![Turkish tourist Shramdaan in Jodhpur](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/4/ayesha-something.jpg.webp?itok=dZkoTZ-9)
సమ్‌థింగ్ స్పెషల్
అంతకు మించిన హాయి ఏమున్నది! శ్రమదానం మనకు కొత్త కాదు. అయితే అయేషా చేసిన శ్రమదానం వీడియో వైరల్ అయింది. ఇంతకీ ఆమె శ్రమదానం ప్రత్యేకత ఏమిటి అనే విషయానికి వస్తే... అయేషా మన అమ్మాయి కాదు. జోద్‌పూర్‌ను చూడడానికి తుర్కియే నుంచి వచ్చింది.
జోద్‌పూర్‌లోని మాండోర్ గార్డెన్‌కు వెళ్లిన అయేషా అక్కడి పనివాళ్లు ఊడ్చే దృశ్యాలను చూసింది. ‘నాకు కూడా ఒక చీపురు కావాలి’ అని అడిగింది. అక్కడ ఉన్న గైడ్, వర్కర్స్ అయేషా జోక్ చేస్తుంది అనుకున్నారు. కాని ఆమె సీరియస్‌గానే అడిగింది అని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. చీపురుతో అరగంట పాటు ఊడ్చుతూ శ్రమదానం చేసింది.
ఈ వీడియోను చూస్తూ నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘గార్డెన్‌లకు వెళ్లడం అనేది ఆహ్లాదకరమైన అనుభవం. అయితే గార్డెన్‌లలో ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తూ చిరాకు కలిగిస్తుంది. చెత్త వేసే వాళ్లు గార్డెన్‌లకు వెళ్లడానికి అనర్హులు. పరిసరాల పరిశుభ్రత అనే స్పృహ ఉన్న ఆయేషాలాంటి వాళ్లు మనకు ఆదర్శం కావాలి’ ‘శ్రమదానానికి సరిహద్దులు లేవని నిరూపించిన వీడియో ఇది’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment