న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఎయిమ్స్ వైద్యులు 22 ఏళ్ల యుక్తి అగర్వాల్ అనే మహిళకు బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా ఆమె హనుమాన్ చాలీసా పఠించారు. న్యూరోసర్జరీ విభాగంలో వైద్యులు మూడున్నర గంటల పాటు ఈ కీలక సర్జరీ నిర్వహించి బ్రెయిన్ ట్యూమర్‌ను తొలగించేవరకూ ఆమె స్ప్రహలోనే ఉన్నారు. అంతేకాదు, ఆమె చికిత్స మధ్యలో వైద్యులతో సహకరించడం విశేషం. మెలకువగా ఉన్న మహిళకు బ్రెయిన్ సర్జరీని ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించి, కణితను తొలగించారు. అనంతరం తనకు ఏమీ జరగనట్లు తల అటూ ఇటూ ఊపుతూ ఆపరేషన్ థియేటర్ నుంచి ఆ మహిళ బయటకొచ్చారు.
కాగా మహిళకు అనస్తీషియాతో పాటు పెయిన్‌కిల్లర్ మందులు ఇచ్చామని వెద్యులు వెల్లడించారు. జులై 22న జరిగిన ఈ ఘటనను ఎయిమ్స్ న్యూరోసర్జరీ విభాగం వైద్యుడు దీపక్ గుప్తా వివరించారు. టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహిళ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో అక్కడున్న వైద్య సిబ్బంది ఒకరు ఈ దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
In #AIIMS, a woman patient recite 40 verses of #Hanuman chalisa, while @drdeepakguptans and his neuro anaesthetic team conducts brain tumor surgery.#Delhi pic.twitter.com/MmKTJsKo95
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 23, 2021
Comments
Please login to add a commentAdd a comment