Alarm
-
మార్నింగ్ టైం అనేక అలారాలు సెట్ చేస్తున్నారా?
ఉదయమే మేల్కోవడం కోసం అలారం సెట్ చేసుకుంటాం. అలారం మోగిన వెంటనే మేల్కోంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ కొందరూ ఉదయం టైంలో అనేక అలారాలు సెట్ చేస్తారు. పోనీ మేల్కోంటారా అంటా అంత సీన్ లేదన్నట్లుగా ముసుగు తన్నీ పడుకుంటారు. ఆ తర్వాత హడావిడిగా ఉరుకులు పరుగులతో ఆఫీసులకు, కాలేజ్‌లకు యథావిధిగా పరుగులు పెడతారు. అయితే ఆరోగ్య నిపుణులు ఇలా అనేక అలారంలు సెట్ చేయడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని కూడా చెబుతున్నారు. అలారానికి ఆరోగ్యానికి ఏంటి సంబంధం..? ఎలా హెల్త్‌పై ప్రభావం చూపిస్తుంది తదితరాల గురించి సవివరంగా చూద్దాం. చాలామంది ఉదయం 6.00లకు ఆఫీస్ వెళ్లాలని 4.00ల నుంచి అలారాలు సెట్ చేస్తారు. ఆ తర్వాత అలారం మోగిన వెంటనే స్నూజ్ బటన్ నొక్కి 4.30, 5,,5.30 ఇలా సెట్ చేసుకుంటూ పోతారు ఏదో ఒకటైంకి లేవకపోదుమా అనుకుని ఇలా అనేక అలారాలు సెట్ చేస్తారు. దీని కారణంగా నాణ్యమైన నిద్ర పట్టక ఆరోగ్యంపై తీప్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. క్లాక్ యాప్‌ని ఎక్కువ మార్నింగ్ అలారాలతో ఓవర్లోక్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇది గందరగోళానికి గురిచేసి అలసిపోయేట్లు చేస్తుందని అన్నారు. " నిజానికి శారీరక, మానసిక ఆరోగ్యంలో మంచి నిద్ర అనేది కీలకం. మంచి నిద్ర ఉంటేనే ఉదయం చురుకుగా పనిచేయగలం లేదంటే ఆ రోజంతా డల్‌గా ఉంటాం. పైగా మనకు తెలియకుండానే ఓ రోజు వృధా అయిపోతుంది. అదీగాక మన నిద్రలో చివరి నాల్గవదశలో గాఢనిద్ర పడుతుంది. ఆ టైం మన స్మృతులు, జ్ఞాపకాలు కలల రూపంలో వచ్చే మంచి సమయం. ఈ దశ నిద్ర ప్రతిఒక్కరికి కీలకమైనది. ఆ సమయంలో నిద్ర పాడయ్యితే మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎలాంటి సమస్యలు వస్తాయంటే..ఉదయం గనుక అనేక అలారాలతో మేల్కొలపడం వల్ల వేగ వంతమైన కంటి కదలిక చక్రానికి తరచుగా అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల మగత, అలసట, మానసిక కల్లోలం ఏర్పడి కార్డిసాల్ స్టాయిలు పెరుగతాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే అలార్ ఆఫ్ అయిన ప్రతిసారీ శరీరం "ఫైట్ లేదా ఫ్లైట్ రెస్పాన్స్"లోకి వెళుతుందని వివరించారు. ఇది ఒత్తిడితో కూడుకున్న స్థితి. కాలక్రమేణ ఈ ఒత్తిడి హృదయనాళ సమస్యలకు కారణమవుతుంది. స్థిరమైన నిద్ర లేకపోవడం వల్ల మీ శరీరంలో ఏర్పడే ఉద్రిక్తతలు కూడా బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. "అధిక కార్టిసాల్ స్థాయిలు మిమ్మల్ని బరువుగా పెంచుతాయి. కాబట్టి అలారం మోగిన వెంటనే లేవండి మంచిగా కాస్త రిలాక్స్ అయ్యే చిన్నపాటి వ్యాయామాలు చేయండి. ఒక్క అలారం మాత్రమే సెట్ చేయండి. ఆ టైంకి మోగిన వెంటనే లేవండి. ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు నిపుణులు. అలాకాకుండా ఉదయం 7 గంటలకు లేవాలని ఆరు గంటల నుంచే అనేక అలారాలు సెట్ చేస్తే నాణ్యమైన నిద్ర పొందలేక అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటారని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేగాదు నిపుణులు ఒకటైంకి సెట్ చేసుకున్న అలారాన్ని బెడ్‌కి కాస్త దూరంలో పెట్టుకుంటే ఆపడం కోసమైన ఆటోమేటిగ్గా లేవడం జరుగుతుంది. అనేక అలారాలు పెట్టాల్సిన పరిస్థితి కూడా రాదని అంటున్నారు. అలాగే మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిరోజూ దాదాపు ఒకే సమయాల్లో మేల్కోవడం, పడుకోవడం చాలా కీలకమని అని చెబుతున్నారు. కాబట్టి ఉదయం అనేక అలరాల సెట్ చెయ్యకండి ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేసుకోకండి.(చదవండి: ఖాళీ కడుపుతో వ్యాయామాలు చేయొచ్చా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
రైల్లో అలారం చైన్‌కు లగేజీ తగిలిస్తే కేసు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీ బ్యాగులు, సెల్ఫోన్లను అలారం చైన్ పుల్లింగ్ పరికరానికి వేలాడదీయడం చట్టరీత్యా తీవ్ర నేరమని రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో హెచ్చరించారు. పలు ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ల కోచ్‌లను ఎల్బీహెచ్ కోచ్‌లుగా ఆధునీకరించారు. అత్యవసర పరిస్ధితిలో రైలును ఆపేందుకు గతంలో ఉపయోగించిన అలారం చైన్ స్థానంలో పాసింజర్స్ ఎమర్జెన్సీ అలారం సిగ్నలింగ్ డివైజ్ (పీఈఏఎస్డీ) అమర్చారు. ఈ పరికరం ఎరుపు రంగుతో హ్యాండిల్‌ను పోలి ఉండటంతో ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీలు, సెల్‌ఫోన్‌ను వేలాడదీస్తున్నారు. ఈ కారణంగా పరికరం ఆటోమెటిక్‌గా లాక్ అయ్యి రైలు నిలిచిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ఈ తరహా ఘటనలు అక్టోబరు వరకూ డివిజన్ వ్యాప్తంగా 2,159 జరిగినట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు సరైన కారణం లేకుండా అలారం చైన్ ఉపయోగించడం తీవ్ర నేరమని, రైల్వే చట్టం 141 సెక్షన్ ప్రకారం రూ.1000 జరిమానా, లేదా ఒక ఏడాది జైలు శిక్ష లేదా రెండు విధించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చదవండి: ‘స్కిల్’ శిక్షకులకు ఆహ్వానం -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఆ టెన్షన్ లేదు, కొత్త సర్వీస్ వచ్చేసింది!
ఇండియన్ రైల్వేస్.. ప్రతి రోజు లక్షల మంది ప్యాసింజర్లను వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు కోట్ల రూపాయలు సరకులను రావాణా చేస్తూ ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తోంది. ప్రయాణికుల సేవలు అందించడంలో ఏ మాత్రం రాజీ పడకుండా ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా మరో సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది భారతీయ రైల్వే. రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సరికొత్త సేవ ఇకపై రాత్రి పూట ప్రయాణించే ప్యాసింజర్లు రైలులో నిద్రిపోయినా ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే రైల్వే శాఖ సరికొత్త సేవని ప్రవేశపెట్టింది. ‘డెస్టినేషన్ అలర్ట్ వేక్ అప్ అలారం’ పేరుతో కొత్త సర్వీసును ప్రారంభించింది భారతీయ రైల్వే . ఇదివరకే రాత్రి వేళ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నుంచి ఈ అంశంపై పలుమార్లు రైల్వే బోర్డుకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు రైల్వేశాఖ ఈ సౌకర్యాన్ని తీసుకువచ్చింది. ఎంక్వైరీ సర్వీస్ నంబర్ 139లో రైల్వే ఈ కొత్త సేవను ప్రారంభించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రైల్వే ప్రయాణికులకు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ సర్వీసు ద్వారా ప్యాసింజర్లు వారి స్టేషన్‌కు చేరుకునే వరకు ఆందోళన లేకుండా నిద్రపోవచ్చు. ఇది ఎలా పని చేస్తుందంటే.. ప్యాసింజర్ వారి గమ్య స్థానానికి చేరుకునే 20 నిమిషాల ముందు రైల్వే శాఖ నుంచి మీకు అలర్ట్ వస్తుంది. దీని ద్వారా మీరు నిద్రలేచి మీ గమ్య స్థానానికి చేరుకుంటారు. ఇలా ఉపయోగించుకోండి డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం సేవను ప్యాసింజర్లు ఉపయోగించుకోవాలంటే.. ఐఆర్సీటీసీ( IRCTC) హెల్ప్‌లైన్ 139కి కాల్ చేయాలి. మీరు గమ్యస్థాన అలర్ట్ కోసం ముందుగా 7 నంబర్లను, ఆపై 2 నంబర్లను నొక్కాలి. తర్వాత మీ 10 అంకెల పీఎన్ఆర్(PNR) నెంబర్‌ను నమోదు చేయాలి. దీన్ని నిర్ధారించడానికి 1 డయల్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు స్టేషన్ చేరుకోవడానికి 20 నిమిషాల ముందు వేకప్ అలర్ట్ వస్తుంది. -
ఫన్నీ వీడియో: దొంగలుగా పొరబడి.. ఒకరిపై ఒకరుపడి
-
అలర్ట్ ఫీచర్.. ‘రైలులో ప్రశాంతంగా నిద్రపోవచ్చు’
Indian Railways Destination Alert Service: రైలు ప్రయాణికులు తాము దిగాల్సిన స్టేషన్ కోసం ఆన్లైన్లో నిత్యం పరిశీలించాల్సి వస్తుంది. అదే రాత్రి వేళల్లో అయితే బోగీలో లైట్లన్నీ ఆర్పి ఉండటం, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కావడంతో వేగంగా వెళ్లడంతో రైలులో నుంచి రైల్వేస్టేషన్లను గుర్తు పట్టే పరిస్థితి ఉండదు. అర్ధరాత్రి దిగాల్సిన స్టేషన్ కోసం నిద్రపోకుండా ఎదురుచూస్తూ ఉండాలి. కానీ ఇక నుంచి రిజర్వేషన్లో ప్రయాణించే ప్రయాణికులు తమ బెర్త్‌లో ప్రశాంతంగా నిద్రపోయేందుకు భారత రైల్వే అలర్ట్ ఫీచర్ ఆప్షన్ తీసుకువచ్చింది. రైలులో నిద్రపోతున్న ప్రయాణికుడు ఇందులో భాగంగా 139కు కాల్ చేసి, మీ రిజర్వేషన్ టికెట్‌పై ఉన్న పీఎన్ఆర్ నంబర్ చెప్పి, దిగాల్సిన రైల్వేస్టేషన్ పేరు ధ్రువీకరించుకోవాలి. ఈ విధానంతో ప్రయాణికులు దిగాల్సిన స్టేషన్‌కు 20 నిమిషాల ముందు మీ సెల్‌ఫోన్‌కు కాల్ వస్తుంది. ఈ సదుపాయం కేవలం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే ఉంది. ఏదేమైనా రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఇది సౌకర్యంగా ఉంటుంది. చదవండి: వచ్చే నెలలో అమెరికాకు వెళ్లాల్సి ఉంది.. మనవడిని చూడకుండానే.. -
డ్రైవింగ్ సీట్లో నిద్ర..రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తం చేసే డివైజ్
ఎంత అప్రమత్తంగా ఉన్నా ప్రయాణాల్లో ఏ ప్రమాదం ఎటునుంచి మీదకొస్తుందో తెలియని రోజులివి. ఇక దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడైతే.. డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్లకు మరిన్ని జాగ్రత్తలు తప్పవు. స్మూత్‌గా దూసుకుపోయే కారు వంటి వాహనాల్లో నిద్ర ముంచుకొస్తుంటుంది. అప్పుడే రెప్పపాటు కాలంలో ఘోర ప్రమాదాలు జరిగిపోతుంటాయి. అలాంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి.. హెచ్చరించే పరికరమే చిత్రంలోని ఆటో సేఫ్ డివైజ్. విధుల్లో ఉన్నప్పుడు పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన వ్యక్తుల కోసం ఈ రిమైండర్‌ని రూపొందించారు. డ్రైవర్స్, రాత్రిపూట డ్యూటీ చెసే సెక్యూరిటీ గార్డ్స్, మెషిన్ ఆపరేటర్లు ఇలా ఎందరికో ఈ డివైజ్ ఉపయోగపడుతుంది. పోర్టబుల్ సైజుతో డిజైన్ చేసిన ఈ పరికరం.. ప్రాణాలను రక్షించే నిద్ర నిరోధక అలారమే అంటున్నారు నిపుణులు. ఎలక్ట్రానిక్ పొజిషన్ సెన్సార్ కలిగిన ఈ గాడ్జెట్‌ని.. చెవికి బ్లూటూత్ మాదిరి పెట్టుకుంటే సరిపోతుంది. వినియోగిస్తున్నవారు ఏమాత్రం నిద్ర మత్తులో తూగినా చెవిలో వైబ్రేషన్‌తో కూడిన అలారాన్ని మోగించి అలెర్ట్ చేస్తుంది. -
Covid alarm: శరీరంలో వైరస్ ఉంటే మోత మోగుడే!
లండన్: కరోనా సోకిందా లేదా కనుగొనే పద్ధతిని మరింత వేగవంతం చేయడానికి ఓ పరికరాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు. దీని సాయంతో కరోనా సోకిన వ్యక్తిని అక్కడికక్కడే మనం కనిపెట్టగలమని చెప్తున్నారు. ఈ పరికరం కారణంగా వైరస్ వ్యాప్తిని కూడా అడ్డుకోవచ్చని బ్రిటన్ వైద్యుల అంటున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎల్‌ఎస్‌హెచ్‌టిఎమ్), డర్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం.. కోవిడ్ ఇన్ఫెక్షన్కు ప్రత్యేకమైన వాసన ఉందని, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో మార్పుల వల్ల కరోనా రోగి నుంచి ఓ రకమైన వాసన వస్తుందని ఇప్పటికే తేల్చారు. దీని బట్టి ఈ పరికరానికి రోగి శరీరం నుంచి వచ్చే వాసన ఆధారంగా కోవిడ్‌ను నిర్ధారిస్తుందని వెల్లడించారు. ఈ పరికరానికి ‘కోవిడ్ అలారం’ అని పేరు పెట్టారు. డర్హామ్ విశ్వవిద్యాలయంతో ఎల్‌ఎస్‌హెచ్‌టిఎమ్, బయోటెక్ కంపెనీ రోబో సైంటిఫిక్ లిమిటెడ్ పరిశోధకుల నేతృత్వంలో.. ఆర్గానిక్ సెమీ కండక్టింగ్ సెన్సార్లతో ఈ పరికరాన్ని తయారు చేశారు. ‘ఈ అలారం ఫలితాలు నిజంగా ఆశాజనకంగా ఉన్నాయి. అయితే మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం ఈ పరికరానికి మరిన్ని పరీక్షలు అవసరమని’ ఎల్ఎస్హెచ్టిఎమ్లోని వ్యాధి నియంత్రణ విభాగం ప్రొఫెసర్ జేమ్స్ లోగాన్ అన్నారు. చదవండి: రక్తం గడ్డ కట్టి వ్యక్తి మృతి, ఆ దేశంలో ఆస్ట్రాజెనెకా టీకా నిలిపివేత! -
ఏనుగు వస్తే సైరన్ మోగుతుంది!
సాక్షి, పలమనేరు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీ నుంచి సోలార్ ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసి రైతుల పంటల్లోకి వస్తున్న ఏనుగుల సమస్యకు మండలంలోని మొరం గ్రామానికి చెందిన గ్రామీణ శాస్త్రవేత్త పవన్ ఓ పరికరాన్ని కనుగొన్నాడు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పలువురు రైతులు దీన్ని అమర్చుకొని ఏనుగుల బెడద నుంచి ఉపశమనం పొందారు. ఇదెలా పనిచేస్తుందంటే.. అడవికి ఆనుకుని పంటలు సాగుచేసే రైతులు చేలకు తొలుత రాతి స్తంభాలు, లేదా కర్రలతో జియో వైరును లాక్కోవాలి. పొలంలో ఓ చోట సోలార్ ప్యానల్, పవన్ తయారు చేసిన పరికరాన్ని అమర్చుతాడు. ఈ పరికరం సోలార్ సాయంతో పనిచేస్తుంది. పొలంలోని ఫెన్సింగ్ నుంచి వైర్లను గదిలో లేదా ఎక్కడైనా ఉంచిన పరికరానికి అనుసంధానం చేస్తారు. దీంతో పొలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను ఏనుగు టచ్ చేయగానే పరికరంలోని అలా రం గట్టిగా మోగడంతో పాటు ఎల్ఈడీ లైట్లు వెలుగుతాయి. ఫెన్సింగ్‌ను టచ్‌చేస్తే తక్కువ మోతాదుతో కరెంట్ షాక్ కొడుతుంది. ఇది రెండు సెకన్లు మాత్రమే. చదవండి: (ఏఐ రంగంలో అగ్రపథాన తెలంగాణ) దీంతో ప్రాణాపాయం ఉండదు. ఫలితంగా ఏనుగు భయపడి వెనక్కి వెళ్తుంది. ఇదే సమయంలో చుట్టుపక్కల రైతులు, ఫారెస్ట్ అధికారుల మొబైల్‌కు కాల్స్ ఏకకాలంలో వెళ్తాయి. రైతుల ఫోన్లకు రింగింగ్ టోన్గా ఏనుగులు వచ్చాయ్ అంటూ మోగడంతోపాటు మొబైల్ స్క్రీన్‌పై ఏనుగుల పిక్చర్ డిస్ప్లే అవుతుంది. దీంతో రైతులు, ఫారెస్ట్ శాఖ అప్రమత్తమవుతారు. బీట్‌లోని ఎలిఫెంట్ ట్రాకర్స్ అక్కడికి చేరుకొని ఏనుగులను అడవిలోకి మళ్లిస్తారు. ఫలితంగా రైతుల పంటకు రక్షణ దొరుకుతుంది. సెల్‌ఫోన్ సాయంతోనే దీన్ని ఆన్ ఆఫ్ చేయవచ్చు. రైతులకు అందుబాటు ధరలతో.. రైతుల పొలాల ఎకరాలను బట్టి రూ.15 వేల నుంచి రూ.30 వేలతో ఈ పరికరాన్ని తయారు చేసుకోవచ్చునని పవన్ తెలిపాడు. ఇందుకోసం 100 వోల్టుల సోలార్ ప్యానల్, ఆరు రోజులు కరెంటును నిల్వ ఉంచుకొనే 100 య్యాంప్స్ బ్యాటరీ, 12 వోల్టుల ఎనర్జలైజర్ తదితరాలను ఉపయోగించాడు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పలువురు రైతులకు అమర్చాడు. స్థానిక అటవీశాఖ అధికారులు సైతం ఈ పరికరం పనితీరును ప్రత్యక్షంగా గమనించి సంతృప్తిని వ్యక్తం చేశారు. -
ఈ అలారంతో ఉదయం నిద్ర లేవాల్సిందే
మీరు పోద్దున లేవాలనుకున్న లేవలేక పోతున్నారా? ఒక వేళా లేసిన మళ్ళి నిద్రపోతున్నారా?. అయితే మీకు గుడ్ న్యూస్.. అలాంటి వాళ్ల కోసం ఒక యాప్ లాంచ్ అయింది. దాని పేరే ‘ఛాలెంజెస్ అలారం క్లాక్– వేకప్ పజిల్స్’ అనే అలారం యాప్. ఇది అన్ని అలారంల లాగా టైం రిమైండ్ చేయదు ఈ యాప్. ఒక వేళా అన్ని యాప్ లలాగే లేసి ఆఫ్ చేసి పడుకుందామన్నా ఊరుకోదు. ఒకసారి ఈ యాప్‌లో అలారం పెడితే మళ్ళి ఆఫ్ చేయాలంటే గణిత, జ్ఞాపకశక్తి, సీక్వెన్స్, రీటైప్, పిక్చర్, స్మైల్ కు సంబందించిన ఒక పజిల్ ని సాల్వ్ చేయాలి. దాంతో ఆటోమేటిక్‌గా నిద్రమత్తు వదలడంతో పాటు మీ మెదడు కూడా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఈ యాప్‌లో అలారం సెట్ చేయడానికి ముందే ఛాలెంజెస్, గేమ్స్‌ని సెలక్ట్ చేసుకోవాలి. ఈ యాప్ విద్యార్థులకు, ఉద్యోగులకు బాగా పనిచేస్తుంది. దీనికోసం మీరు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మీకు గూగుల్ ప్లేస్టోర్ లో ఉచితంగా లభిస్తుంది. (చదవండి: వివో నుండి మరో బడ్జెట్ ఫోన్) -
కరాచీ విమాన ప్రమాదంపై కొత్త అనుమానాలు
కరాచీ: పాకిస్తాన్లో విమానం కూలి 97 మంది మరణించిన ఘటనపై జరిగిన ప్రాథమిక విచారణలో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. విమానం మొదటిసారి ల్యాండింగ్ ప్రయత్నం చేయగా అది విఫలమైంది. ఆ విషయాన్ని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు చెప్పలేదు. ల్యాండింగ్ ప్రయత్నంలో విఫలమైతే జరిగిన ప్రమాదం వల్ల ఇంజిన్లు, ఇతర విభాగాలు దెబ్బ తిని ఉండవచ్చని.. ఇలా జరిగితే వెంటనే ఎమర్జెన్సీ అలారం యాక్టివేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఆ విమానంలో ఆ అలారం యాక్టివేట్ కాలేదు. ల్యాండిగ్ విఫలమైనపుడు 3,000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాల్సిందిగా ట్రాఫిక్ కంట్రోలర్ చెప్పినా పైలట్లు 1,800 అడుగుల ఎత్తు వరకు మాత్రమే విమానాన్ని తీసుకెళ్లగలిగారు. విమానంలోని బ్లాక్ బాక్సును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అలారంతో పిల్లల్ని కాపాడుకోవచ్చు!
టొరంటో : షాపింగ్‌కు వెళ్లేటప్పుడు పిల్లలు, ఇతర పెంపుడు జంతువులను కార్లలో తీసుకెళ్లడం ఇటీవల సర్వసాధారణమైపోయింది. అయితే లోపలికి వెళ్లి తొందరగానే వచ్చేస్తాంలే అనే ఆలోచనతో చిన్నారులను, పెంపుడు జంతువులను కొంతమంది కార్లలోనే వదిలివెళుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి కార్లు ఆటోమెటిక్ లాక్ అయి ఊపిరి ఆడక ప్రాణాలు పోయే పరిస్థితికి దారి తీస్తుంది. ఇటువంటి ప్రమాదాల బారి నుంచి వారిని రక్షించడానికి టొరంటోకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఒక కొత్త సెన్సార్‌ను కనుగొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ- కృత్రిమ మేథ)తో రూపొందిన పరికరానికి రాడార్‌ను జోడించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా ఎంతో ప్రయోజనకరమైన ఈ పరికరం మూడు సెంటీమీటర్ డయామీటర్ ప్రేమ్‌గా అరచేతిలో ఇమిడిపోయేంతగా ఉంటుంది. దీనిని వాహన వెనుక అద్దం(రియర్ వ్యూ మిర్రర్) లేదా పైకప్పుకు అతికించవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే.. ఎప్పుడైనా వాహనాల్లో పిల్లలు, పెంపుడు జంతువులు చిక్కుకుపోతే.. రాడార్ సిగ్నల్స్.. వారిని తాకి పరావర్తనం చెందినపుడు.. ఏఐ సిస్టమ్ ద్వారా సంకేతాలు ఏర్పడి అలారం మోగుతుంది. కాగా దీనిని 2020 చివరినాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు శాస్తవేత్తలు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు రాడార్ టెక్నాలజీని జోడించి రూపొందించిన పరికరం ద్వారా వాహనాల్లో చిక్కుకున్న పిల్లల్ని, పెంపుడు జంతువులను కచ్చితంగా కాపాడవచ్చని కెనెడాలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూకి చెందిన పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. -
అలారం పీక నొక్కారో పీడిస్తుందంతే!
సరిగ్గా పొద్దున్నే ఏడు గంటలకు లేవానుకుని అలారం పెట్టుకుని మరీ పడుకుంటారు. ఉదయం అది మోగగానే దాని పీకనొక్కేసి మళ్లీ దుప్పట్లో దూరిపోతున్నారా అయితే మీ మెదడును మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నట్లేనని ఇటీవల వైద్యులు తేల్చి చెప్పారు. అలారాన్ని తాత్కాలికంగా ఆపేసి మరో 10 నిమిషాలు పడుకుందాంలే అనుకుని పడుకోవడం భ్రమ మాత్రమేనట. నిజానికి మన మెదడు అలారం మోతతో మెలకువకు సిద్ధమయ్యాక తిరిగి వెనక్కి వెళ్లడం నిద్రావస్థ సైకిల్‌కు భంగం చేకూరుస్తుందని, అదే ఆనాటి మీ ఉత్సాహాన్ని దెబ్బతీస్తుం దని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇలా అలారం మోగగానే దాని తలపై ఒక్కటిచ్చి తిరిగి పడుకోవడం అలవాటుగా మారిందంటే దీర్ఘకాలంలో దాని దుష్ఫలితాలు తప్పవంటున్న వైద్యులు. ఉత్సాహాన్ని ఊదేసే స్లీప్ ఇనర్షియా.. నిద్రలేమి బీపీ, జ్ఞాపక శక్తి తగ్గడం తదితర అనేక శారీరక, మానసిక అనారోగ్యాలకు కారణమౌతుంది. కంటినిండా నిద్రపోతే మరునాడు మీలో ఉత్సాహం పొంగిపొర్లుతుందని శాస్త్రీయంగా నిరూపించారు. అదే నిద్రనుంచి మేల్కొనడానికి అలారం పెట్టుకొని దాన్ని తాత్కాలికంగా ఆపేసి, తిరిగి ముడుచుకొని పడుకుందామనుకుంటే మాత్రం అది మరిన్ని సమస్యలకు దారితీస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అలా చేయడం వల్ల నిద్రాభంగం అవుతుందే తప్ప తిరిగి నిద్రలోకి జారుకోవడం అంటూ ఉండదని స్లీప్ ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. అలారాన్ని ఆపేసి పడుకోవడంతో మీ శరీరం, మీ మెదడు పడుకోవాలో, మేల్కోవాలో అర్థం కాని స్థితిలోకి వెళ్తుందట దాన్నే నిద్రలో నిద్ర (స్లీప్ ఇనర్షియా) అంటారు. ఈ స్థితి రోజంతా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. నిద్ర మేల్కోవడానికి ఆ పదినిమిషాలూ బద్దకించడం వల్ల ఉత్సాహానికి బదులు ఆ రోజంతా బద్దకాన్ని కొనితెచ్చుకున్నట్టవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిద్రలో రెండు దశలు మన నిద్ర రెండు భాగాలుగా ఉంటుంది. తొలి పార్శ్వం కనుగుడ్లు కదలకుండా(నాన్రాపిడ్ ఐ) ఉండే నిద్ర. రెండవ భాగం కనుగుడ్లు వేగంగా కదు లుతుండే (రాపిడ్ ఐ) నిద్ర. కనుగుడ్లు కదలకుండా ఉండే నిద్ర నుంచి కనుగుడ్లు కదిలే నిద్ర రెండూ రాత్రంతా ఒక సైకిల్లా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అయితే నిద్రపట్టిన వెంటనే వచ్చే స్థితిలో కనుగుడ్ల కదలిక ఉండదు. ఇది దీర్ఘ నిద్రను సూచిస్తుంది. ఆ తరువాత వచ్చే నిద్రావస్థలో మాత్రం కనుగుడ్లు కదులుతూ ఉంటాయి. ఇది మెలకువ స్థితిలో ఉండే నిద్ర. మంచి నిద్రపట్టడం అంటే ఈ లయబద్ధమైన నిద్రావస్థకి భంగం వాటిల్లలేదని అర్థం. అలాకాకుండా మెలకువకోసం పెట్టుకున్న అలారం మోగిన వెంటనే లేవకుండా తిరిగి నిద్రపోవడం శారీరక మానసిక సహజక్రియని అడ్డుకుంటున్నట్లే. -
ఖాకీలను పరుగులు పెట్టించిన ఎలుకలు..
లక్నో : బ్యాంకులో దోపిడీ జరుగుతోందంటూ అలారం మోగిందని సమాచారం రావడంతో పోలీస్ స్టేషన్ నుంచి హుటాహుటిన తరలివెళ్లిన ఖాకీలకు ఎలుకలు కనిపించడంతో విస్తుపోయారు. బ్యాంకులో దోపిడీ జరిగినట్టు గానీ తాళాలు పగులగొట్టిన ఆనవాళ్లు లేకపోగా ఎలుకలు అటూఇటూ తిరుగుతూ కనిపించాయి. నగరంలోని ఓ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో అలారం మోగిన శబ్ధం వినిపించిందంటూ స్ధానికులు, బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే అక్కడ దోపిడీ జరిగిన తీరుతెన్నులు లేకపోవడం, కొద్ది సంఖ్యలో ఎలుకలు అలారం వద్ద పోగవడంతో అలారం మోగించింది ఎలుకలే అంటూ పోలీసులు తేల్చేశారు. ఎలుకలు చేసిన పనికే సైరెన్ మోగిందని ఖాకీలు చెప్పారు. కృష్ణాష్టమి కావడంతో బ్యాంకు అధికారులెవరూ బ్రాంచ్‌లో లేరని పోలీసులు చెప్పారు. కాగా అసోంలో ఇటీవల ఏటీఎం యంత్రంలోని రూ 12 లక్షల నగదును ఎలుకలు కొరికి తినేసిన ఘటనను ప్రస్తావిస్తూ అదృష్టవశాత్తూ బ్యాంకులో ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని స్ధానికులు పేర్కొన్నారు. -
ఈ అలారం కాఫీ ఇస్తుంది..
లండన్: మనం ఉదయాన్నే నిద్రలేచేందుకు రాత్రి పూట అలారం పెట్టిపడుకుంటాం అదంతా మామూలే. అయితే అలారం మోగగానే లేచిన వెంటనే వేడి వేడి కాఫీ ఇస్తే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదూ.. ఇంతకీ కాఫీ ఎవరిస్తారనేగా ప్రశ్న.. అయితే తెలుసుకుందాం.. ఉదయాన్నే నిద్రలేపి కాఫీ ఇచ్చే అలారంను కనుగొనాలనుకున్నాడు లండన్‌కి చెందిన జోషున రెనోఫ్. ‘బరిసూర్ అలారం క్లాక్’అనే సరికొత్త అలారం రూపొందించాడు. దానిపై ఒక గాజుపాత్ర, నీటిని వేడిచేసేందుకు దాని అడుగున రెండు స్టీల్ బాల్స్ ఉంటాయి. ఆ గాజుపాత్రలో వేడి అయిన నీళ్లు స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్‌లో పడతాయి. రాత్రి పడుకునేముందు ఫిల్టర్‌లో కాఫీ లేదా టీ పొడి నింపుకుని దాని పక్కనే ఉండే చిన్న గ్లాసులో పాలను పోసిన తర్వాత అలారం పెట్టుకోవాలి. అలారం సమయానికి ఈ క్లాక్ పనిచేయడం ప్రారంభమవుతుంది. వెంటనే నీళ్లు వేడి అయి కాఫీ, టీ పొడి ఉన్న ఫిల్టర్‌లోకి వస్తాయి. దీంతో డికాషన్ తయారై ఫిల్టర్ కింద ఉన్న కప్‌లో వచ్చి చేరి అలారం మోగుతుంది. ఇంకేముంది నిద్ర లేచి పక్కనే ఉంచిన పాలను కలుపుకుని వేడి వేడి కాఫీ తాగవచ్చు. ఈ అలారం క్లాక్ వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురావాలని జోషున ప్రయత్నిస్తున్నారు. -
కొట్టి మరీ లేపుతుంది!
తెల్లారే లెగుద్దామని అలారం పెట్టుకోవడం.. అది గొంతు చించుకుని మోగినా.. నిద్రమత్తులో దాన్ని ఆపేసి.. మళ్లీ ముసుగుతన్నేయడం మనకు అలవాటే. తర్వాత.. అయ్యో.. లెగలేదే అని నాలుక్కరుచుకోవడం కూడా మనకు మామూలే. ఇలాంటి నాలుక్కరుచుకోవడాలు ఇకపై ఉండవు. ఎందుకంటే.. స్వీడన్‌కు చెందిన షిమోన్(ఫొటోలోని యువతి) వేకప్ మెషీన్ పేరిట ఈ అలారం క్లాక్‌ను తయారుచేసింది. అలారం పూర్తయ్యాక లేవకుంటే.. ఇది కొట్టిమరీ లేపుతుంది. ఈ వేకప్ మెషీన్‌ను మనం పడుకున్న బెడ్ పైన ఇలా అమర్చుకోవాల్సి ఉంటుంది. అలారం పెట్టుకున్న సమయానికి ఠంఛనుగా ఇది మోగుతుంది. అలారం పూర్తయ్యాక లేవకుంటే.. ఇక పిచ్చకొట్టుడే.. దీన్ని ఇంకా మెరుగుపరచాల్సి ఉందని.. త్వరలోనే మార్కెట్లోకి తెస్తానని షిమోన్ చెబుతోంది. -
కుంభకర్ణుడైనా లేవాల్సిందే..
చూడ్డానికి మామూలు అలారంలా కనిపిస్తోంది.. కానీ ఇది మోగితే.. కుంభకర్ణుడైనా సరే లేచి తీరాల్సిందేనని దీన్ని తయారుచేసిన కంపెనీ ఆంప్లికామ్స్ చెబుతోంది. టీసీఎల్ 300 అనే ఈ అలారం ఏ స్థాయిలో మోగుతుందంటే.. మన పక్కనే ట్రైన్ వెళ్తే.. ఎంత సౌండ్ వస్తుందో అంత వస్తుంది. అంతేకాదు.. దీంతోపాటు వచ్చే వైబ్రేటింగ్ ప్యాడ్ పడుకునే ముందు తలగడ కింద పెట్టుకుంటే.. గియ్యి..గియ్యి..మంటూ బుర్ర తిరిగేలా వైబ్రేట్ అవుతుంది. అదే సమయంలో మన ముఖంపై ఫ్లాష్ లైట్ పడేలా చేస్తుంది. ముఖ్యంగా మొద్దు నిద్ర పోయేవారి కోసం, వినికిడి లోపంతో బాధపడేవారి కోసం దీన్ని ప్రత్యేకంగా తయారుచేశారు. బ్రిటన్‌కు చెందిన హియరింగ్ డెరైక్ట్ అనే సంస్థ దీన్ని విక్రయిస్తోంది. ధర రూ.3,500.