జోధ్‌పూర్ (రాజస్థాన్)లోని ఆలిండియాఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్).. గ్రేడ్-2 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీచేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఖాళీలు: 550 (ఓసీ-279, ఓబీసీ-148, ఎస్సీ-82, ఎస్టీ-41)వేతనం: రూ.9,300-34,800+గ్రేడ్‌పే రూ.4,600+కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఇతర అలవెన్సులు. విద్యార్హత: పదో తరగతి/తత్సమానం, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (జీఎన్‌ఎం) సర్టిఫికెట్. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో ‘ఏ’ గ్రేడ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్‌గా రిజిస్ట్రేషన్.అనుభవం: కంప్యూటర్ పరిజ్ఞానం (ఆఫీస్ అప్లికేషన్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్లకు సంబంధించిన అనుభవం) ఉండాలి. వయసు: 18-30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అవసరమైతే ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుం: ఓసీలు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు.
చివరి తేది: అక్టోబర్ 23 సాయంత్రం 5 గంటల వరకు.
వెబ్‌సైట్: http://www.aiimsjodhpur.edu.in/
గమనిక: గత నోటిఫికేషన్ (Advt No: Admn/Estt/09/01/2015-AIIMS.JDH )మేరకు దరఖాస్తు చేసినవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అర్హతల కటాఫ్ డేట్ (2015 అక్టోబర్ 16)లో ఎలాంటి మార్పులేదు.
ఎయిమ్స్‌లో స్టాఫ్ 550 నర్స్ పోస్టులు
Published Wed, Sep 28 2016 2:28 AM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM
Advertisement
Advertisement