wake up
-
‘చచ్చి’ బతికాడు!
అమెరికాలోని కెంటకీలో థామస్ హోవర్ అనే 36 ఏళ్ల వ్యక్తి డ్రగ్ ఓవర్‌డోస్ వల్ల గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన బాప్టిస్ట్ హెల్త్ రిచ్మండ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనిక బతికి బట్ట కట్టడం కల్లేనని వైద్యులు తేల్చారు. అవయవ దానం చేసి ఉండటంతో ముందుగా గుండెను సేకరించాలని నిర్ణయించారు. ఆపరేషన్ టేబుల్‌పైకి తీసుకెళ్లి సరిగ్గా కత్తులూ, కటార్లకు పని చెప్పబోయే సమయానికి మనవాడు ఉన్నట్టుండి కళ్లు తెరిచాడు! కాళ్లూ చేతులూ కదిలించేందుకు ప్రయతి్నంచాడు. తన పరిస్థితి అర్థమై కన్నీరు పెట్టుకున్నాడు. ఇదంతా చూసి డాక్టర్లంతా దిమ్మెరపోయారు. దాంతో అవయవ సేకరణ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు. ఇది 2021 అక్టోబర్‌లో జరిగితే ఆస్పత్రి వర్గాలు మాత్రం వెలుగులోకి రానివ్వలేదు. కనీసం హూవర్ కుటుంబీకులకు కూడా సమాచరమివ్వలేదు. పైగా అతనిలో కనిపిస్తున్న ప్రాణ లక్షణాలను పట్టించుకోకుండా అవయవాలను సేకరించాల్సిందిగా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చాయి. వారు నిరాకరించడంతో వేరే వైద్యులను నియోగిస్తే వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆస్పత్రి మాజీ ఉద్యోగి ఒకరు గత జనవరిలో హూవర్ సోదరి డోనాకు విషయం చేరవేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. చివరికి వైద్యుల సలహా మేరకు అతన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. హూవర్ బ హుశా ఇంకెంతో కాలం బతక్కపోవచ్చన్న డాక్టర్ల అంచనాలను వమ్ము చేస్తూ సోదరి సంరక్షణలో అతను చాలావరకు కోలుకున్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు కెంటకీలో టా కాఫ్ ద టౌన్‌గా మారింది. కెంటకీ అటార్నీ జనరల్ కార్యాలయం దీనిపై విచారణ కూడా జరుపుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రేపు బీజేపీ కార్యకర్తలకు నడ్డా వేకప్ కాల్
న్యూఢిల్లీ: బీజేపీ బూత్ లెవెల్ కార్యకర్తలను శనివారం(మే25) ఉదయం 5 గంటలకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిద్ర లేపనున్నారు. అంత మంది ఇళ్లకు నడ్డా ఒకేసారి వెళ్లలేరు కాబట్టి వారి ఫోన్లకు ఆయన తెల్లవారుజామునే ఫోన్ చేయనున్నారు.ఫోన్ ఎత్తగానే నడ్డా ఇచ్చే ఒక్క నిమిషం సందేశాన్ని వారు విననున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకుపైగా గెలవాలన్న నినాదాన్ని వారికి నడ్డా తన సందేశంలో గుర్తు చేయనున్నారు. ‘జన్‌జన్‌కీ యహీ పుకార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, ఇస్ బార్ 400 పార్’అని నడ్డా తన సందేశం వినిపించనున్నారు. శనివారం ఆరోవిడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. -
చంద్రయాన్ 3:కీలక ఘట్టానికి రంగం సిద్ధం
చంద్రయాన్ 3 ప్రయోగంలో మరో కీలక ఘట్టానికి ఇస్రో సమాయత్తమవుతోంది. నిద్రాణ స్థితిలో ఉన్న ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌ను మేల్కొల్పడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. సూర్యరశ్మి తాకగానే రోవర్ నుంచి సిగ్నల్ కన్ఫర్మేషన్ కోసం వేచి చూస్తున్నట్లు ఇస్రో స్పష్టం చేసింది. రోవర్, ల్యాండర్ ఇంకా నిద్రాణ స్థితిలోనే ఉన్నాయని చెప్పారు. #WATCH | On Vikram Lander and Pragyan Rover, former ISRO Chairman K Sivan says, "We have to wait and see. It has undergone a lunar night. Now the lunar day starts. So, now they will try to wake up. If all the systems are functioning, it will be alright...This is not the end, a… pic.twitter.com/le3hpbMGcd — ANI (@ANI) September 22, 2023 నిద్రాణ స్థితి.. చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ 14 రోజుల వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నాయి. కీలక సమాచారాన్ని చేరవేశాయి. చంద్రునిపై 14 రోజులు పాటు పగలు, 14 రోజులు రాత్రి ఉంటోంది. రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న రోవర్‌ను, సెప్టెంబర్ 4న ల్యాండర్ విక్రమ్‌ను నిద్రాణ స్థితిలోకి పంపారు. మేల్కొల్పు.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయిన శివశక్తి పాయింట్.. దక్షిణ ధ్రువానికి 600 మీటర్ల దూరంలో ఉంది. 14 రోజుల తర్వాత చంద్రునిపై నేడు సూర్యోదనయం కానుంది. సూర్యరశ్మి రోవర్‌పై పడగానే, పరికరాలు వేడి అవుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ తర్వాత ల్యాండర్, రోవర్ నుంచి సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. రోవర్, ల్యాండర్‌ను నిద్రలేపి మళ్లీ క్రియాశీలకంగా మార్చితే.. చంద్రునిపై మరింత సమాచారాన్ని సేకరించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఇస్రో సేవలు అద్భుతం -
నిద్రపుచ్చుతుంది.. వేళకు మేల్కొల్పుతుంది
ఇది వినూత్నమైన బెడ్‌లైట్. ఉత్త బెడ్‌లైట్ మాత్రమే కాదు, ఇది అలారం కూడా! చక్కగా నిద్రపుచ్చడమే కాకుండా, వేళకు మేల్కొల్పుతుంది. ఇందులోని ఆరు వాట్ల బ్లూటూత్ స్పీకర్ సిస్టమ్ మరో అదనపు సౌకర్యం. పడుకునే సమయంలో ఈ బెడ్లైట్ను ఆన్ చేసుకుని, స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకున్న దీని యాప్ సాయంతో కోరుకున్న సంగీతాన్ని మంద్రంగా వింటూ హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు. ఇది అలెక్సా సాయంతో పనిచేస్తుంది. కళ్లకు ఇబ్బంది లేకుండా దీని కాంతిని కోరుకున్న స్థాయిలో, కోరుకున్న రంగుల్లో సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇదీ చదవండి: ఆధార్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. పుట్టిన బిడ్డకు ఎంతో మేలు! పడుకునే ముందు పొద్దున్నే నిద్ర లేవాల్సిన సమయాన్ని అలారంలో సెట్ చేసుకుంటే చాలు. వేళకు ఠంచనుగా నిద్రలేపుతుంది. అమెరికన్ కంపెనీ డబ్ల్యూఐఐఎం ఈ అలారం బెడ్లైట్ను ‘వేకప్ లైట్’ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర 129 డాలర్లు (రూ.10,584) మాత్రమే! -
పాపం పసివాడు:16 రోజులు కోమాలో ఉండి.. తల్లిని చూడగానే.. కంటతడి పెట్టిస్తున్న వీడియో!
ఇది సోషల్ మీడియాలో అత్యంత వేగంగా వైరల్ అవుతున్న వీడియో. ఒక చిన్నపిల్లోడు తన తల్లితోపాటు ఆగకుండా రోదిస్తున్న దృశ్యం దీనిలో కనిపిస్తుంది. దీనిని చూసినవారంతా కంటతడి పెట్టుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక తల్లి తన కుమారుడిని కలుసుకునేందుకు ఆసుపత్రికి వస్తుంటుంది. 16 రోజుల పాటు కోమాలో ఉన్న తన కుమారుడు ఇప్పడే మేలుకున్నాడని అమెకు తెలియడంతో పరుగుపరుగున వచ్చింది. పిల్లాడిని కావలించుకుని రోదించింది. ఆ పిల్లాడి పేరు గుడ్. ఆ పిల్లాడు పుట్టుకతోనే డిస్ట్రోఫిక్ ఎపిడెర్మోలిసిస్ అనే అరుదైన చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా పిల్లాడు 16 రోజుల పాటు కోమాలోకి జారుకున్నాడు. కోమా నుంచి మేల్కొన్న తరువాత ముందుగా తల్లిని చూడాలని పరితపించాడు. వారిద్దరూ ఒకరిని ఒకరు హత్తుకుని ఆగకుండా కన్నీరు కారుస్తూనే ఉన్నారు. పిల్లాడు కోమా నుంచి లేచాడని తెలియగానే, ఆ తల్లి పరుగుపరుగున ఆసుపత్రికి చేరుకుంది. పిల్లాడిని చూడగానే తల్లి... అమ్మను చూడగానే పిల్లాడు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బాధితులను అనుక్షణం కనిపెట్టుకోవాలి.. ఈ పోస్టు క్యాప్షన్‌లో..‘ పిల్లాడు పుట్టుకతోనే డిస్ట్రోఫిక్ ఎపిడెర్మోలిసిస్ బులోసా అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ స్థితి టైప్-VII కొలోజన్ లేమి కారణంగా తలెత్తుతుంది. ఇది ఒక ప్రొటీన్. ఇది చర్మంలోని ఎపిడర్మిస్ను అనుసంధానిస్తుంది. దీనిని బైండింగ్ ప్రొటీన్ అని అంటారు. ఇటువంటి స్థితిలోఉన్న గుడ్ను అతని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. గుడ్‌కు ఏ చిన్న దెబ్బ తగిలినా, చర్మానికి ఎంటవంటి ఇబ్బంది కలిగినా వ్యాధి మరింత తీవ్ర మవుతుంది. తాజాగా గుడ్ 16 రోజుల పాటు కోమాలో ఉన్నాడు. దీనిలో 14 రోజులు ఇంట్యుబేషన్లోనే ఉన్నాడు. వీడియోను చూసినవారు ఏమంటున్నారంటే.. ఎంతో భావోద్వేగంతో కూడిన ఈ వీడియోను చూసినవారు కంటతడి పెడుతున్నారు. గుడ్ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ఒక యూజర్ ‘పిల్లాడికి తీవ్రస్థాయిలో నిమోనియా సోకింది. అందుకే కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ పిల్లాడి తల్లి రోజూ అతని దగ్గరే ఉంటుంది. అయితే ఆ పిల్లాడు కోమాలోంచి లేచిన రోజే బయటకు వెళ్లింది’ అని రాశారు. మరో యూజర్ ఈ వీడియోను చూశాక ‘నా హృదయం కల్లోలంగా మారిందని’ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: హజ్‌యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే.. -
అరుదైన సంగీత శస్త్ర చికిత్స: బ్యాండు మేళం వాయిస్తుంటే.. సర్జరీ చేసేశారు
ఇటలీలోని ఒక వ్యక్తి అత్యంత అరుదైన శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. అతను శాక్సోఫోన్(బ్యాండు మేళ వాయిద్యం) వాయిస్తూ...ఉంటే ఆపరేషన్ చేసేశారు. అది కూడా దాదాపు తొమ్మిది గంటల ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ఈ మేరకు జీజెడ్ అనే 35 ఏళ్ల వ్యక్తికి రోమ్‌లోని పైడియా ఇంటర్నేషనల్ ఆస్పత్రి ఈ అరుదైన శస్త్ర చికిత్స చేసింది. డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా ఈ శస్త్ర చికిత్స గురించి మాట్లాడుతూ..."ఈ సర్జరీలో రోగి స్ప్రుహలోనే ఉండాలి. అతని మెదడుకు సంబంధించిన న్యూరానల్ ఫంక్షన్ జరుగుతుండాలి. అంటే మాట్లాడటం, కదలడం, లెక్కించడం, గుర్తించడం, ఆడటం వంటివి అన్నమాట. పేషంట్ ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఈ శస్త్ర చికిత్సను సుమారు 10 మందితో కూడిన వైద్యా బృందం చేస్తోంది. మొదటగా వైద్యులకు ఈ శస్త్ర చికిత్స ఎలా సాధ్యం అనే సందేహం కలిగింది. ఎందుకంటే చేసేది బ్రెయిన్ సర్జరీ. అందుకు రోగి పూర్తిగా సహకరించాలి. ఏ మాత్రం భయపడకుండా మేల్కొని ఉండి చేయించుకోవాలి. అసలు టెన్షన్‌కి గురికాకూడదు. వైద్యులుకు కూడా ఈ శస్త్ర చికిత్స అతిపెద్ద సవాలుతో కూడుకున్నది. దీంతో వైద్యుల సదరు రోగితో మాట్లాడుతుండగా... అతను సంగీతకారుడని తెలుసుకున్నాం. దీంతో తాము ఈ చికిత్స సమయంలో తనకు ఇష్టమైన సంగీత వాయిద్యాన్ని వాయిస్తుండమని, నిద్రపోకూడదని చెప్పాం. దీంతో జీజెడ్ కూడా వైద్యులకు పూర్తిగా సహకరించి, ఏ మాత్రం భయపడకుండా బ్యాండు మేళ వాయిస్తూ చేయించుకున్నాడు. ఈ శస్త్ర చికిత్స ద్వారా రోగి బ్రెయిన్లో ఒక నిర్థిష్ట ప్రాంతంలో ఉన్న కణితిని తొలగించి వ్యాధిని నయం చేస్తాం. అంతేకాదండోయ్ సదరు పేషంట్ శస్త్ర చికిత్స జరుగుతున్నంత సేపు ఇటాలియన్ జాతీయ గీతాన్ని, 1970ల లవ్‌స్టోరీ చిత్రంలోని థీమ్ సాంగ్‌ని వాయించాడని వైద్యులు చెప్పారు. తాము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రోగి మేల్కోని ఉండగానే ఈ శస్త్ర చికిత్స చేయగలిగాం." అని డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా సంతోషంగా చెప్పారు. (చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు) -
అలర్ట్ ఫీచర్.. ‘రైలులో ప్రశాంతంగా నిద్రపోవచ్చు’
Indian Railways Destination Alert Service: రైలు ప్రయాణికులు తాము దిగాల్సిన స్టేషన్ కోసం ఆన్లైన్లో నిత్యం పరిశీలించాల్సి వస్తుంది. అదే రాత్రి వేళల్లో అయితే బోగీలో లైట్లన్నీ ఆర్పి ఉండటం, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కావడంతో వేగంగా వెళ్లడంతో రైలులో నుంచి రైల్వేస్టేషన్లను గుర్తు పట్టే పరిస్థితి ఉండదు. అర్ధరాత్రి దిగాల్సిన స్టేషన్ కోసం నిద్రపోకుండా ఎదురుచూస్తూ ఉండాలి. కానీ ఇక నుంచి రిజర్వేషన్లో ప్రయాణించే ప్రయాణికులు తమ బెర్త్‌లో ప్రశాంతంగా నిద్రపోయేందుకు భారత రైల్వే అలర్ట్ ఫీచర్ ఆప్షన్ తీసుకువచ్చింది. రైలులో నిద్రపోతున్న ప్రయాణికుడు ఇందులో భాగంగా 139కు కాల్ చేసి, మీ రిజర్వేషన్ టికెట్‌పై ఉన్న పీఎన్ఆర్ నంబర్ చెప్పి, దిగాల్సిన రైల్వేస్టేషన్ పేరు ధ్రువీకరించుకోవాలి. ఈ విధానంతో ప్రయాణికులు దిగాల్సిన స్టేషన్‌కు 20 నిమిషాల ముందు మీ సెల్‌ఫోన్‌కు కాల్ వస్తుంది. ఈ సదుపాయం కేవలం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే ఉంది. ఏదేమైనా రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఇది సౌకర్యంగా ఉంటుంది. చదవండి: వచ్చే నెలలో అమెరికాకు వెళ్లాల్సి ఉంది.. మనవడిని చూడకుండానే.. -
షాకింగ్ ఘటన: ఒక్కసారిగా పాడెపై నుంచి లేచిన బామ్మ
ముంబై: కరోనాతో మృతి చెందిందని వృద్ధురాలికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె అంత్యక్రియలకు బంధువులను పిలిపించారు. కొద్దిసేపట్లో అంత్యక్రియలు మొదలు పెట్టనుండగా ఒక్కసారిగా ఆ పెద్ద మనిషి పాడెపై నుంచి ఏడుస్తూ కళ్లు తెరిచింది. దీంతో బంధువులంతా షాకయ్యారు. ఎలాగోలా తమ బామ్మ బతికిందని కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బామ్మ ఆస్పత్రిలో ఉంది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముధాలేలోని బారామతి గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్ (76)కు మే 10వ తేదీన కరోనా సోకిందని తేలింది. దీంతో కుటుంబసభ్యులు కారులో ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆస్పత్రిలో ఆమెకు బెడ్ లభించలేదు. దీంతో కారులోనే చాలాసేపు వేచి ఉన్నారు. ఈ సమయంలో బామ్మ శకుంతల అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆమెలో చలనం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె మృతి చెందిందని భావించారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు. ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. శకుంతల మృతదేహాన్ని పాడెపై ఉంచి బంధవులంతా ఏడుస్తుండగా అకస్మాత్తుగా శకుంతల ఏడుస్తూ కళ్లు తెరిచింది. ఒక్కసారిగా కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. బామ్మ చనిపోలేదు.. బతికే ఉందని భావించి ఒక్క క్షణం తర్వాత తేరుకుని ఆనందపడ్డారు. వెంటనే ఆమెను బారామతిలోని సిల్వర్ జూబ్లీ ఆస్పత్రిలో చేర్పించారు. చదవండి: మానవత్వం చాటిన ఎమ్మెల్యే కంచర్ల -
నిద్రలేమిని గుర్తించడం ఎలా?
#WakeUpToGoodSleep ప్రచారం ద్వారా మంచి నిద్ర ప్రాధాన్యతను తెలియజెప్తున్న రెస్‌మెడ్ నిద్ర రుగుత్మలపై వైద్యులు, వినియోగదారులను చైతన్యపరచనున్న ఈ డిజిటల్ ప్రచారం న్యూదిల్లీ: 17 నవంబర్, 2020- డిజిటల్ హెల్త్, సంబంధిత (నిద్ర, శ్వాససంరక్షణ) పరికరాల్లో ప్రపంచ అగ్రగామి రెస్‌మెడ్ (ResMed) సరికొత్త నిద్ర అవగాహన ప్రచారం #WakeUpToGoodSleepను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఆరోగ్యంగా ఉండేందుకు చక్కని నిద్రకున్న ప్రాధాన్యతను, భారతదేశంలో పెరుగుతున్న, గుర్తించని నిద్ర రుగ్మతలను వివరించడమే కాకుండా వాటి చికిత్సకు అందుబాటులో ఉన్నఅవకాశాలను ఈ ప్రచారం నొక్కిచెప్తుంది. నేడు, లక్షలమంది భారతీయులు నిద్ర రుగ్మతలతో బాధపడుతున్నారు, కాని అందులో చాలా మటుకు గుర్తించడడం జరగదు. 2019లో ల్యాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో లక్షలాది మంది భారతీయులు నిద్రలేమితో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఈ నిద్ర రుగ్మతలను చక్కదిద్దకుండా వదిలేస్తే అది గుండెపోటు, డయాబెటిస్, డిప్రెషన్ సహ మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రమాదకారిగా పరిణమించవచ్చు. ఇవన్నీ నిద్రరుగ్మతలపై అవగాహనను పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తున్నాయి. వినియోగదారులు, డాక్టర్లకు అవగాహన పెంచేలా ఈ ప్రచారం తోడ్పడుతుంది. ఈ ప్రచారంలో భాగంగా చిన్న అవగాహన చిత్రాన్నిరెస్‌మెడ్ ఆవిష్కరించింది. ఇది నిద్రలేమి, అంతగా తెలియని నిద్ర రుగ్మతలు, అలసట, మానసిక ఒత్తిడి, చికాకు, ట్రాఫిక్ ప్రమాదాల వంటి వాటి ప్రభావాలను తెలియజెప్తూ రాత్రివేళ మంచి నిద్ర ప్రాముఖ్యతను నొక్కిచెప్తుంది. రోగులు రాత్రివేళ చక్కని నిద్ర పొందేందుకు స్లీప్ కోచ్ అసిస్టెన్స్‌ను రెస్‌మెడ్ ప్రవేశపెట్టింది. ఇది నిద్ర రుగ్మతలు ఉన్న రోగులకు వారి నిద్రయానంలో ప్రతీ దశను దూరప్రాంతం నుంచి దిశానిర్దేశం చేస్తుంది. ఇంటిలోనే స్లీప్ టెస్ట్ నిర్వహించి నిద్రలేమిని గుర్తించడం అలా నిద్రలేమిని గుర్తించిన రోగులకు అందుబాటులో ఉన్న సీపీఎపీ (కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెషర్)చికిత్స అవకాశాలు వివరించడంతో పాటు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా డివైస్‌లు ఉచితంగా ఇన్స్టాల్ చేయడం, ఆ డివైస్‌లకు సంబంధించి ఈఎంఐ స్కీములు సహ సాధ్యమైన ఉత్తమ ఆఫర్లు అందించడం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. “ఆరోగ్యానికి సంబంధించి భారతదేశంలో చైతన్యం పెరుగుతున్న కొద్ది ఆహారమార్పులు, నిత్య వ్యాయామాలు, మానసిక ఆరోగ్యం వంటివాటికి ప్రాధాన్యత అధికమవుతోంది.కాని చక్కని ఆరోగ్యానికి కీలకంగా దోహదపడే నిద్రకు అంత ప్రాధాన్యత లభించడం లేదని” అంటారు రెస్‌మెడ్ ఆసియా, లాటిన్ అమెరికా నేషనల్ మార్కెటింగ్ హెడ్ సీమా అరోరా. “భారతదేశం లాంటి భౌగోళికంగా విస్తరమైన దేశంలో దేశంలో నిద్ర అవగాహనపై చర్చ చాలా తక్కువ స్థాయిలో ఉంది. 130 కోట్ల జనాభాకు వేళ్లపై లెక్కించే సంఖ్యలో స్లీప్ ల్యాబ్స్ ఉన్నాయి. స్లీప్ థెరపీలో అగ్రగామిగా ఉన్న రెస్‌మెడ్ ఈ అవగాహన కార్యక్రమం ద్వారా భారతీయుల్లో ముఖ్యంగా వైద్య సిబ్బందిలో చైతన్యం పెంచే ప్రయత్నం చేస్తుంది. నిద్రరుగ్మతలు మొత్తంగా మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అన్న విషయానికి ప్రాధాన్యత ఇస్తూ “నిద్ర సరిగ్గా ఉంటేనే రోజు సరిగ్గా ఉంటుందనే” సాధారణ ఆలోచనకు ఇది ప్రాముఖ్యతనిస్తుంది”. వైద్యసిబ్బందికి నిద్ర అవగాహన, చైతన్యం పెంచే కృషిలో భాగంగా డాక్టర్ మాన్వీర్ భాటియా, ఆమెకు చెందిన స్లీప్ సొసైటీ- ఎఎస్‌ఎస్‌ఎం ఏస్ స్కూల్ ఆఫ్ స్లీప్ సైన్స్, డాక్టర్ సుజిత్ రాజన్ వంటి దేశంలోనే నిద్ర నిపుణులుగా పేరుగాంచిన ప్రముఖులతో వెబ్-ఎడ్యుకేషన్ సిరీస్‌ను రెస్‌మెడ్ నిర్వహిస్తోంది. ఈ దిశగా మే 2020 నుంచి 700 లకు పైగా డాక్టర్లకు రెస్‌మెడ్ సర్టిఫికేట్లు ప్రదానం చేసింది. “ఐదు నుంచి పది శాతం మంది భారతీయులు నిద్రసంబంధమైన లోపాలతో బాధపడుతూ ఉంటారు, కాని ఆ ప్రభావం వారి ఆరోగ్యంపై ఎలా ఉంటుందనే విషయం వారికి తెలియదని” ప్రముఖ భారతీయ స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ మాన్వీర్ భాటియా తెలిపారు. “జీవితంలో మనం ముఫ్పై శాతం సమయాన్ని నిద్రలో గడుపుతాం, అది మన నిత్య విశ్రాంతి ఉద్దేశాలకు మించి ఉంటుంది. అది మన శరీరానికి సాంత్వన అందిస్తూ శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా ఆరోగ్యంగా ఉండేలా చూసేందుకు దోహదపడుతుంది. నిద్రకు సంబంధించిన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన నిద్ర అన్నది మనం చక్కని ఆరోగ్యంతో ఉండేందుకు చాలా ముఖ్యమైనదని, అది ఇతర వైద్యరుగ్మతలతో ముడిపడి ఉంటుందని తెలుసుకోవాలి. వైద్యులతో శిక్షణా కార్యక్రమాలు, ప్రజావగాహన ప్రచారాలు, స్లీప్ కోచ్ సాయం ద్వారా ఈ అవగాహన పెంచవచ్చు. ఈ చర్యల ద్వారా చక్కని నిద్రకున్న ప్రాధాన్యత ప్రభావాన్ని తెలుసుకోవచ్చని” ఆమె అన్నారు. భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా మారిన ఈ పరిస్థితుల్లో రోగుల సంరక్షణ కోసం హాస్పిటల్స్ అవసరం లేకుండా రెస్‌మెడ్స్ సృజనాత్మక, కనెక్టెడ్ స్లీప్ సొల్యూషన్స్ రోగులు, డాక్టర్లను అనుసంధానం చేస్తాయి. ఈ నెట్వర్క్ పరిధిలోని 10 మిలియన్లకు పైగా ఉన్న క్లౌడ్ కనెక్టబుల్ డివైస్ల ద్వారా దూరప్రాంతం నుంచే రోగులను డాక్టర్లు పర్యవేక్షించగలుగుతారు. అంతే కాదు రోగులు కూడా తమ ఆరోగ్యసంబంధమైన సమాచారాన్ని తెలియజేసుకొని నిద్రసమస్యల కోసం పరీక్షలు చేయించుకొని చికిత్స పొందవచ్చు. స్లీప్ కోచ్ అసిస్టెన్స్ లేదా స్లీప్ టెస్ట్ చేయించుకునేందుకు ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 1800-103-3969కు కాల్ చేయండి. (అడ్వటోరియల్) -
కూతురికి కోసం తల్లే కుక్క పిల్లలా...
లండన్: ఆ తల్లికి కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టం. ఆమె బిడ్డకు శునకాలంటే పిచ్చి. వెరసి తల్లీకూతుళ్లిద్దరూ విచిత్రంగా ప్రవర్తిస్తూ వార్తల్లోకెక్కారు. వినడానికి వింతగా ఉన్న ఈ అలవాటు చాలా ఏళ్ల నుంచి జరుగుతూ వస్తోందట. యూకేకు చెందిన 68 ఏళ్ల మెర్సియాకు 21 ఏళ్ల కూతురు అలినా. ఎంజైమ్ లోపంతో బాధపడుతున్న ఆమెను దత్తత తీసుకున్నప్పటికీ మెర్సియా సొంతబిడ్డకన్నా ఎక్కువగా చూసుకుంటుంది. (కరోనాతో ఆస్పత్రికి.. కట్ చేస్తే పెళ్లి) అయితే అలినాకు కుక్కపిల్లలు పెంచుకోవాలన్నది ఆశ. కానీ అది కుదరలేదు. దీంతో ఆమె తల్లే కుక్కపిల్లలా అవతారం ఎత్తింది. కూతురును నాకుతూనే మెర్సియా నిద్రలేపుతుంది. లేకపోతే ఆమె అస్సలు లేవదట. ఇలా చేయడానికి ముందు ఆమె కుక్కపిల్లలా శబ్ధాలు చేస్తూ కూతురిని సంతోషపెడుతుంది. ఈ దినచర్య కొన్నేళ్ల నుంచి జరుగుతూ వస్తోంది. తల్లి తనను నాకుతూ నిద్ర లేపడం మహా ఇష్టమని ముసిముసి నవ్వులు నవ్వుతోంది అలినా. ఖాళీ సమయాల్లో ఇలా ఒకరినొకరు నాకుతూ కుక్కపిల్లల్లా ఆడుకుంటామని ఈ తల్లీకూతుర్లు చెప్పుకొస్తున్నారు (ఇంతకంటే దారుణమైన ప్రమాదం ఉండదు.. కానీ!) -
ఘుమఘుమలతో నిద్ర లేవండి...
తెలతెలవారుతూండగా ‘‘కౌసల్యా సుప్రజా రామా...’’ అంటూ మంద్రంగా సుబ్బు లక్ష్మి వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తూంటే... వంటింట్లోంచి కాఫీ ఘుమఘుమలు ముక్కు పుటాలకు చేరుతూంటే.. అది గుడ్ మార్నింగే అవుతుంది. ఈ అనుభూతి రోజూ పొందాలను కుంటున్నారా? మీకిష్టమైన సంగీతంతోపాటు... సువాసనలూ ఆస్వాదిస్తూ నిద్రలేవాలనుకుంటున్నారా? అయితే సెన్సర్ వేక్ అలారమ్ క్లాక్ మీ కోసమే! ఫ్రెంచ్ కంపెనీ తయారు చేసిన ఓ టేబుల్‌టాప్ అలారమ్ క్లాక్తోపాటు కొన్ని సెన్సర్ల సాయంతో కమ్మని వాసనలు వెలువరించే ఓ పరికరాన్నీ తయారు చేసింది మరి. ఈ పరికరంలో భారతీయ వంటకాల వాసనలేవీ ప్రస్తుతానికి లేకున్నా.. బ్రెడ్ రోస్ట్, ఎస్ప్రెస్సో కాఫీలతోపాటు పీచ్, స్ట్రాబెర్రీ కాండీ, అల్లం, పెప్పర్మింట్ సువాసనలను వెదజల్లుతుంది. నిద్ర లేవాలనుకున్న సమయాన్ని సెట్ చేసుకోవడం.. వాసనలు వెదజల్లే క్యాప్సూల్‌ను పరికరంలో పడేయడం మాత్రమే మనం చేయాల్సిన పనులు. గివావుడాన్ అనే కంపెనీ సెన్సర్ వేక్ కోసం సువాసనల క్యాప్సూళ్లను తయారు చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది నవంబర్‌కల్లా సెన్సర్ వేక్ మార్కెట్లోకి రానుంది. -
ఆంటోనీజీ! మేల్కొంటారా?
యూపీఏ ప్రభుత్వం రక్షణ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకోకపోవడంతో దేశ రక్షణ రంగ సన్నద్ధత కొరవడింది. గత 8 ఏళ్లుగా రక్షణమంత్రిగా కొనసాగుతున్న ఆంటోనీ ఒక అచేతనమైన నేతగా, స్తబ్దుగా వ్యవహరించి దేశ రక్షణావసరాలను గుర్తించకుండా గాఢనిద్రలో గడిపేశారు. ఆయన జమానాలో భారత రక్షణ సామర్థ్యం బాగా బలహీనపడింది. ఇరాక్‌పై అమెరికా యుద్ధం ప్రకటించిన సందర్భంగా అప్పటి అమెరికా రక్షణ మంత్రి డోనాల్డ్ రమ్స్ఫెల్డ్ ఒక మాట చెప్పారు. ‘‘నీ దగ్గర ఉన్న ఆర్మీతో నువ్వు యుద్ధం చేయాలి. అంతేగానీ సైనికదళం ఎలా ఉండాలో కోరు కోవద్దు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక దేశ రక్షణమంత్రికి ఉండాల్సిన అసలు లక్షణమేమిటంటే ఎలాంటి ఘర్షణలు లేని ప్రశాంత సమయాలలో సైనిక సామర్థ్యా న్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలి. యుద్ధాలు వచ్చేటప్పుడు ఇవి అక్కరకొస్తాయి. ప్రతి యుద్ధమూ కొత్త అనుభవాన్ని నేర్పుతుంది. సాధారణంగా వివిధ దేశాలు తమ సైన్యానికి ఎప్పటికప్పుడు కొత్త యుద్ధవిద్యలలో తర్ఫీదునిస్తాయి. ఎందుకంటే అంతకుముందు జరిగిన యుద్ధాలలో శత్రువులు ఉపయోగించిన ఎత్తుగడలనూ, వ్యూహాలనూ మళ్లీమళ్లీ ఉపయోగించరు కాబట్టి సైన్యం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తాలిబాన్లాంటి మతవాదశక్తులు కొన్ని దేశాలలో తమతో కలిసిపోరాడేవారిని కలుపుకొని దాడులకు తెగబడుతుంటాయి. ఈ శక్తులు తమకు సత్తువ ఉన్నప్పుడు దాడులు చేస్తాయి, లేనప్పుడు విశ్రాంతి తీసుకుంటాయి. యుద్ధంలో ఇదోరకమైన ఘర్షణ. తాలిబాన్ వద్ద ఫిరంగులు, వైమానిక దళం వంటి వనరులు లేవు. అయితే తాలిబాన్ భావజాలాన్ని వంటబట్టించుకున్న తీవ్రవాదులూ, పోరాడాలన్న కాంక్ష, లక్ష్యం, అన్నింటికీ మించి అమూల్యమైన సమయం వారి వద్ద ఉన్నాయి. అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు తాలిబాన్లు ‘ధర్మయుద్ధం’ చేస్తున్నారు. అంతేకాదు క్రమంగా ఈ ప్రభావం పాకిస్థాన్ పొరుగున్న ఉన్న భారత భూభాగంలోని కాశ్మీరుకూ, చైనాలోని జింజియాంగ్కూ విస్తరించేలా చూడాలన్నది తాలిబన్ మతవాదుల పన్నాగం. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో తమకు అనుకూల ప్రభుత్వాలను స్థాపించుకోవాలని కలలు కంటున్న తాలిబన్, లష్కరే తోయిబాలు ఇండియాతో ఘర్షణపడుతూ ఉగ్రవాద అనుబంధ సంస్థలుగా పనిచేస్తాయి. కాని వాటికి ఇవి ఒక సైద్ధాంతిక నాణేనికి రెండు పార్శ్వాలని చెప్పవచ్చు. దక్షిణ, సెంట్రల్ ఆసియా నుంచి నాటో దళాలను ఉపసంహరించుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికే పత్రికలలో చూచాయిగా వార్తలొస్తున్నాయి. మతఛాందస శక్తులలో ఒకవిధమైన విజయగర్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మతఛాందస శక్తులు కొంతసేపు విరామం తీసుకుని మళ్లీ పుంజుకుని ‘ముస్లిం భూభాగాల’ ‘విముక్తి’ కోసం జరుగుతున్న సుదీర్ఘ మార్చ్ దిశగా అడుగులు వేస్తున్నాయి. భారత్, పాకిస్థాన్, చైనాలో ముస్లిమ్‌లకు లౌకిక వ్యవస్థను వారు ఎంతమాత్రం అంగీకరించరు. అఫ్ఘానిస్థాన్ నుంచి 20 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ నిష్ర్కమించిన తర్వాత జమ్మూకాశ్మీర్‌లో శాంతిని కాపాడడం భారత సైన్యానికి ఎంత సవాల్‌గా మారిందో మనకు తెలుస్తూనే ఉంది. దక్షిణ రష్యా, సెంట్రల్ ఆసియా మాదిరిగా చైనాపై కూడా ఉగ్రవాదులు కన్నేశారు. చైనాలోని ఒక రైల్వే స్టేషన్లో