ఉదయమే మేల్కోవడం కోసం అలారం సెట్ చేసుకుంటాం. అలారం మోగిన వెంటనే మేల్కోంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ కొందరూ ఉదయం టైంలో అనేక అలారాలు సెట్ చేస్తారు. పోనీ మేల్కోంటారా అంటా అంత సీన్ లేదన్నట్లుగా ముసుగు తన్నీ పడుకుంటారు. ఆ తర్వాత హడావిడిగా ఉరుకులు పరుగులతో ఆఫీసులకు, కాలేజ్‌లకు యథావిధిగా పరుగులు పెడతారు. అయితే ఆరోగ్య నిపుణులు ఇలా అనేక అలారంలు సెట్ చేయడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని కూడా చెబుతున్నారు. అలారానికి ఆరోగ్యానికి ఏంటి సంబంధం..? ఎలా హెల్త్‌పై ప్రభావం చూపిస్తుంది తదితరాల గురించి సవివరంగా చూద్దాం.
చాలామంది ఉదయం 6.00లకు ఆఫీస్ వెళ్లాలని 4.00ల నుంచి అలారాలు సెట్ చేస్తారు. ఆ తర్వాత అలారం మోగిన వెంటనే స్నూజ్ బటన్ నొక్కి 4.30, 5,,5.30 ఇలా సెట్ చేసుకుంటూ పోతారు ఏదో ఒకటైంకి లేవకపోదుమా అనుకుని ఇలా అనేక అలారాలు సెట్ చేస్తారు. దీని కారణంగా నాణ్యమైన నిద్ర పట్టక ఆరోగ్యంపై తీప్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. క్లాక్ యాప్‌ని ఎక్కువ మార్నింగ్ అలారాలతో ఓవర్‌లోక్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇది గందరగోళానికి గురిచేసి అలసిపోయేట్లు చేస్తుందని అన్నారు.
" నిజానికి శారీరక, మానసిక ఆరోగ్యంలో మంచి నిద్ర అనేది కీలకం. మంచి నిద్ర ఉంటేనే ఉదయం చురుకుగా పనిచేయగలం లేదంటే ఆ రోజంతా డల్‌గా ఉంటాం. పైగా మనకు తెలియకుండానే ఓ రోజు వృధా అయిపోతుంది. అదీగాక మన నిద్రలో చివరి నాల్గవదశలో గాఢనిద్ర పడుతుంది. ఆ టైం మన స్మృతులు, జ్ఞాపకాలు కలల రూపంలో వచ్చే మంచి సమయం. ఈ దశ నిద్ర ప్రతిఒక్కరికి కీలకమైనది. ఆ సమయంలో నిద్ర పాడయ్యితే మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఎలాంటి సమస్యలు వస్తాయంటే..
ఉదయం గనుక అనేక అలారాలతో మేల్కొలపడం వల్ల వేగ వంతమైన కంటి కదలిక చక్రానికి తరచుగా అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల మగత, అలసట, మానసిక కల్లోలం ఏర్పడి కార్డిసాల్ స్టాయిలు పెరుగతాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే అలార్ ఆఫ్ అయిన ప్రతిసారీ శరీరం "ఫైట్ లేదా ఫ్లైట్ రెస్పాన్స్"లోకి వెళుతుందని వివరించారు. ఇది ఒత్తిడితో కూడుకున్న స్థితి. కాలక్రమేణ ఈ ఒత్తిడి హృదయనాళ సమస్యలకు కారణమవుతుంది.
స్థిరమైన నిద్ర లేకపోవడం వల్ల మీ శరీరంలో ఏర్పడే ఉద్రిక్తతలు కూడా బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. "అధిక కార్టిసాల్ స్థాయిలు మిమ్మల్ని బరువుగా పెంచుతాయి. కాబట్టి అలారం మోగిన వెంటనే లేవండి మంచిగా కాస్త రిలాక్స్ అయ్యే చిన్నపాటి వ్యాయామాలు చేయండి. ఒక్క అలారం మాత్రమే సెట్ చేయండి. ఆ టైంకి మోగిన వెంటనే లేవండి. ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు నిపుణులు.
అలాకాకుండా ఉదయం 7 గంటలకు లేవాలని ఆరు గంటల నుంచే అనేక అలారాలు సెట్ చేస్తే నాణ్యమైన నిద్ర పొందలేక అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటారని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేగాదు నిపుణులు ఒకటైంకి సెట్ చేసుకున్న అలారాన్ని బెడ్‌కి కాస్త దూరంలో పెట్టుకుంటే ఆపడం కోసమైన ఆటోమేటిగ్గా లేవడం జరుగుతుంది. అనేక అలారాలు పెట్టాల్సిన పరిస్థితి కూడా రాదని అంటున్నారు. అలాగే మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిరోజూ దాదాపు ఒకే సమయాల్లో మేల్కోవడం, పడుకోవడం చాలా కీలకమని అని చెబుతున్నారు. కాబట్టి ఉదయం అనేక అలరాల సెట్ చెయ్యకండి ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేసుకోకండి.
(చదవండి: ఖాళీ కడుపుతో వ్యాయామాలు చేయొచ్చా..? నిపుణులు ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment