రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఆ టెన్షన్‌ లేదు, కొత్త సర్వీస్‌ వచ్చేసింది! | Indian Railways Starts Destination Alarm Service For Night Time Travelling Passengers | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఆ టెన్షన్‌ లేదు, కొత్త సర్వీస్‌ వచ్చేసింది!

Published Mon, Nov 7 2022 10:09 PM | Last Updated on Mon, Nov 7 2022 10:38 PM

Indian Railways Starts Destination Alarm Service For Night Time Travelling Passengers - Sakshi

ఇండియన్‌ రైల్వేస్‌.. ప్రతి రోజు లక్షల మంది ప్యాసింజర్లను వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు కోట్ల రూపాయలు సరకులను రావాణా చేస్తూ ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తోంది. ప్రయాణికుల సేవలు అందించడంలో ఏ మాత్రం రాజీ పడకుండా ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా మరో సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది భారతీయ రైల్వే.  రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

సరికొత్త సేవ
ఇకపై రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్లు రైలులో నిద్రిపోయినా ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే రైల్వే శాఖ సరికొత్త సేవని ప్రవేశపెట్టింది. ‘డెస్టినేషన్ అలర్ట్ వేక్ అప్ అలారం’ పేరుతో కొత్త సర్వీసును ప్రారంభించింది భారతీయ రైల్వే . ఇదివరకే రాత్రి వేళ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నుంచి ఈ అంశంపై పలుమార్లు రైల్వే బోర్డుకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు రైల్వేశాఖ ఈ సౌకర్యాన్ని తీసుకువచ్చింది.

ఎంక్వైరీ సర్వీస్ నంబర్ 139లో రైల్వే ఈ కొత్త సేవను ప్రారంభించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రైల్వే ప్రయాణికులకు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ సర్వీసు ద్వారా ప్యాసింజర్లు వారి స్టేషన్‌కు చేరుకునే వరకు ఆందోళన లేకుండా నిద్రపోవచ్చు. ఇది ఎలా పని చేస్తుందంటే.. ప్యాసింజర్‌ వారి గమ్య స్థానానికి చేరుకునే 20 నిమిషాల ముందు రైల్వే శాఖ నుంచి మీకు అలర్ట్‌ వస్తుంది. దీని ద్వారా మీరు నిద్రలేచి మీ గమ్య స్థానానికి చేరుకుంటారు.

ఇలా ఉపయోగించుకోండి
డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం సేవను ప్యాసింజర్లు ఉపయోగించుకోవాలంటే.. ఐఆర్‌సీటీసీ( IRCTC) హెల్ప్‌లైన్ 139కి కాల్ చేయాలి. మీరు గమ్యస్థాన అలర్ట్‌ కోసం ముందుగా 7 నంబర్‌లను, ఆపై 2 నంబర్‌లను నొక్కాలి. తర్వాత మీ 10 అంకెల పీఎన్‌ఆర్‌(PNR) నెంబర్‌ను నమోదు చేయాలి. దీన్ని నిర్ధారించడానికి 1 డయల్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు స్టేషన్ చేరుకోవడానికి 20 నిమిషాల ముందు వేకప్ అలర్ట్ వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement