సాక్షి, అనంతపురం : జేసీ దివాకర్‌రెడ్డి ట్రావెల్స్‌లో ఫోర్జరీ బాగోతం బయట పడింది. పలు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన జేసీ ట్రావెల్స్ ఉద్యోగులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ల్యాప్ టాప్, థంబ్ మిషన్, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు రామ్మూర్తి, ఇమాం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సీఐలు, ఎస్సైలు, ఆర్టీఏ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. (వెలుగులోకి జేసీ దివాకర్‌రెడ్డి అవినీతి బాగోతం)
కాగా పోలీసు, రవాణాశాఖ అధికారుల సంతాకాలను జేసీ ట్రావెల్స్ ప్రతినిధులు ఫోర్జరీ చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 6 లారీలను జేసీ ట్రావెల్స్ కర్ణాటకలో విక్రయించారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి సతీమణి ఉమాదేవి జేసీ ట్రావెల్స్ ఎండీగా ఉన్నారు. ట్రావెల్స్ యాజమాన్యం ఒత్తిడి మేరకే సంతకాలు ఫోర్జరీ చేసినట్లు నిందితులు పోలీసులు విచారణలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment