ఆపరేషన్‌ జరుగుతుండగా వంట చేసిన బామ్మ | 60 Years Old Makes Stuffed Olives While Having Brain Surgery | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ సర్జరీ జరుగుతుండగా వంట చేసిన బామ్మ

Published Fri, Jun 12 2020 8:29 AM | Last Updated on Fri, Jun 12 2020 9:20 AM

60 Years Old Makes Stuffed Olives While Having Brain Surgery - Sakshi

సర్జరీ దృశ్యాలు

రోమ్‌ : ఓ వైపు వైద్యులు బ్రెయిన్‌ సర్జరీ చేస్తుంటే.. మరో వైపు రోగి ఎంచక్కా పాటలు పాడటమో.. ఏదైనా వాయిద్యాన్ని వాయించటం లాంటి ఘటనలు కోకొల్లలు. కానీ, ఈ వార్త అందుకు భిన్నమైనది. ఓ బామ్మ మాత్రం తనకు బ్రెయిన్‌ సర్జరీ జరుగుతుండగానే మంట లేకుండా వంట చేసేసింది. ఈ సంఘటన ఇటలీలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం అన్‌కోనా సిటీలోని రీయూనిటీ హాస్పిటల్‌లో ఓ 60ఏళ్ల బామ్మకు బ్రెయిన్‌ సర్జరీ జరిగింది. అమె టెంపరల్‌ లోబ్‌( మాట, కుడివైపు భాగం కదలికలను కంట్రోల్‌ చేసే మెదడులోని భాగం) పని తీరును గమనించేందుకు ఆమెను ఏదైనా పని చేస్తుండమని పురమాయించారు వైద్యులు. ( హుర్రే: ఆర్డ‌ర్ చేసిందొక‌టి.. వ‌చ్చింది మరొక‌టి)

ఇటాలియన్‌ సైడ్‌ డిష్‌ స్టఫ్‌డ్‌ ఆలీవ్స్‌

దీంతో ఆమె వంట చేయటానికి సిద్ధపడింది. ఓ వైపు వైద్యులు సర్జరీ చేస్తుంటే మరో వైపు ఆమె 90 స్టఫ్‌డ్‌ ఆలీవ్స్‌ను తయారు చేసింది. ప్రస్తుతం బామ్మ బ్రెయిన్‌ సర్జరీకి సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ గ్రేట్‌ చెఫ్‌.. ఆమె ఓ వంటల మహారాణి.. ఏదో హర్రర్‌ సినిమా చూసినట్లుగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( మాట్లాడుతుండగానే బ్రెయిన్‌కు సర్జరీ! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement