
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతోందని ఎయిమ్స్ ఆస్పత్రి ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్, మూత్రం సరిగా రాకపోవటం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న వాజ్‌పేయిని ఈనెల 11న ఎయిమ్స్‌లో చేర్పించిన సంగతి తెలిసిందే. ‘చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. కిడ్నీ పనితీరు, మూత్ర విసర్జన సాధారణ స్థాయికి చేరుకున్నాయి. బ్లడ్ ప్రెషర్, శ్వాస వ్యవస్థ, గుండె సక్రమంగా పనిచేస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే ఆయన కోలుకుంటారని ఆశిస్తున్నాం’ అని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment