tourist
-
హైదరాబాద్‌లో టూరిస్ట్ ఇళ్లు.. సకల వసతులు
సాక్షి, సిటీబ్యూరో: వేసవి సెలవుల్లో సేద తీరడానికి పలు కుటుంబాలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటాయి. కానీ, అక్కడి వసతి ఎలా? హోటళ్లలో ఉండాలంటే.. కాస్త ఖర్చు ఎక్కువే. నచ్చిన వంట వండుకోలేం. సరైన ఆతిథ్యాన్ని స్వీకరించలేం. వాళ్లు పెట్టినవాటిలో నుంచి ఎంపిక చేసుకొని తినాలి. దీనికి పరిష్కారం చూపించేవే పర్యాటక విడిదులు. స్టార్ హోటళ్లను తలదన్నేలా ఆధునిక వసతులు అందించడమే ఈ టూరిస్ట్ ఇళ్ల ప్రత్యేకత.ఇళ్లు.. హోం స్టేలుగా! భాగ్యనగరం అంటేనే చక్కని ఆతిథ్యానికి చిరునామా. అందుకే విదేశీ పర్యాటకులు ఇక్కడి ఆత్మీయత, ఆతిథ్యానికి ముగ్ధులవుతుంటారు. ఈ ఆనందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు పర్యాటక శాఖ హోం స్టే పథకం ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో పలు ప్రైవేట్ సంస్థలూ సేవలందిస్తున్నాయి. నగరంలోని గృహ యజమానులు తమ ఇళ్లను అద్దెకు ఇచ్చే బదులుగా ఇలా హోంస్టే సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఆకట్టుకునేలా గృహాలను తీర్చిదిద్ది, అన్ని సౌకర్యాలు కల్పించి, పర్యాటకులకు తాత్కాలికంగా కిరాయికి ఇస్తున్నారు.అన్ని రకాల వసతులు.. ఎయిర్ బీఎన్బీ, వీఆర్బో, బుకింగ్.కామ్, మేక్ మై ట్రిప్, ట్రావెల్ స్టేషన్, హోమ్ టుగో వంటి సంస్థలు హోం స్టే సేవలను అందిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, తీర్థయాత్రలు అన్నిచోట్లా టూరిస్ట్ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. కిచెన్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అన్ని రకాల వసతులు ఈ హోం స్టేలలో ఉంటాయి. సౌకర్యాలను బట్టి అద్దె ఒక రాత్రికి రూ.5 వేల నుంచి ఉంటాయి.ఆయా పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న హోం స్టేల వివరాలను సంస్థలు తమ వెబ్సైట్లలో పొందుపరుస్తున్నాయి. వారికి అనువైన వసతిని వెతుక్కోవచ్చు. ఇందులోనే ధరలను కూడా నిర్ణయిస్తారు. వండి వడ్డించే భోజనం వివరాలు కూడా ఉంటాయి. విమానాశ్రయం నుంచి నేరుగా బస చేసే ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని అందుకోవచ్చు. -
ఆడుతు పాడుతు ఊడుస్తుంటే...
అంతకు మించిన హాయి ఏమున్నది! శ్రమదానం మనకు కొత్త కాదు. అయితే అయేషా చేసిన శ్రమదానం వీడియో వైరల్ అయింది. ఇంతకీ ఆమె శ్రమదానం ప్రత్యేకత ఏమిటి అనే విషయానికి వస్తే... అయేషా మన అమ్మాయి కాదు. జోద్పూర్ను చూడడానికి తుర్కియే నుంచి వచ్చింది. జోద్‌పూర్‌లోని మాండోర్ గార్డెన్‌కు వెళ్లిన అయేషా అక్కడి పనివాళ్లు ఊడ్చే దృశ్యాలను చూసింది. ‘నాకు కూడా ఒక చీపురు కావాలి’ అని అడిగింది. అక్కడ ఉన్న గైడ్, వర్కర్స్ అయేషా జోక్ చేస్తుంది అనుకున్నారు. కాని ఆమె సీరియస్‌గానే అడిగింది అని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. చీపురుతో అరగంట పాటు ఊడ్చుతూ శ్రమదానం చేసింది.ఈ వీడియోను చూస్తూ నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘గార్డెన్లకు వెళ్లడం అనేది ఆహ్లాదకరమైన అనుభవం. అయితే గార్డెన్లలో ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తూ చిరాకు కలిగిస్తుంది. చెత్త వేసే వాళ్లు గార్డెన్లకు వెళ్లడానికి అనర్హులు. పరిసరాల పరిశుభ్రత అనే స్పృహ ఉన్న ఆయేషాలాంటి వాళ్లు మనకు ఆదర్శం కావాలి’ ‘శ్రమదానానికి సరిహద్దులు లేవని నిరూపించిన వీడియో ఇది’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..
గాడ్స్ ఓన్ కంట్రీ... చూడాల్సినవి ఇవి అని చెప్పుకోవడం కష్టం. జాబితా వేళ్ల మీద లెక్కపెట్టేటంత చిన్నదిగా ఉండదు. ఆర్ట్ అండ్ కల్చర్, ఆధ్యాత్మికం, ధార్మికం, వీకెండ్ పిక్నిక్ స్పాట్స్, బీచ్‌లు, బ్యాక్ వాటర్స్, పర్వతాలు, కొండవాలులో టీ తోటలు, సముద్రం మీద సూర్యాస్తమయాలు, జలపాతాలు, వన్యప్రాణులు, హాలిడే రిసార్టులు... ఇలా పరస్పరంవైవిధ్యభరితమైన పర్యటనల నిలయం ఈ రాష్ట్రం. కేరళలో ఆధ్యాత్మికం కూడా ఆద్యంతం అలరిస్తుంది. త్రివేండ్రంలోని పద్మనాభ స్వామి ఆలయం మొదలు అంబళంపుర శ్రీకృష్ణుడు, చెట్టికుళాంగుర భగవతి, శబరిమల అయ్యప్ప, కొట్టరక్కర గణపతి, తిరునెల్లి ఆలయం, చర్చ్‌లు, మసీదులు ప్రతిదీ టూరిస్టులకు కనువిందు చేస్తాయి.శబరిమలైకి మహిళలను అనుమతించడం కోసం తృప్తి దేశాయ్ చేసిన ఉద్యమంతో ఉత్తరాదివాసుల దృష్టి కూడా కేరళ మీద కేంద్రీకృతమైంది. ఇప్పుడు కేరళలో హిందీవాళ్లు కూడా కనిపిస్తున్నారు.అరబిక్ కడలికేరళ టూర్‌కి కాలంతో పని లేదు. అరేబియా తీరం– పశ్చిమ కనుమల మధ్య విహారానికి ఎప్పుడైనా రెడీ కావచ్చు. ఎండకాలం చల్లగా అలరిస్తుంది. జూన్ నుంచి చిరు వానలు పలకరిస్తాయి. శీతాకాలం పచ్చదనం తన గాఢతను ప్రదర్శిస్తుంది. తలలు వాల్చి ఆహ్వానం పలికే కొబ్బరితోటలు, కోమలత్వాన్ని తాకి చూడమనే అరటి గుబుర్లు, ఎటూ వంగని పోకచెట్లు, ఏ చెట్టు దొరుకుతుందా అల్లుకుపోదామని వెతుక్కునే మిరియాల తీగలు, కాయల బరువుతో భారంగా వంగిపోతున్న కాఫీ చెట్లు, టూర్‌కి మినిమమ్ గ్యారంటీ ఇచ్చే అరేబియా సముద్రం మీద సూర్యాస్తమయాలు... ఇవన్నీ ప్రకృతి ప్రసాదితాలు.ఆది శంకరుడు పుట్టిన నేలకాలడి ఓ చిన్న పట్టణం. పెరియార్ నది ఒడ్డున ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఆది శంకరాచార్యుడు పుట్టిన ప్రదేశం ఇది. ఇక్కడ ఆయన నివసించిన ఇల్లు, ఆయన తల్లి సమాధి ఉన్నాయి. ఇక్కడి స్నానఘట్టంలో ముత్తల కడవు (మొసలి మడుగు) ను కూడా చూడవచ్చు. ఆది శంకరుడు సన్యసించాలనుకున్నప్పుడు తల్లి అంగీకరించలేదు. ఆమె అంగీకారం కోసం ఆది శంకరుడు నాటకం ఆడిన ఘట్టం ఇది. స్నానఘట్టంలో దిగి మొసలి పట్టుకున్నదని, సన్యసించడానికి ఒప్పుకుంటేనే వదులుతుందని తల్లిని మాయ చేసి అంగీకారం పొందిన కథనాన్ని చెబుతారు పూజారులు. పెరియార్ నది కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగడానికి ముందే పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. పచ్చటి చేనులో నీలిరంగు వస్త్రాన్ని మలుపు తిప్పుతూ పరిచినట్లు ఉంటుంది దృశ్యం.కళల నిలయంకేరళ ప్రకృతిసోయగంతోపాటు కళలతోనూ ఆకట్టుకుంటుంది. కలరిపయట్టు వంటి యుద్ధ క్రీడ, మోహినీ అట్టం, కథాకళి వంటి నాట్యరీతులు, రాజారవివర్మ చిత్రలేఖన సమ్మేళనం ఇక్కడే పుట్టాయి. భరత్పుఱ నది తీరాన త్రిశూర్ జిల్లాలోని చెరుత్తురుతి పట్టణంలో కేరళ కళామండలం ఉంది. కళల సాధన కోసం ఏర్పాటు చేసిన ఈ కళామండలంలో నిత్యం సంప్రదాయ నాట్యరీతుల సాధన జరుగుతూ ఉంటుంది. మరో హాలులో కేరళ సంప్రదాయ నాట్య రీతుల నాట్య ముద్రలు, భంగిమలు, ఆహార్యంతో ఉన్న బొమ్మల మ్యూజియం ఒక ఎడ్యుకేషన్. ఈ కళల కోసమే కాదు, కేరళ కళామండలం భవన నిర్మాణశైలిని చూడడం కోసం ఆర్కిటెక్చర్ విద్యార్థులు వెళ్లాల్సిన ప్రదేశం.వాస్కోడిగామా ఎంట్రీ!కేరళ రాష్ట్రంలో సగం తీర్రప్రాంత జిల్లాలైతే మిగిలిన సగం కొండ్రప్రాంత జిల్లాలు. రైలు ప్రయాణంలో తమిళనాడు నుంచి కేరళకు వెళ్లేటప్పుడు పాలక్కాడ్ నుంచే మార్పు కనిపిస్తుంది. మనదేశంలో వలస పాలనలో మగ్గి΄ోవడానికి దారులు పడింది కూడా ఈ రాష్ట్రం నుంచే. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా మనదేశంలోకి ప్రవేశించింది కోళికోద్ పట్టణానికి సమీపంలోని కప్పడ్ అనే చిన్న తీరగ్రామంలో. కప్పడ్ బీచ్‌లో వాస్కోడిగామా జ్ఞాపకచిహ్నాలున్నాయి. చర్చ్‌లు యూరోపియన్ నిర్మాణశైలిలో అందంగా ఉంటాయి. నది తీరాన నిర్మించడంలో గొప్ప అభిరుచి వ్యక్తమవుతుంటుంది. ఎర్నాకుళంలో సెయింట్ మేరీస్ బాసిలికా చర్చ్, మలయత్తూర్ చర్చ్, శాంతాక్రజ్ కేథడ్రల్, జార్జ్ ఫ్రాన్సిస్ చర్చ్, సముద్రతీరాన నిర్మించిన వల్లర΄ాదమ్ చర్చ్‌లు ప్రశాంత వాతావరణంలో మౌనముద్ర దాల్చి ఉంటాయి. ముఖ్యమైన మసీదులు ముప్పైకి పైగా ఉంటాయి.ఆరోగ్యదేవుడు ధన్వంతరిఆయుర్వేదంలో వైద్యానికి మూల పురుషుడు ధన్వంతరి. ధన్వంతరికి ‘ముక్కిడి’ పేరుతో 35 ఔషధాల మిశ్రమాన్ని నివేదిస్తారు. త్రిశూర్ జిల్లా, నెల్లువాయ్ గ్రామంలో ఉన్న ఆలయం పురాతనమైనది. దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతభాండాన్ని ధన్వంతరి పట్టుకుని వస్తాడు. ఒక చేతిలో శంకు, ఒక చేతిలో చక్రం, ఒకచేతిలో అమృతభాండం, మరో చేతిలో జలూకం(జలగ, ఆయుర్వేద వైద్యంలో జలగను ఉపయోగిస్తారు)తో ఉద్భవించాడు ధన్వంతరి. ఆ మూర్తినే ఇక్కడ ప్రతిష్టించారని చెబుతారు. మున్నువరువట్టం, గురువాయూర్లలో కూడా ధన్వంతరి ఆలయం ఉంది. శబరిమలకు వెళ్లిన వాళ్లు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు.టీ తోటల మునార్మున్నార్ అంటే మూడు నదుల కలయిక. ముథిరాప్పుజ, నల్లతన్ని, కుండలి నదుల మధ్య ఉన్న హిల్‌స్టేషన్ ఇది. టీ తోటలు విస్తారంగా ఉంటాయి. ఈ తోటల మధ్య జలపాతాలు తెల్లగా పాలధారలను తలపిస్తుంటాయి. వర్షాకాలంలో దట్టంగా అలముమున్న నల్లటి మేఘాలను చీల్చుకుంటూ భూమ్మీద పాలను కుమ్మరిస్తున్నట్లు ఉంటుంది అట్టుకడ జలపాతం. ఈ టూర్లో ఎరవి కులమ్ నేషనల్ పార్క్‌ను, నీలగిరులు అనే పేరు రావడానికి కారణమైన నీలకురింజి మొక్కలను చూడాలి. మున్నార్, ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రదేశాలను ఒకసారి చూసిన వాళ్లు కూడా కురింజి పూలు పూసినప్పుడు మళ్లీ చూడాలని ఆశపడతారు. బొటానికల్‌గా ఇవి 50 రకాల జాతులున్నాయి. కాని మనకు చూడడానికి అన్నీ నీలంగానే ఉంటాయి, షేడ్లు మాత్రం ఏ చిత్రకారుడూ మిక్స్ చేయలేనంత లలితంగా ఉంటాయి. నీలకురింజి పూలు పన్నెండేళ్లకోసారి పూస్తాయి. 2018లో పూశాయి, మళ్లీ పూసేది 2030లోనే. కోవిడ్ సమయంలో కూర్గ్ కొండల్లో కొన్ని చోట్ల విరిశాయి. కానీ సీజన్లో పూసినట్లు కొండ మొత్తం విస్తరించలేదు. ఇక్కడ జంతు సంచారం కూడా ఎక్కువ. నీలగిరి థార్ ఇక్కడ మాత్రమే కనిపించే జింక జాతి.కోటలు... తోటలు!కేరళ గ్రామాల్లో మన దగ్గర ఉన్నట్లు ఇళ్లన్నీ ఒక చోట, పొలాలు ఒకచోట ఉండవు. రెండు – మూడు ఎకరాల స్థలంలో కొబ్బరి చెట్లు, మధ్యలో ఇల్లు ఉంటుంది. తోట పక్కన మరొక తోట... ఆ తోటలో ఒక ఇల్లు... చాలా ఇళ్లకు పై కప్పు ఎర్ర పెంకులే ఉన్నాయి. రెండస్తుల ఇల్లు కూడా పై కప్పు వాలుగా, ఎర్ర పెంకులతో ఉంటుంది. రాజుల ప్యాలెస్‌లు కూడా భారీ నిర్మాణాలేమీ కాదు. రాజస్థాన్ కోటలు, ప్యాలెస్‌లను చూసిన కళ్లతో ఇక్కడి ప్యాలెస్‌లను చూస్తే కళ్లు విప్పార్చలేం. కానీ ప్రకృతి సహజమైన, శాంతియుతమైన జీవనశైలికి నిదర్శనంగా కనిపిస్తాయి. పాలక్కాడ్, తలస్సెరి కోటలు పర్యాటకులను అలరిస్తుంటాయి. చిన్న చిన్న ప్యాలెస్‌లను రిసార్టులుగా మార్చేశారు. భరత్‌పుర నది ఒడ్డున ఉన్న ప్యాలెస్‌ను ‘ది రివర్ రిట్రీట్’ పేరుతో హెరిటేజ్ ఆయుర్వేదిక్ రిసార్టుగా మార్చారు. అందులో భోజనం చేయడం జిహ్వకు వైద్యం.మీన్ ముట్టి జలపాతంవయనాడు... కేరళ రాష్ట్ర్రంలో అత్యున్నత స్థాయి ప్రకృతి సౌందర్యాన్ని ఇముడ్చుకున్న ప్రదేశం. ఆ రాష్ట్రానికి శిఖరాగ్రం కూడ ఇదే. మీన్ముట్టి వాటర్ ఫాల్స్‌కి రెండు కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో ట్రెకింగ్ చేయాలి. ఈ కొండ మీద మీన్ముట్టి వాటర్‌ఫాల్స్ దగ్గర నుంచి చూస్తే ఒక వైపు తమిళనాడు నీలగిరులు, మరోవైపు కర్నాటకకు చెందిన కూర్గ్ కొండలు దోబూచులాడుతుంటాయి. వరదలు ముంచెత్తినప్పటికీ పర్యాటకం తిరిగి మామూలు స్థితికి చేరుకుంటోంది. ట్రీ హౌస్‌లో బస చేయాలనే సరదా తీరాలంటే ముందుగానే ΄్లాన్ చేసుకోవాలి. ఇక్కడ పర్యటిస్తే కేరళ వాళ్లు తమ రాష్ట్రాన్ని ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది.గిన్నిస్ బుక్‌లో జటాయుపురాజటాయు నేచర్ పార్క్... కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణం, జటాయుపురాలో ఉంది. రామాయణంలో సీతాపహరణం ఘట్టంలో రావణాసురుడితో జటాయువు పోరాడిన ప్రదేశం ఇదేనని చెబుతారు. నేచర్ పార్కులో 65 ఎకరాల విస్తీర్ణంలో డిజిటల్ మ్యూజియమ్ ఉంది. లైట్ అండ్ సౌండ్ షోలో రామాయణంలోని జటాయువు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. ప్రపంచంలో ‘లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాచ్యూ ఆఫ్ ఎ బర్డ్’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్‌తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్ సిటిజెన్ అందరికీ ఈ టూర్ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది. వెయ్యి అడుగుల ఎత్తులో జటాయువు పక్షిని నిర్మించడం, పక్షి ఆకారం లోపల మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పవచ్చు.త్రివేండ్రం పద్మనాభుడుఅనంత పద్మనాభ స్వామి ఆలయం అప్పుడప్పుడూ వార్తల్లో కనిపిస్తుంటుంది. తలుపులు తెరుచుకోని ఆరోగది మీదనే అందరి దృష్టి. అంతకంటే గొప్ప ఆసక్తి ఇక్కడి పద్మనాభుడి రూపం. ఈ ఊరికి తిరువనంతపురం అనే పేరు రావడానికి కారణం ఈ ఆలయమే. కేరళ రాజధాని నగరం ఇది. బంగారు గోపురం ఉన్న ఈ ఆలయం టావెన్కోర్ రాజవంశం సంపన్నతకు ప్రతీక.అలెప్పీ హౌస్బోట్హౌస్బోట్లో ప్రయాణం చేయకపోతే కేరళ టూర్ వృథా అనే చెప్పాలి. ఇప్పుడు హౌస్బోట్లు మరింత పెద్దవిగా క్రూయిజ్‌లుగా మారాయి. టూర్ ప్యాకేజ్‌లో డే క్రూయిజ్ ప్యాకేజ్ కూడా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ ప్రయాణంలో కేరళ సంప్రదాయ భోజనంలో రకరకాలను ఆస్వాదించవచ్చు. భోజనాన్ని అరిటాకులో వడ్డించడం మాత్రమే కాదు అరటికాయ చిప్స్, చేపను అరిటాకులో చుట్టి వేయించిన ఫిష్‌ఫ్రై ఇక్కడ ప్రత్యేకం. చికెన్ కర్రీలో కొబ్బరి ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయి. కొబ్బరి నూనె వంటల మీద అపోహ ఉంటుంది. కానీ ఈ వంటలు చాలా రుచిగా ఉంటాయి.షాపింగ్జరీ అంచు హాఫ్‌వైట్ చీర లేదా లంగా–ఓణీ తెచ్చుకోవడం మరువద్దు. ఉడెన్ కార్వింగ్ బాక్సులు, హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అందంగా ఉంటాయి. కొబ్బరి, అరటి నారతో చేసిన టేబుల్ మ్యాట్స్, కోషెలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, వాల్ హ్యాంగింగ్స్ కొనుక్కోవచ్చు. ఇవి తినాలికోకోనట్ హల్వా, అరటికాయ చిప్స్, అరటికాయ బజ్జీ ప్రసిద్ధి. కొబ్బరి బోండాం తప్పకుండా తాగాలి. వేడుకలివిఫిబ్రవరి 14 నిషగంధి డాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఫిబ్రవరి 19 నుంచి 25 వరకు పరియాణమ్ పేట్ పూరమ్, పాలక్కాడ్, భగవతి టెంపుల్, త్రిశూర్ ఆలయంలో ఉత్రాళిక్కవు పూరమ్ వేడుకలు జరుగుతాయి. ప్యాకేజ్‌లిలా...సౌత్ కేరళ 4 రాత్రులు 5 రోజులకు 55 వేలు. 5 రాత్రులు 6 రోజులకు దాదాపుగా అరవై వేలు. ఎంటైర్ కేరళకు ఆఫర్ నడుస్తోంది. పది రాత్రులు 11 రోజులకు 55 వేలు. ఈ ఆఫర్ మార్చి 30 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో కొదుండుళూర్లోని చేరమాన్ జుమా మసీద్, చీయప్పార జలపాతం, వాలర జలపాతం, ఇడుక్కి దేవికులమ్ హిల్స్, కొచ్చిలోని బోల్గట్టీ ఐలాండ్, హౌస్‌బోట్, విలేజ్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ మొదలైనవి కవర్ అవుతాయి. సెంట్రల్ కేరళ ప్యాకేజ్ కి20 వేలు. ఇందులో అళప్పుఱ, పెరియార్ టైగర్ రిజర్వ్, తెక్కడి, మునార్, ఫోర్ట్ కొచ్చి మొదలైనవి ఉంటాయి. --వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం చూతము రారండి) -
పారా గ్లైడింగ్‌లో ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం
పనాజీ: పారాగ్లైడింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. అయితే పారాగ్లైడింగ్ విషయంలో అప్పుడప్పడు ప్రమాదాలు చోటుచేసుకుంటుంటాయి. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కోసారి పర్యాటకులు ప్రమాదాలు బారిన పడుతుంటారు.తాజాగా ఉత్తర గోవాలో పారాగ్లైడింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో పారాగ్లైడింగ్(Paragliding) చేస్తున్న మహిళా పర్యాటకురాలితో పాటు కోచ్ మృతిచెందాడు. ఈ ప్రమాద వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కేరి గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.ఈ దుర్ఘటనలో పూణే నివాసి శివానీ డేబుల్ ఆమె శిక్షకుడు సుమన్ నేపాలీ (26) మృతిచెందారని, డేబుల్ పారాగ్లైడింగ్ కోసం బుకింగ్ చేసుకున్న 'అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ' చట్టవిరుద్ధంగా నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. పారాగ్లైడర్ టేకాఫ్ అయిన వెంటనే అది లోయలో పడిపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఉదంతంలో కంపెనీ యజమాని శేఖర్ రైజాదాపై మాండ్రేమ్ పోలీస్ స్టేషన్(Mandrem Police Station)లో కేసు నమోదైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారుఈ కేసులో కంపెనీతో పాటు దాని యజమానిపై నేరపూరిత హత్య కేసు నమోదు చేసినట్లు గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ తెలిపారు. పోలీసు అధికారి పరేష్ కాలే తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు శేఖర్ రైజాదా ఉద్దేశపూర్వకంగా పైలట్‌కు లైసెన్స్ లేకుండా పారాగ్లైడింగ్ నిర్వహించడానికి అనుమతించాడు. ఫలితంగా పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై చర్యలు చేపట్టారు.ఇది కూడా చదవండి: Uttar Pradesh: ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం -
నిజాయతీకి ఫిదా!
సాక్షి, సిటీబ్యూరో: ఎవరైనా ఏదైనా పర్యాటక ప్రదేశానికి వస్తే చిరు వ్యాపారులు అధిక ధరలు చెబుతారనేది అందరి అభిప్రాయం. మనం వేరే రాష్ట్రాలు లేదా దేశానికి వెళ్లినప్పుడు ఇలాంటి అనుభవం ఒకటి రెండుసార్లు మనకు కూడా బహుశా ఎదురయ్యే ఉంటుంది! అయితే.. మన హైదరాబాద్‌లో కొద్ది రోజులుగా పర్యటిస్తున్న ఓ విదేశీయుడికి భిన్న అనుభవం ఎదురైంది. చారి్మనార్‌ను చూసేందుకు స్కాట్లాండ్కు చెందిన హ్యూ అనే వ్యక్తి వచ్చాడు. అక్కడ కలియదిరుగుతూ నగర ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆభరణాలు, మట్టి గాజుల గురించి ఆరా తీస్తూ వస్తున్నాడు. అప్పుడే ఓ చిరు వ్యాపారి ముత్యాల హారాలను అమ్ముతూ కనిపిస్తే వాటి ధర ఎంతో అడిగాడు. అయితే.. అందరిలా అవి ఒరిజినల్ ముత్యాలంటూ మభ్య పెట్టకుండా ప్లాస్టిక్ ముత్యాలని నిజాయతీగా చెప్పాడు. అలాగే.. లైటర్‌తో కాల్చి ఇవి, ఒరిజినల్ కాదని పేర్కొన్నాడు. పైగా ధర కూడా రూ.150 అనడంతో చాలా నిజాయతీపరుడివి అంటూ కితాబిచ్చాడు. తిరిగి పర్యాటకుడి వివరాలను ఆరా తీశాడు. స్కాట్లాండ్ అని సమాధానం చెప్పాడు. వెంటనే పర్యాటకుడిని ఆ చిరు వ్యాపారి ఫ్రెంచ్‌లో పలకరించాడు. ఓ..ఫ్రెంచ్ కూడా వస్తుందా అని అడిగి షాక్ అయ్యాడు. ఇదంతా వీడియో తీసి తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పైగా హైదరాబాద్ పరువు కాపాడావంటూ నెటిజన్లు అతడిని తెగ పొగిడేస్తున్నారు. -
Year Ender 2024: కుటుంబం మెచ్చిన 10 అందమైన ప్రదేశాలు
2024 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. నూతన సంవత్సరాన్ని స్వాగతించేందుకు అందరం సిద్ధమవుతున్నాం. ఈ నేపధ్యంలో 2024 ఎలా గడిచిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. 2024 భారతదేశంలోని పలు కుటుంబాలకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతులను అందించింది.దేశవ్యాప్తంగా చాలామంది సెలవు రోజుల్లో తమ కుటుంబాలతో సహా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. యువత సాహసభరితమైన ప్రయాణాలు సాగించగా, వయసుపైబడినవారు ప్రశాంత వాతావరణాలకు చేరుకుని సేదతీరారు. అందమైన బీచ్‌లు, అద్భుతమైన పర్వతప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలలో ప్రయాణించేందుకు భారతీయులు మక్కువ చూపారు. వాటిలో 10 ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోవా2024లో టాప్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ టూరిస్ట్ డెస్టినేషన్‌గా గోవా ప్రత్యేక స్థానం దక్కించుకుంది. గోవాలోని అందమైన బీచ్‌లు, చర్చిలు ఉన్నాయి. ఇక్కడి సంస్కృతి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుందిత. కుటుంబ సభ్యులతో సహా ఎంజాయ్చేసేందుకు గోవా అత్యుత్తమ ప్రదేశం. వినోద కార్యక్రమాలను ఆస్వాదించేందుకు, చారిత్రక కోటలను సందర్శించేందుకు, అత్యుత్తమ షాపింగ్‌కు గోవా పెట్టిందిపేరు.కేరళఒకవైపు సహజ సౌందర్యం, మరోవైపు ఘనమైన సంస్కృతికి కేరళ పెట్టిందిపేరు. ఇక్కడి ఆహారం ఆహారప్రియుల నోరూరింపజేస్తుందని చెబుతారు. కుటుంబంతో సహా చూడాల్సిన ప్రాంతాలెన్నో కేరళలో ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ వాటర్స్, తేయాకు తోటలు ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక్కడ జరిగే పండుగలు, ఉత్సవాలు ఉత్సాహాన్ని రెండింతలు చేస్తాయి.కశ్మీర్కశ్మీర్.. ప్రకృతి అందాలకు నెలవు. కుటుంబ సభ్యులతో సహా సందర్శించేందుకు ఉత్తమ ప్రదేశం. గుల్మార్గ్లో స్కీయింగ్, స్నోబోర్డింగ్, బుల్ కార్ రైడ్లను ఆస్వాదించవచ్చు. శ్రీనగర్‌లోని అందమైన లోయలను, సరస్సులను సందర్శించవచ్చు.ముస్సోరీఉత్తరాఖండ్లోని అందమైన హిల్ స్టేషన్ ముస్సోరీ. కుటుంబసభ్యులతో సహా ఆనందంగా విహరించేందుకు అత్యుత్తమ ప్రదేశం ఇది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయవచ్చు. కేబుల్ కార్ రైడ్‌ని ఎంజాయ్ చేయవచ్చు. స్థానిక మార్కెట్లను సందర్శించవచ్చు.సిక్కింభారతదేశంలోని ఈశాన్య ప్రాంతమైన సిక్కిం సహజ సౌందర్యానికి నిలయంగా పేరొందింది. ఇక్కడి పురాతన మఠాలు దేశ ఘన చరిత్రను చాటిచెబుతాయి. ఇక్కడికి కుటుంబంతో సహా వచ్చే పర్యాటకులు వివిధసాహస కార్యకలాపాల్లో పాల్గొని ఆనందించవచ్చు.మనాలి హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ ప్రసిద్ధ హిల్ స్టేషన్ సాహసాలు చేసేవారికి, ప్రకృతిని ఇష్టపడేవారికి అత్యుత్తమ ఎంపిక. ఇక్కడ స్కీయింగ్, స్నోబోర్డింగ్,ట్రెక్కింగ్ మొదలైనవి కుటుంబ సభ్యులకు అమితమైన ఆనందాన్ని అందిస్తాయి. స్థానిక మార్కెట్లు మంచి షాపింగ్ అనుభూతులను అందిస్తాయి. డార్జిలింగ్పశ్చిమ బెంగాల్‌లోని ఈ అందమైన హిల్ స్టేషన్ కుటుంబంతో సహా ఎంజాయ్ చేసేందుకు అనువైన ప్రదేశం. ఇక్కడి టాయ్ ట్రైన్ రైడ్ ఎంతో వినోదాన్నిస్తుంది. ఇక్కడి టీ తోటలు ఎవరినైనా సరే వావ్ అనిపించేలా చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తే ఆ అనుభూతి జీవితాంతం గుర్తుంటుంది.గుల్మార్గ్ కశ్మీర్‌లోని ఈ అందమైన హిల్ స్టేషన్ స్కీయింగ్, స్నోబోర్డింగ్ ఇష్టపడేవారికి ఎంతో అనువైనది. కేబుల్ కార్ రైడ్లు, స్నో గేమ్‌లతో వినోదించవచ్చు. స్నోమెన్లను తయారు చేసి ఆనందించవచ్చు.జైసల్మేర్రాజస్థాన్లోని ఈ అందమైన ఎడారి నగరం.. కుటుంబ సభ్యులంతా కలసి సందర్శించినప్పుడు వారి ఆనందం రెట్టింపవుతుంది. ఒంటె రైడ్, ఎడారి సఫారీ, ఇక్కడి కోటలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ కుటుంబంతో సహా చూడాల్సిన అత్యుత్తు ప్రదేశం. ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇక్కడి వంటకాలు అందరికీ నోరూరేలా చేస్తాయి. స్థానిక స్మారక చిహ్నాలు, మ్యూజియంలు, మార్కెట్లను కుటుంబ సభ్యులంతా కలసి చూసినప్పుడు వారి ఆనందం రెట్టింపవుతుంది. ఢిల్లీలో పలు థీమ్ పార్కులున్నాయి. ఇవి అత్యుత్తమ వినోదాన్ని పంచుతాయి.ఇది కూడా చదవండి: Year Ender 2024: వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. చాటింగ్ స్టైలే మారిపోయిందే.. -
ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!
గోవా విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు వెలుస్తున్నాయి. టాక్సీ మాఫియా, అధిక ధరలే ఇందుకు కారణమని కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. గోవాకు రాకపోకలు సాగిస్తున్న పర్యాటకులకు సంబంధించి పారిశ్రామికవేత్త రామానుజ ముఖర్జీ ఎక్స్‌లో డేటాను షేర్ చేశారు. 2019లో గోవా సందర్శకుల సంఖ్య 85 లక్షల నుంచి 2023లో 15 లక్షలకు తగ్గుముఖం పట్టినట్లు డేటాలో వెల్లడించారు.ముఖర్జీ షేర్ చేసిన డేటాపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మధుర్ స్పందించారు. ‘గోవాలోని బెనౌలిమ్ బీచ్ వద్ద జర్మనీ నుంచి వచ్చిన నా స్నేహితుడిని పికప్ చేసుకోవడానికి వెళ్లాను. వెంటనే దాదాపు పది మందికి పైగా టాక్సీ డ్రైవర్లు నన్ను చుట్టుముట్టారు. విదేశీ పర్యాటకులు స్థానిక టాక్సీలోనే వెళ్లాలని డిమాండ్ చేశారు. తర్వాత నా స్నేహితుడు 37 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.1,800 చెల్లించాల్సి వచ్చింది. గోవాలో టాక్సీ మాఫియా పెరుగుతోంది. గోవా అభివృద్ధికి ఈ మాఫియా ఆటంకంగా నిలుస్తోంది’ అని అన్నారు.Goa’s taxi mafia is responsible for it. 100%I went to pick up a friend (from Germany) from Benaulim Beach and I was accompanied by another friend (a local Goan). A taxi guy (in Benaulim) saw us, he stopped us and in no time there were 10+ taxi drivers ready to beat us up. The… https://t.co/V43IsQXBm9— Madhur (@ThePlacardGuy) November 5, 2024ఇదీ చదవండి: ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్వరుణ్ రావు అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ టాక్సీ, ఆటో మాఫియా గోవాలో పర్యాటకం వృద్ధిని అడ్డుకుంటున్నాయని చెప్పారు. ‘ట్యాక్సీ డ్రైవర్లు స్థానిక ప్రభుత్వానికి ప్రధాన ఓటు బ్యాంకు. కాబట్టి వారి ప్రవర్తన వల్ల వృద్ధి కుంటుపడుతున్నా, పర్యాటకులు ఇబ్బంది పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్య తీసుకునే ధైర్యం చేయరు’ అని అన్నారు. -
దోమకొండ కోటను టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలి..!
చారిత్రక దోమకొండ కోటకు దేశ విదేశాల్లో గుర్తింపు యునెస్కో అవార్డుతో మరింత పెరిగిన ఖ్యాతి కాకతీయ శిల్ప శైలి ఉట్టిపడేలా కోటలో అద్భుత కట్టడాల నిర్మాణం పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికుల విజ్ఞప్తి దోమకొండ: చారిత్రక సంపదకు నిలయంగా ఉన్న దోమకొండ కోటకు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించింది. అద్భుత కాకతీయ శైలి శిల్ప నైపుణ్యం ఉట్టిపడే నిర్మాణాల కారణంగా ఈ గడీ పురాతన కట్టడాలు, వారసత్వ సంపద పరిరక్షణ విభాగంలో ఇటీవల ఐక్య రాజ్యసమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ యునెస్కో అవార్డును అందుకుంది. ఆసియా పసిఫిక్ దేశాలకు యునెస్కో ప్రకటించిన అవార్డుల జాబితాలో హైదరాబాదులోని కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావికి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గడీకి అవార్డు ఆఫ్ మెరిట్ విభాగంలో గుర్తింపు లభించడంతో ఈ కోట, అందులోని శిల్ప సంపద మరోమారు దేశ విదేశాల్లో చర్చనీయాంశంగా మారాయి అపూర్వ శిల్పకళ.. గడీలోని శిల్పకళా సంపద, దాన్ని జాగ్రత్తగా నిర్వహించడమనే అంశాలలో యునెస్కో గుర్తింపుతో దోమకొండ కోట పేరు స్థానిక, జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. ఈ కోటను 400ఏళ్ల క్రితం 60 ఎకరాల విస్తీర్ణంలో పాకనాటి రెడ్డి రాజులైన కామినేని వంశస్థులు నిరి్మంచారు. సరైన నిర్వహణ లేని కారణంగా గడీ ప్రధాన ద్వారం, ఇతర భవనాలు, కొన్ని ఇళ్లు దెబ్బతినడంతో గడీ వారసులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి స్వర్గీయ ఉమాపతిరావు కుమారుడు కామినేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కోట మరమ్మతు పనులు జరిగాయి. గతంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన సినీహీరో చిరంజీవి కోట అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇకాకతీయ శిల్పకళా శైలిలో ఈ పురాతన కట్టడాలు ప్రసిద్ధి చెందాయి. కోటకు తూర్పు ద్వారం, పడమర ప్రధాన ద్వారాలను 200 ఫీట్లు ఎత్తులో నిరి్మంచారు. 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన గడీకోట చుట్టూ 50 ఫీట్ల వెడల్పు, పది ఫీట్ల లోతుతో నిర్మించిన కందకం ఇప్పటికీ చూపరులను ఆకర్షిస్తుంది. కామినేని అనిల్ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు... దోమకొండ సంస్థానా«దీశుల పాలనలో నిరి్మంచిన వెంకటపతి భవన్లో శిల్పకళా నైపుణ్యం, రాజసం ఉట్టిపడతాయి. అలాగే వీరి పాలనలోనే మహాదేవుని ఆలయ పునర్మిర్మాణం జరిగింది. అప్పట్లో మహాదేవుని ఆలయానికి కాకతీయ రాణి రుద్రమదేవి వచ్చినట్లు శిలా ఫలకం వెల్లడిస్తుంది. దోమకొండ కోటను సంస్థాన వారసుడు కామినేని అనిల్ పునరుద్ధరించారు. అనిల్ కుమార్తై ఉపాసన, మెగాస్టార్ చిరంజీవి తనయుడు, సినీహీరో రామ్‌చరణ్ వివాహ వేడుకలు దోమకొండ కోటలోనే జరిగిన విషయం తెలిసిందే. యునెస్కో గుర్తింపుతో.. కామినేని వంశస్థులుదోమకొండ సంస్థానాన్ని 400 ఏళ్లకు పైగా పరిపాలించారు. 1760లో మొదటి పాలకుడుగా రాజన్న చౌదరిగా చరిత్ర పేర్కొంటోంది. ఆనాటి నుంచి జమిందారీ వ్యవస్థ రద్దు వరకు కామినేని వంశస్థులు దోమకొండ కేంద్రంగా పరిపాలన కొనసాగించారని ఆధారాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలు వీరి పాలనలో కొనసాగాయని శిలాశాసనాలు చెబుతున్నాయి. చివరగా స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ విలీనమైనప్పుడు ఈ కోట రాజా సోమేశ్వర్ రావు పాలనలో ఉందని చెబుతారు. వీరి కాలంలోనే భిక్కనూరు సిద్దరామేశ్వరం, తాడ్వాయి భీమేశ్వరం, కామారెడ్డి వేణుగోపాలస్వామి, రామారెడ్డి కాలభైరవ స్వామి, లింగంపేట మెట్ల బావి వంటి ప్రసిద్ధ కట్టడాలు నిరి్మంచినట్లు తెలుస్తోంది. వీరి వారసుల పేర్లతో నేటికి కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట జిల్లాలలో అనేక గ్రామాల పేర్లు ఉండటం విశేషం. రాజధాని నుంచి 100 కి.మీ దూరంలో.. ఈ కోట కామారెడ్డి జిల్లాలోని దోమకొండ జిల్లా కేంద్రానికి 20 కి.మీ దూరంలో...రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌కు కేవలం 100 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో కోటను పర్యాటక కేంద్రంగా మారిస్తే స్థానికులకు ఉపాధి లభించే అవకాశముంటుందని గతంలో గ్రామ ప్రజా ప్రతినిధులు కోట వారసులైన కామినేని అనిల్‌కుమార్‌ను కలిసి వివరించారు. దీంతో ఆయన గడీ కోసం ఓ ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసి దీని ద్వారా గ్రామంలో పలు అభివృద్ది పనులు, స్వచ్చంద సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. కాగా కోటను పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే గ్రామానికి చెందిన యువతకు స్వయం ఉపాధి లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దోమకొండ కోటను టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలి -
విదేశీయుల విడిది 'భారత్'
సాక్షి, అమరావతి: స్వదేశంలో ఉన్న వారు విదేశాలకు వెళ్లి సేద తీరాలనుకుంటుంటే... విదేశీయులు మాత్రం భారత్‌వైపే చూస్తున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో 47.78 లక్షలమంది విదేశీయులు భారత్‌ను సందర్శించారు. దీంతో విదేశీయులకు భారత్ విశ్రాంతి, వినోద కేంద్రంగా మారుతోంది. అమెరికా నుంచి 17.56శాతం, యూకే నుంచి 9.82శాతం, కెనడా 4.5శాతం, ఆ్రస్టేలియా 4.32శాతం మంది వచ్చారు. ఫారిన్ టూరిస్టు ఎరైవల్ (ఎఫ్‌టీఏ) ఒక్క జూన్‌లోనే 7.06లక్షలు ఉండటం విశేషం.ఇది 2023లో 6.48లక్షలు, 2019లో 7.26లక్షలుగా నమోదైంది. అయితే ఇది 2023 జూన్ ఎఫ్‌టీఏలతో పోలిస్తే 9శాతం వృద్ధిని సాధించగా 2019తో పోలిస్తే 2శాతం క్షీణించింది. భారత్‌కు వచ్చిన విదేశీయుల్లో ఎక్కువ (46శాతం) మంది సరదాగా కుటుంబాలతో సహా గడిపి వెళ్లారు. ఇక 18శాతం మంది వ్యాపార, వైద్య సేవల కోసం భారత్‌ను సందర్శిస్తున్నారు. వెల్నెస్ రిట్రీట్లు, అడ్వెంచర్ ట్రిప్‌లకు క్రేజ్ పెరుగుతోంది. ఢిల్లీ నుంచే దేశంలోకి విదేశీ పర్యాటకుల టాప్ ప్రవేశ స్థానంగా 31.45శాతంతో ఢిల్లీ నిలుస్తోంది. ఆ తర్వాత ఆర్థిక రాజధాని ముంబై (14.83శాతం), హరిదాస్పూర్ (9.39శాతం), చెన్నై (8.35శాతం), బెంగళూరు (6.45శాతం) ఉన్నాయి. అనిశ్చితిని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా 21.55శాతం మంది భారత్‌కు వచ్చారు. అయితే వీరందరూ పర్యాటకులని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. దశాబ్ద కాలంగా హరిదాస్పూర్ నుంచే వీరందరూ భారత్‌లోకి వస్తున్నారు. ఈ క్రమంలో ఫారెక్స్ ఆదాయం గతేడాదితో పోలిస్తే 17.62శాతం ఎక్కువగా ఉంది. అదే 2023లో ఆసియా పసిఫిక్ దేశాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా 90లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌లోకి వచ్చారు. భారతీయ ఇన్»ౌండ్ పర్యాటక మార్కెట్‌కు ఆ్రస్టేలియా, మలేసియా, సింగపూర్, జపాన్, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా ప్రధానంగా నిలుస్తున్నాయి. 2023లో ఈ ఆరు దేశాల నుంచే ఏకంగా 10.22లక్షల మందిపైగా విదేశీయులు వచ్చారు. 1.50 కోట్ల మంది విదేశాలకు కోవిడ్ మహమ్మారి విజృంభించిన తర్వాత విదేశాల్లో పర్యటిస్తున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్యలో 1.50 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో పర్యటించారు. గతేడాది ఇదే సమయానికి 1.32లక్షల మంది విదేశాలకు వెళ్లారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ఎక్కువ మంది విదేశీ యాత్రలు చేస్తున్నారు. గడిచిన ఆరు నెలల్లో యూకే, సౌదీ, యూఎస్, థాయ్‌లాండ్, సింగపూర్ భారతీయుల అగ్రగామి ఎంపికలుగా నిలిచాయి. -
‘చెక్క బెంచీలపై ప్రయాణం ఎన్నటికీ మరువలేం’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 1873 నుంచి అంటే గత 150 ఏళ్లుగా నడుస్తున్న ట్రామ్ సేవలకు త్వరలో స్వస్తి చెప్పనున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సవాళ్ల పరిష్కారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అయితే కేవలం ఒక ట్రామ్ సర్వీసును కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోల్‌కతాలో చారిత్రాత్మక రవాణా సర్వీసులను నిలిపివేయడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్సులలో తాము సాగించిన ప్రయాణాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ట్రామ్ బస్సుల శకం ముగిసిందని, అయితే ప్రయాణికులు ఎప్పటికీ చెక్క బెంచీలపై కూర్చుని ప్రయాణించడాన్ని మరచిపోరని పలువురు అంటున్నారు.తెలుపు, నీలి రంగుల ట్రామ్‌లు బెంగాలీల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. కోల్‌కతా నగరాన్నికున్న గుర్తింపులో ట్రామ్ బస్సులకు ప్రత్యేక స్థానం ఉంది. సోషల్ మీడియాలో ఒక యూజర్ భావోద్వేగానికి గురవుతూ ‘ఒక శకం ముగిసింది. కోల్‌కతాలో 150 ఏళ్ల ట్రామ్ వారసత్వం ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక అధ్యాయం ముగింపుతో, చరిత్రలోని ఒక ఘనమైన అధ్యాయానికి వీడ్కోలు పలుకుతున్నాం. రాబోయే తరాలు ట్రామ్‌ల గురించి ఫోటోలు, వీడియోలను చూసి మాత్రమే తెలుసుకోగలుగుతాయి’ అని రాశారు. మరొక యూజర్ ‘కోల్‌కతాలో 150 ఏళ్ల వారసత్వ రవాణా వ్యవస్థ ట్రామ్ బంద్ అవుతోంది. కోల్‌కతా వీధుల్లో దీనిని మిస్ అవుతున్నాం’ అని రాశారు. ఇంకొక యూజర్ ‘కోల్‌కతాలోని పురాతన ట్రామ్ వ్యవస్థను నిలిపివేస్తున్నందుకు అభినందనలు. దానిని ఆధునీకరించడానికి బదులుగా, నిలిపివేస్తున్నారు. చరిత్రను చెరిపివేయగలిగినప్పుడు, దానిని ఇంకా ఎందుకు భద్రపరచాలి?" అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు పర్యావరణ అనుకూల రవాణా అవసరమా?’ అంటూ ఆవేదనతో ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఒక పోలీసు వీరమరణం -
ఉత్తమ పర్యాటక గ్రామంగా రాజస్థాన్ గ్రామం! అక్కడ మద్యం, మాంసం ముట్టరట!
రాజస్థాన్‌లోని బీవర్ జిల్లాలోని దేవమాలి గ్రామం భారతదేశంలోని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యింది. నవంబర్ 27న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుని ప్రదానం చేయనుంది. భారతదేశంలోని రాష్ట్రాలలో ఎన్నో గొప్ప విశిష్టత గల గ్రామలున్నాయి. వాటన్నింటిని వెనక్కినెట్టి రాజస్థాన్‌లోని ఈ గ్రామమే ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎలా ఎంపికయ్యిందో వింటే ఆశ్చర్యపోతారు. ఈ గ్రామానికి ఉన్న స్పెషాలిటీ తెలిస్తే.. ఈ రోజుల్లో కూడా ఇలా నియబద్ధంగా ఎవరు ఉంటున్నారు అని ఆశ్చర్యపోతారు. రాజస్తాన్‌లోని బీవర్ జిల్లాలోని దేవమాలి గ్రామం పేరుకి తగ్గట్టుగానే చక్కటి జీవనశైలితో దేదీప్యమానంగా ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలెవ్వరూ కూడా మాంసం, చేపలు, మద్యం ముట్టరట. ఇలా అందరూ నియమబద్ధంగా ఉండటం అంత ఈజీ కాదు గదా..!. అలాగే అక్కడ వేప కలపను ఎవ్వరూ కాల్చడం వంటివి చేయరట. అంతేగాదు కిరోసిన్ ఉపయోగించడం కూడా నిషిద్ధం. ఆ గ్రామంలో దేవ్‌నారాయణ్ ఆలయం ప్రసిద్ధ ఆలయంగా పూజలందుకుంటోంది. ప్రతి ఏడాది లక్షలాదిమంది పర్యాటకులు సందర్శించడానికి వస్తుంటారట. మసుదా ఉపవిభాగంలోని ఆరావళి కొండల మధ్య ఉన్న ఈ గ్రామం సుమారు మూడు వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ సిమ్మెంట్, కలపతో చేసిన పక్కా ఇళ్లు కూడా ఉండవు. అన్ని మట్టితో చేసిన ఇళ్లే ఉంటాయి. అయితే కొండపై వెలసిన దేవనారాయణుని అందమైన ఆలయం ఈ గ్రామానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇక ఈ ఉత్తమ పర్యాటక గ్రామ పోటీని పర్యాట మంత్రిత్వ శాఖ నిర్వహించింది. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూ గొప్ప సంస్కృతిని కొనసాగిస్తున్న గ్రామాలను గుర్తించి మరీ ఆ గ్రామాన్ని ఎంపిక చేశారు.. ముఖ్యంగా సమతుల్య జీవన విధానం, పర్యావరణం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఉత్తమ పర్యాట గ్రామలను ఎంపిక చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాటన్నింటి ఆధారంగానే 'దేవమాలి గ్రామం' ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యిందని మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ జనరల్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "రాజస్థాన్ గర్వించదగ్గ ఘట్టం!. ఈ గ్రామం సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది." అని సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు. అలాగే కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ దేవమాలి గ్రామాన్ని అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయడం అనేది రాజస్థాన్‌కి ఎంతో గర్వకారణం అన్నారు. (చదవండి: అసామాన్య వనిత 'అంబికా పిళ్లై'!..ఓ పక్క కేన్సర్‌తో పోరాటం మరోవైపు..!) -
ఇది కదా అద్భుతమంటే.. ‘సండూరు’ అందాలు వర్ణించగలమా.. (ఫొటోలు)
-
ఆకట్టుకుంటున్న ఎత్తిపోతల జలపాతం..చూసేందుకు పర్యాటకులు క్యూ (ఫొటోలు)
-
విదేశాలకు వెళ్తున్నారా..? ప్రయాణబీమా తీసుకున్నారా..?
విహార యాత్రల కోసం విదేశాలకు వెళుతున్నారా..? ఎన్ని రోజులు వెళ్లాలి.. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా..? మరి, వెళ్లినచోట ఏదైనా అనారోగ్య పరిస్థితి ఎదురైతే..వెంటతీసుకెళ్లిన సామాగ్రి పోగొట్టుకుంటే.. కంగారు పడకండి.. అలాంటి వారికోసమే చాలా కంపెనీలు ప్రయాణబీమా అందిస్తున్నాయి. అందుకు సంబంధించిన ప్రీమియం చెల్లించి విదేశీ ప్రయాణాన్ని మరింత ధీమాగా పూర్తి చేయవచ్చు. అయితే ఈ ప్రయాణ బీమాకు సంబంధించిన కొన్ని అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.విహారయాత్రలు, ఇతర పనుల నిమిత్తం కొంతకాలంపాటు విదేశాలకు వెళ్లేవారు ప్రయాణానికి సంబంధించి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఊహించని ఖర్చులు ఎదురైతే మొత్తం ప్రయాణంపై ప్రభావం పడుతుంది. అందుకోసం వారు సిద్ధంగా ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లోనే ప్రయాణ బీమా భరోసానిస్తుంది. ఇందుకు సంబంధించి కంపెనీలు ఎలాంటి పాలసీలను అందిస్తున్నాయో తెలుసుకుందాం.ఆరోగ్య అవసరాల కోసం..నిత్యం మనదేశం నుంచి వేలసంఖ్యలో విద్యార్థులు, పర్యటకులు, వ్యాపారవేత్తలు విదేశాలకు వెళ్తుంటారు. వారికి ఎప్పుడైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి రావొచ్చు. అలాంటి వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రయాణ బీమా పాలసీలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల చికిత్సలు కవర్ అయ్యేలా ఉండే బీమా పాలసీను ఎంచుకోవాలి. ఎలాంటి షరతులూ, నిబంధనలు లేకుండా పూర్తి వైద్య ఖర్చులను చెల్లించే పాలసీను తీసుకువాలి.ఒకటికి మించి దేశాలకు ఒకే పాలసీ..ఒకసారి బీమా తీసుకుంటే చాలా ప్రయాణాలకు ఉపయోగపడే పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి ముఖ్యంగా వ్యాపారవేత్తలకు సరిపోతాయి. ఒకటికి మించి దేశాలకు ప్రయాణించే వారు ఆయా దేశాలన్నింటిలోనూ వర్తించేలా ఒకే పాలసీని తీసుకోవచ్చు. అమెరికాలో ఏడు రోజులపాటు పర్యటించాలనుకుంటే బీమా ప్రీమియం కంపెనీను అనుసరించి దాదాపు రూ.700-రూ.800 వరకూ ఉంటుంది.సామగ్రి అందకపోయినా..ఒకటి కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించేవారు నిత్యం సామగ్రి వెంట తీసుకెళ్లాలంటే కష్టం. కాబట్టి ఇతరదేశంలోని చిరునామాలో తమ సామగ్రి చేరేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక్కోసారి ఆ సామగ్రి చేరడం ఆలస్యం అవుతుంది. దాంతో వారు ఇబ్బందులు పడకుండా బీమా సంస్థ పరిహారం ఇచ్చేలా పాలసీలున్నాయి. మొదటిసారి విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు సామగ్రి అందకపోతే ఆర్థికంగా ఎంతో నష్టపోతారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణ బీమా వారికి పరిహారం అందిస్తుంది.ఈ ప్రయాణ బీమా పాలసీలను ఆన్లైన్ ఫ్లాట్‌ఫాంల ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. బీమా సంస్థ వెబ్సైట్లోకి వెళ్లి, కావాల్సిన విధంగా పాలసీని ఎంచుకోవచ్చు. ప్రయాణ వ్యవధి, ఎంత మొత్తానికి బీమా కావాలి, ప్రయాణం రద్దు, ఆరోగ్య అవసరాల్లాంటివన్నీ పాలసీలో ఉండేలా చూసుకోవాలి. బీమా కంపెనీలు ఆయా ప్రాంతాల్లోని కొన్ని ఆసుపత్రులతో ఒప్పందం చేసుకొని ఉంటాయి. ఆ జాబితాను ఒకసారి పరిశీలించాలి.ఇదీ చదవండి: మొబైల్లో ఆర్డర్‌చేసి కిచెన్‌లోకి వెళితే వంట రెడీ!పాలసీ తీసుకునేపుడు గుర్తుంచుకోవాల్సినవి..పాలసీ తీసుకునేటప్పుడు మీ పర్యటన జరిగే అన్ని రోజులకు వర్తించేలా చూసుకోవాలి. పాలసీలోని మినహాయింపులు, పరిమితులు ముందే తెలుసుకోవాలి. ముందస్తు వ్యాధుల చికిత్సకు వర్తిస్తుందా లేదా చూసుకోవాలి. కొన్ని ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రత్యేక అవసరాలు ఉండొచ్చు. వాటికీ పాలసీ వర్తించేలా చూసుకోవాలి. ఏ క్షణమైనా మీకు సేవలను అందించేలా సహాయ కేంద్రాలు పనిచేస్తున్నాయా.? మీరు వెళ్లే ప్రాంతాల్లో ఎన్ని ఆసుపత్రులతో ఒప్పందాలున్నాయి అనే విషయాన్ని పరిశీలించాలి. -
ఖైదీలా కాకుండా టూరిస్ట్‌గా సందర్శించే జైళ్లు ఇవే!
ఎన్నో పర్యాటక ప్రదేశాలు చూసుంటారు. కానీ పర్యాటక ప్రదేశాల్ల ఉన్న జైళ్ల గురించి విన్నారా?. ఔను మీరు వింటుంది నిజమే ఈ జైలుకి ఖైదీలుగా వెళ్లాల్సిన పనిలేదు. సరదాగా ఓ టూరిస్టులా వెళ్లి ఎంజాయ్ చేసి రావొచ్చు. ఇదేంటీ జైళ్లకు పర్యాటుకుల్లా వెళ్లాడమా అని అనుమానంతో ఉండకండి. ఎందుకంటే వీటిని చూస్తే మన దేశ చరిత్రకు సంబంధించిన ఆసక్తికర కథలు, స్వాతంత్య్రంతో ముడిపడి ఉన్న అనేక గొప్ప కథలు తెలుసుకుంటారు. ఆ జైళ్లను చూడగానే అలనాడు దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన నాటి త్యాగధనులు కళ్లముందు మెదులుతారు. మనకవి జైళ్లలా కాదు పవిత్రమైన ప్రదేశాల్లా అనిపిస్తాయి. అవేంటో చూద్దామా!. సెల్యులార్ జైలు, పోర్ట్ బ్లెయిర్ ఈ జైలు చూస్తే కాలాపని మూవీ గుర్తుకొచ్చేస్తుంది ఎందుకంటే ఇది నాటి స్వాతంత్య్ర సమరయోధుల బతుకేశ్వర్ దత్, వీర్ సావర్కర్ ధైర్యసాహసాలు గురించ కథలుగా తెలుసుకోవాచచు. అంతేకాదండోయ్ ఇది కాలాపని పేరుతోనే ప్రసిద్ధి చెందింది. పర్యాటకుల కోసం రోజు ఈ జైలు తెరిచి ఉంటుంది. పైగా వారికోసం లైట్, మ్యూజిక్ షోలు నిర్వహిస్తారు. ఇక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శనవేళలు ఉంటాయి. ఎరవాడ జైలు, పూణే, మహారాష్ట్ర ఎరవాడ, దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలు. భారతదేశ చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, బాల్ గంగాధర్ తిలక్‌లతో సహా చాలా మంది స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం చేసిన పోరాటంలో ఈ జైల్లోనే బంధిలయ్యారు. ఇందలో గాంధీ, తిలక్ పేరుతో ఉరి గది కూడా ఉంది. దీన్ని 1831లో బ్రిటిష్ పాలకులు నిర్మించారు. తీహార్ జైలు, ఢిల్లీ భారతదేశంలోనే అతి పెద్ద జైలు తీహార్ అని చెబుతారు. ఈ జైలులో నివసిస్తున్న ఖైదీలు కూడా తీహార్ బ్రాండ్ పేరుతో పలు ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తుంటారు. కుట్టుపని, అల్లిక, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్‌తో సహా అనేక రకాల పనులు చేస్తున్న ఖైదీలను పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఖైదీలను బిజీగా ఉంచడానికి వారి జీవితాలను మెరుగుపరచడానికి ఈ పనులను చేయిస్తారు. సంగారెడ్డి జైలు, హైదరాబాద్ హైదరాబాద్‌లో 220 ఏళ్ల నాటి ఈ జైలు ఇప్పుడు మ్యూజియంగా మార్చబడింది. ఈ జైలును 1976లో నిర్మించారు. ఇప్పుడు ఇది పర్యాటకుల కోసం మ్యూజియంగా మారింది. జీవితంలో జైలు పాలయ్యే గండం ఉన్నవాళ్లు అదిపోగొట్టుకునేందుకు ఇక్కడకు వచ్చి ఒక రోజంతా ఉండి వెళ్తారట. అంతేగాదు ఇక్కడ ‘ఫీల్ ది జైల్’ పథకం కింద జైలులో ఒక రోజంతా గడిపి రావొచ్చట. వైపర్ ఐలాండ్, అండమాన్ ఇది సెల్యులార్ జైలులాగా ప్రాచుర్యం పొందలేదు. ఇది భారతదేశ ప్రాచీన చరిత్రతో ముడిపడి ఉన్న అనేక కథలను కలిగి ఉంది. ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు పెంచితే వారిని శిక్షించడం కోసం ఇక్కడకి తరలిచేవారట. ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచడం జరగుతుంది. కానీ ఇది అంత ఫేమస్ కాలేదు. బహుశా భయానక శిక్షలు విధించడమే అందుక కారణమై ఉండొచ్చు. (చదవండి: మహారాజ్ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!) -
ఆ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్‌కి టూరిస్ట్ ఫిదా!
విదేశీ టూరిస్టలు మన దేశంలోని చారిత్రక ప్రదేశాలకు వచ్చినప్పుడూ ఇబ్బంది పడుతుంటారు. మనతో కమ్యూనికేషన్ చేయలేక నానాపాట్లు పడుతుంటారు వాళ్లు. అందులోనూ మన దేశంలో చాలామందికి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోవడం లేదా వాళ్లు చెప్పింది అర్థం చేసుకోలేక ఇబ్బంది పడతుండటం జరుగుతుంది. కానీ ఈ ఆటో డ్రైవర్ మాత్రం అర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడి యూకే టూరిస్ట్‌ని ఆకట్టుకున్నాడు. అతడు ఇంగ్లీష్ మాట్లాడుతున్న తీరుకి ఇంప్రెస్ అయ్యి అతడితో జరిగిన సంభాషణను వివరిస్తూ.. అందుకు సంబధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవ్వుతోంది. బ్రిటిష్ వాగ్లర్ జాకీ ఇటీవల కేరళ పర్యటనలో ఉన్నప్పుడూ జరిగింది ఈ ఘటన. అతను అక్కడ ఓ హోటల్లో స్టే చేశాడు. అయితే ఆ హోటల్ని ఖాళీ చేద్దామంటే.. సడెన్‌గా ఏటీఎం వర్క్ చేయడం మానేసింది. దీంతో ఫోర్ట్ కొచ్చికి వెళ్లే ప్రధాన రహదారి గుండా ఏటీఎం సెంటర్ ఎక్కడుందా? అని సర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ ఆష్రఫ్ ఏంటీ సార్ అంటూ ఆంగ్లంలో ఆ టూరిస్ట్‌ని పలకరించాడు. మొహమాటంగా టూరిస్ట్ పొడిపొడిగా సమాధానం ఇచ్చి వెళ్లేందుకు యత్నిస్తుంటే..ఎక్కడికైనా వెళ్తారా? ఆటో కావాలా అంటూ ఫ్రెండ్లీగా అర్థవంతమైన ఆంగ్లంలో మాట్లాడుతుండటంతో.. ధైర్యంగా టూరిస్ట్ తన సమస్య వివరిస్తాడు. దాని గురించి తెలియజేయడమే కాకుండా ఆటోలో రావాల్సిందిగా కోరతాడు డ్రైవర్. అందుకు టూరిస్ట్ నిరాకరిస్తాడు. అయితే ఏటీఎం కోసం కాంప్లిమెంటరీ రైడ్ చేయమంటూ తన ఆటోలోకి ఆహ్వానిస్తాడు. ఆ ఆటోడ్రైవర్ మర్యాదపూర్వకమైన తీరుని చూసి టూరిస్ట్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాతా ఆ టూరిస్ట్‌ని ఏటీఎం సెంటర్ వద్ద డ్రాప్ చేసి వెళ్లిపోతాడు ఆటో డ్రైవర్. చక్కగా మంచి ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడడాని ఆ ఆటో డ్రైవర్ని మెచ్చుకుంటూ అతనితో జరిగిన సంభాషణ గురించి పోస్ట్‌లో రాసుకొచ్చాడు ఆ యూకే టూరిస్ట్. గతంలో ఇలా పర్యాటనకు వెళ్లినప్పుడూ పలు భాషా సమస్యలు ఎదుర్కొన్నాని ఆ పోస్ట్‌లో తెలిపాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనికి మిలియన్లలో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by Zakky (@zakkyzuu) (చదవండి: 1200 ఏళ్ల నాటి పురాతన సమాధి..అందులో ఏకంగా కోట్లు..!) -
విషాదం: పారాగ్లైడింగ్ చేస్తూ హైదరాబాద్ టూరిస్టు మృతి
తెలంగాణకు చెందిన ఓ టూరిస్టు పారాగ్లైడింగ్ చేస్తూ దుర్మరణం చెందారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి కారణమైన పారాగ్లైడింగ్ పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన నవ్య(26)..మనాలి సమీపంలోని దోభీ గ్రామంలో పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందారు. టెన్డం ఫ్లైట్‌లో టేకాఫ్ అయిన నిమిషాలకే ఈ దుర్ఘటన జరిగింది. మానవ తప్పిందంగానే ప్రమాదం జరిగినట్లు పర్యాటకశాఖ అధికారులు పేర్కొన్నారు. పర్యాటకురాలి సేఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకుండానే అనుమంతించడంతో ప్రమాదం జరిగినట్లు తేలడంతో.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారాగ్లైడింగ్ పైలట్‌ను పోలీసులు అరెస్ఠ్ చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. టూరిజం అధికారిణి సునైనా శర్మ మాట్లాడుతూ.. మానవ తప్పిదమే ఈ దురదృష్టకర సంఘటనకు దారితీసి ఉండొచ్చని తెలిపారు. పారాగ్లైడింగ్ చేసిన ప్రదేశం, ఎక్విప్మెంట్కు అనుమతి ఉందని, పైలట్‌కు రిజిస్ట్రేషన్ ఉందన్నారు. వాతావరణ సమస్యలు సైతం లేవన్నారు. ఈ ప్రమాదంతో ప్రస్తుతం దోభీ పారాగ్లైడింగ్‌ను తాత్కాలికంగా నిషేధించినట్లుట్లు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 336, 334 కింద పైలట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారిణి చెప్పారు. మృతిచెందిన టూరిస్టు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: Hyderabad:చాక్లెట్ ప్రియులకు అలర్ట్.. డైరీ మిల్క్‌లో పురుగు.. -
‘నాతో సెల్ఫీ మాములుగా ఉండదు’.. గజరాజు దెబ్బకు టూరిస్టుల పరుగో పరుగు
బెంగళూరు: గజరాజుతో ఫోటో దిగుదామని ఆశించిన ఇద్దరు టూరిస్టులకు ఊహించని అనుభవం ఎదురైంది. ఏనుగు వారిని వెంబడించడంతో భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. చివరికిఏనుగు బారి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజనగర్‌లో ముత్తుంగ అడవిలో జరిగింది, కర్ణాటకు చెందిన కొందరు పర్యాటకులు బందీపూర్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ మీదుగా కేరళ వెళ్తున్నారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా ముత్తుంగ సమీపంలో దారి మార్గంలో వారికి ఏనుగు కనిపించింది. దీంతో ఏనుగును సెల్ఫీ తీయాలనుకున్నారు. కారు దిగి బయటకు వచ్చి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా.. గమనించిన ఏనుగు వారి వైపు వేగంగా దూసుకువచ్చింది. ఇద్దరు వ్యక్తులను వెంబడించింది. ఈ ఘటనలో తీవ్ర భయాందోళనకు గురైన టూరిస్టులు.. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కిందపడిపోయాడు. అతన్ని కాలితో తన్నిన ఏనుగు.. వెనక్కి తిరిగి తన దారిన తాను వెళ్లిపోయింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2 tourists were confronted by an elephant While traveling from #Karnataka to #Kerala through #Bandipur National Park & Tiger Reserve. #Elephant became aggressive when the tourists attempted to take a #selfie, chased them but fortunately, both managed to narrowly escape unharmed. pic.twitter.com/1uIzW7ITiY — Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) February 1, 2024 -
‘బ్రాండ్ యూపీ’కి 28 దేశాల్లో ప్రచారం
ఉత్తరప్రదేశ్‌ను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉన్న యోగి ప్రభుత్వం.. తాజాగా ‘బ్రాండ్ యూపీ’కి 28 దేశాల్లో ప్రచారం కల్పించే దిశగానూ ప్రణాళిక సిద్దం చేసింది. యూపీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. 28 దేశాల్లోని 50 నగరాల్లో యూపీలోని పర్యాటక ప్రాంతాలకు ప్రచారం కల్పించనున్నారు. ఇందుకోసం ఆయా నగరాల్లో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు, ట్రావెల్ ఫెయిర్లు, రోడ్ షోలను నిర్వహించనున్నారు. జపాన్, ఇజ్రాయెల్, చైనా, అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇజ్రాయెల్, రష్యా , యుఎఈలలో బ్రాండ్ యూపీకి ప్రచారం కల్పించనున్నారు. అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభించిన దరిమిలా ప్రతి సంవత్సరం కనీసం ఐదు కోట్ల మంది పర్యాటకులు నగరానికి వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఈ సంఖ్య స్వర్ణ దేవాలయం, తిరుపతి ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. అయోధ్యలో ప్రారంభమైన విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వే స్టేషన్, మెరుగైన రహదారులు మొదలైనవన్నీ పర్యాటకులకు మరింత సౌకర్యాన్ని అందించనున్నాయి. -
అయోధ్యకు పెరిగిన ఖ్యాతి.. ఏడాది చివరికి !
-
China: చైనాను వణికిస్తున్న మంచు తుఫాన్లు
బీజింగ్ : వాయువ్య చైనాను వరుస మంచు తుఫాన్లు బెంబేలెత్తిస్తున్నాయి. డజన్ల కొద్దీ వస్తున్న మంచు తుఫాన్ల ప్రభావంతో ఈ ప్రాంతంలో తీవ్రంగా మంచు కురుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో వారం రోజుల్లో 1000 మంది దాకా మంచులో చిక్కుకుపోయారు. మంచు తుఫాన్ల దాటికి జింజ్యాంగ్ ప్రాంతంలో పలు రోడ్లు బ్లాక్ అవడంతో ఇక్కడున్న పలు గ్రామాల వారికి కనెక్టివిటీ లేకుండా పోయింది. దీంతో ఇక్కడి వారికి ఆహారం, ఇంధనం తదితర నిత్యావసరాలను హెలికాప్టర్లో సరఫరా చేస్తున్నారు. మంచులో చిక్కుకున్న వారిని కూడా హెలికాప్టర్ల సాయంతో తరలిస్తున్నారు. ఈ విషయాలను చైనా అధికారిక టీవీ సీసీటీవీ ప్రసారం చేసింది. చిక్కుకుపోయిన వారిలో కొందరు పర్యాటకులు కూడా ఉన్నారు. మంచు తుఫాన్ల దాటికి వాయువ్య చైనాలో మొత్తం 350 కిలోమీటర్ల దాకా రోడ్లుబ్లాక్ అయ్యాయి. ఇదీచదవండి.. సౌత్ కొరియా ఆక్రమణే లక్ష్యం: కిమ్ -
Dua Lipa: ప్చ్... ఒక్కరూ గుర్తుపట్టలేదు!
సినిమా లేదా టీవీలో నటించే చిన్న ఆర్టిస్ట్ కనిపించినా జనాలు చుట్టుముట్టి ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటారు. అలాంటిది ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న ఆర్టిస్ట్ కనిపిస్తే? ‘జనాలను అదుపు చేయడం కష్టం’ అనుకుంటాం గానీ పాప్ సెన్సేషన్ దువా లిపా విషయంలో మాత్రం అలా జరగలేదు. సాధారణ పర్యాటకురాలిగా దువా ఇటీవల రాజస్థాన్‌కు వచ్చింది. సాదాసీదాగా రోడ్లమీద నడుచుకుంటూ వెళుతున్న దువా లిపాను ఒక్కరు కూడా గుర్తు పట్టలేదు. తాను రాజస్థాన్‌లో ఉన్నప్పటి ఫొటోలను ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తే వైరల్ అయ్యాయి. ‘ఎంత మిస్ అయ్యాను. విషయం ముందే తెలిస్తే రెక్కలు కట్టుకొని అక్కడ వాలేవాళ్లం’ అంటూ అభిమానులు భారీగా స్పందించారు. గ్రామీ అవార్డ్–విన్నింగ్ ఆర్టిస్ట్, గ్లోబల్ స్టార్ స్టేటస్ ఉన్న దువా లిపా మాత్రం తనను ఎవరూ గుర్తించకపోవడాన్ని పెద్ద విషయం అనుకోవడం లేదు. -
లాల్‌చౌక్‌లో మిన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు!
శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో తొలిసారిగా నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అర్థరాత్రి వరకు కొనసాగిన ఈ వేడుకల్లో పాల్గొన్న యువత అత్యంత ఉత్సాహంగా 2024కు స్వాగతం పలికారు. నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి కశ్మీర్ యువత లాల్‌చౌక్ వద్దకు చేరుకుని ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. స్థానికులతో పాటు పర్యాటకులు కూడా అధికసంఖ్యలో లాల్‌చౌక్ వద్దకు తరలివచ్చారు. ఇక్కడ నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ముందుగానే పలు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఉత్తర కాశ్మీర్లో ఎప్పుడూ మంచుతో నిండిపోయే గుల్మార్గ్ శీతాకాలపు ఎండలో మెరిసిపోయింది. నూతన సంవత్సర వేడుకలు ఆదివారం ఉదయం నుంచే ఘనంగా ప్రారంభమయ్యాయి. గుల్మార్గ్లో రోజంతా సందడి నెలకొంది. వివిధ సంగీత, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటకులు ఆనందంగా నృత్యాలు చేస్తూ కనిపించారు. తొలిసారిగా ప్రభుత్వం లాల్‌చౌక్ దగ్గర భారీ ఎత్తున నూతన సంవత్సర వేడుకలు నిర్వహించింది. గతంలో స్థానిక హోటళ్ల నిర్వాహకులు మాత్రమే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు మొదటి సారిగా జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించింది. తమ కొత్త సంవత్సరం 2024 ఇలాంటి స్వర్గంలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: వినూతన వేడుకలు.. This is #SrinagarSquare, #LalChowk right now! A city life never seen before. The celebration, the vibrancy like never before! This is the probably the biggest alibi to the transformation that Srinagar city has witnessed with the implementation of #SrinagarSmartCity projects!… pic.twitter.com/f3mL69RjFF — Athar Aamir Khan (@AtharAamirKhan) December 31, 2023 -
మందుబాబులకు వీఐపీ ట్రీట్మెంట్.. హిమాచల్ సీఎం ఆదేశాలు!
హిమాచల్ ప్రదేశ్‌లో పర్వతరాణిగా పేరొందిన సిమ్లాలో తొలిసారిగా సిమ్లా వింటర్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రారంభించారు. ఏడు రోజుల పాటు కొనసాగే ఈ శీతాకాలపు కార్నివాల్.. సాంస్కృతిక కవాతు, గ్రాండ్ డ్యాన్స్‌తో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ సాంస్కృతిక కవాతును వీక్షించారు. కార్నివాల్ సందర్భంగా రిడ్జ్ గ్రౌండ్, మాల్ రోడ్లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్నివాల్లో మద్యం తాగి డ్యాన్స్ చేసే వారితో సీఎం స్నేహపూర్వకంగా కనిపించారు. అతిగా తాగి వచ్చే పర్యాటకులను పోలీస్ లాకప్‌లో కాకుండా హోటల్‌కు తరలించాలని సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎవరైనా టూరిస్ట్ మద్యం తాగి రచ్చ చేస్తే పోలీసులు వారికి వీఐపీ ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. సిమ్లా వింటర్ కార్నివాల్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ విపత్తు సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో పర్యాటక వ్యాపారం భారీగా నష్టపోయిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందన్నారు. భారీ సంఖ్యలో జనం హిమాచల్ ప్రదేశ్‌కు తరలివస్తున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఫుడ్ స్టాల్స్‌ను 24 గంటలూ తెరిచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా పర్యాటకులను ఇబ్బంది పెట్టవద్దని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకులు నానా హంగామా చేయకూడదని, చట్టాన్ని గుర్తుంచుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సిమ్లా, మనాలిలకు పర్యాటకులు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలో బస చేస్తున్నారు. కాగా మనాలిలో పర్యాటకులు ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న ఉదంతాలు వెలుగు చూశాయి. కొందరు పర్యాటకులు మద్యం సేవించి లోయల్లో హల్చల్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇది కూడా చదవండి: యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది? -
శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్‌తో సహా ఏడు దేశాలకు ఉచిత వీసాలు
శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఏడు దేశాలకు ఉచిత వీసాల జారీచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పర్యాటకశాఖ మంత్రి ఆమోదం తెలిపారు. భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేయిషయా, థాయ్‌లాండ్ పౌరులకు ఉచితం వీసాలు జారీ ప్రతిపాదనను శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ జాబితాలో అమెరికా లేకపోవడం గమనార్హం పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమం తక్షణలమే అమల్లోకి వస్తుందని, మార్చి 31 వరకూ కొనసాగనుందని విదేశాంగమంత్రి అలీ సబ్రీ పేర్కొన్నారు. శ్రీలంకకు పర్యాటకులను ఆకర్షించే ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటకశాఖ పేర్కొంది. ఈ చర్యతో పర్యాటకానికి ఊతం లభిస్తుందని తాము భావిస్తున్నట్టు శ్రీలంక పేర్కొంది. రాబోయే రోజుల్లో శ్రీలంకకు వచ్చే పర్యాటకుల సంఖ్య 5 మిలియన్లకు చేరుతుందని తాము ఆశిస్తున్నట్టు వెల్లడించింది. కాగా ద్వీప దేశమైన శ్రీలంకకు పర్యాటకం ప్రధాన ఆదాయవనరుగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశం ప్రకటించిన ఉచిత వీసాల జాబితాలో మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలు పర్యాటకుల తాకిడి అధికంగా ఉన్న రాష్ట్రాలు కావడం విశేషం. శ్రీలకం నిర్ణయంతో ఆయా దేశాలకు చెందిన పర్యాటకులకు వీసా ఖర్చు, సమయం తగ్గనుంది. చదవండి: రావణుడి వైభోగం ఎంత.. అవశేషాలు ఎక్కడ ఉన్నాయి Cabinet approves issuing of free visas to India, China, Russia, Malaysia, Japan, Indonesia & Thailand with immediate effect as a pilot project till 31 March - — M U M Ali Sabry (@alisabrypc) October 24, 2023 -
భూటాన్ వెళ్లేవారికి శుభవార్త! ఆ ఫీజు సగానికి తగ్గింపు
హిమాలయ పర్యాటక దేశమైన భూటాన్ తమ దేశానికి వచ్చే పర్యాటకులకు శుభవార్త చెప్పింది. తమ దేశంలో పర్యటించే టూరిస్టులకు విధించే డైలీ ఫీజును సగానికి తగ్గించింది. ఇప్పటి వరకు 200 డాలర్లు (రూ.16,500) ఉన్న డైలీ ఫీజును 100 డాలర్లు (రూ.8,250)లకు తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. "సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీజు" పేరుతో పర్యాటకుల నుంచి వసూలు చేస్తున్న ఈ డైలీ ఫీజును గత సంవత్సరం సెప్టెంబర్‌లో 65 డాలర్ల నుంచి ఏకంగా 200 డాలర్లకు పెంచింది భూటాన్. ఈ మొత్తాన్ని కాలుష్య నివారణకు వెచ్చించనున్నట్లు అప్పట్లో పేర్కొంది. ఇప్పుడు తగ్గించిన డైలీ ఫీజు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తుందని, నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుందని భూటాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్నేళ్ల ముందు వరకూ బయటి దేశాలతో సంబంధాలు లేకుండా భూటాన్ 1974లో తొలిసారిగా 300 మంది పర్యాటకులను తమ దేశ సందర్శనకు అనుమతించింది. 2019లో ఈ సంఖ్య 3,15,600కి పెరిగింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 15.1 శాతం పెరిగింది. పర్యాటకుల రద్దీని పెద్దగా ఇష్టపడని భూటాన్.. తమ దేశంలోని శిఖరాల పవిత్రతను కాపాడేందుకు పర్వతారోహణను నిషేధించింది. సందర్శన ఫీజు వసూలు కారణంగా ఆ దేశంలో పర్యటించేవారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే 3 బిలియన్ డాలర్లున్న తమ ఆర్థిక వ్యవస్థ మరింత పెంచుకోవాలని భావిస్తున్న భూటాన్ ఇందుకోసం పర్యాటక రంగం నుంచి వస్తున్న 5 శాతం ఆదాయాన్ని 20 శాతానికి పెంచుకోవాలని చూస్తోంది. ప్రధానంగా బౌద్ధ దేశమైన భూటాన్‌లో అనేక మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలు సెప్టెంబర్-డిసెంబర్ కాలంలో ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో డైలీ ఫీజును సగానికి తగ్గించడం వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆ దేశ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ దోర్జీ ధ్రాధుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత జూన్‌లోనే పర్యాటకుల బస రుసుములపై ప్రభుత్వం నిబంధనలను సడలించింది. కానీ ఆశించినస్థాయిలో పర్యాటకుల సంఖ్య పెరగలేదు. గత జనవరి నుంచి 56,000 మందికిపైగా పర్యాటకులు భూటాన్‌ను సందర్శించారని, ఇందులో దాదాపు 42,000 మంది భారతీయులే ఉన్నారని ధ్రాధుల్ చెప్పారు. -
శాండ్విచ్ కట్ చేసి, తినేలోపు ఊహించని షాక్.. ఈ రెస్టారెంట్‌కి వెళ్లకూడదు బాబోయ్!
సాధారణంగా రెస్టారెంట్లో తిన్నాక ఆర్డర్ చేసిన ఆహారం, జీఎస్టీ లాంటివి బిల్లో చూస్తాం. ఏ హాటల్‌కి వెళ్లినా ఇదే కనిపిస్తుంది. అయితే ఓ రెస్టారెంట్ మాత్రం వీటికి భిన్నంగా కస్టమర్లతో నడుచుకుంటోంది. అందులో మనం తిన్న ఆహారంతో పాటు, సర్వీసింగ్ మాత్రమే కాదు ప్లేట్స్‌కు కూడా బిల్ వేస్తున్నారు. ఈ వింత అనుభవాన్ని ఓ కస్టమర్ సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకోగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. రెండు పీసులకే ఇటలీలో విహార యాత్ర ఎంజాయ్ చేస్తున్న ఓ బ్రిటీష్ టూరిస్ట్ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లేక్ కోమో సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. వెయిటర్ రాగానే శాండ్ విచ్ను ఆర్డర్ చేశాడు. అది వచ్చాక రెండు ముక్కలుగా కట్ చేసి వారిద్దరికి ఇవ్వాలని కోరాడు. తినడం పూర్తయ్యాక వెయిటర్ తీసుకువచ్చిన బిల్ చూసి ఆ టూరిస్ట్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. శాండ్ విచ్ను రెండు పీసులుగా చేసినందుకు కూడా బిల్లో చార్జీ విధించడంపై అవాక్కయ్యాడు. శాండ్ విచ్ అసలు ఖరీదు 7.50 యూరోలు కాగా కట్ చేసినందుకు 2 యూరోలు (భారత ప్రకారం రూ.180) విధించారు. సదరు కస్టమర్ రెస్టారెంట్ మేనేజర్‌తో వాదించకుండా బిల్ చెల్లించినప్పటికీ, అతను ట్రిప్ అడ్వైజర్‌లో నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో పాటు ఆ బిల్లు స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు. విసుగు చెందిన కస్టమర్ రివ్యూల సైట్లో రెస్టారెంట్‌కు ఒక స్టార్ మాత్రమే ఇచ్చాడు. అనంతరం ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేశాడు. దీని చూసిన నెటిజన్లు.. ఇలాంటి రెస్టారెంట్లకు వెళ్లకూడదని, యాజమాన్యంపై మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. రెస్టారెంట్ యజామాన్యం మాత్రం తమ చర్యను సమర్థించుకుంది. దీనిపై స్పందిస్తూ.. ‘రెండు పీసులుగా చేయడం వల్ల వాటికి రెండు ప్లేట్లు వాడాలి. ఈ క్రమంలో రెండు ప్లేట్లు కడుక్కోవాలి. ఇందుకు పట్టే సమయం, శ్రమకు ఆ మాత్రం చార్జీ అవుతుంది’’ అని తెలిపింది. -
నేరుగా సముద్రంలోనే విమానం ల్యాండింగ్.. తర్వాత ఏం జరిగిందంటే
మార్సెయిల్(ఫ్రాన్స్): ఇంజిన్ వైఫల్యం చెందడంతో ఓ పైలట్ విమానాన్ని సముద్రంలోనే అర్ధాంతరంగా దించేశాడు. విమానం మునిగిపోయినా అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఫ్రాన్సులోని మధ్యధరా సముద్ర తీరం ఫ్రెజుస్ వద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. తీరానికి మరో 600 మీటర్ల దూరం ఉందనంగా సెస్నా 177 రకం చిన్నపాటి పర్యాటక విమానం ఇంజిన్‌లో లోపం ఏర్పడింది. దీంతో, పైలట్ సముద్ర జలాల్లోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అత్యవసర విభాగం సిబ్బంది అక్కడికి చేరుకునే అందులోని ముగ్గురినీ రక్షించారు. ‘ఫ్రెజుస్ బీచ్‌లో జనం రద్దీ ఎక్కువగా ఉంది. బీచ్‌లో అత్యవసర ల్యాండింగ్ వారికి అపాయం కలుగుతుందని పైలట్ భావించాడు. దీంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి బీచ్‌లో కాకుండా దగ్గర్లోని∙సముద్ర జలాల్లో ల్యాండ్ చేశాడు. ఇందుకు ఎంతో నైపుణ్యం కావాలి. అదృష్టమూ కలిసి రావాలి’ అని సహాయక సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో విమానం సముద్రంలో మునిగిపోయింది. -
Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ఘటన వెలు గుచూసింది. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను చూసేందుకు వచ్చిన ఓ పర్యాటకుడిపై స్థానిక యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. పర్యాటకుడిని వెంబడించి మరీ కర్రలు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఇదంతా మంగళవారం ఉదయం జరగ్గా.. దాడికి సంబంధించిన దృశ్యాలు ఓ షాప్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. న్యూఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తాజ్‌మహల్ చూసేందుకు ఆదివారం ఆగ్రా వచ్చాడు. ఈ క్రమంలో తాజ్‌గంజ్ ప్రాంతంలోని బసాయ్ చౌకీ వద్ద కారులో వెళ్తుండగా పక్కన నడుచుకుంటూ వెళ్తున్న భక్తులను తన వాహనం తాకింది. పర్యాటకుడు కారు ఆపి వాళ్లకు క్షమాపణలు చెప్పాడు. అయినా వారు వినిపించుకోకుండా దుర్భాషలాడుతూ దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు భయంతో అతడు దగ్గర్లోని ఓ స్వీట్ షాప్‌లోకి పరుగెత్తాడు. అతన్ని వెంబడించిన దుండగులు షాప్‌లోకి చొరబడి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. తప్పు అయ్యింది, క్షమించాలని వేడుకున్నా వదల్లేదు. కొంత సమయం పాటు అతన్ని చితకబాది అక్కడి నుంచి వెళ్లిపోయారు. Video from Agra . Tourist Beaten by Locals. #shameful #SeemaHaider #KiritSomaiya #Agra #DelhiFloods pic.twitter.com/zuXq7qdwLN — देश सर्वप्रथम (@deshsarvpratham) July 18, 2023 దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తమలో ఒకడిని కారుతో ఢీ కొట్టాడన్న కారణంతోనే దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తాజ్‌మహల్ గొప్ప పర్యటక ప్రాంతమని, దీనిని చూసేందుకు రోజు వేలల్లో టూరిస్టులు వస్తుంటారని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి.. पर्यटक के साथ मारपीट से संबंधित वायरल वीडियो का स्वत: संज्ञान लेकर, #थाना_ताजगंज पुलिस द्वारा तत्काल अभियोग पंजीकृत कर, 03 टीमों का गठन करते हुए, 05 आरोपियों को हिरासत में लिया गया है व अन्य आरोपियों की गिरफ्तारी हेतु लगातार प्रयास किया जा रहा है। pic.twitter.com/yoyjGb6J3d — POLICE COMMISSIONERATE AGRA (@agrapolice) July 17, 2023 -
‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్ టీచర్.. చూసేందుకు జనం పరుగులు!
ప్రపంచంలో లెక్కకుమించినంతమంది తమ ఉద్యోగాలను అయిష్టంతోనే చేస్తుంటారనే వాదన వినిపిస్తుంటుంది. అయితే వారు తమ హాబీతో ఏమైనా సాధించవచ్చని తపన పడుతుంటారు. అయినా అందుకు తగిన ప్రయత్నాలు చేయరు. కొందరు మాత్రం ఈ ప్రపంచం ఏమనుకున్నా, ఎటుపోయినా తాము అనుకున్నది చేసి చూపిస్తారు. అద్భుతాలు అందిస్తారు. ఇదే కోవలోకి వచ్చే ఒక మహిళ తన హాబీనే తన ఉద్యోగంగా మలచుకుని అత్యధికంగా సంపాదిస్తోంది. ఇందుకోసం ఆమె ఇంతవరకూ చేస్తూ వచ్చిన బోరింగ్ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసింది. మత్స్య కన్యగా మారిన మాస్ గ్రీన్ మాస్ గ్రీన్ అనే యువతి స్కూలులో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేసేది. అయితే ఇప్పుడామె ‘మత్స్య కన్య’గా మారిపోయింది. ఇది వినేందుకు వింతగా అనిపిస్తుంది. ఆమె ఒక ఫుల్‌టైమ్ ‘రియల్ లైఫ్ మత్స్య కన్య’గా మారేందుకు తన ఉద్యోగాన్ని వదిలివేసింది.యూకేలోని ‘మెట్రో’తో మాట్లాడిన ఆమె ‘మత్స్య కన్య’గా ఉండటం తనకు ఎంతో ఇష్టమైన వ్యాపకమని, తన కెరియర్ మార్చుకున్నాక ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. డెవొన్కు చెందిన 33 ఏళ్ల మాస్ గ్రీన్ ఇంగ్లీషు నేర్చుకునేందుకు 2016లో సిసిలీ వెళ్లింది. మత్స్య కన్యగానే ఎందుకు.. మీడియాతో మాట్లాడిన మాస్ తాను గతంలో ఒక సాగర తీరంలో మత్స్యకన్య మేకప్‌తో ఒక వ్యక్తిని చూశానని, అప్పటి నుంచి తనకు మత్స్యకన్యగా మారాలనే ఆలోచన తరచూ వచ్చేదని తెలిపింది. అయితే అప్పుడు తాను చూసినది ఒక ఇంద్రజాలమని, అయితే తాను నిజంగా మత్స్యకన్యగా మారిపోవాలనుకున్నానని తెలిపింది. ఇది వినేందుకు అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది. కానీ దీనిని తాను చేసి చూపించానని మాస్ గర్వంగా తెలిపింది. తనను చూసేందుకు జనం విపరీతంగా రావడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని పేర్కొంది. అభిరుచే ఆదాయమార్గంగా మారి.. ‘రియల్ లైఫ్ మత్స్యకన్య’గా మారాక తాను నీటిలో సయ్యాటలాడున్నప్పుడు తన తోక భాగాన్ని చూసి అందరూ ఆనందిస్తారని తెలిపింది. తనకు సముద్రంలో అధిక సమయం గడపడమంటే ఎంతో ఇష్టమని మాస్ తెలిపింది. తాను సముద్రతీర సందర్శనకు వచ్చే పర్యాటకులకు పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేస్తానని పేర్కొంది. మత్స్యకన్యగా మారేందుకు తాను అధిక సమయం ఊపిరి నిలిపివుంచే శిక్షణ పొందానని తెలిపింది. తాను తనకు ఎంతో ఇష్టమైన అభిరుచిని నెరవేర్చుకోవడంతో పాటు మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నానని మాస్ గ్రీన్ ఆనందంగా తెలిపింది. ఇది కూడా చదవండి: ఉన్నట్టుండి షాపింగ్ మాల్లో తుపాకీ కాల్పుల మోత.. టెక్సాస్‌లో ఏం జరిగిందంటే.. -
ఉత్తర భారతదేశంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాలు
-
బతుకు పోరు
‘ఈ కర్మభూమిలో ప్రతి అడుగులో ఒక కథ వినిపిస్తుంది’ అంటుంది ఇంజా రోజియ. అమెరికన్ టూరిస్ట్ రోజియ ఇటీవల తన స్నేహితురాలితో కలిసి రాజస్థాన్‌లోని పుష్కర్ నగరానికి వచ్చింది. బిడ్డను ఒళ్లో పడుకోబెట్టుకొని ఎర్రటి ఎండలో కూర్చున్న గుడియ అనే మెహందీ ఆర్టిస్ట్ కనిపించింది. మెహందీ వేయించుకుంటూ గుడియతో కబుర్లలో పడింది రోజియ. తెలిసీ తెలియని ఇంగ్లీష్‌లోనే తన జీవితకథను రోజియతో పంచుకుంది గుడియ. రోజియ వయసే ఉన్న గుడియకు నలుగురు పిల్లలు. విద్యుత్ సౌకర్యం కూడా లేని చిన్న పల్లెలో ఉండేది. తల్లిదండ్రులు చనిపోయారు. భర్త తాగుబోతు. ఎప్పుడూ ఏదో రకంగా హింసించేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేక పిల్లల్ని తీసుకొని పట్టణానికి వచ్చింది. తనకు తెలిసిన ‘మెహందీ ఆర్ట్’తో బతుకుబండి లాగిస్తోంది అంటూ గుడియ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రోజియ. ‘నా జీవితం ఇలా అయిపోయింది... అంటూ ఆమె కన్నీళ్లతో బాధ పడలేదు. ఎవరి మీదో ఫిర్యాదు చేస్తున్నట్లుగా లేదు. జరిగిందేదో జరిగింది. బతుకుపోరు చేస్తాను...అనే స్ఫూర్తి ఆమెలో బలంగా కనిపించింది. గుడియ నలుగురు పిల్లలకు తల్లి. తల్లి ప్రేమకు ఉన్న శక్తి ఏమిటంటే జీవితంలో ఎన్నో యుద్ధాలను గెలిచేలా చేస్తుంది’ అంటూ రాసింది రోజియ. -
టూరిస్టును సొర మింగేసింది.. కన్న తండ్రి కళ్లముందే.. క్షణాల్లోనే..
ఈజిప్టు: ఈజిప్టులోని హుర్ఘదా రీసార్ట్ సమీపంలో ఓ భయానక ఘటన జరిగింది. ఎర్రసముద్రం ఒడ్డున ఈతకొడుతున్న రష్యా పర్యాటకున్ని షార్క్ చేప మింగేసింది. దీంతో స్థానిక పర్యాటకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. వ్లాదిమిర్ పొపోవ్(23) తన కుటుంబంతో సహా విహారానికి హుర్ఘదాలో బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలో వ్లాదిమిర్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి సముద్ర ఒడ్డున ఈత కొడుతున్నారు. ఇంతలోనే ఆ ప్రాంతంలో ఓ సొరచేప ప్రత్యక్షమయింది. భయంతో వారు వేగంగా ఈదినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వ్లాదిమిర్‌ను సొర మింగేసింది. అయితే.. అతని గర్ల్‌ఫ్రెండ్ మాత్రం తప్పించుకోగలిగింది. రెస్క్యూ సిబ్బంది క్షణాల్లో అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే అంతా అయిపోయిందని స్థానికులు చెబుతున్నారు. Tourists stunned watching a Tiger Shark chomping a Russian tourist who was out on a swim at an Egypt beach resort 23YO Vladimir Popov died in the attack, girlfriend escaped alive. Shark has been captured & killed pic.twitter.com/xUsitoCN5X — Nabila Jamal (@nabilajamal_) June 9, 2023 బాధితుడు సొర నుంచి తప్పించుకునే క్రమంలో రక్షించమని తన తండ్రి కోసం ఆర్తనాదాలు చేశాడు. ఒడ్డున ఉన్న అతని తండ్రి చూస్తుండగానే ఒక్క క్షణంలో అంతా అయిపోయింది. నిస్సహాయ స్థితిలో బాధితుని తండ్రి విలపించారు. రక్షించమని స్థానికులను వేడుకున్నారు. కానీ నిమిషాల్లోనే అతని కుమారున్ని సొర మింగేసింది. దీంతో అంతా షాక్‌కు గురయ్యామని స్థానిక పర్యాటకులు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇదీ చదవండి: ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా! -
కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నేరుగా సముద్రంలోకి - వీడియో
ఆధునిక కాలంలో టెక్నాలజీ వేగంగా పరుగులు పెడుతోంది. కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే చేతిలో స్మార్ట్‌ఫోన్ లేదా జిపిఎస్ నావిగేషన్‌కి సపోర్ట్ చేసే ఏదైనా పరికరం ఉండే చాలు. అయితే ఈ టెక్నాలజీ కొన్ని సార్లు ప్రమాదంలోకి నెట్టి వేస్తుంది. అలాంటి సంఘటన ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఇటీవల వెల్లడైన ఒక వీడియో హవాయిలోని హోనోకోహౌ హార్బర్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక కారు ఏకంగా సముద్రపు నీటిలోకి దూసుకెళ్లడం, అందులో ఒక మహిళ ఉండటం చూడవచ్చు. అయితే చివరికి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ కారు నీటిలోకి వెళ్లడం వల్ల అందులో ఏదైనా సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఇందులో కనిపించే కారుని డ్రైవ్ చేస్తున్న మహిళ జిపిఎస్ నమ్ముకుని కారుని డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే అక్కడ సమీపంలో ఉన్న కొంత మంది ఈ సంఘటన గమనించి ఆమెను రక్షించారు. కాబట్టి ఎవరికీ ఎటువంటి హాని జరగకుండా ప్రాణాలతో బయటపడగలిగారు. ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటి సారి కాదు. (ఇదీ చదవండి: రూ. 2.5 కోట్ల ఉద్యోగం వద్దనుకున్నాడు.. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ - ఎవరీ కన్హయ శర్మ?) గతంలో ఒక వ్యక్తి జిపిఎస్ నమ్ముకుని అడవిలో చిక్కుకుని నానా అగచాట్లు పడ్డాడు. ఇంకో సంఘటనలో కొంత మంది ప్రాణాలే కోల్పోయారు. కావున జిపిఎస్ అన్ని వేళలా గమ్యాన్ని చేరుస్తాయని నమ్ముకోకూడదు, కావున కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మీకు అందుబాటులో ఉన్న వ్యక్తుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. ఆలా కాకుండా సొంత తెలివితేటలు నమ్ముకుంటే అనుకోని ప్రమాదాలను ఆహ్వానించినవారవుతారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
కీలక ప్రాజెక్టులకు పర్యాటక భూములు
సాక్షి, విశాఖపట్నం : సహజ అందాలతో అలరారే ఉత్తరాంధ్ర పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కేందుకు సరికొత్త ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఒకవైపు సాగర సోయగాలు.. మరోవైపు ఎత్తైన తూర్పు కనుమల అందాలు ప్రపంచ పర్యాటకులను కట్టిపడేస్తుండగా.. ప్రపంచ పర్యాటక పటంలో టూరిజం రాజధానిగా భాసిల్లే విధంగా ప్రాజెక్టులకు ఇటీవల విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందుకు అవసరమైన భూములను ఆయా ప్రాజక్టులకు అప్పగించేందుకు టూరిజం శాఖ కసరత్తు ప్రారంభించింది. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న పర్యాటక భూముల పరిధిని విశాఖ హబ్‌గా ఏర్పాటు చేస్తూ.. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లకు అనుగుణంగా భూ కేటాయింపులు చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న అపార అవకాశాలను మెరుగు పరుచుకొని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులకు రూపకల్పన జరుగుతోంది. విశాఖ జిల్లానూ పర్యాటక ఖిల్లాగా మార్చే దిశగా.. టూరిజం ప్రాజెక్టులకు కసరత్తు చేస్తున్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో జరిగిన పర్యాటక ఒప్పందాల్లో సింహభాగం ఇన్వెస్టర్లు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలను ఎంపిక చేసుకున్నారు. ఉమ్మడి విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పర్యాటక అవకాశాలు పుష్కలంగా ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. జీఐఎస్‌లో పర్యాటక రంగానికి సంబంధించి రూ.8,806 కోట్లతో 64 ప్రాజెక్టులు ఉత్తరాంధ్రకు రానున్నాయి. భూ బదలాయింపు ప్రక్రియ షురూ విశాఖ హబ్ పరిధిలో 39 పార్శిళ్లలో 427.08 ఎకరాలున్నట్లుగా గుర్తించారు. ఇందులో ఎక్కువ మొత్తం భూములు ఇంకా బదలాయింపునకు నోచుకోలేదు. ఈ ప్రక్రియను టూరిజం శాఖ ప్రారంభించింది. ఆయా జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూ పరిధిలో ఉన్న పర్యాటక భూముల బదలాయింపు వేగవంతం చేయాలని టూరిజం అధికారులు లేఖలు రాశారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫైల్స్ ఆయా మండల తహశీల్దారుల పరిధిలో ఉన్నాయి. వీటిని త్వరగా క్లియర్ చేయాలంటూ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయనున్నారు. భూ బదలాయింపు ప్రక్రియ పూర్తయ్యేలోపు.. ఎంవోయూలు చేసుకున్న పెట్టుబడిదారుల నుంచి కూడా ఫైల్స్ కదిలేలా చేస్తున్నారు. ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌తో పాటు ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్(పీఎంయూ) కూడా అందించాలంటూ ఎంవోయూలు చేసుకున్న సంస్థలకు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ డీపీఆర్, పీఎంయూలు అందితే.. మరోవైపు బదలాయింపు ప్రక్రియ పూర్తయితే.. ఏ ప్రాజెక్టుకు ఏ ల్యాండ్ అవసరమవుతుందనే దానిపై నిర్ణయించి.. ఆయా సంస్థలకు కేటాయింపులు చేపట్టే ప్రక్రియను ప్రారంభించనున్నారు. సరిహద్దులు గుర్తింపునకు రోవర్ సర్వే మరోవైపు.. భూముల బదలాయింపు పూర్తయిన తర్వాత.. పర్యాటక భూముల సరిహద్దులను గుర్తించేందుకు సర్వే నిర్వహించనున్నారు. దీనిపై కలెక్టర్ డా.మల్లికార్జున ఆదేశాల మేరకు విశాఖపట్నం, భీమిలి ఆర్డీవోతో టూరిజం రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి భేటీ అయ్యారు. డ్రోన్ సర్వేకు అనుమతులు లేని కారణంగా రోవర్స్ సర్వే నిర్వహించి హద్దులు గుర్తించనున్నారు. ప్రస్తుతం రోవర్స్ విజయనగరం జిల్లాలో భూహక్కు రీ సర్వేలో ఉన్న కారణంగా వారం రోజుల్లో సర్వే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పర్యాటక భూముల వివరాలివీ... విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పరిధిలో 296.15 ఎకరాలు శ్రీకాకుళం జిల్లాలో 32.78 ఎకరాలు విజయనగరం జిల్లాలో 48.8 ఎకరాలు పార్వతీపురం మన్యం జిల్లాలో6.25 ఎకరాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో43.1 ఎకరాలు మొత్తం విశాఖ హబ్ పరిధిలో 427.08 ఎకరాలు -
అక్కడ సెల్ఫీలు తీస్తే జరిమానా..కానీ క్లిక్ మనిపించకుండా ఉండలేం!
ఇటీవల కాలంలో సెల్ఫీ మోజు మూములగా లేదు. అందుకోసం ప్రాణాలు పోగొట్టుకున్నా వారు ఉన్నారు. అయినా సెల్ఫీ క్రేజ్ తగ్గలేదు. ఐతే ఇలా అన్ని చోట్ల సాధ్యం కాదు. కొన్నిప్రదేశాల్లో తీస్తే పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తారు. ఎవ్వరూ ఫోటోలు తీయకుండా స్ట్రిట్ రూల్స్ ఫాలవుతారట అక్కడి ప్రజలు. వివరాల్లోకెళ్తే..ఇటాలిలోని రివేరాలో రంగురంగుల పట్టణమైన పోర్టోఫినో అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతం. అక్కడకు వచ్చిన ఎవ్వరికైన తమ కెమరాను క్లిక్ మనిపించకుండా ఉండలేరు. ఎందుకంటే అంతా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఆ ప్రదేశం. అందువల్ల అక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువే. చిత్రాకారుల సైతం ఆ అందాలను చిత్రీకరించకుండా ఉండలేనంతగా కట్టిపడేస్తోంది ఆ నగరం. ఐతే ఈ సెల్ఫీల కారణంగానే వీధులన్ని కిక్కిరిసిపోయి గందరగోళానికి దారితీసిందని, అక్కడ సెల్ఫీలు గానీ, ఫోటోలు తీయడం గానీ చేయకూడదంటూ నిషేధించారు. ఈ మేరకు అక్కడకు వచ్చిన పర్యాటకులెవరు ఉదయం 10.30 నుంచి 6 గంటల వరకు ఈ ప్రదేశాల్లో సెల్ఫీలు గానీ ఫోటోలు తీయడం గానీ చేయకూడదు. అక్టోబర్ వరకు ఇలానే నిషేధం అమలవుతుందట. ఇలాంటి నిబంధనలే అమెరికా, ఫ్రాన్స్, యూకేలతో సహా కొన్ని దేశాల్లో ఉన్నాయి. (చదవండి: గాల్లో ఉండగానే పెద్ద శబ్దాలతో ఇంజన్లో మంటలు..ఆ తర్వాత విమానం..) -
ఆ ప్రాంతంలో ఈ పిల్లి ఫేమస్.. చూసేందుకు ఎగబడుతున్న పర్యాటకులు!
ఈ పొటోలో కనిపిస్తున్న పిల్లిని చూశారు కదా! భలే బొద్దుగా ముద్దుగా ఉంది కదూ! ఇది పోలండ్‌లోని స్కజేషిన్ నగరంలో ఉంటుంది. ఈ పిల్లి అక్కడ చాలా ఫేమస్. జర్మనీ సరిహద్దుల్లో ఉండే పురాతన నగరమైన స్కజేషిన్లో ఈ పిల్లి పర్యాటక ఆకర్షణగా మారింది. స్థానికులు ఈ పిల్లికి ‘గకేక్’ అని పేరు పెట్టుకున్నారు. స్కజేషిన్ నగరం శివార్లలోని కస్జుబ్స్కా ప్రాంతంలో పదేళ్ల కిందట ఇది తొలిసారిగా కనిపించింది. అప్పటి నుంచి ఇది అదే వీథిని తన నివాసంగా చేసుకుని, ‘కింగ్ ఆఫ్ కస్జుబ్స్కా స్ట్రీట్’గా పేరు పొందింది. స్కజేషిన్ నగరానికి వచ్చే పర్యాటకులు నగరంలోని మ్యూజియం, పార్కులు, ఇతర పర్యాటక కేంద్రాలను చూడటంతో పాటు ఈ పిల్లిని కూడా ప్రత్యేకంగా చూసి, ఫొటోలు తీసుకుని వెళుతుండటం విశేషం. చదవండి: Anjali Sood: అత్తెసరు మార్కులు వచ్చే అమ్మాయి నుంచి సీఈఓగా.. లాభాల బాటలో.. -
టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
పర్యాటకుల భద్రత కోసమే టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు: సీఎం వైఎస్ జగన్
-
ఏపీలో టూరిస్ట్ పోలీస్టేషన్లు
-
రష్యా పౌరుడి అనుమానాస్పద మృతి.. వాళ్లిదరూ ఒకే గదిలో..
రాయగడ(భువనేశ్వర్): పట్టణంలోని సాయి ఇంటర్నేషనల్ హోటల్లో ఓ విదేశీయుడి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మృతుడు రష్యాకు చెందిన వ్లాదిమర్ బిదానోబ్(61)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్డీపీఓ దేవజ్యోతి దాస్ ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే... ఈనెల 21న రష్యాకు చెందిన నలుగురు పర్యాటకులు ఒడిశాలోని దారింగిబడి నుంచి రాయగడలో పర్యటించేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారి వెంట వచ్చిన గైడ్ స్థానిక సాయి ఇంటర్నేషనల్ హోటల్లో వసతి సౌకర్యం కల్పించారు. గురువారం రాత్రి వ్లాదిమర్‌తో పాటు అతనితో వచ్చిన మరో విదేశీయుడు కలిసి ఒకే గదిలో మద్యం సేవించారు. అయితే తెల్లవారు లేచి చూసేసరికి వ్లాదిమర్ మృతి చెందడంతో హోటల్ మేనేజర్‌కు విషయాన్ని తెలియజేశారు. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమా? లేదా ఇంకేమైనా జరిగి ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎస్డీపీఓ దాస్ మీడియాతో మాట్లాడుతూ విదేశీయుడి మృతికి సంబంధించి నియమాల ప్రకారం సమాచారాన్ని రష్యా రాయబార కార్యాలయానికి విషయం చేరవేశామని తెలిపారు. మృతునికి ఒక కుమారుడు ఉన్నట్ల తెలిసిందని, మిగతా సమాచారం అందాల్సి ఉందని వివరించారు. చదవండి: షాకింగ్ ఘటన.. పారిపోయిన అల్లుడు.. అసలేం జరిగింది? -
విశాఖపట్నం ఎయిర్‌పోర్టు.. ప్రయాణికుల రద్దీతో కళకళ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి అధికమవుతోంది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య ఊపందుకుంటోంది. కోవిడ్ ప్రభావం నుంచి కోలుకుని మళ్లీ పూర్వపు స్థితికి చేరుకుంటోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈనెల 17న ఈ విమానాశ్రయం తొమ్మిది వేల మంది ప్రయాణికుల మైలు రాయిని అధిగమించింది. 2020 మార్చి నుంచి కోవిడ్ తొలి, మలి విడతలో తీవ్ర ప్రతాపం చూపింది. దీంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కోవిడ్ ఉధృతి తగ్గిన తర్వాత కూడా మునుపటి స్థాయిలో ప్రయాణికులు రాకపోకలు చేయడం లేదు. అందుకనుగుణంగా విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసులను కుదించుకున్నాయి. కొన్ని నెలల నుంచి కోవిడ్ ప్రభావం తగ్గి, సాధారణ స్థాయికి వచ్చింది. దీంతో దాదాపు రెండున్నరేళ్ల అనంతరం ఈ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీతో కళకళలాడుతోంది. నవంబర్ వరకు వీరి సంఖ్య రోజుకు 6,000–7,000 వరకు ఉండగా డిసెంబరు నుంచి అది మరింత పెరుగుతూ వస్తోంది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే చాలా విమానాలు కొన్నాళ్ల నుంచి నూరు శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇలా ఈనెల ఆరంభం నుంచి రోజుకు 7000–9000 మంది ప్రయాణికుల సంఖ్య నమోదవుతోంది. శనివారం 9,183 మంది ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించారు. వీరిలో దేశీయ ప్రయాణికులు 8,838 మంది, అంతర్జాతీయ ప్రయాణికులు 345 మంది ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఇదే సమయానికి ఒకే రోజు గరిష్టంగా ఎనిమిది వేల మంది ప్రయాణించారు. ఈ విమానాశ్రయం నుంచి సగటున రోజుకు 56 విమాన సర్వీసులు (రానుపోను) రాకపోకలు సాగిస్తున్నాయి. కోవిడ్ రెండో దశ తర్వాత ఈ విమానాశ్రయం నుంచి గత డిసెంబర్ నెల మొత్తమ్మీద 2.5 లక్షల మంది వెళ్లి వచ్చారు. అయితే 2022 జనవరి నుంచి ఒమిక్రాన్ బెడదతో మార్చి వరకు విమాన ప్రయాణాలు నెలకు సగటున ఆరేడు వేలతో రెండు లక్షలలోపే నమోదయ్యాయి. కోవిడ్‌కు ముందు ఇలా.. కోవిడ్‌కు ముందు 2018–19లో ఈ విమానాశ్రయం నుంచి 28 లక్షల మంది, 2019–20లో 27 లక్షల మంది, 2020–21లో 16 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు జరిపారు. ఈ ఏడాది వీరి సంఖ్య 23 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల తాకిడి కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితికి వస్తుందని భావిస్తున్నట్టు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ కె.శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు. దేశ, విదేశాల నుంచి విశాఖకు ఈ శీతాకాలం సీజనులో పర్యాటకులు అధికంగా వస్తుండడం, కోవిడ్ తీవ్రత తగ్గడం విమాన ప్రయాణికుల తాకిడి పెరగడానికి దోహదపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డీఎస్ వర్మ ‘సాక్షి’కి తెలిపారు. (క్లిక్ చేయండి: సాధారణ చార్జీలతోనే సంక్రాంతి బస్సులు) -
ఫోటోలకు ఫోజులిచ్చి.. ఘోరంగా తిట్టించుకుంది: వీడియో వైరల్
చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలు సందర్శించేటప్పుడూ అక్కడ పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలకు సంబంధించిన బోర్డులు ఉంటాయి. పైగా అక్కడ మనకు ఈ వస్తువులను తాకవద్దు అని కూడా రాసి ఉంటుంది. అయినప్పటికీ కొంతమంది అత్యుత్సహంతో ఎవరికంట పడకుండా ఆ వస్తువులను తాకేందుకు తెగ ట్రై చేస్తుంటారు. ఈ క్రమంలో ఆ వస్తువు గనుక కిందపడి పగిలిందో ఇక అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఒక చారిత్రత్మక ప్రదేశానికి వెళ్లి ఫోటోలు తీసుకునే క్రమంలో ఊహించని షాకింగ్ ఘటనను ఎదుర్కొంటుంది. అసలేం జరిగిదంటే....ఒక మహిళ లండన్ పర్యటనకు వెళ్లింది. అక్కడ ఆమె ప్రసిద్ధిగాంచిన బకింగ్‌హామ్ ప్యాలెస్‌ని సందర్శించింది. అక్కడకు వెళ్లిన ప్రతిఒక్కరూ రకరకాల ఫోజులతో ఫోటోలు తీసుకోవడం సర్వసాధారణం. ఆ క్రమంలోనే ఒక టూరిస్ట్ మహిళ గుర్రం మీద ఉన్న క్వీన్ గార్డుతో కలిసి ఫోటో తీసుకోవాలనుకుంటుంది. అనుకున్నదే తడువుగా ఆ క్వీన్గార్డుకి దగ్గరగా నుంచుని ఒక ఫోటో తీసుకుంటోంది. ఐతే ఫోటోలు తీసుకునే క్రమంలో ఆ గుర్రాన్ని తాకేందుకు యత్నించకూడదని హెచ్చరిక బోర్డులు ఉంటాయి. పైగా అక్కడ ఉన్న సంరక్షణాధికారులు కూడా పర్యాటకులకు ఈ నియమాలు గురించి చెబుతారు. ఐతే సదరు మహిళ అవేమి పట్టించుకోకుండా తనదారి తనది అన్నట్టుగా గుర్రం పై ఉన్న క్వీన్ గార్డుతో కలసి ఫోటో తీసుకుంటున్న నెపంతో ఆ గుర్రాన్ని తాకడమే కాక తనవైపుకు తిప్పుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తుంది. అంతే ఒక్కసారిగా ఆ క్వీన్గార్డు బిగ్గరగా అరుస్తూ...గుర్రాన్ని, వాటికి ఉన్న పగ్గాలను తాకొద్దు అంటూ ఆమె పై సీరియస్ అయ్యాడు. ఈ హఠాత్పరిణామానికి ఆ మహిళ ఒక్కసారిగా తత్తరపాటుకి గురవుతుంది. పైగా ఆ గుర్రం కూడా కాస్త బెదురుగా ముందుకు కదులుతుంది. ఈ ఊహించని ఘటనకు ఆ మహిళ తెగ బాధపడిపోతూ...ఇక లండన్‌కి ఎప్పటికీ రానంటూ శపథం చేసింది. ఈ మేరకు ఈ ఘటన తాలుకా వీడియోని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ గార్డు చర్యను తప్పుపడితే, మరికొందరూ అక్కడ తాకకుడదని కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టే అతను అలా ప్రవర్తించాడంటూ క్వీన్ గార్డుని సమర్థిస్తూ... రకరకాలుగా ట్వీట్ చేశారు. He scared me for a moment too. 😂😂pic.twitter.com/6dD8Fmx62q — Figen (@TheFigen) July 31, 2022 (చదవండి: అనూహ్య ఘటన!. పైలెట్ దూకేశాడా? పడిపోయాడా!) -
సూర్యలంక బీచ్‌లో వీకెండ్ జోష్.. రాబడి కుష్
హోరుగాలికి లయబద్ధంగా కేరింతలు కొడుతున్నట్టు ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు.. అలలతోపాటే ఎగిరెగిరి పడుతూ ఆనందగానం చేస్తున్నట్టు కిలకిలారావాలు చేసే వలస పక్షుల విన్యాసాలు.. ప్రకృతి సరికొత్త ‘అల’ంకారమేదో అద్దినట్టు.. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో మిలమిలా మెరుస్తూ కనువిందు చేసే సాగర జలాలు.. స్వచ్ఛమైన గాలి వీచే సుందర అటవీప్రాంతం.. ఇవన్నీ సూర్యలంక సొంతం. అందుకే ఈ తీరాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు. వారాంతాల్లో అధికసంఖ్యలో పోటెత్తుతున్నారు. సాక్షి, బాపట్ల: వీకెండ్ వస్తే చాలు.. సూర్యలంక తీరం కోలాహలంగా మారుతోంది. శని, ఆదివారాల్లో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఫలితంగా పర్యాటక శాఖ ఆదాయం పెరుగుతోంది. రెండేళ్లుగా కరోనా వల్ల నష్టపోయిన పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతోంది. సూర్యలంక ప్రత్యేకతలివే.. కాలుష్య కారక పరిశ్రమలు లేకపోవడం వల్ల ఈ తీరంలో సముద్ర జలాలు స్వచ్ఛంగా ఉంటాయి. చుట్టూ రెండుకిలోమీటర్ల దూరం మడ అడవులు విస్తరించి ఉంటాయి. ఇవి పర్యాటకులకు స్వచ్ఛమైన గాలులతో స్వాగతం పలుకుతాయి. ఈ తీరంలో అడపాదడపా డాల్ఫిన్లు విన్యాసాలు చేస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. రవాణా మార్గం.. అనుకూలం బాపట్ల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే సూర్యలంక ఉంటుంది. రవాణా మార్గం అనువుగా ఉంటుంది. అందుకే రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుంచీ యువత వారాంతంలో సూర్యలంకకు తరలివస్తారు. ఇక్కడ పర్యాటకులకు సకల వసతులూ అందుబాటులో ఉన్నాయి. బీచ్‌కు సమీపంలో ప్రైవేటు రిసార్ట్స్ ఉన్నాయి. బాపట్లలోని భావన్నారాయణ దేవాలయం, పొన్నూరులోని ఏకశిల శివాలయం ఈ తీరానికి ఆధ్యాత్మిక ఆకర్షణ. కలెక్టర్ చొరవతో.. బాపట్ల జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టగానే విజయకృష్ణన్ సూర్యలంక తీరంపై దృష్టిపెట్టారు. ఈ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఎస్పీ వకుల్‌జిందాల్ సహకారంతో భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మద్యం సేవించి హల్చల్ చేసే మందుబాబులకు రూ.పదివేలు జరిమానా విధించాలని ఆదేశించారు. పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు సూర్యలంక తీరంలో పర్యాటకాభివృద్ధికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వం కేటాయించిన 8 ఎకరాల భూమిలో ప్రైవేటు భాగస్వామ్యంతో నక్షత్ర హోటళ్లు, రిసార్ట్స్ నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలకు కేటాయించిన భూముల్లోనూ ఇదే తరహా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పర్యాటకశాఖ చైర్మన్ ఆరిమండ వరప్రసాదరెడ్డి చెప్పారు. పెరిగిన ఆదాయం తీరంలో పర్యాటకశాఖ ఆదాయం పెరుగుతోంది. గతంలో నెలకు సగటున రూ.30 లక్షల మేర ఆదాయం వచ్చేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ మొత్తం రూ.40 లక్షలకు చేరుకుందని పేర్కొంటున్నారు. ఏడాదికి సుమారు రూ.5 కోట్ల ఆదాయం వస్తున్నట్లు వివరిస్తున్నారు. 32 రూమ్‌లతో సూర్యలంక తీరంలో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన హరిత రిసార్ట్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. -
గాల్లోనే ఆరు గంటలు హైరానా
సిమ్లా: ప్రకృతి అందాలను ఆస్వాదించాలని కేబుల్‌కార్ ఎక్కిన పర్యాటకులు రోప్‌వేలో సాంకేతిక లోపంతో కొన్ని గంటలపాటు తీవ్ర భయాందోళనల మధ్య గాల్లోనే గడపాల్సి వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సొలాన్ జిల్లా పర్వానూ సమీపంలోని టింబర్ ట్రయల్ ప్రైవేట్ రిసార్ట్ వద్ద ఢిల్లీకి చెందిన 11 మంది పర్యాటకులు సోమవారం టింబర్ ట్రయల్ కేబుల్ కార్ ఎక్కారు. రోప్‌వేలో సాంకేతిక లోపం కారణంగా అది మధ్యలోనే సుమారు 250 అడుగుల ఎత్తులో నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం అక్కడికి చేరుకుని, మరో కేబుల్ కార్ ట్రాలీని అక్కడికి పంపించి, ఒక్కొక్కరికీ తాడు కట్టి క్షేమంగా కిందికి దించింది. 6 గంటలు శ్రమించి అందులో చిక్కుకు పోయిన ఐదుగురు మహిళలు సహా మొత్తం 11 మందిని సురక్షితంగా కిందికి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడినట్లు సీఎం జైరాం ఠాకూర్ చెప్పారు. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌తోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఆయన వెంటనే ఘటనాస్థలికి పంపించారని వెల్లడించారు. 1992లోనూ టింబర్ ట్రయల్ వద్ద ఇలాంటి ఘటనే చోటుచేసుకోగా, కేబుల్ కార్లో చిక్కుకుపోయిన 10 మందిని ఆర్మీ కాపాడింది. గత ఏప్రిల్‌లో జార్ఖండ్‌లోని త్రికూట్ పర్వతాల వద్ద రోప్‌వే గాల్లోనే నిలిచిపోయింది. ఆర్మీ సుమారు 40 గంటలపాటు శ్రమించి 12 మందిని రక్షించగా మరో ముగ్గురు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. చదవండి: Breaking: ఆర్మీలో అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల #HimachalPradesh :- Eleven People are stucked in the Timber Trail due to techanical problem. They have been getting rescued by the management.#Himachal pic.twitter.com/EgMfJy0UPY — Gorish (@IGorishThakur) June 20, 2022 కాగా 1992 అక్టోబర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇదే రోప్‌వేలో 11 మంది ప్రయాణికులు చిక్కుకుపోగా ఆర్మీ, వైమానిక దళం జరిపిన ఆపరేషన్‌లో 10 మందిని రక్షించారు. ఒకరు మరణించారు. అలాగే జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలో గత ఏప్రిల్‌లో పర్యాటకులు 40 గంటలకు పైగా కేబుల్ కార్లలో చిక్కుకుపోయారు. వారిలో ముగ్గురు మరణించారు. -
పోలీసులపై దూసుకెళ్లిన వ్యాన్!
సాక్షి, చెన్నై: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఓ పర్యాటక వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్పెషల్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాలు.. నామక్కల్ జిల్లా పుదుచత్రం ఏకే సముద్రం జాతీయ రహదారిలో ఆదివారం వేకువ జామున ఓ కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. అదే సమయంలో మరో లారీ సైతం అదే ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న పుదుచత్రం, రాశిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కారులో చిక్కుకున్న నలుగుర్ని రక్షించారు. స్వల్పగాయాల పాలైన వారికి అక్కడే ప్రథమ చికిత్స అందించారు. రోడ్డుకు అడ్డంగా ఆగిన కారు, లారీని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. వేగంగా దూసుకొచ్చి.. తొలగింపు పనుల్లో నిమగ్నమైన పోలీసులు, రెవెన్యూ సిబ్బందిపైకి ఓ పర్యాటక వ్యాన్ దూసుకెళ్లింది. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోపే భారీ నష్టం.. జరిగిపోయింది. పుదుచత్రం స్టేషన్ స్పెషల్ ఎస్ఐ చంద్రశేఖర్(55), రాశిపురం స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ దేవరాజన్(35) ఘటనా స్థలంలోనే మరణించారు. మరో ఇద్దరు పోలీసులు, రెవెన్యూ శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం రాశిపురం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు ఘటనపై దర్యాప్తురు. దేవరాజన్, చంద్రశేఖర్ మృత దేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ సమాచారంతో సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, తలా రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. రిటైర్డ్ ఇన్స్పెక్టర్ను బలిగొన్న బైక్ రేసింగ్ చెన్నై శివారులోని వండలూరు ఎక్స్‌ప్రెస్ వేలో యువకులు బైక్ రేసింగ్‌లో దూసుకెళ్లడం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం అరుంబాక్కంకు చెందిన రిటైర్డ్ మహిళా ఇన్స్పెక్టర్ సెల్వకుమారి మేల కోట్టై పోలీసు క్వార్టర్స్ నుంచి బైక్‌లో బయలు దేరారు. మార్గం మధ్యలో బైక్ రేసింగ్‌లో ఉన్న యువకులు ఆమె వాహనాన్ని ఢీ కొట్టారు. దీంతో ఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందింది. బైక్ రేసింగ్‌లో దూసుకొచ్చిన ఓ యువకుడు ఒకడు గాయపడ్డాడు. మిగిలిన వారు పరారయ్యారు. -
12 ఏళ్లుగా ఆ జంట ప్రయాణం.. బహుశా ఎవరూ చేసుండకపోవచ్చు!
సాక్షి, చెన్నై: జర్మనీకి చెందిన ఓ జంట 12 సంవత్సరాల క్రితం చేపట్టిన పర్యాటక యాత్ర తాజాగా చెన్నైకు చేరింది. లగ్జరీ వసతులతో కూడిన వాహనం ద్వారా ఈ జంట చెన్నై శివారులోని ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం మహాబలిపురానికి చేరుకుంది. జర్మనీకి చెందిన తోల్సన్(30), మిక్కి(36) తొంభై దేశాల్లో పర్యటించేందుకు నిర్ణయించారు. 12 ఏళ్లుగా ఈ జంట ఇజ్రాయిల్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దుబాయ్ తదితర దేశాల్లో పర్యటించింది. గత వారం ఈ వీరు ఓ నౌక ద్వారా ముంబైకు చేరుకున్నారు. ఈ జంట తమ పర్యటనలో లగ్జరీ సౌకర్యంతో కూడిన వాహనం కూడా తెచ్చుకున్నారు. ఇందులో చిన్న పాటి కిచెన్, బెడ్ రూమ్, స్నానపు గది తదితర వసతుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాహనం ప్రస్తుతం మహాబలిపురం సముద్ర తీర ఆలయానికి కూత వేటు దూరంలో ఉంది. ఈ జంటకు స్థానిక పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించారు. అలాగే, అక్కడి గైడ్లు మహాబలిపురం విశిష్టతను వారికి వివరించారు. మరో నాలుగైదు రోజులు చెన్నైలో ఈ జంట పర్యటించనుంది. -
Suraj Bhai Meena: అడవిలో ఆడపులి.. పల్లె కట్టుబాటును దాటి...
Suraj Bhai Meena- దాదాపు 1300 చదరపు కిలోమీటర్లు ఉండే రణథమ్‌బోర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో చాలా ఆడపులులు ఉన్నాయి. వాటిని చూపి ఉపాధి పొందే మగ టూరిస్ట్లూ ఉన్నారు. కాని వారందరి మధ్య ఇంకో ఆడపులి కూడా ఉంది. సూరజ్‌బాయి మీనా. ఆ అడవి దాపున పల్లెలో పుట్టి పెరిగిన మీనా మొదటిసారి ఆ ప్రాంతంలో మహిళా టూరిస్ట్‌గైడ్‌గా మారింది. మగవాళ్లు వద్దన్నారు. ఊరు వద్దంది. కాని ఇప్పుడు ఆమెకు వస్తున్న పేరు చూసి ఊరే మారింది. ఆడపిల్లలను ఆమెలా మారమని చెబుతోంది. రాజస్థాన్‌లోని సవాయి మధోపూర్ టౌన్ చుట్టుపక్కల బనస్ నదిని చుట్టుముడుతూ ఉండే అతి పెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ రణథమ్‌బోర్ 1980 ల నుంచి టూరిజంలో చురుగ్గా ఉంది. అప్పటి నుంచి ఎందరో గైడ్లు ప్రపంచ వ్యాప్తంగా వచ్చే టూరిస్ట్‌లను అడవిలో గైడ్ చేస్తూ ఉంటారు. వారికి పులిని చూపుతూ ఉంటారు. ధైర్యంగా తిరుగుతూ ఉంటారు. అదంతా పురుషుల పనే 2007 వరకూ. కాని ఆ సంవత్సరం మొదటిసారి ఒక మహిళా గైడ్ అడవిలోకి వచ్చింది. సూరజ్‌బాయి మీనా. ఆ అమ్మాయిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు రెండురోజులు ఉండి పారిపోతుంది అనుకున్నారు. కాని ఇవాళ్టి వరకూ సూరజ్‌బాయి మీనా అక్కడ పని చేస్తూనే ఉంది. తనలాంటి మరో నలుగురు మహిళా గైడ్లను తయారు చేసి వారికీ ఉపాధి చూపింది. పల్లె కట్టుబాటును దాటి... సూరజ్‌బాయి మీనాది రణథమ్‌బోర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉన్న భురి పహడి అనే కుగ్రామం. ఏడుగురు అన్నదమ్ముల్లో మీనా ఒక్కతే ఆడపిల్ల. ఆ ఊళ్లో ఎవరికీ చదువు లేదు. ఆడపిల్లలకు అసలే లేదు. ఇంకా చెప్పాలంటే ఆడపిల్ల చదువుకుంటే ఎక్కువ కట్నం ఇవ్వాలి. ఆ చుట్టుపక్కల చెప్పే చదువులో 8వ తరగతి తర్వాతే ఏబిసిడిలు నేర్పిస్తారు. అలాంటి చోటు నుంచి బయలుదేరింది మీనా. ‘మా అన్నయ్య హేమరాజ్ మొదట రిజర్వ్ ఫారెస్ట్‌లో చేరాడు. నేను అప్పుడప్పుడు వాడితో కలిసి అడవిలోకి వచ్చేదాన్ని. అడవి నాకు చాలా నచ్చేది. నేను కూడా అన్నయ్యలాగే గైడ్ అవ్వాలనుకున్నాను. కాని అది అంత సులభం కాదని నాకు తెలుసు’ అంది మీనా. తల్లిదండ్రులను ఒప్పించి టెన్త్ చదివిన మీనా ఒకటి రెండేళ్ల తర్వాత గైడ్‌గా మారడానికి నిశ్చయించుకుంది. కాని ఈ విషయం ఊళ్లో ఎవరికీ నచ్చలేదు. వచ్చి అందరూ ఆమె తల్లిదండ్రులను తిట్టారు. ‘ఆ ఫారిన్ వాళ్లు వచ్చి నిన్నేమైనా చేస్తే? వాళ్ల మధ్యన పడి నువ్వు మా పరువు తీస్తే’ అని తల్లి ఆందోళన చెందింది. మీనా అన్నయ్యల్లో హేమరాజ్ తప్ప మిగిలిన వారు కూడా మద్దతు ఇవ్వలేదు. కాని హేమరాజ్ ఆమెకు అండగా నిలిచాడు. చెల్లెలు ఉద్యోగస్తురాలవ్వాలని ఒప్పించాడు. సవాయి మధోపూర్‌కు తీసుకెళ్లి ఫారెస్ట్ వాళ్ల ట్రైనింగ్‌కు అప్లికేషన్ పెట్టించాడు. చెల్లెలు అక్కడ ట్రైనింగ్ తీసుకునేందుకు ఏర్పాటు చేశాడు. అక్టోబర్ 2007లో మీనా తొలి మహిళా గైడ్‌గా అడవిలో ప్రవేశించింది. పులినీ... విమర్శనూ ఇప్పుడు మీనాకు రెండు సవాళ్లు ఎదురయ్యాయి. ఒకటి ఫారెస్ట్‌లో పని చేస్తున్న పురుష గైడ్ల సమ్మతి పొందడం. రెండు టూరిస్ట్‌లతో ఇంగ్లిష్ మాట్లాడటం. మీనా పనికి వచ్చిన కొత్తల్లో పురుష గైడ్లు ‘నీకిక్కడ ఏం పని?’ అన్నట్టుగా చూసేవారు. ఆమె కూడా యూనిఫామ్ వేసుకుని సఫారీలో టూరిస్ట్‌లను ఎక్కించుకుని అడవి చూపించడానికి బయలుదేరితే కోపంగా చూసేవారు. ఇంకోవైపు ఫారిన్ టూరిస్ట్‌లకు అడవిలో చెట్ల పేర్లు, పక్షుల పేర్లు, జంతువుల పేర్లు ఇంగ్లిష్‌లో చెప్పాల్సి వచ్చేది. అన్న సాయంతో మీనా ఆ పేర్లన్నీ హిందీ లిపీలో రాసుకుని ఇంగ్లిష్‌ని సాధన చేసి నేర్చుకుంది. చిన్న పెద్ద వాక్యాలు పలకడం తెలుసుకుంది. ఖాళీగా ఉన్నప్పుడు అడవంతా తిరుగుతూ పక్షుల్ని గుర్తించేది. ఆమెకు సరదాగా మాట్లాడటం వచ్చు. టూరిస్ట్‌లను నవ్వించేది. క్రమంగా ఆమె అందరికీ నచ్చింది. పులితో భేటి రణథమ్‌బోర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఇప్పుడు 80 పులులు ఉన్నాయి. అన్నింటికీ పేర్లు ఉన్నాయి. అన్ని పులులనూ మీనా గుర్తించగలదు. ‘పులి కనిపిస్తే టూరిస్ట్‌లకు దాని పేరు చెప్తాను. అన్ని పులులు ఒక్కలాగే ఉంటాయి. దాని పేరే అదేనని నీకెలా తెలుసు అని చాలామంది టూరిస్ట్‌లు అడుగుతారు. ఏం చెప్పమంటారు’ అంటుంది. ఫారెస్ట్‌కు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు, బర్డ్ వాచర్స్, ప్రకృతి ప్రేమికులు చాలామంది వస్తుంటారు. మీనా అడవి చూపిస్తుంటుంది. ‘ఒక ఫోటోగ్రాఫర్ పులిని ఫోటో తీస్తూ జిప్సీ నుంచి కింద పడ్డాడు. నేను వెంటనే జిప్సీ దిగి అతనికి, పులికీ మధ్య నిలబడ్డాను. లక్కీగా అది ఏమీ చేయకుండా వెళ్లిపోయింది’ అంది మీనా. కొన్నిసార్లు పులి జిప్సీ బానెట్ మీదకు లంఘిస్తూ ఉంటుంది. కాని ఎప్పుడూ ఎలాంటి అపాయం జరగలేదు. ‘పులి కనిపించకపోతే టూరిస్ట్‌లు విసుక్కుంటారు. పులిని చూపించు అంటారు. అది నేను రమ్మంటే రాదు కదా. అంతగా కచ్చితంగా చూడాలంటే జూకు వెళ్లండి అని చెప్తుంటాను’ అని నవ్వుతుంది మీనా. జీవితం పులిలా వెంటబడితే మనిషికి పులి కంటే ఎక్కువ ధైర్యం వస్తుంది. తన జీవితాన్ని మలుచుకోవడానికి మీనా సివంగిలా మారింది. ఇద్దరు పిల్లలు, భర్తతో ఆమె సంతోషంగా ఉంది. అన్నట్టు బి.ఇడి వరకూ చదివేసింది కూడా. కలవాలంటే ఈ వేసవిలో రణథమ్‌బోర్ ట్రిప్ వేయండి. -
బ్యాంకాక్ టూర్ వెళ్తున్నారా? మీకో ముఖ్యగమనిక
కరోనా కారణంగా భారీగా దెబ్బతిన్న రంగం పర్యాటకం. ట్రావెల్ బ్యాన్, కఠిన ఆంక్షల కారణంగా లెక్కకు అందని నష్టం వాటిల్లింది ఈ రంగానికి. ముఖ్యంగా లక్షల మంది ఉపాధి లేకుండా పోయారు. మరోవైపు టూరిజం ఆకర్షణగా ఉన్న ప్రాంతాలు.. ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నాయి. ఈ తరుణంలో థాయ్‌లాండ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. థాయ్‌లాండ్‌కు టూర్ మీద వెళ్లే వాళ్లు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే. ఈ మేరకు 300 బహ్త్(9 డాలర్లు-మన కరెన్సీలో 665 రూ.) టూరిస్ట్ ఎంట్రీ ఫీజును ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎంట్రీ ఫీజును సందర్శన ప్రాంతాల అభివృద్ధి కోసం, అలాగే సందర్శకుల ఇన్సూరెన్స్ కోసం ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఎంట్రీ ఫీజు నిర్ణయం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే విమాన ప్రయాణికుల విషయంలో.. ఈ ఫీజును విమాన ఛార్జీలకు ఏప్రిల్ నుంచి జత చేయనున్నట్లు పేర్కొంది. అయితే ఇతర మార్గాల గుండా వచ్చే సందర్శకుల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ ఫీజు.. చాలాదేశాల్లో వసూలు చేస్తున్న టూరిస్ట్ ఫీజుకు సమానంగానే ఉందని, కానీ, సందర్శకులకు కలిగే ప్రయోజనాలు మాత్రం అదనంగా ఉంటున్నాయని లెక్కలతో సహా చెప్తోంది థాయ్‌లాండ్ ప్రభుత్వం. ఒకవైపు ప్రపంచం అంతా ఒమిక్రాన్, కరోనా కేసుల భయంతో ఆంక్షలు విధిస్తుంటే.. థాయ్‌లాండ్ మాత్రం టూరిస్టులకు వెల్కమ్ చెప్తోంది. భారత్ నుంచి రాజధాని బ్యాంకాక్‌కు ఎక్కువ మంది క్యూ కడతారన్న విషయం తెలిసిందే. ఇక కరోనా కారణంగా దెబ్బతిన్న థాయ్ టూరిజాన్ని.. తిరిగి నిలదొక్కుకునేలా చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలోనే టూరిజం ఎంట్రీ ఫీజు విధించింది. ప్రస్తుతం యాభై లక్షల మంది సందర్శకులు వస్తారని థాయ్ ప్రభుత్వం భావిస్తోంది. యూరప్, అమెరికాల నుంచి రెగ్యులర్ టూరిస్టుల తాకిడి ఉందని ప్రకటించుకుంది. మరోవైపు భారత్, చైనా గనుక తమ ప్రజలకు సడలింపులు ఇస్తే.. ఆ సంఖ్య 90 లక్షలకు చేరుతుందని భావిస్తోంది. ఒకవేళ భూమార్గం సరిహద్దులు గనుక తెరిస్తే.. ఆ సంఖ్య కోటి యాభై లక్షలకు చేరొచ్చని అంచనా వేస్తోంది. చదవండి: మహీంద్రా గ్రూప్స్ సంచలన నిర్ణయం -
షాకింగ్ ఘటన: ‘జైలోను పట్టుకుని వెనక్కు లాగిన పులి’.. ఆనంద్ మహీంద్ర ట్వీట్..
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన తరచుగా.. స్ఫూర్తీదాయక .. సందేశాత్మక వీడియోలు, ఫన్నీ వీడియోలను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. తాజాగా ఆయన ఒక వెరైటీ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. కొందరు టూరిస్టులు బన్నేర్‌ఘట్ నేషనల్ పార్కును సందర్శించడానికి వెళ్లారు. వారంతా ప్రత్యేక వాహనంలో ప్రయాణిస్తున్నారు. అప్పుడు.. మైసూరులోని తేప్పెకాడు వద్ద ఉన్న చిరుతపులుల ఎన్‌క్లోజర్ గుండా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో వారికి షాకింగ్ ఘటన ఎదురైంది. పర్యాటకులు పులుల గుంపును చూసి తమ జైలో వాహనాన్ని పార్క్ చేశారు. అక్కడ ఉన్న పులులను తమ ఫోన్లతో ఫోటోలు తీసుకుంటున్నారు. అప్పుడు.. ఒక పులి జైలో వెనుక నుంచి వచ్చింది. పాపం.. వాహనాన్ని చూసి ఎమనుకుందో.. కానీ.. ఆ తర్వాత గాండ్రిస్తూ వాహనం వెనుక బంపర్‌ను తన పదునైన పళ్లతో పట్టుకుంది. అంతటితో ఆగకుండా బలంగా వెనక్కు లాగింది. వాహనంలో ఉన్న పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వాహనం కొన్ని మీటర్ల దూరం వెనుకవైపుకి వెళ్లింది. మరోక వాహనంలో ఉన్న యశ్షా అనే వ్యక్తి ఈ ఘటనను రికార్డు చేశారు. ఆ తర్వాత కొన్నిరోజులకు తన ఇన్‌స్టాలో షేర్చేశాడు. ఈ ఘటన గతంలోనే జరిగింది. తాజాగా, వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర దీన్ని తన ఇన్‌స్టా పోస్ట్ చేయడంతో.. ఇది మరోసారి ఈ ఘటన వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘అబ్బో.. జైలో వాహనాన్ని భలే లాగేస్తుంది..’, ‘పులి బలమైన పళ్ల వెనుక రహస్యమేంటబ్బా’, ‘ పులి పెప్స్డెంట్ వాడుతుందా.. కోల్గెట్ వాడుతుందా..? ’ , ‘ వాటే.. టైగర్ పవర్, హర్స్ పవర్..’, ‘ జైలో అంటే పులికి ఎంత ప్రేమో..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Going around #Signal like wildfire. Apparently on the Ooty to Mysore Road near Theppakadu. Well, that car is a Xylo, so I guess I’m not surprised he’s chewing on it. He probably shares my view that Mahindra cars are Deeeliciousss. 😊 pic.twitter.com/A2w7162oVU — anand mahindra (@anandmahindra) December 30, 2021 చదవండి: వైరల్‌గా మారిన ‘మజ్ను మిస్సింగ్’ యాడ్.. పూర్తిగా చదవకపోతే పప్పులో కాలేసినట్టే! -
ఏపీలో గోవా తరహా బీచ్‌లు, కేరళ బ్యాక్ వాటర్ అందాల.. ఎక్కడో తెలుసా?
సాక్షి, అమరావతి: మంచు సోయగాల సొగసులో.. పైరగాలుల చలిలో.. పచ్చని దుప్పటిలో.. హాయిగా ఒదిగి.. గోదావరి గలగలల మధ్య.. పిల్లకాలువల సవ్వడిలో మునిగి.. దివిని మించిన దీవిలా ప్రకృతి ఒడిలో దిండి సేదతీరుతోంది. గోవా తరహా బీచ్‌లు.. కేరళలో కనిపించే బ్యాక్‌వాటర్స్ అందాలు.. హౌస్ బోట్ల పరుగుల సమాహారంతో కోనసీమ సిగలో సరికొత్త అందాలను సంతరించుకుని .. పర్యాటకులను ‘దిండి’ యాత్రకు ఆహ్వానిస్తోంది. అటు గోదావరి.. ఇటు సముద్రం ఒకవైపు బంగాళాఖాతం.. మరోవైపు గోదావరి.. ఈ రెండింటి సంగమం అన్నాచెల్లెళ్ల గట్టును బోటు ప్రమాణంలో వీక్షించవచ్చు. సముద్రం ఒడ్డును కొలువైన లక్ష్మీనరసింహస్వామి, సమీపంలోని అయినవిల్లి, ముక్తేశ్వరం ఆలయాలను దర్శించవచ్చు. శతాబ్దాలుగా భద్రపరచబడిన తమిళ సంస్కృతిని చాటే పేరూరు వారసత్వం గ్రామం, లైట్‌హౌస్ ఇతర సందర్శనీయ స్థలాలు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి 80 కిలో మీటర్లు, రాజోలు నుంచి 8 కిలోమీటర్లు, పాలకొల్లు రైల్వే స్టేషన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దిండి ఉంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు పర్యటనకు అనుకూలం. దిండిలో రెండు రిసార్టులు దిండిలో పర్యాటక శాఖకు చెందిన హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్‌లో 32 ఏసీ గదులతో పాటు రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాల్, స్విమ్మింగ్ పూల్ ఉంది. సాధారణ రోజుల్లో రోజుకు 50శాతం ఆక్యుపెన్సీతోనూ, వీకెండ్లో వంద శాతం గదులు నిండిపోతున్నాయి. అంతేకాకుండా దిండిలో వాటర్ స్పోర్ట్స్ ఆస్వాదించేందుకు 200 నుంచి 500 మందికి పైగా పర్యాటకులు వస్తున్నారు. దిండి కోనసీమ గాడ్ సిటీ కేరళ తరహా అందాలకు దిండి పెట్టింది పేరు. ఇక్కడ పర్యాటక శాఖ రిసార్టు అత్యాధుని సౌకర్యాలతో బస కల్పిస్తోంది. హౌస్ బోట్ల ప్రయాణం కోసం పర్యాటకులు పోటీపడుతుంటారు. వీటిని కుటుంబ సమేతంగా గడపడానికి అనువుగా తీర్చిదిద్దాం. – సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీపీ ప్రత్యేక ఆకర్షణగా హౌస్ బోట్లు.. తూర్పుగోదావరి జిల్లాలోని దిండిలోని దట్టమైన మడ అడవులు మధ్య బ్యాక్ వాటర్స్‌లో బోటు ప్రయాణం పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర పర్యాటక శాఖ కేరళ తరహా హౌస్బోట్లను ప్రవేశపెట్టింది. వీటిలో అటాచ్డ్ బాత్రూమ్, ఏసీ, సిటౌట్, డైనింగ్ ఏరియా... ఇలా నక్షత్రాల హోటల్‌ను మరిపించే సౌకర్యాలతో రెండు హౌస్ బోట్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఈ బోట్లు దాదాపు 40 కిలో మీటర్ల మేర గోదావరిలో ప్రయాణిస్తాయి. దిండిలో బయలు దేరి రాజోలు లంక ఐలాండ్Š, నరసాపురం రేవు నుంచి తిరిగి గమ్యస్థానానికి చేరుకుంటాయి. మరోవైపు రెండు పాంటూన్ బోట్లు, ఒక లగ్జరీ బోటు, స్పీడ్ బోటు సౌకర్యం కూడా ఉంది. చదవండి: ఒంగోలు జాతి కోడె దూడ ధర రూ.2 లక్షలు -
జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్న 120 మంది సిక్కోలు యాత్రికులు
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నుంచి సింధు పుష్కరాలకు వెళ్లిన జిల్లా వాసులకు చేదు అనుభవం ఎదురైంది. మైసూర్‌కు చెందిన అకుల్ ట్రావెల్స్ ఏజెన్సీ ప్రతినిధులు.. శ్రీకాకుళం స్థానికులను టూరిజం పేరుతో యాత్రకు తీసుకెళ్లారు. ఒక్కొ కపుల్ నుంచి 60 వేలను ట్రావెల్ సిబ్బంది వసూలుచేశారు. ఈ క్రమంలో 120 మంది యాత్రికులు జమ్ముకశ్మీర్‌లోని కట్రా వద్ద హోటల్‌కి చేరుకున్నారు. ఆ తర్వాత.. ట్రావెల్ సిబ్బంది యాత్రికులను అక్కడ వదిలేసి పరారయ్యారు. దీంతో హోటల్ వారు డబ్బులు కట్టాలని 120 మంది యాత్రికులు నిర్భందించారు. ప్రతి ఒక్కరు.. తలా పదివేలు కట్టాలంటూ యాత్రికులను హోటల్ సిబ్బంది డిమాండ్ చేశారు. దీంతో యాత్రికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యాత్రికులలో ఎక్కువగా.. పాలకొండ, నరసన్నపేట గ్రామానికి చెందిన వారున్నట్లు అధికారులు తెలిపారు. -
Seethampeta: వనవిహారీ.. ఇదీ దారి
వేకువ గాలులు నొసటన ముద్దాడుతూ ఉంటే ఈ కొండల్లో విహరించాలి. సూరీడి కిరణాలు నడినెత్తిపై వచ్చే వేళకు ఆ జలపాతం మన శిరసుపై నుంచి పాదాలపైకి దూకాలి. కడుపు లోపల చల్ల కదలకుండా సున్నపుగెడ్డ మధ్యన నడుం వాల్చాలి. వెలుతురు వెళ్లి చీకటి ఇంకా రాని ఆ కొన్ని ఘడియల పాటు చెమట్లు వచ్చేలా సాహస క్రీడల్లో మునిగి తేలాలి. కార్తీక వన విహారానికి ఇంతకు మించిన సాఫల్యత ఏముంటుంది..? ఇవన్నీ నిజం కావాలంటే మంచి సెలవు రోజు చూసుకుని చలో సీతంపేట అనేయడమే. సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం): సీతంపేట రారమ్మంటోంది. కార్తీకంలో వన విహారానికి తన బెస్ట్ టూరిజం ప్రదేశాలను చూపిస్తూ ఆకర్షిస్తోంది. ఓ వైపు జలపాతాలు, మరోవైపు పార్కు, ఇంకో వైపు అడవుల అందాలతో మన్యం అద్భుతంగా కనిపిస్తోంది. ఏటా ఎన్టీఆర్ అడ్వంచర్ పార్కు, జగతపల్లి, ఆడలి వ్యూపాయింట్లను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలతో పాటు ఇటు ఒడిశా నుంచి కూడా పర్యాటకులు క్యూ కడుతుంటారు. సాహస క్రీడా వినోదం సీతంపేట అడ్వంచర్ పార్కు స్థానికంగా దోనుబాయి రహదారి మలుపునకు సమీపంలో ఉంది. ఇక్కడ జలవిహార్‌లో బోటుషికారు ఏర్పాటు చేశారు. సైక్లింగ్, జెయింట్‌వీల్, ఆల్టర్న్ వెహికల్, షూటింగ్, బంజీట్రంపోలిన్ వంటివి ఉన్నాయి. సున్నపుగెడ్డకు ఇలా.. ఏజెన్సీలోని సున్నపు గెడ్డ జలపాతానికి మంచి ప్రాధాన్యం ఉంది. ఇక్కడ వాతావరణం చూపరుల్ని కట్టిపడేస్తుంది. దోనుబాయి గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో సున్నపుగెడ్డ ఉంది. పొల్ల– దోనుబాయి మార్గంలో మేకవ గ్రామానికి సమీపంలో రోడ్డుదిగువ గుండా నడుచుకుంటూ వెళితే సున్నపుగెడ్డ జలపాతానికి చేరుకోవచ్చు. బస్సులు పరిమితంగా ఉంటాయి. సీతంపేట వచ్చి ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. సదుపాయాలు అంతంత మాత్రమే. తిను బండారాలు ఇతర ఆహార సామగ్రి పర్యాటకులు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మెట్టుగూడ.. ఇక్కడ.. ► మెట్టుగూడ జలపాతం మంచి ప్రాచుర్యం పొందింది. మా మూలు రోజుల్లో కూడా ఇక్కడకు వచ్చే సందర్శకుల సంఖ్య అ ధికంగా ఉంటుంది. ► సీతంపేట నుంచి కొత్తూరుకు వెళ్లే రహదారిలో ఈ జలపాతం ఉంది. ► కొత్తూరు నుంచి వస్తే 10 కిలోమీటర్లు, పాలకొండ నుంచి వస్తే 17 కిలోమీటర్ల దూరంలో రహదారి పక్కనే మెట్టుగూడ వస్తుంది. ► అక్కడ వాహనాలు దిగి కొద్ది దూరం నడిచి వెళ్తే జలపాతాన్ని చేరుకోవచ్చు. ► ఆర్టీసీ బస్సులు పాలకొండ–కొత్తూరు నుంచి అనునిత్యం తిరుగుతుంటాయి. పర్యాటకులకు అన్ని సౌకర్యాలున్నాయి. వ్యూపాయింట్ భలే పొల్ల: సున్నపుగెడ్డకు సమీపంలో పొల్ల వ్యూ పాయింట్ ఉంది. ఆడలి: ఏజెన్సీలోని ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లాలంటే కుశిమి జంక్షన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రత్యేక వాహనాల్లో వెళ్లాలి. జగతపల్లి: సీతంపేట నుంచి7 కిలోమీటర్ల దూరంలో జగతపల్లి ఉంది. వీటిని వీక్షించడానికి ప్రత్యేక టూరిజం వెహికల్‌ను ఏర్పాటు చేశారు. -
రామప్ప దగ్గర భూముల ధరకు రెక్కలు
హాలో సునీల్ అన్నా, బాగున్నవా ? నేను శ్రావణ్‌ని మాట్లాడుతున్న.. మన రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది కదా.. మన తరఫున అక్కడో వెంచర్ వేద్దామని ప్లాన్ చేస్తున్నం.. నువ్వే జర మంచి జాగ చూపియ్యాలే.. పైసలెంతైనా పర్వాలేదు. కానీ మనకు ఆడ జాగ కావాలే. నువ్వేంజేస్తవో ఏమో.. నిన్ను కూడా అరుసుకుంట. ఒక్క సునీల్కే కాదు రామప్ప ఆలయం కొలువైన పాలంపేట దాని చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజల ఫోన్లు వారం రోజులగా మోగుతూనే ఉన్నాయి. భూముల కోసం ఆరాలు తీస్తునే ఉన్నారు. నిమిషాల లెక్కన అక్కడ భూముల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం ఆలస్యం రామప్పలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ఊహించని స్థాయికి చేరుకున్నాయి. వరంగల్, హైదరాబాద్‌ల నుంచి బడా రియల్టర్లు ఇక్కడ వాలిపోతున్నారు. ధరెంతైనా పర్వాలేదు.. ఇక్కడ మనకో వెంచర్ ఉండాలన్నట్టుగా బేరాలకు దిగుతున్నారు. యునెస్కో గుర్తింపు కాకతీయులు ఎనిమిది వందల ఏళ్ల కిందట కట్టించిన రుద్రేశ్వరాలయాలన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ఇటీవల యునెస్కో గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్తింపు దక్కించుకున్న తొలి కట్టడంగా రికార్డులెక్కింది. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్పగుడిని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో పాటు ఒక్కసారిగా ఆలయం చుట్టు పక్కల స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. గుర్తింపుతో రెట్టింపు ఆలయానికి సమీపంలోనే రామప్ప చెరువు ఉంది. సాగునీటి లభ్యత ఉండటంతో ఇక్కడి భూములకు ముందు నుంచి డిమాండ్ ఎక్కువ. ఎకరం పొలం సుమారు రూ. 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పలికేది. అయితే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం ఒక్కసారిగా ఎకరం భూమి ధర రూ. 40 లక్షల నుంచి 45 లక్షలకు చేరుకుంది. వారం తిరక్కుండానే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం వరంగల్, హైదరాబాద్‌లకి చెందిన రియల్టర్లు ఇక్కడి స్థలాల కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. తమకే స్థలాలు అమ్మాలంటూ రైతులతో సంప్రదింపులు మొదలెట్టారు. దీంతో రియల్టర్ల మధ్య నెలకొన్న పోటీతో వారం తిరిగే సరికి ఇక్కడ ఎకరం భూమి ధర రూ. 60 లక్షల నుంచి 65 లక్షలకు చేరుకుంది. ఇక్కడే డిమాండ్ రామప్ప దేవాలయం ములుగు జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, వరంగల్ నగరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉంది. వరంగల్ - భూపాలపట్నం జాతీయ రహదారి 163లో జంగాలపల్లి క్రాస్‌రోడ్డు నుంచి రామప్ప ఆలయం వరకు ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలోని భూములకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా రియల్టర్లు ఆఫర్లు ఇస్తుండటంతో ఇక్కడి రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు అగ్రిమెంట్లు చేసుకునేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు మరింత రేటు పెరుగుతుందేమో అని వేచి చేసే ధోరణిలో ఉన్నారు. యాదగిరిగుట్ట యాదాద్రి తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణం భువనగిరి-యాదగిరిగుట్ట-ఆలేరు రోడ్డులో భూముల ధరకు రెక్కలు వచ్చాయి. నెలల వ్యవధిలోనే వందల కొద్ది వెంచర్లు వెలిశాయి. ప్రమోటర్లను పెట్టుకుని లే అవుట్ పూర్తికాకముందే ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి రామప్ప దగ్గరా కనిపిస్తోంది. ఇక్కడ వెంచర్లు వేసేందుకు రియల్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. భద్రాకాళి ఆలయం పర్యాటక కేంద్రం తెలంగాణలో హైదరాబాద్‌ని మినహాయిస్తే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిలుస్తోంది. వరంగల్‌లో వేయిస్థంభాలగుడి, భద్రాకాళి, ఖిలావరంగల్ మొదలు రామప్ప ఆలయం, సమ్మక్క సారలమ్మ మేడారం, లక్నవరం, పాకాల, బొగత జలపాతం, మల్లూరు నరసింహస్వామి, కాళేశ్వరం, పాండవులగుట్ట, ఘణపురం కోటగుళ్లు, ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి ఏకో టూరిజం, ప్రాచీన కాలానికి చెందిన డోల్మన్ సమాధాలు వంటి ఆథ్యాత్మిక పర్యాటక, ప్రకృతి రమణీయ ప్రాంతాలు వరుసగా ఉన్నాయి. ఆదివారం వస్తే పర్యాటకుల వాహనాలు వరంగల్ - ఏటూరునాగారం రోడ్డులో బారులు తీరుతాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో టూరిజం సర్క్యూట్‌ని అభివృద్ధి చేస్తున్నాయి. బొగత జలపాతం ఢోకాలేదు తాజాగా యునెస్కో గుర్తింపు రావడంతో రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాయి. ఇప్పటికే పాలంపేట ప్రాథికార సంస్థ ఏర్పాటును చేశారు. మరోవైపు త్వరలోనే వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వరంల్ టూరిజం సర్క్యూట్లో అటు బొగత జలపాతం ఇటు వరంగల్ నగరానికి నట్టనడుమ రామప్ప కొలువై ఉంది. దీంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు లేవు. దీంతో రామప్ప దగ్గర పెట్టుబడికి ఢోకా లేదనే నమ్మకం రియల్టర్లలో నెలకొంది. హోటళ్లు రిసార్టులు రామప్ప దగ్గర భూములు కొనేందుకు రియల్టర్లతో పాటు బడా కంపెనీలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రామప్ప సమీపంలో హోటళ్లు, రిసార్టులు కట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి అనువుగా ఉండే స్థలం కోసం అన్వేషణ చేస్తున్నాయి. -
మచు పిచ్చుపై అతనొక్కడే.. ఎందుకంటే
లిమా, పెరూ: పెరూ దేశంలోని మచు పిచ్చు ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మచు పిచ్చు కూడా మూత పడింది. అయితే ఈ పర్యాటక ప్రాంతాన్ని కేవలం ఒక్కడి కోసం తెరిచారు. అయితే అతడేమైనా అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీనా అంటే అది కాదు. మరి ఏంటా ఆ వ్యక్తి ప్రత్యేకత అంటే ఓ సారి ఇది చదవండి.. జపాన్‌కు చెందిన బాక్సింగ్ ట్రైనర్ జెస్సీ కటయామా అనే వ్యక్తి మచు పిచ్చు గంభీర పర్వత శిఖరం చూడాలని భావించాడు. దాంతో మార్చిలో పెరూ చేరుకున్నాడు. అయితే దురదృష్టం కొద్ది కోవిడ్ వ్యాప్తి పెరగడం.. లాక్డౌన్ విధించడం వెంటవెంటనే జరిగాయి. పాపం మూడు రోజుల పర్యటన నిమిత్తం పెరూ చెరుకున్న జెస్సీ ఏకంగా ఆరు నెలల పాటు అక్కడే చిక్కుకుపోయాడు. ఈ క్రమంలో తన పరిస్థితి గురించి స్థానిక మీడియాకు తెలియజేశాడు. అది కాస్త పర్యాటక అథారిటీకి చేరడంతో ప్రత్యేక అనుమతితో అతడిని మచు పిచ్చు సందర్శించేందుకు అంగీకరించారు పెరూ అధికారులు. దాంతో అతడి కల నిజమయ్యింది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ మొదలైన నాటి నుంచి మచు పిచ్చుని దర్శించిన మొదటి వ్యక్తిని నేనే. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన స్థానిక అధికారులకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ స్థానిక టూరిజం అథారిటీ ఫేస్బుక్ పేజీలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. (చదవండి: దొంగల గుహలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?) 16 వ శతాబ్దంలో స్పానిష్ ఆక్రమణకు ముందు పశ్చిమ దక్షిణ అమెరికాలో 100 సంవత్సరాల పాటు పాలించిన ఇంకా సామ్రాజ్యపు శాశ్వతమైన వారసత్వం మచు పిచ్చు. ఇంకా సెటిల్మెంట్ శిధిలాలను 1911 లో అమెరికన్ అన్వేషకుడు హిరామ్ బింగ్హామ్ తిరిగి కనుగొన్నారు. ఆ తర్వాత 1983 లో యునెస్కో మచు పిచ్చును ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. అయితే లాక్డౌన్ కారణంగా ముసి వేసిన మచు పిచ్చును మొదట జూలైలో తిరిగి తెరవాలని నిర్ణయించారు. కానీ అది నవంబర్‌కు వాయిదా పడింది. -
కోవిడ్ : ఫ్రాన్స్‌లో చైనా పర్యాటకుని మృతి
పారిస్ : ప్రాణాంతకమైన కోవిడ్-19 (కరోనావైరస్) వ్యాధితో ఫ్రాన్స్‌లో ఒక వృద్ధుడు మరణించాడు. 80 ఏళ్ల చైనా పర్యాటకుడు ఫ్రాన్స్‌లో మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఆగ్నెస్ బుజిన్ శనివారం ప్రకటించారు. గత మూడు వారాలుగా ఉత్తర పారిస్‌లోని బిచాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మరణించినట్లు తెలిపారు. 11 ధృవీకరించబడిన కరోనా వైరస్ కేసులలో ఒకరు చనిపోయారని ఆయన తెలిపారు. దీంతో యూరప్‌లో తొలి కరోనావైరస్ మరణంగా ఇది నిలిచింది. కాగా చైనాలో వుహాన్‌లో గత ఏడాది చివరలో గుర్తించిన కరోనావైరస్ అంతకంతకూ విస్తరించి ఆందోళన రేపింది. ఈవ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 1500 దాటింది. ప్రపంచవ్యాప్తంగా 66,000 కన్నా ఎక్కువ కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. -
సీఏఏ : నార్వే టూరిస్టును వెళ్లగొట్టారు!
త్రివేండ్రం : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు గాను నార్వే టూరిస్టును అధికారులు దేశం నుంచి పంపించేశారు. వివరాలు.. నార్వే దేశానికి చెందిన మాజీ నర్సు జాన్నె మెట్టె జాన్సన్ (74) డిసెంబర్ 17న భారతదేశ సందర్శనకు వచ్చింది. ఈ క్రమంలో 23వ తేదీన కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఉండగా, అక్కడ స్థానికులు సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తుండడంతో జాన్సన్ కూడా పాల్గొంది. అనంతరం నిరసనలో తన అనుభవాల గురించి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని గమనించిన అధికారులు ఆమె ఫేస్బుక్ ఖాతాను తనిఖీ చేయగా, అందులో అరుంధతీరాయ్ చేసిన వ్యాఖ్యలను షేర్ చేయడంతో పాటు సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఉన్న కామెంట్లను గుర్తించారు. ఈ నేపథ్యంలో వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను వెంటనే దేశం విడిచి వెళ్లాలంటూ అధికారులు జాన్సన్‌కు ఆదేశాలు జారీ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై జాన్సన్‌ను సంప్రదించగా, అధికారులు చెప్పేదంతా నిజమేనని ఒప్పుకుంది. అయితే దేశం నుంచి వెళ్లిపోవడానికి తాను సిద్ధపడినా, అధికారులు మాత్రం విమాన టిక్కెట్ బుక్ చేసేదాకా వదలలేదని, వారికి విమాన టిక్కెట్టు చూపించిన తర్వాతే శాంతించారని పేర్కొంది. కాగా, కొన్ని రోజుల ముందు మద్రాస్ ఐఐటీలో ఓ జర్మన్ విద్యార్థి కూడా నిరసనల్లో పాల్గొన్నందుకు అధికారుల ఆదేశాల మేరకు దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. చదవండి : దేశం విడిచి వెళ్లాలంటూ జర్మన్ విద్యార్థికి ఆదేశం -
తప్పిపోయిన అమెరికా టూరిస్ట్, తిరిగి గోవాలో..
పనాజీ: గత నెలలో అదృశ్యమైన అమెరికన్ టూరిస్ట్ తిరిగి గోవా తిరిగి వచ్చింది. వివరాల్లోకి వెళితే ....గత నెల 24న గోవాలో జరిగిన యోగా ఉత్సవాల్లో పాల్గొడానికి కుటుంబ సభ్యులతో సహా ఇరవై యేళ్ల ఎలిజబెత్ భారతదేశానికి వచ్చారు. బీచ్‌కు సమీపంలో ఓ హస్టల్లో ఆమె ఉంటున్నారు. కాగా అంజునా బీచ్ చూడటానికి హాస్టల్ నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీసులను కుమార్తె తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎలిజబెత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అనూహ్యంగా ఎలిజబెత్ మన్ శనివారం తిరిగి గోవాకి రావటంలో పోలీసులు.... ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. గోవాకి తిరిగి వచ్చిన ఎలిజబెత్ తన వద్ద ఫోన్, ఇతర ఏ వస్తువులు లేకుండా మహారాష్ట్రాలోని పంచగాని ప్రాంతానికి టాక్సీ ద్వారా వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వద్ద నుంచి వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక ఎలిజబెత్ మన్ క్షేమంగా తిరిగి రావడంలో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో పాటు తమ కుమార్తెను వెతకటంకోసం ఫేస్ బుక్‌లో ఓ గ్రూప్‌ను క్రియేట్ చేశామని తెలిపారు. -
విహంగ విహారి
త్రి సముద్ర తోయ పీత వాహన... ఇది గౌతమీ పుత్ర శాతకర్ణికి ఉన్న బిరుదు. దీనర్థం మూడు సముద్రాల నీటిని తాగిన గుర్రాన్ని వాహనంగా కలిగిన వాడు అని. ఇక్కడ కవి భావం గుర్రం సముద్రం నీటిని తాగిందని కాదు. ఈ మూడు సముద్రాల మధ్యన ఉన్న ప్రదేశాన్నంతటినీ జయించిన వాడు అని అర్థం. మరి... ఈ మూడు సముద్రాల మధ్యనున్న భూభాగాన్ని ఆద్యంతం పర్యటించిన టూరిస్టును ఏమనాలి? వీటితోపాటు ఖండాలు దాటి విహరించిన విహారిని ఏమనాలి? విశ్వ విహారి అనవచ్చా? ‘‘మరో రెండు ఖండాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఆ విశేషణానికి అర్హత లభిస్తుంది. మరో మూడు– నాలుగేళ్లలో అవి కూడా పూర్తి చేస్తాను’’ అంటున్నారు రజని లక్కా. గుంటూరులో పుట్టి, అనంతపూర్‌లో మెట్టి, బళ్లారిలో స్థిరపడిన మన తెలుగింటి మహిళ రజని. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆమె తన పర్యాటక అనుభవాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘స్విమ్మింగ్ కోచ్‌గా నేను ఏడాదిలో పది నెలలు టైట్ షెడ్యూల్స్‌తో పనిచేస్తాను. వెకేషన్ నన్ను బూస్టప్ చేస్తుంది. అందుకే ఏటా తప్పకుండా నేషనల్ లేదా ఇంటర్నేషనల్ ఏదో ఒక టూర్ చేస్తాను. అన్నవరం నుంచి అమెరికా వరకు, కూర్గ్ నుంచి కెనడా వరకు ప్రతి పర్యటన నుంచి దానికదే ప్రత్యేకమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాను. మన దేశంలోని శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు, కోటలు, సరస్సులు, సముద్రాలు, జలపాతాలను చాలా వరకు చూసేశాను. కృష్ణుడు పుట్టిన మధుర, రాజ్యమేలిన బేట్ ద్వారక, ప్రాణత్యాగం చేసిన వేరావల్ నా పర్యటనలో భాగాలయ్యాయి. ఉత్తరాన కశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు, తూర్పున పూరీ పట్టణం నుంచి పశ్చిమాన సోమనాథ్ వరకు... దాదాపుగా ప్రతి వంద కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేశాననే చెప్పాలి. ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇక ఖండాల విషయానికి వస్తే ఇప్పటి వరకు నా విహారంలో నాలుగు ఖండాలను చూశాను. ఆఫ్రికా పర్యటన ఒకసారి వాయిదా పడింది. మళ్లీ త్వరలోనే ప్లాన్ చేసుకుంటాను. ఇక భవిష్యత్తులో సౌత్ అమెరికాను చూడాలి. వ్యవస్థ పనిచేస్తుంది ఇన్ని దేశాలను చూసిన తర్వాత మనకు వాళ్లకు ఉన్న ప్రధానమైన తేడా సిస్టమ్ ఎస్టాబ్లిష్మెంట్లో కనిపిస్తుంది. న్యూజిలాండ్‌లో మా మనుమరాలి పాస్‌పోర్ట్ కోసం వెళ్తే... మనకిచ్చిన స్లాట్ టైమ్‌కి వెళ్తే ఒక నిమిషంలో పాపను ఫొటో తీసి ‘ఫినిష్డ్’ అని పంపించేశారు. పాస్‌పోర్ట్ ఇంటికి వచ్చింది. అప్పుడు నాకు మన దగ్గర పాస్‌పోర్ట్ కోసం పడాల్సిన ప్రయాస గుర్తుకొచ్చింది. హాస్పిటల్లో డాక్టర్ అపాయింట్మెంట్ కూడా అంతే. మన టైమ్‌కి మనం వెళ్లేసరికి మనకంటే ముందు ఒకరు, మన పరీక్షలు పూర్తయ్యేటప్పటికి ఒకరో ఇద్దరో వచ్చి ఉంటారు. అపాయింట్మెంట్ ఇచ్చి కూడా హాస్పిటల్లో గంటలకు గంటలు వెయిట్ చేయించే పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ ఆఫీసుల్లో మన డాక్యుమెంట్లు కచ్చితంగా ఉంటే ‘ఎస్’ అంటారు, తేడా ఉంటే ‘నో’ అంటారు. అంతే తప్ప లంచంతో పని జరగడం ఉండదు. దొడ్డ విశ్వాసం పాశ్చాత్యదేశాల్లో ఓల్డ్పీపుల్లో ఎంతటి ఆత్మవిశ్వాసం అంటే... వాళ్లు ఒకరి సహాయం కోసం ఎదురు చూడరు. ఎనభై ఏళ్ల మహిళ కూడా తన కారు తనే డ్రైవ్ చేసుకుని వెళ్తుంటుంది. కారులో సామాను దించుకోవడానికి కూడా ఎవరి కోసమూ చూడరు. హోటల్ వంటి బహిరంగ ప్రదేశాల్లో వాళ్లకు అవసరమైన వస్తువు అందించబోయినా కూడా సహాయం తీసుకోరు. చక్కటి చిరునవ్వుతో స్నేహపూర్వకంగా నవ్వి సున్నితంగా తిరస్కరించి, వాళ్లే చేసుకుంటారు. మన దగ్గర వయసులో ఉన్న వాళ్లు కూడా తమ పనులు తాము చేసుకోకుండా సహాయకుల్ని పెట్టుకోవడాన్ని దర్పంగా భావిస్తారు. అక్కడ పని చేసుకోవడాన్ని గౌరవిస్తారు. మనం నేర్చుకోవాల్సిన విషయం అది. పాశ్చాత్య సమాజంలో మరొక గొప్ప సంగతి కూడా గమనించాను... అక్కడ ఒక మనిషికి ఆ వ్యక్తి హోదాలను బట్టి గౌరవం ఇవ్వడం అనేది ఉండదు. కంపెనీ సీఈఓ అయినా అటెండర్ అయినా, స్వీపర్ అయినా ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవం సమానంగా ఉంటుంది. అక్కడ హోదా ప్రదర్శన కూడా కనిపించదు. వర్షం పడుతుంటే మన దగ్గర ఎస్సైకి కానిస్టేబుల్ గొడుగు పట్టుకోవడాన్ని చూస్తుంటాం. అక్కడ ప్రధానమంత్రి అయినా సరే తన గొడుగు తనే పట్టుకుంటాడు. విరిగిన కొండ చరియ ప్రపంచంలో నచ్చిన ప్రదేశాల్లో మొదటిది న్యూజిలాండ్, రెండవది కెనడా, మూడవది స్విట్జర్లాండ్. నా పర్యటన ప్లాన్‌లో గుల్మార్గ్ ఉంది. స్నోఫాల్ చూడటానికి విదేశాలకు వెళ్లడం ఏమిటి? మనదేశంలోనే చూడాలనేది నా పట్టుదల. మానస సరోవర్ యాత్రకు వయసు సహకరిస్తుందా లేదా అని ఆలోచిస్తున్నాను. పర్యటనల్లో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగని కాలు బయటపెట్టకుండా ఉండలేం కదా! మనం రోజూ ప్రయాణం చేసే రోడ్డు మీదనే ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చు. పనులు మానుకుని నాలుగ్గోడలకు పరిమితం కాలేం కదా! కేదార్నాథ్ పర్యటన సమయంలో ఉన్నట్లుండి కొండ చరియ విరిగి పడింది. దారి పొడవునా రెçస్క్యూ సిబ్బంది ఉంటారు. వెంటనే రోడ్డు క్లియర్ చేస్తారు. అయితే కొండ చరియలు మరీ ఎక్కువగా పడినప్పుడు ఒకటి రెండు రోజులు వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఆ సంఘటన తర్వాత నేనేమీ పర్యటనలు ఆపలేదు. ఈ ఏడాది జూలైలో కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు ముందుగా అమర్నాథ్ యాత్రకు వెళ్లాను. నా జీవిత ధ్యేయం ఒక్కటే... శక్తి ఉన్నంత వరకు పని చేస్తాను, మానసికంగా రిఫ్రెష్ కావడానికి పర్యటనలు చేస్తూ ఉంటాను. మనిషి పక్షిలా విహరించాలి. అప్పుడే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆహ్లాదంగా జీవించగలుగుతారు.’’. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ‘భలే’బీడు గోదావరి పుట్టిన త్రయంబకేశ్వర్, కృష్ణానది పుట్టిన మహాబలేశ్వర్, హిమాలయాల నుంచి మైదానానికి దారి తీసే రొహతాంగ్ పాస్, కేదార్నాథ్, బదరీనాథ్, హరిద్వార్, రిషికేశ్, బుద్ధగయ, వైష్ణోదేవి, అమర్నాథ్... ఇలా ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలన్నీ చూడగలిగాను. ఉత్తరాది కంటే దక్షిణాదిలో ఆలయాలు అద్భుతంగా ఉంటాయి. శిల్ప సౌందర్యంలో కర్ణాటకలోని హలేబీడు, బేలూరుకి మించినది కాదు కదా సరిపోలేది కూడా మరోటి లేదనిపించింది. పిల్లలను టూర్లకు తీసుకెళ్లే వాళ్లకు నేను చెప్పేదొక్కటే...విదేశీ పర్యటనలకంటే ముందు పిల్లలకు ఇండియాలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలను చూపించండి. అప్పుడు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం వాళ్లకు సులువవుతుంది. ఇండియా గొప్పతనం తెలుసుకున్న తర్వాత విదేశాలను చూస్తే పర్యాటకం ద్వారా కలిగే విజ్ఞానంలో పరిపూర్ణత ఉంటుంది. – రజని లక్కా, స్విమ్మింగ్ చాంపియన్ రజని చెప్పిన మరికొన్ని విషయాలు ఇండియా తర్వాతనే... ప్రపంచ పర్యటనకంటే ముందు మనదేశాన్ని దాదాపుగా చుట్టేసి ఉండడంతో విదేశాల్లో నేను చూసిన ప్రతి ప్రదేశాన్నీ ఇండియాలో ఏదో ఒక ప్రదేశంతో బేరీజు వేసుకోవడం అలవాటైంది. ఆస్ట్రేలియాలోని బ్లూ మౌంటెయిన్స్ దగ్గర త్రీ సిస్టర్స్ అనేవి నీటి కోత కారణంగా ఏర్పడిన రాతి శిఖరాలు. అది గొప్ప ప్రకృతి అద్భుతమే, అయితే మా బళ్లారికి అరవై కిలోమీటర్ల దూరాన ఉన్న హంపి దగ్గర మాతంగ కొండలు కూడా అలాగే ఉంటాయి. పైగా ఎన్ని శిఖరాలుంటాయో... లెక్కపెట్టడం కూడా సాధ్యం కాదు. పర్యాటక సంపదను ప్రమోట్ చేసుకోవడంలో మనం వెనుకబడిపోయాం. ప్రభుత్వం ఓ రెండు దశాబ్దాలుగా ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది కానీ ఇంకా ఇంప్రూవ్ కాలేదు. పాశ్చాత్యులు ఈ విషయంలో చాలా ముందున్నారు. నయాగరా వాటర్ ఫాల్స్‌ని అమెరికా వైపు నుంచి కెనడా వైపు నుంచి కూడా చూశాను. గొప్ప జలపాతమే కానీ మన దగ్గర జోగ్ జలపాతం, హోగెనక్కల్ జలపాతాల సౌందర్యం కూడా నయాగరాకు ఏ మాత్రం తీసిపోదు. జోగ్ ఫాల్స్‌ని ఇండియన్ నయాగరా అంటారు. శ్వేత సౌందర్యం విషయంలో స్విట్జర్లాండ్‌ను చెప్పుకుంటారు. కానీ అది కశ్మీర్‌ను మించినదేమీ కాదని నా అభిప్రాయం. ఇన్ని ప్రదేశాల్లో నన్ను నిరుత్సాహపరిచిన ప్లేస్ జైపూర్. చిన్నçప్పుడు పింక్ సిటీ అని చదివినప్పుడు చాలా గొప్పగా ఊహించుకున్నాను. చూసినప్పుడు ఆ స్థాయి సంతృప్తి కలగలేదు. మన కోహినూర్ టవర్ ఆఫ్ లండన్‌లోని జువెల్ హౌస్‌లో రాజకుటుంబీకులు వాడిన వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి. కోహినూర్ వజ్రంతోపాటు భారత్ నుంచి తీసుకువెళ్లిన పెద్ద పెద్ద బంగారు పళ్లాలు, స్పూన్లు, ఇతర పాత్రలు, అనేక వస్తువులను చూసినప్పుడు తీవ్రమైన బాధ మనసుని పిండేసింది. మన దగ్గర ఉండాల్సిన వాటిని తీసుకెళ్లిపోవడమేకాక వాటిని దర్జాగా ప్రదర్శనలో పెట్టుకున్నారని కూడా అనిపించింది. దేశదేశాల వాళ్లు వాటిని అబ్బురంగా చూడడాన్ని గమనించిన తర్వాత అవి అక్కడ ఉండడమే మంచిదనుకున్నాను. అవన్నీ మన దగ్గరే ఉండి ఉంటే వెంకటేశ్వరుడి నగల్లాగ ఒక్కొటొక్కటిగా మాయమై ఉండేవేమో. బ్రిటిష్ వాళ్లు వాటిని చక్కగా పరిరక్షించి, ప్రపంచమంతటికీ చూపిస్తున్నారు. పైగా వాళ్ల మ్యూజియం నిర్వహణ తీరు చాలా బాగుంది. బంగారు కొండ ఎన్ని ఖండాలు చూసినా... ఇండియాలో ఉన్నన్ని ప్రకృతి అద్భుతాలు మరే దేశంలోనూ ఉండవనే నా నమ్మకం. బద్రీనాథ్ పర్యటన అయితే నా జీవితంలో మర్చిపోలేను. సూర్యోదయం సమయంలో కొండ బంగారు రంగులోకి మారుతుంది. ఆ సుందర దృశ్యం కొద్ది సెకన్లు మాత్రమే ఉంటుంది. ఉదయం ఐదు ముప్పావుకి లొకేషన్‌కి వెళ్తే ఆ అద్భుతాన్ని చూడవచ్చు. అయితే దానికి కూడా అదృష్టం ఉండాలంటారు. మనం వెళ్లిన రోజు ఆకాశం మబ్బులు పట్టి ఉంటే ఆ అద్భుతాన్ని చూడలేం. విదేశీయులు ఈ సుందర దృశ్యాన్ని చూడటానికే వస్తారు. పర్యటనల పట్ల విదేశీయులు చూపినంత ఆసక్తి మనవాళ్లు చూపించరు. కెనడాలో మాట్రియల్ సిటీ నుంచి క్యుబెక్ సిటీకి బస్‌లో వెళ్లాను. ఆ బస్‌లో ప్రయాణించిన పదిహేను మందిలో పది దేశాల వాళ్లున్నారు. ఎక్కువగా సోలో ట్రావెలర్సే. పర్యాటకుల క్షేమమే ప్రధానం ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే మనకు ఎక్కడ లేని ఉత్కంఠ. మ్యాచ్ పూర్తయిన తర్వాత టపాకాయల మోత చెవుల్ని చిల్లులు చేస్తుంటుంది. వెస్టర్న్ కంట్రీస్‌లో భారతీయులు, పాకిస్తానీయులు ఒక గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టీవీలో మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తారు. కెనడా వెళ్లినప్పుడు టొరంటోలో టాక్సీ ఎక్కిన తర్వాత ఆ డ్రైవర్ పాకిస్తానీ అని తెలిసినప్పుడు ఒక్క క్షణం భయమేసింది. ఇక్కడ మనం ఏర్పరచుకున్న అభిప్రాయమే నా భయానికి కారణం. కానీ అతడు చాలా స్నేహంగా మాట్లాడాడు. శ్రీనగర్‌లో సరస్వతి ఆలయాన్ని చూడాలనుకున్నప్పుడు ఊహించని పరిస్థితి ఎదురైంది. మా టూరిస్ట్ గ్రూప్‌కి క్యాబ్‌లు పెట్టిన డ్రైవర్లందరూ ఒకే మాటగా ఆ ఆలయానికి వద్దన్నారు. అది నమాజ్ టైమ్ అని, ఆ సమయంలో వెళ్తే రాళ్లు రువ్వుతారని చెప్పారు. తమకు పర్యాటకుల క్షేమమే ప్రధానమని కూడా చెప్పారు. మేము చూడాలని పట్టుపట్టడంతో మూడు గంటల తర్వాత నమాజ్ పూర్తయి వెళ్లిపోతారు అప్పుడు తీసుకెళ్తామని చెప్పి అలాగే చేశారు. ఆ ట్యాక్సీ డ్రైవర్లు కూడా ముస్లింలే. -
పర్యాటకులను జైలు పాలు చేసిన ఇసుక
రోమ్: విహార యాత్ర నిమిత్తం ఎక్కడికైనా వెళ్తే అక్కడ దొరికే వస్తువులను గుర్తుగా మనతో పాటు తెచ్చుకుంటాం. అయితే ఇలా చేసినందుకు ప్రస్తుతం ఇద్దరు ఫ్రెంచ్ పర్యాటకులు జైలు పాలయ్యారు. అయితే వారు తీసుకున్న వస్తువులు బాగా ఖరీదైనవో.. లేక డబ్బు చెల్లించకుండా తీసుకున్నవో కాదు. సముద్రపు ఒడ్డున దొరికే ఇసుకను తీసుకున్నందుకు ఇటలీ ప్రభుత్వం వారిద్దరిని అరెస్ట్ చేసింది. వివరాలు.. ఇద్దరు ఫ్రెంచ్ యువకులు పర్యటన నిమిత్తం ఇటలీ వెళ్లారు. అక్కడ చియా బీచ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా గుర్తుగా ఉంటుందని భావించి కొద్దిగా ఇసుకను తమతో తెచ్చుకున్నారు. అయితే ఈ ఇసుకనే తమను కటకటల పాలు చేస్తుందని ఆ క్షణనా వారికి తెలియదు. తిరుగు ప్రయాణంలో విమాన సిబ్బంది వీరి దగ్గర ఇసుక ఉండటం గమనించింది. దాంతో వారి మీద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అయితే తాము చేసిన తప్పేంటో తెలియక ఆ పర్యాటకులు బిక్కమొహం వేశారు. అధికారులను అడిగారు. అందుకు అధికారులు బదులిస్తూ.. ‘2017లో ఇటలీలో చేసిన ఓ చట్టం ప్రకారం పర్యాటకులు ఇసుక, గుండ్లు, రాళ్లు వంటి వాటిని తమతో తీసుకెళ్లడం నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి ఇటలీ ప్రభుత్వం 1-6ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తుంది. మీరు ఇసుక తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేశాం’ అని తెలపడంతో ఆశ్చర్యపోవడం సదరు పర్యాటకుల వంతయ్యింది. తెలియక చేశాం.. మమ్మల్ని వదిలిపెట్టండి బాబు అంటూ ఆ పర్యాటకులు అధికారులను ప్రాధేయపడుతున్నారు. ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘టూరిస్ట్‌లు స్మారక చిహ్నం అంటూ మా దేశ పర్యటక ప్రదేశాల నుంచి టన్నుల కొద్ది ఇసుక, రాళ్లు, గుండ్లను తీసుకెళ్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీన్ని నివారించడం కోసం ఇంత కఠిన చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. దీన్ని గమనించి పర్యాటకులు మా దేశ చట్టాలను గౌరవిస్తే మంచిద’ని వారు తెలిపారు. -
సందర్శకుల సందడి
సాక్షి, శ్రీశైలం: ప్రముఖ జ్యోతిర్లింగ శివక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం ఆదివారం భారీగా తరలివచ్చిన సందర్శకులు, యాత్రికులతో పోటెత్తింది. వరుసగా 3 రోజులపాటు సెలవు రావడంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 30 అడుగుల పైకెత్తడంతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఈ అందాలను తిలకిం చడానికి తెలంగాణ ప్రాంతం నుంచి భారీగా సంద ర్శకులు తరలిచ్చారు. ఆనకట్ట మీదుగా శ్రీశైలం చేరుకోవడానికి వేలాది వాహనాలు రావడంతో ఘాట్ రోడ్డులో సుమారు 43 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన వారు అర్ధరాత్రి 2 గంటలకు శ్రీశైలం చేరుకు న్నారు. ఫర్హాబాద్ నుంచి ట్రాఫిక్ జామ్ కావడంతో అనేకమంది హైదరాబాద్‌కు వెనుదిరిగారు. మిగి లిన వారు శ్రీశైలం చేరుకున్నా మల్లన్న దర్శనా నికి నిరీక్షణ తప్పలేదు. శ్రీశైలంలోని ప్రధాన వీధులు, అంతర్గత రహదారులు సైతం భక్తులు, వాహ నాలతో కిటకిట లాడాయి. ఉచిత దర్శనానికి ఏడు గంటలకు పైగా సమయం పట్టింది. ప్రత్యేక, అతి శీఘ్రదర్శనాలకు నాలుగు గంటలు పట్టింది. బ్రేక్ దర్శనానికి సైతం రెండు గంటలపాటు క్యూలో వేచి ఉండక తప్పలేదు. శ్రావణ మాసంలో ఒకే రోజున లక్షన్నరకు పైగా భక్తులు శ్రీశైలం రావడం ఇదే ప్రథమమని ఆలయ ఉద్యోగులు తెలిపారు. -
వానొస్తే వాపస్
వానొస్తే వాపస్ ఇటలీలో ఎల్బా అనే ఒక పెద్ద ద్వీపం ఉంది. అక్కడి వాతావరణం అమోఘంగా ఉంటుంది. ఇడిలిక్ హాలిడే స్పాట్! మనోహరం అన్నమాట ఇడిలిక్ అంటే. ముదురాకుపచ్చ నీలం రంగులో ఉండే తీరప్రాంతపు ఒడ్డున సన్‌బాత్ చెయ్యడానికి దేశదేశాల నుంచి టూరిస్ట్‌లు వస్తుంటారు. అయితే ఒకటే ప్రాబ్లమ్. సడన్‌గా వాన పడుతుంది. పడితే మంచిదే కదా. కానీ సన్‌బాత్ ఉండదే! అదొక్కటే కాదు ఎండ వల్ల ఒనగూడే అనేక ఆహ్లాదాలు అవిరైపోతాయి.అంత డబ్బు పెట్టి అక్కడి హోటళ్లలో స్టే అయితే.. వానొచ్చి వృధా చేసి వెళ్లిపోయిందే అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఎల్బా టూరిస్ట్ శాఖ ఒక ఆఫర్‌ని ప్రవేశపెట్టింది. వానొస్తే, వచ్చి ఆగకుండా రెండు గంటలపాటు కురిస్తే, ఒక రాత్రి రెంట్‌ను వాపస్ చేస్తుంది. నాలుగు రోజుల స్టే కోసం ఎవరైనా ఎల్బా వచ్చి, వచ్చిన నాలుగు రోజులూ రోజుకు కనీసం రెండు గంటల పాటు వాన కురిస్తే మొత్తం రెంట్ అంతా తిరిగి ఇచ్చేస్తుంది! ఆఫర్ మంచిదే కానీ, ఇంతదూరం వచ్చి వానను మాత్రమే ఎంజాయ్ చేసి వెళ్లడం మళ్లీ అదొక అసంతృప్తి. అదలా ఉంచితే, ఎల్బాకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. నెపోలియన్ ఇక్కడే పది నెలలు అజ్ఞాతంగా గడిపివెళ్లారట.. రెండు శతాబ్దాల క్రితం. -
‘తను..మనసు మాట వింటే బాగుండేది’
వెనిజులా టూరిస్ట్ కార్లా స్టెఫానిక్ హత్యోదంతంతో.. ఒంటరిగా విహార యాత్రలకు వెళ్లే మహిళలు స్వేచ్ఛగా, సంతోషంగా పర్యటించి వచ్చే పరిస్థితులు నెలకొనేవరకు ‘సోలో ట్రిప్’ను వాయిదా వేసుకోవలసిందేనా అనే చర్చ మొదలైంది. విహారయాత్రలు చేయడం.. అది కూడా ఒంటరిగా.. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. అటువంటి సాహస యాత్రకు సంబంధించిన పదిలమైన ఙ్ఞాపకాలు స్నేహితులతో పంచుకుంటూ.. వీడియోల్లో బంధించడం మరొక సరదా. అయితే ఒక్కోసారి ఒంటరి ప్రయాణాలు జీవిత కాలపు విషాదాల్ని మిగులుస్తాయి. ఆప్తులను మనకు శాశ్వతంగా దూరంగా చేస్తాయి. ముఖ్యంగా మహిళలకు ఈ ఒంటరి ప్రయాణాలు ప్రాణాంతకంగా మారుతున్నాయని.. కార్లా స్టెఫానిక్ అనే మహిళ ఉదంతం హెచ్చరించింది. మహిళా ట్రావెలర్స్‌కు ఈ ప్రయాణాలు ఎంతవరకు క్షేమం అనే విషయం గురించి అంతర్జాతీయంగా చర్చను లేవనెత్తింది. అమెరికా– వెనిజులా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న కార్లా.. తన ముఫ్పై ఆరవ పుట్టిన రోజును కాస్త భిన్నంగా జరుపుకోవాలని భావించారు. అందుకు వేదికగా మధ్య అమెరికా దేశమైన కోస్టారికాను ఎంచుకున్న ఆమె.. ఐదు రోజుల పాటు తన ట్రిప్ సాఫీగా సాగేందుకు గేటెడ్ ఎయిర్‌బీఎన్‌బీ విల్లాలో బస చేయాలనుకున్నారు. ఎయిర్‌పోర్టుకు అత్యంత సమీపంలో ఉండటం, పరిశుభ్రమైన పరిసరాలు ఆకర్షించడంతో అక్కడే బస చేయాలని నిశ్చయించుకున్నారు. సంతోషంగా, సాఫీగా ట్రిప్ ముగించుకుని ఫ్లోరిడాకు తిరిగి వెళ్లాలని భావించారే గానీ.. అదే తనకు ఆఖరి రోజు అవుతుందని ఆమె ఏమాత్రం ఊహించలేకపోయారు. ఆరోజు ఏం జరిగింది..? సోలో ట్రావెలర్‌గా ప్రయాణం మొదలెట్టిన కార్లా.. తన అడ్వెంచర్ ట్రిప్ తాలూకు అనుభవాలను పంచుకునేందుకు స్నేహితురాలు లారా జైమ్కు ఫోన్ చేశారు. స్థానిక మార్కెట్లో ముచ్చటపడి కొనుక్కున్న ప్రత్యేకమైన చెవి దుద్దులను వీడియో కాల్లో.. ఆమెకు చూపించారు. రేపు ఉదయమే ఆమెను కలుస్తానని చెప్పి.. ఫోర్ట్ లారెడ్డేల్–హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చి తనని పికప్ చేసుకోకపోతే బాగోదు అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ సమయంలో విల్లాను కూడా చూపిస్తూ తన మనసేదో కీడు శంకిస్తోందని.. అయినా తాను ధైర్యంగా ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. కానీ ముందుగా అనుకున్నట్లుగా కార్లా నవంబర్ 28న జైమ్‌ను కలవలేకపోయారు.స్నేహితురాలితో మాట్లా డిన రాత్రే ఆమె దారుణ హత్యకు గురయ్యారు. మనసు మాట వింటే బాగుండేది! కార్లా బస చేసిన ఎయిర్‌బీఎన్‌బీ విల్లాకు సమీపంలోని అడవిలో.. సగం కాలిపోయి ప్లాస్టిక్ కవర్లలో చుట్టి ఉన్న కార్లా మృత దేహాన్ని కోస్టారికాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హంతకుడిగా భావిస్తున్న విల్లా సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన గురించి కార్ల ఫ్రెండ్ జైమ్ మాట్లాడుతూ.. ‘ ఆరోజు రాత్రి 8.20 నిమిషాలకు నాతో మాట్లాడుతున్న సమయంలో ఏదో అపాయం పొంచి ఉందని కార్లా ముందే ఊహించింది. కొన్నిసార్లు మెదడు, మనసు మనల్ని హెచ్చరిస్తాయి. అలాంటి సమయాల్లో మనసు మాట వినాల్సి ఉంటుంది. అయితే కార్లా అలా చేయలేదు. అందుకే తను దూరంగా వెళ్లిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్లా ఒక్కరే కాదు..! మగవారితో పోలిస్తే ఆడవాళ్లకు ఒంటరి ప్రయాణాలు అంత సురక్షితం కాదని ఇటువంటి ఘటనలు హెచ్చరిస్తున్నాయి. గతేడాది డిసెంబరులో మొరాకోలోని అట్లాస్ పర్వతాలను అధిరోహించడానికి వెళ్లిన లూసియా వెస్ట్రేగర్ (24– డెన్మార్క్), మారెన్ ఊలాండ్ (28)లు దారుణ పరిస్థితుల్లో శవాలై తేలగా.. అదే నెలలో బ్రిటన్ గ్రేస్ అనే మహిళ కూడా హత్యకు గురయ్యారు. వీళ్లే కాదు మూడేళ్ల క్రితం థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన 19 ఏళ్ల యువతి ఒకరు సామూహిక అత్యాచారానికి గురికాగా.. ఓ బెల్జియన్ మహిళను అత్యంత దారుణంగా హతమార్చాడో కామాంధుడు. అంతేకాదు మనదేశంలో కూడా ఇటీవల మహిళా పర్యాటకులపై అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఓ విదేశీ మహిళా ప్రయాణికురాలిని దేశ రాజధానిలో ఆటోవాలాలు ఇబ్బంది పెట్టడం, బుద్ధగయకు వచ్చిన మహిళతో గైడ్ అసభ్య ప్రవర్తనతో పాటు విదేశీ మహిళలపై పలు అత్యాచార ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనల నేపథ్యంలో కొంతమంది మహిళా సోలో ట్రావెలర్స్ తమ అనుభవాల సారంతో కొన్ని జాగ్రత్తలను షేర్ చేసుకుంటున్నారు. ఏ ప్రాంతానికి వెళ్తున్నారో ఆ ప్రాంతానికి తగ్గట్టే డ్రెస్ వేసుకోవడం, ఒంటరి ప్రయాణం అన్న సంగతిని, బస చేస్తున్న ప్రదేశాల వివరాలు వగైరాలను బయటపెట్టకపోవడం, స్థానిక హెల్ప్‌లైన్స్ నంబర్లను దగ్గర పెట్టుకోవడం వంటివి చేస్తే ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. జరిగిన ఘటనలన్నిటినీ నిశితంగా పరిశీలించినట్లైతే వీటన్నింటికీ మగవారి అనుచిత ప్రవర్తనే కారణం అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. విచక్షణ కోల్పోకుండా, మనుషుల్లా ప్రవర్తించినపుడే ఇంటా బయటా మహిళలు సురక్షితంగా ఉండగలుగుతారనే విషయం పురుషులకు బోధపడితే ఎవరూ ఎవరిని నిందించాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఆ పురుషుల కూతుళ్లు, సోదరీమణులు కూడా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించగలుగుతారు. లింగ వివక్ష పోవాలి : ఫుమ్జిలే మియాంబో, ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నామనే అంశాలతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సామాజిక అసమానతలు, లింగ వివక్షే ఇందుకు ప్రధాన కారణం. ఈ పరిస్థితులు మారాలి. ఇక ఒంటరి ప్రయాణాల్లో మగవారితో పోలిస్తే ఆడవాళ్లకే రిస్క్ ఎక్కువగా ఉంటోంది. -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్ డెస్క్ -
గం‘జాయ్’గా రవాణా!
అరకులోయ: అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పర్యాటకుల ముసుగులో గంజాయిని యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. ఏజెన్సీ మారుమూల గ్రామాలతో పాటు సరిహద్దు ఒడిశా ప్రాంతాల్లో సాగైన గంజాయిని అరకు రోడ్డు మార్గంలో భారీగా తరలిస్తున్నారు. పాడేరు నుంచి అరకులోయ మీదుగా ఎస్.కోట రోడ్డు గంజాయి రవాణాకు అడ్డాగా మారింది. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అరకులోయ వరకు రోడ్డు ఉండడంతో ఈ మార్గాన్ని గంజాయి వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పాడేరు, ఒడిశాల నుంచి అరకులోయకు పర్యాటకుల వాహనాలు నిరంతరం తిరుగుతుంటాయి. కుటుంబ సమేతంగా పర్యటనకు వచ్చినట్లు గంజాయి మాఫియా అధునాతన కార్లు, ఇతర వాహనాల్లో సంచరిస్తూ గంజాయిని మైదాన ప్రాంతాలకు తరలించి..సొమ్ము చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన హుకుంపేట మండలం సంతారి జంక్షన్ రోడ్డులో భార్యా భర్తలు, ఇతర కుటుంబసభ్యుల మాదిరిగా నలుగురు గంజాయిని కారులో తరలిస్తుండగా హుకుంపేట పోలీసులు పట్టుకున్నారు. గతంలోను ఇలాంటి అక్రమ గంజాయి రవాణా ఘటనలు వెలుగు చూశాయి. ఒడిశా నుంచి గంజాయిని తరలించే వారంతా మాచ్‌ఖండ్ పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల్లాగా హల్చల్ చేస్తున్నారు. పాడేరు–అరకులోయ రోడ్డు నిత్యం పర్యాటకులతో కళకళాడుతుంది. జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లోని రహస్య ప్రాంతాల్లో పండించే గంజాయిని సురక్షిత ప్రాంతాల్లో నిల్వ ఉంచి, అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా పర్యాటకుల ముసుగులో వ్యాపారులు తరలిస్తున్నారు. పర్యాటకుల్లాగా ఒక్కో వాహనంలో నలుగురైదుగురు ప్రయాణిస్తూ, లగేజీ బ్యాగుల నిండా గంజాయిని నింపుతున్నారు. ఒడిశా, ఏపీల మధ్య పెదబయలు మండలం సమీపంలో మత్స్యగెడ్డ ఉంది. రాత్రి వేళల్లో గంజాయిని వ్యాపారులు నాటుపడవల్లో గెడ్డను దాటించి, ఒడిశాలోని పాడువా రోడ్డు మీదుగా వాహనాల్లో రవాణా చేస్తున్నారు. ఒడిశా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టలేకపోతోంది. దీంతో గంజాయి రవాణాకు జైపూర్ రోడ్డు అనుకూలంగా మారింది. తగ్గిన పోలీసు తనిఖీలు ఐదు నెలల క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్యచేసిన తరువాత జరిగిన పరిణామాలతో డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లో పోలీసు తనిఖీలు పూర్తిగా తగ్గాయి. గతంలో డుంబ్రిగుడ మండలం జైపూర్ జంక్షన్లో డుంబ్రిగుడ పోలీసులు నిరంతరం తనిఖీలు చేపట్టేవారు. అప్పట్లో ఒడిశాతో పాటు, పాడేరు ప్రాంతాల నుంచి గంజాయి రవాణాకు వ్యాపారులు భయపడేవారు. ఇటీవల పోలీసు తనిఖీలు విస్తృతంగా లేకపోవడంతో గంజాయి వ్యాపారులు అక్రమ రవాణాను పర్యాటకం పేరుతో విస్తరించారు. పగలు.. రాత్రి తేడా లేకుండా గంజాయితో కార్లు రయ్ రయ్ మంటున్నాయనే ప్రచారం జరుగుతోంది. పర్యాటకులు ప్రయాణించే వాహనాలపై తనిఖీలు పెద్దగా ఉండవు. కొంతమంది మహిళలను కార్లలో ఉంచుతుండడంతో వారంతా పర్యాటకులు, కుటుంబసభ్యులుగా కనిపిస్తారు. అరకులోయలో ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ ఉన్నప్పటికీ గంజాయి రవాణాపై నిఘా మాత్రం కొరవడింది. తనిఖీలు విస్తృతం చేస్తాం డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసుల తనిఖీలను మమ్మురం చేస్తాం. గంజాయి రవాణాపై దృష్టిపెట్టాం.అనుమానిత పర్యాటకుల వాహనాలను తనిఖీ చేయాలని సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. రాత్రి సమయంలో తనిఖీలు నిరంతరం జరుగుతాయి. గంజాయి రవాణాకు పూర్తిగా అడ్డుకట్టవేస్తాం.– కోటేశ్వరరావు, సీఐ, అరకులోయ సర్కిల్ -
ప్రాణాలు తీస్తున్న సరదా
సాక్షి, చందంపేట (దేవరకొండ) : 18 ఏళ్లు నిండిన ఓ యువకుడు ప్రేమించుకుని వివాహం చేసుకున్నాడు. చిన్నప్పుడే తల్లిదండ్రి నుంచి విడిపోయాడు. తల్లి పని చేసి సాకింది. ఆ యువకుడు ప్రయోజకుడయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, కాళ్లపై నిలబడ్డ కొడుకు మృత్యువాతపడ్డాడు. స్నేహితులతో కలిసి వచ్చి మృత్యుఒడిలోకి వెళ్లాడు. రెండున్నరేళ్లలోపు ఇద్దరు కుమారులకు దూరమయ్యాడు. తల్లి, భార్య రోదనలు, ఆ చిన్నారులను చూస్తే పలువురిని కన్నీటి పర్యంతం చేసింది.. ఈ ఘటన ఆదివారం రాత్రి నేరెడుగొమ్ము మండలం కృష్ణా నది తీరమైన వైజాక్ కాలనీలో చోటు చేసుకుంది. హైదరాబాద్ ప్రాంతంలోని మెహిందీపట్నంకు చెందిన గడ్డం వెంకట్(23) హైదరాబాద్‌లోని సోని ట్రాన్స్‌పోర్ట్‌లో ఇన్చార్జ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అదే కాలనీకి చెందిన నిర్మలతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర సంవత్సరాల లోపు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తన కంపెనికి చెందిన ఏడుగురు మిత్రులతో కలిసి వెంకట్ ఆదివారం సుమారు 3 గంటల సమయంలో వైజాక్ కాలనీలోని ఓ బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసి అక్కడే తినేందుకు కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతాన్ని సందర్శించేందుకు మిత్రులతో మర బోటులో వెళ్లాడు. అక్కడే కాసేపు ఆగినీటిలో ఈత కొట్టారు. ఇదే క్రమంలో మద్యం సేవించి వెంకట్ ప్రమాదవశాత్తు నీటి గుంతలోకి వెళ్లిపోయాడు. తోటి మిత్రులు అరుపులు వేయడంతో మత్స్యకారులు అక్కడికి వెళ్లి గాలించారు. పోలీసులకు కూడా సమాచారం అందడంతో కృష్ణా నదిలో పోలీసు సిబ్బంది జల్లడ పట్టడంతో సుమారు గంట సేపటికి వెంకట్ మృతదేహం లభించింది. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పచ్చిపాల పరమేశ్ తెలిపారు. అడ్డూఅదుపు లేకుండా మద్యం విక్రయాలు తెలంగాణ రాష్ట్రంలో అరకు పర్యాటక ప్రాంతంగా గుర్తింపుపొందిన వైజాక్ కాలనీలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. గతంలో పుష్కరాల సమయంలో వచ్చిన ఓ చిన్నారి కూడా మృత్యువాతపడగా మట్టి, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడడంతో మరో చిన్నారి మృతిచెందాడు. అనుమతి లేకుండా మర బోట్లలోవేలాది రూపాయలు వసూలు చేసి సాగర తీరంలో కొంత మంది వ్యాపారం చేస్తున్నారు. ప్రమాదం ఉన్నప్పటికి మరబోట్లేనే మద్యం, వంటకాల పేరుతో పర్యాటకుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తూ సరదాగ వచ్చిన వారి నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతూ ప్రాణాలు కోల్పోయేలా ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. నిద్రావస్థలో మత్స్యకార సంస్థ అర్హత, రక్షణ జాకెట్లు, హెచ్చరికలు, సూచనలు ఇవ్వాల్సిన మత్స్య శాఖ నిద్రావస్థలో ఉంది. ఆదివారం రాత్రి జరిగిన ఘటనలో వెంకట్ మృతి చెందినప్పటికీ ఆ శాఖ సోమవారం నాటికి కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి పలు హెచ్చరికలు చేయాల్సి ఉంది. అనుమతి లేకుండా మరబోట్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ఈ విషయమై నేరెడుగొమ్ము ఎస్ఐ పచ్చిపాల పరమేశ్‌ను వివరణ కోరగా నలుగురు కానిస్టేబుళ్లు, ఎస్ఐ, ఇద్దరు హోంగార్డులు ఉన్నారని, ఎన్నికల నిర్వాహణ, ఆయా గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలపై దృష్టి సారించామని, మత్స్య శాఖ, మండల పరిషత్, తహసీల్దార్ ఈ విషయాలపై దృష్టి సారించాలని, కాని వారు పట్టించుకోవడం లేదన్నారు. కన్నీరు..మున్నీరు వెంకట్, నిర్మలలు మూడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు.. అందరిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రెండున్నర సంవత్సరాల లోపు అభి, అఖి కుమారులు ఉన్నారు. చిన్నప్పటికి నుంచి తండ్రి తమ నుంచి దూరమైనా తల్లి ఆలనా..పాలన చూసి ప్రయోజకున్ని చేసింది. గత రెండు రోజుల క్రితం తాను సంపాదించిన డబ్బులలో ఓ ద్విచక్ర వాహనం కొనుక్కుంటానని తల్లిని కోరడంతో కొన్ని పైసలు ఇచ్చానని, రెండు రోజుల్లో బండి తెచ్చుకుంటానని చెప్పి వెళ్లిన కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లి రోదన అంతా ఇంత కాదు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఈ ప్రాంతంలో చనిపోవడం ఏంటని ఆ తల్లి కన్నీరు మున్నీరైంది. నా వెంకట్...నాకు కావాలి ప్రేమించి వివాహం చేసుకున్న భార్య నిర్మల చిన్నారుల ఏడుపులతో కేకలు పెట్టడడం కలచివేసింది. -
గోవాలో బ్రిటన్ మహిళపై లైంగిక దాడి
పనాజి : గోవాలో బ్రిటన్ టూరిస్ట్‌పై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి తెగబడిన ఘటన వెలుగుచూసింది. గోవాలో గురువారం ఉదయం బీచ్ వద్దకు వెళుతున్న 48 సంవత్సరాల బ్రిటన్ పర్యాటకురాలిపై దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని, లైంగిక దాడి అనంతరం ఆమె వస్తువులను అపహరించాడని పోలీసులు తెలిపారు. పనాజీకి వంద కిలోమీటర్ల దూరంలోని కనాకొన పట్టణంలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, నేరానికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నాడని దక్షిణ గోవా పోలీసులు వెల్లడించారు. బాధితురాలు పాలోలెమ్ బీచ్‌కు వెళుతుండగా అడ్డగించిన దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పారు. ఒంటరిగా వెళుతున్న మహిళను గమనించిన నిందితుడు ఆమెను రోడ్డు పక్కనే ఉన్న పంటపొలంలోకి బలవంతంగా తీసుకువెళ్లి లైంగిక దాడికి తెగబడ్డాడన్నారు. ఘటన అనంతరం బాధితురాలికి చెందిన మూడు బ్యాగులను దొంగిలించి పారిపోయాడని పోలీసులు చెప్పారు. బాధితురాలు గత పదేళ్ల నుంచి తరచూ గోవాను సందర్శిస్తున్నారని తెలిపారు. -
కాళ్లకు కత్తెర.. టూరిస్ట్‌పై విరుచుకుపడ్డాడని..!
ఫ్లోరిడా : పర్యాటకుడిపై కత్తెరతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడన్న ఆరోపణలతో ఓ దివ్యాంగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చేతులు లేకున్నా ఆ స్థానికుడు ఆవేశంతో ఎందుకు చెలరేగిపోయాడని పోలీసులు అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మియామీ బీచ్ పోలీసుల కథనం ప్రకారం.. జోనాథన్ క్రెన్షా(46) మియామీ బీచ్ చుట్టుపక్కల ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడికి రెండు చేతులు లేవు. అతడు బీచ్ దక్షిణ ప్రాంతంలో పెయింటింగ్స్ వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం చికాగోకు చెందిన పర్యాటకుడు సీజర్ కోరొనాడో తన స్నేహితుడితో కలిసి క్రెన్షా వద్దకు రాగా ఏదో గొడవ మొదలైంది. క్షణికావేశానికి లోనైన క్రెన్షా.. సీజర్ తలపై కత్తెరతో రెండుసార్లు పొడిచి దాడికి పాల్పడ్డాడు. సీజర్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా నిందితుడు క్రెన్షా పరారయ్యాడు. బాధితుడి స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదుతో క్రెన్షాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు క్రెన్షా మాట్లాడుతూ.. సీజర్ తన స్నేహితుడితో కలిపి నా వద్దకు వచ్చాడు. నా తలపై కొట్టడంతో కింద పడిపోయానని చెప్పాడు. బాధితుడు క్రెన్షా మిత్రుడు మాత్రం క్రెన్షా చెప్పింది అబద్దమని ఆరోపించాడు. బీచ్‌లో ఉన్న క్రెన్షాను ఓ అడ్రస్ వివరాలు అడగగా.. అతడు కాళ్లకు కత్తెరతో సీజర్ తల, చేతులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆపై చికిత్స నిమిత్తం సీజర్‌ను ఆస్పత్రికి తరలించామని వివరించాడు. -
కశ్మీర్లో మళ్లీ రెచ్చిపోయిన అల్లరిమూకలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో స్కూల్ బస్‌పై రాళ్ల దాడి ఘటన మరువకముందే సోమవారం మరో బస్సుపై దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన పర్యాటకుడు కన్ను మూశారు. పలువురు పర్యాటకులు, స్థానికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి చెన్నైకి చెందిన ఆర్.తిరుమణి(22) గా గుర్తించారు.ఆదివారం సోఫియాన్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు హిజ్బుల్ ముజాయిద్దీన్ తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టడంతో దీనికి వ్యతిరేకంగా వేర్పాటువాదులు ఆందోళనలు నిర్వహించారు. జాతీయ రహదారిపై ఆందోళనకు దిగిన నిరసనకారులు ఒక్కసారిగా టూరిస్ట్‌ల వాహనాలపై రాళ్లదాడికి దిగారు. ఈ దాడిలో తిరుమణికి తీవ్రగాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడే మరణించాడు. ఈ ఘటనపై ఎస్పీ తెజిందర్ సింగ్ మాట్లాడుతూ.. దుండగులపై కేసు నమోదు చేశాము. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. సిగ్గుతో తలదించుకుంటున్నాం: మెహబూబా ముఫ్తి రాళ్లదాడిలో మరణించిన చెన్నై పర్యాటకుడు తిరుమణి కుంటుంబనికి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ విషాదకర ఘటన జరిగినందుకు క్షమించాలని తిరుమణి తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ ఈ ఘటన జరిగినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను. నిందితులను ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టం. వారికి తగిన శిక్ష పడేలా చేస్తాం’ అని తెలిపారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఓమర్ రాళ్ల దాడిని ప్రతిపక్షనేత ఓమర్ అబ్దుల్లా సైతం తీవ్రంగా ఖండించారు.అమాయకులపై రాళ్ల దాడి చేయడం సిగ్గు చేటని తెలిపారు. నిరసనకారులు పద్దతి, వారి ఆలోచనలు సరైనవి కాదన్నారు.‘ తిరుమణి కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి’ అని ఓమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. -
ఒక్క టికెట్..24 గంటలు..
సాక్షి, సిటీబ్యూరో:నగరమంతా విస్తృతంగా పర్యటించాలనుకుంటున్నారా.. చారిత్రక ప్రదేశాలు, పర్యాటక కేంద్రాలు, పార్కులు, ఆలయాలు సందర్శించాలనుకుంటున్నారా.. అయితే నో ప్రాబ్లమ్. అందుకోసం కేవలం ఒకే ఒక్క బస్సు టికెట్ చాలు. సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిశ్చింతగా ప్రయాణం చేయొచ్చు. అందుబాటులో ఉన్న ఏ బస్సులో అయినా వెళ్లవచ్చు. ఆ ఒక్క టికెట్‌తో 24 గంటల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. అదే ‘ట్రావెల్–24’.(టీ–24). గ్రేటర్ ఆర్టీసీ ప్రవేశపెట్టిన 24 గంటల టికెట్. పర్యాటకులు, సందర్శకుల కోసం ప్రవేశపెట్టిన దీనికి అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. లక్షలాది మంది పర్యాటకులు, సందర్శకులు ఈ టికెట్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుత వేసవి సెలవుల దృష్ట్యా దీని వినియోగం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అంచనా వేస్తోంది. నగరానికి కొత్తగా వచ్చేవాళ్లు, ఒకే రోజుకు ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించాలనుకొనే ప్రయాణికులకు టీ–24 ఎంతో ప్రయోజనకరం. ప్రయాణ ఖర్చులను ఆదా చేసేందుకు దీంతో అవకాశం లభిస్తుంది. టూరిస్ట్ ఫ్రెండ్లీ.. అంతర్జాతీయ స్థాయి హంగులతో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. చార్మినార్, గోల్కొండ కోట, టూంబ్స్, జూపార్కు, బిర్లామందిర్, బిర్లా సైన్స్ ప్లానెటోరియం వంటి చారిత్రక ప్రాంతాలతో పాటు, పార్కులు, వివిధ పర్యాటక స్థలాలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, తదితర రాష్ట్రాల నుంచి ఏటా 8.5 కోట్ల మంది నగరానికి వస్తున్నారు. ప్రతి రోజు సుమారు 2.45 లక్షల మంది సందర్శిస్తున్నారు. అలాగే మరో 2.5 లక్షల మంది విదేశీ పర్యాటకులు ఏటా నగరాన్ని సందర్శిస్తున్నారు. విదేశీ టూరిస్టులు ఆర్టీసీ టీ–24 టికెట్లను పెద్దగా వినియోగించడం లేదు. కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు మాత్రం వీటిని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ అంచనా వేసింది. దీంతో ఈ ఏడాది ఈ టికెట్లను వినియోగించే వారి సంఖ్య 20 లక్షలు దాటిపోయింది. కేవలం పర్యాటకులు, సందర్శకులే కాకుండా నగర వాసులు కూడా టీ–24 టిక్కెట్లను బాగా వినియోగించుకుంటున్నారు. మరోవైపు వీటి వినియోగం కోసం ఆర్టీసీ చేపట్టిన ప్రచారం, సిబ్బందికి అందజేసే ప్రోత్సాహకాలు కూడా సత్ఫలితాలను ఇచ్చినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ నాయక్ తెలిపారు. ఆదరణ అదరహో.. ఈ టిక్కెట్లు ప్రయాణికులకు బహుళ ప్రయోజనాన్ని అందజేయడమే కాకుండా ఆర్టీసీకి సైతం గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రతి రోజు సుమారు 5,000 టికెట్లను విక్రయిస్తున్నారు. 2016లో 19,59,134 మంది వీటిని వినియోగించగా, ఆ ఏడాది ఆర్టీసీకి రూ.15.60 కోట్ల ఆదాయం లభించింది. గత ఏడాది 20,24,711మంది కొనుగోలు చేశారు. ఆర్టీసీ రూ.16.20 కోట్ల ఆదాయం సముపార్జించింది. టీ–24 వినియోగదారుల సంఖ్య ఏడాది కాలంలోనే 65,577కి పెరిగింది. ఈ వేసవిలో మరో లక్ష మందికిపైగా వినియోగించే అవకాశం ఉంది. ఏ బస్సుకైనా సరే.. నగరంలో సుమారు 3,850 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఏసీ, నాన్ఏసీ కేటగిరీలలో టీ–24 టిక్కెట్లను అందజేస్తున్నారు. ఎయిర్‌పోర్టు, హైటెక్‌సిటీ, ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే సుమారు 150 బస్సుల్లో వినియోగించే టీ–24 టికెట్లు రూ.160కి లభిస్తాయి. ఈ టికెట్‌తో ప్రయాణికులు ఏసీ బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లోనూ ప్రయాణం చేయవచ్చు. రూ.80కే రోజంతా ప్రయాణం చేసే మరో టీ–24 టికెట్ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు వర్తిస్తుంది. ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లో వీటిని అనుమతిస్తారు. డ్యూటీ కండక్టర్ల వద్ద ట్రావెల్–24 టికెట్లు లభిస్తాయి. టిక్కెట్ తీసుకున్న సమయం నుంచి 24 గంటల పాటు ఇది చెల్లుబాటులో ఉంటుంది. -
ఆ టూరిస్ట్ కథ విషాదాంతం
సాక్షి, తిరువనంతపురం: ఇటీవల కనిపించకుండా పోయిన విదేశీ మహిళ చివరికి శవమై తేలింది. ఐర్లాండ్ నుంచి వచ్చిన లిగా స్కోమన్ (33) మృతదేహాన్ని కరమనా నది ఒడ్డున పోలీసులు కనుగొన్నారు. డిప్రెషన్ వ్యాధితో బాధపడుతూ కేరళలోని ఆయుర్వేద కేంద్రానికి చికత్సకోసం వచ్చిన ఆమె మార్చి నెల14నుంచి అదృశ్యమయ్యారు. అయితే వైద్యంకోసం వచ్చిన ఆమె చివరికి ప్రాణాల్నే కోల్పోవడం బాధిత కుటుంబంలో విషాదాన్ని నింపింది. ముక్కలు చేసిన ఆమె మృతదేహాన్ని కనుగొన్నామని తిరువనంతపురం పోలీసు కమిషనర్ పి ప్రక్షేపణ వెల్లడించారు. నది ఒడ్డుకు సమీపంలోని పొదలలో ఉన్న బాడీ గురించి జాలర్లు తమకు సమాచారం అందించారని చెప్పారు. కుళ్లిపోయిన స్థితిలో మొండాన్ని, మరి కొంచెం దూరంలో తలను కొనుగొన్నామన్నారు. నెలరోజుల క్రితమే చనిపోయి వుంటారని భావిస్తున్నామన్నారు. అయితే దృవీకరణకోసం డీఎన్ఏ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. కాగా తన భార్య కనిపించడం లేదంటూ బాధితురాలి భర్త ఏండ్రూ జోర్డాన్ గత నెలలో ఫిర్యాదు చేశారు. లాటివన్ పాస్ పోర్టు కలిగిన లిగా గత ఫిబ్రవరి 21 న తన సోదరి ఇల్జే స్క్రోమనే తో బాటు తిరువనంతపురం వచ్చారనీ, తన భార్య గురించి సమాచారం తెలియజేసినవారికి లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు. తన భార్యను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారనే అందోళన కూడా వ్యక్తం చేశారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
కీలుబొమ్మగా మారిన మెహబూబా ముఫ్తీ
సాక్షి, న్యూఢిల్లీ : ‘మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిందీ మాతో చేయి చేయి కలుపుతారని. కశ్మీర్లో ఏదో చిన్న సంఘటన జరుగుతుంది. ఎక్కడో మిలిటెంట్లకు, ప్రభుత్వ సైనికులకు మధ్య కాల్పులు జరుగుతాయి. అంతే, టీవీ ఛానళ్లలో కశ్మీర్ మొత్తం తగులబడి పోతున్నట్లు చూపిస్తారు. మనమున్న పరిస్థితిని దాచేందుకు ప్రయత్నించడం లేదు. ఒక్కసారి ప్రపంచం వైపు చూడండి! ప్రతి చోటా ఏదో సమస్య ఉంటోంది. ఇక్కడ మన సమస్య ఏమిటంటే మన దేశమే మనల్ని ఒంటరి వాళ్లను చేసింది. నేను పిలవగానే మీరు రావడం ముందుగానే వసంత గాలులు వీస్తున్నట్లు ఉంది. ఇది శుభసూచకం. ఇక్కడ మనం చేయాల్సిన పని క్లిష్టమైనదే. మా తండ్రి ఎప్పుడూ ఒక విషయం చెబుతుండేవాడు. కశ్మీర్‌కు ఓ పర్యాటకుడు రావడం అంటే ఇక్కడ శాంతి కోసం పెట్టుబడి పెట్టడమేనని. భారత సైనికులు సరిహద్దుల్లో పోరాడుతున్నట్లే ఇక్కడ కూడా సైనికులు మిలిటెంట్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు మరోరకంగా మనమూ యుద్ధం చేయాల్సిందే. పర్యాటకరంగం పరిఢవిల్లేలా చేయడమే ఆ యుద్ధం. మనం దేశం నుంచి విడిపోయిన్లు భావించరాదు. అతి పెద్ద దేశంలో భాగంగానే బతుకుతున్నామన్న భావన కలగాలి’ అంటూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇటీవల శ్రీనగరంలో జరిగిన భారత పర్యాటక ఏజెంట్ల సమ్మేళనంలో ప్రసంగించారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివద్ధి చేయడం ద్వారా మిలిటెంట్ కార్యకలాపాలు తగ్గి రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయన్నది ఆమె అభిప్రాయంగా స్పష్టం అవుతోంది. ఆమె తన ఉపన్యాసాన్ని కాస్త గంభీర్యంగానే ప్రారంభించినా ఆమె మాటల్లో ఆర్ద్రత, ఆవేదనతోపాటు అశక్తత కూడా కనిపించింది. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆమె తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ పర్యాటకులు రావడం అంటే రాష్ట్రంలో శాంతి స్థాపనకు అది పెట్టుబడే అని ఎప్పుడూ చెప్పేవారు. అయితే ఆయన శాంతికి భంగం కలిగిస్తున్న వారిని ఎప్పుడూ మిలిటెంట్లు అని అనలేదు. వారిని తిరుగుబాటుదారులుగానే వ్యవహరించారు. గతంలో మొహబూబా ముఫ్తీ కూడా తిరుగుబాటుదారుల సమస్య అనే మిలిటెన్సీని వ్యవహరించారు. రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీతో చేతులు కలిపి ఆమె సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆమె భాష మారినట్లు ఉంది. ఆమె పర్యాటక ఏజెంట్ల సమ్మేళనాన్ని నిర్వహించి ‘ఇయర్ ఆఫ్ విజిటింగ్ కశ్మీర్’గా నిర్ణయించిన రెండు రోజులకే ఎదురు కాల్పుల్లో పౌరులు సహా 20 మంది మిలిటెంట్లు, సైనికులు మరణించారు. 2016, జూలైలో జరిగిన అల్లర్లలో దాదాపు వంద మరణించినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటి పోయాయి. మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీ హత్యతో ఆ అల్లర్లు చెలరేగాయి. అంతకుముందు మిలిటెంట్ కార్యకలాపాలకు అంతగా ప్రజల మద్దతు ఉండేది కాదని, 2016 నుంచి ప్రధాన రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో వ్యతిరేక భావం పెరగడంతోపాటు మిలిటెంట్ కార్యక్రమాలకు ప్రజల మద్దతు పెరిగిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కశ్మీర్ యూనివర్శిటీలో పనిచేస్తున్న పొలిటికల్స్ సైన్స్ ప్రొఫెసర్ తెలిపారు. రోజుకో ఏదోచోట కాల్పులు జరిగి పౌరులు కూడా మరణిస్తున్న ప్రస్తుత పరిస్థితులకు ‘మోదీ నుంచి మెహబూబా వరకు అందరూ బాధ్యులే’ అని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం ఆరుశాతం ఓట్లు నమోదయ్యాయంటే ఎన్నికల పట్ల, రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత పెరిగిందో తెలుస్తోంది. మెహబూబా తండ్రి మరణంతో ఖాళీ అయిన ఎంపీ సీటుకు రెండేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం, గతేడాదే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించి నేటికి నిర్వహించక పోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా గతంలో నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా నాయకత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు ప్రజలకు కనిపించేవి. ఇప్పుడు వాటి ఉనికిని కూడా ప్రజలు గుర్తించడం లేదు. అందుకని మిలెటెన్సీ పెరుగుతోంది. మెహబూబా బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆమె పట్లప్రజలకు సగం నమ్మకం పోయింది. సరైన పాలన అందించడంలో విఫలమైనందున ఆమె పట్ల పూర్తి విశ్వాసం పోయింది. కతువా ప్రాంతంలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలికను సైనికులు దారణంగా రేప్‌చేసి హత్య చేసిన కేసులో నిందితులకు మద్దతుగా జరిగిన ప్రదర్శనలో తన కేబినెట్లోని ఇద్దరు బీజేపీ మంత్రులు పాల్గొనడం పట్ల మెహబూబా మౌనం వహిచండం ఆమె మద్దతుదారులు కూడా సహించలేకపోతున్నారు. ఇక ఆఖరి కశ్మీర్ నిరంకుశ రాజు హరీ సింగ్ విగ్రహాన్ని ఆమె ఇటీవల ఆవిష్కరించడాన్ని వారు అంతకన్నా జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ ప్రోద్బలంతో విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆమె నేడు సీఎం కుర్చీలో కూర్చున్న కీలుబొమ్మ మాత్రమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
అర కిలోమీటర్ ఎత్తులో ఈడ్చుకుంటూ..
బీజింగ్ : గాజు వంతెలనకు పెట్టింది పేరు చైనా. సాధారణ వంతెనల నిర్మాణం కంటే ఇప్పుడక్కడ ఎత్తయిన కొండ ప్రాంతాల్లో కొండ చివరన గాజువంతెనల నిర్మాణమే అధికం. ఎందుకంటే ఇవి విపరీతంగా టూరిస్టులను ఆకర్షించి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అయితే, అక్కడికి వచ్చిన టూరిస్టులు మాత్రం చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదుర్కొంటున్నారు. వంతెన వరకు వచ్చి దానిపై అడుగుపెట్టేందుకు భయపడేవారు కొందరైతే.. దానిపై కొంతమేరకు నడిచి అంత ఎత్తునుంచి కిందికి చూసి కళ్లు తిరిగి ఇక మాత్రం ముందుకు కదలకుండా వంతెనకు వేలాడేవారు ఇంకొందరు. తాజాగా ఓ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చెక్కర్లు కొడుతోంది. ఇటీవల ప్రారంభించిన ఐజాయ్ అనే 500 మీటర్ల ఎత్తయిన గాజు వంతెనపై కొద్ది దూరం మాత్రం రెండడుగులు వేసిన ఓ మహిళా టూరిస్టు అనంతరం గజగజా వణికిపోతూ దానిపై కూర్చొని ఇక కదలలేనంటూ మొండికేసింది. దీంతో ఆమెతో వచ్చిన వ్యక్తి ఈడ్చుకుంటూ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన అక్కడి వారంతా కడుపుబ్బేలా నవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ వీడియో తెగ ఆకర్షిస్తోంది.. మీరూ ఓ లుక్కేయండి మరీ! -
గోవాకు వచ్చే వాళ్లంతా పనికిమాలినోళ్లే!
పనాజి : గోవాకి వచ్చే పర్యాటకుల్లో చాలామంది పనికిమాలినవారేనని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవాలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పర్యాటకుల వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. రాష్ట్ర జనాభా కన్నా.. ఇక్కడికి ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య ఆరు రెట్లు అధికంగా ఉందని, వీళ్లంతా గొప్ప వాళ్లేం కాదన్నారు. గోవాలో ప్రస్తుత సమస్యలకు ఉత్తరాది రాష్ట్రాలే కారణమంటూ.. అక్కడి వారు గోవాను మరో హర్యానాలా మార్చాలనుకుంటున్నారని తెలిపారు. కొన్ని రోజులు సేదతీరడానికి వచ్చే వీళ్లకి.. ఎలా అవగాహన కల్పించేదని ప్రశ్నించారు. ఆదాయం, సామాజిక, రాజకీయ అవగాహన, ఆరోగ్యం విషయంలో.. దేశంలో అందరికన్నా గోవా ప్రజలు ముందున్నారని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకన్నా మా గోవా వాళ్లు ఉన్నతులని సర్దేశాయ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాది వారికి వ్యతిరేకం కాదు.. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో.. మంత్రి సర్దేశాయ్ వివరణ ఇచ్చుకున్నారు. తాను ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకం కాదని, దేశీయ పర్యాటకులందరినీ పనికిమాలినవారని అనలేదని.. కొన్ని వర్గాల వల్ల మాత్రం సమస్యలు తలెత్తుతున్నాయని మాత్రమే తెలిపానన్నారు. తనవి విద్వేషపూరిత వ్యాఖ్యలు కాదని.. కేవలం గోవా ప్రజల మనోగతాన్ని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు. -
అద్దె కార్లే అతడి టార్గెట్
సాక్షి,సిటీబ్యూరో: తన ఇద్దరు అనుచరుల తో కలిసి టూరిస్ట్ మాదిరిగా వస్తాడు... నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కార్లు అద్దెకు తీసుకుంటాడు... వెంటనే రాష్ట్రం దాటేసి వాటి రూపురేఖలు మార్చేస్తాడు... ఈ వాహనాలను వినియోగించి కొన్నాళ్ళ పాటు గంజా యి స్మగ్లింగ్ చేసి ఆపై అమ్మేసి సొమ్ము చేసుకుంటాడు... ఈ పంథాలో నాలుగు రాష్ట్రాల్లో ‘పనితనం’ ప్రదర్శించిన అంతర్రాష్ట్ర దొంగను బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. ఇతడి ముఠా సిటీలోనూ నేరాలు చేసినట్లు వెలుగులోకి రావడంతో విషయం ఆరా తీయాలని ఇక్కడి అధికారులు నిర్ణయించారు. జీపీఎస్ ఉన్న హైఎండ్ వాహనాలే.. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాకు చెందిన దిలీప్‌కుమార్ అలియాస్ సురేంద్ర సింగ్ ఈ ముఠా నాయకుడిగా అదే ప్రాంతానికి చెందిన బల్వీర్, ముఖేష్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ ముగ్గురూ టూరిస్టుల మాదిరిగా దేశంలోని వివిధ నగరాలకు వెళ్తుంటారు. వెళ్ళే ముందే తమ ఫొటోలు, నకిలీ పేర్లు, చిరునామాలతో కూడిన గుర్తింపుకార్డులు తయారు చేసుకుని దగ్గర ఉంచుకుంటారు. ఎంపిక చేసుకున్న నగరానికి చేరుకున్న తర్వాత ట్రావెల్స్ కార్యాలయాల నుంచి కార్లను అద్దెకు తీసుకుంటారు. తామే వాహనాలను డ్రైవ్ చేసుకుంటామంటూ వాటి యాజమాన్యాలతో చెప్తారు. ఈ గ్యాంగ్ ట్రావెల్స్ నిర్వాహకులకు ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరిస్తుంది. సాధారణ కార్లు కాకుండా జీపీఎస్ పరిజ్ఞానం జోడించిన హైఎండ్ వాహనాలే అద్దెకు కావాలని అడుగుతుంది. దీంతో వాటిని ఇవ్వడానికీ యజమానులు వెనుకాడరు. ఇలా తీసుకునే సమయంలో ఈ ముగ్గురూ తమ వెంట తెచ్చుకున్న నకిలీ గుర్తింపు పత్రాలు దాఖలు చేస్తుంటారు. ఇలా కారు తమ చేతికి చిక్కిన వెంటనే రాష్ట్రం దాటేయడంతో పాటు సరిహద్దుల్లోనే జీపీఎస్ పరికరాలు, కారు నెంబర్ ప్లేట్లను తొలగించేస్తారు. ఏ రాష్ట్రానికి వెళ్తున్నారో అదే సిరీస్‌లతో కూడిన నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్లు తగిలించుకుంటారు. ఇలా వాహనాలను తీసుకుని నేరుగా గుజరాత్ లేదా రాజస్థాన్ చేరుకుంటారు. ‘కళ్ళల్లో’ పడే వరకు స్మగ్లింగ్... ఈ చోరీ వాహనాలను వినియోగించే దిలీప్ గ్యాంగ్ ఆ రెండు రాష్ట్రాల్లోనూ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటుంది. పోలీసులకు తాము వినియోగిస్తున్న వాహనంపై అనుమానం వచ్చే వరకు అక్రమ రవాణా చేస్తుంది. అలా జరిగిందని తెలిసిన వెంటనే నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి ఆ వాహనాన్ని అమ్మేస్తుంది. ఆపై మరో నగరాన్ని టార్గెట్‌గా చేసుకుని ‘వచ్చి పోతుంది’. ఈ పంథాలో వీరు బెంగళూరులోని జయప్రకాష్ నగర్, జీవన్‌బీమా నగర్ల్లో ఉన్న జస్ట్ రైడర్, జూమ్ కార్ సంస్థల నుంచి రూ.40 లక్షల విలువైన రెండు హైఎండ్ కార్లను ఎత్తుకుపోవడంతో అక్కడ కేసులు నమోదయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన బెంగళూరు పోలీసులు దిలీప్, బల్వీర్, ముఖేష్‌లు నిందితులుగా గుర్తించారు. వీరు రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించి సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకుని బెంగళూరు తరలించారు. విచారణ నేపథ్యంలో ఈ చోర త్రయం ఇదే పంథాలో ముంబై, చెన్నై, హైదరాబాద్‌ల్లోనే కార్ల చోరీలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ముగ్గురి అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని బెంగళూరు పోలీసులు ఈ మూడు ప్రాంతాలకు అందించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న అధికారులు ఇక్కడ నమోదైన ఈ తరహా నేరాలపై ఆరా తీస్తున్నారు. త్వరలో ఓ ప్రత్యేక బృందాన్ని బెంగళూరు పంపనున్నట్లు తెలిసింది. -
లంచం ఇవ్వలేదని డ్రైవర్‌పై పోలీసుల దాడి
-
యూపీలో మరో విదేశీ టూరిస్టుపై దాడి
-
రోడ్డుపై దోపిడీ: ఆ యువహీరో అనూహ్యంగా!
లండన్: హ్యారీపొటర్ హీరో డానియెల్ ర్యాడ్‌క్లిప్ నిజజీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్నాడు. మోటారు వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ పర్యాటకుడిపై దాడి చేయగా.. అక్కడే ఉన్న ర్యాడ్‌క్లిప్ క్షణం ఆలస్యం చేయకుండా బాధితుడికి సహాయం చేశాడు. ముఖానికి గాయమైన అతడిని ఆదుకున్నాడు. ఈ ఘటన లండన్‌లోని ఫ్యాషనబుల్ కింగ్స్ రోడ్డులో జరిగింది. మోటారు వాహనంపై దూసుకొచ్చిన ఇద్దరు దుండగులు పర్యాటకుడి వద్దనుంచి బలవంతంగా బ్యాగు లాక్కెళ్లారు. దీంతో కిందపడిపోయిన పర్యాటకుడి ముఖానికి గాయాలయ్యాయి. దుండగుల చర్యను గమించిన ఓ మాజీ పోలీసు వెంటనే తన వాహనాన్ని వారి మోపెడ్‌కు అడ్డంగా పెట్టారు. దీంతో బెదిరిపోయిన దుండగులు పారిపోయారు. అనంతరం సంఘటనాస్థలికి వచ్చి ఆ మాజీ పోలీసు అక్కడి దృశ్యాన్ని చూసి విస్తుపోయాడు. ఎందుకంటే కిందపడిన బాధితుడికి సాయం చేస్తూ యువహీరో ర్యాడ్‌క్లిప్ కనిపించాడు. ’నేను చూసింది నిజమేనా అని నమ్మలేకపోయాను. మీరు ’డానియెల్ ర్యాడ్‌క్లిప్’ కదా అని అడిగాను. ఔను అంటూ ఆయన బదులిచ్చారు. అతను చాలామంచి వ్యక్తి. చాలామంది సినీ ప్రముఖులు అలాంటి పరిస్థితులను చూసి ఆగనైనా ఆగరు’ అని ఉగ్రవాద నిరోధక దళంలో పనిచేసిన ఆ అధికారి వివరించారు. ఈ ఘటన నిజమేనని ర్యాడ్‌క్లిప్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. -
పాముతో ఆటలు ప్రాణం తీసింది
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ పాములోడు చేసిన పనికి పాపం ఓ పర్యాటకుడు అన్యాయంగా మరణించారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జోధ్‌పూర్‌లో ఓ పాములోడు పాములతో విన్యాసాలు ప్రారంభించారు. దాన్ని చూట్టం కోసం జోధ్‌పూర్‌కు వచ్చిన పర్యాటకులు ఆయన చుట్టూ మూగారు. కొందరేమో సెల్ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు. వారిలో పాములాటను ఆసక్తిగా చూస్తున్న ఓ యువకుడి మెడలో ఆ పాములోడు ఓ నాగు పామును దండలా వేయబోయాడు. చిర్రెత్తుకొచ్చిన పాము పర్యాటకుడిని ఎవరూ గుర్తించలేనంత వేగంగా కరచింది. కాసేపటికి అనుమానం వచ్చిన పర్యాటకుడు తనను పాము కరచిందేమో అంటూ ఆపాములోడికి తన కణతను చూపించాడు. దాన్ని పాములోడు అసలు పట్టించుకోలేదు. కాసేపటికి స్మహతప్పిపోతున్న పర్యాటకుడిని స్థానికులు ఆస్పత్రికి కాకుండా సమీపంలో ఉన్న ఓ మందుల షాపుకు తీసుకెళ్లారు. గంటలోపే ఆ పర్యాటకుడు చనిపోయాడు. పాములోడి వద్దనున్న నాగుపాము ఏ రకమైనదో ఎవరికి తెలియదు. భారత దేశంలో ఐదు రకాల నాగుపాములు అత్యంత విషపూరితమైనవి. అవి కరిస్తే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. వాటిలో ఇండియన్ కోబ్రా ఒకటి. -
కేరళలో రికార్డు స్థాయిలో టూరిస్ట్ ఆదాయం
-
బిజినెస్ తగ్గిపోయి సిమ్లా కళ తప్పింది