భార్యను మర్చిపోయిన భలే భలే మగాడు | Tourist 'forgets' wife at petrol station in Brazil | Sakshi
Sakshi News home page

భార్యను మర్చిపోయిన భలే భలే మగాడు

Published Mon, Jan 18 2016 7:12 PM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM

భార్యను మర్చిపోయిన భలే భలే మగాడు - Sakshi

భార్యను మర్చిపోయిన భలే భలే మగాడు

'భలే భలే మగాడివోయ్' సినిమాలో హీరో ఎక్కడి విషయాలు అక్కడే మర్చిపోవడం మనం చూశాం.

బ్రెజిల్: 'భలే భలే మగాడివోయ్' సినిమాలో హీరో ఎక్కడి విషయాలు అక్కడే మర్చిపోవడం మనం చూశాం. అచ్చంగా అలాంటి సంఘటనే బ్రెజిల్లో చోటు చేసుకుంది. భార్యను పెట్రోల్ బంక్ దగ్గర మరిచిపోయి దాదాపు 96 కిలో మీటర్ల వరకు వెళ్లిపోయాడు వాల్టర్ అనే వ్యక్తి. వాల్టర్ హాలిడే ట్రిప్కు అతని భార్య క్లాడియా, 14 ఏళ్ల కుమారుడితో కలిసి బ్రెజిల్ వెళ్లి టూర్ ముగించుకొని అర్జెంటీనాలోని తమ నివాసానికి బయలు దేరారు. అయితే బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించి కారును పక్కకు ఆపి వాష్ రూంకు వెళ్లాడు.
 
అప్పటి వరకు వెనక సీటులో పడుకున్న క్లాడియా లేచి పక్కనే ఉన్న షాప్కు వెళ్లింది. అయితే క్లాడియా కారులోనే ఉందేమో అనుకొని కారు స్టార్ట్ చేసి బయలు దేరాడు. ఆ సమయంలో పక్కన ఏం జరుగుతుందో చూసే అంత తీరకలేకుండా కుమారుడు ముందు సీటులో కూర్చొని వీడియో గేమ్ ఆడుతున్నాడు.

వాళ్లు తనను మరిచిపోయి వెళ్లారని గ్రహించిన క్లాడియా వారికి ఫోన్ చేయాలని ప్రయత్నించింది. అయితే సిగ్నల్ సరిగాలేకపోవడంతో ప్రయత్నం వృధా అయింది. చేసేదేమీ లేక దగ్గర్లోని పోలీసులకు సమాచారం ఇచ్చింది. వాల్టర్ తిరిగి వచ్చే వరకు పోలీసు స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది.  దీంతో ఆగ్రహించిన క్లాడియా వాళ్లు తిరిగి రావడంతోనే కోపంతో వెళ్లి కారును తన్నింది.  వాళ్లను అరుస్తూ కొట్టినంత పని చేసిందని బ్రెజిల్ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement