![How To Set Destination Alert Or Wake uup Call For Indian Railways - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/13/photos_0.jpg.webp?itok=ZjG8xvBl)
Indian Railways Destination Alert Service: రైలు ప్రయాణికులు తాము దిగాల్సిన స్టేషన్ కోసం ఆన్‌లైన్‌లో నిత్యం పరిశీలించాల్సి వస్తుంది. అదే రాత్రి వేళల్లో అయితే బోగీలో లైట్లన్నీ ఆర్పి ఉండటం, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కావడంతో వేగంగా వెళ్లడంతో రైలులో నుంచి రైల్వేస్టేషన్లను గుర్తు పట్టే పరిస్థితి ఉండదు. అర్ధరాత్రి దిగాల్సిన స్టేషన్ కోసం నిద్రపోకుండా ఎదురుచూస్తూ ఉండాలి. కానీ ఇక నుంచి రిజర్వేషన్‌లో ప్రయాణించే ప్రయాణికులు తమ బెర్త్‌లో ప్రశాంతంగా నిద్రపోయేందుకు భారత రైల్వే అలర్ట్ ఫీచర్ ఆప్షన్ తీసుకువచ్చింది.
రైలులో నిద్రపోతున్న ప్రయాణికుడు
ఇందులో భాగంగా 139కు కాల్ చేసి, మీ రిజర్వేషన్ టికెట్‌పై ఉన్న పీఎన్‌ఆర్ నంబర్ చెప్పి, దిగాల్సిన రైల్వేస్టేషన్ పేరు ధ్రువీకరించుకోవాలి. ఈ విధానంతో ప్రయాణికులు దిగాల్సిన స్టేషన్‌కు 20 నిమిషాల ముందు మీ సెల్‌ఫోన్‌కు కాల్ వస్తుంది. ఈ సదుపాయం కేవలం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే ఉంది. ఏదేమైనా రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఇది సౌకర్యంగా ఉంటుంది.
చదవండి: వచ్చే నెలలో అమెరికాకు వెళ్లాల్సి ఉంది.. మనవడిని చూడకుండానే..
Comments
Please login to add a commentAdd a comment