సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఫోర్జరీ కేసుతో పాటు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేసీకి మరో షాక్ తగిలింది. తాజాగా జేసీ దివాకర్‌రెడ్డి మరో చీటింగ్ వ్యవహారం బయటపడింది. సుప్రీం కోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలు కొనడమే కాకుండా నకిలీ పత్రాలతో 68 లారీలను నాగాలాండ్‌లో జేసీ రిజిస్ర్టేషన్ చేయించారు. ఇందులో దాదాపు పది వాహనాలను సామాన్యులకు విక్రయించినట్టు తాజాగా వెలుగు చూసింది. స్క్రాప్ కింద ఒక్కో లారీని రూ.6లక్షలకు కొనుగోలు చేసి రూ.23 లక్షలకు విక్రయించారు. జేసీ దివాకర్‌రెడ్డి మోసం చేశారని బాధితులు అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది.
(చదవండి : 40 ఏళ్ల నుంచి అక్రమంగా దివాకర్ ట్రావెల్స్ నిర్వహణ)
స్క్రాప్ కింద 68లారీలను కొనుగోలు చేసిన జేసీ ట్రావెల్స్.. వాటిలో 10 లారీలను అనంతపురంలో విక్రయించి, మిగిలినవి సొంతంగా నడుపుకుంటుంది. ఈ లారీలన్నింటినీ ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించారు. సుప్రీం కోర్డు నిషేధించిన బీఎస్ 3 లారీలను సైతం అడ్డదారిలో కొనుగోలు చేశారు. రవాణాశాఖ అధికారుల ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డి సతీమణి, జేసీ ట్రావెల్స్ ఎండీ జేపీ ఉమారెడ్డి, జేసీ అనుచరుడు చవ్వాగోపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అనంతపురం వన్‌టౌన్ పీఎస్‌లో జేసీ ట్రావెల్స్‌పై మరో కేసు నమోదయ్యే అవకాశం ఉంది.
చదవండి :
Comments
Please login to add a commentAdd a comment