All India Institute of Medical Sciences (AIIMS)
-
మంగళగిరి ఎయిమ్స్‌లో 107 అధ్యాపక పోస్టులు ఖాళీ!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎయిమ్స్‌లలో బోధనా సిబ్బంది పోస్టుల్లో భారీగా ఖాళీలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో పూర్తి స్థాయిలో పనిచేస్తున్న ఏడు ఎయిమ్స్‌లలో అధ్యాపక ఖాళీలు 24 శాతం నుంచి 39 శాతం వరకు ఉన్నాయని పార్లమెంట్లో ఆరోగ్య శాఖ సమాధానమిచ్చింది. పన్నెండు నగరాల్లో పాక్షికంగా పనిచేస్తున్న ఎయిమ్స్‌లు సైతం ఈ కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో 1,235 బోధనా సిబ్బందికి గాను కేవలం 810 మాత్రమే ఉండగా, 425 ఖాళీలు(34శాతం) ఉన్నాయని, నాన్ ఫ్యాకల్టీ విభాగంలో 14,343 సిబ్బందికి గాను 12,101 మంది పనిచేస్తుండగా, మరో 2,242 ఖాళీలున్నాయని వెల్లడించింది. ఇదే మాదిరి భోపాల్‌లో 24శాతం, భువనేశ్వర్‌లో 25శాతం, జో«ద్‌పూర్‌లో 28, రాయ్‌పూర్‌లో 38, పాట్నాలో 27, రిషికేశ్‌లో 39శాతం ఖాళీలున్నాయంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పాక్షికంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఎయిమ్స్‌లో 259 మంది బోధనా సిబ్బందికి గాను కేవలం 152 మందే ఉండగా.. మరో 107 ఖాళీలు(41శాతం) ఉన్నాయని తెలిపింది. ఇక 1,469 మంది బోధనేతర సిబ్బందిలో 1,021 మంది పనిచేస్తుండగా 448 పోస్టులు ఖాళీలుగా పేర్కొంది.తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్‌లోనూ 183 మంది బోధనా సిబ్బందికి గాను 118 మంది(36శాతం) మంది పనిచేస్తుండగా, 65 పోస్టుల్లో సిబ్బంది లేరని తెలిపింది. ఇక బోధనేతర సిబ్బందిలోనూ 1,374 మందిలో 898 మంది ఉండగా.. 476 ఖాళీలున్నట్లు తెలిపింది. -
ఆరోగ్య రంగంలో ‘ఏఐ’ విప్లవాత్మక పాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య ఆరోగ్య రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవాత్మక పాత్ర పోషిస్తోందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)– ఢిల్లీ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. పెరుగుతున్న దేశ జనాభా దృష్ట్యా ముందస్తు రోగ నిర్ధారణ, వేగవంతమైన చికిత్సల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మహమ్మారి వ్యాధుల నిర్ధారణ, తీవ్రత అంచనా, వ్యాధి విశ్లేషణలకు ఏఐ పరిపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. ఎయిమ్స్–ఢిల్లీలోని చాలా విభాగాలు ఇప్పటికే రోగనిర్ధారణ, రోగి–కేంద్రీకృత సేవల్లో ఏఐని వినియోగిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో ఏఐ వినియోగంలో ఎయిమ్స్ ఢిల్లీని అత్యుత్తమ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించిందని, ప్రాథమిక స్థాయిలోనే ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో గత మూడేళ్లుగా డెర్మటాలజీ, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ వంటి విభాగాల్లో పరిష్కారాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడం, అమలు చేయడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి ఎయిమ్స్ అవిశ్రాంతంగా పని చేస్తోందన్నారు. ఏఐ ఆధారిత సీసీటీవీ కెమరాలతో అధీకృత సిబ్బంది డేటాబేస్‌తో ముఖాలను పోల్చడానికి, ముఖాలను గుర్తించడానికి ఉపయోగిస్తున్నామని, అంతేగాక వీటితో అనధికార ఎంట్రీలను నిరోధించడం ద్వారా భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురష్కరించుకొని ఎయిమ్స్‌లో నిర్వహించిన సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎయిమ్స్ పరిధిలో పాలనా పరంగా తీసుకొచి్చన సంస్కరణలు, రోగులకు అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాలను ఆయన వివరించారు. ఇటీవలే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఏఐ వినియోగం కోసం ఎయిమ్స్ ఢిల్లీని ప్రధాన సంస్థగా నియమించారని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 20 సంస్థల కన్సారి్టయంకు ఎయిమ్స్ ఢిల్లీ నాయకత్వం వహిస్తోందని తెలిపారు. మిగతా వివరాలు ఆయన మాటల్లోనే.. 4 వేలకు చేరువలో బెడ్లు..: ప్రస్తుతం ఎయిమ్స్‌కి ప్రతి రోజూ సగటున 15వేలకు పైగా రోగులు ఓపీడీ సేవలకై వస్తున్నారు. కోవిడ్ తర్వాత ఓపీడీ కేసుల సంఖ్య 20–30 శాతం పెరిగింది. వీరికి కనీసంగా 15వేల మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ఇక రోగులకై కోవిడ్ వరకు 2,600 వరకు బెడ్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 3,600లకు పెంచాం. ఇందులో మాతా, శిశు బ్లాక్‌లోనే ఏకంగా 425 బెడ్లను పెంచగా, సర్జికల్ బ్లాక్‌లో 200ల బెడ్లు అదనంగా ఏర్పాటు చేశారు. రోగులకు మందుల అందుబాటులో ఉంచేందుకు ఇటీవలి కాలంలో 4 అమృత్ ఫార్మసీలను అందుబాటులోకి తెచ్చాం. ఇక ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా 30 వేల మంది రోగులకు చికిత్స అందించాం. దేశం నలుమూలల నుంచి వివిధ వ్యాధులతో వచ్చి వారిని ఒక్కరినీ తిరిగి పంపడం లేదని, ప్రతి ఒక్కరికీ వైద్యం అందిస్తున్నాం. వివిధ రాష్ట్రాల్లోని ఎయిమ్స్ ఆస్పత్రుల్లోని రోగులకు సైతం రిఫరెన్స్‌ల ఆధారంగా టెలీకన్సల్టేషన్ విధానంలో ఆరోగ్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. రోగుల సహాయకులకు 1,516 బెడ్లు.. ఇక రోగులకు సహాయకులుగా వచ్చే వారికి ఎలాంటి ఇక్కట్లు లేకుండా 5 విశ్రాంతి సదన్లను ఏర్పాటు చేయగా, అందులో 1516 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటే ఓపీడీ సహా ప్రతి కేంద్రం వద్ద వెయిటింగ్ ఏరియాలను ఏర్పాటు చేశాము. ఆస్పత్రి పరిధిలో పర్యావరణహిత ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ఎల క్ట్రిక్ షటిల్బస్ సరీ్వసులు నడుపుతున్నాం. రోగు ల నుంచి ఎలాంటి ఫిర్యాదులైనా స్వీకరించి వాటి ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సంతుష్ట్ పోర్టల్‌ను ఏర్పాటు చేశాం, దీనిద్వారా రోగులకు మరింత మెరుగైన సేవలను అందించే వీలు కలుగుతోంది. ఆస్పత్రిలో రోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని సీఎస్ఆర్ నిధులను సమకూర్చుకున్నాం. ఇప్పటికే 15కి పైగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు రూ.150 కోట్లకు పైగా నిధులను సమకూర్చాయి. ఇందులో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఏకంగా రూ.108 కోట్లు అందించింది. డిజిటల్ పాలన.. ఎయిమ్స్‌లో పారదర్శకతను పెంచేందుకు వీలుగా పూర్తిగా డిజిటల్ పాలనను అందుబాటులోకి తెచ్చాం. పేపర్‌లెస్‌గా మార్చాలని నిర్ణయించి, ఇప్పటికే ఈ–హాస్పిటల్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నాం. 100 శాతం ఈ–ఆఫీస్ ప్రక్రియతో నడుస్తున్న దేశంలోని మొదటి ఆస్పత్రి ఎయిమ్స్ ఒక్కటే. ఎయిమ్స్‌లో ప్రస్తుతం ఫిజికల్ ఫైల్స్ వినియోగం లేదు. 6 నెలల్లో 17,000 ఈ–ఫైళ్లు, 1.11 లక్షల రసీదులు జారీ చేశాం. డిజిటల్ ప్రొక్యూర్మెంట్ రీఫారŠమ్స్‌లో భాగంగా స్టోర్లలో ఆటోమేషన్, డిజిటల్ ప్రొక్యూర్మెంట్ లైబ్రరీ ఉన్నాయి. ఈ కొనుగోలు విధానంతో సగటు కొనుగోలు ధర 10 శాతం నుంచి 200 శాతం తగ్గింది. దీంతో వార్షిక పొదుపు రూ. 100 కోట్లుగా ఉంది. ఇక నియామకాల్లోనూ పూర్తిగా ఆన్‌లైన విధానమే కొనసాగుతోంది. నోటిఫికేషన్ మొదలు పరీక్ష, నియామకపత్రాల జారీ, అపాయింట్మెంట్ ఆర్డర్ల వరకు పూర్తిగా ఆన్లైన్ విధానంలో పూర్తి పారదర్శకతను తెచ్చాం. -
AIIMS Delhi: అయిదేళ్ల చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణు లు అరుదైన ఘనత సాధించారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న అయిదేళ్ల బాలి కకు విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశా రు. అయిదేళ్ల చిన్నారి మెలకువ స్థితిలో ఉండగానే ఇలా ఆపరేషన్ చేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారని చెప్పారు. ఒకటో తరగతి చదువుకునే అక్షిత అనే అయిదేళ్ల చిన్నారి మూర్ఛలతో బాధపడుతోంది. పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు ఆమెకు ఎంఆర్ఐ స్కాన్ చేయించి మెదడులో మాట/భా షను నియంత్రించే చోట కణితి(ట్యూమర్) ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 4న న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ గుప్తా సారథ్యంలోని న్యూరోసర్జన్ల బృందం శస్త్రచికిత్సకు ఉపక్రమించింది. చిన్నారి మెలకువ స్థితిలోనే ఉంచింది. దీనిద్వారా కణితిలను పూర్తిగా తొలగించేందుకు, నరాల సంబంధిత లోపా లను తగ్గించడానికి తోడ్పడుతుందని డాక్టర్ గుప్తా చెప్పారు. నొప్పి కూడా కనీస స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. చిన్నారికి ప్రత్యేక నిపుణులు మత్తు మందు ఇ వ్వడం సహా సర్జరీకి ప్రక్రియకు దాదాపు 3 గంటలు పట్టింది. సర్జరీ సమయంలో తాము చూపిన ప్రధాని మోదీ ఫొటోను చిన్నారి గుర్తు పట్టిందన్నారు. శస్త్రచికిత్స ఆసాంతం పూర్తయ్యేదాకా అక్షిత మెలకువ స్థితిలోనే ఉందన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని, సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని డాక్టర్ దీపక్ గుప్తా చెప్పారు. మెలకువగా ఉన్న పరిస్థితుల్లో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయించుకున్న ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా అక్షిత పేరు ఉంటుందని డాక్టర్ గుప్తా తెలిపారు. -
అవి చైనా న్యుమోనియా కేసులు కావు: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిమ్స్ ఆస్పత్రిలో వెలుగు చూసిన న్యుమోనియా కేసులను చైనాలో వ్యాప్తిస్తున్న చిన్న పిల్లల న్యుమోనియా కేసులతో మూడిపేడుతూ ప్రచురించిన మీడియా కథనాలపై కేంద్రం సీరియస్ అయింది. ఆ కథనాలు తప్పుదోవ పట్టించే అసత్యాలని స్పష్టం చేసింది. ఎయిమ్స్ వెలుగులోకి వచ్చిన కేసులు సాధారణమైన బ్యాక్టీరియల్ న్యుమోనియా కేసులని తెలిపింది. ఎయిమ్స్‌లో బయటపడ్డ న్యూమోనియా కేసులకు చైనాలోని కేసులకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. Media reports claiming detection of bacterial cases in AIIMS Delhi linked to the recent surge in Pneumonia cases in China are misleading and inaccurate. Mycoplasma pneumonia is the commonest bacterial cause of community-acquired pneumonia. Pneumonia Cases in AIIMS Delhi have no… pic.twitter.com/rZkpgPEwv1 — ANI (@ANI) December 7, 2023 అదీ కాగా ప్రస్తుతం వెలుగు చూసిన న్యుమోనియా కేసులు ఎయిమ్స్‌లో గత ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు నిర్వహించిన అధ్యయనంలో భాగమని తెలిపింది. ఈ కేసులను చైనా కేసులుగా భావించి.. ఎవరు భయాందోళనకు గురికావొద్దని స్పష్టం చేసింది. న్యుమోనియాపై మీడియాలో ప్రచురించే నివేదికలు అసత్యమని పేర్కొంది. -
వయాగ్రా అంత డేంజరా? ట్యాబ్లెట్ వేసుకుని మందు తాగిన వ్యక్తి 24 గంటల్లోనే..
న్యూఢిల్లీ: వయగ్రా వేసుకుని మద్యం సేవించిన 41 ఏళ్ల వ్యక్తి 24 గంటల్లోనే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి భారత పరిశోధకులు రూపొందించిన నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అంగ స్తంభన సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి రెండు వయగ్రా ట్యాబ్లెట్లు వేసుకుని అదే సమయంలో ఆల్కహాల్ సేవించాడు. ఆ మరునాడే బ్రెయిన్లో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. ఆరుగురు సభ్యులతో కూడిన ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకులు దీనిపై కేస్ రిపోర్ట్‌ను గతేడాది సెప్టెంబర్‌లో రూపొందించారు. దీన్ని ఈ వారమే ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఈ నివేదిక ప్రచురణకు కూడా ఆమోదం పొందింది. అయితే పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత జర్నల్‌లో ప్రచురించనున్నారు. వయగ్రా తీసుకుని మద్యం తాగడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయనే విషయంపై ఈ పరిశోధకులు పరిశోధనలు జరిపారు. ఈ ఘటనలో మరణించిన 41 ఏళ్ల వ్యక్తికి గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి శస్త్రచికిత్సలు కూడా జరగలేదని గుర్తించారు. ఇతడు చనిపోవడానికి ముందు రోజు తన స్నేహితురాలితో హోటల్లో ఉన్నాడు. రెండు వయాగ్రా ట్యాబ్లెట్లతో పాటు ఆల్కహాల్ సేవించాడు. ఆ మరునాడే తనకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో బ్రెయిన్లో బ్లీడింగ్ కావడం వల్లే అతను చనిపోయినట్లు తేలింది. మెదడులో గడ్డకట్టిన రక్తం 300 గ్రాములు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. అలాగే అతని హార్ట్ వాల్స్ గట్టిపడటంతో పాటు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినట్లు వెల్లడైంది. వైద్యుల సూచన అవసరం.. దీంతో వైద్యుల సూచన లేకుండా వయగ్రా వాడకూడదని పరిశోధకులు హెచ్చరించారు. దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయనే విషయంపైనా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చదవండి: ఆ బీజేపీ ఎమ్మెల్యేకు ఈ రేంజ్లో వెల్కం ఏంది నాయనా..? -
బీబీనగర్ ఎయిమ్స్‌పై కేంద్రం చిన్నచూపు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు వివిధ రంగాలపై ప్రభావం చూపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకంగా నిధుల విడుదలకు సంబంధించి ఇది స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రానికి మంజూరు అయిన బీబీనగర్‌లోని ఎయిమ్స్‌కు నిధుల విడుదలలో కేంద్రం చిన్నచూపు చూస్తోంది. సమాచార హక్కు చట్టం కింద ఇనగంటి రవికుమార్ అనే యాక్టివిస్టు సమాచారం కోరగా.. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉప కార్యదర్శి అజయ్‌కుమార్ లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు. 2024లో బీబీనగర్ ఎయిమ్స్ పూర్తి కావాల్సి ఉన్నా.. దీనికి ఇప్పటి వరకు కేవలం 8.75 శాతం మాత్రమే నిధులు విడుదల చేశారు. కేంద్రంలో 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ సంవత్సరాల్లో మొత్తం 16 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ 16 ఎయిమ్స్‌లలో బిహార్‌లోని దర్బంగా, హరియాణాలోని మనేథిలలో ఆస్పత్రుల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కేంద్రానికి అప్పగించలేదు. అలాగే తమిళనాడులోని మదురైలో ఎయిమ్స్ నిర్మాణం పూర్తిగా జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా)నిధులతో చేపట్టాలని నిర్ణయించడం వల్ల ఆ నిధుల మంజూరులో ఆలస్యం కావడంతో విడుదల కాని పరిస్థితి నెలకొంది. నిమ్స్ భవనాలను ఇచ్చినా.. బీబీనగర్‌లో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విస్తరణ కోసం నిర్మాణం చేసిన భవనాలను ఎయిమ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది. అయితే ఇక్కడ మరిన్ని భవనాల నిర్మాణంతోపాటు, జాతీయ స్థాయిలో పేరున్న విజ్ఞాన సంస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి అవసరమైన నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం చేస్తుండడం గమనార్హం. 2018 సంవత్సరంలో నాలుగు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నాలుగు ఎయిమ్స్‌లలో బీబీనగర్ (తెలంగాణ), మధురై (తమిళనాడు), బిలాస్పూర్ (హిమాచల్‌ప్రదేశ్), దేవఘర్ (జార్ఖండ్) ఉన్నాయి. అయితే బిలాస్పూర్ ఎయిమ్స్‌కు రూ.1,471 కోట్లు కేటాయించగా.. అందులో రూ.1407.93 కోట్లు విడుదల చేయడంతో నిర్మాణం దాదాపు 98 శాతం పూర్తయింది. అలాగే దేవఘర్ ఎయిమ్స్‌కు రూ.1,103 కోట్లు కేటాయించగా.. రూ.713 కోట్లు విడుదల చేసింది. అదే బీబీనగర్ ఎయిమ్స్‌కు రూ.1,365 కోట్లు కేటాయించగా రూ. 156.01 కోట్లు మాత్రమే విడుదల చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 16 ఎయిమ్స్‌లలో ఏడు ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో నాలుగు ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తవుతాయని కేంద్రం వెల్లడించింది. ఇందులో వైద్య కళాశాల, ఆస్పత్రి, ఉద్యోగుల నివాస సముదాయాలు, పరికరాలు అన్నీ అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. బీబీనగర్ ఎయిమ్స్ మొదట రూ.1,028 కోట్లు మంజూరు చేసి, 2022 అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని భావించారు. కానీ నిధులు కేటాయింపులో జాప్యంతో దీనిని 2024 చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అంచనా వ్యయం కూడా రూ.1,365 కోట్లకు చేరింది. కాగా, ఇప్పటికే నిమ్స్‌కోసం నిర్మించిన భవనాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఔట్‌పేషంట్ సేవలు మాత్రం అక్కడ కొనసాగుతున్నాయి. కేంద్రం తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 2018 డిసెంబర్లో వంద ఎకరాల స్థలంతోపాటు, నిమ్స్ భవనాలను కేంద్రానికి అప్పగించింది. అయినా ఇక్కడ ఎయిమ్స్ అభివృద్ధిలో పురోగతి లేదని విమర్శలు వస్తున్నాయి. -
8 రోజులుగా ఎయిమ్స్ సర్వర్ డౌన్.. ఇద్దరిపై వేటు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సర్వర్ హ్యాకైంది. గత ఎనిమిది రోజులుగా పని చేయడం లేదు. సర్వర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ది ఇండియా కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తోంది. ఎనిమిది రోజులు గడిచినా పరిస్థితి అలాగే కొనసాగుతుండటంతో.. ఢిల్లీకి చెందిన ఇద్దరు విశ్లేకులను సస్పెండ్ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కింద మరికొంత మందిపై వేటు పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ‘సర్వర్ హ్యాక్ అయిన క్రమంలో శానిటైజింగ్ ప్రక్రియ మొదలైంది. మొత్తం 50 సర్వర్లలో ఇంతకు ముందు 15 మాత్రమే శానిటైజింగ్ చేయగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను 25కు పెంచారు. అలాగే 400లకుపైగా ఎండ్‌పాయింట్ కంప్యూటర్లను స్కాన్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ సైతం అప్లోడ్ చేస్తున్నారు.’ అని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు.. సర్వర్ డౌన్ సమస్యను పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎయిమ్స్ మంగళవారం ఓ ప్రకటన చేసింది. సర్వర్లలో ఈ-హాస్పిటల్ డేటా పునరుద్ధరణ చేసినట్లు పేర్కొంది. సేవలను పునరుద్ధరించే ముందు నెట్వర్క్ శానిటైజింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. పెద్ద సంఖ్యలో కంప్యూటర్లు, సర్వర్లు, డేటా ఉండటం వల్ల ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఔట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్, ల్యాబ్‌లు వంటి అన్ని సేవలు మాన్యువల్‌గా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఎయిమ్స్ సర్వర్ హ్యాకింగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ది ఇండియా కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఢిల్లీ పోలీసు, ఇంటలిజెన్స్ బ్యూరో, కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), కేంద్ర హోంశాఖలు దర్యాప్తు చేపట్టాయి. దర్యాప్తు సంస్థల సూచలన మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇదీ చదవండి: షాకింగ్:హైస్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్స్, గర్భనిరోధకాలు..! -
ఆరు రోజులుగా ఎయిమ్స్ సర్వర్ హ్యాక్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రఖ్యాత ఆస్పత్రి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడకల్ సైన్సెస్ (ఎయిమ్స్) సర్వర్ హ్యాకైంది. ఆరు రోజులుగా పని చేయడం లేదు. సర్వర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ది ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషిచేస్తోంది. ఢిల్లీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్, స్ట్రాటెజిక్ ఆపరేషన్స్ విభాగం కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. బుధవారం ఉదయం స్తంభించిన సర్వర్‌లో దాదాపు నాలుగు కోట్ల మంది రోగుల ఆరోగ్య, బిల్లుల చెల్లింపుల సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. డేటా అంతా అమ్మకానికి వస్తే అప్రతిష్ట తప్పదని పోలీసు, ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మాజీ ప్రధానమంత్రులు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తుల ఆరోగ్య సమాచారం సైతం సర్వర్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అందుకే హ్యాకర్లు రూ.200 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. -
ఎయిమ్స్ డైరెక్టర్‌గా శ్రీనివాస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఢిల్లీ ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ ఎం.శ్రీనివాస్ శుక్రవారం నియమితులయ్యారు. డాక్టర్ రణదీప్ గులేరియా స్థానంలో ఆయన్ను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ నియమించినట్టు సిబ్బంది శిక్షణ విభాగం తెలిపింది. శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ డీన్‌గా ఉన్నారు. అంతకుముందు ఢిల్లీ ఎయిమ్స్‌లోనే ప్రొఫెసర్‌గా పనిచేశారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శ్రీనివాస్ అక్కడే ఎంబీబీఎస్, ఎంఎస్, ఢిల్లీ ఎయిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ విభాగంలో పీడియాట్రిక్ సర్జన్ (కార్డియో వ్యాస్కులర్ స్పెషలిస్ట్) కోర్సు చేశారు. 1994 నుంచి 2016 దాకా ఢిల్లీ ఎయిమ్స్‌లోనే పలు హోదాల్లో పని చేశారు. -
పురుషుడిగా మారేందుకు మహిళా కానిస్టేబుల్‌కు అనుమతి
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళా కానిస్టేబుల్‌కు తీపి కబురు అందించింది. మహిళ విన్నపం మేరకు.. లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఆమెకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స జరుగుతుందని తెలిపారు. ఆమెకు.. చిన్న తనం నుంచి పురుషులలో ఉన్నట్లు కొన్ని లక్షణాలు, హర్మోన్లు ఉన్నట్లు ఆమె గుర్తించింది. దీంతో ఆమె.. 2019లో లింగమార్పిడి శస్త్ర చికిత్సకోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్వాలియర్, ఢిల్లీలోని వైద్యుల సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కానిస్టేబుల్ తెలిపారు. దీనిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు.‘లింగమార్పిడి అనేది వ్యక్తి హక్కు..’ అని అన్నారు. అందుకే మహిళా కానిస్టేబుల్‌కు అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సర్జరీకి ఆమె కుటుంబంవారు అంగీకరించలేదని తెలుస్తోంది. కానీ.. మహిళా లింగ మార్పిడి చేసుకోవడానికి మొగ్గుచూపుతుంది. దీనికోసం తాను.. దాచుకున్న డబ్బులతో సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడినట్లు కానిస్టెబుల్ తెలిపారు. కాగా, 2018లో మహరాష్ట్రకు చెందిన లలితా సాల్వె అనే మహిళా కానిస్టేబుల్ కూడా ఇదేవిధంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆమెకు సెయింట్ జార్జ్ ఆస్పత్రి వైద్యులు లింగమార్పిడి చికిత్సను నిర్వహించారు. -
లాలు ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత
పట్న: రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్‌ను శుక్రవారం ఎయిమ్స్ ఆస్పత్రిలోని అత్యవసర వార్డులో చేర్పించామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన జ్వరంతో బాధపతున్నారని అయితే ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌కు సంబంధించిన పరీక్షలు చేయగా.. అన్ని పరీక్షల ఫలితాలు పాజిటివ్ రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. -
కిషన్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ ఉంటే ఆ పని చేయాలి: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: అబద్ధాలను ప్రచారం చేయ డంలో రాష్ట్ర బీజేపీ నాయకులతో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పోటీ పడుతున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. కేంద్ర మంత్రి హోదాలో ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం, ట్విట్టర్లో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం ఇచ్చిన కిషన్‌రెడ్డి, రాష్ట్ర ప్రజ లకు క్షమాపణ చెప్పి హుందాతనం కాపాడుకోవాలని అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో.. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, భరత్‌కుమార్ గుప్తా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పా టు, హైదరాబాద్‌లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు స్థలం అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎయిమ్స్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా శాశ్వత భవనంతో పాటు 201.24 ఎకరాల భూమిని అప్పగించిందని తెలిపారు. ఎయిమ్స్ డైరెక్టర్‌కు గత ఏడాది మే 10న బీబీనగర్ తహసీల్దార్ ఈ మేరకు భూమి పత్రాలు కూడా అప్పగించారన్నారు. బీబీనగర్ మండలం కొండ మడుగులో 49.25 ఎకరాలు, రంగాపూర్‌లో 151.29 ఎకరాల భూమి అప్పగింతకు సంబంధించిన పత్రాలను మంత్రి విడుదల చేశారు. చదవండి: ఒకటి, రెండు కాదు..శనగ వయసు ఏకంగా 12,600 ఏళ్లు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి అసత్యాలా? రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్రానికి అనేకమార్లు లేఖలు రాసి, విజ్ఞప్తి చేసినా.. కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలవలేదని కిషన్‌రెడ్డి ప్రకటించడం బాధ్యతారాహిత్యమని హరీశ్‌రావు పేర్కొన్నారు. 2015 జూన్ 21న నాటి కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డాను టీఆర్ఎస్ ఎంపీలతో పాటు అప్పటి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కలిసి.. జిల్లా ఆసుపత్రులను ఆప్‌గ్రేడ్ చేసి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాల్సిందిగా కోరారని గుర్తుచేశారు. అయితే తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అర్హత కలిగిన ఆసుపత్రులు లేవనే సాకును అప్పట్లో కేంద్రం చూపిందన్నారు. ఆ తర్వాత కూడా కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా మెడికల్ కాలేజీలు ఇవ్వలేదన్నారు. ఇటీవల మం జూరు చేసిన 157 మెడికల్ కాలేజీల్లో సైతం తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా ఇవ్వకుండా కేం ద్రం మొండిచేయి చూపిందన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా, కేంద్రం మంజూరు చేయకున్నా సీఎం కేసీఆర్ చొరవతో ప్రస్తుతం ఈ కాలేజీల సంఖ్య 21కి చేరిందన్నారు. రాష్ట్రానికి మరో 12 మెడికల్ కాలేజీలు అవసరమున్నాయని, కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి మంజూరు చేయిస్తే 40 శాతం నిధులు భరిం చేం దుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కిషన్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడటం సరికాదన్నారు. తనకు సరైన సమాచారం ఇచ్చేలా కేంద్ర మంత్రి సరైన బృందాన్ని పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. చదవండి: వైద్యారోగ్య శాఖపై మంత్రి హరీష్ సమీక్ష.. కీలక నిర్ణయాలు విదేశాంగ విధానం మార్చండి రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని, ఇందులో భాగంగానే కిషన్‌రెడ్డి కూడా ఇటీవల అబద్ధాలు చెబుతున్నారని హరీశ్‌రావు విమర్శిం చారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలుకు అనుమతిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు తెస్తే విమానాశ్రయానికే వచ్చి సన్మానం చేస్తామని ప్రకటించారు. పంజా బ్లో పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణలోనూ సేకరించాలన్నారు. బియ్యం ఎగుమతులకు వీలుగా విదేశాంగ విధానం మార్చాలని, పారిశ్రామికవేత్తలకు రుణాలు మాఫీ చేసిన కేంద్రం.. రైతులకు కూడా సబ్సిడీ చెల్లించాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనొద్దని ఓ వైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్తుండగా, మరోవైపు రాష్ట్ర బీజేపీ మాత్రం ధాన్యం కొనాలని ధర్నా చేస్తోందని విమర్శించారు. -
ఏడాది తర్వాతే... బూస్టర్ డోసులు!
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ బూస్టర్ డోసు (ప్రస్తుతం ఇస్తున్న రెండు డోసులకు అదనంగా మరో డోసు) వచ్చే సంవత్సరం అవసరం పడొచ్చని ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రెండు డోసులు ప్రజలను మరణాల నుంచి, ఆసుపత్రి పాలయ్యే అవకాశాల నుంచి ఎంతకాలం కాపాడుతున్నాయనే దాన్ని బట్టి బూస్టర్ డోసు ఎప్పుడివ్వాలనే నిర్ణయం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి శరీరంలో యాంటీబాడీల ఉనికికి కొలమానంగా తీసుకోబోమని తెలిపారు. చిన్న పిల్లలకు త్వరలోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ గులేరియా శనివారం ఎన్డీటీవీ ఛానల్‌తో మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయెల్, యూకే, యూరోపియన్ యూపియన్, యూఏఈ తదితర దేశాలు ఇప్పటికే బూస్టర్ డోసులను సిఫారసు చేసిన అంశాన్ని ప్రస్తావించగా... ‘బూస్టర్ డోసు ఎప్పుడివ్వాలనే దానిపై నిర్దిష్ట సమాధానం మన వద్ద లేదు. కరోనాపై పోరాడే యాంటీబాడీలు తగ్గుతున్నాయని చెప్పి బూస్టర్ డోసు ఇవ్వలేం. సమయాన్ని బట్టి నిర్ణయించాలి. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి రెండో డోసు తీసుకొని ఎంతకాలమైందనేది చూడాలి. మామూలుగా ఏడాది తర్వాత బూస్టర్ డోసుపై ఆలోచించొచ్చు’ అని అన్నారు. ‘యూకేలో గత ఏడాది డిసెంబర్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇప్పుడక్కడ కొత్త కేసులు పెరుగుతున్నాయి కానీ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాల్లో పెరుగుదల లేదు. దీనిబట్టి అర్థమవుతోంది ఏమిటంటే 2020 డిసెంబర్లో తీసుకున్న టీకాలు ఇంకా పనిచేస్తున్నట్లే. టీకా రక్షణ దీర్ఘకాలికంగా ఉంటోంది. వైరస్ రూ పాంతరం చెంది బలపడితే కొంచెం వెనకాముందు బూస్టర్ డోసులివ్వాల్సి రావొచ్చు’ అని చెప్పారు. -
కేంద్రమంత్రిపై మన్మోహన్ సింగ్ కుమార్తె ఆగ్రహం..‘వాళ్లేం జూలో జంతువులు కాదు’
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై అభ్యంతరం తెలియజేశారు. తన తల్లిదండ్రులు వృద్ధులని, జూ లో జంతులు కాదని మండిపడ్డారు. కాగా డెంగ్యూ వ్యాధికి గురైన మన్మోహన్ సింగ్ రెండు రోజులుగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చదవండి: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత ఈ క్రమంలో కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)వెళ్లి మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అక్కడే ఉన్న మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరన్ కౌర్‌ను కలిసి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోల్లో మన్మోహన్ సింగ్ మంచం మీద పడుకుని ఉండగా.. ఆయన భార్య పక్కన నిలబడి ఉన్నారు. అయితే కేంద్రమంత్రి తీరుపై మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ ఫైర్ అయ్యారు. మంత్రి తనతోపాటు ఫోటోగ్రాఫర్‌ను గదిలోకి తీసుకొచ్చినప్పుడు తల్లి చాలా బాధపడిందని, బయటకు వెళ్లాలని చెప్పిన ఆమె మాటలు అస్సులు వినిపించుకోలేదని అన్నారు. తమ తల్లిదండ్రుల కోరికకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు అసహనం వ్యక్తం చేశారు. ‘ఆరోగ్య మంత్రి మా కుటుంబాన్ని పరామర్శించడం సంతోషంగా ఉంది. అయితే ఆ సమయంలో మా తల్లిదండ్రులు ఫోటో దిగే స్థితిలో లేరు. నా తల్లిదండ్రులు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారు వృద్ధులు. జూలో జంతువులు కాదు. అని ఆమె పేర్కొన్నారు. -
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ బుధవవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో మన్మోహన్ సింగ్‌ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు మాజీ ప్రధానికి చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరం బలహీనంగా ఉండి, జ్వరం లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. 88 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఈ ఏడాది మొదట్లో కరోనా వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. చదవండి: Lakhimpur Kheri Incident: ఆ కేంద్ర మంత్రిపై వేటు వేయకపోతే అంతే సంగతా? జరిగేది అదేనా? -
ఆర్–ఫ్యాక్టర్.. పెరుగుదల ఆందోళనకరం: ‘ఎయిమ్స్’ చీఫ్
న్యూఢిల్లీ: దేశంలో ఆర్–వాల్యూ(ఆర్–ఫ్యాక్టర్) క్రమంగా పెరుగుతోందని, ఇది నిజంగా ఆందోళనకర పరిణామమేనని ఢిల్లీలోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్న ప్రాంతాల్లో నియంత్రణ చర్యలను కఠినతరం చేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి శృంఖలాన్ని తెంచడానికి ‘టెస్టు, ట్రాక్, ట్రీట్’ అనే వ్యూహాన్ని కచ్చితంగా పాటించాలని చెప్పారు. ఆర్–వాల్యూ అనేది కరోనా వ్యాప్తి తీరును గుర్తించే ఒక సూచిక. ప్రారంభంలో ఆర్–వాల్యూ రేటు 0.96గా ఉండేదని, ఇప్పుడు 1 దాటేసిందని రణదీప్ గులేరియా పేర్కొన్నారు. అంటే కరోనా బాధితుడి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశాలు పెరుగుతున్నట్లేనని వివరించారు. దేశంలో 46 రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు కొన్ని వారాలుగా 10 శాతం కంటే అధికంగా నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ఆర్–ఫ్యాక్టర్ సైతం క్రమంగా పెరుగుతోంది. ఇంట్లో ఒకరికి ఈ వైరస్ సోకితే మిగిలినవారికి కూడా అంటుకుంటున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. కుటుంబంలో ఒకరికి కరోనా డెల్టా వేరియంట్ సోకితే మిగిలినవారు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది’’ అని గులేరియా పేర్కొన్నారు. కేరళలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగుతున్నాయని, దీని వెనుక కొత్త వేరియంట్ ఏదైనా ఉందా అనేది తేలాల్సి ఉందని చెప్పారు. తమిళనాడులో 66 శాతం మందిలో ప్రతిరక్షకాలు(యాంటీబాడీస్) వృద్ధి చెందినట్లు వెల్లడయ్యిందని వివరించారు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. మనుషుల్లో కొంతకాలం తర్వాత ప్రతిరక్షకాలు తగ్గుతాయని, కేసులు మళ్లీ ఉధృతం కావడానికి ఇదీ ఒక కారణమేనన్నారు. అయితే, ప్రతిరక్షకాలు తగ్గినవారికి కరోనా సోకితే వారి నుంచి వ్యాప్తి చెందే వైరస్ తీవ్రత అంతగా ఉండదని అన్నారు. -
వీడియో: బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే హనుమాన్ చాలీసా చదివిన మహిళ
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఎయిమ్స్ వైద్యులు 22 ఏళ్ల యుక్తి అగర్వాల్ అనే మహిళకు బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా ఆమె హనుమాన్ చాలీసా పఠించారు. న్యూరోసర్జరీ విభాగంలో వైద్యులు మూడున్నర గంటల పాటు ఈ కీలక సర్జరీ నిర్వహించి బ్రెయిన్ ట్యూమర్‌ను తొలగించేవరకూ ఆమె స్ప్రహలోనే ఉన్నారు. అంతేకాదు, ఆమె చికిత్స మధ్యలో వైద్యులతో సహకరించడం విశేషం. మెలకువగా ఉన్న మహిళకు బ్రెయిన్ సర్జరీని ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించి, కణితను తొలగించారు. అనంతరం తనకు ఏమీ జరగనట్లు తల అటూ ఇటూ ఊపుతూ ఆపరేషన్ థియేటర్ నుంచి ఆ మహిళ బయటకొచ్చారు. కాగా మహిళకు అనస్తీషియాతో పాటు పెయిన్‌కిల్లర్ మందులు ఇచ్చామని వెద్యులు వెల్లడించారు. జులై 22న జరిగిన ఈ ఘటనను ఎయిమ్స్ న్యూరోసర్జరీ విభాగం వైద్యుడు దీపక్ గుప్తా వివరించారు. టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహిళ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో అక్కడున్న వైద్య సిబ్బంది ఒకరు ఈ దృశ్యాలను ఫోన్లో రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. In #AIIMS, a woman patient recite 40 verses of #Hanuman chalisa, while @drdeepakguptans and his neuro anaesthetic team conducts brain tumor surgery.#Delhi pic.twitter.com/MmKTJsKo95 — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 23, 2021 -
ఢిల్లీ ఎయిమ్స్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రధాన అత్యవసర వార్డులో సోమవారం తెల్లవారుజామున ఒక చిన్న అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని.. ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన మంటలను గంటలో అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. రోగులందరినీ బాధిత ప్రాంతాల నుంచి సురక్షితంగా తరలించారు. "ప్రమాద ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రిలోని డమ్మీ గదిలో మంటలు, పొగ కనిపించింది. రోగులందరినీ బాధిత ప్రాంతం నుంచి తరలించారు. ఏడు ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉందని డీసీసీ సౌత్ అతుల్ ఠాకూర్ వార్తా సంస్థ ఏఎన్ఐకి వెల్లడించారు. చదవండి: ఇంట్లో ఒంటరిగా ముగ్గురు పిల్లలు; నిజమైన హీరోలు మీరే! -
కోవిడ్ థర్డ్‌వేవ్ అనివార్యం: ఎయిమ్స్ డైరెక్టర్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెంకడ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కోవిడ్ మొదటి వేవ్‌తో పోల్చితే రెండో వేవ్ దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యాప్తించి భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో థర్డ్‌వేవ్ వ్యాపించడం అనివార్యమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రందీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 6 నుంచి 8 వారాల్లో కోవిడ్ మూడో వేవ్ విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపారు. అన్‌లాక్‌తో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని, వైరస్ అంటేనే మ్యుటేషన్లకు గురవుతూ ఉంటుందని తెలిపారు. హాట్స్పాట్లలో తగిన నిఘా అవసరమని పేర్కొన్నారు. దేశంలో ఉన్న జనాభాకు టీకాలు అందించడం, కోవిషిల్డ్ వ్యాక్సిన్ డోస్ మధ్య అంతరం తగ్గించడం సవాల్‌గా మారిందని ఆయన వివరించారు. కరోనా మొదటి, రెండో వేవ్‌ల నుంచి ఏం నేర్చుకున్నామో తెలుసుకోవాలన్నారు. కానీ, పలు రాష్ట్రాలు అన్‌లాక్ చేయడంతో కనీస కోవిడ్ నిబంధనల కూడా పాటించకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడుతున్నారని తెలిపారు. ఇలాగే కొనసాగితే మళ్లీ పాజిటివ్ కేసులు పెరిగి, కోవిడ్ థర్డ్ వేవ్ రావటం ఖాయమని డాక్టర్ రందీప్ గులేరియా హెచ్చరించారు. చదవండి: రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలు -
కోవిడ్ మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలి: ఎయిమ్స్ డైరెక్టర్
న్యూఢిల్లీ: దేశంలో సంభవించిన కరోనా మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలని ఎయిమ్స్‌డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కోవిడ్ మరణాల లెక్కింపు విషయంలో రాష్ట్రాలు, ప్రభుత్వాల మధ్య ఏర్పడిన వ్యత్సాసం వల్ల కోవిడ్‌కు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆవ్యాఖ్యలు వచ్చాయి. దీనికి ఇటీవల మధ్యప్రదేశ్‌లో అధికారిక గణాంకాలు, ఏప్రిల్‌లో నిర్వహించిన చివరి కర్మల సంఖ్య మధ్య అసమానత ఉండటమే కారణం. ఒక వ్యక్తికి అప్పటికే కరోనా ఉండి గుండెపోటుతో చనిపోతే అప్పుడు కోవిడ్ గుండెపోటుకు కారణం కావచ్చు. మీరు దీనిని కోవిడ్ మరణమని లేదా నాన్ కోవిడ్‌గాగుర్తించి గుండెపోటుతో మరణించారని అని తప్పుగా వర్గీకరించవచ్చు. కాబట్టి, అన్ని ఆస్పత్రులు, రాష్ట్రాలు డెత్ ఆడిట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మరణాలకు కారణాలు ఏమిటనే విషయంతోపాటు మరణ రేటును తగ్గించడానికి ఏమి చేయవచ్చో తెలుసుకునేందుకు దోహదపడుతుంది. మాకు స్పష్టమైన డేటా లేకపోతే, మేము చేయలేము మా మరణాలను తగ్గించడానికి ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేయగలగాలి.’ డాక్టర్ గులేరియా చెప్పారు. కోవిడ్‌తో లేక ఇతర కారణాలతో రోగి మరణించాడా అనే విషయాన్ని ఎవరు నిర్ణయించాలో ఇటీవల కేరళ శాసనసభ చర్చించిన క్రమంలో ఆయన ఇలా పేర్కొన్నారు. చదవండి: COVID Vaccine: వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకిందా? -
Corona 3rd Wave: పిల్లలపై ప్రభావం.. కేంద్రం స్పష్టత
న్యూఢిల్లీ: ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసిన కోవిడ్ మహమ్మారి గత కొద్ది రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే నెలలో తీవ్ర స్థాయిలో ఉన్న కరోనా కేసులు జూన్ మొదటి వారంలో లక్షకు దిగువన నమోదు అయ్యాయి. అయితే ఇప్పటి వరకు మహమ్మారి చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే మూడోదశలో మాత్రం వారికి ముప్పు ఎక్కువగా ఉంటుందనే నిపుణుల అభిప్రాయాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. దీనిపై తల్లిదండ్రులు, ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకు తగ్గట్టుగా అప్రమత్తం అవుతున్నాయి. అయితే తదుపరి దశలో కరోనాతో పిల్లలకు ముప్పు పొంచి ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పష్టం చేవారు. మూడో దశ పిల్లలపై ప్రత్యేకంగా ప్రభావం చూపుతుందనడంపై స్పష్టత లేదని కోవిడ్ నివారణ కమిటీ సభ్యులు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ఆధారంగా సీరో ప్రివలెన్స్ రేటు అదే విషయాన్ని వెల్లడి చేసిందన్నారు. అలాగే రానున్న దశలో వారికి అధికంగా ఈ వైరస్ సోకుతుందని రుజువు చేసే ఆధారాలు లేవని గులేరియా పేర్కొన్నారు. మరోపక్క కరోనా టీకాపై ఉన్న అనుమానాలను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. అలానే ఫస్ట్, సెకండ్ వేవ్‌లో కరోనా బారిన పడిన పిల్లల్లో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరలేదని.. ఇంటి వద్దనే కోలుకున్నారని గులేరియా తెలిపారు. పెద్దలు టీకాలు వేసుకుంటే పిల్లలకు వైరస్ సోకే అవకాశం చాలామటుకు తగ్గిపోతుందని తెలుస్తోంది. అలాగే పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేనందున తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయొద్దని ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ కోరింది. తదుపరి దశలో పసిపిల్లలో తీవ్ర లక్షణాలు ఉండొచ్చనే వాదనను నిపుణులు తోసిపుచ్చారు. రెండు దశల్లో భాగంగా సేకరించిన వివరాల ప్రకారం కొద్దిశాతం మందికి మాత్రమే తీవ్ర లక్షణాలు కనిపిస్తాయిని సూచిస్తున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపనుందన్న హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రులు పిల్లల సంరక్షణ కోసం సౌకర్యాలను పెంచడం ప్రారంభించాయి. వాక్సినేషన్లో భాగంగా ఐదేళ్ల లోపు పిల్లల తల్లులకు సాధ్యమైనంత త్వరగా టీకాలు వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ నోయిడా అధికారులు కూడా ఇవే చర్యలు తీసుకున్నారు. చదవండి: వ్యాక్సిన్ వేసుకున్న వారెవరూ మరణించలేదు: ఎయిమ్స్ -
వ్యాక్సిన్ వేసుకున్న వారెవరూ మరణించలేదు: ఎయిమ్స్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నిరోధానికి తీసుకువచ్చిన వ్యాక్సిన్లు సత్ఫలితాలిస్తున్నాయని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తెలిపింది. వ్యాక్సిన్ వేసుకున్నవారు కరోనా వైరస్ బారినపడినా ఎవరూ మరణించలేదని పేర్కొంది. ఈ మేరకు తాము చేసిన అధ్యయన నివేదికను శుక్రవారం ఎయిమ్స్ విడుదల చేసింది. మొత్తం 63 మందిని ఢిల్లీలో పరీక్షించగా వారు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంది. ఈ సందర్భంగా సర్వే వివరాలను వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకిన 63 మందిపై (ఒకటి, రెండు డోసులు వేసుకున్నవారు) ఢిల్లీలో అధ్యయనం చేశారు. ఏప్రిల్- మే నెలలో ఈ అధ్యయనం జరిగింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ సోకిన వారిని శాంపిళ్లను జీనోమిక్ సీక్వెన్స్ సంస్థ అధ్యయనం చేసింది. దీనిలో వ్యాక్సిన్ వేసుకున్న వారెవరూ కూడా కరోనాతో మరణించలేదని సర్వేలో తేలింది. వ్యాక్సిన్ సోకిన తర్వాత కరోనా సోకితే దానిని బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్గా పిలుస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో లోడ్ అధికంగా ఉందని గుర్తించింది. అయితే దానివల్ల ఎలాంటి ప్రమాదం.. ప్రాణసంకటం ఏమీ జరగలదేని అధ్యయనంలో ఎయిమ్స్ తేలింది. అధ్యయనం ఇలా జరిగింది.. మొత్తం 63 బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు పరిశీలించారు. వీరిలో 36 మంది రెండు డోసులు, 27 మంది ఒక డోసు వేసుకున్నారు. 53 మంది కోవాగ్జిన్, 10 మంది కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. వీరంతా 5 నుంచి ఏడు రోజుల వరకు అధిక జ్వరంతో బాధపడ్డారు. వారి వయసు 21 నుంచి 92 ఏళ్ల వయసు ఉంటుంది. ఎవరికీ దీర్ఘకాలిక వ్యాధులు లేవు. పది మందిలో పూర్తిస్థాయి ఇమ్యునోగ్లోబిన్ జీ యాంటీబాడీలు ఉన్నాయి. ఆరుగురిలో కరోనా సోకకముందే యాంటీబాడీలు వృద్ధి చెందాయి. నలుగురికి ఇన్ఫెక్షన్ తర్వాత యాంటి బాడీలు వృద్ధి చెందాయి. -
Black Fungus: ఎలా గుర్తించాలి, ఏం చేయాలి?
న్యూఢిల్లీ: ఓవైపు మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్(మ్యూకోర్మైకోసిస్) సైతం పంజా విసురుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడటం కలవరపాటుకు గురిచేస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే 90 మంది మ్యూకోర్మైకోసిస్ కారణంగా మరణిచంగా, రాజస్తాన్‌లో 100 కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బ్లాక్ ఫంగస్ ఉనికిని గుర్తించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎవరు మరింత అప్రమత్తంగా ఉండాలన్న విషయమై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎవరికి రిస్కు ఎక్కువ? 1. షుగర్ లెవల్స్ కంట్రోల్లో లేనివారు. స్టెరాయిడ్స్ తీసుకుంటున్న డయాబెటిక్ పేషెంట్లు, డయాబెటిక్ కెటోయాసిడోసిస్(అత్యధికంగా కీటోన్లు విడుదల కావడం)తో బాధపడుతున్న వారు. 2. యాంటీ కాన్సర్ చికిత్స తీసుకుంటున్న వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు. 3. అధికమొత్తంలో స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారు, ముఖ్యంగా దీర్ఘకాలంగా టొకిలిజుమాబ్ ఇంజక్షన్ తీసుకుంటున్నవారు 4. ఆక్సిజన్ సపోర్టు, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లు. బ్లాక్ ఫంగస్‌ను ఎలా గుర్తించాలి? 1. ముక్కు నుంచి రక్తం కారడం లేదా బ్లాక్ డిశ్చార్జ్ కావడం 2. ముక్కు దిబ్బడ, తలనొప్పి, కళ్ల చుట్టూ చర్మం ఉబ్బడం, కళ్లు ఎర్రబారడం, ఒక వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం, కంటి చూపు కోల్పోతున్నట్లుగా అనిపించడం, కళ్లు తెరవడం, మూయడంలో తీవ్రమైన ఇబ్బంది 3. ముఖం తిమ్మిరిగా అనిపించడం, స్పర్శ కోల్పోతున్న అనుభూతి 4. ఆహారం నమలడంలో ఇబ్బంది, నోరు తెరవలేకపోవడం 5. దంతాలు వదులుకావడం, నోటిలోపలి భాగం ఉబ్బడం ఏం చేయాలి? 1. పై లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే ఈఎన్టీ వైద్యుడిని లేదా కంటి డాక్టరును సంప్రదించాలి. రెగ్యులర్‌గా చెకప్‌కి వెళ్లాలి. 2. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వాళ్లు షుగర్ లెవల్స్ తప్పక అదుపులో ఉంచాలి. 3. వైద్యుడిని సంప్రదించకుండా స్టెరాయిడ్స్, యాంటీ ఫంగల్ మందులు అస్సలు వాడకూడదు. 4. డాక్టర్ల సూచన మేరకు పారానాసల్, సైనస్ టెస్టులు చేయించుకోవడం చదవండి: మ్యూకోర్మైకోసిస్ అంటే ఏమిటి? -
హెచ్చరిక: హోం ఐసోలేషన్‌లో రెమిడెసివిర్ తీసుకోవద్దు
న్యూఢిల్లీ: హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా పేషెంట్లు రెమిడెసివిర్ ఇంజక్షన్‌ను తీసుకోవద్దని, ఆక్సిజన్ స్థాయి 94కు తగ్గితే వెంటనే ఆసుపత్రిలో చేరాలని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. ‘హోం ఐసోలేషన్‌లో తీసుకోవాల్సిన మందులు, జాగ్రత్తలు’ అనే అంశంపై ఎయిమ్స్ డాక్టర్లు నీరజ్ నిశ్చల్, మనీష్‌లు శనివారం ఒక వెబినార్‌లో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ఆక్సిజన్ స్థాయిలను పరీక్షిస్తున్నపుడు పేషెంట్ వయసు, ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ►ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినప్పటికీ... లక్షణాలు అలాగే కొనసాగితే మరోసారి టెస్టు చేయించుకోవాలి. ►ఐసోలేషన్ ఉన్నవారు మందులను సరైన మోతాదులో, సరైన సమయంలో వాడితేనే ఉపయోగం ఉంటుంది. ►ఐసోలేషన్‌లో వాడే ఏ మందులైన డాక్టర్ల సలహా మేరకే వాడాలి. ►బీపీ, షుగర్, గుండెజబ్బులు, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న 60 ఏళ్లకు పైబడిన పేషెంట్లు డాక్టర్లను సంప్రదించాకే హోం ఐసోలేషన్‌లో ఉండాలి. ►హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లు తప్పకుండా మూడు పొరల మాస్క్‌ను వాడాలి, ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి దాన్ని మార్చాలి. ►ఒకరికొకరు ఎదురుపడాల్సిన పరిస్థితుల్లో పేషెంట్, సహాయకుడు ఇద్దరూ ఎన్–95 మాస్క్‌లు ధరించాలి. ►అజిత్రోమైసిన్ టాబెట్ల వాడొద్దని కోవిడ్ మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నాయి. -
అదొక్కటే మార్గం కాదు: ఎయిమ్స్ డైరెక్టర్
సాక్షి, న్యూఢిల్లీ: రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, మరణాలతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యం బారిన పడుతుండడంతో భారతదేశం తల్లడిల్లుతోంది. ప్రస్తుతం కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు. ఇదే విషయాన్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. ప్రస్తుత కట్టడి చర్యలు కరోనాను ఏమాత్రం నియంత్రించలేదని హెచ్చరించారు. రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌తో ఎలాంటి ప్రయోజనం లేదని.. కరోనా వ్యాప్తిని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. కరోనా మూడో వేవ్‌కు సిద్ధంగా ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా ఈ సందర్భంగా అప్రమత్తం చేశారు. కరోనా కేసులు తగ్గేందుకు లాక్‌డౌనే ఉత్తమ మార్గమని, అయితే అదొక్కటే మార్గం కాదని పునరుద్ఘాటించారు. మంగళవారం ఓ జాతీయ మీడియాతో గులేరియా మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి మూడు మార్గాలు ఆయన సూచించారు. ఒకటి: ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన పెంచాలి. రెండోది: ఉప్పెనలా దూసుకురాబోతున్న మూడో వేవ్ కట్టడికి వ్యాక్సిన్లు వేయడం పెంచాలి. మూడోది: ప్రజల మధ్య దూరం పెంచాలి. ఒకచోట ఉండకుండా చూసుకోవాలి. ఈ చర్యలు తీసుకుంటే కేసులు తగ్గేందుకు ఆస్కారం ఉందని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. ‘ప్రజల ఆరోగ్య దృష్ట్యా పాలకులు లాక్డౌన్లాంటి చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రాంతాలకే లాక్డౌన్ పరిమితమైతే అమెరికా మాదిరి మన దేశంలో పరిస్థితి ఉంటుంది. లాక్డౌన్ లాంటి నిర్ణయం తీసుకుంటూనే ప్రజలకు నిత్యావసరాలతో పాటు రోజువారీ కార్మికుల గురించి కూడా ఆలోచన చేయాలి. నిర్ణీత కాలం పాటు లాక్డౌన్ విధించాలి. కనీసం రెండు వారాలైనా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించాలి’ అని పేర్కొన్నారు. చదవండి: వ్యాక్సిన్‌పై ప్రధానికి లేఖ రాయనున్న సీఎం జగన్ చదవండి: నోటీస్ ఇవ్వకుండా రాజ్‌భవన్‌పై కూడా విచారించొచ్చు -
అలర్ట్: సీటీ స్కాన్‌తో క్యాన్సర్ వచ్చే అవకాశం..
న్యూఢిల్లీ: కోవిడ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో చాలామంది కరోనా అనుమానంతో లక్షణాలు లేకపోయినప్పటికి సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సీటీ స్కాన్‌కు సంబంధించి కీలక సూచనలు చేశారు. కరోనా లక్షణాలు లేని వారికి సీటీ స్కాన్ అవసరం లేదు అన్నారు. ఒక్క సీటీ స్కాన్ 300-400 ఎక్స్‌రేలతో సమానం అని.. దానితో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. అవసరం లేకున్నా చీటికి మాటికి సీటీ స్కాన్ ఎక్కువగా చేయించుకుంటే దాని రేడియేషన్‌తో క్యాన్సర్ రావొచ్చని హెచ్చరించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన సీటీ స్కాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. చెస్ట్ ఎక్స్‌రే తీసుకున్న తర్వాత ఇబ్బందిగా ఉంటేనే సీటీ స్కాన్ చేయించుకోవాలి అని తెలిపారు. కరోనా లక్షణాలు లేనివారు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకోవచ్చన్నారు. వైద్యుల సూచనల మేరకు మాత్రమే రోగులు మందులు వాడాలని గులేరియా తెలిపారు. చదవండి: కరోనా వేళ.. గుంపులుగా జనాలు -
ఎట్టిపరిస్థితుల్లో వారికి రెమిడెసివిర్ వేయకూడదు!
న్యూఢిల్లీ: రెమిడెసివిర్ ఇంజక్షన్ ప్రాణాలను నిలబెట్టే సంజీవని కాదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కోవిడ్ పేషెంట్లకు ‘అనవసరంగా, అహేతుకంగా’ రెమిడెసివిర్‌ను వాడటం ‘అనైతికం’ అని స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రెమిడెసివిర్‌కు తీవ్ర డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఔషధానికి విపరీతమైన కొరత ఉందని, సరఫరా పెంచాలని అత్యధికంగా కేసులు వస్తున్న రాష్ట్రాలన్నీ కేంద్రాన్ని నిత్యం అభ్యర్థిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సోమవారం దీని సమర్థత, వాడకంపై స్పష్టతనిచ్చింది. జాతీయ కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడైన ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ‘రెమిడెసివిర్ సంజీవని కాదనేది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. మరణాలను ఇది తగ్గించదు. మరో మంచి యాంటీవైరల్ డ్రగ్ లేనందువల్ల రెమిడెసివిర్‌ను వాడుతున్నాం. ఆసుపత్రుల్లో చేరి... ఆక్సిజన్‌పై ఉన్నవాళ్లకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని రుజువైంది. సాధారణ యాంటీబయోటిక్‌లా దీన్ని వాడకూడదు’అని వివరించారు. రెమిడెసివిర్‌ను అనవసరంగా/ అహేతుకంగా వాడటం అనైతికం! రెమిడెసివిర్ ప్రయోగాత్మకంగా పరిశీలనలో ఉన్న ఔషధమే. అత్యవసర వినియోగానికి అనుమతించబడింది. కోవిడ్–19లో ఇది ప్రాణాలను నిలబెట్టే ఔషధం కాదు దీనివల్ల మరణాలు తగ్గుతాయని అధ్యయనాల్లో నిరూపితం కాలేదు ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్లకు మాత్రమే రెమిడెసివిర్‌ను ఇవ్వాలి. ఓ మోస్తరు వ్యాధి తీవ్రతతో బాధపడుతూ ఆక్సిజన్‌పై ఉన్నవారికి మాత్రమే దీనిని సిఫారసు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు రెమిడెసివిర్‌ను వేయకూడదు. -
పొరపాటు దిద్దుకున్న ఎయిమ్స్!
న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించిన ఓ విద్యార్థినికి ఆలిండియా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సీటు నిరాకరించడం సంచలనమైంది. నీట్-2020లో 66వ ర్యాంక్ పొందిన ఫర్హీన్ కేఎస్‌కు ఎయిమ్స్ సీటు ఇవ్వకపోవడంతో ఆమె టూరిజం శాఖ మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అల్ఫోన్స్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. దీనిపై స్పందించిన ఎంపీ అల్ఫోన్స్ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాసి విద్యార్థిని సమస్య పరిష్కరించాలని కోరారు. విషయం ఆరోగ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో తమ పొరపాటును సరిదిద్దుకున్న ఎయిమ్స్ యాజమాన్యం ఎట్టకేలకు ఫర్హీన్ కేఎస్‌కు ప్రవేశం కల్పించింది. కాగా, నీట్లో 66 ర్యాంక్ సాధించిన ఫర్హీన్ గడువులోగా క్రిమి లేయర్ సర్టిఫికెట్ సమర్పించలేదన్న కారణంతో ఎయిమ్స్ సీటు నిరాకరించిన సంగతి తెలిసిందే. పేద కుటుంబంలో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఎయిమ్స్‌లో చేదు అనుభవం ఎదురవడం దురదృష్టకరమని అల్ఫోన్స్ ఈ సంర్భంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చొరవతో ఫర్హీన్‌కు సీటు దక్కిందని, మరి మంచి ర్యాంకులు సాధించినప్పటికీ చిన్నచిన్న కారణాలతో ప్రవేశాలకు దూరమవుతున్నవారి సంగతేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సమస్యల పరిష్కారానికి ఒక అప్పిలేట్ అథారిటీ ఉండాలని అల్ఫోన్స్ సూచించారు. ఉన్నత చదువులకు సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీ వచ్చే విద్యార్థులంతా మంత్రులను కలవలేరు కదా అని అన్నారు. ప్రవేశాలకు సంబంధించి ప్రాస్పెక్టస్‌లో సవివరంగా చెప్పాలని అన్నారు. -
రూ.10కే అత్యాధునిక వైద్యం
సాక్షి, యాదాద్రి: బీబీనగర్ ఎయిమ్స్‌లో గురువారం నుంచి ఓపీ సేవలు ప్రారంభమవుతాయని, రూ.10కే అత్యాధునిక వైద్యం అందజేస్తామని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. దేశంలోని టాప్–10 ఎయిమ్స్‌లలో ఒకటిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బుధవారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడుతూ.. 2024 నాటికి అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ప్రజలకు ఇక్కడ వైద్యం అందనుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయి ఎయిమ్స్ కోసం సుమారు రూ.1,000 కోట్ల నిధులు కేంద్రం మంజూరు చేసిందన్నారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, గైనిక్, ఫ్యామిలీ మెడిసిన్, పీడియాట్రిక్ సేవలు అందించనున్నట్లు వివరించారు. ఇందుకోసం డాక్టర్ల నియామకం, వైద్య పరికరాల కొనుగోలు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయిందని చెప్పారు. డిసెంబర్ చివరి వారంలో 100 పడకల ఇన్‌పేషెంట్ విభాగాన్ని ప్రారంభించాల్సి ఉండగా, కోవిడ్ నేపథ్యంలో 40 పడకలకే పరిమితం చేస్తున్నామని, ఇందులో పాజిటివ్ కేసుల కోసం 10 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేస్తామన్నారు. మెరుగైన సేవల కోసం రాజీపడం మెరుగైన సేవల కోసం ఎక్కడా రాజీపడేది లేదని వికాస్ భాటియా స్పష్టం చేశారు. తెలంగాణ ఎయిమ్స్‌లో పనిచేయడానికి దేశంలోని ప్రముఖ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది పెద్దఎత్తున పోటీ పడుతున్నారని తెలిపారు. 483 మంది ప్రొఫెసర్ల ఉద్యోగాల కోసం 2 వేల మంది దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 22 మంది డాక్టర్ల నియామకం పూర్తయిందని, మరికొంత మంది డాక్టర్ల నియామకం త్వరలో పూర్తవుతుందని ఆయన వివరించారు. 2024 నాటికి 750 పడకలతో పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తెస్తామన్నారు. మాస్టర్‌ప్లాన్ అప్రూవ్ అయ్యింది ఎయిమ్స్ ప్రధాన భవన సముదాయం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయ్యిందని భాటియా తెలిపారు. 201 ఎకరాల్లో విశాలమైన పార్కులు, క్రీడా మైదానాలు, ఆస్పత్రి భవనాలు, విద్యార్థుల వసతి గృహాల 28 అంతస్తుల 3 టవర్లు బాలురు, బాలికలు, స్టాఫ్ కోసం వేర్వేరుగా నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. స్విమ్మింగ్ పూల్స్, గార్డెనింగ్, గెస్ట్‌హౌజ్, మెడికల్ కళాశాల, ఆయుష్ బిల్డింగ్, ఆడిటోరియం వెనక స్టాఫ్ రెసిడెన్షియల్ భవనాలు, పార్కులు ఇలా ఆహ్లాదకర వాతావరణం ఉంటుందన్నారు. నిమ్స్ భవన సముదాయాలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు అధికారికంగా అప్పగించలేదన్నారు. ఎయిమ్స్‌కు అనుబంధంగా 40 నుంచి 60 కిలో మీటర్ల లోపు రూరల్ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు. -
కుక్కల్లా మొరిగిన వారు ఇప్పుడేం చెబుతారు!
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ మరణంలో హత్య కోణాన్ని తోసిపుచ్చుతూ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వెల్లడించిన నివేదికపై శివసేన సోమవారం స్పందించింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల ప్రతిష్ట దిగజార్చిన రాజకీయ నేతలు, వార్తా ఛానెళ్లు మహారాష్ట్రకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. సుశాంత్ కేసులో చివరికి సత్యం వెలుగుచూసిందని, ఈ ఉదంతంలో మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్ర జరిగిందని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం ఆరోపించింది. ఈ కుట్రలో పాలుపంచుకున్న వారిపై మహారాష్ట్ర ప్రభుత్వం పరువునష్టం దావా వేయాలని సూచించింది. సుశాంత్ మృతిపై ఎయిమ్స్ నివేదికను మూఢ భక్తులు వ్యతిరేకిస్తారా అని ప్రశ్నించింది. సుశాంత్ కేసుపై కుక్కల్లా మొరిగి, ముంబై పోలీసులను అనుమానించిన రాజకీయ నేతలు, వార్తాఛానెళ్లు ఇప్పుడు మహారాష్ట్రకు క్షమాపణలు చెప్పాలని శివసేన కోరింది. యూపీలోని హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన సామూహిక లైంగిక దాడిపై నోరుమెదపని వారు మహారాష్ట్ర నిబద్ధతను ప్రశ్నించలేరని ఆక్షేపించింది. సుశాంత్ కేసు దర్యాప్తులో విలువలు, గోప్యతను కాపాడేలా ముంబై పోలీసులు వ్యవహరించారని, అదే సీబీఐ నటుడి డ్రగ్స్ కేసును 24 గంటల దర్యాప్తులోనే తవ్వితీసిందని పేర్కొంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి ఎలాంటి అంశాలు లేకపోవడంతో సుశాంత్ కేసును బిహార్ నేతలు లేవనెత్తారని శివసేన దుయ్యబట్టింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్య కేసుపై రాద్ధాంతం చేసి ముంబైని పీఓకేతో పోల్చిన నటి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని కంగనా రనౌత్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించింది. యూపీలోని హత్రాస్‌లో దళిత యువతి హత్యాచార ఘటనపై ఆ నటి కనీసం రెండు కన్నీటి చుక్కలు కార్చలేదని ఆరోపించింది. చదవండి : సుశాంత్‌ది ఆత్మహత్యే: ఎయిమ్స్ -
గుడ్‌న్యూస్ : జనవరి నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగితే వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్‌లో సమర్ధవంతమైన కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనేది స్పష్టంగా చెప్పడం కష్టసాధ్యమేనని, మానవ పరీక్షల దశ దాటుకుని, ఇన్ఫెక్షన్ను ఎదుర్కొనే సామర్థ్యం వ్యాక్సిన్‌కు ఉందని నిరూపణ కావడం వంటి పలు అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని అన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏడాది ఆరంభంలోనే (జనవరి నాటికి) కోవిడ్-19 వ్యాక్సిన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్ తొలి సరఫరాలు దేశంలో జనాభా అంతటికి సరిపడే డోసులు ప్రాథమికంగా అందుబాటులో ఉండవని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్ సిద్ధం కాగానే, జనాభాకు అనుగుణంగా తయారీ, పెద్ద ఎత్తున పంపిణీ చేపట్టడం ప్రధాన సవాళ్లుగా ముందుకొస్తాయని అన్నారు. భారత్‌లో వ్యాక్సిన్ పంపిణీపై ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభమయ్యాయని, వ్యాక్సిన్‌ను ప్రాథాన్యతా క్రమంలో ప్రజలకు అందించడం జరుగుతుందని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా చెప్పారు. కరోనా వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నవారికి ముందుగా వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలతో పాటు వైరస్‌పై ముందుండి పోరాడే ఇతర కరోనా యోధులకు వ్యాక్సిన్ పంపిణీలో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. వైరస్ బారినపడి మరణించే అవకాశం అధికంగా ఉన్న గ్రూపులకు కూడా తొలుత వ్యాక్సిన్ ఇస్తారని చెప్పారు. ప్రాధాన్యతా జాబితాను రూపొందించి దానికి అనుగుణంగా వ్యవహరిస్తే వ్యాక్సిన్ పంపిణీ సమంగా సాగుతుందని అన్నారు. ప్రాధాన్యతా జాబితాను అనుసరించని పక్షంలో అది మరిన్ని మరణాలకు దారితీయడంతో పాటు వైరస్ వ్యాప్తి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా మాస్క్‌లు ధరించి భౌతిక దూరాన్ని పాటించడం వంటి కోవిడ్-19 నిబంధనలను పాటించి వ్యాధి వ్యాప్తిని తగ్గించేందుకు సహకరించాలని కోరారు. చదవండి : ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ కష్టం -
ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం తన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలకాంశాల గురించి చర్చించినట్లు సమాచారం. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అమిత్ షా నార్త్ బ్లాక్ కార్యాలయంలో మొదటి సారి ఈ రోజే సమావేశం అయ్యారు. అమిత్ షా ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక నేటి సమీక్షా సమావేశంలో హోం మంత్రి అనేక ముఖ్యమైన అంశాల గురించి చర్చించినట్లు తెలిసింది. అయితే ఆ కీలకాంశాలు ఏంటనే దాని గురించి సమాచారం లేదు. (ఇక వైదొలుగుతాం : అమిత్ షాకు లేఖ) -
ఎయిమ్స్‌లో చేరిన హోంమంత్రి అమిత్‌షా
-
రష్యా వ్యాక్సిన్‌పై ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుట్నిక్ వీ’ పట్ల ఆచితూచి వ్యవహరించాలని ప్రముఖ వైద్య నిపుణులు, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియ అన్నారు. ఈ వ్యాక్సిన్‌ను వాడే ముందుగా ఇది సురిక్షితమైనదా, ప్రపంచస్థాయి ప్రమాణాలను కలిగిఉందా అనేది పరిశీలించాలని ఓ జాతీయ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. తొలుత ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదా అనేది వెల్లడికావాల్సి ఉందని, పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టేముందు ఇది ప్రాథమిక అంశమని డాక్టర్ గులేరియ అన్నారు. వ్యాక్సిన్ పరీక్షల శాంపిల్ పరిమాణం, దీని సామర్ధం వంటి ప్రాతిపదికన భద్రతను పసిగట్టవచ్చని అన్నారు. వ్యాక్సిన్‌తో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు ఎంతకాలం కొనసాగుతాయనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. చదవండి : గుడ్‌న్యూస్ : తొలి వ్యాక్సిన్ వచ్చేసింది! ప్రపంచంలో తొలి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను రష్యా అభివృద్ధి చేసిందని, వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటన చేసిన నేపథ్యంలో డాక్టర్ గులేరియ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వ్యాక్సిన్‌పై ఇంకా తుది పరీక్షలు జరుగుతుండగానే రష్యా వ్యాక్సిన్‌కు ప్రభుత్వం అనుమతించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో కోవిడ్-19 రోగులకు చికిత్స అందించే రష్యా వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఇక భారత్‌లో తయారవుతున్న దేశీ వ్యాక్సిన్లపై డాక్టర్ గులేరియ స్పందిస్తూ భారత వ్యాక్సిన్లు రెండు, మూడవ పరీక్షల దశలో ఉన్నాయని వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ల అభివృద్ధిపై భారత్ కసరత్తు సాగిస్తోందని, భారీగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యం మనకు ఉందని చెప్పారు. -
ఎయిమ్స్ వైద్య విద్యార్థి బలవన్మరణం
సాక్షి, న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో దారుణం జరిగింది. వైద్య విద్యార్థి ఆత్మహత్మకు పాల్పడి ఘటన కలకలం రేపుతోంది. ఎయిమ్స్‌లో రెండవ సంవత్సరం చదువుతున్న వికాస్ (22) అనే వైద్య విద్యార్థి సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అతడు మరణించాడు. పోలీసుల సమాచారం ప్రకారం... న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో సాయంత్రం 6 గంటల సమయంలో వికాస్ అనే వైద్య విద్యార్థి హాస్టల్ పైకప్పుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రి యాజమాన్యం ఈ ఘటనపై తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న అనంతరం సదరు బాధితుడిని ఎయిమ్స్‌లోని సంబంధిత విభాగానికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: కరోనా నుంచి కోలుకున్న కర్ణాటక సీఎం) వికాస్‌కు చికిత్స అందిస్తుండగానే అతడు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు వికాస్ బెంగళూరుకు చెందిన వాడని, అతడు 2018 బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. వికాస్ కొద్ది రోజులుగా మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని, అతడికి మానసిక వైద్య చికిత్స వార్డులో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వికాస్ రోజులాగే ఈ రోజు కూడా విధులకు హజరయ్యాడని, సాయంత్రం సమయంలో ఒక గంట సెలవు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విరామం కోసం వెళ్లి సాయంత్రం 6 గంటల సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: కరోనా నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం) -
బాలికపై అత్యాచారం.. సీఎం సీరియస్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురై ఏయిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న 12 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులను గురువారం కేజ్రివాల్ పరామర్శించారు. ఈ ఘటనపై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడినట్టు తెలిపారు. ఈ ఘోరమైన నేరానికి పాల్పడిన వారికి కఠినమైన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాలిక కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించారు. బాలికకు వైద్యం అందిస్తున్న డాక్టర్లతో కేజ్రివాల్ చర్చించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని, మరో 48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమన్నారు. (రియాకు ఈడీ సమన్లు జారీ.. స్పందన లేదు) అసలేం జరిగిందంటే.. ఢిల్లీలోని పశ్చిమ విహార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ 12 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. తల్లిదండ్రులు, ఆమె సోదరి, స్థానికంగా ఉన్న గార్మెంట్ షాపులో పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం బాలిక తల్లిదండ్రులు, సోదరి పనికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను గమనించి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెపై అత్యాచారం చేసి, శరీరమంతా కత్తులతో పొడిచి వికృతానందం పొందారు. అదే రోజు సాయంత్రం 5:30 గంటల సమయంలో అతి కష్టంతో బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చింది. పొరుగింటి వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని తొలుత సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించాగా, అక్కడి డాక్టర్ల సూచనల మేరకు ఎయిమ్స్‌కు తరలించారు. ఆమె తలకు బలమైన గాయమైనట్లు వైద్యులు తెలిపారు. శరీరమంతా కత్తిపోట్లు ఉండడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
అమిత్ షా ఆ ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయిన కేంద్రం హోంమంత్రి అమిత్ షా చికిత్స కోసం ఏయిమ్స్ ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలకు ప్రజల విశ్వాసాన్ని ప్రేరేపించాలంటే శక్తి వంతుల(ప్రజా ప్రతినిధులు) ప్రోత్సాహకం చాలా అవసరమని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏయిమ్స్) ఆస్పత్రి చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన హోంమంత్రి అనారోగ్యానికి గురైనప్పుడు ఢిల్లీలోని ఏయిమ్స్‌కు వెళ్లకుండా, పక్క రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలని ఎందకు నిర్ణయించుకున్నారో ఆలోచించండి. ప్రజల విశ్వాసాన్ని ప్రేరేపించాలంటే ప్రభుత్వ సంస్థలకు శక్తివంతుల(ప్రజా ప్రతినిధుల) ప్రోత్సాహం అవసరం’అని శశి థరూర్ ట్వీట్ చేశారు. (చదవండి : ప్రముఖులపై కరోనా పంజా) కాగా, తనలో కరోనా వైరస్ ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(55) ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసందే. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. అలాగే కర్ణాటక, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రలు బీఎస్ యెడియూరప్ప, శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కరోనా బారిన పడ్డారు. వారిద్దరూ బెంగళూరు, భోపాల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
ఎయిమ్స్ వైద్యుడి మృతిపై ఢిల్లీ సీఎం దిగ్ర్భాంతి
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19తో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ వైద్యులు డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే (78) మరణించారు. ఎయిమ్స్ పల్మనాలజీ విభాగానికి ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ పాండేతో పాటు ఆయన భార్యకు మంగళవారం నిర్వహించిన కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్‌గా ఫలితం రావడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. తాము తరచూ ఆయనతో మాట్లాడుతూనే ఉన్నామని, తన పరిస్థితి మెరుగైందని చెప్పారని, శనివారం డిన్నర్ ముగించుకుని పడుకున్న తర్వాత నిద్రలో తుదిశ్వాస విడిచారని గులేరియా చెప్పారు. తీవ్ర గుండెపోటుతో డాక్టర్ పాండే మరణించి ఉంటారని వెల్లడించారు. కాగా పాండే మరణం పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అపోలో గ్రూప్ జేఎండీ డాక్టర్ సంగీతా రెడ్డి సహా పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చదవండి : ఆర్ఎంఎల్ డీన్‌కు కరోనా పాజిటివ్ -
కరోనా.. ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ మృతి
న్యూఢిల్లీ : ప్రముఖ పల్మనాలజిస్ట్, ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ జితేంద్రనాథ్ పాండే కరోనాతో మృతిచెందారు. కరోనా సోకడంతో తన నివాసంలోనే ఐసోలేషన్‌లో ఉన్న 78 ఏళ్ల జితేంద్ర శనివారం తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రత్నదీప్ గులేరియా తెలిపారు. ‘కొద్దిపాటి లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా డాక్టర్ జితేంద్ర, ఆయన భార్యకు కరోనా సోకినట్టుగా తేలింది. దీంతో మంగళవారం నుంచి వారు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని మేము నిరంతరం సమీక్షించాం. అతను కోలుకుంటున్నట్టుగానే కనిపించారు. నిన్న రాత్రి భోజనం చేసి పడుకున్నాక ఆయన మృతి చెందారు. నిద్రపోతున్న సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన మరణించి ఉంటారు’ అని చెప్పారు. జితేంద్ర మృతిపై ప్రముఖ వైద్యురాలు సంగీత రెడ్డి విచారం వ్యక్తం చేశారు. పల్మనాలజిస్ట్‌గా ఆయన అందించిన సేవలు.. ఎంతో మంది ఆరోగ్యంగా ఉండేలా చేశాయని అన్నారు. వైద్య ప్రపంచం ఓ ధ్రువతారను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.(చదవండి : భారత్‌లో లక్షా ముప్పైవేలు దాటిన కరోనా కేసులు) -
ఆస్పత్రి నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆదివారం రోజున ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జి చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎటువంటి సమస్య లేదని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. (చదవండి : మెరుగుపడిన మన్మోహన్ ఆరోగ్యం) కాగా, ఛాతీ నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరిన సమయంలో మన్మోహన్‌కు జ్వరం కూడా వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా వైద్యులు.. ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. మొదట వైద్యులు ఆయన్ని కార్డియో థొరాసిక్ ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం కార్డియో–న్యూరో టవర్లోని ప్రైవేట్ వార్డుకు తరలించారు. కాగా, 1990లో ఆయనకు తొలిసారిగా బైపాస్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత 2003లో ఆయనకు స్టంట్ వేశారు. 2009లో మరోసారి ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. -
గుజరాత్ హాట్‌స్పాట్
కరోనా వచ్చిన చిట్టచివరి రాష్ట్రాలలో గుజరాత్ ఒకటి. మార్చి 19న తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత వ్యాప్తి నెమ్మదిగా ఉంది. 500 కేసులు నమోదు కావడానికి 25 రోజులు పట్టింది. అందరూ ఈ రాష్ట్రం సేఫ్ జోన్ అనుకున్నారు. కానీ హఠాత్తుగా హాట్‌స్పాట్‌గా మారింది. గత వారంలో కేసులు రోజురోజుకీ రెట్టింపవుతున్నాయి. కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌కే కరోనాతో ఊపిరాడడం లేదు. పారామిలటరీ దళాలు మోహరించాయి. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా హుటాహుటిన అహ్మదాబాద్ వెళ్లారు. కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిని సందర్శించి పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. రోగులకు చికిత్స వ్యూహాత్మకంగా ఎలా అందించాలో అక్కడ వైద్యులకి వివరించారు. కరోనా కేసులతో పాటు మృతులు గుజరాత్లో ఎక్కువైపోవడం దడ పుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 60 వేల వరకు ఉంటే అందులో 60శాతం కేసులు ఎనిమిది నగరాల్లోనే నమోదయ్యాయి. అందులో 42 శాతానికిపైగా కేసులు ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌లో ఉన్నాయి. ఎందుకిన్ని కేసులు? 1: గుజరాత్ వాణిజ్యానికి, పర్యాటకానికి పెట్టింది పేరు. జనవరి–మార్చి కాలంలో అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు, చైనా, జపాన్, సింగపూర్, దుబాయ్ వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు. వారికి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ నిర్వహించి 14 రోజులు క్వారంటైన్లో ఉంచారు. కానీ స్క్రీనింగ్ లోపాలు, క్వారంటైన్ పకడ్బందీగా అమలు చేయడంలో ఆరోగ్య అధికారుల వైఫల్యంతో కేసులు పెరిగాయి. 2: ఢిల్లీలో మర్కజ్ నిజాముద్దీన్‌లో మత ప్రార్థనలకి గుజరాత్ నుంచి 1500 మంది వెళ్లారు. వీరంతా అహ్మదాబాద్, సూరత్, వడోదరావాసులే. ఇరుకు ప్రాంతాల్లోనే నివసించే జనాభా ఇక్కడ అధికం. ప్రస్తుతం ఈ మూడు నగరాలే రాష్ట్రంలో కోవిడ్ హాట్స్పాట్లుగా మారాయి. అహ్మదాబాద్ ఎప్పుడు చూసినా జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఒక చదరపు కిలోమీటర్‌కి 10 వేల మంది నివసిస్తూ ఉంటారు. అందుకే కరోనా నిరోధక చర్యలు పాటించడం కత్తి మీద సాములా మారింది. 3: ఆరోగ్య రంగానికి ఈ రాష్ట్రంలో ఖర్చు చేసేది చాలా తక్కువ. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో ఆరోగ్యానికి 1 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. వెనుకబడిన రాష్ట్రాలతో సమానంగా మహిళలు, శిశువుల్లో పౌష్టికాహార లోపాలున్నాయి. దేశంలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమని యూనిసెఫ్ వంటి సంస్థలు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి. పోషకాహారం లోపాలతో రోగనిరోధక శక్తి లేక కరోనా వైరస్ సులభంగా దాడి చేస్తోంది. ప్రాణాలు కూడా ఎక్కువగానే తీస్తోంది. 4: అహ్మదాబాద్‌లో ఆర్థిక అసమానతలు, అభివృద్ధిలో తేడాలు ఎక్కువ. తూర్పు అహ్మదాబాద్‌లో జనసాంద్రత ఎక్కువ. తక్కువ ఆదాయం వచ్చే జనాభా అధికంగా నివసిస్తుంది. దరియాపూర్వంటి ప్రాంతాల్లో ఇళ్లలో ఒకేగది ఉంటుంది. అందులో 50శాతానికిపైగా ఇళ్లల్లో ఒకే గదిలో ఐదుగురు జీవిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించడం అసాధ్యం. అందుకే గుజరాత్ మొత్తమ్మీద నమోదైన కేసుల్లో 70శాతం (5వేలకు పైగా) అహ్మదాబాద్‌లోనే ఉన్నాయి. 5: దేశంలో కరోనా వ్యాపించిన రాష్ట్రాల్లో ఇంచుమించుగా చివరిది గుజరాత్. దేశవ్యాప్త లాక్‌డౌన్‌కి ఆరేడు రోజుల ముందు మాత్రమే ఇక్కడ తొలి కేసు నమోదైంది. అయినా కేసులన్నీ ఎగబాకి ఇప్పుడు మహారాష్ట్ర తర్వాత స్థానంలోకి చేరుకుంది. అయితే తొలినాళ్లలో ఇక్కడ కరోనా పరీక్షలు సరిగా నిర్వహించలేదు. గత వారం రోజులుగా పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రోజుకి 3 వేలకి పైగా పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు లక్షకు పైగా పరీక్షలు చేశారు. అది కూడా కేసులు పెరగడానికి ఒక కారణమన్న వాదనలైతే ఉన్నాయి. -
జూన్, జూలైలో కరోనా మరింత ప్రభావం!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ కేసులు జూన్, జులై మాసాల్లో గరిష్టానికి చేరే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. దేశంలో కరోనా కేసుల పెరుగుదల రేటు నిలకడగా ఉందని, కొన్ని సందర్భాల్లో ఉన్నట్టుండి కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. గురువారం ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల ఆధారంగా జూన్, జూలై మాసాలలో కరోనా మరింత ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. (చదవండి : పాలు, మందు దుకాణాలు తప్ప అన్ని బంద్) మోడలింగ్ డేటా, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తీరును పరిశీలించి ఈ విషయాన్ని చెబుతున్నట్లు ఆయన తెలిపారు. కానీ కేసుల సంఖ్య పెరగడాన్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయని, ఈ అంచనాలు ఎంత మేర నిజం అవుతాయి, లాక్డౌన్ పొడిగించిన ప్రభావం ఎంత మేర ఉంటుందనేది టైం గడిస్తేనే చెప్పగలమన్నారు. ‘రాబోయే ఆరు వారాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఆ సమయంలో లాక్డౌన్ ఉండకపోవచ్చు. దీంతో కేసులు సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాధితులను త్వరగా గుర్తించి వారికి చికిత్స అందించడం వల్లే కరోనాను కట్టడి చేయగల్గుతాం’ అని గులేరియా అన్నారు. రెడ్ జోన్స్, కరోనా హాట్‌స్పాట్స్, కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ తయారిపై స్పష్టత లేనందున భవిషత్తు ఆందోళన తప్పదని వైరస్ వ్యాప్తిని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం లాక్డౌన్లో ప్రయత్నం చేస్తోందని అన్నారు (చదవండి : 31 మంది పోలీసులకు కరోనా పాజిటివ్) కాగా,భారత్‌లో ఇప్పటి వరకూ(గురువారం ఉదయం 8 గంటల వరకు) 52,952 వేల కోవిడ్ కేసులు నమోదు కాగా, 1783 మంది చనిపోయారు. ఇప్పటివరకు 15,266 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 35,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి. -
మంగళగిరి ఎయిమ్స్‌లో ప్లాస్మాథెరపీ
సాక్షి, అమరావతి: మంగళగిరి ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో ప్లాస్మా థెరపీకి కేంద్రం అనుమతించింది. కొద్ది రోజుల క్రితమే ఎయిమ్స్‌లో ఇమ్యునోథెరపీ, ఫార్మకోథెరపీకి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. మంగళగిరిలో ఎయిమ్స్‌లో ప్లాస్మా థెరపీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐదుగురు వైద్యులతో కార్యనిర్వాహక కమిటీని, ఆరుగురు వైద్యులతో సాంకేతిక కమిటీ బృందాన్ని నియమించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వీలైనంత త్వరగా ల్యాబొరేటరీ ఏర్పాట్లు పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. (పరీక్షల సంఖ్య పెంచండి: సీఎం జగన్) కోవిడ్–19 ఓఎస్డీగా జయచంద్రా రెడ్డి అమరావతి: కోవిడ్–19కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ, కంట్రోల్ రూం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి (ఓఎస్డీ)గా డాక్టర్ పీఎల్.జయచంద్రా రెడ్డిని ప్రభుత్వం నియమించింది. విధులకు తక్షణం హాజరు కావాల్సిందిగా ఆయన్ను ఆదేశిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్.జవహర్ రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. జయచంద్రా రెడ్డి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్‌గా పదవీ విరమణ చేశారు. (సీఎం జగన్‌కు అమిత్ షా ఫోన్) -
చెట్టంత కొడుకే పోయాడు.. ఆ బూడిదతో ఏం పని?
సాక్షి, న్యూఢిల్లీ : ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక మాకేం అనుకున్నారు ఆ వృద్ధ దంపతులు. కలో గంజో తాగి పిల్లలను పెంచి పెద్దవాళ్లను చేశారు. ఇక వాళ్లు ఏదో ఒక పని చేసుకొని బతికితే చాలు.. తమ కష్టాలన్నీ తీరినట్లే అనుకున్నారు. కానీ ఇంతలోనే విధి వారిని మరో రకంగా పలకరించింది. పెద్దోడిని క్యాన్సర్ సోకింది. ఇలాంటి సమయంలో తోడుగా ఉండాల్సిన చిన్నోడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. పెద్ద కొడుకు జబ్బు నయం అవుతుంది.. తిరిగి ఇంటికెళ్తామనే ఆశాభావంతో పుట్‌పాత్‌పై జీవిస్తూ మంచి రోజుల కోసం ఆశగా ఎదురు చూశారు. కానీ దేవుడు కనికరించలేదు. జబ్బున పడ్డ కొడుకు మరణించాడు. అయితే లాక్డౌన్ పుణ్యమా అని తల్లిదండ్రులు... కొడుకు అంత్యక్రియలు కూడా జరపలేకపోయారు. ఈ హృదయ విదారక ఘటన గత శుక్రవారం న్యూఢిల్లీలోని నిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...బీహార్‌కు చెందిన గొర్రెల కాపరి సర్జ్‌దాస్(70), మీనాదేవి(65) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్ దాస్ (30) కూడా అదే వృత్తిని కొనసాగిస్తున్నాడు. గుట్కాలకు అలవాటు పడిన సంజయ్‌కు తొమ్మిది నెలల క్రితం నోటి క్యాన్సర్ సోకింది. చికిత్స కోసం పట్నా, బెంగళూరులోని ప్రముఖ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. అయినప్పటికీ జబ్బు నయం కాలేదు. దీంతో చివరి ఢిల్లీలోని ఏయిమ్స్ అస్సత్రిలో చేర్పించారు. కొడుకుకు తోడుగా వచ్చిన ఆ వృద్ధ దంపతులు అక్కడి పుట్‌పాత్‌పై జీవిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ సమయంలో తోడుగా ఉండాల్సిన కోడలు (సంజయ్ భార్య).. పుట్టింటికి వెళ్లిపోయింది. ఆసరాగా ఉంటాడనుకున్న చిన్న కొడుకు ఇంట్లో నుంచి పారిపోయాడు. అయినప్పటికీ ఆ దంపతులు కలత చెందలేదు. ఎప్పటికైనా పెద్ద కొడుకుకి జబ్బు నయం అవుతుంది తిరిగి ఇంటికి వెళ్లిపోవచ్చనే ఆశతో అక్కడే ఉన్నారు. కానీ విధి వారి ఆశలపై నీళ్లు చల్లింది. చికిత్స పొందుతున్న సంజయ్ గత శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ‘గత కొద్దిరోజులుగా ఈ వృద్ధ దంపతులు పుట్‌పాత్‌నే నివాసంగా చేసుకున్నారు. సర్జ్‌దాస్ కడుపు నొప్పితో బాధపడుతున్నా తట్టుకుంటూ... కొడుకు రోగం తగ్గిపోతే ఇక ఇంటికి వెళ్లిపోతామనే ఆశగా ఎదురు చూసేవాడు. కానీ శుక్రవారం సంజయ్ దాస్ మృతి చెందారు. వైద్యులు ఈ విషయం చెప్పగానే ఆ వృద్ధ దంపతులను దుఃఖానికి అంతులేదు. వైద్యులు కొడుకు మృతదేహాన్ని అప్పగించగా.. తీసుకెళ్లడానికి వారికి తోడుగా ఎవరూ రాలేదు. మీనా దేవి ఒక్కతే కొడుకు శవంపై ఏడుస్తూ ఉంది. అసలు వారు ఎక్కడి వెళ్లాలో కూడా తెలియదు. చివరకి ఆస్పత్రి ఆవరణంలో ఉన్నఎలక్ట్రిక్ క్రిమటోరియంలో అతని అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఎప్పటి మాదిరే ఆ వృద్ధ దంపతులు ఇక్కడి వచ్చి ఉంటున్నారు. వారికి ఎవరూ లేదు. ఎక్కడికి వెళ్లలేము ఇక్కడే ఉంటామని చెప్పారు’ అని వారితో పాటు అక్కడే ఉంటున్న మురాద్ ఖుష్వాహా అనే మహిళ మీడియాతో చెప్పారు. ఆమె కూడా క్యాన్సర్ బారిన పడిన తన ఐదేళ్ల కూతురి చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కి వచ్చారు. ఇక కొడుకు అంత్యక్రియలు చేశారు కదా.. మరి బూడిద అయినా తీసుకొచ్చారా అని ఓ వ్యక్తి సర్జ్దాస్ను అడగ్గా.. ‘ చెట్టంత కొడుకే పోయాడు..ఇక ఆ బూడిదతో నేనేం చేస్తాను. మా స్వంత ఊరు ఎక్కడ ఉందో మాకే తెలియదు’ అని కన్నీటిపర్యంతమయ్యాడు. ‘ఇక దేవుడుపై భారమేసి బతుకుతున్నాం. లాక్డౌన్ పుణ్యమా అని ప్రతి రోజు ఆహారం అందుతుంది. ఎవరెవరో వచ్చి అన్నంపెట్టి పోతున్నారు. లాక్డౌన్ మరిన్ని రోజులు కొనసాగాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాం’ అని సర్జ్ అన్నారు. ‘లాక్‌డౌన్‌తో వారు ఎక్కడికి వెళ్లలేకపోతున్నారు. అంబులెన్స్‌లో వారిని ఇంటికి పంపిద్దామంటే దాదాపు రూ.50 వేలు ఖర్చు అవుతుంది. అంత మొత్తం వాళ్ల దగ్గరలేవు. ఎవరూ ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ మాతోనే ఉన్నారు. మేము తినే దాంట్లో కొంచెం వారికి పెడుతున్నాం’ అని అక్కడే ఉన్నవారు అంటున్నారు. -
కరోనాపై పోరు: డాక్టర్ కన్నీటిపర్యంతం
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) నుంచి ప్రజలను కాపాడేందుకు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది కుటుంబానికి పూర్తిగా దూరమవ్వాల్సి వస్తోంది. ప్రాణాంతక వైరస్ సోకకుండా తమను తాము రక్షించుకోవడంతో పాటుగా కుటుంబ సభ్యులకు తమ కారణంగా హాని కలగకూడదనే ఉద్దేశంతో క్వారంటైన్లో ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మహిళా డాక్టర్ అంబిక తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఎయిమ్స్ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్న ఆమె.. విపత్కర పరిస్థితుల్లో కుటుంబం మద్దతు తమకు ఎంతగానో ముఖ్యమని.. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.(ఆ దేశాలకు ఎగుమతి చేస్తాం: భారత్) ‘‘కరోనా రోజురోజుకీ విస్తరిస్తోంది. అందరికీ సవాలు విసురుతోంది. ఇలాంటి సమయంలో మా అందరికీ కుటుంబం అండ ఎంతగానో అవసరం. సొంతవాళ్లు ఎవరైనా ఇప్పుడు అనారోగ్యం పాలైతే వారికి మేం చికిత్స అందించలేం. ఆ అపరాధ భావన మమ్మల్ని ఎల్లప్పుడూ వెంటాడుతుంది. ఇక్కడ సహోద్యోగులు, స్నేహితులు, ఇతర సిబ్బంది మాకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉన్నారనే విషయం మాకెంతో సాంత్వన కలిగిస్తుంది’’అంటూ డాక్టర్ అంబిక కన్నీటి పర్యంతమయ్యారు.(‘భారత్ అమ్మాలనుకుంటేనే పంపిస్తుంది’) #WATCH Dr Ambika, who is posted at #COVID19 treatment ward of Delhi AIIMS, breaks down while speaking about her professional challenges amid coronavirus pandemic. pic.twitter.com/erNNUIh7Il — ANI (@ANI) April 6, 2020 -
కరోనా భయంతో ఆస్పత్రిపై నుంచి దూకాడు..
న్యూఢిల్లీ : కరోనా వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని ఎయిమ్స్ జై ప్రకాశ్‌నారాయణ్ అపెక్స్ ట్రామా సెంటర్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఐపీ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన సదరు వ్యక్తిని కరోనా లక్షణాలతో మార్చి 31న ఆస్పత్రిలో చేర్పించారు. అయితే శనివారం రాత్రి ఉన్నట్టుండి అతడు ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే అదృష్టవశాత్తు అతడు ప్రాణాలతో బయటపడ్డాడని వైద్యులు తెలిపారు. ఎత్తు నుంచి పడటం వల్ల అతని కాలు ఫ్రాక్చర్ అయిందని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. కాగా, అతడి కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. మరోవైపు దేశంలో రోజరోజుకు కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. ఇప్పటివరకు భారత్‌లో 3374 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 77 మంది మృతిచెందినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్ : సొమ్ము మాయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు షాకింగ్ న్యూస్. ఎస్బీఐ ఖాతాల్లో డబ్బులు అనూహ్యంగా మాయమైపోతున్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. నకిలీ (క్లోన్) చెక్కుల ద్వారా కోట్లాది రూపాయలు మోసగాళ్ల చేతుల్లోకి పోతున్నాయి. దేశంలోని అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ బ్యాంకింగ్ మోసానికి గురైంది. దీంతో ఎస్బీఐ వివిధ నగరాల్లోని తన అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. పెద్దమొత్తంలో ఉన్న నాన్ హోం (ఎస్బీఐయేతర) చెక్కుల క్లియరింగ్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్బీఐ ఫ్రాడ్ మానిటరింగ్ సెల్ వాట్సాప్ సమాచారాన్ని తన ఉద్యోగులకు అందిస్తోంది. వివరాల్లోకి వెళితే, ఎయిమ్స్ కు చెందిన ఎస్బీఐ రెండు ఖాతాల్లోని 12 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము గల్లంతైనట్టు గుర్తించారు. ఎయిమ్స్ డైరెక్టర్ నిర్వహిస్తున్న ప్రధాన ఖాతా నుంచి రూ .7 కోట్లు, రీసెర్చ్ ఆఫ్ ఎయిమ్స్ డీన్స్‌కు చెందిన మరో ఖాతా నుంచి మరో రూ. 5 కోట్ల నగదు అక్రమంగా తరలిపోయాయి. గత రెండు నెలల్లోనే ఈ మోసం జరిగినట్టు సంస్థ ఆలస్యంగా గుర్తించింది. అధీకృత సంతకాలులేని నకిలీ చెక్కులకు చెల్లింపులు చేయడంలోని వైఫల్యానికి ఆయా శాఖలే కారణమని ఎయిమ్స్ వాదించింది. ప్రోటోకాల్‌ను అనుసరించడంలో ఎస్బీఐ విఫలమైందని, తాము పోగొట్టుకున్ననగదును జమ చేయాలని బ్యాంకును కోరింది. ఈ కుంభకోణంపై దర్యాప్తు కోరుతూ ఏయిమ్స్ వర్గాలు ఇప్పటికే ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగాన్ని సంప్రదించాయి. దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ మోసం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా, గత వారం డెహ్రాడూన్ (రూ .20 కోట్లకు పైగా), ముంబైలో ఎస్బీఐ నాన్-హోమ్ శాఖల నుంచి (రూ.9 కోట్లు) క్లోన్ చెక్కుల ద్వారా రూ .29 కోట్లకు పైగా నగదును అక్రమంగా విత్‌డ్రా చేసుకునే ప్రయత్నాలు జరిగాయని పీటీఐ పేర్కొంది. బ్యాంకు సూచనల మేరకు ఏదైనా నాన్-హోమ్ బ్రాంచ్‌లో నుంచి రూ. 2 లక్షలకుపైగా విలువైన చెక్ వస్తే దాన్ని క్లియర్ చేయడానికి లేదా డబ్బు బదిలీ చేయడానికి ముందు ధృవీకరణ కోసం కస్టమర్‌ను సంప్రదించాలని ఎస్బీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే రూ. 25 వేలకు పైన లావాదేవీలను కూడా తాము పరిశీలిస్తున్నామన్నారు. అలాగే రూ. 3 కోట్లకు పైగా బ్యాంకు మోసం జరిగినట్లు తెలిస్తే, బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేస్తుంది. -
ప్రధాని కోసం చీపురు పట్టిన హోం మంత్రి
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో పాటు పలువురు నాయకులు శనివారం ఉదయం చీపురు పట్టి ఎయిమ్స్ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం. దీన్ని పురస్కరించుకుని బీజేపీ శ్రేణులు ‘సేవా వారం’ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. దానిలో భాగంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. #WATCH BJP President Amit Shah with working president JP Nadda and leaders Vijay Goel and Vijender Gupta sweeps the floor in AIIMS as part of the party's 'Seva Saptah'campaign launched to celebrate PM Modi's birthday pic.twitter.com/1bO0nzGgoU — ANI (@ANI) September 14, 2019 ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలంతా నేటి నుంచి ‘సేవా వారం’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. మన ప్రధాని దేశం కోసం, ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. అందుకు కృతజ్ఞతగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ వారమంతటిని మనం సేవా వారంగా నిర్వహించాలి’ అని పిలుపునిచ్చారు. అంతేకాక ఎయిమ్స్‌లోని రోగులకు భోజనం, పండ్లు అందించారు. సేవా వారం కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు వారం రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. రక్త దాన శిబిరాలు, ఫ్రీ హెల్త్ చెక్ అప్ క్యాంప్స్, అనాథలకు, వృద్ధులకు పండ్లు పంచడం వంటి కార్యక్రమానలు చేపట్టాలని భావించారు. -
ఎయిమ్స్ కళాశాల ప్రారంభం
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రంగాపురం వద్ద ఏర్పాటు చేసిన ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల (ఎయిమ్స్) మంగళవారం ప్రారంభమైంది. భోపా ల్ ఎయిమ్స్ సంస్థ డైరెక్టర్ శర్మన్ సింగ్ సాదాసీదాగా ప్రారంభ కార్యక్రమాలను కొనసాగించారు. అనంతరం విద్యార్థులకు మొదటి రోజు ఓరియెంటేషన్ క్లాస్‌ను నిర్వహించడంతో పాటు తల్లిదండ్రులు, ఫ్యాకల్టీతో కలసి పరిచయ కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లో 50 మంది ఏంబీబీఎస్ విద్యార్థులు చేరగా 20 మంది ఫ్యాకల్టీని నియమించారు. కళాశాలలోని అనాటమీ, ఫిజి యోలజీ, బయోకెమిస్ట్రీ, సామాజిక, కుటుంబ వైద్య విభాగాలతోపాటు హిస్టాలాజీ, అడ్మిన్ లా కార్యాలయం, డీయెన్, వీఐపీ లాంజ్, క్యాంటిన్లను ప్రారంభించారు. వైద్య రంగ పరిశోధన, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు నిర్వహించేలా ప్రత్యేకమైన హాల్స్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ఏంబీబీఎస్ తరగతులు కొనసాగుతాయని, విద్యార్థులకు సంబంధించిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ శర్మన్ సింగ్ తెలిపారు. ప్రారంభోత్సవంలో గందరగోళం.. కళాశాల ప్రారంభోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రులు, ఎయిమ్స్ అధికారులు, ఫ్యాకల్టీకి తప్పా ప్రజా ప్రతినిధులకు, ఇతరులకు ఆహ్వానం లేదు. అయితే టీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ నాయకులు ఎయిమ్స్ భవనంలోకి పెద్ద ఎత్తున రావడం, పరిచయ వేదికలో ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చోవడంతో కొంత గందరగోళం నెలకొంది. -
‘ఆ లోపు మంగళగిరి ఎయిమ్స్ సిద్ధం’
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మంత్రివర్గం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 2020 సెప్టెంబర్ నాటికి మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం పూర్తవుతుందని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే మంగళవారం రాజ్య సభకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. ‘ఆంధ్ర ప్రదేశ్‌లోని మంగళగిరిలో ఎయిమ్స్‌ను నెలకొల్పడానికి 2015 అక్టోబర్ 7న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎయిమ్స్ నిర్మాణం కోసం మొత్తం 1618 కోట్ల రూపాయయలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కేంద్రం 385.54 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది’ అని మంత్రి చెప్పారు. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. హాస్పిటల్, అకడమిక్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 26 శాతం పూర్తయినట్లు ఆయన తెలిపారు. 2019 మార్చిలో మంగళగిరి ఎయిమ్స్‌లో ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ వైద్య సేవలు ప్రారంభమైనట్లు కూడా మంత్రి చెప్పారు. ఎయిమ్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు నిర్ణీత కాలవ్యవధిలోనే సాగుతున్నందున నిర్మాణ వ్యయం అంచనాలు పెరిగే అవకాశమే లేదని ఆయన తెలిపారు. -
తెలంగాణకే ఎయిమ్స్ టాప్ ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన వై.జతిన్ ప్రతిష్టాత్మక ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం ప్రవేశ పరీక్షలో దేశవ్యాప్త మొదటి ర్యాంకు సాధించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 2014లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన జతిన్.. తర్వాత 2015–18 వరకు చండీగఢ్‌లో ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేశారు. ఇప్పుడు ఎయిమ్స్ నిర్వహించిన ఎంట్రన్స్‌లో మొదటి ర్యాంకు సాధించడం పట్ల జూనియర్ డాక్టర్లు (జూడా) హర్షం వ్యక్తంచేశారు. కరీంనగర్‌కు చెందిన ఆయన కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. -
నీతిని అణిచేస్తున్న రాజనీతి
అవినీతిని, భ్రష్టాచారాన్ని, లంచగొండితనాన్ని నిజంగా వ్యతిరేకించే వారెవరయినా ఉన్నారా అని అనుమానం వస్తున్నది. లంచాలు తీసుకునే అధికారులు పెరిగితే నీతివంతుడే వారికి శత్రువు. పగబట్టి నీతివంతుడిని వేధించే పనిలో ముందుండేది ప్రభుత్వమే. కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో, హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో తమ ఉద్యోగులమీద, అధికారుల మీద ప్రభుత్వం కేసులు నడుపుతున్నది. అన్యాయంగా సస్పెండ్ చేస్తారు. ఉద్యోగి విధిలేక కాట్ న్యాయం అర్థిస్తాడు. అక్కడ న్యాయం దొరికితే ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటుంది. హైకోర్టులో గెలిచినా అతనికి న్యాయం దక్కనివ్వకుండా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుంది. తన వద్ద ఉన్న పెద్ద పెద్ద లాయర్లకు ప్రజల డబ్బు ఫీజుగా చెల్లిస్తూ చిరుద్యోగిమీద సుప్రీం సమరం సాగిస్తుంది. సివిల్ సర్వీసులో ఉద్యోగం దొరికితే నీతివంతంగా పనిచేయాలని చిత్తశుద్ధితో అనుకున్నాడొక యువకుడు. ఇండియన్ ఫారెస్టు సర్వీసులో దొరి కింది. ఫైళ్లలో స్పష్టంగా కనిపిస్తున్న అవినీతిని చూసీచూడనట్టు ఉండటం తెలివైన మేనేజ్ మెంట్, దానికి బదులు చట్టం ప్రకారం చర్య తీసుకోవడం పిచ్చి కింద లెక్క. కనిపిస్తున్న తప్పులన్నింటి మీద కేసులు పెట్టడం ఒక మానసిక వ్యాధి అని ప్రస్తుతం జనం నమ్ముతుంటారు. ఆ అధికారి సంజయ్ చతుర్వేది. తన ముందుకు వచ్చిన కలప రక్షణ ఫైళ్ళలో అక్రమాలు, లంచాలు బయటపడ్డాయి. కేసులు పెట్టారు. అందులో పై అధికారులు, మంత్రులు కూడా ఉన్నారు. వారందరికీ కోపం వచ్చింది. ఈ అధికారి మీద తప్పుడు కేసులు సృష్టించారు. సస్పెండు చేశారు. బదిలీలతో పాటు అరెస్టు దాకా వెళ్లే ప్రమాదం ఉండటంతో మంత్రిగారికి మొర పెట్టుకున్నారు. అప్పుడు పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేశ్‌కు కేసులో నిజానిజాలు అర్థమై, దర్యాప్తుచేయమని ఇంటెలిజెన్స్ బ్యూరోని ఆదేశించారు. ఈ యువ అధికారి పెట్టిన కేసులన్నీ వాస్తవాలనీ, ఆయనమీద పెట్టినవన్నీ తప్పుడు కేసులని నిర్ధారించారు. కానీ ఆ నివేదిక ప్రతిని ఆయనకు ఇవ్వడం లేదు. అది రహస్యమట. చివరకు ఆ సమాచారం ఇవ్వాలని కమిషన్ తీర్పుచెప్పింది. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ప్రభుత్వం పక్షాన పెద్ద లాయరుగారు దిగారు. ఇటువైపు ఒంటరిగా ఈ మధ్యతరగతి నీతివంతుడైన అధికారి, అంటే డబ్బులు విపరీతంగా లేని వాడని అర్థం. అయినా తనే సొంతంగా వాదించాడు. డిల్లీ హైకోర్టు కరుణించి న్యాయంగా తీర్పు చెప్పి ఆ సమాచారం ఇమ్మని ఆదేశించింది. కానీ హోంమంత్రిత్వశాఖ ఇంకా పెద్ద లాయర్‌ను రంగంలోకి దించి పెద్ద కోర్టు అంటే ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచి ముందుకు వెళ్లింది. ప్రభుత్వం ఇలా నీతిపైన పోరాడుతూ ఉంటుంది. ఐదేళ్ల నుంచి సంజయ్ చతుర్వేదికి వార్షిక కార్య సమీక్షా నివేదికల్లో అత్యున్నత తరగతినిచ్చారు పైఅధికారులు. ఆరో సంవత్సరం 2014–15లో ఆయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పనిచేశారు. ఆయన పని అక్రమార్జకుల పని పట్టడమే. పెద్దపెద్ద డాక్టర్లతో సహా అనేక మంది పెద్దల అక్రమాలు ఆయన దృష్టికి రావడం, ఆయన కేసులు పెట్టడం జరిగిపోయింది. దాంతో పైఅధికారులు, ఆపైన ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాగారు 2014–సంవత్సరం పనితీరుకు శూన్యం మార్కులు ఇచ్చారు. మధ్యలో సున్నావల్ల ఆయనకు ఉద్యోగంలో పైపదవికి వెళ్లేందుకు వీలుండదు. కనుక పునఃసమీక్షించాలని కోరాడు. హైకోర్టుకు వెళ్లాల్సివచ్చింది. ఇటువంటి ఎన్నో కేసుల్లో ఎందరికో న్యాయం చేసిన హైకోర్టు ఈయన గారి కేసులో మాత్రం కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు వెళ్లమని ఉత్తర్వు జారీ చేసింది. ఆయన నైనిటాల్‌లోని కాట్ బెంచ్‌కు విన్నవించుకున్నాడు. సెప్టెంబర్ 2017లో తీర్పు ఇస్తూ చతుర్వేదికి మంత్రిగారిచ్చిన సున్నాను పరగణించరాదని కాట్ ఇద్దరు సభ్యుల బెంచి ఆదేశించింది. దానిపైన ప్రభుత్వం వారు డిల్లీలోని కాట్ చైర్పర్సన్ ముందు అప్పీలు చేసుకున్నారు. వారు నైనిటాల్ కాట్ ఉత్తర్వు మీద స్టే జారీ చేశారు. మళ్లీ చతుర్వేది ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లక తప్పని స్థితి. ప్రభుత్వం అనవసరంగా వేధిస్తున్నందుకు పాతిక వేల రూపాయలను ఖర్చులుగా చెల్లించాలని ఆదేశించింది. అయినా, కాట్ అధ్యక్షుడే న్యాయమైన తీర్పు ఇచ్చా రని, హైకోర్టే తీవ్ర అన్యాయం చేసిందని వాదిస్తూ ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకు వెళ్లింది కేంద్ర ప్రభుత్వం. అంతా విన్న ధర్మాసనం కాట్ తీర్పును కొట్టివేస్తూ, నీతివంతుడైన అధికారిని వేధించే ఈ ప్రభుత్వం మరో పాతిక వేలు ఖర్చులు చెల్లించాలని ఫిబ్రవరి 1న ఆదేశించింది. విచిత్రం ఏమంటే నీతివంతుడైన అధికారిని కోర్టుల చుట్టూ తిప్పుతూ, ఆయన పెట్టిన కేసులను తొక్కిపెట్టడమే. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
తెలంగాణ ఎయిమ్స్‌కు కేంద్రం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఫలించింది. ఎట్టకేలకు తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నల్గొండ జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి స్వాస్థ్ సురక్ష యోజన కింద.. ఎయిమ్స్‌ను మంజూరు చేసింది. ఎయిమ్స్ ఏర్పాటుకు రూ. 1028 కోట్ల ఖర్చు అవుతున్నట్లు అంచనా వేసింది. మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. 15-20 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 750 పడకలతో ఎయిమ్స్ ఏర్పాటు కానుంది. ఎయిమ్స్ లో 1500 ఓపీ, 1000 మంది ఇన్ పేషెంట్లకు నేరుగా చికిత్స అందే అవకాశముంది. ఎయిమ్స్ లో ఎమర్జెన్సీ, ట్రామా, ఆయుష్, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు ఉండనున్నాయి. మెడికల్ కాలేజీ సహా ఇతర సదుపాయాలన్నీ 45 నెలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. -
‘65ఏళ్ల స్నేహం మాది.. నోట మాట రావడం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి(93) మృతి పట్ల పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఐ మిస్ యూ అటల్ జీ అంటూ తన బాధను వ్యక్తం చేశారు. ‘వాజ్‌పేయి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. తీవ్రం దుఃఖంతో నేనున్నాను. నోట మాట రావడం లేదు. 65 ఏళ్ల స్నేహం మాది. ఆరెస్సెస్‌లో ప్రచారకర్తలుగా ప్రారంభమైన మా అనుబంధం భారీతీయ జన్ సంఘ్లోనూ కొనసాగింది. జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు కలిసే ప్రయాణించాం. ఎమర్జెన్సీ చీకటి రోజులను కలిసే ఎదుర్కొన్నాం. అపారమైన దేశ భక్తి, అన్నింటికి మించి మానవతా విలువలు ఉన్న గొప్ప వ్యక్తి. సైద్ధాంతిక విభేదాలున్నా ప్రతి ఒక్కరిని హృదయాన్ని గెలిచిన వ్యక్తిత్వం వాజ్‌పేయికి సొంతం’ అంటూ అటల్ జీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
వాజపేయి ప్రసంగం ఇప్పటికీ ఎందరినో వెంటాడుతోంది
-
మాజీ ప్రధాని వాజ్‌పేయి అస్తమయం
-
వాజ్‌పేయి జీవన ప్రస్థానంలో ముఖ్య ఘట్టాలు ...!
పద్దెనిమిదేళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా అరెస్టయిన యువకుడు ఆ తర్వాత దేశరాజకీయాల్లో గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచాడు. బీజేపీ అంటేనే వాజ్‌పేయి, వాజ్‌పేయి అంటేనే బీజేపీ అన్నంతగా పార్టీ, నాయకులు, కార్యకర్తలను ప్రభావితం చేశారు. దాదాపు ఆరేడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎత్తు,పల్లాలు చవిచూశారు. బీజేపీ పట్ల, ఆ పార్టీ రాజకీయాల పట్ల కేడర్ ఆకర్షితులయ్యేందుకు ఆయన ఇమేజీ ఎంతగానో పనిచేసింది. హాస్య చతురత మేళవించిన ప్రసంగాలతో పాటు ఆవేశపూరిత ఉపన్యాసాలకు ఆయన పెట్టింది పేరు... వాజ్‌పేయి జీవితంలోని కొన్ని విశేషాలు... (అటల్ బిహారీ వాజ్‌పేయి ఫోటో గ్యాలరీ ఇక్కడ క్లిక్ చేయండి) ⇔ 1924లో గ్వాలియర్‌లో జననం ⇔ 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్ట్ ⇔ 1951లో భారతీయ జనసంఘ్ (బీజేఎస్) లో చేరిక ⇔ 1957లో లోక్‌సభ సభ్యుడిగా తొలిసారి ఎన్నిక ⇔ 1962లో రాజ్యసభ సభ్యుడిగా మొదటిసారి ⇔ 1968లో బీజేఎస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ ⇔ 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంగా అరెస్ట్ ⇔ 1977లో జనతాపార్టీ ప్రభుత్వ హయాంలో విదేశాంగ మంత్రిగా నియామకం ⇔ 1980లో బీజేఎస్ను బీజేపీగా మార్పుచేసి ఆ పార్టీ మొదటి జాతీయ అధ్యక్షుడయ్యారు ⇔ 1996లో తొలిసారి 13 రోజుల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించాక, సభలో బలం నిరూపించుకోలేక బీజేపీ ప్రభుత్వ పతనం ⇔ 1998లో రెండోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ సారధిగా 13 నెలల పాటు బాధ్యతల నిర్వహణ. ఈ సందర్భంగా దేశచరిత్రలోనే రెండోసారి పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించారు. ⇔ చారిత్రాత్మక ఢిల్లీ–లాహోర్ బస్సు సర్వీసు మొదలుపెట్టారు. కార్గిల్‌లో పాకిస్తాన్ సైన్యం చొరబాట్లను తిప్పికొట్టేందుకు ‘ఆపరేషన్ విజయ్’ నిర్వహించారు. ⇔ 1999లో మూడోసారి ప్రధానిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ⇔ 2001లో దేశవ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ ప్రారంభం ⇔ 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చూడడంతో ఆ పదవి నుంచి వైదొలిగారు. ⇔ 2005లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగారు. ⇔ 2009లో గుండెపోటుకు గురయ్యారు ⇔ 2014లో వాజ్‌పేయి 90వ పుట్టినరోజును ‘సుపరిపాలన దినోత్సవంగా’ నిర్వహణ ⇔ 2015లో దేశంలోనే అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ ప్రదానం ⇔ 2018 జూన్‌లో అనారోగ్యం బారిన పడడంతో ఆసుపత్రిలో చేరిక. -
వాజ్‌పేయి అభిరుచులు, ఆసక్తులపై ప్రత్యేక కథనం
విషాద సందర్భం... తన జీవితంలోని విషాద సందర్భం తనకి స్ఫూర్తినిచ్చిన దీన్ దయాల్ ఉపాధ్యాయ మరణించిన సందర్భమేనంటారు. ఇష్టమైన నాయకుడు.. వాజ్‌పేయ్ తనకిష్టమైన నాయకుడు తొలి ప్ర«ధాని జవహర్లాల్ నెహ్రూ అని అంటారు. అభిమాన రచయితలు.. రాజకీయాల్తో పాటు సాహిత్యాన్నీ అమితంగా ప్రేమించిన వాజ్‌పేయికి ప్రముఖ రచయితలు శరత్ చంద్ర, ప్రేమ్ చంద్ అంటే చాలా ఇష్టం. అలాగే హరివంశరాయ్ బచ్చన్, రామనాథ్ అవస్తి, డాక్టర్ శిమంగల్ సింఘ్ సుమన్, సూర్యకాంత్ త్రిపాఠీ ‘నిరళ’, బాలకృష్ణ శర్మ నవీన్, జగన్నాథ్ ప్రసాద్ మిలండి, ఫియాజ్ అహ్మద్ ఫియాజ్ల నుంచి కవితాస్ఫూర్తి పొందానంటారు వాజ్‌పేయి. కవి హృదయాన్ని మెప్పించిన క్లాసికల్ కళాకారులు! భీమ్సేన్ జోషి, అమ్జాద్ అలీఖాన్, హరిప్రసాద్ చౌరాసియా వాజ్‌పేయి మదిమెచ్చిన కళాకారులు. అలాగే లతా మంగేష్కర్ పాటలన్నా, ముఖేష్ , ఎస్డి బర్మన్ అన్నా చెవికోసుకునేవాడట. ఇష్టమైన మ్యూజీషియన్ సచిన్ దేవ్ బర్మన్, ఇష్టమైన నటులు సంజీవ్ కుమార్, దిలీప్ కుమార్, సుచ్రిత సేన్, రాఖీ, నూతన్ అని చెపుతారు. ఎస్డి బర్మన్ ‘‘ఓ....మేరే మాజీ’’‘‘సన్ మేరే బంధూ రే’’పాటలన్నా, ముఖేష్ కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై’’పాటన్నా, ప్రాణం అంటారు. ముఖ్యంగా ముఖేష్, లతామంగేష్కర్ లంటే వాజ్‌పేయికి అమితమైన ఇష్టం. ఒకానొక సందర్భంలో లతామంగేష్కర్‌తో మాట్లాడుతూ వాజ్‌పేయి ‘‘మీకూ నాకూ చాలా దగ్గరి పోలికలున్నాయి. మీరూ ఒంటరివాళ్ళే, నేనూ ఒంటరినే, అలాగే నా పేరులో అటల్‌ని తిరగేస్తే (ఆంగ్ల అక్షరాల్లో) లత అని వస్తుంది’’అంటారు. వాజ్‌పేయికి నచ్చిన సినిమాలు దేవదాస్, బాంధినీ, తీస్రీ కసమ్, మౌసమ్, ఆంధీ వాజ్‌పేయ్‌కి నచ్చిన సినిమాలు. ‘‘బ్రిడ్జి ఓవ ర్ ద రివర్ క్వై’’, ‘‘బార్న్ ఫ్రీ’’, ‘‘గాంధీ’’ ఇంగ్లీషు సినిమాలు తనకిష్టమైనవంటారు వాజ్‌పేయి. అటల్జీకి రుచించేవి.. అటల్జీ బాగా వంటలు చేసేవారట. వాజ్‌పేయి తండ్రికి బయటి భోజనం ఇష్టం లేకపోవడంతో తన తండ్రితో కలిసి ఉండేటప్పుడు తనే స్వయంగా వంట చేసి తండ్రికి వడ్డించేవారు. కిచిడీ, పూరి కచోరీ, దాల్–పకోరీ, పాంథ, ఖీర్ , మాల్‌పావ్, కచోరీ, మంగౌరీ వంటకాలు వాజ్‌పేయికి అత్యంత ఇష్టమైన వంటకాలు. అటల్జీ మదిమెచ్చినవి లతామంగేష్కర్ పాటా, హరిప్రసాద్ చౌరాసియామురళీగానం, గాంధీ సినిమా, శరత్ చంద్ర, ప్రేమ్‌చంద్ అక్షరం... పూరీ కచోరీ, ఖీర్, మాల్‌పావ్! అభిరుచుల్లో సున్నితత్వం, ఆహార్యంలో సాదాత్వం, అవసరమైనప్పుడు కటుత్వం మొత్తంగా ఆయన వ్యక్తిత్వం. మాటలతోనే కట్టిపడేసే మాంత్రికుడు, రాజకీయాటలో నేర్పూ, జనం మది గెలుపులో ఓర్పూ అటల్ బిహారీ వాజ్‌పేయిని రాజకీయాలకతీతంగా అభిమానించేలా చేశాయి. ఓ అనుభవజ్ఞుడైన రాజనీతిజ్ఞుడిగానే కాక కవిగా, రచయితగా, మంచి వక్తగా ప్రజలమెప్పునొందిన వాజ్‌పేయి వ్యక్తిగత ఇష్టాఇష్టాలు అతని స్వభావాన్ని చెప్పకనే చెబుతాయి. ఆయన జీవితాన్ని అమితంగా ప్రభావితం చేసిన వ్యక్తులూ, అతనికిష్టమైన సంగీతం, అతని మదిని చెదిరిపోని సందర్భాల్లో మచ్చుకి కొన్ని ... అదే చేదు ఘడియ ఒంటరి జీవితాన్ని జీవితాంతం గడిపిన వ్యక్తి వాజ్‌పేయ్. కవిత్వంతోనే రాజకీయరంగ ప్రవేశం చేసానని చెప్పుకున్న వాజ్‌పేయి తన జీవితంలో అత్యంత చేదు ఘడియలేవైనా ఉన్నాయంటే అది ఐదవ తరగతిలో తన మాస్టారు చెంపఛెళ్ళుమనిపించిన సందర్భమేనంటారు. అందుకు సమయం లేదు మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదని ప్రశ్నిస్తే పెళ్ళి చేసుకునే తీరిక తనకు లేదన్నారు. థ్రిల్లింగ్ మూవ్మెంట్ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తనని ఆçహ్వానించినప్పుడు అత్యంత థ్రిల్లింగ్‌గా ఫీలయ్యానంటారు. ప్రియ మిత్రులు... ఆనాటి ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, భైరాన్‌సింగ్ షెకావత్, అప్పా ఘటాటే, నాటి ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్, డాక్టర్ ముకుంద్ మోడీ, అలాగే శివకుమార్‌లు తనకు అత్యంత సన్నిహిత మిత్రులంటారు. మరపురాని ఘటన.. ఐరాస జనరల్ అసెంబ్లీలో తొలిసారిగా, అదీ కూడా హిందీలో ఉపన్యసించడం తన జీవితంలో మరపురాని ఘటన అంటారు. స్ఫూర్తి... తన తండ్రి కృష్ణ బిహారీ వాజ్‌పేయి తనకు స్ఫూర్తి ప్రదాత అనీ, గురు గోల్వాకర్జీ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, ఆర్ఎస్ఎస్ బాబూరావ్ డియోరాజ్ లు తనకి స్ఫూర్తినిచ్చినవారంటారు. -
వాగ్ధాటి.. లేరు సాటి!
వాజ్‌పేయి మంచి వక్త. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ప్రధానిగా ఉన్నా ఆయన ప్రసంగం మొదలు పెడితే చాలు పార్లమెంటు సభ్యులందరూ నిశ్శబ్దంగా చెవులు రిక్కించి వినేవారు. సునిశితమైన హాస్యాన్ని పండిస్తూ, కవితా పరిమళాలు వెదజల్లుతూ, విమర్శకుల నోళ్లను మూయిస్తూ, చమత్కారపూరితంగా ఒక గంగా ప్రవాహంలా ఆయన ప్రసంగాలు సాగిపోయేవి. ఆయనలోని సంభాషణాచాతుర్యానికి స్వపక్ష నేతలే కాదు ఇతర పార్టీల నాయకులు కూడా మంత్రముగ్ధులయ్యేవారు. తొలి ప్రసంగంతోనే నెహ్రూ ఫిదా 1957లో వాజ్‌పేయి పార్లమెంటేరియన్‌గా తన తొలి ప్రసంగంతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వాజపేయి విదేశాంగ విధానంపై చేసిన ప్రసంగానికి విస్తుపోయారు. అంత చిన్న వయసులో అపారమైన పరిజ్ఞానంతో మాట్లాడిన వాజ్‌పేయిని ఆకాశానికెత్తేశారు. రాజకీయాల్లో ఆ యువకుడికి ఉజ్వల భవిష్యత్ ఉందని, ఎప్పటికైనా దేశ ప్రధాని అవుతారంటూ అప్పట్లోనే జోస్యం చెప్పారు. ఆగ్రహావేశాలు ప్రదర్శించగలరు వాజ్‌పేయి మృదుస్వభావి. ఆయన ప్రసంగాలు కూడా ఎప్పుడూ సుతిమెత్తగా సాగిపోయేవి. కానీ అవసరమైతే ఆ స్వరం నిప్పులు కూడా కురిపించగలదు. 1997లో ఐకే గుజ్రాల్ ప్రధాని గా ఉన్న సమయంలో బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంపై చర్చ జరిగే సమయంలో వాజ్‌పేయి ప్రసంగంలో ఆగ్రహావేశాలు కనిపిస్తాయి. వాజ్‌పేయిలో ఆ కోణాన్ని చూసి సభ యావత్తూ విస్తుపోయింది. శాంతే ప్రధానం లేదంటే సమరమే మిత్రులను మార్చుకోవచ్చు, కానీ ఇరుగుపొరుగుని మార్చలేం. మేము శాంతినే కోరుకుంటాం కాదంటారా సమరానికైనా సిద్ధం అంటూ పాక్‌కు రిటార్ట్ ఇచ్చారు. 1998లో పోఖ్రాన్ –2 (ఆపరేషన్ శక్తి) అణు పరీక్షలపై సర్వ త్రా ఆందోళనలు వ్యక్తమైనప్పుడు వాజ్‌పేయి బాగా సమర్థించుకున్నారు. ‘ఇప్పటికే మూడు సార్లు దాడులకు బలయ్యాము. అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదు. ఒకవైపు లాహోర్ బస్సు సర్వీసు అంటూ ఈ అణుపరీక్షలేమిటని అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ రెండూ ఒకే నాణేనికి చెరోవైపులాంటివి. నీతి నిజాయితీతో స్నేహహస్తం జాపాం. తోకజాడిస్తారేమోనని రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం’అంటూ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. శ్రమయేవజయతే నినాదం ‘నేను ఓటమిని అంగీకరించను. పోరు బాట పట్టడమే నాకిష్టం. ఆకాశాన్నంటే ఆశయాలను సాధించాలంటే కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా తలవంచకూడదు‘అంటూ వాజపేయి తన ప్రసంగాల్లో శ్రమయేవ జయతే నినాదాన్నే ఎప్పుడూ వినిపించేవారు. కష్టపడి పనిచేస్తేనే బంగారు భవిష్యత్ సాధ్యపడుతుందని ఆయన యువతరానికి పదే పదే పిలుపునిచ్చేవారు. 2002 స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలోనూ మన ముందున్న లక్ష్యం చాలా పెద్దదే కావొచ్చు, కానీ చేయి చేయి కలిపితే, కష్టపడి పోరాడితే విజయం మన ముందు తలవంచుతుంది అంటూ ఎందరిలోనో ఉత్తేజాన్ని నింపారు. కొత్త సంబంధాలు 2000 సంవత్సరంలో అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి వాజ్‌పేయి చేసిన ప్రసంగం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసిందనే చెప్పాలి. ప్రపంచ దేశాల మధ్య శాంతి, సుస్థిరతలకు పాటు పడాలని, అన్ని రంగాల్లోనూ సహకరిస్తూ కొత్త అధ్యాయానికి తెరతీయాలంటూ వాజ్‌పేయి చేసిన ప్రసంగాన్ని అమెరికన్లు ఎప్పటికీ మర్చిపోలేమని అంటారు. అద్భుతమైన వాదనా పటిమ వాజ్‌పేయి ఏదైనా అంశంపై మాట్లాడితే ముందస్తుగా సుదీర్ఘమైన కసరత్తు చేసేవారు. రకరకాల గణాంకాలను ప్రస్తావిస్తూ, వాస్తవాలనే మాట్లాడుతూ తన వాదనకు బలమైన పునాదులు ఏర్పాటు చేసుకోవడం ఆయన ప్రసంగాల్లో విలక్షణంగా కనపడేది. అందుకే ఆయన ఆరెస్సెస్‌కి అనుకూలంగా మాట్లాడినా కూడా సభలో ఎలాంటి అలజడి చెలరేగేది కాదు. ఇతర పక్షాల సభ్యులు నోరు మెదపలేకపోయేవారు. పీవీ నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జెనీవాలో కశ్మీర్ అంశంపై జరిగే చర్చలకు ప్రతిపక్ష నాయకుడైన వాజ్‌పేయిని భారత్ ప్రతినిధిగా పంపించారంటే ఆయనకున్న వాదనాపటిమ ఎంతటిదో, ఇతర పక్ష నేతలూ వాజ్‌పేయి అంటే ఎంత గౌరవం ఇస్తారో అర్థమవుతుంది. నేటికీ వెంటాడే ప్రసంగం 1996లో 13 రోజుల పాటు ప్రధాని పదవిలో కొనసాగిన వాజ్‌పేయి గద్దె దిగిపోతూ మంద్రస్వరంతో నీతి నిజాయితీ ఉట్టిపడేలా చేసిన ప్రసంగం భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఒక కీలక ఘట్టం. నాటి ప్రసంగాన్ని దూరదర్శన్‌లో లైవ్ టెలికాస్ట్ అయింది. ఇలా చట్టసభల సమావేశాలను లైవ్ ఇవ్వడం అదే తొలిసారి. అప్పట్లో వాజ్‌పేయి సభ విశ్వాసాన్ని పొందలేకపోయినా తన ప్రసంగం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ‘మీకు ఎంత శాతం ఓట్లు వచ్చాయని నన్ను అడుగుతున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లు ముఖ్యమా? సీట్లు ముఖ్యమా? మన పార్లమెంటరీ వ్యవస్థలో నెగటివ్ ఓట్లను ఎవరూ లెక్కపెట్టరు. అలాంటప్పుడు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని మీరెలా అంటారు’ అంటూ వాజ్‌పేయి చేసిన ప్రసంగం ఈనాటి రాజకీయాలకు కూడా అద్దం పడుతోంది. అంతటి వక్తకి నోట మాట రాలేదు.. వాజ్‌పేయి మృదుస్వభావి. వెన్నలాంటి మనసు. ఏ అంశం మీదైనా అనర్గళంగా మాట్లా డే ఆయన నోటి వెంట మాటరాని సందర్భం ఒకసారి ఎదురైంది. 1988లో బిహార్‌లోని పరారి యా గ్రామంపై దాడి చేసిన ఖాకీలు తమ కర్కశత్వాన్ని చాటుకున్నారు. వెనుకబడిన కులాల ఇళ్లౖ పె దాడులు చేసి వారి సామాన్లను లూటీ చేశారు. మహిళల్ని పాశవికంగా సామూ హిక అత్యాచారం చేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన వాజ్‌పేయి చలించారు. చెవి కమ్మలు, ముక్కెరలు తెగిపోయి రక్తంతో దీనస్థితిలో ఉన్న వారిని చూసి విస్తుపోయారు. నోట మాట రాక మౌనంగా ఉండిపోయారు. కన్నీరు పెట్టుకు న్నారు. బుగ్గల మీద నుంచి జారిపడిన కన్నీటి చారికలతో వాజపేయి చెప్పిన మాట ఒక్కటే. ‘రేపిస్టుల్ని ఉరితీయాలి‘. ఆ ఒక్క మాటతోనే అత్యాచార బాధితులకు కొండంత ఊరట ఇచ్చారు. ఏకాభిప్రాయంతోనే 3 రాష్ట్రాల ఏర్పాటు న్యూఢిల్లీ: వాజ్‌పేయి ఏకాభిప్రాయం కోసం తీవ్రంగా శ్రమిస్తారన్నది అందరూ చెప్పేమాట అయితే, 2000 ఏడాదిలో ఆయన ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం ఇందుకు చక్కని ఉదాహరణ. ఆ ఏడాది నవంబర్ 1న మధ్యప్రదేశ్‌ను విభజించి ఛత్తీస్‌గఢ్‌ను, అదే నెల 9న ఉత్తరప్రదేశ్‌ను విభజించి ఉత్తరాఖండ్‌ను, 15న బిహార్‌ను విభజించి జార్ఖండ్‌ను వాజ్‌పేయి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. అయితే ఎక్కడా ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఈ మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇటీవల అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలోనూ ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఆ మూడు రాష్ట్రాలూ ప్రశాంతంగా ఏర్పడ్డాయి’ అన్నారు. (పెరిగిన పెట్రోలు, కిరోసిన్ ధరలకు నిరసనగా ఎడ్లబండిపై పార్లమెంటు సమావేశాలకు వెళుతున్న వాజ్‌పేయి) 12 సార్లు ఎంపీగా.. న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 47 సంవత్సరాల పాటు మాజీ ప్రధాని వాజ్‌పేయి సేవలందించారు. 12 సార్లు పనిచేసిన అతికొద్ది మందిలో ఆయన ఒకరు. 10 సార్లు లోక్‌సభకు ఎన్నిక కాగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఒక్కసారి మాత్రమే ఆయన ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. 1984లో గ్వాలియర్ నుంచి పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు సింధియా చేతిలో 2 లక్షల ఓట్ల తేడాతో వాజ్‌పేయి ఓడిపోయారు. రెండు భాషల్లోనూ పట్టు ఇంగ్లిష్, హిందీ రెండు భాషల్లోనూ వాజ్‌పేయి అనర్గళంగా మాట్లాడగలరు. 1977లో ఐరాసలో హిందీలో మాట్లాడి మాతృభాషపై మమకారాన్ని చాటుకున్నారు. ఏ భాషలో మాట్లాడినా హాస్యం, వ్యంగ్యాన్ని విడిచిపెట్టలేదు వ్యంగ్యపూరిత వ్యాఖ్యలు ♦ బీజేపీలో వాజ్‌పేయి దళం ఉంది, అడ్వాణీ దళం ఉంది అని విపక్షాలు విమర్శిస్తే, వాజపేయి ‘నేను ఏ దళ్‌దళ్ (బురద)లో లేను. కానీ అవతలి వారి బురదలో కమలదళాన్ని వికసింపజేయగలను’ అంటూ ఎదురుదాడి చేశారు. ♦కశ్మీర్ లేకుండా పాకిస్తాన్ అసంపూర్ణం అని పాకిస్తాన్ మంత్రి ఒకరు అంటే దానికి వాజ్‌పేయి ఇచ్చిన సమాధానం పాకిస్తాన్ లేకుండా హిందూస్తాన్ కూడా అసంపూర్ణమే. ♦ ఒక చేత్తో ఎవరూ చప్పట్లు కొట్టలేరు కదాని పాక్ నేతలు పరోక్షంగా భారత్ కయ్యానికి కాలు దువ్వుతోందని ప్రస్తావిస్తే వాజ్‌పేయి చప్పట్లు కొట్టలేం నిజమే. కానీ చిటికెలు వెయ్యగలం కదా అంటూ పాక్ నోరు మూయించారు. ♦ విపక్షాలు రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ, తప్పుడు పార్టీలో మంచి మనిషి అని వ్యాఖ్యానిస్తే, అయితే ఈ మంచి మనిషిని ఏం చేయాలని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ♦ బిహార్‌లో ఒక సభలో ‘నేను అటల్‌ని. ఒక్క క్షణం ఆగి బిహారిని కూడా ‘అంటూ ప్రసంగాన్ని ప్రారంభించగానే చప్పట్లే చప్పట్లు. -
వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాం
-
వాజ్‌పేయి కోలుకుని మళ్లీ స్పీచ్‌లు ఇస్తారు!
సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని బంధువులు దేవున్ని ప్రార్థిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో కొంతకాలం నుంచి వాజ్‌పేయి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయి మేనకోడలు కాంతి మిశ్రా మీడియాతో మాట్లాడారు. ‘వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రసంగాలను మళ్లీ వినే అవకాశం వస్తుందన్న ఆశ మాకు ఉంది. వాజ్‌పేయితో మా అనుబంధాలు, అప్యాయతలు చిరకాలం గుర్తుండిపోతాయి. మా మనసులో ఆయనకు ఉన్న స్థానం ఎప్పటికీ చెక్కు చెదరదు. ఆయన మళ్లీ కోలుకుని సాధారణ స్థితికి వస్తారని’ కాంతి మిశ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. వాజ్‌పేయి కుటుంబ సభ్యులు మరికొందరు మీడియాతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. ‘వాజ్‌పేయి అందరినీ ప్రేమగా పలకరించేవారు. స్థానికంగా ఉండేవారిపై కూడా ఆప్యాయత చూపేవారు. నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండే వ్యక్తుల్లో వాజ్‌పేయి ఒకరు. రాజకీయాల గురించి ఇంట్లో ప్రస్తావించేవారు కాదు. శత్రువుల మనసుల్లోనూ చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి ఆయన. ధనం కూడబెట్టడం రాజకీయం కాదని.. ప్రజల గుండెల్లో పదిలంగా ఉండటమే ముఖ్యం అనేవారు. ఇంటి వంటను ఎక్కువగా ఇష్టపడేవారు. నేను అనే అహం లేకుండా మనం అనే స్వభావం కలిగిన మహోన్నత వ్యక్తి వాజ్‌పేయి. వివాద రహితుడిగా జీవితాన్ని గడిపిన అతికొద్ది మంది నేతల్లో ఆయన ఒకరని’ మాజీ ప్రధాని వాజ్‌పేయి విశిష్టతను ఆయన బంధువులు షేర్ చేసుకున్నారు. గ్వాలియర్, ఆగ్రాల్లో ఉన్న ఆయన బంధువులు ఒక్కొక్కరిగా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఆందోళకరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, బీజేపీ నేతలతో పాటు పలు రాష్ట్రాల కీలక నేతలు గురువారం వాజ్‌పేయి నివాసానికి చేరుకుంటున్నారు. మాజీ ప్రధాని నివాసం వద్ద, ఎయిమ్స్ ఆస్పత్రి పరిసర ప్రాంగణాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. -
వాజ్‌పేయి నివాసం వద్ద ఉద్విగ్న వాతావరణం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని మాజీప్రధాని వాజ్‌పేయి నివాసం వద్ద తీవ్ర ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో ఆయన నివాసానికి బీజేపీ అగ్రనేతలు, శ్రేణులు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థి గురించి వాకబు చేసిన ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు అనంతరం నేరుగా వాజ్‌పేయి నివాసానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వాజ్‌పేయి నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున వాజ్‌పేయి నివాసానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాజ్‌పేయి నివాసానికి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు వాజ్‌పేయి చికిత్స పొందుతున్న ఎయిమ్స్ పరిసర ప్రాంతల్లోనూ వాహనాలన్నింటినీ ఖాళీ చేయించారు. మరికాసేపట్లో వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బుటెటిన్‌ను ఎయిమ్స్ వైద్యులు విడుదల చేయనున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. ఢిల్లీకి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ రావాలని అధిష్టానం ఆదేశించింది. -
చావు ఆయుష్షు ఎంత? రెండు క్షణాలే!
అటల్ బిహారీ వాజపేయి రాజకీయ వేత్తగా కంటే సాహితీ వేత్తగా, కవిగా ప్రాచుర్యం పొందారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయనలోని కవిని గౌరవించేవారు.ఆయన ప్రసంగాలు కూడా కవితాత్మకంగా ఉండటం ఆయనలోని కవితాభినివేశానికి నిదర్శనం.’నువ్వు ఏదో ఒక రోజు మాజీ ప్రధానివి కావచ్చు.అయితే, మాజీ కవివి మాత్రం ఎప్పటికీ కాలేవు.అని వాజ్‌పేయి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆయనలోని సాహిత్య ప్రతిభను గౌరవిస్తూ అందరూ అటల్జీ అని పిలిచేవారు. తన కవితలు, వ్యాఖ్యల ద్వారా ఆయన ఎందరినో ఉత్తేజితుల్ని చేశారు. మరెందరిలోనో ధైర్య సాహసాలు నింపారు. బుధవారం నాటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ వాజపేయి వ్యాఖ్యల గురించి ప్రస్తావించారంటే ఆయన దేశ రాజకీయాల్లో కవిగా ఎంత బలమైన ముద్ర వేశారో స్పష్టమవుతోంది.నిరాశావాదాన్ని పారదోలాలని చెబుతూ...’ మధ్యాహ్నాం పూట చీకటి ఆవరించింది, సూర్యుడు తన నీడచేత పరాజితుడయ్యాడు. నీ హృదయం నుంచి తైలం పిండి దీపాన్ని వెలిగించు మరో దీపం వెలిగించేందుకు కదిలిరా... అంటూ పిలుపు నిచ్చారు. మరో సందర్భంలో... ప్రభూ.. నన్నెప్పుడూ అత్యున్నత స్థాయికి చేరనివ్వకు అక్కడుండి ఇతరులను ఇబ్బంది పెట్టలేను అలాంటి పరిస్థితి నుంచి నన్నెప్పుడూ విముక్తుడిని చేయి..అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాజపేయి కవితలు జీవిత సత్యాలను వెల్లడిస్తాయి. చట్ట సభల్లో ప్రసంగిస్తున్నప్పుడు కూడా ఆశువుగా కవితలల్లి సభ్యులను రంజిపచేయడం వాజపేయికి వెన్నతో పెట్టిన విద్య. మరణాన్ని కూడా ఆయన కవితాత్మకంగా ఇలా చిత్రించారు. ’చావు ఆయుష్షు ఎంత? రెండు క్షణాలు కూడా ఉండదు జీవితమన్నది ప్రగతిశీలం..అది ఒకటి రెండు రోజుల్లో ముగిసిపోదు’ -
బ్రేకింగ్: వాజ్‌పేయికి నివాళులు అర్పించిన ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(93) కన్నుమూశారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై ఉండి చికిత్స పొందిన ఆయన గురువారం సాయంత్రం 5.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. వాజ్‌పేయి కన్నుమూసిన నేపథ్యంలో లైవ్ అప్డేట్స్ ఇవి.. ఎయిమ్స్ నుంచి నివాసానికి వాజ్‌పేయి పార్థీవదేహం వాజ్‌పేయికి నివాళులు అర్పించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సంగ్. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయడు, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్ తదితరులు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి పార్థీవదేహాన్ని ప్రత్యేక కన్వాయ్‌లో ఎయిమ్స్ నుంచి ఆయన నివాసానికి తరలించారు. వాజ్‌పేయి నివాసానికి ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. రేపు అంత్యక్రియలు వాజ్‌పేయి కన్నుమూసిన నేపథ్యంలో ఈ నెల 22వ తేదీ వరకు ఏడు రోజులు సంతాపదినాలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వాజ్‌పేయి మృతికి సంతాపంగా భారతీయ జెండాను సగం వరకు అవతనం చేయనున్నారు. కాసేపట్లో ఆయన పార్థీవదేహాన్ని కృష్ణమీనన్ మర్గంలోని నివాసానికి తరలించనున్నారు. శుక్రవారం ఉదయం అభిమానుల సందర్శనార్థం వాజ్‌పేయి భౌతికకాయాన్ని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదు గంటలకు యమునా నది ఒడ్డున స్మృతిస్థల్‌లో వాజ్‌పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. పూర్తి కథనాన్ని ఇక్కడ చదవండి: రేపు విజయ్ ఘాట్‌లో వాజ్‌పేయి అంత్యక్రియలు అటల్జీ.. మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు: ఎన్టీఆర్ మన దేశాన్ని పాలించిన గొప్ప నేతల్లో ఒకరైన వాజ్‌పేయికి సెల్యూట్ సమర్పిస్తున్నాను. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, సాహసోపేతమైన జాతీయవాది, దేశాన్ని అనుసంధానం చేసిన స్వర్ణ త్రిభుజి రహదారి రూపకర్త. అటల్జీ మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు- ట్విటర్లో జూనియ్ ఎన్టీఆర్ చదవండి: వాజ్‌పేయి మృతి పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి.. నివాళులు వాజ్‌పేయి ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు. ఆయన మృతి ఎంతో బాధ కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి : రజనీకాంత్ I’m saddened to hear the demise of a great statesman Shri.Vajpayee ji. May his soul Rest In Peace. — Rajinikanth (@rajinikanth) 16 August 2018 మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందంటూ ఆయన వాజ్‌పేయికి ఘననివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వాజ్‌పేయి ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. Grieved over the demise of former Prime Minister Bharat Ratna Shri Atal Bihari Vajpayeeji. My heart felt condolences to his family members. May his soul rest in peace. — YS Jagan Mohan Reddy (@ysjagan) 16 August 2018 క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయిన ఓ యువకుడు.. పద్దెనిమిదేళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టయిన ఓ యువకుడు ఆ తర్వాత దేశరాజకీయాల్లో గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచాడు. బీజేపీ అంటేనే ఆయన అన్నంతగా ఎదిగాడు. దాదాపు ఆరేడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎత్తు,పల్లాలు చవిచూశాడు. బీజేపీ పట్ల, ఆ పార్టీ రాజకీయాల పట్ల కేడర్ ఆకర్షితులయ్యేందుకు ఆయన ఇమేజీ ఎంతగానో పనిచేసింది. హాస్య చతురత మేళవించిన ప్రసంగాలతో పాటు ఆవేశపూరిత ఉపన్యాసాలకు ఆయన పెట్టింది పేరు.. ఆయనే వాజ్‌పేయి.. ఆయన జీవితంలోని కీలక విశేషాలివి.. చదవండి: వాజ్‌పేయి జీవన ప్రస్థానంలో ముఖ్య ఘట్టాలు ...! శోకసంద్రంలో అభిమానులు! భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఇకలేరు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్తో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాజ్‌పేయి గురువారం కన్నుమూశారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఎయిమ్స్ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. గురువారం సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. దీంతో బీజేపీ శ్రేణులు, అటల్జీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తి కథనాన్ని చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: వాజ్‌పేయి కన్నుమూత.. శోకసంద్రంలో అభిమానులు! వాజ్‌పేయి మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. India grieves the demise of our beloved Atal Ji. His passing away marks the end of an era. He lived for the nation and served it assiduously for decades. My thoughts are with his family, BJP Karyakartas and millions of admirers in this hour of sadness. Om Shanti. — Narendra Modi (@narendramodi) 16 August 2018 ఎయిమ్స్‌లో వాజ్‌పేయి చికిత్సకు సంబంధించిన పరిణామాలివి.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు. అంతకుముందు వాజ్‌పేయిని పరామర్శించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని రాజ్‌నాథ్ మీడియాకు తెలిపారు. వాజ్‌పేయి నివాసానికి మోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులు చేరుకున్నారు. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున వాజ్‌పేయి నివాసానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ట్రాపిక్ ఆంక్షలు విధించారు. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులందరూ ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశం.. ఎయిమ్స్‌కు చేరుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరుఖ్ అబ్దుల్లా గ్వాలియర్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన వాజ్‌పేయి బంధువులు ఎయిమ్స్‌లో దాదాపు గంటసేపు గడిపిన ప్రధాని మోదీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులతో చర్చించిన ప్రధాని మోదీ, అమిత్ షా బిహార్ సీఎం నితీశ్‌కుమార్ హుటాహుటిన ఢిల్లీకి వచ్చారు. ఆయనతోపాటు మహారాష్ట్ర, రాజస్థాన్ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, వసుంధరారాజే కూడా ఎయిమ్స్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయిని పరామర్శించనున్నారు. ఉప రాష్టపతి వెంకయ్య నాయుడు.. ఎయిమ్స్ చేరుకుని వాజ్‌పేయి ఆరోగ్యం ఆరా తీశారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఎయిమ్స్‌కు చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, పీయూష్, హర్షవర్ధన్, సురేష్ ప్రభు, జితేంద్ర సింగ్, అశ్విన్ కుమార్ చౌబే, సురేష్ ప్రభు, ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్‌లు వాజ్‌పేయిని పరామర్శించిన వారిలో ఉన్నారు. అమిత్ షా, జేపీ నడ్డాలు ఎయిమ్స్‌లో ఉండి వాజ్‌పేయి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పడు వాకబు చేస్తున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉండటంతో బీజేపీ తన అధికారిక కార్యక్రమాల్ని వాయిదా వేసుకుంది. జూన్ 11 నుంచి ఎయిమ్స్‌లో వాజ్‌పేయి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మూత్రనాళ ఇన్ఫెక్షన్, ఛాతీలో ఇబ్బంది.. తదితర అనారోగ్య కారణాలతో వాజ్‌పేయి గత రెండు నెలల నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఎయిమ్స్ వైద్య బృందం పర్యవేక్షణ ఆయన ఆరోగ్యాన్ని ఎయిమ్స్ వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. బుధవారం సాయంత్రానికి వాజ్‌పేయి ఆరోగ్యం మరింత క్షీణించగా, గురువారం ఉదయానికి విషమంగా మారింది. ఎయిమ్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని 15 మంది వైద్యుల బృందం వాజ్‌పేయికి చికిత్స అందిస్తోంది. ఒక ప్రత్యేకమైన వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యంపై ఆందోళన నెలకొనడంతో కేంద్ర మంత్రులతో పాటు పలువురు అగ్రనేతలు ఒక్కొక్కరిగా ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. -
ఎయిమ్స్‌కు చేరుకున్న నరేంద్ర మోదీ
-
సీఎం బర్త్‌డే వేడుకలు రద్దు
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో, కేంద్ర మంత్రులతో పాటు పలువురు అగ్రనేతలు ఒక్కొక్కరిగా ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం వాజ్‌పేయికి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. బుధవారం సాయంత్రానికే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా, గురువారం ఉదయానికి అత్యంత విషమంగా మారింది. వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు. ‘పార్టీ వాలంటీర్లకు, శ్రేయోభిలాషులకు ఇదే నా విన్నపం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించడంతో, మీరు నా పుట్టినరోజు వేడుకలు చేయొద్దని కోరుతున్నా. సీఎం అధికారిక నివాసం వద్దకు కూడా వాలంటీర్లు రావొద్దు’ అని అభ్యర్థించారు. నేడు కేజ్రీవాల్ పుట్టిన రోజు. ఆయన బర్త్‌డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా అరవింద్ కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి, కేజ్రీవాల్‌కు అంత మంచి సంబంధాలు లేనప్పటికీ, ఉదయమే మోదీ, కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయడం, ఆ అనంతరం కేజ్రీవాల్ కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. మిగతా పార్టీల నేతలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాలు కూడా కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఐఐటీ-ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేట్ అయిన కేజ్రీవాల్, 1995లో ఐఆర్ఎస్గా బాధ్యతలు చేపట్టారు. కానీ 2012 తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా కొనసాగుతున్నారు. మరోవైపు వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో, కేజ్రీవాల్ కూడా ఉదయం ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. బీజేపీ కూడా నేడు జరుగబోయే తన కార్యక్రమాలన్నింటిన్నీ రద్దు చేసింది. -
అత్యంత విషమంగా వాజ్‌పేయి ఆరోగ్యం
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ప్రస్తుతం వాజ్‌పేయికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యాన్ని ఎయిమ్స్ వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. బుధవారం సాయంత్రానికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా, గురువారం ఉదయానికి విషమంగా మారింది. ఎయిమ్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని 15 మంది వైద్యుల బృందం వాజ్‌పేయికి చికిత్స అందిస్తోంది. ఒక ప్రత్యేకమైన వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యంపై ఆందోళన నెలకొనడంతో కేంద్ర మంత్రులతో పాటు పలువురు అగ్రనేతలు ఒక్కొక్కరిగా ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. వాజ్‌పేయిని ఉప రాష్టపతి వెంకయ్య నాయుడు.. ఎయిమ్స్ చేరుకుని వాజ్‌పేయి ఆరోగ్యం ఆరా తీశారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఎయిమ్స్‌కు చేరుకున్నారు. మరోసారి వాజ్‌పేయిని పరామర్శించడానికి ప్రధాని మోదీ ఎయిమ్స్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, పీయూష్, హర్షవర్ధన్, సురేష్ ప్రభు, జితేంద్ర సింగ్, అశ్విన్ కుమార్ చౌబే, సురేష్ ప్రభు, ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్‌లు వాజ్‌పేయిని పరామర్శించిన వారిలో ఉన్నారు. కాగా, అమిత్ షా, జేపీ నడ్డాలు ఎయిమ్స్‌లో ఉండి వాజ్‌పేయి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పడు వాకబు చేస్తున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉండటంతో బీజేపీ తన అధికారిక కార్యక్రమాల్ని వాయిదా వేసుకుంది. జూన్ 11 నుంచి ఎయిమ్స్‌లో వాజ్‌పేయి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మూత్రనాళ ఇన్ఫెక్షన్, ఛాతీలో ఇబ్బంది.. తదితర అనారోగ్య కారణాలతో వాజ్‌పేయి గత రెండు నెలల నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. -
వెంటిలేటర్‌పై వాజ్‌పేయి
-
వాజ్‌పేయి ఆరోగ్యం విషమం ; వెంటిలేటర్‌పై చికిత్స
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్యం మరింత క్షీణించింది. వాజ్‌పేయి ఆరోగ్యం విషమించిందని, గత 24 గంటల్లో ఆయన పరిస్థితి మరింత దిగజారిందని బుధవారం రాత్రి 10.15 గంటల సమయంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని, నిపుణులైన వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని పేర్కొంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్, ఛాతీలో ఇబ్బంది.. తదితర అనారోగ్య కారణాలతో వాజ్‌పేయి జూన్ 11 నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, బుధవారం సాయంత్రానికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని వార్తలు వెలువడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో ఎయిమ్స్‌కు చేరుకుని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అక్కడ ప్రధాని దాదాపు 50 నిమిషాల పాటు ఉన్నారు.వాజ్‌పేయికి ప్రస్తుతం ఒక మూత్రపిండం మాత్రమే పనిచేస్తోంది. అంతేకాకుండా, 2009లో ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన ఆరోగ్యం మరింతగా దెబ్బతిన్నది. జ్ఞాపకశక్తి కూడా పూర్తిగా క్షీణించింది. వాజ్‌పేయి అనారోగ్య వార్తల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేతలంతా గురువారం నాటి తమ కార్యక్రమాలనన్నింటినీ రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం నూతన భవన నిర్మాణానికి గురువారం తలపెట్టిన భూమిపూజ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు బీజేపీ ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి తెలిపారు. -
భువనగిరిలో ఎయిమ్స్ ఏర్పాటుకు లైన్ క్లియర్
-
తెలంగాణ ఎయిమ్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూ ఢిల్లీ: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) సేవలు తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్నాయి. భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన స్థలానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆమోదం తెలిపారు. దీంతో నిమ్స్ కోసం ఏర్పాటు చేసిన భవణాల్లోనే ఎయిమ్స్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భవణాలు సిద్దంగా ఉన్నందున వైద్య సేవలు అతిత్వరలోనే ప్రారంభం చేస్తామని కేంద్ర అధికారులు తెలిపారు. బీబీనగర్‌లో మరో 49 ఎకరాల స్థలంతో పాటు, రోడ్లు, విద్యుత్ వంటి పలు సదుపాయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పోరాడి సాధించాం.. భువనగిరి జిల్లాలో ఎయిమ్స్ ఏర్పాటును పోరాడి సాధించామని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు స్థల రూపంలో తొలి అడుగుపడడం సంతోషంగా ఉందని.. ఏడాది లోపు ప్రిలిమినరీ సేవలు ప్రారంభమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ తెలిపారు. కేంద్రానికి ధన్యవాదాలు.. టీఆర్ఎస్ ప్రభుత్వ కృషితోనే ఎయిమ్స్ ఏర్పాటు జరగనుందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి వివరించారు. ప్రతిష్టాత్మక వైద్య సేవలు రావడానికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. -
పేద విద్యార్థికి రాహుల్ లేఖ
భోపాల్ : ప్రతిభను అడ్డుకునే శక్తి పేదరికానికి, కుటుంబ ఆర్థిక పరిస్థితులకు లేదని నిరూపించాడు ఓ విద్యార్థి. పీలికలు ఏరుకుని జీవనాన్ని సాగిస్తున్న ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన పేద విద్యార్థి ఆశారాం చౌదరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జోద్‌పూర్‌కు ఎంపికై ఔరా అనిపించాడు. విద్యార్థి ప్రతిభను మెచ్చుకుంటూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందనలు తెలుపుతూ ఓ లేఖను రాశారు. ‘ఉన్నత విద్యాసంస్థలో ప్రవేశం పొందినందుకు ఆశారాంకు అభినందనలు. మహాత్మ గాంధీ చెప్పినట్లు.. శక్తి అనేది శారీరక చర్య నుంచి రాదు. చరగని సంకల్పం నుంచి వస్తుంది. అన్ని సవాళ్లు ఎదుర్కొని మంచి ర్యాంక్ సాధించారు. భవిష్యత్తు తరాలకు నువ్వు మర్గదర్శకుడివి కాగలవని నాకు నమ్మకం ఉంది’ అంటూ రాహుల్ లేఖలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కూడా ఆశారాంకు అభినందనలు తెలిపారు. తన చదువుకు అవసరైన ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందిస్తామని సీఎం ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని దీవాస్ జిల్లా మారుమూల గ్రామానికి చెందిన ఆశారాం ఆల్ ఇండియా స్థాయిలో 707 ర్యాంక్, ఓబీసీ కేటగిరిలో 141 ర్యాంకు సాధించారు. గ్రామంలో కనీసం కరెంట్ సౌకర్యం కూడా లేకున్నా, దీపం సహాయంతో చదువుకున్ని జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచాడు. తనకు చదువుకోడానికి డబ్బులు లేకున్న తండ్రి పీలికలు ఏరి ఆ డబ్బుతో తనను చదివించాడని ఆశారం తెలిపారు. మొదటి ప్రయత్నంలో ఈ ర్యాంకును సాధించినట్లు ఇరవైఏళ్ల ఆశారాం వెల్లడించారు. -
నిలకడగా మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం
-
మరింత మెరుగ్గా వాజ్‌పేయి ఆరోగ్యం
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతోందని ఎయిమ్స్ ఆస్పత్రి ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్, మూత్రం సరిగా రాకపోవటం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న వాజ్‌పేయిని ఈనెల 11న ఎయిమ్స్‌లో చేర్పించిన సంగతి తెలిసిందే. ‘చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. కిడ్నీ పనితీరు, మూత్ర విసర్జన సాధారణ స్థాయికి చేరుకున్నాయి. బ్లడ్ ప్రెషర్, శ్వాస వ్యవస్థ, గుండె సక్రమంగా పనిచేస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే ఆయన కోలుకుంటారని ఆశిస్తున్నాం’ అని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా మీడియాకు తెలిపారు. -
నిలకడగా మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రి తెలిపింది. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, ప్రస్తుతం ఆయనకు యాంటీబయాటిక్స్ అందిస్తున్నామని తెలిపింది. వాజపేయి కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని, ఇన్ఫెక్షన్ తగ్గేవరకు ఆయన ఆస్పత్రిలో ఉండాలని ఎయిమ్స్ ఆస్పత్రి మంగళవారం విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపింది. సోమవారం ఉదయం అనారోగ్యానికి గురికావటంతో వాజ్‌పేయిని ఎయిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. తొలుత రొటీన్ చెకప్‌లో భాగంగా వాజ్‌పేయిని ఎయిమ్స్‌కు తరలించినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఆయన మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని ఎయిమ్స్ వైద్యులు తాజాగా తెలిపారు. వాజ్‌పేయికి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందచేస్తున్నట్టు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌లో వాజ్‌పేయిని పరామర్శించి, చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ కాన్పూర్‌లో కమలం పార్టీ కార్యకర్తలు పూజలు నిర్వహించారు. -
వాజ్‌పేయి కోలుకోవాలని బీజేపీ కార్యకర్తల పూజలు
సాక్షి, లక్నో : ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాజ్‌పేయి ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ కాన్పూర్‌లో బీజేపీ కార్యకర్తలు పూజలు నిర్వహించారు. పూర్తి ఆరోగ్యంతో వాజ్‌పేయి ఇంటికి చేరుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రార్థనలు చేశారు. తొలుత రొటీన్ చెకప్‌లో భాగంగా వాజ్‌పేయిని ఎయిమ్స్‌కు తరలించినట్టు వైద్యులు పేర్కొన్నారు. కాగా ఆయన మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. వాజ్‌పేయికి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందచేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌లో వాజ్‌పేయిని పరామర్శించి, చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. -
ఎయిమ్స్‌లో అటల్జీ : పలువురి పరామర్శ
-
వాజ్‌పేయిని పరామర్శించిన ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య పరీక్షల కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని, ‘భారతరత్న’ అటల్ బిహారీ వాజ్‌పేయిని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మర్యాద పూర్వకంగా కలుసుకుని పరామర్శించారు. 93 ఏళ్ల వాజ్‌పేయి.. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం వాజ్‌పేయిని ఎయిమ్స్‌లో చేర్పించడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం కాగా, పెద్దాయన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని, వైద్య పరీక్షల కోసం మాత్రమే వాజ్‌పేయి ఆస్పత్రిలో చేరారని ఎయిమ్స్ ప్రకటించింది. ఎయిమ్స్ డైరెక్టర్ రాజ్‌దీప్ గులేరియా ఆధ్వర్యంలోని వైద్యుల బృందం వాజ్‌పేయికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నది. కాగా, సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఓబీసీ సమ్మేళనంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ఆ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే ఎయిమ్స్‌కు వెళ్లారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను ఆరా తీశారు. రాహుల్ వెళ్లిపోయిన కొద్దిసేపటికే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎయిమ్స్‌కు వచ్చారు. అటల్ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసిన ప్రధాని మోదీ.. అధికారులకు కొన్ని సూచనలు చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ చీఫ్ అమిత్ షాలు కూడా వాజ్‌పేయిని పరామర్శించిన వారిలో ఉన్నారు. -
ఎయిమ్స్‌లో వాజ్‌పేయి
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(93) అస్వస్థతకు లోనయ్యారు. సోమవారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావటంతో ఎయిమ్స్‌కు తరలించారు. ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ చేసింది. అయితే రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన్ని ఎయిమ్స్‌కు తరలించినట్లు ఆయన కార్యదర్శి మహేంద్ర పాండే ఓ ప్రెస్ నోట్ మీడియాకు విడుదల చేశారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేతృత్వంలోని బృందం వాజ్‌పేయికి చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో వాజ్‌పేయి గురించి కొన్ని ఫేక్ న్యూస్‌లు వైరల్ కాగా, కొన్ని మీడియా ఛానెళ్లు ఇప్పుడు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి బ్రేకింగ్‌లు ఇవ్వటం గమనార్హం. నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటేరియన్‌గా ఉన్న వాజ్‌పేయి.. భారత దేశానికి పదో ప్రధానిగా పనిచేశారు. కాంగ్రెసేతర ప్రధానిగా దేశాన్ని ఐదేళ్లు పాలించిన ఘనత కూడా వాజ్‌పేయిదే. వివాదరహితుడిగా ప్రతిపక్ష పార్టీలతోపాటు పలువురి ప్రశంసలు ఆయన అందుకున్నారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పలువురు సందేశాలు పెడుతున్నారు. Former PM AB Vajpayee admitted in AIIMS. @ThePrintIndia pic.twitter.com/mSzVh0z0wt — Pragya Kaushika (@pragyakaushika) 11 June 2018 -
రోజూ యోగా చేస్తే..
సాక్షి, న్యూఢిల్లీ : యోగాతో ఒనగూరే ప్రయోజనాలపై పలు అథ్యయనాలు వెల్లడించగా తాజాగా రోజూ యోగా చేస్తే వీర్యకణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఎయిమ్స్ నిర్వహించిన అథ్యయనం పేర్కొంది. ఎయిమ్స్‌కు చెందిన శరీరనిర్మాణ శాస్త్ర విభాగం నిపుణులు చేపట్టిన ఈ సర్వే నేచర్ రివ్యూ యూరాలజీ పత్రికలో ప్రచురితమైంది. వీర్యకణాల డీఎన్ఏ దెబ్బతినడంతో సంతాన సాఫల్యంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చేందుకు వీర్యకణాల్లో జన్యుపరమైన నాణ్యత కీలకమని ఎయిమ్స్, అనాటమీ విభాగానికి చెందిన డాక్టర్ రీమా దాదా పేర్కొన్నారు. డీఎన్ఏ దెబ్బతినేందుకు శరీరంలోనిఆక్సిజన్ సామర్ధ్యం, రాడికల్ లెవెల్స్‌ల మధ్య సమతుల్యత లోపించడంతో ఆక్సిడేటివ్ ఒత్తిడికి దారితీయడమే కారణమని విశ్లేషించారు. జీవనశైలి మార్పుల ద్వారా వీటిని నిరోధించవచ్చని చెప్పారు. నిత్యం యోగా చేయడం ద్వారా పురుషుల్లో సంతానలేమిని తగ్గించవచ్చన్నారు. యోగాతో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించుకోవచ్చని, డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడుకోవచ్చన్నారు. ఆరు నెలల పాటు యోగ అభ్యసించిన 200 మంది పురుషుల పై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయన్నారు. వీరిలో డీఎన్ఏ నాణ్యత మెరుగుపడినట్టు, ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గుముఖం పట్టినట్టు తాము గమనించామన్నారు. నిత్యం యోగా చేసే వారిలో కుంగుబాటు, ఒత్తిడి, ఉద్వేగాల తీవ్రత అదుపులోకి వచ్చినట్టు గుర్తించామని ఆమె చెప్పారు. ఫ్రీ రాడికల్ స్థాయిలను తగ్గించి డీఎన్ఏ విచ్ఛినం కాకుండా యోగా నిరోధిస్తుందని తెలిపారు.