
ఒకవైపు సర్జరీ... మరోవైపు క్యాండీక్రష్!
మామూలుగా అయితే రోగికి మత్తుమందు ఇచ్చి స్పృహలో లేనప్పుడు ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు. కానీ కొంత మందికి మాత్రం వారు మెలకువగా ఉండగానే శస్త్రచికిత్స నిర్వహించడం తప్పనిసరి. సరైన భాగంలో ఆపరేషన్ చేస్తున్నారో వైద్యులకు అర్థం అవ్వాలంటే రోగి మేల్కొని ఉండాల్సిందే. నందినిది కూడా అలాంటి పరిస్థితేననీ, అందువల్లే మెలకువగా ఉండగానే శస్త్రచికిత్స నిర్వహించాల్సి వచ్చిందని వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ చేస్తుంటే నందిని ఏ మాత్రం భయపడకుండా మొబైల్‌లో క్యాం డీ క్రష్ గేమ్ ఆడుకుందంటూ ఆమె ధైర్యాన్ని వైద్యులు మెచ్చుకున్నారు.