దారుణం : ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య | Doctor Jumps To Death From Eighth Floor Of Delhi Hospital | Sakshi
Sakshi News home page

దారుణం : ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

Sep 1 2019 3:57 PM | Updated on Sep 1 2019 4:19 PM

Doctor Jumps To Death From Eighth Floor Of Delhi Hospital - Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీలోని జిటిబి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి క్యాంపస్‌లోని ఎనిమిదో అంతస్తు నుంచి దూకి 44 ఏళ్ల వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన పల్లవ్‌(44) తన భార్యతో కలిసి జీటీబీ క్యాంపస్‌లో నివసిస్తున్నాడని తెలిపారు. కాగా,  పల్లవ్‌ నోయిడాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేస్తుండగా, అతని భార్య జీటీబీ ఆసుపత్రిలోనే విధులు నిర్వహిస్తోంది. కాగా ఎప్పటిలాగే శనివారం రాత్రి విధులు ముగించుకొని పల్లవ్‌  జిటిబి ఆసుపత్రికి చేరుకున్నాడు.  ఎనిమిదో అంతస్తుకు చేరుకున్న అతను అక్కడి నుంచి కిందకు దూకినట్లు పేర్కొన్నారు. తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగానే మరణించాడు. కాగా ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. అతడి కుటుంబ సభ్యులు రాగానే పోస్టుమార్టం నిర్వహిస్తామని వెల్లడించారు.  సెక‌్షన్‌ 174 కింద కేసు కింద నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement