశంలోని 18 రైల్వే జోన్లలో ఆరు జోన్లలో మాత్రమే (ఈశాన్య, నైరుతి, దక్షిణ, పశ్చిమ మధ్య, కొంకణ్, మెట్రో రైల్వేలు) ఎటువంటి ప్రమాదాలు లేకపోవడం విశేషం. నిధులు విదల్చట్లేదు.. రైల్వే ప్రయాణికుల భద్రత విషయంలో రైల్వే శాఖ ఖర్చు చేస్తున్న నిధులను సైతం కాగ్ తప్పు పట్టింది. 2017–18లో ప్రవేశపెట్టిన రా్రïÙ్టయ రైల్ సంరక్ష కోష్ (ఆర్ఆర్ఎస్కే) రైల్వే భద్రతా నిధి (భద్రతకు సంబంధించిన పనులకు ఆరి్థక సాయం అందించడానికి ప్రత్యేక నిధి)పేరుకు మాత్రమే ఉందని ఎద్దేవా చేసింది. ఆర్ఆర్ఎస్కే నుంచి ప్రాధాన్యత–1 పనులపై మొత్తం వ్యయం 2017–18లో 81.55 శాతం నుంచి 2019–20లో 73.76 శాతానికి పడిపోయింది. ట్రాక్ పునరుద్ధరణ పనులకు 2018–19లో నిధుల కేటాయింపు రూ.9,607.65 కోట్ల నుంచి 2019–20లో రూ.7,417 కోట్లకు దిగజారింది. అత్యంత రద్దీగా ఉండే పశ్చిమ రైల్వే కోసం 2019–20లో మొత్తం వ్యయంలో ట్రాక్ పునరుద్ధరణ కోసం ఖర్చు చేసినది 3.01 శాతమే కావడం గమనార్హం. ఉద్యోగాలు భర్తీ చేయాలి.. కృత్రిమ మేధస్సు (ఏఐ) ను సిబ్బంది తొలగింపునకు, పోస్టుల రద్దుకు వినియోగించే బదులు విస్తృతంగా స్టేషన్ డేటా లాగర్ల, లోకోమోటివ్ లలోని మైక్రో ప్రాసెసర్ల డిజిటల్ డేటాను తక్షణమే విశ్లేషించి ప్రమాదాలను నివారించాలి. ఏటీఆర్‌లను సమర్పించడానికి కాలపరిమితిని నిర్ణయించాలని గతంలో రైల్వే భద్రతపై పార్లమెంటరీ ప్యానెల్ సమర్పించిన నివేదికలో సిఫారసులను కచ్చితంగా అమలు పరచాలి. రైల్వేలోని ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. – వి.కృష్ణ మోహన్, జాతీయ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీసీజీజీఓఓ) -
K Padmaja: సవాళ్లే పట్టాలెక్కించేది
దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పిసిసిఎమ్) గా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సీనియర్ అధికారి కె.పద్మజ హైదరాబాద్ రైల్ నిలయంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఆర్టిఎస్ బ్యాచ్‌కు చెందిన పద్మజ ఎస్‌సిఆర్‌లో మొట్టమొదటి మహిళా పిసిసిఎమ్. ‘ఇప్పుడంటే మహిళా అధికారులను అందరూ అంగీకరిస్తున్నారు కానీ, 30 ఏళ్ల క్రితం పురుష ఉద్యోగులు నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు..’ అంటూ నాటి విషయాలను చెబుతూనే, ఉద్యోగ జీవనంలో సవాళ్లను ఎదుర్కొన్న తీరు తెన్నులను ‘సాక్షి’తో పంచుకున్నారు.‘‘సౌత్ సెంట్రల్ రైల్వేలో మొట్టమొదటి మహిళా ఆఫీసర్‌గా ఈ పోస్ట్‌లోకి రావడం చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడంటే వర్క్‌ఫోర్స్‌లో చాలామంది అమ్మాయిలు వస్తున్నారు. కానీ, నేను జాయిన్ అయినప్పుడు ఒక్కదాన్నే ఉండేదాన్ని. కొత్తగా వర్క్‌లో చేరినప్పుడు ఒక తరహా స్ట్రెస్ ఉండేది. నన్ను నేను చాలా సమాధానపరుచుకునేదాన్ని. ‘ఒక్కదాన్నే ఉన్నాను అని ఎందుకు అనుకోవాలి.. ఎవరో ఒకరు రూట్ వేస్తేనే ఆ తర్వాత వచ్చే మహిళలకు మార్గం సులువు అవుతుంది కదా’ అనుకునేదాన్ని.ఎదుర్కొన్న సవాళ్లుమొదట్లో డివిజనల్ ఆఫీస్ మేనేజర్‌గా జాయిన్ అయినప్పుడు ఒక మహిళను అధికారిగా అంగీకరించడానికి సహోద్యోగులకే కష్టంగా ఉండేది. నేను మొదటిసారి ఇన్స్పెక్షన్కి వెళ్లినప్పుడు స్టేషన్ మాస్టర్‌కి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. మొదట వాళ్లు నమ్మలేదు. ఆఫీసుకు ఫోన్ చేసి ‘ఇక్కడెవరో లేడీ వచ్చారు. ఆవిడేమో నేను డివిజనల్ ఆఫీస్ మేనేజర్ని అంటోంది, ఏమిటిది?’ అని అడిగారు. మా కొలీగ్ ‘ఆవిడ కూడా నాలాగే ఆఫీసర్’ అంటే అప్పుడు వాళ్లు అంగీకరించక తప్పలేదు. ఆ స్టేజ్ నుంచి ఇక్కడకు రావడానికి చాలా సవాళ్లు ఉన్నాయి. మొదట్లో గుర్తించిన మరో విషయం ఏంటంటే తోటి ఉద్యోగులు చాలామంది నా నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికే ఇబ్బంది పడేవారు. దీంతో ‘నేను ఎక్స్పర్ట్ అయితేనే ఈ అసమానతను తొలగించగలను’ అనుకున్నాను. అందుకు, నా పనిని ఎప్పుడూ ముందు చేసినదానికన్నా బెటర్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాను. పనిచేసే చోట రూల్స్ పరంగా అన్నీ క్లియర్‌గా ఉంటాయి. అయితే, మనతో ఉండే కొలీగ్స్, సీనియర్స్ విషయంలో వారి ప్రవర్తనలో తేడాలు కనిపిస్తుంటాయి. ‘ఇంత సమర్థంగా చేస్తున్నా కూడా ఇంకా వివక్షతోనే చూస్తున్నారే..’ అని అనిపించేది. ఇంటì నుంచి బయటకు వచ్చినప్పుడు వీటన్నింటినీ ఎదుర్కోకతప్పదు అన్నట్టుగా ఉండేవి ఆ రోజులు. ఇప్పటి తరంలో ఈ ఆలోచన పూర్తిగా మారిపోయింది. అయితే, ఏదీ అంత సులువైనది కాదు, కష్టమైన జర్నీయే. కానీ, నిన్నటి కన్నా ఈ రోజు బెటర్‌గా మార్చుకుంటూ రావడమే నన్ను ఇలా ఒక ఉన్నత స్థానంలో మీ ముందుంచ గలిగింది. ముఖ్యమైనవి వదులుకోవద్దుపిల్లల చిన్నప్పుడు మాత్రం తీరిక దొరికేది కాదు. ఉద్యోగం, ఇల్లు, వేడుకలు.. వీటన్నింటిలో కొన్ని త్యాగాలు చేయక తప్పలేదు. వాటిని మనం అంగీకరించాల్సిందే. అయితే, ముఖ్యమైన వాటిని వదిలేదాన్ని కాదు. నాకు ఇద్దరు కూతుళ్లు. ఇప్పుడు వాళ్లు వర్కింగ్ ఉమెన్. డ్యూటీ చూసుకుంటూనే పిల్లల పేరెంట్ టీచర్ మీట్, స్పోర్ట్స్ మీట్, స్కూల్ ఈవెంట్స్.. తప్పనిసరి అనుకున్నవి ఏవీ మిస్ అయ్యేదాన్ని కాదు. ఆఫీస్ పని వల్ల ఇంట్లో ముఖ్యమైన వాటిని వదులుకున్నాను ... అనుకునే సందర్భాలు రాకూడదు అనుకునేదాన్ని. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఊపిరి సలుపుకోనివ్వనంత గా పనులు చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండేది. అయితే, వర్క్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టినతర్వాత అన్నీ సులువుగా బ్యాలన్స్ చేసుకో గలిగాను. మా నాన్నగారు ఐఎఎస్ ఆఫీసర్ కావడంతో తరచు బదిలీలు ఉండేవి. మా అమ్మానాన్నలు ఎంతో బిజీగా ఉండి కూడా మాతో ఎలా ఉండేవారో తెలుసు కాబట్టి, నేనే సరైన టైమ్ ప్లానింగ్ చేసుకోవాలి అనుకున్నాను. ఏదైనా పనికి గంట సమయం కుదరకపోతే అరగంటలోనైనా పూర్తి చేయాలి. ప్లానింగ్ మన చేతుల్లో ఉన్నప్పుడు దేనినీ వదులుకోవాల్సిన అవసరం లేదు. నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. ఇప్పటికీ రోజూ కొంతసమయం బుక్స్‌కి కేటాయిస్తాను. అలాగే, మొక్కల పెంపకం పట్ల శ్రద్ధ తీసుకుంటాను. పాజిటివ్ ఆలోచనలు మేలు..ముందుగా మహిళ ఇతరుల మెదళ్ల నుంచి ఆలోచించడం మానేయాలి. వాళ్లేం అనుకుంటారో, వీళ్లేం అంటారో... అనే ఆలోచన మన జీవితాన్ని నరక మయం చేస్తుంది. కెరియర్ మొదట్లోనే మన కల పట్ల స్పష్టత ఉండాలి. ఎన్ని సమస్యలు వస్తున్నా మనకంటూ ఒక స్పష్టమైన దారిని ఎంచుకోవాలి. సగం జీవితం అయిపోయాకనో, పిల్లలు పెద్దయ్యాక చూద్దాంలే అనో అనుకోవద్దు. ముందుగా అన్ని రకాలుగా స్థిరత్వం ఉండేలా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి. సమస్యలు వచ్చేదే మనల్ని ధైర్యంగా ఉంచడానికి అనుకోవాలి. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే బ్యాలెన్స్ చేసుకోవడం సులువు అవుతుంది’’ అంటూ సొంతంగా వేసుకున్న దారుల గురించి వివరించారు ఈ ఆఫీసర్. కుటుంబ మద్దతుట్రెయిన్స్కు సంబంధించిన సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, ప్రమాదాలు.. వంటి సమయాల్లో నైట్ డ్యూటీస్ కూడా తప్పనిసరి. నిరంతరాయంగా పని చేస్తూనే ఉండాలి. మా పని ఈ కొద్ది గంటలు మాత్రమే అన్నట్టు ఏమీ ఉండదు. 24/7 ఏ సమయంలోనైనా డ్యూటీలో ఉండాల్సిందే. మా పేరెంట్స్, కుటుంబ సభ్యులందరూ నా బాధ్యతలను, పని ఒత్తిడిని అర్థం చేసుకొని, పూర్తి మద్దతుని, సహకారాన్ని ఇవ్వడం వల్ల నేను నిశ్చింతగా నా పనులు చేçసుకోగలిగాను.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: నోముల రాజేష్‌రెడ్డి -
జనరల్ బోగీలు : సీట్లు.. పాట్లు.. రైలు ప్రయాణమంటే హడల్ (ఫొటోలు)
-
చచ్చిన ఎలుకల కోసం రైల్వే పైలెట్ ప్రాజెక్ట్
చచ్చిన ఎలుకలను కనుగొనేందుకు భారతీయ రైల్వే వివిధ స్టేషన్లలో బోరెస్కోపిక్ కెమెరాలను వినియోగించనుంది. ఇది వినడానికి కాస్త వింతగా అనిపించినా ప్రయాణికులు, రైల్వే ఉద్యోగుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని ముంబైలో ప్రారంభించినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.రైల్వే స్టేషన్లలోని వెయిటింగ్ హాల్, ఆఫీసు, క్యాంటీన్లోని మూలల్లో ఎలుకలు చనిపోతుంటాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మీడియాకు తెలిపారు. చచ్చిన ఎలుకల నుంచి దుర్వాసన వస్తుండటంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఇబ్బంది పడుతుంటారు. దీనికి సంబంధించిన ఫిర్యాదులు తరచుగా అందుతుండటంతో చచ్చిన ఎలుకలను వెతికేందుకు సెంట్రల్ రైల్వే రెండు అత్యాధునిక బోరోస్కోపిక్ కెమెరాలను కొనుగోలు చేసింది.బోరోస్కోపిక్ కెమెరా అతి చిన్న ప్రదేశంలోకి కూడా వెళుతుంది. సాధారణంగా చూడలేని ప్రాంతాన్ని కూడా స్కాన్ చేసి చూపిస్తుంది. దీని సాయంతో ఆయా ప్రాంతాల్లో స్కాన్ చేసి చచ్చిన ఎలుకలను గుర్తిస్తారు. తరువాత వాటిని అక్కడి నుంచి తొలగిస్తారు. ఈ కెమెరాలను ప్రయోగపూర్వకంగా ఉపయోగించినప్పుడు స్టేషన్ లాబీ, టాయిలెట్, వాష్‌రూమ్ సీలింగ్ వెనుక కొన్ని చచ్చిన ఎలుకలు కనిపించాయి. అనంతరం ఆ ఎలుకలను తొలగించారు. ప్రస్తుతానికి ముంబై స్టేషన్లో రెండు కెమెరాలు అమర్చినట్లు ముఖ్య ప్రజాసంబంధాల అధికారి తెలిపారు. త్వరలో ఇతర స్టేషన్లలోనూ ఇటువంటి కెమెరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. -
వేగంగా, క్షేమంగా పట్టాలెక్కితేనే...
ఈ నెలలో పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదం రైల్వేల పనితీరును మరోసారి వార్తల్లోకి తెచ్చింది. కాగ్ నివేదిక ప్రకారం, రైళ్లలో అత్యంత ప్రమాదాలకు కారణం అవుతున్నవి సిగ్నల్ వైఫల్యాలు, పట్టాల్లో బీటలు. భద్రతా ప్రమాణాలకు తోడు, నత్తనడక వేగం వల్ల రైల్వేలు తమ మార్కెట్ వాటాను కోల్పోయాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సగటు వేగం గంటకు 50 – 51 కిలోమీటర్ల మధ్యనే ఉండిపోయిందనీ, ‘మిషర్ రఫ్తార్’ ద్వారా సగటు వేగం 75 కిలోమీటర్లకు పెరిగిందన్నది ప్రచారమేననీ తేలింది. వందే భారత్ రైళ్లు వేగం కంటే హంగులకే ప్రసిద్ధి చెందాయి. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో రైల్వే వ్యవస్థ అన్ని విధాలుగా పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజల అవసరాలు తీరుతాయి.భారతీయ రైల్వే మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ నెల 16న పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి వద్ద ఓ గూడ్సు బండి, ప్యాసెంజర్ రైలును ఢీకొట్టడంతో తొమ్మిది మంది మరణించగా, సుమారు 40 మంది గాయపడ్డారు. 1995 నుంచి తీసుకుంటే దేశంలో కనీసం ఏడు భయంకరమైన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఐదింటిలో 200కు పైగా ప్రాణాలు పోయాయి. ఇంకోదాంట్లో 358 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ వద్ద 1995లో జరిగింది. ఏడాది క్రితం ఒడిశాలోని బాలాసోర్ వద్ద పలు రైళ్లు ఢీకొనడంతో 287 మంది చనిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఏడు ప్రమాదాల్లోనే విలువైన 1,600 ప్రాణాలు గాల్లో కలిసిపోవడం గమనార్హం. 140 కోట్ల జనాభా కలిగిన మనలాంటి దేశంలో రైల్వే వ్యవస్థ పటిష్టంగా ఉండాలనీ, రోడ్డు, వాయు మార్గాలతో పోటీపడేలా ఉన్నప్పుడే ప్రజల అవసరాలు తీర్చగలమనీ రైల్వే ప్లానర్స్ చెబుతారు. రైల్వే బోర్డు లేదా కేంద్ర ప్రభుత్వం రెండూ ఈ ప్రాథమ్యాన్ని కాదని అనలేదు. రైల్వే వేగం రెట్టింపు చేస్తామనీ, మరిన్ని రైల్వే లైన్లతోపాటు భద్రతను కూడా పెంచుతామనీ కేంద్రం తరచూ ప్రకటనలు చేస్తూనే ఉంటుంది. ప్రధానమైన రైల్వే రూట్లలో రద్దీ విపరీతమైన నేపథ్యంలో ఇది అవసరం కూడా. కాకపోతే ఈ మాటలు ఇప్పటివరకూ మాటలకే పరిమితం కావడం గమనార్హం. గూడ్స్, ప్యాసెంజర్ రవాణా రెండింటిలోనూ రైల్వేలు తమ మార్కెట్ వాటాను ఎప్పుడో కోల్పోయాయి. 2010–12 మధ్యకాలంలో ఈ రెండింటిలో వృద్ధి స్తంభించిపోయింది. రోడ్డు, వాయు మార్గాల వాటా ఏటా 6 నుంచి 12 శాతం వరకూ పెరిగాయి. 2014–15 నుంచి 2019 – 20 మధ్యలో ప్రయాణికుల సంఖ్య కిలోమీటర్‌కు 99,500 కోట్ల నుంచి కిలోమీటర్‌కు 91,400 కోట్లకు పడిపోవడం గమనార్హం. అదే గూడ్స్ రవాణా విషయానికి వస్తే, అది కిలోమీటర్‌కు 68,200 – 73,900 టన్నుల మధ్యే నిలిచిపోయింది. 2019–20 నుంచి ఇప్పటి వరకూ ఉన్న కాలంలో ప్యాసెంజర్, గూడ్స్ రవాణా గణాంకాలను రైల్వే శాఖ వెల్లడించలేదు.దేశంలో రవాణాలో రైల్వేది గుత్తాధిపత్యం అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతం అది తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మార్కెట్ వాటా తగ్గుదల ఇప్పటిమాదిరే ఇంకో పదేళ్లు కొనసాగితే రైల్వేలు రెండో తరగతి రవాణా వ్యవస్థలుగా మారిపోతాయి. రైల్వే లైన్లు, వేగం, భద్రతా ప్రమాణాలు పెరగకపోవడాన్ని బట్టి చూస్తే భారతీయ రైల్వే ప్రస్థానం ఈ దిశగానే సాగుతోందని అనాలి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి విశాలమైన, జనాభా తక్కువ ఉన్న దేశాల్లో రైల్వేలు ఇప్పుడు ఇదే దశలో ఉన్నాయి. అయితే భారతదేశంలోని జనాభా సాంద్రత, ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న వైనాలను దృష్టిలో పెట్టుకుంటే రైల్వేల తిరోగమనం మంచిది కాదు.రైళ్లలో భద్రత అంశాన్ని విస్తృత దృష్టికోణంతో చూడాల్సి ఉంటుంది. గత రెండు దశాబ్దాల్లో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే రైల్వే బోర్డు ఒక దిశ, దిక్కూ లేకుండా పని చేస్తోంది. అకస్మాత్తుగా విధానాల మార్పులు జరిగిపోతుండటంతో విస్తరణ, వృద్ధికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. నత్తనడకన నడుస్తున్న రైళ్లను మరింత వేగంగా పరుగెత్తించడంలో బోర్డు ఘోరంగా విఫలమైంది. రైళ్ల రాకపోకలు దైవాధీనమన్న పరిస్థితి ఇప్పటికీ మారలేదు. భద్రతపై ఆందోళనలూ పెరిగిపోతున్నాయి. రైల్వేల భద్రత, వేగం, సమయపాలన విషయాల్లో భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవలే రెండు ముఖ్యమైన నివేదికలు సమర్పించారు. 2014–19 మధ్యలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైల్వేల సగటు వేగంలో పెద్దగా మార్పుల్లేవనీ, గంటకు 50 – 51 కిలోమీటర్ల మధ్యనే ఉండిపోయిందనీ స్పష్టం చేసింది. ‘మిషర్ రఫ్తార్’ ద్వారా సగటు వేగం గంటకు 75 కిలోమీటర్లకు పెరిగిందన్న ప్రచారం వట్టిదేనని తేల్చింది. సరుకు రవాణా రైళ్ల విషయంలో రైల్వే బోర్డు చెప్పుకొంటున్నట్లుగా వేగం రెట్టింపు కాకపోగా, సగటు వేగం కొంత తగ్గినట్లు ఈ నివేదిక తెలిపింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, రైళ్లను గంటకు 110–130 కి.మీ. వేగం నుంచి, గంటకు 160 – 200 కి.మీ. వేగంతో పరుగెత్తించేందుకు కావాల్సిన టెక్నాలజీ, కోచుల తయారీ సామర్థ్యాలను భారత్ 20 ఏళ్ల క్రితమే సముపార్జించుకోవడం! కాగ్ విడుదల చేసిన రెండో నివేదిక ప్రమాదాలకు సంబంధించినది. ప్రమాదాల సంఖ్యలో కొంత తగ్గుదల ఉంది. మనుషుల కావలి లేని గేట్ల దగ్గర మనుషులను పెట్టడం దీనికి ముఖ్య కారణం. కానీ పట్టాలు తప్పిపోవడం, ఢీకొనడం వంటి వాటి విషయంలో పెద్దగా పురోగతి లేదు. సిగ్నల్ వైఫల్యాలు, రైల్ ఫ్రాక్చర్లు(పట్టాల్లో బీటలు) పెరిగిపోతూండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ రైల్వేల్లో అత్యంత భారీ ప్రమాదాలు ఈ రెండు కారణాలతోనే జరగడం గమనార్హం. బాలాసోర్‌లో గత ఏడాది సంభవించిన ప్రమాదానికి సిగ్నల్ వైఫల్యం కారణమన్నది తెలిసిన విషయమే. మొత్తమ్మీద కాగ్ నివేదికలు రెండింటి సారాంశం చూస్తే రైల్వేల్లోని వ్యవస్థల వైఫల్యానికి వేగం, సామర్థ్యం పెంపు వంటివి తోడయ్యాయి. ఫలితంగా భద్రత అంతంత మాత్రంగా మారిపోయింది. సమయపాలన అసాధ్యంగా మారింది. భారతీయ రైల్వేల్లో ప్రస్తుత నెట్వర్క్ తిరోగమన దిశలో ఉంటే... ఏటికేడాదీ భారీ ప్రాజెక్టుల ప్రకటన కొనసాగుతూనే ఉంది. వీటి ఆర్థిక వెసలుబాటు గురించి ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. ప్రధాన బ్రాడ్‌గేజ్ లైన్‌తో అనుసంధానం కాకుండా ఉండే ‘స్టాండ్ అలోన్ బుల్లెట్ ట్రైన్లు’ వీటిల్లో ఒకటి. ఈ లైన్లు అన్నీ స్టాండర్డ్ గేజ్‌పై నిర్మించినవి. అలాగే సరుకు రవాణాకు ఉద్దేశించిన కారిడార్ పొడవాటి, బరువైన రైళ్ల కోసం సిద్ధం చేసినది. దేశంలో తొలి బుల్లెట్ రైలు నిర్మాణం 2017లో మొదలైంది. 2012లోనే సరుకు రవాణాకు ప్రత్యేకమైన కారిడార్ల నిర్మాణం మొదలైంది. ఇదిలా ఉంటే... గత మూడేళ్లలోనే దేశంలో సుమారు 50 జతల ‘సెమీ హై స్పీడ్’ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఇవి వేగం కంటే వాటి హంగులకే ఎక్కువ ప్రసిద్ధి చెందాయి. ఒక్క విషయమైతే స్పష్టం. రైల్వే బోర్డు తన ప్రాథమ్యాలను సమగ్రంగా సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి కొత్త ప్రభుత్వం ఈ అంశాన్ని తలకెత్తుకుంటుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం.అలోక్ కుమార్ వర్మ వ్యాసకర్త రైల్వే విశ్రాంత చీఫ్ ఇంజినీర్ -
ఇండియన్ రైల్వే టార్గెట్.. ఐదేళ్లలో 44000 కిమీ కవచ్ సిస్టం
టెక్నాలజీ ఎంత పెరిగిన రైలు ప్రమాదాలను పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం జరిగిన కొద్ది రోజుల తర్వాత, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంబంధిత అధికారులతో కవచ్ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని అన్నారు. వచ్చే ఐదేళ్లలో నేషనల్ ట్రాన్స్పోర్టర్ 44,000 కి.మీలను కవచ్ కిందకు తీసుకువస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంతకీ ఈ కవచ్ సిస్టం అంటే ఏంటి? ఇదెలా పనిచేస్తుంది? దీనివల్ల ఉపయోగాలేంటి అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.కవచ్ అనేది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటక్షన్ సిస్టం. ఒక ట్రైన్ పట్టాల మీద వెళ్తున్న సమయంలో.. అదే ట్రాక్ మీద ఒకవేలా ట్రైన్ వస్తే అలాంటి సమయంలో రెండూ ఢీ కొట్టుకోకుండా నిరోధిస్తుంది. ఇది రైలు వేగాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ప్రమాద సంకేతాలకు గుర్తిస్తే వెంటనే ట్రైన్ ఆపరేటర్లను హెచ్చరిస్తుంది. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాద సంకేతాలు గురించినప్పటికీ ట్రైన్ ఆపరేటర్ చర్యలు తీసుకొని సమయంలో ఇదే ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేస్తుంది.ప్రస్తుతం కవచ్ సిస్టమ్‌కు ముగ్గురు మాత్రమే తయారీదారులు ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఈ తయారీదారులు కూడా పెంచాలని అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ ఢిల్లీ - ముంబై & ఢిల్లీ - హౌరా మార్గాల్లో కవచ్ ఇన్‌స్టాలేషన్‌పై కసరత్తు చేస్తోంది. ఈ సంవత్సరం చివరినాటికి మరో 6000 కిమీ కవచ్ ఇన్స్టాలేషన్ కోసం టెండర్లను జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.ప్రపంచంలోని చాలా ప్రధాన రైల్వే వ్యవస్థలు 1980లలో కవాచ్ మాదిరిగా ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (ATP)కి మారాయి. అయితే మనదేశంలో భారతీయ రైల్వే 2016లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TACS) మొదటి వెర్షన్ ఆమోదంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది. రాబోయే రోజుల్లో ఈ కవచ్ సిస్టం దేశం మొత్తం మీద అందుబాటులోకి వస్తుంది. దీంతో ప్రమాదాల సంఖ్య తగ్గిపోతుందని భావిస్తున్నారు. -
వందే భారత్ రైలు ఆహారంలో బొద్దింక..
కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అందించే ఆహారంపై గత కొన్ని రోజులుగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణ రైళ్లలో కంటే వందేభారత్‌లో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఫుడ్ మాత్రం సరిగా ఉండటం లేదని.. పాచిపోయిన, పురుగులు పడిన ఆహారం వచ్చిందంటూ ప్రయాణికుల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి.తాజాగా ఓ జంటకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. భోపాల్ నుంచి ఆగ్రా వెళ్తుండగా దంపతులక వందే భారత్ రైలులో అందించిన ఫుడ్‌లో చచ్చిన బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో ఈ విషయాన్ని తన బందువుల తరుపున విదిత్ వర్ష్నే అనే నెటిజన్ ఎక్స్ లో పోస్టు చేశారు. ‘ఈనెల 18వ తేదీన మా ఆంటీ, అంకుల్ వందేభారత్ రైలులో భోపాల్ నుంచి ఆగ్రా వరకూ ప్రయాణించారు. ఆ సమయంలో ఐఆర్సీటీసీ పెట్టిన భోజనంలో బొద్దింక వచ్చింది’ అని పోస్టు పెట్టారు.అంతేకాకుండా ఘటనపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు ట్వీట్ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.అయితే ఈ ఘటనపై ఐఆర్సీటీసీ క్షమాపణలు చెప్పింది. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ‘మీకు కలిగిన అనుభవానికి క్షమాపణలు కోరుతున్నాము. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాం. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌కు తగిన జరిమానా విధించాం’ అని తెలిపింది.Today on 18-06-24 my Uncle and Aunt were travelling from Bhopal to Agra in Vande Bharat.They got "COCKROACH" in their food from @IRCTCofficial. Please take strict action against the vendor and make sure this would not happen again @RailMinIndia @ AshwiniVaishnaw @RailwaySe pic.twitter.com/Gicaw99I17— Vidit Varshney (@ViditVarshney1) June 18, 2024 కాగా వందేభారత్ రైళ్లలో ఇలాంటి ఘటన జరగడం ఇదేం తొలిసారి కాదు. గత మార్చిలో సిలిగురి నుంచి కోల్‌కతా వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న ప్రసూన్ దేవ్.. తన ఆహారంలో పురుగును గుర్తించాడు. -
వదలని వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని వడగాడ్పులు వదలడం లేదు. మండుటెండలు ప్రజలకు ఏమాత్రం ఉపశమనం కలిగించడం లేదు. అధిక ఉష్ణోగ్రతలు రోజురోజుకూ అదుపు తప్పుతూనే ఉన్నాయి. సాధారణం కంటే 3నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా పలు జిల్లాల్లో వడగాడ్పులు, మరికొన్ని జిల్లాలో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. మంగళవారం కూడా ఇవి కొనసాగాయి. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42–45 డిగ్రీలు రికార్డయ్యాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా డోన్, బనగానపల్లి (నంద్యాల), కొత్తవలస, జామి (విజయనగరం)లలో 44.9 డిగ్రీలు, కాజీపేట (వైఎస్సార్) 44.6, గోస్పాడు (కర్నూలు)లో 44.2, మహానంది, చీడికాడ, దేవరాపల్లి (అనకాపల్లి)లో 44.1, సారవకోట (శ్రీకాకుళం)లో 43.7 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఫలితంగా 66 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 84 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. బుధవారం 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 143 మండలాల్లో వడగాడ్పులు, గురువారం 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 109 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు మండలాల్లో 43–45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాకు తేలికపాటి వర్షాలు దక్షిణ అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉంది. అలాగే రాష్ట్రంపైకి ఈశాన్య, ఆగ్నేయ దిశగా దిగువ స్థాయి నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం తెలిపింది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని పేర్కొంది. రైల్వేలకు అలర్ట్ వడగాడ్పుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వేలను ఐఎండీ అప్రమత్తం చేసింది. వడగాడ్పుల ప్రభావం రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమపై ఉంటుందని తెలిపింది. వీటి పరిధిలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫామ్‌లపైన, బోగీల్లోనూ ప్రయాణికులకు పూర్తిస్థాయిలో మంచినీటిని అందుబాటులో ఉంచాలని, ప్లాట్‌ఫామ్‌లపై చల్లదనం కోసం కూల్ రూఫ్‌లు, నీడనిచ్చే ఏర్పాట్లు చేయాలని సూచించింది. -
రైల్వే రిజర్వేషన్లో కొత్త రూల్! ప్రాధాన్యత వారికే..
రైల్వే రిజర్వేషన్, బెర్తుల కేటాయింపులో ఇండియన్ రైల్వే కొత్త రూల్‌ను అమలు చేసింది. లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్లో వృద్ధ ప్రయాణికులకు ప్రాధాన్యతనిస్తూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ప్రయాణంలో సీనియర్ సిటిజన్ల ఇబ్బందులను తొలగించడానికి భారతీయ రైల్వే ఈ చర్య చేపట్టింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌లను రిజర్వ్ చేసుకోవడానికి అర్హులు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రయాణికుల విభిన్న అవసరాలను తీర్చడంలో రైల్వే నిబద్ధతను ఈ నిబంధన తెలియజేస్తుంది. పైకి ఎక్కలేని వృద్ధులకు లోయర్ బెర్త్‌ను బుక్ చేసుకున్నప్పటికీ అప్పర్ బెర్త్‌ల కేటాయించడంపై సోషల్ మీడియాలో లేవనెత్తిన ప్రయాణికుల ఆందోళనకు ప్రతిస్పందనగా ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరిస్తూ సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ రిజర్వేషన్లను పొందే ప్రక్రియను స్పష్టం చేసింది. ఇండియన్ రైల్వే అందించిన స్పష్టీకరణ ప్రకారం.. ప్రయాణికులు లోయర్ బెర్త్ కోసం బుకింగ్ సమయంలో తప్పనిసరిగా రిజర్వేషన్ ఛాయిస్ ఎంపికను ఎంచుకోవాలి. అయితే బెర్తుల కేటాయింపులు లభ్యతకు లోబడి ఉంటాయి. ముందుగా రిజర్వ్ చేసుకున్నవారికి ముందుగా ప్రాతిపదికన లోయర్ బెర్త్‌లు కేటాయిస్తున్నట్లు భారతీయ రైల్వే స్పష్టం చేసింది. లోయర్ అవసరమైన ప్రయాణికులు రైలు టిక్కెట్ ఎగ్జామినర్ (TTE)ను సంప్రదించవచ్చని, లోయర్ బెర్త్‌లు అందుబాటులో ఉంటే కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొంది. -
రైలు ప్రయాణికులకు అలర్ట్.. రిజర్వేషన్ సేవలకు బ్రేక్!
ఢిల్లీ, చుట్టుపక్కల రాష్ట్రాలలో నడిచే రైళ్లకు రిజర్వేషన్ చేయాలనుకుంటున్న ప్రయాణికులు శుక్రవారం రాత్రికి ముందే చేసేయండి. ఎందుకంటే ఢిల్లీ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)కు సంబంధించిన అన్ని సేవలు శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు పనిచేయవు. అయితే, సర్వీసులు నిలిచిపోయిన సమయంలో చాలా తక్కువ మంది మాత్రమే అసౌకర్యానికి గురవుతారని రైల్వే పేర్కొంది. చాలా కొద్ది మంది మాత్రమే ఈ సేవలను ఉపయోగిస్తున్నారని రైల్వే చెబుతోంది. పీఆర్ఎస్ దేశవ్యాప్తంగా ఐదు నగరాల నుండి పనిచేస్తుంది. వీటిలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, గౌహతి ఉన్నాయి. ఢిల్లీ పీఆర్ఎస్ వ్యవస్థను శుక్రవారం రాత్రి తాత్కాలికంగా మూసివేయనున్నారు. అంటే ఢిల్లీ పీఆర్ఎస్ ద్వారా నిర్వహించే అన్ని రైళ్లలో రిజర్వేషన్, రద్దు, విచారణ (139, కౌంటర్ సర్వీస్), ఇంటర్నెట్ బుకింగ్‌తో సహా అన్ని రకాల సేవలు ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 11.45 గంటల నుండి ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 04.15 గంటల వరకు దాదాపు 04.30 గంటల పాటు నిలిచిపోతాయి. ఈ సమయంలో ఢిల్లీ పీఆర్ఎస్కు సంబంధించిన ఏ పనిని మరే ఇతర నగరంలోని పీఆర్ఎస్ నుండి చేయలేము. రిజర్వేషన్ లేదా మరేదైనా పనిని పూర్తి చేయాలనుకుంటే, శుక్రవారం రాత్రికి ముందే పూర్తి చేయండి.. లేకపోతే మీరు శనివారం ఉదయం మాత్రమే పూర్తి చేయగలుగుతారు. -
IRCTC తో Swiggy - ఆర్డర్ చేసుకునే విధానం..!
-
సమ్మెకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైరన్?
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రైల్వేతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. 2024, మే ఒకటి నుంచి చేపట్టబోయే ఈ సమ్మెలో 28 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మూడు కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాలు పాల్గొననున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం అమవుతున్న జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ని పునరుద్ధరించాలని ఈ ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ జాయింట్ ఫోరమ్(జేఎఫ్ఆర్ఓపీఎస్) ఢిల్లీలో నిర్వహించిన ఒక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో మార్చి 19న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని ఫోరమ్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ అంశంపై కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమవడంతో సమ్మెకు దిగాలని నిర్ణయించినట్లు ఫోరమ్ కన్వీనర్, ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్) ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తెలిపారు. -
‘భావి భారతం గురించి నీకేం తెలుసు?’.. విద్యార్థులకు రైల్వేశాఖ పోటీ..
భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉండబోతోంది? భారతీయ రైల్వేలు ఎంతలా మారనున్నాయి?.. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలను ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను వారి అధ్యాపకులు అడుగుతుంటారు. తాజాగా భారతీయ రైల్వే దేశంలోని పాఠశాలల విద్యార్థులకు ఒక పోటీ నిర్వహించబోతోంది. ఈ పోటీలో పాల్గొనే విద్యార్థులు భావి భారతంపై తమకున్న కలల గురించి చెప్పాలని రైల్వేశాఖ కోరింది. ఇందుకోసం భారతీయ రైల్వే ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 4000 పాఠశాలల నుంచి 4 లక్షల మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొననున్నారు. భావి భారతం ఎలా ఉండబోతోంది? రైల్వేల భవిష్యత్ ఎలా ఉండనుందనే దానిపై విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, కవితా రచన తదితర పోటీలు నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పోటీలో ప్రతిభ కనబరిచిన 50 వేల మంది విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 26న దేశంలోని అన్ని డివిజన్లలోని 2000 రైల్వే స్టేషన్లలో పోటీ నిర్వహించనున్నామని, పోటీలు జరిగే సమయంలో ప్రధాని స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని రైల్వే అధికారులు తెలిపారు. -
రైల్వేకే చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. ఇలా మీకైతే ఏం చేస్తారు?
Rs 10000 Fine On Indian Railways : దేశంలో అత్యధిక మంది ప్రయాణించే సాధనం రైల్వేలు. నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే రైళ్లలో ఎదురయ్యే అసౌకర్యాలతో ప్రతిఒక్కరూ ఎప్పుడోసారి ఇబ్బంది పడే ఉంటారు. ఇలా అసౌకర్యానికి గురైన ఓ ప్రయాణికుడు రైల్వేకు, ఐఆర్సీటీసీకి చుక్కలు చూపించాడు. పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌కు చెందిన కుటుంబానికి బెర్త్‌లను సెకెండ్ ఏసీ నుంచి థర్డ్ ఏసీకి ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్ చేసినందుకు రూ.10,000 మొత్తాన్ని చెల్లించాలని నార్తన్ రైల్వే, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( IRCTC )ను చండీగఢ్‌లోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది. జిరాక్‌పూర్‌కు చెందిన పునీత్ జైన్ 2018 ఆగస్టులో తనకు, తన కుటుంబానికి వైష్ణో దేవి నుంచి చండీగఢ్‌కి శ్రీ వైష్ణో దేవి-కల్కా ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కొక్కరికీ రూ. 2,560 చొప్పున సెకెండ్ ఏసీ టిక్కెట్లను కొనుగోలు చేశారు. అయితే అతను తన కుటుంబంతో సహా 2018 అక్టోబర్ 20న కట్రా రైల్వే స్టేషన్‌కు చేరుకోగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వారి బెర్త్‌లను డౌన్‌గ్రేడ్ చేశారు. సమస్యను టీటీఈ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదు. దీంతో వారు థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్లో ప్రయాణించవలసి వచ్చింది. సెకెండ్ ఏసీ సౌకర్యాలను కోల్పోయిన వారు థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్లోని అసౌకర్యాలతో ఇబ్బందులు పడ్డారు. దీని తర్వాత బాధితుడు సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ టిక్కెట్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వాపసు చేయాలని కోరగా తిరస్కరణ ఎదురైంది. అనంతరం సబ్ డివిజనల్ మేనేజర్‌కు మొత్తం విషయాన్ని ఈమెయిల్లో పంపాడు. జైన్ అవసరమైన సర్టిఫికేట్ అందించలేదని, అది కూడా చాలా కాలం తర్వాత సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చాడని, ఇది ఇప్పుడు పరిష్కరించడానికి వీలుకాదని నార్తన్ రైల్వే సబ్-డివిజనల్ మేనేజర్/డివిజనల్ మేనేజర్ చేతులెత్తేశారు. ఇక ఈ విషయంపై ఐఆర్సీటీసీ వాదన ఏమిటంటే తాము కేవలం ఆన్లైన్ బుకింగ్ సర్వీస్ మాత్రమే అందిస్తామని, జైన్ కోరిన ఉపశమనాలకు బాధ్యత వహించమని చెబుతోంది. సేవలో లోపం నార్తన్ రైల్వే, ఐఆర్సీటీసీ అవలంభించిన అన్యాయమైన వాణిజ్య పద్ధతుల కారణంగా బాధితుడికి ఇబ్బంది కలిగిందని జైన్‌కు అనుకూలంగా కమిషన్ తీర్పునిచ్చింది. రూ. 1,005 లను 2018 అక్టోబర్ 20 నుండి 9 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని, దీంతో పాటు రూ. 5,000 నష్ట పరిహారం, రూ. 4,000 వ్యాజ్యం ఖర్చులు చెల్లించాలని నార్తన్ రైల్వే, ఐఆర్సీటీలను ఆదేశించింది. -
రైలు ప్రయాణికులకు అలర్ట్.. ట్రైన్ ఎక్కే ముందు తప్పక తెలుసుకోండి..
దేశవ్యాప్తంగా రోజూ కొన్ని లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ప్రజా అవసరాలు, సరుకుల రవాణా కోసం ఇండియన్ రైల్వేస్ వేల సంఖ్యలో రైళ్లను నడుపుతోంది. టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించడం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే కొన్ని సందర్భాల్లో రైలు బయలుదేరే సమయానికి కౌంటర్ వద్ద క్యూ ఎక్కువగా ఉండటం వల్లనో లేదా టికెట్ కొనే సమయం లేకపోవడం వల్లనో కొందరు టికెట్ లేకుండానే రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. ఏది ఏమైనా టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించడం చట్టరీత్యా నేరం. రైళ్లలో ప్రయాణికులు అందరూ టికెట్ తీసుకున్నారా.. ఎవరైనా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా అన్నది పరీశీలించడానికి టీటీఈలు (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) ఉంటారు. వీరిలో కొంతమంది టికెట్ లేని ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. వేలాది రూపాయలు వసూలు చేస్తుంటారు. టికెట్ లేకపోతే ఏం చేయాలి.. రైళ్లలో రోజూ కొన్ని లక్షల మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తుంటారు. వీరిలో కొందరు టికెట్ లేకుండా ప్రయాణించే సందర్భం వస్తుంది. ఈ క్రమంలో కొందరు టీటీఈలు దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల లక్నో ఎక్స్‌ప్రెస్‌లో ఓ రైల్వే అధికారి ప్రయాణికుడిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతన్ని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసింది రైల్వే శాఖ. ఇలా అధికారులు ప్రవర్తించవచ్చా.. టికెట్ లేకుండా రైలు ఎక్కిన ప్రయాణికులు ఏం చేయాలి అన్న విషయాలు ఇక్కడ తెలుసుకుందాం... ఇదీ చదవండి: IRCTC: రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు టికెట్ లేకుండా రైలు ఎక్కిన ప్రయాణికులు మొదటగా టీటీఈని సంప్రదించి మీ పరిస్థితి గురించి వారికి తెలియజేయాలి. మీ వద్ద రిజర్వేషన్ టికెట్ లేకపోతే మీరు వెళ్ళాల్సిన గమ్య స్థానానికి అయ్యే టికెట్ ధరతో పాటు రూ.250 జరిమానా విధిస్తారు. అంటే మీరు రైలు ఎక్కిన ప్రదేశం నుండి గమ్యస్థానానికి అయ్యే చార్జీతో పాటు అదనంగా రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేశాక ఒకవేళ ట్రైన్లో సీట్లు కాళీ ఉంటే సీటును కూడా కేటాయిస్తారు. ఇదీ చదవండి: ఓటీపీలకు స్వస్తి.. ఆర్బీఐ కీలక ప్రతిపాదన! -
వందే భారత్‌లో పాడైపోయిన భోజనం?
దేశంలోనే సెమీహైస్పీడ్ రైళ్లుగా ప్రత్యేకతను చాటుకుంటున్నాయి వందే భారత్ రైళ్లు. సాధారణ రైళ్ల కంటే టికెట్ ధర ఎక్కువైనప్పటికీ.. త్వరగా గమ్యస్థానం చేర్చడం, ఇతర సదుపాయాల విషయంలో వందేభారత్ రైళ్లకు మంచి స్పందనే వస్తోంది. అయితే.. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న రైలులో ఓ ప్రయాణికుడికి భోజనం విషయంలో చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఎక్స్‌లో వందేభారత్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సిబ్బంది తీసుకొచ్చిన భోజనం నాసిరకంగా ఉండటమే కాకుండా, దుర్వాసన వచ్చింది. తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికుడు వెంటనే వీడియో తీశాడు. పాడైపోయిన భోజనం ఇచ్చారంటూ ఆ కస్టమర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన డబ్బులు తనకు రిటర్న్ చేయాలంటూ.. ఆ ఘటనంతా వీడియో రూపంలో బయటకు రావడంతో రైల్వే శాఖ స్పందించింది. ఫిర్యాదు అందిందని.. ఘటనపై దర్యాప్తు చేపడతామని రైల్వేస్‌సేవ తెలియజేసింది. ఫిర్యాదు వివరాల కోసం తమను సంపద్రించాలంటూ సదరు ఎక్స్ యూజర్‌కు సూచించింది. ఇక.. ఐఆర్సీటీసీ సైతం సదరు వీడియోపై స్పందించింది. అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూనే.. విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. దీనికి సర్వీస్ ప్రొవైడర్ పెనాల్టీ విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. @indianrailway__ @AshwiniVaishnaw @VandeBharatExp Hi sir I am in journey with 22416 from NDLS to BSB. Food that was served now is smelling and very dirty food quality. Kindly refund my all the money.. These vendor are spoiling the brand name of Vande Bharat express . pic.twitter.com/QFPWYIkk2k — Akash Keshari (@akash24188) January 6, 2024 Sir, our sincere apologies for the unsatisfactory experience you had. The matter is viewed seriously. A suitable penalty has been imposed on the service provider. Further the service provider staff responsible have been disengaged and the licensee has been suitably instructed.… — IRCTC (@IRCTCofficial) January 11, 2024 -
Indian Railways: అయోధ్యకు 1,000 రైళ్లు..
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారం¿ోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత జనవరి 23వ తేదీ నుంచి భక్తులకు దర్శనభాగ్యం కలి్పంచనున్నారు. ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు అయోధ్య పట్టణానికి పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు రైలు మార్గంలో అయోధ్యకు చేరేందుకు వీలుగా రైల్వే సరీ్వసులను భారీగా పెంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని రామాలయం ప్రారంభం అయిన రోజు నుంచి తొలి 100 రోజుల పాటు అయోధ్యకు వేయికిపైగా రైళ్లను నడిపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి. 19వ తేదీ నుంచే మొదలు! మందిర ప్రారం¿ోత్సవానికి కొన్ని రోజుల ముందు నుంచే ఈ అదనపు రైల్వే సరీ్వసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జనవరి 19వ నుంచి ఈ అదనపు రైళ్లను నడపాలని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. 100 రోజుల పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, నాగ్‌పుర్, లక్నో, జమ్మూ, పుణె, కోల్‌కతా సహా దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల నుంచి అయోధ్యకు రైళ్లు నడపనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీటితోపాటు కొన్ని రైళ్లను ప్రత్యేకంగా భక్తుల కోసం రిజర్వ్‌చేసి నడపనున్నారు. ప్రతిరోజూ ఈ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఆహారం అందించేందుకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికోసం ఈనెల 23 నుంచి రిజర్వేషన్ టికెట్ బుకింగ్‌కు అవకాశం కలి్పంచనున్నారు. అయితే దీనిపై రైల్వే శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అయోధ్యలోని రైల్వేస్టేషన్లో ఆధునికీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రోజుకు 50,000 మంది ప్రయాణికులు వచి్చనా ఎలాంటి ఇబ్బందులు పడకుండా సకల సదుపాయాలు అందుబాటులో ఉండేలా రైల్వేస్టేషన్‌ను నవీకరిస్తున్నారు. జనవరి 15వ తేదీ కల్లా స్టేషన్ పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత రామ్ లల్లా ప్రతిష్టాపన క్రతువు మొదలుపెట్టి దాదాపు పది రోజుల పాటు ’ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆలయ నిర్వహణ సంస్థ ప్రత్యేకంగా ఆహా్వనించడం తెల్సిందే. మోదీతోపాటు 4,000 మంది సాధువులు, వేలాది మంది ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. -
రైలే కళ్యాణ వేదిక!
కళ్యాణం వచ్చినా, కక్కొచ్చినా ఆగదు...అంటారు. కళ్యాణ ఘడియ ముంచుకొచ్చింది...అనుకున్నారేమో ఒక ప్రేమ జంట బెంగాల్–జార్ఖండ్ మూవింగ్ ట్రైన్లోనే దండలు మార్చుకున్నారు. ఆ తరువాత వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. వధువు భావోద్వేగానికి గురై ఏడ్చింది. ఈ ‘రైలు పెళ్లి’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బోగీలో ఉన్న ప్రయాణికులు ఈ పెళ్లి తంతు చూసి మొదట షాక్ తిన్నా ఆ తరువాత మాత్రం ఆశీర్వదించారు. ‘మల్టీ పర్సస్ ఇండియన్ రైల్వేస్’ ‘విమానంలో జరిగే పెళ్లి కంటే ఇది నయం. తక్కువ ఖర్చు కదా’... ఇలాంటి కామెంట్స్ నెటిజనుల నుంచి వచ్చాయి. ఇక మరో పెళ్లి విషయానికి వస్తే... దిల్లీకి చెందిన 27 సంవత్సరాల అవినాష్ కుమార్ డెంగ్యూ బారిన పడ్డాడు. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి. ఈలోపు పెళ్లిరోజు రానే వచ్చింది. దీంతో హాస్పిటల్లోనే వధువు మెడలో తాళి కట్టించి పెళ్లి చేశారు. -
వరల్డ్‌కప్ ఫైనల్.. క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త
క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. నవంబర్ 19న వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌కు వెళ్లే అభిమానుల రద్దీ దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మొత్తం నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. మూడు ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. మరొకటి ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు రైలు సర్వీసును నడపనున్నట్లు పేర్కొంది. ఈ రైళ్లు శనివారం సాయంత్రం ముంబై, ఢిల్లీ నుంచి బయలుదేరి మరుసటి రోజు(ఆదివారం) ఉదయం అహ్మదాబాద్‌కు చేరుకుంటాయని తెలిపింది. అంతేగాక అన్ని సాధారణ రైలు రిజర్వేషన్లు నిండినందున.. ప్రత్యేక రైలు టికెట్లు విమాన, మిగతా రైలు ఛార్జీల కంటే తక్కువ ధరలకే అందిస్తున్నట్లు చెప్పింది. ఈ రైలులో స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ. 620.. రూ.1,525కే 3ఏసీ ఎకానమీ బెర్త్.. రూ.1,665కే స్టాండర్డ్ 3ఏసీ.. రూ.3,490కే ఫస్ట్ క్లాస్ ఏసీ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా అహ్మాదాబాద్‌కు ప్రస్తుతం విమాన టికెట్ ధర రూ. 20,000 నుంచి రూ. 40,000 వరకు ఉంది. అదే విధంగా మ్యాచ్ ముగిసిన తరువాత అభిమానులు ప్రత్యేక రైళ్లలో తిరిగి వెళ్లే సదుపాయం కూడా కల్పిస్తుంది రైల్వే సంస్థ. అహ్మదాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు రైళ్లు బయల్దేరనున్నాయని చెప్పింది. ఈ ప్రత్యేక రైళ్లలో టిక్కెట్లను ప్రయాణికులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని తెలిపింది. చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ కాగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం సాయంత్రం వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే తుదిపోరులో టీమిండియా- అయిదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇరవై ఏళ్ల తర్వాత మరోసారి భారత్- ఆసీస్‌లు మరోసారి వరల్డ్ కప్ ఫైనల్లో ఈ రెండు జంట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఆసీస్-భారత జట్లు చివరగా 2003 వరల్డ్‌కప్ ఫైనల్లో తలపడ్డాయి. ఈ పోరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. సహా పలువురు ప్రముఖులు ప్రత్యేక్షంగా వీక్షించనున్నారు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌ను లక్ష పైచిలుకు మంది ప్రత్యక్షంగా చూడనున్నారు. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు దేశంలోనే కాకుండా విదేశాల్లోని అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీంతో అహ్మదాబాద్ వెళ్లవలసిన రోడ్డు, రైలు, ఆకాశ మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. ధరలన్నీ ఆకాశాన్ని అంటున్నాయి. ఏది ఎక్కినా చుక్కలు చూడటం ఖాయంగా మారింది. బసచేసే హోటళ్లు, తినే ఆహారం రేట్లు అన్నీ వేలు, లక్షల్లో పలుకుతున్నాయి. అసాధారణ ధరలతో ఉక్కిరి బిక్కిరవుతున్న క్రికెట్ అభిమానులకు రైల్వే ప్రకటించిన సదుపాయం కాస్తా ఊరటనిచ్చే అంశంగా మారింది. చదవండి: CWC 2023: టీమిండియా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే! -
రైలు ప్రయాణికులకు శుభవార్త.. ప్రతిఒక్కరికీ కన్ఫర్మ్డ్ టికెట్!
రద్దీ రైళ్లతో విసిగిపోయిన ప్రయాణికులకు శుభవార్త ఇది. 2027 నాటికల్లా ప్రతి రైలు ప్రయాణికుడికి కన్ఫర్మ్డ్ టికెట్ లభించనుంది. ఈ మేరకు రైళ్ల సంఖ్యను పెంచుతూ విస్తృత విస్తరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ వార్తా సంస్థ ఎన్డీటీవీ పేర్కొంది. దీపావళి పండుగ సందర్భంగా ఇటీవల ప్రయాణికులతో రద్దీగా మారిన ప్లాట్‌ఫామ్‌లు, రైళ్లలో కిక్కిరిసిన ప్రయాణికుల చిత్రాలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. ఛత్ పండుగ కోసం బిహార్ వెళ్లే రైలు ఎక్కే ప్రయత్నంలో 40 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ విస్తరణ ప్రణాళికలు చేపట్టనుండటం కోట్లాది మంది ప్రయాణికులకు ఊరటనిచ్చే విషయం. కొత్త రైళ్లు, ట్రాక్‌ల నిర్మాణం ఈ విస్తరణ ప్రణాళిక కింద ఏటా 4,000-5,000 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం జరుగనుంది. ప్రస్తుతం రోజుకు 10,748 రైళ్లు నడుస్తుండగా ఈ సంఖ్యను 13,000కు పెంచాలన్న ఈ ప్రణాళిక లక్ష్యంగా తెలుస్తోంది. రాబోయే మూడు నాలుగేళ్లలో 3,000 కొత్త రైళ్లను ట్రాక్‌లపైకి తీసుకురావాలనేది ప్రణాళిక అని రైల్వే వర్గాలు తెలిపాయి. అలాగే ఏటా 800 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుండగా ఈ సామర్థ్యాన్ని 1,000 కోట్లకు పెంచాలనేది కూడా విస్తరణ ప్రణాళికలో భాగం. ప్రయాణ సమయం తగ్గింపుపై దృష్టి ఇక రైళ్ల ప్రయాణ సమయాన్ని తగ్గించడంపైనా రైల్వే శాఖ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా మరిన్ని ట్రాక్‌ల నిర్మాణం, వేగాన్ని పెంచడానికి చర్యలు తీసుకోనుంది. రైల్వే శాఖ అధ్యయనం ప్రకారం, ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ప్రయాణంలో త్వరణం, వేగాన్ని పెంచితే రెండు గంటల ఇరవై నిమిషాలు ఆదా అవుతాయి. పుష్ అండ్ పుల్ టెక్నిక్ త్వరణం, వేగాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఏటా దాదాపు 225 రైళ్లు తయారవుతుండగా వీటిలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లలో యాక్సిలరేషన్, డీసిలరేషన్ సామర్థ్యం సాధారణ రైళ్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. -
‘వందే సాధారణ్’ ట్రయల్ రన్
ముంబై: రైల్వే శాఖ దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ‘వందే సాధారణ్’ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. తొలి వందే సాధారణ్ రైలును బుధవారం ముంబై–అహ్మదాబాద్ మధ్య విజయవంతంగా నడిపినట్టు రైల్వే శాఖ పేర్కొంది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్‌అవుతోంది. కొంతకాలం క్రితం ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లు దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో విజయవంతంగా నడుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం అదే తరహాలో ‘వందే సాధారణ్’ రైళ్లు తేవాలని రైల్వే శాఖ గతంలోనే నిర్ణయించడం తెల్సిందే. వందేభారత్ రైళ్లలో పూర్తిగా ఏసీ కోచ్‌లు ఉండగా ‘వందే సాధారణ్’ నాన్ ఏసీ కోచ్‌లతో నడవనున్నాయి. వీటిలో మొత్తం 22 స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. రెండువైపులా ఇంజన్లుండటం వీటి ప్రత్యేకత. సీసీటీవీ నిఘా, సెన్సార్ ఆధారిత సౌకర్యాలు, తదితర సదుపాయాలను ఈ కోచ్‌లలో కలి్పంచనున్నారు. ఒక్కో రైలులో 1,800 మంది దాకా ప్రయాణించవచ్చు. ఇవి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయని రైల్వే శాఖ చెబుతోంది. దేశంలో 500 కిలోమీటర్లు దాటిన ప్రఖ్యాతిగాంచిన పలు మార్గాల్లో ఈ కొత్తతరహా రైలు సరీ్వసులను ప్రారంభించాలని రైల్వేశాఖ యోచిస్తోందని సమాచారం. ముంబై– న్యూఢిల్లీ, పటా్న–న్యూఢిల్లీ, హౌరా–న్యూఢిల్లీ, హైదరాబాద్–న్యూఢిల్లీ, ఎర్నాకులం–గువాహటి మార్గాలు ఈ రూట్ల జాబితాలో ఉన్నాయి. -
బిహార్ రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా
బిహార్ రైలు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్ర గాయలయ్యాయి. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. బిహార్‌లో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి కామాఖ్య వెళ్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ బక్సర్ సమీపంలో పట్టాలు తప్పింది. 23 బోగీలున్న రైలులోని 21 బోగీలు పట్టాలు తప్పాయి. మూడు బోగీలు పల్టీలు కొట్టాయి. సమాచారం అందుకున్న రెస్యూ టీం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించింది. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టాలపై నుంచి బోగీలను అధికారులు తొలగిస్తున్నారు. దెబ్బతిన్న ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టారు. మృతుల కుంటుంబాలకు రూ.10 లక్షల పరిహారం రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రైల్వేశాఖ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున అందించనున్నట్లు పేర్కొంది. అదే విధంగా బిహీర్ సీఎం నితీష్ కుమార్ కూడా మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం ప్రకటించారు. చదవండి: కాంగ్రెస్ కీలక సమావేశం.. క్యాండీ క్రష్ ఆడుతూ ఛత్తీస్‌గఢ్ సీఎం రైలు ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పట్టాలు తప్పిన బోగీల నుంచి ప్రయాణికులు బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ప్రమాదంపై దర్యాప్తు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైలు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. దెబ్బతిన్న పట్టాల పునరుద్ధరించే ప్రక్రియ పూర్తయ్యిందని పేర్కొన్నారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని కోచ్‌లను తనిఖీ చేసినట్లు చెప్పారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను కూడా పరిశీలిస్తామని, దీనిపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. A Terrible Train Accident Happened Near #Buxar In Bihar Last Night 🙏🙏. #TrainAccident #NorthEastExpress pic.twitter.com/wiOSDCr7si — Sai Mohan 'NTR' (@sai_mohan_9999) October 12, 2023 బక్సర్ నుంచి బయల్దేరిన అరగంటలోపే.. 12506 నెంబర్ గల నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ బుధవారం ఉదయం ఢిల్లీలోని ఆనంద్ విహార్ టర్మినల్ నుంచి బయలు దేరింది. చివరి స్టేషన్ కామాఖ్యకు చేరుకోవడానికి 33 గంటల ప్రయాణించాల్సి ఉంటుంది. బక్సర్ స్టేషన్ నుంచి బయలుదేరిన అరగంట తర్వాత బుధవారం రాత్రి 9.53 గంటలకు రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. దాదాపు అన్నీ బోగీలు పట్టాలు తప్పాయి . పలు రైళ్ల రీషెడ్యూల్ నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ఆ మార్గంలో ప్రయాణించే మొత్తం 40 రైలు ప్రభావితమయ్యాయి. 21 రైళ్లను దారిమళ్లీంచగా.. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఎలక్ట్రిక్ వైర్లు, పోల్స్, రైలు పట్టాలు ధ్వసం అయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో సమాచారం, సాయం కోసం ప్రయాణికులకు రైల్వే అధికారులు అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. పాట్నా రైల్వే స్టేషన్- 9771449971 ధనాపూర్ రైల్వే స్టేషన్- 8905697493 అర జంక్షన్- 8306182542 కమర్షియల్- నార్త్ సెంట్రల్ రైల్వేస్- 7759070004 ప్రయాగ్‌రాజ్ 0532-2408128 0532-2407353 0532-2408149 కాన్పూర్ 0512-2323016 0512-2323018 0512-2323015 ఫతేపూర్ 05180-222026 05180-222025 05180-222436 తుండ్ల 05612-220338 05612-220339 05612-220337 ఇతావా 7525001249 అలీఘర్ 2409348 -
రైల్వే స్టేషన్లలో సరికొత్త సెక్యూరిటీ సిస్టమ్.. ఇక దొంగల ఆటకట్టు!
దేశంలోని రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రయాణికుల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు వార్తలు తరచూ వింటుంటాం. ఇలాంటి రైల్వే స్టేషన్లలో దొంగల ఆట కట్టించడానికి భారతీయ రైల్వే (Indian Railways) సరికొత్త భద్రతా వ్యవస్థను తీసుకొస్తోంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా వివిధ ప్రాంతాల్లో భద్రతను పెంచేందుకు సెంట్రల్ రైల్వే సర్వం సిద్ధం చేసింది. సెంట్రల్ రైల్వేస్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. త్వరలో 364 రైల్వే స్టేషన్లలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌తో కూడిన 3,652 కెమెరాలతో సహా మొత్తం 6,122 క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ (CCTV) కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రైల్‌టెల్‌తో రైల్వే బోర్డు అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. (iPhone 15: షాకింగ్.. బ్రేకింగ్! ఇదేం ఐఫోన్ భయ్యా.. వైరల్ వీడియో) "ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, వీడియో అనలిటిక్స్, వీడియో మేనేజ్మెంట్ సిస్టమ్‌తో కూడిన కెమెరాలు ప్రయాణికుల భద్రతను పెంపొందిస్తాయి. నేరాలను నియంత్రిస్తాయి. చట్టాన్ని దుర్వినియోగం చేసేవారిని అరికట్టగలవు. రైల్వే నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షిస్తాయి" అని ప్రకటనలో వివరించారు. కెమెరాలు ఇలా పనిచేస్తాయి.. రైల్వే స్టేషన్లోకి దొంగ ప్రవేశించగానే ఈ ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు గుర్తించి వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తాయి. ఇందుకోసం ఇదివరకే డేటాబేస్‌లో స్టోర్ అయిన దొంగల ఫేస్ సమాచారాన్ని ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు వినియోగించుకుంటాయి. ఈ కెమెరాలు కంటి రెటీనా లేదా నురురు వంటి ముఖ భాగాలను గుర్తించగలవు. ప్రతి హెచ్డీ కెమెరా సుమారు 750 జీబీ డేటాను వినియోగిస్తుంది. ఇక 4K కెమెరాలు నెలకు 3 టీబీ డేటాను వినియోగించుకుంటాయి. వీడియో ఫుటేజ్‌ను పోస్ట్ ఈవెంట్ అనాలిసిస్, ప్లేబ్యాక్, ఇన్వెస్టిగేషన్ ప్రయోజనాల కోసం 30 రోజుల పాటు నిల్వ చేయనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. -
కేంద్రం అనూహ్య నిర్ణయం.. హిస్టరీ క్రియేట్ చేసిన జయవర్మ సిన్హా
ఢిల్లీ: దేశ చర్రితలోనే మొదటిసారిగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా తొలిసారిగా మహిళను నియమించింది. జయవర్మ సిన్హాను కేంద్రం రైల్వే బోర్డు సీఈవో, ఛైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. రైల్వే బోర్డు సీఈవో, చైర్‌పర్సన్‌గా జయవర్మ సిన్హా నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దేశ చరిత్రలోనే రైల్వే బోర్డు సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళా అధికారి జయవర్మనే కావడం విశేషం. కాగా, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ అధికారిణి అయిన జయవర్మ.. ప్రస్తుతం రైల్వే బోర్డు సభ్యురాలిగా(ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్) ఉన్నారు. Congratulations 🌹🎉🙂 Jaya Verma Sinha, Indian Railway Management Services (IRMS), Member (Operations & Business Development), Railway Board appointed as Chairman & Chief Executive Officer (CEO), Railway Board: Govt of India. @RailMinIndia #WomenEmpowerment #RakshaBandangift pic.twitter.com/3kRFq3OesJ — Uppal Shah (@uppalshah) August 31, 2023 ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31వ తేదీ వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జయవర్మ సీఈవోగా కొనసాగనున్నారు. 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో సిన్హా చేశారు. నార్తర్న్ రైల్వే, సౌత్ ఈస్ట్ రైల్వే, ఈస్టర్న్ రైల్వేలో ఆమె పని చేశారు. ఆమె అలహాబాద్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కావడం విశేషం. కాగా, నేటి వరకు రైల్వే బోర్డు సీఈవోగా అనిల్ కుమార్ లహాటీ కొనసాగారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రధాని మోదీ చంద్రయాన్-3 విజయం సందర్భంగా మహిళల శక్తి గురించి ప్రత్యేకంగా చర్చించారు. మహిళలను అభినందించారు. మహిళల పాత్ర అనిర్వచనీయమని ప్రధాని మోదీ వారిని అభినందించి, మెచ్చుకున్నారు. అలాగే వారితో కలిసి గ్రూపు ఫోటో కూడా దిగారు. అటు మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మహిళా సాధికారతపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా డాటర్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఉంటే భారత్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోగలరు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధి మన దేశ స్వాభావిక లక్షణంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటే మహిళా శక్తితో సుసాధ్యంగా చేయవచ్చు అని చెప్పారు. ఇది కూడా చదవండి: జాబిల్లి పెరట్లో రోవర్ ఆటలు.. చంద్రయాన్ 3 న్యూ వీడియో.. -
ఇక రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు
సాక్షి, అమరావతి: భారతీయ రైల్వే మరింత ఆధునికతను సంతరించుకుంటోంది. విమానాల తరహాలో రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తద్వారా ప్రమాదాలు సంభవిస్తే సమగ్ర విశ్లేషణకు అవకాశం ఏర్పడనుంది. తొలిసారిగా వందే భారత్ రైళ్లలో బ్లాక్ బాక్సులు ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే రైల్వే కోచ్ ఫ్యాక్టరీలకు విధివిధానాలను నిర్దేశించింది. సెప్టెంబర్ నుంచి రూపొందించే రైళ్లలో బ్లాక్ బాక్సులు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. దీంతోపాటు రైలు ఇంజిన్లు, బ్రేకులు, ఇతర అంశాల్లో కూడా భద్రతా ప్రమాణాలను మెరుగుపరచనుంది. సీసీఆర్‌సీవీఆర్ పరిజ్ఞానంతో.. కేబిన్ క్రూ రెస్ట్ కంపార్ట్మెంట్ వీడియో రికార్డింగ్ (సీసీఆర్‌సీవీఆర్) సాంకేతిక పరిజ్ఞానంతో బ్లాక్ బాక్సులు తయారు చేస్తారు. విమానాల్లోని బ్లాక్ బాక్సులను కూడా అదే సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందిస్తున్నారు. చిత్తరంజన్‌లోని లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేసే వందేభారత్ రైళ్లలో ఈ బ్లాక్ బాక్సులను ప్రవేశపెడతారు. అందుకోసం డిజైన్లు ఖరారు చేశారు. సెప్టెంబర్‌లో తయారు చేసే వందేభారత్ రైళ్లలో వాటిని ప్రవేశపెట్టిన అనంతరం చెన్నైలోని ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీలో పరీక్షించి తుది ఆమోదం తెలుపుతారు. రైలు డ్రైవర్ కేబిన్‌లో అన్ని కదలికలను ఈ బ్లాక్‌బాక్సులు రికార్డు చేసి ఆడియో, వీడియో రూపంలో భద్రపరుస్తాయి. రైలు ఎలాంటి ప్రమాదానికి గురైనా ఆ బ్లాక్ బాక్సులో రికార్డు అయిన సమాచారం భద్రంగా ఉంటుంది. దీంతో ప్రమాద కారణాలను సహేతుకంగా విశ్లేషించి ఇకముందు జరగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. -
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: తక్కువ ధరకే మందులు!
దేశంలో అతిపెద్ద ప్రజా ప్రయాణ వ్యవస్థ రైల్వేలు. దేశవ్యాప్తంగా రోజూ లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్నిసార్లు ప్రయాణికుల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కొంత మంది ముందు జాగ్రత్తగా కొన్ని మందులు తమ వెంట తెచ్చుకున్నా చాలా మంది మందులు దొరక్క, ఒకవేళ దొరికినా అధిక ధరల కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి ఇబ్బందుల పరిష్కారానికి రైల్వే చర్యలు చేపట్టింది. ప్రయాణికుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ దేశంలోని రైల్వే స్టేషన్లలో తక్కువ ధరకు మందులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాల పేరుతో మెడికల్ స్టాల్స్ ప్రారంభించనుంది. ఇక్కడ ప్రయాణికులకు అవసరమైన వివిధ రకాల మందులు తక్కువ ధరకు విక్రయిస్తారు. ఈ అవుట్లెట్లు రైల్వేస్టేషన్లలోని రద్దీ ప్రదేశాలలో, కాన్కోర్స్‌లలో ఏర్పటు చేస్తారు. దీని వల్ల వచ్చీపోయే ప్రయాణికులందరికీ ప్రయోజనం కలుగుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. మొదట 50 స్టేషన్లలో.. పైలట్ ప్రాజెక్ట్ కింద మొదట ఎంపిక చేసిన 50 రైల్వే స్టేషన్లలో ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ జాబితాలో ఆనంద్ విహార్, దర్భంగా, శ్రీనగర్, మైసూర్, లక్నో తదితర ప్రధాన స్టేషన్లతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: Water Bottles in Trains: రైళ్లలో వాటర్ బాటిల్ కొంటున్నారా.. ఏ బ్రాండ్ అమ్మాలి.. రూల్స్ ఏంటి? రైల్వే డివిజన్ల ద్వారా గుర్తించిన ప్రదేశాలలో ఈ మందుల కేంద్రాలను లైసెన్సుల ద్వారా ఏర్పాటు చేసి నిర్వహిస్తారు. సంబంధిత రైల్వే డివిజన్ల ఆధ్వర్యంలో ఈ-వేలం ద్వారా ఈ స్టాల్స్ ను కేటాయిస్తారు. వీటిని ఎన్ఐడీ అహ్మదాబాద్ డిజైన్ చేస్తుంది. -
రైళ్లలో వాటర్ బాటిల్ కొంటున్నారా.. ఏ బ్రాండ్ అమ్మాలి.. రూల్స్ ఏంటి?
ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. రైలు ప్రయాణంలో ఎక్కువ మంది ఇబ్బందులు పడేది ఆహారం, నీళ్లతోనే. డబ్బు పెట్టినా సురక్షితమైన నీళ్లు లభించవు. చాలా సార్లు రైళ్లలో అసురక్షితమైన ఏవో లోకల్ బ్రాండ్ వాటర్ బాటిళ్లు విక్రయిస్తుంటారు. అయితే రైళ్లలో ఏ బ్రాండ్ వాటర్ బాటిళ్లు అమ్మాలో నిబంధనలు ఉన్నాయి. తాజాగా పోర్బందర్ ఎక్స్‌ప్రెస్ ప్యాంట్రీ కారు నుంచి అనధికారిక, నాసిరకం తాగునీటి బాటిళ్లను మొరాదాబాద్ రైల్వే స్టేషన్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం వాటర్ బాటిళ్ల విక్రయంపై ఓ సిబ్బందిలో ఒకరు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో రైల్వే అధికారులు వేగంగా చర్యలు తీసుకున్నారు. సుమారు 80 కేసులు లోకల్ బ్రాండ్‌కు చెందిన బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యుడైన మేనేజర్‌ను, మరికొంత మందిని అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే.. సీనియర్ డిప్యూటీ చీఫ్ మేనేజర్ (DCM) సుధీర్ కుమార్ సింగ్ ఈ సంఘటనపై మాట్లాడుతూ భారతీయ రైల్వేలలో ‘రైల్ నీర్’ బ్రాండ్ వాటర్ బాటిళ్లను మాత్రమే విక్రయించాలని, ఒకవేళ అవి అందుబాటులో లేకుంటే నిర్దిష్ట బ్రాండ్ నీటిని విక్రయించడానికి కచ్చితమైన ప్రోటోకాల్ ఉందని పేర్కొన్నారు. 'రైల్ నీర్' బ్రాండ్ వాటర్ బాటిళ్ల సరఫరా పుష్కలంగా ఉన్న నేపథ్యంలో వేరే బ్రాండ్లను విక్రయించాల్సిన పని లేదన్నారు. ‘రైల్ నీర్’ అనేది భారతీయ రైల్వేలో భాగమైన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRTC)కి చెందిన బాటిల్ వాటర్ బ్రాండ్. -
రైల్వేలో భారీగా ఉద్యోగాలు ఖాళీ.. మొత్తం ఎన్ని లక్షల పోస్టులంటే?
సాక్షి, అమరావతి: దేశంలో రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాల్సి ఉండటం గమనార్హం. ఈ మేరకు రైల్వేశాఖ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలిపిన సమాధానంలో పేర్కొంది. దేశంలో అత్యధిక ఉద్యోగులు కలిగిన ప్రభుత్వ విభాగంగా మొదటిస్థానంలో నిలిచిన రైల్వేశాఖ.. దేశంలో అత్యధికంగా పోస్టులు ఖాళీగా ఉన్న విభాగంగాను గుర్తింపు పొందింది. ఇక కీలకమైన ఆపరేషనల్ సేఫ్టీ విభాగంలో 53,178 పోస్టులు పెండింగులో ఉండటం గమనార్హం. దేశంలో అన్ని రైల్వేజోన్ల పరిధిలో కలిపి మొత్తం 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. వాటిలో అత్యధికంగా గ్రూప్–సి ఉద్యాగాలే 2.48 లక్షలు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్–ఏ ఉద్యోగాలు 1,965, గ్రూప్–బి ఉద్యోగాలు 105 ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా నార్తర్న్ రైల్వేలో 32,636 పోస్టులు ఖాళీగా ఉండగా, అత్యల్పంగా దక్షిణ పశ్చిమ రైల్వే జోన్లో 4,897 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చదవండి: టీడీపీ నేతకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు -
అరిస్తే నీ బిడ్డని విసిరేస్తా.. రైలులో తల్లిపై అత్యాచారం
కోల్‌కతా: మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా, దోషులను శిక్షిస్తున్న వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా చంటిబిడ్డతో కలిసి రైలు ప్రయాణం చేస్తున్న ఓ మహిళపై దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. అస్సాంలోని గుహవాటి నుంచి పశ్చిమబెంగాల్లోని అలీపుర్ద్వార్ వెళ్లే.. సిఫాంగ్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీపుర్దూర్ జిల్లాకు చెందిన మహిళ శనివారం మధ్యాహ్నం గౌహతిలో రైలు ఎక్కింది. అసోంలోని కోక్రాఝర్‌లో రైలు ఆగిన మూడో చివరి స్టేషన్లో కోచ్ ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. ఫకీరాగ్రామ్ జంక్షన్ వద్ద కోచ్‌లోని ఇతర ప్రయాణికులు దిగిన తర్వాత ఆ ఇద్దరు తనను కట్టేసి, కొట్టి అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. మరొకరు ఆమె ప్రతిఘటిస్తే నడుస్తున్న రైలులో నుండి తన బిడ్డను బయట విసిరేస్తానని బెదిరించినట్లు తెలిపింది. తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనప్పటికీ ఆ మహిళ ఎలాగోలా అలీపుర్దూర్ జంక్షన్లో రైలు దిగి చిన్నారితో కలిసి అధికారులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు గంటలలోపే నిందితులను పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. దర్యాప్తు కొనసాగుతోంది, ”అని అలీపుర్దువార్ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. -
కాజీపేట వ్యాగన్ల పరిశ్రమ రెండో అతిపెద్దది
కాజీపేట రూరల్: భారతీయ రైల్వేలోనే రెండో అతిపెద్ద రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ కాజీపేటలో నిర్మాణం కాబోతోందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురం గ్రామశివారులో ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్న రైల్వే వ్యాగ న్ల తయారీ పరిశ్రమస్థలాన్ని, అక్కడ జరుగుతున్న పను లను గురువారం అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైల్వేతోపాటు తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా కేంద్రం ప్రతిష్టాత్మకంగా ఈ పరిశ్రమను నిర్మిస్తుందన్నారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) సంస్థ సహకారంతో రొబొటిక్ సిస్టం ద్వారా నిర్మిస్తున్న రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్, రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమకు ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వ్యాగన్ల తయారీ పరిశ్రమకు ఆదారంగా వివిధ రకాల రోలింగ్ స్టాక్లను ఉత్పత్తి చేస్తుంద న్నారు. జిల్లాలో కొత్త పారి శ్రా మిక అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థను ప్రోత్స హి స్తుందని తెలిపారు. దీంతో ఈ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక పురోగతికి తోడ్పడుతుందన్నారు. రూ.521 కోట్ల వ్య యంతో 160.4 ఎకరాల విస్థీర్ణంలో నిర్మాణం కానున్న వ్యా గన్ల తయారీ పరిశ్రమలో నెలకు 200 వ్యాగన్ల పీరి యాడికల్ ఓవరాయిలింగ్ (పీవోహెచ్) చేసేందుకు వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్ మంజూరైందని, సంవత్సరానికి 1,200 వ్యాగన్లు, రెండో సంవత్సరానికి 2,400 వ్యాగన్లను ఉత్పత్తి చేస్తుందని వివరించారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మా ణం కానున్న వ్యాగన్ల తయారీ పరిశ్రమను 24 నెలల్లోపూర్తి చేసి 2025 సంవత్సరం నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాగన్ల తయారీ పరిశ్రమ వివరాలను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో సికింద్రాబాద్ డివిజన్ డీఆర్ఎం ఏకే గుప్తా, ఆర్వీఎన్ఎల్ సీపీఎం మున్నకుమార్ పాల్గొన్నారు. -
Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తగ్గేదేలే!
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్ల సక్సెస్ మాటేమోగానీ.. అధిక టికెట్ ధరలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. అయితే దూర ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉండడంతో నెమ్మదిగా సాధారణ ప్యాసింజర్ రైళ్లకు ప్రయాణికులు దూరమైపోతున్నారు. అయినప్పటికీ వందే భారత్ రైళ్లనే ప్రమోట్ చేసేందుకే భారతీయ రైల్వేస్ మొగ్గు చూపిస్తోంది. ఈ క్రమంలో.. వందే భారత్ రైళ్లలో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచడానికి టికెట్ ధరల్ని తగ్గించాలని నిర్ణయించింది. అయితే.. ఇక్కడే ఓ మెలిక ఉంది. తక్కువ దూరం ఉండే మార్గాల్లో నడిచే రైళ్లలో టికెట్ ధరలు తగ్గించాలని భారతీయ రైల్వేస్ భావిస్తోంది. పైగా తెలుగు రాష్ట్రాల రూట్లకు ఇది వర్తించబోదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఇండోర్-భోపాల్ వందే భారత్ రైలు ప్రయాణ సమయం మూడు గంటలు. జూన్ నెలలో 29 శాతం ఆక్యుపెన్సీతోనే నడిచింది ఈ రైలు. అలాగే.. భోపాల్-ఇండోర్ రూట్లో 21 శాతం ఆక్యుపెన్సీతో నడిచింది. అందుకే ఈ తరహా తక్కువ దూరం ఉన్న రూట్లో టికెట్ ధరల్ని తగ్గించాలని.. తద్వారా ఆక్యుపెన్సీ పెంచుకోవాలని భావిస్తోంది రైల్వేస్. ఇక ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లల్లో మాత్రం టికెట్ ధరలు యథాతధంగా కొనసాగించాలనుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నడుస్తున్న సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లకు ఆదరణ బాగుందని అధికారులు చెబుతున్నారు. దీంతో, టికెట్ ధరల తగ్గింపు ప్రతిపాదనలు ఈ రైళ్లకు లేవని స్పష్టత ఇచ్చేశారు. ఇదిగాక.. త్వరలోనే విజయవాడ - చెన్నై వందేభారత్ రైలు ప్రారంభం కానుంది. వచ్చే నెలలో మరో వందేభారత్ సికింద్రాబాద్ - పూణే మధ్య ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఆయా రూట్లలోనూ టికెట్ ధరలు అధికంగానే ఉండొచ్చని ఇప్పటికే అధికారులు సంకేతాలు కూడా ఇచ్చేశారు. ఇదీ చదవండి: ఇంతకీ కట్టప్ప ఎవరు? బాహుబలి ఎవరు? -
అది మన నిర్లక్ష్యానికి మూల్యమే!
నెల రోజుల క్రితం దిగ్భ్రాంతికి గురిచేసిన ఒరిస్సా ఘోర రైలు ప్రమాద ఘటనకు కారణాలు ఇప్పుడిప్పుడే విచారణలో బయటకొస్తున్నాయి. గడచిన మూడు దశాబ్దాలలో అతి దారుణమైనదిగా నమోదైన ఈ ప్రమాదానికి మానవ తప్పిదం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలే కారణమని రైల్వే శాఖ దర్యాప్తులో వెల్లడైనట్టు వస్తున్న వార్తలు మన భారతీయ రైల్వేలోని లోపాలకు అద్దం పడుతున్నాయి. అనేక స్థాయుల్లో లోపాల వల్లే 293 మంది ప్రాణాలను బలిగొన్న బాలాసోర్ ప్రమాదం జరిగినట్టు రైల్వే భద్రతా కమిషనర్ (సీఆర్ఎస్) ఎ.ఎం. చౌధరి తన దర్యాప్తు నివేదికలో తేల్చినట్టు తాజా సమాచారం. దాదాపు 1200 మందికి పైగా గాయపడిన ఈ ప్రమాదంపై భద్రతా కమిషనర్ దర్యాప్తు ఏం చెబుతుందా ఎదురుచూస్తున్న వేళ ఎట్టకేలకు గత నెల 28న నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించారు. మరోపక్క కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సైతం ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా అని నేర దర్యాప్తు చేస్తున్నందున ఈ తొలి నివేదికను బయటపెట్టడం లేదు. అయితేనేం, వివిధ మార్గాల్లో బయట కొచ్చిన ఈ నివేదికలోని అంశాలు మిగిలిన దర్యాప్తుకూ, సత్వరం చేపట్టాల్సిన చర్యలకూ స్పష్టమైన సూచికలుగా నిలిచాయి. రైల్వే సిబ్బందిని విచారించి, వాఙ్మూలాలను నమోదు చేసుకొని, అలాగే ప్రమాద స్థలం, రైల్వే ఆస్తులకు సంబంధించిన వివిధ కోణాలను పరిశీలించాక సీఆర్ఎస్ నివేదికను సిద్ధం చేశారు. దాదాపు 40 పేజీల నివేదికలో అవన్నీ పేర్కొన్నారు. ఒరిస్సాలోని బాలాసోర్ వద్ద బాహానగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 2న జరిగిన ఈ రైలు ప్రమాదంలో చెన్నై – కోల్‌కతా ‘కోరమాండల్ ఎక్స్‌ప్రెస్’ అప్ – లూప్ లైనులోకి ప్రవేశించి, అప్పటికే ఆ లైనులో ఉన్న ఓ గూడ్స్ రైలును గుద్దుకుంది. అలా ఆ రెండు రైళ్ళు గుద్దుకోవడంతో బోగీలు పట్టాలు తప్పి, పక్కనే మరో పట్టాలపై వెళుతున్న బెంగుళూరు – హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని చివరి కొద్ది బోగీలపై పడడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ (ఎస్ అండ్ టి) విభాగంలో అనేక స్థాయుల్లో లోపాలతోనే ఇంతటి ప్రమాదానికి కారణమైందన్న నివేదిక సారాంశం అత్యంత కీలకం. ఈ ఘోర రైలు ప్రమాదానికి ప్రాథమిక కారణమేమిటనే విషయంలో నెలకొన్న గందరగోళాన్ని సీఆర్ఎస్ నివేదిక పోగొట్టిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా మూడు అంశాలను ఈ నివేదిక బయట పెట్టింది. ఒకటి – గతంలో 2018లో ఒకసారి, తాజా ప్రమాద ఘటనకు కొద్ది గంటల ముందు మరో సారి చేసిన మరమ్మతులు అరకొరగా, నిర్లక్ష్యపూరితంగా సాగాయి. ఫలితంగా సిగ్నలింగ్ వ్యవస్థ రాజీ పడ్డట్టయింది. రెండు – పదేపదే చేస్తూ వచ్చిన తప్పుల్ని ముందుగా పసిగట్టివుంటే, ఈ ఘోరం జరిగి ఉండేది కాదు. వివరంగా చెప్పాలంటే, 2018లో కేబుల్ లోపం తలెత్తింది. దాన్ని సరిచేసినా, కీలకమైన సర్క్యూట్ బోర్డ్‌పై దాన్ని మార్క్ చేయలేదు. లోపం సరిచేసేందుకు అప్పట్లో సర్క్యూట్ షిఫ్టింగ్ పని చేశారు. అందుకు ప్రామాణిక పద్ధతులేమీ పాటించనే లేదు. పైపెచ్చు టెర్మినల్స్ మీద అక్షరాలు తప్పుగా పేర్కొన్నారు. అయిదేళ్ళుగా అలక్ష్యం చేసిన ఆ లోపభూయిష్ఠమైన పని ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చింది. మూడు – తప్పుడు వైరింగ్, కేబుల్ ఫాల్ట్ వల్ల తలెత్తే సమస్యలేమిటో నిరుడు పశ్చిమ బెంగాల్లోనే చూశారు. అయినా సరే దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. అలాగే బాహానగా బజార్ రైల్వేస్టేషన్‌కు సరిపడేలా ముందస్తు ఆమోదంతో సర్క్యూట్ డయా గ్రమ్ను మార్చి ఉన్నా రాంగ్ సిగ్నలింగ్ అయ్యేది కాదు. ఈ ఘోరం జరిగేది కాదు. ఎస్ అండ్ టి విభాగాన్ని వేలెత్తి చూపే ఈ లోపాలే కీలకమైన వేళ ఘోర ప్రమాదానికి కారణమై, అమాయకుల్ని బలిగొన్నాయని నివేదిక చెబుతున్న మాట. ఇక, రైల్వేలలో ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్ విధానానికి కీలక కేంద్రస్థానం రిలే రూమ్. రైళ్ళను నియంత్రించే మెకానిజమ్‌లు, అలాగే లెవల్ క్రాసింగ్లకు సంబంధించిన సిగ్నలింగ్ సామగ్రి అయిన ‘రిలే హట్స్’ ఈ రిలే రూమ్‌లలోనే ఉంటాయి. అలాంటి రూమ్ ఏ స్థాయి వారికి, ఎలా అందుబాటులో ఉండాలనే విషయంలోనూ అనేక లోపాలున్నాయి. సీఆర్ఎస్ నివేదిక ఈ సంగతీ వెల్లడించింది. నివేదికను సమర్పణకు సరిగ్గా కొద్ది రోజుల ముందే రిలే రూమ్‌కు ఒకటికి రెండు తాళాలు వేయాలని రైల్వే నిర్ణయించడం గమనార్హం. ఎప్పుడో 2018లో జరిగిన తప్పు ఇప్పుడు ప్రాణాలు బలి తీసుకుందంటే, క్రమం తప్పకుండా చేయాల్సిన చెకింగ్లు సవ్యంగా సాగడం లేదనే! రైల్వే స్టేషన్లలో మార్పులు చేసిన సర్క్యూట్లన్నీ సవ్యంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి, పరీక్షించడానికి ఇకపై ప్రత్యేక బృందాన్ని నియోగించాలని సీఆర్ఎస్ సిఫార్సు చేయడం గమనార్హం. అలాగే, ప్రమాద సందర్భంలో సత్వర స్పందనకు జోనల్ రైల్వేలలో ఏర్పాట్లను సమీక్షించాలంది. కళ్ళెదుటే లోపాలు కనిపిస్తున్నాయి గనక ఇకనైనా నిద్ర మేల్కోవాలి. లోపరహిత వ్యవస్థను సృష్టించాలి. అయితే, అందుకు అవసరమైన ప్రాథమిక వసతుల కల్పన ఎంతో ఖర్చుతో, శ్రమతో కూడింది. దీర్ఘకాలికమైన ఆ పని చేయాలంటే రాజకీయ కృత నిశ్చయం ఉండాలి. రైల్వేలో భారీగా పెట్టుబడి పెట్టాలి. పార్టీల తేడాలు లేకుండా కేంద్రంలో గద్దె మీదున్న ప్రతి ప్రభుత్వంలోనూ అవి కొరవడ్డాయి. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే సవ్యంగా నడవాలంటే బండికి నట్లు, బోల్టులు అన్నీ సక్రమంగా బిగించి ఉండడం అవసరమని ఇకనైనా గ్రహించాలి. ఎడాపెడా వందే భారత్ రైళ్ళ కన్నా ప్రస్తుతం ఇదే ఎక్కువ అవ సరం! ఒరిస్సా దుర్ఘటన, దానిపై సీఆర్ఎస్ నివేదిక ఆ సంగతే గుర్తు చేస్తున్నాయి. గుర్తుపట్టే నాథుడు లేక ఇప్పటికీ బాలాసోర్‌లో పడివున్న 80కి పైగా మృతదేహాలూ మౌనంగా ప్రశ్నిస్తున్నాయి. -
చైన్ లాగకుంటే పరిస్థితి ఏంటి!.. విరిగిన చక్రంతో 10 కి.మీ. ప్రయాణించిన రైలు!
భోపాల్: బిహార్‌లో ఓ ప్రయాణికుల రైలుకు భారీ ప్రమాదం తప్పింది. ముజఫర్‌పూర్‌లో ముంబయి వెళ్లే పవన్ ఎక్స్‌ప్రెస్ చక్రం విరిగి 10 కిలోమీటర్ల వరకు ప్రయాణించడమే అందుకు కారణం. ఆదివారం అర్థరాత్రి భగవాన్‌పూర్ రైలు వద్ద ముజఫర్‌పూర్-హాజీపూర్ రైలు సెక్షన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి పవన్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. కాస్త దూరం ప్రయాణించి తర్వాత ప్యాసింజర్లకు S-11 కోచ్‌లో పెద్ద శబ్దాలు వినిపించాయి. భారీ ప్రమాదం తప్పింది అయితే, వేగంగా వెళుతున్న రైలు భగవాన్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పటికీ సమస్యను గుర్తించే ప్రయత్నాలు జరగలేదని సమాచారం. రైలు భగవాన్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరగా.. ఆ శబ్ధంలో ఏ మార్పు రాకపోవడంతో ప్రయాణికులకు ఆనుమానం వచ్చి చైన్ లాగేసి రైలును ఆపేశారు. తక్షణమే ట్రైన్లో ఏదో సమస్య ఉందని రైల్వే ఉద్యోగులతో పాటు రైలు డ్రైవర్, గార్డులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది జరిపిన తనిఖీలో, S-11 కోచ్ చక్రం విరిగిందని కనుగొన్నారు. దీని తర్వాత రైల్వే ఇంజనీర్లు, ఉద్యోగులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలుకు మరమ్మతులు చేయగా, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ‘పవన్ ఎక్స్‌ప్రెస్ చక్రం విరిగిపోయిందని మాకు సమాచారం అందింది. వెంటనే మా బృందం అక్కడికి చేరుకొని మరమ్మతులు నిర్వహించింది’ అని రైల్వే అధికారి వీరేంద్ర కుమార్ వెల్లడించారు. కాగా జూన్ 2న బాలాసోర్ రైలు ప్రమాదంలో 290 మందికి పైగా మరణించిన 1,000 మందికి పైగా గాయపడిన ఘటన మరవకముందే ఇది చోటు చేసుకోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. చదవండి: ఆ మేక.. అతన్ని కంటితోనే చంపేసింది..! -
రైలు మొత్తం బుకింగ్ చేసుకోవచ్చని తెలుసా?.. ఎంత ఖర్చవుతుందంటే!
భారతీయ రైల్వే.. దేశంలో సామాన్యులకు ప్రధాన రవాణా వ్యవస్థ. ప్రతిరోజు సుమారు కొన్ని కొట్ల మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద రైలు నెట్వర్క్ కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. నేడు భారతీయ రైల్వే దేశంలోని ప్రతీ ప్రాంతానికీ విస్తరించింది. అయితే రోజూ వేలాది రైళ్లు నడుస్తున్న రైలు టికెట్ పొందడం మాత్రం కష్టతరంగా మారుతోంది. రైలు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటం, జనాభాకు సరిపడా రైళ్లు అందుబాటులో లేకపోవడం వంటి తదితర కారణాలతో నెల రోజుల ముందు బుక్ చేసుకున్నా టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇక అత్యవసరంగా బుక్ చేస్తే తప్పక వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండిపోతుంది. ఒకటి రెండు టికెట్ల బుకింగ్ కోసమే అష్టకష్టాలు ఎదుర్కొంటున్న ఈ రోజుల్లో ఏకంగా కొన్ని కోచ్‌లు, లేదా రైలు మొత్తం బుక్ చేసుకోనే సదుపాయం ఉన్నదన్న విషయం అందరికీ తెలిసి ఉండదు. ఒకవేళ తెలిసినా దాన్ని ఎలా బుక్ చేసుకోవాలనే దానిపై అవగాహన ఉండకపోవచ్చు.. అయితే రైలు, కోచ్‌లను ఎలా బుక్ చేసుకోవాలి, ఏ నిబంధనలు పాటించాలి, ఏ డాక్యుమెంట్లు అందించాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ రైల్వే సంస్థకు చెందిన IRCTC FTR యాప్ ద్వారా మొత్తం రైలు, లేదా కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ ఎఫ్‌టీఆర్‌లో రైలు బుక్ చేసుకుంటే అన్ని రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణించవచ్చు. కేవలం కోచ్ మాత్రమే బుక్ చేసుకోవాలనుకుంటే.. రైలు 10 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ ఆగిన స్టేషన్లలో మాత్రమే ప్రత్యేక కోచ్‌ను యాడ్ చేయడం, తొలగించడం జరుగుతుంది. అన్ని రైళ్లలో ఈ కోచ్‌లను జోడించడం సాధ్యం కాదు. బుకింగ్ వ్యవధి.. FTR రిజిస్ట్రేషన్ ప్రయాణ తేదికి గరిష్టంగా 6 నెలల ముందు.. కనీసం 30 రోజుల ముందు చేసుకోవచ్చు కోచ్ బుకింగ్.. సాంకేతిక సదుపాయాలను అనుసరించి FTRలో ఒక రైలులో కనిష్టంగా రెండు కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. రెండు స్లీపర్ కోచ్‌లు..అదే గరిష్టంగా 24 కోచ్‌లు బుక్ చేసుకోవచ్చు. చదవండి: ఆ దేశంలో వాడుకలో 840 భాషలు.. భారత్‌లో ఎన్ని భాషలంటే.. సెక్యూరిటీ డిపాజిట్.. ఆన్లైన్ బుకింగ్‌లో ప్రయాణానికి సంబంధించిన ప్రతి వివరాలను నమోదు చేయాలి. ప్రయాణ వివరాలు, కోచ్ వివరాలు, రూట్, ఇతర వివరాలను ఆన్లైన్ ఫామ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఒక్కో కోచ్‌కు రూ. 50,000/- సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఒకవేళ 18 కోచ్‌ల కంటే తక్కువ ఉన్న రైలు బుకింగ్ కోసం కూడా 18 కోచ్‌లకు రిజిస్ట్రేషన్ మొత్తాన్ని..అంటే రూ. 9 లక్షలు చెల్లించాల్సిందే. ఏడు రోజుల వరకు కోచ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత, రోజుకు/కోచ్‌కి అదనంగా రూ. 10,000 చెల్లించాలి. బుకింగ్ విధానం ►రైలు లేదా కోచ్‌ని బుక్ చేసుకోవడానికి, ముందుగా IRCTC అధికారిక FTR వెబ్సైట్ www.ftr.irctc.co.in కి వెళ్లాలి. ►ఇప్పుడు మీ ఖాతాను ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి. ఇప్పటి వరకు మీకు అకౌంట్ లేకపోతే కొత్తగా నమోదు చేసుకోవాలి. ►పూర్తి కోచ్ బుకింగ్ కోసం FTR సర్వీస్ ఎంపికను ఎంచుకోండి. ►ఆ తర్వాత అవసరమైన మొత్తం సమాచారాన్ని నమోదు చేయండి. ►ఆ తర్వాత ఫీజు చెల్లించాలి.. అంతే మీ ప్రయాణం బుక్ అయినట్లే. గుర్తుంచుకోవాల్సిన విషయాలు.. IRCTCలో మొత్తం రైలు లేదా కోచ్‌ను బుక్ చేసేటప్పుడు మీ ప్రయాణ తేదీకి కనీసం ఆరు నెలల ముందుగానే బుక్ చేసుకోవడం ఉత్తమం. అయితే మీరు సెక్యూరిటీ డిపాజిట్‌గా అందించిన మొత్తాన్ని ప్రయాణం పూర్తయిన తరువాత తిరిగి రిఫండ్ చేస్తారు. అంతేగాక IRCTC మొత్తం రైలు, కోచ్ కోసం క్యాటరింగ్ సేవలను సైతం అందిస్తుంది.. దీనిని ముందుగానే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కారణం చేత మీ బుకింగ్‌ను రద్దు చేస్తే, మీకు రిజిస్ట్రేషన్ డబ్బులు అందవు. -
మన వ్యవస్థ పట్టాలు తప్పిందెక్కడ?
భారతదేశంలో రైళ్ల వేగం సగటున గంటకు 50 కిలోమీటర్లు మాత్రమే ఉన్నప్పటికీ, ప్రమాదాలు జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన రైల్వే వ్యవస్థలున్న దేశాలలో ప్రమాదాలు అత్యంత అరుదు. ప్రధాన ట్రంక్ రూట్లలో తీవ్రమైన రద్దీ అనేది రైళ్ల వేగంలో స్తబ్ధతకూ, అభద్రతకూ దోహదపడే ప్రాథమిక అంశంగా ఉంటోంది. 1950లో చైనా రైలు నెట్ వర్క్ పొడవు భారత్‌తో పోలిస్తే సగం కంటే తక్కువ. కానీ, ప్రస్తుతం చైనా మొత్తం రైలు మార్గం పొడవు భారత్ కంటే రెండు రెట్లు ఎక్కువ. గత 20 సంవత్సరాలుగా, భారతీయ రైల్వేలు విమాన, రోడ్డు రవాణాకు తన మార్కెట్ వాటాను స్థిరంగా కోల్పోతున్నాయి. కొత్త లైన్ల నిర్మాణం చేపట్టడం, ఉన్నవి అప్‌గ్రేడ్ చేయడమే శరణ్యం. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో రెండు ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు, ఒక నిలిచివున్న సరుకు రవాణా రైలు ఢీకొనడం, బహుశా గత 20 సంవత్సరాల్లో జరిగిన ఘోరమైన రైలు ప్రమాదం కావచ్చు. ఇటీవలి అధికారిక గణాంకాల ప్రకారం, ఇది 275 మరణాలకు దారితీసింది. 1,000 కంటే ఎక్కువ మంది గాయపడ్డారు. 2002 జూన్ 24న టాంజా నియాలో జరిగిన చివరి రైలు ప్రమాదం చాలామంది మరణాలకు కారణమైంది. ఒక ప్రయాణీకుల రైలు ఒక సరుకు రవాణా రైలు పర్వత ప్రాంత రైలు మార్గంలో ఢీకొనడంతో 281 మంది చని పోయారు. వేగం తక్కువ ప్రమాదాలు ఎక్కువ ఈ వాస్తవాలను పరిశీలిస్తే భారత్‌లో రైలు భద్రతా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. జపాన్, చైనా, టర్కీ వంటి అభివృద్ధి చెందిన రైల్వే వ్యవస్థలు... ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, స్వీడన్, బ్రిటన్ వంటి అనేక యూరోపియన్ దేశాలలో ప్రయాణీకుల రైళ్ల ప్రమాదాలు అత్యంత అరుదు, అసాధారణం. ఈ రైల్వేలలో, అనేక ప్యాసింజర్ రైళ్లు గరిష్ఠంగా గంటకు 200–350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటి సగటు వేగం గంటకు 150–250 కిలోమీటర్లు. భారతదేశంలో రైళ్ల వేగం గంటకు దాదాపు 50 కిలోమీటర్లు. ఇంత తక్కువ వేగం ఉన్నప్పటికీ, ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. భద్రతా పనితీరు ఆధారంగా ప్రపంచంలోని ప్రధాన రైల్వేల ర్యాంకింగులను సిద్ధం చేస్తే, భారతదేశం బహుశా ఈజిప్ట్, మెక్సికో, టాంజా నియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైజీరియా, ఇంకా పాకిస్తాన్ దేశాల కంటే కొంచెం పైస్థాయిలో మాత్రమే ఉంటుంది. వాయు, రోడ్డు రవాణాల వేగవంతమైన సాంకేతిక అభివృద్ధితో సమర్థవంతంగా పోటీ పడటానికి, అభివృద్ధి చెందిన దేశాలు 1970 నుండి ఉనికిలో ఉన్న తమ రైలు నెట్‌వర్క్‌లను విస్తరింపజేసుకుంటూ ఆధునికీకరించడం ప్రారంభించాయి. దాని భౌగోళిక పరిమాణం, జనాభా సారూప్యతల కారణంగా భారత్‌కు చైనా మంచి పోలిక అవు తుంది. 1950లో చైనా రైలు నెట్ వర్క్ మొత్తం పొడవు (21,800 కి.మీ.) భారతదేశంతో (53,596 కి.మీ.) పోలిస్తే సగం కంటే తక్కువ. భారతదేశ మొత్తం రైలు మార్గం పొడవును (62,900 కి.మీ.) 1997 నాటికి చైనా (66,000 కి.మీ.) అధిగమించింది. ప్రస్తుతం చైనా మొత్తం రైలు మార్గం పొడవు (1,55,000 కి.మీ.). ఇది భారతదేశం (68,100 కి.మీ.) కంటే రెండు రెట్లు ఎక్కువ. చైనా తన నెట్‌వర్క్‌ను దాదాపు రెండు దశల్లో అప్‌గ్రేడ్ చేసింది. 1995 నుండి 2010 వరకు, దాని ఎనిమిది ట్రంక్ రూట్లలో (నాలుగు నిలువు, నాలుగు అడ్డం) ముందునుంచీ ఉన్న లైన్లలో గంటకు 200–250 కిలోమీటర్ల వేగాన్ని సాధించడంపై దృష్టి పెట్టింది. తరువాత, గంటకు 200–250 కిలోమీటర్లు (హై స్పీడ్), గంటకు 300–350 కిలోమీటర్ల (అల్ట్రా హై స్పీడ్) వేగంతో నడిచే ప్యాసింజర్ రైళ్ల కోసం ప్రత్యేకంగా కొత్త లైన్లను నిర్మించింది. ప్రస్తుతం, ఇది మొత్తం 16 (ఎనిమిది నిలువు, ఎనిమిది క్షితిజ సమాంతరాలు) ట్రంక్ మార్గాలను విస్తరించే పనిలో ఉంది. 2030 నాటికి, మొత్తం రైలు మార్గం పొడవు 1,75,000 కిలోమీటర్లకు పెంచడానికి ప్రణాళిక రూపొందించారు. వీటిలో దాదాపు 55,000 కి.మీ. హై స్పీడ్, అల్ట్రా హై స్పీడ్ లైన్లుగా ఉంటాయి. రద్దీయే అసలు సమస్య భారత రైల్వే బోర్డు 2017–18లో ప్రాజెక్ట్ మిషన్ రఫ్తార్‌ను ప్రకటించింది. గంటకు 25 కిలోమీటర్లు ఉన్న సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని రెట్టింపు చేయడం, ప్యాసింజర్ రైళ్ల వేగాన్ని ఐదేళ్లలో గంటకు 50 కి.మీ. నుండి 75 కి.మీ. వరకు పెంచడం లక్ష్యాలుగా దీన్ని ప్రకటించింది. కానీ, ‘కాగ్ ఆఫ్ ఇండియా’ తన నివేదికలో పేర్కొ న్నట్లుగా, ఈ ప్రణాళిక రైళ్ల వేగాన్ని పెంచడానికి దారితీయలేదు. చైనాలా భారతదేశం తన ప్రధాన ట్రంక్ మార్గాల్లో, ముఖ్యంగా స్వర్ణచతుర్భుజి, దానితోపాటు ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతాలను కలిపే కర్ణాలలో కొత్త జంట లైన్లను నిర్మించలేదు. భారతీయ రైల్వే ప్రధాన ట్రంక్ రూట్లలో తీవ్రమైన రద్దీ అనేది రైళ్ల వేగంలో స్తబ్ధతకూ, భద్రత విషయంలో పేలవమైన రికార్డ్కూ దోహదపడే ప్రాథమిక అంశంగా ఉంటోంది. గత 20 సంవత్స రాలుగా, భారతీయ రైల్వేలు విమాన, రోడ్డు రవాణాకు తన మార్కెట్ వాటాను స్థిరంగా కోల్పోతున్నాయి. సుమారు 10,000 కి.మీ.ల ట్రంక్ రూట్లలో సామర్థ్యం 125 శాతానికి మించి ఉంటోంది. ఈ తీవ్రమైన రద్దీ కారణంగా రైల్వే ట్రాక్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్ నిర్వహణ వ్యవస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇది సమయపాలన లేక పోవడానికి దారితీస్తోంది. దీనివల్ల మితిమీరి పని చేయా ల్సిన డ్రైవర్లు, స్టేషన్ మాస్టర్లు, ట్రాక్‌మెన్ వల్ల భద్రతపై ప్రతికూల ప్రభావం పడుతోంది. 2005లో, రైల్వే బోర్డు 2,843 కి.మీ. పొడవుతో రెండు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను (డీఎఫ్‌సీలు) నిర్మించాలని నిర్ణయించింది. భవిష్యత్తులో మరో మూడు కారి డార్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ డీఎఫ్‌సీలు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి మరో రెండు నుండి నాలుగేళ్లు పట్టవచ్చు. ప్రత్యేక ప్యాసింజర్ లైన్లకు బదులుగా ప్రత్యేక సరకుల లైన్లను నిర్మించడంలోని అనుచితాన్ని గ్రహించి, రైల్వే బోర్డు మరిన్ని డీఎఫ్‌సీలను నిర్మించే ప్రణాళికను వాయిదా వేసినట్లు కనిపిస్తోంది. అనూహ్య వ్యయం భారతదేశం 2017లో ముంబై, అహ్మదాబాద్ మధ్య స్టాండర్డ్ గేజ్‌లో స్వతంత్ర అల్ట్రా హై స్పీడ్ (బుల్లెట్ రైలు) లైన్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇలాంటి మరిన్ని లైన్ల కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలను (డీపీఆర్‌లు) తయారు చేశారు. అనధికార అంచనాల ప్రకారం, ఈ లైన్‌కు ప్రతి కిలోమీటర్‌కు రూ.350 కోట్లు ఖర్చు అవు తుంది. ఈ వ్యయం 160 కిలోమీటర్ల సెమీ హైస్పీడ్ లైన్ కంటే 10 రెట్లు ఎక్కువ. అలాగే గంటకు 200–250 కిలోమీటర్ల హైస్పీడ్ లైన్ నిర్మాణ వ్యయం కంటే ఏడు రెట్లు ఎక్కువ. ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు లైన్ నిర్మాణ పురోగతి నెమ్మదిగా ఉండగా, మరిన్ని బుల్లెట్ రైలు మార్గాలను నిర్మించే ప్రణాళిక కూడా మందకొడిగా ఉంది. బ్రాడ్ గేజ్ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, భారతదేశం గంటకు 200–250 కిలోమీటర్లు ప్రయాణించే హై స్పీడ్ లైన్లను నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న 15,000 కిలోమీటర్ల ట్రంక్ మార్గాలను 160–200 కిలోమీటర్ల వేగానికి అప్‌గ్రేడ్ చేయాలి. దీనికీ, 10,000 కి.మీ. హై స్పీడ్ బ్రాడ్ గేజ్ లైన్ల నిర్మాణానికీ కలిపి దాదాపు రూ.7 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీన్ని 15 సంవత్సరాలలో పూర్తి చేయవచ్చు. ఈ విస్తరించిన, అప్‌గ్రేడ్ చేసిన నెట్వర్క్... 2060–2070 వరకు ప్రయాణికులు, సరకు రవాణా రెండింటి అవసరాలను తీర్చ గలిగే తగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తద్వారా రైల్వేలు భారత దేశ రవాణాకు జీవనాధారంగా తమ పాత్రను తిరిగి పొంద గలుగుతాయి. అలోక్ కుమార్ వర్మ వ్యాసకర్త ‘ఇండియర్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్’ (ఐఆర్ఎస్సీ)లో పనిచేశారు. (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
కలకలం రేపుతున్న వీడియో.. రైలు పట్టాలపై రాళ్లు పెట్టి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): రైలు పట్టాలపై ఒక బాలుడు రాళ్లు పెట్టిన వీడియో ఒకటి కర్ణాటక రాష్ట్రంలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఒక బాలుడు రైలు పట్టాలపై రాళ్లను వరుసగా పేర్చాడు. కొందరు ఆ బాలుడిని పట్టుకుని రాళ్లు ఎవరు పెట్టమన్నారని అడుగుతున్నారు. అయితే తనకు ఎవరూ ఇలా చేయమని చెప్పలేదని పోలీసులకు అప్పగించవద్దని ఏడుస్తూ వేడుకోవడం, తరువాత ఆ బాలుడిని వదిలేయడం రికార్డయ్యాయి. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందీ తెలీడం లేదు. ఈ వీడియోను కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్విన్ వైష్ణవ్ రైల్వే ఉన్నతాధికారులకు ట్యాగ్ చేసి ఇది చాలా సీరియస్ విషయమని, దీనికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఓ బాలుడు రైలు పట్టాలపై రాళ్లు పెట్టిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఓ వ్యక్తి సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ⚠️ Shocking: Another #TrainAccident Averted. An underage boy was caught sabotaging the railway Track this time in #Karnataka. We have tens of thousands of Kms of railway tracks and forget adults now even kids are being used for sabotaging and causing deaths. This is a serious… pic.twitter.com/URe9zW4NgG — Arun Pudur (@arunpudur) June 5, 2023 చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: మృతదేహాలలో నుంచి ఒక చేయి అతనిని పట్టుకోగానే... -
కీలక మైలు రాళ్లు, అనేక విషాదాలు:170 ఏళ్ళ రైల్వే ఘన చరిత్ర ఇది!
ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అంతర్జాతీయ మీడియా దృష్టి సారించింది. 21వ శతాబ్దంలో జరిగిన ఈ అతి పెద్ద రైలు దుర్ఘటన వివరాలు ఇస్తూనే భారత రైల్వేల చరిత్రను, దాని విశిష్ఠతను ఈ ప్రపంచ వార్తాసంస్థలు అందరికీ తెలియజేస్తున్నాయి. బ్రిటిష్ వారి పాలనలోని భారతదేశంలో 1853లో అంటే 170 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన భారత రైల్వే వ్యవస్థ శరవేగంతో అభివృద్ధి సాధించింది. దేశంలో ప్రయాణికులను వారి గమ్యాలకు చేర్చడమేగాక, ఇతర సాంప్రదాయ సరకు రవాణా పద్ధతులతో పోల్చితే రైల్వేలు అంతే సామర్ధ్యంతో, ఇంకాస్త చౌకగా వస్తు రవాణా చేయడం ద్వారా భారత ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోంది. 1991 నుంచీ దేశ ఆర్థికవ్యవస్థతో పాటే రోడ్డు మార్గాలు విపరీతంగా విస్తరించినా గాని పెరుగుతున్న వాణిజ్య అవసరాలకు అనుగుణంగా భారత రైల్వేలు వృద్ధిచెందాయేగాని వెనుకబడ లేదు, భారతదేశంలో నలుమూలలకూ విస్తరించిన భారత రైల్వేల రైలు పట్టాల వ్యవస్థ మ్తొత్తం విస్తీర్ణం 2022 మార్చి 31 నాటికి 1,28,305 కిలోమీటర్లు కాగా, రైళ్లు నడిచే పట్టాల (రైలు ట్రాక్) పొడవు 1,02,831 కి.మీ. అందులో అన్ని రైలు మార్గాల రూట్లు కలిపి చూస్తే వాటి మొత్తం పొడవు 68,043 కి.మీ. 1853లో మొదలైన భారత రైల్యేల ప్రయాణం వేగంగా ముందుకు సాగడంతో 1880 నాటికి 9000 మైళ్ల పొడవైన రైలు మార్గాల స్థాయికి చేరింది. దక్షిణాది నగరం మద్రాసులోనే కదిలిన మొదటి (గ్రానైట్ లోడుతో) భారత రైలు! 1953 ఏప్రిల్ 16న భారత రైల్వేల మొదటి రైలు బొంబాయి నుంచి ఠాణె మధ్య లాంఛనంగా పట్టాలపై నడవడంతో ప్రారంభోత్సవం జరిగిందని చెబుతారు. నాటి నగరం బొంబాయితో సమీపంలోని ఠాణె, కల్యాణ్ వంటి ప్రాంతాలను రైలు మార్గాల ద్వారా కలపాలనే ఆలోచన 1843లో బొంబాయి ప్రభుత్వ చీఫ్ ఇంజినీర్ జార్జ్ క్లార్క్ బొంబాయి సమీపంలోని భాండప్ ప్రాంతానికి వచ్చినప్పుడు కలిగింది. వెంటనే రైలు మార్గాల నిర్మాణ ప్రయత్నాలు మొదలబెట్టడంతో ఈ ఆలోచన పదేళ్లకు వాస్తవ రూపం దాల్చింది. 21 మైళ్ల దూరం ఉన్న ఈ రూటు మొదటి రైలులోని 14 బోగీల్లో దాదాపు 400 మంది అతిధులు బోరీ బందర్ లో రైలెక్కి ప్రయాణించారు. తర్వాత, తూర్పు తీరంలోని బెంగాల్ లో కలకత్తా నగరం సమీపంలోని హౌరా (బెంగాలీలో హావ్‌డా) నుంచి హుగ్లీకి మొదటి ప్రయాణికుల రైలు 1954 ఆగస్ట్ 15న బయల్దేరింది. ఈ రెండు కొత్త రైల్వే స్టేషన్ల మధ్య దూరం 24 మైళ్లు. భారత ఉపఖండం తూర్పు భాగానికి మొదటి రైలు మార్గాన్ని ఈస్టిండియన్ రైల్వే సంస్థ ఇలా ప్రారంభించింది. తర్వాత దక్షిణాదిలో మొదటి రైల్వే లైను ప్రారంభించారు. 1856 జులై 1న మద్రాస్ రైల్వే కంపెనీ మద్రాసు నగరంలోని వ్యాసరపాడి జీవ నిలయం (వెయసరపాండి), వాలాజారోడ్డు మధ్య మొదటి ప్రయాణికుల రైలు నడిపింది. ఈ రైలు మార్గం దూరం 63 కి.మీ. అయితే, దేశంలో మొదటి రైలు 1853లో నాటి బొంబాయి నగరంలో బయల్దేరిందని చెబుతారు గాని అసలు రైలు అనేది రైలు మార్గంపై నడించింది మాత్రం నాటి మద్రాసు నగర ప్రాంతంలోనే. 1837లోనే నగరంలోని రెడ్ హిల్స్ నుంచి చింతాద్రిపేట్ బ్రిడ్జికి మొదటి రైలును రెడ్ హిల్ రైల్వే సంస్థ నడిపింది. కానీ ఇది ప్రయాణికుల రైలు కాదు. ప్రఖ్యాత ఈస్టిండియా కంపెనీ ఇంజినీరు సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు గ్రానైట్ రవాణా చేయడానికి ఈ రైలును తయారుచేశాడు. గ్రానైట్ రవాణాతో మొదలైన గూడ్సురైళ్లే భారతరైల్వేలకు తెచ్చేది 74శాతం ఆదాయం పైన వివరించినట్టు మద్రాసు నగరంలో గ్రానైట్ రాయి రవాణాతో మొదలైన భారత రైల్వేల గూడ్సు రైళ్లు 1837 నుంచీ అనూహ్య రీతిలో విస్తరించాయి. ఫలితంగా ప్రస్తుతం భారత రైల్వేల ఆదాయంలో 74 శాతం సరకు రవాణా గూడ్సు రైళ్ల వ్యవస్థ ద్వారానే ప్రభుత్వానికి వస్తోంది. ఆసక్తికర అంశం ఏమంటే–చివరికి ఆటోమొబైల్ కంపెనీలు సైతం తమ వాహనాలను గూడ్సు రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు పంపుతున్నాయి. 2027 నాటికి ఇలాంటి రవాణాను 30శాతం పెంచాలని ఈ ఆటోమొబైల్ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇలా అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్న భారత రైల్వేలు 2019 నుంచీ మరింత వేగంగతో ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేసే ‘వందే భారత్’ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా గత ఐదేళ్లుగా పత్రికల మొదటి పేజీ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇది వందే భారత్ యుగమని ప్రజలు ఆనందిస్తున్న సమయంలో ఒడిశాలో శుక్రవారం జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఒక్కసారిగా దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. అయితే, భారత రైల్వేలు ఇలాంటి అనేక సవాళ్లను తట్టుకుని ధైర్యంగా నిలబడ్డాయి. ప్రతి దుర్ఘటన తర్వాతా ఎన్నో పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతున్నాయి. ఒడిశా ప్రమాదం నుంచి కూడా ఎంతో నేర్చుకుని భారత రైల్వేలు శరవేగంతో ముందుకు పరుగెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. -విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికగా చేపట్టిన రైల్వే శాఖ
-
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఆ రూట్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు, కారణం అదే!
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ రైళ్ల సేవలు కేవలం కొన్ని నగరాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా పేరు సంపాదించుకోవడంతో పాటు ప్యాసింజర్లకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. అయితే కొన్ని రూట్లలో మాత్రం ఊహించినంత ఆదరణ వీటికి లభించనట్లు తెలుస్తోంది. ఇదే కారణంగా తాజాగా ఓ రూట్లో వందేభారత్ రైలుని నిలిపివేసింది రైల్వే శాఖ. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ఛత్తీస్‌గఢ్ బిలాస్పూర్ వరకు ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆటంకం ఏర్పడింది. సరైన అక్యుపెన్సీ లేని కారణంగా ఈ రైలును ఇండియన్ రైల్వేస్ రద్దు చేసింది. రైల్వే శాఖ ఆశించినమేర ప్యాసింజర్లు వందే భారత్‌లో ప్రయాణించేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో ఈ రూట్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్థానంలో తేజస్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు ప్రకటించింది. బిలాస్పూర్-నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను గత ఏడాది డిసెంబర్లో నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నాగ్‌పూర్ నుంచి బిలాస్‌పూర్‌కు ప్రయాణ సమయాన్ని ఏడు-ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, అధిక ధరల కారణంగా, ఆక్యుపెన్సీ సంతృప్తికరంగా లేదని అధికారులు చెబుతున్నారు. తేజస్ ఎక్స్‌ప్రెస్ భారతదేశపు మొట్టమొదటి కార్పొరేట్ రైలుగా 2017లో ప్రారంభించారు. ఇది పూర్తిగా భారతీయ రైల్వేల అనుబంధ సంస్థ అయిన ఐఆర్సీటీసీ ద్వారా నిర్వహిస్తున్నారు. దీనిని తొలిసారిగా 2017లో అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఉంబై నుంచి గోవా మార్గంలో ప్రారంభించారు. -
Vande Bharat: వందే భారత్‌పై దాడులు ఆగవా?
తిరువనంతపురం: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన అల్లరి మూకలు.. ఈ మధ్య ఎక్కడో దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన చర్యలు ఉంటాయని, జైలు శిక్ష తప్పదనే రైల్వే శాఖ హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టి మరీ రైలుపై దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో దేశంలోనే సెమీ హైస్పీడ్ రైళ్లుగా పేరున్న వందే భారత్ రైళ్లపై దాడులపరంపరకు చెక్ పెట్టడం ఎలాగనే ఆలోచనలో పడిపోయింది రైల్వే శాఖ. తాజాగా.. కేరళలో కొత్తగా ప్రారంభమైన వందే భారత్‌పైనా రాళ్ల దాడి జరిగింది. ఏప్రిల్ 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి.. తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ మధ్య కేరళ తొలి వందేభారత్‌ను ప్రారంభించారు. అయితే.. తాజాగా తిరునవయా-తిరూర్ మధ్య వందే భారత్‌పై రాళ్లు రువ్వారు ఆగంతకులు. ఈ దాడిలో అద్దం పగిలిపోగా.. ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపటినట్లు వెల్లడించారు. Flagged off Kerala’s first Vande Bharat Express, which will enhance connectivity from Thiruvananthapuram to Kasaragod. pic.twitter.com/u1RqG5SoVU — Narendra Modi (@narendramodi) April 25, 2023 ఇదిలా ఉంటే.. వందేభారత్ రైళ్లపై గత కొంతకాలంగా రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంతెందుకు సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో స్వల్ప కాలవ్యవధిలోనే వందేభారత్‌పై మూడుసార్లు రాళ్ల దాడి జరిగింది. అంతకు ముందు మార్చిలో పశ్చిమ బెంగాల్ ఫన్సిదేవా వద్ద, అదే నెలలో హౌరా-న్యూ జల్పైగురి మధ్య మాల్దా సమీపంలో వందేభారత్ రైళ్ల పై రాళ్ల దాడులు జరిగాయి. మొత్తంగా దేశంలో వందే భారత్ రైళ్లు పట్టాలెక్కిన తర్వాత.. ఇలాంటి దాడుల కేసులే పాతిక దాకా నమోదు అయినట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో రైల్వే శాఖ సీఆర్పీఎఫ్ ద్వారా ఈ తరహా నేరాల కట్టడికి సమాలోచనలు చేస్తోంది. ఇదీ చదవండి: కవితక్క ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్‌లో ఆస్తులు -
పనిలో ఫైర్ బ్రాండ్.. ముక్కు పిండి మరీ రూ.కోటి వసూలు చేసింది!
కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్లో నిర్లక్క్ష్యంగా వ్యవహరిస్తూ సస్పెండ్ అవుతుంటే, మరి కొందరు నిబద్ధతతో పని చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోసలిన్ అరోకియా మేరీ తన పని తీరుతో అందరి మన్ననలు పొందుతోంది. ఇటీవల ఆమె రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ప్రశంసలు అందుకుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. రోసలిన్ అరోకియా మేరీ.. ఆమె తన విధుల్లో ఎంతో కచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తూ ఆమె చేతికి చిక్కితే ఇక వారి పని అయినట్టే, ముక్కు పిండి మరీ వారి నుంచి జరిమానా వసూలు చేస్తుంది. ఇలా టికెట్ లేని ప్రయాణికులు, నిబంధనలు పాటించని ప్యాసింజర్ల నుంచి రోసలిన్ రూ.1.03 కోట్ల జరిమానాలు వసూలు చేసింది. పనిలో నిజాయతీగా ఖచ్చితత్వం ప్రదర్శిస్తూ తోటి ఉద్యోగులకు ఆదర్శంగా మారిన ఈ మహిళా టికెట్ ఇన్ స్పెక్టర్ కు కేంద్ర రైల్వే శాఖ నుంచి ప్రశంసలు దక్కాయి. ‘‘విధుల నిర్వహణ పట్ల ఆమె అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నారు. సదరన్ రైల్వేలో చీఫ్ టికెట్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీమతి రోసలిన్ అరోకియా మేరీ.. భారతీయ రైల్వేలో రూ.1.03 కోట్ల జరిమానా వసూలు చేసిన మొదటి మహిళా టికెట్ చెకింగ్ ఉద్యోగి’’ అని తెలిపింది. ఈ పోస్ట్ ఆన్లైన్లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది, ఎందుకంటే టికెట్ తనిఖీ సిబ్బందిలో ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసిన మొదటి మహిళ ఆమె గుర్తింపు పొందింది. ఉద్యోగాన్ని సిన్సియర్ గా చేస్తున్న మేరీకి నెటిజన్లు అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. -
మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు దిగొచ్చాయి. రైలు ప్రయాణాన్ని ప్రయాణికులకు మరింత చౌకగా అందించేలా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వేసవికి ఎండలు మరింత మండ నున్నాయనే వార్తల నేపథ్యంలో తరచుగా రైళ్లోలో ప్రయాణించే వారికి ఇది చల్లటి కబురే. రైల్వే తాజా నిర్ణయంతో ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్ చార్జీలకు సంబంధించి మునుపటి (నవంబరు 2022) ఆర్డర్‌ను ఉపసంహరించుకుంది. దీని ప్రకారం ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్ల కొత్త ధర మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి ఉంటుందని బెడ్స్ యథావిధిగా అందజేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఆన్లైన్లో లేదా వ్యక్తిగతంగా టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారు చెల్లించిన అదనపు డబ్బు తిరిగిచెల్లించనున్నారు. దీంతో ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం ఇప్పుడు చౌకగా మారింది. (ఇదీ చదవండి: Maruti Suzuki: మారుతి కస్టమర్లకు మరో షాక్: ఏ మోడల్ అయినా బాదుడే!) ఉత్తమ, చౌకైన ఏసీ ప్రయాణం సేవను అందించడానికి 3-టైర్ ఎకానమీ కోచ్‌లను సెప్టెంబరు 2021లో ప్రవేశపెట్టింది. 11,277 సాధారణ ఏసీ 3 కోచ్‌లతో పోలిస్తే ప్రస్తుతం 463 ఏసీ 3 ఎకానమీ కోచ్‌లు ఉన్నాయని, సాధారణ AC 3 కోచ్‌ల కంటే AC 3 ఎకానమీ కోచ్‌లలో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. సాధారణ AC 3-టైర్ కోచ్‌లో 72 బెర్త్‌లు ఉంటే, AC 3-టైర్ ఎకానమీలో 80 బెర్త్‌లు ఉంటాయి. డేటా ప్రకారం ఏసీ 3-టైర్ ఎకానమీ క్లాస్‌ను ప్రవేశపెట్టిన తొలి ఏడాదిలోనే ఇండియన్ రైల్వే రూ.231 కోట్లు ఆర్జించింది. ఏప్రిల్-ఆగస్టు 2022 వరకు, ఈ కోచ్‌లలో 15 లక్షల మంది ప్రయాణించారు, దీని ద్వారా రూ. 177 కోట్ల ఆదాయం వచ్చింది. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) -
ఈ సారి విమానం కాదు ట్రైన్.. ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన టీటీఈ!
లక్నో: ఇటీవల విమానాల్లో ప్రయాణికులు తోటి వారితో లేదా అందులోని సిబ్బందితో అనుచిత ప్రవర్తిస్తున్న ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ ఘటనల్లో కొందరు కటకటాల పాలయ్యారు కూడా. అయినా వీటికి ఫుల్ స్టాప్ మాత్రం పడేలా కనిపించడం లేదు. తాజాగా ఈ తరహా ఘటనే ఓ రైల్లో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో నిందితుడు ఓ రైల్వే అధికారి కావడం గమనార్హం. ఆ వ్యక్తి చేసిన పనికి చివరికి కటకటాలపాలయ్యాడు. అక్కడ ఏం జరిగిందంటే... మద్యం మత్తులో టీటీఈ... ఓ మహిళ తన భర్తతో కలిసి అమృత్సర్- కోల్‌కతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తోంది. అర్ధరాత్రి కావడంతో ప్రయాణికులతో పాటు ఆ జంట కూడా నిద్రలోకి జారుకుంది. ఇంతలో మద్యం మత్తులో ఉన్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) ఆ మహిళపై మూత్రవిసర్జన చేశాడు. మహిళ నిద్రలేచి అరవడంతో ఆమె భర్త టీటీఈని పట్టుకోగలిగాడు. మహిళ అరుపులు విని ఇతర ప్రయాణీకులు కూడా మేల్కొని టీటీఈని కొట్టారు. తర్వాత స్టేషన్ రాగానే టీటీఈని ప్రభుత్వ రైల్వే పోలీసులకు (GRP) అప్పగించారు. నిందితుడిని బిహార్‌కు చెందిన మున్నా కుమార్‌గా గుర్తించారు. ఈ మేరకు టీటీఈపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. గతంలో.. కొన్ని నెలల క్రితం విమానంలో ఇదే తరహాలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన పక్కనే కూర్చున్న మహిళపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. అనంతరం అమెరికాలో పనిచేస్తున్న భారతీయుడు శంకర్ మిశ్రాను అదుపులోకి తీసుకుని ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించకుండా 4 నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్ నుంచి ఢిల్లీకి అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణిస్తున్న సమయంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి తన పక్కనే కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వాత ఐజీఐ విమానాశ్రయంలో ప్రయాణికుడిని అరెస్టు చేశారు. -
రైలులో ప్రయాణించే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!
దేశంలో రైల్వే శాఖ ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాక్కర్లేదు. భారతీయ రైల్వేలు 7,000 స్టేషన్లతో అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా పేరు సంపాదించింది. ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. అయితే రైల్వే శాఖ ప్రయాణికులు పాటించాల్సిన కొన్ని నిబంధనలను రూపొందించింది. వీటిని ట్రైన్లో ప్రయాణించే ప్రతి ఒక్క ప్యాసింజర్ తప్పక పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాల ఉల్లంఘనకు పాల్పడితే ఒక్కోసారి చట్టపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ప్రయాణీకుడు తప్పనిసరిగా తెలుసుకోవలసిన 7 ప్రధాన భారతీయ రైల్వే నియమాలు ఇవే: ► టిక్కెట్ బుకింగ్: రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకులందరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే టిక్కెట్‌ను కలిగి ఉండాలి. టిక్కెట్లను ఆన్లైన్లో, రైల్వే స్టేషన్లలో లేదా అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా ప్రయాణించడం జరిమానాకు దారితీస్తుంది. ఈ విషయాన్ని ప్యాసింజర్లు గుర్తుపెట్టుకోవాలి. ► లగేజ్: ప్రయాణీకులు రైళ్లలో ప్రయాణించేటప్పుడు తమతో లగేజ్ తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. అయితే దీనికి ఓ పరిమితి ఉంది. ఫస్ట్ ఏసీ, 2వ ఏసీకి 40 కేజీలు, 3వ ఏసీ, చైర్ కార్కు 35 కేజీలు, స్లీపర్ క్లాస్‌కు 15 కేజీలు లగేజీని తీసుకెళ్లేందుకు పరిమితి ఉంటుంది. ప్రయాణికులు ఏ రకమైన మండే లేదా ప్రమాదకరమైన వస్తువులను ట్రైన్లో తీసుకెళ్లడం నిషేధం ► ధూమపానం: రైళ్లు, ప్లాట్‌ఫారమ్‌లు, స్టేషన్ ఆవరణలో ధూమపానం నిషేధం. ► ఆహారం: ప్రయాణీకులు తమ సొంత ఆహారాన్ని తీసుకెళ్లవచ్చు లేదా ప్లాట్‌ఫారమ్‌లోని ప్యాంట్రీ కార్ లేదా ఫుడ్ స్టాల్స్ నుండి ఆహారాన్ని కొనుగోలు చేయవచ్చు. ► మద్యం: రైళ్లు, రైల్వే ప్రాంగణాల్లో మద్యం సేవించడం నిషేధం. ► టికెట్ క్యాన్సిల్, రీఫండ్: ప్యాసింజర్ వారి టిక్కెట్‌ను రద్దు చేయాలనుకుంటే, రైలు బయలుదేరే సమయానికి ముందే అలా చేయాల్సి ఉంటుంది. తద్వారా భారతీయ రైల్వే క్యాన్సిలేషన్ విధానం ప్రకారం రీఫండ్ (వాపసు) లభిస్తుంది. ► భద్రత: ప్రయాణీకులు తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ప్రయాణించేటప్పుడు ప్యాసింజర్లు వారి విలువైన వస్తువులను తీసుకెళ్లకుండా ఉండడం ఉత్తమం. ట్రైన్లో తోటి ప్రయాణీకులతో వాదనలు లేదా తగాదాలకు కూడా దూరంగా ఉండాలి. చదవండి: వాహనదారులకు షాక్! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్ చార్జీలు! -
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. త్వరలో ట్రైన్ హోటల్స్!
సాక్షి, చెన్నై: వృథాగా ఉన్న రైలు బోగీలను హోటళ్లుగా మార్చేందుకు దక్షిణ రైల్వే ప్రణాళిక రూపొందిస్తోంది. తొలి విడతలో మూడు చోట్ల ట్రైన్ హోటళ్లు ఏర్పాటు చేయనుంది. వివరాలు.. దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు రోజూ వేలాది మంది ప్రయాణికులు వచ్చి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ సరైన హోటళ్లు అందుబాటులో లేవు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న దక్షిణ రైల్వే ప్రయాణికులను ఆకర్షించే విధంగా వృథాగా ఉన్న బోగీల్లో హోటళ్ల ఏర్పాటపై దృష్టి సారించింది. ఈ హోటళ్ల నిర్వహణ ప్రైవేటు సిబ్బందికి అప్పగించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా దక్షిణ రైల్వేకు అదనపు ఆదాయం కూడా సమకూరనుంది. ఇప్పటికే అనేక చోట్ల నగరాల్లో ప్రైవేటు హోటళ్లు రైళ్ల తరహాలో సెట్టింగ్ లు, పెయింటింగ్స్‌తో భోజన ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అయితే, రైల్వే యంత్రాంగం నిజమైన రైలు బోగీలను హోటళ్లుగా మార్చనుండడం విశేషం. రైలులో ప్రయాణిస్తూ ఆహారాన్ని తింటున్నామనే అనుభూతిని కలిగించేలా.. ఆయా బోగీలలో ప్రత్యేక డిజైన్లు, సీట్లను ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి టెండర్ల ద్వారా ఈ హోటళ్లను త్వరలో కేటాయించనున్నారు. 24 గంటల పాటూ ఇవి సేవలు అందించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నారు. ఒకే సమయంలో ఓ బోగీలో 40 మంది కూర్చుని ఆహారం తినేందుకు తగినట్లు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో చెన్నై సెంట్రల్, పెరంబూరు, కాటాన్ కొళ్తూరు స్టేషన్లలో ఈ రైలు బోగీల హోటళ్లకు ఆన్లైన్ ద్వారా టెండర్లను ఆహా్వనించనున్నారు. చదవండి ఊరేగింపులో రూ.కోట్ల విలువైన కార్లు.. అయినా ఎద్దుల బండి మీద వరుడు ఎంట్రీ! -
‘మాకొక వందే భారత్ కావలెను’
ఢిల్లీ: వందేభారత్ రైళ్లకు అక్కడ ఫుల్ గిరాకీ ఉంటోంది. ప్రయాణికులతో అనుకునేరు. మా రూట్లలో ఆ రైలు నడపండి మహాప్రభో అంటూ కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు పలువురు ఎంపీలు. వాళ్లలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సైతం ఉండడం గమనార్హం. గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో.. భారత్‌లో సెమీ హైస్పీడ్ రైల్‌గా వందే భారత్ పేరొందింది. టికెట్ ధర ఎక్కువే అయినా.. ఫ్లైట్‌లో ఉండేలా అత్యాధునిక వసతులు, త్వరగతిన గమ్యస్థానానికి చేర్చుతుండడంతో వందే భారత్ రైళ్లను తమ నియోజకవర్గాల్లోని ప్రజలు కోరుకుంటున్నారని చెబుతూ ఎంపీలు.. కేంద్ర రైల్వేశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్లమెంట్ నుంచి దాదాపు 60 మంది ఎంపీలు.. వందే భారత్ రైళ్లను తమ రూట్లలో నడపాలంటూ కేంద్ర రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు. వందే భారత్ 2.0 సూపర్ సక్సెస్ అయ్యింటూ లేఖలో పేర్కొన్నారు వాళ్లు. వీళ్లలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. అలాగే పలువురు బీజేపీ ఎంపీలతో పాటు విపక్షాల నుంచి 14 మంది ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా రైల్వేస్‌కు విజ్ఞప్తి చేసినవాళ్లలో ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పది వందే భారత్ రైళ్లు వివిధ రూట్లలో ప్రయాణిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నడుమ సికింద్రాబాద్-విశాఖపట్నం నడుమ వందే భారత్ రైలు నడుస్తోంది. -
కరీంనగర్ వాసులకు శుభవార్త.. 2025లో రైలు వస్తోంది!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు తుదిదశకు వచ్చింది. మరో రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యాన్ని విధించుకుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే చాలా వేగంగా పనులు చేపడుతోంది. 2025 మార్చి వరకు ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రాజెక్టు స్వరూపం, ఖర్చు, పూర్తి చేసే తేదీ తదితరాలను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్‌ను కలుపుతూ రూపొందించిన మనోహరాబాద్ (మేడ్చల్)– కొత్తపల్లి (కరీంనగర్) రైల్వే ప్రాజెక్టు ఇది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అధిక ఖర్చు, వయబిలిటీ ఉండదన్న కారణాలతో పక్కనపెట్టిన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వినతితో 2016లో దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. ప్రస్తుతం గజ్వేల్ వరకు ట్రయల్ రన్ నడుస్తోంది. ప్రభుత్వం వేములవాడ, కొండగట్టుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేస్తుండటంతో ఈ మార్గంలో ఆధ్యాత్మిక పర్యాటకం ఊపందుకోనుంది. ఏడాది చివరలో సిద్దిపేట, దుద్దెడలకు.. ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం మనోహరాబాద్–గజ్వేల్ మధ్య 32 కి.మీ మేర ట్రాక్ పూర్తయి ట్రయల్‌రన్ నడుస్తోంది. గజ్వేల్ నుంచి కొడకండ్ల వరకు కొత్తగా నిర్మించిన 12.5 కిలోమీటర్ల మార్గం కూడా పూర్తయి ట్రయల్‌రన్‌కు సిద్ధంగా ఉంది. ఇక ఈ ఏడాది ఆగస్టులో కొడగండ్ల–దుద్దెడను ఆగస్టులో, దుద్దెడ–సిద్దిపేటను డిసెంబరులో, సిద్దిపేట సిరిసిల్ల వచ్చే ఏడాది మార్చిలో, సిరిసిల్ల– కొత్తపల్లి 2025 మార్చిలో పూర్తి చేయనున్నారు. ఇప్పటివరకు పనులన్నీ అనుకున్న విధంగా గడువులోనే జరుగుతుండటం గమనార్హం. మాస్టర్ప్లాన్లతో పెరిగిన డిమాండ్..! ఈ ప్రాజెక్టు పూర్తయితే.. రాష్ట్రంలో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు ఒకే రైల్వేలైను పరిధిలో దర్శించుకునే వీలు కలుగుతుంది. ఈ మార్గంలో కొమురవెల్లి, కొండపోచమ్మ, నాచారం లక్ష్మీ నర్సింహాస్వామి, నాంపల్లి, వేములవాడ పుణ్యక్షేత్రాలు వస్తాయి. కొ త్తపల్లి స్టేషన్ అందుబాటులోకి వస్తే.. అక్కడ నుంచి కరీంనగర్ స్టేషన్ నుంచి కొండగట్టు (నూకపల్లి–మల్యాల)స్టేషన్‌కు కలపవచ్చు. ఇటీవల బడ్జెట్లో వేములవాడ మాస్టర్ ప్లాన్ కోసం రూ.50 కోట్లు, కొండగట్టుకు రూ.600 కోట్లు ప్రకటించడంతో ఈ రెండు పుణ్యక్షేత్రాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ రెండు ఆలయాల అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ ప్రాధాన్యం పెరిగింది. ఇదే విషయాన్ని దక్షిణమధ్య రైల్వే కూడా గు ర్తించింది. అందుకే, ఈ రైల్వేలైన్‌ను త్వరగా పూర్తి చేసే పట్టుదలతో ఉన్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ధీమాగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే 46 శాతం మేర ప్రాజెక్టు పూర్తయింది. షిరిడీ, ముంబై, బెంగళూరులకు రైళ్లు..! కొత్తపల్లి– మనోరాబాద్ రైల్వేలైన్ హైదరాబాద్ డివిజన్లో ఉంది. అదే ఖాజీపేట–బల్లార్షా మార్గం సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ రెండు మార్గాలకు కొత్తపల్లి జంక్షన్‌లా మారనుంది. ఉత్తరభారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఇది ముఖద్వారంగా అవతరించనుంది. ఈ మార్గం పూర్తయితే ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ వాసులకు షిరిడీ, ముంబై, షిరిడీ, బెంగళూరులకు రైళ్లు నడపొచ్చని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. చదవండి లాభాల గాడిద పాలు.. రోజూ లీటరున్నర వరకు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే! -
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. భారీ మార్పులు, నిమిషానికి 2 లక్షల టికెట్లు!
దేశ ప్రజలకు ఇండియన్ రైల్వేస్ అందిస్తున్న సేవలను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ లక్షల ప్రయాణికులను తక్కువ ఖర్చుతో వారి గమ్యస్థానానికి చేరుస్తోంది. తాజాగా ప్యాసింజర్ల అందించే సేవల విషయంలో మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతమున్న ఆన్లైన్ టిక్కెట్ల రిజర్వేషన్ వ్యవస్థ సామర్థ్యం మరింత పెంచేందుకు కీలక చర్యలు తీసుకోనుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. భారీ మార్పులు.. నిమిషాల్లో 2 లక్షల టికెట్లు విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7,000 కిలోమీటర్ల దూరం కొత్త రైల్వే ట్రాక్‌లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ‘ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచాలని ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం, టిక్కెట్ల సామర్థ్యం నిమిషానికి 25,000 టిక్కెట్లు ఉండగా, ఆ సామర్థ్యాన్ని నిమిషానికి 2.25 లక్షలకు అప్‌గ్రేడ్ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని' చెప్పారు. దీని ద్వారా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మరింత సులభంగా టికెట్ లభించనుంది. ఎంక్వైరీలకు హాజరయ్యే సామర్థ్యం నిమిషానికి నాలుగు లక్షల నుంచి నిమిషానికి 40 లక్షలకు అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 2,000 రైల్వే స్టేషన్లలో “జన్ సువిధ” కన్వీనియన్స్ స్టోర్లను నిర్మిస్తామని, అవి 24 గంటలూ తెరిచి ఉంటాయని ప్రకటించారు. వీటితో పాటు 2014 కి ముందు, ఇది రోజుకు నాలుగు కిలోమీటర్లు ఉండగా, 2022-23లో 4,500 కిలోమీటర్ల (రోజుకు 12 కిలోమీటర్లు) దూరం వరకు రైల్వే ట్రాక్‌లు వేయాలనే లక్ష్యం ఇప్పటికే అందుకున్నట్లు చెప్పారు. చదవండి: ఎలన్ మస్క్‌కు భారీ ఊరట.. ఆ దూకుడుకు కళ్లెం వేయడం కష్టమే! -
వందే భారత్ రైళ్లలో ఇది పరిస్థితి.. భారతీయ రైల్వేస్ రిక్వెస్ట్
Viral News: ఇతర దేశాల్లో బుల్లెట్ ట్రైన్లు, మాగ్నటిక్ బుల్లెట్ ట్రైన్ల టెక్నాలజీతో రైల్వే రంగాలు దూసుకుపోతున్నాయి. మన దగ్గర అంతస్థాయిలో కాకపోయినా మెట్రో, ఈ మధ్యకాలంలో వందే భారత్ లాంటి సెమీ స్పీడ్ రైళ్లను పట్టాలెక్కించింది కేంద్రం. అయితే.. భారత్‌లో ఇప్పటిదాకా హైక్లాస్ రైలుగా వందే భారత్ ఓ ఫీట్ సాధించగా.. వసతులు, ఆధారంగా భూతల విమానంగా అభివర్ణిస్తున్న వందే భారత్ రైలులో పరిస్థితి ఇది అంటూ తాజాగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వందే భారత్ రైలు కంపార్ట్మెంట్లో మొత్తం వాటర్ బాటిళ్లు, చెత్తా చెదారం, కవర్లు నిండిపోయి ఉన్నాయి. ఓ వర్కర్ దానికి శుభ్రం చేస్తుండగా తీసిన ఫొటో ఇది. ఐఏఎస్ అధికారి అవానిష్ శరణ్ తన ట్విటర్లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. పైగా ‘వీ ద పీపుల్’ అంటూ మన జనాల్లోని కొందరి మైండ్ సెట్‌ను ఉదాహరించారాయన. “We The People.” Pic: Vande Bharat Express pic.twitter.com/r1K6Yv0XIa — Awanish Sharan (@AwanishSharan) January 28, 2023 ఆయన పోస్ట్‌కు రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధం లేన్నన్నాళ్లూ ఇలాంటి పరిస్థితి తప్పదంటూ కొందరు.. జనాలకు స్వీయ శుభ్రత అలవడితేనే పరిస్థితి మారుతుందంంటూ మరికొందరు.. ఏది ఏమైనా మన దేశంలో ఇలాంటి పరిస్థితిలో మార్పురాదని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఓవైపు చెత్తాచెదారం శుభ్రం చేశాక కూడా.. సిబ్బంది ముందే చెత్తా పారబోస్తున్నారు. వందే భారత్ రైళ్లు గమ్యస్థానం నుంచి ప్రారంభం అయ్యే లోపే ప్రయాణికులు వేస్తున్న చెత్తాచెదారంతో నిండిపోతోందని సిబ్బంది వాపోతున్నారు. ఇదిలాఉంటే సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్ రైలులో చెత్తాచెదారం దర్శనమివ్వగా.. దయచేసి శుభ్రతను పాటించాలంటూ భారతీయ రైల్వేస్ సంస్థ వందేభారత్ ప్రయాణికులకు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల వైఖరి, మనస్తతత్వం మారనంత కాలం.. స్వచ్ఛ భారత్ సాధించడం కష్టం. కాబట్టి, మెరుగైన సేవలను అందుకోవడానికి రైల్వేస్‌తో సహకరించండి. దయచేసి చెత్తచెదారం వేయకండి. డస్ట్బిన్లలోనే చెత్త వేయండంటూ అంటూ ప్రకటనలో పేర్కొంది భారతీయ రైల్వేస్. హైక్లాస్ రైలు.. అత్యాధునిక, సాంకేతిక వ్యవస్థలతో పనిచేసే వందే భారత్ రైళ్లలో.. విమానాల్లో మాదిరి ఇంటీరియర్ కనిపిస్తుంది. కోచ్‌లన్నీ ఫ్లైట్ ఇంటీరియర్‌తో పోలి ఉంటాయి. సీటింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఆటోమేటిక్ డోర్లు ఉండటమే కాక అవన్నీ రొటేట్ అవుతుంటాయి. సీట్ల వద్ద ఉండే బటన్ ప్రెస్ చేసి ఎవరితోనైనా మాట్లాడవచ్చు. సీసీ కెమెరాలుంటాయి. ప్రయాణికుల కదలికలను సెంట్రల్ స్టేషన్ నుంచి మానిటరింగ్ చేస్తారు. భద్రతకు ప్రాధాన్యత.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా భద్రతా వ్యవస్థ సత్వరం స్పందిస్తుంది. ఎమర్జన్సీ అలారం ఉంటుంది. మరుగుదొడ్లు స్టార్ హోటల్లో ఉన్నట్టుగా తలపిస్తాయి. ఇంజిన్ కాక్‌పిట్ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ-డిస్‌ప్లేలుంటాయి. గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోయినా గ్లాసులో వాటర్ ఒలకదు. గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సగటు వేగం 88 కిలోమీటర్ల మేర ఉంటుంది. సున్నితంగా ఉంటుంది ఈ రైలులో ప్రయాణం. -
ట్రైన్ జర్నీ వాయిదా, తేదీని మార్చుకోవాలా?.. ఇలా చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవు!
ప్రజలు సాధారణంగా ఫలానా తేదీన ట్రైన్ జర్నీఅనుకున్నప్పుడు టికెట్లను ముందుగానే రిజర్వేషన్ చేసిపెట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్లు అనుకున్న ప్రయాణ తేదీని వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. అనగా మందనుకున్న ప్రయాణం తేదీని ముందుగా లేదా తర్వాత రోజులకు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు. గతంలో అయితే ఈ తరహా ఘటనలు ఎదురైతే టికెట్ రద్దు (క్యాన్సిల్) చేసుకోవాలి. అందువల్ల రైల్వే శాఖ క్యాన్సిలేషన్ ఛార్జిని మినహాయించుకుని మిగిలిన నగదును మాత్రమే ప్రయాణికుడికి ఇస్తుంది. ఇలా చేయడం వల్ల ప్యాసింజర్ కొంత డబ్బును నష్టపోవాల్సి ఉంటుంది. ఇటీవల దీనికి పరిష్కారంగా భారతీయ రైల్వే కొత్త సేవలను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రయాణికుడికి ఏ నష్టం రాకుండా ప్రయాణా టికెట్‌ను మార్చుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం కేవలం ఆఫ్‌లైన్ టిక్కెట్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇ-టికెటింగ్ విభాగం ఆన్లైన్ బుకింగ్ తేదీని మార్చుకునే సదుపాయం లేదు. క్యాన్సిల్ చేసిన.. ఛార్జీలు పడవు కావు తెరపైకి వచ్చిన కొత్త సేవలో.. ప్యాసింజర్ బుక్ చేసుకున్న ప్రయాణ తేదీని మార్చుకునే వెసలుబాటు ఉంది. అది కూడా క్యాన్సిలేషన్ ఛార్జీలు లేకుండానే ఆ టికెట్లను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా ... మనం ముందుగా బుక్ చేసుకున్న రైలు ప్రయాణం ప్రారంభమయ్యే కనీసం 48 గంటల ముందే రిజర్వేషన్ కౌంటర్‌కు (పనివేళల్లో) వెళ్లి మీ టికెట్‌ను సంబంధిత రైల్వే ఉద్యోగికి సరెండర్ చేయాలి. అదే సమయంలో మీరు ఏ రోజున ఏ సమయంలో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నారో రిజర్వేషన్ కౌంటర్లోని ఉద్యోగులకు తెలియజేయాలి. అంతేకాకుండా ఇందులో మరో సౌకర్యం ఏమనగా.. ఆ సమయంలో ప్యాసింజర్లు ప్రయాణపు తరగతిని కూడా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ కౌంటర్ అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి మీరు కోరిన రోజున ప్రయాణానికి అందుబాటులో ఉంటే సర్దుబాటు చేస్తారు. ఇందుకోసం అదనపు ఛార్జీలు తీసుకోరు. మీ కోచ్ తరగతిని అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే అందుకు తగిన టికెట్ ధరను మాత్రం తీసుకుంటారు. ఈ సదుపాయం కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారితో పాటు, ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారు సైతం ఒకసారి ఉపయోగించుకోవచ్చు. బోర్డింగ్ స్టేషన్నూ మార్చుకోవచ్చు.. ప్రయాణికులు ఒరిజినల్ బోర్డింగ్ స్టేషన్‌లోని స్టేషన్ మేనేజర్‌కి వ్రాతపూర్వక అభ్యర్థనను సమర్పించడం ద్వారా లేదా ఏదైనా కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ కేంద్రాన్ని సంప్రదించడం ద్వారా బోర్డింగ్ స్టేషన్‌ను మార్చవచ్చు. అయితే అందుకోసం రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు సమాచారం తెలపాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ టిక్కెట్లకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. చదవండి : భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు భారీ షాక్! -
భారతీయ రైల్వే ప్రైవేటీకరణ..?
-
రైళ్లలో వృద్ధులకు రాయితీలు ఇప్పుడే కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: రైల్వేలపై ఖర్చుల భారం విపరీతంగా పెరిగిపోతోందని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతేడాది ప్యాసింజర్ సేవలకు రూ.59,000 కోట్ల రాయితీలు ఇచ్చామని, పెన్షన్లు, జీతాల బిల్లు భారీగానే ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైళ్లలో వృద్ధులకు రాయితీలను ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశం లేదని పరోక్షంగా చెప్పారు. వాటిని కరోనా సమయంలో రద్దు చేయడం తెలిసిందే. ‘‘ప్రయాణికుల సేవలకు ఏటా రూ.59,000 కోట్ల రాయితీలివ్వడం మామూలు విషయం కాదు. పైగా రూ.60,000 కోట్ల పెన్షన్ బిల్లు, రూ.97,000 కోట్ల జీతాల బిల్లు, రూ.40,000 కోట్ల ఇంధన ఖర్చు భరించాల్సి వస్తోంది. కొత్త నిర్ణయాలు తీసుకొనే ముందు రైల్వేల ఆర్థిక పరిస్థితినీ పరిగణనలోకి తీసుకోవాలి’’ అని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: AP: 8.22లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ -
Train Video: ఇది రైలు ప్రయాణమా? ఇంత ఘోరమా?
వైరల్: మన దేశంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ.. భారతీయ రైల్వేస్. అలాగే.. అత్యంత రద్దీ వ్యవస్థ కూడా ఇదే!. పండుగలు, ఇతర సెలవుల సమయంలో రైళ్లలో రద్దీ ఏపాటి ఉంటుందో తెలియంది కాదు. అయితే.. సాధారణ రోజుల్లోనూ కొన్ని మార్గాల్లో రద్దీ అధికంగా ఉంటోంది. ఆ రద్దీని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించలేకపోతోందనే విమర్శ ఇండియన్ రైల్వేస్‌పై ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా రాజేష్ దుబే అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అమృత్సర్ కథిహార్ ఎక్స్‌ప్రెస్‌లో 72 బెర్త్ స్లీపర్లు ఉన్న కోచ్‌లో ఏకంగా 350 మంది ప్రయాణించారు. ఎటు చూసినా ప్యాసింజర్లు, లగేజీలతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. అంత నరకంలోనూ గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లు, మరో మార్గం లేక ఇలా చేసినట్లు కొందరు ప్రయాణికులు వెల్లడించారు. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులు అలా ప్రయాణించడం నేరమే!. కానీ, ఆ టైంకి అక్కడ టీటీఈ కూడా లేకపోవడంతో.. విషయం రైల్వేస్ దృష్టికి వెళ్లింది. రైల్వే సేవా అధికారిక ట్విటర్ అకౌంట్ ఈ ప్రయాణ వివరాలను అందించమని కోరగా.. చివరకు ఫిర్యాదు నమోదు అయ్యింది. Video Credits: The Logical Indian -
రైల్వే శాఖ ఆదాయానికి గండి.. ఆ ప్యాసింజర్ల సంఖ్య భారీగా తగ్గుతోంది!
కరోనా మహ్మమారి రాకతో దాదాపు అన్నీ రంగాల ఆదాయాలకు గండి పడింది. ఇటీవలే దీని నుంచి బయట పడుతూ కొన్ని పుంజుకుంటుండుగా, మరి కొన్ని డీలా పడిపోయాయి. ఈ వైరస్ దెబ్బకు ఇండియన్ రైల్వేస్ ఆదాయానికి కూడా చాలా వరకే గండిపడింది. ఇప్పుడిప్పుడే రైల్వే శాఖ ఈ దెబ్బ నుంచి కోలుకుంటోంది. అయితే తాజాగా ట్రైన్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్స్ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు నివేదికలు చెప్తున్నాయి. కరోనా పరిస్థితులతో పాటు, గతంలో పలు కారణాల వల్ల టికెట్‌పై ఇచ్చే రాయితీని నిలిపేయడంతో రైళ్లలో వయోవృద్ధల ప్రయాణాలు ఈ ఏడాది 24 శాతం తగ్గాయని వెల్లడయ్యింది. 2018-2019లో 7.1 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించగా, 2019-20లో ఈ సంఖ్య 7.2 కోట్లకు పెరిగింది. అయితే, 2021-22లో దాదాపు 5.5 కోట్ల మంది మాత్రమే రైలులో ప్రయాణించారు. ఈ విభాగం ప్రయాణీకుల సంఖ్య తగ్గుదల కారణంగా, రైల్వే శాఖ ఆదాయం గతంలో పోలిస్తే 13 శాతం క్షీణించింది. ఆర్బీఐ తెలిపిన సమాచారం ప్రకారం.. 2018-2019లో సీనియర్ సిటిజన్ ప్రయాణికుల నుంచి వచ్చిన మొత్తం రూ. 2,920 కోట్లు, 2019-2020లో రూ. 3,010 కోట్లు, 2020-21లో రూ. 875 కోట్లు, 2021-22లో రూ. 2,598 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. చదవండి: అమెజాన్‌లో ఏం జరుగుతోంది? భారత్‌లో మరో బిజినెస్ మూసివేత! -
రైల్వేలో మానవ రహిత సిగ్నలింగ్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: రైలు ప్రమాదాలను నివారించే దిశగా త్వరలోనే ఆధునిక అన్‌మేన్డ్ ఆటోమేషన్ సిగ్నలింగ్ వ్యవస్థను రైల్వే శాఖ ప్రవేశపెట్టబోతోంది. దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ సిగ్నలింగ్ వ్యవస్థ స్థానంలో ‘ఇండీజినస్ కమ్యూనికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ సిస్టమ్ (ఐ–సీబీటీసీ) విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. సంప్రదాయ వ్యవస్థకు మంగళం భారతీయ రైల్వే దశాబ్దాలుగా సంప్రదాయ సిగ్నలింగ్ వ్యవస్థనే కొనసాగిస్తోంది. ట్రాక్ సర్క్యూట్లు, యాక్సెల్ కౌంటర్ల ద్వారా రైళ్ల గమనాన్ని తెలుసుకుంటూ రంగుల లైట్ల ద్వారా రైళ్ల లోకో పైలట్లకు సిగ్నల్స్ తెలిపే విధానాన్ని అనుసరిస్తోంది. రైళ్ల గమనాన్ని తెలుసుకోడానికి, నియంత్రించడానికి ఈ విధానం సరైనదే. కానీ.. మన దేశంలోని 68,103 కి.మీ. పొడవైన రైల్వే ట్రాక్‌లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోడానికి ప్రస్తుత వ్యవస్థ సరిపోవడం లేదు. అందుకే ప్రస్తుత సిగ్నలింగ్ స్థానంలో ఐ–సీబీటీసీ పేరుతో పూర్తిగా మానవ రహిత సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందించనుంది. చదవండి: (ఉద్యోగులకు సీఎం జగన్ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు: సజ్జల) -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఆ టెన్షన్ లేదు, కొత్త సర్వీస్ వచ్చేసింది!
ఇండియన్ రైల్వేస్.. ప్రతి రోజు లక్షల మంది ప్యాసింజర్లను వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు కోట్ల రూపాయలు సరకులను రావాణా చేస్తూ ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తోంది. ప్రయాణికుల సేవలు అందించడంలో ఏ మాత్రం రాజీ పడకుండా ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా మరో సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది భారతీయ రైల్వే. రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సరికొత్త సేవ ఇకపై రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్లు రైలులో నిద్రిపోయినా ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే రైల్వే శాఖ సరికొత్త సేవని ప్రవేశపెట్టింది. ‘డెస్టినేషన్ అలర్ట్ వేక్ అప్ అలారం’ పేరుతో కొత్త సర్వీసును ప్రారంభించింది భారతీయ రైల్వే . ఇదివరకే రాత్రి వేళ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నుంచి ఈ అంశంపై పలుమార్లు రైల్వే బోర్డుకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు రైల్వేశాఖ ఈ సౌకర్యాన్ని తీసుకువచ్చింది. ఎంక్వైరీ సర్వీస్ నంబర్ 139లో రైల్వే ఈ కొత్త సేవను ప్రారంభించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రైల్వే ప్రయాణికులకు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ సర్వీసు ద్వారా ప్యాసింజర్లు వారి స్టేషన్‌కు చేరుకునే వరకు ఆందోళన లేకుండా నిద్రపోవచ్చు. ఇది ఎలా పని చేస్తుందంటే.. ప్యాసింజర్ వారి గమ్య స్థానానికి చేరుకునే 20 నిమిషాల ముందు రైల్వే శాఖ నుంచి మీకు అలర్ట్ వస్తుంది. దీని ద్వారా మీరు నిద్రలేచి మీ గమ్య స్థానానికి చేరుకుంటారు. ఇలా ఉపయోగించుకోండి డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం సేవను ప్యాసింజర్లు ఉపయోగించుకోవాలంటే.. ఐఆర్సీటీసీ( IRCTC) హెల్ప్‌లైన్ 139కి కాల్ చేయాలి. మీరు గమ్యస్థాన అలర్ట్ కోసం ముందుగా 7 నంబర్లను, ఆపై 2 నంబర్లను నొక్కాలి. తర్వాత మీ 10 అంకెల పీఎన్ఆర్(PNR) నెంబర్‌ను నమోదు చేయాలి. దీన్ని నిర్ధారించడానికి 1 డయల్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు స్టేషన్ చేరుకోవడానికి 20 నిమిషాల ముందు వేకప్ అలర్ట్ వస్తుంది. -
భద్రాచలం–సత్తుపల్లి బొగ్గు లైన్ రెడీ.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బొగ్గు తరలింపు కోసం ప్రత్యేకంగా నిర్మించిన భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే కారిడార్‌ను త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 12న ప్రారంభోత్సవం ఉంటుందని, అయితే దీనిని ప్రధాని కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ కారిడార్‌ను సింగరేణి బొగ్గు గనుల సంస్థతో కలిసి రైల్వే నిర్మించింది. 54.10 కి.మీ. నిడివి గల ఈ ప్రాజెక్టును రూ.930 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. ఇందులో సింగరేణి సంస్థ రూ.619 కోట్లు భరించగా, మిగతా మొత్తాన్ని రైల్వే శాఖ వ్యయం చేసింది. జోన్ పరిధిలో గతంలో సిమెంటు ఫ్యాక్టరీలకు సున్నపురాయిని తరలించేందుకు బీబీనగర్–గుంటూరు మధ్య ఉన్న విష్ణుపురం నుంచి ఖాజీపేట–విజయవాడ సెక్షన్ల మధ్య ఉన్న మోటుమర్రి వరకు ఓ సరుకు రవాణా రైల్వే లైనును నిర్మించారు. దాని తర్వాత రెండో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇదే. లారీలకు ప్రత్యామ్నాయంగా.. సింగరేణి సంస్థ సత్తుపల్లి పరిసరాల్లో భారీ సంఖ్యలో ఓపెన్‌కాస్ట్‌ల నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. విస్తరించే క్రమంలో ప్రత్యేకంగా రైల్వే లైన్ అవసరమని భావించి రైల్వే శాఖకు ప్రతిపాదించింది. రైల్వేకు ప్రయాణికుల రైళ్ల ద్వారా కంటే సరుకు రవాణా రైళ్ల ద్వారానే ఆదాయం అధికంగా నమోదవుతుంది. దీంతో సింగరేణి సంస్థ ప్రతిపాదనను వెంటనే అంగీకరించిన రైల్వే 2010లో ప్రాజెక్టును మంజూరు చేసింది. అయితే పదేళ్ల తర్వాత కానీ పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా అంచనా వ్యయం రూ.360 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెరిగింది. చదవండి: పోతరాజు అవతారమెత్తిన రాహుల్.. కొరడాతో విన్యాసం ప్రస్తుతం పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలోని గనుల నుంచి నిత్యం వేయికి పైగా లారీలతో బొగ్గు వివిధ ప్రాంతాలకు తరలుతోంది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్నది. మరోవైపు బొగ్గు లోడు లారీల రాకపోకలతో రోడ్లు భారీగా దెబ్బతింటున్నాయంటూ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా దుమ్ము రేగుతుండటంతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. వీటన్నింటికీ రైల్వే మార్గమే పరిష్కారమని తేల్చారు. మొత్తం మూడు స్టేషన్లు ఈ ప్రాజెక్టు కోసం 860 ఎకరాల భూమిని సేకరించారు. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉంటాయి. సారవరం క్రాసింగ్ స్టేషన్, చంద్రుగొండ క్రాసింగ్ స్టేషన్, పార్థసారథి పురం టెర్మినల్. సత్తుపల్లిలో పెద్దదైన జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్స్‌కు సంబంధించి సైడింగ్ స్టేషన్ పార్థసారథి పురంలోనే ఉంటుంది. ఈ మార్గంలో 10 మేజర్ బ్రిడ్జిలు, 37 మైనర్ బ్రిడ్జిలు, 40 ఆర్‌యూబీలు, 7 ఆర్ఓబీలు నిర్మించారు. రోజుకు ఐదారు రేక్‌ల బొగ్గు తరలింపు రోజుకు ఐదారు రేక్ (ఒక రైలు)ల లోడు తరలించాల్సి ఉంటుందని సింగరేణి సంస్థ ఆదిలోనే రైల్వే దృష్టికి తెచ్చింది. వచ్చే 30 ఏళ్లలో 200 మిలియన్ టన్నుల బొగ్గును ఇక్కడి నుంచి తరలిస్తారని అంచనా. ప్రస్తుతం ఇక్కడినుంచి 7.5 మిలియన్ టన్నుల బొగ్గును లారీల ద్వారా వేరే ప్రాంతాల్లోని రైల్వే సైడింగ్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ రైల్వే లైను ప్రారంభంతో ఆ బాధ తప్పుతుంది. దాంతోపాటు ఏడాదికి మరో 2.5 మిలియన్ టన్నుల బొగ్గును అదనంగా ఇక్కడ లోడ్ చేయనున్నారు. ప్రస్తుతానికి బొగ్గుకే పరిమితం.. భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి ఆంధ్రలోని కొవ్వూరుకు ఓ రైల్వే లైన్‌ను పదేళ్ల కింద మంజూరు చేశారు. ప్రస్తుతం బొగ్గు తరలింపునకు నిర్మించిన మార్గాన్ని దానికి అనుసంధానించి పొడిగిస్తే బాగుటుందనే ప్రతిపాదనలు ఉన్నాయి. భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి మరో అదనపు లైను బదులు, సత్తుపల్లి వరకు నిర్మించిన బొగ్గు తరలింపు లైన్‌ను పొడిగిస్తే ఖర్చు తగ్గుతుందన్నది ఆలోచన. కానీ దీనిని సింగరేణి సంస్థ ఆమోదించాల్సి ఉంది. -
రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఇక నుండి ఫ్రీ ఫుడ్
-
రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఆ ప్రయాణికులకు ఉచిత ఆహారం!
భారతీయ రైల్వే.. రోజూ కొన్ని లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేరుస్తూ, ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ప్రయాణికులకు అందించే సర్వీస్ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ముందుకు దుసుకుపోతోంది. ఎప్పటికప్పుడు కొత్త సేవలను ప్రవేశపెడుతూ ప్రయాణికుల సౌకర్యానికి పెద్ద పీట వేస్తుంది ఇండియన్ రైల్వేస్. తాజాగా ప్రయాణికుల కోసం మరో సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి ఏకంగా తన ప్రయాణికులకు ఉచిత ఆహార సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం! ప్రస్తుత పండుగ సీజన్లో భారతీయ రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీపావళి, ఛత్ వంటి పండుగల సందర్భంగా భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం అనేక ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. మరో వైపు రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఉచిత ఆహార సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. అయితే గమనించల్సిన విషయం ఏంటంటే.. రైల్వే శాఖ ఈ సదుపాయం ప్రతి రైలులోని ప్రయాణీకులకు అందుబాటులో ఉండదని తెలపింది. కేవలం కొన్ని రైళ్లకు మాత్రమేనని.. ఆ జాబితాలో డుర్యాంటో ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది వంటి లగ్జరీ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఉచిత ఆహార సౌకర్యం పొందాలంటే.. రైలు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయిన రైలులోని ప్రయాణికులకు మాత్రమే ఈ ఉచిత సర్వీస్ అందిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం, పై తెలిపిన వాటి ప్రకారం ప్రయాణీకులు పూర్తి భోజనం లేదా మధ్యాహ్న అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనం మొదలైనవి, అలాగే కొన్ని ఎంపిక చేసిన పానీయాలు కూడా ఉచితంగా అందిస్తారు. చదవండి: ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యజమాని.. జీవితాంతం కరెంట్ ఫ్రీ! -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్!
భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. దేశ వ్యాప్తంగా అనేక మార్గాల్లో రైళ్ల వేగాన్ని పెంచే విధంగా రైల్వే యంత్రాంగం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో రైళ్ల వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చెన్నై–గూడూరు మార్గంలో రైలు వేగాన్ని పెంచే విధంగా నిర్వహించిన ట్రైల్ రన్ సంతృప్తికరంగా జరిగినట్లు దక్షిణ రైల్వే జీఎం బీజీ మాల్య తెలిపారు. రైల్వే డివిజనల్ మేనేజర్ గణేష్, ప్రధాన ఇంజినీర్ దేశ్ రతన్ గుప్తాతో కలిసి గురువారం ఈ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. 110 కి.మీ వేగం నుంచి 130 కి.మీ వరకు పరిశీలించారు. చివరకు 143 కి.మీ వరకు నడిపారు. రైళ్ల వేగం పెంచడం ద్వారా ప్రయాణ సమయం తగ్గతుందని, తద్వారా ప్యాసింజర్ల విలువైన సమయం ఆదా కానుంది. సంతృప్తికరం ట్రయల్ రన్ గురించి శుక్రవారం రైల్వే జీఎం బీజీ మాల్య మీడియాతో మాట్లాడారు. చెన్నైగూడూరు మార్గంలో అన్ని స్టేషన్లలో ఇంటర్‌లాకింగ్ ప్రమాణాల సామర్థ్యం పెంచామని తెలిపారు. ట్రాక్, సిగ్నల్, టీఆర్డీ, రోలింగ్ స్టాక్‌ల నిర్వహణ అవసరం పెరిగినట్లు వివరించారు. ఈ మార్గంలో వేగంగా సాగిన ట్రయల్ రన్ సంతృప్తిని కలిగించిందన్నారు. వేగం పెరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, హౌరా, ముంబై వైపుగా వెళ్లే అనేక రైళ్ల ప్రయాణ సమయం తగ్గుతుందని తెలిపారు. తదుపరి పవిత్ర పుణ్య క్షేత్రం తిరుపతిని కలిపే విధంగా చెన్నై–రేణిగుంట మార్గంలో వేగం పెంపునకు ట్రయల్ రన్ నిర్వహించనున్నామని తెలిపారు. ఆ తర్వాత అరక్కోణం–జోలార్‌పేట–పొత్తనూరు, సేరనూర్, తిరువనంతపురం, ఆలపులా, మంగళూరు తదితర మార్గాలపై దృష్టి పెడతామన్నారు. చివరగా, ఎగ్మూర్ నుంచి విల్లుపురం, తిరుచ్చి, దిండుగల్ మార్గంలో వేగం పెంపునకు చర్యలు తీసుకుంటామన్నారు. వేగంగా రైళ్లు నడిపేందుకు తగ్గ అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడతాయని తెలిపారు. చదవండి: క్రెడిట్ కార్డ్ పేమెంట్ కష్టంగా మారిందా, అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి! -
ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే శాఖ... ఆ రూట్లలో 80 రైళ్లు రద్దు!
దసరా పండుగ సీజన్ ప్రారంభమైంది. ప్రజలు నగరాలను విడిచి వారి సొంతూర్లకు పయనమవుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు రద్దీగా మారాయి. ఈ తరుణంలో రైల్వే శాఖ ప్రయాణికులకు భారీ షాక్‌నే ఇచ్చింది. పలు కారణాల వల్ల దాదాపు 80 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. అక్టోబర్ 1న బయలుదేరాల్సిన 52 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, 26 రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణ, మౌలిక సదుపాయాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రద్దు చేయబడిన రైళ్ల జాబితాలో లక్నో, వారణాసి, ఢిల్లీ, కాన్పూర్, మరిన్ని నగరాల నుంచి నడిచే రైళ్లు ఉన్నాయి. ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్ల ఆటోమేటిక్‌గా రద్దు అవుతుందని, ఆ మొత్తం నగదు వినియోగదారు ఖాతాలలో నేరుగా రీఫండ్ కానుంది. కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు రీఫండ్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి రిజర్వేషన్ కౌంటర్‌ను సందర్శించాల్సి ఉంటుంది. చదవండి: బ్యాంకింగ్ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే! -
కిక్కిరిసిన జర్నీ.. అరకొర రైళ్లే.. ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలు వసూలు
సాక్షి, హైదరాబాద్: నగరం పల్లెబాట పట్టింది. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో గత రెండు రోజులుగా బస్సులు, రైళ్లలో రద్దీ పెరిగింది. పండగకు మరో మూడు రోజులే ఉండడడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. దీంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర కూడళ్ల వద్ద ప్రయాణికుల రద్దీ కనిపించింది. అలాగే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి కూడా ప్రయాణికులు సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ సంఖ్యలో బయలుదేరారు. ఈ సంవత్సరం ఆర్టీసీ పుణ్యమా అని పండగ ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. ఆర్టీసీ బస్సుల్ని సాధారణ చార్జీలపైనే ప్రత్యేక బస్సులు నడుపుతుండడంతో ప్రయాణికుల ఆదరణ పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కడప, కర్నూలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సుల్లో మాత్రం యథావిధిగా దారిదోపిడీ కొనసాగుతోంది. రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. దక్షిణమధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు అరకొరగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. డిమాండ్ మేరకు రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు అదనంగా ప్యాసింజర్ రైళ్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా వరకు బస్సులపైనే ఆధారపడి ప్రయాణం చేయవలసి వస్తోంది. అరకొర రైళ్లే... ► ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయవలసి ఉండగా, ఈసారి అదనపు రైళ్లను చాలా వరకు తగ్గించారు. ► కొన్ని ప్రాంతాలకు మాత్రమే సుమారు 20 రైళ్లను అదనంగా ఏర్పాటు చేశారు. ► దసరా సందర్భంగా ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలకు ► అదనపు రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో వెళ్లేందుకు అవకాశం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ► ‘కనీసం జనరల్ బోగీలను కూడా అదనంగా ఏర్పాటు చేయడం లేదు. ఒక్కో బోగీలో వందలకొద్దీ కిక్కిరిసి ప్రయాణం చేయవలసి వస్తుంది’. అని కాగజ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఫణీంద్ర విస్మయం వ్యక్తం చేశారు. ► తెలంగాణ ప్రాంతాలకు రైలు సర్వీసుల విస్తరణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని సికింద్రాబాద్ నుంచి వికారాబాద్‌కు వెళ్తున్న మరో ప్రయాణికుడు శ్రీనివాస్ ఆరోపించారు. దూరప్రాంతాలకు మాత్రమే పరిమితంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు... ► తెలుగు రాష్ట్రాలకు ప్రతి రోజు సుమారు 3500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని 4400కు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ► విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, కర్నూలు, కడప, తిరుపతి తదితర నగరాలతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ► అక్టోబర్ 1 నుంచి రద్దీ మరింత పెరగనున్న దృష్ట్యా రోజుకు 500 నుంచి 1000 వరకు అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఏ బస్సులు ఎక్కడి నుంచి బయలుదేరుతాయి.. సీబీస్: అనంతపూర్, చిత్తూరు, కడప,కర్నూలు,ఒంగోలు, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్‌రోడ్డు: వరంగల్, హనుమకొండ, జనగామ, యాదగిరిగుట్ట వైపు దిల్సుఖ్నగర్: నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట .. జేబీఎస్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లేవి.. ఎల్బీనగర్: వైజాగ్, విజయవాడ, గుంటూరు వైపు .. ఎంజీబీఎస్: మహబూబ్‌నగర్,వికారాబాద్, తాండూరు, భద్రాచలం, తదితర ప్రాంతాలకు.. సాధారణ చార్జీలే.. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించరాదని, సాధారణ చార్జీలపైనే ఆర్టీసీ బస్సులు అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న దృష్ట్యా సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ నాయక్ కోరారు. ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్లు నమోదు చేసుకోవచ్చునని, నేరుగా ప్రయాణసమయంలోనూ టిక్కెట్లు తీసుకోవచ్చునని తెలిపారు. -
దసరా సీజన్.. ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్–తిరుపతి (07469/07470) స్పెషల్ ట్రైన్ ఈనెల 25న సాయంత్రం 5.50 గంటలకి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 26న రాత్రి 8.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.20కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–యశ్వంత్‌పూర్ (07233/07234) స్పెషల్ ట్రైన్ ఈనెల 25, 27 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు బయల్దేరి మలిరోజు ఉదయం 10.50కి యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 26, 28 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకి యశ్వంత్‌పూర్ నుంచి బయల్దేరి తర్వాత రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
ఆదాయంలో అదరగొట్టిన రైల్వేస్: కారణాలివే!
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ఆదాయంలో అదరగొట్టింది. ఈ ఏడాది ఆగస్ట్ చివరికి రూ.95,487 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలిస్తే రూ.26,271 కోట్లు (38 శాతం) అధికంగా నమోదైంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల రూపంలో వచ్చిన ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలానికి రూ.13,574 కోట్లు రాగా, 116 శాతం వృద్ధితో ఈ ఏడాది రూ.25,277 కోట్లకు చేరింది. రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ విభాగాల్లోనూ వృద్ధి నెలకొంది. బొగ్గు రవాణాతో పాటు ఆహార ధాన్యాలు, ఎరువులు, సిమెంట్, మినరల్ ఆయిల్, కంటైనర్ ట్రాఫిక్ మరియు బ్యాలెన్స్ ఇతర వస్తువుల విభాగాలు ఈ వృద్ధికి ముఖ్యమైన దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సరుకు రవాణా రూపంలో ఆదాయం 20 శాతం వృద్ధితో (రూ.10,780 కోట్లు) రూ.65,505 కోట్లకు చేరింది. 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రైల్వే ఆదాయం రూ.1,91,278 కోట్లుగా ఉండడం గమనార్హం. -
రైళ్లిక రయ్.. గంటకు 130 కి.మీ. వేగంతో పరుగులు!
సాక్షి, హైదరాబాద్: రైలు అనగానే.. నెమ్మది ప్రయాణం, అనుకున్న సమయానికి గమ్యం చేరదన్న అభిప్రాయమే మదిలో మెదులుతుంది. ఆ అపప్రదను చెరిపేస్తూ విప్లవాత్మక మార్పులతో దూసుకుపోతున్న భారతీయ రైల్వే మరో చారిత్రక ఘనతను సాధించేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటివరకు చేసిన ప్రయోగాలు విజయవంతం కావటంతో నిర్దిష్ట రూట్లలో రైళ్లు గరిష్ట వేగంతో దూసుకుపోయేందుకు అనుమతి లభించింది. దీంతో సోమవారం నుంచి ఆయా మార్గాల్లో సాధారణ రైళ్లు కూడా గంటకు 130 కి.మీ. వేగంతో పరుగులు పెట్టనున్నాయి. మూడేళ్ల కసరత్తు తర్వాత.. దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని దశలవారీగా పెంచాలని నిర్ణయించిన రైల్వే అందుకోసం మూడేళ్లుగా కసరత్తు చేస్తోంది. రైలు మార్గాల్లో కీలకమైన స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ మార్గాల్లో తొలుత దీన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించి, ఆ మార్గాల్లో ట్రాక్‌లు 130 కి.మీ వేగాన్ని తట్టుకునేలా పటిష్టం చేసింది. కోవిడ్ సమయంలో రైళ్ల రాకపోకలపై నిషేధం ఉండటాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పటిష్టపరిచే పనులను వేగంగా పూర్తి చేసింది. ఇటీవలే ముంబయి, చెన్నై మార్గాల్లో కొన్ని రైళ్లు ఈ వేగంతో వెళ్లేలా అనుమతించిన రైల్వే, తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ అనుమతినిచ్చింది. ఏ డివిజన్లో ఏయే మార్గాలు..? ప్రస్తుతం అన్ని మార్గాల్లో ఈ వేగం సాధ్యం కాదు, ట్రాక్‌ను పటిష్టపరిచిన పరిమిత మార్గాల్లోనే ఇది సాధ్యమవుతుంది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్–కాజీపేట–బల్లార్షా, కాజీపేట–కొండపల్లి సెక్షన్లు, విజయవాడ డివిజన్ పరిధిలోని కొండపల్లి–విజయవాడ–గూడూరు, గుంతకల్ డివిజన్ పరిధిలోని రేణిగుంట–గుంతకల్–వాడి సెక్షన్ల పరిధిలో ఈ వేగానికి అనుమతించారు. ఈ మార్గాలు నిత్యం అన్ని వేళలా రద్దీగా ఉండేవి కావడం గమనార్హం. ప్రస్తుతానికి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు.. ప్రీమియం రైళ్లుగా ఉన్న రాజధాని, దురొంతో ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని గత ఏప్రిల్‌లోనే 130కి పెంచారు. అప్పటివరకు అవి 120 వేగంతో వెళ్లేవి. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇంతకాలం గంటకు 110 కి.మీ. వేగంతో వెళ్తూ వస్తున్నాయి. ఇప్పుడివన్నీ ఆయా రూట్లలో 130 కి.మీ. వేగంతో దూసుకుపోనున్నాయి. ప్రస్తుతానికి ప్యాసింజర్ రైళ్ల వేగం కొంత తక్కువే ఉండనుంది. ఎక్కువ స్టాపులుండటం, సిగ్నళ్ల పరిధి ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఇక గూడ్సు రైళ్లు కూడా ఇప్పుడు వేగంగా దూసుకుపోయేలా మార్చారు. వాటిల్లో వ్యాగన్ల రకాన్ని బట్టి వేగంలో కొంత మార్పులుంటాయి. కొన్ని గంటకు 130 కి.మీ. వేగంతో, కొన్ని 100 కి.మీ, మరికొన్ని 80 కి.మీ. వేగంతో దూసుకుపోనున్నాయి. ప్రస్తుతం స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ (గ్రాండ్ ట్రంకు కారిడార్) మార్గాలు కాకుండా త్వరలో మరిన్ని కారిడార్లను కూడా పటిష్టం చేసి మిగతా రూట్లలో కూడా రైళ్లను 130 కి.మీ. వేగంతో నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్!
రైల్వే ప్రయాణికులకు కేంద్రం భారీ షాకిచ్చింది. బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటే వాటిపై జీఎస్టీ వసూలు చేయనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ సర్క్యిలర్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే.. ఆ టికెట్లపై మాత్రమే 5 శాతం జీఎస్టీని విధిస్తున్నట్లు తెలిపింది. ట్రైన్ టికెట్ రద్దుపై ఛార్జీ (జీఎస్టీ) అనేది.. ఒప్పంద ఉల్లంఘనకు బదులుగా చెల్లించేదని ఆ సర్క్యిలర్‌లో పేర్కొంది. క్యాన్సిలేషన్‌పై జీఎస్టీ ఎందుకు? మంత్రిత్వ శాఖ ట్యాక్స్ రీసెర్చ్ యూనిట్ (TRU) జారీ చేసిన సర్క్యిలర్‌లో టిక్కెట్ల బుకింగ్ అనేది 'కాంట్రాక్టు'. వసూలు చేసిన జీఎస్టీ కింద సర్వీస్ ప్రొవైడర్ (ఐఆర్సీటీసీ/ఇండియన్ రైల్వే ) కస్టమర్లకు సేవల్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఎంత వసూలు చేస్తుంది సాధారణంగా ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటే.. ఆ బుకింగ్ పై 5శాతం జీఎస్టీని వసూలు చేస్తుంది. ఇప్పుడు అదే టికెట్లను బుక్ చేసుకొని రద్దు చేస్తే 5శాతం జీఎస్టీని విధిస్తుంది. ఉదాహరణకు ఒక్క క్యాన్సిలేషన్ టికెట్‌పై రూ.240 వసూలు చేస్తుండగా ట్యాక్స్ రూ.12 + రూ.240 (జీఎస్టీ)ని వసూలు చేయనుంది. -
Indian Railways: మన డేటాతో రైల్వే వ్యాపారం!
న్యూఢిల్లీ: ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్న ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా ప్రయాణికుల డేటాపై దృష్టి సారించింది. వివిధ ప్రైవేట్, ప్రభుత్వ రంగ కంపెనీలకు ఈ డేటాను అందించే వ్యాపారం ద్వారా రూ. 1,000 కోట్ల వరకూ ఆదాయం సమకూర్చుకోవచ్చని (మానిటైజేషన్) అంచనా వేస్తోంది. అలాగే కస్టమర్లకు సదుపాయాలను, సర్వీసులను మరింత మెరుగుపర్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని భావిస్తోంది. ఈ ప్రతిపాదన అమలుకు విధి విధానాలను రూపొందించడానికి కన్సల్టెంట్ సర్వీసులను ఐఆర్సీటీసీ వినియోగించుకోనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా టెండరు ప్రకటన జారీ చేసింది. ఆతిథ్య, ఇంధన, మౌలిక, వైద్య తదితర రంగాల సంస్థలకు ఈ తరహా డేటా ఉపయోగకరంగా ఉండగలదని భావిస్తున్నట్లు టెండరు ప్రకటనలో పేర్కొంది. ఉదాహరణకు ట్రావెల్ సంస్థలతో ఈ డేటాను పంచుకుంటే.. ఆయా సంస్థలు తమ సర్వీసులు వినియోగించుకోవాలంటూ ప్రయాణికులకు వివరాలను పంపే అవకాశముంది. ‘‘భారతీయ రైల్వేస్ తన కస్టమర్/వెండార్ యాప్‌లు, అంతర్గత యాప్‌లలో ఉండే డేటాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని హోటల్, ట్రావెల్, బీమా, వైద్యం, ఏవియేషన్ తదితర విభాగాల సంస్థలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం ద్వారా మానిటైజ్ చేయదల్చుకుంది. తద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని .. అలాగే కస్టమర్లకు సదుపాయాలను, సేవలను మరింత మెరుగుపర్చవచ్చని భావిస్తోంది’’ అని వివరించింది. దీనికోసం ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ .. వినియోగదారు డేటాను ఈ విధంగా ఉపయోగించుకోవడంలో గోప్యతా నిబంధనలపరంగా ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించవచ్చనే అంశంపై తగు సూచనలు చేయాల్సి ఉంటుంది. డేటా ప్రైవసీ విషయంలో చట్టాలు, సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రణాళికను అమలు చేసేందుకు నిబంధనలను క్షుణ్నంగా అధ్యయం చేయా ల్సి ఉంటుంది. ప్రయాణికులు, రవాణా సేవలు ఉపయోగించుకునే కస్టమర్లు మొదలైన వర్గాల ప్రాథమిక డేటాను విశ్లేషించాలి. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, అయితే దీన్ని అమలు చేయాలంటూ రైల్వే బోర్డు నుంచి ఒత్తిడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రైవసీకి రిస్కులపై సందేహాలు... ప్రయాణికుల వ్యక్తిగత డేటాను ఇలా ఎవరికిపడితే వారికి ఇవ్వడమనేది వినియోగదారుల హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లయ్యే అవకాశాలు ఉన్నా యని సీయూటీఎస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అమోల్ కులకర్ణి అభిప్రాయపడ్డారు. సాధారణంగా డేటాను క్రోడీకరించి, ఏ వివరాలు ఎవరివి అనేది బైటపడకుండా గోప్యంగాను, భద్రంగానూ ఉంచాలని ఆయన చెప్పారు. అయితే, గోప్యనీయతను పాటించకుండా ఐఆర్సీటీసీ గానీ ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు డేటాను ఇచ్చిన పక్షంలో ప్రైవసీ హక్కులకు భంగం కలగడంతో పాటు సదరు డేటా దుర్వినియోగానికి అవకాశాలు ఉన్నాయని కులకర్ణి పేర్కొన్నారు. అయితే, ఇలా డేటాను షేర్ చేసుకోవడం అక్రమం అనేందుకు తగిన చట్టాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ డేటాను షేర్ చేసుకుంటే దాన్ని తాను భద్రంగా ఉంచడంతో పాటు థర్డ్ పార్టీలు కూడా పటిష్టమైన ప్రమణాలు పాటించేలా ఐఆర్సీటీసీ చూడాల్సి ఉంటుందని కులకర్ణి చెప్పారు. రోజుకు 11 లక్షలకు పైగా టికెట్లు.. రైల్వే టికెట్లను బుక్ చేసుకునేందుకు ఏకైక మార్గంగా ఈ విషయంలో ఐఆర్సీటీసీకి గుత్తాధిపత్యం ఉంది. కంపెనీ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఐఆర్సీటీసీ ప్లాట్‌ఫాం ద్వారా 43 కోట్ల పైచిలుకు టికెట్లు బుక్ అయ్యాయి. రోజువారీ దాదాపు 63 లక్షల లాగిన్స్ నమోదయ్యాయి. 8 కోట్ల మంది పైగా యూజర్లు ఐఆర్సీటీసీ ఆన్లైన్ సేవలు వినియోగించుకుంటున్నారు. టికెట్ల బుకింగ్స్‌లో దాదాపు 46 శాతం వాటా మొబైల్ యాప్‌దే ఉంటోంది. ఈ నేపథ్యంలో కంపెనీ దగ్గర భారీ స్థాయిలో ప్రయాణికుల డేటా ఉంటోంది. -
భారతీయ రైల్వేతో భాగస్వామ్యం.. రెండు రోజుల్లోనే అమెజాన్ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినియోగదారులకు త్వరితగతిన ఉత్పత్తులను చేర్చడం కోసం భారతీయ రైల్వేతో కలిసి పనిచేస్తున్నట్టు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తెలిపింది. ప్రస్తుతం 110కిపైగా ఇంటర్–సిటీ మార్గాల్లో సరుకులను చేరవేస్తున్నట్టు వివరించింది. తద్వారా దేశవ్యాప్తంగా 97 శాతం పిన్‌కోడ్స్ ప్రాంతాల్లో ఒకట్రెండు రోజుల్లోనే కస్టమర్ల చేతుల్లో బుక్ చేసిన ఉత్పత్తులు ఉంటాయని తెలిపింది. 2019లో రైల్వేతో భాగస్వామ్యం కుదుర్చుకున్న నాటి నుంచి సరుకు రవాణా మార్గాలను పెంచుతూ వస్తున్నట్టు అమెజాన్ వివరించింది.