
శాక్సోఫోన్(బ్యాండు మేళ వాయిద్యం) వాయిస్తూ.. బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న పేషంట్
ఇటలీలోని ఒక వ్యక్తి అత్యంత అరుదైన శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. అతను శాక్సోఫోన్(బ్యాండు మేళ వాయిద్యం) వాయిస్తూ...ఉంటే ఆపరేషన్ చేసేశారు. అది కూడా దాదాపు తొమ్మిది గంటల ఆపరేషన్‌ని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ఈ మేరకు జీజెడ్ అనే 35 ఏళ్ల వ్యక్తికి రోమ్‌లోని పైడియా ఇంటర్నేషనల్ ఆస్పత్రి ఈ అరుదైన శస్త్ర చికిత్స చేసింది. డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా ఈ శస్త్ర చికిత్స గురించి మాట్లాడుతూ..."ఈ సర్జరీలో రోగి స్ప్రుహలోనే ఉండాలి. అతని మెదడుకు సంబంధించిన న్యూరానల్ ఫంక్షన్ జరుగుతుండాలి. అంటే మాట్లాడటం, కదలడం, లెక్కించడం, గుర్తించడం, ఆడటం వంటివి అన్నమాట.
పేషంట్ ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఈ శస్త్ర చికిత్సను సుమారు 10 మందితో కూడిన వైద్యా బృందం చేస్తోంది. మొదటగా వైద్యులకు ఈ శస్త్ర చికిత్స ఎలా సాధ్యం అనే సందేహం కలిగింది. ఎందుకంటే చేసేది బ్రెయిన్ సర్జరీ. అందుకు రోగి పూర్తిగా సహకరించాలి. ఏ మాత్రం భయపడకుండా మేల్కొని ఉండి చేయించుకోవాలి. అసలు టెన్షన్‌కి గురికాకూడదు. వైద్యులుకు కూడా ఈ శస్త్ర చికిత్స అతిపెద్ద సవాలుతో కూడుకున్నది.
దీంతో వైద్యుల సదరు రోగితో మాట్లాడుతుండగా... అతను సంగీతకారుడని తెలుసుకున్నాం. దీంతో తాము ఈ చికిత్స సమయంలో తనకు ఇష్టమైన సంగీత వాయిద్యాన్ని వాయిస్తుండమని, నిద్రపోకూడదని చెప్పాం. దీంతో జీజెడ్ కూడా వైద్యులకు పూర్తిగా సహకరించి, ఏ మాత్రం భయపడకుండా బ్యాండు మేళ వాయిస్తూ చేయించుకున్నాడు.
ఈ శస్త్ర చికిత్స ద్వారా రోగి బ్రెయిన్‌లో ఒక నిర్థిష్ట ప్రాంతంలో ఉన్న కణితిని తొలగించి వ్యాధిని నయం చేస్తాం. అంతేకాదండోయ్ సదరు పేషంట్ శస్త్ర చికిత్స జరుగుతున్నంత సేపు ఇటాలియన్ జాతీయ గీతాన్ని, 1970ల లవ్‌స్టోరీ చిత్రంలోని థీమ్ సాంగ్‌ని వాయించాడని వైద్యులు చెప్పారు. తాము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రోగి మేల్కోని ఉండగానే ఈ శస్త్ర చికిత్స చేయగలిగాం." అని డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా సంతోషంగా చెప్పారు.
(చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు)
Comments
Please login to add a commentAdd a comment