brain surgery
-
బ్రహ్మానందం వీడియోలు చూస్తుండగా మహిళకు సర్జరీ
వయసుతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులకు కామెడీ ఇష్టం. యూట్యూబ్‌లో అయితే బ్రహ్మానందం, సునీల్ కామెడీ వీడియోలు తెగ చూసేస్తుంటారు. ఇప్పుడు అలానే 'అదుర్స్' సినిమాలోని బ్రహ్మీ కామెడీ వీడియోలు చూస్తుండగా 55 మహిళకు డాక్టర్స్ సర్జరీ చేశారు. కాకినాడలోని జీజీహెచ్‌లో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: లైంగిక వేధింపుల కేసు.. పరారీలో జానీ మాస్టర్)కొత్తపల్లికి చెందిన 55 ఏళ్ల అప్పన్న అనంతలక్ష్మికి ఏడాదిగా కుడి కాలు, కుడి చెయ్యి లాగేస్తుండటం వల్ల బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు పలు పరీక్షలు చేయగా మెదడులో ఎడమవైపు ట్యూమర్ ఉందని గుర్తించారు. దీన్ని అలానే వదిలేస్తే పక్షవాదం వచ్చే ప్రమాదం ఉందని చెప్పి సర్జరీకి సిద్ధమయ్యారు. అయితే మత్తు మందు ఇవ్వకుండా ఆమెకు ఇష్టమైన బ్రహ్మానందం వీడియోలు చూపిస్తూ క్రైనీయాటమీ సర్జరీ పూర్తి చేశారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సర్జరీ చేశారు. ఇది విజయవంతం కావడంతో వైద్యులపై ప్రశంసలు కురుస్తున్నాయి. అలానే శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు సదరు మహిళ బ్రహ్మానందం కామెడీ సీన్స్ చూస్తున్న ఆరు సెకన్ల వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?) -
హెల్త్ అప్డేట్ షేర్ చేసిన సద్గురు
ఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్(66) శరవేగంగా కోలుకుంటున్నారు. తలకు బ్యాండేజ్ ప్యాచ్‌తో ఆస్పత్రిలో బెడ్ మీద ఆయన పేపర్ చదువుతూ ఉండగా.. వీడియో తీసిన ఆయన కుమార్తె రాధే జగ్గీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు, శిష్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదడులో రక్తస్రావం కారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకున్న సద్గురు.. ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. మెదడు, కపాలం మధ్య చేరిన రక్తాన్ని తొలగించడానికి ఈ నెల 17న న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో వైద్యులు సర్జరీ చేశారు. #Sadhguru #SpeedyRecovery pic.twitter.com/rTiyhYPiJM — Sadhguru (@SadhguruJV) March 25, 2024 సద్గురుకి సర్జరీ విషయం తెలియగానే ఆయన అభిమానులు, శిష్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఆయన త్వరగా కోలుకుని మన ముందుకు వస్తారంటూ ఈశా ఫౌండేషన్ ఒక ప్రకటన చేసింది. మరోవైపు.. ఆ టైంలో సద్గురుతో మాట్లాడానని, ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని మోదీ సైతం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇక తాము ఊహించిందానికంటే వేగంగా ఆయన కోలుకుంటున్నారని.. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు ప్రకటించారు. -
దయచేసి.. మా కుమారుడిని కాపాడండి!
ఖమ్మం: మెదడులో నీరు చేరడంతో అనారోగ్యం పాలైన ఓ విద్యార్థి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. బ్రెయిన్‌కు సర్జరీ చేస్తేనే బతుకుతాడని వైద్యులు సూచించడంతో కన్నీరుమున్నీరవుతున్న ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం వేచిచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని గాదెపాడు గ్రామానికి చెందిన భూక్యా సంతు, ప్రమీల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడైన భూక్యా హర్షిత్ కారేపల్లిలోని మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. కాగా మూడేళ్ల కిందట హర్షిత్‌కు జ్వరం రావడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చూపించగా.. చిన్నారి బ్రెయిన్లో నీరు చేరిందని అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో హర్షిత్‌కు రెండుసార్లు బ్రెయిన్ సర్జరీ జరిగి కోలుకుంటున్న క్రమంలో ఇటీవల తిరిగి అనారోగ్యానికి గురికావడంతో రెయిన్‌బోకు తీసుకొచ్చారు. చికిత్స అనంతరం మరోసారి బ్రెయిన్ సర్జరీ చేయాలని, సుమారు రూ.7 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యు లు తెలపడంతో ఇప్పటికే ఇల్లు, వాకిలి అమ్ముకోవడంతో పాటు స్నేహితుల సహకారంతో రూ.12 లక్షల వరకు ఖర్చుచేశామని వాపోయారు. ఇదిలా ఉండగా హర్షిత్ తండ్రి సంతుకు 2021వ సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై బ్రెయిన్ సర్జరీ కావడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలతో రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించింది. తమ కుమారుడి ప్రాణాలైనా కాపాడుకుందామని, దాతలు సహకరించాలని హర్షిత్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. చదవండి: బ్యాంకుల వద్ద మఫ్టీలో ఉండి మరీ అరాచకం..! ఒక్కసారిగా ఇలా.. -
గర్భస్థ శిశువు మెదడుకు శస్త్రచికిత్స
బోస్టన్: అమెరికాలోని బోస్టన్ నగరంలో వైద్యులు అరుదైన ఘనత సాధించారు. వైద్య రంగంలోనే అద్భుతాన్ని సృష్టించారు. తల్లిగర్భంలో ఉన్న 34 వారాల శిశువు(పిండం)కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. శిశువు మెదడులో అపసవ్యంగా ఉన్న రక్తనాళాన్ని సర్జరీతో సరిచేశారు. ప్రపంచంలో ఈ తరహా సర్జరీ చేయడం ఇదే ప్రథమం. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, బ్రిఘామ్, ఉమెన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ సర్జరీ జరిగింది. గర్భస్థ శిశువుల్లో అరుదుగా తలెత్తే ఈ వైకల్యాన్ని ‘వీనస్ ఆఫ్ గాలెన్ మాల్ఫార్మేషన్’ అంటారు. ఇలాంటి వైకల్యంతో జన్మించే శిశువులు మెదడులో గాయాలు, గుండె వైఫల్యం వంటి కారణాలతో మరణించే అవకాశం ఉంటుందని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ డాక్టర్ డారెన్ ఒబ్రాచ్ చెప్పారు. మెదడు నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళం అపసవ్యంగా ఏర్పడడమే గాలెన్ మాల్ఫార్మేషన్. దీనివల్ల రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. ఫలితంగా రక్త పీడనం ఎక్కువై సిరలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సిరలలో ఒత్తిడి కారణంగా మెదడు పెరుగుదల మందగిస్తుంది. కణజాలాలు దెబ్బతింటాయి. అంతేకాకుండా గుండె పనితీరు కూడా దెబ్బతినవచ్చు. గాలెన్ మాల్ఫార్మేషన్తో బాధపడుతున్న గర్భస్థ శిశువుల్లో 50 నుంచి 60 శాతం మంది పుట్టిన వెంటనే ఆరోగ్యం విషమిస్తుందని, వారు బతికే అవకాశాలు కేవలం 40 శాతం ఉంటాయని డారెన్ ఒబ్రాచ్ వెల్లడించారు. -
అరుదైన సంగీత శస్త్ర చికిత్స: బ్యాండు మేళం వాయిస్తుంటే.. సర్జరీ చేసేశారు
ఇటలీలోని ఒక వ్యక్తి అత్యంత అరుదైన శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. అతను శాక్సోఫోన్(బ్యాండు మేళ వాయిద్యం) వాయిస్తూ...ఉంటే ఆపరేషన్ చేసేశారు. అది కూడా దాదాపు తొమ్మిది గంటల ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ఈ మేరకు జీజెడ్ అనే 35 ఏళ్ల వ్యక్తికి రోమ్‌లోని పైడియా ఇంటర్నేషనల్ ఆస్పత్రి ఈ అరుదైన శస్త్ర చికిత్స చేసింది. డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా ఈ శస్త్ర చికిత్స గురించి మాట్లాడుతూ..."ఈ సర్జరీలో రోగి స్ప్రుహలోనే ఉండాలి. అతని మెదడుకు సంబంధించిన న్యూరానల్ ఫంక్షన్ జరుగుతుండాలి. అంటే మాట్లాడటం, కదలడం, లెక్కించడం, గుర్తించడం, ఆడటం వంటివి అన్నమాట. పేషంట్ ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఈ శస్త్ర చికిత్సను సుమారు 10 మందితో కూడిన వైద్యా బృందం చేస్తోంది. మొదటగా వైద్యులకు ఈ శస్త్ర చికిత్స ఎలా సాధ్యం అనే సందేహం కలిగింది. ఎందుకంటే చేసేది బ్రెయిన్ సర్జరీ. అందుకు రోగి పూర్తిగా సహకరించాలి. ఏ మాత్రం భయపడకుండా మేల్కొని ఉండి చేయించుకోవాలి. అసలు టెన్షన్‌కి గురికాకూడదు. వైద్యులుకు కూడా ఈ శస్త్ర చికిత్స అతిపెద్ద సవాలుతో కూడుకున్నది. దీంతో వైద్యుల సదరు రోగితో మాట్లాడుతుండగా... అతను సంగీతకారుడని తెలుసుకున్నాం. దీంతో తాము ఈ చికిత్స సమయంలో తనకు ఇష్టమైన సంగీత వాయిద్యాన్ని వాయిస్తుండమని, నిద్రపోకూడదని చెప్పాం. దీంతో జీజెడ్ కూడా వైద్యులకు పూర్తిగా సహకరించి, ఏ మాత్రం భయపడకుండా బ్యాండు మేళ వాయిస్తూ చేయించుకున్నాడు. ఈ శస్త్ర చికిత్స ద్వారా రోగి బ్రెయిన్లో ఒక నిర్థిష్ట ప్రాంతంలో ఉన్న కణితిని తొలగించి వ్యాధిని నయం చేస్తాం. అంతేకాదండోయ్ సదరు పేషంట్ శస్త్ర చికిత్స జరుగుతున్నంత సేపు ఇటాలియన్ జాతీయ గీతాన్ని, 1970ల లవ్‌స్టోరీ చిత్రంలోని థీమ్ సాంగ్‌ని వాయించాడని వైద్యులు చెప్పారు. తాము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రోగి మేల్కోని ఉండగానే ఈ శస్త్ర చికిత్స చేయగలిగాం." అని డాక్టర్ క్రిస్టియన్ బ్రోగ్నా సంతోషంగా చెప్పారు. (చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు) -
అయ్యో! రామూ.. నీ జీవితం ఎందుకిలా మారిపోయింది?
నిర్జీవంగా పడి ఉన్న భర్త రామస్వామి మంచం పక్కనే వేయి కళ్లతో ఎదురు చూస్తోంది రాధమ్మ. ప్రతీక్షణం అతని పలకరింపు కోసం పడిగాపులు కాస్తోంది. కానీ అది జరగాలంటే అతనికి ఖరీదైన వైద్యం చాలా అవసరం. అందుకే దాతలు అదుకుని తన భర్త రామస్వామికి మంచి జీవితాన్ని ప్రసాదించమని కోరుతోందామె. దాతలు మంచి మనసుతో విరాళాలిచ్చి ఆరోగ్యవంతంగా తన భర్త రామూని తిరిగి ఇవ్వాలని కన్నీళ్లతో వేడుకుంటోంది. భార్యభర్తలుగా తమ కుటుంబం కోసం ఎన్నో కలలు కంటుంది ఏ జంట అయినా.. రాత్రి పగలు కష్టపడి తమను నమ్ముకున్న వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తారు. అలాంటి దంపతులే రాధమ్మ రామస్వామి. కానీ అనుకోని ప్రమాదం ఈ దంపతుల జీవితంలో నిప్పులు పోసింది. పనినుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడనుకున్న భర్త ప్రమాదానికి గురై అచేతనంగా పడి ఉండడాన్ని చూసి కుమిలిపోతోంది రాధమ్మ. అసలేం జరిగిందంటే.. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే రామస్వామి ఒకరోజు పనినుంచి ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. తీవ్ర గాయాలతో అతను అప్పటికే కోమాలోకి వెళ్లిపోయాడు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు రామస్వామి పరిస్థితి విషమంగా ఉందని, అత్యవసరంగా పోస్ట్ ట్రామాటిక్ కేర్ బ్రెయిన్ సర్జరీ అవసరమవుతుందని చెప్పారు. అతడిని కాపాడేందుకు అదొక్కటే మార్గం అని కూడా వైద్యులు రాధమ్మకు తేల్చి చెప్పారు. ఈ చికిత్సకు దాదాపు 10 లక్షలు ($ 12853.88) అవుతుందన్నారు. దీంతో ఆమె దుఃఖంతో కుప్పకూలిపోయింది. నిరుపేద కుటుంబానికి ఆ ఖర్చును భరించడం చాలా కష్టం. అయినా అందిన చోటల్లా అప్పు తెచ్చి చికిత్స అందించారు. కానీ రామస్వామి పూర్తిగా కోలుకోవాలంటే ఆపరేషన్లు, కీలకమైన మందులు అవసరం. అందుకే నిస్సహాయస్థితిలో ఉన్న తనను ఆర్థికంగా ఆదుకోవాలని రాధమ్మ ఆకాంక్షిస్తోంది. తన భర్త రామస్వామికి కొత్త జీవితాన్ని ప్రసాదించేలా సాయం చేయమని కోరుతోంది. దాతల దాతృత్వమే తనకు రక్ష అని కన్నీటితో ప్రార్థిస్తోంది రాధమ్మ. మీ విరాళాలతో ఆమె కుటుంబాన్ని ఆదుకొని, రామస్వామికి మెరుగైన జీవితాన్ని ప్రసాదించండి! (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా బిడ్డను కాపాడండి: దాతలూ ఆదుకోండి ప్లీజ్!
రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది. అందులోనూ కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా ఏమైనా జరిగితే వారి జీవితం అంధకారంలోకి కూరుకు పోతుంది. తన ప్రాణానికి ప్రాణం, కుటుంబానికి పెద్దదిక్కైన 28 ఏళ్ల కొడుకు రాహుల్ పనినుంచి తిరిగి వస్తాడని ఎదురుచూస్తూన్న తల్లికి అతనికి ప్రమాదం జరిగిందని తెలిస్తే గుండె పగిలి పోదూ! సరిగ్గా నిర్మల జీవితంలోనూ ఇదే జరిగింది. కొడుకు వస్తాడనే సంబురంతో రాత్రి భోజనానికి సిద్ధమవుతుండగా కుమారుడి స్నేహితుడి ఫోన్‌కాల్ పిడుగులా మారింది. రాహుల్ బైక్‌ను లారీ ఢీకొట్టిందనీ, తీవ్రంగా గాయపడిన రాహుల్‌ని ఆసుపత్రికి తరలించారని అతని స్నేహితుడు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈ వార్త వినేసరికి కుప్పకూలిపోయింది నిర్మల. వెంటనే ఆసుపత్రికి పరిగెత్తింది. అక్కడ రాహుల్ జాడ కనిపించలేదు. దీంతో బిడ్డ ఏమై పోయాడో అన్న భయంతో గుండె వేగం మరింత పెరిగింది. అయితే దెబ్బలు బాగా తగలడంతో మరో ఆసుపత్రికి తరలించినట్లు నర్సు చెప్పడంతో కాస్త ఊరట పడింది. దెబ్బలు తగిలినా పరవాలేదు. బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలు ఎలాగైనా కాపాడుకుంటా అంటూ ఆ తల్లి మనసు ఆరాట పడింది. ఆందోళనతో ఆ ఆసుపత్రి కెళ్లేసరికి అత్యవసర శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు తీసుకెళ్లారని తెలిసింది. దీంతో సాయం చేసిన వారందరికీ కన్నీళ్లతోనే ధన్యవాదాలు తెలుపుకొని, నా బిడ్డను ఎలాగైనా కాపాడు తండ్రీ అంటూ వేయి దేవుళ్లకు మొక్కుకుంది. మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రాహుల్‌ని కళ్లారా చూసేందుకు ఆరాటపడుతూ థియేటర్ బయట కూర్చొని ఎదురు చూస్తోంది. రాహుల్ చిన్నతనంలోనే తండ్రి కంటి చూపుకోల్పోయాడు. అప్పటినుంచి అన్నీ తానే అయ్యా కుటుంబ పోషణ బాధ్యత తీసుకున్నాడు. పగలూ రాత్రి కష్టపడి కూలిపని చేస్తూ, తల్లి దండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కొడుకు జ్ఞాపకాల్లో మునిగిపోయింది నిర్మల. ఇంతలో థియేటర్ నుంచి బైటికి వచ్చి వైద్యులు చెప్పిన మాట విని నిర్మలమ్మ కాళ్ల కింద భూమి కంపించిపోయింది. ‘‘రాహుల్‌కి అన్నిపరీక్షలు చేశాం అతని మెదడులో తీవ్రమైన ఇంటర్నల్ బ్లీడింగ్‌ను గుర్తించాం. మెదడులోని రక్తస్రావాన్ని ఆపి, అతడి ప్రాణాల్ని రక్షించేందుకు అత్యవసరంగా అతనికి పుర్రెలో ఒక భాగానికి శస్త్రచికిత్స చేశాం. కానీ శరీరంలో ఎడమ భాగం పక్షవాతానికి గురైంది. అయినా ఈ గండంనుంచి రాహుల్ గట్టెక్కాలంటే మరిన్ని ఆపరేషన్లు చేయాలి. సుమారు 10-15 రోజుల ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది. ఈ చికిత్సకు మొత్తం ఖర్చు రూ. 7 లక్షలు ($ 8878.46) అవుతుంది’’ ఇదీ డాక్టర్లు చెప్పిన మాట. చెట్టంత ఎదిగిన కొడుకు అచేతనంగా పడిపోవడంతో, బిడ్డను బతికించుకోవడానికి అవసరమైన డబ్బు లేక ఆ నిరుపేద కుటుంబం అల్లాడిపోతోంది. మరోవైపు ప్రమాదానికి ముందు, తరువాత సంగతులు కొడుకు మర్చిపోతాడేమోననే భయం నిర్మలను ఆవరించాయి. అయినా తన కొడుకును దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. దయగల దాతలు స్పందించి దయచేసి నా బిడ్డను రక్షించండి! అని నిర్మల దీనంగా వేడుకుంటోంది. సరిగ్గా కదలలేక, తిండిలేక, నిద్రలేక అల్లాడిపోతున్న కొడుకును ఈ స్థితిలో చూడలేపోతున్నాను. మా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేశాం అంటూ రాహుల్ ఆపరేషన్ ఖర్చులకు అవసరమైన సొమ్మును సమకూర్చాల్సిందిగా దాతలను కోరుతున్నారు ఆ నిర్మలమ్మ దంపతులు. రాహుల్ ప్రాణం కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి! దానం చేయండి!! (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
బోన్ క్యాన్సర్ అని తెలియడంతో...
జలుమూరు: మండలంలోని టి.లింగాలుపాడు పంచాయతీకి చెందిన దువ్వారాపు రాము(32) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో పెయింటర్‌గా పనిచేసిన రాము అనారోగ్యం కారణంగా కొద్ది నెలల క్రితం స్వగ్రామం చేరుకున్నాడు. గతంలో మెదడు సంబంధిత వ్యాధి బారిన పడటంతో రెండుసార్లు శస్త్ర చికిత్స చేశారు. ఇటీవల మళ్లీ అనారోగ్యానికి గురి కాగా వైద్యపరీక్షలు చేయించగా బోన్ క్యాన్సర్ అని తేలడంతో మాసికంగా కుంగిపోయాడు. భార్య, పిన్ని చర్చికి వెళ్లిన సమయంలో శ్లాబ్‌కు చున్నీ కట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. రాముకు బాల్యం నుంచి కష్టాలే. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో పిన్ని అసిరిపోలమ్మ అన్నీ తానై పెంచింది. ఈ క్రమంలో వివాహం కూడా చేసింది. రాముకు భార్య యమున, కుమారుడు హర్షవర్దన్ ఉన్నారు. అసిరిపోలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పారినాయుడు తెలిపారు. లారీని ఢీకొట్టిన బైక్ ఇచ్ఛాపురం: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచిలి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పులారి జానకిరావు (27), పిన్నింటి దర్మరాజు, మద్దిలి ప్రవీణ్‌కుమార్‌లు ఆదివారం ఒడిశా నుంచి ఆంధ్ర వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. సుమండి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని అదుపు తప్పి ఢీకొట్టారు. ఈ ఘటనలో జానకిరావు అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన ధర్మరాజు, ప్రవీణ్‌కుమార్‌లను 108 వాహనంలో ఇచ్ఛాపురం సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తీసుకెళ్లారు. ఒడిశా గొలంత్ర పోలీసులు కేసు నమోదు చేసి జానకిరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బరంపురం పెద్దాసుపత్రికి తరలించారు. (చదవండి: భార్యపై కతితో దాడి చేసి...ఆ తర్వాత...) -
అమ్మో! ఆ సర్జరీ చేయించుకుంటే....ఇన్ని సమస్యలా!
-
ఆమె గుండె చప్పుడు వినిపించడమే కాదు.. కనిపిస్తోంది కూడా!
అత్యధునిక టెక్నాలజీతో కూడిన వైద్య విధానంలో మనం చాలా రకాల సర్జరీలు గురించి వినే ఉంటాం. కానీ కొన్న సర్జరీల వల్ల జరిగే దుష్పరిణామాలు గురించి ఇటీవలకాలంలో తరుచుగా వింటున్నాం. కానీ అత్యవసర పరిస్థితిలో రోగిని రక్షించే నిమిత్తం తప్పనిసరై అలాంటి శస్త్ర చికిత్సలు చేస్తారు. అయితే ఇటీవలకాలంటో గుండె మార్పిడికి సంబందించిన శస్త్ర చికిత్సలు గురించి వింటున్నాం. కానీ ఇక్కడొక అమ్మాయి అలాంటి శస్త్ర చికిత్స చేయించుకోవడం ఎలా దుష్పరిణామాలను ఎదుర్కుందో చూడండి. గుండె మార్పిడి అనేది వైద్యంలో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సా విధానాలలో ఒకటి. ఇది వైద్య విధాంలో అత్యద్భుతమైన శస్త్ర చికిత్స. అయితే సిసిలియా-జాయ్ అడమౌ అనే 22 ఏళ్ల మహిళ గుండెకు సంబందించిన ఎడమ కర్ణిక ఐసోమెరిజంతో అట్రియో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్(గుండెకు ఎడమవైపు రంధ్రాలు ఏర్పడటం)తో జన్మించింది. దీంతో ఆమెకు గుండె మార్పిడి చికిత్స చేయాల్సి వచ్చింది. (చదవండి: వామ్మో! అంత ఎత్తులోంచి ఒకేసారి దూకేసారు... చివరికి) ఈ మేరకు ఆమెకు 2010లో 45 ఏళ్ల వ్యక్తి నుంచి ఆమెకు గుండె మార్పిడి జరిగింది. దీంతో ఆమె తర్వాత ఆరునెలలకే మూత్రపిండాల మార్పిడికి సంబంధించిన సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే ఆమెకు 11 ఏళ్ల ప్రాయంలో జరిగిన ఈ రెండు శస్త్ర చికిత్స ఆమె జీవితాన్నే మార్చేశాయి. తదనంతరం నాలుగేళ్లకే బ్రెయిన్లో ఏర్పడిన కణుతులు కారణంగా మరో ఆపరేషన్ చేయించుకుంది. ఈ సర్జరీల కారణంగా ఆమె రకరకాల దుష్పరిణామాలను ఎదుర్కొంది. అయితే ఆమెకు జరిగిన గుండె మార్పిడి సర్జరీ కారణంగా ఆమె గుండె కొట్టుకుని తీరు అందరికి కనిపించేలా కొట్టుకుంటింది. ఈ శస్త్ర చికిత్సతల తాలుకు మచ్చలు ఆమె శరీరం మీద గుర్తులుగా మిగిలిపోయాయి. ఏది ఏమైన ఒక శస్త్ర చికిత్స చేయిస్తే ఇంకో దుష్పరిణామం ఎదుర్కొవ్వడం మళ్లీ మరో చికిత్సా ఇలా ఆమె మూడు ప్రమాదరకరమైన శస్త్ర చికిత్సలు చేయించుకుంది. ఈ మేరకు ఆమె టిక్‌టాక్‌లో తాను ఈ శస్త్ర చికిత్స వల్ల తాను ఎదర్కొన్న సమస్యలను గురించి వివరిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: వింతైన ఇల్లు దీని ధర ఎంత తెలుసా?) -
వీడియో: బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే హనుమాన్ చాలీసా చదివిన మహిళ
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఎయిమ్స్ వైద్యులు 22 ఏళ్ల యుక్తి అగర్వాల్ అనే మహిళకు బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా ఆమె హనుమాన్ చాలీసా పఠించారు. న్యూరోసర్జరీ విభాగంలో వైద్యులు మూడున్నర గంటల పాటు ఈ కీలక సర్జరీ నిర్వహించి బ్రెయిన్ ట్యూమర్‌ను తొలగించేవరకూ ఆమె స్ప్రహలోనే ఉన్నారు. అంతేకాదు, ఆమె చికిత్స మధ్యలో వైద్యులతో సహకరించడం విశేషం. మెలకువగా ఉన్న మహిళకు బ్రెయిన్ సర్జరీని ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించి, కణితను తొలగించారు. అనంతరం తనకు ఏమీ జరగనట్లు తల అటూ ఇటూ ఊపుతూ ఆపరేషన్ థియేటర్ నుంచి ఆ మహిళ బయటకొచ్చారు. కాగా మహిళకు అనస్తీషియాతో పాటు పెయిన్‌కిల్లర్ మందులు ఇచ్చామని వెద్యులు వెల్లడించారు. జులై 22న జరిగిన ఈ ఘటనను ఎయిమ్స్ న్యూరోసర్జరీ విభాగం వైద్యుడు దీపక్ గుప్తా వివరించారు. టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహిళ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో అక్కడున్న వైద్య సిబ్బంది ఒకరు ఈ దృశ్యాలను ఫోన్లో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. In #AIIMS, a woman patient recite 40 verses of #Hanuman chalisa, while @drdeepakguptans and his neuro anaesthetic team conducts brain tumor surgery.#Delhi pic.twitter.com/MmKTJsKo95 — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 23, 2021 -
నులి పురుగు బ్రెయిన్‌లోకి వెళ్లడం వల్లే ..
సాక్షి, గుంటూరు: గత ఐదేళ్లుగా ఫిట్స్‌తో బాధపడుతూ.. నిరంతరం కుడి చేయి కొట్టుకుంటున్న పదేళ్ల బాలుడికి గుంటూరుకు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి అరుదైన శస్త్రచికిత్స చేసి వ్యాధిని నయం చేశారు. ఆపరేషన్ వివరాలను బుధవారం గుంటూరులో ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లుకు చెందిన బురుసు వీర్రాజు, మహేశ్వరి దంపతుల పదేళ్ల కుమారుడు మహేష్ 2015 నుంచి ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. మందులు వాడుతున్నా ఫిట్స్ తగ్గలేదు. గత నెల 15 నుంచి రాత్రి నిద్రపోయే 8 గంటలు మినహా రోజంతా బాలుడి కుడిచేయి ఆగకుండా నిరంతరం కొట్టుకుంటూనే ఉండేది. దీంతో బాలుడి తల్లిదండ్రులు అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లగా.. బ్రిందా న్యూరో సెంటర్‌కు వెళ్లమని రిఫర్ చేశారు. బ్రెయిన్ సర్జరీలకు వాడే అత్యాధునిక వైద్య పరికరం ‘న్యూరో నావిగేషన్ టెక్నాలజీ’, ‘యానిమేటెడ్ త్రీడీ బ్రెయిన్ మ్యాప్’లను ఉపయోగించి బాలుడి బ్రెయిన్లోని గడ్డను ఈ నెల 17న డాక్టర్ హనుమ శ్రీనివాసరెడ్డి తొలగించారు. డాక్టర్ త్రినాథ్ సహకరించారు. నులి పురుగు బ్రెయిన్‌లోకి వెళ్లడం వల్లే .. ఆపరేషన్ చేసి తొలగించిన ట్యూమర్‌కు బయాప్సీ పరీక్ష చేయగా ‘న్యూరో సిస్టిసెర్కోసిస్ ఆఫ్ బ్రెయిన్’గా తేలిందని డాక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇది ఒక టేప్‌వార్మ్ (నులిపురుగు) వల్ల వస్తుందన్నారు. పంది మాంసం తినేవారితో పాటు కూరగాయలు, పండ్లు సరిగా కడుక్కోకుండా తినేవారిలో న్యూరో సిస్టిసెర్కోసిస్ ఎగ్స్ ఉండి నులిపురుగు బ్రెయిన్‌లోకి వెళ్లడం వల్ల ఈ సమస్య వస్తుందని వివరించారు. -
తన సర్జరీ కోసం నిమ్మరసం అమ్ముతున్న చిన్నారి!
జీవితమన్నాక కష్టసుఖాలు సర్వసాధారణం. మనం ఖర్చు చేయలేని స్థాయిలో కష్టం ఎదురైతే వెంటనే ఎవరైనా సాయం చేస్తారా? అని ఎదురు చూస్తాం. కొందరైతే సాయం చేసే చేతులకోసం అదేపనిగా వెతుకుతుంటారు. కానీ అమెరికాలోని ఓ ఏడేళ్లమ్మాయి తన బ్రెయిన్ సర్జరీ కోసం తానే సంపాదించాలనుకొంది. ఇంత చిన్న వయసులో అంతపెద్ద సమస్య వచ్చినప్పటికీ కలేజాతో ముందుకు సాగుతూ.. ఎవర్నీ సాయమడగకుండా సొంతంగా డబ్బులు సంపాదిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. అమెరికాలోని అలబామా కు చెందిన ఏడేళ్ల లిజా స్కాట్‌కు తరచూ ఫిట్స్(మూర్ఛ) వచ్చి పడిపోయేది. ఫిట్స్ ఎందుకొస్తున్నాయో తెలుసుకునేందుకు లిజాను డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా.. మస్తిష్కంలో కొన్ని లోపాల కారణంగా తరచూ మూర్ఛ వస్తుందని, బ్రెయిన్ సర్జరీ ద్వారా ఈ సమస్య ను సరిచేయవచ్చని వైద్యులు చెప్పారు. అయితే బ్రెయిన్ సర్జరీకయ్యే ఖర్చును భరించే శక్తి లిజా కుటుంబానికి లేదు. దీంతో లిజా తన ఆపరేషన్‌కు తానే సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే లిజా తల్లి నడిపే బేకరీలో సొంతంగా నిమ్మరసం అమ్ముతూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టింది. నిమ్మరసం కొనే కస్టమర్లు లిజా పరిస్థితి తెలుసుకుని బిల్లుతోపాటు మరికొంత ఎక్కువ నగదును ఇచ్చేవారు. ఒక్కో కస్టమర్ ఐదు డాలర్ల నుంచి వంద డాలర్ల వరకు బిల్లు కట్టేవారు. ఇప్పటిదాకా నిమ్మరసం అమ్మడం ద్వారా లిజా మొత్తం 12 వేల డాలర్లను కూడబెట్టింది. మళ్లీ ఫిట్స్ రావడంతో ప్రస్తుతం లిజా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ‘నీ ఆపరేషన్ కు నువ్వే ఎందుకు సంపాదించుకోవాలి?’ అనుకున్నావు అన్న ప్రశ్నకు సమాధానంగా... ‘‘నా లాగా ఆపదలో ఉన్నవారు ఇలా సొంతంగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నించడం యాచించడం కంటే కొంతమేలే కదా అని’ చెప్పడం చాలా ముచ్చటేస్తుంది. ‘తండ్రిలేని లిజాను తాను ఎంతో ప్రేమ గా చూసుకుంటున్నాననీ, ఆమె వైద్య ఖర్చుల కోసం కోసం కష్టపడి డబ్బులు కూడబెడుతున్నానని లిజా తల్లి ఎలిజబెత్ చెప్పారు. సర్జరీ, ఇంకా మందులకు చాలానే ఖర్చవుతుంది. అందుకే నేను కూడా ఆన్లైన్లో దాతల్ని సాయం చేయమని అభ్యర్థించాను. దీంతో లిజా పరిస్థితి తెలిసిన బంధువులు, స్నేహితులు, ఇతర దాతలనుంచి ఇప్పటివరకు మూడు లక్షల డాలర్ల సాయం అందిందని చెప్పారు. ప్రస్తుతం బ్రెయిన్ ఆపరేషన్‌తో తన పరిస్థితి కాస్త మెరుగుపడినప్పటికీ లిజాకి 30 ఏళ్లు వచ్చేవరకు రెగ్యులర్‌గా చెకప్స్ చేయించాలని ఎలిజ్బెత్ వివరించారు. చదవండి: భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు -
సింథసైజర్ వాయిస్తుండగా బ్రెయిన్ సర్జరీ
భోపాల్: ఇంజక్షన్ పేరు చెబితే చాలు చిన్నారులతో సహా పెద్దలు కూడా కొందరు భయపడతారు. అలాంటిది సర్జరీ అంటే.. ఇక ఎంత భయం, ఆందోళన ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధైర్యవంతుల్లో కూడా చిన్నపాటి ఆందోళన సహజం. కానీ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి మాత్రం బ్రెయిన్ సర్జరీ జరుగుతుండగా.. ఏ మాత్రం భయపడలేదు సరి కదా.. ఏకంగా సింథసైజర్(ఎలక్ట్రానిక్ సంగీత పరికరం) వాయిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. గ్వాలియార్కు చెందిన సౌమ్య అనే తొమ్మిదేళ్ల చిన్నారికి తలలో కణితి ఏర్పడింది. తల్లిదంద్రులు చిన్నారిని గ్వాలియర్ బీఐఎంఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. అయితే సాధారణంగా ఆపరేషన్‌కు ముందు మత్తు మందు ఇస్తారు. కానీ సౌమ్య విషయంలో ఇలా మత్తు మందు ఇచ్చి సర్జరీ చేయడం ప్రమాదం అని.. దాని వల్ల మెదడులోని ఇతర నరాలు దెబ్బతింటాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల, ఆమె శస్త్రచికిత్సను 'అవేక్ క్రానియోటమీ'(రోగి మెలకువగా ఉండగానే సర్జరీ చేయడం) పద్ధతిలో చేయాలని వైద్యులు నిర్ణయించారు. (చదవండి: బిగ్‌బాస్ షో చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్) ఈ క్రమంలో చిన్నారి దృష్టి మరల్చడం కోసం వైద్యులు వినూత్న ఆలోచన చేశారు. సౌమ్యకు సర్జరీ చేస్తుండగా సింథసైజర్ ఇవ్వాలని... పాప దానితో ఆడుకుంటూ.. శస్త్ర చికిత్స విషయం మర్చిపోతుందని భావించారు. ఇక సర్జరీ చేసే భాగం వరకు మాత్రమే మత్తు మందు ఇచ్చారు. అనంతరం వైద్యులు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి సౌమ్య తలలోని కణితిని విజయవంతంగా తొలగించారు. ఆ తర్వాత సౌమ్యను ఆబ్జర్వేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యవంతంగా ఉందని వెల్లడించారు వైద్యులు. -
బిగ్‌బాస్ షో చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్
గుంటూరు : బిగ్‌బాస్ రియాల్టీ షోను రోగికి చూపిస్తూ, రోగి హీరో నాగార్జున పాటలు పాడుతున్న సమయంలో బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. రోగికి అత్యాధునిక వైద్య విధానం న్యూరో నావిగేషన్‌తో అవేక్ బ్రెయిన్ సర్జరీ చేసి ప్రాణాలు కాపాడినట్టు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి చెప్పారు. గుంటూరు కొత్తపేటలోని బ్రింద న్యూరోసెంటర్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన 33 ఏళ్ల బత్తుల వరప్రసాద్ బెంగళూరులో స్టాఫ్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తలలో ట్యూమర్ ఏర్పడి ఫిట్స్ రావటంతో 2016లో హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించుకున్నారు. సర్జరీ అనంతరం రేడియోథెరపీ కూడా చేశారు. అయితే బ్రెయిన్లో మరలా గడ్డ ఏర్పడి సుమారు ఆరు నెలలుగా ఫిట్స్ వచ్చి తరచుగా పడిపోతున్నాడు. క్యాన్సర్ వైద్య నిపుణుల సూచనల మేరకు నవంబర్ 6న రోగి తమ ఆస్పత్రికి వచ్చాడని చెప్పారు. రోగి తలకు ఎంఆర్ స్పెక్ట్రో స్కోపీ, పర్ఫ్యూజన్ స్కాన్ చేసి ప్రధానమైన పెద్ద రక్తనాళం పక్కన ప్రీ మోటార్ ప్రాంతంలో ట్యూమర్ ఉన్నట్టు గుర్తించామన్నారు. ఈ నెల 10న న్యూరో నావిగేషన్, మోడరన్ మైక్రోస్కోప్ వినియోగించి త్రీడీ టెక్నాలజీ ద్వారా ఆపరేషన్ చేసినట్లు వివరించారు. ఆపరేషన్ సమయంలో రోగికి బిగ్‌బాస్ షో చూపిస్తూ ఉండగా హీరో నాగార్జున పాటలను రోగి పాడుతూ ఉన్నట్టు తెలిపారు. తదుపరి రోగికి ఇష్టమైన అవతార్ సినిమాను చూపిస్తూ, రోగితో మాట్లాడుతూ ఆపరేషన్ చేశామన్నారు. బ్రెయిన్లో నుంచి మూడు సెంటీమీటర్ల ట్యూమర్‌ను తీసే సమయంలో వరప్రసాద్ తన మెడ వెనుక ఏదో తేడా వస్తున్నట్టు చెప్పాడన్నారు. వెంటనే వేరే డైరెక్షన్లో బ్రెయిన్లో నుంచి ట్యూమర్‌ను బయటకు తీసి రోగి ప్రాణాలు కాపాడామన్నారు. సుమారు గంటన్నర వ్యవధిలో జరిగిన శస్త్రచికిత్సలో తనతో పాటుగా సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ డి.శేషాద్రిశేఖర్, మత్తు వైద్యనిపుణుడు డాక్టర్ బి.త్రినాథ్ పాల్గొన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అవేక్ బ్రెయిన్ సర్జరీ తామే మొట్టమొదటిసారిగా చేశామని చెప్పారు. -
మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
న్యూఢిల్లీ : బ్రెయిన్ సర్జరీ అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రణబ్‌కు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ప్రణబ్ ఆరోగ్యంపై మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే ఆయన ఆరోగ్యంపై నిపుణుల వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని అన్నారు. కాగా మాజీ రాష్ట్రపతికి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. (ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం) అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. (మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ) -
ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగింది. మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ‘ప్రణబ్‌కు బ్రెయిన్ క్లాట్‌ను తొలగించేందుకు శస్త్రచికిత్స జరిగింది. ఆయన పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్‌పై ఉన్నారు’అని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని, నిపుణులైన వైద్య బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపాయి. దాదాకు కరోనా పాజిటివ్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కోవిడ్–19 బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. గత వారంలో తనను సంప్రదించిన వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం లేదా కోవిడ్–19 పరీక్షలు చేయించుకోవడమో చేయాలని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూడా అయిన ఆయన విజ్ఞప్తి చేశారు. 2012–17 మధ్యకాలంలో ప్రణబ్ రాష్ట్రపతిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్ఆర్ ఆస్పత్రికి వెళ్లి ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన కూతురు షర్మిష్టకు ఫోన్ చేసి ప్రణబ్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అశోక్ గహ్లోత్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర మంతి పీయూష్ గోయల్ తదితర నేతలు మాజీ రాష్ట్రపతికి త్వరగా స్వస్థత చేకూరాలని ఆకాంక్షించారు. -
ప్రాణభిక్ష పెట్టండి
శ్రీకాకుళం, జి.సిగడాం: భవిష్యత్తుపై ఎన్నో కళలు కన్న ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం మంచానికి పరిమితం చేసింది. తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చింది. ఇప్పటికే 20 లక్షల రూపాయలు అప్పు చేసి చికిత్స చేసినా మరో రూ.30 లక్షలు అవసరం కావడంతో కుటుంబ సభ్యులు దాతల సాయం ఆశగా ఎదురుచూస్తున్నారు. జి.సిగడాం మండలం నిద్దాం గ్రామానికి చెందిన చౌదరి వెంకటరమణ, వరలక్ష్మి దంపతుల కుమారుడు గణేష్. రాజాంలోని ఓ ప్రయివేట్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగా 2018 ఏప్రిల్ 3న ఆమదాలవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే జెమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో విశాఖకు తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో మెదడుకు శస్త్రచికిత్స చేశారు. అయితే మెదడులో కొంత భాగం రక్తం ప్రసరించకపోవడంతో మాట, నడక లేక మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు కూలి పని చేసి, అప్పులు చేసి, అర ఎకరా పొలం కూడా అమ్మి సుమారు రూ.20 లక్షలు వైద్యం కోసం ఖర్చు చేశారు. యువకుడి చికిత్సకు మరో రూ.30 లక్షలు అవసరమవుతాయని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు అంత సొమ్ము తీసుకురాలేక తల్లడిల్లుతున్నారు. దాతలే కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదుకోవాలి.. మాది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. గణేష్‌ను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. రోజువారీ కూలీ డబ్బులు కుటుంబ పోషణకే చాలడం లేదు. ఇంకా చికిత్స ఎలా చేయించగలం. దాతలు, ప్రభుత్వం స్పందించి నా కుమారుడ్ని ఆదుకోవాలి.– చౌదరి వరలక్ష్మి(గణేష్ తల్లి) సాయం చేయాలనుకుంటే చౌదరి వెంకటరమణ, స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా, రాజాం ఖాతా నంబరు : 20397702441, ఐఎఫ్ఎస్ కోడ్: ఎస్బీఐఎన్ 0006216, సెల్:9505875335 -
ఆపరేషన్ జరుగుతుండగా వంట చేసిన బామ్మ
రోమ్ : ఓ వైపు వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే.. మరో వైపు రోగి ఎంచక్కా పాటలు పాడటమో.. ఏదైనా వాయిద్యాన్ని వాయించటం లాంటి ఘటనలు కోకొల్లలు. కానీ, ఈ వార్త అందుకు భిన్నమైనది. ఓ బామ్మ మాత్రం తనకు బ్రెయిన్ సర్జరీ జరుగుతుండగానే మంట లేకుండా వంట చేసేసింది. ఈ సంఘటన ఇటలీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం అన్కోనా సిటీలోని రీయూనిటీ హాస్పిటల్లో ఓ 60ఏళ్ల బామ్మకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. అమె టెంపరల్ లోబ్( మాట, కుడివైపు భాగం కదలికలను కంట్రోల్ చేసే మెదడులోని భాగం) పని తీరును గమనించేందుకు ఆమెను ఏదైనా పని చేస్తుండమని పురమాయించారు వైద్యులు. ( హుర్రే: ఆర్డర్ చేసిందొకటి.. వచ్చింది మరొకటి) ఇటాలియన్ సైడ్ డిష్ స్టఫ్డ్ ఆలీవ్స్ దీంతో ఆమె వంట చేయటానికి సిద్ధపడింది. ఓ వైపు వైద్యులు సర్జరీ చేస్తుంటే మరో వైపు ఆమె 90 స్టఫ్డ్ ఆలీవ్స్ను తయారు చేసింది. ప్రస్తుతం బామ్మ బ్రెయిన్ సర్జరీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ గ్రేట్ చెఫ్.. ఆమె ఓ వంటల మహారాణి.. ఏదో హర్రర్ సినిమా చూసినట్లుగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( మాట్లాడుతుండగానే బ్రెయిన్‌కు సర్జరీ! ) -
నవ్వుతుండగానే బ్రెయిన్‌కు సర్జరీ
-
మాట్లాడుతుండగానే బ్రెయిన్‌కు సర్జరీ!
న్యూఢిల్లీ : జార్జియాలోని బ్రినావ్ యూనివర్శిటీలో చదువుతున్న జెన్నా స్కార్డ్ అనే 25 ఏళ్ల వైద్య విద్యార్థిని బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఎలా నివారించుకోవచ్చో రోగులకు శిక్షణ ఇస్తుండగా, హఠాత్తుగా మూర్చరోగం లాగా వచ్చి పడిపోయింది. కాళ్లు, చేతులు వణికిపోయాయి. ఆమెను వైద్యులు వచ్చి పరీక్షించగా, ఆమె ‘కవర్నోమా’తో బాధ పడుతున్నట్లు తేలింది. అంటే మెదడులోని ఆక్సిజన్ తీసుకెళ్లే మంచి రక్తనాళాలు, చెడు రక్తం నాళాలు ఓ చోట కలుసుకొని బిగుసుకుపోవడం, దాని వల్ల అక్కడ రక్తనాళాలు తెగి మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సర్జరీ తప్పదని డాక్టర్లు చెప్పడంతో ఇలినాయికి చెందిన జెన్నా, డల్లాస్‌లోని మెథడిస్ట్ మెడికల్ సెంటర్ ఆస్పత్రిలో చేరింది. మాట్లాడే ప్రక్రియను నియంత్రించే మెదడు ప్రాంతానికి అతి సమీపంలోనే మంచి, చెడు రక్తనాళాలు బిగుసుకుపోయాయి. సర్జరీలో ఏ మాత్రం పొరపాటు జరిగినా ఆమెకు మాట పడిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు గ్రహించి ఆమెను హెచ్చరించారు. అందుకు ప్రత్యామ్నాయం ఏమిటని ఆమె ప్రశ్నించగా, మెదడుకు ఆపరేషన్ చేస్తున్నంత సేపు ఏదో ఒకటి మాట్లాడుతుండాలని, అలా మాట్లాడాలంటే ఎలాంటి మత్తు తీసుకోరాదని చెప్పారు. స్వతహాగ ఓ థెరపిస్ట్ కోర్సు చేస్తున్నందున ఎలాంటి మత్తు ఇవ్వకుండా సర్జరీ చేయమని డాక్టర్లకు చెప్పారు. వారు అలాగే సర్జరీని ప్రారంభించారు. సర్జరీ జరుగుతున్నంత సేపు ఆమె మాట్లాడుతుండడమే కాకుండా ఎక్కడా బాధ పడుతున్నట్లు కనిపించకుండా నవ్వుతూ కనిపించారు. దీన్ని వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఇలాంటి సర్జరీలు జరగడం చాలా అరుదు. -
బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారు..
మా నాన్నగారి వయసు 52 ఏళ్లు. ఈమధ్య తరచూ కాళ్లూ–చేతులు తిమ్మిర్లెక్కుతున్నాయని విపరీతంగా బాధపడుతున్నారు. ఒక్కోసారి నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఏ పని మీదా దృష్టిపెట్టలేకపోతున్నారు. మందులు వాడినా ఫలితం లేకపోవడంతో విజయవాడ పెద్దాసుపత్రిలోని ‘న్యూరో’ డాక్టరుకు చూపించాం. వారు పరీక్షలన్నీ చేసి బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా సర్జరీ చేయించుకొమ్మని చెప్పారు. ఆ కుటుంబంలో అందరమూ బెంగపడుతున్నాం. బ్రెయిన్ సర్జరీ అంటే ప్రాణాపాయం ఉంటుందని, ఏవైనా అవయవాలు కోల్పోవచ్చని చెబుతున్నారు. కొద్దికాలం కిందట ‘బ్రెయిన్ ట్యూమర్’కు ఏదో శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చిందని, అది చాలా సురక్షితమని, అవయవాలు పనిచేయకుండా పడిపోయే పరిస్థితి రాదనే విషయాన్ని తాను పేపర్లో చదివానని ఒక ఫ్రెండ్ చెప్పాడు. అంతకు మించి వివరాలేమీ ఇవ్వలేకపోయాడు. అదేం సర్జరీయో వివరంగా చెప్పండి. అది ఖరీదైనదేమోననే ఆందోళన కూడా ఉంది. ఈ సర్జరీలోని రిస్క్ ఏమిటో, ఫలితాలెలా ఉంటాయో కూడా దయచేసి వివరించండి. మీరు లేఖలో రాసినదాన్ని బట్టి చూస్తే... బహుశా మీ ఫ్రెండ్ ‘ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ’ గురించి పేపర్లో చదివి ఉంటారు. అదే విషయాన్ని మీకు చెప్పి ఉంటారు. మెదడులో గడ్డలు అనేక సమస్యలు తెచ్చిపెడతాయి. తలనొప్పి మొదలుకొని... శరీరంలోని వివిధ అవయవాల పనితీరు దెబ్బతీసేలా చేయడం వరకు రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. అవయవాలు పనిచేయకపోవడం లాంటి తీవ్రమైన పరిణామాలు తలెత్తితే అది ఆ వ్యక్తి జీవననాణ్యతపై ప్రభావం చూపడంతో పాటు, తన సాధారణ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది.ఇక ఈ అధునాతన సర్జరీ విషయానికి వస్తే... ఇందులో మంచి కచ్చితత్వం ఉంటుంది. ఈ ఇంట్రా ఆపరేటివ్ 3టి ఎమ్మారై (ఐఎమ్మారై) శస్త్రచికిత్స ప్రక్రియలో మళ్లీ మళ్లీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం రాకుండా గడ్డలను సమూలంగా తొలగించేందుకు అవకాశం ఉంటుంది. దీని సహాయంతో సర్జన్లు కేంద్రనాడీమండలం (సీఎన్ఎస్)లో ఏర్పడే గడ్డలను మూలాల వరకు గుర్తించి కూకటివేళ్ల నుంచి తొలగించడానికి వీలవుతుంది. ఒక వ్యక్తి శరీరంలోని అన్ని అవయవాలను మెదడు నియంత్రిస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే మెదడుకు శస్త్రచికిత్సలంటే అది ఏ అవయవాన్నైనా దెబ్బతీస్తుందేమోననే ఆందోళన ఉండటం సహజమే. అయితే ఆధునిక న్యూరోసర్జరీ వైద్యవిభాగంలో మైక్రోస్కోప్‌లు ప్రవేశించడం వల్ల ఇప్పుడు అవే శస్త్రచికిత్సలను చాలా సురక్షితమైన రీతిలో చేయడం సాధ్యమవుతుంది. సాధారణంగానైతే సర్జన్ మైక్రోస్కోప్ ద్వారా లోనికి చూస్తూన్నప్పుడు మెదడులోని భాగాలను ఊహించగలడు గానీ... లోపలి భాగాల్లోకి ప్రవేశించడం కష్టంగానూ, ప్రమాదాలతో కూడుకున్న రిస్కీ పనిగానూ ఉంటుంది. అయితే మనం సాధారణంగా వాడే జీపీఎస్లాగే... ఈ ఆపరేషన్‌లోనూ ముందుగానే న్యూరోనావిగేషన్ పద్ధతి ద్వారా మెదడులోని అంతర్గత భాగాలనూ విస్పష్టంగా గుర్తించడం ఇప్పుడు సాధ్యమవుతోంది. నిమ్ ఎక్లిప్స్ వంటి ఇంట్రా ఆపరేటివ్ న్యూరోమానిటరింగ్ను ఉపయోగించుకొని, మెదడులోని ఫంక్షనల్ ప్రాంతాలను... అంటే ఏదైనా అవయవాన్ని నియంత్రించే భాగాలను గుర్తించి, శస్త్రచికిత్స సమయంలో వాటికి ఎలాంటి నష్టం జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకునేందుకు ఇప్పుడు అవకాశం ఉంది. మామూలుగానైతే శస్త్రచికిత్స చేస్తున్న ప్రదేశాన్ని ఒక మైక్రోస్కోపు... న్యూరోనావిగేషన్తో కలిసి కొన్ని భాగాలను కాంతిమంతంగా చూపించగలగుతుంది. కానీ అది మెదడులోని సాధారణ, అసాధారణ కణాల మధ్య వ్యత్యాసాన్ని చూపించలేదు. దాంతో కొన్ని రకాల గడ్డలను మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు అవి కూడా మెదడు కణజాలంలాగే కనిపిస్తాయి. ఈ సమస్యను ఎదుర్కోవడంలో న్యూరో నావిగేషన్ సదుపాయం కొంతవరకు సహాయపడుతుంది. అయితే మెత్తని కణజాలంతో కూడిన మెదడు... సర్జరీ సమయంలో స్థిరంగా ఉండదు. కదలికలకు (షిఫ్ట్స్కు) గురవుతుంటుంది. దీనివల్ల శస్త్రచికిత్స ప్రారంభానికి ముందు న్యూరోనావిగేషన్ ద్వారా అందిన చిత్రాలు... ఆపరేషన్ కొనసాగించే సమయంలో అంతగా ఉపయోగపడవు. అందువల్ల స్పష్టత లేకుండానే తమ ఊహమేరకు సర్జన్లు శస్త్రచికిత్స కొనసాగించాల్సి రావడంతో చాలా సందర్భాల్లో మెదడులోని గడ్డలో కొంతభాగం అలాగే మిగిలిపోవచ్చు. అలా మిగిలిపోయిన ఆ భాగం మళ్లీ పెద్ద గడ్డగా పెరిగేందుకు అవకాశం ఉంది. ఈ కారణంగానే మెదడు గడ్డల తొలగింపు ఆపరేషన్లలో చాలా సందర్భాల్లో మళ్లీ మళ్లీ సర్జరీ చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఇలాంటి పరిస్థితిని నివారించడంలో ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారై కీలక పాత్ర పోషిస్తుంది. శస్త్రచికిత్స సమయంలో మెదడు కదిలిపోయే పరిస్థితిని ఎప్పటికప్పుడు అది తెలియజేస్తూ ఉంటుంది. శస్త్రచికిత్స కొంత పూర్తయిన తర్వాత ఇంకా గడ్డ భాగం ఏదైనా మిగిలి ఉందా, దాని అంచులు ఎంతమేరకు విస్తరించి ఉన్నాయి... వంటి అంశాలను అది స్పష్టంగా చూపిస్తుంటుంది. అందువల్ల ఈ సౌకర్యాన్ని ఉపయోగించి శస్త్రచికిత్స చేయించుకుంటే మళ్లీ మళ్లీ మెదడు సర్జరీలు చేయించాల్సిన అవసరం రాదు. మొత్తం ట్యూమర్‌ను ఒకేసారి తొలగించవచ్చు. కాకపోతే కాస్తంత సమయం ఎక్కువగా పడుతుందంతే. ఈ ఎమ్మారై ఎలా సహాయపడుతుందంటే... ఎమ్మారై (మాగ్నెటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్) సహాయంతో మన శరీర అంతర్భాగాల్లోని అవయవాలను స్పష్టమైన చిత్రాలుగా తీయవచ్చన్న విషయం తెలిసిందే కదా. ఇప్పటివరకూ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిగ్రస్తుల్లో శస్త్రచికిత్సకు ముందుగా ఈ ఎమ్మారై పరీక్ష చేస్తుంటారు. ఆపరేషన్ నిర్వహించాక... రెండో రోజున పేషెంట్‌ను మళ్లీ ఎమ్మారై గదికి తరలించి, మరోసారి పరీక్ష చేసి, ట్యూమర్‌ను ఏ మేరకు తొలగించామని పరిశీలిస్తుంటారు. ట్యూమర్ ఇంకా కొంత మిగిలి ఉన్నట్లు గమనిస్తే... మళ్లీ సర్జరీ చేస్తారు. దీంతో ట్యూమర్ మొత్తాన్ని తొలగించడానికి... ఈ విధంగా చాలాసార్లు సర్జరీలు చేయాల్సి వస్తుంటుంది. అదే ‘ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారై’ శస్త్రచికిత్స సమయంలోనే స్కాన్‌ను నిర్వహిస్తూ ఉంటే... ఇక్కడికక్కడే అప్పటికప్పుడే శస్త్రచికిత్సలో అవసరమైన మార్పులు చేయడానికి వీలవుతుంది. అంటే దీనిద్వారా పదే పదే సర్జరీలు చేయాల్సిన అగత్యం తప్పుతుందన్నమాట. ఈ తరహా శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారైను సర్జన్లకు అందుబాటులో ఉంచే విధంగా ఆపరేషన్ థియేటర్‌ను ప్రత్యేకంగా రూపొందించాల్సింటుంది. దీనికి తోడుగా మైక్రోస్కోప్, న్యూరోనావిగేషన్ వ్యవస్థలనూ ఏర్పాటు చేస్తారు. ఈ అత్యాధునిక పరికరాల సహాయంతో ఆపరేషన్ కొనసాగుతుండగానే నిమిషనిమిషానికీ ఎప్పటికప్పుడు మెదడు చిత్రాల(ఇమేజెస్)ను చూసే వీలుకలుగుతుంటుంది. ఈ ఇమేజెస్ అందుబాటులో ఉండటం వల్ల సర్జన్లు ట్యూమర్ పరిమాణాన్ని, విస్తరణను విస్పష్టంగా చూడగలుగుతారు. ఫలితంగా మూలాల నుంచి గడ్డను తొలగించగలుగుతారు. అంతేకాదు... ఆ శస్త్రచికిత్స జరిగే క్రమంలో మెదడులోని వివిధ కీలకప్రాంతాలకు ఏమాత్రం నష్టం జరగకుండా చూస్తారు. దాంతో అవి అదుపుచేసే శరీర భాగాల పనితీరు దెబ్బతినకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. కణితి ఉన్న ప్రదేశం వరకు పక్కాగా మార్క్ చేసి, మెదడులోని ఇతర కీలక భాగలు, ప్రధాన అవయవాలను నియంత్రించే వ్యవస్థలను ఎంతో జాగ్రత్తగా న్యూరో మానిటరింగ్ సిస్టమ్‌తో పర్యవేక్షిస్తూ... ఏ అవయవాన్నీ కోల్పోకుండా, దెబ్బతినకుండా జాగ్రత్తపడుతూ ఈ ‘ఇంట్రా ఆపరేటివ్ న్యూరోమానిటరింగ్’ సహాయంతో సర్జరీ చేయవచ్చు. ఈ సర్జరీలు 90 శాతానికి పైగా విజయవంతమవుతున్నాయి. ఇక ఖర్చు విషయానికి వస్తే మామూలు సర్జరీలతో పోలిస్తే కేవలం 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే అదనంగా ఖర్చవుతుంది. అయితే మళ్లీమళ్లీ సర్జరీ చేయాల్సిన పరిస్థితులను నివారించే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది పెద్ద ఖర్చుగా భావించనక్కర్లేదు. ట్యూమర్ ఉన్న ప్రదేశం, సైజును బట్టి ఉండే రిస్క్ ఎలాంటి సర్జరీలలోనైనా ఉండనే ఉంటుంది. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఈ ఆధునిక పద్ధతిని ఉపయోగించుకొని శస్త్రచికిత్స చేయించుకోవచ్చు. - డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియం, సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
బ్రెయిన్ సర్జరీ మధ్యలో అలవోకగా..
-
ఓ వైపు సర్జరీ.. మరో వైపు గిటార్..!!
బెంగళూరు : నగరానికి చెందిన భగవాన్ మహవీర్ జైన్ ఆసుపత్రి వైద్యులు అద్భుతం చేశారు. బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటున్న పేషెంట్‌తో సర్జరీ మధ్యలో గిటార్ ప్లే చేయించారు. అంతేకాదు స్మార్ట్ ఫోన్‌ను కూడా వినియోగించమని పేషెంట్‌కు సూచించడంతో అతను అలవోకగా ఫోన్‌ను వినియోగించాడు. బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందిన మ్యూజిషియన్, ఇంజినీర్ టస్కిన్ ఇబ్నా అలీ(31) న్యూరలాజికల్ సమస్య(వేళ్లు పని చేయడం మానేశాయి)తో మహవీర్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సర్జరీ నిర్వహిస్తూ చేతి వేళ్ల ఎలా పని చేస్తున్నాయో పరీక్షించేందుకు అలీతో గిటార్, స్మార్ట్‌ఫోన్‌ను వినియోగింపజేశారు. సర్జరీపై మీడియాతో మాట్లాడిన న్యూరాలిజిస్టు డా. సంజీవ్.. గిటారిస్టుల్లో ఎక్కువగా వేళ్ల కదలికల సమస్య తలెత్తుతుంటుందని చెప్పారు. ఉద్యోగ రీత్యా ఇంజినీర్ అయిన అలీకి గిటారప్లే చేయడం అంటే ఇష్టమని చెప్పారు. ఇలాంటి సమస్యలకు వైద్యం చేయడం కన్నా, సర్జరీయే మేలని తెలిపారు. సర్జరీ విజయవంతమైందని అలీ వేళ్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో పని చేస్తున్నట్లు వెల్లడించారు. -
మెదడులోని 1.2 కేజీల కణిత తొలగింపు
నెల్లూరు(బారకాసు): ఓ మహిళ మెదడులో ఉన్న 1.2 కేజీల కణితను నారాయణ హాస్పిటల్ వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. మంగళవారం చింతారెడ్డిపాళెంలోని నారాయణ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూరోసర్జరీ విభాగం వైద్యుడు జి.విద్యాసాగర్ వివరాలు వెల్లడించారు. కావలిలోని బీసీ కాలనీకి చెందిన 65 ఏళ్ల వెంకటసుబ్బమ్మ చాలా రోజులుగా మెదడులోని కణిత కారణంగా మూతి వంకరపోయి తరచూ ఫిట్స్ రావడంతో ఇబ్బందిపడుతుండేది. పలు హాస్పిటల్స్‌లో వైద్యం చేయించినా ఫలితం లేకుండాపోయింది. సన్నిహితురాలి సూచన మేరకు ఆమె నారాయణ హాస్పిటల్‌కు వచ్చారు. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి మెదడులో పెద్ద కణిత ఉందని, దానిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని తెలిపారు. కుటుంబసభ్యుల అంగీకారం మేరకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి కణితను తొలగించారు. ఈ కణిత 1.2 కేజీల బరువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తమ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, నిష్ణాణుతులైన వైద్యులు అందుబాటులో ఉండటం వల్లనే ఈక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించగలిగామని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాంసతీష్ తెలిపారు. ఈ శస్త్రచికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఉచితంగా నిర్వహించామన్నారు. సమావేశంలో హాస్పిటల్ సీఈఓ డాక్టర్ విజయమోహన్‌రెడ్డి, ఏజీఎం భాస్కర్‌రెడ్డి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.