ఇటీవలే కొంతమంది సాయుధ ఉగ్రవాదులు ప్రవేశించి నరమేధం సృష్టించారు. చైనాలోని ఏకైక ముస్లిమ్ మెజారిటీ రాష్ట్రమైన జింజియాంగ్‌లో ఉగ్రవాదం పెచ్చుపెరిగింది. దీన్ని చైనా పాలకులు ఎంతగా దాచిపెట్టాలన్నా అది ఎప్పటికప్పుడు బయటపడిపోతోంది. ఉగ్రవాదులు భవిష్యత్తులో పాకిస్థాన్‌ను తమ కోటగా వాడుకోవడం కొనసాగిస్తే, పాక్‌తో తమ సంబంధాల వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో చైనా ఇప్పుడు పునస్సమీక్షించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో భారత్ కూడా తన విధానాన్ని సమీక్షించుకోవాలి. ఉగ్రవాదులను అణచివేసేందుకు తీసుకునే కఠిన చర్యలు బహుముఖ పోరుకు దారితీస్తే దాన్ని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పోరుకు ఇండియా సిద్ధంగా లేదని స్పష్టంగా తేలిపోతోంది. గత ఐదేళ్లుగా యూపీఏ ప్రభుత్వం రక్షణ రంగంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల భారత రక్షణ రంగ సన్నద్ధత కొరవడింది. గత 8 ఏళ్లుగా రక్షణమంత్రిగా కొనసాగుతున్న ఏకే ఆంటోనీ ఒక అచేతనమైన నాయకుడిగా, స్తబ్దుగా వ్యవహరించి దేశ రక్షణావసరాలను గుర్తించకుండా గాఢనిద్రలో గడిపేశారు. ఆయన జమానాలో భారత రక్షణ సామర్థ్యం గణనీయంగా బలహీనపడింది. దక్షిణాసియాలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. అయినా ఆంటోనీగారు నిద్రమబ్బు వీడలేదు. భారత రక్షణ పరికరాలు నాసిరకంగా ఉన్నాయి. నావికాదళాన్ని పట్టిపీడిస్తున్న నిర్లక్ష్య వ్యాధి లక్షణాలకు నిదర్శనమే ఇటీవల నేవీలో వరుసగా జరుగుతున్న అనేక ప్రమాదాలని వేరే చెప్పనక్కర్లేదు. ఇది నావికాసిబ్బంది మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. నావికాదళంలో అనేక ప్రమాదాలు సంభవించినా రాజకీయ నాయకులు బాధ్యత వహించిన పాపాన పోలేదు. శత్రువు మన తలుపు పక్కకు వచ్చి నక్కాడు. అయినా ఆంటోనీ ఇంకా మత్తులో జోగుతున్నాడు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్నాటికల్లా కొత్త రక్షణ మంత్రి రావచ్చు. రక్షణ రంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికీ, పునర్నిర్మించడానికి ఎంతో వ్యవధి పడుతుంది. కాని మనకు అంత సమ యం లేదు. దక్షిణాసియాలో పరిస్థితులు వేగంగా మారి పోతున్నాయి. అవి మంచి మార్పులు అనుకోడానికి లేదు. కొత్త ప్రమాదాలు పొంచి ఉన్నాయి. భారత విదేశాంగ విధానంలో కొత్త మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉంది. శత్రువుకు శత్రువు మనకు తప్పనిసరిగా మిత్రుడు కావల్సిన అవసరం ఏమీ లేదు. కాని యుద్ధక్షేత్రంలో అతను సహచరుడు కావచ్చు. భారత్, చైనా పరస్పరం అనుమానించుకోవడం కన్నా సహకరించుకుంటేనే మంచిది. సెంట్రల్ ఆసియాలో ఉన్న ప్రమాదాల గురించి రష్యాకు కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. తుపాకులు పట్టుకుని సంచరించే మతోన్మాదుల గురించి పాకిస్థాన్ అప్రమత్తంగా ఉండాల్సిందే. చైనా, పాకిస్థాన్ ఏం చేయాలో అవి తేల్చుకోవాలి. ఉగ్రవాదులను అణచివేయాలన్నా, ఇతర దేశాలపై యుద్ధం చేయాలన్నా అది భారతే చేయాల్సి ఉంటుంది. మన తరఫున మరో దేశం యుద్ధం చేయదని భారత్ గుర్తిస్తే మంచిది. ఇంకో విషయం... ఎప్పటికైనా సైన్యాలే యుద్ధాలు చేయాలి. యుద్ధంలో శత్రుదేశాన్ని మట్టికరిపించే సత్తాగల సైన్యం మనకు ఉందా? ఆలోచించాల్సిందే! బైలైన్: ఎంజే అక్బర్ (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)