Forgery
-
మతి మరవండి.. మంచిదే!
రోడ్డుపై వెళ్తుంటే ఎవరో పలకరించారు.. ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నా వారెవరో వెంటనే గుర్తుకు రాదు.. ఏదో కొనుక్కొద్దామని దుకాణానికి వెళ్లారు.. వెళ్లాక అదేమిటో గుర్తుకు రాక కాసేపు తలగోక్కుంటారు.. వామ్మో మతిమరపు వచ్చేస్తోందని ఆందోళనపడుతుంటారు. కానీ ఏదో డిటర్జెంట్ ప్రకటనలో మరక మంచిదే అన్నట్టుగా.. ‘మరపు మంచిదే’నని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మతి మరవకుంటే మనిషి మనుగడ ఆగిపో యినట్టేనని తేల్చి చెప్తున్నారు. మరి మతిమరపు ఎందుకు మంచిదో మర్చిపోకుండా తెలుసుకుందామా..జ్ఞాపకం.. మరపు.. ఎలా జరిగేది?మెదడులోని న్యూరాన్ కణాల మధ్య ఏర్పడే బంధాలు (సినాప్సెస్) ఎంత బలంగా ఉంటే.. అక్కడ నిక్షిప్తమైన జ్ఞాపకం అంతగా మనలో నాటుకుపోయి ఉంటుంది. ఏదైనా పనిని ప్రత్యేక శ్రద్ధతో, ఏకాగ్రతతో, ఇష్టంతో చేసినప్పుడు.. ఒకే పనిని తరచూ చేస్తూ ఉన్నప్పుడు.. ఆ అంశానికి సంబంధించిన సినాప్సెస్ అంత బలంగా ఏర్పడి, జ్ఞాపకం (మెమరీ)గా మారుతాయి. ఆ పని లేదా అంశానికి సంబంధించి ప్రతిసారీ ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా.. ఆటోమేటిక్ మెమరీగా నిక్షిప్తం అవుతాయి. అదే మనం దేనిౖపె అయినా సరిగా దృష్టిపెట్టనప్పుడు సినాప్సెస్ బలహీనంగా ఉండి.. ఆ అంశం సరిగా రిజిస్టర్ కాదు. ఇలాంటి వాటిని మెదడు ఎప్పటికప్పుడు తొలగిస్తూ ‘క్లీన్’ చేస్తూ ఉంటుంది. అదే మతిమరపు. మనుషుల్లో వయసు పెరిగినకొద్దీ.. మెదడుకు ఏకాగ్రత, ఫోకస్ చేసే శక్తి వంటివి తగ్గిపోతాయి. దీనికి ఇతర కారణాలూ తోడై అల్జీమర్స్ వంటి సమస్యలు వస్తుంటాయి.కొత్త ‘దారి’ కోసం.. పాత దాన్ని మరుగుపరుస్తూ..రోజువారీ జీవితంలో కొత్త అంశాలను నేర్చుకోవడానికి, జ్ఞాపకాలను అప్డేట్ చేసుకోవడానికి మతిమరపు తప్పనిసరి అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మనిషి పరిణామక్రమానికి, మనుగడకు ఇదీ కీలకమని తేల్చి చెప్తున్నారు. ఉదాహరణకు కొన్నేళ్లుగా రోజూ ఒకేదారిలో ఆఫీసుకు వెళుతూ ఉంటారు. ఆ మార్గం, మధ్యలోని సిగ్నళ్లు, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు.. ఇలా అన్ని అంశాలు బలంగా రిజిస్టరై.. ఆటోమేటిక్ మెమరీగా మారుతాయి. కానీ ఉన్నట్టుండి ఒకరోజు ఆ రోడ్డు మూసేయడంతో.. కొన్నిరోజులు పూర్తిగా కొత్త దారిలో ఆఫీసుకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో మెదడులోని ఆ రోడ్డు మెమరీలో మార్పులు జరుగుతాయి. మనం వెళ్లే కొత్త దారిలోని సిగ్నళ్లు, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు వంటివి బలంగా రిజిస్టర్ అవడం మొదలవుతుంది. ఇందుకోసం మన మెదడు మొదటి రోడ్డుకు సంబంధించిన సినాప్సెస్‌ను బలహీనం చేస్తుంది. అంటే పాత డేటాను కొంతమేర మరుగుపరుస్తూ.. కొత్త అంశానికి అప్డేట్ అవుతుంది. ఇలా చేయకపోతే జ్ఞాపకాలు చిక్కుముడి పడి (మెమరీ క్లట్టర్) సమస్యాత్మకంగా మారుతాయి. ప్రతిష్టాత్మక నోబెల్‌ను గెలుచుకున్న శాస్త్రవేత్త ఎరిక్ కండెల్ తన పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించారు. మరిచిపోకుంటే.. మనుగడకే ముప్పుమరుపు లేకుంటే ఎంత ప్రమాదమనే దానికి శాస్త్రవేత్తలు ఎన్నో ఉదాహరణలు చూపుతున్నారు. ఉదాహరణకు ‘పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ)’.. అంటే ఏదైనా ప్రమాదానికి, భయోత్పాత ఘటనకు లోనైనప్పుడు ఆ జ్ఞాపకాలు లోతుగా నిక్షిప్తమైపోయి, నిత్యం వెంటాడుతూ ఉండే పరిస్థితి. ప్రమాదాలకో, దారుణ ఘటనలకో గురైనవారు.. తరచూ అవి తమ కళ్ల ముందే మళ్లీ, మళ్లీ జరుగుతున్నట్టుగా భ్రాంతి చెందుతూ బాధపడుతుంటారు. డిప్రెషన్లోకి వెళ్లిపోతారు.సాధారణ జీవితం గడపలేరు. ఇక పరిణామక్రమానికీ.. మతిమరపు, జ్ఞాపకాల అప్డేషన్కు లింకు ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకప్పుడు మనుషులు గుహల్లో ఉంటూ, వేటాడే బతికేవారు.. నీటికోసం సమీపంలోని కొలను దగ్గరికి వెళ్లేవారు. ఓసారి అలా వెళ్లినప్పుడు.. విషపూరిత పాములు, క్రూర జంతువులు కనిపిస్తే.. ఆ ప్రాంతం ప్రమాదకరమని మెదడులో జ్ఞాపకం అప్డేట్ అవుతుంది. ఈసారి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండటంగానీ, మరో కొలనును వెతుక్కోవడంగానీ చేసేలా ప్రేరేపిస్తుంది. ఈ లక్షణం కూడా మానవ పరిణామానికి తోడ్పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.మరపు శాశ్వతం కాదు.. మళ్లీ రావొచ్చు..ఒకసారి ఆటోమేటిక్/దీర్ఘకాలిక మెమరీగా నిక్షిప్తౖమెన జ్ఞాపకాలు.. అంత త్వరగా వీడిపోవని, అవి మరుగునపడతాయని.. సరైన ప్రేరణ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చని అమెరికన్ సైకాలజిస్టులు రోజర్ బ్రౌన్, డేవిడ్ మెక్నీల్ 1960వ దశకంలోనే ప్రతిపాదించారు. ఇటీవల చేసిన ప్రయో గాల్లో కొందరు శాస్త్రవేత్తలు దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఉదాహÆý‡ణకు మొదట చెప్పుకొన్నట్టు రోడ్డుపై వెళ్తుండగా కనబడిన వ్యక్తి పేరు వెంటనే గుర్తుకురాదు. కానీ ఆ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో గుర్తుంటుంది. ‘అరె నాలుకపైనే ఉంది, బయటికి రావట్లేదు’ అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ వ్యక్తి ఊరి పేరో, బంధుత్వమో, మరొకటో ప్రస్తావించగానే.. పేరు ఠక్కున గుర్తొస్తుంది. అంటే తగిన ప్రేరణతో జ్ఞాపకం వచ్చేస్తుందన్న మాట.ఎలా చూసినా.. మరీ మర్చిపోయేంత కాకుండా.. కాస్త మరపు మంచిదే. -
డామిట్.. కబ్జా కుట్ర అడ్డం తిరిగింది!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి, ఫోర్జరీ సంతకాలతో ఏకంగా నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి రూ.600 కోట్ల విలువైన సర్కారు భూమిని కొట్టేసేందుకు కబ్జాదారులు కుట్రపన్నారు. రంగారెడ్డి జిల్లా–2 జా యింట్ సబ్ రిజి్రస్టార్‌తో కుమ్మక్కై కబ్జాదారు లు ఈ కుట్రకు పాల్పడగా...శేరిలింగపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకుల వెంకారెడ్డి ఫిర్యాదుతో కబ్జాకుట్ర బయటపడింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. విచారణాధికారి ఏసీపీ ఎస్.రవీందర్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గ్ పైగా గ్రామంలోని సర్వే నంబర్లు 1, 4, 5, 20లలో 12.09 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌ఎల్‌ఐపీసీవో) సంస్థకు యాజమాన్య హక్కులున్నాయి. ఈ స్థలంపై బోరబండకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా నలుగురు కన్నేశారు. రంగారెడ్డి జిల్లా–2 జాయింట్ సబ్ రిజి స్ట్రార్ జె.గురుసాయిరాజ్‌తో కలసి కుట్ర పన్నా రు. ఈ నలుగురు నిందితులు ఫైజుల్లా వారసులుగా నటిస్తూ...1978 నాటి ప్రభుత్వ రికార్డుల ను తారుమారు చేసేశారు. దీని సహాయంతో ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లను కూ డా సృష్టించారు. ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా క్లెయిమ్ చేసేందుకు ఏకంగా గీక్ బిల్డర్ ఎల్ఎల్పీతో అభివృద్ధి ఒప్పందం చేసుకున్నారు. 39 అంతస్తుల్లో భారీ భవనం... ఈ ప్రభుత్వ భూమిలో భారీ నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు కబ్జాదారులు గీక్ బిల్డర్ ఎల్ఎల్పీ పార్ట్నర్ నవీన్‌కుమార్ గోయెల్‌తో అక్రమంగా అభివృద్ధి ఒప్పందాలు సైతం చేసుకున్నారు. 39 అంతస్తుల్లో 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు ప్రణాళిక వేశారు. 30:70 నిష్పత్తిలో వాటాలతో ఒప్పందాలు చేసుకున్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కు.. రిజి్రస్టేషన్ చట్టంలోని సెక్షన్ 22–ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గురుసాయిరాజ్ నిందితులతో కుమ్మక్కయ్యారు. రిజిస్ట్రేషన్ రికార్డులను తారుమారు చేసి, చట్టవిరుద్ధంగా యాజమాన్య హక్కులను బదలాయించారు. ఈ నెల 11న నిందితులు, జాయింట్ సబ్ రిజిస్ట్రేషర్తో కలసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కం జనరల్ పవరాఫ్ అటార్నీ (డీజీపీఏ) డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేశారు. రూ.202 కోట్లతో మాల్ నిర్మాణం.. ఈ ప్రభుత్వ భూమిలోని కొంత భాగంలో 5.16 ఎకరాల స్థలంలో యూనిటీ మాల్‌ను ని ర్మించాలని టీఎస్‌ఎల్‌ఐపీసీవో నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌టీపీసీ)తో లీజు ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.202 కోట్లను కేటాయించింది. టీఎస్‌టీపీసీ ఆర్కిటెక్చర్ డిజైన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సేవల కోసం కన్సల్టెంట్లను సైతం ఖరా రు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 4న ఓఎన్సీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ప్రాజెక్ట్ తవ్వకాల పనుల కాంట్రాక్ట్‌ను సైతం ఇచి్చంది.కుట్ర బయటపడిందిలా...శేరిలింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకల వెంకారెడ్డి సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం(ఈఓడబ్ల్యూ) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కబ్జాకుట్ర బయటకొచి్చంది. దీంతో సాంకేతిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు నిందితులు జే గురుసాయి రాజ్‌తో పాటు మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా, గీక్ బిల్డర్ ఎల్ఎల్పీ పార్టనర్ నవీన్ కుమార్ గోయెల్‌పై బీఎన్ఎస్ చట్టంలోని 318 (4), 316 (5), 338, 336 (3), 340 (2), 61 (2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. -
JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తనకు సంబంధించిన ఇంటిని ఖాళీ చేయకుండా వేధించడంతో పాటు తన సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 62 లో దివాకర్ రెడ్డికి ఇల్లు ఉంది. దానిని సాహితీ లక్ష్మీనారాయణకు అద్దెకు ఇచ్చారు. అయితే ఒప్పందం గడువును మూడేళ్లుగా నిర్ణయించుకున్నారు. ఒప్పంద గడువు 2023 మేతో ముగియడంతో ఇంటిని ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా... స్పందించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆపై తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టులో అఫిడవిట్ వేసినట్లు జేసీ దివాకర్‌రెడ్డి గుర్తించారు. బూదాటి లక్ష్మీనారాయణ, అతని కుమారుడు సాత్విక్‌లు తమకు లీజు గడువు ఇంకా ఉన్నట్లు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయడంతో జేసీకి కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. లక్ష్మీనారాయణ, అతని న్యాయవాది కోర్టులో దాఖలు చేసిన పత్రాలను గమనించిన జేసీ.. ఒప్పందం తేదీని 2021 మే నెలగా చూపినట్లు గుర్తించారు. అంతేకాదు తన సంతకం ఫోర్జరీ జరిగిందని, నకిలీ పత్రాలతో బూదాటి లక్ష్మీనారాయణ, సాత్విక్, వారి న్యాయవాది మహమ్మద్ షాజుద్దీన్‌లు కోర్టును తప్పుదోవ పట్టించారని జేసీ పోలీసులను ఆశ్రయించారు. సోమవారం ఆయన ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తుపాకి గురిపెట్టి... షేర్లు కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి : మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల బాగోతం బయటపెట్టాల్సిందేనన్న సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పుతో ఆర్థిక ఉగ్రవాది రామోజీ అక్రమాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులోనే మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే మరో కంపెనీని ఏర్పాటు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అని కనీసం బోర్డు కూడా పెట్టకుండా వేల కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లుగా సేకరించారు. రామోజీ ఇంతటి ఆర్థిక అక్రమానికి కేంద్ర బిందువుగా మార్చుకున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ అనే సంస్థ ఏర్పాటుకు, తన ఉన్నతికి సాయం చేసిన చేతినే ఆయన కాటేశారన్న వాస్తవం కూడా విస్మయపరుస్తోంది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. దీనిపై జీజే రెడ్డి వారసుల ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఆ సోదరులు ఇద్దరూ ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నారు. సాయం చేసిన మిత్రుడిని ముంచేసిన రామోజీ కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావు 1960లలో నిరుద్యోగి. చిన్న ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత కొండపల్లి సీతారామయ్యను కలిసి ఏదైనా ఉద్యోగానికి సిఫార్సు చేయమని ప్రాథేయపడేవారు. ఇదే జిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లో్లవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో ఆయన రామోజీకి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. రెండేళ్ల తరువాత 1962లో ఇద్దరూ కలిసి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను స్థాపించారు. జీజే రెడ్డి తన స్వగ్రామం జొన్నలపాడులోని భూముల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇందులో పెట్టుబడిగా పెట్టారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. ఆ తర్వాత జీజే రెడ్డి చెకొస్లో వేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని ఎన్నిసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. తుపాకితో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించారు. చిట్టచివరకు 2016 సెప్టెంబరు 29న రామోజీరావు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007 – 08 వార్షిక సంవత్సరం షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని కోరగా, అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోపెట్టారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్‌హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు వారిపై ఆగ్రహంతో చిందులు తొక్కారు. తుపాకీ తీసి మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తారని గానీ, తేదీ గానీ ఆ ఫామ్‌పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి అక్కడి నుంచి బతుకు జీవుడా అని బయటపడ్డారు. రామోజీ, శైలజపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్‌లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీరావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. మరోవైపు ఇదే అంశంపై యూరి రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్న రామోజీరావు, శైలజ కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ షేర్లను తమ పేరిట బదిలీ చేసేలా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ను ఆదేశించాలని కోరుతున్నారు. దీనిపై న్యాయస్థానంలో వ్యాజ్యం కొనసాగుతోంది. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ, తమ షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. తమ తండ్రి వాటా షేర్లను అట్టిపెట్టుకోవాలనే నిర్ణయించుకున్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మారిస్తే చట్ట ప్రకారం షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. చిట్‌ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. వాటన్నింటిపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ ఆర్థిక అక్రమాల్లో ఆరితేరిన రామోజీ తాను అనుకున్నంతా చేశారు. జీజే రెడ్డి షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తన పేరుతో ఒక్క షేరు కూడా లేకపోవడంతో విస్తుపోయారు. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. కంపెనీల చట్టం మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో అక్రమంగా షేర్లు బదిలీ చేసేసుకున్నట్లు వెల్లడైంది. -
సీఎం రమేష్ పై కేసు
-
బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌పై ఫోర్జరీ కేసు
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు వేణు ఫిర్యాదుతో బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ కేసు నమోదైంది. పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో ఫోర్జరీకి పాల్పడి రూ.450 కోట్లు సీఎం రమేష్ కొట్టేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కాగా, వేణు తరఫున కావూరి భాస్కర్‌రావు స్టేట్మెంట్ ఇచ్చారు. పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడ్డారని కావూరి భాస్కర్ రావు తెలిపారు. ‘‘ఈ ఫోర్జరీకి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వేణు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్‌లో నమోదైన కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రోజు క్రైమ్ ఏసీపీ నా స్టేట్మెంట్ రికార్డు కోసం రమ్మని పిలిచారు. అరగంట పాటు నా స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. కేసుకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది. వేల కోట్ల స్కాంకి సీఎం రమేష్ పాల్పడ్డాడు సీబిఐ ఎంక్వయిరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి’’ అని కావూరి భాస్కర్‌రావు పేర్కొన్నారు. -
సంతకాలు చేస్తారా.. చస్తారా?
సాక్షి, అమరావతి: ఆదరించినవారికి ద్రోహ చేయడం, ఆశ్రయం కల్పించిన వారిని ముంచేయడం అంటే ఠక్కున చంద్రబాబే గుర్తుకు వస్తారు. కానీ ఆయన రాజగురువు రామోజీరావు కూడా ఆ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. రామోజీ వ్యాపార సామ్రాజ్యానికి నల్లధనం సరఫరా యూనిట్‌గా నిలుస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్సే నమ్మక ద్రోహం, మోసాల పునాదుల మీద ఏర్పడింది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. రామోజీ చేసిన ద్రోహంపై జీజే రెడ్డి వారసులు సీఐడీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. పాయింట్ బ్లాంక్‌లో తుపాకి గురిపెట్టి రామోజీ చేసిన మైండ్ బ్లోయింగ్ దుర్మార్గం ఇదిగో ఇలా ఉంది.. ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ.. కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అదే జిల్లా పెదపారుపూడికి చెందిన రామోజీరావు అప్పట్లో నిరుద్యోగి. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సు చేయడంతో రామోజీకి జీజే రెడ్డి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. అంతేకాదు.. రెండేళ్లకే అంటే 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం కోసం రామోజీరావుకు జీజే రెడ్డి ఆర్థిక సహకారం అందించారు. ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. తదనంతర పరిణామాల్లో జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. కాగా జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని చాలాసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. ఆ షేర్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. తుపాకీతో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత... 2016 సెప్టెంబరు 29న రామోజీరావు ఆ సోదరులిద్దరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5 వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్‌హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. దాంతో ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందని గానీ, తేదీ గానీ ఆ ఫామ్‌పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి అక్కడి నుంచి బయటపడ్డారు. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ తమ వాటా షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. అందుకే వారు రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు. ఆ చెక్కును నగదుగా మారిస్తే షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. చిట్‌ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ అక్రమాల్లో ఆరితేరిన రామోజీ మాత్రం ఫోర్జరీ సంతకాలతో జీజే రెడ్డి షేర్లను తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని విస్తుపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు. రామోజీ, శైలజలపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్‌లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహా రాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీ రావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. -
జర్నలిజం ముసుగులో ఫోర్జరీ..టీవీ5 సాంబపై కేసు నమోదు
-
IAS vs IPS అసలు తప్పు ఎవరిది ?
-
ఐపీఎస్ అధికారి ఫోర్జరీ..మాజీ ఐఏఎస్ కే కుచ్చుటోపీ..
-
సూపర్ స్టార్ భార్యకు బెయిల్ మంజూరు..ఆ సినిమా కేసులోనే!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్‌కు బెయిల్ మంజూరైంది. ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన కొచ్చాడియాన్ సినిమా ప్రొడక్షన్ టైంలో ఓ యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి తీసుకున్న ఋణం తిరిగి ఇవ్వకపోవడంపై లతా రజినీకాంత్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెకు తాజాగా బెంగళూరు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే లభించింది. అయితే డిసెంబర్ 1, 2023న కోర్టు బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో ముందస్తుగా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అసలేం జరిగిందంటే.. కొచ్చాడయాన్ సినిమాను భారీ ఖర్చుతో పెట్టి తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా నిర్మించిన మీడియా వన్ ఎంటర్టైన్మెంట్లో పనిచేస్తున్న మురళి అనే వ్యక్తికి.. చెన్నైకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ. 6.2 కోట్ల రుణం ఇచ్చింది. మురళికి ఇచ్చిన రుణానికి గ్యారెంటర్‌గా లతా రజనీకాంత్ సంతకం చేశారు. మురళి అప్పు తీర్చకపోవడంతో హామీదారుగా ఉన్న లత ఈ కేసులో చిక్కుకుపోయారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు... రూ.1 లక్ష వ్యక్తిగత పూచీకత్తు, మరో రూ.25 వేల నగదు కోర్టుకు చెల్లించడంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. -
షేర్ల కోసం.. తుపాకీతో రామోజీ బెదిరింపు
సాక్షి, అమరావతి: ‘మీ షేర్లను బదిలీ చేస్తున్నట్లు సంతకాలు పెడతారా లేదా!?’.. ఓ గదిలో తలకు తుపాకి గురిపెట్టి మరీ ఇలా బెదిరిస్తే ఎవరైనా ఏం చేస్తారు.. ప్రాణభయంతో సంతకాలు చేసేస్తారు కదా. ఈ ఉదంతంలోనూ బాధితులు అదే పనిచేశారు. కానీ, ఇక్కడ తలకు తుపాకి పెట్టి బెదిరించింది ఎవరో కాదు.. చెరుకూరి రామోజీరావు అలియాస్ ఈనాడు రామోజీరావు. ఆ బాధితులు మరెవరో కాదు.. రామోజీరావుతో కలిసి మార్గదర్శి చిట్‌ఫండ్స్ స్థాపించిన జీజే రెడ్డి కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి. ఇలా.. తుపాకితో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని 288 షేర్లను తన కోడలు శైలజా కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారు రామోజీ. ఆ ఒక్క సంతకమే కాకుండా మరికొన్ని ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లతో తతంగం కానిచ్చేశారు. ఆ విధంగా 2016 నాటికి రూ.1,59,69,600 మూలధన విలువ ఉన్న 288 షేర్లను అక్రమంగా కైవసం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల గుర్తించిన బాధితుడు యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఈనెల 13న ఫిర్యాదు చేయడంతో రామోజీరావు అక్రమాల బండారం బట్టబయలైంది. జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్‌రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. భారత్‌లో నివసిస్తూ తన కుటుంబ ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఆయన రెండో కుమారుడు యూరి రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉండటంతో రామోజీరావు, శైలజ కిరణ్‌లపై సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజ కిరణ్‌లను నిందితులుగా చేర్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంచలనాత్మక కేసు వివరాలివీ.. ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ.. కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకోస్లేవేకియాలో ఉన్నత విద్య పూర్తిచేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటుచేశారు. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో తన జిల్లాలోని పెదపారుపూడికి చెందిన రామోజీరావుకు తన కంపెనీలో టైపిస్ట్‌గా ఉద్యోగం ఇచ్చారు. అనంతరం జీజే రెడ్డి ఆర్థిక సహకారంతో రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను 1962లో నెలకొల్పారు. ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి 1985లో చెకోస్లోవేకియాలో చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. ఆ తర్వాత.. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్ల కోసం రామోజీరావును చాలాసార్లు సంప్రదించినప్పటికీ ఆయనేమీ చెప్పలేదు. పత్రికల ద్వారా తెలుసుకుని సంప్రదిస్తే.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను 2014లో పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా మార్టిన్‌రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత 2016, సెప్టెంబరు 29న రామోజీరావు తనను కలిసేందుకు ఆ సోదరులు ఇద్దరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్‌రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన ఏళ్లకు సంబంధించిన డివిడెండ్ మొత్తాన్ని కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. తుపాకి పెట్టి బెదిరించి మరీ.. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిలను ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్ మీద మార్టిన్రెడ్డిని సంతకం చేయమన్నారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరంలేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016, అక్టోబరు 5వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీలేని ఫామ్ ఎస్‌హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. వెంటనే రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు’ అని బెదిరించారు. దీంతో ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందనిగానీ, తేదీగానీ ఆ ఫామ్‌పై లేవు. రామోజీరావు తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి వారు బయటకొచ్చారు. చెక్కు మార్చలేదు.. షేర్ల బదిలీకి అంగీకరించలేదు.. మరోవైపు.. ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ.. తమకు రామోజీరావు ఇచ్చిన చెక్కును మాత్రం వారు నగదుగా మార్చుకోలేదు. ఎందుకంటే షేర్లు బదిలీ చేయడం సమ్మతం కాదు కాబట్టి. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకంచేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. చిట్‌ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. అలాగే, రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి తాను షేర్లు బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. కానీ, ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో.. 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ.. మరోవైపు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో వాటాదారు అయిన యూరి రెడ్డి తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజకిరణ్ పేరిట బదిలీ చేసినట్లు గుర్తించారు. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే రామోజీరావు కుతంత్రం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేశారన్నది వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు. మూలధన నిధి సేకరించింది ఏపీలోనే కాబట్టి.. తన షేర్లను అక్రమంగా శైలజకిరణ్ పేరిట బదిలీ చేయడంపై యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే తన తండ్రి జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాబట్టి తన షేర్ల అక్రమ బదిలీపై యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే ఆయన నిబంధనల మేరకు ఫిర్యాదు చేశారు. యూరి రెడ్డి ఫిర్యాదును పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్‌లను పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
హీరో మోటో ఎండీ, తదితరులపై ఫోర్జరీ కేసు:షేరు ఢమాల్
Delhi Police file FIR against Hero MotoCorp chairman Pawan Munjal ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్‌కు మరోసారి భారీ షాక్ గిలింది. మోసం, ఫోర్జరీ , నేరపూరిత కుట్ర ఆరోపణలతో ఢిల్లీ కోర్టు ఆదేశాలపై హీరో మోటో ఎండీ, సహా పలువురి సీనియర్ అధికారులపై కేసు నమోదైంది. నకిలీ బిల్లులు తయారు చేసి, ఆదాయపు పన్ను శాఖలో డిపాజిట్ చేసి, సేవా పన్నులో లబ్ధి పొందారని పోలీసులు ఆరోపించారు. దీంతో స్టాక్ 3 శాతం భారీ పతనాన్ని నమోదు చేసింది. ఈ కేసు ఎఫ్ఐఆర్ 2010కి ముందు నాటి పాత విషయానికి సంబంధించినదని, ఇతర దర్యాప్తులు , పన్ను విచారణలకు ఎలాంటి సంబంధం లేదని కంపెనీ తెలిపింది. బిలియనీర్ , కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్, సీఈవో పవన్ కాంత్, ముగ్గురిపై ఫోర్టరీ అరోపణలపై కేసు నమోదైంది. కాగా పవన్ ముంజాల్సహా మరికొందరికీలక అధికారులపై మనీలాండరింగ్ ఆరోపణలు దాఖలైనాయి. ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) 2023 ఆగస్టు లో ముంజాల్, ఇతరులపై సోదాలు నిర్వహించింది. ప్రకటించని విదేశీ కరెన్సీని కలిగి ఉన్నారనే ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఫిర్యాదు చేసింది. దీంతో ముంజాల్ నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. వ్యక్తిగత అవసరాల కోసం కోసం రూ.40 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ (నిషేధిత వస్తువు)ని అక్రమంగా ఎగుమతి చేసినట్టు ఈడీ ఆరోపించింది. దీనికి సంబంధించిన తనిఖీల్లో సెర్చ్ 25 కోట్ల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ, నగదు, బంగారం ,వజ్రాభరణాలు (విదేశీ కరెన్సీ, బంగారంతో సహా) స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. (ఇజ్రాయెల్-గాజా సంక్షోభం: ‘షెకెల్’ కోసం సెంట్రల్ బ్యాంకు కీలక నిర్ణయం) ఆగస్ట్ 20, 2018న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముంజాల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ లండన్‌కు బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో భద్రతా తనిఖీల సమయంలో అతని హ్యాండ్ బ్యాగేజీలో రూ.81 లక్షల కంటే ఎక్కువ విలువైన విదేశీ కరెన్సీని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. 800 కోట్లకు పైగా అక్రమ వ్యాపార వ్యయాలు, భూమి కొనుగోలుకు ఉపయోగించిన రూ. 60 కోట్ల విలువైన "ఖాతాలో చూపని" అక్రమ ఆస్తులను సోదాల్లో కనుగొన్నట్లు ఐటి అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ గత ఏడాది మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!) -
కెనడాలో భారతీయ విద్యార్థులకు ఊరట
ఒట్టావా: కెనడాలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న భారతీయ విద్యార్థులకు గొప్ప ఊరట లభించింది. పంజాబ్‌కు చెందిన లవ్ ప్రీత్ సింగ్ సహా 700 మంది భారతీయ విద్యార్థుల్ని తిరిగి మన దేశానికి పంపడాన్ని కెనడా ప్రభుత్వం వాయిదా వేసింది. తదుపరి నోటీసులు అందేవరకు వారు కెనడాలో ఉండవచ్చునని స్పష్టం చేసింది. ఫోర్జరీ ఆఫర్ లెటర్లతో విద్యావకాశాలకు అనుమతి సంపాదించి లవ్ ప్రీత్ సహా ఇతర విద్యార్థులు కెనడాకి వచ్చారని కెనడియన్ బోర్డర్ సర్వీసు ఏజెన్సీ (సీబీఎస్ఏ) విచారణలో తేలింది. దీంతో జూన్ 13లోగా కెనడా వీడి వెళ్లిపోవాలంటూ లవ్ ప్రీత్ సింగ్‌తో పాటు 700 మంది వరకు విద్యార్థులకు నోటీసులు అందాయి. ఒక సంస్థ చేసిన మోసానికి గురైన తాము బాధితులమే తప్ప మోసగాళ్లము కాదని తాము ఎందుకు దేశం విడిచి వెళ్లాలంటూ విద్యార్థులు నిరసన ప్రదర్శనలకి దిగారు. జలంధర్‌కు చెందిన కన్సల్టెంట్ బ్రిజేష్ మిశ్రా కెనడాలోని పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీల నుంచి తప్పుడు ఆఫర్ లెటర్లు సృష్టించి ఆ విద్యార్థుల్ని ఆరేళ్ల క్రితమే కెనడాకు పంపారు. రాయబార కార్యాలయం కూడా కాలేజీలు ఇచ్చిన లెటర్స్ ఫోర్జరీ అని గుర్తించలేకపోయింది. విద్యార్థులు ఆయా కాలేజీలకు వెళ్లేవరకు అవి ఫేక్ అని తెలియలేదు. ఆ తర్వాత వేరే కాలేజీల్లో సీటు ఇప్పిస్తానని మిశ్రా నమ్మబలికాడు. కెనడాలో శాశ్వత నివాసం కోసం ఆ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రభుత్వం జరిపించిన విచారణలో కాలేజీల ఆఫర్ లెటర్స్ ఫోర్జరీ అన్న విషయం బయటపడింది. దీంతో బ్రిజేష్ మిశ్రాకు చెందిన ఎడ్యుకేషన్ అండ్ మైగ్రేషన్ సర్వీసెస్‌ను రద్దు చేశారు. అప్పట్నుంచి ఆ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగానే మారింది. -
ఏపీబీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవానంద్ పై ఫోర్జరీ కేసు
-
BharatPe controversy: అష్నీర్ గ్రోవర్, ఫ్యామిలీకి భారీ షాక్
సాక్షి,ముంబై: పేమెంట్స్ యాప్ భారత్ పే ఫౌండర్, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ వివాదంలో అష్నీర్‌కు మరోసారి చుక్కెదురైంది. భారత్‌పే టాప్ లీడర్షిప్ నుంచి వివాదాస్పదంగా నిష్క్రమించిన తర్వాత, తాజాగా మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి 8 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో గ్రోవర్‌తోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. గ్రోవర్ కుటుంబ సభ్యులు ఫిన్‌టెక్ యునికార్న్‌ను దాదాపు రూ.81 కోట్ల మేర మోసగించారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. గత ఏడాది ఫిన్‌టెక్ యునికార్న్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా అష్నీర్ గ్రోవర్ , కుటుంబ సభ్యులపై ఆర్థిక నేరాల విభాగం (EOW) ఫిర్యాదు దాఖలు చేసింది. ఇందులో గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్, ఆమె సోదరులు శ్వేతాంక్ జైన్, దీపక్ గుప్తా, సురేష్ జైన్ ఉన్నారు. కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానించబడిన ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆర్థిక నేరాల విభాగం ఆరోపించింది. ఆర్థిక నేరాల విభాగం ఆరోపణలు 86 నకిలీ, తప్పుడు ఇన్వాయిస్లను ఉపయోగించి గ్రోవర్, ఇతర నిందితులు రూ.7.6 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాదు కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానంగాఉన్న ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆరోపించింది. అంతేకాదు సాక్ష్యాలను మాధురీ జైన్ నాశనం చేశారని ఆరోపించింది. త్వరలోనే నిందితులందరినీ అరెస్టు చేసే అవకాశం ఉందని అంచనా. మరోవైపు నేరం రుజువైతై గ్రోవర్ కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా పదేళ్ల దాకా జైలు శిక్ష ఖరారు కానుందని తెలుస్తోంది. కాగా 2022, జనవరిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో గ్రోవర్‌ను మార్చిలో తొలగించింది. డిసెంబరులో కంపెనీలో జరిగిన మోసాలపై కంపెనీ ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగంలో క్రిమినల్ ఫిర్యాదు చేయడంతోపాటు, గ్రోవర్, అతని కుటుంబ సభ్యులపై ఢిల్లీ హైకోర్టులో సివిల్ దావా కూడా వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, వివిధ సెక్షన్ల ద్వారా నిందితులందరి నుండి రూ. 88 కోట్ల నష్టపరిహారాన్ని రికవరీ చేయాలని కంపెనీ కోరింది. భారత్‌పే ఫౌండర్ ట్యాగ్‌ని ఉపయోగించకుండా నిరోధించాలంటూ సింగపూర్‌లో కూడా దావా వేసింది. అయితే తాజా పరిణామంపై అష్నీర్ గ్రోవర్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
టీటీడీ విజిలెన్స్ వలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సాబ్జీ
తిరుమల/సాక్షి ప్రతినిధి ఏలూరు: ఫోర్జరీ ఆధార్ కార్డులతో తన సిఫార్సు లేఖలపై వేరే రాష్ట్రాలకు చెందినవారికి తిరుమలలో శ్రీవారి దర్శనం చేయిస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ శుక్రవారం టీటీడీ విజిలెన్స్ వలకు చిక్కారు. ఆయనే స్వయంగా ఫోర్జరీ ఆధార్ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకెళ్తుండగా విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ అధికారి గిరిధర్‌రావు వెల్లడించిన వివరాలు... ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఇతర మతస్తుడైనా తరచూ శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు జారీ చేస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన టీటీడీ ఉన్నతాధికారులు లోతుగా ఈ వ్యవహారాన్ని పరిశీలించారు. గత నెల రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్సీ సాబ్జీ 19సార్లు సిఫార్సు లేఖలు జారీ చేశారని వెల్లడైంది. ఇందులో మూడుసార్లు ఎమ్మెల్సీయే స్వయంగా తిరుమలకు వచ్చారు. తన సిఫార్సు లేఖలపై దర్శనానికి పంపిన భక్తులంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందినవారే. ఈ క్రమంలో శుక్రవారం కూడా ఎమ్మెల్సీ సాబ్జీ స్వయంగా తిరుమలకు వచ్చారు. 14 మందికి బ్రేక్ దర్శనాలు కావాలని దరఖాస్తు చేశారు. ఆయన ఎమ్మెల్సీ కావడంతో టీటీడీ నిబంధనల మేరకు 10 మందికి అధికారులు బ్రేక్ దర్శన టికెట్లు ఇచ్చారు. అయితే అనుమానంతో ఆయనతోపాటు దర్శనానికి వెళ్తున్నవారిని విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. భక్తులు ఫోర్జరీ ఆధార్ కార్డులపై దర్శనానికి వెళుతున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. బెంగళూరుకి చెందిన భక్తుల ఆధార్ కార్డులను ఫోర్జరీ చేసి హైదరాబాద్‌కు చెందినవారిగా సృష్టించారని వెల్లడైంది. అంతేకాకుండా ఆరుగురు భక్తులకు దర్శనానికి సంబంధించి ఎమ్మెల్సీ డ్రైవర్ ఖాతాలో రూ.లక్షా 5 వేలు జమయ్యాయి. దీంతో వీరిపై విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో డ్రైవర్‌తో పాటు ఎమ్మెల్సీని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అధికార హోదాను అడ్డుపెట్టుకొని దర్శనాల్లో అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. మండలి చైర్మన్ ఈ సంఘటనపై వెంటనే స్పందించాలని ఆ పార్టీ నేతలు భానుప్రకాష్, విష్ణువర్ధన్ రెడ్డి వేర్వేరుగా డిమాండ్ చేశారు. -
ఫోర్జరీ కేసు: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీంలో చుక్కెదురు
ఢిల్లీ: టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతంలో అయ్యన్నపాత్రుడిపై నమోదైన ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా, ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌పై గతంలో ఫోర్జరీ కేసు నమోదైంది.. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేశారు. అక్రమ నిర్మాణం.. సక్రమం చేసుకునేలా.. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. తీరా నిర్మాణం సమయం.. అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టబయలైంది. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది. ఇందులో జలవనరుల శాఖకు చెందిన పంట కాలువను ఆక్రమించి అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని సర్వేలో తేలింది. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించింది. అక్రమంగా పంట కాలువలో నిర్మించిన నిర్మాణాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తే తన నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అధికారులను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ)ను సృష్టించి.. సక్రమ నిర్మాణమేనని చెప్పుకునేందుకు యత్నించారు. తీరా సదరు అధికారి ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని స్పష్టం చేసి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఫోర్జరీ సంతకాలు.. తప్పుడు స్టాంపు పేపర్లు చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబ సభ్యులు 2017లో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీకి సర్వే నంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు(సెటిల్మెంట్ డీడ్ నం–3660 ఆఫ్ 2017) చేశారు. దక్షిణం, పశ్చిమం వైపు పంట కాలువ ఉన్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఈ కాలువను ఆక్రమించి మరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్వోసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్వోసీని జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున రావు సంతకంతో ఇచ్చినట్టుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన ఈఈ ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాకుండా దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన ఎన్వోసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాదని కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొంటూ జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వాగు, కెనాల్, నాలా, డ్రెయిన్ బౌండరీకి 9–10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణం చేపట్టరాదని ఏపీ బిల్డింగ్ చట్టం–2017 చెబుతోంది. ఇందుకు అనుగుణంగా కెనాల్ బౌండరీని మొదటగా నిర్ణయించాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ కెనాల్ బౌండరీని నిర్ణయించకుండా ఎన్వోసీ ఇవ్వడం సాధ్యం కాదు. అయినప్పటికీ తన పేరుతో ఎన్వోసీ ఇచ్చినట్టుగా కోర్టులో చూపారని ఈఈ మల్లికార్జునరావు పేర్కొన్నారు. అసలు ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనేనని తెలిపారు. మరోవైపు కార్యాలయం సీల్ కూడా తమది కాదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెపె్టంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్వోసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. -
వీఆర్వో, తహశీల్దార్ సంతకాలు ఫోర్జరీ.. పక్కా ప్లాన్‌తో భూమి దొంగ రిజిస్ట్రేషన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వీఆర్వో, తహశీల్దార్ సంతకాలనే ఫోర్జరీ చేసి విలువైన స్థలాన్ని కాజేసేందుకు విఫలయత్నం చేశారు. తీరా స్థల యజమానికి విషయం తెలిసి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన తమ్మా వినోద్‌రెడ్డికి ఆర్ఎస్ నంబర్ 64–3లో 25 సెంట్ల విలువైన స్థలం ఉంది. ఆ స్థలం తన తల్లికి వీలునామా ద్వారా సక్రమించింది. మచిలీపట్నానికి చెందిన స్థలాల బ్రోకర్ అలీ.. తమ్మా వినోద్‌రెడ్డికి చెందిన స్థలాన్ని అమ్మి పెడతానని చెప్పాడు. అయితే రేటు వద్ద తేడా రావడంతో స్థలానికి సంబంధించిన డీల్ ఆగిపోయింది. అయితే ఆ స్థలంపై కన్నేసిన అలీ.. దాన్ని కొట్టేసేందుకు స్కెచ్ వేశాడు. పామర్రు, గుడివాడలోని ఇద్దరు విలేకరుల సాయంతో దొంగ పత్రాలు సృష్టించాడు. వారికి అలీ భారీగా ముడుపులు చెల్లించినట్లు సమాచారం. దీంతో వారు వీఆర్వో, తహసీల్దార్ల సంతకాలను ఫోర్జరీ చేసి స్థలం అలీదేనని, సర్టిఫికెట్లు తయారు చేశారు. పిత్రార్జితం, ఇంటి స్థలం కింద డాక్యుమెంట్ తయారు చేయించుకున్న అలీ.. తన భార్య పేరుతో తొలుత గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సైతం చేతులు తడిపాడు. పామర్రుకు చెందిన స్థలాన్ని అక్కడ రిజిస్ట్రేషన్ చేయించకుండా గుడివాడలో చేయించారు. పామర్రు రిజిస్ట్రార్ సైతం ఓకే చెప్పడంతో గుడివాడ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తంతు ముగిసింది. తర్వాత ఆ స్థలాన్ని అలీ మళ్లీ పామర్రుకు చెందిన ఇద్దరికి కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశాడు. స్థలం కొనుగోలు చేసిన వారు సంబంధిత స్థలంలో పూజలు చేస్తుండటంతో విషయం తెలుసుకున్న స్థల యజమాని.. ఆరా తీయగా, రెండు నెలల కిందటే తమ పేర్న రిజిస్ట్రేషన్ అయ్యిందంటూ డాక్యుమెంట్లు చూపారు. దీంతో ఉలిక్కిపడ్డ వినోద్‌రెడ్డి పామర్రు ఎస్ఐ అవినాష్‌కు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గుడివాడ డీఎస్పీ సత్యానందం బుధవారం ‘సాక్షి’తో చెప్పారు. స్థలం యజమాని తనకు ఫిర్యాదు చేయగానే సంతకాన్ని పరిశీలించి.. ఫోర్జరీ చేశారని నిర్థారించుకుని వెంటనే పామర్రు, గుడివాడ రిజిస్ట్రార్ కార్యాలయాలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు పామర్రు తహశీల్దార్ భరత్‌రెడ్డి చెప్పారు. -
సినీ హీరో నవీన్ రెడ్డి అరెస్ట్
సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఎన్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేసిన అతడు సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టాడు. అంతేగాక ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితులు నవీన్ రూ.55 కోట్ల మేర మోసం చేశాడంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్ తరలించారు. కాగా నవీన్ రెడ్డి హీరోగా 'నో బడీ' అనే సినిమా తీసినట్లు తెలుస్తోంది. అతడి స్వస్థలం సూర్యాపేట జిల్లా అని చెబుతున్నారు. చదవండి: సడన్‌గా రాత్రికి రాత్రే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు -
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఫోర్జరీ కేసులో కౌంటరు దాఖలు చేయాలని టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బిల్డింగ్ ప్లాన్ విషయంలో సంతకాలు ఫోర్జరీ చేశారన్న కేసులో హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈఈ మల్లికార్జునరావు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. గత విచారణ సమయంలో జారీ చేసిన నోటీసులు రెండు రోజుల క్రితమే అందాయని అయ్యన్న పాత్రుడు తరపు న్యాయవాది తెలిపారు. దీంతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని అయ్యన్నకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా పడింది. చదవండి: (ప్రత్యేక హోదాపై గళమెత్తుతాం: వైఎస్సార్సీపీ ఎంపీలు) -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో రంగంలోకి సీబీఐ
-
నందకుమార్‌కు బెయిల్ మంజూరు.. లాస్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు సంచలన ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ మరోసారి హైలైట్ అయ్యారు. మరోవైపు, తెలంగాణ పాలిటిక్స్‌లో నందకుమార్.. అన్ని పార్టీల నేతలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. నాంపల్లి కోర్టు నందకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో నమోదైన ఫోర్జరీ కేసులో బెయిల్ మంజూరైంది. ఇదిలా ఉండగా, మరో కేసులో నందకుమార్‌పై పీటీ వారెంట్ ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో, నందకుమార్‌పై ఎన్ని కేసులు నమోదు అయ్యాయో వివరాలు ఇవ్వాలని పోలీసులను కోర్టు కోరింది. ఇక, ఎమ్మెల్యేలకు ఎర కేసు కేవలం టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే నడుస్తుందని భావించిన కాంగ్రెస్ పెద్దలను నందకుమార్ చాటింగ్ జాబితా టెన్షన్‌కు గురిచేస్తోంది. ఈ జాబితాలో తమ పార్టీ నేతల పేర్లు ఉండటంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. ఎమ్మెల్యేలతో సహా! నందు చాటింగ్ జాబితాలో తమ పార్టీ కీలక నేతలుండటం టీపీసీసీ వర్గాలను ఉలికిపాటుకు గురిచేస్తోంది. పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంథని, భద్రాచలం, సంగారెడ్డి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లాంటి నేతల పేర్లున్న నేపథ్యంలో పార్టీలో ఎంత మందిని టార్గెట్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ పార్టీ విధేయులేనని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడే ఆలోచన ఉన్న వారు కాదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అలాంటి నేతల పేర్లు కూడా నందు లిస్ట్‌లో ఉండటం చూస్తే పార్టీ కుంభస్థలాన్ని కొట్టేందుకే కొందరు కుట్రలు చేస్తున్నారనే అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. మొత్తంమీద నందు చిట్టా ఏ పరిణామాలకు దారితీస్తుందో, పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ముందస్తు నష్ట నివారణ చర్యలకు టీపీసీసీ పూనుకుంటుందో లేదో అన్న సందేహాలు కాంగ్రెస్ కేడర్‌లో తలెత్తుతున్నాయి. -
మోసగాళ్లతో జాగ్రత్త
సాక్షి, అమరావతి: హైకోర్టుతోపాటు దిగువ కోర్టుల్లో భారీగా పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో దానిని సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు రంగంలోకి దిగారు. డబ్బు ఇస్తే ఉద్యోగం గ్యారెంటీ... అంటూ అభ్యర్థులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏకంగా హైకోర్టు రిజిస్ట్రార్ల సంతకాలను ఫోర్జరీ చేసి ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేసేస్తున్నారు. కొన్నిచోట్ల హైకోర్టు న్యాయమూర్తులు, అధికారుల పేర్లు వాడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తమ దృష్టికి రావడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇటీవల నకిలీ ఉద్యోగ నియామకపత్రాలను జారీ చేసిన మోసగాళ్లతోపాటు వారి నుంచి నియామకపత్రం పొందిన ఒక వ్యక్తిపై కూడా గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టుల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన 15మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మోసగాళ్లకు, వారి బారిన పడుతున్న అభ్యర్థులకు హైకోర్టు గట్టి హెచ్చరికలు చేస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే మోసగాళ్లు, కుట్రదారుల చేతిలో మోసపోవద్దంటూ అభ్యర్థులను హైకోర్టు హెచ్చరించింది. న్యాయమూర్తులు, అధికారుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తులు, వారికి సహకరించేవారిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించే ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టే సమస్యే లేదని స్పష్టం చేసింది. ఉద్యోగాల విషయంలో తప్పుడు వార్తలను, పోస్టులను వ్యాప్తి చేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు హైకోర్టు వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని సూచించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపు మాటలు చెప్పే వ్యక్తులు, నకిలీ నియామక పత్రాలు ఇచ్చే వారు తారసపడితే వారి గురించి హైకోర్టుకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఆ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) ఆలపాటి గిరిధర్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. -
‘అయ్యన్న’ అరెస్టు
నర్సీపట్నం/ఆరిలోవ (విశాఖ తూర్పు)/సాక్షి, అమరావతి: ఫోర్జరీ కేసులో మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన తనయుడు రాజేష్‌ను సీఐడీ పోలీసులు అరెస్టుచేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శివపురంలోని ఆయన నివాసానికి సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో సీఐడీ పోలీసులు, స్థానిక పోలీసులు గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చేరుకున్నారు. అయ్యన్నపాత్రుడు ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఆయన ఇద్దరు కుమారుల పేరుపై ఐదేళ్ల కిందట ఇళ్లు నిర్మించారు. అక్రమ నిర్మాణాన్ని గుర్తించిన అధికారులు గతంలో దానిని తొలగించే ప్రయత్నం చేశారు. అప్పట్లో రెవెన్యూ అధికారుల సమక్షంలో కూల్చేందుకు సిద్ధంకాగా అయ్యన్న కుటుంబం, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో.. అయ్యన్నపాత్రుడు ఆయన కుమారులు తప్పుడు ఎన్ఓసీ సర్టిఫికెట్ సృష్టించి ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించారని సంబంధిత అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సీఐడీ పోలీసులు గురువారం తెల్లవారుజామున అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్నారు. వెంటనే ఇంటి తలుపులు తీయకపోవడంతో కొద్దిసేపు పోలీసులు నిరీక్షించారు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించారు. అదే సమయంలో అయ్యన్న తనయుడు రాజేష్ బయటకు రావడం.. కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కావడంతో ఆయనను ముందుగా అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. ఇంతలో అయ్యన్నపాత్రుడు బయటకొచ్చి.. నన్ను అరెస్టుచేసేందుకు ఇంతమంది రావటం అవసరమా అని ప్రశ్నించారు. అరెస్టుగల కారణాలు తెలియజేస్తూ నోటీసును అయ్యన్నపాత్రుడికి పోలీసులు అందజేశారు. దీనిపై అయ్యన్న, సీఐడీ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు అయ్యన్నపాత్రుడు నోటిసుపై సంతకం చేశారు. అరెస్టుచేసి ఇంట్లో నుండి బయటకు తీసుకువస్తుండగా నోటీసును తన చేతికిస్తేనే వస్తానని అయ్యన్నపాత్రుడు మెలిక పెట్టారు. పోలీసులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఆయన్ను వాహనంలోకి ఎక్కించి విశాఖకు తరలించారు. మరోవైపు.. శాంతియాత్ర పేరుతో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టగా పోలీసులు వారిని అరెస్టుచేశారు. సీఐడీ కార్యాలయం వద్ద హైడ్రామా ఇక నర్సీపట్నంలో అరెస్టుచేసిన అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను పైనాపిల్ కాలనీలో ఉన్న సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇక్కడ విచారిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఇతర నాయకులు సీఐడీ కార్యాలయానికి చేరుకుని కొంతసేపు హైడ్రామా నడిపారు. కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ వారిని తోసుకుని వెళ్లడానికి ప్రయత్నించిన వెలగపూడి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌తో పాటు మరికొంతమంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్టుచేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఇక మధ్యాహ్నం వరకు అక్కడే విచారించిన సీఐడీ అధికారులు 2.30 గంటలకు అయ్యన్నతో పాటు కుమారుడు రాజేష్‌ను వైద్య పరీక్షలు నిమిత్తం సింహాచలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అనంతరం తిరిగి సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి సా.4.30 గంటలకు విశాఖ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించిన కోర్టు సా.5.40 గంటలకు ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు వారిని పోలీసులు హాజరుపరిచారు. అయ్యన్న, అతని కుమారుడు రాజేష్‌లపై రిమాండ్ రిపోర్టును ఏపీపీ ఆదినారాయణ ద్వారా సీడీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. దానిపై ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సీఐడీ అధికారులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పెట్టిన సెక్షన్లు, నమోదు చేసిన కేసుతో పొంతనలేదని జడ్జి రిమాండ్ రిపోర్టును తిరస్కరించారు. దీంతో పోలీసులు వారికి 41ఎ నోటీసులు అందజేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈఈ ఫిర్యాదుతో ‘ఫోర్జరీ’ వెలుగులోకి.. ఇక చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబీకులు 2017లో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి బిల్డింగ్ ప్లాన్ అనుమతి కోసం అదే ఏడాదిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో (సెటిల్మెంట్ డీడ్ నెం–3660 ఆఫ్ 2017) సర్వే నెంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరారు. దక్షిణం, పశ్చిమం వైపునకు పంట కాలువ ఉన్నట్లు ప్లాన్‌లో చూపించారు. అయితే, నిర్మాణ సమయంలో ఈ కాలువను ఆక్రమించి నిర్మాణాన్ని చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్ఓసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్ఓసీని జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మల్జికార్జునరావు సంతకంతో ఇచ్చినట్లుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన సదరు ఈఈ.. ఎన్ఓసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాక.. దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదన్న సంగతి ఆయనకు స్పష్టమైంది. అదే విధంగా కోర్టుకు సమర్పించిన ఎన్ఓసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాకపోవడంతో ఈ విషయాన్ని జలవనరుల శాఖ ఈఈ మల్జికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పారు. ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనే అని తెలిపారు. మరోవైపు.. కార్యాలయం సీల్ కూడా తమది కాదని స్పష్టంచేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెప్టెంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన విచారణ నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్ఓసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. ఫోర్జరీ కారణంగానే అరెస్టు చేశాం : సీఐడీ డీఐజీ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా అధికారుల సంతకాలను ఫోర్జరీచేసి నకిలీ ఎన్ఓసీలతో ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను గురువారం అరెస్టుచేసినట్లు సీఐడీ విభాగం డీఐజీ సునీల్‌నాయక్ వెల్లడించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ స్థలం కబ్జా, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారంటూ అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులు విజయ్, రాజేష్‌లపై నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ కె.మల్లికార్జునరావు ఫిర్యాదు చేశారని చెప్పారు. దాంతో సెక్షన్లు 464, 467, 471, 474, 120 (బి), 34 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఫోర్జరీ చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని సునీల్‌నాయక్ తెలిపారు. దీంతో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను అరెస్టుచేశామన్నారు. మిగిలిన నిందితులను గాలించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పారు.