వరంగల్ క్రైం: హనుమకొండ సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో ఫిజియోథెరపీ డాక్టర్ కుందురు నిహారికారెడ్డి (25) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం కేశవాపూర్‌కు చెందిన గంగాధర్‌రెడ్డి నగరంలోని చార్టెడ్ అకౌంటెంట్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఇతనికి వర్ధన్నపేట మండలం కడారిగూడేనికి చెందిన నిహారికారెడ్డితో రెండేళ్లక్రితం వివాహమైంది.
పెళ్లి సమయంలో కట్నం కింద నగరంలో 300 గజాల ప్లాట్, ఇతర కానుకలు ఇచ్చారు. ఎక్సైజ్ కాలనీలో నివాసం ఉంటున్న వీరికి నాలుగు నెలల క్రితం పాప జన్మించింది. ఇటీవల కారు కావాలని గంగాధర్‌రెడ్డి అడగగా అందుకు కూడా నిహారిక తల్లిదండ్రులు అంగీకరించారు. అయినప్పటికీ ఇంకా పెళ్లి లాంఛనాల విషయంలో వివాదం నడుస్తోంది.
ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యాభర్తలు వేర్వేరు గదుల్లో నిద్రించారు. గురువారం ఉదయం పాప ఏడు స్తున్నా నిహారికారెడ్డి తలుపు తీయక పోవడంతో భర్తకు అను మానం వచ్చి తలుపులు పగులగొట్టి లోపలి కి వెళ్లేసరికి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఇన్‌స్పెక్టర్ షూకుర్ ఘట నాస్థలానికి చేరుకుని పరిశీలించారు. భర్త, అత్త, ఆడబిడ్డ దంపతుల వేధింపుల వల్లే తన కూతురు ఆత్మ హత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి మల్లారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
చదవండి: మద్యానికి బానిసై సైకోగా మారి.. కూతుర్ని గొడ్డలితో నరికిచంపిన తండ్రి..
Comments
Please login to add a commentAdd a comment