సాక్షి, న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో దారుణం జరిగింది. వైద్య విద్యార్థి ఆత్మహత్మకు పాల్పడి ఘటన కలకలం రేపుతోంది. ఎయిమ్స్‌లో రెండవ సంవత్సరం చదువుతున్న వికాస్ (22) అనే వైద్య విద్యార్థి సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అతడు మరణించాడు. పోలీసుల సమాచారం ప్రకారం... న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో సాయంత్రం 6 గంటల సమయంలో వికాస్ అనే వైద్య విద్యార్థి హాస్టల్ పైకప్పుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రి యాజమాన్యం ఈ ఘటనపై తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న అనంతరం సదరు బాధితుడిని ఎయిమ్స్‌లోని సంబంధిత విభాగానికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
(చదవండి: కరోనా నుంచి కోలుకున్న కర్ణాటక సీఎం)
వికాస్‌కు చికిత్స అందిస్తుండగానే అతడు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు వికాస్ బెంగళూరుకు చెందిన వాడని, అతడు 2018 బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. వికాస్ కొద్ది రోజులుగా మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని, అతడికి మానసిక వైద్య చికిత్స వార్డులో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వికాస్ రోజులాగే ఈ రోజు కూడా విధులకు హజరయ్యాడని, సాయంత్రం సమయంలో ఒక గంట సెలవు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విరామం కోసం వెళ్లి సాయంత్రం 6 గంటల సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: కరోనా నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment